sundar Pichai
-
మహాకుంభమేళాలో స్టాల్స్ : స్ట్రీట్ వెండర్లుగా అంబానీ, అదానీ, మస్క్.. (ఫొటోలు)
-
సీఈవో... జీతాలు అదరహో
కాలు బయటపెడితే ఖరీదైన కార్లు, చార్టర్డ్ విమానాల్లో ప్రయాణం.. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిత్యం కనిపెట్టుకొని ఉండే సేవకులు.. జీ హుజూర్ అనే యాజమాన్యాలు.. వీటన్నింటికీ మించి వందల కోట్ల రూపాయల వేతనాలు.. ప్రపంచ టాప్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల జీవితమిది. కంపెనీని లాభాల్లో నడిపించగలడు అని నమ్మితే ఎంత వేతనం, ఎన్ని సౌకర్యాలైనా ఇచ్చి సీఈవోగా నియమించుకునేందుకు కంపెనీలు వెనుకాడటంలేదు.అందుకే కొందరు సీఈఓలు కళ్లు చెదిరే వేతనాలు అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణ స్టార్‌బక్స్ సీఈవో బ్రియాన్ నికోల్. ఆయన వారంలో మూడు రోజులే ఆఫీస్‌కు వస్తారు. అది కూడా 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆఫీస్‌కు చేరుకుంటారు. ప్రయాణం, నివాసం.. ఇలా అన్ని ఖర్చులూ కంపెనీయే భరిస్తుంది. ఆయన ఏడాదికి 113 మిలియన్ డాలర్ల (రూ.971 కోట్లు) ప్యాకేజీ అందుకుంటున్నారు. బ్రియాన్ అమెరికాలోని టాప్–20 సీఈఓల్లో ఒకరు. ఎందుకంత అధిక వేతనాలు? భారత కంపెనీలు చాలా వేగంగా వృద్ధి చెందుతూ, అంతర్జాతీయంగా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలకు పోటీగా దేశీ సీఈఓలకు సైతం అధికంగా పారితోషికాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల్లో టాప్ బాస్ అయిన సీఈఓనే కంపెనీ వ్యాపార విజయాలకు సూత్రధారి.కంపెనీలను విజయపథంలో నడపగలిగే సీఈఓలకు అంతర్జాతీయంగా అధికడిమాండ్ ఉంది. వారిని పారితోషికాలతో ప్రసన్నం చేసుకునేందుకు కంపెనీ బోర్డులు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటంలేదు. సీఈఓల పారితోíÙకం షేర్ల కేటాయింపు రూపంలోనూ ఉంటుంది. షేర్ల ధరలు పెరగడం వారి పారితోíÙకాన్ని మరిన్ని రెట్లు చేయగలదు.భారత్‌లో సగటు నెల వేతనం 10 కోట్లుభారత్‌లో సీఈవోల సగటు నెల వేతనం రూ.10 కోట్లుగా ఉంది. అమెరికాలో ఇది 14–15 మిలియన్ డాలర్లు (రూ. 129 కోట్లు) కోట్లు. అమెరికా కంపెనీల్లో సీఈఓ వేతనం సగటు ఉద్యోగి వేతనం కంటే 160–300 రెట్లు ఎక్కువగా ఉంది. మనదేశంలో నిఫ్టీ –50 కంపెనీల్లో సగటు ఉద్యోగి కంటే సీఈవో వేతనం 260 రెట్లు అధికం. -
ఏఐకి నాలుగు సూత్రాలు
పారిస్: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ పరిజ్ఞానం అభివృద్ధి, సమర్థ వినియోగం కోసం నాలుగు సూత్రాలను అనుసరించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సూచించారు. ఆ నాలుగు అంశాలలో ముందడుగు పడేందుకు పబ్లిక్ పాలసీ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరుగుతున్న ఏఐ యాక్షన్ సదస్సులో ఏఐ అభివృద్ధి, విస్తరణకు సంబంధించి రోడ్‌మ్యాప్‌ను సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలు దేశాల్లో భిన్నమైన నిబంధనలు, ఆంక్షలు ఉంటే.. ఏఐ అభివృద్ధికి ఆటంకమని స్పష్టం చేశారు. ప్రస్తుతం డేటాను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చు 97 శాతం దిగివచ్చిందని, ఇది కృత్రిమ మేధ అభివృద్ధికి అద్భుతమైన ఊతమిస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు. ఇది ఏఐ ఆవిష్కరణల స్వర్ణయుగమని, సమాజానికి ప్రయోజనకరంగా ఉండే ఏఐ ఆవిష్కరణల కోసం ప్రభుత్వాలు, సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో సుందర్ పిచాయ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే... ‘‘కృత్రిమ మేధ, దాని అప్లికేషన్ల గురించి నేను ఆశాజనకంగా ఉన్నాను. ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా టెక్నాలజీతో ప్రయోజనం పొందేందుకు, జీవితాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుంది. నేను భారత్‌లోని చెన్నైలో పెరిగాను. అప్పట్లో ప్రతి కొత్త టెక్నాలజీ ఇంటి వద్దకు చేరుకోవడానికి కొంత సమయం పట్టేది. అందులో రోటరీ ఫోన్ కూడా ఒకటి. దానికోసం మేం ఐదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. కానీ తర్వాత ఆ ఫోన్ మా జీవితాలను మార్చేసింది. అప్పట్లో మా అమ్మకు చేసిన రక్త పరీక్షల ఫలితాలు తెలుసుకోవడానికి నేను నాలుగు గంటల పా టు ప్రయాణం చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు అంతదూరం వెళ్లినా.. ‘రిపోర్ట్ సిద్ధంగా లేదు. రేపు రండి’అని ఆస్పత్రివాళ్లు చెప్పేవారు. అదే ఫోన్ వచ్చాక.. కేవలం ఒక్క కాల్‌తో పని అయిపోయింది.మన జీవితాల్లో గణనీయమైన మార్పు రాబోతోందిసాంకేతికత చూపిన సానుకూల ప్రభావాన్ని గమనించాను. అదే నన్ను యూఎస్ వరకు నడిపించింది. గూగుల్ అనే స్టార్టప్ కంపెనీ వద్దకు చేర్చింది. ముగ్గురు గూగుల్ సహోద్యోగులు నోబెల్ అందుకోవడాన్ని, డ్రైవర్ లెస్ కారులో నా తల్లిదండ్రులను తీసుకువెళ్లడాన్ని ఆనాడు నేను ఊహించలేదు. వీటిని సాకారం చేసినది ‘కృత్రిమ మేధ(ఏఐ)’సాంకేతికతే. దీనిలో మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. అయినా ఏఐ మన జీవితంలో గణనీయమైన మార్పులు తెస్తోంది. పర్సనల్ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వచి్చనప్పటి కంటే ఈ మార్పు మరింత పెద్దదిగా, ప్రభావవంతంగా ఉండబోతోంది.ఏడాదిన్నరలో 97 శాతం ఖర్చు తగ్గింది..డేటాను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చు గత 18 నెలల్లో ఏకంగా 97 శాతం దిగి వచ్చింది. పది లక్షల టోకెన్ల (డేటా ప్రాసెసింగ్ యూనిట్) డేటాను ప్రాసెస్ చేయడానికి అయిన ఖర్చు నాలుగు డాలర్ల (సుమారు రూ.350) నుంచి 13 సెంట్ల (రూ.11)కు దిగి వచ్చింది. అంటే ఇంతకుముందెన్నడూ లేనంతగా మేధస్సు అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్నకొద్దీ.. ప్రపంచవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలను, అవకాశాలను, ఆర్థిక అభివృద్ధి అవకాశాలను మెరుగుపరుస్తూనే ఉంటుంది. విజ్ఞానాన్ని, సృజనాత్మకతను, ఉత్పాదకతను పెంచుతుంది. ఏఐలో గూగుల్ పెట్టుబడి..ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, మార్చడానికి గూగుల్ సంస్థ దశాబ్దకాలం నుంచి ఏఐలో పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచంలోని సమాచారాన్ని నిర్వహించడంతోపాటు అందరికీ ప్రయోజనకరంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇది కీలకమని గుర్తించాం. ఇప్పుడు జనరేటివ్ ఏఐ విప్లవానికి మార్గం వేసిన ఆవిష్కరణలను రూపొందించాం. ఏఐ కోసం ప్రత్యేకమైన ‘టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్’చిప్స్‌ను అభివృద్ధి చేశాం. టెక్స్టŠ, ఇమేజ్, వీడియో, ఆడియో, కోడ్ ఇలా అన్నిరకాల సమాచారాన్ని ప్రాసెస్ చేయగల ‘జెమిని’వంటి ఏఐ మోడళ్లను దీనితో వినియోగించుకోగలం. ఎన్నో అంశాల్లో ప్రజలకు పూర్తి సహాయకారిగా ఉండే అప్లికేషన్లను రూపొందిస్తున్నాం. 200 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు వినియోగిస్తున్న గూగుల్ మ్యాప్స్, సెర్చ్, ఆండ్రాయిడ్ వంటి ఏడు ఉత్పత్తులను మా కృత్రిమ మేధ ఆవిష్కరణల సాయంతో అభివృద్ధి చేశాం.సైన్స్, ఆవిష్కరణలకు ఏఐ సాయం.. వైద్య రంగంలో కీలక ఆవిష్కరణగా ఆల్ఫాఫోల్డ్ను రూపొందించాం. 2021లో దానిని సైంటిఫిక్ కమ్యూనిటీకి ఉచితంగా అందుబాటులోకి తెచ్చాం. 190 దేశాలకు చెందిన 25 లక్షల మంది కంటే ఎక్కువ మంది పరిశోధకులు మలేరియా కొత్త వ్యాక్సిన్లు, కేన్సర్ చికిత్సలు, ప్లాస్టిక్‌ను అరగదీసే ఎంజైమ్‌లను రూపొందించడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. ఆల్ఫాఫోల్డ్ ఆధారంగా ఏర్పాటైన ఐసోమోర్ఫిక్ ల్యాబ్స్.. ఔషధాల రూపకల్పన, చికిత్సలు విజయవంతం చేయడం కోసం మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు కొత్త ఔషధాలను కనుగొనడానికి, ఎలక్ట్రిక్ కార్ల కోసం మరింత సమర్థవంతమైన బ్యాటరీలను రూపొందించడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ సాయపడుతోంది. ఏఐ తర్వాత రాబోతున్న అతిపెద్ద మార్పు క్వాంటమ్ కంప్యూటింగ్.ఇది ఆవిష్కరణల స్వర్ణయుగం..ఇదొక చరిత్రాత్మక క్షణం. ఇది ఆవిష్కరణల స్వర్ణయుగానికి నాంది. కానీ దీని ఫలితాలు కచ్చితమని చెప్పలేను. అయితే ప్రతి తరం కూడా కొత్త సాంకేతికత వల్ల తర్వాతి తరం పరిస్థితి అధ్వానంగా మారుతుందని ఆందోళన చెందుతుంది. కానీ ప్రతిసారీ అందుకు విరుద్ధంగా జరుగుతూ వస్తోంది. ఏఐతో జీవితాలను మెరుగుపరచుకోవడానికి మనకు ఒక తరంలో ఒకసారే అవకాశం ఉంటుంది. అది సాధ్యం కావడానికి మనం చేయగలిగినదంతా చేద్దాం.సమాజానికి ఏఐతో సమకూరుతున్న ప్రయోజనాలెన్నో..కృత్రిమ మేధతో సమాజానికి ఇప్పటికే ఎన్నో ప్రయోజనాలు సమకూరుతున్నాయి. గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను ప్రవేశపెట్టిన కొత్తలో కొన్ని భాషలే ఉన్నాయి. ఏఐ వచ్చాక ఈ ప్రయోజనం మరింత పెరిగింది. ఏఐ సాంకేతికతలను ఉపయోగించి గత ఏడాది 50కోట్ల మందికి పైగా మాట్లాడే 110కి పైగా కొత్త భాషలను గూగుల్ ట్రాన్స్‌లేట్‌కు జోడించాం. 60 ఆఫ్రికన్ భాషలు సహా గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇప్పుడు 249 భాషలకు చేరుకుంది. ఏఐతో ఆరోగ్య రంగంలో ప్రయోజనాలు ఎన్నో. ప్రమాదకరమైన కేన్సర్లకు సంబంధించిన బయోమార్కర్లను గుర్తించే అంశంలో ఏఐ సాయం తీసుకుంటున్నాం. భారత్, థాయ్‌లాండ్‌లో స్థానిక సంస్థలతో కలసి 60లక్షల మందికి ఉచితంగా డయాబెటిక్ రెటినోపతికి ఏఐ స్క్రీనింగ్ చేశాం. ఏఐ ఆధారిత ఫ్లడ్హబ్తో 100 కంటే ఎక్కువ దేశాల్లో 70 కోట్ల మందికి వరదల సమాచారాన్ని ముందే అందించగలుగుతున్నాం. ఇలా ఏఐతో ప్రయోజనకరమైన సాంకేతికతలు ఎన్నో వచ్చాయి.ఏఐ శక్తిని వెలికితీయడానికి ఏం చేయాలి?కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వెలికితీసి, సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఎన్నో చర్యలు చేపట్టాలి.» మొదటిది... ఆవిష్కరణకర్తలు, వాటిని అనుసరించేవారితో ఎకోసిస్టమ్ రూపొందించాలి. » రెండోది.. ఏఐ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ప్రధాన టెక్ కంపెనీలు సుమారు 300 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 26,025 కోట్లు) ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి. » మూడోది.. వర్క్ ఫోర్స్‌ను సిద్ధం చేసేందుకు పెట్టుబడి పెట్టాలి, భవిష్యత్తు పరిణామాలకు వారిని సిద్ధం చేయాలి. ప్రపంచ ఆర్థిక సదస్సు నివేదిక ప్రకారం... యూరప్‌లోని ఉద్యోగాల్లో చాలా వరకు జనరేటివ్ ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొంటాయి. »నాలుగోది.. సమాజంలో మార్పులు తీసుకురాగల కృత్రిమ మేధ అప్లికేషన్ల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలి. అందరూ ప్రయోజనం పొందేలా చూడాలి. అదే సమయంలో సమాచార కచ్చితత్వం, వాస్తవాలు, టెక్నాలజీ దురి్వనియోగంపై అప్రమత్తంగా ఉండాలి. ... ఈ నాలుగు అంశాలలో ముందడుగు పడేందుకు పబ్లిక్ పాలసీ అత్యంత కీలకమైనది. ఇందులో భాగంగా.. సృజనాత్మకత, ఆవిష్కరణలకు ఆటంకం కలుగకుండా చూసుకుంటూ, ఏఐతో సమస్యలను గుర్తించాలి. కొత్త చట్టాలు తేవడం కంటే.. ఇప్పుడున్న చట్టాల్లో అవసరమైన మార్పులు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వేర్వేరు నిబంధనలు, ఆంక్షలు ఉంటే ఏఐ అభివృద్ధికి ఆటంకమన్నది గుర్తుంచుకోవాలి. ఏఐ రంగంలో మౌలిక సదుపాయాలు, మానవ వనరులపై పెట్టుబడుల విషయంలో ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. -
కాసుల వర్షం: సినీ తారలు, వ్యాపారవేత్తలే కాదు.. ఐటీ దిగ్గజాలు కూడా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిందంటే అతియోశక్తి కాదేమో! ఐపీఎల్ ఆరంభానికి పూర్వం కూడా భారత్ క్రికెట్ యాజమాన్యానికి అంతర్జాతీయ క్రికెట్ పై మంచి పట్టు ఉండేది. కానీ ఐపీఎల్ రాకతో భారత్ ఏకంగా ప్రపంచ క్రికెట్‌ని శాసించే స్థాయికి చేరుకుంది. ఐపీఎల్ కురిపించే కాసుల వర్షం ఇందుకు ప్రధాన కారణం. గత సంవత్సరం గణాంకాల ప్రకారం ఐపీఎల్ మొత్తం విలువ 1600 కోట్ల డాలర్లను దాటి పోయింది. ఇందుకు ఐపీఎల్‌ను నిర్వహిస్తున్న తీరు కూడా ఒక కారణం. ఇందుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని అభినందించాల్సిందే.ఐపీఎల్ విజయ సూత్రాన్ని ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దేశాలన్నీ తెలుసుకున్నాయి. వివిధ దేశాల్లో జరుగుతున్న టీ20 క్రికెట్ టోర్నమెంట్లు ఇందుకు ఉదాహరణ. ఆయా దేశాల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ అక్కడ ఐపీఎల్ తరహాలో కాసుల వర్షం కురవడం లేదు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న మోజు కూడా ఇందుకు ప్రధాన కారణం. ఐపీఎల్ జరుగుతుంటే అందరూ టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. ఐపీఎల్‌కి క్రికెట్ అభిమానుల్లో ఉన్న క్రేజ్ అలాటిది.'ది హండ్రెడ్' ఇక ఐపీఎల్ స్పూర్తితో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 'ది హండ్రెడ్' అనే కొత్త ఫార్మాట్ ని 2021 జులై లో ప్రారంభించింది. ఇందులో ఇరు జట్లు వందేసి బంతులు మాత్రమే ఎదుర్కొంటాయి. ఇప్పుడు తాజాగా అమెరికా లో రాణిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజాల కళ్ళు ఈ క్రికెట్ టోర్నమెంట్‌పై పడ్డాయి.టెక్ దిగ్గజాలు కూడాఅమెరికాలో టెక్ కంపెనీ సీఈఓలు.. ముఖ్యంగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ వంటి ప్రముఖులు ఇందులో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. టైమ్స్ ఇంటర్నెట్ వైస్ చైర్మన్ సత్యన్ గజ్వానీ, పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈవో నికేశ్ అరోరా నేతృత్వంలోని అమెరికాకు చెందిన టెక్ లీడర్లతో కూడిన కన్సార్టియం శుక్రవారం జరిగిన వేలంలో లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీలో 49% వాటాను 145 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది.అమాంతం పెరిగిపోయిన విలువఈ కన్సార్టియం ఐపీఎల్ లోని లక్నో జట్టు ను నిర్వహిస్తున్న ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్‌ను పక్కకు తోసి లండన్ స్పిరిట్ క్రికెట్ ఫ్రాంచైజీ ని చేజిక్కించుకోవడం విశేషం. లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ వేదిక కావడం ఇందుకు ఒక కారణం. లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లో పోటీపడే ఎనిమిది ఫ్రాంచైజీలలో ఒకటి. ఈ ఒప్పందంతో లండన్ స్పిరిట్ విలువ అమాంతం పెరిగిపోయి, ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్లో ఈ జట్టు ఇప్పుడు అత్యంత విలువైన ఫ్రాంచైజీగా చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 49%అంతకుముందు గురువారం నాడు ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టులో ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 49% వాటా కోసం వెచ్చించిన 60 లక్ష ల పౌండ్ల కంటే ఇది రెండింతలు అధికం. ఇప్ప్పటికే ఐపీఎల్ లో సినీ తారలు, వ్యాపారవేత్తలు వివిధ ఫ్రాంచైజీ ల లో పెట్టుబడులు పెట్టి కోట్ల లాభాలను గడిస్తున్నారు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ ప్రతీ సంవత్సరం అమాంతం పెరిగిపోతోంది. ఇప్పుడు తాజాగా ది హండ్రెడ్ క్రికెట్ టోర్నమెంట్ లోకి ప్రపంచ ఐటి దిగ్గజాలు రంగ ప్రవేశం చేయడంతో ప్రపంచ క్రికెట్ కొత్త హంగులు దిద్దుకుంటుందనడంలో సందేహం లేదు.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
క్రికెట్ జట్టు కోసం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బిడ్ దాఖలు
ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ లండన్‌కు చెందిన క్రికెట్ జట్టు కోసం వేలం వేసే సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్‌ల కన్సార్టియంలో చేరారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ వంటి టాప్ టెక్ లీడర్లతో కూడిన ఈ గ్రూప్ ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ లేదా ‘లండన్ స్పిరిట్’ టీమ్‌ల కోసం 80 మిలియన్ పౌండ్ల (97 మిలియన్ డాలర్లు-రూ.805.1 కోట్లు) బిడ్ వేస్తోంది.ఈ కన్సార్టియంకు పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ సత్యన్ గజ్వానీ నేతృత్వం వహిస్తున్నారు. యువ క్రికెట్ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించిన క్రికెట్ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’ ఎనిమిది జట్లలో ప్రైవేట్ పెట్టుబడులను పొందడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీఈ) చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ బిడ్ దాఖలవుతున్నట్లు తెలిసింది.100-బాల్ ఫార్మాట్‌తో ‘ది హండ్రెడ్’100-బాల్ ఫార్మాట్‌ను అనుసరించే ది హండ్రెడ్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఈ పోటీలో ఎనిమిది నగరాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. ప్రతి ఒక్కటి యూకేలోని ఒక ప్రధాన నగరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇది స్కై స్పోర్ట్స్, బీబీసీలో ప్రసారం అవుతుంది.ఇదీ చదవండి: ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిన ఆన్లైన్ సేవలుటెక్ కంపెనీ సీఈఓలకు ఆసక్తిసుందర్ పిచాయ్‌కు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే. టాప్ టెక్ కంపెనీ సారథులు క్రికెట్‌పై ఆసక్తిగా ఉంటూ దాన్ని మరింత మందికి చేరువ చేయాలని చూస్తున్నారు. ఇదిగాఉండగా, ఈసీబీ ప్రతి జట్టులో 49 శాతం వాటాను విక్రయించాలని చూస్తోంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆడే లండన్ స్పిరిట్ జట్టుకు సొంత మైదానం ఉండడంతో దాని నిర్వహణకు సంబంధించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. -
‘గూగులీనెస్’ అంటే తెలుసా? సుందర్ పిచాయ్ వివరణ
‘గూగులీనెస్’ అనే పదాన్ని చాలా కాలంగా గూగుల్ ఉద్యోగులు ఉపయోగిస్తున్నారు. మళ్లీ గూగుల్‌లో లేఆఫ్స్ ఉంటాయని ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ పదం మరోసారి వైరల్‌గా మారింది. ఉద్యోగులు గూగుల్ సంస్కృతి, విలువలకు సరిపోతారా లేదా అని తనిఖీ చేయడంలో ఈ పదం ఉపయోగపడుతుందని సంస్థలో ఉన్నతాధికారులు నమ్ముతున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల జరిగిన కంపెనీ వైడ్ ఫోరమ్ సమావేశంలో ఈ పదానికి సంబంధించి మరింత స్పష్టతను ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆరు కీలక అంశాలపై గూగులీనెస్ ఆధారపడి ఉంటుందని చెప్పారు.మిషన్ ఫస్ట్: గూగుల్ మిషన్‌కు, ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తులో ఆయా ప్రాజెక్ట్‌ల్లో భారీ లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి. ఫ్యూచర్ విజన్ కోసం పని చేయాలి.అందరికీ ఉపయోగపడే వాటిపై దృష్టి: ప్రజల జీవితాలను నిజంగా మెరుగుపరిచే ఉత్పత్తులను సృష్టించాలి. అందరికీ ఉపయోగపడే వాటిపై ఉద్యోగులు దృష్టి సారించాలి.ధైర్యంగా, బాధ్యతాయుతంగా ఉండడం: ఏ పని చేస్తున్నప్పుడైనాసరే మీరు చేస్తున్నది బలంగా నమ్మి ధైర్యంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వచ్చే ఫలితాలకు సైతం బాధ్యత తీసుకునేటప్పుడు సాహసోపేతమైన ఆలోచనలను ప్రోత్సహించవచ్చు.వనరులను సద్వినియోగం చేసుకోవడం: మనం చేయాలనుకుంటున్న పనులకు అన్ని సందర్భాల్లోనూ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. చాలా వనరులు అవసరం అవ్వొచ్చు. కానీ పరిమిత వనరులను సద్వినియోగం చేసుకుని మెరుగైనా ఫలితాలు రాబట్టేలా పని చేయాలి.వేగంగా.. సరదాగా..: చేసేపనిని నిర్దేశించిన కాలంలో పూర్తి చేయాలి. దాంతోపాటు భారంగా కాకుండా, సరదాగా పని చేయాలి.టీమ్ గూగుల్: టీమ్ వర్క్ చాలా ముఖ్యం. ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..10 శాతం మందికి లేఆఫ్స్..కొంతకాలంగా ఎలాంటి తొలగింపులు లేకుండా నిశ్చలంగా ఉన్న గూగుల్ కంపెనీ మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్దమైంది. ఈ ప్రభావం మేనేజర్ స్థాయి ఉద్యోగులు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ల మీద పడనుంది. గూగుల్ రానున్న రోజుల్లో 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవలే వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో నెలకొన్న పోటీని ఎదుర్కోవడానికి, ఓపెన్ఏఐ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు. -
టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: 10 శాతం ఉద్యోగులు బయటకు
గత కొంతకాలంగా ఎలాంటి తొలగింపులు లేకుండా నిశ్చలంగా ఉన్న టెక్ రంగంలో మళ్ళీ లేఆప్స్ అలజడి మొదలైంది. గూగుల్ కంపెనీ మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్దమైంది. ఈ ప్రభావం మేనేజర్ స్థాయి ఉద్యోగులపైన, డైరెక్టర్లపైన, వైస్ ప్రెసిడెంట్ల మీద పడనుంది.గ్లోబల్ టెక్ దిగ్గజం 'గూగుల్' ఇప్పుడు 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు.. సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో నెలకొన్న పోటీని ఎదుర్కోవడానికి, ఓపెన్ఏఐ వంటి వాటిని గట్టి పోటీ ఇవ్వడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మీరు అమెజాన్ ప్రైమ్ యూజర్లా.. కొత్త రూల్స్ చూసారా?గూగుల్ కంపెనీ 20 శాతం మరింత శక్తివంతంగా మారాలని సుందర్ పిచాయ్ 2022లోనే ఆకాక్షించారు. ఆ తరువాత ఏడాది 12,000 మంది ఉద్యోగులను గూగుల్ తొలగించారు. కాగా ఇప్పుడు 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎంత మందిని తొలగిస్తారు అనే విషయాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
గూగుల్ కొత్త చిప్: సూపర్ కంప్యూటర్ కంటే ఫాస్ట్
టెక్ దిగ్గజం 'గూగుల్'.. క్వాంటం కంప్యూటింగ్‌లో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది. ఇందులో భాగంగానే సరికొత్త క్వాంటం చిప్ విల్లోను ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని కంపెనీ ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన ఈ కొత్త చిప్, కేవలం ఐదు నిమిషాల్లో సంక్లిష్టమైన గణిత సమస్యను విజయవంతంగా పరిష్కరించగలిగింది.గూగుల్ పరిచయం చేసిన ఈ విల్లో చిప్.. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. విల్లో చిప్ ఐదు నిమిషాల్లో పరిష్కరించగలిగిన సమస్యను.. వేగవంతమై సూపర్ కంప్యూటర్ పరిష్కారించాలంటే 10 సెప్టిలియన్ (ఒకటి తరువాత 25 సన్నాలు ఉన్న సంఖ్య) సంవత్సరాలు పడుతుంది. ఇది విశ్వం ఆవిర్భావం కంటే ఎక్కువని గూగుల్ వెల్లడించింది.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!విల్లోని పరిచయం చేస్తున్నాము, ఇది మా కొత్త లేటెస్ట్ క్వాంటం కంప్యూటింగ్ 'చిప్' అని గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. వావ్ అని కామెంట్ చేశారు. ఆ తరువాత వీరిరువురి మధ్య కొంత సంభాషణ కూడా జరిగింది. ఇదంతా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.Introducing Willow, our new state-of-the-art quantum computing chip with a breakthrough that can reduce errors exponentially as we scale up using more qubits, cracking a 30-year challenge in the field. In benchmark tests, Willow solved a standard computation in <5 mins that would…— Sundar Pichai (@sundarpichai) December 9, 2024Wow— Elon Musk (@elonmusk) December 9, 2024 -
మైక్రోసాఫ్ట్‌కు, గూగుల్‌కు తేడా అదే..
మైక్రోసాఫ్ట్ ఏఐ వ్యూహంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సూక్ష్మంగా స్పందించారు. ది న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ సమ్మిట్‌లో ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీదారులతో పోలిస్తే ఏఐలో గూగుల్ (Google) పురోగతి గురించి అడిగినప్పుడు, పిచాయ్ ఒక కీలకమైన వ్యత్యాసాన్ని హైలైట్ చేశారు. గూగుల్ సొంత ఏఐ మోడల్లను అభివృద్ధి చేస్తుంది.. కానీ మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ వంటి కంపెనీల బాహ్య మోడల్‌లపై ఆధారపడుతుందని చెప్పుకొచ్చారు.సత్య నాదెళ్ల మాటకేమంటారు..?పోటీదారులతో పోలుస్తూ ఏఐలో గూగుల్ పురోగతి గురించి ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. ఏఐ రేసులో గూగుల్ గెలవాలని సవాలు విసురుతూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గతంలో చేసిన వ్యాఖ్యను కూడా ఆయన గుర్తుచేశారు. పిచాయ్ స్పందిస్తూ మైక్రోసాఫ్ట్ బాహ్య ఏఐ మోడల్స్‌పై ఆధారపడుతుందని, కానీ గూగుల్ సొంతంగా అభివృద్ధి చేస్తుందని ఎద్దేవా చేశారు.చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే మైక్రోసాఫ్ట్‌కు సవాలు విసురుతున్నారా.. అని ప్రశ్నించగా పిచాయ్ నవ్వుతూ, "అలా కాదు.. వారి పట్ల, వారి టీమ్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది" అని పేర్కొన్నారు.సత్య నాదెళ్ల వ్యాఖ్యలపై పిచాయ్ స్పందించడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమ ఏఐ- పవర్డ్ బింగ్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించిన తర్వాత సెర్చ్ వ్యాపారం పరంగా గూగుల్ ఎడ్జ్ గురించి నాదెళ్ల మాట్లాడారు. సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్‌ను '800-పౌండ్ల గొరిల్లా' అని అభివర్ణించారు. తమ ఆవిష్కరణలతో గూగుల్‌ను ఆట ఆడిస్తామని చెప్పారు. బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్.. మైక్రోసాఫ్ట్ బాస్‌కు కౌంటర్ ఇచ్చారు. తాము వేరొకరి మ్యూజిక్కు ఆడబోమంటూ బదులిచ్చారు. -
కాన్ఫరెన్స్ కాల్లో ట్రంప్-పిచాయ్-మస్క్!
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కాల్ చేశారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనందకు ట్రంప్నలకు అభినందనలు తెలిపారు. అయితే వీరి సంభాషణలో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మాస్క్ చేరారు. గతంలో గూగుల్‌లో సెర్చ్ విషయంలో తప్పుడుగా చూపిస్తున్నట్లు మస్క్ ఆరోపణలు చేశారు. ట్రంప్ కోసం సెర్చ్ చేస్తే, కమలా హారిస్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయని, కానీ హారిస్ కోసం సెర్చ్ చేస్తే ట్రంప్ సమాచారం రావడం లేదని ఓ యూజర్ తెలపగా.. దానిని మస్క్ రీట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా.. పిచాయ్, ట్రంప్, మస్క్ టెలిఫోన్ సంభాషణపై ఆసక్తి నెలకొంది. మరి ఈ ముగ్గురి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియరాలేదు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య సంబంధాలు బలపడిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల ముందు మస్క్ ప్రపంచ నాయకులతో టెలిఫోన్ కాల్లో మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి పలు సలహాలు అందించారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా మారడంతో మాస్క్‌ను అందరూ ‘ఫస్ట్ బడ్డీ’గా పిలుస్తుంటారు.ఈ క్రమంలో స్పేస్ ఎక్స్‌కు చెందిన ఓ భారీ స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగాన్ని వీరిద్దరూ ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే, ఇందులో ఒక దశ విఫలమవ్వగా.. రెండో దశ విజయవంతమైంది. ట్రంప్ కేబినెట్లో మస్క్ 'ప్రభుత్వ సమర్థత విభాగానికి(అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) నాయకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ప్రచార సమయంలోనే వెల్లడించాడు. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామితో కలిసి మస్క్ ఈ విభాగానికి అధిపతిగా ఉండనున్నారు. -
సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు: ఎన్నికల్లో ఎవరు గెలిచినా..
టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. ఫలితాలు వెలువడక ముందే ఓ విషయాన్ని వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. కంపెనీ మాత్రం విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే వనరుగా ఉండాలని, తన ఉద్యోగులను కోరినట్లు సమాచారం. ఎన్నికల వేళ రాజకీయ విభేదాలలో చిక్కుకోకుండా ఉండేందుకు పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.గూగుల్‌పై ట్రంప్ ఆరోపణలుఈ ఏడాది సెప్టెంబర్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజంపై విచారణ జరుపుతామని వెల్లడించారు. గూగుల్ తన గురించి చెడు కథనాలను, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ గురించి మంచి కథనాలను మాత్రమే వెల్లడిస్తోంది ఆరోపించారు.అధ్యక్ష పీఠమెవరికో..ఇప్పటికే ఒక సారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన.. ట్రంప్ మళ్ళీ అధ్యక్ష పదివి చేపడతారా?.. లేక 'కమలా హారిస్'ను ఆ పదవి వరిస్తుందా? అని ప్రపంచ దేశాలు ఉత్కఠతో ఎదురు చూస్తున్నాయి. కాగా ఇప్పటికే అమెరికాలో పోలింగ్ మొదలైపోయింది. ఫలితాలు త్వరలోనే వెల్లడవుతాయి. అమెరికా అధ్యక్ష పీఠమెవరిదనేది తెలిసిపోతుంది. -
గూగుల్‌లో జాబ్ కోసం ఇవి తప్పనిసరి: సుందర్ పిచాయ్
గూగుల్ సంస్థలో ఉద్యోగం చేయాలని చాలామంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కలలు కంటారు. అయితే కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలంటే.. ఎలాంటి స్కిల్స్ ఉండాలనే విషయాన్ని సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.ది డేవిడ్ రూబెన్‌స్టెయిన్ షో, పీర్ టు పీర్ కన్వర్జేషన్స్‌లో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. గూగుల్ కంపెనీలో జాబ్ కావాలంటే మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని కావలసిన నైపుణ్యం, అడాప్టబుల్ వంటివి పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు వేగంగా.. టెక్నాలజీకి అనుకూలంగా మారే సూపర్ స్టార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కంపెనీ ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటుందని అన్నారు.క్రియేటివిటీ, ఇనోవేషన్స్ వంటి వాటిని పెంపొందించడంలో గూగుల్ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది. ఉచిత భోజనాన్ని అందించే కంపెనీ సంప్రదాయాన్ని గురించి పిచాయ్ వివరిస్తూ.. ఇది సమాజాన్ని నిర్మించడంలో, కొత్త ఆలోచనలను రేకెత్తించడంలో సహాయపడుతుందని అన్నారు.గూగుల్ కంపెనీలో సుందర్ పిచాయ్ ప్రారంభ రోజులను గురించి కూడా వెల్లడించారు. కేఫ్‌లో ఊహించని సంభాషణలు ఎలా ఉత్తేజకరమైన ప్రాజెక్ట్‌లకు దారితీస్తాయో గుర్తుచేసుకున్నారు. టెక్ ప్రపంచం సవాళ్లతో కూడుకున్నదిగా ఉన్నప్పటికీ.. ప్రతిభావంతులకు గూగుల్ గమ్యస్థానంగా నిలుస్తుందని పిచాయ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: సూరత్‌లో వజ్రాల పరిశ్రమకు ఏమైంది? కార్మికుల ఆత్మహత్యలకు కారణం ఇదేనా..2024 జూన్ నాటికి గూగుల్ కంపెనీలో 1,79,000 మంది ఉన్నట్లు వెల్లడించారు. టెక్ పరిశ్రమ అంతటా ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో గూగుల్‌లో ఉద్యోగం పొందటం కొంత కష్టమని అన్నారు. మాజీ గూగుల్ రిక్రూటర్ నోలన్ చర్చ్ కూడా నియామక ప్రక్రియపై గురించి వివరించారు. గూగుల్ సంస్థ విలువలను, మిషన్‌ను అర్థం చేసుకోవడానికి సంబంధించిన ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ.. ఇంటర్వ్యూలకు బాగా సిద్ధం కావాలని అభ్యర్థులకు సూచించారు. -
‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’
రతన్ టాటా మృతిపట్ల ప్రముఖులు వివిధ మాధ్యమాల ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ రతన్ టాటాతో చివరిసారిగా గడిపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆ వివరాలు పంచుకుంటూ టాటా మృతికి సంతాపం తెలియజేశారు.‘గూగుల్ క్యాంపస్‌లో రతన్ టాటాను చివరిసారి కలిసినప్పుడు ‘వేమో’(అధునాతన అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ) పురోగతి గురించి మాట్లాడాం. ఈ విభాగంలో ఆయన ఆలోచన విధానాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అసాధారణమైన వ్యాపార, దాతృత్వ వారసత్వం ఆయన సొంతం. భారతదేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం చేయడంలో రతన్ టాటా కీలకపాత్ర పోషించారు. భారత్‌ను ఆర్థికంగా మరింత మెరుగుపరిచేందుకు ఆయన ఎంతో శ్రద్ధ చూపారు. అతని మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని సుందర్ తెలిపారు.My last meeting with Ratan Tata at Google, we talked about the progress of Waymo and his vision was inspiring to hear. He leaves an extraordinary business and philanthropic legacy and was instrumental in mentoring and developing the modern business leadership in India. He deeply…— Sundar Pichai (@sundarpichai) October 9, 2024రతన్ టాటాపై ఇలోన్మస్క్టాటా ప్రపంచ ప్రఖ్యాత సంస్థల సారథులకు స్ఫూర్తిగా నిలిచారు. అమెరికన్ జర్నలిస్ట్ చార్లీ రోస్తో 2009లో ఇలోన్మస్క్తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా దూరదృష్టిని మస్క్ ప్రశంసించారు. ఇంటర్వ్యూలో భాగంగా భారతీయ మార్కెట్లో టాటా తక్కువ ధరకే కారు(నానో) అందిస్తున్నారని మస్క్ దృష్టికి తీసుకొచ్చారు. ‘రతన్ టాటా ఇండియాలో విప్లవాత్మక మార్పునకు తెరతీశారు. కేవలం రూ.ఒక లక్షకు కారు అందించడం గొప్ప విషయం. కారు సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే దూరదృష్టి టాటాది’ అని మస్క్ బదులిచ్చారు.He fulfilled his promise to build the world's cheapest car.- Ratan Tata wanted to build a car, which the middle class of India could afford and so he delivered on his promise and launched Tata Nano for just $1,200 (₹1 lakh) in 2008.- @ElonMusk also shared his views on the… pic.twitter.com/QqTY5KuQLK— Nico Garcia (@nicogarcia) August 26, 2024రతన్ టాటాపై బిల్ గేట్స్‘రతన్ టాటా దూరదృష్టి కలిగిన నాయకుడు, సామాన్యుల జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం ఎనలేనిది. అతడి వ్యక్తిత్వం భారతదేశం, ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. ప్రజలకు సేవ చేసేందుకు రతన్ టాటాతో కలిసి అనే సందర్భాల్లో వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. అతడి మరణం రాబోయే తరాలకులోటు. కానీ అతడు అనుసరించిన విలువలు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’ అని బిల్‌గేట్స్ తెలిపారు.ఇదీ చదవండి: సినీనటి సంతాపం.. అప్పట్లో ఇద్దరి మధ్య ప్రేమ?మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, ముఖేష్ అంబానీ వంటి వ్యాపార ప్రముఖులు, రాజకీయ, సినీ దిగ్గజాలు ఆయనకు సంతాపం తెలిపారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో టాటా తుది శ్వాస విడిచారు. -
రతన్ టాటాతో చివరి మీటింగ్ గుర్తు చేసుకున్న గూగుల్ సీఈఓ
ముంబై: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన 86వ ఏట కన్నుమూశారు. ఆయన మృతిపై పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నివాళులు అర్పించిన వారిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు.భారతీయ సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. గూగుల్‌లో రతన్ టాటాతో తమ చివరి సమావేశంలో తాము అనేక అంశాలపై చర్చించామని సుందర్ పిచాయ్ తెలిపారు. ఆయన విజన్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆయన తన దాతృత్వ విలువలను మనకు అందించారు. మన దేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పిచాయ్ ఎక్స్ వేదికగా ఒక పోస్టులో పేర్కొన్నారు.భారతదేశాన్ని అభివృద్ధిపథంలో నడపడంలో టాటా ఎంతో శ్రద్ధ వహించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రతన్ జీ.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్నాను అంటూ సుందర్ పిచాయ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. టాటా గ్రూప్‌నకు రతన్ టాటా 20 ఏళ్లు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు.ఇది కూడా చదవండి: రతన్ టాటా..రతనాల మాటలు -
యూట్యూబ్ మాజీ సీఈఓ కన్నుమూత
యూట్యూబ్ మాజీ సీఈఓ 'సుసాన్ వొజ్కికి' (Susan Wojcicki) క్యాన్సర్‌తో రెండేళ్ల పోరాటం తర్వాత 56 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె మరణ వార్తను ఆమె భర్త 'డెన్నిస్ ట్రోపర్' ఆగస్టు 9న ధృవీకరించారు.సుసాన్ వొజ్కికి మరణ వార్తను ట్రోపర్ ఫేస్బుక్ పోస్ట్‌తో తెలియజేశారు. నా భార్య ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడి చివరకు కన్నుమూసింది. సుసాన్ నాకు ప్రాణ స్నేహితురాలు. జీవిత భాగస్వామి మాత్రమే కాదు, తెలివైన మనస్సు, ప్రేమగల తల్లి, చాలా మందికి మంచి స్నేహితురాలు. మా కుటుంబంపై ఆమె ప్రభావం ఎనలేనిదని అన్నారు.సుసాన్ వొజ్కికి మరణం టెక్ ప్రపంచానికి తీరని లోటు అని చాలామంది నివాళులు అర్పించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ విచారం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల క్యాన్సర్‌తో పోరాడి నా ప్రియమైన స్నేహితురాలు సుసాన్ వొజ్కికిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టంగా ఉందని అన్నారు.Unbelievably saddened by the loss of my dear friend @SusanWojcicki after two years of living with cancer. She is as core to the history of Google as anyone, and it’s hard to imagine the world without her. She was an incredible person, leader and friend who had a tremendous…— Sundar Pichai (@sundarpichai) August 10, 2024 -
సుందర్ పిచయ్ కు ట్రంప్ వార్నింగ్..
-
బర్త్‌డే స్పెషల్.. 'సుందర్ పిచాయ్' సక్సెస్ జర్నీ & లవ్ స్టోరీ (ఫొటోలు)
-
టెన్షన్ పడుతూ లవ్‌ప్రపోజ్ చేసిన సుందర్‌పిచాయ్
భారత సంతతికి చెందిన వ్యక్తులు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభ చాటుతున్నారు. అందులో ప్రపంచ నం.1 సెర్చ్ఇంజిన్ కంపెనీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు ప్రత్యేకస్థానం ఉంది. తమిళనాడులోని మధురైలో పుట్టి టాప్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా సీఈఓగా ఎంపికవ్వడం మామూలు విషయంకాదు. ఈరోజు సుందర్ పిచాయ్(52) పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందరరాజన్ కాగా.. అమెరికాకు వెళ్లిన తర్వాత అసలు పేరును కుదించి తోటి ఉద్యోగులు సుందర్పిచాయ్గా పిలవడం ప్రారంభించారు. ఆయన 1972, జూన్ 10న తమిళనాడులోని మధురైలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి లక్ష్మి, స్టెనోగ్రాఫర్..తండ్రి రేగునాథ పిచాయ్ బ్రిటిష్ హయాంలో జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ(జీఈసీ)లో ఇంజినీర్‌గా పనిచేసేవారు. సుందర్ స్థానికంగా ఉన్న వనవాణి మెట్రిక్యులేషన్ పాఠశాలలో పదో తరగతి దాకా చదివారు. చెన్నైలోని జవహర్ విద్యాలయలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో మెటలార్జికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. అనంతరం అధ్యాపకులు అక్కడే పీహెచ్డీ చేయాలని సలహా ఇచ్చారు. కానీ, 1993లో అమెరికా వెళ్లి సుందర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్‌లో ఎంఎస్, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.చదువుపూర్తయ్యాక అప్లైడ్మెటీరియల్స్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేశారు. మెకిన్సే అండ్ కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టింగ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో గూగుల్ సంస్థలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగం ఉపాధ్యక్షుడిగా చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ టూల్బార్ రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించారు. గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ మ్యాప్స్ వంటి ఇతర అప్లికేషన్ల అభివృద్ధిని పర్యవేక్షించారు.మార్చి 13, 2013న పిచాయ్ తాను పర్యవేక్షించిన గూగుల్ ఉత్పత్తుల జాబితాను ఆండ్రాయిడ్‌కు జోడించారు. ఆగస్టు 10, 2015లో పిచాయ్ గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గూగుల్ ఆయన సారథ్యంలో ఇటీవల ‘జెమినీ’ అనే జనరేటివ్ ఏఐను ఆవిష్కరించింది. ఆయన టెక్ప్రపంచానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్‌తో గౌరవించింది. 2019 డిసెంబర్లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సుందర్ 2022 సంవత్సరానికిగానూ 226 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.1850కోట్లకు పైమాటే) పారితోషికం అందుకున్నారు.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్..!టెన్షన్ పడిన సీఈఓ..సుందర్‌ది ప్రేమ వివాహం. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో బీటెక్ చూస్తున్నపుడు అంజలితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెప్పారు. తన భార్య గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘మేం ఖరగ్‌పుర్ ఐఐటీలో తొలిసారి కలిశాం. చాలా బిడియస్తుడినైన నన్ను ఆమే మార్చింది. తనకు ప్రపోజ్ చేసేటప్పుడు నా టెన్షన్ ఇప్పటికీ గుర్తే. నా మనసులో మాట అంజలికి చెప్పడం కన్నా, గూగుల్‌లో ఈ స్థానాన్ని సంపాదించడమే తేలిక అనిపిస్తోందిప్పుడు. నా ప్రేమను అంగీకరించడం తన గొప్పతనం. అప్పటికి నేను ఆర్థికంగా స్థిరపడకపోయినా, నన్ను నమ్మింది. నా జీవితంలో ప్రతి కీలక సందర్భంలోనూ తనదే ముఖ్య పాత్ర. ఎన్నో ముఖ్య విషయాల్లో సందిగ్ధంలో ఉన్నప్పుడు అంజలే నా సలహాదారు. తక్షణ పరిష్కారాన్ని సూచిస్తుంది. మైక్రోసాఫ్ట్, యాహూ, ట్విటర్ వంటి సంస్థల నుంచి అవకాశాలెన్నో వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయా. అప్పుడు గూగుల్ నుంచి వెళ్లొద్దన్న తన సూచనను పాటించడమే నన్నీ స్థాయిలో నిలబెట్టింది’ అన్నారు. సుందర్ దంపతులకు కావ్య పిచాయ్, కిరణ్ పిచాయ్ ఇద్దరు పిల్లలు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా: '3 ఇడియట్స్' సీన్‌తో..
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో భారతీయ ఇంజనీర్లకు సలహాలు ఇచ్చారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ (FAANG) వంటి సంస్థల్లో ఇంటర్వ్యూల్లో ఎలా విజయం సాధించాలో వివరిస్తూ.. రోట్ లెర్నింగ్ గురించి వివరించారు. ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా.. బట్టీ పడితే ఉపయోగం లేదని అన్నారు. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ తప్పకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని అన్నారు.దీనికి ఉదాహరణగా 3 ఇడియట్స్ సినిమా గురించి వివరించారు. ఈ సినిమాలో మోటార్ ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకు ఓ విద్యార్ధి బట్టీ పట్టిన సమాధానం చెబుతాడు. ఆ పద్దతి సరైనది కాదని వివరించారు. ఒక వ్యక్తి ఎంత స్మార్ట్ అయినప్పటికీ.. ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టడంలో విఫలమవుతున్నారని ఆయన అన్నారు. -
నాకు నచ్చిన భారతీయ వంటకాలు ఇవే.. సీఈఓ సుందర్ పిచాయ్
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తనకు నచ్చిన ఆహార పదార్ధాల గురించి బహిర్ఘతం చేశారు. నిత్యం ఏఐ, యాప్స్, టెక్నాలజీ అంటూ కంప్యూటర్లతో కుస్తీ పట్టే పిచాయ్ ఓ పాడ్ కాస్ట్లో కాస్త రిలాక్స్ అయ్యారు. పిచాయ్ ఇటీవల యూట్యూబర్ వరుణ్ మయ్య పాడ్‌కాస్ట్‌లో దేశంలో ఏఐ ప్రభావం, ఐటీ నిపుణులకు సలహాలు, ర్యాపర్ స్టార్టప్‌తో పాటు పలు అంశాలపై చర్చించారు. అదే సమయంలో తన అభిమాన భారతీయ వంటకాలను కూడా వెల్లడించారు.భారత్‌లో తనకు ఇష్టమైన ఆహారం పేరు చెప్పమని సుందర్ పిచాయ్‌ను మయ్య అడిగినప్పుడు సీఈఓ సుందర్ పిచాయ్ దౌత్యంతో సమాధానమిచ్చారు. ప్రాంతాల వారీ ఎదురుయ్యే ఇబ్బందుల్ని ముందే పసిగట్టారు. దేశీయంగా ఉన్న మూడు మెట్రో నగరాలు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో తనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్ధాల గురించి తన మనుసులో మాటను బయట పెట్టారు. బెంగుళూరులో దోసె, ఢిల్లీలో చోలే భతురే ముంబైలో పావ్ భాజీలను ఇష్టంగా తింటానని తెలిపారు. -
‘భళా భారత్’.. జపాన్ కంపెనీ సీఈఓ ప్రశంసల వర్షం
భారత్ సంస్కృతి, సంప్రదాయాలకు జపాన్ టెక్ కంపెనీ కోఫౌండర్ ఫిదా అయ్యారు. భారత్ భళా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సత్తా ఈ దేశానికే ఉందంటూ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.టెక్ జపాన్ కంపెనీ కోఫౌండర్, సీఈఓ నౌటకా నిషియామా.. తన వ్యాపార కార్యకలాపాల్ని భారత్‌లో విస్తరించాలని భావించారు. ఇందుకోసం ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల్ని అర్ధం చేసుకునేందుకు గత నెలలో సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరుకు వచ్చారు.ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఈ నేపథ్యంలో భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ రోజు ప్రపంచం నివసించడానికి అస్తవ్యస్తమైన ప్రదేశంగా ఉందని అన్నారు. అయితే అనేక విషయాల్లో అపార అనుభవం ఉన్న భారత్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉందన్నారు. ఆశ్చర్యపోయా‘ప్రపంచానికి భారతీయ నాయకత్వం అవసరం. నేను భారతదేశానికి వచ్చి నెలరోజులైంది. దేశంలోని విలువల వైవిధ్యాన్ని చూసి మరోసారి ఆశ్చర్యపోయాను’ అని లింక్డిన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లు.. వివిధ మతాలు, జాతులు, విలువలతో కూడిన పెద్ద దేశంగా ఉన్నప్పటికీ భారతదేశం ఒకే దేశం కావడం ఒక అద్భుతం. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ల విజయాల్ని ఉదహరించారు. భారత్ పోటీ, సహకారం రెండింటినీ మూర్తీభవించిందని.. ప్రపంచ సంస్థలో నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిషియామా అన్నారు. వ్యాపార రంగంలో, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల రెండవ తరం అమెరికన్లు కాదు. వారు ఇక్కడే (భారత్) జన్మించారు. ఇక్కడే చదువుకున్నారు. ఆపై గ్రాడ్యుయేట్ కోసం అమెరికాకు వెళ్లారు. వాళ్లే టెక్ రంగాల్ని శాసిస్తున్నారంటూ భారత్‌ను కొనియాడుతూ పోస్ట్ చేశారు. నౌటకా నిషియామా పోస్ట్‌పై నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
సాహో భారతీయుడా.. త్వరలోనే బిలియనీర్‌గా సుందర్ పిచాయ్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. చెన్నైలో రెండు గదుల ఇంటి నుంచి ప్రారంభమైన పిచాయ్ ప్రస్థానం 100 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోనున్నారు. ఇదే విషయాన్ని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. ఇప్పటి వరకు టెక్నాలజీ కంపెనీ అధినేతలు మాత్రమే బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కానీ తొలిసారి సాధారణ ఉద్యోగిలా గూగుల్‌లో చేరి తన అసాధారణమైన పనితీరుతో సీఈఓ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్గాగూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్‌ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు.సీఈఓ అనే సింహాసనం మీదఅందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్‌కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్‌లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్ డాక్‌లలో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు. అదే సమయంలో సుందర్ పిచాయ్‌కు గూగుల్ యాజమాన్యం అందించిన జీతాలు, ఇతర భత్యాలు, షేర్లు సైతం భారీ లాభాల్ని ఒడిసి పట్టుకున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో సంస్థ విలువతో పాటు సుందర్ పిచాయ్ ఆదాయం భారీగా పెరిగింది. త్వరలో బిలీయనీర్పలు నివేదికల ప్రకారం.. గూగుల్‌తో పాటు గూగుల్ పేరెంట్ కంపెనీ ‘ఆల్ఫాబెట్' షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రత్యేకించి గూగుల్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ గత మూడు నెలల్లో అద్భుతంగా రాణించింది. దీనికి తోడు గూగుల్ ఏఐ టూల్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వెరసి ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఆల్ఫాబెట్ కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి త్వరలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కాబోతున్నారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. -
గూగుల్‌లో 20 ఏళ్ళు.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్
గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) 'సుందర్ పిచాయ్' టెక్ దిగ్గజంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఏప్రిల్ 26 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.''2004 ఏప్రిల్ 26 గూగుల్ కంపెనీలో నా మొదటి రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీ మాత్రమే కాకుండా.. మా ఉత్పత్తులను ఉపయోగించే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ అద్భుతమైన కంపెనీలో పని చేయడం వల్ల చాలా థ్రిల్ పొందాను. సంస్థలో పనిచేస్తున్నందుకు ఇప్పటికీ నన్ను నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను'' అంటూ సుందర్ పిచాయ్ పోస్ట్ చేశారు. సుందర్ పిచాయ్ చేసిన ఈ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ఇప్పటికే 1,42,999 కంటే ఎక్కువ లైక్స్ పొందిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలామంది సుందర్ పిచాయ్ విజయాన్ని గొప్పగా అభినందించారు. సుందర్ పిచాయ్ 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ హెడ్‌గా చేరాడు. ఆ తరువాత దినదినాభివృద్ధి చెందుతూ ఆ కంపెనీకి సీఈఓగా ఎదిగారు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన పిచాయ్ నేడు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారంటే దాని వెనుక ఉన్న ఆయన కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి. View this post on Instagram A post shared by Sundar Pichai (@sundarpichai) -
ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి.. వారం వ్యవధిలో మరో షాకిచ్చిన అమెజాన్!
కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. 2024లో అడుగుపెట్టామో లేదో తొలి వారంలోనే ఈ ఏడాదీ లేఆఫ్స్ తప్పవనే స్పష్టమైన సంకేతాలు ఇస్తూ గూగుల్, అమెజాన్, మెటా సహా పలు దిగ్గజ కంపెనీలు కొలువుల కోతకు తెగబడ్డాయి. ఈ తరుణంలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వారం వ్యవధిలో మరోసారి ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. వారం రోజుల క్రితం అమెజాన్ తన పేరెంట్ కంపెనీలు ట్విచ్, ఆడిబుల్‌లో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వారం తిరిగే లోపే అమెజాన్‌లో ‘బై విత్ ప్రైమ్’ విభాగంలో పనిచేస్తున్న 5 శాతం మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా తొలగింపుల కారణంగా 30 మంది ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఓ వైపు తొలగింపులు.. మరోవైపు పెట్టుబడులు 2022లో బై విత్ ప్రైమ్‌ను అమెజాన్ ప్రారంభించింది. అమెజాన్ వ్యాపారులు, రిటైలర్లకు దాని లాజిస్టిక్స్ నెట్వర్క్ ద్వారా డెలివరీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యూనిట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, బై విత్ ప్రైమ్‌లో పెట్టుబడులు పెడుతుంటామని చెబుతూనే లేఆఫ్స్‌పై అమెజాన్ ప్రకటన చేసింది. సిబ్బందిని ఆదుకుంటాం తొలగించిన సిబ్బందిని అన్ని విధాల ఆదుకుంటామని అమెజాన్ తెలిపింది. కాగా, అమెజాన్ ఇప్పటికే తన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ట్విచ్‌లో సుమారు 500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. ఆడియోబుక్ యూనిట్ ఆడిబుల్ కూడా ఈ ఏడాది మొదటి రెండు వారాల్లోనే వందలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలికింది. ఈ తొలగింపులు వ్యయ తగ్గింపు చర్యల్లో భాగమా లేక ఏఐ పునర్నిర్మాణం వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఉద్యోగుల్ని నిండా ముంచుతున్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల 2024 జనవరి మొదటి మూడు వారాల్లోనే బడా టెక్ కంపెనీలు 7500 ఉద్యోగాలను తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తాజా నివేదిక వెల్లడించింది. మరింత మందిని తొలగిస్తూ గూగుల్ ప్రకటన గూగుల్ తన వాయిస్ అసిస్టెంట్, హార్డ్‌వేర్ విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించిన వెంటనే సంస్థలో మరో వరుస ఉద్యోగాల కోత ఉంటుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గురువారం ప్రకటించారు. కాగా, గత ఏడాది గూగుల్ పలు విభాగాల్లో 12,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించింది. ఫలితంగా గూగుల్‌లో భారీ మొత్తంలో తొలగించడం ఇదే తొలిసారి. -
ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా!
గత ఏడాది పెద్ద కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకు ఉద్యోగులను తొలగించిన సంఘటనలు కోకొల్లలు, 2024లో అయినా పరిస్థితులు చక్కబడుతాయనుకుంటే ఇప్పటికే లేఆప్స్ మొదలైపోయాయి. జనవరి 1 నుంచి వివిధ కంపెనీలు 7500 మంది ఉద్యోగులను తొలగించాయి. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ సంస్థ ఈ ఏడాది కూడా ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. పనిభారాన్ని తగ్గించడానికి ఏఐ సాఫ్ట్వేర్ అండ్ ఆటోమేషన్ వంటి వాటిని అనుసరించనున్నట్లు, ఈ కారణంగా మరింత మంది ఉద్యోగుల తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. గూగుల్ ఇప్పటికే జెమిని' (Gemini) పేరుతో అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ పరిచయం చేసింది. ఇది తప్పకుండా భవిష్యత్తులో పనిభారాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇది కూడా ఈ ఏడాది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవడానికి కారణమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదీ చదవండి: టీసీఎస్ కీలక నిర్ణయం.. 5 లక్షల మందికి ట్రైనింగ్! ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపులు గతేడాది మాదిరిగా అన్ని విభాగాల్లో ఉండే అవకాశం ఉండదని పిచాయ్ వెల్లడించారు. అయితే గత వారం సంస్థ తన వాయిస్ అసిస్టెంట్ యూనిట్‌లోని పిక్సెల్, నెస్ట్, ఫిట్బిట్కి బాధ్యత వహించే హార్డ్‌వేర్ టీమ్‌లు, అడ్వర్టైజింగ్ సేల్స్ టీమ్ & ఆగ్మెంటెడ్ రియాలిటీ టీమ్‌లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. -
అది తప్పే.. అలా చేయాల్సింది కాదు.. అంగీకరించిన గూగుల్ సీఈవో
పెద్ద మొత్తంలో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తప్పేనని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అంగీకరించారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పలేదని, అయితే మరోలా వ్యవహరించాల్సి ఉండేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 2023 సంవత్సరం ప్రారంభంలో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో నెలకొన్న మాంద్యం భయాల నేపథ్యంలో ఈ టెక్ దిగ్గజం తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం ఉద్యోగ వర్గాల్లో ఆందోళనను, అలజడిని సృష్టించింది. బిజినెస్ ఇన్సైడర్ నుంచి వచ్చిన కథనం ప్రకారం.. ఇటీవల ఉద్యోగులతో జరిగిన సమావేశంలో సీఈవో సుందర్ పిచాయ్‌ను ఈ వివాదాస్పద నిర్ణయంతో ఏం సాధించారని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ అది తప్పేనని అంగీకరించారు. కానీ తప్పలేదని, గూగుల్ తన 25 ఏళ్ల చరిత్రలో అంత కీలకమైన క్షణాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పారు. అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మరింత ప్రతికూల ఫలితాలకు దారితీసేదన్నారు. అయితే ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉండేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు. తొలగింపులు ఉద్యోగుల మానసిక స్థైర్యంపై చాలా ప్రభావం చూపించాయని, "గూగుల్జీస్ట్" వంటి ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్ ఛానెల్‌లలో అది స్పష్టంగా కనిపించిందని ఆయన చెప్పారు. -
ఆ ఒక్క సలహా రోజుకి రూ.5 కోట్లు సంపాదించేలా.. భర్త సక్సెస్ వెనుక భార్య..
సుందర్ పిచాయ్ (Sundar Pichai).. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. సాధారణ కుటుంబం నుంచి ప్రపంచమే గుర్తించదగిన స్థాయికి ఎదిగాడంటే దాని వెనుక ఆయన కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి. అంతే కాకుండా ఈ రోజు ఆ స్థాయిలో ఉండటానికి పిచాయ్ భార్య అంజలి కూడా కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుందర్ పిచాయ్, అంజలి ఇద్దరూ కూడా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకునే రోజుల్లో క్లాస్మేట్స్. దీంతో వారిద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తరువాత పిచాయ్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయాడు, అంజలి మాత్రం ఇండియాలోనే ఉద్యోగంలో చేరింది. గూగుల్ సీఈఓగా.. ఎంత దూరంలో ఉన్నా ప్రేమకు పెద్ద దూరం కాదన్నట్లు.. చివరికి వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కిరణ్, కావ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం గూగుల్ సీఈఓగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. చాలామందికి సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా మాత్రమే తెలుసు, కానీ ఒకానొక సందర్భంలో ఆయన గూగుల్ కంపెనీ వదిలేయాలనుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా ఉన్న సమయంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ పోస్ట్ ఆఫర్ చేసింది, ట్విటర్ కంపెనీ కూడా కీలకమైన జాబ్ ఇస్తామని ఆఫర్ చేసింది. గూగుల్ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగం ఉన్న సమయంలో వచ్చిన ఆఫర్స్ స్వీకరించాలనుకుని ఆ జాబ్ వదిలేయాలనుకున్నాడు, ఈ విషయాన్ని తన భార్యకు చెప్పినప్పుడు.. ఆమె వద్దని వారిస్తూ.. గూగుల్ సంస్థలోనే మంచి ఫ్యూచర్ ఉందని సలహా ఇచ్చింది. ఆ సలహా తీసుకున్న పిచాయ్.. ఆ తరువాత కంపెనీ సీఈఓగా ఎంపికయ్యాడు. ఇదీ చదవండి: మొన్న విప్రో.. నేడు హెచ్‌సీఎల్ - ఎందుకిలా? రోజుకు రూ. 5 కోట్లు.. ఈ రోజు గూగుల్ కంపెనీ సీఈఓగా రోజుకు రూ. 5 కోట్లు ప్యాకేజీ తీసుకుంటున్నాడు అంటే.. దానికి కారణం భార్య ఇచ్చిన సలహా పాటించడమనే చెబుతున్నారు. అర్థం చేసుకునే భార్య ఉంటే.. మగవారి జీవితంలో సక్సెస్ వస్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. -
దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్
ఇటీవల జరిగిన దీపావళి సమయంలో గూగుల్‌లో ఎక్కువ మంది సర్చ్ చేసిన ఐదు విషయాలను సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) రివీల్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దీపావళి జరుపుకునే అందరికి శుభాకాంక్షలు చెబుతూ.. ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ ప్రశ్నలను ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇందులో ఐదు అంకెలతో కూడిన ఒక దీపాన్ని సూపించే ఫోటో కూడా షేర్ చేశారు. ఈ అంకెల ద్వారానే ప్రశ్నలను తెలియజేసారు. సుందర్ పిచాయ్ హైలైట్ చేసిన ఐదు ప్రశ్నలు 👉భారతీయులు దీపావళిని ఎందుకు జరుపుకుంటారు? 👉దీపావళి సమయంలో మనం రంగోలీని ఎందుకు వేస్తారు? 👉దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారు? 👉దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు? 👉దీపావళి సమయంలో ఆయిల్ బాత్ ఎందుకు? ఇదీ చదవండి: 25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్పీరియన్స్! ఈ ప్రశ్నలను గమనిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా దీపావళి జరుపుకునేవారు పండుగ అర్థం, సంప్రదాయం వంటి వివరాలను తెలుసుకోవడానికి ఎంత ఆసక్తి చూపుతున్నారో తెలుస్తోంది. దీపావళి జరుపుకుంటున్న చాలా మందికి ఆ పండుగ విశిష్టత గురించి తెలియదు, అలాంటి వారు ద్వారా సర్చ్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. Happy Diwali to all who celebrate! We’re seeing lots of interest about Diwali traditions on Search, here are a few of the top trending “why” questions worldwide: https://t.co/6ALN4CvVwb pic.twitter.com/54VNnF8GqO — Sundar Pichai (@sundarpichai) November 12, 2023 -
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి : విచారంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్!
ఇజ్రాయెల్‌పై హామాస్ ఉగ్రదాడిపై ప్రముఖ టెక్ దిగ్గజం, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌లో స్థానిక గూగుల్ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అండగా నిలుస్తామంటూ ఓ మెసేజ్‌ను షేర్ చేశారు. ఇజ్రాయెల్ - హమాస్ ఉద్రిక్తతలపై సుందార్ పిచాయ్ ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద దాడిపై విచారం వ్యక్తం చేస్తున్నాం. గూగుల్‌కు చెందిన రెండు ఆఫీసుల్లో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఉద్రికతల నేపథ్యంలో వారి అనుభవాలు ఎలా ఉన్నాయో ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఉద్యోగులు భద్రతపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Deeply saddened by the terrorist attacks in Israel this weekend and the escalating conflict underway. Google has 2 offices and over 2,000 employees in Israel. It’s unimaginable what they’re experiencing. Our immediate focus since Saturday has been on employee safety. We’ve now… https://t.co/VCiboq9oN8 — Sundar Pichai (@sundarpichai) October 10, 2023 స్థానికంగా ఉన్న మా ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి కంపెనీ అండగా నిలుస్తుంది. అదే విధంగా ఇజ్రాయెల్‌లో సహాయక చర్యలు చేపట్టే బృందాలకు మా వంతు సాయం అందిస్తాం’ అని సుందర్ పిచాయ్ ట్వీట్లో పేర్కొన్నారు. -
గూగుల్ సీఈఓ మరీ ఇంత సింపుల్గానా.. ఫోటో వైరల్!
భారతదేశం నుంచి వెళ్లి ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగిన గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎక్కువ జీతం తీసుకునే సీఈఓల జాబితాలో ఒకడైన ఈయన చాలా ఆడంబరంగా ఉంటారని చాలామంది ఊహించి ఉంటారు. కానీ తాజాగా విడుదలైన ఫోటో మీ ఆలోచనలను తారుమారు చేస్తుంది. మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన 'సిద్ పురి' ఇటీవలే శాన్ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడ ఉదయం వాకింగ్ చేసే సమయంలో సుందర్ పిచాయ్ పెద్దగా సెక్యూరిటీ లేకుండానే కనిపించారు. అప్పుడు సిద్ ఫోటో తీసుకోవచ్చా.. అని అడిగిన వెంటనే ఒప్పుకున్నాడు. ఈ ఫోటోలు ఆ వ్యక్తి తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసాడు. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే! ఈ ఫోటోలలో గమించినట్లతే.. సుందర్ పిచాయ్ చాలా సింపుల్‌గా బ్లూ జీన్స్, జాకెట్, బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఈ ఫోటోని ఇప్పటికి 6 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించారు. 4000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: భారత్‌లో ఐఫోన్ మేనియా.. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ ధరతో.. ఒక నెటిజన్ అక్కడ సెక్యూరిటీ ఎవరూ లేరా? అని అడిగాడు. దీనికి ఒక్క సెక్యూరిటీ ఉన్నాడు, అతడే ఫోటో తీసాడని సిద్ రిప్లై ఇచ్చాడు. మరి కొందరు అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినా చాలా సాధారణంగా ఉండటం చూస్తే.. చాలా ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయట తిరగటం కొంత ఆందోళన కలిగిస్తుందని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. go to SF they said, no one prepared me to just run into Sundar Pichai on the street. pic.twitter.com/BJitwCw0EE — Sid Puri (@PuriSid) September 25, 2023 -
రూ. 10వేల కోట్ల సుందర్ పిచాయ్ లగ్జరీ భవనం (ఫోటోలు)
-
సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?
సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్,ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. గ్లోబల్ టాప్ సీఈవోలలో ఒకరిగా చాలా మందికి ఆయన రోల్ మోడల్. తమిళనాడుకు చెందిన ఐఐటి గ్రాడ్యుయేట్ చెన్నైలోని అశోక్ నగర్లో ఉన్న పూర్వీకుల భవనాన్ని ఇటీవల విక్రయించిన సుందర్ పిచాయ్ నివాసముంటున్న ఇల్లు ఎలా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఐటీ నిపుణుల్లో,బిలియన్ల మందికి రోల్ మోడల్ సుందర్ పిచాయ్ ఉంటున్న ఇల్లు ఖరీదు రూ. 10వేల కోట్లు అంటే నమ్ముతారా. సుందర్ పిచాయ్ అద్భుతమైన భవనం కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీలోని లాస్ ఆల్టోస్‌లోని కొండపై 31.17 ఎకరాల్లో ఉంది. సుందర్ పిచాయ్ భార్య అంజలి పిచాయ్ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ కోసం రూ. 49 కోట్లు ఖర్చు చేశారట.. కొన్నేళ్ల క్రితం ఈ భవనాన్ని సుందర్ పిచాయ్ 40 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. (అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్‌బస్ హెలికాప్టర్, ఇంకా విశేషాలు) విశాలమైన బెడ్ రూమ్స్ ఇన్ఫినిటీ పూల్, జిమ్నాసియం, స్పా, వైన్ సెల్లార్ సోలార్ ప్యానెల్స్ , లిఫ్టులు , నానీ క్వార్టర్ లాంటి హంగులతో ఉన్న అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ హోమ్ విలువ ఇపుడు రూ. 10,000 కోట్లకు పైమాటే. 2022లో రూ.1852 కోట్లు జీతం అందుకున్న సుందర్ పిచాయ్ నికర విలువ 1,310 మిలియన్ల డాలర్లుగా ఉంది. సుందర్ పిచాయ్ 2015లో గూగుల్ సీఈఓగా, 2019లో ఆల్ఫాబెట్ ఇంక్ సీఈవోగా ఎంపికయ్యారు. జూన్ 10, 1972న తమిళనాడులోని మధురైలో జన్మించారు.1989లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ఇం జనీరింగ్ పట్టాపొందారు. (అలియా హాలీవుడ్ ఎంట్రీ:ఆమె గ్రీన్ డ్రెస్ ధర ఎంతో తెలుసా?) స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో మెటీరియల్ సైన్స్ లో ఎంఎస్చేశారు. ఈ తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేశారు. పిచాయ్ 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ హెడ్‌గా చేరారు. కాలేజీ ఫ్రెండ్‌ను అంజలి పిచాయ్ని వివాహం చేసుకున్న పిచాయ్‌కు కిరణ్, కావ్య అనే ఇద్దరు పిల్లలున్నారు. 2022నలో ఇండియా మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. -
గూగుల్ సీఈవో చిన్ననాటి ఇల్లు విక్రయం.. కన్నీటి పర్యంతమైన తండ్రి
చెన్నై: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెన్నైలో తను పుట్టి పెరిగిన ఇంటిని విక్రయించారు. ఆ ఇంటిని కొనుగోలు చేసిన తమిళ నటుడు, నిర్మాత సి.మణికందన్ ఈ విషయం వెల్లడించారు. ఆస్తి పత్రాల అప్పగింత సమయంలో ఆయన తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. ‘ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలని అన్వేషిస్తుండగా చెన్నైలోని అశోక్ నగర్లో ఓ ఇల్లు ఉందని తెలిసింది. అది గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పుట్టి, పెరిగిన చోటని తెలియడంతో కొనుగోలు చేయాలని వెంటనే నిర్ణయించుకున్నా’అని మణికందన్ అన్నారు. ‘మన దేశానికి సుందర్ పిచాయ్ గర్వకారణంగా నిలిచారు. ఆయన నివసించిన ఇంటిని కొనుగోలు చేయడమంటే నా జీవితంలో గొప్ప ఆశయం సాధించినట్లేనని ఆనందం వ్యక్తం చేశారు. ఆస్తి పత్రాలు అందజేసే సమయంలో సుందర్ తండ్రి రఘునాథ పిచాయ్ కన్నీటి పర్యంతమయ్యారని చెప్పారు. ‘వారి ఇంటికి వెళ్లినప్పుడు సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ చేసి తీసుకువచ్చారు. ఆయన తండ్రి ఆస్తి పత్రాలు ఇవ్వబోయారు’వారి నిరాడంబర వ్యవహార శైలి చూసి ఆశ్చర్యపోయా. రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద రఘునాథ గంటలపాటు వేచి ఉన్నారు. ఆస్తి పత్రాలను నాకు అప్పగించడానికి ముందు అన్ని పన్నులను ఆయనే చెల్లించారు. పత్రాలను నా చేతికి ఇచ్చేటప్పుడు ఆయన ఉద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు’అని మణికందన్ చెప్పారు. 1989లో ఐఐటీ ఖరగ్‌పూర్‌కు వెళ్లేవరకు సుందర్ పిచాయ్ కుటుంబం ఆ ఇంట్లోనే ఉంది. 20 ఏళ్లు వచ్చే వరకు సుందర్ పిచాయ్ ఆ ఇంట్లోనే గడిపినట్లు పొరుగు వారు చెప్పారు. సుందర్ గత ఏడాది చెన్నైలోని ఆ ఇంటికి వచ్చారు. -
అమ్మకానికి సుందర్ పిచాయ్ ఇల్లు.. కొనుగోలు చేసిన యాక్టర్.. ఎవరో తెలుసా?
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెన్నైలో తన బాల్యంలో ఇంట్లో గడిపిన మధుర క్షణాలు కనుమరుగు కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. పలు కథనాల ప్రకారం.. చెన్నై అశోక్ నగర్లో పిచాయ్ చిన్ననాటి ఇంటిని ఇటీవలే పిచాయ్ తండ్రి అమ్మేసినట్లు సమాచారం. ఆ ఇంటిని తమిళ నటుడు, నిర్మాత సి.మణికందన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. (గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు) సుందర్ పిచాయ్ బాల్యంలో గడిపిన ఆ ఇంటిని పిచాయ్ తల్లిదండ్రులు అమ్ముతున్నారని తెలుసుకొని కొనుగోలు చేసేందుకు మణికందన్ ముందుకు వచ్చారు. ‘సుందర్ పిచాయ్ ఇంటిని కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తున్నా. పిచాయ్ సాధించిన విజయాల పట్ల తన గర్వంగా ఉందంటూ’ ప్రశంసల వర్షం కురిపించారు. నాలుగు నెలల సమయం తాను ఆ ఇల్లు కొనుగులో చేసే సమయంలో పిచాయ్ తండ్రి అమెరికాలో నివసిస్తున్నారని,లావాదేవీల ప్రక్రియ పూర్తి చేసేందుకు నాలుగు నెలల సమయం పట్టినట్లు మణికందన్ చెప్పారు. సుందర్ పిచాయ్ తండ్రికి అదే మొదటి ఆస్తి కావడంతో.. ఆస్తిపత్రాలు ఇచ్చే సమయంలో ఉద్వేగ్వానికి గురైనట్లు గుర్తు చేశారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది! -
గూగుల్ సంచలన నిర్ణయం..!
-
టిమ్ కుక్ శాలరీ కట్ అయ్యింది..మరి నీ శాలరీ?
-
సుందర్ పిచాయ్‌పై సొంత ఉద్యోగులే ఆగ్రహం.. జీతం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా?
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తీరుపట్ల ఆ సంస్థ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలోని ఉద్యోగులకు కాస్ట్ కటింగ్ నిబంధనలు అమలు చేస్తున్న సమయంలో సీఈవో భారీ ఎత్తున వేతనాలు ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఉద్యోగులు సైతం ఇంట్రర్నల్ ఫోరమ్‌లో సంస్థను ప్రశ్నిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో గూగుల్ సెక్యూరిటీస్ ఫైలింగ్‌లో సుందర్ పిచాయ్‌కు ఎంత వేతనం చెల్లిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. వ్యయ నియంత్రణ అంటూ ఉద్యోగులకు భారీగా కోతపెడుతున్న గూగుల్.. సీఈవోకు మాత్రం 2022 సంవత్సరానికి రూ.1,850 (226 మిలియన్ డాలర్లు) కోట్ల పారితోషికం ఇచ్చింది. గూగుల్‌లో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే.. ఇది 800 రెట్లు ఎక్కువ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ జనవరిలో గ్లోబుల్ వర్క్ ఫోర్స్‌లో 6 శాతంతో సుమారు 12 వేల మందిని విధుల నుంచి తొలగించడాన్ని తప్పుబడుతున్నారు. చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే? సుందర్ పిచాయ్ వర్సెస్ టిమ్‌కుక్ సుందర్ పిచాయ్ కాంపన్సేషన్ కింద భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. దీంతో సీఈవోకి చెల్లించే వేతనాల విషయంలో గూగుల్ ఉద్యోగులు పిచాయ్ వేతనాన్ని, యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వేతనంతో పోల్చుతూ మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు. టిమ్‌కుక్ గత ఏడాదిలో సుమారు 40 శాతం వేతనంలో కోత విధించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ మీమ్స్ వేస్తున్నారు. కంపెనీ ఖర్చులను తగ్గించుకున్నప్పటికీ సుందర్ పిచాయ్ వేతనాల పెంపుపై గూగుల్ ఇంట్రర్నల్ ఫోరమ్‌లో ఉద్యోగులు సంస్థకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీపీఎస్, సీఈవో మినహా అందరికీ వర్తిస్తుంది మార్చి నెలలో గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరట్ ఉద్యోగులకు మెమో పంపారు. సంస్థ ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో భాగంగా స్నాక్స్, లంచ్‌లు, లాండ్రీ, మసాజ్ సర్వీసులు ఆఫీసులో ఉండవని ప్రకటించింది. ఇలా ఆదా చేసిన డబ్బుల్ని మరిన్ని కీలకమైన పరిశోధనలకు ఖర్చు పెడతామని పేర్కొన్నారు. అందులో ఖర్చు ఆదా అందరికీ వర్తిస్తుంది. సంస్థ కోసం కష్టపడే వైస్ ప్రెసిడెంట్ సీఈవోకి మినహాయింపు ఉంటుందని గూగుల్ ఎంప్లాయిస్ ఫోరమ్‌లో పోరట్ స్పష్టం చేశారు. కాగా, ఉద్యోగుల నుంచి వస్తున్న విమర్శలపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందన ఎలా ఉంటుందోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విమర్శలకు చెక్ పెట్టేలా జీతాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా? లేదంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారా? అని చర్చించుకుంటున్నారు. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్, గూగుల్ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే?
ఏ మార్పైన కొంత వరకు మంచిదే. కానీ అతిగా జరిగితే అనార్ధం తప్పదు. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎటు చూసినా ఇదే చర్చ నడుస్తోంది. దీనిని నమ్మితే మానవజాతి వినాశనం తప్పదని, మానవుని ఎదుగుదలకు మూలమైన సృజనాత్మకతను అంతం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా దిగ్గజ టెక్ సంస్థలు ఈ ఏఐ రేసులో ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. శరవేగంగా విస్తరిస్తున్న ఏఐ విభాగంలో సత్తా చాటేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు కృత్రిమ మేధస్సు వినియోగంలో కాస్త వెనుకంజలో ఉన్న మరో టెక్ దిగ్గజం యాపిల్ సైతం దృష్టి సారించింది. గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీతో ముందంజలో ఉంటే యాపిల్ ఏఐని విస్మరించింది. ఊహించని పరిణామలతో ఓపెన్ ఏఐ లాంటి సంస్థలతో పోటీపడలేక ఆ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చీఫ్ జాన్ జియానాండ్రియా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బంగారు గుడ్లు పెట్టే బాతుల్లా నివేదికల ప్రకారం.. ఏఐలో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురిలో శ్రీనివాస్ వెంకటా చారి, ఆనంద్ శుక్లాలు (స్టీవెన్ బాకెర్ కాకుండా) ఇద్దరు దిగ్గజ కంపెనీలకు బంగారు గుడ్లు పెట్టే బాతుల్లాగా కనిపిస్తున్నారు. అందుకే ఎంత ప్యాకేజీ కావాలంటే అంత చెల్లించి తమ సంస్థలో చేర్చుకునేందుకు పోటీపడుతున్నారు. యాపిల్‌ను వదిలేసి గూగుల్ వైపు యాపిల్ సెర్చ్ టెక్నాలజీలో పని చేస్తున్న ఆ ముగ్గురు యాపిల్‌ను వదిలేసి గూగుల్‌లో చేరారు. అందులో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)పై పనిచేస్తున్నారు. వారిలో ఇద్దరు ఐఐటీని పూర్తి చేశారు. ఆ ఇద్దరిని తమతో పాటు ఉంచుకునేందుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రయత్నిస్తుంటే.. యాపిల్ సంస్థ నుంచి గూగుల్‌కు వెళ్లిన ఆ ఇద్దరినే.. మళ్లీ తమవైపుకు తిప్పుకోవాలని సీఈవో టిమ్‌కుక్ చూస్తున్నారు. దీంతో ఇప్పుడు ఐఐటీయన్ల కోసం టెక్ సంస్థలు పోటీ పడుతున్న తీరు ప్రపంచ టెక్ రంగంలో చర్చాంశనీయంగా మారింది. ఎవరా ఇద్దరు భారతీయులు? ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్‌ను పూర్తి చేసిన వెంకటాచారి ప్రస్తుతం గూగుల్ ఏఐ ప్రొడక్ట్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. మరొకరు ఆనంద్ శుక్లా. శుక్లా గూగుల్‌లో మంచి పేరున్న ఇంజినీర్‌గా చెలామణి అవుతున్నారు. లింక్డిన్ ఫ్రొఫైల్ ప్రకారం.. 2022 అక్టోబర్ నెలలో వెంకటచారీ యాపిల్‌కు రిజైన్ చేయగా.. అదే ఏడాది నవంబర్‌లో యాపిల్‌కు గుడ్‌పై చెప్పి గూగుల్‌లో చేరారు శుక్లా. బ్రతిమలాడి, బామాలి ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం, ఆ ఇద్దరు భారతీయులు గూగుల్‌లో పనిచేందుకు మొగ్గుచూపుతున్నట్లు తేలింది. గూగుల్ ఎల్ఎల్ఎంలో పనిచేసుందకు మంచి ప్రదేశమని భావించారని, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సైతం తమ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వాళ్లిద్దరికి ఇక్కడే ఉండమని ఒప్పించేందుకు ప్రయత్నించారని నివేదిక పేర్కొంది. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ -
కృత్రిమ మేధను తలచుకొంటే నిద్రలేని రాత్రులే.. గూగుల్ సీఈఓ సుందర్
వాషింగ్టన్: కృత్రిమ మేధను సరిగా వాడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ముప్పు నుంచి బయటపడాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి తలచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో పిచాయ్ చెప్పారు. ఈ టెక్నాలజీ ప్రయోజనకరమైన రీతిలో ఉపయోగించుకొనేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఐతో అసత్య సమాచారాన్ని సృష్టించే వీలుందని, ఇది సమాజానికి ప్రమాదకరమని అన్నారు. అణ్వాయుధాలను నియంత్రిస్తున్న తరహాలోనే ఏఐని నియంత్రించడానికి ఒక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు. -
ఉద్యోగాలు కోల్పోతున్న గూగుల్ ఉద్యోగులు
-
'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ai) ఆధారిత టూల్స్ చాట్‌జీపీటీ (chatgpt) వంటి టెక్నాలజీలతో ఉద్యోగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ సైతం స్పష్టం చేసింది. ఆ సంస్థ నిర్వహించిన పరిశోధనల్ని ‘ఆర్థికప్రగతిపై కృత్రిమ మేధ ప్రభావాల ముప్పు’ పేరుతో పలు అంశాలు వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలో వస్తోన్న నూతన ఒరవడులు 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేసింది. ఈ తరుణంలో కేసీ న్యూటన్, కెవిన్ రూస్లతో జరిగిన న్యూయార్క్ టైమ్స్ హార్డ్ ఫోర్క్ పాడ్‌కాస్ట్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘ఏఐతో ప్రమాదంలో ఉద్యోగాలు’ అనే అంశంపై మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ ఉద్యోగుల స్థానాల్ని భర్తీ చేస్తుందా? అన్న ప్రశ్నకు సుందర్ పిచాయ్ గూగుల్ బార్డ్, చాట్‌జీపీటీలపై సానుకూలంగా స్పందించారు. గూగుల్‌లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందాలా? అని అడిగినప్పుడు.. ఎవరైనా టెక్నాలజీకి అనుగుణంగా మారాల్సిందేనని పిచాయ్ అన్నారు. ఏఐ సాంకేతికత కారణంగా ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయనే విషయాన్ని ధృవీకరించలేదు. కానీ ఉత్పాదకత విషయంలో ఏఐల పనితీరును ప్రశంసించారు. ‘ఏఐ వినియోగంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల విషయంలో రెండు విషయాలు నిజమవుతాయని నేను అనుకుంటున్నాను. ఒకటి ప్రోగ్రామింగ్‌లో మీ పని తీరు మరింత మెరుగుపడుతుంది. చాట్‌జీపీటీ, బార్డ్ వంటి ఏఐ టూల్స్ కారణంగా ప్రోగ్రామింగ్ అనేది అందరికి అందుబాటులోకి వస్తుంది. ఇది కొత్త విషయాలను తెలుసుకోవడానికి లేదంటే సృష్టించడానికి వినియోగదారులకు అండగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గూగుల్ బార్డ్ కాలక్రమేణా మెరుగుపడుతుందని చెప్పారు. ఓపెన్ ఏఐ పనితీరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందా? అని అడిగినప్పుడు.. పిచాయ్ వారి విజయాన్ని చూసి తాను ఆశ్చర్యపోలేదని పేర్కొన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న (ఓపెన్ ఏఐ) వ్యక్తుల క్యాలిబర్ మాకు తెలుసు. కాబట్టే తాను ఆశ్చర్యపోలేదని తెలిపారు. చదవండి👉 చాట్‌జీపీటీ జాబ్.. జీతం ఏడాదికి రూ.2.7కోట్లు -
గూగుల్ ‘బార్డ్’ మళ్లీ ఫెయిల్.. ఈ సారి ఏకంగా
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తామేమీ తక్కువ కాదంటూ చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్ పేరిట గూగుల్ తీసుకొచ్చిన చాట్‌బాట్ వరుస షాకులిస్తుంది. ఇప్పటికే ప్రమోషనల్ వీడియోలో జరిగిన తప్పిదంతో గూగుల్ భారీగా నష్టపోయింది. తాజాగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బార్డ్ మరోసారి ఫెయిల్ అయ్యింది. ‘బార్డ్’ పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బార్డ్‌ను పరిచయం చేస్తూ గూగుల్ ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడంలో బార్డ్ విఫలమైంది. దీంతో గూగుల్‌కు 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. చదవండి👉 చాట్‌జీపీటీకీ భారీ షాక్.. బ్యాన్ దిశగా ప్రపంచ దేశాల అడుగులు? తాజాగా టెస్టింగ్ దశలో ఉన్న బార్డ్ శాట్ పరీక్షలకు సరిగ్గా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అమెరికాకు చెందిన కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే శాట్ (sat) అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు సంబంధిత కాలేజీల్లో సీటు దొరుకుతుంది. ఫార్చ్యూన్ సంస్థ ఆ పరీక్షకు సంబంధించిన మ్యాథ్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని బార్డ్‌ను అడిగింది. అందుకు బార్డ్ స్పందించింది. 75 శాతం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను తప్పుగా ఇచ్చింది. కొన్నింటికి సమాధానాలు ఇచ్చినప్పటికీ.. మళ్లీ అదే ప్రశ్న వేసినప్పుడు గతంలో ఇచ్చిన సమాధానం కాకుండా వేరే ఆన్సర్ ఇచ్చినట్లు తేలింది. రిటర్న్ లాంగ్వేజ్ ఎగ్జామ్‌లో 30 శాతం మాత్రమే కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చింది. దీనిపై గూగుల్ ప్రతినిధి ఫార్చ్యూన్‌తో మాట్లాడుతూ..బార్డ్ టెస్టింగ్ దశలో ఉంది. కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. బార్డ్ పనితీరు మెరుగుపడుతోంది. వినియోగంలోకి తెచ్చేందుకు వేలాది మంది టెస్టర్లు దీనిపై పని చేస్తున్నారని అన్నారు. చదవండి👉 త్వరలో ‘చాట్‌జీపీటీ’తో ఊడనున్న ఉద్యోగాలు ఇవే! బార్డ్ పనితీరుపై అనుమానాలు మైక్రోసాఫ్ట్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ను పరిచయం చేస్తూ ప్రమోషనల్ వీడియోలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి అడిగిన ప్రశ్నకు బార్డ్ తప్పుడు సమాధానం ఇచ్చింది. సౌర వ్యవస్థకు వెలుపల ఉన్న గ్రహాల చిత్రాలను తొలుత జేమ్స్ వెబ్ స్పేస్ తీసిందని పేర్కొంది. వాస్తవానికి 2004లోనే యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన టెలీస్కోప్ సౌరవ్యవస్థకు వెలుపలి చిత్రాలను తీసింది. గూగుల్ విడుదల చేసిన జిఫ్ వీడియోలో ఈ పొరపాటును గుర్తించడంతో దీని సామర్థ్యంపై అనుమానాలు నెలకొన్నాయి. అప్ గ్రేడ్ చేస్తున్నాం ఈ తరుణంలో న్యూయార్క్ టైమ్స్ పాడ్‌కాస్ట్ లో బార్డ్ పనితీరుపై సుందర్ పిచాయ్ స్పందించారు. బార్డ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బార్డ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన టెస్టర్లతో ప్రయోగాలు నిర్వహించాక పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చదవండి👉 వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్‌జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి! -
గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్.. అసలేం జరిగిందంటే?
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఇకపై వారికి అందించే ఫ్రీ స్నాక్స్, లంచ్, మసాజ్, లాండ్రీతో పాటు ఇతర సౌకర్యాల్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్‌లో పనిచేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఆహ్లాదకర వాతావరణం, జీత భత్యాలు, ఉద్యోగులకు అందించే సౌకర్యాలు, ఇతర ప్రోత్సహాకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేసే వారికి సొసైటీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందుకే గూగుల్ ఉద్యోగం అంటే ఎగిరి గంతేస్తుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ప్రథమ స్థానంలో ఉన్న గూగుల్ ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితిని తట్టుకొని నిలబడాలంటే ఉన్న డబ్బును పొదుపుగా వాడుకొని..దూబారా ఖర్చుల్ని తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో ఇప్పటి వరకు ఉద్యోగులకు అందించిన అన్నీ ప్రోత్సాహకాల్ని రద్దు చేసింది. నియామకాల్ని తగ్గించి డబ్బుల్ని ఆదా చేస్తోంది. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ ఈ సందర్భంగా గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ మాట్లాడుతూ..సంస్థ అధిక ప్రాధాన్యత కలిగిన పనులపై మాత్రమే డబ్బుల్ని సమర్థవంతంగా వినియోగించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రోత్సాహకాల నిలిపి వేతపై ఉద్యోగులకు గూగుల్ మెమో జారీ చేసింది. హైరింగ్ ప్రాసెస్‌ను నిలిపివేసి ఉద్యోగుల్ని అధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్‌లపై పనిచేసేలా రీలొకేట్ చేయనున్నట్లు బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక తెలిపింది. ఉద్యోగులకు అందించే ల్యాప్‌ట్యాప్‌లను తిరిగి వెనక్కి తీసుకోవడంతో పాటు, ఆఫీస్ లొకేషన్ అవసరాలు, ప్రతి ఆఫీస్ స్పేస్‌లో కనిపించే ట్రెండ్ల ఆధారంగా ప్రొత్సహకాల్ని సర్ధుబాటు చేయాల్సి వస్తుందని పోరాట్ తెలిపినట్లు నివేదిక పేర్కొంది. మైక్రో కిచెన్ల అవసరం ఎంత వరకు ఉందనే విషయంపై స్పష్టత వచ్చిన వెంటనే వాటిని మూసివేయడం, వినియోగానికి తగ్గట్లు ఫిట్నెస్ క్లాసుల్ని షెడ్యూల్ చేయడం పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వాడాకాన్ని తగ్గించి డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టేందుకు సిద్ధమైనట్లు బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక హైలెట్ చేసింది. కొన్ని సర్ధుబాట్లు తప్పవ్ ఇక తాజా గూగుల్ నిర్ణయంపై ‘సంస్థ ఇచ్చే ప్రోత్సహాకాల్ని ఇష్టపడే ఉద్యోగులకు ఈ నిర్ణయం అసంతృప్తి కలిగించవచ్చు. కానీ కంపెనీకి నిధులను ఆదా చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహా అధిక ప్రాధాన్యత కలిగిన ఇతర రంగాలపై దృష్టిసారించడం తప్పనిసరి. ముఖ్యమైన ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు, సౌకర్యాలను అందించడం కొనసాగిస్తుంది. అయితే కంపెనీ తన వనరుల విషయంలో బాధ్యతాయుతంగా ఉండేందుకు కొన్ని సర్ధుబాట్లు చేయబడతాయి అంటూ గూగుల్ ప్రతినిధి ర్యాన్ లామోన్ గిజ్మోడోకి చెప్పారు. చదవండి👉 గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తొందరపాటు.. ఏకిపారేస్తున్న సొంత ఉద్యోగులు! -
ఉద్యోగుల తొలగింపు వేళ .. గూగుల్ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా ఎంత వీలైతే అంత ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగుల్ని తొలగించిన గూగుల్.. తాజాగా క్లౌడ్ ఉద్యోగులు వారి సహచర ఉద్యోగులు డెస్క్‌లు వినియోగించుకోవాలని కోరింది. తద్వారా నిర్వహణ ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తోంది. ‘రియల్ ఎస్టేట్ ఎఫిషెన్సీ’ (హాల్ తరహాలో డెస్క్‌లు) పేరుతో గూగుల్ ఆఫీస్‌లో డెస్క్‌ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు శ్రీకారం చుట్టుంది. ప్రస్తుతం ఉద్యోగులు హైబ్రిడ్ వర్కింగ్ విధానంలో వారంలో 2 రోజులు ఇంటిలో, 3 రోజులు ఆఫీసులో పనిచేస్తున్నారు. వారంతంలో శని, ఆదివారాలు సెలవులే. ఇప్పుడు ఈ విధానంలో గూగుల్ మార్పులు చేస్తుంది. ఉద్యోగులు పరస్పర అంగీకారంతో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు ఆఫీస్‌లో వర్క్ చేసేలా ప్లాన్ చేసుకోవాలని తెలిపింది. తదనుగుణంగా కార్యాలయాల్లో డెస్క్‌లను సిద్ధం చేస్తున్నట్లు ఇంటర్నల్ మీటింగ్‌లో పేర్కొంది. ఇప్పుడు ఉద్యోగులకు విడివిడిగా డెస్క్‌లు లేవని, ఒకరి డెస్క్‌లు మరొకరు వాడుకోవాలని సూచించింది. అయితే, డెస్క్ అందుబాటులో లేనప్పుడు ఉద్యోగులు ఆఫీస్‌కు రావొచ్చని .. ఆఫీస్‌లో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కూర్చొని పనిచేసుకోవాలని స్పష్టం చేసింది. చదవండి👉 గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తొందరపాటు.. ఏకిపారేస్తున్న సొంత ఉద్యోగులు! -
మరికొన్ని గంటలు అదనంగా పనిచేయండి.. ఉద్యోగులకు సుందర్ పిచాయ్ రిక్వెస్ట్!
గూగుల్ రూపొందించిన బార్డ్ ఏఐ చాట్బాట్లో లోపాలను సరిచేసేందుకు ఆ సంస్థ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సరికొత్త ప్రణాళికను రచించింది. ఇందుకోసం వారంలో కొన్ని గంటలు అదనంగా పనిచేయాలని గూగుల్ ఉద్యోగులను సీఈవో సుందర్ పిచాయ్ కోరారు. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత సందేశాలు పంపినట్లు తెలిసింది. బార్డ్ ఏఐ చాట్బాట్లో లోపాలను గుర్తించి సరిచేయడానికి వారానికి రెండు నుంచి నాలుగు గంటలు కేటాయించాలని కోరారు. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం.. వేలాది మంది గూగుల్ ఉద్యోగులు ఇప్పటికే బార్డ్ ఏఐ చాట్‌బాట్‌ను వినియోగిస్తూ పరీక్షిస్తున్నారని, ఇందులో సమస్యలన్నంటినీ పరిష్కరించడానికి ఒక కొత్త ప్లాన్‌ను రూపొందించినట్లు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇందు కోసం వేలాదిమంది ఉద్యోగులు అదనపు గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంది. వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాక ఎటాంటి లోపాలు ఉండకూడదన్నది గూగుల్ ఉద్దేశం. అయితే సుందర్ పిచాయ్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం గూగుల్ ఉద్యోగులందరికీ ఈ సందేశాలను పంపించారా.. లేదా అన్నది స్పష్టత లేదు. గత వారంలో డెమో సమయంలో బార్డ్ బాట్ తప్పుడు సమాచారం ఇవ్వడంతో నెగిటివ్ ప్రచారం బాగా జరిగింది. గూగుల్ ఇటీవల తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 12 వేల ఉద్యోగాల కోత ప్రకటించిన విషయం తెలిసిందే. మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌తో సంబంధం లేకుండా గూగుల్‌కు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 1.70 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. సుందర్ పిచాయ్ పంపించిన సందేశాల్లో.. ఉద్యోగులందరూ బార్డ్ కోసం వారానికి రెండు నుంచి నాలుగు గంటలు అదనంగా, మరింత లోతుగా పనిచేసి లోపాలు సరిచేసేందుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బార్డ్‌ని పరీక్షించడానికి ఈ వారంలో గణనీయమైన సమయాన్ని కేటాయించాలని ఈ-మెయిల్స్‌లో పిచాయ్ అభ్యర్థించారు. (ఇదీ చదవండి: రిషి సునాక్, బిల్‌గేట్స్‌ను ఇంటర్వ్యూ చేసిన చాట్‌బాట్.. ఏయే ప్రశ్నలు అడిగిందో తెలుసా?) -
Pravasi Bharatiya Divas: రవి అస్తమించని ప్రవాస భారతీయం
ప్రపంచ నలుమూలలా భారతీయులు నివసిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 210 దేశాలలో భారతీయ మూలాలున్న వారు, ఎన్నారైలు కలిపి 3.2 కోట్లకు పైగానే ఉన్నారు. ప్రవాస భారతీయ జనాభా కంటే తక్కువ జనాభా కలిగిన దేశాలు 150 పైనే ఉన్నాయి. నేడు అనేక దేశాల్లో రాజకీయంగా కూడా భారతీయులు కీలక పదవుల్లో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని కమలా హారిస్ అలంకరించిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్‌లో జన్మించిన తెలుగింటి బిడ్డ అరుణ మిల్లర్ (కాట్రగడ్డ అరుణ) మేరీలాండ్ రాష్ట్రానికి గత నవంబర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వివిధ దేశాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు వివిధ దేశాలకు అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. రిషి సునాక్ (బ్రిటన్ ప్రధాని), అంటో నియ కోస్టా (పోర్చుగల్ ప్రధాని), మహ్మద్ ఇర్ఫాన్ అలీ (గయానా ప్రెసిడెంట్), పృథ్వీరాజ్ రూపన్ (మారిషస్ అధ్యక్షులు), చంద్రిక పెర్సద్ శాన్ టోఖి (సురినామ్ ప్రెసిడెంట్) లతోపాటు 200 మందికి పైగా భారతీయులు 15 దేశాల్లో వివిధ హోదాల్లో ప్రజాసేవలో ఉన్నారు. వీరంతా అమెరికా, యూకే, కెనడా, గయానా, సురినామ్, ఫిజీ, ట్రినిడాడ్ అండ్ టుబాగో, సింగపూర్, మారిషస్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మలేసియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పనిచేస్తున్నారు. వీరు కాకుండా వివిధ దేశాల్లో, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు చాలామందే ఉన్నారు. గతంలో సింగపూర్ ప్రెసిడెంట్‌గా ఉన్నఎస్.ఆర్.నాథన్ (1999–2011), దేవన్ నాయర్ (1981 –1985)లు, ఫిజీ ప్రధానిగా పనిచేసిన మహేంద్ర చౌదరి, మలేసియా ప్రధానిగా పని చేసిన మహతీర్ బిన్ మహ్మద్ వంటి వారు భారతీయ మూలాలున్నవారే. ప్రపంచంలోని అగ్రస్థానాల్లో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, ఈ మధ్య వరకు ట్విట్టర్ సీఈఓగా కొనసాగిన పరాగ్ అగర్వాల్, పెప్సికోలా ఒకప్పటి సీఈఓ ఇంద్రనూయి వంటి వారెందరో భారతీయ మూలలున్నవారే. నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ప్రవాస భారతీయులు బ్రిటిష్ రాజ్ కాలంలో, తదనంతరం విదేశాలకు వెళ్ళినవారే. ముఖ్యంగా వ్యవసాయం పనుల కోసం వెళ్ళిన భారతీయులు అక్కడ స్థిరపడ్డారు. మారిషస్, గయానా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, కెనడా, దక్షిణాఫ్రికా మలేసియా, ఫిజీ వంటి కామన్వెల్త్ దేశాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నవారు వీరే! స్వాతంత్య్రానంతరం ప్రపంచ కలల దేశమైన అమెరికాకు భారతీయ వలసలు ప్రారంభమై, నేడు సుమారు 45 లక్షల మంది ఆ గడ్డపై తమవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. 10 దేశాల్లో భారతీయుల జనాభా 10 లక్షలు దాటితే మరో 22 దేశాల్లో లక్షకు పైగా వున్నారు. డర్బన్ నగరాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారంటే ఆ నగరంలో భారతీయుల హవాని అర్థం చేసుకోవచ్చు. ప్రతీ ఏడు 25 లక్షల భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు. భారతీయ వలసల్లో ఇదే పంథా కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి భారతీయ పరిమళాలు ధరణి అంతా మరింత వ్యాపించి రవి అస్తమించని ‘భారతీయం’ సాక్షాత్కరిస్తుంది. (క్లిక్ చేయండి: నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..! - కోరాడ శ్రీనివాసరావు ప్రభుత్వాధికారి, ఏపీ (జనవరి 8–10 ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల సందర్భంగా) -
మహిళా స్టార్టప్‌లపై గూగుల్ ఫోకస్
న్యూఢిల్లీ: దేశీయంగా మహిళల సారథ్యంలో నడిచే స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంపై టెక్ దిగ్గజం గూగుల్ మరింతగా దృష్టి పెట్టనుంది. 75 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే, 100 పైచిలుకు భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్ సెర్చ్‌ను సపోర్ట్ చేసే వ్యవస్థపై కసరత్తు చేస్తోంది. భారత పర్యటనకు వచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయాలు వెల్లడించారు. భారతీయ స్టార్టప్స్‌లో 300 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు, ఇందులో నాలుగో వంతు భాగం (సుమారు 75 మిలియన్ డాలర్లు) మహిళల సారథ్యంలోని ప్రారంభ దశ అంకుర సంస్థల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ ఫర్ ఇండియా 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. భారీ స్థాయిలో విస్తరించిన టెక్నాలజీ .. ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాలను స్పృశిస్తున్న నేపథ్యంలో నియంత్రణలనేవి బాధ్యతాయుతమైనవిగా, సమతూకం పాటించేవిగా ఉండాలని పిచాయ్ పేర్కొన్నారు. ఎగుమతుల విషయంలో భారత్ అతి పెద్ద దేశంగా ఎదగగలదని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ను చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు 2020లో గూగుల్ 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 75,000 కోట్లు)తో ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇప్పటికే 4.5 బిలియన్ డాలర్లతో జియోలో 7.73 శాతం, భారతి ఎయిర్‌టెల్‌లో 700 మిలియన్ డాలర్లతో 1.2 శాతం వాటాలను గూగుల్ కొనుగోలు చేసింది. ప్రధాని, రాష్ట్రపతితో భేటీ .. పర్యటన సందర్భంగా పిచాయ్ కేంద్ర టెలికం, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ‘మీ సారథ్యంలో భారత్ సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుండటం స్ఫూర్తిదాయకమైన విషయం‘ అని మోదీతో భేటీ అనంతరం పిచాయ్ ట్వీట్ చేశారు. సమావేశంలో ఏయే అంశాలు చర్చించారనేది వెల్లడించలేదు. అయితే, ‘గూగుల్ చిన్న వ్యాపారాలు .. స్టార్టప్‌లకు మద్దతుగా నిలవడం, సైబర్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేయడం, విద్య..నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచడం, వ్యవసాయం.. ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో కృత్రిమ మేథను వినియోగిస్తుండటం వంటి అంశాల‘ పై ప్రధానితో చర్చించనున్నట్లు పిచాయ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. అలాగే, స్పీచ్ టెక్నాలజీ, వాయిస్, వీడియో సెర్చ్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పలు ప్రాజెక్టులను బ్లాగ్‌లో ప్రస్తావించారు. తాను భారత్‌లో పర్యటించిన ప్రతిసారి భారత స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతుండటాన్ని గమనిస్తున్నానని ఆయన తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమం సందర్భంగా తమ అనువాదం, సెర్చ్ టెక్నాలజీ సేవలను మెరుగుపర్చుకునేందుకు దేశవ్యాప్తంగా 773 జిల్లాల నుంచి స్పీచ్ డేటాను సేకరించేందుకు బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌తో జట్టు కట్టినట్లు గూగుల్ తెలిపింది. అలాగే ఐఐటీ మద్రాస్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటు కోసం 1 మిలియన్ డాలర్ల గ్రాంటును అందించనున్నట్లుపేర్కొంది.వ్యవసాయ రంగానికి సంబంధించి అధునాత టెక్నాలజీలపై పని చేసేందుకు గూగుల్‌డాట్‌ఆర్గ్ ద్వారా వాధ్వానీ ఏఐకి 1 మిలియన్ గ్రాంటు అందిస్తున్నట్లు గూగుల్ వివరించింది. ‘మీతో నవకల్పనలు, టెక్నాలజీ వంటి ఎన్నో విషయాలను చర్చించడం సంతోషం కలిగించింది. మానవజాతి పురోగతికి, సుస్థిర అభివృద్ధికి టెక్నాలజీని వినియోగించడంలో ప్రపంచ దేశాలు కలిసి పని చేయడం చాలా ముఖ్యం’. – ప్రధాని మోదీ ట్వీట్ చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
అలర్ట్, ‘గూగుల్ పే’ లో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ ఏంటో తెలుసా!
ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ సంచలనం నిర్ణయం తీసుకుంది. భారత్‌లో యూపీఐ ఆధారిత గూగుల్ పే సేవల్లో వాయిస్ ద్వారా ‘ట్రాన్సాక్షన్ సెర్చ్’ ఫీచర్ తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ ప్రకటించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన గూగుల్ 8వ ఎడిషన్‌లో సంస్థ సీఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ అందుబాటులోకి తేనున్న ఫీచర్లను పరిచయం చేశారు. ముఖ్యంగా డాక్టర్ల ప్రిస్కప్షన్‌తో పాటు స్థానిక భాషల్లో సమాచారం,మల్టీ సెర్చ్ ఇలా రకరకాల ఫీచర్లను గురించి పిచ్చాయ్ వివరించారు. దీంతో పాటు గూగుల్ పేలో ఈ సరికొత్త ఫీచర్‌ను ఎనేబుల్ చేయనున్నట్లు తెలిపారు. ఇదే ఈవెంట్లో కేంద్ర టెలీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పలు రంగాల్లో గణనీయ మార్పులు రానున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
‘మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా’..పిచాయ్ వార్నింగ్..ఆందోళనలో గూగుల్ ఉద్యోగులు!
అనిశ్చిత స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెటా, అమెజాన్, ట్విటర్ తరహాలో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించేలా నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ గత వారం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ రాబోయే వారాల్లో దాదాపు 10వేలు, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగుల్ని తొలగించనుందనే వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఆల్ హ్యాండ్ మీటింగ్ తరువాత గూగుల్ సంస్థలోని పరిణామాలు ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం. చదవండి👉 ‘నాతో గేమ్స్ ఆడొద్దు’..! మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా ఈ తరుణంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ త్వరలో ఉద్యోగుల తొలగింపులపై సంకేతాలు ఇచ్చారని, పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని ఉద్యోగుల లేఆఫ్స్‌పై పరోక్షంగా స్పందించారని ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. ఇక, ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసే విషయంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని చెప్పినట్లు బిజినెస్ ఇన్సైడర్ సైతం తన కథనంలో పేర్కొంది. ఉద్యోగులపై గ్రాడ్ అస్త్రం అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని పిచాయ్ ఉద్యోగుల్ని కోరారు. కీలకమైన విభాగాలు తప్ప మిగిలిన అన్నీ వాటిల్లో హైరింగ్ నిలిపివేశారు. ఉద్యోగులు వారు చేసే పనిని డబ్బుతో పోల్చుకూడదని సూచించారు.ఉద్యోగులపై వేటు వేసే విషయంలో గూగుల్ రివ్యూస్ అండ్ డెవెలప్మెంట్ (grad) ఉపయోగించాలని యోచిస్తోంది. తద్వారా వర్క్ విషయంలో ఉద్యోగుల పనితీరు ఎలా ఉందో ఫీడ్ బ్యాక్ తీసుకోవచ్చు. ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా గూగుల్ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనుంది. ఇప్పుడేనా.. గతంలో లేఆఫ్స్ గురించి పిచాయ్ ఈ తరహా వ్యాఖ్యల్ని గతంలో చేశారు. ఈ ఏడాది క్యూ2 ఫలితాల విడుదల అనంతరం పిచాయ్ మాట్లాడుతూ.. సంస్థ పనితీరు అంచనాల కంటే బలహీనంగా ఉందని అన్నారు. ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఉద్యోగులు ఎక్కువ మందే ఉన్నారు. కానీ పనిచేసేది కొద్ది మంది మాత్రమే. ప్రతి ఒక్కరూ వర్క్ ప్రొడక్టివిటీని పెంచాలని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు పిచాయ్ మరోసారి ఈ తరహా హెచ్చరికలు జారీ చేయడంతో గూగుల్ ఉద్యోగుల్లో కలవరం మొదలైనట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 భారతీయులేనా పనిమంతులు.. మేం పనికి రామా? టీసీఎస్‌పై అమెరికన్ల ఆగ్రహం! -
పాక్ అభిమాని గూబ గుయ్‌మనేలా..సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ‘మొదటి 3 ఓవర్లు’ చూడమని సలహా ఇచ్చిన పాక్ అభిమానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అద్భుతంగా స్పందించారు. టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. మెల్బోర్న్లో జరిగిన భారత్- పాక్ మ్యాచ్‌లో కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. కళ్లముందే టీమ్ఇండియా టాప్ ఆర్డర్ పేకమేడలా కూలుతున్నా..ప్రశాంతంగా ఉన్నాడు. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌ను చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి గెలిపించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో 53 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విరాట్ అందుకున్నాడు. Happy Diwali! Hope everyone celebrating has a great time with your friends and family. 🪔 I celebrated by watching the last three overs again today, what a game and performance #Diwali #TeamIndia #T20WC2022 — Sundar Pichai (@sundarpichai) October 24, 2022 నరాలు తెగే ఉత్కంఠలో దాయాది దేశంపై గెలిచిన భారత్‌పై క్రికెట్ లవర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ దురభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ ఓటమిని తట్టుకోలేక టీవీలు పగలగొడుతున్నారు.మరికొందరు పాక్ బౌలింగ్ వేసిన మొదటి 3 ఓవర్లు చూడమని ట్వీట్లు చేస్తున్నారు. అయితే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కోహ్లీ ఆటతీరును ప్రశంసిస్తూ పిచాయ్ ఇలా ట్విట్ చేశారు. ‘దీపావళి శుభాకాంక్షలు! ఈ ఆనంద క్షణాల్నిస్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపండి. నేను ఈరోజు చివరి మూడు ఓవర్లను మళ్లీ చూసి సంబరాలు చేసుకున్నాను. వాట్ ఏ గేమ్.. వాట్ ఏ పర్ఫార్మెన్స్ అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. After many requests received from neighbours I have decided to frame this picture @sundarpichai #PakvsIndia pic.twitter.com/LC3ZCe8i3t — Muhammad Shahzaib (@Muhamma91436212) October 24, 2022 ఆ ట్వీట్‌పై ఓ పాక్ అభిమాని స్పందించాడు. ‘మీరు మొదటి మూడు ఓవర్లు చూడాలి’ అని వెటకారంగా అన్నాడు. దానికి పాక్ అభిమానికి గూబ గుయ్‌మనేలా సుందర్ పిచాయ్ రిప్లయి ఇచ్చారు. ‘‘ఓ అది కూడా చూశాను. భువీ - అర్ష్‌దీప్ బౌలింగ్ అద్భుతంగా చేశారని ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ప్రస్తుతం సుందర్ పిచాయి పాక్ అభిమానికి ఇచ్చిన ఎపిక్ రిప్లయి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చదవండి👉 సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ భారీ షాక్! ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇద్దాం.. సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు -
గూగుల్ ఉద్యోగులకు సీఈవో సుందర్ పిచాయ్ భారీ షాక్!
ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో అన్నీ రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. నియామకాల్ని నిలిపివేస్తున్నాయి. ఈ నేపథ్యంలోప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సైతం భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించనుందా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా పరిణామాలు. గూగుల్ ఇటీవల క్యూ2 వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఆదాయాలు, రాబడుల పరంగా 'అంచనాల కంటే బలహీనంగా ఉండడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రశ్నించారు. ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నా..వారిలో పనిచేసేది కొంతమందేనంటూ టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన ఇంటర్నల్ మీటింగ్‌లో పిచాయ్ అన్నట్లు తెలుస్తోంది. పిచాయ్ వ్యాఖ్యలతో..గూగుల్ త్వరలో ఉద్యోగుల్ని తొలగించనుంది' అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరణంలో ఉద్యోగుల్ని తొలగించేందుకు గూగుల్ సిద్ధమైంది. వచ్చే వార్షిక ఫలితాల విడుదల సమాయానికి ఉద్యోగుల సేల్స్, ప్రొడక్టివిటీ విభాగాల్లో పర్ఫార్మెన్స్ బాగుంటే సరేసరి. లేదంటే వేటు తప్పదని గూగుల్ క్లౌడ్ సేల్స్ విభాగానికి చెందిన ఉద్యోగులతో తెలిపారు. ది న్యూయార్క్ పోస్ట్ సైతం గూగుల్ ఉద్యోగాల నియామకాల్ని నిలిపి వేయడం, అదే సమయంలో తొలగింపుపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. ఉద్యోగుల తొలగింపు ఖాయమంటూ తన కథనంలో హైలెట్ చేసింది. చదవండి👉'మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా'..ఉద్యోగులకు సుందర్ పిచాయ్ వార్నింగ్! -
లార్డ్స్‌లో కలిసి మ్యాచ్ చూసిన రవిశాస్త్రి, సుందర్ పిచాయ్, ముఖేష్ అంబానీ ..!
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ టోర్నీ ది హండ్రెడ్ లీగ్‌లో కామెంటేటర్ వ్యవహారిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్, మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో కలిసి రవిశాస్త్రి వీక్షించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను రవిశాస్త్రి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. "క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడే ముఖేష్ అంబానీ, సుందర్ పిచాయ్‌తో క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌లో మ్యాచ్ చూడడం చాలా సంతోషంగా ఉంది" అంటూ ఈ పోస్ట్‌కు రవిశాస్త్రి క్యాప్షన్‌గా పెట్టాడు. కాగా వ్యక్తిగత కారణాలతో ముఖేష్ అంబానీ, సుందర్ పిచాయ్ ఇంగ్లండ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే లండన్ స్పిరిట్ ది హండ్రెడ్ 2022లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మాంచెస్టర్‌పై 52 పరగుల తేడాతో లండన్ స్పిరిట్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ నిర్ణీత 100బంతుల్లో 6వికెట్లు కోల్పోయి 160పరుగులు చేసింది. లండన్ బ్యాటర్లలో జాక్ క్రాలే(41), మోర్గాన్(37) కిరాన్ పొలార్ట్( 34) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ ఒరిజినల్స్ 108 పరుగులకే కుప్పకూలింది. మాంచెస్టర్ బ్యాటర్లలో సాల్ట్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లండన్ బౌలర్లలో జోర్డాన్ థాంప్సన్ నాలుగు వికెట్లతో చేలరేగగా.. మాసన్ క్రేన్,లియామ్ డాసన్ తలా రెండు వికెట్లు సాధించారు. In the august company of two people who love their cricket @HomeOfCricket - Mr Mukesh Ambani and Mr @sundarpichai at @thehundred @SkyCricket pic.twitter.com/JYnkGlMd8W — Ravi Shastri (@RaviShastriOfc) August 9, 2022 చదవండి: CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో ఓటమి.. ఇంగ్లండ్ హెడ్ కోచ్ సంచలన నిర్ణయం! -
డబ్బులెవరికి ఊరికే రావు సార్, సుందర్ పిచాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు, సీఈవో సుందర్ పిచాయ్ వ్యవహారం పోలీస్టేషన్ వరకు చేరింది. యాప్ బిల్లింగ్ సిస్టమ్‌లో డొమొస్టిక్ యాప్ డెవలపర్ల నుంచి భారీ ఎత్తున కమిషన్లను వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ వినియోగదారుల సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొరియా టైమ్స్ కథనం ప్రకారం..సిటిజన్ యునైటెడ్ ఫర్ కన్జ్యూమర్ సోవర్జినిటీ (సీయూసీఎస్) సభ్యులు సుందర్ పిచాయ్, గూగుల్ కొరియా సీఈవో నాన్సీ మాబెల్ వాకర్, గూగుల్ ఏసియా పసిపిక్ ప్రెసిడెంట్ స్కాట్ బ్యూమాంట్లపై సౌత్ కొరియా సియో నగరంలోని గంగ్నమ్ జిల్లా పోలిసుల్ని ఆశ్రయించారు. గూగుల్ టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు దేశ టెలికమ్యూనికేషన్ బిజినెస్ యాక్ట్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ పోలీసులకు సీయూసీఎస్ సభ్యులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గూగుల్ యాప్ పేమెంట్ పాలసీ పెంచుతున్న కమిషన్ల కారణంగా వినియోగదారులకు భారంగా, క్రియేటర్లకు నష్టం వాటిల్లేలా ఉందంటూ కన్జ్యూమర్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. "యాప్ డెవలపర్లకు ప్రత్యామ్నాయం లేదు. తప్పని సరిగా గూగుల్ సంస్థ చెప్పినట్లే వినాలి. ఎందుకంటే యాప్‌స్టోర్ మార్కెట్ షేర్ గూగుల్‌కు 74.6 శాతంగా ఉందని" అన్నారు. వివాదం ఏంటంటే సంస్థకు సంబంధించిన డిజిటల్ ప్రొడక్ట్‌లు సేల్ చేయాలన్నా,సంబంధిత యాప్స్ సర్వీస్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి అందించాలన్నా గూగుల్‌కు 15శాతం నుంచి 30 వరకు కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ కమిషన్ ఎక్కువగా ఉండడంతో యాప్ డెవలపర్లు 15 శాతం నుంచి 20శాతం మాత్రమే కమిషన్ చెల్లించి థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్ సంస్థల ద్వారా గూగుల్‌కు పేమెంట్ చేసేవారు. దీంతో యజమానులకు గూగుల్‌కు పెద్దమొత్తంలో చెల్లించే కమిషన్ల భారం తగ్గిపోయింది. యాప్స్‌ను బ్లాక్ చేస్తాం అదే సమయంలో యాప్ డెవలపర్ల నుంచి వచ్చే కమిషన్ పడిపోవడంతో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యాప్ డెవలపర్లు థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్ సంస్థల నుంచి చెల్లింపులు జరపకూడదని హెచ్చరించింది. అలా చేస్తే సదరు యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి బ్లాక్ చేస్తామని తెలిపింది. పనిలో పనిగా గూగుల్‌కు లింకైన థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్‌లను నిలిపివేసింది. దీంతో వినియోగదారుల సంఘం సభ్యులు గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ తీరు మారలేదు! ఈ ఏడాది మార్చి నెలలో గూగుల్ తీరుతో సౌత్ కొరియా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ డెవలపర్లు వారి ఇష్ట ప్రకారమే చెల్లింపులు చేసుకోవచ్చని, ఆ విషయంలో గూగుల్ ఒత్తిడి చేయకూడదని సవరించిన బిల్లుపై కేబినెట్ ఆమోదం తెలిపింది.అయినా సౌత్ కొరియా కేబినెట్ తెచ్చిన ప్రతిపాదనల్ని తిరస్కరించింది. ఏప్రిల్ 1 నుంచి డెవలపర్లను తమ బిల్లింగ్ పేమెంట్ సిస్టమ్‌ను ఉపయోగించాలని సూచించింది. లేని పక్షంలో యాప్స్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. గూగుల్ తాజా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యునైటెడ్ ఫర్ కన్జ్యూమర్ సోవర్జినిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి👉సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ భారీ షాక్! -
ఉక్రెయిన్ కోసం గూగుల్.. సుందర్ పిచాయ్ డేరింగ్ స్టెప్..
Google Ukraine Support Fund: గూగుల్ కంపెనీ గ్లోబల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు. సంక్షోభ సమయంలో ఆపన్నులకు అండగా నిలిచేందుకు గూగుల్ సిద్ధంగా ఉందంటూ ప్రపంచానికి సందేశం పంపాడు. యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న ఉక్రెయిన్ సంస్థలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. నాటో విషయంలో తలెత్తిన బేదాభిప్రాయలు చినికిచినికి గాలివానగా మారి ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది రష్యా. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే యుద్ధం కారణంగా నష్టపోతున్న ఎంట్రప్యూనర్లకు గూగుల్ అండగా ఉంటుందంటూ ఈ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ 2022 మార్చిలో ప్రకటించారు. మార్చిలో చేసిన ప్రకటనకు తగ్గట్టుగానే యుద్ధంలో నష్టపోయిన స్టార్టప్‌లు ఎంట్రప్యూనర్లకు సపోర్ట్‌గా నిలిచేందుకు సుందర్ పిచాయ్ నడుం బిగించారు. ఈ మేరకు సాయం పొందేందుకు అర్హులైన ఉక్రెయిన్ ఎంట్రప్యూనర్ల వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. మొదటి రౌండ్ 17 ఉక్రెయిన్ కంపెనీలు గూగుల్ నుంచి సాయం పొందేందుకు అర్హత సాధించాయి. While in Warsaw, Poland in March, I announced our Ukraine Support Fund to help Ukrainian entrepreneurs maintain and grow their businesses in a time of war. Today we're welcoming the 1st recipients who will receive financing + mentoring from @GoogleStartups https://t.co/NQQELKCjHN — Sundar Pichai (@sundarpichai) May 31, 2022 ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత అనేక కారొ్పరేట్ కంపెనీలు రష్యా విషయంలో కఠినంగా వ్యవహరించాయి. అక్కడ తమ వ్యాపార కలాపాలను నిలిపేశాయి. ఇదే సమయంలో యుద్ధం వల్ల నష్టపోయిన ఉక్రెయిన్‌కు సాయం చేసే విషయంలో స్పష్టమైన కార్యాచరణ పెద్దగా ప్రకటించలేదు. కానీ గూగుల్ ఇందుకు భిన్నంగా ఉక్రెయిన్‌లో నష్టపోయిన స్టార్టప్‌లకు సాయం చేయడం ప్రారంభించింది. చదవండి: Anand Mahindra: అబ్దుల్ కలామ్ మాటల స్ఫూర్తితో -
సస్పెన్స్‌తో చంపేశారు, ఆ సీక్రెట్‌ను రివిల్ చేసిన సుందర్ పిచాయ్!
తమకు నచ్చిన హీరో, లేదంటే ఆటగాళ్ల వ్యక్తిగత విషయాల గురించి ఫ్యాన్స్ తెలుసుకునేందుకు ఆరాట పడుతుంటారు. వాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటీ? స్కూలింగ్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడ కంప్లీట్ చేశారనే విషయాల గురించి ఆరాలు తీస్తుంటారు. ఈ ఇంట్రస్ట్.. సినిమా హీరోలు, స్పోర్ట్స్ పర్సన్ల గురించే కాదండోయ్..టెక్ సంస్థల సీఈఓల గురించి తెలుసుకునేందుకు మక్కువ చూపుతుంటారు. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన టెక్నాలజీ లెజెండ్ సుందర్ పిచాయ్. శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి. దక్షిణ భారతదేశం నుంచి మొదలైన సుందర్ ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో సుందర్ పిచాయ్ సంవత్సరాలుగా తన స్కూలింగ్ ఎక్కడ కంప్లీట్ అయ్యిందనే విషయాల్ని ఎక్కడ రివిల్ చేయకుండా టెక్ లవర్స్‌ను సస్పెన్స్‌కు గురి చేశారు. తాజాగా స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ఇంటర్వ్యూలో పిచాయ్ తన స్కూల్ విద్యాభ్యాసంపై ఆసక్తిర విషయాల్ని పంచుకున్నారు. ఇంటర్వ్యూయర్ వికీపీడియా పేజీలో కనిపించిన స్కూల్ జాబితాను చూపించాడు. దానికి పిచాయ్ వికీపీడియాలో కనిపించిన పేర్లలో రెండు సరైనవేనని, అతను చెన్నైలోని వాణ వాణిలో తన పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు చెప్పారు. తన ఎడ్యుకేషన్‌పై అనేక రూమర్లు వచ్చాయని, వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదని పిచాయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పిచాయ్ ఉన్నత విద్య విషయానికొస్తే ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో తన బీటెక్‌ను, ఆ తర్వాత ఇంజినీరింగ్‌లో మెటీరియల్ సైన్స్ విభాగంలో ఎంఎస్ చేయడానికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వార్టన్ స్కూల్ నుండి ఎంబీఏ చదివారు. ఆ తర్వాత 2004లో పిచాయ్ గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో లీడ్‌గా తన కెరియర్ను ప్రారంభించి అనతి కాలంలో గూగుల్ సీఈఓగా సుందార్ పిచాయ్ అవతరించారు. చదవండి👉సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ భారీ షాక్! -
సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ భారీ షాక్!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. సంస్థలు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. మరి సాధారణ సంస్థల్లో పరిస్థితిలు ఇలా ఉంటే..దిగ్గజ టెక్ కంపెనీలు అందుకు విభిన్నంగా వ్యవహరించాయి. ప్రపంచ దేశాలకు చెందిన టాప్-10 టెక్ కంపెనీలు ఆ సంస్థల్లో పనిచేస్తున్న సీఈఓలకు 2020-2021 మధ్య కాలంలో భారీగా బోనస్‌లు అందించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అనూహ్యంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ షాకిచ్చింది. కోవిడ్ సమయంలో టెక్ కంపెనీలు అద్భుతమైన పనితీరును ప్రదర్శించాయి. దీంతో టెక్ కంపెనీలు వారి సంస్థల్లో సీఈఓలుగా పనిచేస్తున్న వారికి ఊహించని విధంగా బోనస్‌లు పెంచాయి. కానీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ సంస్థ 14శాతం బోనస్‌ను తగ్గించిందని ఫైన్‌బోల్డ్ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇదే అంశాన్ని జాతీయ మీడియా సంస్థ న్యూస్-18 ఓ కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. టాప్-5 సీఈఓల బోనస్‌లు భారీగా బోనస్‌లు పెరిగిన సీఈఓల జాబితాలో అమెరికాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థ బ్రాడ్‌కామ్ సీఈఓ తాన్ హాక్ ఎంగ్ ఉన్నారు. ఆయన అత్యధికంగా ఏకంగా 1586శాతం బోనస్ పొందాడు. ఇది 3.6 అమెరికన్ మిలియన్ డాలర్ల నుంచి 60.7మిలియన్ డాలర్లుగా ఉంది. తాన్ హాక్ ఎంగ్ తర్వాత ఒరాకిల్ సీఈఓ సాఫ్రా అడా క్యాట్జ్ (Safra Ada Catz), ఇంటెల్ సీఈఓ పాట గ్లెసింగెర్, యాపిల్ సీఈఓ టీమ్ కుక్, అమెజాన్ సీఈఓ ఆండీ జెస్పీ ఉన్నారు. ఒరాకిల్ సీఈఓ సాఫ్రా అడా క్యాట్జ్ అత్యధికంగా బోనస్‌లు పొందిన సీఈఓల జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. 999శాతంతో భారీగా బోనస్ పొందారు. ప్యాండమిక్‌లో టెక్ దిగ్గజాలు భారీ ఎత్తున లాభాల్లో గడించాయి. దీంతో సంస్థలు సైతం అందుకు కారణమైన సీఈఓలకు కళ్లు చెదిరేలా బోనస్‌లు అందించినట్లు ఫైన్‌బోల్డ్ తన నివేదికలో హైలెట్ చేసింది. ఇంటెల్ సీఈఓ పాట గ్లెసింగెర్ 713.64శాతంతో 22 మిలియన్ల నుంచి 179 మిలియన్ డారల్లను పొందారు. అదే సమయంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం 571.63శాతం బోనస్‌తో 35.8 మిలియన్ల నుంచి 211.9మిలియన్లు, అమెజాన్ సీఈఓ అండీ జాస్సీ 491.9 శాతంతో 35.8 మిలియన్ల నుంచి 211.9 మిలియన్లను సొంతం చేసుకొని.. అత్యధికంగా బోనస్‌లు పొందిన టాప్-5 టెక్ కంపెనీల సీఈఓల జాబితాలో ఒకరిగా నిలిచారు. సుందర్ పిచాయ్‌కు భారీ షాక్! మరో సాఫ్ట్వేర్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ 52.17 శాతం బోనస్‌ను, సిస్కో సీఈఓ చుక్ రాబిన్సన్ 9.48శాతం బోనస్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ 5.93 శాతం పొందగా..నెట్ ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హ్యాస్టింగ్స్ 19.68 శాతంతో 43.2 మిలియన్ డాలర్ల నుంచి 34.7 మిలియన్ డాలర్లు, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు 14శాతం బోనస్ కట్ చేసి భారీ షాక్ ఇచ్చింది. అయితే సుందర్ పిచాయ్ బోనస్ కోల్పోయినా స్టాక్ ప్యాకేజీ భారీగా దక్కించుకున్నారు. 2020 నుంచి సుందర్ పిచాయ్ వార్షిక వేతనం (సంవత్సరం) రూ.14కోట్లు ఉండగా..అదనంగా 2020, 2021ఈ రెండేళ్ల కాలంలో స్టాక్ ప్యాకేజీ కింద గూగుల్ సంస్థ రూ.1707కోట్లు అందించినట్లు ఫైన్‌బోల్డ్ నివేదిక తెలిపింది. చదవండి: ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇద్దాం.. సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు -
ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇద్దాం.. సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ దేశాలతో పాటూ మనదేశంలో పలు దిగ్గజ ఐటీ కంపెనీలు మార్చి నెలాఖరులోగా ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలంటూ మెయిల్స్ పంపించాయి. పనిలో పనిగా ఆఫీస్ వాతావరణాన్ని ఉద్యోగులకు అనుకూలంగా మార్చేస్తున్నాయి. అయితే ఈ తరుణంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్‌తో జరిగిన ఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ..కరోనా ప్రభావం దాదాపు తగ్గిపోవడం, మార్కెట్లోని అన్ని రంగాలూ సాధారణ స్థితికి చేరడంతో.. ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని ఆఫీస్‌లకు రావాలని పిలుపు నివ్వడంపై స్పందించారు. గూగుల్ సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కొంత మంది ఉద్యోగులు మాత్రం వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు వస్తామంటూ మెయిల్స్ పంపిస్తున్నారు. ఉద్యోగులు వర్క్, వ్యక్తిగత జీవితాన్ని మరింత సంతృప్తికరంగా మార్చేలా కోరుకుంటున్నారని అన్నారు. గత రెండేళ్లుగా ఉద్యోగులు పనిఒత్తిడి కారణంగా అసంతృప్తితో ఉన్నారని, వారికి నచ్చినట్లు వర్క్ కల్చర్‌ను మార్చేస్తే ప్రొడక్టివిటీతో పనిచేస్తారని తెలిపారు. అంతేకాదు వారికి ఫ్రీడం ఇవ్వడం వల్ల ఇన్నోవేటీవ్‌గా పనిచేస్తారని వాల్ స్ట్రీట్ జర్నల్‌కి చెప్పారు. కాగా, ఈ వ్యాఖ్యలపై దిగ్గజ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోనని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ !! రండి.. రండి.. దయచేయండి.. ఉద్యోగులకు టెక్ కంపెనీల పిలుపు!! -
భారత ప్రజలారా.. మీకు కృతజ్ఞతలు.. ఎమోషనలైన సత్య నాదెళ్ల
మాతృదేశాన్ని, ఇక్కడి ప్రజలను తలుచుకుని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భావోద్వేగానికి లోనయ్యారు. గణతంత్రదినోత్సవ వేడుకల వేళ భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు పద్మభూషన్ అవార్డును ప్రకటించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన ఎమెషనల్ అయ్యారు. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రిలతో ఇక్కడి ప్రజలకు కృతజ్ఞనతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులతో పాటు ఈ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానంటూ చెప్పారు. It’s an honor to receive a Padma Bhushan Award and to be recognized with so many extraordinary people. I’m thankful to the President, Prime Minister, and people of India, and look forward to continuing to work with people across India to help them use technology to achieve more. — Satya Nadella (@satyanadella) January 27, 2022 సత్యనాదెళ్లతో పాటు గూగుల్ సీఈవో సుందర్ పిచయ్‌కి సైతం కేంద్రం పద్మభూషన్ అవార్డును ప్రకటించింది.. దీనిపై ఆయన స్పందిస్తూ వివిధ రంగాల్లో గొప్ప ప్రతిభ చూపిన వ్యక్తులతో కలిసి ఈ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు. -
సుందర్ పిచాయ్‌పై పోలీస్ కేసు
Police Complaint Against Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై బుధవారం పోలీస్ కేసు నమోదు అయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు పిచాయ్‌తో పాటు ఐదుగరు కంపెనీ ప్రతినిధులపైనా కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాపీరైట్ యాక్ట్ వయొలేషన్ కింద ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ‘ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా’ అనే సినిమాను తన అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారంటూ ఆ సినిమా డైరెక్టర్, నిర్మాత అయిన సునీల్ దర్శన్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు యూట్యూబ్ ఓనర్ కంపెనీ అయిన ‘గూగుల్’ ప్రతినిధుల పేర్లతో(సుందర్ పిచాయ్ ఇతరులు) ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తన సినిమా హక్కుల్ని ఎవరికీ అమ్మలేదని, అలాంటిది యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం ద్వారా తనకు నష్టం వాటిల్లిందంటూ ఫిర్యాదుధారి సునీల్ చెప్తున్నారు. ఇల్లీగల్ అప్లోడింగ్ విషయంలో యూట్యూబ్‌కు ఎన్ని ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అందుకే తాను ఈ చర్యకు దిగానని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా 2017లో రిలీజ్ అయ్యింది. రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాగా ప్రమోట్ చేసుకున్న ఈ సినిమా.. డిజాస్టర్‌గా నిలిచింది. అయితే అదొక బీ గ్రేడ్ సినిమా అని, దీని మీద కూడా ఆ దర్శకుడు కోర్టుకెక్కడం విడ్డూరంగా ఉందంటూ కొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు తాజాగా పద్మ భూషణ్ పురస్కారం గౌరవం దక్కిన విషయం తెలిసిందే. -
టెక్ దిగ్గజాలకు పద్మభూషణ్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. సీడీఎస్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాటా గ్రూప్ చైర్ పర్సన్ నటరాజన్ చంద్రశేఖర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండి సైరస్ పూనావాలాలకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అలాగే, కొవాగ్జిన్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, సహ వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్లాకు పద్మభూషణ్ పురస్కారం అనౌన్స్ చేసింది. ట్రేడ్ & ఇండస్ట్రీ రంగానికి చెందిన ఐదుగురికి పద్మభూషణ్ అవార్డ్స్ లభించడంతో పాటు ఇద్దరికీ పద్మశ్రీ పురస్కారం లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ప్రదానం చేస్తున్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవని కనబరిచిన వారికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. The President of India has approved conferment of 128 Padma Awards this year.#PadmaAwards#RepublicDay2022 The list is as below - pic.twitter.com/4xf9UHOZ2H — DD News (@DDNewslive) January 25, 2022 (చదవండి: Padma Awards 2022: బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్!) -
ట్విటర్ ఒక్కటే కాదు.. ఈ దిగ్గజ కంపెనీలకు కూడా భారతీయులే సీఈఓలు..!
Here’s a Look at 10 Indian-Origin CEOs: నవంబర్ 29న సీఈఓగా పరాగ్ అగ్రవాల్(45)ను ట్విటర్ కంపెనీ నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అరడజనుకు పైగా గ్లోబల్ టెక్ కంపెనీలు భారతీయ-అమెరికన్ల నేతృత్వంలో ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం లాంటి సంస్థలను భారతీయులు అద్భుతంగా నడుపుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ట్విట్టర్‌కు కొత్త సీఈఓగా నియమితులైన పరాగ్ అగర్వాల్ చేరారు. ఇప్పుడు ఎక్కడ చూసిన భారత మేధోసంపత్తి గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ విషయంపై ఎలన్ మస్క్ స్పందించారు. భారతీయుల టాలెంట్‌ను గొప్పగా వాడుకుంటూ అమెరికా విపరీతంగా లాభపడుతోందంటూ తనదైన శైలిలో ఐర్లాండ్ బిలియనీర్, స్ట్రయిప్ కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొల్లైసన్ చేసిన ఆసక్తికరమైన ట్వీట్‌కు రీట్వీట్ చేశాడు. పరాగ్ నియామకంతో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఇతర ప్రసిద్ధ సంస్థలకు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయుల వివరాలు చూద్దాం. సుందర్ పిచాయ్: తమిళ నాడులో జన్మించిన సుందర్ పిచాయ్ ఆగస్టు 2015లో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు. మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్, సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ తర్వాత సంస్థ మూడవ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సుందర్ పిచాయ్ ఎన్నికయ్యారు. అలాగే, 2019 డిసెంబరులో పిచాయ్ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు కూడా సీఈఓ అయ్యారు. సత్య నాదెళ్ల: హైదరాబాద్‌లో జన్మించిన సత్య నాదెళ్ల 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది ఆయన ఆ కంపెనీ చైర్మన్‌గానూ ఎదిగారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాప్ట్ సంస్థకు ఛైర్మన్, సీఈఓగా కొనసాగుతున్నారు. తెలుగు వ్యక్తి అయిన సత్య నాదెళ్ల 1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించారు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యారు. అరవింద్ కృష్ణ: భారతీయ సంతతికి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ అరవింద్ కృష్ణ అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబిఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా 2020 జనవరిలో జనవరి ఎంపికయ్యారు. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన చదువు పూర్తి చేశారు. 1990లలో కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ ఐబీఎంలో చేరారు. గిన్ని రోమెట్టి ఐబీఎం సీఈఓ పదవి నుంచి తప్పుకోవడంతో జనవరి 2020లో ఐబీఎం సీఈఓగా అరవింద్ కృష్ట నియమితులయ్యారు. శంతను నారాయణ్: భారతీయ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ శంతను నారాయణ్ డిసెంబర్ 2007 నుంచి అడోబ్ ఇంక్ చైర్మన్, అధ్యక్షుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. అంతక ముందు 2005 నుంచి కంపెనీ అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. శంతను నారాయణ్ భారతదేశంలోని హైదరాబాద్‌లో జన్మించాడు. సృజనాత్మక డిజిటల్ డాక్యుమెంట్ సాఫ్ట్వేర్ ఫ్రాంచైజీలను పెంచేస్తూ కంపెనీని బాగా విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రంగరాజన్ రఘురామ్: భారత సంతతికి చెందిన రంగరాజన్ రఘురామ్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ విఎంవేర్ కొత్త సీఈఓగా 2021 జూన్ నెలలో ఎంపికయ్యారు. 2003లో కంపెనీలో చేరిన రఘురామ్ జూన్ 1న సీఈఓ పదివిని చేపట్టారు. విఎమ్ వేర్ ప్రధాన వర్చువలైజేషన్ వ్యాపారాన్ని విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జయశ్రీ ఉల్లాల్: జయశ్రీ వి. ఉల్లాల్ ఒక అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త. జయశ్రీ ఉల్లాల్ అరిస్టా నెట్వర్క్స్ సీఈఓగా 2008 నుంచి కొనసాగుతున్నారు. అంతకు ముందు ఆమె ఏఎండీ, సిస్కో కంపెనీల్లోనూ సేవలు అందించారు. లక్ష్మణ్ నరసింహన్: గతంలో పెప్సికోలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా ఉన్న లక్ష్మణ్ నరసింహన్ సెప్టెంబర్ 2019లో రాకేష్ కపూర్ తర్వాత రెకిట్ బెంకిసర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. రాజీవ్ సూరి: 1967 అక్టోబరు 10న జన్మించిన రాజీవ్ సూరి ఒక సింగపూర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, మార్చి 1 2021 నుంచి ఇన్మార్శాట్ సీఈఓగా పనిచేస్తున్నారు. అతను గతంలో 31 జూలై 2020 వరకు నోకియా సీఈఓగా ఉన్నారు. దినేష్ సి. పాల్వాల్: పాల్వాల్ 2007 నుంచి 2020 వరకు హర్మన్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా పనిచేశారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత అతను సీఈఓ పదవి నుంచి వైదొలిగారు. ఇప్పుడు డైరెక్టర్ల బోర్డుకు సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు. పరాగ్ అగ్రవాల్: ప్రస్తుత ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఐఐటీ ప్రవేశ పరీక్షలో 77వ ర్యాంకు సాధించారు. బాంబే ఐఐటీలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ పూర్తి చేశారు. 2011లో ట్విట్టర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరి తన ప్రతిభతో 2018లో ట్విటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)గా హోదా చేజిక్కించుకున్నారు. మరో 4 ఏళ్లలోపే ట్విట్టర్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా ఎదిగారు. -
వర్క్‌ఫ్రమ్ హోం.. గూగుల్‌కు ఉద్యోగుల ఝలక్!
Google Employees Oppose vaccination Mandatory : టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు వర్క్‌ఫ్రమ్ హోంలో ఉద్యోగులు భారీ షాకిచ్చారు. వ్యాక్సినేషన్ తప్పనిసరి అని కంపెనీ జారీ చేసిన ఆదేశాలపై నిరసన వ్యక్తం చేయడమే కాదు.. ఈ సాకుతో వర్క్‌ఫ్రమ్ హోంను మరికొంతకాలం పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా సంతకాలతో ఓ మ్యానిఫెస్టో తయారుచేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ సంస్థ ఉద్యోగులు తమ కంపెనీకి వ్యతిరేకంగా ఓ మ్యానిఫెస్టోను సిద్ధం చేశారు. వ్యాక్సినేషన్ తప్పనిసరి అంటూ జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ వందల మంది సంతకాలతో ఆ మ్యానిఫెస్టో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. పైగా పోను పోను ఆ సంతకాల సంఖ్య పెరుగుతుండడం విశేషం. త్వరలో వర్క్‌ఫ్రమ్ హోం ముగిసి.. ఉద్యోగులు ఆఫీసులకు వస్తారనుకుంటున్న తరుణంలో ఈ పరిణామం గూగుల్‌కు మింగుడుపడడం లేదు. సర్కార్ ఉత్తర్వుల నేపథ్యంలోనే.. ఇదిలా ఉంటే కరోనా ప్రభావం తగ్గని నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం తాజాగా అమెరికన్ కంపెనీలకు కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ కంపెనీలో వంద, అంతకంటే ఎక్కువ మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాల్సిందేనని, కంపెనీలు ఈ అంశాన్ని పర్యవేక్షించాలని తేల్చి చెప్పింది. ఇందుకోసం జనవరి 4వ తేదీని డెడ్‌లైన్‌గా విధించింది. ఈ తరుణంలో గూగుల్ తమ కంపెనీలో పని చేసే లక్షా యాభై వేల మంది ఉద్యోగులకు మెయిల్ పంపించింది. ఆఫీసులకు వచ్చినా, వర్క్‌ఫ్రమ్ హోంలో కొనసాగుతున్నా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలంటూ అందులో పేర్కొంది. అంతేకాదు డిసెంబర్ 3వ తేదీకల్లా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను తమ కంపెనీ ప్రొఫైల్‌లో అప్డేట్ చేయించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. అయితే ‘తప్పనిసరి’ అనే ఆదేశాల్ని ఉద్యోగులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఆ ఆదేశాల్ని వ్యతిరేకిస్తూ.. వ్యాక్సినేషన్లో తమకు స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. అంతేకాదు కరోనా ప్రభావం కారణంగా తాము మరికొంత కాలం వర్క్‌ఫ్రమ్ హోంలోనే కొనసాగుతామని, బలవంతం చేస్తే ఉద్యోగాలకు రాజీనామాలు చేయాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. అయితే గతంలో చాలాసార్లు ఉద్యోగుల బ్లాక్‌మెయిలింగ్‌లకు తలొగ్గినప్పటికీ.. ఈసారి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు గూగుల్ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇంకోవైపు వ్యాక్సినేషన్ తప్పనిసరి ఆదేశాలు గూగుల్‌కు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద కంపెనీలకు తలనొప్పిగా మారింది. క్లిక్ చేయండి: గూగుల్ అసిస్టెంట్‌తో టీకాల బుకింగ్ -
జియోఫోన్ నెక్ట్స్ లాంచ్...! సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు..!
భారత మొబైల్ నెట్‌వర్క్‌లో జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌తో జియో మరో సంచలనాన్ని నమోదు చేయనుంది. ప్రపంచంలో అత్యంత చౌకైన ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ త్వరలోనే రిలీజ్ కానుంది. దీపావళి రోజున జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. జియో, గూగుల్ భాగస్వామ్యంతో జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు...! జియోఫోన్ నెక్ట్స్ లాంచ్ భారత్‌లో ఈ దీపావళి పండుగకు భారతీయుల ముందుకు వస్తోందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ధృవీకరించారు. ఈ సందర్భంగా సుందర్‌పిచాయ్ పలు కీలక వ్యాఖ్యలను చేశారు. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో జియోఫోన్ నెక్ట్స్ నాయకత్వం వహిస్తోందని సుందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ రాకతో భారత్‌లో డిజిటల్ పరివర్తన కోసం ఒక పునాది చూపబడుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే సంవత్సరాల్లో జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్-రీచ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తోందని అన్నారు. జియోఫోన్ నెక్ట్స్తో భారతీయులు ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ లాంటి దేశాలు ఆసియా-పపిఫిక్ రిజియన్లో గూగుల్‌కు ప్రధాన మార్కెట్‌గా నిలుస్తోందని వెల్లడించారు. జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్..! 5.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 చిప్ సెట్ అడ్రినో 306 జీపీయు 2500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ ఆండ్రాయిడ్ ప్రగతి ఓఎస్ ధర - రూ.3,499 చదవండి:ఓలా స్కూటర్ గురించి సీఈఓ భవిష్ అగర్వాల్ ఆసక్తికర ట్వీట్ -
స్మార్ట్ ఫోన్లో కొత్త సమస్య, బాబోయ్ అంటూ ఫిర్యాదుల వెల్లువ
గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా టెన్సార్ చిప్సెట్లతో పాటు ఆండ్రాయిడ్12 వెర్షన్‌తో పిక్సెల్ 6, పిక్సెల్స్ 6 ప్రో ఫోన్లను విడుదల చేసింది. ఇప్పుడు ఆ ఫోన్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ 19న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఫిక్సెల్ ఫోన్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా ఫోన్లలో ఉండే చిప్ సెట్లను క్వాల్కమ్ తయారు చేస్తుంది. అయితే పిక్సెల్ ఫోన్లలో వినియోగించిన చిప్‌లను గూగులే సొంతంగా తయారు చేసింది. ఈ పిక్సెల్ 6 ప్రారంభ ధర మన కరెన్సీలో రూ.44,971వేలు, పిక్సెల్ ప్రొ ధర దాదాపు రూ.67,494గా ఉంది. We're launching Pixel 6 and Pixel 6 Pro today! They’re unlike any phone we've built before, with a new industrial design, Android 12 with Material You user interface, and running on our custom Google Tensor chip. Can't wait to see how people use them:)https://t.co/QPvVrCtxvB pic.twitter.com/2eFJsGmSOc — Sundar Pichai (@sundarpichai) October 19, 2021 Android 12 is wrecking my Pixel 4a. Touch is all wonky and the animations are running slow. Also a weird thing where I can't touch the date to open my calendar anymore. Curious if others are having these issues. — Donny Turnbaugh (@DonnyOutWest) October 21, 2021 అయితే విడుదల సందర్భంగా ఈ సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులు పిక్సెల్ సపోర్ట్‌కు పేజ్‌కు వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. తాము కొనుగోలు చేసిన పిక్సెల్ ఫోన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపారు. అన్లాకింగ్, యాప్స్ క్రాష్, కెమెరాలలో సమస్యలున్నాయని, ఫోన్ రీస్టార్ట్ చేసినా అవి పరిష్కారం కావడం లేదని, ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌ని ఇన్స్టాల్ చేసిన పిక్సెల్ ఫోన్లలో ఎటువంటి మార్పులు లేవని అన్నారు. Are there any other Pixels out there have issues since Android 12 was released, my 4a 5G is have a bunch — Rick Young Jr (@RichardYoungJr7) October 21, 2021 మరికొందరు ఆండ్రాయిడ్ వెర్షన్‌కి మారిన తర్వాత యాప్‌లు క్రాష్ అవున్నట్లు చెప్పారు. బ్యాటరీ డ్రెయిన్ సమస్యల్ని ఫేస్ చేస్తున్నట్లు, త్వరగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. పిక్సెల్ 6 సిరీస్‌తో పాటు పిక్సెల్ 4ఏ, పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్5 ఫోన్లలో సమస్యలు ఉన్నాయని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఇక యూజర్ల వరుస ఫిర్యాదులతో గూగుల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. చదవండి: గూగుల్ పిక్సెల్ 6 సిరీస్: సొంత చిప్‌తోనే అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే.. -
వర్క్‌ఫ్రం హోమ్ ఓల్డ్ మెథడ్... కొత్తగా ఫ్లెక్సిబుల్ వర్క్‌వీక్
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలా ? లేక ఆఫీసుకు రావాలా అనే విషయంలో కొన్నాళ్లుగా కొనసాగుతున్న సందిగ్థతకు తెరదించింది. ఈ రెండింంటికీ మధ్యే మార్గంగా కొత్త విధానం అమల్లోకి తేబోతున్నట్టు ఆ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పని విధానాల్లో మార్పులు వచ్చాయి. కోవిడ్ నిబంధనల కారణంగా ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు సైతం ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్నారు. దాదాపు ఏడాది కాలంగా ఇదే పద్ధతిని అనేక పెద్ద కంపెనీలు కొనసాగిస్తున్నాయి. వర్క్‌ఫ్రం హోంకి స్వస్తి పలికి ఆఫీసులకు రావాలంటూ ఆదేశాలు ఇచ్చేందుకు దాదాపు అన్ని కంపెనీలు సిద్ధం అవుతుండగా కోవిడ్ సెంకండ్ వేవ్ ప్రపంచాన్ని చుట్టేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం వేగంగా జరుగుతోంది. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలించేందుకు అనేక కంపెనీలు రెడీగా ఉన్నాయి. అయితే థర్డ్‌వేర్ భయం ముంగింట ఉండటంతో ఉద్యోగులను ఆఫీసులకు పిలించేందుకు ముందు వెనుకా ఆలోచిస్తున్నాయి. కొత్తగా ఫ్లెక్సిబుల్ మెథడ్..! ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తరించిన గూగుల్ సంస్థ ఉద్యోగుల పని విధానం విషయంలో కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇటు పూర్తిగా వర్క్‌ఫ్రం హోం కాకుండా అటూ రెగ్యులర్ పద్దతిలో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనకుండా ఫ్లెక్సిబుల్ వర్క్ వీక్ మెథడ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ముందుగా ఈ విధానం అమెరికాలో అమలు చేసి ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఐదు రోజుల పని విధానం అమల్లో ఉంది. దీంతో ఉద్యోగులు ఐదు రోజులు మాత్రమే పని చేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు మూడు రోజులు ఇళ్ల నుంచి పని చేస్తే రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాల్సి ఉంటుంది. గూగుల్ సీఈవో సుంచర్ పిచయ్ ఈ వర్క్ విధానాన్ని టూ బై త్రీ (2/3) మోడల్‌గా పేర్కొంటున్నారు. ‘ఏడాది కాలంగా ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేయడానికి అలవాటు పడ్డారు, దీంతో చాలా మంది నగరాలకు దూరంగా రిమోట్ ఏరియాల్లో పని చేస్తున్నారు. ఇప్పుడు ఆఫీసులకు రావాలంటే వీరంతా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీని వల్ల శారీరక, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని దూరం చేసేందుకు టై బై త్రీ మోడల్ని అమలు చేయాలని నిర్ణయించాం’ అని పిచాయ్ తెలిపారు. చదవండి: Facebook: ఫేస్‌బుక్‌ను బద్నామ్ చేసింది అతడేనా..! -
పాఠాలు చెప్పని గురువులు.. అయినా గెలిచిన శిష్యులు
Happy Teacher's Day 2021: గురువంటే బడిత పట్టి పాఠాలు నేర్పేవాడు మాత్రమే కాదు. శిష్యుడంటే పలక పట్టి దిద్దాల్సిన అవసరమూ లేదు. గెలుపు తీరాలను తాకిన వాళ్ల నుంచి పాఠాలు నేర్చుకునే వాళ్లను శిష్యులుగానే భావించొచ్చు. అలాగే వాళ్లకు ప్రత్యక్ష పాఠాలు చెప్పకుండా ‘సక్సెస్’ స్ఫూర్తిని నింపే మార్గదర్శకులు గురువులే అవుతారు. ద్రోణుడికి ఏకలవ్య శిష్యుడిలాగా.. వెతికితే వ్యాపార, టెక్ రంగాల్లో రాటుదేలిన ఎంతో మంది మేధావులు మనకు కనిపిస్తారు. వాళ్లలో గురువుల్ని మించిన శిష్యులుగా, వాళ్ల ‘లెగసీ’కి వారసులుగా ఆయా రంగాల్లో పేరు సంపాదించుకుంటున్న కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►సుందర్ పిచాయ్(పిచాయ్ సుందరరాజన్).. 49 ఏళ్ల ఈ టెక్ మేధావి అల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా, గూగుల్ సీఈవోగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మెటీరియల్స్ ఇంజినీర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్‌లో అడుగుపెట్టారు. ఇంతకీ ఈయన గురువు ఎవరో తెలుసా? విలియమ్ విన్సెంట్ క్యాంప్‌బెల్ జూనియర్. అమెరికా వ్యాపార దిగ్గజంగా పేరున్న విన్సెంట్ క్యాంప్‌బెల్.. మొదట్లో ఫుట్‌బాల్ కోచ్ కూడా. ఆపై టెక్నాలజీ వైపు అడుగులేసి.. యాపిల్ లాంటి ప్రముఖ కంపెనీలకు పని చేశారు. సుందర్ పిచాయ్.. అంతకంటే ముందు గూగుల్ ఫౌండర్లు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎరిక్ షిమిడెట్, జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్), జాక్ డోర్సే, డిక్ కోస్టోలో(ట్విటర్), షెరీల్ శాండ్‌బర్గ్(ఫేస్బుక్) లాంటి ప్రముఖులెందరికో ఈయనే మెంటర్ కూడా. ఇక యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌కు వ్యక్తిగత గురువుగా చాలాకాలం పని చేశారు విన్సెంట్ క్యాంప్‌బెల్. ►మార్క్ జుకర్‌బర్గ్.. ఫేస్బుక్ ఫౌండర్ కమ్ సీఈవో. చిన్నవయసులోనే బిలియనీర్‌గా ఎదిగిన ఈ ఇంటర్నెట్ ఎంట్రెప్రెన్యూర్.. ఎవరి స్ఫూర్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టాడో తెలుసా? టెక్ మేధావి స్టీవ్ జాబ్స్. అవును.. ఈ విషయాన్ని స్టీవ్ జాబ్స్ తన బయోగ్రఫీలోనూ రాసుకున్నాడు. ఇది చాలామందిని విస్తుపోయేలా చేసింది. అయితే స్టీవ్ జాబ్స్ చనిపోయిన చాన్నాళ్లకు ఓ అమెరికన్ టాక్ షోలో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని నిర్ధారించాడు. ► రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వ్యాపారవేత్త, వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు. లేకర్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, బ్రిటన్ వ్యాపారదిగ్గజం ఫ్రెడ్డీ లేకర్‌ను తన గురువుగా ఆరాధిస్తుంటాడు. ఆయన స్ఫూర్తితోనే తాను ఇవాళ ఉన్నానంటూ చాలా ఇంటర్వ్యూలో గురుభక్తిని చాటుకుంటాడు బ్రాన్సన్. ►సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను గురువుగా ఆరాధిస్తుంటాడు. తన కెరీర్ ఎదుగుదలకు గేట్స్ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్భలమే కారణమని చెప్తుంటారు. గొప్ప విజయాలు సాధించేందుకు గేట్స్ చెప్పే సూత్రాలు పాటిస్తే చాలాని తనలాంటి వాళ్లకు సూచిస్తుంటాడు సత్య నాదెళ్ల. ►రతన్ నవల్ టాటా(రతన్ టాటా).. ప్రముఖ వ్యాపారవేత్త. టాటా గ్రూపుల మాజీ చైర్మన్. ప్రస్తుతం టాటా చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటున్న ఈ పెద్దాయన(83).. ఫ్రెండ్లీబాస్ తీరుతో, సహాయక కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరిని గురువుగా భావిస్తాడో తెలుసా?.. టాటా గ్రూపుల మాజీ చైర్మన్ జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా(జేఆర్డీ టాటా)ని. ►ఎలన్ మస్క్.. బహుతిక్కమేధావిగా పేరున్న మస్క్ తనకు గురవంటూ ఎవరూ లేరని తరచూ ప్రకటనలు ఇస్తుంటాడు. అంతేకాదు స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహారాలను చూసుకునే జిమ్ కాంట్రెల్ ఓ ఇంటర్వ్యూలో ‘మస్క్ రాకెట్ సైన్స్ గురించి తనంతట తానే తెలుసుకున్నాడ’ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కూడా. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కంప్యూటర్ సైంటిస్ట్-గూగుల్ ఫౌండర్ ల్యారీ పేజ్‌తో దగ్గరగా ఎలన్‌మస్క్ పని చేశాడని, ఆ ప్రభావంతోనే మస్క్ రాటుదేలాడని. ►బిల్ గేట్స్.. వ్యాపార మేధావిగా పేరున్న బిల్‌గేట్స్‌కు, అమెరికా ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్‌కు మధ్య అపర కుబేరుడి స్థానం కోసం చాలాకాలం పోటీ నడిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ, బఫెట్‌ను అన్నింటా తాను గురువుగా భావిస్తానని బిల్‌గేట్స్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్తుంటాడు. అంతేకాదు ఇద్దరూ వ్యాపార సలహాలు, ఛారిటీలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించుకుంటారు కూడా. - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ -
వర్క్‌ఫ్రం హోంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక ప్రకటన
Google Work From Home: వర్క్‌ఫ్రం హోం కొనసాగించడంపై మల్లాగుల్లాలు పడుతున్న కార్పోరేట్ కంపెనీలు క్రమంగా ఓ నిర్ణయానికి వస్తున్నాయి. ఉద్యోగులు ఎక్కడి నుంచి పని చేయాలనే అంశంపై క్లారిటీ ఇస్తున్నాయి. తాజాగా దీనిపై నంబర్ వన్ సెర్చ్ ఇంజన్ గూగుల్ సైతం స్పందించింది. ఆఫీసులకు రండి కరోనా విజృంభనతో కార్పోరేట్ కంపెనీలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలు తమ ఆఫీసులకు తాళాలు వేశాయి. ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలంటూ చెప్పాయి. అయితే వర్క్‌ఫ్రం హోం మొదలై ఏడాది గడిచిపోవడంతో క్రమంగా అన్ని ఆఫీసులు ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పని చేయాలని కోరుతున్నాయి. గూగుల్ సైతం సెప్టెంబరు మొదటి వారం నుంచి ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పని చేయాలని కోరింది. ఆ తర్వాత ఈ గడువును అక్టోబరుకు పొడిగించింది. తాజాగా వర్క్‌ఫ్రం హోంపై ఆ కంపెనీ కీలక ప్రకటన చేసింది. గూగుల్ సీఈవో ప్రకటన కరోనా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోన్నా కొత్త రకం మ్యూటెంట్లతో ఎప్పటికప్పుడు ప్రమాదం ముంచుకొస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికాతో పాటు అనేక దేశాల్లో డెల్టా వేరియంట్‌తో వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనే విషయంలో గూగుల్ వెనక్కి తగ్గింది. 2022 జనవరి తర్వాత వరకు వర్క్‌ఫ్రం కొనసాగించాలని నిర్ణయించింది. ఆఫీసులకు వచ్చి పని చేయాలనే నిబంధను ఐచ్ఛికంగా మార్చింది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ కంపెనీ ఉద్యోగులకు ఈ మెయిల్ పంపారు. ‘ 2022 జనవరి 10 తర్వాత వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ వర్క్‌ఫ్రం హోం కొనసాగించాలా ?, ఆఫీసులకు వచ్చి పని చేయాలా ? అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటాం’ అని మెయిల్లో ఆయన పేర్కొన్నారు. అందరిదీ అదే దారి డెల్టా వేరియంట్ విజృంభణకు తోడు ఆఫీసులకు వచ్చి పని చేసేందుకు ఉద్యోగులు అయిష్టత చూపుతున్నందున ఇప్పటికే అమెజాన్ , లైఫ్ట్ వంటి సంస్థలు వర్క్‌ఫ్రం హోంను కొనసాగిస్తామని ప్రకటించాయి. వచ్చే ఏడాదిలో పరిస్థితులను బట్టి ఉద్యోగులు ఆఫీసులకు రావాలా ? వద్దా ? అనేది నిర్ణయిస్తామని ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో గూగుల్ కూడా చేరింది. చదవండి : Work From Home: జనవరి వరకు ఊరట.. ఇప్పుడు ఎంప్లాయిస్ మరో మాట! -
గూగుల్‌లో ఈ బుల్లి డైనోసార్ ఎలా పుట్టిందో తెలుసా?
గూగుల్‌లో కనిపించే బ్రౌజర్ గేమ్ ‘డైనోసార్’ తెలుసు కదా. ఇంటర్నెట్ ఆగిపోగానే.. చాలామందికి అదొక టైంపాస్ యవ్వారంగా ఉంటోంది. అయితే ఆ గేమ్‌కు కొత్త హంగులు అద్దినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా ప్రకటించాడు. ఇంతకీ ఈ Google Dinosaur Game కొత్త అప్డేట్ ఏంటంటే.. ఒలింపిక్స్ మినీ గేమ్స్. సాక్షి, వెబ్‌డెస్క్: అడ్డుగా వచ్చే ముళ్ల పొదల చెట్లు, పై నుంచి దూసుకొచ్చే పక్షులు. వాటిని తప్పించుకుంటూ పరుగులు తీసే బుల్లి డైనోసార్. స్పేస్ బార్‌తో ఈ గేమ్ కంట్రోలింగ్ ఉంటుంది. దాని సాయంతో డైనోసార్‌ను తప్పించి ముందుకు పరిగెత్తాలి. పోను పోను వేగం పెరుగుతూ పోతుంటుంది. అయితే ఈ గేమ్‌కు ఒలింపిక్స్ గేమ్స్ తరహా ఫీచర్స్‌ను చేర్చారు. ఆటలకు సంబంధించిన టీ-రెక్స్(డైనోసార్), ఒలింపిక్స్ మినీ గేమ్స్, ఒలింపిక్ ఫ్లేమ్, రింగులు, మెడల్స్.. ఇలాంటి ఫీచర్లను చేర్చారు. అయితే పిచాయ్ కంటే ముందే ఓ రెడ్డిట్ యూజర్ ఈ విషయాన్ని గుర్తించి అప్డేట్ ఇవ్వడం విశేషం. Might need to work on my surfing skills 🌊 chrome://dino/ pic.twitter.com/OqDn3RHLGg — Sundar Pichai (@sundarpichai) July 23, 2021 అంతరించిపోయిన డైనోసార్ల నుంచి ఓ బుల్లి గేమ్.. అదీ అందరికీ అందుబాటులో ఎలా ఉంటుందనే సెబాస్టియన్ గాబ్రియల్ ఆలోచన నుంచి పుట్టింది ఇది. 2014లో శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన ఈ వెబ్ డిజైనర్ డైనోసార్ గేమ్‌ను లాంఛ్ చేశాడు. 70వ దశకంలో ప్రపంచాన్ని ఊపిన ఇంగ్లీష్ రాక్ బ్యాండ్ టీ రెక్స్ పేరు మీద ఈ గేమ్‌ను రూపొందించాడు సెబాస్టియన్. మొదట్లో ప్రాజెక్ట్ బోలన్ పేరుతో దీనిని మొదలుపెట్టాడు. మార్క్ బోలన్ ఎవరంటే.. టీ-రెక్స్ లీడ్ సింగర్. 2014 సెప్టెంబర్‌లో ఈ గేమ్ రిలీజ్ కాగా..పాత డివైజ్‌లలో పని చేయలేదు. దీంతో డిసెంబర్లో అప్డేట్ వెర్షన్‌తో రీ-రిలీజ్ చేశారు. పాయింట్లు దాటుకుంటూ పోతుంటే రంగులు కూడా మారుతుంది ఈ గేమ్. సగటున నెలకు 27 కోట్ల మంది(అంతకు మించే) ఈ గేమ్‌ను ఆడుతుంటారని గూగుల్ చెబుతోంది. తర్వాతి కాలంలో గేమ్‌కు అప్డేట్స్ రాగా.. డినో స్వార్డ్స్ అని కత్తులు, కటార్లు, గొడ్డలు తగిలించారు. ఆటలో కొంచెం అటు ఇటు తేడా జరిగినా ఆ ఆయుధాలు డైనోసార్‌ను బలి తీసుకుంటాయి. ఇక రంగు రంగుల టోపీలు, ఐకాన్లు కూడా ఈ బుల్లి డైనోసార్‌కు తగిలించుకుని ఆడే వీలుంది. తాజా ఒలింపిక్స్ అప్డేట్ ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌కి వర్తిస్తుందని గూగుల్ స్పష్టం చేసింది. టీ-రెక్స్ కూడా రూపాలు మారడంతో పాటు పరుగులు పెడుతుందని, ఫినిషింగ్ లైన్ లక్క్ష్యంగా గేమ్ భలేగా ఉందని సదరు రెడ్డిట్ యూజర్ వెల్లడించాడు. ఇంతకీ ఈ గేమ్ మాగ్జిమమ్ పాయింట్లు 99999 రీచ్ అయితే ఏమవుతుందో తెలుసా?.. మళ్లీ సున్నాకే వచ్చేస్తుంది. కాకపోతే ఈసారి డైనోసార్ వేగం శరవేగంగా ఉంటుంది. -
వర్క్ ఫ్రమ్ ‘ఆఫీస్’.. ఉద్యోగుల్లో ఆగ్రహం
కరోనా కారణంగా ఉద్యోగుల్లో చాలామంది వర్క్ ఫ్రమ్ హోంకే ఫిక్స్ అయిపోయారు. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకుంటున్న తరుణంలో తిరిగి ఆఫీస్ గేట్లు తెరవాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు ఇంటర్నెట్ దిగ్గజ కంపెనీలు యాపిల్, గూగుల్ ఎంప్లాయిస్ తమ ఉద్యోగులకు ఆఫీస్‌లకు సిద్ధం కావాలని మెయిల్స్ పెడుతుండగా.. ప్రతిగా ఉద్యోగులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నట్లు సమాచారం. తాము వర్క్ ఫ్రమ్ హోంలోనే కొనసాగుతామని, ఆఫీస్‌లకు రావాలని బలవంతపెడితే రాజీనామాలు చేస్తామని చాలామంది బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారు. యాపిల్‌కు లేఖలు జూన్ నెలలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రతిపాదన మేరకు ‘హైబ్రిడ్ మోడల్’ తెర మీదకు వచ్చింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని ఉద్యోగులకు సూచించారు. అయితే తాము ఆఫీస్‌లకు రాలేమని, వర్క్ ఫ్రమ్ హోం కొనసాగించాలని కొందరు ఎంప్లాయిస్ విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో ఎక్కువ రిక్వెస్ట్‌లు వస్తుండడంతో యాపిల్ కుదరదని తేల్చి చెప్పింది. అయితే ఆఫీస్‌లకు రావాలని బలవంతం చేస్తే.. రిజైన్ చేస్తామని ఉద్యోగులు తాజాగా లేఖలు రాయడం మొదలుపెట్టారు. మరోవైపు కిందటి నెలలో యాపిల్ నిర్వహించిన ఓ సర్వేలో 90 శాతం ఉద్యోగులు తాము తమకు వీలున్న రీతిలోనే పనులు చేస్తామని వెల్లడించడం విశేషం. ఈ నేపథ్యంలో కొందరు మేనేజ్మెంట్కు మళ్లీ లేఖలు రాయాలని భావిస్తుండగా.. కోర్టుకు వెళ్లే ఉద్దేశంలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ పునరాలోచన చేస్తుందా? లేదా? అనేది చూడాలి. గూగుల్ కూడా.. ఆఫీస్ రిటర్న్ పాలసీపై గూగుల్ ఉద్యోగుల్లోనూ అసంతృప్తే నెలకొంది. మే నెలలో కంపెనీ సీఈవో సుందర్‌పిచాయ్ ‘హైబ్రిడ్ వర్క్ ఎన్విరాన్మెంట్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి 60 శాతం ఉద్యోగులు ఆఫీస్‌లకు రావాలని, మరో 20 శాతం మంది రిమోట్ వర్క్, ఇంకో 20 శాతం మంది రీ లోకేట్ కావాలని పిచాయ్ పిలుపు ఇచ్చాడు. ఇక లొకేషన్ టూల్ ఆధారంగా జీతాలు ఉంటాయని కూడా ప్రకటించాడు. ఈ దశలో గందరగోళానికి గురవుతున్న ఉద్యోగులు.. ఆఫీస్‌లకు రాలేమని చెప్తున్నారు. అంతేకాదు మెయిల్స్ ద్వారా తమ ఫ్రస్టేషన్‌ను వెల్లగక్కుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో గూగుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
ఆఖరిసారి అప్పుడే ఏడ్చాను: సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఏడాదిన్నరకు పైగా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కోవిడ్‌కు అంతమెన్నడో తెలియడం లేదు.. రెండు వేవ్‌లతో సతమతమైన జనాలపై మూడో వేవ్ విరుచుకుపడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఓ విధంగా కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారంటే అతిశయోక్తి కాదు. కుబేరులు, పేదలు, ప్రముఖులు, సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధ పెట్టింది కోవిడ్. ఈ జాబితాలో తాను కూడా ఉన్నాను అంటున్నారు గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్. మహమ్మారి తనను కూడా మానసికంగా బాధించిందన్నారు. బీబీసీకిచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ఆయన ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇంటర్నెట్’పై దాడితో సహా పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూ సందర్భంగా చివరిసారిగా ఎప్పుడు ఏడ్చారన్న ప్రశ్నకు సుందర్ పిచాయ్ బదులిస్తూ... ‘‘కోవిడ్ వేళ ప్రపంచవ్యాప్తంగా నిలిపి ఉంచిన మోర్గ్ ట్రక్కులను చూసినప్పుడు.. రెండు నెలల క్రితం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నాను’’ అన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో భాగంగా ఏప్రిల్-మే నెలల్లో భారత దేశంలో వేలాది మంది మరణించారు. గంగా నదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ పరిస్థితులు తనను ఎంతో బాధించాయన్నారు పిచాయ్. అంతేకాక ‘‘నేను అమెరికన్ పౌరుడిని. కానీ నాలో భారతీయత ఎంతో లోతుగా పాతుకుపోయింది. నేను ఎవరు అనే విషయానికి వస్తే.. ఈ భారతీయత నాలో అతి పెద్ద భాగంగా నిలుస్తుంది. నేను దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను. సాంకేతికతలో చోటు చేసుకుంటున్న మార్పులు నాపై ఎంతో ప్రభావం చూపేవి. నా బాల్యంలో చూసిన రోటరి ఫోన్.. పాత స్కూటర్ ఇవన్ని నన్ను చాలా ఆశ్చర్యపరిచేవి’’ అని సుందర్ పిచాయ్ తెలిపారు. ‘‘నా తండ్రి ఏడాది మొత్తం జీతం ఖర్చు చేస్తే నేను అమెరికా చేరుకోగలిగాను. కాలీఫోర్నియాలో దిగినప్పుడు నేను ఊహించుకున్న దానికి వాస్తవ పరిస్థితులకు చాలా తేడా గమనించాను. అమెరికా చాలా ఖరీదైనది. ఇక్కడ ఓ బ్యాక్‌పాక్ కొనాలంటే దాని విలువ మా నాన్న నెల జీతంతో సమానంగా ఉంటుంది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కేవలం అదృష్టం మాత్రమే కారణం కాదు. సాంకేతికత మీద నాకున్న అభిమానం కూడా నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది’’ అని తెలిపారు సుందర్ పిచాయ్. పాస్వర్డ్ మార్చను ఎందుకంటే.. బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్ తాను పాస్‌వర్డ్‌ను తరచూ మార్చనని వెల్లడించారు. వినియోగదారులు వారి పాస్‌వర్డ్‌లను తరచూ మార్చడానికి బదులుగా “రెండు-కారకాల ప్రామాణీకరణ” (టూ ఫాక్టర్ అథెంటికేషన్)ఎంచుకోవాలని ఆయన సిఫార్సు చేశారు. ‘‘పాస్‌వర్డ్‌ను పదేపదే మార్చడం కంటే రెండు-కారకాల ప్రామాణీకరణ మార్గం ఎంతో సురక్షితం. ఎందుకంటే పాస్‌వర్డ్‌లను చాలా తరచుగా మార్చినప్పుడు, వాటిని గుర్తుంచుకోవడంలో మీకు ఇబ్బంది తలెత్తుతుంది. కనుక రెండు-కారకాల ప్రామాణీకరణను ఎంచుకోవడం ఎంతో మంచిది’’ అన్నారు. అంతేకాక తాను ఒకేసారి 20కి పైగా ఫోన్లను ఉపయోగిస్తానని తెలిపారు. మార్కెట్లోకి వచ్చిన ప్రతి ఫోన్‌ని పరీక్షిస్తాను అని సుందర్ పిచాయ్ తెలిపారు. . -
‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇంటర్నెట్’పై దాడి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్వేచ్ఛాయుత, బహిరంగ అంతర్జాలం(ఇంటర్నెట్) దాడికి గురవుతోందని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) సుందర్ పిచాయ్ అన్నారు. తాజాగా ఆయన బీబీసీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సమాచార వ్యాప్తిపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయని, కొన్ని దేశాలు ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆక్షేపించారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇంటర్నెట్ అనే ఆలోచనను తప్పుగా అర్థం చేసుకుంటున్నాయని చెప్పారు. నిజానికి దీనివల్ల అనర్థాల కంటే మంచే ఎక్కువగా జరుగుతుందని సూచించారు. సమాచార వ్యాప్తి చుట్టూ గోడలు కట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. సమాచార ప్రవాహాన్ని అడ్డుకోరాదని చెప్పారు. భారత్‌లో సోషల్ మీడియా వేదికలు, వార్తా ప్రచురణ సంస్థలు, ఓటీటీ వెబ్సైట్లు, గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లపై నియంత్రణ విధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల భద్రత కోసమే ఈ నిబంధనలని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ నిబంధనలు వినియోగదారుల గోప్యత, వాక్ స్వాతంత్య్రపు హక్కుకు భంగం కలిగించేలా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ చట్టాలను తాము గౌరవిస్తామని, నిబంధనలు పాటిస్తామని సుందర్ పిచాయ్ గతంలోనే స్పష్టం చేశారు. -
చౌక స్మార్ట్‌ఫోన్ కోసం జియో, గూగుల్ కసరత్తు
న్యూఢిల్లీ: అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లను రూపొందించడంపై దేశీ టెలికం దిగ్గజం జియోతో కలిసి పనిచేస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయని ఆసియా పసిఫిక్ విలేకరులతో వర్చువల్ సమావేశంలో ఆయన వివరించారు. అయితే, ఎప్పుడు ప్రవేశపెట్టేదీ, ధర ఎంత ఉంటుందీ వంటి అంశాలను ఆయన వెల్లడించలేదు. చౌక డేటా రేట్లకు చౌక స్మార్ట్ఫోన్లు కూడా తోడైతే ఇంటర్నెట్ను దేశవ్యాప్తంగా మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు తోడ్పడనుంది. ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) కింద కేటాయించిన 10 బిలియన్ డాలర్ల నిధులను వినియోగించేందుకు ఉపయోగపడే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పిచాయ్ పేర్కొన్నారు. టెక్నాలజీలో కృత్రిమ మేథస్సు సాధనాల వినియోగంలో నైతికత పాటించే విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం ఇవి ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, తమ సంస్థ ఈ అంశంలో పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) కింద కేటాయించిన 10 బిలియన్ డాలర్ల నిధులను (సుమారు రూ. 75,000 కోట్లు) వినియోగించేందుకు తోడ్పడే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చదవండి: జూలైలో అమెజాన్ కొత్త సీఈవో జెస్సీకి బాధ్యతలు -
H-1B Visa: భాగస్వాముల వీసాలకు గూగుల్ మద్దతు
వాషింగ్టన్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం కలిగిన వలసదారులైన హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు వర్క్ వీసాలు అందించేందుకు గూగుల్ సంస్థ మద్దతు ప్రకటించింది. ఈ విషయంపై ఇప్పటికే పలు సంస్థలు సానుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ సైతం ఈ జాబితాలో చేరింది. అమెరికాకు వచ్చే వలసదారులకు గూగుల్ మద్దతుగా ఉంటుందని ఆ సంస్థ సీఈవో సుందర్‌పిచాయ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్4ఈఏడీ(ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆవిష్కరణలు పెరిగి ఉద్యోగ సృష్టి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. Google is proud to support our nation’s immigrants. We joined 30 other companies to protect the H-4 EAD program which spurs innovation, creates jobs and opportunities, and helps families. https://t.co/AvmEbLve3C — Sundar Pichai (@sundarpichai) May 14, 2021 హెచ్4 వీసాల వల్ల ఉద్యోగాల్లో పోటీ తత్వం దెబ్బతింటోందని అక్కడి కోర్టులో దాఖలైన కేసులో గూగుల్ మరో 30 సంస్థల తరపున అఫిడవిట్ సమర్పించింది. హెచ్1బీ వీసాదారు కుటుంబసభ్యులకు అవకాశం కల్పించే వ్యవస్థను కోరుకుంటున్నామని పేర్కొంది. దాని ద్వారా సుమారు 90వేల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆ సంస్థ న్యాయ విభాగం ఉపాధ్యక్షురాలుకేథరిన్ లఖవేరా తెలిపారు. హెచ్1బీ వీసా కలిగిన వారు తమ భాగస్వామితో పాటు పిల్లలు కూడా అమెరికాలో ఉండేందుకు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అనుమతి ఇస్తుంది. ‘వలసదారులకు మద్దతుగా నిలిచేందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. మరో 30 సంస్థలతో కలిసి హెచ్4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాం. దీని వల్ల ఆవిష్కరణలు, ఉద్యోగ అవకాశాలుపెరుగుతాయి. ఈ కార్యక్రమం వారి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది’ అని పిచాయ్ ట్వీట్ చేశారు. అడోబ్, అమెజాన్, యాపిల్, ఈబే, ఐబీఎం, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, పేపాల్, ట్విటర్ సహా ఇతర కంపెనీలు హెచ్4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అనేక ఆంక్షలు విధించారు. ఇక జోబైడెన్ అధ్యక్షుడుఅయిన తర్వాత ట్రంప్ విధించిన నియమ నిబంధనలు, ఆంక్షలను ఉపసంహరించిన విషయం తెలిసిందే. చదవండి: భారతీయ టెక్కీలకు భారీ ఊరట -
మహిళా సాధికారతకు గూగుల్ తోడ్పాటు
న్యూఢిల్లీ: బాలికలు, మహిళల సాధికారత కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు 25 మిలియన్ డాలర్ల మేర గ్రాంటు ఇవ్వనున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్డాట్ఓఆర్జీ వెల్లడించింది. లాభాపేక్ష లేకుండా నిర్వహించే స్వచ్ఛంద సంస్థలు మొదలైనవి దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ జాక్వెలిన్ ఫుల్లర్ తెలిపారు. ఎంపికయ్యే సంస్థలకు ఒకోదానికి దాదాపు 2 మిలియన్ డాలర్ల దాకా నిధులు లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, భారత్‌లో తాము నిర్వహిస్తున్న ఇంటర్నెట్ సాథీ డిజిటల్ అక్షరాస్యత శిక్షణా కార్యక్రమంతో గణనీయ సంఖ్యలో మహిళలు లబ్ధి పొందినట్లు జాక్వెలిన్ వివరించారు. గడిచిన కొన్నేళ్లుగా భారత్‌లో ఔత్సాహిక వ్యాపారవేత్తలు, నవకల్పనల ఆవిష్కర్తలు, లాభాపేక్ష లేని సంస్థలకు తోడ్పాటు అందించేందుకు దాదాపు 40 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశామని ఆమె వివరించారు. ఇంటర్నెట్ సాథీ ప్రోగ్రాం అనుభవాలతో ’ఉమెన్ విల్’ పేరిట వెబ్ ప్లాట్‌ఫాంని రూపొందించినట్లు గూగుల్ ఇండియా సీనియర్ కంట్రీ మార్కెటింగ్ డైరెక్టర్ సప్నా చడ్ఢా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. టైలరింగ్, బ్యూటీ సర్వీసులు, హోమ్ ట్యూషన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన హాబీలను ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకునే మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు దీని ద్వారా అందగలవని ఆమె చెప్పారు. -
జెఫ్ బెజోస్ కు టెక్ దిగ్గజాల అభినందన
న్యూఢిల్లీ: ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ ఈ ఏడాది చివరలో అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకొని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగనున్నట్లు ప్రకటించారు. జెఫ్ బెజోస్ తీసుకున్న నిర్ణయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం అభినందించారు. అమెజాన్ తదుపరి సీఈఓ ఆండీ జాస్సీకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జెఫ్ బెజోస్ కు తన ఫీచర్ ప్రాజెక్ట్స్ డే వన్ ఫండ్, బెజోస్ ఎర్త్ ఫండ్ కు ఇండియన్-అమెరికన్ టాప్ ఎగ్జిక్యూటివ్ తన శుభాకాంక్షలు తెలిపారు.(చదవండి: అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం) Congrats @JeffBezos , best wishes for Day 1 and Earth fund. Congrats @ajassy on your new role! — Sundar Pichai (@sundarpichai) February 2, 2021 మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల: జెఫ్ బెజోస్, ఆండీ జాస్సీ మీరు కొత్త స్థానాలను చేపడుతున్నందుకు శుభాకాంక్షలు. గతంలో మీరు సాధించిన వాటికి తగిన అర్హత ఉంది అని అన్నారు. Congratulations to @JeffBezos and @ajassy on your new roles. A well-deserved recognition of what you have accomplished. — Satya Nadella (@satyanadella) February 2, 2021 27 ఏళ్ల క్రితం 1994లో మిస్టర్ బెజోస్ ఇంటర్నెట్లో పుస్తకాలు అమ్మెందుకు అమెజాన్‌ను ప్రారంభించిన బెజోస్.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు. ప్రస్తుత ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీగా అమెజాన్ నిలిచింది. బెజోస్ తరువాత అమెజాన్ సీఈఓ బాధ్యతలను స్వీకరించనున్న ఆండీ జాస్సీ ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అధిపతిగా ఉన్నారు. 1997లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన జాస్సీ అమెజాన్‌లో ఉద్యోగిగా చేరారు. బెజోస్‌కు టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. కాలక్రమంలో సంస్థలో కీలక వ్యక్తిగా ఎదిగారు. 2006లో అమెజాన్ వెబ్ సేవలకు నాయకత్వం వహిస్తూ, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలతో పోటీపడే స్థాయికి దాన్ని తీర్చిదిద్దిన ఘనత జాస్సీది. -
ప్రారంభ దశలోనే ఏఐ టెక్నాలజీ
న్యూఢిల్లీ: దేశంలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ప్రారంభ దశలోనే ఉందని.. దాని నిజమైన సామర్థ్యం అందుబాటులోకి రావడానికి మరో 10–20 ఏళ్ల కాలం పడుతుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. భవిష్యత్తులో కరోనా తరహా అంటు వ్యాధులు వైరస్‌లను పరిష్కరించడంలో ఏఐ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వర్చువల్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 ఎంత కల్లోలాన్ని సృష్టిస్తోందో అదే సమయంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పనితీరుకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా సాంకేతిక పురోగతి పునాదిపై ఆధారపడి టీకాల అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో కంప్యూటిక్, మిషన్ లెర్నింగ్, ఆల్గరిథం వంటి ఏఐ టెక్నాలజీ ఉపయోగపడగలవని.. కాకపోతే అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని పేర్కొన్నారు. వందల సంవత్సరాలలో జరిగిన ప్రపంచ విపత్తు సంఘటన అయిన కోవిడ్–19 గురించి ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో ఏఐ కీలకమైందని.. దీనికి ఎన్నో శాస్త్రీయ ఉదాహరణలున్నాయన్నారు. ‘‘ఏ ఒక్క దేశం కూడా ప్రపంచ విపత్తులను ఒంటరిగా పరిష్కరించలేదు. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి గ్లోబల్ పారిస్ ఒప్పందం ఉన్నట్టుగానే.. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతికత పరిజ్ఞానాల ద్వారా పెద్ద, దీర్ఘకాలిక భద్రతా సమస్యలను పరిష్కరించడానికి అన్ని దేశాలు కలిసి ముందుకు రావాలని’’ పిచాయ్ సూచించారు. -
‘మిస్టర్ బెజోస్.. మీరు మ్యూట్‌లో ఉన్నారు’
వాషింగ్టన్: డిజిటల్ యుగంలో ఆన్లైన్ వేదికలు, సోషల్ మీడియా ద్వారా విద్వేషం, హింసపూరిత వాతావరణం పెరిగిపోతుందన్న ఆరోపణల నేపథ్యంలో టెక్ దిగ్గజాలు అమెరికన్ సెనేట్ విచారణ కమిటీ ఎదుట హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో బుధవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తమ వాదనలు వినిపించారు. వీరిలో ఫేస్బుక్ కో-ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌లతో పాటు అమెజాన్ అధినేత, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో తొలి సారిగా ఈ మీటింగ్‌కు హాజరైన బెజోస్‌ను విచారణ కమిటీ.. అమెరికా కంపెనీల సాంకేతికత, సమాచారాన్ని చైనా ప్రభుత్వం చోరీ చేస్తుందా అని ప్రశ్నించగా ఆయన నుంచి స్పందన రాలేదు.(ఆన్లైన్ వేదికల దుర్వినియోగంపై ఆందోళన) ఈ క్రమంలో ఫ్లోరెడ్ రిపబ్లికన్ గ్రెగ్ స్ట్రేబ్.. ‘‘మిస్టర్ బెజోస్.. మీరు మ్యూట్‌లో ఉన్నారు’’అంటూ బెజోస్‌కు గుర్తు చేశారు. దీంతో వెంటనే తేరుకున్న బెజోస్.. అన్‌మ్యూట్ చేసి.. ‘‘క్షమించండి. కొన్ని ఖరీదైన వస్తువులకు సంబంధించిన నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారని విన్నాను. అయితే ఇందులో డ్రాగన్ ప్రభుత్వ ప్రమేయం ఉందో లేదో తెలియదు’’ అని బదులిచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఈ- కామర్స్ బిజినెస్ మ్యాన్‌కు అన్‌మ్యూట్ చేయాలనే విషయం తెలియదా లేదా ఆ సమయంలో స్నాక్స్ తినడానికి వెళ్లారా.. అదీ కాదంటే విచారణ కమిటీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారా’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంత మంది.. సైలెంట్‌గా ఉన్న సమయంలో ఆయన ఎన్ని మిలియన్ డాలర్లు సంపాదించారో అంటూ బెజోస్ సంపాదనను లెక్కలేసే పనిలో పడ్డారు. (2026 నాటికి జెఫ్ బెజోస్, మరి ముకేశ్ అంబానీ?) ఇప్పుడే చెప్పలేం ఇదిలా ఉండగా.. అమెరికా- చైనాల మధ్య వాణిజ్య, దౌత్య యుద్ధం ముదురుతున్న వేళ అగ్రరాజ్యం ఇప్పటికే డ్రాగన్ కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. డేటా చౌర్యానికి పాల్పడుతుందనే కారణంతో చైనీస్ కంపెనీ హువావేను నిషేధించడం సహా జాతీయ భద్రత దృష్ట్యా మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమైనట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం నాటి సమావేశంలో.. టెక్ దిగ్గజాలను అడిగిన పలు ప్రశ్నల్లో డ్రాగన్ ప్రస్తావన రావడం గమనార్హం. ఈ క్రమంలో తమకు సంబంధించిన సాంకేతికతను చైనా ప్రభుత్వం దొంగిలించిందన్న విషయంలో ప్రాథమిక నిర్దారణకు రాలేమని జుకర్‌బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. -
ఉద్యోగులకు గూగుల్ శుభవార్త..!
బెంగుళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. కానీ సాఫ్ట్వేర్ రంగం మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచే ఉద్యోగం) ద్వారా కొంత మేర నిలదొక్కుకుంది. అయితే మహమ్మారి తగ్గడానికి ఎంత సమయం పడుతుందో ఎపరు చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సాఫ్టవేర్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించబోతున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇది వరకు తమ ఉద్యోగుల క్షేమం కోసం ఈ ఏడాది డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని కల్పించింది. అయితే ఇంకా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని వచ్చే ఏడాది(2021, జూన్)సంవత్సరం వరకు పోడగించే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ ఉద్యోగులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌లో 2లక్షల మంది రిగ్యూలర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. దేశంలో పనిచేస్తున్న గూగుల్ ఉద్యోగులకు ఈ వెసలుబాటు వర్తించనుంది. అయితే గూగుల్‌కు దేశంలో బెంగుళూరు, హైదరాబాద్‌లో మంచి మార్కెట్ ఉంది. ఇటీవల గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దేశంలో 75,000కోట్ల డిజిటల్ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
భారత్‌కు గూగుల్ దన్ను!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా భారత్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఆవిష్కరించింది. వచ్చే 5–7 సంవత్సరాల్లో సుమారు రూ. 75 వేల కోట్లు (దాదాపు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇందుకోసం గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ ఏర్పాటును ప్రకటించారు. ’గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. భారత్‌పైనా, భారత డిజిటల్ ఎకానమీ భవిష్యత్‌పైనా తమ కంపెనీకి ఉన్న నమ్మకాన్ని తాజా పెట్టుబడులు ప్రతిబింబిస్తాయని పిచాయ్ తెలిపారు.‘గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. దీని ద్వారా వచ్చే 5–7 ఏళ్లలో భారత్‌లో రూ. 75,000 కోట్లు (సుమారు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తాం. ఈక్విటీ, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పన తదితర మార్గాల్లో ఈ పెట్టుబడులు ఉంటాయి‘ అని పిచాయ్ తెలిపారు. నాలుగు ప్రధానాంశాలపై దృష్టి... భారత్ డిజిటలీకరణకు తోడ్పడేలా ప్రధానంగా నాలుగు విభాగాల్లో ఈ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయని సుందర్ తెలిపారు. ప్రతి భారతీయుడికి తమ తమ ప్రాంతీయ భాషల్లో సమాచారం అందుబాటులో ఉండేలా చూసే ప్రాజెక్టు కూడా ఇందులో ఒకటని వివరించారు. అలాగే, ప్రత్యేకంగా భారత్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు, సర్వీసుల రూపకల్పనపైనా ఇన్వెస్ట్ చేయనున్నట్లు సుందర్ పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు డిజిటల్‌కు మళ్లేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తామన్నారు. చివరిగా సామాజిక శ్రేయస్సుకు తోడ్పడేలా వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలు మరింత మెరుగుపడేలా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని మరింత వినియోగంలోకి తేవడంపై దృష్టి పెడతామని సుందర్ తెలిపారు. భారత్ ప్రత్యేకం... ప్రస్తుతం భారతీయులు టెక్నాలజీ తమ దాకా వచ్చేంత వరకూ నిరీక్షించాల్సిన అవసరం ఉండటం లేదని.. కొత్త తరం టెక్నాలజీలు ముందుగా భారత్‌లోనే ఆవిష్కృతమవుతున్నాయని సుందర్ తెలిపారు. ‘భారత్‌తో పాటు యావత్ ప్రపంచం ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటోందని అనడంలో సందేహం లేదు. మన ఆరోగ్యాలు, మన ఆర్థిక వ్యవస్థలకు ఎదురైన పెను సవాళ్లు.. మన పనితీరును, జీవన విధానాలను పునఃసమీక్షించుకునేలా చేశాయి. అయితే, ఇలాంటి సవాళ్లే కొంగొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయి‘ అని ఆయన పేర్కొన్నారు. కొత్త తరం ఆవిష్కరణలతో ప్రయోజనం పొందడం మాత్రమే కాదు.. వాటి రూపకల్పనలోనూ భారత్ ముందుండేలా చూడటం తమ లక్ష్యమని సుందర్ చెప్పారు. ముందుగా భారత్ కోసం ఉత్పత్తులు తయారు చేయడమన్నది.. మిగతా ప్రపంచ దేశాలకు మరింత మెరుగైన ఉత్పత్తులను అందించే దిశలో గూగుల్‌కు ఎంతగానో ఉపయోగపడిందని గూగుల్ చీఫ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో పిచాయ్ భేటీ... డేటా భద్రత, ఆన్లైన్ విద్య తదితర అంశాలపై చర్చ ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోమవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. డేటా భద్రత, గోప్యతపై సందేహాలు, రైతాంగానికి సాంకేతికతను మరింతగా చేరువ చేయడం, ఆన్లైన్ విద్య విధానాన్ని విస్తరించడం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ‘డేటా భద్రతపై సందేహాలను పారద్రోలేందుకు టెక్ కంపెనీలు మరింతగా కృషి చేయాలని ప్రధాని సూచించారు. అలాగే, సైబర్ దాడుల ద్వారా జరిగే సైబర్ నేరాలు, ముప్పుల గురించి ప్రస్తావించారు. రైతులకు టెక్నాలజీ ప్రయోజనాలు అందించడం, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలు వంటి అంశాలపై చర్చించారు. విద్యార్థులతో పాటు రైతులకు కూడా ఉపయోగపడేలా వర్చువల్ ల్యాబ్స్ ఏర్పాటు ఆలోచన గురించి ప్రస్తావించారు‘ అని పీఎంవో తెలిపింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం తీసుకుంటున్న చర్యలు మొదలైన అంశాలను ప్రధాని వివరించారు. కరోనా వైరస్ సంబంధ సమాచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలను అందించడంలోనూ .. అపోహలు, తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేయడంలోనూ గూగుల్ క్రియాశీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ‘సుందర్‌పిచాయ్‌తో భేటీలో రైతులు, యువత, ఔత్సాహిక వ్యాపారవేత్తల జీవితాలను మార్చగలగడంలో టెక్నాలజీ వినియోగం గురించి చర్చించాం‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘సమావేశానికి సమయం కేటాయించినందుకు మీకు కృతజ్ఞతలు. డిజిటల్ ఇండియాకి సంబంధించి మీ విజన్‌ను సాకారం చేసే దిశగా మేము కూడా కృషి చేయడం కొనసాగిస్తాం‘ అని ప్రతిగా సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. మరిన్ని భాగస్వామ్యాలు.. భారత మార్కెట్లో ప్రణాళికల్లో భాగంగా ప్రసార భారతితో కూడా జట్టు కడుతున్నట్లు గూగుల్ తెలిపింది. డిజిటల్ సాధనాలతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలను మల్చుకునేలా చిన్న సంస్థల్లో అవగాహన పెంచేందుకు దూరదర్శన్‌లో ఎడ్యుటెయిన్‌మెంట్ సిరీస్‌ను ప్రారంభించింది. అలాగే, 2020 ఆఖరు నాటికి భారత్‌లో 22,000 పైచిలుకు పాఠశాల్లో 10 లక్షల మంది పైగా ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు సీబీఎస్ఈతో జట్టుకట్టామని గూగుల్ వెల్లడించింది. ఇక గ్లోబల్ డిస్టెన్స్ లెర్నింగ్ ఫండ్ ద్వారా అల్పాదాయ వర్గాల కోసం కైవల్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌కు గూగుల్‌డాట్‌ఆర్గ్ ద్వారా మిలియన్ డాలర్లు గ్రాంట్ అందిస్తున్నట్లు పేర్కొంది. చిన్న సంస్థల డిజిటలీకరణ.. చిన్న వ్యాపార సంస్థలు డిజిటల్ బాట పట్టడంలో గూగుల్ గణనీయంగా తోడ్పాటు అందిస్తోందని సుందర్ చెప్పారు. ప్రస్తుతం 2.6 కోట్లకు పైగా ఎస్‌ఎంబీలను (చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు) సెర్చి, మ్యాప్స్‌లో చూడవచ్చని, వీటికి ప్రతి నెలా 15 కోట్ల మంది పైగా యూజర్లు ఉంటున్నారని ఆయన వివరించారు. కరోనా వల్ల డిజిటల్ సాధనాల వినియోగం మరింత పెరిగిందన్నారు. ‘మా బామ్మకు కూరగాయల వాళ్లతో బేరాలడటం కుదరకపోవడం అనే ఒక్క లోటు తప్ప..లాక్డౌన్ వేళ వివిధ ఉత్పత్తులు, సర్వీసులను పొందేందుకు డిజిటల్ చెల్లింపుల విధానం బాగా ఉపయోగపడింది’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. -
యూజర్లకు గూగుల్ గుడ్‌న్యూస్
కొత్తగా గూగుల్(మెయిల్) ఉపయోగించేవారికి సెర్చ్ ఇంజన్ దిగ్గజం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై వారి లోకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్ కాబోతుంది. ఈ మేరకు గూగుల్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన గూగుల్ బ్లాగ్ ద్వారా వివరించారు. ‘మేం ఏదైనా ప్రొడక్ట్‌ను రూపొందిచేటప్పుడు ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుంటాం. మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, బాధతాయుతంగా ఉండటం, నియంత్రణలో ఉంచడం. ఈ విషయంలో మరింత భద్రతను కల్పించడం కోసం గూగుల్ సరికొత్త ఆవిష్కరణను ఈ రోజు మీ ముందుకు తీసుకు వచ్చింది. డేటాకు సంబంధించి కొన్ని మార్పులు చేశాం’ అని తెలిపారు. (గూగుల్ @కరోనా సెంటర్) ఇక నుంచి గూగుల్ యూజర్ హిస్టరీ 18 నెలల తరువాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. డేటాను డిలీట్ చేయాలనుకుంటే ఇప్పటి వరకు ఆ పనిని మాన్యువల్‌గా చేయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు ఆటోమేటిక్‌గా డిలీట్ కానుంది. ఇది గూగుల్ అకౌంట్ కొత్తగా వాడటం మొదలుపెట్టిన వారికి మాత్రమే వర్తిస్తుందని గూగుల్ వర్గాలు తెలిపాయి. పాత యూజర్లకు కూడా డేటాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ- మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. వారు ఎంచుకునే ఆప్షన్ బట్టి డేటా మూడు నెలలకొకసారి లేదా 18 నెలల కొకసారి ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుందని గూగుల్ వర్గాలు తెలిపాయి. దీంతో వినియోగదారుల భద్రత మరింత పెరిగే అవకాశం ఉందని గూగుల్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న వినియోగదారుల సెట్టింగ్స్‌ను గూగుల్ మార్చబోవడం లేదని కూడా తెలిపారు. ఈ ఆటోమెటిక్ డిలిట్ ఆప్షన్ జీ మెయిల్, గూగుల్ డ్రైవ్‌కు వర్తించదని వారు తెలిపారు. (అందుకే మిట్రాన్ యాప్ తొలగించాం: గూగుల్) -
కార్పొరేట్ కథానాయకులు
భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగానే ఉంటారు. తమ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దొరికిన అవకాశాలను అందింపుచ్చుకుని, అత్యున్నత శిఖరాలకు చేరుకున్న వాళ్లలో భారతీయులే ఎక్కువగా కనిపిస్తారు. బహుళజాతి కార్పొరేట్ దిగ్గజ సంస్థల పగ్గాలను చేపట్టి, విజయపథంలో వాటికి సారథ్యం వహిస్తున్న వాళ్లలో మన భారతీయులే ముందంజలో ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, నోకియా, మొటొరోలా వంటి బడా బడా సంస్థలకు అధినేతలు మనోళ్లే... ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారీ కార్పొరేట్ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల గురించి ఈ వారం ప్రత్యేక కథనం... సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంప్యూటర్లు ఉపయోగించే వారందరికీ చిరపరిచతమైన పేరు ‘మైక్రోసాఫ్ట్’. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ నెలకొల్పిన ప్రతిష్ఠాత్మక మైక్రోసాఫ్ట్ సంస్థకు మన తెలుగువాడైన సత్య నాదెళ్ల సీఈవోగా పనిచేస్తున్నారు. సత్య నాదెళ్ల హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి యుగంధర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. పాఠశాల విద్యను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కొనసాగించారు. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఈ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొంతకాలం సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేశాక, 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. మైక్రోసాఫ్ట్‌లోని వివిధ విభాగాలను విజయవంతంగా నిర్వహించి, తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తర్వాత సీఈవోగా పనిచేసిన స్టీవ్ బాల్మెర్ 2014లో వైదొలగిన తర్వాత, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ పగ్గాలను చేపట్టారు. ‘ఫైనాన్షియల్ టైమ్స్’. పత్రిక 2019 సంవత్సరానికి గాను సత్య నాదెళ్లను ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. సత్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ ఏడాదికేడాది వృద్ధి రేటును పెంచుకుంటూ దూసుకుపోతోంది. సాంకేతిక పరిజ్ఞానమే ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని సత్య నాదెళ్ల బలంగా నమ్ముతారు. తన జీవితానుభవాలను పంచుకుంటూ ఆయన రాసిన ‘హిట్ రిఫ్రెష్’ యువతరం పాఠకులకు అమితంగా స్ఫూర్తినిస్తోంది. సుందర్ పిచయ్ గూగుల్ ఇంటర్నెట్ యుగంలో గూగుల్ లేనిదే ఎవరికీ గడవదు. గూగుల్ సంస్థకు, గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ ఇన్కార్పొరేషన్ సంస్థకు సుందర్ పిచయ్ సీఈవోగా ఉన్నారు. తమిళనాడులోని మదురైలో పుట్టిన సుందర్ పిచయ్, స్కూలు చదువు మద్రాసులో కొనసాగింది. తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తి చేశారు. తర్వాత అమెరికా చేరుకుని, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అమెరికాలోని మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ‘మెక్ కిన్సీ అండ్ కంపెనీ’లో కెరీర్ ప్రారంభించారు. తర్వాత 2004లో గూగుల్‌లో చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఆండ్రాయిడ్’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో పదవికి సుందర్ పిచయ్ పేరు కూడా పరిగణనలోకి వచ్చినా, చివరకు ఆ పదవి సత్య నాదెళ్లకు దక్కింది. అయితే, గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన లారీ పేజ్ సీఈవో బాధ్యతల నుంచి వైదొలగుతూ, తన వారసుడిగా సుందర్ పిచయ్ని 2015 ఆగస్టులో ప్రకటించారు. గూగుల్ హోల్డింగ్ కంపెనీ ‘ఆల్ఫాబెట్’ రూపకల్పన పూర్తయిన తర్వాత అదే ఏడాది అక్టోబరులో సుందర్ పిచయ్ ‘అల్ఫాబెట్’, ‘గూగుల్’లకు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. చైనాలో 2017లో జరిగిన వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్‌లో సుందర్ పిచయ్ గూగుల్ సీఈవో హోదాలో పాల్గొని ప్రసంగించారు. అరవింద్ కృష్ణ ఐబీఎం కంప్యూటర్ల తయారీ రంగంలో అతి పురాతనమైన సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్ (ఐబీఎం). దాదాపు శతాబ్ది చరిత్ర కలిగిన ఐబీఎం సీఈవోగా అరవింద్ కృష్ణ ఎంపికయ్యారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 6న ఐబీఎం సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీతో ఐబీఎంకు భారీ ఒప్పందం కుదర్చడంలో అరవింద్ కృష్ణ కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్ కృష్ణ, ఐఐటీ కాన్పూర్ నుంచి బీటెక్ చేశారు. అమెరికాలోని ఇల్లినాయీ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. అరవింద్ కృష్ణ తండ్రి విజయ్ కృష్ణ భారత సైన్యంలో మేజర్ జనరల్‌గా పనిచేశారు. ఐబీఎంలో 1990లో చేరిన అరవింద్ కృష్ణ, సుదీర్ఘకాలం అదే సంస్థలో కొనసాగుతూ, అనతి కాలంలోనే ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఐబీఎంకు గల సుదీర్ఘ చరిత్రలో ఒక భారతీయుడు సీఈవో పదవికి ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఐబీఎం ప్రస్తుత సీఈవో జిన్నీ రోమెట్టీ నుంచి కొద్దిరోజుల్లోనే బాధ్యతలు చేపట్టనున్న అరవింద్ కృష్ణ, ఐబీఎంకు మరిన్ని విజయాలను చేకూర్చిపెడతారని ఆశించవచ్చు. అజయ్‌పాల్ సింగ్ బంగా మాస్టర్‌కార్డ్ అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ ‘మాస్టర్‌కార్డ్’కు అజయ్‌పాల్ సింగ్ బంగా సీఈవోగా సేవలందిస్తున్నారు. మహారాష్ట్రలోని పుణే సమీపంలోని ఖడ్కే పట్టణంలో బంగా పుట్టారు. పంజాబ్‌లోని జలంధర్‌లో మూలాలు గల ఆయన తండ్రి హర్భజన్‌సింగ్ బంగా ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్‌గా పని చేశారు. తండ్రి ఆర్మీ ఉన్నతాధికారి కావడంతో అజయ్ బంగా చదువు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు జలంధర్, సిమ్లా, ఢిల్లీలలో స్కూలు చదువు కొనసాగింది. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో బీఏ ఆనర్స్ చేశాక, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. నెస్లే కంపెనీలో 1981లో తొలి ఉద్యోగం చేశారు. ఆ తర్వాత వివిధ సంస్థల్లో సేల్స్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. తర్వాత పెప్సీకోలో చేరి, భారత్‌లో పెప్సీకి చెందిన ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజీలను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. న్యూయార్క్ హాల్ ఆఫ్ సైన్స్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆర్థిక సాంకేతిక రంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో విస్తృతంగా ప్రసంగాలు చేస్తూ ప్రముఖ స్థానానికి చేరుకున్నారు. అమెరికన్ టీవీ ప్రముఖుడు జిమ్ క్రామర్ నిర్వహించే ‘మ్యాడ్ మనీ’ షోలో కూడా పాల్గొన్నారు. మాస్టర్‌కార్డ్ సీఈవోగా 2010లో బాధ్యతలు చేపట్టి, ‘మాస్టర్‌కార్డ్’ను విజయాల బాటలో నడిపిస్తున్నారు. రాజీవ్ సూరి నోకియా సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో ఎక్కువ మంది చేతిలో కనిపించేవి ‘నోకియా’ ఫోన్లే! ఫిన్లాండ్కు చెందిన బహుళజాతి సంస్థ నోకియా కార్పొరేషన్‌కు సీఈవోగా రాజీవ్ సూరి సారథ్యం వహిస్తున్నారు. రాజీవ్ సూరి ఢిల్లీలో పుట్టారు. కువైట్‌లో ఆయన స్కూల్ చదువు కొనసాగింది. తర్వాత మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఈ పూర్తి చేశారు. కెరీర్ తొలినాళ్లలో భారత్‌లోను, నైజీరియాలోను కొన్ని బహుళజాతి సంస్థల్లో కొంతకాలం పనిచేశాక 1995లో నోకియాలో చేరారు. 2004 నాటికి నోకియా కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్ సీఈవో స్థాయికి ఎదిగారు. పశ్చిమాసియా, ఆఫ్రికా, యూరోప్ దేశాలలో నోకియా మార్కెట్‌ను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. సంస్థలోని సమస్యలను పరిష్కరించడంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, 2014లో నోకియా కార్పొరేషన్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. శంతను నారాయణ్ అడోబ్ దేశ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే బడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన అడోబ్‌కు సీఈవోగా శంతను నారాయణ్ 2007 నుంచి కొనసాగుతున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శంతను నారాయణ్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఈ చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి, కాలిఫోర్నియా వర్సిటీ నుంచి ఎంబీఏ, బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తి చేశారు. కంప్యూటర్ల తయారీ సంస్థ ‘ఆపిల్’తో కెరీర్ ప్రారంభించిన శంతను నారాయణ్, కొందరు మిత్రులతో కలసి ‘పిక్ట్రా’ సంస్థను నెలకొల్పారు. డిజిటల్ ఫొటోలను ఇంటర్నెట్ ద్వారా షేర్ చేసే వెసులుబాటును తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఘనత ‘పిక్ట్రా’ సంస్థకే దక్కుతుంది. తర్వాత ఆయన 1998లో అడోబ్ సంస్థలో వైస్‌ప్రెసిడెంట్ హోదాలో చేరారు. బరాక్ ఒబామా హయాంలో 2011లో మేనేజ్మెంట్ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యారు. ఫొటోషాప్, పీడీఎఫ్, ఆక్రోబాట్ వంటి అడోబ్ ఉత్పత్తుల విజయం వెనుక కీలక పాత్ర పోషించిన శంతను నారాయణ్, అనతి కాలంలోనే సీఈవో స్థానానికి చేరుకున్నారు. ‘ఎకనామిక్ టైమ్స్’ 2018లో శంతను నారాయణ్‌ను ‘గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్’గా గుర్తించింది. ప్రస్తుతం ఆయన అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. జయశ్రీ ఉల్లాల్ అరిస్టా నెట్వర్క్స్ క్లౌడ్ నెట్వర్కింగ్ కంపెనీ అయిన అరిస్టా నెట్వర్క్స్కు జయశ్రీ ఉల్లాల్ సీఈవోగా సారథ్యం వహిస్తున్నారు. లండన్‌లో పుట్టిన జయశ్రీ ఉల్లాల్ పాఠశాల విద్య ఢిల్లీలో కొనసాగింది. తర్వాత శాన్ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ నుంచి బీఎస్, శాంటా క్లారా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సెమీ కండక్టర్ వస్తువులను తయారు చేసే అమెరికన్ బహుళ జాతి సంస్థ అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ (ఏఎండీ) నుంచి తన కెరీర్ ప్రారంభించారు. కొంతకాలం ఫెయిర్ చైల్డ్ సెమీకండక్టర్ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు. తర్వాత కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ యూబీ నెట్‌వర్క్స్‌లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, 2008 నాటికి అరిస్టా నెట్వర్క్స్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అరిస్టా నెట్వర్క్స్ వ్యవస్థాపకులైన ఆండీ బెక్టాల్షీమ్, డేవిడ్ షెరిటన్లు ఏరి కోరి మరీ జయశ్రీ ఉల్లాల్‌ను ఈ పదవికి ఎంపిక చేశారు. ఆమె సారథ్యంలో అరిస్టా నెట్వర్క్స్ ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది. నెట్ వర్కింగ్ సంస్థల్లో పనిచేసే ఐదుగురు ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా జయశ్రీ ఉల్లాల్‌ను ‘ఫోర్బ్స్’ పత్రిక 2014లో ఎంపిక చేసింది. దినేష్ పాలీవాల్ హర్మాన్ ఆడియో, వినోద సమాచార సాధనాలను తయారు చేసే బహుళజాతి సంస్థ హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్‌కు దినేష్ పాలీవాల్ సీఈవోగా సేవలందిస్తున్నారు. ఆగ్రాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన దినేష్ పాలీవాల్ చిన్నప్పటి నుంచి చదువులో అసమాన ప్రతిభా పాటవాలు కనబరచేవారు. యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ (ప్రస్తుతం ఐఐటీ,రూర్కీ) నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఇంజనీరింగ్‌లో ఉన్నత చదువు కొనసాగించడానికి స్కాలర్షిప్ లభించడంతో అమెరికాలోని మయామీ యూనివర్సిటీలో చేరి, అక్కడ ఎంఎస్, ఎంబీఏ డిగ్రీలు పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, సింగపూర్, స్విట్జర్లాండ్లలో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేశారు. అంచెలంచెలుగా ఎదిగి, 2003లో హర్మాన్ ఇంటర్నేషనల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. పాలీవాల్కు మయామీ యూనివర్సిటీ గత ఏడాది గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్ 2017లో హర్మాన్ సంస్థను స్వాధీనం చేసుకున్నా, దినేష్ పాలీవాల్ను ఈ పదవిలో కొనసాగనిచ్చింది. ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అయితే, కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న మైకేల్ మాసర్కు సలహాదారుగా డిసెంబరు వరకు కొనసాగనున్నారు. జార్జ్ కురియన్ నెట్‌యాప్ థామస్ కురియన్ గూగుల్ క్లౌడ్ జార్జ్ కురియన్, థామస్ కురియన్ సోదరులు కవలలు. కేరళలోని కొట్టాయం జిల్లాలో పుట్టి పెరిగారు. ఇద్దరికీ ఐఐటీ మద్రాసులో సీటు దొరికినా, అక్కడ వారిద్దరూ చదువుకున్నది ఆరు నెలలు మాత్రమే. మరింత మెరుగైన చదువు కోసం, ఉన్నతమైన అవకాశాల కోసం ఈ కవల సోదరులిద్దరూ అమెరికా చేరుకుని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చేరి, బీఎస్ పూర్తి చేశారు. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కెరీర్ ప్రారంభంలో ఈ కవల సోదరులిద్దరూ ఒరాకిల్‌లో కొంతకాలం పనిచేశారు. తర్వాత ఇద్దరూ వేర్వేరు కంపెనీల్లో వివిధ హోదాల్లో పని చేశారు. జార్జ్ కురియన్ నెట్‌యాప్ సీఈవోగా 2015లో బాధ్యతలు చేపట్టగా, థామస్ కురియన్ 2019లో గూగుల్ క్లౌడ్ సీఈవో బాధ్యతలు చేపట్టారు. భారత్‌కు చెందిన ఇద్దరు కవల సోదరులు ప్రతిష్ఠాత్మకమైన రెండు వేర్వేరు బహుళ జాతి సంస్థలకు సీఈవోలుగా ఎదగడం విశేషం. సంజయ్ మెహ్రోత్రా మైక్రాన్ టెక్నాలజీ కంప్యూటర్స్ మెమొరీ స్టోరేజ్ పరికరాల సంస్థ మైక్రాన్ టెక్నాలజీకి సంజయ్ మెహ్రోత్రా 2017 నుంచి సారథ్యం వహిస్తున్నారు. సంజయ్ మెహ్రోత్రా స్కూలు చదువు ఢిల్లీలో కొనసాగింది. తర్వాత బిట్స్ పిలానీలో చేరినా, కొద్ది కాలానికే అక్కడి నుంచి కాలిఫోర్నియా వర్సిటీకి బదిలీ అయి, అక్కడ కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీలు సాధించారు. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సు చేశారు. కెరీర్ తొలినాళ్లలో 1988లోనే ఆయన తన మిత్రులతో కలసి కంప్యూటర్ మెమొరీ స్టోరేజ్ పరికరాల ఉత్పాదన సంస్థ శాన్డిస్క్ను నెలకొల్పారు. శాన్డిస్క్ సీఈవోగా 2011 నుంచి 2016 వరకు కొనసాగారు. కంప్యూటర్ స్టోరేజ్ పరికరాల రూపకల్పనలో విశేషమైన పరిశోధనలు సాగించిన మెహ్రోత్రా ఏకంగా 70 పేటెంట్లను సొంతం చేసుకున్నారు. సిలికాన్ వ్యాలీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫౌండేషన్ మెహ్రోత్రాను 2013లో ‘సీఈవో ఆఫ్ ది ఇయర్’గా గుర్తించి, సత్కరించింది. ఇదివరకటి సారథులు వీరే... ప్రస్తుతం వివిధ బహుళ సంస్థల సీఈవోలుగా కొనసాగుతున్న భారతీయుల గురించి తెలుసుకున్నాం సరే, సమీప గతంలోనే కొందరు భారతీయులు కొన్ని బహుళజాతి సంస్థలకు సారథ్యం వహించి తమదైన ముద్ర వేశారు. అలాంటి వారిలో పెప్సీకోకు సారథ్యం వహించిన ఇంద్రా నూయీ అగ్రస్థానంలో నిలుస్తారు. మద్రాసులో పుట్టి పెరిగిన నూయీ తన కెరీర్‌ను భారత్‌లోనే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ద్వారా ప్రారంభించారు. ఆమె పెప్సీకో సీఈవోగా 2006 నుంచి 2018 వరకు కొనసాగారు. ప్రస్తుతం ఆమె పెప్సీకో చైర్‌వుమన్‌గా కొనసాగుతున్నారు. ఇక సంజయ్‌కుమార్ ఝా ప్రముఖ మొబైల్ఫోన్ల తయారీ సంస్థ ‘మోటొరోలా’కు, ‘గ్లోబల్ ఫౌండ్రీస్’కు సీఈవోగా పనిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్, యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్లలో ఇంజనీరింగ్ పోస్ట్‌గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ చేసిన సంజయ్‌కుమార్ ఝాను అమెరికా ప్రభుత్వం 2018లో యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో కీలక పదవిలో నియమించింది. ఇదిలా ఉంటే, ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ సీఈవోగా భారత సంతతికి చెందిన ఫ్రాన్సిస్కో డిసౌజా 2007 నుంచి 2019 వరకు సేవలందించారు. డిసౌజా తండ్రి ఐఎఫ్ఎస్ అధికారి. ఆయన కెన్యాలో విధులు నిర్వర్తిస్తున్న కాలంలో ఫ్రాన్సిస్కో డిసౌజా నైరోబీలో పుట్టారు. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆసియాలలో బిజినెస్ మేనేజ్మెంట్లో ఉన్నత చదువులు చదువుకున్నారు. – పన్యాల జగన్నాథదాసు -
పిచాయ్ని టచ్ చేసిన అమ్మాయ్!
ఆ ట్వీట్ దగ్గర సుందర్ పిచాయ్ కళ్లు ఆగిపోయాయి! గూగుల్ సీఈవో ఆయన. అంతటి మనిషిని పట్టి ఆపిన ట్వీట్ అంటే.. అది మామూలు ట్వీట్ అయి ఉండదు అనుకుంటాం. కానీ అతి మామూలు ట్వీట్ అది. ‘నాలుగేళ్ల క్రితం.. క్వాంటమ్ ఫిజిక్స్ పరీక్షలో నాకు జీరో మార్కులు వచ్చాయి. వెంటనే మా ప్రొఫెసర్ని కలిశాను. సర్, ఫిజిక్స్‌ని వదిలేసి ఇంకో సబ్జెక్ట్ తీసుకోనా అని అడిగాను. అదే నయమేమో అన్నట్లు ఆయనా చూశారు. కానీ ఈరోజు నేను ఆస్ట్రోఫిజిక్స్‌లో పీహెడ్.డి. పూర్తి చేశాను. రెండు అధ్యయన పత్రాలు సమర్పించాను. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) ఎవరికైనా కొరుకుడు పడనిదే. గ్రేడ్ తక్కువ వచ్చినంత మాత్రాన వదిలేయనవసరం లేదు’ అని శారాఫినా నాన్స్ అనే యువతి చేసిన ట్వీట్ అది. పిచాయ్ని ఆకట్టుకుంది. వెంటనే ‘‘వెల్ సెడ్ అండ్ సో ఇన్స్పైరింగ్’’ అంటూ ఆమెను అభినందిస్తూ ట్వీట్ పెట్టారు. ఓటమి అంటే గెలవలేకపోవడం కాదు. గెలిచేవరకు ప్రయత్నించక పోవడం. -
వారి నమ్మకాన్ని కాపాడతాం: సుందర్ పిచాయ్
వాషింగ్టన్: వివాదాస్పద అంశాల చర్చ విషయంలో తమ కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొంటోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ప్రయాణ నిషేధ నిర్ణయాన్ని సమర్థించిన సెక్యూరిటీ అధికారి మైల్స్ టేలర్‌ను గూగుల్ నియమించడాన్ని సమర్థించారు. తాజాగా పిచాయ్ మాట్లాడుతున్న ఓ వీడియో లీకైంది. గురువారం పిచాయ్, నిపుణుల సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ముఖ్యంగా కొంతమంది ఉద్యోగుల నమ్మకాన్ని సంస్థ కోల్పోయిందని అంగీకరించారు. ఉద్యోగుల అసంతృప్తిని పరిష్కరించే మార్గాలను చర్చించారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కరన్ భాటియా మాట్లాడుతూ టైలర్‌ను ఇమ్మిగ్రేషన్ పాలసీలో కాకుండా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, జాతీయ భద్రతను పెంపొందించే అంశాలలో అతని సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో ఉద్యోగులు వివాదాస్పద రాజకీయ అంశాలను, కించపరిచే అంశాలను చర్చించొద్దని ఈ వేసవిలో కంపెనీ ఓ మెమోను జారీ చేసింది. అయితే ఎప్పటకప్పుడు ఉద్యోగుల ఫోరమ్‌లను పర్యవేక్షిస్తామని తెలిపింది. గూగుల్ అధికారి బరోసో మాట్లాడుతూ ఫోరమ్‌ల కంటే సాఫ్టవేర్‌ను ఉపయోగించుకొని సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. కంపెనీలో అసభ్య ప్రవర్తన, రహస్య సమాచారాన్ని లీక్ చేయడం స్పష్టమైన కంటెంట్ లేకపోవడం వంటి అంశాలను సాఫ్టవేర్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. -
దిమ్మ తిరిగే స్పీడుతో కంప్యూటర్
పారిస్: సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లు 10 వేల యేళ్లలో గణించగల గణనలను కేవలం 200 సెకన్లలో సాధించిన కొత్త కంప్యూటర్ ‘సికామోర్ మెషీన్’ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఇది సూపర్ కంప్యూటర్లకంటే కోట్ల రెట్ల వేగంతో పని చేసిందని బుధవారం తెలిపారు. ఈ తరహా వేగాన్ని ‘క్వాంటమ్ సుప్రిమసీ’ అంటారు. గూగుల్ సంస్థకు చెందిన పరిశోధనా బృందం దీన్ని తయారు చేస్తోంది. సాధారణ కంప్యూటర్లు ప్రతి విషయాన్ని బైనరీల రూపంలో (1, 0) అర్థం చేసుకుంటాయి. ఇందులోనూ అదే పద్ధతి ఉన్నా రెంటినీ ఒకేసారి తీసుకోగలదు. సాధారణ కంప్యూటర్లు సమాచారాన్ని బిట్స్ రూపంలో తీసుకుంటుండగా, సికామోర్ క్యూబిట్స్ రూపంలో తీసుకుంటుంది. ఇందులోని క్వాంటమ్ ప్రాసెసర్ 54 క్యూబిట్స్ సామర్థ్యంతో తయారైంది. తమ సంస్థకు చెందిన ఉద్యోగులు దీన్ని నిర్మించడం తమకు గర్వకారణమని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్‌చేశారు. -
ఒకే వేదికపై సచిన్, సుందర్ పిచాయ్
బర్మింగ్‌హామ్ : భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒకే వేదికపై కనిపించి అభిమానులను అలరించారు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ మధ్య ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను వీరుద్దరూ తిలకించారు. సచిన్, పిచాయ్ పక్క పక్కనే కూర్చొని మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోను.. బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ఈ ఫొటోపై అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి : తగిలింది తొలి షాక్) గూగుల్‌లో పిచాయ్ క్రికెట్ స్కోర్ వివరాలు అప్డేట్ చేస్తున్నారని ఒకరు.. టెక్నాలజీ, స్పోర్ట్స్ జతకలిసి వచ్చే కొత్త తరానికి క్రికెట్ పాఠాలు నేర్పాలి అని మరొకరు కామెంట్ చేశారు. ఇంతకూ ఈ ఇద్దరూ లెజెండ్స్ ఏం మాట్లాడుకున్నారబ్బా అని మరో నెటిజన్ ఉత్సాహం చూపించాడు. కాగా మ్యాచ్‌కు ముందు యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పిచాయ్ భారత్, ఇంగ్లండ్ దేశాలు ప్రపంచకప్ ఫైనల్ చేరాలని ఆకాక్షించారు. చిన్నతనంలో క్రికెటర్ కావాలని కలలు కనేవాడినని.. సునీల్ గవాస్కర్, సచిన్‌ను ఆరాధించేవాడినని చెప్పుకొచ్చారు. ఇక భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
‘విద్వేష వీడియోలపై విధానంలో కీలక మార్పులు’
వాషింగ్టన్ : యూట్యూబ్‌లో విద్వేష ప్రసంగాల వీడియోలపై తమ విధానంలో కీలక మార్పులు చేశామనీ, గత త్రైమాసికంలో ఏకంగా 90 లక్షల వీడియోలను తొలగించామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోమవారం చెప్పారు. అయితే తాము చేయాల్సింది ఇంకెంతో ఉందని ఆయన అన్నారు. విద్వేషపూరిత, వివాదసహిత, పూర్ణాధిపత్య ధోరణితో ఉన్న వీడియోలను తొలగించేందుకు యూట్యూబ్ ప్రయత్నించినప్పటికీ, ఆ వీడియోలు మళ్లీ మళ్లీ కనిపించడంతో గత రెండేళ్లుగా ఆ కంపెనీపై ఉగ్రహం వ్యక్తం అవుతుండటం తెలిసిందే. సీఎన్ఎన్తో పిచాయ్ మాట్లాడుతూ ‘పరిస్థితిని చక్కదిద్దేందుకు మేం చాలా కష్టిస్తున్నాం. యూట్యూబ్ వాడకంలో మార్పులను బట్టి ప్రతీ కొన్ని సంవత్సరాలకోసారి పరిణామం చెందాలని మేం అనుకుంటాం. గత వారమే విద్వేష పూరిత వీడియోలపై మా విధానాలను సవరించాం. -
భారత్ కీలకం..
వాషింగ్టన్ : టెక్ దిగ్గజం గూగుల్ కొంగొత్త ఉత్పత్తులు ఆవిష్కరించడంలోనూ, అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో వాటిని ప్రవేశపెట్టడంలోనూ భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణం పరంగా భారత్ చాలా భారీ మార్కెట్ కావడంతో ఇక్కడిలాంటి ప్రయోగాలు చేయటం గూగుల్‌కు సాధ్యమవుతోంది. అమెరికా, ఇండియా వ్యాపార మండలి (యూఎస్ఐబీసీ) నిర్వహించిన ‘ఇండియా ఐడియాస్’ సదస్సులో పాల్గొన్న సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ ఈ విషయాలు చెప్పారు. పాలనను, సామాజిక.. ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడానికి భారత ప్రభుత్వం టెక్నాలజీని అద్భుతంగా వినియోగించుకుంటోందని ఆయన కితాబిచ్చారు. ఇందులో తాము కూడా భాగస్వాములం కావడం సంతోషదాయకమన్నారు. ‘భారత మార్కెట్ భారీ పరిమాణం కారణంగా ముందుగా అక్కడ కొత్త ఉత్పత్తులు, సాధనాలు రూపొందించేందుకు, ఆ తర్వాత ఇతర దేశాల్లో ప్రవేశపెట్టేందుకు మాకు వీలుంటోంది. ముఖ్యంగా గత మూడు, నాలుగేళ్లుగా ఈ ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. ప్రస్తుతం భారత్ క్రమంగా డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లుతోంది. దీంతో చెల్లింపుల సాధనాలను ప్రవేశపెట్టడానికి భారత్ సరైన మార్కెట్ అని మేం భావించాం. ఇది నిజంగానే మంచి ఫలితాలు కూడా ఇచ్చింది. ఇలా భారత మార్కెట్ కోసం రూపొందించిన సాధనాన్ని ప్రస్తుతం ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి తేవడంపై మా టీమ్ కసరత్తు చేస్తోంది‘ అని పిచయ్ పేర్కొన్నారు. ఫోన్ల ధరలను తగ్గించి, మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తూనే ఉందన్నారు. 2004లో భారత్‌లో రెండు దేశీ తయారీ సంస్థలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు 200 పైచిలుకు ఉన్నాయని పిచయ్ చెప్పారు. మరోవైపు, డేటా ప్రైవసీని కాపాడేందుకు అనుసరించాల్సిన ప్రమాణాల రూపకల్పనలో భారత్, అమెరికా కీలక పాత్ర పోషించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ వాణిజ్య లావాదేవీలకు సమాచార మార్పిడి స్వేచ్ఛగా జరగడం ప్రధానమని, అయితే అదే సమయంలో యూజర్ల ప్రైవసీకి భంగం కలగకుండా ఉండటం కూడా ముఖ్యమేనని ఆయన పేర్కొన్నారు. సదస్సు సందర్భంగా పిచయ్ గ్లోబల్ లీడర్షిప్ పురస్కారాన్ని అందుకున్నారు. భారత్, ఇంగ్లండ్ మధ్యే వరల్డ్ కప్ ఫైనల్స్... ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడే అవకాశాలు ఉన్నాయని పిచయ్ జోస్యం చెప్పారు. భారత జట్టు గెలవాలని తాను కోరుకుంటున్నానన్నారు. ‘భారత్, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ పోరు ఉండొచ్చనుకుంటున్నాను. అయితే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా మంచి పటిష్టమైన జట్లే. వాటినీ తక్కువగా అంచనా వేయలేం’ అన్నారాయన. క్రీడల్లో తనకు క్రికెట్ అంటే మక్కువని తెలిపిన పిచయ్.. అమెరికాలో తన క్రికెట్, బేస్‌బాల్ ఆటల అనుభవాలు వెల్లడించారు. ‘నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో బేస్‌బాల్ ఆడేందుకు ప్రయత్నించాను. అది కాస్త కష్టమైన ఆటే. మొదటి గేమ్‌లో బాల్‌ను గట్టిగా కొట్టా. క్రికెట్లో అలా చేస్తే గొప్ప షాట్ కాబట్టి.. గొప్పగానే ఆడాననుకున్నా. అందరూ వింతగా చూశారు. అలాగే క్రికెట్లో రన్ తీసేటప్పుడు బ్యాట్‌ను వెంట పెట్టుకుని పరుగెత్తాలి. ఇందు లోనూ అలాగే చేశాను.. కానీ తర్వాత తెలిసింది.. బేస్‌బాల్ అనేది క్రికెట్ లాంటిది కాదని. ఏదైతేనేం.. నేను క్రికెట్‌కే కట్టుబడి ఉంటా’ అన్నారు. -
ఫైనల్లో తలపడేవి ఆ జట్లే..!!
వాషింగ్టన్ : ప్రపంచకప్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్, టీమిండియా జట్లు తలపడతాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జోస్యం చెప్పారు. అయితే మెగా టోర్నీలో ఇండియానే గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. వాషింగ్టన్లో జరిగిన అమెరికా- ఇండియా వ్యాపార మండలి సదస్సుకు సుందర్ పిచాయ్ హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సహా పలువురు కార్పోరేట్ దిగ్గజాల సమక్షంలో ఆయన గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా క్రీడలపై పట్ల తనకున్న మక్కువ గురించి పిచాయ్ మాట్లాడుతూ..‘ ఇక్కడికి(అమెరికా) వచ్చిన కొత్తలో బేస్‌బాల్ అంటే ఇంట్రస్ట్ ఉండేది. అది చాలెంజింగ్ గేమ్ అనిపించేది. మొదటి మ్యాచ్‌లోనే బాల్‌ను వెనక్కి బలంగా కొట్టేసా. నిజానికి అది క్రికెట్ మ్యాచ్ అయి ఉంటే గ్రేట్ షాట్ అయ్యి ఉండేది. కానీ బేస్‌బాల్ మ్యాచ్‌లో అలా ఆడినందుకు అందరూ వింతగా చూశారు. అందుకే బేస్‌బాల్ కాస్త కఠినంగా తోచింది. దీంతో క్రికెట్‌కు షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు ప్రపంచకప్ అనే అద్భుతమైన టోర్నమెంట్ జరుగుతోంది కదా. మెన్ ఇన్ బ్లూ గెలవాలని ఆశిస్తున్నా. నాకు తెలిసి ఇంగ్లండ్, భారత్ ఫైనల్లో తలపడతాయి. ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు మంచి జట్లు. వాటిని కూడా తక్కువగా అంచనా వేయలేం’ అని చెప్పుకొచ్చారు. -
సుందర్ పిచయ్ ఓటేశారా?
సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఏది అసలు వార్తో ఏది అబద్ధమో తెలియకుండా పోతోంది. పాత ఫొటోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు పెట్టి అసలు వార్తల్లా భ్రమింప చేస్తున్నారు. ఈ కోవలోకే వస్తుంది గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ ఓటేసిన వార్త. రెండో దశ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో గురువారం పోలింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ ఓటు వేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్త వచ్చింది. తమిళనాడుకు చెందిన సుందర్ పిచయ్ ఓటు కోసమే పని గట్టుకుని భారతదేశం వచ్చారని, ఓటు వేసి వెళ్లిపోయారని ఆ వార్త సారాంశం. ఓటు వేయడానికి వస్తున్న సుందర్ పిచయ్ అంటూ ఫొటో కూడా పెట్టారు. అయితే, నిజానికి సుందర్ పిచయ్ ఓటు వేయలేదు. అమెరికాలో ఉంటున్న ఆయనకు ద్వంద్వ పౌరసత్వం ఉంది. అంటే ఆయన భారత పౌరుడిగా, అమెరికా పౌరుడిగా కూడా చెలామణి అవుతున్నారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ద్వంద్వ పౌరసత్వం ఉన్న ప్రవాస భారతీయులు భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి వీల్లేదు. కాబట్టి సుందర్ పిచయ్ ఓటు వేశారనడం నిజం కాదు. ఈ వార్తతో పాటు పెట్టిన ఫొటో రెండేళ్ల కిందటిది. 2017లో భారత దేశం వచ్చిన సుందర్ తాను చదువుకున్న ఖరగ్‌పూర్ ఐఐటీకి వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోను ఇప్పటి వార్తతో కలిపి పెట్టేశారు. దాన్ని చూసిన వారు నిజంగా పిచయ్ ఓటు వేయడానికి వచ్చారని నమ్మేశారు. -
గూగుల్ సీఈవో ఓటు వేసాడా?
వినేవాడుంటే చెప్పేవాడు ఎన్నయినా చెబుతాడు. కొంచెం పద్ధతిగా చెప్పుకున్నాం కాబట్టి ఈ సామెత వినడానికి బాగుంది. కానీ ఇదే సామెతకు ఈ మధ్య చాలా రీమిక్స్ లు పుట్టుకొచ్చాయి. అలా పుట్టుకొచ్చిన రీమేక్ సామెతను యాజ్ ఇటీజ్ గా సోషల్ మీడియాకు అపాదిస్తే... వినేవాడుంటే సోషల్ మీడియా ఎన్నయినా చెబుతోందనవచ్చు. అవును అసత్య వార్తలను ప్రచారం చేసి.. ఏది నిజం.. ఏది అబద్దమో తెలుసుకోలేని పరిస్థితిలోకి నెట్టేస్తుంది. ఆ మధ్య కేరళ వరదలప్పుడు ఆ హీరో, ఈ క్రికెట్ ఇంత సాయం చేశాడంటూ అందరిని తప్పుదోవ పట్టించింది. పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ మూక దాడులకు కారణమైంది. ఇలా సోషల్ మీడియా ఫేక్ కథల గురించి చెప్తే ఒడిసేది కాదు.. దంచితే దంగేది కాదు.తాజాగా లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో మరో అసత్యవార్త హల్చల్ చేస్తోంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న 95 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన రెండో దశ పోలింగ్‌లో సినీతారాలు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ ఇంకుడ్ వేలును చూపిస్తూ ఫొటోలకు ఫోజిచ్చారు. అయితే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా గురువారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నాడని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షికారు చేస్తుంది. పైగా సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఈ పోస్ట్‌కు జత చేసి ఫొటోను ఫ్యాక్ట్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం అంత ఉత్తదేనని తేలిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుంధర్ ఫొటో.. 2017 ఐఐటీ కరగ్పూర్ను సందర్శించిననాటిదని తేలిపోయంది. ఆ సమయంలో సుంధర్ ఈ ఫొటో తన ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోనే వాడుకుంటూ సుందర్ ఓటు హక్కు వినియోగించుకున్నాడని అసత్యప్రచారాని తెరలేపారు. సుందర్ తమిళనాడులోని మధురైలో జన్మించినప్పటికి.. అతను అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. అతను భారత్‌లో ఓటేస్తానన్నా.. ఈసీ అనుమతించదు. భారత పౌరసత్వం కలిగి ఉన్న ఎన్ఆర్ఐలకు మాత్రం ఓటేసే అవకాశం కల్పిస్తారు. Also got to visit my alma mater (and old dorm room!) for the first time in 23 years. Thanks to everyone @IITKgp for the warm welcome! pic.twitter.com/OUn7mlKGI7 — Sundar Pichai (@sundarpichai) 7 January 2017 -
గూగుల్‌లో అత్యధిక మంది వెతికింది దానికోసమే!!
ఈ ఏడాది పూర్తవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2018 తమకు మిగిల్చిన తీపి ఙ్ఞాపకాలను, చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు.. మనలో చాలా మంది ఇప్పటినుంచే ప్రిపరేషన్స్ మొదలుపెట్టేసి ఉంటారు కూడా. ఈ నేపథ్యంలో 2018లో అత్యధిక మంది నెటిజన్లు ఎక్కువగా దేని గురించి వెదికారో అన్న దానిపై గూగుల్ ఓ వీడియోను విడుదల చేసింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. యూట్యూబ్ విడుదల చేసిన ఆన్యువల్ రివైండ్ వీడియో కంటే కూడా గూగుల్ వీడియోనే సూపర్బ్‌గా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ గూగుల్‌లో ఎక్కువ మంది వెదికింది దేనికోసం అంటే...‘మంచి’ కోసం. అవును మీరు చదివింది నిజమే. గుడ్ సింగర్, డ్యాన్సర్, కిస్సర్ ఇలా ప్రతీవిషయంలో గుడ్ అనిపించుకోవడానికి ఏం చేయాలా అని నెటిజన్లు సెర్చ్ చేశారట. ఇయర్ఇన్సర్చ్ పేరిట విడుదల చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంకేం మీరు కూడా ఓ లుక్కేయండి మరి. In a year of ups and downs, the world searched for "good" more than ever before. Here’s to all the good moments from 2018 and all the people who searched for them. #YearInSearch https://t.co/hj2FnX4mR4 — Sundar Pichai (@sundarpichai) December 12, 2018 -
గూగుల్ సీఈవోకు సమన్లు
వాషింగ్టన్: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి నోటీసులు అందాయి. గూగుల్ సెర్చిఇంజీన్‌లో చైనీస్ వెర్షన్ రూపొందించే ప్రణాళికలపై సెనేటర్లు తీవ్రంగా స్పందించారు. అమెరికా సెనేట్‌లోని ఆరుగురు సభ్యులు పిచాయ్‌కు సమన్లు జారీ చేశారు. పిచాయ్‌కు. తాజా మీడియా నివేదిలకపై వివరణ ఇవ్వాల్సిందిగా ఒక లేఖ రాశారు. గుగుల్ నిర్ణయానికి కొత్తగా ఏం మారిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇదే నిజమైతే ఇది చాలా ప్రమాదకరమైన పరిణామంగా తమ లేఖలో పేర్కొన్నారు. చైనాలో కఠినమైన సెన్సార్షిప్ నిబంధనల్లో 2010నుంచి కొత్తగా ఏది మారిందని సెనేటర్లు ఘాటుగా స్పందించారు. ఇంటెలిజన్స్ కమిటీ ఉపాధ్యక్షుడు వార్నర్, సెనేట్ ఫారిన్ రిలేషన్స్ అండ్ ఇంటెలిజెన్స్ కమిటీ సభ్యుడైన ఫ్లోరిడా రిపబ్లికన్ రూబియో సహా పలు సెనేటర్లు సుందర్ పిచాయ్‌ను ప్రశ్నించారు. గూగుల్‌కు సౌకర్యవంతమైన సహకారం అందించడానికి సంబంధించిన పరిస్థితులపై వారు లేఖలో ప్రశ్నించారు. ఇది చైనా ప్రభుత్వ కుట్ర అని సెనేటర్లు తప్పు పట్టారు. చైనాలో గూగుల్ ప్రాజెక్ట్ ప్రమాదకరమైన చర్య అని పేర్కొన్నారు. అలాగే సెన్సార్షిప్ నిబంధనలకు లోబడి, ప్రధాన విలువలతో రాజీ లేకుండా వ్యవహరిస్తున్న ఇతర టెక్ కంపెనీలకు ఆందోళనకర పరిణామమని వ్యాఖ్యానించారు. కాగా చైనా కోసం గూగుల్ ఒక కొత్త సెర్చి ఇంజీన్ రూపొందించనుందనంటూ మీడియా నివేదికలు గత వారం వెలుగులోకి వచ్చాయి. మరోవైపు చైనాకు చెందిన చైనా సెక్యూరిటీస్ డైలీ గత వారం ఈ నివేదికలను తిరస్కరించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆన్లైన్ కమ్యూనిటీ చైనాలో సొంతం. దాదాపు 772 మిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. -
పిచాయ్ పంటపండింది.. 2500 కోట్ల రివార్డు!
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పంట పండింది. అక్షరాల 380 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 2,524 కోట్ల) రివార్డు ఆయన సొంతం కానుంది. 2014లో గూగుల్‌లో తనకు లభించిన ప్రమోషన్‌కు ప్రతిఫలంగా 3,53,939 వాటాలు (రిస్ట్రిక్టెడ్ షేర్స్) బుధవారం విడుదల కానున్నాయి. దీంతో ఈ మొత్తం వాటాల విలువ ఆయనకు దక్కనుందని బ్లూమ్‌బర్గ్ వెబ్సైట్ వెల్లడించింది. ఇటీవలికాలంలో ఓ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌కు ఇంత భారీస్థాయిలో ప్యాకేజీ ఇవ్వడం ఇదే కావడం గమనార్హం. ఆల్ఫాబెట్ కంపెనీ నేతృత్వంలోని గూగుల్ కంపెనీకి సుందర్ పిచాయ్ (45) 2015 నుంచి నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఏడాది సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందినందుకు ప్రతిఫలంగా ఈ షేర్లను కంపెనీ ఆయనకు కట్టబెట్టింది. దీంతోపాటు గూగుల్ ఫౌండర్ ల్యారీ పేజ్ బాధ్యతలు కూడా చాలామటుకు ఆయనకు బదలాయించారు. ఆయనకు వాటాలు బదలాయించిన తర్వాత వాటి విలువ 90శాతం మేరకు పెరిగింది. 2017వ సంవత్సరానికిగాను సుందర్ పిచాయ్‌కి చెల్లించాల్సిన ప్యాకేజీని ఇంకా గూగుల్ వెల్లడించలేదు. -
పిచాయ్ దిగ్భ్రాంతి.. సత్య నాదెళ్ల విచారం!
సాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ వీడియో షేరింగ్ కంపెనీ యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ మంగళవారం ఉదయం కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అనంతరం ఆమె తనను తాను కాల్చుకొని ప్రాణాలు విడిచింది. కాలిఫోర్నియాలోని సాన్ బ్రునోలో ఉన్న యూట్యూబ్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారి కాల్పులు చోటుచేసుకోవడంతో బెంబేలెత్తిపోయిన యూట్యూబ్ ఉద్యోగాలు ప్రాణభయంతో చెల్లాచెదురుగా పరిగెత్తారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయోత్పాతాన్ని నింపింది. ఈ కాల్పుల ఘటనపై గుగూల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విటర్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకు అందని విషాదమని పేర్కొన్నారు. ‘ఈ రోజు జరిగిన విషాదాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. ఈ కష్టసమయంలో, మా ఉద్యోగులు, యూట్యూబ్ కమ్యూనిటీకి అండగా ఉండేందుకు నేను, సుసాన్ వొజ్సిస్కి (యూట్యూబ్ సీఈవో) ప్రయత్నిస్తున్నాం. వెంటనే స్పందించిన పోలీసులకు, మాకు అండగా సందేశాలు పంపిన వారికి కృతజ్ఞతలు’ అని పిచాయ్ పేర్కొన్నారు. అటు యాపిల్, మైక్రోసాఫ్ట్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ కాల్పుల ఘటనలోని బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. గూగుల్ ఉద్యోగులకు, సంస్థకు తమ మద్దతు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ట్విట్టర్ సీఈవో, కో ఫౌండర్ జాక్ డోర్సె తదితరులు గూగుల్, యూట్యూబ్ ఉద్యోగులకు అండగా ట్వీట్ చేశారు. ఈ కష్టసమయంలో తాము వారికి అండగా ఉన్నామని, వారు త్వరగా ఈ షాక్ నుంచి కోలుకోవాలని పేర్కొన్నారు. -
వీళ్లనూ తిప్పి పంపేవారా?
‘అమెరికా ఉత్పత్తులనే కొనండి, ఆమెరికా జాతీయులకే ఉద్యోగాలివ్వండి’ అనే తన ఎన్నికల నినాదాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాల జారీ విధానంలో కీలకమార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఇకపై హెచ్–1బీ వీసా పొందడం కఠినం కానుంది. తాజాగా ట్రంప్ తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం శాశ్వత నివాసానికి అర్హత కల్పించే ‘గ్రీన్‌కార్డు’ దరఖాస్తు పరిశీలనలో ఉండగానే హెచ్–1బీ వీసా గడువు ముగిసిన ఉద్యోగులు స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమలైతే అయిదు నుంచి ఏడున్నర లక్షల మంది భారత ఉద్యోగులపై పెనుప్రభావం పడుతుంది. అయితే.. ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక అమెరికన్ కంపెనీలకు సీఈఓలుగా, అధిపతులుగా ఉన్న భారతీయులు గతంలో హెచ్ –1బీ వీసాలపై అక్కడకు వెళ్లిన వారే. ఒకవేళ ఇప్పుడు ›ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన తాజా ప్రతిపాదన గతంలోనే అమలై ఉంటే వీరంతా ప్రసిద్ధ కంపెనీల్లో ఉన్నతస్థానాల్లో ఉండేవారా అన్న వాదన ముందుకొస్తోంది. గతంలో సరళమైన వీసా విధానం కారణంగానే పలువురు భారతీయులు ప్రస్తుతం ఆయా కంపెనీల్లో కార్పొరేట్ లీడర్లుగా ఉన్నారు. వీరంతా అమెరికా ఆర్థికాభివృద్ధికి విశేషంగా తోడ్పడి, ఆ దేశానికే అధిక లాభం చేకూర్చారు. వలసదారుల దేశంగా పిలిచే అమెరికాలో 20వ దశాబ్దం నుంచి వీసాలు, స్థిరనివాసం విషయంలో కఠిన నిబంధనలను సడలించారు. ఈ చర్యల ఫలితంగా అత్యుత్తమ ప్రతిభావంతులను అమెరికాకు ఆకర్షించగలిగారు. భారత్ నుంచి అమెరికా వెళ్లి వివిధ రంగాల్లో స్థిరపడిన కొందరు ప్రముఖులు సత్యా నాదెళ్ల, హైదరాబాద్‌లో జననం. హోదా : సీఈఓ, మైక్రోసాఫ్ట్ చదువు : మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బీఈ, అమెరికాలోని విస్కాన్సిన్–మిల్ఔ – ఎమ్మెస్, షికాగో యూనివర్శిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ – ఎంబీఏ సుందర్ పిచాయ్, తమిళనాడులో పుట్టారు. హోదా : సీఈఓ, గూగుల్ : చదువు : ఐఐటీ ఖరగ్‌పూర్–బీటెక్, స్టాన్‌ఫర్డ్–ఎమ్మెస్, వార్టాన్–ఎంబీఏ ఇంద్రానూయి, చెన్నైలో జన్మించారు హోదా : సీఈఓ, పెప్సీకో : అనుభవం : 1994లో ఆ సంస్థలో చేరిక. కొన్నేళ్లుగా సీఈఓగా బాధ్యతలు.. 2017లో వ్యాపార,వాణిజ్యాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళల ఫోర్బ్స్ జాబితాలో ద్వితీయస్థానం శంతను నారాయణ్, హైదరాబాద్‌లో పుట్టారు హోదా : సీఈఓ, అడోబ్ చదువు : ఉస్మానియా విశ్వవిద్యాలయం–బీఎస్సీ, బెర్క్లే కాలిఫోర్నియా వర్శిటీ–ఎంబీఏ, బౌలింగ్ గ్రీన్ స్టేట్ వర్శిటీ–ఎమ్మెస్ అజయ్‌పాల్‌సింగ్ బాంగా హోదా : ప్రెసిడెంట్, సీఈఓ, మాస్టర్‌కార్డ్ చదువు : అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ జార్జి కురియన్, కేరళలో జన్మించారు హోదా : ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, నెట్‌యాప్ చదువు : ఐఐటీ మద్రాస్‌లో కొంతకాలం ఇంజనీరింగ్ అమెరికాలోని ప్రిన్స్టన్ (న్యూజెర్సీలోని) యూనివర్శిటీలో డిగ్రీ,. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ–ఎంబీఏ దినేష్ పాలివాల్, ఉత్తరప్రదేశ్‌లో జననం హోదా : ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, హర్మన్ ఇంటర్మేషనల్ చదువు : ఐఐటీ రూర్కీ–బీటెక్, వయామి వర్సిటీ–ఎమ్మెస్, ఎంబీఏ సంజయ్ ఝా హోదా : సీఈఓ, గ్లోబల్ ఫౌండ్రీస్ అనుభవం : 2014లో ఈ బాధ్యతలు చేపట్టడానికి పూర్వం మోటరోలా మొబిలిటి సీఈఓగా, క్వాల్కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. 2008లో ఆయన మోటరోలా కో(సహ) సీఈఓగా చేరారు. అజిత్ జైన్, ఒడిశాలో పుట్టారు చదువు : ఐఐటీ, హార్వర్డ్ల నుంచి ఉన్నతవిద్యాభ్యాసం అనుభవం :బెర్క్‌షైర్ హాథ్‌వేలో వారెన్ బఫెట్ వారసుడిగా నియమితులయ్యే వారిలో ముందు వరుసలో ఉన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గూగుల్ సీఈవో మరో ఘనత
శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(45) మరో ఘనతను సాధించారు. చెన్నైకు చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు తన ఖాతాలో మరో విశిఫ్టతను చేర్చుకున్నారు. గత రెండేళ్లుగా గూగుల్ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్న సుందర్ పిచాయ్ తాజాగా గూగుల్ పేరెంటల్ కంపెనీ, గ్లోబల్ టెక్ దిగ్గజం అల్పాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఎంపికయ్యారు. యూ ట్యూబ్, గూగుల్ యాజమాన్య సంస్థ అయిన ఆల్పాబెట్ బోర్డుకు పిచాయ్ నియమితులయ్యారు. గూగుల్ సీఈవోగా సుందర్ మంచి కృషిని కొనసాగిస్తున్నారని, భాగస్వామ్యాలు, అద్భుతమైన నూతన ఆవిష్కరణలతో బలమైన అభివృద్ధిని నమోదు చేస్తున్నారని ఆల్ఫాబెట్ ఒక ప్రకటనలో తెలిపింది. 26 బిలియన్ డాలర్ల అమ్మకాలపై 3.5 బిలియన్ డాలర్ల నికర ఆదాయం సాధించినట్టు తెలిపింది. అలాగే యూరోపియన్ యూనియన్ విధించిన యాంటీ ట్రస్ట్ ఫైన్ (2.7 బిలియన్ డాలర్లు)లేకపోతే రికార్డ్ స్థాయి భారీ లాభాలను సాధించేవారమని పేర్కొంది. ఆల్ఫాబెట్ ఇంక్. సోమవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆదాయంలో 21 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గూగుల్ ప్రకటన ఆదాయం 18.4 శాతం పెరిగి 22.67 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంస్థ డిజిటల్ యాడ్ రెవెన్యూ 73.75 బిలియన్ డాలర్లుగా నమోదుకానుందని అంచనా. ఫేస్బుక్ 36.29 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని పరిశోధనా సంస్థ ఇమార్కెటర్ తెలిపింది. మొత్తం మార్కెట్లో ఇరు కంపెనీలు 49 శాతం వాటా ఉంటుందని తెలిపింది. కాగా సుందర్ పిచాయ్ 2004లో గూగుల్ చేరారు. 2015 ఆగస్టులో గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు -
గూగుల్ సీఈవో మరో రికార్డు
-
పిచాయ్‌కు రూ.1291 కోట్లు
హూస్టన్: గూగుల్ సీఈవో, భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ గతేడాది ప్రతిఫలంగా (స్టాక్ అవార్డు) కంపెనీ నుంచి భారీ మొత్తం అందుకున్నారు. 2016 సంవత్సరానికి దాదాపు 198.7 మిలియన్ డాలర్లను(దాదాపు రూ. 1291 కోట్లు) పిచాయ్‌కు గూగుల్ అందజేసింది. 2015తో పోలిస్తే ఇది రెండింతలు కావడం గమనార్హం. 2015లో పిచాయ్‌కు దక్కిన స్టాక్ అవార్డు మొత్తం 99.8 మిలియన్ డాలర్లు (రూ. 648 కోట్లు). స్టాక్ అవార్డుతో పాటు 2016లో వేతనంగా 6.5 లక్షల డాలర్లు(4.22 కోట్లు)అందుకున్నారు. అయితే 2015లో పిచాయ్ వేతనం 6.52 లక్షల డాలర్లు. ఆగస్టు 2015లో సీఈవోగా సుందర్ పిచాయ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం గూగుల్ భారీ లాభాలను ఆర్జించింది. ప్రకటనల విభాగం, యూట్యూబ్ బిజినెస్‌లు బాగా పెరిగాయి. అలాగే మెషీన్ లెర్నింగ్, హార్డ్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 2016లో గూగుల్ నుంచి స్మార్ట్‌ఫోన్ కూడా విడుదలైంది. -
గూగుల్ సీఈవో మరో రికార్డు
హ్యూస్టన్: ప్రముఖ సెర్చి ఇంజీన్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (44 ) అందిన పరిహారం ఎంత పెరిగిందో తెలుసా? అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న అమెరికా టాప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్ లిస్ట్ లో చేరిన పిచాయ్ 200 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ సొంతం చేసుకొని మరోసారి రికార్డు సృష్టించారు. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ సుందర్‌కు 200 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్ యూనిట్లను ఆయనకిచ్చింది. వీటి విలువ రూపాయల్లో సుమారు 12,855కోట్లకు చేరింది. 2015 స్టాక్ అవార్డు సుమారు 99.8 మిలియన్ డాలర్లకు ఇది రెట్టింపు. యూ ట్యూబ్ వ్యాపారంతోపాటు, ప్రధానమైన యాడ్స్ బిజినెస్‌ద్వారా గూగుల్ ఆదాయానికి మంచి బూస్ట్ఇచ్చినందుకుగాను పిచాయ్ కి ఈ భారీ కాంపన్సేషన్ లభించింది. అలాగే మెషీన లెర్నింగ్, హార్డ్ వేర్ , క్లౌడ్ కంప్యూటింగ్ పెట్టుబడుల ద్వారా ఈ గ్రోత్ సాధించారని సీఎన్ఎస్ నివేదించింది. అనేక విజయవంతమైన ప్రాజెక్టులను లాంచ్ చేసినందుకు సంస్థ పరిహార కమిటీ ఈ విలాసవంతమైన పరిహారం చెల్లించిందని తెలిపింది. భారత సంతతికి చెందిన పిచాయ్ 2015 నాటి వేతనంతో పోలిస్తే ఇది రెండింతలు పెరిగింది. అయితే 2015 లో 652,500 డాలర్లను ఆర్జించిన పిచాయ్, గత ఏడాది ఈ వేతనం కొంచెం క్షీణించి 650,000డాలర్లు (రూ.667 కోట్లు) వేతనాన్ని పొందారు అల్ఫాబెట్ స్టాక్ వాల్యూ ఈనెలలో భారీగా పుంజుకుంది. మొదటిసారి దీని మార్కెట్ క్యాప్ 600 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా 2004 సంవత్సరంలో గూగుల్‌లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా కేరీర్‌ను ఆరంభించిన పిచాయ్ 2015 ఆగస్టులో సంస్థ పునఃనిర్మాణ సమయంలో సీఈవో పదవిని చేపట్టారు. 2016లో 199 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డును అందుకున్నారు. -
గూగుల్ సీఈవో ఎంకరేజింగ్ రిప్లై
లండన్: గూగుల్ లో ఉద్యోగం కోసం ఏడేళ్ళ బాలిక రాసిన లేఖపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయికి స్పందించారు. మంచి ప్రోత్సాహకర సమాధానం ఇచ్చారు. ఈ లేఖ రాసినందుకు బాలికకకు ధన్యవాదాలు తెలిపిన ఆయన తన కలలను ఆమె చేరుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే విద్యాభ్యాసం పూర్తైన తర్వాత ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకోవాలని ఆ బాలికకు సుందర్ పిచాయి జవాబిచ్చారు. యూకె కు చెందిన బాలిక క్లో తనకు పెద్దయ్యాక గూగుల్ సంస్థలోఉద్యోగం చేయాలని కలలు కంటున్నానని గూగుల్ బాస్‌కి లేఖ రాసింది. క్లోకు ఇటీవలే ఆదర్శవంతమైన గూగుల్ లో పనిచేయాలనే ఆసక్తి కలిగిందట. కూతురి కోరిక మేరకు తండ్రి ఆమెను గూగుల్ లో ఉద్యోగం కోసం ధరఖాస్తు పంపాలని కోరారు. ఈ మేరకు ఆమె గూగుల్ బాస్‌కు లేఖ రాసింది. అంతేకాదు కంప్యూటర్లు, రోబోలు, టాబ్లెట్స్ అంటే ఈ బాలికకు చాలా ఇష్టమనీ రాసింది. గూగుల్ లో పనిచేయడమంటే చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేయడం, ఒలంపిక్స్ లో స్విమ్ చేయాలనే ఆసక్తిని పిచాయ్ కు రాసిన లేఖలో ఆమె తెలిపింది. దీంతో చదువు అయిపోయాక ఉద్యోగానికి దరఖాస్తు చేయాంటూ సమాధానం ఇచ్చి క్లో కలలకు ఊపిరి పోశారు పిచాయ్. నీ పాఠశాల విద్య పూర్తి చేశాక..మీ ఉద్యోగ అప్లికేషన్ స్వీకరించడంకోసం ఎదురు చూస్తుంటానని రాశారు. టెక్నాలజీని మరింత నేర్చుకోవాలని ఆశిస్తున్నట్టుగా పిచాయ్ అభిప్రాయపడ్డారు. అలాగే ఒక స్మైల్ ఎమోజీతో తన లేఖను ముగించారు పిచాయ్. సాధారణంగా బొమ్మలు, ఇతర బహుమతులు కోరుకునే వయసులో ఏకంగా గూగుల్ ఉద్యోగం అడిగడం అందర్నీ ఆశ్చర్య పరిస్తే.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అంతే బాధ్యతాయుతంగా, స్వీట్‌గా రిప్లై ఇవ్వడం విశేషంగా నిలిచింది. దీంతో గూగుల్ సీఈవో సంతకంతోఉన్న లేఖను చూసిన క్లో సంతోషంతో పొంగిపోతోందని తండ్రి ఆండీ బ్రిడ్జ్ వాటర్ చెప్పారు. అంతేకాదు రెండేళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదంతో డీలా పడిన ఆమెలో నూతనోత్సాహాన్ని, విశ్వాసాన్ని పెంపొందించారన్నారు. దీనికి ఆయన సుందర్ పిచాయ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని బిజినెస్ ఇన్ సైడర్ రిపోర్ట్ చేసింది. -
రోడ్డుపైకి వచ్చిన గూగుల్ ఉద్యోగులు
వలసవాదులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను నిరసిస్తూ 2000 మందికి పైగా గూగుల్ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చారు. ఏడు ముస్లిం దేశాలను అమెరికాలోకి రాకుండా ట్రంప్ జారీచేసిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా వారు ర్యాలీ నిర్వహించారు. ట్రంప్ ఆదేశాలకు చెంపచెట్టులా 4 మిలియన్ డాలర్ల సంక్షోభ నిధిని వలసదారుల సమస్యల కోసం సమీకరించిన గూగుల్, వెంటనే ఇలా ర్యాలీకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గూగుల్ ఉద్యోగులందరూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాయి. ఉద్యోగులు చేస్తున్న ఈ ర్యాలీకి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న గూగుల్ క్యాంపస్‌లు మద్దతు పలుకుతున్నాయి. మద్దతిచ్చే వాటిలో మౌంటేన్ వ్యూ, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, సియాటిల్ క్యాంపస్‌లు ఉన్నాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ మౌంటేన్ వ్యూ క్యాంపస్‌లో నిర్వహించబోయే కంపెనీ ఉద్యోగుల ర్యాలీలో ప్రసంగించారు. పిచాయ్ కూడా వలసవాదుడు కావడం విశేషం. ట్రంప్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ర్యాలీలో పాల్గొన్న ఉద్యోగులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ యుద్ధాన్ని ఇలానే కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని తెలిపారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా శాన్ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగిన నిరసనలో పాల్గొన్న గూగుల్ సెర్జీ బిన్, తను కూడా ఒక వలసవాది, శరణార్థి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు ఆరేళ్లు ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ నుంచి అమెరికాకు తన కుటుంబసభ్యులు తరలివచ్చారని పేర్కొన్నారు. ప్రాథమిక విలువలు, విధానాల రూపకల్పనలు వంటి వాటిపై డిబేట్ జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 187 మంది గూగుల్ ఉద్యోగులపై ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లు ప్రభావం చూపనున్నాయి. వారికి సహాయం కోసం కంపెనీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా) -
ట్రంప్ ఆర్డర్‌తో రిస్కులో గూగుల్ ఉద్యోగులు
ముస్లిం దేశాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై ఘాటైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ కంపెనీల సీఈవోలందరూ ట్రంప్‌పై విరుచుకుపడుతున్నారు. ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్ అనంతరం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై విమర్శలు సంధించారు. ఏడు దేశాలకు చెందిన వారిని అమెరికాలోకి రాకుండా నిషేధం విధించడం పిచాయ్ తప్పుపట్టారు. ట్రంప్ ఆదేశాలు తమ ఉద్యోగులపై ప్రభావం చూపనున్నాయని తెలుపుతూ కంపెనీ స్టాఫ్‌కు ఓ ఈ-మెయిల్ రాశారు. దానిలో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌ను విమర్శించారు. 187 మంది గూగుల్ ఉద్యోగులపై ఈ ఆర్డర్ ప్రభావం చూపనుందని పిచాయ్ పేర్కొన్నారు. ఈ ఆర్డర్‌తో చూపే ప్రభావంపై తాము చింతిస్తున్నామని, ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌తో తమ సహచరులకు తలెత్తే వ్యక్తిగత వ్యయాలు చాలా బాధకరమన్నారు. విదేశాలకు ట్రావెల్ చేసే గూగుల్ ఉద్యోగులు ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వచ్చేలోపల అమెరికాకు వచ్చేయాలని పిచాయ్ ఆదేశించారు. గూగుల్ సెక్యురిటీ, ట్రావెల్, ఇమ్మిగ్రేషన్‌పై కంపెనీ సాయం చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీల్లో పనిచేసే వారు, కేటాయించిన పనులపై విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ వారిదగ్గర వాలిడ్ వీసా ఉన్నప్పటికీ వారు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని కంపెనీ ఉద్యోగులకు హెచ్చరిస్తోంది. శుక్రవారం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ముస్లిం మెజారిటీ ఏడు దేశాలు ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమెన్లకు చెందిన పౌరులను అమెరికాలోకి రాకుండా ఆంక్షలు విధించారు. ఈ దేశాలకు చెందిన పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు. అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. ఈ ఏడు దేశాలకు చెందిన వారిదగ్గర గ్రీన్ కార్డు ఉన్నా.. వారిని అమెరికాలోకి రానిస్తారో లేదో అన్నది ప్రస్తుతం సందేహంగా మారింది. -
రూ.2 వేలకే స్మార్ట్‌ఫోన్!
-
నోట్ల రద్దుపై సుందర్ పిచాయ్ కామెంట్
-
రూ.2 వేలకే స్మార్ట్‌ఫోన్!
డిజిటల్ సేవల విస్తృతికి చౌకగా అందించాల్సిన అవసరం ఉంది... ♦ డిజిటల్ ఎకానమీలో ప్రపంచ అగ్రగామిగా భారత్ ♦ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఖరగ్‌పూర్: డిజిటల్ సేవలు మరింత మంది ప్రజలకు చేరువయ్యేందుకు వీలుగా ప్రారంభ స్థాయి స్మార్ట్ఫోన్లు 30 డాలర్లకే (సుమారు రూ.2 వేలు) అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న పిచాయ్ గతంలో తాను చదువుకున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా 3,500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్న సభలో మాట్లాడారు. ‘‘డిజిటల్ ప్రపంచంతో అనుసంధానాన్ని పెంచేందుకు వీలుగా చౌకైన, ప్రారంభ స్థాయి స్మార్ట్ఫోన్లను చూడాలని కోరుకుంటున్నాను. ధరలను మరింత తక్కువ స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది 30 డాలర్ల స్థాయి కావచ్చు (రూ.2,000)’’ అని పిచాయ్ పేర్కొన్నారు. గూగుల్ గతంలో మైక్రోమ్యాక్స్, కార్బన్, స్పైస్ మొబైల్ తయారీ సంస్థలతో టైఅప్ అయి ‘ఆండ్రాయిడ్ వన్’ స్మార్ట్ఫోన్లను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ మోడల్ ధర రూ.6,000కుపైనే ఉంది. ఆ తర్వాత ఇంతకంటే తక్కువ ధరకే మంచి ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు మార్కెట్ ప్రవేశం చేశాయి. అయినప్పటికీ రూ.2,000కే మంచి సదుపాయాలున్న స్మార్ట్‌ఫోన్ ఇంత వరకూ రాలేదు. ఇందుకోసం కనీసం రూ.3,000పైన పెట్టాల్సి వస్తోంది. గోకుల్‌పూర్‌లో సుందర్ పిచాయ్‌కు టోపీతో స్వాగతం పలుకుతున్న మహిళలు చైనాను భారత్ ఎప్పుడు దాటేస్తుంది? డిజిటల్ రంగంలో భారత్ చైనాను ఎప్పుడు అధిగమిస్తుందన్న ప్రశ్నకు పిచాయ్ స్పందిస్తూ... ‘‘డిజిటల్ ఆర్థిక రంగంలో భారత్ ప్రపంచ స్థాయి దేశంగా ఎదుగుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఏ దేశంతోనైనా పోటీ పడగలదు. అందుకు తగ్గ నిర్మాణం ఉంది’’ అని పిచాయ్ బదులిచ్చారు. ఇక్కడి స్టార్టప్‌లు స్వదేశం కోసం, ప్రపంచం కోసం రూపొందిస్తున్న ఉత్పత్తులే దీన్ని సాధ్యం చేస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డిజిటల్ ఇండియా కోసం మరిన్ని కార్యక్రమాలను గూగుల్ తీసుకువస్తుందన్నారు. రైల్వే స్టేషన్లలో వైఫై సర్వీసులకు రైల్‌టెల్‌తో భాగస్వామ్యం, డిజిటల్ పేమెంట్ల కోసం ఎన్పీసీఐతో భాగస్వామ్యాలను ప్రస్తావించారు. దేశీయంగా ఇంగ్లిష్ మాట్లాడే ప్రజల శాతం తక్కువేనని, ఈ దృష్ట్యా మరింత మందిని చేరుకునేందుకు వీలుగా గూగుల్ తన సేవలను సాధ్యమైనన్ని ప్రాంతీయ భాషల్లో అందించేందుకు కృషి చేస్తోందన్నారు. భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) చక్కగా పనిచేస్తోందని, డిజిటల్ ఇండియా ప్రచారానికి గూగుల్ అతి పెద్ద మద్దతుదారుగా ఉందన్నారు. ప్రపంచంలోనే భారత్ అత్యంత చైతన్యవంతమైన ఇంటర్నెట్ మార్కెట్ అని, పరిమాణం దృష్ట్యా రెండో అతిపెద్దదని పిచాయ్ పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ముందడుగు కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వంటి పరిజ్ఞానాలు, మెషీన్ లెర్నింగ్ వంటివి నిత్య జీవితాన్ని మరింత వినూత్నంగా మార్చగలవని సుందర్ అన్నారు. వీటిని సాధ్యమైనంత వేగంగా సాధ్యమైనంత మందికి చేరువ చేసేందుకు గూగుల్ భారీ పెట్టుబడులు పెడుతోందన్నారు. ఇలా కొన్నేళ్ల పాటు స్థిరంగా కొనసాగితే భవిష్యత్ కంప్యూటింగ్‌కు మార్గం సుగమం అవుతుందన్నారు. మెషీన్ లెర్నింగ్‌లో ముందడుగు వేస్తే చాలా రంగాల్లో భారీ మార్పు సాకారమవుతుందన్నారు. దీనికి ఉదాహరణగా కంటి చూపును దెబ్బతీసే డయాబెటిక్ రెటీనాను గుర్తించేందుకు మెషీన్ లెర్నింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చని సుందర్ వివరించారు. లోక జ్ఞానమూ అవసరమే... ఐఐటీ పట్టభద్రులు ఐఐఎంలో సీటు సంపాదించాలన్న కలలతో ఉండడంపై పిచాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్య మాత్రమే కాదని, వాస్తవిక ప్రపంచ అనుభవాలూ ఎంతో ముఖ్యమన్న విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తాను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తరగతులకు బంక్ కొట్టిన స్మృతులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల్లో విద్యార్థులు చేరుతున్న విషయాన్ని విన్న ఆయన ఖంగుతిన్నారు. సవాళ్లను స్వీకరించాలని, భిన్న విషయాల దిశగా ప్రయత్నం చేయాలని, తమ అభిరుచుల ప్రకారం నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సుందర్ య్ 1993లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేయగా... 23 ఏళ్ల తర్వాత తిరిగి సందర్శించారు. బీటెక్ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో ఎంఎస్ పట్టా అందుకున్నారు. వార్టన్ స్కూల్లో ఎంబీయే అనంతరం 2004లో గూగుల్‌లో చేరి అత్యున్నత పదవిని అందుకున్నారు. ‘అబే సాలే’ అని పిలిచేవాడిని.. గూగుల్ బాస్‌గా ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపును సొంతం చేసుకున్న సుందర్ పిచాయ్ సగటు భారతీయ విద్యార్థే. విద్యార్థిగా అతడిలోనూ చిలిపితనం, ఆకతాయితనం దాగున్నాయి. వాటిని ఐఐటీ ఖరగ్‌పూర్ వేదికగా ఆయన విద్యార్థులతో పంచుకున్నారు. స్నేహితులను ‘అబే సాలే (అరే బామ్మర్ది)’ అని పిలిచేవారట. ఎందుకని అలా..? అన్నదానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. ‘‘నేను చెన్నై నుంచి వచ్చాను. స్కూల్లో హిందీ చదువుకున్నాను. కానీ ఎప్పుడూ పెద్దగా మాట్లాడింది లేదు. అయితే, ఇతరులు ఎలా మాట్లాడుకుంటున్నారో మాత్రం వినేవాణ్ణి. ఒకానొక రోజు మెస్‌లో ఒకతన్ని ‘అబే సాలే’ అని పిలిచాను. దీన్ని స్నేహపూర్వక పలకరింపు అనుకున్నాను. కానీ, ఇందుకు మెస్‌లోని వారు కలత చెందినట్టు, ఆ తర్వాత మెస్ తాత్కాలికంగా మూసివేయడానికి అదే కారణమని తెలుసుకున్నాను’’ అని ఆయన చెప్పారు. సుందర్ పిచాయ్ తన జీవిత భాగస్వామి అంజలిని ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లోనే తొలిసారి కలుసుకున్నారట. అంజలిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో అమ్మాయిల హాస్టల్‌కు వెళ్లడం అంత తేలిక కాదని. దాంతో రొమాన్స్ సాధ్యపడేది కాదని ఆయన చెప్పారు. ‘‘ఎవరో ఒకరు బయట నుంచి ‘అంజలీ... సుందర్ నీకోసం ఇక్కడకు వచ్చాడు’ అంటూ గట్టిగా అరిచేవారు. దీంతో సిగ్గుగా అనిపించేంది’ అని ఆయన పేర్కొన్నారు. మొబైల్స్ ప్రపంచాన్నే మార్చేశాయని.. కానీ, కొన్నింటిని మార్చకుండా అలానే వదిలేశాయన్నారు. 23 ఏళ్ల క్రితం తన హాస్టల్ గది ఎలాఉందో ఇప్పుడూ అలానేఉందంటూ చమత్కరించారు. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండి, తెల్లారి క్లాసులు ఎగ్గొట్టేవాడినని చెప్పారు. 2004లో గూగుల్ ఇంటర్వూ్యను ఎదుర్కొన్న తాను జీమెయిల్‌ను ఏప్రిల్ ఫూల్ జోక్‌గా భావించేవాడినన్నారు. కాలేజీ రోజుల్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని మార్గదర్శకంగా భావించిన ఆయన సచిన్ బ్యాట్ పట్టుకుంటే క్రికెట్ చూడ్డానికి ఇష్టపడేవాడినని చెప్పారు. -
రూ.2 వేలకే స్మార్ట్‌ఫోన్!
డిజిటల్ సేవల విస్తృతికి చౌకగా అందించాల్సిన అవసరం ఉంది... • డిజిటల్ ఎకానమీలో ప్రపంచ అగ్రగామిగా భారత్ • గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఖరగ్‌పూర్: డిజిటల్ సేవలు మరింత మంది ప్రజలకు చేరువయ్యేందుకు వీలుగా ప్రారంభ స్థాయి స్మార్ట్ఫోన్లు 30 డాలర్లకే (సుమారు రూ.2 వేలు) అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న పిచాయ్ గతంలో తాను చదువుకున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా 3,500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్న సభలో మాట్లాడారు. ‘‘డిజిటల్ ప్రపంచంతో అనుసంధానాన్ని పెంచేందుకు వీలుగా చౌకైన, ప్రారంభ స్థాయి స్మార్ట్ఫోన్లను చూడాలని కోరుకుంటున్నాను. ధరలను మరింత తక్కువ స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది 30 డాలర్ల స్థాయి కావచ్చు (రూ.2,000)’’ అని పిచాయ్ పేర్కొన్నారు. గూగుల్ గతంలో మైక్రోమ్యాక్స్, కార్బన్, స్పైస్ మొబైల్ తయారీ సంస్థలతో టైఅప్ అయి ‘ఆండ్రాయిడ్ వన్’ స్మార్ట్ఫోన్లను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ మోడల్ ధర రూ.6,000కుపైనే ఉంది. ఆ తర్వాత ఇంతకంటే తక్కువ ధరకే మంచి ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు మార్కెట్ ప్రవేశం చేశాయి. అయినప్పటికీ రూ.2,000కే మంచి సదుపాయాలున్న స్మార్ట్‌ఫోన్ ఇంత వరకూ రాలేదు. ఇందుకోసం కనీసం రూ.3,000పైన పెట్టాల్సి వస్తోంది. గోకుల్‌పూర్‌లో సుందర్ పిచాయ్‌కు టోపీతో స్వాగతం పలుకుతున్న మహిళలు చైనాను భారత్ ఎప్పుడు దాటేస్తుంది? డిజిటల్ రంగంలో భారత్ చైనాను ఎప్పుడు అధిగమిస్తుందన్న ప్రశ్నకు పిచాయ్ స్పందిస్తూ... ‘‘డిజిటల్ ఆర్థిక రంగంలో భారత్ ప్రపంచ స్థాయి దేశంగా ఎదుగుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఏ దేశంతోనైనా పోటీ పడగలదు. అందుకు తగ్గ నిర్మాణం ఉంది’’ అని పిచాయ్ బదులిచ్చారు. ఇక్కడి స్టార్టప్‌లు స్వదేశం కోసం, ప్రపంచం కోసం రూపొందిస్తున్న ఉత్పత్తులే దీన్ని సాధ్యం చేస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డిజిటల్ ఇండియా కోసం మరిన్ని కార్యక్రమాలను గూగుల్ తీసుకువస్తుందన్నారు. రైల్వే స్టేషన్లలో వైఫై సర్వీసులకు రైల్‌టెల్‌తో భాగస్వామ్యం, డిజిటల్ పేమెంట్ల కోసం ఎన్పీసీఐతో భాగస్వామ్యాలను ప్రస్తావించారు. దేశీయంగా ఇంగ్లిష్ మాట్లాడే ప్రజల శాతం తక్కువేనని, ఈ దృష్ట్యా మరింత మందిని చేరుకునేందుకు వీలుగా గూగుల్ తన సేవలను సాధ్యమైనన్ని ప్రాంతీయ భాషల్లో అందించేందుకు కృషి చేస్తోందన్నారు. భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) చక్కగా పనిచేస్తోందని, డిజిటల్ ఇండియా ప్రచారానికి గూగుల్ అతి పెద్ద మద్దతుదారుగా ఉందన్నారు. ప్రపంచంలోనే భారత్ అత్యంత చైతన్యవంతమైన ఇంటర్నెట్ మార్కెట్ అని, పరిమాణం దృష్ట్యా రెండో అతిపెద్దదని పిచాయ్ పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ముందడుగు కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వంటి పరిజ్ఞానాలు, మెషీన్ లెర్నింగ్ వంటివి నిత్య జీవితాన్ని మరింత వినూత్నంగా మార్చగలవని సుందర్ అన్నారు. వీటిని సాధ్యమైనంత వేగంగా సాధ్యమైనంత మందికి చేరువ చేసేందుకు గూగుల్ భారీ పెట్టుబడులు పెడుతోందన్నారు. ఇలా కొన్నేళ్ల పాటు స్థిరంగా కొనసాగితే భవిష్యత్ కంప్యూటింగ్‌కు మార్గం సుగమం అవుతుందన్నారు. మెషీన్ లెర్నింగ్‌లో ముందడుగు వేస్తే చాలా రంగాల్లో భారీ మార్పు సాకారమవుతుందన్నారు. దీనికి ఉదాహరణగా కంటి చూపును దెబ్బతీసే డయాబెటిక్ రెటీనాను గుర్తించేందుకు మెషీన్ లెర్నింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చని సుందర్ వివరించారు. పశ్చిమ బెంగాల్‌లోని గోకుల్పూర్ గ్రామంలో గూగుల్ ‘ఇంటర్నెట్ సాథి’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహిళలతో సుందర్ లోక జ్ఞానమూ అవసరమే... ఐఐటీ పట్టభద్రులు ఐఐఎంలో సీటు సంపాదించాలన్న కలలతో ఉండడంపై పిచాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్య మాత్రమే కాదని, వాస్తవిక ప్రపంచ అనుభవాలూ ఎంతో ముఖ్యమన్న విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తాను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తరగతులకు బంక్ కొట్టిన స్మృతులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల్లో విద్యార్థులు చేరుతున్న విషయాన్ని విన్న ఆయన ఖంగుతిన్నారు. సవాళ్లను స్వీకరించాలని, భిన్న విషయాల దిశగా ప్రయత్నం చేయాలని, తమ అభిరుచుల ప్రకారం నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సుందర్ య్ 1993లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేయగా... 23 ఏళ్ల తర్వాత తిరిగి సందర్శించారు. బీటెక్ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో ఎంఎస్ పట్టా అందుకున్నారు. వార్టన్ స్కూల్లో ఎంబీయే అనంతరం 2004లో గూగుల్‌లో చేరి అత్యున్నత పదవిని అందుకున్నారు. ‘అబే సాలే’ అని పిలిచేవాడిని.. గూగుల్ బాస్‌గా ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపును సొంతం చేసుకున్న సుందర్ పిచాయ్ సగటు భారతీయ విద్యార్థే. విద్యార్థిగా అతడిలోనూ చిలిపితనం, ఆకతాయితనం దాగున్నాయి. వాటిని ఐఐటీ ఖరగ్‌పూర్ వేదికగా ఆయన విద్యార్థులతో పంచుకున్నారు. స్నేహితులను ‘అబే సాలే (అరే బామ్మర్ది)’ అని పిలిచేవారట. ఎందుకని అలా..? అన్నదానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. ‘‘నేను చెన్నై నుంచి వచ్చాను. స్కూల్లో హిందీ చదువుకున్నాను. కానీ ఎప్పుడూ పెద్దగా మాట్లాడింది లేదు. అయితే, ఇతరులు ఎలా మాట్లాడుకుంటున్నారో మాత్రం వినేవాణ్ణి. ఒకానొక రోజు మెస్‌లో ఒకతన్ని ‘అబే సాలే’ అని పిలిచాను. దీన్ని స్నేహపూర్వక పలకరింపు అనుకున్నాను. కానీ, ఇందుకు మెస్‌లోని వారు కలత చెందినట్టు, ఆ తర్వాత మెస్ తాత్కాలికంగా మూసివేయడానికి అదే కారణమని తెలుసుకున్నాను’’ అని ఆయన చెప్పారు. సుందర్ పిచాయ్ తన జీవిత భాగస్వామి అంజలిని ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లోనే తొలిసారి కలుసుకున్నారట. అంజలిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో అమ్మాయిల హాస్టల్‌కు వెళ్లడం అంత తేలిక కాదని. దాంతో రొమాన్స్ సాధ్యపడేది కాదని ఆయన చెప్పారు. ‘‘ఎవరో ఒకరు బయట నుంచి ‘అంజలీ... సుందర్ నీకోసం ఇక్కడకు వచ్చాడు’ అంటూ గట్టిగా అరిచేవారు. దీంతో సిగ్గుగా అనిపించేంది’ అని ఆయన పేర్కొన్నారు. మొబైల్స్ ప్రపంచాన్నే మార్చేశాయని.. కానీ, కొన్నింటిని మార్చకుండా అలానే వదిలేశాయన్నారు. 23 ఏళ్ల క్రితం తన హాస్టల్ గది ఎలాఉందో ఇప్పుడూ అలానేఉందంటూ చమత్కరించారు. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండి, తెల్లారి క్లాసులు ఎగ్గొట్టేవాడినని చెప్పారు. 2004లో గూగుల్ ఇంటర్వూ్యను ఎదుర్కొన్న తాను జీమెయిల్‌ను ఏప్రిల్ ఫూల్ జోక్‌గా భావించేవాడినన్నారు. కాలేజీ రోజుల్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని మార్గదర్శకంగా భావించిన ఆయన సచిన్ బ్యాట్ పట్టుకుంటే క్రికెట్ చూడ్డానికి ఇష్టపడేవాడినని చెప్పారు. గోకుల్‌పూర్‌లో సరదాగా క్రికెట్ ఆడుతూ... -
అబే సాలే.. అంటే అర్థమేంటి?
'అబే సాలే..' అంటే ఏంటో ఓ మాదిరిగా హిందీ వచ్చినవాళ్లందరికీ బాగా తెలుసు. ఎవరినైనా తిట్టాలంటే ముందుగా ఆ పదాన్ని ఉపయోగిస్తారు. కానీ, ప్రస్తుతం గూగుల్ లాంటి సెర్చింజన్ దిగ్గజ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సుందర్ పిచాయ్ మాత్రం.. అదేదో స్నేహపూర్వకంగా పిలిచే పలకరింపు అనుకున్నారట. అయితే అది ఇప్పటి విషయం కాదు.. 23 ఏళ్ల క్రితం ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకునే సమయంలో. చెన్నైలో పుట్టిన పిచాయ్.. ఖరగ్‌పూర్ ఐఐటీకి వెళ్లినప్పుడు అక్కడి విద్యార్థులకు ఈ విషయం చెప్పి నవ్వుకున్నారు. తాను స్కూల్లో హిందీ చదువుకున్నా, పెద్దగా మాట్లాడేవాడిని కానని.. ఎవరైనా మాట్లాడుతుంటే వినేవాడినని సుందర్ పిచాయ్ చెప్పారు. అందరూ అలాగే పిలుచుకుంటారని భావించి ఒకరోజు మెస్‌లో ఓ స్నేహితుడిని పిలవడానికి తాను 'అబే సాలే..' అన్నానని తెలిపారు. ఆయన ఆ మాట అనగానే ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. మొదటి రెండు వారాల పాటు తాను అలాగే అనుకున్నానని, క్రమంగా అర్థమైందని తెలిపారు. తన భార్య అంజలిని కూడా క్యాంపస్‌లోనే కలిసిన సుందర్.. అమ్మాయిల హాస్టల్లోకి వెళ్లడం మాత్రం అంత సులభం కాదన్నారు. ఎవరో ఒకళ్లు బయట నిలబడి, గట్టిగా.. 'అంజలీ, నీకోసం సుందర్ వచ్చాడు' అని చెప్పాల్సి వచ్చేదని, అది అంత బాగుండేది కాదని తన ప్రేమ వ్యవహారాన్ని కూడా తెలిపారు. టెక్నాలజీ.. అందునా మొబైల్ ఫోన్లు వచ్చాక ప్రపంచమే మారిపోయిందని, కానీ ఐఐటీలో తన గది మాత్రం పాతికేళ్ల నుంచి అలాగే మారకుండా ఉందని జోక్ చేశారు. అందరు కాలేజి కుర్రాళ్లలాగే తాను కూడా నైటవుట్లు చేసి, పొద్దున్నే క్లాసులు ఎగ్గొట్టేవాడినన్నారు. 2004లో తనకు గూగుల్‌లో ఇంటర్వ్యూ వచ్చిందని, అప్పట్లో వాళ్లు జీమెయిల్ గురించి చెబుతుంటే అదేదో తనను ఏప్రిల్ ఫూల్ చేయడానికి చెబుతున్నారని అనుకున్నానని తెలిపారు. అది వాస్తవమన్న విషయం చాలా కాలం వరకు నమ్మలేదన్నారు. కాలేజిలో చదివే రోజుల్లో నారాయణమూర్తి తనకు హీరో అని, సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతుంటే చూడటాన్ని ఇష్టపడేవాడినని అన్నారు. -
గూగుల్ సీఈవో అభిమాన నటి ఎవరు?
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఫేవరెట్ నటి , ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థులతో ముచ్చటించిన పిచాయ్ తన జీవితంలోని కొన్నిముఖ్య ఘట్టాలను ప్రస్తావించారు. జనవరి4 ఇండియాకు వచ్చిన సుందర్ పిచాయ్ 23 ఏళ్ల తరువాత మళ్లీ గురువారం ఐఐటీ ఖరగ్ పూర్ ను సందర్శించారు. డిజిటల్ ఎకానమీ లో ఇండియా ప్రముఖ పాత్ర పోషించనుందనీ, 5-10 ఏళ్లలో భారత మార్కెట్ లో భారీగా స్టార్ట్ అప్స్ కు మంచి అవకాశమన్నారు. ఎంట్రీ లెవల్ (30 డాలర్లు) స్మార్ట్ ఫోన్ తయారీపై దృష్టి పెట్టామని పిచాయ్ పేర్కొన్నారు. విద్యార్థిగా పలు స్మృతులను నెమరువేసుకున్న పిచాయ్ అనేక ఆసక్తికర విఫయాలను విద్యార్థులతో పంచుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తనకు ఇష్టమైన భారతీయ నటి అనీ, అలాగే ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి తన పేవరెట్ క్రికెటర్ అని చెప్పారు. విరాట్ కోహ్లి ఆట చూడటానికి ఎక్కువగా చూసేవాడినన్నారు. ఫస్ట్ కంప్యూటర్ ను ఐఐటీ ఖరగ్ పూర్ లో చూశాను, 20 ఏళ్ల వయసులో నా మొదటి విమాన ప్రయాణం. కానీ సంవత్సరానికి10 లక్షలమంది విమానాల్లో ప్రయాణించేలా ఇపుడు భారత్ పూర్తిగా మారిపోయింది. రాత్రిళ్లు బాగా మేల్కొని చదవడంతో పొద్దున్న క్లాసులు మిస్ అయ్యేవాణ్ని. నేనూ క్లాసు లు బంక్ కొట్టేవాణ్ణి. హాస్టల్ ఫుడ్ లో పప్పా , సాంబారా అని ఎదురు చూసే వాణ్ణని, తనకు హిందీ అంత బాగా రాదంటూ తన ఐఐటీ రోజులను గుర్తు చేసుకున్నారు. అనేక విషయాల్లో ఆసక్తి చూపించాలని జీవితంలో సాహసాలు చేయడానికి ప్రయత్నించడం ముఖ్యమని విద్యార్థులకు చెప్పారు. దేశంలో విద్యావ్యవస్థ విద్యార్థులపై ఒత్తిడి పెంచేదిగాఉందని ఇది మారాలని ఆయన సూచించారు. ఐఐటీ లో సీటు రావడానికి హార్డ్ వర్క్ తో కూడుకున్నదని, ఎనిమిదివ తరగతి నుంచే ఐఐటీ విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఏప్రిల్ పూల్ డే రోజు గూగుల్ ఇంటర్వ్యూ జరిగిందనీ, దీంతో నమ్మకం కుదరలేదనీ, నిజంగా జోక్ ఏమో అనుకున్నానంటూ తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఐఐటి ఖరగ్ పూర్ ను గూగుల్ డూడుల్ గా చూడొచ్చా అని ప్రశ్నించినపుడు.. అవకాశాలు తక్కువే కానీ.. తమ టీంకు మెయిల్ పెట్టమని సూచించారు. గూగుల్ లో్ ఉద్యోగం సాధించడం ఎలా అని మరో ఐఐటీయన్ ప్రశ్నించినపుడు.. త్వరలోనే ఖరగ్ పూర్ లో గూగుల్ క్యాంపస్ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. కాగా 1993 లో ఐఐటీ ఖరగ్ పూర్ లో లోహశోధన ఇంజనీరింగ్, బిజినెస్ వార్టన్ స్కూల్ నుంచి ఎంబిఎ డిగ్రీ పట్టా పుచ్చుకున్న సుందర్ పిచాయ్ 2004 లో గూగుల్ సంస్థలో చేరారు. అనంతరం ఆగష్టు 2015 లో గూగుల్ సీఈఓగా నియమితులైన సంగతి తెలిసిందే. -
నోట్ల రద్దుపై సుందర్ పిచాయ్ కామెంట్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుపై టెక్నో దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. ఈ అంశంలో తాను నిపుణుడిని కాకపోయినా ఇది సాహసోపేతమైన నిర్ణయమని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో గూగుల్ సంస్థ ఏ విధంగానైనా సాయం చేసే అవకాశముంటే అందుకు తాము సిద్దమని ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఓ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నోట్ల రద్దుపై స్పందించాలని కోరగా.. ‘పెద్ద వేదికలలో మార్పులు తీసుకొచ్చినప్పుడు విశేషమైన ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు ప్రజలకు ఫోన్లు ఉండి.. వాటిలో లోకేషన్ గుర్తించే వీలుండటం రైడ్-షేరింగ్ (క్యాబ్) సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రవాణా వ్యవస్థలో విశేషమైన మార్పులు వచ్చాయి. అదేవిధంగా పెద్దనోట్ల రద్దును నేను తక్కువ అంచనా వేయను. భారత్‌లో ఇలాంటి వాటి వల్ల విశేషమైన బహుళ ప్రభావాలు ఉంటాయి. ఇతర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనే భారత్ ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ల్యాండ్ లైన్లకు బదులు సెల్ఫోన్లు వాడుతున్నాం. అదేవిధంగా డిజిటల్ చెల్లింపులు దేశానికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి. ప్రజలు అనుకుంటున్న దానికన్నా మెరుగైన మౌలికవసతులు దేశంలో ఉన్నాయి’ అని ఆయన అన్నారు. -
చిన్న సంస్థలకు గూగుల్ దన్ను..!
• భారత్ లక్ష్యంగా డిజిటల్ ఉత్పత్తులు • డిజిటల్ అన్లాక్డ్ శిక్షణా కార్యక్రమాలు • ప్రైమర్ మొబైల్ యాప్ ఆవిష్కరించిన సీఈవో సుందర్ పిచాయ్ • త్వరలో మై బిజినెస్ వెబ్‌సైట్స్ న్యూఢిల్లీ: దేశీయంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంబీ) డిజిటల్ బాట పట్టేలా తోడ్పాటు అందించడంపై టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా పలు కొత్త ఆవిష్కరణలను ప్రకటించింది. భారత పర్యటనలో ఉన్న సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ బుధవారం వీటిని ప్రకటించారు. డిజిటల్ అన్లాక్డ్ శిక్షణా కార్యక్రమాలు, ప్రైమర్ మొబైల్ యాప్ మొదలైనవి ఇందులో ఉన్నాయి. భారతీయ సంస్థల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న ఉత్పత్తులను.. క్రమంగా ఇతర దేశాల్లో కూడా ప్రవేశపెడతామని గూగుల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సుందర్ చెప్పారు. భారత్‌లో సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేలా రూపొందించిన సాధనాలు .. ప్రపంచ దేశాల్లో అందరికీ ఉపయోగపడే విధంగా ఉండగలవని ఆయన పేర్కొన్నారు. అందుకే, భారతీయ సంస్థల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను తయారు చేసే దిశగా ఇక్కడి టీమ్‌ను పటిష్టం చేస్తున్నామని సుందర్ వివరించారు. ఎకానమీకి చిన్న సంస్థలే కీలకం.. భారత ఆర్థిక వ్యవస్థకు చిన్న, మధ్య తరహా సంస్థలే (ఎస్ఎంబీ) చోదకాలని పిచాయ్ పేర్కొన్నారు. అటువంటి సంస్థలు డిజిటల్ బాట పట్టేందుకు సరైన సాధనాలు అందుబాటులో ఉండటం ముఖ్యమని పేర్కొన్నారు. వృద్ధి బాటలో అవి మరింత వేగంగా ఎదిగేందుకు తగిన శిక్షణనివ్వడంపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని పిచాయ్ చెప్పారు. ప్రస్తుతం 80 లక్షల పైగా భారతీయ ఎస్ఎంబీలు.. గూగుల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారు. గూగుల్–కేపీఎంజీ సంయుక్త అధ్యయన నివేదిక ప్రకారం 5.1 కోట్ల పైచిలుకు భారతీయ ఎస్‌ఎంబీల్లో సుమారు 68 శాతం ఇప్పటికీ ఆఫ్‌లైన్‌లోనే ఉన్నాయి. ఇంటర్నెట్ వినియోగం పెరుగుతోండటం, ఎస్ఎంబీలు డిజిటల్ బాట పట్టడం తదితర పరిణామాలు దేశ జీడీపీలో చిన్న సంస్థల వాటా 10 శాతం మేర పెరిగేందుకు తోడ్పడగలవు. 2020 నాటికి ఇది 46–48 శాతానికి పెరగవచ్చని అంచనా. నివేదిక ప్రకారం.. ఆఫ్‌లైన్ ఎస్‌ఎంబీలతో పోలిస్తే డిజిటల్‌కు మారిన ఎస్ఎంబీల లాభాలు రెండు రెట్లు వేగంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే, అవి తమ కస్టమర్ల సంఖ్యను కూడా భారీగా పెంచుకోగలవు. సదరు సంస్థలు ఆఫ్‌లైన్‌లో ఉండిపోవడానికి.. సాంకేతిక నైపుణ్యాలు కొరవడటం, డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలపై అవగాహన లేకపోవడం తదితర అంశాలే ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. 5వేల పైచిలుకు వర్క్‌షాపులు.. ఎస్ఎంబీలు ఈ సవాళ్లను అధిగమించడానికి తోడ్పడేలా గూగుల్.. డిజిటల్ అన్లాక్డ్ పేరిట శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. వ్యాపారాలను విస్తరించుకునే దిశగా ఎస్ఎంబీలు డిజిటల్ మాధ్యమాన్ని అందిపుచ్చుకునేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఉపయోగపడుతుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీతో కలిసి గూగుల్ ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోంది. డిజిటల్ అన్లాక్డ్ కార్యక్రమం కింద రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 40 నగరాల్లో 5,000 పైచిలుకు గూగుల్ వర్క్‌షాప్‌లు నిర్వహించనుంది. ఈ కార్యక్రమం కింద.. ఆన్లైన్ ట్రైనింగ్‌లో భారత సంస్థల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన దాదాపు 90 వీడియో ట్యుటోరియల్స్ ఉచితంగా అందుబాటులో ఉంటాయి. గూగుల్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఫిక్కీ ఈ శిక్షణా కార్యక్రమాలను సర్టిఫై చేస్తాయి. మరోవైపు ప్రైమర్ పేరిట డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణనిచ్చే ఉచిత మొబైల్ యాప్‌ను కూడా గూగుల్ ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్స్‌లో అందుబాటులో ఉండే ఈ ప్రైమర్.. ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో లభ్యమయ్యే ఈ యాప్‌నకు సంబంధించి త్వరలోనే తెలుగు, తమిళం, మరాఠీ వెర్షన్స్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న మై బిజినెస్ వెబ్‌సైట్స్ సాధనాన్ని కూడా గూగుల్ ఆవిష్కరించింది. సైబర్ సెక్యూరిటీపైనా దృష్టి పెట్టాలి: మంత్రి రవిశంకర్ ప్రసాద్ గూగుల్ అమెరికన్ కంపెనీ అయినప్పటికీ.. దానిలో భారతీయత కూడా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. భారతీయులు గూగుల్‌ను ఎంతగానో ఆదరిస్తున్నందున.. భారత్ విషయంలో గూగుల్ మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. భారతీయుల అనుగుణమైన ఉత్పత్తులు, సాధనాలను రూపొందించడం, సైబర్ భద్రతపై మరిం తగా కసరత్తు చేయడం మొదలైన వాటితో దేశీ ఎకానమీ వృద్ధికి గూగుల్ తోడ్పాటు అందించాలని మంత్రి సూచించారు. ’రాబోయే 3–4 ఏళ్లలో భారత డిజిటల్ ఎకానమీ 1 లక్ష కోట్ల డాలర్ల పైచిలుకు స్థాయికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఉపయోగపడేలా భారతీయుల ఆకాంక్షలకు తోడ్పడేలా.. స్థానిక భాషల్లో.. స్థానిక అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను తయారు చేయడంపై గూగుల్ ఇండియా దృష్టిపెట్టాలి’ అని ఆయన చెప్పారు. గూగుల్, టాటా ట్రస్ట్‌తో మొబిక్విక్ జట్టు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ నగదు రహిత లావాదేవీల విధానాలను అందుబాటులోకి తెచ్చే దిశగా గూగుల్ ఇండియా, టాటా ట్రస్ట్‌తో మొబైల్ వాలెట్ సంస్థ మొబిక్విక్ చేతులు కలిపింది. దీంతో టాటా ట్రస్ట్స్, గూగుల్ ఇండియా సంయుక్తంగా చేపట్టిన ’ఇంటర్నెట్ సాథీ’ కార్యక్రమాన్ని మరింత మందికి చేరువగా తీసుకెళ్లనున్నట్లు మొబిక్విక్ వివరించింది. ఈ ఒప్పందం కింద ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లలో పైలట్ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. డిజిటల్ అక్షరాస్యత ప్రయోజనాలను 20 కోట్ల మందికి అందించడమే లక్ష్యమని మొబిక్విక్ పేర్కొంది. -
అందరికీ ఫ్రీ ఇంటర్నెట్ లక్ష్యం- గూగుల్
-
అందరికీ ఫ్రీ ఇంటర్నెట్ లక్ష్యం- గూగుల్
న్యూఢిల్లీ: భారత పర్యటనకు విచ్చేసిన ఇంటర్నెట్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చిన్న వ్యాపారస్తులకు ఆఫర్లను ప్రకటించారు. ఢిల్లీలో చిన్న మధ్య తరహా పరిశ్రమల సమావేశంలో బుధవారం పాల్గొన్న ఆయన గూగుల్ కంటే కూడా చిన్న వ్యాపారాల గురించి మాట్లాడానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు. గూగుల్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారస్తులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ సమాఖ్య కంపెనీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సమావేశంలో పాల్గొన్న సుందర్ పిచాయి రాబో్యే మూడు సంవత్సరాలుగా భారతదేశంలో 40 నగరాల్లో 5,000 వర్క్ షాప్ లను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. భారతదేశ సమస్యల్ని అధిగమిస్తే ప్రపంచానికి పరిష్కారాలు చూపించినట్టేనని ఈ సందర్భంగా పిచాయ్ పేర్కొన్నారు. అందరికీ ఉచిత ఇంటర్నెట్ అందించడమే గూగుల్ లక్ష్యమన్నారు. దాదాపు ఇండియాలో దేశ వ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కృషిలో భాగంగా గడిచిన 18 ఏళ్ళలో మెజార్టీ ప్రజలకు తమ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఇంటర్నెట్ ద్వారా ఏ వ్యాపారస్తుడైనా రిజిస్టర్ చేసుకొని శిక్షణ పొందొచ్చని తెలిపారు. అలాగే వారు ఉచితంగా సాధారణ వెబ్సైట్ సృష్టించుకోవచ్చన్నారు. దీనికోసం . వారు చేయవలసిందల్లా ఒక స్మార్ట్ ఫోన్ మరియు కొన్నినిమిషాల సమయాన్ని కేటాయింపు అని చెప్పారు. రిజిస్టర్ చేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ సదుపాయాన్ని అందిస్తామని తెలిపారు. ముఖ్యాంశాలు చెన్నై లో చిన్నప్పుడు , నేను సమాచారం కోసం వెదుక్కున్నాను. నేడు చిన్న పిల్లవాడు వీలైనంత సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. భారతదేశం లో చాలా చిన్న వ్యాపారులు ఇంటర్నెట్ ప్రతి ఒక్కరిదీ అనుకోవాలి. కావాలనుకున్నవారందరికీ నాణ్యమైన డిజిటల్ శిక్షణ అందుబాటులో డిజిటల్ అన్‌లాక్ ప్రోగ్రామ్ గా దీన్ని పిలుస్తున్నాం. భారతదేశం లో 40 నగరాల్లో 5,000 వర్క్ షాప్స్ -
మరోసారి ఇండియాకు గూగుల్ సీఈవో
న్యూఢిల్లీ: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి ఇండియాకు రానున్నారు. ఢిల్లీలో జనవరి 4 నిర్వహిస్తున్న స్మాల్ అండ్ మీడియం బిజినెస్ నిర్వహిస్తున్న ఒక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరునున్నారు. ఈ ఈవెంటలో కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ సహా ఇతర గూగుల్ సీనియర్ అధికారులు కూడా పాల్గొననున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో చాలా చురుకుగా ఉన్న గూగుల్ దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులకు ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పిస్తోంది. టెక్నాలజీ విభాగంలో భవిష్యత్తులో భారత్‌ది కీలకపాత్ర అని ఇటీవల ప్రకటించిన సుందర్ పిచాయ్ భారత్ లోని డిజిటల్ పవర్ ద్వారా ఎస్ఎంబీ-గూగుల్ భాగస్వామ్యంపై దృష్టిపెట్టనున్నారు. ఈ దిశగా ఐటీ మంత్రిత్వ శాఖ గూగుల్ కలిసి ఇప్పటికే పనిచేస్తున్నాయి. మరోవైపు గూగుల్ భాగస్వామ్యంతో రైల్వే శాఖ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలోని సుమారు 400 రైల్వే స్టేషన్లలో ఉచిత వై ఫై సదుపాయాన్ని కల్పించింది. 2017 చివరి నాటికి దేశంలోని మరో 400 ప్రధాన రైల్వే స్టేషన్లలో వై-ఫై సదుపాయం కల్పిస్తామని రైల్వే వర్గాలు వెల్లడించింది. కాగా గుగూల్ సీఈవో అయిన తరువాత సుందర్ పిచాయ్ గత ఏడాది డిసెంబర్ లో భారత్ లో పర్యటించారు. అలాగే ఈ నియామకానికి కొద్ది రోజులు ముందు ఆండ్రాయిడ్ హెడ్ గా ఇండియాను సందర్శించారు. -
టిమ్ కుక్ వర్సస్ సుందర్ పిచాయ్.. గెలుపెవరిదో?
స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్‌ను అధిగమించి, భారత్ మార్కెట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆపిల్ ఓ వైపు ప్రయత్నిస్తుండగా.. సొంత ఆండ్రాయిడ్ డివైజ్లతో మార్కెట్లను ఏలాలని గూగుల్ రంగంలోకి దిగింది. చైనా తర్వాత ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఎక్కువగా దృష్టిసారించిన భారత్ మార్కెట్లో.. ఆ కంపెనీకి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గట్టిపోటీని ఇస్తున్నారు. ఆపిల్ ఇటీవలే తన కొత్త ఐఫోన్లను భారత్ లో లాంచ్ చేయగా...గూగుల్ తన సొంత బ్రాండులోని కొత్త ఫిక్సెల్ స్మార్ట్ఫోన్లను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి గూగుల్ లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా .. ముందస్తుగానే ఆండ్రాయిడ్ మార్కెట్ అంతటిన్నీ తన సొంతం చేసుకుంది. భారత్‌లో 94 శాతం స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఆండ్రాయిడ్ ఓఎస్ డివైజ్లే ఏలుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ వైపు అత్యాధునికమైన డివైజ్‌లుగా ఆపిల్‌కు ఎంతో పేరుంది. ఆపిల్‌కు పోటీగా హై ఎండ్ డివైజ్‌లను తాము తీసుకొచ్చామంటూ గూగుల్ సీఈవో ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ప్రకటించిన ఆపిల్ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో ఆపిల్ విక్రయాలు గ్లోబల్‌గా దెబ్బతిన్నప్పటికీ, భారత్ మార్కెట్లో మెరుగైన ఫలితాలనే సాధించింది. భారత్‌లో ఐఫోన్ విక్రయాలను 50 శాతం పెంచుకున్నట్టు ప్రకటించింది. అయితే గూగుల్ కంపెనీ నుంచి తమకు గట్టి పోటీ వాతావరణం నెలకొందని పేర్కొంది. కానీ ఆండ్రాయిడ్ డివైజ్ ల ఆధిపత్యాన్ని తాము ఎలాగైనా కొల్లగొడతామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ గట్టిగా నొక్కి చెప్పారు. చైనా తర్వాత తాము ఎక్కువగా ఇండియా మార్కెట్‌పైనే దృష్టిసారించామని టిమ్ కుక్ తెలిపారు. రిలయన్స్ జియో ఇంటర్నెట్ స్పీడ్ సహకారంతో గూగుల్, శాంసంగ్‌లను తాము అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఒక్కసారి ఆండ్రాయిడ్ కస్టమర్లు ఐఫోన్ల వైపు మరిలితే, వారు ఇతర ఓఎస్‌లను కనెత్తి కూడా చూడరని విశ్లేషకులంటున్నారు. గూగుల్, తన ఆండ్రాయిడ్ కస్టమర్లను వదులుకుంటే, మళ్లీ వారిని తనవైపు మరలుచుకోవడం కొంత కష్టతరమేనంటున్నారు విశ్లేషకులు. అంతేకాక పాతుకుపోయిన ఆండ్రాయిడ్ డివైజ్‌లను మార్కెట్ నుంచి తొలగించడం ఆపిల్‌కూ ఓ పెద్ద సవాలేనట. ధర పరంగా కూడా ఆపిల్ కొత్త ఐఫోన్7, గూగుల్ కొత్త పిక్సెల్ ఫోన్ లు గట్టి పోటీ ఇంచుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో భారత్ మార్కెట్ ఇటు ఆపిల్ సీఈవో టిమ్ కుక్కు, అటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. రానున్న మార్కెట్లో గెలుపెవరిదో వేచిచూడాల్సిందే. ఎవరి వ్యూహాలు ఎలా ఫలిస్తాయో. -
అప్పుడు జుకర్బర్గ్ది..ఇప్పుడు పిచాయ్ది..!
కోరా అకౌంట్‌ను హ్యాక్ చేసిన అవర్‌మైన్ న్యూయార్క్: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు చెందిన కోరా అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ చర్యకు పాల్పడింది ఎవరో కాదు.. ఇది వరకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన ట్వీటర్, పింటరెస్ట్ అకౌంట్లను హ్యాక్ చేసిన ‘అవర్‌మైన్’ సంస్థే మళ్లీ ఇప్పుడు పిచాయ్ అకౌంట్‌నూ హ్యాక్ చేసింది. ఈ సంస్థ పిచాయ్ అకౌంట్ ద్వారా ఆయనకు తెలియకుండానే కోరాలో పలు మెసేజ్‌లను పోస్ట్ చేసింది. కోరా అకౌంట్ ట్వీటర్‌తో కూడా అనుసంధానమై ఉండటంతో అవర్‌మైన్ చేసిన పోస్టులన్నీ.. పిచాయ్కున్న 5,08,000 మంది ఫాలోవర్స్‌కు వెళ్లాయి. అవర్‌మైన్ సంస్థ తొలిగా ‘హ్యాక్డ్’ అని పోస్ట్ చేసింది. తర్వాత మీ సెక్యూరిటీ లెవెల్స్‌ను పరీక్షించడానికే హ్యాక్ చేశామని తరువాతి పోస్ట్‌లలో పేర్కొంది. పిచాయ్ టీమ్ కోరా అకౌంట్‌ను తిరిగి తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. తదనంతరం అకౌం ట్లోని అవర్‌మైన్ పోస్ట్‌లను తొలగించారు. కాగా అవర్‌మైన్ సంస్థ టెక్ దిగ్గజాల అకౌంట్లను ఎలా హ్యాక్ చేస్తోందనేది ఇప్పటిదాకా వెల్లడి కాలేదు. -
స్మార్ట్ ఫోన్స్ తయారీ యోచన లేదు: పిచాయ్
న్యూయార్క్: ఇప్పటికిప్పుడు సొంతంగా స్మార్ట్‌ఫోన్స్‌ను తయారు చేయాలనీ ఉద్దేశం తమకు లేదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టంచేశారు. దీనికోసం ఒరిజినల్ ఎక్విప్మెంట్ మానుఫాక్చరర్స్ (ఓఈఎం)తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. మొబైల్స్ తయారీకి ఓఈఎంలతో పనిచేయాలనే ప్రణాళికనే అవలంబిస్తామని చెప్పారు. నెక్సాస్ ఫోన్లపై అధికంగా దృష్టి కేంద్రీకరించామని, భవిష్యత్తులో వీటికి మరిన్ని ఫీచర్లను జతచేస్తామని తెలిపారు. గూగుల్.. నెక్సాస్ ఫోన్లలోని సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ అంశాలను మాత్రమే చూసుకుంటుందని, వాటి తయారీ బాధ్యతలను భాగస్వామ్య తయారీదారులకు అప్పగిస్తుందని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ అనేది ఒక పెద్ద ఓపెన్ ప్లాట్‌ఫామ్ అని చెప్పారు. కాగా ఈయన ఇటీవల వాయిస్ యాక్టివేటెడ్ ప్రొడక్ట్ ‘గూగుల్ హోమ్’ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇది గూగుల్ అసిస్టెంట్ అనే టెక్నాలజీని మన గదికి తీసుకువస్తుంది. ఆయన దీనితోపాటు మేసేజింగ్ యాప్ ‘అలో’, వీడియో కాలింగ్ యాప్ ‘డుయో’ సహా పలు ఉత్పత్తులను ఆవిష్కరించారు. -
గూగుల్ స్మార్ట్ ఫోన్లకు ఇంకా టైమ్ ఉందట
న్యూయార్క్ : స్మాప్ట్ వేర్ దిగ్గజం గూగుల్ నుంచి సొంత స్మార్ట్ ఫోన్ రూపొందించే ప్రణాళికలేమి లేవని కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. నెక్సస్ డివైజ్ ల రూపకల్పనలో ఒరిజనల్ ఎక్విప్ మెంట్ మానుఫాక్చర్స్ తోనే కలిసి పనిచేస్తామని పిచాయ్ పేర్కొన్నారు. కాలిఫోర్నియాలోని కోడ్ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. హార్డ్ వేర్ పార్టనర్లతోనే భవిష్యత్తులో కూడా కలిసి పనిచేసే ప్లాన్లు ఉన్నాయన్నారు. నెక్సస్ లో మరిన్ని పెట్టుబడులకు ప్రయత్నిస్తామని చెప్పారు. నెక్సస్ డివైజ్ లోనే ఎక్కువ దృష్టి సారిస్తామని చెప్పారు. ఫోన్లకు మించిన కేటగిరీలు తమ ముందు ఉన్నాయన్నారు. ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ ఎకో సిస్టమ్ అని, ప్రపంచంలో ఉన్న ప్రతి భాగానికి గ్లోబల్ ప్లేయర్ ఒకరే సమాధానం చెప్పలేరని పిచాయ్ తెలిపారు. ఇండియా, చైనాలో చాలా స్థానిక కంపెనీలు ఉన్నాయని, అక్కడ అవి చాలా బాగా విజయవంతం అవుతున్నాయన్నారు. నేటికాలంలో ఆండ్రాయిడ్ అతిపెద్ద ఎకో సిస్టమ్, ఆండ్రాయిడ్ లో ఓపెన్ విధానం కలిగిఉన్న కంపెనీలకు కృతజ్క్షతలని పిచాయ్ చెప్పారు. స్మార్ట్ ఫోన్, హార్డ్ వేర్ పరిశ్రమలు రెండు డిమాండ్ ఎక్కువ కలిగి ఉండి, పోటీతత్వంతో ముందుకు వెళ్తున్నాయన్నారు. ఇంటిలిజెంట్ వర్చువల్ ఫ్రెండ్స్ యాపిల్ సిరీ, మైక్రోసాప్ట్ కోర్ టనా వంటి వాటికి సమానంగా గూగుల్ అసిస్టెంట్ ప్రొగ్రామ్ ను పిచాయ్ ఇటీవలే ఆవిష్కరించారు. మూవీ టికెట్ల బుకింగ్ లాంటి ప్రతిరోజు చేసే పనులకు ఇంటర్నెట్ యూజర్లకు గూగుల్ అసిస్టెంట్ సహకరించనుంది. -
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లోకి గూగుల్
♦ గూగుల్ అసిస్టెంట్ ఆవిష్కరణ ♦ గూగుల్ హోమ్ ప్రొడక్ట్, అలో, డుయో, డేడ్రీమ్, ఆండ్రాయిడ్ ఎన్, ఆండ్రాయిడ్ వియర్ 2.0 కూడా.. శాన్ఫ్రాన్సిస్కో: దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా ‘గూగుల్ అసిస్టెంట్’ అనే కొత్త టెక్నాలజీని ఆవిష్కరించారు. అలాగే ఆయన ‘గూగుల్ హోమ్’ అనే వైస్-యాక్టివేటెడ్ ప్రొడక్ట్‌ను, ‘అలో’ మేసేజింగ్ యాప్‌ను, ‘డుయో’ వీడియో కాలింగ్ యాప్, ఇన్స్టాంట్ యాప్స్, మొబైల్ సాఫ్ట్వేర్ ‘ఆండ్రాయిడ్ ఎన్’ను , వీఆర్ ప్లాట్‌ఫామ్ ‘డేడ్రీమ్’ను, వియరబుల్ ప్లాట్‌ఫామ్ ‘ఆండ్రాయిడ్ వియర్ 2.0’ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో బుధవారం జరిగిన సంస్థ వార్షిక డెవలపర్ సమావేశంలో వీటి ఆవిష్కరణ జరిగింది. గూగుల్ అసిస్టెంట్: గూగుల్ అసిస్టెంట్ అనేది ఒక టెక్నాలజీ. దీన్ని పలు ఉపకరణాల్లో వాడొచ్చు. ఇది మనం గూగుల్‌తో మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. అంటే మనకు అవసరమైన పనిని గూగుల్‌కు చెబితే.. అది దాన్ని చేసిపెడుతుంది. ఉదాహరణకు మనం డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు సినిమా టికెట్లను బుక్ చేసుకోవాలనుకుంటే.. ఆ అంశాన్ని గూగుల్ అసిస్టెంట్‌కు చెబితే.. టికెట్లను బుక్ చేస్తుంది. అలాగే మూవీ ప్రారంభానికి ముందు దారిలో ఏదైనా తినాలనుకుంటే.. దగ్గరిలోని రెస్టారెంట్ల వివరాలను తెలియజేస్తుంది. తర్వాత సినిమా థియేటర్‌కు ఎలా వెళ్లాలో దారి చూపిస్తుంది. ఈ విషయాలన్నింటినీ పిచాయ్ తన బ్లాగ్‌లో తెలిపారు. గూగుల్ హోమ్: గూగుల్ హోమ్.. ఇది ఒక వైస్-యాక్టివేటెడ్ ప్రొడక్ట్. ఇందులో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ఉంటుంది. దీంతో ఇంట్లో పలు పనులను చేయొచ్చు. అంటే వాయిస్ కమాండ్స్ ద్వారా గదిలో పాటలను ప్లే అవుతాయి. లైట్స్‌ను ఆన్ చేసుకోవచ్చు. గూగుల్ హోమ్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని పిచాయ్ తెలిపారు. అలో: ఫేస్బుక్ మెసెంజర్, వాట్స్‌యాప్‌లకు పోటీగా గూగుల్ ఈ మెసేజింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది. మీరు మీ స్నేహితుడికి ఒక ఫోటో పంపాలనుకుంటే.. దాన్ని అప్లోడ్ చేస్తే.. ఈ యాప్ దానికి సరైన కొటేషన్స్‌ను చూపిస్తుంది. అలాగే ఇది మనకు ఏదైనా టెక్స్‌కు సరిపడే వీడియో లింక్స్‌ను చూపిస్తుంది. డుయో: ఇది వీడియో కాలింగ్ యాప్. స్లో నెట్‌వర్క్‌లో కూడా నాణ్యమైన వీడియో కాలింగ్ తమ ఉద్దేశమని పిచాయ్ తెలిపారు. ఇందులో నాక్ నాక్ ఫీచర్ కూడా ఉంటుందని, దీంతో కాల్‌కు ఆన్సర్ చేయక ముందే అవతలి వారి లైవ్ వీడియో చూడొచ్చని పేర్కొన్నారు. ఈ సమ్మర్లోనే రెండు యాప్స్ అందుబాటులోకి తెస్తామన్నారు. ఇన్స్టాంట్ యాప్స్: గూగుల్ సంస్థ తన ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ఇన్స్టాంట్ యాప్స్ అనే మరొక ఫీచర్‌ను జతచేయనున్నది. ఇన్స్టాంట్ యాప్స్ అంటే వీటిని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్స్టాల్ చేసుకోకుండానే పనిచేస్తాయి. ఈ యాప్స్ స్మార్ట్‌ఫోన్‌కు బదులు గూగుల్ సర్వర్లలో రన్ అవుతాయి. -
గూగుల్ ట్రెడిషన్ ను బ్రేక్ చేసిన పిచాయ్
శాన్ హోసె: ఆన్ లైన్ దిగ్గజ సంస్థ గూగుల్ లో సంప్రదాయాన్ని సీఈవో సుందర్ పిచాయ్ బ్రేక్ చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది గూగుల్ ఇన్వెస్టర్లకు ఆ సంస్థ నుంచి లేఖలు వెళ్లాయి. అయితే గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ ఈ లేఖలు రాయలేదు. సంప్రదాయానికి భిన్నంగా సీఈవో పిచాయ్ లేఖలు రాశారు. నిజానికి పిచాయ్ గూగుల్ వ్యవస్థాపకుడు కాదు. ఆయనకు అత్యంత ప్రాధాన్యం దక్కిందని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. అంతేకాదు పిచాయ్ పనితీరు పట్ల లారీ పేజ్, సెర్జీ బ్రిన్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లేఖలో పిచాయ్ ను పరిచయం చేస్తూ లారీ పేజ్ రాసిన ఇంట్రడక్షన్ లో ఆయనపై ప్రశంసలు కురిపించారు. పిచాయ్ పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆరు ప్రధాన విభాగాలపై దృష్టి సారించాల్సిన అవసరముందని పిచాయ్ తన లేఖలో పేర్కొన్నారు. గూగుల్ ప్రారంభమైన కొత్తలో సమాచారం అందించే బాధ్యతను మాత్రమే నిర్వర్తించిందని తర్వాత ప్రాధాన్యాలు మారాయన్నారు. 'టెక్నాలజీ అంటే డివైసెస్ లేదా ప్రొడక్టులను తయారు చేయడమే కాదు. లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి. టెక్నాలజీ అనేది ప్రజాస్వామ్యీకరణ శక్తి. సమాచారం ద్వారా ప్రజలను సాధికారత దిశగా నడిపించాల'ని పిచాయ్ పేర్కొన్నారు. ప్రజలు విభిన్న తరహాలో సమాచారం కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఏఐ, స్మార్ట్ ఫోన్ సంబంధిత టెక్నాలజీలో గూగుల్ పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. తన లేఖను గూగుల్ ప్లస్, ట్విటర్, పేస్ బుక్ లో షేర్ చేశారు. -
2015లో పిచాయ్ అందుకున్న జీతమెంతో తెలుసా?
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ 2015లో జీతభత్యాల కింద అక్షరాల రూ. 667 కోట్లు (100.5 మిలియన్ డాలర్లు) అందుకున్నారు. గడిచిన ఏడాది ఆయనకు జీతం కింద 652,500 డాలర్లు (రూ. 4.32కోట్లు) లభించగా, రిస్ట్రిక్టెడ్ వాటాల రూపంలో 99.8 మిలియన్ డాలర్ల (రూ. 662 కోట్లు) మొత్తం లభించాయి. ఈ వాటాలను 2017 తర్వాత పూర్తిస్థాయిలో డబ్బు రూపంలో మార్చుకోవచ్చు. ఇక ఇతర భత్యాల రూపంలో 22,935 డాలర్లు పిచాయ్‌కు అందాయి. రెగ్యూలేటరీ ఫిల్లింగ్స్ ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2015 ఆగస్టులో గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ బాధ్యతలు స్వీకరించారు. మాతృసంస్థ ఆల్పాబెట్ గొడుగు కింద గూగుల్ సంస్థలన్నింటినీ పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. గతంలో గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ బాధ్యతలు చూసుకున్న పిచాయ్ గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు గత ఫిబ్రవరిలో 199 మిలియన్ డాలర్ల (1,320 కోట్లు) రిస్ట్రిక్టెడ్ వాటాలను బహుమతిగా అందించింది. ప్రాడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా 2004లో పిచాయ్ గూగుల్ లో చేరారు. ఆయన నాయకత్వంలో సమిష్టి కృషితో గూగుల్ క్రోమ్ ను లాంచ్ చేశారు. 2008 లాంచ్ అయిన గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్‌గా విశేషమైన ఆదరణను పొందింది. -
యాపిల్‌ను వెనకేసుకొచ్చిన పిచాయ్
ఐఫోన్ యూజర్ల వ్యక్తిగత ప్రైవసీ విషయమై ఎఫ్‌బీఐ, యాపిల్ సంస్థకు మధ్య జరుగుతున్న పోరాటంపై గూగుల్ సీఈవో, భారత సంతతి వ్యక్తి సుందర్ పిచాయ్ స్పందించారు. ఉగ్రవాది సయెద్ ఫరూఖ్ ఐఫోన్ యాక్సెస్‌ను ఎఫ్‌బీఐకి ఇవ్వడానికి యాపిల్ నిరాకరించడాన్ని ఆయన సమర్థించారు. ఈ సందర్భంగా గతంలో యాపిల్ సీఈవో టిమ్ కూక్ ప్రచురించిన యాపిల్ ప్రైవసీ లేఖను సుందర్ పిచాయ్ ప్రస్తావించారు. ఉగ్రవాది ఐఫోన్ యాక్సెస్ ఇవ్వాలంటూ అమెరికా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు భవిష్యత్తులో అసాధారణ సమస్యాత్మక పరిస్థితులకు దారితీయవచ్చునని పిచాయ్ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచే ఎన్క్రిప్షన్ రక్షణ చర్యలు ఐఫోన్ మాదిరిగా ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను పర్యవేక్షించే గూగుల్ సంస్థ కూడా ఈ చర్చలోకి ప్రవేశించడం చాలా కీలకంగా మారింది. మొబైల్ ఫోన్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచాల్సిందేనన్న యాపిల్ నిర్ణయానికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మద్దతు పలికారు. 'మీ సమాచారానికి పూర్తి భద్రత కలిగించే ఉత్పత్తులను మేం రూపొందిస్తున్నాం. అయితే ఈ విషయంలో చట్టబద్ధమైన ఆదేశాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు ఈ డాటా యాక్సెస్‌ను ఇస్తాం' అని మొదట ట్వీట్ చేసిన పిచాయ్ ఆ వెంటనే 'అయితే వినియోగదారుడి పరికరాన్ని హ్యాక్ చేసి.. అందులోని సమాచారాన్ని ఇవ్వమనడం మాత్రం అందుకు పూర్తి విరుద్ధమే' అని మరో ట్వీట్ లో తేల్చిచెప్పారు. హ్యాకింగ్ చేయాలంటూ కంపెనీలను బలవంత పెట్టడం వినియోగదారుల ప్రైవసీ విషయంలో రాజీపడటమే అవుతుందని, ఈ కీలక విషయంలో బహిరంగ చర్చ జరుగాల్సి ఉందని పిచాయ్ స్పష్టం చేశారు. మరోవైపు విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడన్ కూడా యాపిల్ సంస్థకు మద్దతు పలికారు. పౌరుల వ్యక్తిగత విషయాల్లోకి చొరబడేవిధంగా ఉన్న ఎఫ్‌బీఐ తీరును వ్యతిరేకిస్తున్న యాపిల్ ను ఆయన కొనియాడారు. -
సుందర్ పిచాయ్ శాలరీ ఎంతో తెలుసా?
బెంగళూరు: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టిన సుందర్ పిచాయ్ అమెరికాలోనే అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోగా ఘనత సొంతం చేసుకున్నారు. వేతనం కింద గూగుల్ సంస్థలో 199 మిలియన్ డాలర్ల (రూ. 1353.39 కోట్లు) విలువైన వాటాలు పొందడం ద్వారా ఈ ఘనత ఆయన సొంతమైంది. ఈ నెల 3న భారత సంతతికి చెందిన పిచాయ్ పేరిట గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 2,73,328 క్లాస్ సీ వాటాలు ఆయనకు గ్రాంట్ రూపంలో అందజేసింది. ఆ రోజున స్టాక్ మార్కెట్ ముగిసేనాటికి ఈ వాటాల విలువ 19.9 కోట్ల డాలర్లు. ఇందులో 375 క్లాస్ ఏ ఉమ్మడి వాటాలను 786.28 డాలర్ల చొప్పున, 3,625 క్లాస్ సీ మూలధన వాటాలను 768.84 డాలర్ల చొప్పున పిచాయ్ అమ్మేశారని ఆల్ఫాబెట్ సంస్థ తెలిపింది. మొత్తంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్లో సుందర్ పిచాయ్‌కి 650 మిలియన్ డాలర్ల (రూ. 4420.61 కోట్ల) విలువైన వాటాలు ఉన్నాయి. అయితే, గూగుల్ స్థాపకులు ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్కు కంపెనీలో ఉన్న నికర సంపదతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఫోర్బ్స్ తెలియజేసిన వివరాల ప్రకారం పేజ్‌కు 34.6 బిలియన్ డాలర్లు, బ్రిన్కు 33.9 బిలియన్ డాలర్ల సంపద ఉంది. గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ షిండ్ట్కు కూడా మూడు బిలియన్ డాలర్ల సంపద ఉంది. సుందర్ పిచాయ్కే కాదు గతంలో ఆల్ఫాబెట్ సీఎఫ్ వోగా ఉన్న రూత్ పొరట్ కూడా భారీగా వేతనం పొందింది. గత ఏడాది మోర్గాన్ స్టాన్లీ చేరడానికి ముందువరకు ఆమెకు 38 మిలియన్ డాలర్ల వాటాలు వేతనంగా, 30 మిలియన్ వాటాలు బోనస్‌గా లభించాయి. -
'క్రికెటర్ ను కావాలనుకున్నా'
-
పీఎం మోదీని కలిసిన పిచాయ్
-
'క్రికెటర్ ను కావాలనుకున్నా'
న్యూఢిల్లీ:భారత క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లైన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లకు తనో పెద్ద వీరాభిమానినని గూగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. గవాస్కర్ క్రికెట్ ఆడిన రోజుల్లోనే కాకుండా ఆ తరువాత కూడా ఆయనకు ఒక పిచ్చి అభిమానిగా ఉండేవాడినని పిచాయ్ తెలిపారు. తాను అసలు క్రికెటర్ ను కావాలనుకున్నానని తన మనసులోని మాటను బయటపెట్టారు సుందర్ పిచాయ్. గురువారం ఢిల్లీలోని శ్రీరాం కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి భేటీ అయిన సుందర్ పిచాయ్ వారితో తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 'చాలా మంది భారతీయ క్రికెటర్ల వలే నాకు కూడా క్రికెటర్ ను కావాలనే కోరిక అమితంగా ఉండేది. ఆ కలే ఎప్పుడూ నాలో మెదులుతూ ఉండేది. ఆ క్రమంలోనే గవాస్కర్ అభిమానిగా మారా. గవాస్కర్ క్రికెట్ ను వదిలేశాక కూడా ఆయనంటే తెలియని అభిమానం నాలో ఉండిపోయింది. అటు తరువాత సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతున్న రోజుల్ని ఎక్కువగా ఆస్వాదించా. వన్డే మ్యాచ్ లతో పాటు, టెస్టు మ్యాచ్ లను కూడా రెగ్యులర్ గా చూస్తూ ఉండేవాణ్ని. కాకపోతే ట్వంటీ 20 మ్యాచ్ ల్ని మాత్రం ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయా'అని ఐఐటీ ఖరగ్ పూర్ పూర్వ విద్యార్థి, 43 ఏళ్ల సుందర్ పిచాయ్ తెలిపారు. ఇక ఫుట్ బాల్ లో లియోనెల్ మెస్సీ అంటే విపరీతమైన ఇష్టమని పేర్కొన్నారు. -
విద్యార్థులూ... రిస్క్ తీసుకోండి: పిచాయ్
న్యూఢిల్లీ: రిస్క్ తీసుకోవడానికి ముందుకు రావాలని విద్యార్థులకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిలుపునిచ్చారు. అకడమిక్ చదువుల కంటే క్రియేటివిటీ ముఖ్యమని పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని శ్రీరాం కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులారా కాసింత రిస్క్ తీసుకోండి. రిస్క్ వల్ల ఇబ్బందులతో పాటు విజయం కూడా వస్తుంది. వచ్చే తరానికి క్రియేటివిటీ అన్నదే ప్రధానాంశం. చదువుల కంటే సృజన ముఖ్యం. ఉద్యోగాలు చేయడం గురించి కాదు, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా ఆలోచనలు ఉండాలి. చదువైపోగానే ఓ కొత్త కంపెనీ ప్రారంభించాలన్న తపన ఉండాలి. ఇండియాలో స్టార్ ఆప్ కల్చర్ పెరుగుతోంది. దేశంలో ఎంతమంది డెవలపర్లు ఉంటే అన్ని పరిష్కారాలు దొరుకుతాయి. పాఠశాలల్లో కోడింగ్ ను తప్పనిసరి చేయాలి' అన్నారు. ఇండియా చాలా మారిందని అన్నారు. సిలికాన్ వ్యాలీకి, ఢిల్లీకి తేడా లేదని పేర్కొన్నారు. -
వంద రైల్వే స్టేషన్లకు వై-ఫై: సుందర్ పిచాయ్
భారతదేశంలోని వంద రైల్వే స్టేషన్లకు 2016 డిసెంబర్ నాటికల్లా వై-ఫై సదుపాయం కల్పిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. భారతదేశ పర్యటనలో ఉన్న ఆయన మీడియా, డెవలపర్లు, పారిశ్రామికవేత్తలు, మార్కెటింగ్ నిపుణులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా పిచాయ్ పర్యటన సాగుతున్నట్లు తెలుస్తోంది. సామాన్యుడి చెంతకు కూడా టెక్నాలజీని తీసుకెళ్లాలన్నది పిచాయ్ వ్యూహమని చెబుతున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా ఐదు అంశాలను ప్రస్తావిస్తున్నారు. 1) భారతదేశంలోని వంద రైల్వే స్టేషన్లలో రైల్‌టెల్ సహకారంతో 2016 డిసెంబర్ నాటికల్లా వై-ఫై సేవలు 2) మూడేళ్లలో భారతదేశంలోని 3 లక్షల గ్రామాల్లో మహిళలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు గూగుల్ సాయం 3) భారతదేశం కోసం ఉత్పత్తులు తయారుచేసేందుకు హైదరాబాద్‌లో 'ఇంజనీరింగ్ ప్రెజెన్స్'ను పెంచడం 4) 11 భాషల్లో టైప్ చేసేందుకు ఉపయోగపడే గూగుల్ 'ఇండిక్' కీబోర్డు 5) 2016 నుంచి గూగుల్ సెర్చ్ ద్వారా లైవ్ క్రికెట్ అప్డేట్లు -
ప్రణబ్, మోదీలతో భేటీ కానున్న సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విడిగా భేటీ కానున్నారు. గూగుల్ సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా భారత్‌కు వస్తున్న సుందర్ పిచాయ్ బుధవారం మీడియాతో మాట్లాడతారు. తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లను కలుసుకుంటారు. గురువారం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ క్యాంపస్‌లో విద్యార్థులతో కొంత సమయం గడుపుతారు. ఆ తరవాత మోదీతో భేటీ అవుతారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రపతితో సమావేశమవుతారు. పిచాయ్ ఈ పర్యటనలో భాగంగా కొత్త ఆవిష్కరణలు ప్రకటించవచ్చని సమాచారం. చెన్నైకి చెందిన సుందర్ పిచాయ్ ఆగస్ట్‌లో గూగుల్ సీఈవోగా నియమితులైన విషయం తెలిసిందే. -
ముస్లింలకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మద్దతు
న్యూయార్క్: ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ బాటలోనే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ముస్లింలకు మద్దతు పలికారు. అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు, ఇతర మైనారిటీలకు మద్దతివ్వాలన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ట్రంప్ ముస్లింలను అమెరికాలోకి అడుగుపెట్టనీయవద్దని చెప్పడం తెలిసిందే. దీనిపై పిచాయ్ స్పందిస్తూ, ఒక కంపెనీ, ఒక పురోగతి సాధించాలంటే అన్ని వర్గాలను కలుపుకు వెళ్లాలని సోషల్ మీడియాలో అన్నారు. పారిస్ దాడిని ప్రస్తావిస్తూ ఎవరో కొందరు చేసిన పనికి ముస్లింలందరినీ నిందించొద్దన్నారు. -
'ప్రపంచాన్ని మార్చే శక్తి ఆయనకు ఉంది'
శాన్ జోసె: ప్రపంచాన్ని, భారత్ ను మార్చే శక్తి ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని సిస్కో సిస్టమ్స్ సీఈవో జాన్ చాంబర్స్ అభిప్రాయపడ్డారు. మోదీకి గ్లోబల్ విజన్ ఉందని, ప్రపంచ పరిణామాలపై ఆయనకు అవగాహన ఉందని అన్నారు. కాలిఫోర్నియాలోని శాన్ జోసెలో ఐటీ దిగ్గజ కంపెనీల సీఈవోలతో నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు సీఈవోలు మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ అమెరికాకు రావడం తమకెంతో ఆనందంగా ఉందని ఎడోబ్ సీఈవో శంతను నారాయణ్ అన్నారు. భారతదేశ వ్యాప్తంగా చవకైన బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. మోదీతో భేటీ అయిన వారిలో గూగుల్ సీఈవో సుందర్ పిచ్చై, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టిఐఈఎస్ సీఈవో వెంక్ శుక్లా తదితరులు ఉన్నారు. -
'సుందర్... మీ కాలేజీని సందర్శించండి'
కోల్ కతా: గూగుల్ సీఈఓగా నియమితులైన సుందర్ పిచాయ్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. ఐఐటీ ఖరగ్ పూర్ ను సందర్శించాలని ఆకాంక్షించారు. 'సుందర్ పిచాయ్ కు అభినందనలు. మీరు స్ఫూర్తి ప్రదాత. ఐఐటీ ఖరగ్ పూర్ లో మీరు విద్య అభ్యసించడం మాకెంతో గర్వకారణం. మీరు చదువుతున్న కాలేజీని త్వరలోనే సందర్శిస్తారని ఆశిస్తున్నాం' అని మమత ట్వీట్ చేశారు. 1993లో అమెరికా వెళ్లడానికి ముందు సుందర్ పిచాయ్... ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. కాగా, గూగుల్ సీఈఓగా ఎంపికైన సుందర్ పిచాయ్ కు అభినందనలు తెలిపేందుకు ఐఐటీ ఖరగ్ పూర్ ప్రత్యేకంగా ఫేస్ బుక్ లో పేజీలో ప్రారంభించింది. -
సత్యం.. శివం.. సుందరం
సత్యం.. శివం.. సుందరం. ఐటీ రంగంలో త్రిమూర్తులు సత్య నాదెళ్ల, శివ నాడార్, సుందర్ పిచాయ్ వెలిగిపోతున్నారు. తెలుగుతేజం సత్య నాదెళ్ల ప్రఖ్యాత మైక్రోసాప్ట్ సీఈఓగా .. తమిళులు శివ నాడర్ దేశీయ సాఫ్ట్వేర్ సంస్థల దిగ్గజం హెచ్‌సీఎల్ చైర్మన్‌గా, సుందర్ పిచాయ్ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈఓగా.. ఐటీ రంగాన్ని శాసిస్తున్నారు. ఐటీ అంటేనే భారత్ అంటూ ప్రపంచం గుర్తించేలా చేశారు. అంతర్జాతీయ ఐటీ రంగంలో భారత్‌ది ప్రత్యేక స్థానం. సత్య నాదెళ్ల.. మైక్రోసాప్ట్ సీఈఓ పదవి తెలుగువాడికి దక్కింది. సాప్ట్వేర్ దిగ్గజం బిల్‌గేట్స్ వారసుడిగా మైక్రోసాప్ట్ కార్పోరేషన్ కొత్త సీఈఓగా హైదరాబాద్‌కు చెందిన ప్రవాస భారతీయుడు సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. గత 38 ఏళ్లలో సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టారు. ఇటువంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం గర్వించదగిన విషయం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న సత్య మంగళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఆ తరువాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన వార్షిక జీతం ప్రసుత్తం 84.3 మిలియన్ డాలర్లు (రూ.525 కోట్లు). శివనాడార్.. 1945లో తమిళనాడులోని తూతుకుడి జిల్లా తిరుచెందూరుకు 10 కిలో మీటర్ల సమీపంలో మూలైపొజి గ్రామంలో శివనాడార్ జన్మించారు. కుంభకోణంలో పాఠశాల విద్య అభ్యసించారు. మధురైలోని ద అమెరికన్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ డిగ్రీ, కోయంబత్తూరులోని పీఎస్జీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ చేశారు. పుణెలో వాల్చంద్ గ్రూపు కూపర్ ఇంజినీరింగ్ కాలేజీలో కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత మిత్రులతో కలసి 1976లో హెచ్సీఎల్ను స్థాపించారు. ఐటీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా నాడార్కు 2008లో పద్మభూషణ్ అవార్డు వరించింది. విద్యారంగంలోనూ నాడార్ విరాళాలు ఇస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద దాదాపు 88 వేల కోట్ల రూపాయలు. సుందర్ పిచాయ్.. అంతర్జాతీయ స్థాయి ఐటీ రంగంలో మరో భారత సంతతి వ్యక్తి అత్యున్నత పదవి అలంకరించారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ (43) ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవోగా నియమితులయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో సుందర్ 1972లో జన్మించారు. ఆయన ఐఐటీ- ఖరగ్‌పూర్ నుంచి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ సంపాదించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్, వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టాను సుందర్ పొందారు. పిచాయ్ 2004 లో గూగుల్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయికి చేరారు. ఆయన వార్షిక జీతం రూ. 310 కోట్లు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబోయి సూపర్ స్టార్ అయ్యాడు
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానన్నది పాతమాట. షారుక్ ఖాన్ మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావలనుకుని బాలీవుడ్ బాద్షా అయ్యారు. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ నూతన సీఈఓ సుందర్ పిచాయ్ సమక్షంలో షారుక్ స్వయంగా ఈ విషయం చెప్పారు. గతేడాది అక్టోబరులో కాలిఫోర్నియాలోని గూగుల్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షారుక్ పాల్గొన్నారు. గూగుల్‌ప్లెక్స్‌లో షారుక్.. సుందర్‌తో 30 నిమిషాల పాటు చాట్ చేశారు. ఈ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ.. 'నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నా. యాక్టర్ కావాలని అనుకోలేదు. నేను మొద్దులా కనిపిస్తాను కానీ నిజంగా కాదు. నేను చాలా తెలివైనవాణ్ని. ఎలెక్ట్రానిక్స్ చేశా' అని చెప్పారు. తాను ఐఐటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాశానని, తాను చదువకునే కాలంలో ఐటీ అంతగా అభివృద్ది చెందలేదని షారుక్ వెల్లడించారు. హ్యాపీ న్యూ ఇయర్ చిత్రం ప్రమోషన్ కోసం అప్పట్లో షారుక్ అమెరికా వెళ్లారు. గూగుల్ నూతన సీఈఓగా తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ నియమితులైన సంగతి తెలిసిందే. షారుక్.. గూగుల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించినపుడు సుందర్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. తాజాగా అత్యున్నత పదవి రావడంతో సుందర్ పేరు మారుమోగుతోంది. ప్రధాని సహా చాలామంది ప్రముఖులు సుందర్‌కు అభినందనలు తెలపారు. -
ఇంటర్నెట్ శిఖరం పై ఇండియన్
గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజానికి భారతీయుడి సారథ్యం కంపెనీ ప్రధాన ఆదాయ వనరుల విభాగాలు ఆయన కిందే గూగుల్‌కు కొత్తగా మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఏర్పాటు న్యూయార్క్: వేల కోట్ల డాలర్ల ఆదాయాలు ఆర్జించే మరో అమెరికన్ దిగ్గజ కంపెనీకి మరో భారతీయుడు సారథ్యం వహించనున్నారు. టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కి తాజాగా భారతీయుడైన సుందర్ పిచాయ్ (43) సీఈవోగా నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన గూగుల్ ఇంటర్నెట్ వ్యాపారాలకు సంబంధించిన ప్రోడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి ఇంచార్జిగా ఉన్నారు. సత్య నాదెళ్ల, ఇంద్రా నూయి తదితరుల్లాగానే మరో అంతర్జాతీయ సంస్థ పగ్గాలు చేపడుతున్న సుందర్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే నెల సిలికాన్ వేలీ సందర్శనలో భాగంగా మోదీ.. పలువురు టెక్ దిగ్గజాలతో భేటీ కానున్న నేపథ్యంలో సుందర్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో రేసులో కూడా సుందర్ నిలవడం, అంతిమంగా ఆ కంపెనీ పగ్గాలు తెలుగువాడైన సత్య నాదెళ్ల దక్కించుకోవడం తెలిసిందే. 66 బిలియన్ డాలర్ల ఆదాయం, 16 బిలియన్ డాలర్ల లాభాలతో టాప్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా గూగుల్ వెలుగొందుతోంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణ.. సంస్థాగతంగా గూగుల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తీసుకున్న పలు నిర్ణయాల్లో సుందర్ నియామకం ఒకటి. సుందర్ నిబద్ధతతో అంచెలంచెలుగా పురోగమించారని గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ ప్రశంసించారు. సంస్థను నడిపించేందుకు ఆయన అత్యంత సమర్ధులని, కంపెనీ పగ్గాలు చేపట్టేందుకు ఇది సరైన సమయమని పేర్కొన్నారు. సుందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇక తాను, మరో సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ ఇతర లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి సమయం చిక్కగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. కీలక వ్యాపార విభాగాలు సుందర్ చేతిలోనే ప్రధాన ఆదాయ వనరులైన సెర్చి, అడ్వర్టైజింగ్, మ్యాప్స్, యూట్యూబ్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ మొదలైనవన్నీ సుందర్ సారథ్యంలోని గూగుల్ కిందే ఉంటాయి. కొత్తగా ఏర్పాటైన మాతృసంస్థ ఆల్ఫాబెట్లో గూగుల్ సహా నెస్ట్, ఫైబర్, కాలికో వంటివి స్వతంత్ర సంస్థలుగా కొనసాగుతాయి. మాతృ సంస్థగా ఆల్ఫాబెట్.. కంపెనీ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ కింద కొత్తగా ఆల్ఫాబెట్ పేరిట మాతృసంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ తెలిపారు. గూగుల్ సహా కంపెనీకి చెందిన ఇతరత్రా వ్యాపారాలన్నీ కూడా ఇందులో భాగంగా ఉంటాయని వివరించారు. స్టాక్‌మార్కెట్లలో కూడా గూగుల్ స్థానంలో ఆల్ఫాబెట్ చేరుతుంది. గూగుల్ షేర్లన్నీ కూడా ఆల్ఫాబెట్‌కి బదిలీ అవుతాయి. దీనికి ల్యారీ పేజ్ సీఈవోగా, మరో సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు. ఆల్ఫాబెట్ పదాన్ని ఎంచుకోవడానికి వెనుక గల కారణాలను పేజ్ వివరించారు. ‘మానవ చరిత్రలో అత్యంత కీలకమైన ఆవిష్కరణల్లో భాష కూడా ఒకటి. గూగుల్ సెర్చికి కూడా ఇదే ఆధారం. ఒక భాషను ప్రతిబింబించే అక్షరాలన్నింటినీ కలిపి ఆల్ఫాబెట్ అంటారు. అందుకే దీన్ని ఎంచుకున్నాం’ అని పేజ్ పేర్కొన్నారు. అంతే కాదు పెట్టుబడుల పరిభాషలో బెంచ్‌మార్క్‌ను మించి రాబడులు అందించడాన్ని ఆల్ఫా సూచిస్తుందని, తమ లక్ష్యం కూడా అదే అయినందున దీన్ని ఎంచుకున్నామని పేజ్ తెలిపారు. టెక్నాలజీ అనేది ఉపయోగించుకునే వారికి అనువుగా, సేవకుడిగా ఉండాలనేది నా అభిప్రాయం. ఉదాహరణకు ఫోన్‌నే తీసుకుంటే.. అది నేను ఏదైనా ముఖ్యమైనది మర్చిపోయిన పక్షంలో వెంటనే అప్రమత్తం చేయగలగాలి. అలాగే, నేను ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు .. ఏదైనా అనవసరమైన సమాచారం వస్తే నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇలా, యూజర్లకు సరైన విధంగా సేవలందించేలా టెక్నాలజీ ఉండాలి. - ఒక ఇంటర్వ్యూలో సుందర్ సుందరరాజన్ నుంచి సుందర్ పిచాయ్ దాకా సుందర్ అసలు పేరు పి సుందరరాజన్ కాగా.. అమెరికాకు వెళ్లిన తర్వాత అసలు పేరును కుదించి సుందర్‌గా, ఇంటిపేరును పి అనే పొడి అక్షరం నుంచి పిచాయ్ కింద పూర్తిగా పొడిగించుకున్నారు. ఆయన చెన్నైలో పుట్టి, పెరిగారు. వనవాణి మెట్రిక్యులేషన్ స్కూల్లో పదో తరగతి దాకా చదివారు. చెన్నైలోని జవహర్ విద్యాలయలో ఇంటర్మీడియెట్ చదివారు. ఆ తర్వాత ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేశారు. ఉపాధ్యాయులు అక్కడే పీహెచ్డీ చేయాలని సలహా ఇచ్చారు. కానీ, 1993లో అమెరికా వెళ్లిన సుందర్.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ (ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్‌లో), వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ కూడా చేశారు. 2004లో గూగుల్‌లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన టీమ్‌కు సారథ్యం వహించారు. సెర్చి ఇంజిన్లలో దిగ్గజంగా ఎదిగేందుకు తోడ్పడిన టూల్బార్ రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. గతేడాది కంపెనీలో నంబర్ టూ స్థానానికి ఎదిగారు. ఇక, గూగుల్‌లో చేరడానికి ముందు సుందర్ మెకిన్సే, అప్లైడ్ మెటీరియల్స్ సంస్థల్లో కూడా పనిచేశారు. గూగుల్‌లో పనిచేస్తుండగానే మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వీటర్లో అవకాశం వచ్చినప్పటికీ ఆయన వెళ్లలేదు. తాజాగా ఆయన గూగుల్ సీఈవోగా నియమితులు కావడం పట్ల అదే ట్విటర్లో ప్రశంసలు వెల్లువెత్తడం విశేషం. - చెన్నైకి చెందిన తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1972లో సుందర్ జన్మించారు. ఆయనకో తమ్ముడు ఉన్నారు. చిన్నతనంలో ఆయన కుటుంబం రెండు గదుల అపార్ట్మెంట్లో ఉండేది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం కావడంతో చాలా కాలం పాటు ఇంట్లో టీవీ గానీ కారు గానీ ఉండేది కాదు. ఎటైనా వెళ్లాలంటే నీలం రంగు లాంబ్రెటా స్కూటరో లేకుంటే బస్సులు మొదలైన వాటిల్లోనే వెళ్లేవారు. - సుందర్ స్కూల్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. తన సారథ్యంలో ఆయన టీమ్ పలు ప్రాంతీయ టోర్నమెంట్లు గెల్చుకుంది. - సుందర్ తల్లి స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. తండ్రి రఘునాథ పిచాయ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. బ్రిటన్ సంస్థ జీఈసీకి చెందిన ఎలక్ట్రికల్ పరికరాల ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చూసేవారు. సుందర్‌కు టెక్నాలజీని పరిచయం చేసింది ఆయనే. - సుందర్‌కు పన్నెండేళ్ల వయస్సప్పుడు వారింట్లోకి మొట్టమొదటిసారిగా టెలిఫోన్ వచ్చింది. టెక్నాలజీ చేసే అద్భుతాలను అది పరిచయం చేసింది. తాను డయల్ చేసిన ప్రతి నంబరును ఆయన గుర్తుంచుకునేవారు. ఈ నైపుణ్యమే ఆయనకు భవిష్యత్‌లో ఎంతగానో ఉపయోగపడింది. - సుందర్ అమెరికా ప్రయాణానికి విమాన టికెట్లు కొనేందుకు, ఇతర ఖర్చుల కోసం తండ్రి రుణం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ, రుణం రాకపోవడంతో.. అప్పటిదాకా పోగుచేసిన పొదుపు మొత్తంలో నుంచి డబ్బు తీయాల్సి వచ్చింది. విమాన చార్జీ ఆయన ఏడాది సంపాదన కంటే కూడా చాలా ఎక్కువ. అయితే, స్టాన్ఫోర్డ్ చదువును మధ్యలోనే ఆపి.. అప్లయిడ్ మెటీరియల్స్ అనే సెమీ కండక్టర్స్ తయారీ సంస్థలో ఇంజనీర్‌గా చేరారు. 2002లో వార్టన్ నుంచి ఎంబీఏ చేశారు. మెకిన్సేలో కన్సల్టెంట్గానూ పనిచేశారు. - గూగుల్ సొంత బ్రౌజర్ రూపొందించుకోవాలని తొలిసారి ప్రతిపాదించినది ఆయనే. అప్పటి సీఈవో ఎరిక్ ష్మిట్ తప్ప మిగతా సహ వ్యవస్థాపకులంతా సుందర్ ప్రతిపాదనకు మద్దతు పలికారు. మొబైల్స్, డెస్క్‌టాప్ పీసీలకు సంబంధించిన బ్రౌజర్ మార్కెట్లో గూగుల్ క్రోమ్‌కు దాదాపు 32% వాటా ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది, అత్యంత ప్రాచుర్యంలోకి తెచ్చినది సుందరే. - సుందర్ భార్య పేరు అంజలి. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. పాఠశాల రోజుల నుంచి సుందర్, అంజలికి పరిచయం ఉండేది. అది కొన్నాళ్లకు ప్రేమ, వివాహానికి దారితీసింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా అంజలికి సుందర్ ప్రపోజ్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ సుందర్! గూగుల్ సీఈవోగా నియమితులైన సుందర్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకుని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల దాకా పలువురు ప్రముఖులు అభినందించారు. అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలు వచ్చేలా కొత్త ఉత్సాహాన్ని నింపడంలో సుందర్ కీలకపాత్ర పోషించగలరని భారత ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ అభిప్రాయపడింది. అపార అనుభవం గల సుందర్.. గూగుల్‌కు అసెట్‌గా నిల్వగలరని పేర్కొంది. ఈ అభినందనలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వీటర్ వేదికగా నిల్చింది. కంగ్రాచ్యులేషన్స్ సుందర్. గూగుల్‌లో కొత్త బాధ్యతలు చేపడుతున్న మీకు అభినందనలు. - నరేంద్ర మోదీ, భారత ప్రధాని భారతదేశానికి చెందిన సుందర్ గూగుల్ సీఈవోగా నియమితులవడం గర్వకారణం. - రవిశంకర్ ప్రసాద్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి కంగ్రాట్స్. ఈ హోదాకు మీరు అన్ని విధాలా అర్హులు. - సత్య నాదెళ్ల, సీఈవో, మైక్రోసాఫ్ట్ ఆయన దార్శనికత అబ్బురపరుస్తుంది. సుందర్ గొప్ప సీఈవోగా నిలవగలరు. - ఎరిక్ ష్మిట్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, గూగుల్ సుందర్ చురుకైన, అద్భుతమైన వ్యక్తి. ఆయన ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది.పనులను సమర్థంగా చక్కబెట్టగల నేర్పరి. - నికేశ్ ఆరోరా, ప్రెసిడెంట్, సాఫ్ట్‌బ్యాంక్ సీఈవోగా ప్రమోషన్ దక్కించుకున్న మీకు అభినందనలు. - టిమ్ కుక్, సీఈవో, యాపిల్ వార్షిక జీతం రూ. 310 కోట్లు.. ప్రస్తుతం గూగుల్‌లో సుందర్ ఏడాదికి రూ. 310 కోట్ల జీత భత్యాలు పొందుతున్నారు. గతంలో ఆయనకు ట్వీటర్ కంపెనీ నుంచి ఉన్నతస్థానానికి ఆహ్వానం వచ్చినపుడు ఆయనను నిలువరించడానికి గూగుల్ 50 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఇచ్చింది. ఆత్మీయుడు.. సిగ్గరి.. గూగుల్‌లో సహ ఉద్యోగులు ఆయన్ను అందరికీ ఆత్మీయుడిగా అభివర్ణిస్తారు. స్వతహాగా సుందర్ సిగ్గరి. సోషల్ మీడియా మాధ్యమంగా తనకు అభినందనలు తెలిపిన వారిలో కూడా కొంతమందికే ధన్యవాదాల మెసేజీలు పెట్టారు. వీరిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, యాపిల్ సీఈవో టిమ్ కుక్ మొదలైన వారు ఉన్నారు. సుందర్ చురుకైన విద్యార్థి అయినప్పటికీ.. అనవసర పాండిత్య ప్రదర్శనకు దిగే వాడు కాడని ఐఐటీ ప్రొఫెసర్ సనత్ కుమార్ రాయ్ తెలిపారు. -
కంగ్రాట్స్.. సుందర్ పిచాయ్: మోదీ
-
కంగ్రాట్స్.. సుందర్ పిచాయ్: మోదీ
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కొత్త సీఈవోగా నియమితులైన సుందర్ పిచాయ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గూగుల్‌లో కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలంటూ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు రాజధాని చెన్నైలో సుందర్ 1972లో జన్మించారు. పిచాయ్ 2004 లో గూగుల్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయికి చేరారు. సుందర్ పిచాయ్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ల, ఆంధ్రపదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లు అభినందించారు. -
ఎవరీ సుందర్ పిచాయ్..?
-
ఎవరీ సుందర్ పిచాయ్..?
చెన్నై: అంతర్జాతీయ స్థాయి ఐటీ రంగంలో మరో భారత సంతతి వ్యక్తి అత్యున్నత పదవి అలంకరించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో గా తెలుగు వ్యక్తి సత్యా నాదెళ్ల బాధ్యతలు చేపట్టగా.. తాజాగా పొరుగు రాష్ట్రం తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ (43) ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈవోగా నియమితులయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో సుందర్ 1972లో జన్మించారు. ఆయన ఐఐటీ- ఖరగ్‌పూర్ నుంచి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ సంపాదించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్, వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టాను సుందర్ పొందారు. పిచాయ్ 2004 లో గూగుల్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయికి చేరారు. ఇంటర్నెట్ సెర్చింజన్‌గా సేవలను ప్రారంభించిన గూగుల్, ఆపై డ్రోన్ల తయారీ, ఫార్మా, వెంచర్ కాపిటల్ ఇలా పలు రంగాలకు విస్తరించింది. తాజాగా కొత్త ప్రొడక్టులను కనుగొని వాటిని అభివృద్ధి చేయడానికి గూగుల్ అల్ఫాబేట్ పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి గూగుల్ అనుబంధ సంస్థగా కొనసాగనుంది. -
గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్
చెన్నై: భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్(43) ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గూగుల్ ఆల్ఫాబెట్ పేరిట మరో కొత్త కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధ సంస్థగా గూగుల్ కొనసాగనుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో సుందర్ 1972లో జన్మించారు. ఆయన ఐఐటీ- ఖరగ్‌పూర్ నుంచి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ సంపాదించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్, వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టాను సుందర్ పొందారు. పిచాయ్ 2004 లో గూగుల్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయికి చేరారు. సుందర్ పిచాయ్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ల, ఆంధ్రపదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లు అభినందించారు. Congrats @sundarpichai well deserved! — Satya Nadella (@satyanadella) August 10, 2015 Congratulations @sundarpichai for being named the CEO of Google. Best wishes to you. Proud moment for India. — N Chandrababu Naidu (@ncbn) August 11, 2015 Congratulations @sundarpichai. Wish @google scales new heights under your leadership. — Min IT, Telangana (@MinIT_Telangana) August 11, 2015