సాధారణంగా కంపెనీల సీఈవో వేతనం రూ.కోట్లలో ఉంటుంది. కానీ ఈ ఫిన్‌టెక్ యూనికార్న్ సీఈవో వార్షిక జీతం కేవలం 12 రూపాయలే. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఈ కథనం చదవండి.
ప్రైవేట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ప్రైవేట్ సర్కిల్ రీసెర్చ్ యూనికార్న్ వ్యవస్థాపకుల మధ్యస్త, సగటు వేతన అంతరాలపై ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఫిన్‌టెక్ యూనికార్న్ స్లైస్ ఫౌండర్, సీఈవో రాజన్ బజాజ్ 2023 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12 వార్షిక వేతనం మాత్రమే తీసుకున్నారు.
సీఈవో బజాజ్ జీతం నామమాత్రంగా ఉన్నప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు, రుణ వ్యాపార కార్యకలాపాల నుంచి స్లైస్ రూ .847 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ తన అప్పటి ఫ్లాగ్షిప్ ఉత్పత్తి అయిన ప్రీపెయిడ్ కార్డుపై రివాల్వింగ్ క్రెడిట్ లైన్‌ను రద్దు చేసినప్పటికీ కంపెనీ దీనిని సాధించగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment