CEO
-
డిసెంబర్ 20 నాటికి 3200: సీఈఓ ట్వీట్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసిన కస్టమర్లతో అసంతృప్తి పెరిగిపోతున్న తరుణంలో.. కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఓ శుభవార్త చెప్పారు. వాహనాల సర్వీసుల్లో జాప్యం కలగకుండా చూడటానికి దేశ వ్యాప్తంగా మరో 3,200 సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.డిసెంబర్ 20 నాటికి 3,200 కొత్త స్టోర్స్ ప్రారంభించనున్నట్లు భవిష్ అగర్వాల్ వెల్లడించారు. ఆ తరువాత కంపెనీ మొత్తం నెట్వర్క్ 4,000 అవుట్లెట్లకు చేరుకుంటుంది.ప్రస్తుతం దేశంలో ఓలా స్టోర్లు కేవలం 800 మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య త్వరలోనే 4,000లకు చేరుకుంటుంది. వినియోగదారులకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా సీఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ప్రారంభం కానున్న స్టోర్లలో సర్వీస్ కూడా లభిస్తుంది. కాబట్టి కస్టమర్లు నిశ్చింతగా.. తమ వాహనంలో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఓలా ఎస్1 ఎక్స్, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ వంటి స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి కాకుండా మరో మూడు (ఓలా ఎస్1 జెడ్, ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్) స్కూటర్లను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. ఇవి త్వరలోనే అమ్మకానికి రానున్నాయి. కాగా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి కూడా అడుగు పెట్టడానికి యోచిస్తోంది. ఇది బహుశా వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.Taking the Electric revolution to the next level this month.Going from 800 stores right now to 4000 stores this month itself. Goal to be as close to our customers as possible.All stores opening together on 20th Dec across India. Probably the biggest single day store opening…— Bhavish Aggarwal (@bhash) December 2, 2024 -
'ఆలోచిస్తే ఆశ్చర్యపోతుంటాను': భారత్‌పై నితిన్ కామత్ వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే.. జెరోధా సీఈఓ 'నితిన్ కామత్' భారత్ చాలా వైవిధ్యంగా ఉందని అన్నారు. ఇటీవలే ఐరోపాలోని చాలా దేశాలను సందర్శించాను. అక్కడన్నీ చిన్న తేడాతో అంతా కట్, కాపీ.. పేస్ట్ మాదిరిగా అనిపించాయని అన్నారు.భారతదేశం మాత్రం చాలా వైవిధ్యంగా ఉంది. మనది ఒక దేశం అయినప్పటికీ.. వైవిధ్యంలో ఓ ఖండం లాంటిదని నితిన్ కామత్ అన్నారు. ఒక్కో రాష్ట్రంలో.. ఒక్కో భాష, ఒక్కో ఆచార సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు.. ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఇన్ని భిన్నమైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ దేశం మొత్తం ఏకతాటిపై ఉంది. ఈ విషయం గురించి ఆలోచించినప్పుడల్లా నేను ఆశ్చర్యపోతుంటానని కామత్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఎన్ని భాషలు, ఆచార & సంప్రదాయాలు ఉన్నప్పటికీ.. ప్రజలందరినీ ఏకీకృతం చేయగలిగిన సత్తా ఒక్క భారతదేశానికి మాత్రమే ఉందని కామత్ దేశాన్ని కీర్తించారు. ఈ పోస్టుపై నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ.. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రత్యేకంగా నిలుస్తోంది అంటే.. దానికి కారణం ఈ ఏకీకృతమే అని ఒకరు అన్నారు.భారతదేశానికి ఎంత గొప్ప చరిత్ర ఉన్నా.. ఎన్నెన్ని దేశాలు ఇండియాను ఆదర్శంగా తీసుకుంటున్నా.. కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల స్వార్థం వల్ల ప్రగతి కుంటుపడుతోంది. వీరు కూడా సవ్యంగా నడుచుకుంటే.. ప్రపంచానికి మన దేశం మకుటాయమానంగా నిలుస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.I recently returned from visiting several countries in Europe. Everything feels like a cut, copy, and paste with very small differences.In contrast, India is more like a continent than a country. The diversity in terms of languages, food, culture, etc., between the 28 states… pic.twitter.com/6er6J4IvVB— Nithin Kamath (@Nithin0dha) November 26, 2024 -
మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ
సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని.. దాదాపు ఉద్యోగులందరినీ సీఈఓ తొలగించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన మ్యూజిక్ కంపెనీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఉదయం ఉద్యోగులందరీ సమావేశానికి హాజరుకావాలని కంపెనీ సీఈఓ వెల్లడించారు. కానీ ఈ సమావేశానికి 99 మంది హాజరుకాలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సీఈఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరందరిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఆ కంపెనీలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 110 మంది మాత్రమే. 99 మందిని తీసేస్తూ సీఈఓ నిర్ణయం వల్ల ఆ సంస్థలో 11 మంది మాత్రమే మిగిలారు.ఉద్యోగులను తొలగించడం మాత్రమే కాకుండా.. కంపెనీకి సంబంధించిన వస్తువులు మీ దగ్గర ఏవైనా ఉంటే తిరిగి ఇచ్చేయండి. అన్ని అకౌంట్స్ నుంచి లాగ్ అవుట్ అవ్వండి అంటూ సీఈఓ పేర్కొన్నారు. సమావేశానికి హాజరుకాలేదనే కారణంతో జాబ్ నుంచి తొలగించిన సీఈఓపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని పూర్తి చేయడంలో నిమగ్నం కావడం వల్లనే, సమావేశానికి హాజరు కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు.ఇదీ చదవండి: భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీ బతికేలా చేసిందిఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక్క సమావేశానికి హాజరు కాలేదని సుమారు 90 శాతం మందిని తొలగించడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మిగిలిన 11 మంది ఉద్యోగులను సీఈఓ పీల్చి పిప్పి చేస్తాడు అని అన్నారు. ఇంకొందరు.. ఇలాన్ మస్క్ నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. -
మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే..! వారానికి 90 గంటలు పనిచేస్తూ కూడా..
కొందరు మన కళ్లముందే బిలియనీర్ సీఈవోలుగా అత్యున్నతస్థాయికి ఎదుగుతుంటారు. ఆ క్రమంలో వాళ్లు ఎంతో కష్టపడటమే గాక ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. అయినా కూడా ఫ్యామిలీని, వృత్తిపర జీవితాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. రెండింటికీ పూర్తి న్యాయం చేసి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలానే చేశారు ఈ బిలియనీర్ సీఈవో. అతడు విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలదొక్కుకునేందుకు ఎంతలా కష్టపడ్డాడో వింటే ఆశ్చర్యపోతారు. మరి దాంతోపాటు కుటుంబ జీవితాన్ని కూడా విజయవంతంగా ఎలా బ్యాలెన్స్ చేశాడంటే..రైజింగ్ కేన్స్ చికెన్ ఫింగర్స్ సహ-వ్యవస్థాపకుడు టాడ్ గ్రేవ్స్ బిలియనీర్ సీఈవో. అతను దాదాపు 800 రెస్టారెంట్లు నిర్వహిస్తూ విజయవంతమైన వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నాడు. అయితే తాను ప్రారంభదశలో వారానికి 90 గంటలకు పైగా పనిచేసి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆనందాలను కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు 52 ఏళ్ల గ్రేవ్స్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి రోజూ 12 నుంచి 16 గంటల వరకు కష్టపడేవాడినని అన్నారు. అయితే వృత్తిపరమైన జీవితం తోపాటు కుటుంబ ఆనందాన్ని దూరం చేసుకోకూడదని నిర్ణయించుకుని అందుకోసం సమయం కేటాయించేలా తన విధులను సెట్ చేసుకునే వాడినని అన్నారు. అలా తన వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత జీవితాన్ని పూర్తి న్యాయం చేసేలా బ్యాలెన్స్ చేసికోగలిగానని అన్నారు సీఈవో గ్రేవ్స్. అన్ని గంటలు పనిచేస్తూ కూడా ఇదెలా సాధ్యమయ్యిందో కూడా వివరించారు గ్రేవ్స్. తనకు గనుక ఆఫీస్‌లో పనిభారం ఎక్కువగా ఉంటే..తన భార్య పిల్లలను ఆపీసుకి తీసుకువచ్చి తనతో గడిపేలా ప్లాన్ చేస్తుందట. అలాగే తాను కూడా సెలవు రోజుల్లో పొద్దున్నే 4.30 గంటల కల్లా నిద్రలేచి పిల్లలతోనూ, తన తల్లిదండ్రులతోనూ గడిపేలా ప్లాన్ చేసుకునేవాడట. అలా తన కుటుంబ సభ్యులకు ప్రేమానుబంధాలను పంచుతూ వారిని సంతోషంగా ఉండేలా చేయడమే గాక మంచి వ్యాపారవేత్తగా రాణించేలా పాటుపడటంలో రాజీకి తావివ్వకుండా ఆహర్నిశలు శ్రమించానని చెప్పుకొచ్చాడు గ్రేవ్స్. ఓ బిజినెస్‌మ్యాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసేలా అత్యున్నత స్థాయికి చేరాలంటే అంకితభావంతో పనిచేయాలి సమయంతో సంబంధం లేకుండా కష్టపడాలని అన్నారు. తన కెరీర్ ప్రారంభంలో 1996 ఆ టైంలో కాలిఫోర్నియాలోని చమురు శుద్ధి కర్మాగారంలో వారానికి తొంభై గంటలకు పైగా పనిచేశానని, అలాగే లూసియానాలోని బాటన్ రూజ్‌లో చికెన్ ఫింగర్ రెస్టారెంట్ల నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు అలస్కాలో సాల్మన్ చేపలు పట్టేవాడినని అన్నారు. అంతలా కష్టపడి దాదాపు 800 చికెన్ ఫిగర్ రెస్టారెంట్లు నిర్వహించే స్థాయికి చేరుకున్నాడు గ్రేవ్స్. వాటి ద్వారా ఏడాదికి ఏకంగా రూ. 500 కోట్లకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. అంతేగాదు అతడు ఉద్యోగులును నియమించుకునేటప్పడూ అతడిలో ఉన్న నిబద్ధత, కష్టపడేతత్వం ఎంతమేర ఉన్నాయో గమనించి నియమించుకుంటాడట. ఇక్కడ గ్రేవ్స్ వృత్తిని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడమే గాక మంచి సక్సెస్‌ని అందుకున్నాడు. మాటిమాటికి టైం లేదు అని చెప్పేవాళ్లకు ఈ బిలియనీర్ సీఈవో జీవితమే ఓ ఉదాహరణ కదూ..!. (చదవండి: వీల్‌ఛైర్‌తో విల్ పవర్‌కి అసలైన అర్థం ఇచ్చాడు!) -
ర్యాపిడోపై చెన్నై సీఈఓ ఫైర్: ఎందుకంటే..
ర్యాపిడో, ఉబర్ క్యాబ్స్, ఓలా రైడ్స్ వంటివి కస్టమర్ల నుంచి నిర్ణీత ధర కంటే ఎక్కువ డబ్బు వసూలు చేసిన సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఘటనే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 21 కి.మీ దూరంలో ఉన్న తొరైపాక్కం వరకు వెళ్లడానికి ర్యాపిడో ఏకంగా రూ.1,000 వసూలు చేసినట్లు ఏజే స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ ఫౌండర్ అండ్ సీఈఓ 'అశోక్ రాజ్ రాజేంద్రన్' వెల్లడించారు. 21 కిలోమీటర్లకు ఛార్జ్ రూ. 350 మాత్రమే. కానీ ర్యాపిడో మూడు రెట్లు డబ్బు వసూలు చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి అనుభవం నాకు ఎప్పుడూ ఎదురవ్వలేదని అన్నాడు.ఈ సమస్య గురించి ర్యాపిడోకు తెలియజేసినప్పటికీ.. డ్రైవర్ చర్యల గురించి కూడా అడగకుండా చాట్‌ను ముగించారని, రాపిడో కస్టమర్ కేర్ సర్వీస్‌పై సీఈఓ నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యాలకు త్వరలోనే తగిన గుణపాఠం ఎదురవుతుందని వెల్లడించాడు.ఇదీ చదవండి: రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి అనుభవాలు ఎదురైనా పలువురు నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ర్యాపిడోలో ఇలాంటివి చాలాసార్లు ఎదురయ్యాయని చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది డ్రైవర్లు.. కస్టమర్లను మోసం చేయడం ప్రారంభించారని మరికొందరు చెబుతున్నారు. -
ఎన్‌పీసీఐకి ప్రవీణా రాయ్ రాజీనామా: ఎంసీఎక్స్‌లో కొత్త బాధ్యతలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ప్రవీణా రాయ్' తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం 'మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్' (ఎంసీఎక్స్) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఆర్థిక సేవల రంగంలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రవీణా రాయ్ ఎంసీఎక్స్‌లో నియామకానికి 'సెబీ' ఆమోదం తెలిపింది. రాయ్ ఎన్పీసీఐలో చేరటానికి ముందు కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీలలో కూడా పనిచేశారు.ఇదీ చదవండి: బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ కన్నుమూతఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ప్రవీణా రాయ్.. ఐఐఎం అహ్మదాబాద్‌లో పేజీ చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో చేరినప్పుడు ఈమె క్యాష్ మేనేజ్మెంట్ పోర్ట్ ఫోలియో నిర్వహించారు. ఆ తరువాత హెచ్ఎస్బీసీలో ఆసియా - పసిఫిక్ రీజియన్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్పీసీఐలో రాయ్ మార్కెటింగ్, ప్రొడక్ట్, టెక్నాలజీ, బిజినెస్ స్ట్రాటజీ, ఆపరేషన్ డెలివరీ వంటి బాధ్యలు నిర్వహించారు. ఇప్పుడు ఎంసీఎక్స్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు.PRESS RELEASE - Ms. Praveena Rai takes charge as MD & CEO of MCXClick here to read more: https://t.co/114IrR0cYL#pressrelease pic.twitter.com/yZW5GGEmbT— MCX (@MCXIndialtd) October 31, 2024 -
మేధావులకు ప్రశ్న.. చెబితే జాబ్: సీఈఓ పోస్ట్ వైరల్
తెలివితేటలను, ఆలోచనా శక్తిని పెంచుకోవడానికి చాలామంది చదరంగం, పదవినోదం వంటివి ఆడుతారు. అయితే ఇటీవల కాలంలో దీనికోసం బ్రెయిన్ టీజర్లు విరివిగా అందుబాటులోకి వచ్చేసాయి. ఇలాంటివి చూడటానికి గమ్మత్తుగా ఉన్నప్పటికీ.. లోతుగా ఆలోచింపజేస్తాయి. ఈ కోవకు చెందిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది.జెనెసిస్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ 'డినో డియోన్' ఈ పోస్ట్ చేస్తూ.. ఉద్యోగం కావాలంటే దీనికి మూడు సెకన్లలో సరైన సమాధానం చెప్పాలి, అని పేర్కొన్నారు. దీనికి సమాధానం నా ఆరేళ్ళ పిల్లాడు 30 సెకన్లలో చెప్పినట్లు వెల్లడించారు.డినో డియోన్ షేర్ చేసిన పోస్టులో 3x3-3/3+3 అని ఉంది. ఇది కేవలం మేధావులకు మాత్రమే అంటూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వేల లైక్స్ పొందిన ఈ పోస్టుకు.. భారీ సంఖ్యలో కామెంట్లు కూడా వచ్చాయి.ఇదీ చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్లలో.. దీనిని మూడు సెకన్లలో ఎలా చెప్పగలం అని కొందరు చెబితే.. మరికొందరు మూడు సెకన్లలో ఆలోచించడానికి ప్రయత్నించవచ్చని అన్నారు. ఇంకొందరు దీనికి సమాధానం తొమ్మిది అని వెల్లడించారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు సమాధానాలను కామెంట్ల రూపంలో వెల్లడించారు. -
బీమా విస్తరణకు టెల్కోల సాయం
ముంబై: దేశంలో బీమాను అందరికీ చేర్చేందుకు టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ సీఈవో, ఎండీ సిద్ధార్థ మొహంతి అన్నారు. ‘ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంక్–ఇన్సూరెన్స్‌తో సహా ప్రస్తుత ఛానెల్‌లు ప్రభావవంతంగా ఉన్నాయి. విస్తారమైన, మారుమూల గ్రామీణ మార్కెట్‌కు బీమాను విస్తరించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తులో సంప్రదాయేతర విధానాలను అమలు పర్చాల్సిందే. అందరికీ బీమాను చేర్చాలంటే పంపిణీ, మార్కెటింగ్ అంశాలను పునరాలోచించాలి. టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ వంటి సంప్రదాయేతర కంపెనీల సహకారంతోనే బీమా పాలసీలను పెద్ద ఎత్తున జారీ చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకూ విస్తరించాయి. వీటితో భాగస్వామ్యం చేయడం ద్వారా సరసమైన, అందుబాటులో ఉండే కవరేజ్ అందరికీ లభిస్తుంది. కొత్త విధానాన్ని అనుసరించడం వల్ల వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి బీమా సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాయి. 100 కోట్ల మందికిపైగా బీమా చేర్చడం అంత సులువు కాదు. గ్రామీణ, తక్కువ–ఆదాయ వర్గాలను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ కీలకం. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు, ప్లాట్‌ఫామ్‌లు మొత్తం బీమా రంగాన్ని విప్లవాత్మకంగా, మరింత కస్టమర్–ఫ్రెండ్లీగా మారుస్తున్నాయి’ అని సీఐఐ సదస్సులో వివరించారు. -
70 విమానాలకు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌లైన్స్ సీఈఓలతో భేటీ
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం తీవ్ర కలకలం రేపుతోంది. అటు దేశీయంగా నడిచే వాటితోపాటు విదేశాలకు వెళ్తున్న అనేక ఎయిర్‌లైన్స్ వరసగా బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఆరు రోజుల్లో ఏకంగా 70 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయంటే.. వీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు అధికారులు, కపౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నకిలీ బెదిరింపులపై దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పరిస్థితులో మార్పు కనిపించడం లేదు.ఈ క్రమంలో తాజాగా ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బీసీఏఎస్) అప్రమత్తమైంది. విమానయాన సంస్థల సీఈఓలతో శనివారం సమావేశమైంది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే బెదిరింపులను ఎదుర్కోవడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) అనుసరించాలని సీఈవోలను కోరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్న వేళ.. ప్రయాణికులకు అసౌకర్యం, క్యారియర్లకు నష్టం కలగకుండా ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించింది. బెదిరింపులు, వాటి పట్ల తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలని కోరింది.ఇక గత వారం రోజులుగా 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు 30కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు జరిపిన విచారణలో బెదిరింపులు వచ్చిన బెదిరింపులు వాటిలో ఐపీ (ఇంటర్నెట్ ప్రోటోకాల్) చిరునామాలు లండన్, జర్మనీ, కెనడా, యూఎస్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
రిటర్న్ టు ఆఫీస్.. ‘నచ్చకపోతే వెళ్లిపోవచ్చు’
ఇంటి నుంచి పనిచేసే విధానానికి దాదాపు అన్ని కంపెనీలు ఇప్పటికే ముగింపు పలికేశాయి. కొన్ని కంపెనీలు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి ఇంకొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఆ పద్ధతికీ మంగళం పాడేసి పూర్తిగా రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి.ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన అమెజాన్ కూడా ఇటీవల వారానికి 5-రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వివాదాస్పదమైన ఈ విధానాన్ని అమెజాన్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తాజాగా సమర్థించారు. దీనికి మద్దతు ఇవ్వని వారు మరొక కంపెనీకి వెళ్లిపోవచ్చని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగిస్తున్న మెటా..అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ఆ యూనిట్ సీఈవో మాట్ గార్మాన్ ప్రసంగిస్తూ.. తాను పది మందితో మాట్లాడితే వారిలో తొమ్మిది మంది జనవరిలో అమలులోకి వచ్చే కొత్త విధానానికి మద్దతుగా మాట్లాడారని చెప్పారు. కొత్త విధానం నచ్చని వారు నిష్క్రమించవచ్చని ఆయన సూచించారని రాయిటర్స్ పేర్కొంది.అమెజాన్ ప్రస్తుతం మూడు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే సీఈవో ఆండీ జాస్సీ గత నెలలో ఐదు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించారు. దీంతో అనేకమంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొంతమంది అయితే స్వచ్ఛంద రాజీనామాలకు దిగుతున్నట్లు చెప్పారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి తోటి టెక్నాలజీ కంపెనీలు రెండు-మూడు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీలను అమలు చేస్తుండగా అమెజాన్ మరో అడుగు ముందుకేసి పూర్తిగా ఐదు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీ అమలుకు సిద్ధమైంది. -
హనీ సంస్థ ప్రచారకర్తగా అదితిరావు హైదరీ
న్యూఢిల్లీ: హమ్దర్ద్ హనీ తన ప్రచాకర్తగా సినీ నటి అదితిరావు హైదరీని నియమించుకుంది. ఈ సందర్భంగా ‘ద నో కాంప్రమైజ్ హనీ’ పేరుతో ఒక టీవీ ప్రచార వీడియో విడుదల చేసింది. నాణ్యత, స్వచ్ఛతల మేలికలయిక హమ్దర్ద్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించనుండటం సంతోషం కలిగిస్తోందని అదితిరావు అన్నారు. ఆరోగ్యకర జీవన శైలి కోరుకునే ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఈ తేనె భాగం కావాలన్నారు. అదితిరావుతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై హమ్దర్ద్ సీఈవో హమీద్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం అప్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ క్యూ2లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 4,235 కోట్లుగా నమోదైంది. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్ల నుంచి రూ. 28,862 కోట్లకు చేరింది. రెవెన్యూ వృద్ధితో పాటు లాభదాయకత కూడా మెరుగ్గా ఉందని సంస్థ సీఈవో సి. విజయ్ కుమార్ తెలిపారు. వార్షికంగా ఆదాయ వృద్ధి 3.5–5.0 శాతంగా ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచి్చంది. క్యూ2లో 780 మంది ఉద్యోగులను తగ్గించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,18,621కి చేరింది. 2024–25 ఆరి్థక సంవత్సరానికి గాను రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 12 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. సోమవారం బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేరు స్వల్పంగా ఒక్క శాతం పెరిగి రూ. 1,856 వద్ద క్లోజయ్యింది. -
బిహార్‌లో కంపెనీ పెట్టి తప్పు చేశాను.. సీఈవో ఆవేదన
బిహార్‌లో తొలి సెమీకండక్టర్ కంపెనీ సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్. నాలుగేళ్ల క్రితం ఈ సంస్థ ఏర్పాటైంది. అయితే బిహార్‌లో కంపెనీ పెట్టడం తన జీవితంలో "అత్యంత చెత్త నిర్ణయం" అని వాపోతున్నాడు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన చందన్ రాజ్. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.బిహార్‌ను "ల్యాండ్ ఆఫ్ ఫ్రస్టేషన్"గా పేర్కొన్న చందన్ రాజ్ అక్కడ సెమీకండక్టర్ కంపెనీ నడపడానికి అష్టకష్టాలు పడుతున్నట్టు వాపోయారు. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తన కంపెనీతో కలిసి పనిచేయడానికి క్లయింట్స్ ఎవరూ ముందుకు రావడం ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు, మౌలిక సదుపాయాల కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నానని, ఎవరూ సహాయం చేయలేదన్నారు. బిహార్ ప్రభుత్వం సెమీకండక్టర్ పరిశ్రమలను అర్థం చేసుకోలేదని రాసుకొచ్చారు. స్థానిక గ్యాంగ్‌స్టర్ బెదిరిస్తే పోలీసులు కూడా పట్టించుకోరంటూ చందన్ రాసుకొచ్చారు.ఎవరీ చందన్ రాజ్?సెమీకండక్టర్ స్టార్టప్ వ్యవస్థాపకుడైన చందన్ రాజ్.. తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఒడిషాలోని బిజూ పట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీతో 2009లో పట్టభద్రుడయ్యారు.శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మలేషియా, ఇజ్రాయెల్‌లోని ఇంటెల్, రొమేనియాలోని సిలికాన్ సర్వీస్ ఎస్ఆర్ఎల్, షాంఘైలో నోకియా బెల్ ల్యాబ్స్, ఎన్ఎక్స్పీలతో సహా వివిధ సాంకేతిక సంస్థలలో ఇంజనీరింగ్, నిర్వాహక పాత్రలలో పనిచేశారు. 2020 డిసెంబర్లో బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ సంస్థను ఏర్పాటు చేశారు.Bihar - The land of frustration. Lots of problems and struggle to survive here as a semiconductor/VLSI Company.Worst decision of my life to start a company in Bihar— Chandan Raj (@ChandanRaj_ASIC) October 9, 2024 -
సీఈవో అయినా డెలివరీ బాయ్‌గా వెళ్తే అంతే..
చిరుద్యోగుల పట్ల సమాజంలో చాలా చిన్న చూపు ఉంది. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బంది నిత్యం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు. వారు పడుతున్న ఇబ్బందులు స్వయంగా జొమాటో సీఈవో ఎదుర్కోవాల్సి ఉంది.విషయం ఏంటంటే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ అప్పుడప్పుడూ డెలివరీ బాయ్ అవతారం ఎత్తి ఆర్డర్లు డెలివరీ చేస్తుంటారు. అందులో భాగంగానే తన సతీమణి గ్రీసియా మునోజ్‌తో కలిసి తాజాగా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌గా రెస్టారెంట్స్, మాల్స్ తిరిగారు.ఇలాగే ఆర్డర్ పికప్ చేసుకునేందుకు గురుగ్రామ్‌లోని ఓ మాల్‌కు వెళ్లగా డెలివరీ బాయ్ దుస్తుల్లో ఉన్న వారిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించేందుకు అనుమతి లేదని, మెట్లు ఎక్కి వెళ్లాలని సూచించారు. దీంతో చేసేది లేక మూడో అంతస్తులోని రెస్టారెంట్‌కు మెట్లు ఎక్కి వెళ్లి ఆర్డర్ పికప్ చేసుకున్నారు.తమకు ఎదురైన చేదు అనుభవాన్ని గురించి దీపిందర్ గోయల్ ‘ఎక్స్’లో ప్టోస్ట్ చేశారు. వీడియోలను షేర్ చేశారు. డెలివరీ భాగస్వాములందరికీ పని పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. మాల్స్ వారు కూడా డెలివరీ సిబ్బంది పట్ల మానవత్వం చూపించాలని కోరారు. గోయల్ పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, మాల్స్ మాత్రమే కాదు.. చాలా సొసైటీల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందని చాలా మంది వినియోగదారులు వాపోతూ కామెంట్లు పెట్టారు.During my second order, I realised that we need to work with malls more closely to improve working conditions for all delivery partners. And malls also need to be more humane to delivery partners. What do you think? pic.twitter.com/vgccgyH8oE— Deepinder Goyal (@deepigoyal) October 6, 2024 -
ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్!!
ఉద్యోగంలో చేర్చుకోవడం ఎంత ముఖ్యమో.. తొలగించడం కూడా అంతే ముఖ్యం అంటూ, టెక్ కంపెనీ జర్నీ సీఈఓ 'ఆండ్రియాస్ రోట్ల్' (Andreas Roettl) చెబుతున్నారు. దీనికోసం నైపుణ్యం అవసరమని తమ మేనేజర్లను, టీమ్ లీడర్లకు సంస్థలే ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఫోటో ప్రింటింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్న టెక్ సంస్థ జర్నీ సీఈఓ ఆండ్రియాస్ రోట్ల్.. నాయకులంటే ఉద్యోగులను నియమించుకోవడం మాత్రమే కాదు, తొలగించడంలో కూడా కొంత నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అంతే కాకుండా నేను ఉద్యోగులను తొలగించడంలో చాలా మంచివాడినని ఆండ్రియాస్ పేర్కొన్నారు.జర్నీ సంస్థలో ఉద్యోగులను ఎలా తొలగించాలో మా లీడ్‌లకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెడతాము. మీరు కూడా అలా చేయాలని ఆండ్రియాస్ వెల్లడించారు. ఉద్యోగి పనితీరును అంచనా వేయడానికి తొలగింపు విధానాలను తప్పకుండా నేర్చుకోవాలి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఉపయోగించడం వంటివి కూడా తెలుసుకోవాలి. పనితీరు ఎక్కువగా ఉన్న సిబ్బందికి మద్దతు ఇవ్వడం అత్యంత ప్రాధాన్యం అని అన్నారు.తొలగించడానికి సంబంధించిన విధానాన్ని ఆండ్రియాస్ రోట్ల్ ఫుట్‌బాల్ ఆటతో పోల్చారు. ఇక్కడ ఆటగాళ్లకు హెచ్చరికగా పసుపు కార్డు అందుతుంది. దీనిని మొదటి హెచ్చరికగా వెల్లడించాలి. పనితీరును మెరుగుపరచుకోవాలి, కష్టపడుతున్న ఉద్యోగులతో సంభాషణలు జరపాలని చెప్పాలి.ఇదీ చదవండి: పోయిన రూ.5 కోట్ల కారు: పట్టించిన ఎయిర్‌పాడ్స్ - ఎలా అంటే?మొదటిసారి పసుపు కార్డు అందుకున్న వ్యక్తి పనితీరులో ఎలాంటి పురోగతి కనిపించకపోతే.. రెండవ పసుపు కార్డును ఇవ్వాలి. ఇది వారు తమ ఉద్యోగానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని తెలియజేస్తుందని అన్నారు. రెడ్ కార్డు ఇవ్వాల్సిన సందర్భాలు వస్తే.. అది వేరే కథ. దానికి వేరే ప్రాసెస్ ఉంటుందని అన్నారు. ఆండ్రియాస్ రోట్ల్ చేసిన పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయితే ఆండ్రియాస్ ఫాలో-అప్ సందేశాన్ని పేర్కొన్నారు. నా సందేశం వల్ల బాధ కలిగి ఉండే క్షమాపణలు కోరుతున్నా అని అన్నారు. -
సైబర్ వలలో ప్రముఖ పారిశ్రామికవేత్త: రూ.7 కోట్లు మాయం
వర్ధమాన్ గ్రూప్ సీఈఓ ఎస్పీ ఓస్వాల్‌ను.. సైబర్ మోసగాళ్ల ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ. 7 కోట్లు మోసగించింది. దీనిని ఛేదిస్తూ పంజాబ్ పోలీసులు ఇద్దరు నేరగాళ్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 5.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని లూథియానా పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు.ఎస్పీ ఓస్వాల్‌ను మోసగించిన ముఠాలో మరో ఏడుగురిని గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కుల్దీప్ సింగ్ చాహల్ వెల్లడించారు. ముఠాలోని మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉన్నట్లు, వారంతా అస్సాం, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని ఆయన తెలిపారు.సైబర్ మోసగాళ్లలో ఒకరు తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకుని, పారిశ్రామికవేత్తకు నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి డిజిటల్ అరెస్ట్ చేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఓస్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి 48 గంటల్లో కేసును ఛేదించారు.ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్దేశంలో ఇలాంటి సైబర్ మోసాలు చాలా పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గుర్తు తెలియనివారు ఫోన్ చేసి బెదిరించినా? డబ్బు డిమాండ్ చేసినా? సంబంధిత అధికారులకు వెంటనే వెల్లడించడం ఉత్తమం. లేకుంటే భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. -
నకిలీ టికెట్ల వ్యవహారం.. బుక్‌మైషో సీఈవోకు సమన్లు
బ్రిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ షో నలికీ టికెట్లతో బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై బుక్‌మైషో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సహ వ్యవస్థాపకుడైన ఆశిష్ హేమ్రజనీ ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఈయనతోపాటు కంపెనీ టెక్నికల్ హెడ్‌కు కూడా సమన్లు పంపినట్లు ఒక అధికారి తెలిపారు.ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వచ్చే ఏడాది జనవరి 19 నుండి 21 వరకు జరగనున్న కోల్డ్‌ప్లే కచేరీకి సంబంధించి బుక్‌మైషో టిక్కెట్ల బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుపై ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ సీఈవో, టెక్నికల్ హెడ్లకు సమన్లు పంపిన అధికారులు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయాల్సి ఉందని కోరారు.కోల్డ్‌ప్లే ఇండియా టూర్ టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి బుక్‌మైషోపై ఫిర్యాదు చేసిన న్యాయవాది అమిత్ వ్యాస్.. రూ.2,500 ఉన్న టెకెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేసి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే అమిత్ వ్యాస్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన అధికారులు.. టికెట్ల దందాలో పాల్గొన్న పలువురు బ్రోకర్లను గుర్తించారు. -
యాక్సెంచర్‌లో జోరుగా నియామకాలు
న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సేవల దిగ్గజం యాక్సెంచర్ భారత్‌లో గణనీయంగా నియామకాలు చేపట్టనుంది. ప్రధానంగా ఫ్రెషర్స్‌ను తీసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. కంపెనీ సీఈవో జూలీ స్వీట్ ఈ విషయాలు వెల్లడించారు.జెనరేటివ్ఏఐ (జెన్‌ఏ) మీద ఫోకస్‌తో తమ సర్వీసులను ఎప్పటికప్పుడు సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో ఆమె వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపార వృద్ధికి ఇదే దోహదపడిందని పేర్కొన్నారు. జెన్ఏఐ సాంకేతికతను ఉపయోగించడంలో సిబ్బందికి విస్తృతంగా శిక్షణనిస్తున్నట్లు జూలీ చెప్పారు.ఐర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాక్సెంచర్‌కి భారత్‌లో 3,00,000కు పైగా సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా 7,74,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 64.90 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. యాక్సెంచర్ సెప్టెంబర్–ఆగస్టు వ్యవధిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. -
బొంబార్డియర్ సీఈవోతో గౌతమ్ అదానీ భేటీ
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన బిజినెస్ జెట్స్ తయారీ దిగ్గజం బొంబార్డియర్ సీఈవో ఎరిక్ మార్టెల్తో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఎయిర్‌క్రాఫ్ట్ సరీ్వసులు, రక్షణ రంగ కార్యకలాపాల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై ఇందులో చర్చించినట్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో అదానీ పోస్ట్ చేశారు. అదానీ గ్రూప్ దేశీయంగా ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
రోజుకు రూ.45 లక్షల జీతం.. అగ్రరాజ్యంలో తెలుగు తేజం
ప్రపంచంలో అత్యధిక జీతం తీసుకుంటున్న అతి కొద్దిమంది సీఈఓలలో ఒకరు ఐబీఎమ్ సీఈఓ 'అరవింద్ కృష్ణ'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన వేతనం ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓలలో ఒకరుగా మాత్రమే తెలిసిన అరవింద్ కృష్ణ.. మన భారతీయుడు అని బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఈయన 1962 నవంబర్ 23 పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన తెలుగు బిడ్డ. తండ్రి భారత సైన్యంలో పనిచేసిన ఆర్మీ అధికారి.అరవింద్ కృష్ణ తమిళనాడులోని కూనూర్‌లోని స్టాన్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో, డెహ్రాడూన్‌లోని సెయింట్ జోసెఫ్స్ అకాడమీలో చదువుకున్నారు. ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని.. 1991లో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా - ఛాంపెయిన్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్డీ పట్టా పొందారు.అరవింద్ కృష్ణ 1990లోనే ఐబీఎంకు సంబంధించిన థామస్ జే. వాట్సాన్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. 2009 వరకు అక్కడే కొనసాగారు. ఆ తరువాత ఐబీఎం ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్‌లో జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2015లో ఐబీఎం రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. ఆ తరువాత ఐబీఎం క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్ట్వేర్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2020లో ఐబీఎం సీఈఓ అయ్యారు. కంపెనీలో ఈయన దాదాపు 34 ఏళ్ళు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్మన్ఐబీఎం సీఈఓ అయిన తరువాత అరవింద్ కృష్ణ.. కంపెనీ ఉన్నతికి ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన వార్షిక వేతనం ఇప్పుడు రూ.165 కోట్లు. అంటే రోజుకు రూ.45 లక్షల జీతం అన్న మాట. 2023లో ఈయన జీతం పెరగడంతో వార్షిక వేతనం భారీగా పెరిగింది. -
భారత్‌లో ఆకర్షణీయమైన అవకాశాలు: సేల్స్‌ఫోర్స్
శాన్ ఫ్రాన్సిస్కో: భారత్‌లో వ్యాపార అవకాశాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని, దేశంలో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సేవల సంస్థ సేల్స్‌ఫోర్స్ చైర్మన్, సీఈవో మార్క్ బెనియాఫ్ తెలిపారు. ప్రపంచం అంతా ’భారతీయ శకం’లోకి మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు.తమకు భారత్‌లో 11,000 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిలో చాలా మంది అంతర్జాతీయ క్లయింట్లకు సర్వీసులు అందిస్తున్నారని బెనియాఫ్ చెప్పారు. డిజిటల్ టెక్నాలజీల వినియోగం పెరిగే కొద్దీ భారత వ్యాపార విభాగం కూడా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బజాజ్ గ్రూప్ వంటి దిగ్గజ కస్టమర్లకు కూడా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ నిర్వహించిన వార్షిక ’డ్రీమ్‌ఫోర్స్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బెనియాఫ్ ఈ విషయాలు చెప్పారు.సేల్స్‌ఫోర్స్ భారత విభాగం చీఫ్‌గా ఉన్న ఎస్బీఐ మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య సారథ్య సామర్థ్యాలను ఆయన ప్రశంసించారు. కార్యక్రమం సందర్భంగా ఏజెంట్‌ఫోర్స్ సొల్యూషన్‌ను ఆవిష్కరించారు. వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగుల కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. -
చిన్న వయసులోనే సీయీవో అయ్యారు!
ఎడ్యుకేషన్ యాప్ ‘అల్ఫా బెట్’. ఎమర్జెన్సీ సర్వీస్ యాప్ ‘ఎమర్జెన్సీ’ గేమింగ్ యాప్ ‘సూపర్ హీరో అండ్ కార్ రేసింగ్ ఒకటి కాదు రెండు కాదు 150 యాప్స్ క్రియేట్ చేశారు ఈ బ్రదర్స్.ఫ్రెండ్స్ ఈరోజు మనం చెన్నైకి చెందిన శ్రావణ్, సంజయ్ బ్రదర్స్ గురించి తెలుసుకుందాం. పది, పన్నెండేళ్ల వయసులోనే ఈ బ్రదర్స్ ఒక యాప్‌ను డెవలప్ చేసి బోలెడు పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు...‘గో డైమన్షన్స్’ పేరుతో ఒక కంపెనీని మొదలుపెట్టారు. యంగెస్ట్ సీయీవోలుగా దేశం దృష్టిని ఆకర్షించారు.వారి తండ్రి కుమరన్ సురేంద్రన్ వల్ల శ్రావణ్, సంజయ్‌లకు సాంకేతిక విషయాలపై ఆసక్తి పెరిగింది.‘కంప్యూటర్లు ఎలా పని చేస్తాయి?’ నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు తండ్రి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునేవారు.టెక్నాలజీకి సంబంధించిన విషయాలను చందమామ కథల్లాగా ఆసక్తిగా వినేవారు.ఏ మాత్రం సమయం దొరికిన కంప్యూటర్లో రకరకాల కొత్త విషయాల గురించి తెలుసుకునేవారు.అలా ఎన్నో యాప్‌ల గురించి తెలుసుకున్నారు.కొత్త కొత్త యాప్‌ల గురించి తెలుసుకునేటప్పుడు తమకు కూడా యాప్ తయారు చేయాలనిపించింది.‘క్యాచ్ మీ కాప్’ పేరుతో ఈ బ్రదర్స్ రూపోందించిన యాప్‌కు మంచి పేరు వచ్చింది. ఇది పిల్లల ఆటలకు సంబంధించిన యాప్. దీంతో పాటు రూపోందించిన ఎడ్యుకేషన్ యాప్ ‘అల్ఫా బెట్’. ఎమర్జెన్సీ సర్వీస్ యాప్ ‘ఎమర్జెన్సీ’ గేమింగ్ యాప్ ‘సూపర్ హీరో అండ్ కార్ రేసింగ్ ఒకటి కాదు రెండు కాదు 150 యాప్స్ క్రియేట్ చేశారు.ఫ్రెండ్స్, శ్రావణ్, సంజయ్ గురించి మీరు చదివారు కదా... మరి మీ గురించి కూడా గొప్పగా రాయాలంటే.... మీరు కూడా ఏదైనా సాధించాలి. మరి ఒకేనా! -
కొత్త ఉత్పత్తులకు అనుమతుల్లో జాప్యం: సింజెంటా సీఈవో
న్యూఢిల్లీ: బ్యూరోక్రసీ విధానాల కారణంగా భారత సాగురంగంలో వినూత్న ఉత్పత్తులకు అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అగ్రోకెమికల్స్ దిగ్గజం సింజెంటా గ్రూప్ సీఈవో జెఫ్ రోవ్ వ్యాఖ్యానించారు. దీంతో రైతులపై ప్రభావం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత పర్యటన సందర్భంగా ఆయన తెలిపారు.దేశీయంగా సులభతరంగా వ్యాపారాల నిర్వహణ అంశంపై స్పందిస్తూ ‘భారత్‌లో ప్రోడక్టుల అనుమతులకు సంబంధించి పాలసీ అంతా బ్యూరోక్రసీమయంగా ఉంటుంది. దీంతో అనుమతులకు చాలా సమయం పట్టేస్తుంది. ఆ ప్రభావం రైతులపై పడుతుంది‘ అని జెఫ్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణల కోసం రైతులు ఎంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తే అంత ఎక్కువగా రిస్కులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన చెప్పారు.వినియోగదారుల వ్యవస్థను డిజిటలీకరించడంలో భారత ప్రభుత్వ కృషిని ప్రశంసించిన జెఫ్.. వ్యవసాయ రంగంలోనూ అదే తరహాలో అనుమతుల ప్రక్రియను ఆధునీకరించాలని కోరారు. వాతావరణ మార్పులతో రిస్కులే కాకుండా అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే 3 ఏళ్లలో 40 ఉత్పత్తులు..రాబోయే 2–3 సంవత్సరాల్లో కొత్తగా 40 పంట సంరక్షణ ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు జెఫ్ చెప్పారు. పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలపై తమ సంస్థ అంతర్జాతీయంగా ఏటా 2 బిలియన్ డాలర్లు వెచ్చిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో తమ వ్యాపారం ఈ ఏడాది ద్వితీయార్థంలో కాస్త మెరుగుపడగలదని వివరించారు.ప్రపంచవ్యాప్తంగా ఆహార అవసరాలు పెరుగుతున్న తరుణంలో సేంద్రియ వ్యవసాయాన్ని భారీ స్థాయిలో విస్తరించడానికి అవకాశాలు తక్కువని జెఫ్ తెలిపారు. సంప్రదాయ సాగుతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయ సామరŠాధ్యలు 20–30 శాతం మేర తక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. ప్రత్యేకమైన భారత వ్యవసాయ రంగ సవాళ్లను పరిష్కరించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని జెఫ్ వివరించారు. -
హీరోలకు ఏమాత్రం తగ్గని ఫిజిక్.. సంచలనాల సీఈవో..
-
టెలిగ్రామ్ సీఈవో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా?
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పాత ఫోటోలు ఆన్లైన్లో మళ్లీ తెరపైకి వచ్చాయి. తన రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని రూమర్స్ వ్యాపిస్తున్నాయి. అక్రమ లావాదేవీలు, పిల్లల అశ్లీల చిత్రాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మోసాలు వంటివాటిని టెలిగ్రామ్ అనుమతిస్తోందన్న ఆరోపణలపై ఇటీవల ఫ్రాన్స్‌లో దురోవ్ అరెస్టయ్యారు.రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్ 2013లో టెలిగ్రామ్‌ను మెసేజింగ్ యాప్‌గా ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం దురోవ్ సంపద 15.5 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.1.3 లక్షల కోట్లు. దుబాయ్‌కి చెందిన ఈ బిలియనీర్‌ను వారం రోజుల క్రితం పారిస్‌లో అదుపులోకి తీసుకున్నారు.దురోవ్ 2011 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. పలు సందర్భాల్లో ఆయన తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. దురోవ్ ఇటీవలి ఫొటోల్లో ఒత్తైన జుట్టు, టోన్డ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. చొక్కా లేకుండా దిగిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే దురోవ్ ఇటీవలి ఫొటోలు పాత ఫొటోలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.సోషల్ మీడియాలో వైరల్ఇలా దురోవ్ తాజా ఫొటోలను, పాత ఫొటోలను పోలుస్తూ ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆయన ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడన్న పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. దీనిపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. దురోవ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారని, లేదు విగ్ పెట్టుకున్నారని ఇలా తలో వాదన చేస్తున్నారు.Pavel Durov (Telegram CEO) before his hair transplant and plastic surgery. pic.twitter.com/TTb3am2Ddn— Creepy.org (@creepydotorg) September 1, 2024