ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ‘మొదటి 3 ఓవర్లు’ చూడమని సలహా ఇచ్చిన పాక్ అభిమానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అద్భుతంగా స్పందించారు.
టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన భారత్- పాక్ మ్యాచ్‌లో కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. కళ్లముందే టీమ్‌ఇండియా టాప్ ఆర్డర్ పేకమేడలా కూలుతున్నా..ప్రశాంతంగా ఉన్నాడు. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌ను చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి గెలిపించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో 53 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విరాట్ అందుకున్నాడు.
Happy Diwali! Hope everyone celebrating has a great time with your friends and family.
— Sundar Pichai (@sundarpichai) October 24, 2022
🪔 I celebrated by watching the last three overs again today, what a game and performance #Diwali #TeamIndia #T20WC2022
నరాలు తెగే ఉత్కంఠలో దాయాది దేశంపై గెలిచిన భారత్‌పై క్రికెట్ లవర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ దురభిమానులు మాత్రం జీర‍్ణించుకోలేకపోతున్నారు. పాక్ ఓటమిని తట్టుకోలేక టీవీలు పగలగొడుతున్నారు.మరికొందరు పాక్ బౌలింగ్ వేసిన మొదటి 3 ఓవర్లు చూడమని ట్వీట్‌లు చేస్తున్నారు. అయితే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కోహ్లీ ఆటతీరును ప్రశంసిస్తూ పిచాయ్ ఇలా ట్విట్ చేశారు. ‘దీపావళి శుభాకాంక్షలు! ఈ ఆనంద క్షణాల్నిస్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపండి. నేను ఈరోజు చివరి మూడు ఓవర్‌లను మళ్లీ చూసి సంబరాలు చేసుకున్నాను. వాట్ ఏ గేమ్.. వాట్ ఏ పర్‌ఫార్మెన్స్ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
After many requests received from neighbours I have decided to frame this picture @sundarpichai #PakvsIndia pic.twitter.com/LC3ZCe8i3t
— Muhammad Shahzaib (@Muhamma91436212) October 24, 2022
ఆ ట్వీట్‌పై ఓ పాక్ అభిమాని స్పందించాడు. ‘మీరు మొదటి మూడు ఓవర్లు చూడాలి’ అని వెటకారంగా అన్నాడు. దానికి పాక్ అభిమానికి గూబ గుయ్‌మనేలా సుందర్ పిచాయ్ రిప్లయి ఇచ్చారు. ‘‘ఓ అది కూడా చూశాను. భువీ - అర్ష్‌దీప్ బౌలింగ్ అద్భుతంగా చేశారని ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ప్రస్తుతం సుందర్ పిచాయి పాక్ అభిమానికి ఇచ్చిన ఎపిక్ రిప్లయి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
చదవండి👉 సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ భారీ షాక్!
ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇద్దాం.. సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment