
ఏడాదికి రూ.వందలు, వేల కోట్లు పారితోషికం
కోరినన్ని సదుపాయాలు, ప్రోత్సాహకాలు
2024లో రూ. 2.2 లక్షల కోట్ల వేతనం తీసుకున్న మస్క్
స్టార్ బక్స్ సీఈవోకు నాలుగు నెలల్లో రూ.971 కోట్లు
సత్య నాదెళ్లకు ఏటా రూ.2,661 కోట్లు
సుందర్ పిచాయ్‌కి రూ.2,408 కోట్లు
కాలు బయటపెడితే ఖరీదైన కార్లు, చార్టర్డ్ విమానాల్లో ప్రయాణం.. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిత్యం కనిపెట్టుకొని ఉండే సేవకులు.. జీ హుజూర్ అనే యాజమాన్యాలు.. వీటన్నింటికీ మించి వందల కోట్ల రూపాయల వేతనాలు.. ప్రపంచ టాప్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల జీవితమిది. కంపెనీని లాభాల్లో నడిపించగలడు అని నమ్మితే ఎంత వేతనం, ఎన్ని సౌకర్యాలైనా ఇచ్చి సీఈవోగా నియమించుకునేందుకు కంపెనీలు వెనుకాడటంలేదు.
అందుకే కొందరు సీఈఓలు కళ్లు చెదిరే వేతనాలు అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణ స్టార్‌బక్స్ సీఈవో బ్రియాన్ నికోల్. ఆయన వారంలో మూడు రోజులే ఆఫీస్‌కు వస్తారు. అది కూడా 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆఫీస్‌కు చేరుకుంటారు. ప్రయాణం, నివాసం.. ఇలా అన్ని ఖర్చులూ కంపెనీయే భరిస్తుంది. ఆయన ఏడాదికి 113 మిలియన్ డాలర్ల (రూ.971 కోట్లు) ప్యాకేజీ అందుకుంటున్నారు. బ్రియాన్ అమెరికాలోని టాప్–20 సీఈఓల్లో ఒకరు.

ఎందుకంత అధిక వేతనాలు?
భారత కంపెనీలు చాలా వేగంగా వృద్ధి చెందుతూ, అంతర్జాతీయంగా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలకు పోటీగా దేశీ సీఈఓలకు సైతం అధికంగా పారితోషికాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల్లో టాప్ బాస్ అయిన సీఈఓనే కంపెనీ వ్యాపార విజయాలకు సూత్రధారి.
కంపెనీలను విజయపథంలో నడపగలిగే సీఈఓలకు అంతర్జాతీయంగా అధికడిమాండ్ ఉంది. వారిని పారితోషికాలతో ప్రసన్నం చేసుకునేందుకు కంపెనీ బోర్డులు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటంలేదు. సీఈఓల పారితోíÙకం షేర్ల కేటాయింపు రూపంలోనూ ఉంటుంది. షేర్ల ధరలు పెరగడం వారి పారితోíÙకాన్ని మరిన్ని రెట్లు చేయగలదు.

భారత్‌లో సగటు నెల వేతనం 10 కోట్లు
భారత్‌లో సీఈవోల సగటు నెల వేతనం రూ.10 కోట్లుగా ఉంది. అమెరికాలో ఇది 14–15 మిలియన్ డాలర్లు (రూ. 129 కోట్లు) కోట్లు. అమెరికా కంపెనీల్లో సీఈఓ వేతనం సగటు ఉద్యోగి వేతనం కంటే 160–300 రెట్లు ఎక్కువగా ఉంది. మనదేశంలో నిఫ్టీ –50 కంపెనీల్లో సగటు ఉద్యోగి కంటే సీఈవో వేతనం 260 రెట్లు అధికం.
Comments
Please login to add a commentAdd a comment