t20
-
కివీస్‌దే టి20 సిరీస్
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): బ్యాటర్ల దూకుడుకు... బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో... పాకిస్తాన్‌తో నాలుగో టి20లో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన పోరులో ఆతిథ్య న్యూజిలాండ్ 115 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలుపొందింది. ఫలితంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3–1తో సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (22 బంతుల్లో 44; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిన్ అలెన్ (20 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. బ్రేస్‌వెల్ (26 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... మార్క్ చాప్మన్ (24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ (29; 1 ఫోర్, 1 సిక్స్) ఉన్నంతసేపు దూకుడు కనబర్చారు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3, అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ పూర్తిగా తడబడింది. 16.2 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. మొత్తం జట్టులో అబ్దుల్ సమద్ (30 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇర్ఫాన్ ఖాన్ (24; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. గత మ్యాచ్ సెంచరీ హీరో హసన్ నవాజ్ (1), కెప్టెన్ ఆఘా సల్మాన్ (1), మొహమ్మద్ హరీస్ (2), షాదాబ్ ఖాన్ (1), ఖుష్దిల్ షా (6) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 4, ఫోల్క్స్ 3 వికెట్లు పడగొట్టారు. కివీస్ ఓపెనర్ అలెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి టి20 బుధవారం వెల్లింగ్టన్లో జరుగుతుంది. బాదుడే బాదుడు... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు సీఫెర్ట్, అలెన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. బౌలర్‌తో సంబంధం లేకుండా ఈ జోడీ ఎడాపెడా బౌండరీలతో చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన సీఫెర్ట్... అబ్రార్ వేసిన నాలుగో ఓవర్లో 6, 4, 6 కొట్టాడు. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 54 పరుగులు చేసింది. మరో భారీ షాట్‌కు యత్నించి సీఫెర్ట్ అవుట్ కాగా... ఆ తర్వాత బాదే బాధ్యత అలెన్ తీసుకున్నాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై విరుచుకుపడిన అలెన్... అబ్రార్ వేసిన ఏడో ఓవర్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఫలితంగా 8 ఓవర్లలోనే కివీస్ వంద పరుగుల మార్క్ దాటింది. షాదాబ్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 6 కొట్టిన అలెన్ 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... 10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 134/2తో నిలిచింది. ఈ దూకుడు చూస్తుంటే కివీస్ మరింత భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించినా... ఆ తర్వాత తేరుకున్న పాక్ బౌలర్లు ఒత్తిడి పెంచి కివీస్‌ను కాస్త కట్టడి చేశారు. చివర్లో బ్రాస్‌వెల్ కొన్ని చక్కటి షాట్లతో జట్టుకు మంచి స్కోరు అందించాడు. పెవిలియన్‌కు ‘క్యూ’ భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఇన్నింగ్స్ రెండో బంతికే హరీస్ క్లీన్»ౌల్డ్ కాగా... గత మ్యాచ్‌లో సెంచరీతో జట్టుకు చక్కటి విజయాన్ని అందించిన హసన్ నవాజ్ రెండో ఓవర్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. బాధ్యతగా ఆడాల్సిన కెప్టెన్ సల్మాన్ కూడా కీపర్ క్యాచ్‌గా వెనుదిరగగా... ఇర్ఫాన్ ఖాన్ కాసేపు పోరాడాడు. షాదాబ్, ఖుష్దిల్ షా, అబ్బాస్ అఫ్రిది (1), షాహీన్ షా అఫ్రిది (6) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా ఒక దశలో పాకిస్తాన్ 56 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి మరింత ఘోరం పరాజయం మూటగట్టుకునేలా కనిపించినా... ఆఖర్లో సమద్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును వంద పరుగుల మైలురాయి దాటించాడు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ (4/20), ఫోల్‌్క్స (3/25) కలిసి 7 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. -
IPL 2025: IPL కప్ మనదేనా?
-
అదరగొడుతున్న ‘అభి’
142.3 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఒక బంతి... ఆ తర్వాత అదే ఓవర్లో 146.1 కిలోమీటర్ల వేగంతో మరో బంతి... 147.2 కిలోమీటర్ల వేగంతో తర్వాతి బంతి... మొదటిది ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీ దాటింది. తర్వాతి షార్ట్ బంతి బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా, మూడోది కవర్స్ మీదుగా సిక్సర్లుగా మారాయి! ప్రపంచంలో ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడైన జోఫ్రా ఆర్చర్‌ను ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ ఇలా చితకబాదిన తీరు అతని అసలైన బ్యాటింగ్ శైలిని చూపించాయి. ఒకదానితో మరొకటి పోటీ పడినట్లుగా అభిషేక్ బాదిన భారీ సిక్సర్లలో ఈ రెండు మరింత హైలైట్‌గా నిలిచాయి. అండర్–16 స్థాయి నుంచే దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచిన అభిషేక్ ఇప్పుడు 24 ఏళ్ల వయసులో భారత్ తరఫున టి20ల్లో భీకరమైన హిట్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన షాట్లతో వీరవిధ్వంసం సృష్టించిన ఇన్నింగ్స్ భారత టి20లో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచిపోయింది. అతను కొట్టిన 7 ఫోర్లు, 13 సిక్స్‌లు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో కొట్టిన అసలైన క్రికెటింగ్ షాట్లే. ఒక్కటి కూడా అనుకోకుండా తగిలి లేదా ఎడ్జ్ తీసుకొని వెళ్లింది లేదు. డ్రైవ్, లాఫ్టెడ్ డ్రైవ్, ఫ్లిక్, కట్... ఇలా ఏదైనా శ్రమ లేకుండా అలవోకగా, చూడముచ్చటగా ఆడటం అభిషేక్‌కే చెల్లింది. ఇక ప్రభావాన్ని చూస్తే మాత్రం అన్ని షాట్లూ ఫలితం రాబట్టినవే. ఐపీఎల్ ద్వారానే అభిమానులకు చేరువైన అతను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా తన బ్యాటింగ్ పదును చూపించాడు. అక్కడే మొదలు... భారీ షాట్లు బాదడం, సిక్సర్లతో పండగ చేసుకోవడం అభిషేక్‌కు కొత్త కాదు. తన స్వస్థలం అమృత్‌సర్‌లోని గాంధీ స్టేడియంలో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే అతను ఇలా ఆడేవాడు. అతని దెబ్బకు ఎంతో విలువైన కొత్త ఎస్జీ, కూకూబుర్రా, డ్యూక్ బంతులు గ్రౌండ్ బయట పడేవి. చివరకు కోచ్‌లు, సిబ్బంది ఈ జోరును తగ్గించమని, లేదంటే చాలా ఖర్చు అవుతుందని అభిషేక్ తండ్రి రాజ్‌కుమార్ శర్మకు మొర పెట్టుకోవాల్సి వచ్చేది. అయితే మీకు కావాలంటే చండీగఢ్ నుంచి నేను కొత్త బంతులు కొని ఇస్తానే తప్ప శైలి మార్చుకోమని నా కొడుకుకు చెప్పను అతని ఆయన ఖరాఖండీగా తేల్చేశారు. దాంతో టీనేజ్‌లో వచ్చిన ఆ ధాటి అన్ని చోట్లా అలాగే కొనసాగింది. బీసీసీఐ అండర్–16 టోర్నీ విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఒకే సీజన్ (2015–16)లో అతను ఇలాంటి బ్యాటింగ్‌తోనే ఏకంగా 1200కు పైగా పరుగులు సాధించి తానేంటో చూపించాడు. యువరాజ్ అండతో... దూకుడైన బ్యాటింగ్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్‌తో కీలక ఓవర్లు వేయగల అభిషేక్ పంజాబ్ జట్టులో మిడిలార్డర్ నుంచి టాపార్డర్‌కు మారడంతో అతని బ్యాటింగ్ సత్తా అందరికీ తెలిసింది. కెపె్టన్‌గా అండర్–19 ఆసియాకప్‌ను గెలిపించిన అభిషేక్ 2018 అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు కూడా. పంజాబ్ తొలిసారి 2023లో దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకోవడంలో అతనిదే కీలక పాత్ర. ఈ టోర్నిలో ఏకంగా 192.46 స్ట్రయిక్‌రేట్‌తో అతను 485 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉండగా... ఆంధ్రపై 51 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో చేసిన 112 పరుగులు టోర్నిలో హైలైట్‌గా నిలిచాయి. అతని ఎదుగుదలలో భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో ఉంది. అభిషేక్‌కు మెంటార్‌గా యువీ ఎన్నో రకాలుగా మార్గనిర్దేశనం చేశాడు. ‘అభి’లోని హిట్టింగ్ సామర్థ్యాన్ని గుర్తించిన యువీ సరైన దిశలో ప్రోత్సహించిన ఫలితమే ఇప్పుడు ఈ సిక్సర్ల పండగ. అందుకే యువరాజ్ ఎప్పుడు, ఎక్కడ ప్రాక్టీస్‌కు పిలిచినా అభిషేక్ వెంటనే హాజరైపోతాడు. ఐపీఎల్లో జోరు... భారత క్రికెట్ అభిమానులకు అభిషేక్ విధ్వంసం విలువ 2024లోనే కనిపించింది. 2022 సీజన్లో కూడా సన్‌రైజర్స్ తరఫున 426 పరుగులు చేసినా గత సీజన్ మాత్రమే అతని స్థాయిని అమాంతం పెంచేసింది. ట్రవిస్ హెడ్‌తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యాలు ఐపీఎల్లో అద్భుతాన్ని చూపించాయి. ఈ టోర్నిలో ఏకంగా 204.21 స్ట్రయిక్‌రేట్‌తో అభిషేక్ 484 పరుగులు చేసి టీమ్‌ను ఫైనల్ వరకు చేర్చాడు. ఇందులో 36 ఫోర్లు ఉంటే, సిక్స్‌లు 42 ఉన్నాయి! రెండు సార్లు సన్‌రైజర్స్ ఐపీఎల్లో అత్యధిక స్కోరు రికార్డులు బద్దలు కొట్టడంతో అతని పాత్రను అంతా ప్రత్యక్షంగా చూశారు. ఇదే సీజన్లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో అతను అదరగొట్టాడు. నిజానికి పంజాబ్ గెలిచిన ముస్తాక్ అలీ ట్రోఫీ నుంచే అతని స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. నాటి నుంచి ఆదివారం మ్యాచ్ వరకు అతను టి20ల్లో 199.47 స్ట్రయిక్‌రేట్‌తో 1893 పరుగులు చేశాడంటే అభి ఆట ఎలా సాగుతోందో అర్థమవుతుంది. డకౌట్‌తో మొదలై... ఐపీఎల్ మెరుపుల తర్వాత భారత్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో ‘డకౌట్’తో అభిషేక్ కెరీర్ మొదలైంది. అయితే దానిని మరచిపోయేలా తర్వాతి మ్యాచ్‌లో 46 బంతుల్లో సెంచరీతో అతను చెలరేగాడు. కానీ ఆ తర్వాత వరుస వైఫల్యాలతో మళ్లీ తడబాటు. దక్షిణాఫ్రికాపై రెండు మ్యాచ్‌లలో రాణించినా తాజా సిరీస్‌కు ముందు కాస్త ఒత్తిడి. కానీ కోల్‌కతాలో తొలి మ్యాచ్‌లో 34 బంతుల్లో 79 పరుగులతో చెలరేగి దానిని కాస్త తగ్గించుకోగలిగాడు. ఇప్పుడు చివరి మ్యాచ్‌కు వచ్చేసరికి అభిషేక్ విశ్వరూపం చూపించాడు. 17 మ్యాచ్‌ల టి20 కెరీర్లో అతను 276 బంతులు ఆడితే 46 ఫోర్లు, 41 సిక్సర్లతో 535 పరుగులు చేసి పరాక్రమించాడు. మున్ముందూ ఇదే ధాటి కొనసాగితే 2026 టి20 వరల్డ్ కప్ వరకు కూడా మనకు ఎదురుండదు. –సాక్షి క్రీడా విభాగం -
#INDvsENG : మూడో టి20లో టీమిండియా ఓటమి (ఫొటోలు)
-
IND Vs ENG: భారత్‌ను ముంచిన బ్యాటర్లు
ఇంగ్లండ్ స్కోరు 7 వద్దే తొలి వికెట్‌ను కోల్పోయింది. కానీ రెండో వికెట్ 83 పరుగుల వద్ద పడింది. అప్పటికి 9 ఓవర్లే ముగిశాయి. ఇలా పుంజుకున్న ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను వరుణ్ చక్రవర్తి (5/24) తిప్పేయడంతో అనూహ్యంగా 127 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. హమ్మయ్య పట్టు సాధించామనుకుంటే... డెత్ ఓవర్లు, మిగతా బౌలర్ల వైఫల్యంతో ఇంగ్లండ్ 170 పైచిలుకు పరుగులు చేసింది. కానీ భారత్ మొదటి వికెట్ 16 పరుగుల వద్ద పడింది. ఆ తర్వాతా పడిపోతూనే 85/5 స్కోరు వద్ద సగం వికెట్లను సమరి్పంచుకొని ఓటమికి స్వాగతం పలికింది. దీంతో తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ సత్తా చాటితే... ఈ ఒక్కటి గెలిస్తే సిరీస్ వశమయ్యే మ్యాచ్‌లో నిలువెత్తు నిర్లక్ష్యం భారత్‌ను ముంచింది. రాజ్‌కోట్: సిరీస్‌ను గెలిపించే మ్యాచ్‌ను భారత్ సిరీయస్‌గా తీసుకున్నట్లు లేదు. అందుకే తగిన మూల్యం ఓటమిగా చెల్లించుకుంది. రేసులో నిలవాలనుకున్న ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్... వరుణ్ బిగించిన స్పిన్ ఉచ్చు నుంచి బయటపడి... అనంతరం ఆతిథ్య జట్టును బంతితో ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ఫలితంగా సిరీస్ రేసులో నిలిచేందుకు ఇంగ్లండ్ 26 పరుగులతో భారత్‌ను ఓడించి గెలుపు బోణీ కొట్టేసింది. ముందుగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.బెన్ డకెట్ (28 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), లివింగ్‌స్టోన్ (24 బంతుల్లో 43; 1 ఫోర్, 5 సిక్స్‌లు) మెరిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి (5/24) తిప్పేశాడు. హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓడింది. హార్దిక్ పాండ్యా (40; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్లు సాల్ట్ (5)ను పాండ్యా త్వరగానే పెవిలియన్ చేర్చాడు. కానీ డకెట్, బట్లర్ (24; 1 ఫోర్, 1 సిక్స్) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను గాడిన పెడితే వరుణ్ ఉచ్చులో ఇంగ్లండ్ చిక్కుకుంది. బట్లర్ సహా, స్మిత్ (6), ఓవర్టన్ (0), కార్స్ (3), ఆర్చర్ (0)లు వికెట్లు పారేసుకున్నారు. కానీ లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో కూలుతున్న పర్యాటక జట్టు కోలుకుంది. 127/8 నుంచి 171/9 స్కోరుకు చేరుకుంది. లక్ష్యంపై నిర్లక్ష్యం! భారత్ ముందున్నది సాధారణ లక్ష్యం కానేకాదు. ఇలాంటి ఛేదనకు చక్కని శుభారంభం, తదనంతరం మిడిలార్డర్ బాధ్యత ఎంతో ముఖ్యం... కానీ ఈ ఒక్కటీ ఓడితే పోయేదేముంది అన్నట్లు భారత బ్యాటర్ల ఆటతీరు సాగింది. సంజూ సామ్సన్ (3), అభిషేక్ (14 బంతుల్లో 24; 5 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ (14), తిలక్ వర్మ (18), సుందర్ (6), అక్షర్ (15), జురేల్ (2) ఇలా అంతా... మా వల్లకాదంటూ ప్రత్యర్థి బౌలింగ్‌కు తలొగ్గారు. హార్దిక్ చేసిన ఆ మాత్రం స్కోరు భారత్ పరువు నిలిపింది... కానీ ఒడ్డున పడేయలేకపోయింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 5; డకెట్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 51; బట్లర్ (సి) సామ్సన్ (బి) వరుణ్ 24; హ్యారీ బ్రూక్ (బి) బిష్ణోయ్ 8; లివింగ్‌స్టోన్ (సి) జురేల్ (బి) పాండ్యా 43; స్మిత్ (సి) జురేల్ (బి) వరుణ్ 6; ఓవర్టన్ (బి) వరుణ్ 0; కార్స్ (సి) తిలక్‌వర్మ (బి) వరుణ్ 3; ఆర్చర్ (బి) వరుణ్ 0; రషీద్ నాటౌట్ 10; మార్క్‌వుడ్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171.వికెట్ల పతనం: 1–7, 2–83, 3–87, 4–108, 5–115, 6–115, 7–127, 8–127, 9–147. బౌలింగ్: షమీ 3–0–25–0, హార్దిక్ పాండ్యా 4–0–33–2, సుందర్ 1–0–15–0, వరుణ్ 4–0– 24–5, రవి బిష్ణోయ్ 4–0–46–1, అక్షర్ పటేల్ 3–0–19–1, అభిషేక్ 1–0–4–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 3; అభిషేక్ (సి) ఆర్చర్ (బి) కార్స్ 24; సూర్య (సి) సాల్ట్ (బి) వుడ్ 14; తిలక్ వర్మ (బి) రషీద్ 18; హార్దిక్ పాండ్యా (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 40; సుందర్ (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 6; అక్షర్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 15; జురేల్ (సి) సాల్ట్ (బి) కార్స్ 2; షమీ (సి) బ్రూక్ (బి) ఓవర్టన్ 7; రవి బిష్ణోయ్ నాటౌట్ 4; వరుణ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145.వికెట్ల పతనం: 1–16, 2–31, 3–48, 4–68, 5–85, 6–123, 7–131, 8–140, 9–140. బౌలింగ్: ఆర్చర్ 4–0–33–2, వుడ్ 3–0–29–1, బ్రైడన్ కార్స్ 4–0–28–2, లివింగ్‌స్టోన్ 1–0–11–0, రషీద్ 4–0–15–1, జేమీ ఓవర్టన్ 4–0–24–3. -
అర్ష్ దీప్‌కు అందలం
దుబాయ్: భారత యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యాడు. గతేడాది భారత జట్టు టి20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ 25 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్... 2024లో ఓవరాల్‌గా 18 మ్యాచ్‌లాడి 15.31 సగటుతో 36 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో ఆరంభ ఓవర్లతో పాటు, డెత్ ఓవర్స్‌లో చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్న అర్ష్ దీప్ ఐసీసీ టి20 టిమ్ ఆఫ్ ద ఇయర్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా నిలిచిన అర్ష్ దీప్... భారత టి20 జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. టి20ల్లో ఇప్పటి వరకు 97 వికెట్లు పడగొట్టిన అర్ష్ దీప్... ఈ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2021లో ఐసీసీ ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ప్రవేశపెట్టింది. 2021లో మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)కు ఈ గౌరవం దక్కగా... 2022, 2023లలో సూర్యకుమార్ యాదవ్ (భారత్) గెల్చుకున్నాడు. -
ఇంగ్లాండ్ తో టీ20 సమరానికి సిద్ధమైన టీమిండియా
-
తిలక్, సామ్సన్ వీర విధ్వంసం.. మూడో టీ20లో సౌతాఫ్రికా చిత్తు
వాండరర్స్‌లో బౌండరీల వర్షం... సిరీస్‌లో తొలి మ్యాచ్ సెంచరీ హీరో, మూడో మ్యాచ్ శతక వీరుడు ఈసారి జత కలిసి సాగించిన పరుగుల ప్రవాహానికి పలు రికార్డులు కొట్టుకుపోయాయి. తిలక్ వర్మ, సంజు సామ్సన్ ఒకరితో మరొకరు పోటీ పడుతూ బాదిన సెంచరీలతో జొహన్నెస్‌బర్గ్ మైదానం అదిరింది. వీరిద్దరి జోరును నిలువరించలేక, ఏం చేయాలో అర్థం కాక దక్షిణాఫ్రికా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 23 సిక్సర్లు ఉండగా... బౌండరీల ద్వారానే 206 పరుగులు వచ్చాయి. అనంతరం మైదానంలోకి దిగక ముందే ఓటమిని అంగీకరించినట్లు కనిపించిన సఫారీ టీమ్ 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. 3 ఓవర్లు ముగిసేసరికి 10/4 వద్ద నిలిచిన ఆ జట్టు మళ్లీ కోలుకోలేదు. జొహన్నెస్‌బర్గ్: సఫారీ పర్యటనను భారత టి20 జట్టు అద్భుతంగా ముగించింది. అన్ని రంగాల్లో తమ ఆధిపత్యం కొనసాగిస్తూ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరి పోరులో భారత్ 135 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ (47 బంతుల్లో 120 నాటౌట్; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు), సంజు సామ్సన్ (56 బంతుల్లో 109 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. తిలక్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా... వరుసగా రెండు డకౌట్ల తర్వాత సామ్సన్‌కు ఈ సిరీస్‌లో ఇది రెండో శతకం కావడం విశేషం. వీరిద్దరు రెండో వికెట్‌కు 86 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ధనాధన్ జోడీ... పవర్‌ప్లేలో 73 పరుగులు... 10 ఓవర్లు ముగిసేసరికి 129... 15 ఓవర్లలో 219... చివరి 5 ఓవర్లలో 64... ఇదీ భారత్ స్కోరింగ్ జోరు! గత కొన్ని మ్యాచ్‌లలో వరుసగా విఫలమైన అభిõÙక్ శర్మ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఈసారి కాస్త మెరుగైన ఆటతో దూకుడు ప్రదర్శించాడు. అభిషేక్ అవుట య్యాక సామ్సన్, తిలక్ జత కలిసిన తర్వాత అసలు వినోదం మొదలైంది. ప్రతీ బౌలర్‌పై వీరిద్దరు విరుచుకుపడి పరుగులు సాధించారు. మహరాజ్ ఓవర్లో తిలక్ రెండు వరుస సిక్స్‌లు కొట్టగా... స్టబ్స్ ఓవర్లో సామ్సన్ అదే పని చేశాడు. సిపామ్లా ఓవర్లో ఇద్దరూ కలిసి 3 సిక్సర్లతో 20 పరుగులు రాబట్టారు. కెప్టెన్ మార్క్రమ్ ఓవర్లో తిలక్ మరింత రెచ్చిపోతూ వరుసగా 4, 6, 6, 4 బాదాడు. సామ్సన్ స్కోరు 27 వద్ద ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ ఒకదశలో అతడిని దాటేసి సెంచరీకి చేరువయ్యాడు. అయితే ముందుగా 51 బంతుల్లోనే సామ్సన్ శతకం పూర్తి చేసుకోగా... తర్వాతి ఓవర్లోనే తిలక్ 41 బంతుల్లో ఆ మార్క్‌ను అందుకున్నాడు. టపటపా... భారీ ఛేదనను చెత్త ఆటతో మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా గెలుపు గురించి ఆలోచించే అవకాశమే లేకపోయింది. తొలి రెండు ఓవర్లలో హెన్డ్రిక్స్ (0), రికెల్టన్ (1) వెనుదిరగ్గా... మూడో ఓవర్లో అర్ష్ దీప్ వరుస బంతుల్లో మార్క్రమ్ (8), క్లాసెన్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత స్టబ్స్, మిల్లర్... చివర్లో జాన్సెన్ (29; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కొద్దిసేపు నిలబడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (నాటౌట్) 109; అభిషేక్ (సి) క్లాసెన్ (బి) సిపామ్లా 36; తిలక్ వర్మ (నాటౌట్) 120; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టానికి) 283. వికెట్ల పతనం: 1–73. బౌలింగ్: జాన్సెన్ 4–0–42–0, కొయెట్జీ 3–0–43–0, సిపామ్లా 4–0–58–1, సిమ్‌లేన్ 3–0–47–0, మహరాజ్ 3–0–42–0, మార్క్రమ్ 2–0–30–0, స్టబ్స్ 1–0–21–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 1; హెన్డ్రిక్స్ (బి) అర్ష్ దీప్ 0; మార్క్రమ్ (సి) బిష్ణోయ్ (బి) అర్ష్ దీప్ 8; స్టబ్స్ (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 43; క్లాసెన్ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; మిల్లర్ (సి) తిలక్ (బి) వరుణ్ 36; జాన్సెన్ (నాటౌట్) 29; సిమ్‌లేన్ (సి) బిష్ణోయ్ (బి) వరుణ్ 2; కొయెట్జీ (సి) సామ్సన్ (బి) అక్షర్ 12; మహరాజ్ (సి) తిలక్ (బి) అక్షర్ 6; సిపామ్లా (సి) అక్షర్ (బి) రమణ్‌దీప్ 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 148. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–10, 4–10, 5–96, 6–96, 7–105, 8–131, 9–141, 10–148. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–20–3, పాండ్యా 3–1–8–1, రమణ్‌దీప్ 3.2–0–42–1, వరుణ్ 4–0–42–2, బిష్ణోయ్ 3–0–28–1, అక్షర్ 2–0–6–2. 283 టి20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. గత నెలలో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 297 పరుగులు చేసింది. 210 సామ్సన్, తిలక్ జోడించిన పరుగులు. ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. రోహిత్, రింకూ (190; అఫ్గానిస్తాన్‌పై 2024లో) రికార్డు కనుమరుగైంది. 5 అంతర్జాతీయ టి20ల్లో వరుసగా రెండు శతకాలు చేసిన ఐదో బ్యాటర్ తిలక్ వర్మ. భారత్ తరఫున సామ్సన్ ఇదే సిరీస్‌లో ఆ రికార్డు నమోదు చేయగా... గతంలో మరో ముగ్గురు గుస్తావ్ మెక్‌కియాన్, ఫిల్ సాల్ట్, రిలీ రోసో ఈ ఘనత సాధించారు. 3 ఒకే మ్యాచ్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో చెక్ రిపబ్లిక్, జపాన్ బ్యాటర్లు ఈ ఫీట్ నమోదు చేశారు. -
సిరీస్ సొంతం చేసుకోవాలని...
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా గడ్డపై చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న భారత క్రికెట్ జట్టు శుక్రవారం చివరిదైన నాలుగో టి20లో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సారథ్యంలోని టీమిండియా... అదే జోరులో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు సొంతగడ్డపై సిరీస్ సమం చేయాలని సఫారీలు భావిస్తున్నారు. మూడు మ్యాచ్‌ల్లో రెండుసార్లు 200 పైచిలుకు స్కోర్లు చేసిన భారత జట్టు... ఓడిన మ్యాచ్‌లోనూ మెరుగైన పోరాటం కనబర్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 25 టి20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా... అందులో 23 విజయాలు సాధించి భళా అనిపించుకుంది. ఈ ఏడాదిలో భారత జట్టుకు ఇదే చివరి టి20 మ్యాచ్ కాగా... ఇందులోనూ విజయం సాధించాలని సూర్యకుమార్ బృందం తహతహలాడుతోంది. 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలిచి విశ్వవిజేత కిరీటం నెగ్గిన వాండరర్స్ మైదానంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్‌కు మంచి రికార్డు ఉంది. చివరిసారి వాండరర్స్‌లో ఆడిన మ్యాచ్‌లో సూర్య సెంచరీతో విజృంభించాడు. తాజా సిరీస్‌లో ఇప్పటికే భారత్ తరఫున సంజూ సామ్సన్, తిలక్ వర్మ శతకాలు బాదగా... ఆఖరి మ్యాచ్‌లో ఎవరు రాణిస్తారో చూడాలి. కలిసికట్టుగా కదంతొక్కితేనే.. తొలి మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ సామ్సన్ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలం కాగా... తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన మరో ఓపెనర్ అభిõÙక్ శర్మ మూడో టి20లో అర్ధశతకంతో మెరిశాడు. మొత్తంగా చూసుకుంటే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా లోపాలు కనిపించకపోయినా... ప్లేయర్లంతా కలిసికట్టుగా కదం తొక్కాల్సిన అవసరముంది. సెంచూరియన్ సెంచరీ హీరో తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఖాయమే కాగా... కెపె్టన్ సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్‌తో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే రింకూ సింగ్ బ్యాట్ నుంచి గత మెరుపులు కరువయ్యాయి. ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కలిపి రింకూ కేవలం 28 పరుగులే చేశాడు. అతడి స్థాయికి ఇది చాలా తక్కువే. తగినన్ని బంతులు ఆడే అవకాశం రాలేదన్నది నిజమే అయినా... క్రీజులో ఉన్న కాసేపట్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న రింకూ... చివరి పోరులో భారీ షాట్లతో విరుచుకుపడాల్సిన అవసరముంది. మూడో టి20 ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హిట్టర్ రమణ్‌దీప్ సింగ్‌కు మరోసారి అవకాశం దక్కవచ్చు. అర్ష్ దీప్ సింగ్ పేస్ బాధ్యతలు మోయనున్నాడు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నారు. మిల్లర్, క్లాసెన్ మెరిస్తేనే! టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా... ఈ సిరీస్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. గత మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లంతా చేతులెత్తేసిన సమయంలో పేస్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్ భారీ షాట్లతో విరుచుకుపడి టీమిండియాను భయపెట్టాడు.టాపార్డర్‌లో ఇలాంటి దూకుడు లోపించడంతోనే సఫారీ జట్టు ఇబ్బంది పడుతోంది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్లపై ఆ జట్టు అతిగా ఆధారపడుతోంది. ఈ ఇద్దరు ఒకటీ అరా మెరుపులు తప్ప... చివరి వరకు నిలకడగా రాణించలేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. గత ఏడాది టీమిండియాతో తమ దేశంలో జరిగిన సిరీస్‌ను 1–1తో సమం చేసుకున్న దక్షిణాఫ్రికా... ఇప్పుడదే ఫలితం రాబట్టాలంటే శక్తికి మించి పోరాడాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో కేశవ్ మహరాజ్, సిమ్లెన్, కోట్జీ, మార్కో జాన్సన్ కీలకం కానున్నారు. -
South Africa vs India: సఫారీ గడ్డపై సమరానికి సై
దాదాపు ఐదు నెలల క్రితం... టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ మ్యాచ్ తర్వాత ఇరు జట్లు మరోసారి ఇదే ఫార్మాట్లో పోరుకు సిద్ధమయ్యాయి. వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమికి ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో మ్యాచ్‌ను ప్రతీకార సమరంగా చూడలేం. పైగా నాటి మ్యాచ్ ఆడిన టీమ్ నుంచి ఇరు జట్లలో పలు మార్పులు జరిగాయి. అయితే తర్వాతి టి20 వరల్డ్‌కప్ కోసం కొత్త జట్లను తయారు చేసే ప్రణాళికల్లో భాగంగా ఇరు జట్లూ సన్నద్ధమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ టి20 సమరానికి రంగం సిద్ధమైంది. డర్బన్: స్వదేశంలో ఐదు రోజుల క్రితమే టెస్టు సిరీస్‌లో చిత్తయిన భారత్ ఇప్పుడు విదేశీ గడ్డపై టి20 ఫార్మాట్లో సత్తా చాటేందుకు ‘సై’ అంటోంది. అయితే టెస్టు సిరీస్ ఆడిన వారిలో ఒక్క ఆటగాడు కూడా లేకుండా బరిలోకి దిగుతుండటంతో టీమిండియాపై ఈ ఓటమి భారం లేదు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాను తొలి టి20 మ్యాచ్‌లో భారత్ ఎదుర్కోనుంది. సఫారీ జట్టు పరిస్థితి చూస్తే వరల్డ్‌కప్ ఓటమి నుంచి ఇంకా కోలుకున్నట్లుగా లేదు. ఆ తర్వాత టి20ల్లోనే విండీస్ చేతిలో 0–3తో ఓడిన జట్టు ఐర్లాండ్‌తో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఇప్పుడు స్వదేశంలోనైనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చి సిరీస్ గెలుచుకోవాలని జట్టు ఆశిస్తోంది. సుస్థిర స్థానం కోసం... సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను టి20 సిరీస్‌లో 3–0తో ఓడించిన భారత యువ జట్టు ఉత్సాహంతో ఉంది. సూర్యకుమార్ నాయకత్వంలో ఈ టీమ్ అన్ని విధాలా బలంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌పై హైదరాబాద్‌లో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన సంజూ సామ్సన్ అదే జోరును ఇక్కడా కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. యశస్వి, గిల్వంటి రెగ్యులర్ ఓపెనర్లు మళ్లీ వచ్చినా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అతను భావిస్తున్నాడు. రెండో ఓపెనర్‌గా అభిషేక్ శర్మ కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. జింబాబ్వేపై 36 బంతుల్లోనే శతకం బాదినా... మిగిలిన ఆరు ఇన్నింగ్స్‌లలో అతను ఒక్కసారి కూడా 20 పరుగులు దాటలేదు. ఇటీవల ఎమర్జింగ్ కప్‌లో భారత టాప్‌స్కోరర్‌గా నిలిచిన అభిషేక్ ఇక్కడ రాణించడం అవసరం. సూర్య, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్‌లతో మన బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కూడా తనను తాను మళ్లీ నిరూపించుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో మంచి ప్రదర్శనలే వచ్చినా... ఆ తర్వాత చోటు కోల్పోయి ఇటీవలే మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఎమర్జింగ్ కప్‌లో కెప్టెన్ హోదాలో ఆడిన తిలక్ 4 ఇన్నింగ్స్‌లలో 117 పరుగులే చేయగలిగాడు. మిడిలార్డర్లో పోటీ పెరిగిన నేపథ్యంలో రెగ్యులర్‌గా మారాలంటే తిలక్ మంచి స్కోర్లు సాధించాల్సి ఉంది. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డర్ అయిన రమణ్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మెరుపు ప్రదర్శనతో ముస్తాక్ అలీ టోర్నీలో పంజాబ్, ఐపీఎల్లో కేకేఆర్ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను ఎమర్జింగ్ టోర్నీలోనూ రాణించాడు. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడైన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌ను నడిపిస్తుండగా...అవేశ్‌కు రెండో పేసర్‌గా అవకాశం దక్కవచ్చు. హిట్టర్లు వచ్చేశారు... వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ మళ్లీ ఇప్పుడే మైదానంలోకి దిగుతున్నారు. వీరిద్దరి రాకతో పాటు మరో దూకుడైన ప్లేయర్ స్టబ్స్‌తో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ పటిష్టంగా మారింది. ప్రపంచకప్ ఆడిన డికాక్, రబడ, నోర్జే ఈ సిరీస్‌కు అందుబాటులో లేకపోయినా... గాయాల నుంచి కోలుకున్న జాన్సెన్, కొయెట్జీ పునరాగమనం చేయడంతో టీమ్ మెరుగ్గా కనిపిస్తోంది. ఓపెనర్లుగా అనుభవజ్ఞుడైన హెన్డ్రిక్స్తో పాటు రికెల్టన్ శుభారంభం ఇవ్వాలని టీమ్ ఆశిస్తోంది. ఇద్దరు కొత్త ఆటగాళ్లు సిమ్‌లేన్, ఎన్ఖబయోమ్జి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టనున్నారు. అయితే కెప్టెన్ మార్క్రమ్ ఫామ్ టీమ్‌ను కలవరపరుస్తోంది. ఈ ఏడాది ఆడిన 14 ఇన్నింగ్స్‌లలో మార్క్రమ్ ఒకే ఒక్కసారి 25 పరుగుల స్కోరు దాటగలిగాడు. ఈ సిరీస్ ద్వారా ఫామ్‌లోకి వస్తానని అతను చెబుతున్నాడు. ఐపీఎల్ వేలానికి ముందు భారత జట్టుపై రాణించడం ద్వారా తమ సత్తాను ప్రపంచానికి చూపించేందుకు సఫారీ ఆటగాళ్లకు ఇది చక్కటి అవకాశం. ఒక్క క్లాసెన్ మినహా మిగతా వారందరూ వేలంలోకి రానున్నారు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, తిలక్, పాండ్యా, రింకూ, రమణ్‌దీప్, అక్షర్, అవేశ్, అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెపె్టన్), హెన్డ్రిక్స్, రికెల్టన్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, సిమ్‌లేన్, ఎన్ఖబయోమ్జి, కేశవ్, బార్ట్‌మన్.పిచ్, వాతావరణం కింగ్స్‌మీడ్ మైదానం భారీ స్కోర్లకు వేదిక. మరోసారి అదే జరిగే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ రోజు వర్షసూచన ఉంది.6: దక్షిణాఫ్రికా గడ్డపై ఇరు జట్ల మధ్య 9 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 6 మ్యాచ్‌ల్లో నెగ్గి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. -
W T20 WC: కథ మళ్లీ మొదటికి...
‘నా దృష్టిలో టి20ల్లో ఇదే భారత అత్యుత్తమ జట్టు. 15 మందిలో 12 మందికి ప్రపంచ కప్ ఆడిన అనుభవం ఉంది. అందరికీ తమ బాధ్యతలు బాగా తెలుసు. వారి సత్తాపై నాకు బాగా నమ్మకముంది’... వరల్డ్ కప్ కోసం బయల్దేరే ముందు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ తుది ఫలితం చూస్తే మాత్రం అందరికీ నిరాశ కలిగింది. ప్లేయర్‌గా 9వ ప్రయత్నంలో కూడా వరల్డ్ కప్ ట్రోఫీ లేకుండానే హర్మన్ ముగించింది. వరుసగా గత మూడు టి20 వరల్డ్ కప్‌లలో సెమీస్, ఫైనల్, సెమీస్... ఇదీ మన ప్రదర్శన. టీమ్ బలాబలాలు, ఫామ్, ర్యాంక్‌ను బట్టి చూసుకుంటే మన జట్టు మహిళల క్రికెట్లో కచ్చితంగా టాప్–4లో ఉంటుంది. కాబట్టి మరో చర్చకు తావు లేకుండా కనీసం సెమీఫైనల్ అయినా చేరుతుందని అందరూ అంచనా వేశారు. తర్వాతి రెండు నాకౌట్ మ్యాచ్‌ల సంగతేమో కానీ... సెమీస్ గురించి ఎవరికీ సందేహాలు లేవు. ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదుగత రెండు సీజన్లుగా పూర్తి స్థాయిలో సాగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాణించి అవకాశం దక్కించుకున్న యువ ప్లేయర్లు జట్టును మరింత పటిష్టంగా మార్చారు. ఇలాంటి స్థితిలో వరల్డ్ కప్‌లో జట్టు ప్రదర్శన ఆశ్చర్యం కలిగించింది. అసలు ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదు. పైగా యూఏఈలో వాతావరణం, పిచ్‌లు భారత్‌కు అనుకూలం అంటూ జరిగిన ప్రచారంతో హర్మన్ బృందం ఫేవరెట్‌గా మారింది. కొన్ని రోజుల క్రితమే ఆసియా కప్ ఫైనల్లో భారత్ అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓడింది. అయితే ఆ మ్యాచ్ ఒక ‘అరుదైన పరాజయం’గానే అంతా భావించారు. ఎందుకంటే ఫైనల్‌కు ముందు ఆ టోర్నీలో మన జట్టు అద్భుతంగా ఆడింది. కాబట్టి దాని ప్రభావం వరల్డ్ కప్‌పై ఉండకపోవచ్చు అని కూడా అంతా భావించారు. గ్రూప్ ‘ఎ’ నుంచి ఆస్ట్రేలియా తర్వాత రెండో జట్టుగా భారత్ సెమీస్ చేరే అవకాశం కనిపించింది. అయితే తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగులతో చిత్తుగా ఓడటంతోనే అంతా తలకిందులైంది. ఆసీస్ ముందు తలవంచిసెమీస్లో స్థానం కోసం మనతో పోటీ పడే జట్టుపై గెలవకపోవడమే చివరకు దెబ్బ తీసింది. ఆ తర్వాత పాక్‌పై 106 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు కూడా 18.5 ఓవర్లు తీసుకోవడం మన బలహీన ఆటను గుర్తు చేసింది. ఆపై శ్రీలంకను 82 పరుగులతో చిత్తు చేసినా... ఆసీస్ ముందు తలవంచాల్సి వచ్చింది. నాలుగో వికెట్‌కు హర్మన్, దీప్తి 55 బంతుల్లోనే 63 పరుగులు జోడించి గెలుపు దిశగా సాగుతున్న మ్యాచ్‌లో కూడా చివరకు మన జట్టు తలవంచింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో హర్మన్ స్ట్రైక్ రొటేట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ టోర్నీలో ఓవరాల్‌గా లంకపై మినహా మన ఆటతీరు అతి సాధారణంగా కనిపించింది.హర్మన్ ఒక్కతే రెండు అర్ధసెంచరీలు చేయగా... టాప్–5లో మిగతా నలుగురు పూర్తిగా విఫలమయ్యారు. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన కూడా మూడు కీలక మ్యాచ్‌లలో కనీస ప్రదర్శన ఇవ్వలేదు. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. బ్యాటింగ్‌తో పోలిస్తే మన బౌలింగ్ మెరుగ్గా అనిపించింది. అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ చెరో 7 వికెట్లతో ఆకట్టుకోగా... ఆశా శోభన రాణించింది. అయితే సమష్టి వైఫల్యం కివీస్, ఆసీస్‌తో మ్యాచ్‌లలో దెబ్బ తీసింది. సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన ఫిట్నెస్ క్యాంప్, స్కిల్ క్యాంప్‌లు చాలా బాగా జరిగాయని కోచ్ అమోల్ మజుందార్ చెప్పాడు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధ బవరే కూడా జట్టుతో ఉంది. కానీ తాజా ఫలితం చూస్తే అతను మెరుగుపర్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేది స్పష్టం. –సాక్షి క్రీడా విభాగం -
బంగ్లాపై భారత్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్ స్వీప్ (ఫోటోలు)
-
ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య చివరి టి20 రద్దు
భారీ వర్షం కారణంగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య ఆదివారం మాంచెస్టర్‌లో జరగాల్సిన చివరి టి20 మ్యాచ్ రద్దయింది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. దాంతో టాస్ కూడా వేయకుండా నిర్ణీత సమయానికి రెండు గంటల తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఈ నెల 19 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లతో కూడిన వన్డే సిరీస్ జరుగుతుంది. -
రెండో టీ20లో టీమ్ఇండియా ఘనవిజయం..సిరీస్ భారత్‌దే (ఫొటోలు)
-
సిరీస్ విజయమే లక్ష్యంగా...
హరారే: జింబాబ్వే పర్యటనలో భారత యువ జట్టు అంచనాలకు అనుగుణంగానే రాణిస్తోంది. తక్కువ స్కోర్ల తొలి టి20లో తడబడి అనూహ్యంగా ఓటమి పాలైనా... తర్వాతి రెండు మ్యాచ్‌లలో జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారీ స్కోర్లు చేసిన అనంతరం వాటిని నిలబెట్టుకుంది. ఇదే జోరులో మరో మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని శుబ్‌మన్ గిల్ బృందం పట్టుదలగా ఉంది. జట్టు సభ్యులంతా ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. రుతురాజ్ నిలకడగా ఆడుతుండగా... అభిషేక్ శర్మ రెండో మ్యాచ్‌లో సెంచరీతో తన ధాటిని చూపించాడు. కెప్టెన్ గిల్ కూడా అర్ధ సెంచరీతో ఫామ్‌లోకి రాగా... వరల్డ్ కప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత యశస్వి జైస్వాల్ కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రింకూ సింగ్ కూడా రెండో టి20లో సిక్సర్ల మోత మోగించగా, గత మ్యాచ్‌లో ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాని సంజూ సామ్సన్ కూడా చెలరేగిపోగలడు. శివమ్ దూబే కూడా తన దూకుడును ప్రదర్శిస్తే ఇక ఈ లైనప్‌ను నిలువరించడం జింబాబ్వే బౌలర్లకు అంత సులువు కాదు. బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ స్పిన్‌ను ప్రత్యర్థి బ్యాటర్లు తడబడుతున్నారు. తొలి మూడు మ్యాచ్‌లు ఆడిన అవేశ్ స్థానంలో ముకేశ్‌కు మళ్లీ తుది జట్టులో చోటు దక్కవచ్చు. ఈ మార్పు మినహా అదే జట్టు కొనసాగనుంది. మరోవైపు సిరీస్‌ను కోల్పోకుండా ఉండేందుకు జింబాబ్వే రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది. గత రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు పేలవ ఫీల్డింగ్‌తో 7 క్యాచ్‌లు వదిలేయడంతో పాటు అదనపు పరుగులూ ఇచ్చింది. దీనిని నివారించగలిగితే టీమ్ పోటీనివ్వగలదు. మరోసారి కెప్టెన్ సికందర్ రజానే కీలకం కానుండగా... బెన్నెట్, మైర్స్, క్యాంప్‌బెల్‌లపై బ్యాటింగ్ భారం ఉంది. బౌలింగ్‌లో పేసర్ ముజరబాని, చటారా నిలకడగా ఆడుతున్నారు. సొంతగడ్డపై జింబాబ్వే తమ స్థాయికి తగినట్లు ఆడితే పోరు ఆసక్తికరంగా సాగవచ్చు. -
కోహీకి షాక్..ఓపెనర్ గా యశస్వి..?
-
IPL LSG Vs DC Photos: కుల్దీప్ మాయాజాలం, 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు (ఫొటోలు)
-
మెరుపు ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించిన శశాంక్ (ఫొటోలు)
-
ఆఖరి టి20లో పాకిస్తాన్‌కు ఊరట విజయం
న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కాకుండా పాకిస్తాన్ తప్పించుకుంది. శనివారం జరిగిన ఐదో టి20లో పాక్ 42 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (38), ఫఖర్ జమాన్ (33) రాణించారు. కివీస్ బౌలర్లలో సౌతీ, ఇష్ సోధి, ఫెర్గూసన్, హెన్రీ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై కివీస్‌కు టి20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. ఫిలిప్స్ (26), అలెన్ (22) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇఫ్తికార్ అహ్మద్ (3/24) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. 275 పరుగులు సాధించిన అలెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ 4–1తో సిరీస్ గెలుచుకుంది. -
ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్.. ఓపెనర్‌గా విరాట్ కోహ్లి..?
ఆఫ్ఘనిస్తాన్‌తో గురువారం నుంచి ప్రారంభం కాబోయే టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనర్‌గా విరాట్ కోహ్లి వస్తాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రచారాన్ని చూసి కోహ్లి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, కొందరు విశ్లేషకులు మాత్రం ఇది సాధ్యమయ్యే విషయం కాదని సదరు ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. వాస్తవానికి కోహ్లి గత ఐపీఎల్ సీజన్లో ఓపెనర్ అవతారమెత్తినప్పటికీ, అది క్యాష్ రిచ్ లీగ్ వరకే పరిమతమైంది. గత సీజన్లో అతను ఓపెనర్‌గా పరుగుల వరద పారించినా, ఆతర్వాత అంతర్జాతీయ టీ20లు ఆడలేదు. దీంతో ఆ అంశం అప్పటితో మరుగున పడిపోయింది. అయితే తాజాగా కోహ్లి అంతర్జాతీయ టీ20ల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఓపెనర్ ప్రస్తావన మళ్లీ తెరపైకి వచ్చింది. పొట్టి ఫార్మాట్లో కోహ్లిని ఓపెనర్‌గా పంపాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత సమీకరణల ప్రకారం ఇది సాధ్యపడకపోవచ్చనే చెప్పాలి. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఉన్న నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ ఇలాంటి సాహసాల జోలికి పోకపోవచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌కు సైతం భారత సెలెక్టర్లు రోహిత్‌కు జతగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లను ఓపెనర్లును ఎంపిక చేశారు. రోహిత్‌కు జతగా కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేస్తే వీరి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే గిల్ టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయి జట్టులో చోటే ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఈ పరిస్థితుల్లో టీమ్ మేనేజ్మెంట్ కోహ్లిని ఓపెనర్‌గా పంపించే సాహసం చేస్తుందో లేదో వేచి చూడాలి. వాస్తవానికి కోహ్లి వన్‌డౌన్‌లో వస్తే టీమిండియాకు కొండంత బలం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా చాలామంది మాజీలు ప్రస్తావిస్తూ, కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి కోహ్లి విషయంలో జరుగుతున్న ప్రచారం నిజమో లేదో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 11, 14, 17 తేదీల్లో జరుగనుంది. చాలాకాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆఫ్ఘన్‌తో సిరీస్ అనంతరం టీమిండియా స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఓపెనర్‌గా టీ20ల్లో విరాట్ గణాంకాలు.. 107 మ్యాచ్‌లు 107 ఇన్నింగ్స్‌లు 4011 పరుగులు 122 నాటౌట్ అత్యధిక స్కోర్ 44.56 సగటు 137.64 సగటు 8 శతకాలు 28 అర్ధశతకాలు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ అఫ్గనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. -
ఆసీస్‌తో రెండో టీ20.. సిరీస్ విజయమే లక్ష్యంగా!
ముంబై: వన్డే సిరీస్ వైఫల్యాన్ని అధిగమించి తొలి టి20లో ఆ్రస్టేలియా మహిళలపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడే అదే ఊపులో సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. గత మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహంతో హర్మన్‌ప్రీత్ సేన బరిలోకి దిగుతోంది. మరో వైపు సాధారణ బ్యాటింగ్‌తో ఓటమిని ఆహ్వానించిన ఆస్ట్రేలియా కోలుకొని సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. యువ పేసర్ టిటాస్ సాధు అద్భుత బౌలింగ్ ప్రదర్శన తొలి మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. 19 ఏళ్ల ఈ బెంగాలీ పేసర్ మరోసారి తన జోరును ప్రదర్శిస్తే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. శ్రేయాంక, దీప్తిల ఆటతో డీవై పాటిల్ స్టేడియంలో స్పిన్నర్ల ప్రభావం కూడా బాగా కనిపించింది. పేసర్లు రేణుక, పూజ కూడా ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌లో షఫాలీ, స్మృతి మరో బ్యాటర్‌కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఫామ్ కోల్పోయి చివరి రెండు వన్డేల్లో తుది జట్టులో అవకాశం లభించని షఫాలీ తాను ఎంత కీలకమో తొలి టి20 పోరులో చూపించింది. స్మృతి కూడా చాలా కాలం తర్వాత తన స్థాయికి తగ్గ ఆటతీరుతో అలరించింది. జెమీమా, హర్మన్ కూడా చెలరేగితే బ్యాటింగ్‌లో తిరుగుండదు. జట్టుపరంగా చూస్తే ముఖ్యంగా వన్డేలతో పోలిస్తే ఫీల్డింగ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మరో వైపు ఆ్రస్టేలియా జట్టు అనూహ్య రీతిలో తడబడింది. టి20ల్లో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆ జట్టు ఆలౌట్ కావడం భారత బౌలర్ల పైచేయిని చూపించింది. సీనియర్ బ్యాటర్లు ఉన్న టాప్–5లో పెరీ మినహా అంతా విఫలమయ్యారు. అయితే హీలీ, మూనీ, తహీలా, గార్డ్నర్ రాణిస్తే జట్టు భారీ స్కోరు చేయగలుగుతుంది. వన్డే సిరీస్‌లో అద్భుత ఆటను చూపించిన లిచ్‌ఫీల్డ్ టి20 మ్యాచ్‌లో కూడా సత్తా చాటడం ఆసీస్‌కు సానుకూలాంశం. ఆమె ఆడిన కొన్ని చక్కటి షాట్లు లిచ్‌ఫీల్డ్ సామర్థ్యాన్ని చూపించాయి. గత మ్యాచ్‌లో పూర్తిగా కట్టు తప్పిన ఆసీస్ బౌలింగ్ ఈ సారి ఎంత ప్రభావం చూపిస్తుంననేది ఆసక్తికరం. -
సూర్య సూపర్ సెంచరీ.. దక్షిణాఫ్రికా చిత్తు
జొహన్నెస్‌బర్గ్: వాండరర్స్ మైదానంలో భారత్ విజయహాసం చేసింది. గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ భారీ విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో భారత్ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ , ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు శతకంతో చెలరేగాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (41 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు. అంతర్జాతీయ టి20ల్లో నాలుగో సెంచరీ సాధించిన సూర్య... రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లతో సమంగా నిలిచాడు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఏ దశలోనూ ప్రభావం చూపలేకపోయింది. చివరకు ఆ జట్టు 13.5 ఓవర్లలోనే 95 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ మిల్లర్ (25 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా, మార్క్రమ్ (25) ఫర్వాలేదనిపించాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/17) తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని పడగొట్టాడు. తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా... తాజా ఫలితంతో 1–1తో టి20 సిరీస్ సమంగా ముగిసింది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి మ్యాచ్ జరుగుతుంది. సూర్య సిక్సర్ల జోరు... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. గిల్ (12), తిలక్ వర్మ (0)లను వరుస బంతుల్లో కేశవ్ మహరాజ్ అవుట్ చేశాడు. అయితే మరో ఎండ్‌లో యశస్వి మాత్రం దూకుడు కనబరుస్తూ మార్క్రమ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. నాలుగో స్థానంలో వచ్చిన సూర్య తనదైన శైలిలో ఆరంభం నుంచి విరుచుకుపడటంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 62 పరుగులకు చేరింది. మధ్యలో కొంత నెమ్మదించిన యశస్వి 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఫెలుక్వాయో ఓవర్లో సూర్య చెలరేగిపోయాడు. వరుసగా 6, 4, 6, 6 కొట్టిన అతను 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మూడో వికెట్‌కు సూర్యతో 70 బంతుల్లోనే 112 పరుగులు జోడించిన అనంతరం యశస్వి వెనుదిరిగాడు. రింకూ సింగ్ (14) ఈసారి ప్రభావం చూపలేకపోగా, జితేశ్ (4), జడేజా (4) విఫలమయ్యారు. మరోవైపు సూర్య మాత్రం తన జోరు కొనసాగించాడు. బర్జర్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4 బాదిన అతను షమ్సీ ఓవర్లోనూ 4, 6 కొట్టాడు. 55 బంతుల్లో సూర్య సెంచరీ పూర్తి కాగా, 20వ ఓవర్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. చివరి 4 ఓవర్లలో టీమిండియాను కట్టడి చేయడంలో సఫలమైన సఫారీ టీమ్ 40 పరుగులే ఇచ్చింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) హెన్డ్రిక్స్ (బి) షమ్సీ 60; గిల్ (ఎల్బీ) (బి) మహరాజ్ 8; తిలక్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 0; సూర్యకుమార్ (సి) బ్రీట్కే (బి) విలియమ్స్ 100; రింకూ (సి) (సబ్) స్టబ్స్ (బి) బర్జర్ 14; జితేశ్ (హిట్‌వికెట్) (బి) విలియమ్స్ 4; జడేజా (రనౌట్) 4; అర్‡్షదీప్ (నాటౌట్) 0; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–29, 2–29, 3–141, 4–188, 5–194, 6–199, 7–199. బౌలింగ్: బర్జర్ 4–0–39–1, మార్క్రమ్ 1–0–15–0, కేశవ్ మహరాజ్ 4–0– 26–2, విలియమ్స్ 4–0–46–2, ఫెలుక్వాయో 3–0–33–0, షమ్సీ 4–0–38–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హెన్డ్రిక్స్ (రనౌట్) 8; బ్రీట్కే (బి) ముకేశ్ 14; మార్క్రమ్ (సి) యశస్వి (బి) జడేజా 25; క్లాసెన్ (సి) రింకూ (బి) అర్‡్షదీప్ 5; మిల్లర్ (బి) కుల్దీప్ 35; ఫెరీరా (బి) కుల్దీప్ 12; ఫెలుక్వాయో (సి) అండ్ (బి) జడేజా 0; మహరాజ్ (బి) కుల్దీప్ 1; బర్జర్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 1; విలియమ్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (13.5 ఓవర్లలో ఆలౌట్) 95. వికెట్ల పతనం: 1–4, 2–23, 3–42, 4–42, 5–75, 6–82, 7–89, 8–89, 9–94, 10–95. బౌలింగ్: సిరాజ్ 3–1–13–0, ముకేశ్ 2–0–21–1, అర్‡్షదీప్ 2–0–13–1, జడేజా 3–0–25–2, తిలక్ 1–0–4–0, కుల్దీప్ 2.5–0–17–5. -
భారత్vsఆస్ట్రేలియా T20 ఉత్కంఠపోరులో భారత్ విజయం (ఫొటోలు)
-
విశాఖ వేదికగా కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్
-
నేటి నుంచి ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్ టికెట్ల విక్రయం
విశాఖపట్నం: విశాఖ వేదికగా ఈ నెల 23న జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీసీపీ–1 కె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఉదయం 11 గంటల నుంచి పేటీఎం(ఇన్సైడర్.ఇన్)లో టికెట్లు పొందవచ్చన్నారు. 17, 18 తేదీల్లో పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్, వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయించనున్నట్లు చెప్పారు. ఆఫ్‌లైన్‌లో ఒకరికి రెండు టికెట్లు మాత్రమే విక్రయిస్తారని స్పష్టం చేశారు. ఆన్లైన్లో 10,500, ఆఫ్‌లైన్‌లో 11,500 టికెట్లు విక్రయిస్తారని, కాంప్లిమెంటరీ టికెట్లు 5 వేల వరకు ఉంటాయన్నారు. పోలీసులకు సహకరించాలి : క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చే వారు పోలీసులకు సహకరించాలని డీసీపీ–1 కోరారు. మ్యాచ్ ప్రారంభానికి ముందుగానే వచ్చి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని సూచించారు. పోలీసులు సూచించిన ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలన్నారు. విలువైన వస్తువులు, ఎక్కువ మొత్తంలో నగదు తీసుకురావద్దన్నారు. సెక్యూరిటీ పరంగా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. టికెట్లపై ప్రత్యేకంగా మార్కు ఉంటుందన్నారు. స్కాన్‌లో ఆ మార్కు రాకపోయినా, కలర్ జిరాక్స్ టికెట్లు తీసుకొచ్చినా అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. వేరే వారి దగ్గర కొనుగోలు చేశామని కుంటిసాకులు చెప్పవద్దన్నారు. అలా వచ్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వానతో ముగిసిన ఆట!
డబ్లిన్: భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వర్షంతో ముగింపు లభించింది. బుధవారం జరగాల్సిన మూడో టి20 మ్యాచ్ వాన కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. నిర్విరామంగా కురిసిన వర్షం తెరిపినివ్వకపోవడంతో టాస్ వేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మధ్యలో కొద్దిసేపు వాన తీవ్రత తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరీక్షించినా... కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించే అవకాశం లేదని తేలిపోయింది. దాంతో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ రద్దుపై అంపైర్లు అధికారిక ప్రకటన చేశారు. దాంతో తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్ ఖాతాలో 2–0తో సిరీస్ చేరింది. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ‘చంద్రయాన్’ను వీక్షిస్తూ... మ్యాచ్ రోజు డబ్లిన్‌లో భారత క్రికెటర్లు టీవీలో ‘చంద్రయాన్–3’ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ సమయం గడిపారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అడుగు పెట్టిన క్షణాన సంబరాలు చేసుకుంటూ భావోద్వేగంతో తమ ఆనందాన్ని ప్రదర్శించారు. మరోవైపు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, స్టార్ ప్లేయర్ కోహ్లి తదితరులు తమ సంతోషాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్లో ‘ఇస్రో’కు అభినందనలు తెలియజేశారు. -
Ind Vs Ire: ప్రయోగానికి ఆఖరి అవకాశం .. జితేశ్, షహబాజ్‌లకు ఛాన్స్!
డబ్లిన్: వెస్టిండీస్‌తో ఐదు టి20 మ్యాచ్‌లు, ఆ తర్వాత ఐర్లాండ్‌తో మూడు టి20 మ్యాచ్‌లు భారత యువ ఆటగాళ్లను ఈ ఫార్మాట్లో పరీక్షించేందుకు అవకాశం ఇచ్చాయి. వన్డే ప్రపంచకప్ ఏడాది ఎక్కువ మంది సీనియర్లు విరామం తీసుకోగా, కుర్రాళ్లంతా తమకు లభించిన చాన్స్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ రెండు పర్యటనల్లో కలిపి ఏడు మ్యాచ్‌లలో ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు. ఇక మరో ఇద్దరు దాని కోసం ఎదురు చూస్తున్నారు. టూర్ చివరి మ్యాచ్‌లో ఆ చాన్స్ దక్కుతుందా అనేది చూడాలి. సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకున్న భారత్ కోణంలో ఇది మాత్రమే ఆసక్తికర అంశం. మరోవైపు వన్డే, టి20 ఫార్మాట్లలో కలిపి భారత్‌తో ఆడిన 10 సార్లూ ఓడిన ఐర్లాండ్ ఈసారైనా సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ గెలవాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో నేడు చివరి టి20కి రంగం సిద్ధమైంది. జితేశ్, షహబాజ్‌లకు అవకాశం! ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్లోలనూ రాణించిన కెప్టెన్ బుమ్రా, పేసర్ ప్రసిధ్ కృష్ణ ఫామ్‌లోకి రావడం, ఆసియా కప్‌కు ఎంపిక కావడంతో ఈ సిరీస్ నుంచి భారత్‌కు ఆశించిన ప్రధాన ఫలితం దక్కింది. అయితే మరింత మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వీరిద్దరు ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతారు. రవి బిష్ణోయ్ కూడా సిరీస్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో రుతురాజ్, సామ్సన్, రింకూ సింగ్ కూడా తమకు లభించిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకోగా, శివమ్ దూబే కూడా తన ధాటిని ప్రదర్శించాడు. సిరీస్‌లో విఫలమైన తిలక్ వర్మ చివరి పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. యశస్వి కూడా మరో మెరుపు ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఈ స్థితిలో తుది జట్టులో మూడు మార్పులకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడని వికెట్ కీపర్ జితేశ్ శర్మ, 3 వన్డేలు ఆడిన షహబాజ్ అహ్మద్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిని తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తే సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో అవకాశం దక్కుతుంది. మరోవైపు కొంత విరామం తర్వాత టీమ్‌లోకి వచ్చిన అవేశ్ ఖాన్ కూడా టీమ్‌తో పాటు ఉన్నాడు. అతనికీ ఒక మ్యాచ్ ఇవ్వాలనుకుంటే అర్‡్షదీప్‌కు విశ్రాంతినిస్తారు. ఇదే జరిగితే కుర్రాళ్లతో భారత్ ప్రయోగం సంపూర్ణమవుతుంది. స్టిర్లింగ్ ఫామ్‌లోకి వచ్చేనా! రెండు టి20 మ్యాచ్‌లలో ఐర్లాండ్ ఆటతీరు మరీ పేలవంగా లేకున్నా భారత్‌లాంటి బలమైన జట్టుకు పోటీనిచ్చేందుకు సరిపోలేదు. గతంలోనూ కొన్ని చక్కటి ప్రదర్శనలు వచ్చినా టీమిండియాను ఓడించడంలో మాత్రం ఆ జట్టు సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో చివరి పోరులోనైనా ఆ జట్టు గెలుపు బాట పడుతుందేమో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఇక్కడ మాత్రం రెండింటిలోనూ విఫలమయ్యాడు. బల్బిర్నీ మినహా మిగతావారంతా ప్రభావం చూపలేకపోయారు. విజయం సాధించాలంటే జట్టు సమష్టిగా రాణించడం కీలకం. ఐర్లాండ్ కూడా గత మ్యాచ్‌తో పోలిస్తే మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. -
మరో విజయంపై టీమిండియా గురి.. ఫ్లోరిడాలో నాలుగో టీ20
లాడర్‌హిల్ (ఫ్లోరిడా): భారత్, వెస్టిండీస్ సమరం అమెరికా గడ్డకు చేరింది. సిరీస్‌ను సమం చేసే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతుండగా... గత మ్యాచ్‌లో ఓటమి పాలైన తర్వాత ఇక్కడైనా సిరీస్ అందుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే నాలుగో టి20 మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ టూర్లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లతో పోలిస్తే అమెరికాలోని ఈ రీజినల్ పార్క్ స్టేడియం బ్యాటింగ్‌కు బాగా అనుకూలించే మైదానం. గతంలోనూ ఇక్కడ భారీ స్కోర్లే నమోదయ్యాయి కాబట్టి సిరీస్‌లోని చివరి రెండు టి20ల్లో బ్యాటర్ల నుంచి మెరుపు ప్రదర్శనలు ఆశించవచ్చు. అయితే శనివారం రోజున వర్ష సూచన ఉంది. మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించవచ్చు. ఇక్కడ జరిగిన 13 టి20ల్లో 11 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. అదే జట్టుతో... గత మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించిన భారత జట్టు మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. తన సత్తా చాటేందుకు యశస్వి జైస్వాల్‌కు ఇది మరో అవకాశం. అయితే రెండో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మూడు మ్యాచుల్లోనూ ‘సింగిల్ డిజిట్’ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక్కడైనా అతను ఫామ్‌ను అందుకుంటాడా చూడాలి. ఈ ఫార్మాట్లో తాను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో సూర్యకుమార్ నిరూపించాడు. అయితే ఇప్పుడు అందరి దృష్టీ హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మపై నిలిచింది. సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లలో సత్తా చాటిన అతనిపై అన్ని వైపుల నుంచి ప్రశంసలతో పాటు వన్డేల్లోనూ తీసుకోవాలనే సూచనలు వస్తున్న నేపథ్యంలో తిలక్ తన జోరును కొనసాగించాల్సి ఉంది. సంజు సామ్సన్‌కు కూడా ఇది చావోరేవోలాంటి మ్యాచ్. ఇక్కడా అవకాశం వృథా చేస్తే మున్ముందు కష్టమే. బౌలింగ్‌లో పేసర్లు ముకేశ్, అర్ష్ దీప్ అంతంత మాత్రమే ప్రభావం చూపిస్తుండగా... చహల్, కుల్దీప్ తమ స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టిపడేస్తున్నారు. వీరు మరోసారి చెలరేగితే విండీస్‌కు కష్టాలు తప్పవు. హెట్‌మైర్ రాణిస్తాడా... విండీస్ జట్టులో పూరన్, హెట్‌మైర్‌లు టి20 ఫార్మాట్లో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పూరన్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోగా, హెట్‌మైర్ ఇప్పటి వరకు ప్రభావం చూపలేకపోయాడు. ఈసారైనా అతను దూకుడుగా ఆడాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కెపె్టన్ పావెల్ ఫామ్‌లోకి సానుకూలాంశం కాగా... మేయర్స్, చార్లెస్ కనీస ప్రదర్శన కూడా ఇవ్వడం లేదు. ఓపెనర్ కింగ్ కూడా శుభారంభం అందించాల్సి ఉంది. చార్లెస్ స్థానంలో వన్డే కెప్టెన్ షై హోప్‌ను ఆడించే అవకాశం ఉంది. ఫిట్‌గా ఉంటే చేజ్ స్థానంలో హోల్డర్ తిరిగొస్తాడు. నెమ్మదైన పిచ్‌లపై మెరుగైన రీతిలో రాణించిన విండీస్ పేసర్లు జోసెఫ్, మెకాయ్, షెఫర్డ్ ఈ పిచ్‌పై భారత బ్యాటర్లను ఎలా నిలువరిస్తారనేది చూడాలి. అన్ని విధాలుగా ఆకట్టుకున్న స్పిన్నర్ అకీల్ హొసీన్పై కూడా టీమ్ ఆధారపడుతోంది. -
WI vs IND 3rd T20 Match Photos: మూడో టీ20లో భారత ఘన విజయం (ఫొటోలు)
-
సిరీస్ కాపాడుకునేందుకు...
ప్రావిడెన్స్ (గయానా): ఏడేళ్ల తర్వాత వెస్టిండీస్ చేతిలో భారత్ వరుసగా రెండు టి20 మ్యాచ్‌లలో ఓడింది. ఇప్పుడు అదే తరహాలో సిరీస్ కూడా కోల్పోయే స్థితిలో టీమిండియా నిలిచింది. రోహిత్, కోహ్లి లేకపోయినా ఐపీఎల్ కారణంగా తగినంత టి20 అనుభవం ఉన్న భారత జట్టు తొలి రెండు మ్యాచ్‌లలో ప్రత్యరి్థకి అనూహ్యంగా తలవంచింది. ఇప్పుడైనా హార్దిక్ పాండ్యా బృందం కోలుకొని తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తుందా అనేది కీలకం. మరోవైపు రెండు మ్యాచ్‌లు గెలిచిన ఉత్సాహంతో వెస్టిండీస్ సిరీస్‌పై కన్నేసింది. ఆ జట్టు ఇదే జోరు కొనసాగిస్తే మరో మ్యాచ్ గెలవడం కూడా కష్టం కాబోదు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు మూడో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గత మ్యాచ్ జరిగిన వేదికపైనే ఈ మ్యాచ్ కూడా కావడంతో పిచ్ నెమ్మదిగా ఉండవచ్చు. సూర్య చెలరేగేనా... తొలి రెండు టి20ల్లోనూ భారత ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. బ్యాటింగ్‌కు గొప్పగా అనుకూలించని నెమ్మదైన పిచ్‌పై పరుగులు చేసేందుకు మనవాళ్లు తడబడుతున్నారు. ఇషాన్ కిషన్, గిల్, సంజు సామ్సన్, హార్దిక్ పాండ్యా ప్రభావం చూపలేకపోయారు. దీంతోపాటు టి20ల్లో అద్భుత రికార్డు ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా తనదైన దూకుడు ప్రదర్శించలేదు. హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ ఒక్కడే చక్కటి బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో స్పిన్నర్ చహల్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోగా, అర్‡్షదీప్, ముకేశ్ కుమార్ నిరాశపరిచారు. పాండ్యా కెపె్టన్సీ కూడా పేలవంగా ఉంది. గత మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌కు బౌలింగ్ ఇవ్వకపోగా, కీలకదశలో చహల్‌కు బౌలింగ్ ఇవ్వకుండా విండీస్ గెలిచే అవకాశం సృష్టించాడు. ఈ తప్పులను దిద్దుకుంటేనే భారత్ గెలుపు బాట పట్టగలదు. వారిద్దరిపై భారం... వెస్టిండీస్ రెండుసార్లూ చక్కటి బౌలింగ్ ప్రదర్శనలతో మ్యాచ్‌లను సొంతం చేసుకోగలిగింది. పటిష్టమైన భారత లైనప్‌ను నిలువరించడంలో ఆ జట్టు సఫలమైంది. ముఖ్యంగా అకీల్ హొసీన్, మెకాయ్, జోసెఫ్‌లు నియంత్రణతో బౌలింగ్ చేస్తున్నారు. హోల్డర్ కూడా కీలక దశలో రాణించడం ఆ జట్టుకు సానుకూలాంశం. బ్యాటింగ్‌లో తన విలువేమిటో పూరన్ చూపించాడు. హెట్‌మైర్ కూడా జట్టు బ్యాటింగ్‌లో కీలకం. ఈ ఇద్దరు ఐపీఎల్ అనుభవం ఉన్న ఆటగాళ్లు జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సమర్థులు. అదే తరహాలో మేయర్స్ కూడా రాణించాలని టీమ్ కోరుకుంటోంది. మొత్తంగా చూస్తే ఈ ఫార్మాట్లో అంత సులువుగా తలవంచమని చూపిన విండీస్ సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. -
WI vs IND 1st T20 Match Photos : ఉత్కంఠపోరులో విండీస్ విజయం (ఫొటోలు)
-
రాన్నున్న T -20 సిరీస్ లో ఈ యువ ఆటగాళ్లు
-
ఒక్క సిరీస్ తో వరల్డ్ కప్ కి యశస్వి జైస్వాల్..
-
దుమ్మురేపుతున్న సామ్ కర్రన్.. ఓరేంజ్ లోే తిడుతున్న ఫ్యాన్స్
-
పతిరణకి ధోని సలహా...మండి పడుతున్న మలింగ
-
క్రికెట్ లో సరికొత్త రికార్డు... ఒక్క ఓవర్ లో 46 పరుగులు
-
అఫ్గన్ చేతిలో పాక్ చిత్తు
షార్జా: అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన పుష్కరకాలం తర్వాత అఫ్గనిస్తాన్‌కు ఆ జట్టుపై మొదటి విజయం దక్కింది. శుక్రవారం జరిగిన తొలి టి20లో అఫ్గన్ 6 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. అనంతరం అఫ్గనిస్తాన్ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 98 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ నబీ (38 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అఫ్గన్‌ను గెలిపించాడు. -
Ind Vs NZ: ఆఖరి ఆటకు సిద్ధం!
హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఇప్పటికే మూడు టి20 సిరీస్‌లు గెలుచుకున్న భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్‌లో తుది సమరానికి సన్నద్ధమైంది. ఏకపక్షంగా సాగిన వన్డేలతో పోలిస్తే రెండు టి20ల్లోనూ న్యూజిలాండ్ నుంచి టీమిండియా గట్టి పోటీ ఎదుర్కొంది. దాంతో సిరీస్ ఫలితం చివరి మ్యాచ్‌కు చేరింది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ కారణంగా మున్ముందు కొన్ని నెలల పాటు భారత జట్టు టి20 మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మన జట్టు విజయంతో ముగిస్తుందా లేక కివీస్ తన సత్తా చాటి సిరీస్ సాధిస్తుందా చూడాలి. అహ్మదాబాద్: సొంతగడ్డపై శ్రీలంకను చిత్తు చేసి రెండు ఫార్మాట్లలోనూ సిరీస్ గెలుచుకున్న భారత జట్టు న్యూజిలాండ్‌తోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. వన్డేల్లో విజేతగా నిలిచిన టీమిండియా, టి20ల్లో సిరీస్ అందుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ అవకాశాన్ని వదిలి పెట్టరాదని పట్టుదలగా ఉంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ 1–1తో సమంగా ఉన్న స్థితిలో నేడు జరిగే చివరి టి20 మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. తాజా ఫామ్, జట్లను చూస్తే మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. ఉమ్రాన్‌కు చాన్స్... రోహిత్, రాహుల్, కోహ్లిల గైర్హాజరులో భారత్ టాప్–3 ఈ సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేదనేది స్పష్టం. గిల్, ఇషాన్, రాహుల్ త్రిపాఠి అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోయారు. ఈ మ్యాచ్‌లోనైనా వీరు మెరుగ్గా రాణిస్తే మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. చాలా కాలం తర్వాత టీమ్‌లోకి ఎంపికైన పృథ్వీ షాకు ఆడే అవకాశం రాకుండానే సిరీస్ ముగిసిపోయేలా కనిపిస్తోంది. బౌలింగ్‌లో భారత తుది జట్టులో ఒక మార్పు జరగవచ్చు. లక్నోలాంటి టర్నింగ్ పిచ్ కాకపోవడంతో మళ్లీ చహల్ స్థానంలో ఉమ్రాన్ జట్టులోకి రావచ్చు. అరుదైన అవకాశం... న్యూజిలాండ్ జట్టు 2012లో చెన్నైలో జరిగిన ఏకైక టి20లో భారత్‌ను ఓడించింది. అది మినహా 1955 నుంచి ఏ ఫార్మాట్లో కూడా మన గడ్డపై ఆ జట్టు సిరీస్ గెలవలేకపోయింది. అయితే తాజా ఫామ్‌ను బట్టి చూస్తే తమ జట్టు ఆ అరుదైన ఘనత అందుకోగలదని కివీస్ ఆశిస్తోంది. టీమ్ తుది జట్టులో కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కాన్వే జోరు మీదుండగా, ఇతర ఆటగాళ్ల నుంచి కూడా తగిన సహకారం అందుతోంది. అలెన్, ఫిలిప్స్ బ్యాటింగ్‌లో కీలకం కానుండగా, ఆల్‌రౌండర్లు బ్రేస్‌వెల్, మిచెల్ కూడా ఆకట్టుకున్నారు. స్పిన్నర్లు సాన్‌ట్నర్, ఇష్ సోధి భారత లైనప్‌ను కట్టిపడేయగల సమర్థులు. వ్యక్తిగతంగా గొప్ప ఘనతలు లేకపోయినా... సమష్టిగా తమ జట్టు బలమైందని ఎన్నోసార్లు నిరూపించిన న్యూజిలాండ్ మళ్లీ అదే పట్టుదలను చూపిస్తే సంతోషంగా తిరిగి వెళ్లవచ్చు. పిచ్, వాతావరణం నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ మొదటి నుంచీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్ రోజు వర్ష సూచనలేదు. పశ్చిమ భారత్‌లో పెద్దగా మంచు ప్రభావం లేదు. ►గత పదేళ్లలో భారత జట్టు సొంతగడ్డపై మూడు ఫార్మాట్లలో కలిపి 55 సిరీస్‌లు ఆడింది. ఇందులో 47 సిరీస్‌లు గెలవడం విశేషం. ఒక్క ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మాత్రమే భారత్‌ను ఓడించగలిగాయి. -
సీనియర్లు లేకుండా టీ20 సమరానికి 'సై'! ఆ ముగ్గురికి విశ్రాంతి
సీనియర్లు లేకుండా మరో టి20 సిరీస్... రోహిత్ శర్మ, కోహ్లి, కేఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకోగా, వరల్డ్‌కప్ తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్ వరుసగా మూడో సిరీస్... వన్డేల్లో న్యూజిలాండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఇప్పుడు టి20ల్లో కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. ఏడాది వన్డే వరల్డ్‌కప్ ఉండటంతో టి20 ఫార్మాట్‌కు ప్రాధాన్యత తగ్గిన నేపథ్యంలో సీజన్లో చివరి టి20 ద్వైపాక్షిక పోరులో సత్తా చాటేందుకు యువ ఆటగాళ్లకు మరో అవకాశం దక్కింది. గత ప్రత్యర్థి శ్రీలంక తరహాలో కివీస్ కూడా కనీసం ఈ ఫార్మాట్లో అయినా పోటీనిస్తుందా లేదా అనేది చూడాలి. రాంచీ: దాదాపు ఏకపక్షంగా సాగిన వన్డే సిరీస్ తర్వాత టి20ల్లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్, న్యూజిలాండ్ సన్నద్ధమయ్యాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి టి20 పోరు జరగనుంది. అనుభవం, గణాంకాల దృష్ట్యా ప్రత్యర్థి కంటే టీమిండియా ఎంతో బలంగా కనిపిస్తుండగా... కివీస్ తమ యువ ఆటగాళ్లతో సంచలనాన్ని ఆశిస్తోంది. ఇలాంటి స్థితిలో ఈ సిరీస్ అయినా పోటాపోటీగా సాగుతుందా లేక ఇదీ ఏకపక్షమవుతుందా అనేది ఆసక్తికరం. గిల్తోనే ఓపెనింగ్... దాదాపు ఇరవై రోజుల క్రితం భారత జట్టు తమ చివరి టి20 మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడింది. స్వల్ప మార్పుల మినహా అదే జట్టు ఈసారి కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒక ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఖాయం కాగా... రెండో ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ ఆడతాడని కెప్టెన్ హార్దిక్ చెప్పేశాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సిరీస్‌కు దూరం కాగా, పృథ్వీ షా రూపంలో మరో ఓపెనర్ అందుబాటులో ఉన్నాడు. శ్రీలంకతో సిరీస్‌లోనే అరంగేట్రం చేసిన గిల్ టి20 రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. అయితే వన్డేల్లో అతని తాజా ఫామ్‌ను చూస్తే జట్టులో స్థానం ఇవ్వక తప్పదని కూడా హార్దిక్ వెల్లడించాడు. రాహుల్ త్రిపాఠి తన సత్తాను గత మ్యాచ్‌లో చూపించగా... నాలుగో స్థానంలో ‘ఐసీసీ టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ రూపంలో సూర్యకుమార్ సిద్ధంగా ఉన్నాడు. ఆల్‌రౌండర్‌గా దీపక్ హుడా బరిలోకి దిగనుండగా, పెళ్లి కారణంగా అక్షర్ పటేల్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో వాషింగ్టన్ సుందర్‌కు చోటు ఖాయమైంది. సీనియర్ పేసర్లు ఎవరూ లేకపోవడంతో మరోసారి ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ మావిలపైనే జట్టు భారం ఉంది. మున్ముందు అగ్రశ్రేణి బౌలర్లు వచ్చినా... తమ స్థానం నిలబెట్టుకోవాలంటే ఈ సిరీస్‌లో వీరు సత్తా చాటాల్సి ఉంది. మణికట్టు స్పిన్నర్ స్థానానికి సహజంగానే కుల్దీప్, చహల్ మధ్య పోటీ నెలకొంది. ఇష్ సోధికి చోటు... వన్డేలలాగే టి20 సిరీస్ నుంచి కూడా న్యూజిలాండ్ సీనియర్లు విలియమ్సన్, సౌతీ విశ్రాంతి తీసుకున్నారు. దాంతో సాన్‌ట్నర్ నాయకత్వంలో జట్టు బరిలోకి దిగుతోంది. కెప్టెన్‌గా సాన్‌ట్నర్ బలహీన జట్లు ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లపై విజయాలు అందించాడు. టి20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన తర్వాత ఓపెనర్ ఫిన్ అలెన్ ఆడిన ఆరు టి20ల్లోనూ విఫలమయ్యాడు. తాజా వన్డే సిరీస్‌లో కూడా రెండుసార్లు డకౌట్ అయిన అతను ఇప్పుడైనా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాలని జట్టు కోరుకుంటోంది. ఆల్‌ఫార్మాట్ బ్యాటర్‌గా తనకంటూ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకొని చివరి వన్డేలో సెంచరీ బాదిన కాన్వే మరోసారి కీలకం కానుండగా... ముగ్గురు ఆల్‌రౌండర్లు మిచెల్, బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్ రాణిస్తేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. పేస్ బౌలింగ్‌లో కివీస్ బాగా బలహీనంగా కనిపిస్తోంది. లిస్టర్, షిప్లీ ఇప్పటివరకు టి20లు ఆడకపోగా... టిక్నర్, డఫీ అనుభవం కూడా అంతంత మాత్రమే. దాంతో ఫెర్గూసన్‌పై అదనపు భారం పడింది. లిస్టర్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే గాయంతో వన్డేలు ఆడని ప్రధాన స్పిన్నర్ ఇష్ సోధి కోలుకోవడం జట్టుకు పెద్ద ఊరట. భారత గడ్డపై అతనికి మంచి రికార్డు ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హార్దిక్ (కెప్టెన్), గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్, హుడా, సుందర్, మావి, ఉమ్రాన్, అర్ష్‌దీప్, కుల్దీప్/చహల్. న్యూజిలాండ్: సాన్‌ట్నర్ (కెప్టెన్), అలెన్, కాన్వే, చాప్మన్, ఫిలిప్స్, మిచెల్, మైకేల్ బ్రేస్‌వెల్, టిక్నర్, సోధి, లిస్టర్, ఫెర్గూసన్. చదవండి: Australian Open: ఆశలు గల్లంతు! ఫైనల్లో ఓటమిపాలైన సానియా-బోపన్న జోడి -
న్యూజీలాండ్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ
-
రోహిత్ పై వేటు తప్పదా ..?
-
IND NZ T20 Series: ద్వైపాక్షిక సిరీస్ సమయం
వెల్లింగ్టన్: గతవారమే భారత్, న్యూజిలాండ్ జట్లు టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ కోసం ప్రత్యర్థి జట్లతో సెమీ ఫైనల్స్ ఆడాయి. ఓటమితో రెండు గ్రూప్ టాపర్స్ జట్ల ఆశలకు అక్కడే తెర పడింది. ఇప్పుడు ఓ రకంగా ఈ మూడు టి20ల సిరీస్‌ను ‘కాంస్యం’ కాని కాంస్య పతక పోరు అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో సెమీఫైనల్స్ సమ ఉజ్జీల మధ్య ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలాంటి అనుభవజ్ఞులు లేని భారత జట్టు బరిలోకి దిగుతోంది. కానీ మెరుపుల్లో ఇప్పటికే నిరూపించుకున్న ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడాలు ఉన్న టీమిండియా సీనియర్లు లేని లోటును కచ్చితంగా పూరిస్తుంది. వీళ్లంతా ఐపీఎల్లో అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొన్నవారే కావడంతో భారత బృందం నుంచి కేన్ విలియమ్సన్ సేనకు కఠిన సవాళ్లు తప్పకపోవచ్చు. మళ్లీ పాండ్యా సారథ్యంలో... హార్దిక్ పాండ్యా ఈ ఏడాది సారథిగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించి నిరూపించుకున్నాడు. ఐర్లాండ్ గడ్డపై 2–0తో సిరీస్ సాధించాడు. ఇప్పుడు మాత్రం గట్టి ప్రత్యర్థి న్యూజిలాండ్‌తో జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం రోహిత్ తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యే అర్హతలున్న ఆటగాడిగా కితాబందుకుంటున్న పాండ్యాకు ఈ సిరీస్ సువర్ణావకాశం కల్పిస్తోంది. ఇలా సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని విజయవంతం చేసుకుంటే మాత్రం 2024 టి20 ప్రపంచకప్‌లో టీమిండియాను నడిపేది కచ్చితంగా పాండ్యానే! ఇందులో ఏ సందేహం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో జట్టును గెలిపిస్తే అద్భుతమే అని చెప్పాలి. సూర్యకుమార్ సూపర్ ఫామ్‌లో ఉండటం, హార్డ్ హిట్టర్లు ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్, ఆల్‌రౌండర్ దీపక్ హుడాలతో టీమిండియా పొట్టిసిరీస్కు సరిపోయే మెటిరియల్తోనే ఉంది. పైగా గత న్యూజిలాండ్ పర్యటనలో భారత్ 5–0తో చేసిన క్లీన్‌స్వీప్ విజయం జట్టును ఒక మెట్టు పైనే నిలబెట్టుతోంది. ప్రతీకారంపై కివీస్ కన్ను సొంతగడ్డపై అనుకూలతలున్నా... టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్ చూస్తోంది. అనుభవజ్ఞులు లేని ప్రపంచ నంబర్‌వన్ టి20 జట్టుపై తొలి మ్యాచ్ నుంచే ఆధిపత్యం కనబరచాలని విలియమ్సన్ సేన ప్రణాళికతో ఉంది. ఆసీస్ గడ్డపై జరిగిన టి20 మెగా ఈవెంట్లో ఫిన్ అలెన్, కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ అదరగొట్టారు. ఇప్పుడు సొంతగడ్డపై కూడా అదే జోరు సాగించాలని బ్యాటింగ్ త్రయం ఉవ్విళ్లూరుతోంది. దీంతో పాటు భారత్‌తో పోల్చితే ప్రస్తుత న్యూజిలాండ్ బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది. సీనియర్ సీమర్ బౌల్ట్ లేకపోయినా సౌతీ, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, ఇష్ సోధిలు ఫామ్‌లో ఉన్నారు. వీళ్లంతా ప్రపంచకప్‌లో నిలకడగా రాణించడం వల్లే సూపర్–12 దశలో కివీస్ అగ్రస్థానంలో నిలిచింది. జట్లు (అంచనా) భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, అయ్యర్, సూర్యకుమార్, రిషబ్ పంత్, సుందర్, హర్షల్ / ఉమ్రాన్ మలిక్, భువనేశ్వర్, అర్‡్షదీప్, చహల్. న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, కాన్వే, ఫిలిప్స్, మిచెల్, నీషమ్, సాన్‌ట్నర్, సౌతీ, ఇష్ సోధి, మిల్నే, ఫెర్గూసన్. పిచ్, వాతావరణం సాధారణంగా కివీస్ గడ్డపై జరిగే పొట్టి పోటీల్లో మెరుపులు, భారీస్కోర్లకు కొదవుండదు. కానీ వెల్లింగ్టన్ మాత్రం ప్రతీసారి ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇక్కడ సగటు స్కోరు 162. కాబట్టి ఈ వేదికపై బౌలర్లకూ అవకాశముంటుందని చెప్పొచ్చు. శుక్రవారం వానముప్పు ఉన్నప్పటికీ మ్యాచ్ సమయానికల్లా సర్దుకుంటుంది. -
డీకేను తిట్టుకోవాల్సి వచ్చింది: అశ్విన్
-
పాక్ అభిమాని గూబ గుయ్‌మనేలా..సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ‘మొదటి 3 ఓవర్లు’ చూడమని సలహా ఇచ్చిన పాక్ అభిమానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అద్భుతంగా స్పందించారు. టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. మెల్బోర్న్లో జరిగిన భారత్- పాక్ మ్యాచ్‌లో కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. కళ్లముందే టీమ్ఇండియా టాప్ ఆర్డర్ పేకమేడలా కూలుతున్నా..ప్రశాంతంగా ఉన్నాడు. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌ను చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి గెలిపించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో 53 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విరాట్ అందుకున్నాడు. Happy Diwali! Hope everyone celebrating has a great time with your friends and family. 🪔 I celebrated by watching the last three overs again today, what a game and performance #Diwali #TeamIndia #T20WC2022 — Sundar Pichai (@sundarpichai) October 24, 2022 నరాలు తెగే ఉత్కంఠలో దాయాది దేశంపై గెలిచిన భారత్‌పై క్రికెట్ లవర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ దురభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ ఓటమిని తట్టుకోలేక టీవీలు పగలగొడుతున్నారు.మరికొందరు పాక్ బౌలింగ్ వేసిన మొదటి 3 ఓవర్లు చూడమని ట్వీట్లు చేస్తున్నారు. అయితే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కోహ్లీ ఆటతీరును ప్రశంసిస్తూ పిచాయ్ ఇలా ట్విట్ చేశారు. ‘దీపావళి శుభాకాంక్షలు! ఈ ఆనంద క్షణాల్నిస్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపండి. నేను ఈరోజు చివరి మూడు ఓవర్లను మళ్లీ చూసి సంబరాలు చేసుకున్నాను. వాట్ ఏ గేమ్.. వాట్ ఏ పర్ఫార్మెన్స్ అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. After many requests received from neighbours I have decided to frame this picture @sundarpichai #PakvsIndia pic.twitter.com/LC3ZCe8i3t — Muhammad Shahzaib (@Muhamma91436212) October 24, 2022 ఆ ట్వీట్‌పై ఓ పాక్ అభిమాని స్పందించాడు. ‘మీరు మొదటి మూడు ఓవర్లు చూడాలి’ అని వెటకారంగా అన్నాడు. దానికి పాక్ అభిమానికి గూబ గుయ్‌మనేలా సుందర్ పిచాయ్ రిప్లయి ఇచ్చారు. ‘‘ఓ అది కూడా చూశాను. భువీ - అర్ష్‌దీప్ బౌలింగ్ అద్భుతంగా చేశారని ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ప్రస్తుతం సుందర్ పిచాయి పాక్ అభిమానికి ఇచ్చిన ఎపిక్ రిప్లయి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చదవండి👉 సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ భారీ షాక్! ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇద్దాం.. సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు -
లంకకు నమీబియా షాక్
గిలాంగ్: ఆసియా టి20 చాంపియన్ శ్రీలంకకు క్రికెట్ కూన నమీబియా పెద్ద షాకే ఇచ్చింది. టి20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ తొలి రౌండ్ (క్వాలిఫయర్స్) మ్యాచ్‌లో నమీబియా 55 పరుగుల తేడాతో 2014 టి20 ప్రపంచకప్ విజేత లంకను చిత్తు చేసింది. గతేడాది యూఏఈలో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో ఆకట్టుకున్న నమీబియా ఇక్కడ తొలి మ్యాచ్‌తోనే శుభారంభం చేసింది. మొదట నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జాన్ ఫ్రయ్‌లింక్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు), స్మిట్ (16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఒకదశలో 14.2 ఓవర్లలో 93 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నమీబియాను ఫ్రయ్‌లింక్, స్మిట్ ధాటిగా ఆడి ఆదుకున్నారు. ఇద్దరు చివరి 5.4 ఓవర్లలోనే ఏడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో మదుషాన్ 2 వికెట్లు పడగొట్టాడు. తర్వాత శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ దాసున్ షనక (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), రాజపక్స (21 బంతుల్లో 20; 2 ఫోర్లు) తప్ప ఇంకెవరూ ఎంతోసేపు క్రీజులో నిలువలేకపోయారు. ఫ్రయ్‌లింక్ (2/26), స్మిట్ (1/16) బంతితోనూ ఆకట్టుకున్నారు. వీస్, బెర్నార్డ్, షికొంగో తలా 2 వికెట్లు తీశారు. నెదర్లాండ్స్ బోణీ ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో యూఏఈపై నెదర్లాండ్స్ ఆఖరిదాకా చెమటోడ్చి నెగ్గింది. తక్కువ స్కోర్ల ఈ మ్యాచ్ ఆఖర్లో కాస్త ఉత్కంఠ రేపినా... నెదర్లాండ్స్ 3 వికెట్ల తేడాతో గట్టెక్కింది. తొలుత యూఏఈ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు చేసింది. ఓపెనర్ వసీమ్ (47 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. బస్ డి లీడే (3/19) ఒక్క ఓవర్‌తో మలుపు తిప్పాడు. 91/2 స్కోరుతో ఒకదశలో పటిష్టంగానే కనిపించిన యూఏఈకు అదేస్కోరుపై వసీమ్ వికెట్‌ను కోల్పోయాక కష్టాలు మొదలయ్యాయి. 18వ ఓవర్లో ఫరీద్ (2) రనౌటయ్యాడు. ధనాధన్ ఆడే డెత్ ఓవర్లలో పరుగులకు బదులు వికెట్లు రాలడంతో యూఏఈ ఊహించనిరీతిలో కట్టడి అయ్యింది. 19వ ఓవర్ వేసిన డి లీడే మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బ తీశాడు. అరవింద్ (18), బాసిల్ హమీద్ (4), కెప్టెన్ రిజ్వాన్ (1)లను లీడే అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్లో అఫ్జల్ ఖాన్ (5)ను క్లాసెన్ పెవిలియన్ చేర్చడంతో... కేవలం 19 పరుగుల వ్యవధిలోనే యూఏఈ 6 వికెట్లను కోల్పోయింది. తర్వాత నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ ఓడోడ్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో కెప్టెన్ ఎడ్వర్డ్స్ (16 నాటౌట్), ప్రింగిల్ (5) కుదురుగా ఆడి గెలిపించారు. జునైద్ సిద్ధిఖ్ 3 వికెట్లు తీశాడు. చివరి 12 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో 19 ఓవర్లో ప్రింగిల్ను జహూర్ ఖాన్ అవుట్ చేయగా 4 పరుగులే వచ్చాయి. 6 బంతుల్లో 6 పరుగుల విజయ సమీకరణం యూఏఈని ఊరించినప్పటికీ ఎడ్వర్డ్స్, వాన్ బిక్ (4) షాట్ల జోలికి వెళ్లకుండా ఒకట్రెండు పరుగులు తీసి జట్టును గెలిపించారు. గ్రూప్ ‘బి’లో నేటి మ్యాచ్‌లు స్కాట్లాండ్ vs వెస్టిండీస్ (ఉదయం గం. 9:30 నుంచి) ఐర్లాండ్ vs జింబాబ్వే (మధ్యాహ్నం గం. 1:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
రోహిత్ శర్మను మెప్పించిన కుర్ర బౌలర్..
-
టీ 20 వరల్డ్ కప్ గెలిచేది ఆ మూడు జట్లే...
-
ఒక్కే మ్యాచ్ తో అనేక రికార్డ్స్ బ్రేక్ చేసిన సూర్యకుమార్ యాదవ్
-
T20 World Cup: అయ్యో బుమ్రా..!
టి20 ప్రపంచకప్‌కు బయల్దేరక ముందే భారత క్రికెట్ జట్టుకు పెద్ద షాక్! ఆసీస్ గడ్డపై జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించగలడని భావించిన స్టార్ పేసర్ ఇప్పుడు టోర్నీకే దూరం కానున్నాడు. వెన్ను నొప్పి గాయం (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా నొప్పి తిరగబెట్టడంతో తప్పనిసరిగా ఆటకు విరామం పలకాల్సి వచ్చింది. దాంతో అతను టి20 ప్రపంచకప్ వెళ్లే అవకాశం లేదని తేలిపోయింది. ఇప్పటికే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో మెగా టోర్నీనుంచి తప్పుకోగా, ఇప్పుడు బుమ్రా కూడా లేకపోవడం టీమిండియాను బలహీనంగా మార్చింది. న్యూఢిల్లీ: గాయంనుంచి కోలుకొని విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆట రెండు మ్యాచ్‌లకే పరిమితమైంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో, మూడో టి20లో ఆడిన అతను బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టి20నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నాడు. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్లో బుమ్రాకు వెన్ను నొప్పి వచ్చిందని, అందుకే మ్యాచ్ ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఆ వెన్ను బాధ అంతటితో ఆగిపోలేదని బుధవారం సాయంత్రం తేలింది. తిరువనంతపురంనుంచి బుమ్రా నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి చేరుకున్నాడు. పరీక్షల అనంతరం గాయం తీవ్రమైందని తేలగా, కొన్ని నెలల పాటు ఆటకు దూరం కావాల్సి ఉందని అర్థమైంది. బీసీసీఐ అధికారికంగా బుమ్రా గాయంపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటన చేయకపోయినా...బోర్డు ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘బుమ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ టి20 ప్రపంచకప్ ఆడే అవకాశం లేదు. అతని వెన్ను గాయం చాలా తీవ్రమైంది. స్ట్రెస్ ఫ్రాక్చర్ కాబట్టి కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది’ అని ఆయన వెల్లడించారు. వరల్డ్ కప్‌కు ప్రకటించిన జట్టులో స్టాండ్‌బైలుగా ఇద్దరు పేసర్లు అందుబాటులో ఉన్నారు. మొహమ్మద్ షమీ లేదా దీపక్ చహర్‌లలో ఒకరిని ప్రధాన జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బుమ్రా గాయాన్ని బీసీసీఐ వైద్యులు పర్యవేక్షిస్తారని, టీమ్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న అక్టోబర్ 15 వరకు వేచి చూడవచ్చని చెబుతున్నా... పూర్తి ఫిట్‌గా లేని ఆటగాడిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లే సాహసం టీమ్ మేనేజ్మెంట్ చేయకపోవచ్చు. బలమే బలహీనతై... ‘బుమ్రా పూర్తి స్థాయిలో మళ్లీ బౌలింగ్ చేయడం సంతోషంగా అనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే వెన్ను నొప్పితో రెండు నెలలు విశ్రాంతి తీసుకొని మళ్లీ బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. అతని ప్రదర్శన ఎలా ఉందన్నది అనవసరం. మెల్లగా లయ అందుకుంటున్నాడు. అతను తిరిగి రావడమే విశేషం. ’...ఆసీస్‌తో రెండో టి20 తర్వాత బుమ్రా గురించి రోహిత్ వ్యాఖ్య ఇది. అయితే మరో మ్యాచ్‌కే గాయం తిరగబెట్టి బుమ్రా మళ్లీ అందుబాటులో లేకుండా పోతాడని బహుశా రోహిత్ కూడా ఊహించి ఉండడు. విజయావకాశాలు ప్రభావితం చేయగల తన స్టార్ బౌలర్ లేకపోవడం ఏ కెప్టెన్‌కైనా లోటే. అయితే బుమ్రా గాయాన్ని బోర్డు వైద్యులు, ఎన్సీఏ పర్యవేక్షించిన తీరే సరిగా కనిపించడం లేదు. బుమ్రా విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా ఏమీ ఆడటం లేదు. బోర్డు రొటేషన్ పాలసీ, వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతను చాలా తక్కువ మ్యాచ్‌లే ఆడాడు. 2022లో అతను ఐపీఎల్‌తో పాటు 5 టెస్టులు, 5 వన్డేలు, 5 అంతర్జాతీయ టి20లు మాత్రమే ఆడాడు. నిజానికి బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చర్ కొత్త కాదు. 2019లోనే అతను ఇదే బాధతో మూడు నెలలు ఆటకు దూరమయ్యాడు. నిపుణులు చెప్పినదాని ప్రకారం అతని భిన్నమైన శైలే అందుకు ప్రధాన కారణం. వెన్నునొప్పితోనే అతను ఇటీవలే ఆసియా కప్‌లోనూ ఆడలేదు. అయితే సరిగ్గా ఇక్కడే టీమ్ మేనేజ్మెంట్ తొందరపాటు కనిపిస్తోంది. అతను పూర్తి స్థాయిలో కోలుకోకుండానే ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేసినట్లుగా అనిపిస్తోంది. లేదంటే ఎన్సీఏ బుమ్రా గాయాన్ని సరిగ్గా అంచనా వేయలేక తగినంత రీహాబిలిటేషన్ లేకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఉంది. ఎందుకంటే పూర్తి ఫిట్‌గా ఉంటే రెండు మ్యాచ్‌లకే గాయం తిరగబెట్టడం ఊహించలేనిది. ‘తక్కువ రనప్‌తో ఫాస్ట్ బౌలింగ్ చేసేందుకు బుమ్రా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎంత కాలం ఇలా అతని శరీరం సహకరిస్తుందనేదే నా సందేహం. అది మానవశరీరం. మెషీన్ కాదు’ అని రెండేళ్ల క్రితం దిగ్గజ పేసర్ మైకేల్ హోల్డింగ్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు వాస్తవంగా మారినట్లు అనిపిస్తోంది. -
India vs Australia 2nd T20I: ఆస్ట్రేలియాపై భారత్ విజయం (ఫొటోలు)
-
జింఖానా గ్రౌండ్ ‘తొక్కిసలాట’దృశ్యాలు
-
తొలి టీ20 కోసం భారత్, ఆస్ట్రేలియా జట్ల సాధన (ఫొటోలు)
-
Asia Cup 2022: భారత్ కథ ముగిసె!
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్‌కు ఊహించని షాక్! అభిమానుల గుండె పగిలె ఫలితం శ్రీలంక చేతిలోనూ ఎదురైంది. సూపర్ –4లో వరుసగా రెండో ఓటమి. దీంతో ఫైనల్ ఆశలకు దాదాపు తెరపడింది. నేడు పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ అద్భుతం చేస్తే తప్ప మనకు దారే లేదు. మంగళవారం జరిగిన పోరులో 6 వికెట్లతో భారత్‌ను ఓడించిన శ్రీలంక ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మొదట టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. మదుషంక 3 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. నిసాంక (37 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (37 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన షనకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. కెప్టెన్ ఒక్కడే! గత మ్యాచ్‌కు భిన్నంగా ఆట మొదలైంది. పాక్‌పై ధాటిగా ఆరంభమైన ఓపెనింగ్ మెరుపులు... శ్రీలంకపై కరువయ్యాయి. ఓపెనర్ రాహుల్ (6) రెండో ఓవర్లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరుసటి ఓవర్లోనే కోహ్లి (0) డకౌటయ్యాడు. 13 పరుగులకే రెండు టాపార్డర్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ రోహిత్ బాధ్యతగా నడిపించాడు. అసిత ఫెర్నాండో వేసిన ఐదో ఓవర్లో 6, 4 కొట్టి రన్‌రేట్ పెంచాడు. మళ్లీ తనే వేసిన పదో ఓవర్లో మరో సిక్సర్, బౌండరీతో 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలో భారత్ స్కోరు 79/2. సగం ఓవర్లు అయిపోవడంతో ‘హిట్‌మ్యాన్’ ధాటిని మరింత పెంచాడు. కానీ ఆ క్రమంలోనే వెనుదిరిగాడు. హసరంగ వేసిన 12వ ఓవర్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. మరుసటి ఓవర్లో కరుణరత్నే స్లో డెలివరీతో రోహిత్‌ను బోల్తా కొట్టించాడు. కాసేపటికి సూర్యకుమార్ (29 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్)ను స్లో బౌన్సర్‌తో షనక పెవిలియన్ చేర్చాడు. పాండ్యా (17), పంత్ (17) పెద్దగా మెరిపించలేదు. అశ్విన్ (7 బంతుల్లో 15 నాటౌట్; 1 సిక్స్) చేసిన ఆ కాస్త పరుగులతోనే కష్టంగా 170 పైచిలుకు స్కోరు చేయగలిగింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చెలరేగిన ఓపెనర్లు లంక ఛేదన తొలి ఓవర్లో కేవలం పరుగుతో మొదలైంది. తర్వాత ఓవర్ నుంచి ఫోర్లతో, అటు నుంచి సిక్సర్లతో చకచకా సాగిపోయింది. ఓపెనర్లు నిసాంక, కుశాల్ల జోరుతో అర్‡్షదీప్ తేలిపోయాడు. ఐదో ఓవర్లో అతను 18 పరుగులు సమర్పించుకున్నాడు. శ్రీలంక 5.2 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. మరో ఐదు ఓవర్లు... మొత్తంగా సగం ఓవర్లు ముగిసినా భారత బౌలర్లు వికెట్ తీయలేకపోయారు. అవతలివైపు ఓపెనర్లే లక్ష్యంలో సగం స్కోరును (10 ఓవర్లలో 89/0) దాటేశారు. 12వ ఓవర్ వేసిన చహల్ నిసాంకతో పాటు అసలంక (0)ను పెవిలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో గుణతిలక (1)ను అశ్విన్, కుశాల్ మెండిస్‌ను చహల్ అవుట్ చేయడంతో 110 పరుగుల వద్ద 4 వికెట్లను కోల్పోవడంతో భారత శిబిరం ఆనందంలో తేలియాడింది. కానీ రాజపక్స వచ్చీ రాగానే స్పిన్నర్లిదరి ఓవర్లలో సిక్సర్లు కొట్టాడు. తర్వాత కెప్టెన్ షనక కూడా జాగ్రత్తగా ఆడటంతో లక్ష్యానికి చేరువైంది. ఆఖరి అవకాశాన్ని కూడా కీపర్ పంత్, బౌలర్ అర్‡్షదీప్ చేజార్చడంతో లంక మరో బంతి ఉండగానే గెలిచింది. 2 బంతుల్లో 2 పరుగుల సమీకరణం వద్ద ఐదో బంతిని షనక బీట్ అయ్యాడు. పంత్ వికెట్లపై విసరగా తగలకుండా బంతి బౌలర్ అర్‡్షదీప్ చేతుల్లో పడింది. తను పరుగెత్తుకుంటూ వికెట్లను కొట్టకుండా బలంగా విసరడంతో అవుట్ కావాల్సిన చోట ఓవర్‌త్రోతో 2 పరుగులు వచ్చాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తీక్షణ 6; రోహిత్ (సి) నిసాంక (బి) కరుణరత్నే 72; కోహ్లి (బి) మదుషంక 0; సూర్యకుమార్ (సి) తీక్షణ (బి) షనక 34; పాండ్యా (సి) నిసాంక (బి) షనక 17; పంత్ (సి) నిసాంక (బి) మదుషంక 17; దీపక్ హుడా (బి) మదుషంక 3; అశ్వి న్ (నాటౌట్) 15; భువనేశ్వర్ (బి) కరుణరత్నే 0; అర్‡్షదీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–11, 2–13, 3–110, 4–119, 5–149, 6–157, 7–158, 8–164. బౌలింగ్: మదుషంక 4–0–24–3, మహీశ్ తీక్షణ 4–0–29–1, చమిక 4–0–27–2, అసిత ఫెర్నాండో 2–0–28–0, హసరంగ 4–0–39–0, షనక 2–0–26–2. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) రోహిత్ (బి) చహల్ 52; కుశాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 57; అసలంక (సి) సూర్యకుమార్ (బి) చహల్ 0; గుణతిలక (సి) రాహుల్ (బి) అశ్విన్ 1; రాజపక్స (నాటౌట్) 25; షనక (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–97, 2–97, 3–110, 4–110. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–30–0, అర్‡్షదీప్ 3.5–0–40–0, పాండ్యా 4–0–35–0, చహల్ 4–0–34–3, అశ్విన్ 4–0–32–1. భారత్ ఫైనల్ చేరాలంటే... నేడు జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ తప్పనిసరిగా గెలవాలి. అనంతరం గురువారం జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై భారత్ కూడా విజయం సాధించాలి. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై కూడా శ్రీలంక తప్పనిసరిగా నెగ్గాలి. ఇలా జరిగితే శ్రీలంక ఫైనల్ చేరుతుంది. భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్లు రెండు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ మూడు జట్లలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ఫైనల్‌కు వెళుతుంది. ఒకవేళ నేడు అఫ్గానిస్తాన్‌పై గెలిస్తే పాకిస్తాన్ ఫైనల్లోకి అడుగు పెడుతుంది. పాక్ , భారత్‌లపై అఫ్గానిస్తాన్ గెలిచి... లంకపై పాకిస్తాన్ నెగ్గితే... పాక్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ నాలుగు పాయింట్లతో సమంగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు ఫైనల్ చేరుతాయి. -
స్పిన్నర్ల మాయాజాలం.. ఆఖరి టీ20లోనూ టీమిండియాదే విజయం
ఫ్లొరిడా: ఆఖరి టి20లోనూ భారతే విజయం సాధించింది. ఐదో మ్యాచ్‌లో టీమిండియా 88 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. కరీబియన్ గడ్డపై ఒక మ్యాచ్ అయినా నెగ్గిన విండీస్‌కు అమెరికాలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం ఎదురైంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ హుడా (25 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. తర్వాత వెస్టిండీస్ 15.4 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. బిష్ణోయ్ (4/16), కుల్దీప్ (3/12), అక్షర్ పటేల్ (3/15)ల స్పిన్ ఉచ్చులో పడిన కరీబియన్‌ను హెట్‌మైర్ (35 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్స్ చేతులెత్తేయడంతో వెస్టిండీస్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేదు. భారత్ 4–1తో పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
నాలుగో టి20.. గెలిస్తే సిరీస్ వశం
ఫ్లోరిడా: అమెరికా గడ్డపై సిరీస్ తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా నేడు వెస్టిండీస్‌తో నాలుగో టి20లో తలపడనుంది. నేడు, రేపు వరుసగా జరిగే రెండు మ్యాచ్‌ల్లో భారత్ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం చాలు. కానీ విండీస్ పరిస్థితి భిన్నం. ఈ రెండూ గెలిస్తేనే పొట్టి సిరీస్ దక్కుతుంది. లేదంటే వన్డే సిరీస్‌ను అప్పగించినట్లే టి20 సిరీస్‌ను ప్రత్యర్థి చేతుల్లో పెట్టాల్సి వస్తుంది. అందుకే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది. ప్రపంచకప్‌కు ముందు భారత్ ఎక్కువగా టి20లే ఆడుతోంది. వరల్డ్‌కప్ బెర్త్ దక్కాలంటే దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్లు మెరుపులు మెరిపించాల్సిందే. కాబట్టి ఇకపై వీళ్లకి ప్రతీ మ్యాచ్ కూడా ఫైనల్ పరీక్షలాంటిదే. రెండు రోజుల్లో రెండూ గెలవాల్సిన ఒత్తిడిలో వెస్టిండీస్ ఉంది. రెండో టి20లో బౌలింగ్‌తో బెదరగొట్టిన కరీబియన్ బౌలర్లు గత మ్యాచ్‌లో తేలిపోయారు. -
హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత..!
-
IND vs SA 4th T20 : టీమిండియా ఘన విజయం (ఫోటోలు)
-
IND Vs SA 4th T20: సిరీస్ సమం చేసేందుకు...
రాజ్‌కోట్: మారింది... ఒక్క విజయంతో సిరీస్ సీన్ మారింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. రాజ్‌కోట్ మ్యాచ్ గెలిస్తే సిరీస్ 2–2తో సమం అవుతుంది. అప్పుడే లక్ష్యం దిశగా భారత జట్టు అడుగు వేస్తుంది. ఈ సిరీస్‌లో... సీనియర్లు లేని టీమిండియా తొలుత డీలా పడినా గత మ్యాచ్‌లో అటు బ్యాట్‌తో... ఇటు బౌలింగ్‌తో గర్జించింది. ఇప్పుడిదే ఉత్సాహంతో సిరీస్ సమం చేసేందుకు సన్నద్ధమైంది. శుక్రవారం జరిగే నాలుగో టి20 మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా రిషభ్ పంత్ సేన బరిలోకి దిగుతోంది. అయితే మరో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిస్తేనే విజయం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో భారత కోచ్ ద్రవిడ్ కుర్రాళ్లతో కూడిన జట్టును పట్టుదలతో సిద్ధం చేస్తున్నాడు. బ్యాటింగ్ బాగున్నప్పటికీ... వైజాగ్ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్లు రుతురాజ్, ఇషాన్లే మెరిపించారు. తర్వాత వచ్చిన వారంతా నిరాశపరిచారు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ రిషభ్ పంత్‌ల నుంచి మ్యాచ్‌ను మలుపుతిప్పే ఇన్నింగ్సే కరువైంది. హార్దిక్ పాండ్యా కాస్త మెరుగనిపించినప్పటికీ మెరుపులు మాత్రం తక్కువే! ఈ కోవలో దినేశ్ కార్తీక్‌కు మినహాయింపేమీ లేదు. వీళ్లంతా ఓపెనర్ల కంటే సీనియర్లు... కానీ బాధ్యత పంచుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. కీలకమైన నేటి మ్యాచ్‌లో సీనియర్లంతా ఆడితేనే పటిష్టమైన దక్షిణాఫ్రికాకు బదులివ్వగలం. లేదంటే బెంగళూరు (ఆఖరి మ్యాచ్)కు వెళ్లకముందే ఇక్కడే సిరీస్‌ను ప్రత్యర్థి జట్టు చేతుల్లో పెట్టాల్సి వస్తుంది. తొలి టి20తో పోల్చితే గత రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ విభాగం మెరుగైంది. సీమర్లు భువనేశ్వర్, హర్షల్ పటేల్, స్పిన్నర్ చహల్ ప్రత్యర్థి బ్యాటర్స్‌ను చక్కగా కట్టడి చేస్తున్నారు. ఇదే నిలకడ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగితే భారత్ విజయానికి బాట పడుతుంది. సిరీస్ లక్ష్యంగా సఫారీ ఇక్కడ టీమిండియా లక్ష్యం మ్యాచ్ అయితే... పర్యాటక జట్టు సిరీసే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పైగా సీనియర్, డాషింగ్ ఓపెనర్ డికాక్ కూడా అందుబాటులోకి రావడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చే అంశం. బవుమా, డికాక్ జోడీ ఓపెనింగ్‌లో చెలరేగితే... డసెన్, క్లాసెన్, మిల్లర్లతో కూడిన మిడిలార్డర్ మిగతా పరుగుల సంగతి చూసుకుంటుంది. సఫారీ నెగ్గిన రెండు టి20లను పరిశీలిస్తే మిడిలార్డర్ పాత్రే కీలకంగా నిలిపింది. రాజ్‌కోట్ పిచ్‌పై పరుగులు ధారాళంగా రావడం ఖాయం. ఈ నేపథ్యంలో క్లాసెన్, మిల్లర్లు నిలదొక్కుకుంటే భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తారు. ఇక బౌలింగ్ విషయంలో దక్షిణాఫ్రికాకు ఏ బెంగా లేదు. తొలి మ్యాచ్ మినహా... సీమర్లు నోర్జే, పార్నెల్, రబడ, స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, షమ్సీలు భారత వికెట్లపై అద్భుతంగా రాణిస్తున్నారు. సఫారీ మళ్లీ సమష్టిగా కదం తొక్కితే భారత్‌కు కష్టాలు తప్పవు. ఆఖరి మ్యాచ్ దాకా లాగకుండా ఇక్కడే సిరీస్‌ను నెగ్గినా ఆశ్చర్యం లేదు. పిచ్–వాతావరణం ఈ వికెట్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. పరుగుల విందు ఖాయం. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపుతుంది. రుతుపవనాలతో వాతావరణం కాస్త చల్లబడింది. అయితే వర్షం పడే అవకాశాలు తక్కువే! జట్లు (అంచనా) భారత్: రిషభ్ పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్, హర్షల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, చహల్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, వాన్ డెర్ డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్, పార్నెల్, రబడ, కేశవ్, నోర్జే, షమ్సీ. -
శ్రీలంకతో తొలి టి20 మ్యాచ్.. ఆసీస్ ఘనవిజయం(ఫోటోలు)
-
శ్రీలంకతో తొలి టి20 మ్యాచ్.. ఆసీస్ ఘనవిజయం
కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు వార్నర్ (44 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు), ఫించ్ (40 బంతుల్లో 61 నాటౌట్; 4ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. తొలుత లంక జట్టు 19.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. నిసాంక (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), గుణతిలక (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), అసలంక (34 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) తప్ప ఇంకెవరూ ఆసీస్ పేస్ ముందు నిలబడలేకపోయారు. హాజల్‌వుడ్ (4/16), స్టార్క్ (3/26) నిప్పులు చెరిగారు. అనంతరం ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 ఓవర్లలో 134 పరుగులు చేసి నెగ్గింది. ఇదే వేదికపై నేడు రెండో టి20 జరుగుతుంది. -
క్రికెట్ ఫ్యాన్స్‌కి అలర్ట్.. విశాఖలో టీ20 మ్యాచ్‌కు టికెట్స్ అమ్మకాలు
విశాఖ స్పోర్ట్స్: భారత్ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు ఆడనున్న మూడో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలు ఈ నెల 5వ తేదీ నుంచి ఆన్లైన్లో ప్రారంభం కానున్నాయి. దక్షిణాఫ్రికా–భారత్ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఈనెల 14న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండగా.. 13వ తేదీనే ఇరు జట్లు విశాఖ చేరుకోనున్నాయి. మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియంలో గల 27,251 సీటింగ్ కెపాసిటీలో స్థానిక క్లబ్‌లకు, కాంప్లిమెంటరీలు మినహాయించి మిగిలిన టికెట్లను ఈనెల 5వ తేదీన ఉ.11.30 గంటల నుంచి ఆన్లైన్లో విక్రయించనున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. టికెట్లను పేటీఎం యాప్ www.insider.in.tickets ప్లాట్‌ఫాంలో పొందవచ్చన్నారు. టికెట్ కనీస ధర రూ.600 నుంచి రూ.6 వేల వరకు ఉంటుందన్నారు. 8న ఆఫ్‌లైన్‌లో విశాఖలోని 3 కేంద్రాల్లో విక్రయించనున్నారు. విశాఖతో పాటు విజయవాడ, హైదరాబాద్‌లలో కొన్నవారి టికెట్లను కొరియర్లో పంపనున్నారు. ఇది కూడా చదవండి: అస్సలు బాలేదు.. కోహ్లి, రోహిత్ తమ మార్కు చూపించాలి.. లేదంటే కష్టమే! -
రెండో టీ20లో టీమిండియా ఘన విజయం (ఫోటోలు)
-
టి20ల్లోనూ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు వెస్టిండీస్ ఖాళీ అయ్యింది. ట్రోఫీ కాదు కదా కనీస విజయమైనా లేకుండానే రిక్త హస్తాలతో కరీబియన్‌కు పయనం కానుంది. ఆఖరి టి20లోనూ టీమిండియానే గెలిచి సిరీస్‌ను 3–0తో చేజిక్కించుకుంది. ఇంతకుముందు వన్డే సిరీస్‌నూ 3–0తో సొంతం చేసుకున్న భారత్ టి20 సిరీస్‌ను కైవసం చేసుకొని ఓవరాల్‌గా ఆరు విజయాలు నమోదు చేసుకోగా... విండీస్ గెలుపు రుచి కూడా చూడకుండానే వెనుదిరిగింది. కోల్‌కతా: ఈ మ్యాచ్‌లో 15 ఓవర్ల దాకా భారత్ వంద పరుగులైనా చేయలేదు. కోహ్లికి రెస్ట్ ఇస్తే కెప్టెన్ ‘హిట్‌మ్యాన్’ రోహిత్ అప్పటికే ఔటయ్యాడు. ఈ పరిస్థితిలో జట్టు అనూహ్యంగా ఆఖరి 5 ఓవర్లలో 86 పరుగులతో ఎవరూ ఊహించని భారీస్కోరు చేసింది. తర్వాత అనుభవజ్ఞులే లేని టీమిండియా పేస్ దళం వెస్టిండీస్‌ను కూల్చేసింది. చివరకు 17 పరుగుల తేడాతో ఆఖరి టి20లో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఆదివారం జరిగిన చివరి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 65; 1 ఫోర్, 7 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. పేస్ బౌలర్ అవేశ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆరంభంలో భారత బ్యాటర్స్ తడబడ్డారు. చెత్తషాట్లతో వికెట్లను సమర్పించుకున్నారు. మొదటి 10 ఓవర్లలో టీమిండియా స్కోరు 68/3 మాత్రమే! 14వ ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ అవుటయ్యే సమయానికి భారత్ స్కోరు 93/4. ఈ దశలో సూర్యకుమార్‌తో వెంకటేశ్ అయ్యర్ జత కలిశాడు. చప్పగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు సూర్యకుమార్ భారీ సిక్సర్లతో ఊపు తెచ్చాడు. వెంకటేశ్ కూడా దూకుడుగా ఆడటంతో కేవలం 19 బంతుల వ్యవధిలోనే (18.2వ ఓవర్లో) భారత్ 150 పరుగులు దాటింది. షెఫర్డ్ వేసిన ఆఖరి ఓవర్లో సూర్యకుమార్ మూడు సిక్సర్లు బాదాడు. చివరి బంతికి అవుటయ్యాడు. వెంకటేశ్, సూర్యకుమార్ ఐదో వికెట్‌కు 41 బంతుల్లోనే 91 పరుగులు జతచేశారు. విండీస్ విలవిల లక్ష్యాన్ని ఛేదించేందుకు పరుగుల వేట ప్రారంభిస్తే భారత సీమర్లు వికెట్లు కూల్చేపనిలో పడ్డారు. దీపక్ చహర్ వరుస ఓవర్లలో ఓపెనర్లు మేయర్స్ (6), షై హోప్ (8)లను ఔట్‌చేశాడు. అంతలోనే చహర్ గాయంతో రెండో ఓవర్ పూర్తవకుండానే మైదానం వీడాడు. తర్వాత పూరన్, పావెల్ (25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు క్రీజులో నిలిచారు. ఏడో ఓవర్ నుంచి హర్షల్ పటేల్, వెంకటేశ్ అయ్యర్ల వికెట్ల వేట మొదలెట్టగానే 100 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. లక్ష్యానికి దూరమైంది. పూరన్ బౌండరీలు, షెఫర్డ్ (21 బంతుల్లో 29; 1 ఫోర్, 3 సిక్సర్లు) సిక్స్‌లు విండీస్ శిబిరాన్ని కాస్త ఊరడించాయి. తప్ప విజయం దాకా తీసుకెళ్లలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) మేయర్స్ (బి) హోల్డర్ 4; ఇషాన్ (బి) చేజ్ 34; శ్రేయస్ (సి) హోల్డర్ (బి) వాల్‡్ష 25; రోహిత్ (బి) డ్రేక్స్ 7; సూర్యకుమార్ (సి) పావెల్ (బి) షెఫర్డ్ 65; వెంకటేశ్ (నాటౌట్) 35; ఎక్స్ట్రా లు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–10, 2–63, 3–66, 4–93, 5–184. బౌలింగ్: హోల్డర్ 4–0–29–1, షెఫర్డ్ 4–0–50–1, చేజ్ 4–0–23–1, వాల్‡్ష 4–0– 30–1, డ్రేక్స్ 3–0–37–1, అలెన్ 1–0–5–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: మేయర్స్ (సి) ఇషాన్ (బి) చహర్ 6; షై హోప్ (సి) ఇషాన్ (బి) చహర్ 8; పూరన్ (సి) ఇషాన్ (బి) శార్దుల్ ఠాకూర్ 61; పావెల్ (సి) శార్దుల్ (బి) హర్షల్ పటేల్ 25; పొలార్డ్ (సి) రవి బిష్ణోయ్ (బి) వెంకటేశ్ అయ్యర్ 5; హోల్డర్ (సి) శ్రేయస్ అయ్యర్ (బి) వెంకటేశ్ అయ్యర్ 2; రోస్టన్ చేజ్ (బి) హర్షల్ పటేల్ 12; షెపర్డ్ (సి) రోహిత్ శర్మ (బి) హర్షల్ పటేల్ 29; అలెన్ (నాటౌట్) 5; డ్రేక్స్ (సి) రోహిత్ శర్మ (బి) శార్దుల్ ఠాకూర్ 4; హేడెన్ వాల్‡్ష (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–6, 2–26, 3–73, 4–82, 5–87, 6–100, 7–148, 8–158, 9–166. బౌలింగ్: చహర్ 1.5–0–15–2, అవేశ్ ఖాన్ 4–0–42–0, వెంకటేశ్ 2.1–0–23–2, శార్దుల్ ఠాకూర్ 4–0–33–2, రవి బిష్ణోయ్ 4–0– 29–0, హర్షల్ పటేల్ 4–0–22–3. అంతర్జాతీయ టి20 క్రికెట్లో ద్వైపాక్షిక సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కిది ఏడోసారి. స్వదేశంలో నాలుగు సిరీస్‌లు, విదేశాల్లో మూడు సిరీస్‌లను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. -
Ind Vs Wi 1st T20 : ప్రాక్టీస్‌లో చమటోడుస్తున్న టీమిండియా ఆటగాళ్లు
-
4 బంతుల్లో 4 వికెట్లు
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): వెస్టిండీస్‌తో ఐదో టి20లో ఇంగ్లండ్ విజయానికి ఆఖరి ఓవర్లో 20 పరుగులు కావాలి. జోరు మీదున్న బిల్లింగ్స్ సహా నాలుగు వికెట్లు ఉండటంతో అసాధ్యమేమీ అనిపించలేదు. అయితే తొలి బంతికి ‘నోబాల్’ సహా రెండు పరుగులిచ్చిన జేసన్ హోల్డర్ మరుసటి బంతికి పరుగు ఇవ్వలేదు. ఆ తర్వాత అతని మ్యాజిక్ మొదలైంది. వరుసగా నాలుగు బంతుల్లో జోర్డాన్, బిల్లింగ్స్, రషీద్, సాఖిబ్ అవుట్... మరో బంతి మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఆలౌట్. 17 పరుగులతో నెగ్గిన వెస్టిండీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రవ్మన్ పావెల్ (17 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు), బ్రెండన్ కింగ్ (31 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కైల్ మేయర్స్ (19 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 162 పరుగులే చేయగలిగింది. జేమ్స్ విన్స్ (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్), స్యామ్ బిల్లింగ్స్ (28 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. అకీల్ హొసీన్ 4 కీలక వికెట్లు పడగొట్టాడు. సొంత మైదానంలో కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన (5/27) కనబర్చి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన హోల్డర్... మొత్తం 15 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు. మార్పుల్లేకుండానే భారత్‌కు... భారత్‌తో జరిగే టి20 సిరీస్‌లో తలపడే వెస్టిండీస్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఇంగ్లండ్‌పై సిరీస్ నెగ్గిన టీమ్‌లో ఎలాంటి మార్పు చేయకుండా ఆ 16 మందినే భారత పర్యటనకు ఎంపిక చేశారు. తగిన ఫిట్నెస్ ప్రమాణాలు అందుకోలేకపోయిన హెట్‌మైర్‌కు, కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి మ్యాచ్‌లు ఆడని ఎవిన్ లూయిస్‌కు ఈసారి కూడా చోటు దక్కలేదు. భారత్, విండీస్ మధ్య ఈ నెల 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియాన్ అలెన్, డారెన్ బ్రేవో, రోస్టన్ ఛేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జేసన్ హోల్డర్, షై హోప్, అకీన్ హొసీన్, బ్రండన్ కింగ్, రవ్మన్ పావెల్, రొమారియా షెఫర్డ్, ఒడియాన్ స్మిత్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్‡్ష జూనియర్. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడు జేసన్ హోల్డర్. గతంలో లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్; 2019లో ఐర్లాండ్‌పై), లసిత్ మలింగ (శ్రీలంక; 2019లో న్యూజిలాండ్‌పై), క్యాంఫర్ (ఐర్లాండ్; 2021 లో నెదర్లాండ్స్‌పై) ఈ ఘనత సాధించారు. -
సిరీస్ గెలిచే లక్ష్యంతో...
రాంచీ: న్యూజిలాండ్‌తో తొలి టి20లో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు సిరీస్ సొంత చేసుకోవడంపై దృష్టి పెట్టింది. నేడు జరిగే రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ టీమిండియా చెంత చేరుతుంది. మరోవైపు టి20 ప్రపంచకప్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఇప్పుడు ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలిచేందుకు కావాల్సిన అస్త్రశస్త్రాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. లోపాలను సరిదిద్దుకుంటూ... ఈ సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఇది బాగానే ఉన్నా... బౌలింగ్ మొదలుపెట్టిన తీరు, మ్యాచ్ ముగించిన విధానం కాస్త ఆందోళన పరిచే అంశం. మన బౌలింగ్ వైఫల్యంతో కివీస్ ఒక దశలో 13 ఓవర్లలో 106/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అశ్విన్ ఒకే ఓవర్లో చాప్మన్, ఫిలిప్స్‌లను పెవిలియన్ చేర్చాకే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మన చేతుల్లోకి వచ్చారు. అనుభవజ్ఞులైన భువీ, అశ్విన్ తప్ప దీపక్ చహర్, సిరాజ్, అక్షర్ పటేల్‌లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అలాగే సునాయాసంగా ఛేదించాల్సిన లక్ష్యాన్ని ఆఖరి ఓవర్ దాకా తెచ్చుకున్న బ్యాటింగ్ లైనప్‌పై కొత్త కోచ్ ద్రవిడ్ కచ్చితంగా దృష్టిపెట్టాల్సిందే. సూర్యకుమార్ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశమైతే, ఓపెనర్ లోకేశ్ రాహుల్ బ్యాటింగ్‌లో నిలకడ లోపించడం జట్టుకు ఇబ్బందికరం. రోహిత్‌తో కలిసి రాహుల్ చెలరేగితేనే కివీస్‌పై సిరీస్ విజయం సులువవుతుంది. కివీస్ అలసిపోయిందా! న్యూజిలాండ్ ఆదివారం ఫైనల్ ఆడింది. మరో ఆదివారం వచ్చేలోపే నాలుగో మ్యాచ్ ఆడబోతుంది. పైగా వేర్వేరు దేశాల్లో! ఇది ఆటగాళ్లకు ఊపిరి సలపని బిజీ షెడ్యూలే. అయినా సరే ప్రొఫెషనల్ క్రికెటర్లు పోరాటానికి సై అంటున్నారు. వెటరన్ ఓపెనర్ గప్టిల్, టాపార్డర్‌లో చాప్మన్ భారత బౌలింగ్‌ను వణికించారు. వీరికి తోడు మరో ఓపెనర్ డారిల్ మిచెల్, ఫిలిప్స్ ధనాధన్ మెరుపులు మెరిపిస్తే పర్యాటక జట్టు పుంజుకుంటుంది. బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర, బౌలింగ్‌లో టాడ్ ఆస్టల్ విఫలమవడంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ నీషమ్, స్పిన్నర్ ఇష్ సోధిలను ఆడించే అవకాశాలున్నాయి. జట్టు ప్రధాన బౌలర్లు సౌతీ, బౌల్ట్ ఇద్దరూ తేలిపోవడం జట్టును కలవరపెడుతోంది. సీనియర్ సీమర్లు అంచనాలకు తగ్గట్లు రాణిస్తే జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకం సాధిస్తుంది. భారత్‌ను సొంతగడ్డపై ఓడించాలంటే జట్టు మరింత తీవ్రంగా శ్రమించాల్సిందే! పిచ్, వాతావరణం శీతాకాలం దృష్ట్యా ఇక్కడి పిచ్ ఛేదించేందుకు అనుకూలం. దీంతో టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగే ఎంచుకుంటుంది. మంచు వల్ల బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, సూర్యకుమార్, రిషభ్ పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్ /చహల్, దీపక్ చహర్, అశ్విన్, భువనేశ్వర్, సిరాజ్. న్యూజిలాండ్: సౌతీ (కెప్టెన్), గప్టిల్, డారిల్ మిచెల్, చాప్మన్, ఫిలిప్స్, సీఫెర్ట్, నీషమ్, సాన్‌ట్నర్, బౌల్ట్, ఫెర్గూసన్, ఇష్ సోధి. -
మన జట్టు బ్యాలెన్సింగ్ గా ఉంది: అజారుద్దీన్
-
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న యావత్ క్రికెట్ ప్రపంచం
-
దక్షిణాఫ్రికాదే టి20 సిరీస్
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 42 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. తొలుత సఫారీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (44 బంతుల్లో 75 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. ఛేజింగ్‌లో ఐర్లాండ్ 19.3 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. షమ్సీ, బోర్న్ ఫోర్టీన్ చెరో మూడు వికెట్లు సాధించి ప్రత్యర్థిని కట్టడి చేశారు. -
లివింగ్‌స్టోన్ సెంచరీ వృథా
నాటింగ్‌హామ్: లివింగ్‌స్టోన్ (43 బంతుల్లో 103; 6 ఫోర్లు, 9 సిక్స్ లు) పోరాటం వృథా అయింది. ఇంగ్లండ్ తరఫున టి20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్న లివింగ్‌స్టోన్ జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. దాంతో పాకిస్తాన్‌తో జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో ఓడింది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 232 పరుగులు చేసింది. టి20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్లు బాబర్ ఆజమ్ (49 బంతుల్లో 85; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిజ్వాన్ (41 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఇంగ్లండ్‌ను పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది (3/30) దెబ్బతీశాడు. రెండో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. -
పాక్ రివెంజ్.. హీరో మాత్రం అతనే!
భారీ ఛేజ్‌లో భాగంగా జట్టు తడబాటు.. నిలదొక్కుకునే క్రమంలో 42 బంతుల్లో తొమ్మిది సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు లియామ్ లివింగ్‌స్టోన్. అయినప్పటికీ ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓడింది. దీంతో 3-0 వన్డే సిరీస్ అవమానకరైమన ఓటమికి కొంతలో కొంత పాక్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. శుక్రవారం నాటింగ్హమ్ ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాక్, ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. కెప్టెన్ బాబర్ అజామ్ 49 బంతుల్లో 85 పరుగులు, రిజ్వాన్ 41 బంతుల్లో 63 పరుగులతో రాణించడంతో ఆరు వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ లక్క్క్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. బ్యాట్జులిపించిన లిమాయ్ అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఏడు ఓవర్లకే నాలుగు వికెట్లు పోగొట్టుకుని మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లియామ్ లివింగ్‌స్టోన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. 42 బంతుల్లో శతకం బాదడంతో పాటు.. సిక్స్ ద్వారా టీ20ల్లో ఫాసెస్ట్ సెంచరీ సాధించిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ ఘనతకు తన ఖాతాలో వేసుకున్నాడు లియామ్. కానీ, ఆ తర్వాతి బంతికే(17వ ఓవర్లో) భారీ షాట్ప్రయత్నించి అవుట్ అయ్యాడు. తర్వాతి బ్యాట్స్‌మ్యాన్ చేతులెత్తేయడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది ఇంగ్లండ్. వీరోచితంగా పోరాడిన లియామ్‌ను ఇంగ్లండ్ మాజీ దిగ్గజాలతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు. The moment Liam Livingstone struck England's fastest T20I century 💪#ENGvPAKpic.twitter.com/nEkYA8iQsf — The Cricketer (@TheCricketerMag) July 16, 2021 -
నేడు భారత్, ఇంగ్లండ్ మహిళల తొలి టి20
నార్తాంప్టన్: భారత మహిళల క్రికెట్ జట్టు ఇక టి20ల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేడు భారత్,ఇంగ్లండ్‌ల మధ్య తొలిటి20 జరుగనుంది. వన్డేల్లాగే ఈ ఫార్మాట్లోనూ ప్రత్యర్థి జట్టు మనకంటే బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఫామ్‌లో లేని కెప్టెన్ హర్మన్‌పైనే తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఇచ్చే ఆరంభంపై భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. స్నేహ్ రాణా, రిచా ఘోష్‌లతో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. మరో వైపు స్టార్ ప్లేయర్ డానీ వ్యాట్ పునరాగమనంతో ఇంగ్లండ్ మరింత పటిష్టంగా తయారైంది. -
డెల్టా దాడి.. ఈసారి టీ 20 ప్రపంచ కప్ విదేశాల్లో..?
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవనవిధానాల్లో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి. ఈ వైరస్ కారణంగా అవే మార్పులు క్రికెట్ వేదికలపై కూడా పడతోంది. ముందస్తు నిర్ణయాల ప్రకారం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరగాల్సి ఉంది. కానీ భారత్‌లో కోవిడ్ డెల్టా వేరియంట్ విజృంభణ కారణంగా ప్రపంచకప్ ఇక్కడ జరిగే అవకాశం దాదాపు లేనట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీని సజావుగా నిర్వహించడం కోసం ఐసీసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గడువు కూడా కోరింది. కానీ ప్రస్తుత వైరస్ వ్యాప్తి, ఆటగాళ్ల రక్షణ దృష్ట్యా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను యూఏఈలో జరిపేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఐసీసీకి సమాచారం కూడా ఇచ్చిందని తెలుస్తోంది. ఈ అంశంపై బీసీసీఐ కార్యదర్శి జే షా మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా కారణంగా భారత్‌లో పరిస్థితులను సమీక్షిస్తున్నామని, ఇక టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల ఆరోగ్యం, రక్షణే ముఖ్యమన్నారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ను భారత్ లేదా యూఏఈలో నిర్వహించాలా అనే విషయంపై త్వరలోనే బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో అక్టోబర్ 17 నుంచి యూఏఈలో ప్రపంచకప్ టోర్నీని నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు, ఫైనల్ మ్యాచ్‌ను నవంబర్ 14వ తేదీన నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. Due to the COVID situation in the country, we may shift the T20 World Cup scheduled in India to UAE. We are monitoring the situation closely. Health and safety of players are paramount for us. We will take the final call soon: BCCI Secretary, Jay Shah to ANI (File pic) pic.twitter.com/Sqz77E5BkC — ANI (@ANI) June 26, 2021 చదవండి: ధోని మెసేజ్‌పై అభిమానుల ఆగ్రహం.. ట్వీట్ వైరల్ -
టీమిండియా కెప్టెన్‌గా అతనే సరైనోడు: పనేసర్
టీమిండియా సారథిని మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో ట్వీ20లకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు. ప్రారంభ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్లూటీసీ) ఫైనల్లో కొహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఓడిపోయిన తరువాత పనేసర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా భారత జట్టులో కెప్టెన్సీ మార్పుపై చాలా కాలంగా చర్చ నడుస్తోంది. రోహిత్ ముందుండి నడిపించగలడు చాలా దేశాలు వివిధ ఫార్మాట్లకు వేరువేరు కెప్టెన్లను ఎంపిక చేసుకుని వాళ్ల జట్లను నడిపిస్తుండగా,భారత్,పాకిస్తాన్,న్యూజిలాండ్ దేశాలు మాత్రం అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్‌తో బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం విరాట్ ఒత్తిడిలో ఉన్నాడని రాబోవు 2021 ట్వీ20 ప్రపంచ కప్ దృష్ట్యా హిట్‌మ్యాన్‌కు టీమిండియా సారథ్యం బాధ్యతలు అప్పగించాలని పనేసర్ సూచించాడు. అంతేగాక రోహిత్‌కు ఐపీఎల్ లో ముంబై జట్టుకి సారథ్యం వహించి ఎన్నో విజయాలను అందించడమే గాక ఐపీఎల్లో ముంబైని ఫైనల్లో ఐదు సార్లు విజేతగా నిలిపిన ఘనత కూడా ఉందని గుర్తు చేశాడు. పొట్టి ఫార్మట్‌లో తన టీంను సమర్థవంతంగా నడిపించగల అనుభవం తనకుందని అతను ఎప్పుడో నిరూపించుకున్నాడని పనేసర్ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ ఆసియా కప్‌తో పాటు నిదాహాస్ ట్రోఫీలో కూడా భారత జట్టును విజయవంతంగా నడిపించాడు. ఇప్పటివరకు, అతను భారత్‌కు 29 సార్లు (10 వన్డేలు, 19 టీ20 ) నాయకత్వం వహించగా, అందులో 23 (8 వన్డేలు, 15 టీ 20 ) విజయాలు ఉన్నాయి. చదవండి: WTC: కివీస్‌కు క్షమాపణలు చెప్పిన ఆసీస్ కెప్టెన్ -
మరో సారి కోహ్లిని వెనక్కి నెట్టిన పాక్ ఆటగాడు
పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. తాజా రికార్డుతో మరోసారి భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టిన బాబర్ కోహ్లి రికార్డును బద్దలుకొట్టాడు. ఇటీవల ఐసీసీ అత్యుత్తమ వన్డే బ్యాట్స్మెన్ల ర్యాంకింగ్స్‌లో కోహ్లీని వెనక్కు నెట్టిన బాబర్.. ఈసారి టీ20ల్లో అత్యంత వేగంగా 2వేల పరుగుల చేసి కోహ్లిని అధిగమించాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 లో బాబార్ ఈ ఘనతను సాధించాడు. టీ20ల్లో 2వేల పరుగులు చేయడానికి కోహ్లి 56 ఇన్నింగ్స్‌లు తీసుకోగా బాబర్ ఈ ఘనతను కేవలం 52 ఇన్నింగ్స్‌ల్లో సాధించడం విశేషం. ఇక ఈ వరుసలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (62 ఇన్నింగ్స్), న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (66 ఇన్నింగ్స్) మూడవ, నాలుగో స్థానాల్లో ఉన్నారు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన టి20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ప్రకారం బాబర్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ( చదవండి: ఆ బౌన్సర్‌కు హెల్మెట్ సెపరేట్ అయ్యింది..! ) -
యువరాజ్‌సింగ్ గాయపడిన బాహుబలి..!
రాయ్‌పూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021 ఫైనల్లో ఇండియా లెజెండ్స్ ఆదివారం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ గెలవడంలో యువరాజ్ సింగ్ పాత్ర ఎంతగానో ఉంది.ఫైనల్లో యువరాజ్ సింగ్ 41 బంతుల్లో 60 పరుగులు చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇండియా టీం ప్లేయర్లకు హోటల్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. యువరాజ్ సింగ్ భారత ఆటగాళ్లకు జరిగిన స్వాగత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇక్కడ చదవండి: ఇండియాదే లెజెండ్స్ కప్ వీడియోలో యువీ హోటల్లోకి డ్యాన్స్ చేస్తూ వచ్చాడు , సిబ్బంది అతనికి గౌరవ సూచకంగా బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ మాదిరిగా, లాంగ్ హ్యాండిల్ ప్యాన్లను కత్తులలాగా పైకిలేపారు. ఈ వీడియోకు బ్లాక్ గ్రౌండ్లో సాహోరే బాహుబలి పాటను వేశారు. ఫైనల్ మ్యాచ్‌లో యువీ కుడికాలికి కాస్త గాయమైంది. దీంతో యువీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో "బ్రోకెన్ బాహుబలి," అంటూ వీడియోకు క్యాప్షన్ ఇస్తూ షేర్ చేశాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్లో అత్యధిక సిక్సర్లను బాదిన బ్యాట్స్‌మన్‌గా యువరాజ్ సింగ్ నిలిచాడు. ఏడు మ్యాచ్‌లలో 17 సిక్స్‌లను కొట్టాడు. View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) (చదవండి: యువీ దూకుడు.. యూసఫ్ మెరుపులు) -
భారత్‌పై చివరి బంతికి గెలిచిన దక్షిణాఫ్రికా
లక్నో: ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేగిన రెండో టి20 మ్యాచ్‌లోనూ భారత అమ్మాయిల జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో వన్డే సిరీస్‌లాగే దక్షిణాఫ్రికా జట్టు ఇంకో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో టి20 సిరీస్‌నూ కైవసం చేసుకుంది. ఓపెనర్ లిజెల్ లీ (45 బంతుల్లో 70; 11 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ లౌరా వోల్వార్ట్ (39 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు) చెలరేగారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (31 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిచా ఘోష్ (26 బంతుల్లో 44; 8 ఫోర్లు) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. దక్షిణాఫ్రికా గెలిచేందుకు ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి మొదటి నాలుగు బంతుల్లో మూడే పరుగులిచ్చింది. కానీ ఐదో బంతిని అరుంధతి నోబాల్‌గా వేయడం... దక్షిణాఫ్రికాకు 3 పరుగులు రావడంతో ఆ జట్టు విజయసమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారింది. ఐదో బంతికి 2 పరుగులు చేసిన వోల్వార్ట్ ఆఖరి బంతికి మిగిలున్న ఒక్క పరుగును కూడా సాధించి జట్టును గెలిపించింది. గాయం నుంచి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ స్మృతి మంధాన సారథ్యం వహించింది. రేపు ఆఖరి టి20 మ్యాచ్ జరుగుతుంది. నిరాశ పరిచిన స్మృతి తప్పక గెలిచి నిలవాల్సిన ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన (7) మళ్లీ నిరాశపరిచింది. తొలి ఓవర్లో బౌండరీ బాదిన ఆమె ఎంతోసేపు నిలువలేదు. దీంతో 8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన హర్లీన్ డియోల్‌తో కలిసి షఫాలీ ఇన్నింగ్స్‌ను నడిపించింది. నాలుగో ఓవర్లో షఫాలీ మూడు ఫోర్లు కొట్టింది. ఆరో ఓవర్లో బౌండరీతో పాటు లాంగాఫ్‌లో భారీ సిక్సర్ బాదింది. మరోవైపు డియోల్ కూడా అడపాదడపా ఫోర్లు కొట్టడంతో ఓవర్‌కు 7 పరుగుల చొప్పున రన్‌రేట్ నమోదైంది. పది ఓవర్లు ముగిసే సరికి భారత్ 79/1 స్కోరు చేసింది. మరుసటి ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా మరో సిక్సర్ కొట్టిన షఫాలీ అదే ఓవర్లో పెవిలియన్ చేరింది. తర్వాత జోరు తగ్గిన భారత్‌కు హర్లీన్ (31; 4 ఫోర్లు) రూపంలో మరో దెబ్బ తగిలింది. రిచా ధనాధన్ ఈ దశలో క్రీజులోకి దిగిన రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిసింది. 14వ ఓవర్లో తన ఆటను బౌండరీలతో ప్రారంభించింది. ఆమె 3 ఫోర్లు, జెమిమా మరో బౌండరీ బాదడంతో లూస్ వేసిన ఆ ఓవర్లో ఏకంగా 18 పరుగులొచ్చాయి. ఇదే జోరును కొనసాగించడంతో స్కోరుబోర్డు జోరందుకుంది. ఓవర్‌కు ఒకటి, రెండు బౌండరీల చొప్పున ఆమె ధాటిగా ఆడింది. దీంతో భారత్ స్కోరు 150 పరుగులను అధిగమించింది. లిజెల్ మెరుపులు ఛేజింగ్‌లో రెండో ఓవర్లోనే ఓపెనర్ బాస్చ్ (2) వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టును లిజెల్ లీ మెరుపు ఇన్నింగ్స్ తో నిలబెట్టింది. కెప్టెన్ సునే లూస్ (21 బంతుల్లో 20; 3 ఫోర్లు)తో రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించింది. తర్వాత వోల్వార్ట్తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. ఈ క్రమంలోనే లిజెల్ 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కూడా ధాటిగా ఆడిన లిజెల్ చేయాల్సిన రన్‌రేట్‌ను దించేసింది. ఎట్టకేలకు ఇన్నింగ్స్ 16వ ఓవర్లో రాధా యాదవ్ ఆమె సుదీర్ఘ ఇన్నింగ్స్‌కు తెరదించింది. లిజెల్ అవుటైనా చివరి వరకు వోల్వార్ట్ క్రీజులో నిలిచి దక్షిణాఫ్రికాను గెలిపించింది. -
‘అందుకే కోహ్లిని లీడర్ అంటాం’
అహ్మదాబాద్ : ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ఫేవరెట్ స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్ కోసం త్యాగం చేశాడు. ఈ సీరీస్ లో రెండో టీ20 మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన యాదవ్‌కి ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఆ తర్వాత మూడో టీ20లో అతడిని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. నాలుగో మ్యాచ్‌లో కోహ్లికి మూడో స్థానంలో ఆడే అవకాశం ఉన్నా తాను కాదని సూర్యను ఆ స్థానంలో పంపాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ చేజార్చుకుంది. దాంతో.. నెం.3 బ్యాటింగ్ స్ధానంలో కోహ్లీ వస్తాడని అంతా అనుకున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా క్రీజులోకి వచ్చాడు. మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతినే భారీ సిక్స్‌తో బోణి కొట్టడమే కాక చక్కటి ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో యాదవ్ (57; 31 బంతుల్లో 6x4,3x6) హాఫ్ సెంచరీ బాదేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ( 1) పరుగుతో వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ తీసుకున్న నిర్ణయానికి స్పందిస్తూ భారత మాజీ ఫాస్ట్ ఇర్ఫాన్ పఠాన్ ‘కోహ్లీని లీడర్‌గా నేను గౌరవించడానికి కారణం ఇదే. కొత్తగా భారత్ జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం ఇవ్వడం కోసం తన ఫేవరెట్ బ్యాటింగ్ పొజీషన్‌ని త్యాగం చేశాడని’ కొనియాడాడు. మరోవైపు నెటిజన్లు కూడా కోహ్లీ త్యాగంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో జరిగిన మూడో టీ20లోనూ యువ హిట్టర్ ఇషాన్ కిషన్ కోసం కోహ్లీ తన నెం.3 స్థానాన్ని త్యాగం చేసిన విషయం తెలిసిందే. (చదవండి :సూర్య ప్రతాపం.. భారత్ విజయం ) -
విలియమ్సన్ సరసన కోహ్లి
అహ్మదాబాద్ : ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో వీరాట్ కోహ్లి కెప్టెన్‌గా విలియమ్సన్ పేరిట ఉన్న అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టీ 20లో ప్రస్తుతం కోహ్లి ,విలియమ్సన్ 11 అర్ధ సెంచరీలతో సమంగా ఉన్నారు. మంగళవారం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడవ టీ20 లో కోహ్లి కేవలం 46 బంతుల్లో 77 పరుగులు (నాటౌట్) చేసి ఈ ఘనతను సాధించాడు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అంతరాతీయ పురుషుల టీ20 క్రికెట్లో 3000 పరుగుల చేసిన మొదటి క్రికెటర్‌గా తన పేరును నమోదు చేసుకున్నాడు . టీ 20లో 138.96 స్ట్రైక్ రేట్‌తో సగటున 52.17 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ 20 లో కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్, ఇంగ్లాండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్ వీరిద్దరు తొమ్మిది అర్ధ సెంచరీలు సాధించి కోహ్లీ ,విలియమ్సన్ తర్వాతి స్థానంలో ఉన్నారు. మూడో టీ20లో భారత బ్యాట్స్‌మెన్ తడబాటు పవర్‌ప్లేలోనే 24 పరుగులకు 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌కు కోహ్లి తన ఇన్నింగ్స్ ద్వారా గౌరవప్రదమైన స్కోర్‌ను ఇంగ్లాండ్ ముందు ఉంచాడు. ప్రత్యేకంగా మార్క్ వుడ్ వేసిన 18 వ ఓవర్లో 6, 6, 4 పరుగులు చేసి డెత్ ఓవర్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌ను మరో సారి ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. కోహ్లీ ( 77), రిషబ్ పంత్ (25) చివర్లో హార్దిక్ పాండ్యా (17) మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. -
కొన్ని విషయాలను తేలిగ్గా తీసుకోం: కోహ్లీ
అహ్మదాబాద్: ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా, నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాము. అనుకున్న షాట్లను సరిగ్గా ఆడలేకపోయాం’ అని అన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో పక్కా ప్లాన్‌తో తిరిగివస్తామని తెలిపాడు. బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు. దీంతో ఇంగ్లాండ్ విజయం సులువైందని చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే మంచి ప్రదర్శన చేసినా మిగతా బ్యాట్స్మన్లు పూర్తిగా విఫలమయ్యారని కోహ్లి తెలిపాడు.ఆటలో గెలుపు, ఓటములు సహజమేనని తర్వాతి మ్యాచ్‌కు సరైన ప్రణాళికతో తిరిగివస్తామని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు కేవలం ఐదు టీ20 మ్యాచ్‌లే ఉండగా, ఈ సమయంలో ప్రయోగాలు చేసిన, కొన్ని విషయాలను మాత్రం తేలిగ్గా తీసుకోలేమని వివరించాడు. టీమిండియా నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి చేధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. (చదవండి: కోహ్లి కథ ముగిసినట్టేనా..!) -
పొట్టి ఆటలో గట్టి పోరు
టి20ల్లో టాప్–2 జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. కోహ్లి సేన టెస్టు సిరీస్‌ను ‘అనుకూలత’లతో నెగ్గినా... టి20ల్లో నంబర్‌వన్ ఇంగ్లండ్‌తో అంత సులువు కాదు. మెరుపుల సంగ్రామంలో రెండూ కూడా మెరుగైన జట్లే! దీంతో మొటెరా మోతెక్కడం ఖాయం. ప్రేక్షకులకు మెరుపుల విందు సిద్ధం. అహ్మదాబాద్: టెస్టుల్ని స్పిన్‌తో దున్నేసిన భారత్‌కు పొట్టి ఆటలో దీటైన పోరే ఎదురు కానుంది. ప్రపంచ నంబర్‌వన్ టి20 జట్టు ఇంగ్లండ్ ఈ ఫార్మాట్లో అసాధారణ ఆటతీరుతో దూసుకెళ్తుంది. అలాగని భారత్ ఇందులో తక్కువని కాదు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ ముస్తాక్ అలీ టోర్నీల్లో భారత కుర్రాళ్లు రాటుదేలారు. ఎప్పుడైనా అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐదు టి20ల సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశముంది. దీంతో ప్రతీ మ్యాచ్ ప్రేక్షకులకు సిసలైన క్రికెట్ పసందునే పంచనుంది. ఇందులో భాగంగా శుక్రవారం తొలి సమరం జరగనుంది. రాహుల్–రోహిత్‌ల ఓపెనింగ్ సీనియర్లు ఫామ్‌లో ఉంటే... కుర్రాళ్లేమో జోరు మీదున్నారు. దీంతో భారత తుది జట్టు కసరత్తు టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. అందుకేనేమో మ్యాచ్ మొదలయ్యే క్షణం దాకా ఈ భారం మోయలేకే ఓపెనింగ్ జోడీని కెప్టెన్ కోహ్లి తేల్చేశాడు. హిట్‌మ్యాన్ రోహిత్‌కు జోడీగా లోకేశ్ రాహుల్ దిగుతాడని ప్రకటించాడు. దీంతో ధావన్ బెంచ్‌కే పరిమితం కాకతప్పదు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రతీ స్థానంలోనూ మునుపెన్నడు లేనంత తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో జట్టుకు ఎంపికైనప్పటికీ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు ఆడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాలు ఖాయమైన తుది జట్టులో వాళ్లిద్దరికి చోటు అసాధ్యమే. లోకల్ బాయ్ అక్షర్ పటేల్ కంటే బ్యాటింగ్‌లో మెరుగైన వాషింగ్టన్ సుందర్‌వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది. పేస్ విభాగంలో భువీ, శార్దుల్, సైనీలున్నారు. అంతా కొట్టేవాళ్లే ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ భారత్ కంటే కాస్త మెరుగనే చెప్పాలి. తుది జట్టుకు ఆడే 11 మందిలో పది మందికి బ్యాటింగ్, హిట్టింగ్ బాగా తెలుసు. ఓపెనర్లు జేసన్ రాయ్, బట్లర్లతో పాటు టి20 స్పెషలిస్టు డేవిడ్ మలన్, బెయిర్ స్టో, ఆల్‌రౌండర్ స్టోక్స్, కెప్టెన్ మోర్గాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్చర్ దాకా ఆడేసేవాళ్లే అందుబాటులో ఉన్నారు. భారత్ స్పిన్ దెబ్బతీసినా... కాసిన్ని ఓవర్ల (20)లో పదో వరుస దాకా ఉన్న బ్యాటింగ్ బలం జట్టుకు వరం. బౌలింగ్‌లో రషీద్, జోర్డాన్, మొయిన్ అలీలు భారత బ్యాట్స్‌మెన్‌కు తప్పకుండా సవాళ్లు విసురుతారు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య సాగే ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆద్యంతం రసవత్తరంగానే సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, శ్రేయస్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, శార్దుల్, భువనేశ్వర్, చహల్, సైనీ. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, మలన్, బెయిర్‌స్టో, స్టోక్స్, మొయిన్ అలీ, సామ్ కరన్, జొర్డాన్, ఆర్చర్, మార్క్‌వుడ్, రషీద్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్. దీంతో భారీ స్కోర్లు ఖాయం. స్పిన్నర్లు కూడా కొంత ప్రభావం చూపించగలరు. ఈ విషయంలో భారత్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. వేసవి మొదలవడంతో వర్షం ముప్పు లేనే లేదు. -
సూర్య కుమార్, తెవాటియాలకు చాన్స్
ముంబై: ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. ఐదు టి20 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌తో తలపడే భారత జట్టులో అతనికి చోటు దక్కింది. అహ్మదాబాద్‌లో జరిగే ఈ సిరీస్ కోసం 19 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించారు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీలో కూడా ముంబై తరఫున అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినా... ఇన్నాళ్లూ సూర్యకుమార్‌కు టీమిండియాలో అవకాశం లభించలేదు. ఐపీఎల్‌లోనే రాజస్తాన్ తరఫున ఆకట్టుకున్న రాహుల్ తెవాటియాకు కూడా తొలిసారి భారత జట్టు పిలుపు వచ్చింది. ముంబై ఇండియన్స్ తరఫునే పలు దూకుడైన ఇన్నింగ్స్‌లు ఆడిన జార్ఖండ్ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా తొలి సారి భారత జట్టుకు ఎంపిక కావడం విశేషం. రిషభ్ పంత్ జట్టులో ఉన్నా, రెండో వికెట్ కీపర్‌గా కిషన్‌ను ఎంపిక చేసిన కమిటీ... సంజు సామ్సన్‌పై వేటు వేసింది. బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లను కూడా జట్టునుంచి తప్పించారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి సెలక్టర్లు మరో అవకాశం కల్పించారు. గాయంనుంచి కోలుకొని భువనేశ్వర్ కుమార్ పునరాగమనం చేస్తుండగా... ఊహించినట్లుగా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. 12 మార్చినుంచి 20 మార్చి వరకు మొటెరా స్టేడియంలోనే ఐదు టి20లు జరుగుతాయి. జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), రాహుల్, ధావన్, అయ్యర్, సూర్యకుమార్, హార్దిక్, పంత్, ఇషాన్ కిషన్, చహల్, చక్రవర్తి, అక్షర్, సుందర్, తెవాటియా, నటరాజన్, భువనేశ్వర్, దీపక్ చహర్, నవదీప్, శార్దుల్ -
న్యూజిలాండ్‌దే టి20 సిరీస్
హామిల్టన్: బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్ (63 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ కేన్ విలియమ్సన్ (42 బంతుల్లో 57 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీలతో చెలరేగడంతో పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కివీస్ 2–0తో గెలుచుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. మొహమ్మద్ హఫీజ్ (57 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. హఫీజ్ ఒంటరి పోరాటం చేయగా... మిగతా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ సౌతీ 4 వికెట్లతో చెలరేగాడు. జేమ్స్ నీషమ్, ఇష్ సోధి చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 164 పరుగులు చేసి గెలుపొందింది. గప్టిల్ (11 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. సీఫెర్ట్, విలియమ్సన్ రెండో వికెట్‌కు అజేయంగా 95 బంతుల్లో 124 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అష్రఫ్‌కు ఒక వికెట్ దక్కింది. నామమాత్రమైన మూడో టి20 మంగళవారం జరుగుతుంది. -
కొట్టేస్తా... ఏమనుకున్నావ్!
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. మైదానంలో తన సహచరుడిపైనే చెయ్యెత్తాడు. కుడి చేతితో దాదాపు తన సహచరుడి ముఖం మీద కొట్టినంత పని చేశాడు. జట్టులోని ఆటగాళ్లంతా సముదాయించినా అతనిలో కోపం తగ్గలేదు. వివరాల్లోకెళితే ‘బంగబంధు టి20 కప్’ సందర్భంగా సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఇందులో రహీమ్ జట్టు బెక్సింకో ఢాకా 9 పరుగులతో ఫార్చున్ బరిషల్‌పై నెగ్గి ప్లే ఆఫ్‌కు చేరింది. మ్యాచ్ జరుగుతుండగా బౌన్సర్‌ను ఆడే క్రమంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ అఫిఫ్ హొస్సేన్ కొట్టిన షాట్ అక్కడే గాల్లోకి లేచింది. కీపర్ రహీమ్, ఫైన్ లెగ్ ఫీల్డర్ నజుమ్ అహ్మద్ క్యాచ్ అందుకునే క్రమంలో ఢీకొట్టుకోబోయారు. కానీ రహీమ్ తడబడుతూనే క్యాచ్ పట్టేశాడు. క్యాచ్ పట్టిన వెంటనే సహచరుడు నజుమ్‌ను అదే చేత్తో కొట్టబోయాడు. రహీమ్ చర్యకు నజుమ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. నిజానికి ఈ క్యాచ్‌ను ఫైన్‌లెగ్‌లో ఉన్న నజుమ్ అందుకోవాలి. కానీ రహీమ్ ఎలాంటి సంజ్ఞ ఇవ్వకుండానే పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టడం గమనార్హం. సీనియర్ ప్లేయర్ అయిన రహీమ్ ఓ జూనియర్ క్రికెటర్ పట్ల ఇలా ప్రవర్తించి విమర్శల పాలయ్యాడు. -
మయాంక్, ధావన్‌ల జోడీ మేలు: బంగర్
న్యూఢిల్లీ : ఆదివారం సిడ్నీ వేదికగా జరగనున్న భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓపెన్‌కు మయాంక్ శర్మ, శిఖర్ ధావన్‌ల జోడీ బాగుంటుందని మాజీ ఇండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ రోహిత్ శర్మ అందుబాటులో లేడు కాబట్టి, మయాంక్ శర్మ, శిఖర్ ధావన్‌ల జోడీతో ముందుకెళితే బాగుంటుందని నా అభిప్రాయం. ధావన్ నిలకడగా ఆడతాడు. ఒక వేళ వారు కేల్ రాహుల్‌తో ముందుకెళ్లొచ్చు. అతడు నెంబర్ 5 ఆటగాడిగా భారత జట్టుకు ఎంతో సేవ చేశాడు. కానీ, మయాంక్, శిఖర్ ధావన్‌తో జోడీ అయితేనే బాగుంటుందని భావిస్తున్నా’’నన్నారు. -
తొలి టి20 న్యూజిలాండ్‌దే
ఆక్లాండ్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో) విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 16 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (37 బంతుల్లో 75 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... ఫాబియాన్ అలెన్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రూ ఫ్లెచర్ (14 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లాకీ ఫెర్గూసన్ (5/21) విండీస్‌ను దెబ్బ తీశాడు. అనంతరం వర్షం కారణంగా కివీస్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 176గా నిర్దేశించారు. అరంగేట్ర ఆటగాడు డెవాన్ కాన్వే (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం జిమ్మీ నీషమ్ (24 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మిషెల్ సాన్‌ట్నర్ (18 బంతుల్లో 31 నాటౌట్; 3 సిక్సర్లు) చివర్లో విజృంభించడంతో న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసి గెలుపొందింది. -
స్టన్నింగ్ డైవ్ క్యాచ్, వహ్వా అనాల్సిందే!
అలా దూరంగా వెళ్తున్న బంతిని సైతం గాల్లో పల్టీలు కొడుతూ క్యాచ్ పడితే.. అదిరిపోయే క్యాచ్ అంటూ ఆ ఫీల్డర్‌పై ప్రశంసలు కురిపిస్తాం. అదే సమయంలో ఆ క్యాచ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తే అభిమానులు మరింత కేరింతలు కొడతారు. తాజాగా, మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఇలాంటి ఓ డైవింగ్ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రిస్బేన్ హీట్ వుమెన్ వర్సెస్ అడిలైడ్ స్ట్రయికర్స్ వుమెన్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ స్టన్నింగ్ క్యాచ్ వెలుగు చూసింది. 17 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన తరుణంలో.. అడిలైడ్ స్పిన్నర్ అమంద వెల్లింగ్టన్ విసిరిన ఫుల్‌టాస్ బంతిని అమెలియా కేర్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించాలనుకుంది. ఆమె కొట్టిన షాట్ బాల్‌ను షార్ట్ మిడ్ వికెట్ వద్ద ఉన్న మ్యాడీ పెన్నా క్యాచ్ కోసం ప్రయత్నించగా.. ఫలించలేదు. ఆమె చేతులను తాకుతూ బంతి అమాంతం పైకి లేచి బుల్లెట్లా బౌండరీ వైపుగా దూసుకెళ్తోంది. పెన్నాకు సమీపంలోనే ఉన్న తాహిలా మెక్‌గ్రాత్ చాకచక్యంగా ఫుల్‌లెంగ్త్‌లో డైవ్ చేసి ఆ బంతిని ఒడిసిపట్టింది. అప్పటికే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బ్రిస్బేన్ జట్టు తాజా వికెట్‌తో ఒత్తిడికి లోనైంది. ఫలితంగా అడిలైడ్ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ జట్టు 20 ఓవర్లకు 153 పరుగులు చేయగా.. బ్రిస్బేన్ జట్టు 135 పరుగులే చేయగలిగింది. -
వెలాసిటీ బోణీ
షార్జా: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ ఐదు వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని సూపర్ నోవాస్ జట్టుపై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఓపెనర్ చమరి ఆటపట్టు (39 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించింది. ఏక్తాబిష్త్ 3 వికెట్లు తీసింది. తర్వాత వెలాసిటీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సునె లూస్ (21 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సుష్మ వర్మ (33 బంతుల్లో 34; 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. రాణించిన చమరి... ఓపెనర్ ప్రియా (11), జెమీమా రోడ్రిగ్స్ (7) విఫలమైనా... మరో ఓపెనర్ చమరి ఆటపట్టు కుదరుగా ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించింది. మనాలీ, కాస్పెరెక్ ఓవర్లలో సిక్సర్లు బాదిన చమరి దూకుడుకు జహనార చెక్ పెట్టింది. కాసేపటికే హర్మన్ (27 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను జహనార పెవిలియన్ చేర్చగా... తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారిలో సిరివర్దెనె (18) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 20వ ఓవర్ వేసిన ఏక్తా బిష్త్ ఆఖరి రెండు బంతుల్లో రాధా యాదవ్ (2), షకీరా (5)లను అవుట్ చేసింది. జహనార, కాస్పెరెక్ చెరో 2 వికెట్లు తీశారు. ఆఖర్లో ఉత్కంఠ... బంతికో పరుగు చొప్పున చేయాల్సిన లక్ష్యం. కానీ ఖాతా తెరువకుండానే ఓపెనర్ వ్యాట్ (0)ను, లక్ష్యఛేదనలో సగం పరుగులు చేయగానే షఫాలీ (11 బంతుల్లో 17), కెప్టెన్ మిథాలీ (7), వేద కృష్ణమూర్తి (28 బంతుల్లో 29; 4 ఫోర్లు) వికెట్లను కోల్పోయింది. 13 ఓవర్లలో వెలాసిటీ స్కోరు 65/4. ఇంకా 42 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన సమీకరణం. చివరి 5 ఓవర్లలో అయితే ఓవర్‌కు 10 చొప్పున 50 పరుగులు చేయాలి. లక్ష్యానికి దాదాపు దూరమైన తరుణంలో సుష్మ, సునె లూస్ భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. పూనమ్ 16వ ఓవర్లో ఇద్దరు చెరో సిక్సర్ బాదడంతో 14 పరుగులు, సిరివర్దెనె 17వ ఓవర్లో 11 పరుగులు రావడంతో లక్ష్యం సులువైంది. సుష్మ అవుటైనా... ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లూస్, శిఖాపాండే చెరో బౌండరీతో గెలిపించారు. నేడు జరిగే మ్యాచ్‌లో వెలాసిటీతో ట్రయల్ బ్లేజర్స్ తలపడుతుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
నవంబర్ 27న తొలి పోరు
భారత క్రికెట్ జట్టు చివరిసారిగా మార్చి 2న మైదానంలోకి దిగింది. న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓడిన తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉన్నా... కరోనా కారణంగా ప్రపంచం తలకిందులై పోయింది. బయో బబుల్‌లో ఐపీఎల్ వినోదం పంచుతున్నా... సగటు భారత అభిమాని అంతర్జాతీయ క్రికెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగే టీమిండియా పర్యటన అధికారికంగా ఖరారైంది. మూడు ఫార్మాట్లలో కలిపి 10 మ్యాచ్‌లతో ఈ పోరు రసవత్తరంగా సాగడం ఖాయం. కోవిడ్–19 కఠిన పరిస్థితులను అధిగమించి సరిగ్గా 269 రోజుల విరామం తర్వాత భారత జట్టు సిడ్నీ వేదికగా నవంబర్ 27న జరిగే తొలి వన్డేతో మళ్లీ బరిలోకి దిగనుంది. మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. టీమిండియా సుదీర్ఘ ఆసీస్ టూర్‌కు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కరోనా పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాలతో చర్చించిన తర్వాత తమ అంగీకారాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు అక్కడి ప్రభుత్వం తెలియజేసింది. గతంలోనే షెడ్యూల్ ప్రకటించేందుకు సీఏ సిద్ధమైనా... ఆంక్షల కారణంగా ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు స్వల్ప మార్పులతో మొత్తం పర్యటన వివరాలను సీఏ వెల్లడించింది. ఆస్ట్రేలియా దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం కేవలం 14 కేసులు మాత్రమే నమోదు కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య సుమారు 1500 మాత్రమే. ఈ సిరీస్‌లో భారత్–ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేలు, 3 టి20లు, 4 టెస్టులు జరుగుతాయి. మెల్బోర్న్లో రోజూ 25 వేల ప్రేక్షకులకు అనుమతి! నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టుకు అడిలైడ్ వేదిక కానుంది. ఇది భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే తొలి డే అండ్ నైట్ కావడం విశేషం. భారత్ తమ ఏకైక డే–నైట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించగా... ఆసీస్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు, ఆస్ట్రేలియా ‘ఎ’తో మూడు రోజుల డే అండ్ నైట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడుతుంది. ఆసీస్ ‘ఎ’ జట్టులో కూడా దాదాపు అంతా ప్రధాన జట్టు ఆటగాళ్లే ఉండే అవకాశం ఉంది. సాంప్రదాయం ప్రకారం ఈసారి కూడా బాక్సింగ్ డే టెస్టుకు మెల్బోర్న్ మైదానమే వేదిక కానుంది. అయితే విక్టోరియా రాష్ట్రంలోనే కరోనా ప్రభావం ఉండటంతో లక్ష సామర్థ్యం గల ఈ స్టేడియంలో రోజూ నాలుగో వంతు సుమారు 25 వేల మంది ప్రేక్షకులను అనుమతించే విషయాన్ని సీఏ పరిశీలిస్తోంది. మరోవైపు భారత క్రికెటర్లు కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో సీఏ, బీసీసీఐతో చర్చిస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 14 రోజుల క్వారంటైన్... బీసీసీఐ ఎన్ని విధాలా విజ్ఞప్తి చేసినా క్వారంటైన్ విషయంలో మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వం క్రికెటర్లకు ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టంగా చెప్పింది. నవంబర్ 10న దుబాయ్‌లో ఐపీఎల్ ముగిసిన అనంతరం భారత బృందం ప్రత్యేక విమానంలో సిడ్నీకి బయలుదేరి వెళుతుంది. నిజానికి భారత్ ముందుగా బ్రిస్బేన్ వెళ్లాల్సి ఉన్నా, క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించలేదు. సిడ్నీ ఒలింపిక్ పార్క్‌కు దగ్గరిలోనే ఒక హోటల్లో వీరికి బస ఏర్పాటు చేస్తున్నారు. ఈ హోటల్‌ను ఇతర అతిథులు ఎవరూ ఉండకుండా ప్రత్యేకంగా టీమిండియా కోసం సిద్ధం చేశారు. ఆటగాళ్లంతా నవంబర్ 12 నుంచి హోటల్లోనే 14 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గరలోనే ఉన్న బ్లాక్‌టౌన్‌లో టీమ్ ప్రాక్టీస్ చేస్తుంది. క్వారంటైన్ ముగిసిన సరిగ్గా రెండు రోజుల తర్వాత టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
హోప్‌పై వేటు వేశారు
సెయింట్ జాన్స్ (అంటిగ్వా): న్యూజిలాండ్‌తో వచ్చే నెలలో మొదలయ్యే టి20, టెస్టు సిరీస్‌లకు వెస్టిండీస్ జట్లను ప్రకటించింది. టెస్టు జట్టులోకి డారెన్ బ్రేవో, హెట్‌మైర్, కీమో పాల్ పునరాగమనం చేయగా... బ్యాట్స్‌మన్ షై హోప్ ఉద్వాసనకు గురయ్యాడు. గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న హోప్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. టెస్టు జట్టుకు సారథిగా జేసన్ హోల్డర్ వ్యవహరించనున్నాడు. వికెట్ కీపర్ ఆండ్రూ ఫ్లెచర్ 2018 తర్వాత తొలిసారి టి20 జట్టులో స్థానం దక్కించుకోవడం విశేషం. కరోనా నేపథ్యంలో తాము న్యూజిలాండ్ పర్యటనలో పాల్గొనలేమని ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్, ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్, ఎవిన్ లూయిస్‌లు విండీస్ బోర్డుకు తెలియజేయడంతో వారిని పరిగణనలోకి తీసుకోలేదు. టి20 జట్టుకు కీరన్ పొలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వెస్టిండీస్... న్యూజిలాండ్ పర్యటనను టి20 సిరీస్‌తో ఆరంభించనుంది. నవంబర్ 27, 29, 30వ తేదీల్లో మూడు టి20లను ఆడనున్న కరీబియన్ జట్టు... డిసెంబర్ 3–7, 11–15 మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల్లో కివీస్‌తో తలపడనుంది. -
తొలి రోజు నుంచే మహిళల క్రికెట్
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల టి20 క్రికెట్ తొలి రోజే ప్రేక్షకులను అలరించనుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగే ఈ పోటీల నిర్వాహక కమిటీ తాజాగా ప్రకటించిన షెడ్యూల్లో పోటీల తొలి రోజైన 2022 జూలై 29న మహిళల క్రికెట్ మొదలవుతుంది. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. 11 రోజులపాటు ఆగస్టు 8 వరకు జరిగే కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం 19 అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. పోటీలు గతంలో ప్రకటించినట్లుగా జూలై 28న కాకుండా ఒకరోజు ఆలస్యంగా జూలై 29న ప్రారంభం కానున్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఒకే ఒకసారి క్రికెట్ భాగంగా ఉంది. 1998లో మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన క్రీడల్లో వన్డే ఫార్మాట్లో జట్లు పోటీ పడ్డాయి. దక్షిణాఫ్రికా స్వర్ణం గెలుచుకోగా...ఈ పోటీలకు ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్‌లుగా కాకుండా... దేశవాళీ వన్డే హోదా మాత్రమే ఇచ్చింది. -
అలుపెరగని ఆల్‌రౌండర్
ఐపీఎల్ టీమ్‌లంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). ఈ జట్టు అనగానే మదిలో మెదిలే తొలి పేరు ధోని. మరి ధోని, రైనాలతోపాటు మరో స్టార్ కూడా సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతనే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. చెన్నై మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్‌షిప్ సాధించడంలో ధోని సారథ్యం ఎంత ఉందో... బ్రావో సత్తా కూడా అంతే ఉంది. పొట్టి క్రికెట్లో గట్టి ఆల్‌రౌండర్ ఈ కరీబియన్ సూపర్‌స్టార్. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టోర్నీలో భాగంగా బుధవారం సెయింట్ లూసియా జూక్స్తో జరిగిన మ్యాచ్‌లో బ్రావో 500 వికెట్ల మైలురాయి దాటి టి20 క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. –సాక్షి క్రీడా విభాగం ట్రినిడాడ్‌లోని కరీబియన్ దిగ్గజం బ్రియాన్ లారా అడుగు జాడల నుంచే బ్రావో వచ్చాడు. కానీ లారా మాదిరిగా క్లాస్ బ్యాటింగ్ లేదు. తన ట్రేడ్‌మార్క్ షాట్ కవర్‌డ్రైవ్‌ను ఏమంత బాగా ఆడలేడు. చెప్పాలంటే పర్ఫెక్ట్ షాట్లేవీ తనకంటూ లేకపోయినా బ్రావో మాత్రం బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. మ్యాచ్‌లను బ్యాట్‌తో ముగించగలడు. బంతి (పేస్ బౌలింగ్)తో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కూల్చేయగలడు. ఇక టి20 లీగ్లకైతే స్పెషలిస్ట్‌గా మారాడు... కాదు కాదు ఎదిగాడు. ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు. అందుకే ఎవరికీ సాధ్యంకాని 500 వికెట్లను తన పేస్ బౌలింగ్‌తో సుసాధ్యం చేసుకున్నాడు. బ్యాట్‌తోనూ బ్రావో మెరిపించగలడు. ఓవరాల్‌గా 459 టి20 మ్యాచ్‌లు ఆడిన బ్రావో ఇప్పటివరకు 501 వికెట్లు తీయడంతోపాటు 6,313 పరుగులు చేసి, 225 క్యాచ్‌లు కూడా పట్టాడు. (చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్ ) పొట్టి ఫార్మాట్ మేటి బౌలర్... సంప్రదాయ క్రికెట్‌ను వన్డే ఆట మించితే... ఈ 50 ఓవర్లను దంచేసే ఆట 20–20. ఇందులో బాదడాని కే బాట ఉంటుంది. బ్యాట్స్ మెన్దే ఆట. బ్యాటింగ్ మెరుపులతోనే టి20 వెలుగు వెలుగుతోంది. ఇలాంటి ఫార్మాట్లో ప్రత్యేకించి బౌలరే బలిపశువయ్యే పోటీల్లో 500 వికెట్లు తీయడం ఆషామాషీ కానే కాదు. ఎందుకంటే టెస్టులో వేసినట్లు అపరిమిత ఓవర్లు వేయలేం. వన్డేల్లా 10 ఓవర్ల కోటా ఉండదు. ఏమున్నా... ఆ నాలుగు ఓవర్లతోనే సాధించాలి. లేదంటే బ్యాట్స్‌మన్ బాదుడుకు మోకరిల్లాలి! బ్యాటింగ్ విశ్వరూపం కనిపించే టి20ల్లో బ్రావోది కచ్చితంగా అనితర సాధ్యమైన ప్రదర్శనే! ఇది అతని శైలి... క్రీజులో పాతుకుపోయిన ఉద్ధండుల్ని, డివిలియర్స్ లాంటి ‘360 డిగ్రీ బ్యాట్స్‌మన్’ను తన వైవిధ్యమైన బంతులతో బోల్తా కొట్టించే ప్రత్యేకత బ్రావోది. భారత్‌లో జరిగిన 2016 టి20 ప్రపంచకప్‌లో సఫారీ స్టార్ డివిలియర్స్‌ను అంతుచిక్కని బంతితో ఆట ముగించాడు. లంక బౌలర్ మలింగ వేగం, తనకు మాత్రమే సాధ్యమయ్యే ‘స్లోయర్ ఆఫ్ కట్టర్’, ‘స్లోయర్ బౌన్సర్’లు బ్రావో అస్త్రాలు. అందుకేనేమో బ్యాట్స్‌మెన్ దంచేసి ఆటలో మించిపోయిన బౌలర్ బ్రావో ఒక్కడే అంటే అతిశయోక్తి కాదు. విండీస్ సూపర్ స్టార్ లారా కెప్టెన్సీలో 16 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయమైన బ్రావో అలుపెరగని బాటసారిగా ఆడుతూనే ఉన్నాడు. పొట్టి ఫార్మాట్లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కిన బ్రావోకు దరిదాపుల్లో ఏ ఒక్కరూ లేదు. ఈ వరుసలో రెండో స్థానంలో ఉన్న లంక బౌలర్ మలింగ (390) కనీసం 400 మార్క్‌ను దాటలేదు. లీగ్ ఏదైనా టాపర్ ఒకడే! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), చాంపియన్స్ లీగ్, కరీబియన్, బంగ్లాదేశ్, బిగ్‌బాష్ ఇలా లీగ్ ఏదైనా బ్రావో ఆడితే అతనే బౌలింగ్ టాపర్. 2009లో ట్రినిడాడ్ తరఫున చాంపియన్స్ లీగ్ ఆడిన బ్రావో 12 వికెట్లతో టాప్ లేపాడు. ఐపీఎల్లో అయితే రెండుసార్లు (2013, 15) సీఎస్కే తురుఫుముక్కగా రాణించాడు. ఆ రెండు సీజన్లలో అతను 32, 26 వికెట్లు పడేశాడు. సొంతగడ్డపై జరిగే కరీబియన్ లీగ్‌ల్లో 2015, 2016లలో వరుసగా 28, 21 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (2016)లో 21 వికెట్లు, బిగ్‌బాష్ (2017) లీగ్‌లో 18 వికెట్లు తీసి టాప్ బౌలర్‌గా నిలిచాడు. (చదవండి:ఊహించని ట్విస్ట్.. పాపం కెవిన్ ఒబ్రెయిన్) -
భారత్, పాక్ మహిళల టి20 మ్యాచ్ రద్దు
బ్రిస్బేన్: మహిళల టి20 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా జరగాల్సిన భారత్, పాకిస్తాన్ టి20 ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది. ఇక్కడి అలెన్ బోర్డర్ ఫీల్డ్ మైదానంలో ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంతో ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. భారీ వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. భారత్ తన తదుపరి ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఈనెల 18న వెస్టిండీస్‌తో ఆడుతుంది. భారత్–పాక్ మ్యాచ్‌తో పాటు ఆస్ట్రేలియా–వెస్టిండీస్, బంగ్లాదేశ్–థాయ్‌లాండ్ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా జరగలేదు. అడిలైడ్ వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఈనెల 21న భారత్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌తో పొట్టి ప్రపంచ కప్‌కు తెరలేవనుంది. -
చేజేతులా...
మెల్బోర్న్: కీలకదశలో ఒత్తిడికి లోనైన భారత మహిళల క్రికెట్ జట్టు మూల్యం చెల్లించుకుంది. విజేతగా నిలవాల్సిన చోట పరాజయాన్ని పలకరించింది. ముక్కోణపు టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 11 పరుగుల తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒకదశలో 15 ఓవర్లలో 3 వికెట్లకు 115 పరుగులు చేసి విజయందిశగా సాగుతోంది. భారత్ విజయానికి 30 బంతుల్లో 41 పరుగులు అవసరమైన దశలో... ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ జెస్సికా జొనాస్సెన్ మాయాజాలం చేసింది. జెస్సికా స్పిన్ వలలో చిక్కుకున్న భారత మహిళల జట్టు చివరి 7 వికెట్లను 29 పరుగుల తేడాలో కోల్పోయి సరిగ్గా 20 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. జోరు మీదున్న స్మృతి మంధాన (37 బంతుల్లో 66; 12 ఫోర్లు)ను మేగన్ షుట్ అవుట్ చేయగా... ఆ తర్వాత జెస్సికా స్పిన్‌కు హర్మన్‌ప్రీత్ (14; 2 ఫోర్లు)... దీప్తి శర్మ (10), అరుంధతి రెడ్డి (0), రాధా యాదవ్ (2), తానియా భాటియా (11; 2 ఫోర్లు) పెవిలియన్ చేరుకున్నారు. శిఖా పాండే (4)ను ఎలీస్ పెర్రీ అవుట్ చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. బెథానీ మూనీ (54 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. యాష్లే గార్డెనర్ (26; 5 ఫోర్లు), మేగన్ లానింగ్ (26; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. భారత స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆస్ట్రేలియా ఏకంగా 19 పరుగులు సాధించి భారత్ ముందు క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. -
భారత్ రికార్డ్ ఛేజింగ్; ఆసీస్‌పై గెలుపు
మెల్బోర్న్: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టు రికార్డు ఛేజింగ్‌తో ఘన విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సమిష్టిగా రాణించి చివరి ఓవర్లో గెలిచింది. 174 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతి మంధాన(55; 48 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించింది. 16 ఏళ్ల షెఫాలి వర్మ బ్యాట్‌తో చెలరేగింది. 18 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 49 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో అర్ధసెంచరీ కోల్పోయింది. రోడ్రిగ్స్(30), కౌర్(20) నాటౌట్‌గా నిలిచారు. భారత మహిళల జట్టుకు టి20ల్లో ఇదే అతిపెద్ద ఛేజింగ్ కావడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించింది. గార్డ్నర్ విజృంభించి ఆడి 57 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 పరుగులు చేసింది. లానింగ్ 37 పరుగులతో ఫర్వాలేదనిపించింది. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండు గెలిచి, రెండు ఓడింది. 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచిన ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. -
కోహ్లి మిస్.. రోహిత్‌కు ఛాన్స్
మౌంట్‌మాంగనీ: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డు సాధించాడు. టి20ల్లో అత్యధికసార్లు 50 అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. 25 సార్లు అతడీ ఘనత సాధించాడు. దీంతో విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన 5వ టి20లో రోహిత్ శర్మ 60 పరుగులు చేసి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకోవడంతో అతడి పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకునే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటివరకు 108 టి20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ నాలుగు సెంచరీలు, 21 అర్ధశతకాలతో 50 ప్లస్ స్కోర్లు సాధించిన వారిలో అందరికంటే ముందున్నాడు. కోహ్లి 24 అర్ధశతకాలు సాధించాడు. అయితే కోహ్లి ఇప్పటివరకు 82 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్, ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్ 17 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశారు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 16 సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. పరుగుల పరంగా చూస్తే రోహిత్ కంటే కోహ్లి ముందున్నాడు. కోహ్లి 50.80 సగటుతో 2794 పరుగులు సాధించాడు. రోహిత్ 32.62 సగటుతో 2773 పరుగులు చేశాడు. కోహ్లికి 21 పరుగుల దూరంలో నిలిచాడు. కొంతకాలంగా వీరిద్దరూ ‘టాప్’ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. ఐపీఎల్ ముగిసే వరకు టి20 అంతర్జాతీయ సిరీస్‌లు లేనందున అప్పటివరకు కోహ్లి టాప్‌లో కొనసాగనున్నాడు. (చదవండి: టీమిండియా క్లీన్‌స్వీప్) -
టీమిండియా సరికొత్త రికార్డు
హామిల్టన్: న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో టి20లో ‘సూపర్’ విజయం సాధించిన టీమిండియా కొత్త రికార్డు సృష్టించింది. టి20 చరిత్రలో ‘సూపర్’ రికార్డును తిరగరాసింది. సూపర్ ఓవర్లో ఛేజింగ్ చేస్తూ వికెట్ నష్టపోకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సరికొత్త రికార్డు లిఖించింది. ఇంతకుముందు వెస్టిండీస్ పేరిట రికార్డును బద్దలు కొట్టింది. 2012లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ సూపర్ ఓవర్ ఛేజింగ్‌లో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా సూపర్ ఓవర్లో ముందుగా కివీస్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. 18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 20 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ‘హిట్‌మాన్’ రోహిత్ శర్మ చివరి రెండు బంతులకు వరుస సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు. కాగా, ఇప్పటివరకు టి20ల్లో ఆరుసార్లు, వన్డేల్లో ఒకసారి కలిపి న్యూజిలాండ్ జట్టు మొత్తం ఏడుసార్లు సూపర్ ఓవర్ ఆడింది. అయితే ఆరుసార్లు న్యూజిలాండ్ జట్టుకు పరాజయమే ఎదురుకావడం గమనార్హం. (చదవండి: ఊహించని ప్రదర్శన.. అద్భుత విజయం) ‘సూపర్’ విశేషాలు.. ►న్యూజిలాండ్ తరఫున టిమ్ సౌతీ ఐదుసార్లు సూపర్ ఓవర్ వేయగా, నాలుగుసార్లు ఓడిపోవడం గమనార్హం. ►ఐపీఎల్, అంతర్జాతీయ టి20ల్లో కలిపి జస్ప్రీత్ బుమ్రా మూడుసార్లు సూపర్ ఓవర్ వేయగా... మూడుసార్లూ అతని జట్టునే విజయం వరించింది. ఐపీఎల్లో 2017లో గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో... 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బుమ్రా సూపర్ ఓవర్ వేశాడు. చదవండి: ఉత్కం‘టై’న మ్యాచ్‌కు సూపర్ ముగింపు -
ఉత్కం‘టై’న మ్యాచ్‌కు సూపర్ ముగింపు
‘ఆఖరి పంచ్ మనదైతే... వచ్చే కిక్కే వేరబ్బా’ ఇది బాగా పాపులర్ డైలాగ్. ఇక్కడ పొట్టి మ్యాచ్‌లో ఆ పంచ్ కివీస్‌కు పడింది. కిక్ భారత్‌కు ఎక్కింది. ఈ డైలాగ్‌ను హీరో అంటుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ... ఆస్వాదిస్తే ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఈ మ్యాచ్ చూసినోళ్లకు అనిపించక మానదు. నిజమే... మ్యాచ్ అంటే ఇది. మలుపులంటే ఇవి. మెరుపులంటే మావే అన్నట్లు ఇరు జట్లను ఉత్కంఠతో ఊపేసిన మ్యాచ్‌కు ఎవరూ ఊహించని ఫినిషింగ్ లభించింది. కోట్లాది అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టిన పోరు సిక్సర్లతో హోరెత్తింది. హామిల్టన్: ఒకతను ఆపేశాడు. మరొకతను బాదేశాడు. ఇలా ఇద్దరు సీనియర్ల దెబ్బకు కివీస్ తలకిందులైంది. రెండుసార్లు ఊహకందని విధంగా అంచనాలు తారుమారయ్యాయి. ఎంచక్కా గెలుస్తుందిలే అనుకుని ఆఖరి మజిలీకి చేరిన న్యూజిలాండ్‌ను తొలుత పేసర్ షమీ అడ్డుకున్నాడు. మ్యాచ్ ‘టై’ అయింది. సూపర్ ఓవర్ మొదలైంది. ఇక్కడా విజయావకాశాలు కివీస్‌నే ఊరిస్తే... రోహిత్ సిక్సర్లతో మార్చేశాడు. ఈ రెండు దెబ్బలకు భారత్ మూడో టి20లోనూ గెలవడంతో పాటు... ఇంకా రెండు మ్యాచ్‌లుండగానే 3–0తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. న్యూజిలాండ్ గడ్డపై భారత్‌కు ఇదే తొలి పొట్టి సిరీస్ కావడం విశేషం. గతంలో రెండు సార్లు ఆతిథ్య జట్టుకే సిరీస్ సమర్పించుకుంది. ఆఖరిదాకా అత్యుత్తమ పోరాటం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో గెలుపొందింది. మొదట భారత్ నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్ కోహ్లి (27 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. బెన్నెట్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత కివీస్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి సరిగ్గా 179 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 95; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత పోరాటం చేశాడు. కానీ ఒత్తిడిని ఎదుర్కోలేక చిత్తయ్యాడు. శార్దుల్, షమీలకు రెండేసి వికెట్లు దక్కాయి. ‘సిక్సర’ పిడుగు రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నాలుగో టి20 శుక్రవారం వెల్లింగ్టన్లో జరుగుతుంది. దంచేసిన రోహిత్... టాస్ నెగ్గిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన రోహిత్ భారత ఇన్నింగ్స్‌కు మూలస్తంభమయ్యాడు. రాహుల్‌తో కలిసి చకచకా పరుగులు జత చేశాడు. దీంతో ఆరు ఓవర్లలోనే భారత్ 50 పరుగులకు చేరింది. బెన్నెట్ వేసిన ఈ ఓవర్‌ను రోహిత్ 1, 6, 6, 4, 4, 6తో దంచేశాడు. ఇందులో ఆ ఒక్కటీ రాహుల్దైతే... విధ్వంసం రోహిత్‌ది. దీంతో ఈ ఒక్క ఓవర్లోనే 27 పరుగులు లభించాయి. రోహిత్ శర్మ అర్ధసెంచరీ 23 బంతుల్లో (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూర్తయ్యింది. ధాటిగా సాగిపోతున్న ఈ ఓపెనింగ్ జోడీని ఎట్టకేలకు రాహుల్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్)ని ఔట్‌చేయడం ద్వారా గ్రాండ్‌హోమ్ విడగొట్టాడు.89 పరుగుల వద్ద తొలివికెట్‌ను కోల్పోయిన భారత్ మరో 7 పరుగుల వ్యవధిలో రోహిత్, శివమ్ దూబే (3) వికెట్లను కోల్పోయింది. ఒకే ఓవర్లో బెన్నెట్ ఆ ఇద్దరి వికెట్లను పడేశాడు. తర్వాత కెపె్టన్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 17; 1 ఫోర్), మనీశ్ పాండే (6 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) జట్టు స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. విలియమ్సన్ వీరోచితం... అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కూడా వేగంగానే పరుగులు జతచేసింది. బుమ్రా బౌలింగ్‌లో గప్టిల్ (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కానీ ధాటిలో మన్రో (14; 2 ఫోర్లు) వెనుకబడ్డాడు. గప్టిల్ జోరుకు శార్దుల్ తెరదించగా, మన్రోను జడేజా అవుట్ చేశాడు. ఆరో ఓవర్లోనే జట్టు స్కోరు 50కి చేరినా... కీలక వికెట్లను కోల్పోయింది. అయినప్పటికీ కెపె్టన్ కేన్ విలియమ్సన్ మాత్రం క్రీజులోకి వచ్చినప్పటినుంచే దంచేసే పనిలో పడ్డాడు. బుమ్రా, చహల్, షమీ, జడేజా ఎవరు బౌలింగ్‌కు దిగినా బౌండరీలు, సిక్సర్లు బాదకుండా విడిచిపెట్టలేదు. ఈ క్రమంలోనే అతను 28 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. 12.4 ఓవర్లలో జట్టు స్కోరు వందకు చేరింది. సాన్‌ట్నర్ (9), గ్రాండ్‌హోమ్ (5) తక్కువ స్కోర్లకే నిష్క్రమించినా ...కెప్టెన్ దూకుడుతో ఆ ప్రభావం స్కోరుపై పడలేదు. జోరును ఆపలేదు! టేలర్ (10 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) అండతో కేన్ జట్టును విజయతీరాలకు తీసుకొచ్చాడు. సెంచరీకి అతను, విజయానికి జట్టు చేరువైనా... షమీ అద్భు త బౌలింగ్‌తో ఏ ఒక్కటీ జరగలేదు. 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన 20వ ఓవర్‌ను వైవిధ్యమైన బంతులతో నియత్రించాడు. ఆఖరి 4 బంతుల్లో అయితే వాళ్లిద్దరినీ ఔట్ చేసిన షమీ ఒక పరుగు మాత్రమే ఇవ్వడంతో స్కోరు సమమై మ్యాచ్ ‘టై’ అయింది. ఈ మ్యాచ్‌లో రో‘హిట్స్’, షమీ బౌలింగ్‌తో భారత్ గెలిచినప్పటికీ ఫీల్డింగ్‌లో తడబడింది. విలువైన క్యాచ్‌లు చేజార్చిన భారత ఫీల్డర్లు దూబే, జడేజా చిత్రంగా తేలికపాటి బౌండరీల్ని ఆపలేకపోయారు. దీంతో ఒక పరుగొచ్చే చోట 4 పరుగులు ప్రత్యర్థి స్కోరుకు జతయ్యాయి. షమీ ఆఖరి ఓవర్లో ఆపేశాడు... ఆఖరి ఓవర్ వేసిన షమీ కివీస్‌ను ఆపేశాడు. అద్భుతమైన బౌలింగ్‌తో గెలుపు దారిని మూసేశాడు. 6 బంతుల్లో 9 పరుగులతో గెలిచే చోట తొలి రెండు బంతులకు సిక్స్ సహా 7 పరుగులిచ్చాడు. మిగిలిన బంతులు నాలుగైతే.. చేయాల్సిన పరుగులు రెండే! కానీ షమీ ఇచ్చింది ఒకటే పరుగు. తీసింది రెండు వికెట్లు. మూడో బంతికి విలియమ్సన్, ఆఖరి బంతికి రాస్ టేలర్ ఔట్. మ్యాచ్ ‘టై’... రోహిత్ ఆఖరి బంతుల్లో ఆరేశాడు... సూపర్ ఓవర్లో భారత్ విజయానికి 18 పరుగులు చేయాలి. కానీ రోహిత్, రాహుల్ ఇద్దరు చెరో 2 బంతులాడి ఎనిమిదే చేశారు. ఇక గెలవాలంటే చివరి రెండు బంతుల్లో 10 చేయాలి. క్రీజ్‌లో ‘హిట్‌మ్యాన్’ ఉన్నాడు. సౌతీ యార్కర్ ప్రయత్నం విఫలం కాగా... రోహిత్ బ్యాట్ ఝుళిపించాడు. లాంగాన్‌లో సిక్స్. ఆఖరి బంతికి 4 కావాలి. ఈసారి లాంగాఫ్‌లో సిక్స్. అంతే భారత్‌కు మూడో మ్యాచ్ గెలుపుతో పాటు సిరీస్ కూడా దక్కింది. ►6 ఇప్పటివరకు టి20ల్లో ఆరుసార్లు, వన్డేల్లో ఒకసారి కలిపి న్యూజిలాండ్ జట్టు మొత్తం ఏడుసార్లు సూపర్ ఓవర్ ఆడింది. అయితే ఆరుసార్లు న్యూజిలాండ్ జట్టుకు పరాజయమే ఎదురైంది. ►న్యూజిలాండ్ తరఫున టిమ్ సౌతీ ఐదుసార్లు సూపర్ ఓవర్ వేశాడు. ఇందులో నాలుగుసార్లు ఓడిపోవడం గమనార్హం. ►ఐపీఎల్, అంతర్జాతీయ టి20ల్లో కలిపి జస్ప్రీత్ బుమ్రా మూడుసార్లు సూపర్ ఓవర్ వేయగా... మూడుసార్లూ అతని జట్టునే విజయం వరించింది. ఐపీఎల్లో 2017లో గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో... 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బుమ్రా సూపర్ ఓవర్ వేశాడు. ►న్యూజిలాండ్ గడ్డపై భారత్ టి20 సిరీస్‌ను గెలవడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌లో భారత్ 2009లో 0–2తో... 2019లో 1–2తో టి20 సిరీస్‌లను చేజార్చుకుంది. ►ఒక దశలో ఓటమి ఖాయమనుకున్నా. కేన్ బాగా ఆడాడు. కానీ దురదృష్టం. సెంచరీకి చేరువై 95 దగ్గర ఔటైతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. చివరి బంతినెలా వేయాలనే దానిపై తర్జనభర్జన పడ్డాం. వికెట్లకు సూటిగా వేస్తే సరే కానీ... బ్యాట్‌కు తగిలితే ఆ ఒక్క పరుగు ఎలాగైనా వస్తుందనే బెంగ కూడా ఉంది. రోహిత్ ఇన్నింగ్స్‌లో, సూపర్ ఓవర్లో చెలరేగాడు. అతనొక బంతిపై విరుచుకుపడితే మరో బంతి వేసే సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతాడని అనుకున్నాం. సిరీస్ గెలిచాం. ఇక క్లీన్ స్వీపే మా లక్ష్యం. –భారత కెప్టెన్ కోహ్లి ►నేనెప్పుడూ సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు రాలేదు. ఎలా మొదలెట్టాలో కూడా తెలియని పరిస్థితి. తొలి బంతినుంచే బాదాలా లేక సింగిల్ తీయాలో కూడా తెలియదు. కానీ మొత్తానికి మంచి ప్రదర్శన కనబరిచాను. చాలాసేపు క్రీజులో ఉండాలని భావించిన నేను అలా ఔట్ కావడం కాస్త నిరాశపరిచింది. –భారత ఓపెనర్ రోహిత్ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి)సౌతీ (బి) బెన్నెట్ 65; రాహుల్ (సి) మన్రో (బి) గ్రాండ్‌హోమ్ 27; దూబే (సి) సోధి (బి) బెన్నెట్ 3; కోహ్లి (సి) సౌతీ (బి) బెన్నెట్ 38; అయ్యర్ (స్టంప్డ్) సిఫెర్ట్ (బి) సాన్‌ట్నర్ 17; పాండే (నాటౌట్) 14; జడేజా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–89, 2–94, 3–96, 4–142, 5–160. బౌలింగ్: సౌతీ 4–0–39–0, బెన్నెట్ 4–0–54–3, కుగెలెజిన్ 2–0–10–0, సాన్‌ట్నర్ 4–0–37–1, సోధి 4–0–23–0, గ్రాండ్ హోమ్ 2–0–13–1 న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) సబ్–సామ్సన్ (బి) శార్దుల్ 31; మన్రో (స్టంప్డ్) రాహుల్ (బి) జడేజా 14; విలియమ్సన్ (సి) రాహుల్ (బి) షమీ 95; సాన్‌ట్నర్ (బి) చహల్ 9; గ్రాండ్‌హోమ్ (సి) దూబే (బి) శార్దుల్ 5; టేలర్ (బి) షమీ 17; సిఫెర్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–47, 2–52, 3–88, 4–137, 5–178, 6–179. బౌలింగ్: శార్దుల్ 3–0–21–2, షమీ 4–0–32–2, బుమ్రా 4–0–45–0, చహల్ 4–0–36–1, జడేజా 4–0–23–1, దూబే 1–0–14–0. -
పాక్‌ను గెలిపించిన షోయబ్ మాలిక్
లాహోర్: అంతర్జాతీయ టి20ల్లో ఎదురవుతోన్న వరుస పరాజయాలకు పాకిస్తాన్ ఫుల్స్టాప్ పెట్టింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (39; 4 ఫోర్లు, సిక్స్), మొహమ్మద్ నైమ్ (43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. అనంతరం ఛేదనకు దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. పునరాగమనంలో తొలి టి20 ఆడుతున్న పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ (45 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించడంతో... పాక్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. మాలిక్ చివరి టి20ని 2019 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో ఆడాడు. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ తరఫున హసన్ అలీ, హరీస్ రౌఫ్‌లు టి20ల్లో అరంగేట్రం చేశారు. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా రెండో టి20 ఇక్కడే నేడు జరుగుతుంది. -
‘కష్టమే అనుకున్నాం.. కానీ కళ్లు చెదిరే క్యాచ్’
సిడ్నీ : క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫీల్డర్ మైదానంలో చురుగ్గా కదిలి అందివచ్చిన క్యాచ్‌ను ఒడిసి పట్టుకుంటేనే ఫలితం ఆశాజనకంగా ఉంటుంది. అయితే, ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో కొన్నిసార్లు బంతిని అంచనా వేయలేకపోవచ్చు. దాంతో అటు క్యాచ్, ఇటు మ్యాచ్ ప్రత్యర్థి వశం అయ్యే ప్రమాదం ఉంటుంది. లేదంటే పరుగులు సమర్పించుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్‌లో శనివారం అద్భుతమైన క్యాచ్ సన్నివేశమొకటి ఆవిష్కృతమైంది. సిడ్నీ థండర్, హోబర్ట్ హారికేన్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో.. హొబర్ట్ ఆటగాడు నాథన్ ఎల్లిస్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. సిడ్నీ థండర్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా ఆట 12వ ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా కొట్టిన భారీ షాట్ గాల్లోకి లేచి వేగంగా బౌండరీ లైన్ వైపు దూసుకొచ్చింది. బంతి క్యాచ్ పడుదామని నాథన్ ముందుకు కదిలాడు. కానీ, అతని అంచనా తప్పింది. బంతి తక్కువ ఎత్తులో అతని వైపు రాసాగింది. చాకచక్యంగా వ్యవహరించిన నాథన్.. మోకాళ్లపై కూర్చుని క్యాచ్ పట్టేందుకు యత్నించాడు. అయితే, అంచనాలు తలక్రిందులు చేస్తూ.. బంతి అతని పైనుంచి వెళ్లింది. వెంటనే అలర్టయిన నాథన్ మోకాళ్లపైనే కూర్చుని రెండు చేతులు పైకి చాచడం.. బంతి అతని చేతిలో పడటం చకచక జరిగిపోయాయి. దీంతో 35 పరుగులు చేసిన ఓపెనర్ ఖవాజా పెవిలియన్ చేరక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో హోబర్ట్‌పై థండర్ విజయం సాధించింది. నాథన్ క్యాచ్ వీడియోపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. చేజారిందనుకున్న క్యాచ్‌ను నాథన్ చక్కగా ఒడిసిపట్టాడని నెటిజన్లు పేర్కొన్నారు. -
పొరబడి.. తేరుకుని చేతుల్లో బంధించాడు
-
లాంఛనం పూర్తయింది
ఊహించిన ఫలితమే..! దుర్బేధ్యమైన భారత జట్టు ముందు నిలవడం శ్రీలంకకు సాధ్యం కాదని మళ్లీ తేలిపోయింది. కనీస పోరాటపటిమ కూడా లేకుండా ప్రత్యర్థి చేతులెత్తేయడంతో కోహ్లి సేన ఖాతాలో మరో సిరీస్ విజయం చేరింది. ముందుగా బ్యాటింగ్‌లో సమష్టి ప్రదర్శనతో భారీ స్కోరు చేసి ఆపై పదునైన బౌలింగ్‌తో చెలరేగిన టీమిండియా సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత మ్యాచ్‌లాగే చివరి టి20లోనూ పేలవంగా ఆడిన లంక భారత గడ్డపై ఓటమి లాంఛనాన్ని పూర్తి చేసుకుంది. 2008లో శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన తర్వాత లంకతో మూడు ఫార్మాట్లలో కలిపి 19 సిరీస్‌లతో తలపడిన భారత్ 17 గెలవగా, మరో 2 ‘డ్రా’ అయ్యాయి. ఓడిపోవడానికే వచ్చామన్నట్లుగా తాజా పర్యటనలో మలింగ బృందం ఆడగా, భారత్ ఆధిపత్యం ఎలాంటిదో స్పష్టంగా కనిపించింది. పుణే: కొత్త ఏడాదిని మరో సిరీస్ విజయంతో భారత్ ప్రారంభించింది. శ్రీలంకతో ముగిసిన మూడు మ్యాచ్‌ల టి20 పోరును టీమిండియా 2–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి టి20లో భారత్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (36 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్), శిఖర్ ధావన్ (36 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 65 బంతుల్లోనే 97 పరుగులు జోడించడం విశేషం. చివర్లో మనీశ్ పాండే (18 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు), విరాట్ కోహ్లి (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ (8 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) కీలక పరుగులు జోడించారు. అనంతరం శ్రీలంక 15.5 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. ధనంజయ డిసిల్వా (36 బంతుల్లో 57; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, ఏంజెలో మాథ్యూస్ (20 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 37 బంతుల్లో 68 పరుగులు జత చేశారు. అయితే ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ మినహా మిగతావారిలో ఒక్కరూ కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. నవదీప్ సైనీకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం లభించింది. ధావన్ జోరు... వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటూ తీవ్ర ఒత్తిడిలో ఉన్న ధావన్ కీలక సమయంలో ధాటైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 1 పరుగు వద్దే తను ఇచి్చన క్యాచ్‌ను షనక వదిలేయడంతో బతికిపోయిన భారత ఓపెనర్ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. మలింగ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన అతను, లాహిరు వేసిన తర్వాతి ఓవర్లోనూ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. హసరంగ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్‌తో శిఖర్ కొట్టిన సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలో 34 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే ఆ వెంటనే అతను మరో భారీషాట్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగాడు. రాహుల్ ఫామ్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. మాథ్యూస్ ఓవర్లో రెండు ఫోర్లతో దూకుడు మొదలు పెట్టిన అతను ధనంజయ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. 34 బంతుల్లోనే రాహుల్ కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే సందకన్ బౌలింగ్‌లో కుశాల్ స్టంపింగ్‌కు రాహుల్ వెనుదిరగాల్సి వచి్చంది. ఆకట్టుకున్న పాండే... తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యం తర్వాత భారత్ 25 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. నాలుగున్నరేళ్ల తర్వాత భారత్ తరఫున ఆడిన సంజు సామ్సన్ (6) అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోగా, శ్రేయస్ అయ్యర్ (4) విఫలమయ్యాడు. ఈ దశలో పాండే తన ఆటతో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. తన బలమైన బ్యాక్‌ఫుట్‌పై నియంత్రణతో ఆడుతూ అతను ముచ్చటైన బౌండరీలు కొట్టాడు. ఆరో స్థానంలో బరిలోకి దిగిన కోహ్లి కూడా తనదైన శైలిలో వేగంగా పరుగులు జోడించాడు. వీరిద్దరు 28 బంతుల్లో 42 పరుగులు జోడించిన అనంతరం కోహ్లి రనౌటయ్యాడు. సుందర్ (0) తొలి బంతికే అవుట్ కాగా, చివర్లో శార్దుల్ మెరుపు బ్యాటింగ్‌తో భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. కుమార వేసిన ఆఖరి ఓవర్లోనే భారత్‌కు 20 పరుగులు వచ్చాయి. పాండే, శార్దుల్ 14 బంతుల్లోనే అభేద్యంగా 37 పరుగులు జత చేశారు. ఇద్దరు మినహా... భారీ లక్ష్యఛేదనలో ఎప్పటిలాగే శ్రీలంక తడబడింది. పవర్‌ప్లే ముగిసేలోపే జట్టు నాలుగు వికెట్లు చేజార్చుకుంది. తొలి ఓవర్లోనే గుణతిలక (1)ను బుమ్రా అవుట్ చేయగా, శార్దుల్ వేసిన తర్వాతి ఓవర్లో అవిష్క (9) వెనుదిరిగాడు. పాండే చక్కటి ఫీల్డింగ్‌కు ఒషాడా (2) రనౌట్ కాగా...సైనీ అద్భుత యార్కర్‌తో కుశాల్ పెరీరా (7) స్టంప్స్‌ను పడగొట్టాడు. ఈ స్థితిలో మాథ్యూస్, ధనంజయ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత టి20 బరిలోకి దిగిన సీనియర్ మాథ్యూస్ కొన్ని చూడచక్కటి షాట్లు బాదాడు. ముఖ్యంగా సుందర్ ఓవర్లో మాథ్యూస్ రెండు భారీ సిక్సర్లు, ఫోర్ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. అయితే సుందర్ తర్వాతి ఓవర్లో మరో సిక్స్ కొట్టిన అనంతరం భారీ షాట్‌కు ప్రయతి్నంచి మాథ్యూస్ అవుటయ్యాడు. మరోవైపు ధనంజయ ఎదురుదాడి బ్యాటింగ్ కూడా ఆకట్టుకుంది. సైనీ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను చహల్ బౌలింగ్‌లో లాంగాఫ్ మీదుగా బాదిన సిక్సర్ లంక ఇన్నింగ్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. 31 బంతుల్లోనే ధనంజయ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 29 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయి శ్రీలంక ఓటమిని ఆహ్వానించింది. *భారత కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లి 11 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. పాంటింగ్ (252)ను అధిగమించి అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో (196) ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. *భారత్ తరఫున టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా (53) నిలిచాడు. అశ్విన్ (52), చహల్ (52) ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్నారు. *భారత్ ఇప్పటివరకు కనీసం మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లు 15 ఆడింది. 13 గెలిచింది. ఒక దానిని ‘డ్రా’ చేసుకుంది. ఒకే ఒక్క సిరీస్‌ను (2019లో కివీస్ చేతిలో) కోల్పోయింది. -
పిచ్‌పై ‘ముగ్గు’ వేస్తున్న విరాట్ కోహ్లి!!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పిచ్‌పై.. ‘మొక్కలు నాటుతున్నాడా... లేదా ముగ్గు వేస్తున్నాడా... అదీ కాదంటే మేస్త్రీలా పిచ్‌పై కాంక్రీట్ వేస్తున్నాడా’ అంటూ నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. కోహ్లి ఫన్నీ మీమ్స్‌తో హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింటా చక్కర్లు కొడతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. గువాహటి బార్సపర స్టేడియంలో శ్రీలంకతో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వర్షం అనంతరం విరాట్ పిచ్‌ను పరిశీలిస్తున్న ఫొటోను భారత క్రికెట్ కౌన్సిల్ బోర్టు(బీసీసీఐ) ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ‘తదుపరి తనిఖీ సాయంత్రం 9:30 గంటలకు’ అంటూ షేర్ చేసిన విరాట్ ఫొటోకి నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ను జోడించి తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కోహ్లి విత్తనాలు నాటుతున్నట్లు, రంగోలి దిద్దుతున్నట్లుగా మీమ్స్ క్రియేట్ చేసి సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇక విరాట్ ముగ్గు వేస్తుంటే అతని భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ పక్కనే కుర్చుని చూస్తున్న మీమ్ ప్రతీ ఒక్కరిని తెగ ఆకట్టుకుంటుంది. Waiting for the pitch to dry like :#INDvSL #INDvsSL pic.twitter.com/uKpJFFcwsu — OM Rajpurohit (@omrajguru) January 5, 2020 చదవండి: మెరుపుల్లేవ్... చినుకులే! -
మిషన్ వరల్డ్ కప్
-
కిర్రాక్ పుట్టించాడే!
విరాట్ కోహ్లి తన అది్వతీయ బ్యాటింగ్‌తో హైదరాబాద్ ప్రేక్షకుల మనసుల్లో కిర్రాక్ పుట్టించాడు. ఛేదనలో మళ్లీ మొనగాడిగా నిలిచాడు. బౌలర్లను కనిపెట్టుకునే ఉప్పల్ పిచ్ తొలి అంతర్జాతీయ టి20లో మాత్రం పరుగుల ఉప్పెనలా మారింది. ముందు రాహుల్ మెరుపులకు తోడుగా నిలిచిన కోహ్లి ఆ తర్వాత అన్నీ తానై గెలిపించాడు. సాక్షి, హైదరాబాద్: కోహ్లి అలసటెరుగని పోరాటంతో భారత్‌ను గెలిపించాడు. అతను కడదాకా నిలిచాడు. కసిదీరా బంతుల్ని కొట్టాడు. దీంతో ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లే కాదు బంతి కూడా దెబ్బమీద దెబ్బలతో విసిగిపోయింది. విరాట్ ఆఖరిదాకా నిలువడంతో కొండంత లక్ష్యం కూడా చిన్నబోయింది. శుక్రవారం జరిగిన తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (50 బంతుల్లో 94 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) విశ్వరూపంతో కరీబియన్ల భరతం పట్టాడు. ముందుగా వెస్టిండీస్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీస్కోరు చేసింది. హెట్‌మైర్ (41 బంతుల్లో 56; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), లూయిస్ (17 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగారు. భారత బౌలర్లలో చహల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ (40 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. ఈ విజయంతో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య ఆదివారం తిరువనంతపురంలో రెండో టి20 జరుగుతుంది. విరుచుకుపడిన లూయిస్... టాస్ నెగ్గిన కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో విండీస్ పరుగులు మొదలుపెట్టగా... ఓపెనర్ ఎవిన్ లూయిస్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్, సిక్సర్‌తో ఎదురుదాడికి దిగాడు. అయితే దీపక్ చాహర్ బౌలింగ్‌కు దిగీదిగగానే విండీస్ ఓపెనర్ సిమన్స్ (2) వికెట్‌ను పడేశాడు. క్రీజ్‌లోకి బ్రాండన్ కింగ్ రాగా... విండీస్ జోరు అంతకంతకూ పెరిగింది. చాహర్ మరుసటి ఓవర్లో లూయిస్ 6, 4 కొడితే, కింగ్ కూడా ఓ సిక్సర్ బాదాడు. ధాటిగా ఆడుతున్న లూయిస్‌ను సుందర్ ఎల్బీగా అవుట్ చేశాడు. హెట్‌మైర్ అర్ధసెంచరీ తర్వాత క్రీజ్‌లోకి దిగిన ప్రతీ ఒక్కరూ బాదేయడంతో విండీస్ స్కోరు ఏ దశలోనూ 10 పరుగుల సగటుకు పడిపోలేదు. హెట్‌మైర్, కింగ్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) చకచకా పరుగులు సాధించారు. పదో ఓవర్ పూర్తికాకముందే జట్టు స్కోరు వందకు చేరింది. దూకుడుగా ఆడుతున్న కింగ్ జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. తర్వాత హెట్‌మైర్‌కు కెపె్టన్ పొలార్డ్ జతయ్యాడు. ఇద్దరు మెరుపులు మెరిపించడంతో స్కోరు వేగం మరింత పుంజుకుంది. హెట్‌మైర్ 35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇద్దరిని ఒకే ఓవర్లో స్పిన్నర్ చహల్ ఔట్ చేయడంతో... హోల్డర్ (24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రామ్‌దిన్ (11 నాటౌట్) జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు. రాహుల్ జిగేల్ లక్ష్యం కష్టసాధ్యమే అయినా... ఛేదనకు తగ్గట్లుగానే బ్యాట్‌కు పనిచెప్పారు భారత బ్యాట్స్‌మెన్. రాహుల్ వేగంగా ఆడాడు. రెండో ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. రోహిత్ శర్మ (8) విఫలమైనప్పటికీ తర్వాత కెపె్టన్ కోహ్లి జతకావడంతో భారత్ లక్ష్యంవైపు పరుగు పెట్టింది. ఆరో ఓవర్లో జట్టు 50 పరుగులు చేసింది. ఇద్దరూ వెస్టిండీస్ బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తూ పటిష్టమైన భాగస్వామ్యానికి బాట వేశారు. 11.4 ఓవర్లలో భారత్ 100 పరుగులను చేరుకుంది. కాసేపటికే రాహుల్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో అర్ధసెంచరీ సాధించాడు. రెండో వికెట్‌కు కోహ్లి, రాహుల్ 100 పరుగులు జోడించారు. అనంతరం భారీషాట్‌కు యతి్నంచి రాహుల్ ని్రష్కమించాడు. విరాట్... ధనాధన్... పెద్ద లక్ష్యం ముందుండగా... హిట్‌మ్యాన్ (రోహిత్) చేతులెత్తేయగా... విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌కు మూలస్తంభమయ్యాడు. 200 పైచిలుకు లక్ష్యం కావడంతో తన వికెట్ విలువ ఏంటో తెలుసుకొని ఆడాడు. రాహుల్ చెలరేగేందుకు ఊతమిచ్చిన భారత కెపె్టన్ జట్టు గెలిచేదాకా క్రీజ్‌ను అంటిపెట్టుకున్నాడు. రాహుల్ జోరులో వెనుకబడినట్లు కనిపించిన కోహ్లి... అతను ఔటయ్యాక మాత్రం అంతా తానై ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 10వ ఓవర్ ముగిసే సమయానికి రాహుల్ (46) చేసిన పరుగుల్లో కోహ్లి (20) సగమైనా చేయలేదు. కానీ మూడు ఓవర్ల వ్యవధిలోనే అతన్ని సమీపించాడు. హోల్డర్ వేసిన 11, 15వ ఓవర్లలో వరుసగా 6, 4 బాదిన కోహ్లి మ్యాచ్ సాగేకొద్దీ కసిదీరా బ్యాట్ ఝళిపించాడు. విలియమ్స్నూ అదే తరహాలో (4, 6) శిక్షించాడు. రిషభ్ పంత్ (18), శ్రేయస్ అయ్యర్ (4)పెద్ద స్కోర్లేమీ చేయలేకపోయినా... విలియమ్స్ 19వ ఓవర్లో మరో 2 సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు. 2017లో కింగ్‌స్టన్‌లో జరిగిన టి20 మ్యాచ్ సందర్భంగా కోహ్లిని ఔట్ చేసినపుడు విలియమ్స్ చేసుకున్న ‘నోట్‌బుక్ స్టయిల్’ సంబరాన్ని... ఇప్పుడు విలియమ్స్ బౌలింగ్‌లో సిక్స్‌లు బాదినపుడు కోహ్లి కూడా అదే శైలీని అనుకరించిమరీ సంబరం చేసుకున్నాడు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: సిమన్స్ (సి) రోహిత్ (బి) చాహర్ 2; లూయిస్ (ఎల్బీ) (బి) సుందర్ 40; కింగ్ (స్టంప్డ్) పంత్ (బి) జడేజా 31; హెట్‌మైర్ (సి) రోహిత్ (బి) చహల్ 56; పొలార్డ్ (బి) చహల్ 37; హోల్డర్ (నాటౌట్) 24; రామ్‌దిన్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5›వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–13, 2–64, 3–101, 4–172, 5–173. బౌలింగ్: సుందర్ 3–0–34–1, చాహర్ 4–0–56–1, భువనేశ్వర్ 4–0– 36–0, జడేజా 4–0– 30– 1, చహల్ 4–0–36–2, దూబే 1–0– 13–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) హెట్‌మైర్ (బి) పియర్ 8; రాహుల్ (సి) పొలార్డ్ (బి) పియర్ 62; కోహ్లి (నాటౌట్) 94; పంత్ (సి) హోల్డర్ (బి) కాట్రెల్ 18; శ్రేయస్ (సి అండ్ బి) పొలార్డ్ 4; శివమ్ దూబే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–30, 2–130, 3–178, 4–193. బౌలింగ్: కాట్రెల్ 4–0–24–1, హోల్డర్ 4–0–46–0, పియర్ 4–0–44– 2, వాల్‡్ష 2–0–19–0, విలియమ్స్ 3.4–0–60–0, పొలార్డ్ 1–0–10–1. ►1 అంతర్జాతీయ టి20ల్లో భారత్‌కిదే అత్యధిక ఛేదన. గతంలో శ్రీలంకపై (207–మొహాలీలో, 2009); ఆస్ట్రేలియాపై (202–రాజ్‌కోట్‌లో, 2013) చేసిన ఛేజింగ్స్ వెనక్కి వెళ్లాయి. ►5 అంతర్జాతీయ టి20ల్లో ఐదుసార్లు ఛేజింగ్‌లో 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేసి విజయం సాధించిన తొలి జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. ►94 భారత కెపె్టన్ కోహ్లి అంతర్జాతీయ టి20ల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లి అత్యధిక వ్యక్తిగత స్కోరు 90 నాటౌట్ (2016లో అడిలైడ్‌లో ఆ్రస్టేలియాపై) ఉండేది. కోహ్లి గేర్ మారిందిలా... ►1–10 బంతులు: ►7 పరుగులు ►11–20 బంతులు: ►13 పరుగులు ►21–30 బంతులు: ►19 పరుగులు ►31–40 బంతులు: ►28 పరుగులు ►41–50 బంతులు: ►27 పరుగులు -
సరదాగా కాసేపు...
ఉప్పల్ మైదానం టి20 ఫైట్‌కు సిద్ధమైంది. భారత్, వెస్టిండీస్‌ల మధ్య శుక్రవారం జరగనున్న తొలి మ్యాచ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.గురువారం స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ వారితో సరదాగా మాట్లాడారు. రోహిత్ శర్మ,యజువేంద్ర చహల్, రిషబ్‌పంత్‌లతో ముచ్చటించిన ఈ భారత మాజీ కెప్టెన్‌యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేశారు. -
సిటీలో క్రికెట్ ఫీవర్.. వెబ్సైట్లు పనిచేయక ట్రబుల్స్
సాక్షి,సిటీబ్యూరో: భారత్– వెస్టిండీస్‌ల తొలి 20–20 క్రికెట్ మ్యాచ్ కోసం నగరం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ ఆర్జీఏ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ తరఫున కోహ్లీతో పాటు టాప్ స్టార్ ఆటగాళ్లంతా అడనుండడంతో ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కనీస టికెట్టు ధరను రూ.800గా నిర్థారించి ఆపై రూ.1000 నుంచి రూ.12500 నిర్ణయించారు. వీటి అమ్మకాలను టికెట్స్ ఈవెంట్ డాట్ ఇన్, ఈవెంట్స్ నౌ, పేటీఎం యాప్‌ల ద్వారా అందుబాటులోకి తెచ్చారు. అయితే, కొన్ని వెబ్‌సైట్స్ ఓపెన్ కాకపోవటంతో దళారులు బ్లాక్ మార్కెట్లో టికెట్ల బేరాలు మొదలుపెట్టారని పోలీస్‌లకు బుధవారం ఫిర్యాదులు అందాయి. మరోపైపు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు నగరం వేదిక కావడంతో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం నుంచే స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఉప్పల్ పరిసరాలను నిఘా నీడలో ఉంచారు. -
చివరి టి20లో బంగ్లాదేశ్ చిత్తు
-
చహర్ సిక్సర్... భారత్ విన్నర్
నాగ్‌పూర్‌లో అద్భుతం జరిగింది. బంగ్లాదేశ్ చేతిలో టి20 సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడిన సమయంలో టీమిండియా తీవ్ర ఒత్తిడి మధ్య ఉవ్వెత్తున లేచింది. 43 బంతుల్లో 65 పరుగులు చేస్తే గెలిచే స్థితిలో నిలిచిన బంగ్లాదేశ్‌ను కుప్పకూల్చి ఒక్కసారిగా తన స్థాయిని ప్రదర్శించి పరువు నిలబెట్టుకుంది. 34 పరుగుల వ్యవధిలో మిగిలిన 8 వికెట్లు తీసి సొంతగడ్డపై దర్జాగా సిరీస్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ కీలక దశలో రెండు ప్రధాన వికెట్లు తీసి శివమ్ దూబే విజయానికి బాటలు వేస్తే... ఏకంగా 6 వికెట్ల ప్రదర్శనతో దీపక్ చహర్ అదరగొట్టాడు. చహర్ ప్రదర్శన అంతర్జాతీయ టి20ల్లో అత్యుత్తమం కాగా, భారత్ తరఫున టి20ల్లో తొలి హ్యాట్రిక్ తీసిన అరుదైన బౌలర్‌గా కూడా అతను నిలిచాడు. తన 3వ ఓవర్ చివరి బంతికి వికెట్ తీసిన చహర్... నాలుగో ఓవర్ తొలి రెండు బంతులకు వికెట్లు పడగొట్టి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. అంతకుముందు శ్రేయస్ అయ్యర్, రాహుల్ అర్ధసెంచరీలతో టీమిండియా స్కోరులో ప్రధాన పాత్ర పోషించారు. నాగ్‌పూర్: బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ భారత్ ఖాతాలో చేరింది. ఒక దశలో ఓడిపోతుందనుకున్న చివరి మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాక్కొని రోహిత్ సేన 2–1తో సిరీస్‌ను గెలుచుకుంది. ఆదివారం ఇక్కడి జామ్తా మైదానంలో జరిగిన పోరులో భారత్ 30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 62; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. నయీమ్ (48 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా, మిథున్ (27) సహకరించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 61 బంతుల్లో 98 పరుగులు జోడించి విజయం దిశగా నడిపించినా... భారత బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. పేసర్ దీపక్ చహర్ కేవలం 7 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... శివమ్ దూబేకు 3 వికెట్లు దక్కాయి. చహర్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘సిరీస్’ అవార్డులు దక్కాయి. ఓపెనర్లు విఫలం... రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ (2)ను అవుట్ చేసి షఫీయుల్ తన జట్టుకు శుభారంభం అందించాడు. లోపలికి దూసుకొచ్చిన బంతిని రోహిత్ వికెట్లపైకి ఆడుకోగా ఈ ఓవర్లో పరుగులేమీ రాలేదు. సిరీస్‌లో ఇదే తొలి మెయిడిన్ ఓవర్ కావడం విశేషం. కొన్ని చక్కటి షాట్లు ఆడినా... మరోసారి శిఖర్ ధావన్ (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. రాహుల్ జోరు... మూడో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్ బ్యాట్ నుంచి చూడచక్కటి బౌండరీలు జాలువారాయి. షఫీయుల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను, ముస్తఫిజుర్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టి ప్రత్యర్థి ప్రధాన బౌలర్ లయ దెబ్బ తీశాడు. 33 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే మరో రెండు బంతులకే మిడాఫ్‌లో క్యాచ్ ఇచ్చి అతను వెనుదిరిగాడు. శ్రేయస్ సూపర్... షఫీయుల్ బౌలింగ్‌లో ‘సున్నా’ వద్ద అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ను అమీనుల్ వదిలేశాడు. అదే అమీనుల్ ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ బాది అయ్యర్ తన బౌండరీల ఖాతా తెరవడం విశేషం. అఫీఫ్ వేసిన తర్వాతి ఓవర్లో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుసగా 6, 6, 6 బాది 27 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో లాంగాన్‌లో క్యాచ్ ఇవ్వడంతో అయ్యర్ ఇన్నింగ్స్ ముగిసింది. మరోవైపు పంత్ (6) వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. చివర్లో పాండే (13 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు), దూబే (9 నాటౌట్) కలిసి 19 బంతుల్లో 30 పరుగులు జోడించడంతో భారత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. . భారీ భాగస్వామ్యం... ఛేదనలో బంగ్లాదేశ్‌కు సరైన ఆరంభం లభించలేదు. చహర్ వేసిన మూడో ఓవర్లో ఆ జట్టు లిటన్ దాస్ (9), సౌమ్య సర్కార్ (0) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో నయీమ్ దూకుడైన ఆటతో జట్టును ఆదుకున్నాడు. అతనికి మిథున్ నుంచి చక్కటి సహకారం లభించింది. ఇదే జోడి బంగ్లాను గెలుపు తీరానికి చేరుస్తుందని భావిస్తున్న తరుణంలో చహర్ బౌలింగ్‌లో మిథున్ అవుట్ కావడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత బంగ్లా పతనం వేగంగా సాగింది. ‘హ్యాట్రిక్’ వెలుగులు దీపక్ చహర్ తన తొలి ఓవర్లో 2 వికెట్లు తీసి 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. కొంత విరామం తర్వాత మళ్లీ వచ్చి కీలకమైన మిథున్ వికెట్ తీయడంతో పాటు 4 పరుగులే ఇచ్చాడు. ఈ మూడు వికెట్ల తర్వాత తీసిన మరో మూడు వికెట్లు అతని ఖాతాలో ‘హ్యాట్రిక్’ను చేర్చాయి. 18వ ఓవర్ చివరి బంతికి షఫీయుల్ వికెట్‌ను... ఆ తర్వాత 20వ ఓవర్ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్‌లను అవుట్ చేసి చహర్ ‘హ్యాట్రిక్’తో పాటు ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ►1 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్’ తీసిన తొలి బౌలర్ దీపక్ చహర్. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 11వ బౌలర్. మలింగ (శ్రీలంక) రెండుసార్లు ‘హ్యాట్రిక్’ తీయగా... బ్రెట్ లీ (ఆస్ట్రేలియా), ఓరమ్, సౌతీ (న్యూజిలాండ్), తిసారా పెరీరా (శ్రీలంక), అష్రఫ్ (పాకిస్తాన్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), హస్నయిన్ (పాకిస్తాన్), ఖవర్ అలీ (ఒమన్), వనువా (పపువా న్యూ గినియా) ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. ►3 అశ్విన్ (52 వికెట్లు), బుమ్రా (51 వికెట్లు) తర్వాత టి20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న మూడో భారత బౌలర్ చహల్. చహల్ తక్కువ మ్యాచ్‌ల్లో (34) ఈ ఘనత సాధించాడు. ►అంతర్జాతీయ టి20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన మూడో బౌలర్ దీపక్ చహర్. ఈ ఫార్మాట్లోనే అతను అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ (6/8; జింబాబ్వేపై 2012లో... 6/16; ఆ్రస్టేలియాపై 2011లో), భారత స్పిన్నర్ చహల్ (6/25; ఇంగ్లండ్‌పై 2017లో) మాత్రమే ఆరు చొప్పున వికెట్లు తీశారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) షఫీయుల్ 2; ధావన్ (సి) మహ్ముదుల్లా (బి) షఫీయుల్ 19; రాహుల్ (సి) దాస్ (బి) అల్ అమీన్ 52; అయ్యర్ (సి) దాస్ (బి) సర్కార్ 62; పంత్ (బి) సర్కార్ 6, పాండే (నాటౌట్) 22; దూబే (నాటౌట్) 9, ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–3; 2–35; 3–94; 4–139; 5–144. బౌలింగ్: అల్ అమీన్ 4–0–22–1; షఫీయుల్ 4–1–32–2; ముస్తఫిజుర్ 4–0–42–0; అమీనుల్ 3–0–29–0; సౌమ్య సర్కార్ 4–0–29–2; అఫీఫ్ 1–0–20–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) సుందర్ (బి) చహర్ 9; నయీమ్ (బి) దూబే 81; సౌమ్య సర్కార్ (సి) దూబే (బి) చహర్ 0; మిథున్ (సి) రాహుల్ (బి) చహర్ 27; ముష్ఫికర్ (బి) దూబే 0; మహ్ముదుల్లా (బి) చహల్ 8; అఫీఫ్ (సి అండ్ బి) దూబే 0; అమీనుల్ (బి) చహర్ 9; షఫీయుల్ (సి) రాహుల్ (బి) చహర్ 4; ముస్తఫిజుర్ (సి) అయ్యర్ (బి) చహర్ 1; అల్ అమీన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 144. వికెట్ల పతనం: 1–12; 2–12; 3–110; 4–110; 5–126; 6–126; 7–130; 8–135; 9–144; 10–144. బౌలింగ్: ఖలీల్ 4–0–27–0; వాషింగ్టన్ సుందర్ 4–0–34–0; దీపక్ చహర్ 3.2–0–7–6; చహల్ 4–0–43–1; దూబే 4–0–30–3. -
రేపు భారత్ బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20
-
‘ఇది నాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం’
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న మహిళ, పురుషుల టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ వేడుక మెల్బోర్న్లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో వరల్డ్ కప్ ట్రోఫీని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది తనకు దక్కిన అరుదైన గౌరమంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇంతటి ప్రఖ్యాత కార్యక్రమంలో తను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. అలాగే మహిళా క్రికెటర్లంతా తమ కలలను సాకారం చేసుకునే దిశగా వారిని ప్రోత్సహించాలనుకుంటున్నానని చెప్పారు. ఇంతటి అంతర్జాతీయ టోర్నీలో వారు పాల్గొనడం గొప్ప విషయమని, వారు అందరికీ ఆదర్శమని ఆమె కొనియాడారు. తన మామయ్య (మన్సూర్ పటౌడీ అలీఖాన్) కూడా ప్రముఖ క్రికెటర్ అని కరీనా గుర్తు చేశారు. ప్రపంచమంతా అత్యంత ఆదరణ ఉన్న ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణకు తనను ఆహ్వనించడం తనకు దక్కిన అత్యంత గౌరవని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి8వ తేదీ వరకు మహిళా క్రికెట్ టీ-20 వరల్ కప్ జరగనుండగా.. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు పురుషుల టోర్నీ జరగనుంది. సినిమాల విషయానికి వస్తే కరీనా కపూర్ అక్షయ్ కుమార్, కైరా అద్వానిలతో కలిసి ‘గుడ్ న్యూస్’ సినిమాలో కనిపించనుంది. అలాగే అమీర్ ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’లో కూడా నటిస్తున్నారు. -
సఫారీల సంగతి తేల్చాలి
స్వదేశంలో ఏ ఫార్మాట్లోనైనా టీమిండియా ఎంత బలమైనదో అందరికీ తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా సొంతగడ్డపై సిరీస్ విజయాలు మన ఖాతాలో చేరడం లాంఛనమే. మిగతా అన్ని దేశాలపై టి20ల్లోనూ ఇదే పంథా సాగినా... దక్షిణాఫ్రికా ఒక్కటే ఇప్పటి వరకు తప్పించుకుంది. ఇరు జట్ల మధ్య భారత్‌లో ఒక్కసారే పొట్టి ఫార్మాట్ సిరీస్ జరగ్గా అందులో సఫారీలే విజయం సాధించారు. మొత్తమ్మీద మాత్రం 8–5తో గణాంకాల్లో టీమిండియాదే పైచేయిగా ఉంది. ఆదివారం నుంచి మొదలుకానున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కోహ్లి సేన కైవసం చేసుకుంటే మిగిలిపోయిన ‘ఈ ఒక్క ప్రత్యరి్థ’ సంగతీ తేలి్చనట్లవుతుంది. సాక్షి క్రీడా విభాగం టీమిండియా టి20ల అరంగేట్ర–గెలుపు బోణీ (2006 డిసెంబరు 1న) కొట్టింది దక్షిణాఫ్రికాపైనే. తర్వాత ఐసీసీ టోరీ్నలు కాక ఇరు జట్లు నాలుగు సార్లు ఈ ఫార్మాట్లో ముఖాముఖిగా తలపడ్డాయి. 2010–11; 2011–12 సఫారీ పర్యటనల్లో జరిగిన ఏకైక టి20లలో భారత్ ఒకటి గెలిచి, మరోటి ఓడింది. 2017–18 టూర్లోనూ 2–1తో నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంది. వీటి మధ్య ఒకే ఒక్కసారి మన గడ్డపై 2015–16లో ఆడిన ప్రొటీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే సిరీస్‌ను గెలవడం... గణాంకాలను మెరుగుపర్చుకునే దిశగా కోహ్లి సేనకు ఓ అవకాశం కానుంది. పైచేయి మనదే... దక్షిణాఫ్రికాతో పూర్తిస్థాయిలో జరిగిన 13 మ్యాచ్‌ల్లో భారత్ ఎనిమిదింట్లో విజయం సాధించి మంచి ఆధిక్యంలో ఉంది. వీటిలో 2007 ప్రపంచ కప్ సూపర్–8 దశ సహా 2012–13, 2013–14 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఉండటం గమనార్హం. టి20 విశ్వ సమరంలో 2009లో మాత్రమే టీమిండియా వారికి తలొంచింది. అయితే, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి నాలుగేళ్ల క్రితం నాటి పర్యటనలో పటిష్టంగా ఉన్న భారత్‌కు షాకిచి్చంది. నాడు అక్టోబరు 2న... నేటి సిరీస్ తొలి మ్యాచ్‌కు వేదిౖకైన ధర్మశాలలోనే జరిగిన పోరులో రోహిత్ శర్మ శతకం (106)తో పాటు కోహ్లి (43) రాణించడంతో టీమిండియా నిరీ్ణత ఓవర్లలో 199 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో విధ్వంసక డివిలియర్స్ (51) అర్ధసెంచరీకి డుమిని (34 బంతుల్లో 68; ఫోర్, 7 సిక్స్‌లు) మెరుపులు తోడవడంతో సఫారీలు రెండు బంతులు మిగిలి ఉండగానే గెలిచేశారు. ఇక కటక్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో బౌలర్ల ఆధిపత్యం నడిచింది. అల్బీ మోర్కెల్ (3/12)ధాటికి భారత్ 92 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా కాస్త కష్టపడినా డుమిని (30 నాటౌట్) నిలవడంతో 17.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుని నెగ్గి సిరీస్‌ను ఒడిసిపట్టింది. కోల్‌కతాలో మూడో మ్యాచ్ రద్దవడంతో భారత్‌కు ఒక్కటైనా గెలుపు దక్కనట్లయింది. అప్పటికి... ఇప్పటికి చాలా తేడా డివిలియర్స్, ఆమ్లా, డుమిని, డు ప్లెసిస్ వంటి దక్షిణాఫ్రికా దిగ్గజాలు తప్పుకొన్న నేపథ్యంలో రాబోయే సిరీస్‌లో కోహ్లి సేనే ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. కెపె్టన్‌గా డికాక్ బాధ్యతలు చేపట్టిన ప్రత్యర్థి జట్టులో మిల్లర్, రబడ మాత్రమే పేరున్న ఆటగాళ్లు. అయితే, టి20లకు తగినట్లు ఆడే డాలా, డసెన్, నోర్జెలాంటి యువకులతో సఫారీలు బలంగానే కనిపిస్తున్నారు. ఇటు భారత్‌వైపు చూస్తే 2015 సిరీస్‌లో ఆడిన ధోని, రాయుడు, రైనా, హర్భజన్, అశి్వన్ తెరమరుగయ్యారు. వారి స్థానంలో శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్, కృనాల్ పాండ్యా, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ తదితరులు వచ్చారు. దీనిప్రకారం తాజా సిరీస్ వెలుగులోకి వచ్చేందుకు రెండు జట్లలోని పలువురు కుర్రాళ్లకు ఓ వేదికగా మారనుంది. -
ఆసీస్ మహిళా క్రికెటర్ మెగాన్ షుట్ హ్యాట్రిక్
మహిళల క్రికెట్లో ఆ్రస్టేలియా పేసర్ మెగాన్ షుట్ అరుదైన ఘనతను నమోదు చేసింది. బుధవారం నార్త్‌సౌండ్‌లో వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో ఆమె ‘హ్యాట్రిక్’ సాధించింది. విండీస్ ఇన్నింగ్స్ 50వ ఓవర్ చివరి మూడు బంతులకు ఆమె మూడు వికెట్లు తీసింది. ఆసీస్‌కు వన్డేల్లో ఇదే తొలి హ్యాట్రిక్. గతేడాది భారత్‌తో ముంబైలో జరిగిన టి20 మ్యాచ్‌లో కూడా ‘హ్యాట్రిక్’ తీసిన ఘనత ఆమె సొంతం. తద్వారా అంతర్జాతీయ వన్డేలు, టి20ల్లో ‘హ్యాట్రిక్’ సాధించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా మెగాన్ షుట్ రికార్డులకెక్కింది. -
అర్జున్ టెండూల్కర్‌కు రూ. 5 లక్షలు
ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ స్థానిక లీగ్‌లో ఆడేందుకు రూ. 5 లక్షలకు అమ్ముడుపోయాడు. ముంబై టి20 లీగ్‌లో ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్టర్న్ సబర్బ్ జట్టు అతడిని రూ. 5 లక్షలకు కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్ల కేటగిరీలో ఉన్న అతని ప్రాథమిక ధర రూ. లక్ష కాగా... వేలంలో అతని కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. గరిష్ట ధర అయిన రూ. 5 లక్షలకు చేరుకోవడంతో ‘ఆపర్చునిటీ టు మ్యాచ్’ (ఓటీఎమ్) కార్డు ద్వారా కొత్త జట్లయిన ఆకాశ్ టైగర్స్, ఈగల్ థానే స్ట్రయికర్స్‌లకు అవకాశం దక్కింది. చివరకు ‘డ్రా’ తీయగా టైగర్స్ పేరు వచ్చి ంది. అర్జున్ టెండూల్కర్ ఇదివరకే భారత్ అండర్–19 జట్టు తరఫున అనధికారిక టెస్టులు ఆడాడు. అన్నట్లు... ఈ లీగ్‌కు సచినే బ్రాండ్ అంబాసిడర్! -
టెస్టులూ కావాలి మాకు!
బెంగళూరు: సంప్రదాయక టెస్టు క్రికెట్ ప్రాభవం కోల్పోతోందని... ఐదు రోజుల ఆటకు క్రమంగా కాలం చెల్లుతోందని ఈ మధ్య తరచూ వార్తలొస్తున్నాయి. కానీ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిర్వహించిన సర్వేలో మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని తేలింది. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో 86 శాతం మంది క్రికెట్ అభిమానులు టెస్టులకు జై కొట్టారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌తోపాటు తమకు టెస్టులు చూడటం కూడా ఇష్టమేనని 86 శాతం ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎంసీసీ టెస్టు క్రికెట్ సర్వేను వంద దేశాల్లో నిర్వహించింది. ఇందులో 13 వేల మంది క్రికెట్ ప్రేక్షకులు పాల్గొన్నారు. టెస్టు క్రికెట్ మరింత విజయవంతం కావడానికి ఆ అభిమానులు విలువైన సూచనలూ ఇచ్చారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లకు అందుబాటులో ఉన్న టికెట్ల వివరాల్ని, ధరతో పాటు ఆన్లైన్లో ఉంచాలి. ప్రస్తుతం ధరల వివరాలే ఉంటున్నాయి. ఎన్ని టికెట్లు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదు. ఐదు రోజుల మ్యాచ్‌ల్ని టీవీల్లో ఉచితంగా వీక్షించేందుకు (ఫ్రీ టు ఎయిర్) అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు పెయిడ్ చానళ్లలో ప్రసారమవుతున్నాయి. రోజు మొత్తానికి బదులుగా ‘హాఫ్ డే’ టిక్కెట్లు విక్రయించాలని సర్వేలో పాల్గొన్న అభిమానులు తెలిపారు. తాజా సర్వేతో టెస్టు క్రికెట్‌కూ ఆదరణ ఉందని రుజువైందని ఎంసీసీ తెలిపింది. గతేడాది సర్వేలో కూడా 70% ప్రజలు టెస్టులకు మద్దతు తెలిపారు. -
పరాజయ పరంపర ఆగేనా!
గువాహటి: వన్డేల్లో చాలా బాగా ఆడుతున్నా... టి20 క్రికెట్ మాత్రం భారత మహిళల జట్టుకు అచ్చి రావడం లేదు. వరల్డ్ కప్ సెమీఫైనల్‌తో మొదలుపెట్టి మంగళవారం ఇంగ్లండ్‌తో తొలి టి20 వరకు మన టీమ్ వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడింది. సొంతగడ్డపై కూడా జట్టుకు కలిసి రాలేదు. సిరీస్‌లో 0–1తో వెనుకబడిన దశలో భారత్ రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు జరిగే పోరులో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటి మన జట్టు సిరీస్‌ను సమం చేస్తుందా లేక జోరు మీదున్న ఇంగ్లండ్ 2–0తో సిరీస్ గెలుచుకుంటుందా అనేది ఆసక్తికరం. తొలి టి20 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. టాప్–4లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. చివర్లో శిఖా పాండే, దీప్తి శర్మ చలవతో స్కోరు అతి కష్టమ్మీద వంద పరుగులు దాటగలిగింది. ఈ నేపథ్యంలో జట్టులో ప్రతీ ఒక్కరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన గత మ్యాచ్‌లో అనూహ్యంగా విఫలమైంది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఒత్తిడి కూడా ఆమెపై పడి ఉండవచ్చు. మరో ఓపెనర్ జెమీమాతో పాటు కెరీర్లో తొలి మ్యాచ్ ఆడిన హర్లీన్ డియోల్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఈ సిరీస్ తర్వాత టి20ల నుంచి తప్పుకుంటుందని వినిపిస్తున్న మిథాలీ రాజ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆమె ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడితే బాగుంటుంది. వీరితో పాటు వేద కృష్ణమూర్తి కూడా రాణించాల్సి ఉంది. తొలి టి20లో బౌలింగ్‌లో దీప్తి, అరుంధతి, రాధాయాదవ్ పూర్తిగా విఫలమయ్యారు. మొత్తంగా గత మ్యాచ్ తప్పులను సరిదిద్దుకొని బరిలోకి దిగితే స్మృతి సేనకు విజయావకాశం ఉంటుంది. మరోవైపు వన్డే సిరీస్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న ఇంగ్లండ్ సిరీస్ విజయంపై గురి పెట్టింది. మొదటి మ్యాచ్‌ను గెలిపించిన బీమోంట్, కెప్టెన్ హీథెర్ నైట్, వ్యాట్ మరోసారి భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ జట్టు బౌలింగ్ కూడా బలంగా ఉంది. బ్రంట్, లిన్సీ స్మిత్, క్రాస్ కలిపి తమ పూర్తి కోటా 12 ఓవర్లలో కేవలం 66 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం భారత్‌ను దెబ్బ తీసింది. ఇదే ఫామ్‌ను కొనసాగించాలని వారు పట్టుదలగా ఉన్నారు. ఈ స్థితిలో భారత్ మ్యాచ్, ఆపై సిరీస్ చేజారిపోకుండా కాపాడుకోగలదా చూడాలి. Indian women looking to bounce back against England in second T20 -
ఇంగ్లండ్‌దే తొలి టి20
గ్రాస్ ఐలెట్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు వికెట్లతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. నికోలస్ పూరణ్ (37 బంతుల్లో 58; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ కరన్ 36 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (40 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), జో డెన్లీ (29 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించారు. -
వినయ విధేయ రాహుల్
బెంగళూరు: టీవీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలతో నిషేధం ఎదుర్కొన్న లోకేశ్ రాహుల్ ఆ ఘటన తనలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని అన్నాడు. ఆ సమయంలో ఆటను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టినట్లు చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టి20ల్లో రాహుల్ 50, 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. విరామం సందర్భంగా బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వద్ద తగిన సూచనలు తీసుకున్నట్లు అతను వెల్లడించాడు. ‘ఆటగాడిగా, వ్యక్తిగతంగా కూడా అది నాకు చాలా కఠిన సమయం. టీవీ షో తర్వాతి పరిణామాలు నన్ను ఎంతో మార్చేశాయి. మరింత వినయంగా, సంయమనంగా ఉండటం ఎలాగో నేర్చుకున్నాను. దేశం తరఫున ఆడే అవకాశం రావడం గొప్ప విషయం. ఇకపై తలవంచుకొని ఆటపై మాత్రమే దృష్టి పెడతాను. నిషేధం కారణంగా లభించిన సమయంలో నా ఆటలో లోపాలు అధిగమించే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా ద్రవిడ్‌తో గడిపిన సమయం ఎంతో ఉపయోగపడింది. ఇకపై వ్యక్తిగా మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తా’ అని రాహుల్ పేర్కొన్నాడు. గురువారం ప్రకటించిన ఐసీసీ టి20 బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో రాహుల్ ఆరో స్థానంలో నిలిచాడు. భారత్‌నుంచి టాప్–10లో అతనొక్కడే ఉన్నాడు. -
బెంగళూరు టీ-20 లో ఆస్ట్రేలియా విజయం
-
విజయమే సమంజసం
2008లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో పరాజయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చూస్తే... టి20 ఫార్మాట్లో టీమిండియా ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాకు సిరీస్‌ను కోల్పోలేదు. రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లను గెల్చుకోవడమో లేదా సమంగా ముగించడమో చేసింది. కానీ, ఇప్పుడు సొంతగడ్డపై ఓటమి ముప్పు పొంచి ఉంది. దీనిని తప్పించుకోవాలంటే... తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో కోహ్లి సేన బెంగళూరులో అమీతుమీకి సిద్ధమవుతోంది. అజేయ రికార్డును నిలబెట్టుకోవాలన్నా, అపజయ శకునాలు లేకుండా ప్రపంచ కప్‌నకు సిద్ధమవ్వాలన్నా చిన్నస్వామి స్టేడియంలో భారత్ పెద్ద ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. మరి ఇందులో ఎంతవరకు సఫలమవుతారో వేచి చూడాలి. బెంగళూరు: బ్యాటింగ్‌లో విఫలమై బౌలింగ్‌లో అనూహ్యంగా పుంజుకున్నా, విశాఖపట్నంలో జరిగిన తొలి టి20ని త్రుటిలో ఆస్ట్రేలియాకు చేజార్చుకుంది టీమిండియా. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 0–1తో వెనుకబడి ఆత్మరక్షణలో పడింది. పొట్టి ఫార్మాట్లో తొలిసారిగా, అందులోనూ స్వదేశంలో ఆసీస్‌కు సిరీస్‌ను కోల్పోయారన్న విమర్శలను తప్పించుకోవాల్సిన పరిస్థితుల్లో చిక్కుకుంది. దీంతో బుధవారం బెంగళూరులో జరుగనున్న రెండో మ్యాచ్‌ను కోహ్లి సేన తీవ్రంగా తీసుకోనుంది. మరోవైపు ఇన్నాళ్లూ కొంత బలహీనంగా ఉన్న టి20ల్లో కంగారూలు క్రమంగా మెరుగవుతూ వస్తున్నారు. ఒత్తిడిని తట్టుకుని విశాఖలో సాధించిన విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దీనికితోడు భారత్‌పై ‘తొలిసారి’ టి20 సిరీస్ గెలుపు వారిని ఉత్సాహపరుస్తోంది. ఇరు జట్లకూ ప్రతిష్ఠాత్మకమైన నేపథ్యంలో చిన్నస్వామి మైదానంలో జరిగే ఈ మ్యాచ్ అభిమానులకు వినోదం పంచడం ఖాయంగా కనిపిస్తోంది. మార్పులు ఎన్ని? తొలి టి20లో రెగ్యులర్ ఓపెనర్ ధావన్‌ను తప్పించిన భారత జట్టు మేనేజ్మెంట్... ఈసారి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చే యోచనలో ఉంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్, పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానాల్లో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, పేసర్ సిద్థార్థ్ కౌల్‌ను తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంత టి20 అయినా తుది జట్టులో ఒకేసారి మూడు మార్పులు చేస్తారా? అనేది అనుమానం. ఓపెనర్ల రొటేషన్, ఒత్తిడి తగ్గించడం అనే కోణంలో ఆలోచిస్తే రోహిత్ స్థానంలో ధావన్ రావొచ్చు. బౌలింగ్‌లో మరో ప్రత్యామ్నాయం కావాలని భావిస్తే శంకర్‌కు చోటు దక్కుతుంది. విశాఖలో ఉమేశ్ చివరి ఓవర్ వైఫల్యం కౌల్‌ను ఎంచుకునేలా చేస్తోంది. మరోవైపు పునరాగమనంలో రాహుల్ ఆకట్టుకున్నాడు. సొంత నగరంలో మరింత చెలరేగితే అతడితో పాటు జట్టుకూ మేలు. పంత్ లేకుంటే దినేశ్ కార్తీక్‌పై మరింత భారం పడుతుంది. వన్డే జట్టులో స్థానం కోల్పోయిన అతడు పొట్టి ఫార్మాట్లోనూ వేటు పడకుండా ఉండాలంటే కచ్చితంగా రాణించాలి. కెప్టెన్ కోహ్లి తనదైన ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. నెమ్మదైన పిచ్‌ను ఓ కారణంగా చెప్పుకొన్నా, చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ వెటరన్ ధోని విశాఖలో పరుగులు సాధించలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. బెంగళూరులో వాటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వీరంతా పుంజుకుని భారీ స్కోర్లు చేస్తే కంగారూలకు కష్టాలు తప్పవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బుమ్రా పేస్‌ను ఎదుర్కొనడం ఎంత కష్టమో ఆసీస్‌కు తొలి మ్యాచ్‌లో తెలిసొచ్చింది. ముఖ్యంగా అతడి యార్కర్ల పదునేంటో 19వ ఓవర్లో వేసిన బంతి చెబుతోంది. అంచనాలు నిలబెట్టుకుంటే కౌల్ స్థిరమైన కెరీర్‌కు బాటలు పడతాయి. స్పిన్ త్రయంలో కృనాల్ పాండ్యా తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. కొత్త కుర్రాడు మయాంక్ మార్కండే మాయాజాలం అంతర్జాతీయ స్థాయికి చాటాలి. వీరిద్దరితో పోలిస్తే చహల్ కొంత వెనుకంజలో ఉన్నట్లే. ప్రత్యర్థులు అతడి బౌలింగ్‌ను చదివేసినట్లు కనిపిస్తోంది. చహల్ మేల్కొనాల్సిన సమయం వచ్చింది. ఆసీస్... అలాగే(నా)! చివరి ఓవర్లో అయినప్పటికీ తొలి మ్యాచ్ విజయం ఆస్ట్రేలియాకు ఊరటనిచ్చి ఉంటుంది. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ మెరుపులు, పేసర్ల పొదుపైన బౌలింగ్ ఆకట్టుకుంది. అయితే, బెంగళూరులో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూర్పులో మార్పులుండొచ్చు. స్టొయినిస్‌లాంటి ఆటగాడిని ఓపెనర్‌గా పంపడంపై పునరాలోచన చేయొచ్చు. కెప్టెన్ అరోన్ ఫించ్ వన్‌డౌన్‌లోనే వస్తాడంటున్నారు. దీంతో టర్నర్‌ను పక్కనపెట్టి ఇన్నింగ్స్‌ను ఆరంభించగల వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ క్యారీని తీసుకుంటారని భావిస్తున్నారు. తద్వారా హ్యాండ్స్‌కోంబ్‌ను పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌గా పంపొచ్చు. విశాఖలో పేసర్లు కమిన్స్, బెహ్రెన్‌డార్ఫ్ పరుగులు కట్టడి చేయగా, కూల్టర్‌నీల్ టీమిండియాను దెబ్బకొట్టాడు. ఏకైక స్పిన్నర్‌గా ఆడమ్ జంపానే ఆడించొచ్చు. మొత్తమ్మీద ఒక్క మార్పుతోనే ఆసీస్ బరిలోకి దిగుతుందని అంచనా. తుది జట్లు (అంచనా) భారత్: రాహుల్, రోహిత్/ధావన్, కోహ్లి (కెప్టెన్), పంత్/విజయ్ శంకర్, ధోని, దినేశ్ కార్తీక్, కృనాల్, ఉమేశ్/సిద్ధార్థ్ కౌల్, చహల్, మార్కండే, బుమ్రా. ఆస్ట్రేలియా: స్టొయినిస్, షార్ట్, ఫించ్ (కెప్టెన్), మ్యాక్స్‌వెల్, హ్యాండ్స్కోంబ్, టర్నర్, కూల్టర్‌నీల్, కమిన్స్, జే రిచర్డ్సన్, బెహ్రెన్‌డార్ఫ్, జంపా. ►రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం చిన్నస్వామి మైదానం పిచ్ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం. వాతావరణం వేడిగా ఉండనుంది. -
వావ్ రషీద్.. 4 బంతుల్లో 4 వికెట్లు
డెహ్రాడూన్: అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (5/27) టి20 క్రికెట్లో కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్’ వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి ‘హ్యాట్రిక్ ప్లస్’ ప్రదర్శనతో ఔరా అనిపించాడు. ఆదివారం జరిగిన మూడో టి20లో 32 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలుపొందిన అఫ్గాన్ సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మొదట అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేయగా... ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసి ఓడిపోయింది. అఫ్గానిస్తాన్ జట్టులో మొహమ్మద్ నబీ (36 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగాడు. హజ్రతుల్లా (17 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఐర్లాండ్ బౌలర్లలో రాన్కిన్కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఐర్లాండ్ 15.5 ఓవర్లలో 153/3 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. కానీ ఆ మరుసటి బంతి నుంచి ఐర్లాండ్ రాత మారింది. 16వ ఓవర్ వేసిన రషీద్ చివరి బంతికి కెవిన్ ఓబ్రియన్ (47 బంతుల్లో 74; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటానికి తెరదించాడు. తర్వాత 18వ ఓవర్ తొలి మూడు వరుస బంతులకు డాక్రెల్ (18), గెట్కెట్ (2), సిమి సింగ్ (0)లను పెవిలియన్ చేర్చాడు. ►7 అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్’ తీసిన ఏడో బౌలర్‌గా, తొలి స్పిన్నర్‌గా రషీద్‌ఖాన్ నిలిచాడు. గతంలో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ఆరుగురూ పేస్ బౌలర్లు (బ్రెట్ లీ, జాకబ్ ఓరమ్, టిమ్ సౌతీ,తిసారా పెరీరా, లసిత్ మలింగ, ఫహీమ్ అష్రఫ్) కావడం గమనార్హం. ► 2అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రషీద్ ఖాన్ గుర్తింపు పొందాడు. గతంలో శ్రీలంక పేసర్ లసిత్ మలింగ మాత్రమే (2007 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై) ఈ ఘనత సాధించాడు. -
ఒకటే స్థానం ఖాళీ!
వన్డే వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఒకటిగా భారత జట్టు బరిలోకి దిగబోతోంది. బలమైన బ్యాటింగ్ లైనప్, ఇంగ్లండ్ పిచ్‌లకు సరిపోయే పదునైన బౌలింగ్‌తో పాటు ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు మాయ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వన్డేల్లో టీమిండియా ఇటీవలి ప్రదర్శన చూస్తే సాధారణ క్రికెట్ అభిమానికి కూడా వరల్డ్ కప్ జట్టులో ఎవరెవరు ఉంటారో ఒక అంచనా వచ్చేసి ఉంటుంది. ఆసియా కప్ టైటిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో సిరీస్ విజయాల తర్వాత టీమ్ కూర్పుపై సెలక్షన్ కమిటీకి కూడా మరింత స్పష్టత లభించింది. ఇదే అంశంపై సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తన అభిప్రాయం వెల్లడించారు. ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోబోమని... టీమ్ ఎంపికపై ఎలాంటి సందేహాలు లేకుండా మరింత స్పష్టతనిచ్చారు. ముంబై: వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక దాదాపుగా పూర్తయిందని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. 15 మంది సభ్యుల జట్టులో 14 మంది విషయంలో తాము దాదాపు నిర్ణయానికి వచ్చేశామని, మిగిలిన ఒకే ఒక స్థానం కోసం గట్టి పోటీ ఉందని ఆయన చెప్పారు. నిజానికి కొన్నాళ్ల క్రితం వరకు జట్టు ఎంపిక సాఫీగానే అనిపించిందని, అయితే ఇటీవల అవకాశం ఇచ్చిన కుర్రాళ్లంతా సత్తా చాటడంతో తమకు ‘ఆరోగ్యకరమైన తలనొప్పి’ మొదలైందని ప్రసాద్ వ్యాఖ్యానించారు. జట్టులో ధోని పాత్ర ఎంత కీలకమో కూడా ఆయన స్పష్టతనిచ్చారు. వరల్డ్ కప్‌కు సంబంధించి ప్రసాద్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... టీమ్ ఎంపికపై... వన్డేల్లో మన టీమ్ అద్భుత ప్రదర్శన తర్వాత వరల్డ్ కప్ టీమ్ ఎంపిక దాదాపుగా పూర్తయినట్లే. ఆఖరి క్షణంలో ఒక మార్పు మినహా మిగతా ఆటగాళ్ల గురించి ఎలాంటి సందేహం లేదు. సరిగ్గా చెప్పాలంటే ఒకటే స్థానం ఖాళీగా ఉంది. అది కూడా ఇటీవల కొత్త ఆటగాళ్ల చక్కటి ప్రదర్శన తర్వాత మా తుది ఎంపికపై పునరాలోచించుకోవాల్సి వచ్చింది. బహుశా స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత ఆ స్థానం ఖాయం అవుతుంది. 2011 వరల్డ్ కప్ తరహాలో సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతూకంగా ఉంటుంది. అప్పుడు సచిన్, సెహ్వాగ్‌లే కాకుండా కోహ్లి, శ్రీశాంత్‌లాంటి కుర్రాళ్లూ ఉన్నారు. మిగిలిన స్థానానికి ఉన్న పోటీపై... చాలా మంది బరిలో ఉన్నారని మాత్రం చెప్పగలను. రిషభ్ పంత్, విజయ్ శంకర్, రహానేలతో పాటు కేఎల్ రాహుల్ కూడా ఇంకా రేసులోనే నిలిచారు. గత ఏడాది కాలంగా పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు. తనకు లభించిన పరిమిత అవకాశాల్లోనే విజయ్ శంకర్ ఆకట్టుకున్నాడు. అతని ప్రదర్శన జట్టు కూర్పు గురించి మరో కోణంలో ఆలోచించేలా చేసింది. దేశవాళీ క్రికెట్లో రహానే పరుగుల వరద పారించాడు కాబట్టి అతడిని ఇంకా పూర్తిగా పక్కన పెట్టలేదు. వీరందరినీ దాటాలంటే రాహుల్ మిగిలిన కొద్ది సమయంలో మాత్రం భారీగా పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పటికే నలుగురు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, విజయ్ శంకర్ ఉన్నారు. వీరందరినీ తెలుసుకోలేం. వరల్డ్ కప్ కోసం కొన్ని లెక్కలను చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 20 మందితో జాబితా మా ముందుంది. కాబట్టి వచ్చే ఐపీఎల్లో ప్రదర్శన ఎలా ఉన్నా దానిని మాత్రం ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించాం. మిడిలార్డర్ సమస్యలపై... ఇంగ్లండ్ గడ్డపై 1–2తో వన్డే సిరీస్ ఓడిపోయిన సమయంలో మా మిడిలార్డర్ సమస్యగా కనిపించింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌ల తర్వాత దానికి పరిష్కారం లభించినట్లే. మిడిలార్డర్ బాధ్యతల గురించి స్పష్టంగా వివరించి అవకాశాలు ఇచ్చిన వారందరూ తమ పాత్రకు న్యాయం చేయడం సంతోషకరం. ఇంకా చిన్న చిన్న లోపాలేమైనా ఉంటే ఆటగాళ్లే చూసుకుంటారు. నేను ఏ ఒక్కరి పేరు చెప్పను గానీ మిడిలార్డర్ సమస్య తీరినట్లుగానే భావిస్తున్నాం. రాయుడుపై విశ్వాసం ఉంచడంపై... మన మిడిలార్డర్ పటిష్టంగా ఉండాలి. నాలుగో స్థానంలో కోసం మేం ప్రయత్నించినవారి ఆట మాకు సంతృప్తి కలిగించలేదు. ఆ స్థానంలో అనుభవంతో పాటు పరిణతి అవసరం. టి20 ఫార్మాటే అయినా ఐపీఎల్ ప్రదర్శనతోనే రాయుడును వన్డేలకు ఎంపిక చేశాం. తనకు లభించిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకున్న అతను, ఆ స్థానానికి సరైనవాడినేనని నిరూపించుకున్నాడు. ఇద్దరు స్పిన్నర్లపైనే నమ్మకం... వాస్తవానికి 2017 చాంపియన్స్ ట్రోఫీ తర్వాతి నుంచి మేం వరల్డ్ కప్ జట్టు నిర్మాణం గురించి ఆలోచించాం. ఆ టోర్నీలో భారత్ బాగానే ఆడి ఫైనల్ చేరింది. కానీ స్పిన్‌లో మరింత వైవిధ్యం ఉంటే బాగుంటుందని భావించాం. అందుకే చహల్, కుల్దీప్లకు అవకాశాలిచ్చాం. ఫలితాలు ఎలా ఉన్నాయో మీరే చూశారుగా. వీరిద్దరు కలిసి ఆడిన మ్యాచ్‌లలో భారత్ 70 శాతం (27 మ్యాచ్‌లలో 19 గెలిచి, 7 ఓడింది) విజయాలు సాధించింది. వారి వల్ల బౌలింగ్ బలం పెరిగింది. వరల్డ్ కప్ జరిగే సమయంలో ఇంగ్లండ్‌లో పిచ్‌లు బౌన్సీగా ఉంటాయి. అలాంటప్పుడు ఆఫ్ స్పిన్నర్లకంటే లెగ్ స్పిన్నర్లే ఎక్కువ ప్రభావం చూపుతారు కూడా. ధోని పాత్ర, అతని ప్రాధాన్యతపై... ధోని ఇప్పటికీ మ్యాచ్ విన్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్ కప్‌లో కూడా అందరికంటే అతనే కీలకం కానున్నాడు. విరాట్ కోహ్లికి సలహాలివ్వడంలో గానీ వికెట్ కీపర్‌గా గానీ మైదానంలో కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేయడంలో గానీ అతడిని మించినవారు లేరు. ఇటీవల సిరీస్‌ల తర్వాత తన సహజశైలిలో దూకుడుగా ఆడతానని ధోని సందేశం ఇచ్చేశాడు. మనందరికీ తెలిసిన పాత తరహా ధోనిలా భారీ షాట్లతో చెలరేగితే మాకందరికీ ఆనందం. మధ్యలో మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల అతనిలో కొంత జోరు తగ్గి ఉండవచ్చు కానీ మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. వరల్డ్ కప్‌కు ముందు ఐపీఎల్ సైతం ఆడతాడు కాబట్టి సమస్య లేదు. బ్యాటింగ్ ఫామ్ మాత్రం కొంత తగ్గినా... అతని కీపింగ్‌పై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. విరాట్ చెప్పినట్లు ధోనిపై విపరీతమైన అంచనాలు ఉండటమే సమస్య. మనకెప్పుడూ ధోని తొలి రోజులు గుర్తుకొచ్చి అలాగే ఆడాలని కోరుకుంటాం. ఇప్పుడు విఫలమవుతున్నాడని విమర్శిస్తాం. కానీ అతని స్థాయి ఆటగాళ్లకు తమనుంచి ఏం కోరుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాము విఫలమైతే వారు కూడా సహజంగానే బాధపడతారు! 2016 సెప్టెంబర్‌లో ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ బాధ్యతలు తీసుకున్న నాటినుంచి భారత్ 131 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడితే 89 గెలిచి, 33 ఓడింది. ఈ సమయంలో భారత్ గెలుపోటముల నిష్పత్తి (2.696) అన్ని జట్లకంటే చాలా ఎక్కువగా ఉంది. -
ధోని దేశభక్తి!
దేశం తరఫున ఆడుతున్నప్పుడు మైదానంలో ధోని అంకితభావం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మ్యాచ్‌లో జరిగిన ఒక ఘటన ధోని దేశభక్తిని మరోసారి ప్రపంచానికి చూపించింది. కివీస్ ఇన్నింగ్స్ సమయంలో ఒక అభిమాని భద్రతను ఛేదించుకొని గ్రౌండ్లోకి దూసుకొచ్చాడు. అతను నేరుగా ధోని వద్దకు వెళ్లి పాదాభివందనం చేశాడు. ఈ క్రమంలో అతని చేతిలో ఉన్న మన జాతీయ జెండా నేలను తాకింది. అంతే... అమిత వేగంతో కిందకు వంగిన ధోని ముందుగా మువ్వన్నెల జెండాను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాతే సదరు అభిమానిని పక్కకు జరిపాడు. త్రివర్ణ పతాకాన్ని నేలకు తగలకుండా ‘లెఫ్ట్‌నెంట్ కల్నల్’ ధోని దానిపై తన గౌరవాన్ని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. ఆ క్షణం మ్యాచ్‌లో ‘మూమెంట్ ఆఫ్ ద డే’గా నిలిచింది. -
టీమిండియా ఈసారి అలా బోల్తా పడొద్దు...
గత 13 నెలలుగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలతో భూగోళాన్ని చుట్టేస్తోంది టీమిండియా. ఈ ప్రయాణంలో మధురమైన విజయాలను సొంతం చేసుకుంది. పలు ఘనతలను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడిక ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌నకు ముందు విదేశాల్లో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో మూడు నెలలుగా సాగుతున్న ఆస్ట్రేలియా–న్యూజిలాండ్ పర్యటనను మరింత గొప్పగా ముగించి... టి20 సిరీస్‌ను ఒడిసిపట్టి సగర్వంగా స్వదేశానికి చేరేందుకు ఒక్క గెలుపు దూరంలో ఉంది. దీనిని రోహిత్ బృందం నిజం చేయాలని ఆశిద్దాం. హామిల్టన్: న్యూజిలాండ్ గడ్డపై శుక్రవారం తొలి టి 20 విజయాన్ని అందుకున్న టీమిండియా... అదే ఊపులో మొదటిసారి సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. రెండు జట్ల మధ్య ఆదివారం ఇక్కడ జరుగబోయే చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుని ఆ దేశ పర్యటనను ఘనంగా ముగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో గత మ్యాచ్‌లో గెలుపును అందించిన జట్టునే బరిలో దించనుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో, పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను చేజార్చుకోకూడదని భావిస్తున్న కివీస్... కుగ్లీన్, ఫెర్గూసన్‌ల స్థానంలో నీషమ్, టిక్నెర్లను ఆడించనుంది. ఈసారి అలా బోల్తా పడొద్దు... నాలుగో వన్డేలో పేసర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి 92 పరుగులకే ఆలౌటైన హామిల్టన్‌లోనే చివరి టి20 జరుగనుంది. నేటి మ్యాచ్‌లో బౌల్ట్ లేనప్పటికీ ఆ అనుభవంతో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు తొలి టి20లో తడబడినప్పటికీ తప్పులను దిద్దుకున్న మన జట్టు... ఆక్లాండ్‌లో సమష్టిగా రాణించింది. బ్యాటింగ్‌లో రోహిత్, పంత్... బౌలింగ్‌లో పేసర్లు భువనేశ్వర్, ఖలీల్, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా మెరిశారు. కీలకమైన చివరి మ్యాచ్‌లో హార్దిక్, చహల్ కూడా ప్రభావం చూపితే కివీస్‌కు ఇబ్బందులు తప్పవు. చహల్ స్థానంలో కుల్దీప్ను తీసుకోవచ్చని భావిస్తున్నా... కృనాల్ రూపంలో ఎడంచేతి వాటం స్పిన్నర్ ఉన్నందున ఆ అవకాశం కనిపించట్లేదు. ఓపెనర్లు రోహిత్, ధావన్‌లలో ఒక్కరు నిలదొక్కుకున్నా భారీ స్కోరుకు బాటలు పడతాయి. ధావన్ ప్రారంభాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ఐదు మ్యాచ్‌లుగా అతడి నుంచి అర్ధ సెంచరీ నమోదు కాలేదు. భారీ స్కోర్లకు అవకాశం ఉన్న పిచ్‌పై వీరు బలమైన పునాది వేస్తే పంత్, ధోని, కార్తీక్ చెలరేగేందుకు వీలుంటుంది. ఆ ఇద్దరిని తప్పించి... ఆతిథ్య న్యూజిలాండ్‌కు తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫామ్ లేమి ఆందోళనగా మారింది. మున్ముందు కీలక టోర్నీల దృష్ట్యా విలియమ్సన్ గాడినపడటం వారికి అత్యవసరం. తొలి మ్యాచ్‌లో ఓపెనర్ సీఫెర్ట్, రెండో దాంట్లో గ్రాండ్‌హోమ్ దూకుడుతో ఆ జట్టుకు కీలకంగా నిలిచారు. ఈ మైదానంలో గతేడాది ఇంగ్లండ్‌పై ఓపెనర్ కొలిన్ మున్రో 18 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. మిడిలార్డర్లో టేలర్ నిలకడగా ఆడుతున్నాడు. అయితే, అతడి నుంచి జట్టు ఇంకా భారీ స్కోరు ఆశిస్తోంది. ప్రభావం చూపలేకపోతున్న ఆల్ రౌండర్ కుగ్లీన్, పేసర్ ఫెర్గూసన్‌లను తప్పించి... పిచ్ పరిస్థితుల రీత్యా నీషమ్ వైపు మొగ్గుచూపింది. ధాటిగా ఆడగల అతడు మీడియం పేసర్‌గా బౌలింగ్‌లోనూ పనికొస్తాడు. టిమ్ సౌతీతో కలిసి టిక్నెర్ పేస్ బాధ్యతలు పంచుకుంటాడు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, పంత్, విజయ్ శంకర్, ధోని, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, ఖలీల్, చహల్. న్యూజిలాండ్: సీఫెర్ట్, మున్రో, విలియమ్సన్, రాస్ టేలర్, మిషెల్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, సౌతీ, సోధి, టిక్నెర్. పిచ్, వాతావరణం బౌండరీ సరిహద్దులు కొంచెం పెద్దవైనా... వేగవంతమైన ఔట్ ఫీల్డ్‌కు తోడు పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలం. సరిగ్గా ఏడాది క్రితం న్యూజిలాండ్–ఇంగ్లండ్ మధ్య ఇక్కడ జరిగిన టి20లో ఇరు జట్లు 386 పరుగులు చేశాయి. ఈసారి కూడా పరుగుల వరద ఖాయం. -
రేపు భారత్, న్యూజిలాండ్ తొలి టీ20
-
చెలరేగిన షై హోప్
సిల్హెట్ (బంగ్లాదేశ్): వెస్టిండీస్ ఓపెనర్ షై హోప్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) బంగ్లాదేశ్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో సోమవారం ఇక్కడ జరిగిన తొలి టి20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 129 పరుగులు చేసి ఆలౌటైంది. పేసర్ షెల్డన్ కాట్రెల్ (4/28) ధాటికి విలవిల్లాడిన ఆతిథ్య జట్టును కెప్టెన్ షకీబుల్ హసన్ (43 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నాడు. తర్వాత 130 పరుగుల లక్ష్యాన్ని విండీస్ కేవలం 10.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. హోప్ ప్రతాపంతో విండీస్ 3.1 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. 98 పరుగుల వద్ద హోప్ నిష్క్రమించాక... మిగతా లాంఛనాన్ని నికోలస్ పూరన్ (23 నాటౌట్), కీమో పాల్ (14 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) అంతే వేగంతో పూర్తి చేశారు. దీంతో సగం ఓవర్లు (9.1) మిగిలుండగానే మ్యాచ్ ముగిసింది. రెండో టి20 గురువారం ఢాకాలో జరుగుతుంది. -
ఆసీస్ 158, భారత్ 169.. విజేత?
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి కారణమైన డక్‌వర్త్ లూయిస్ విధానంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆసీస్ కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ భారత్ ఓడిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘ప్రత్యర్థి కంటే 11 పరుగులు ఎక్కువగా చేసిన జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయింద’ని బాధ పడ్డారు. ట్విటర్లో కామెంట్లు, ఫొటోలతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఆసీస్ కంటే ఎక్కువ స్కోరు చేసినా.. ఓడిన భారత్!) ఆసీస్ స్కోరు మీద జీఎస్టీ(వస్తు సేవల పన్ను) విధించడం వల్లే టీమిండియా ఓడిపోయిందని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎకసెక్కమాడారు. ఏదేమైనప్పటికీ సిరీస్ ఆరంభ మ్యాచ్ మజా అందించిందని పేర్కొన్నారు. ఏ ఆటలోనైనా డక్‌వర్త్ లూయిస్ విధానం లోపభూయిష్టమైందని అభిమానులు ధ్వజమెత్తారు. డీ/ఎల్ గురించి ఎవరైనా మాకు వివరించండి అంటూ మొరపెట్టుకున్నారు. పనిలో పనిగా టీమిండియా ఆటగాళ్ల వైఫల్యాలపైనా సెటైర్లు వేశారు. పాండ్యా బ్రదర్స్‌ను సాగనంపే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఈ రోజు మ్యాచ్‌లో టీమిండియాలో ఇద్దరు మాత్రమే స్థాయికి తగ్గటు ఆడారని మిగతా వారంతా ఏమీ చేయలేక చూస్తుండి పోయారని జోకులేశారు. ధోని లాంటి ఫినిషర్ లేకపోవడం వల్లే మ్యాచ్ చేజారిందని మహి ఫ్యాన్స్ నిష్టూరమాడారు. తమ ఓటమికి 11 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు కారణం కాదని, ఇద్దరు ఇంగ్లీషు వ్యక్తులు డక్‌వర్త్, లూయిస్ వల్లే విజయం సాధించలేకపోయామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పడం కొసమెరుపు Oily hands after eating food made from #SaffolaOil is not good for fielding. You miss catches & fielding like me & my boys. Make sure you clean your hands with #Lifebuoy soap & dry them with #BombayDyeing towel before taking the field else the #Kookaburra ball may slip. #AUSvIND pic.twitter.com/LHo7ESxr6i — Virat Kolhi (@imVlkohli) 21 November 2018 👉1st Wicket: c Kuldeep b Khaleel 👉2nd Wicket: c Khaleel b Kuldeep 👉3rd Wicket: c&b Kuldeep Yadav Seems India Is Playing With Only 2 Players On Field, Others Are Watching #Zero In Dressing Room 🤔😂😭 #INDvAUS #AUSvIND #INDvsAUS — Sir Jadeja (@SirJadeja) 21 November 2018 -
టి20లోనూ దక్షిణాఫ్రికా గెలుపు
కరారా: ఏకైక టి20లో 21 పరుగుల విజయంతో దక్షిణాఫ్రికా... ఆస్ట్రేలియా పర్యటనను ముగించింది. రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (16 బంతుల్లో 22; 2 సిక్స్‌లు), రీజా హెన్డ్రిక్స్ (8 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ డు ప్లెసిస్ (15 బంతుల్లో 27; 4 ఫోర్లు) వేగంగా ఆడారు. ఆండ్రూ టై (2/18), కౌల్టర్‌నైల్ (2/19)లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో 10 ఓవర్లలో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 87 పరుగులే చేయగలిగింది. మ్యాక్స్‌వెల్ (23 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిలిచినా... ఓపెనర్లు కెప్టెన్ ఫించ్ (7), క్రిస్ లిన్ (14) సహా డీఆర్సీ షార్ట్ (0), స్టొయినిస్ (5) విఫలమవడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. ఇంతకుముందు జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా సఫారీలు 2–1తో కైవసం చేసుకున్నారు. -
రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
-
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్
లక్నో: పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ జరుగుతున్న రెండో టీ20లో కోహ్లి(2,102)ని రోహిత్ అధిగమించాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ జట్టు భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి వన్డేలో గెలిచిన రోహిత్ బృందం.. రెండో టీ20లో సైతం గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా. రోహిత్ శర్మ(2,203) రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2,171 పరుగులతో మూడో స్థానంలో, న్యూజిలాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ మెకల్లమ్ 2,140 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. -
పాకిస్తాన్ క్లీన్‌స్వీప్
దుబాయ్: టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ జట్టు పాకిస్తాన్ స్థాయికి తగ్గ ఆటతో న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మూడో టి20లోనూ కివీస్‌ను ఓడించి 3–0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత పాక్ మూడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ఓపెనర్ బాబర్ ఆజమ్ (58 బంతుల్లో 79; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), హఫీజ్ (34 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు. ఛేదనలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (38 బంతుల్లో 60; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓపెనర్ గ్లెన్ ఫిలిప్స్ (26) మినహా మరెవరూ నిలవకపోవడంతో కివీస్ 16.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. షాదాబ్ ఖాన్ (3/30), వకాస్ మక్సూద్ (2/21), ఇమాద్ వసీం (2/28) ప్రత్యర్థిని దెబ్బతీశారు. హఫీజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. -
టాస్ ఓడిపోవాలనే కోరుకుంటారు!
తొలి టి20 మ్యాచ్ కూడా టెస్టు, వన్డే సిరీస్‌ల తరహాలోనే సాగింది. భారత్‌ను కొంత ఇబ్బందిలో పడేయగలిగినా... వెస్టిండీస్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఒషాన్ థామస్ తన పేస్, బౌన్స్‌తో పాత వెస్టిండీస్ భీకర ఫాస్ట్ బౌలింగ్‌కు గుర్తు చేయగా, తన ఎత్తును నమ్ముకున్న కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ చక్కటి లెంగ్త్‌తో భారత బ్యాట్స్‌మెన్ వెనకడుగు వేసేలా చేశాడు. వేగంతో దూసుకొచ్చిన షార్ట్ బంతులను ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. హెల్మెట్ల వాడకం పెరగడం, ఓవర్లో ఒకే బౌన్సర్‌కు అనుమతివంటి నిబంధనలు వచ్చిన తర్వాత ప్రపంచంలోని చాలా మందిలాగే మన ఆటగాళ్లు కూడా బ్యాక్‌ఫుట్‌పై ఆడటం మరచిపోయారు. అయితే టి20ల్లో ఒక బౌలర్ గరిష్టంగా 4 ఓవర్లే వేయగలిగే అవకాశం ఉండగా థామస్‌కు అండగా నిలిచే మరో ఫాస్ట్ బౌలర్ వెస్టిండీస్ జట్టులో ఎవరూ లేరు. ఫలితంగా భారత లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థిని సునాయాసంగా ఎదుర్కొని జట్టును గెలిపించారు. విండీస్ చాలా కాలంగా కోరుకుంటున్న మెరుగైన ఫాస్ట్ బౌలర్ అయ్యే అవకాశం థామస్‌కు ఉంది. షెనాన్ గాబ్రియెల్ బౌలింగ్‌లోనూ వేగం ఉన్నా తన తొలి స్పెల్‌లోనే ఎక్కువగా షార్ట్ బంతులు విసిరే లక్షణం అతనికి ఉంది. అలా కాకుండా థామస్ భారత బ్యాట్స్‌మెన్‌ను క్రీజ్‌లో ఒక ఆటాడించాడు. వారికి అతి దగ్గరి నుంచి అతని బంతులు దూసుకుపోయాయి. అయితే ఈడెన్ గార్డెన్స్‌లో కొంత బౌన్స్ ఉండటం అనుకూలించింది. కానీ లక్నోలో అతనికి అంత సహకారం లభించకపోవచ్చు. ఈ కొత్త వేదిక గురించి భారత ఆటగాళ్లకు కూడా పెద్దగా అవగాహన లేదు కాబట్టి ఇరు జట్ల కెప్టెన్లు తాము టాస్ ఓడిపోయి పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలని కోరుకునే అవకాశమే ఉంది. దినేశ్ కార్తీక్ మరోసారి తన విలువను చూపిస్తూ జట్టును విజయతీరం చేర్చాడు. అతడికి అండగా నిలిచిన కొత్త ఆటగాడు కృనాల్ పాండ్యా పరిస్థితికి తగినట్లుగా ఆడి భారత్ తరఫున ఆడే అర్హత తనకు ఉందని నిరూపించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కష్టాల్లో ఉన్నప్పుడు అతను ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు ఇక్కడ భారత జట్టు తరఫున కూడా అంతే సౌకర్యంగా కనిపించాడు. మరో కొత్త ఆటగాడు ఖలీల్ అహ్మద్ కూడా చక్కగా బౌలింగ్ చేయగా... విండీస్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన పియర్, అలెన్ కూడా ఆకట్టుకున్నారు. మొత్తంగా ఇరు జట్ల నుంచి కొత్తవాళ్లకు ఈ మ్యాచ్ గుర్తుండిపోయేలా సాగింది. సిరీస్‌లో నిలవాలంటే లక్నోలో కచ్చితంగా గెలవాల్సిన ప్రపంచ చాంపియన్ ఈడెన్ గార్డెన్స్‌తో పోలిస్తే బ్యాటింగ్‌లో మరింత పట్టుదల కనబర్చాల్సి ఉంది. -
సమమా? సిరీసా?
టి20లు అంటేనే మెరుపు షాట్లు... భారీ స్కోర్లు! కానీ, కోల్‌కతాలో ఆదివారం తొలి మ్యాచ్ ఇలాంటి మెరుపులేమీ లేకుండానే సాగింది. వెస్టిండీస్ ఆట ఇంతేనని సరిపెట్టుకుంటే, టీమిండియా సైతం కొంత కష్టంగానే లక్ష్యాన్ని ఛేదించింది. జట్ల బలాబలాలు ఎలా ఉన్నా, పిచ్ గురించి వస్తున్న విశ్లేషణలను చూస్తే లక్నోలో జరుగనున్న రెండో మ్యాచ్ కూడా మొదటిదానికి భిన్నంగా ఉండేట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తెలివిగా ఆడిన జట్టుదే విజయం అనడంలో సందేహం లేదు. మరి... మరో గెలుపుతో రోహిత్ బృందం సిరీస్‌ను ఇక్కడే కైవసం చేసుకుంటుందా? పర్యాటక జట్టు పుంజుకుని పోటీ ఇస్తుందా? లక్నో: టెస్టు, వన్డే సిరీస్‌ల తరహాలోనే టి20 సిరీస్‌నూ ఒడిసి పట్టేందుకు మరో విజయం దూరంలో టీమిండియా. వెస్టిండీస్‌తో మంగళవారం లక్నోలో కొత్తగా నిర్మించిన ‘భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి అంతర్జాతీయ స్టేడియం’లో రెండో మ్యాచ్. రోహిత్ సేనకు అటు సిరీస్‌తో పాటు పొట్టి ఫార్మాట్ ప్రపంచ చాంపియన్‌పై విజయాల రికార్డు మెరుగుపర్చుకునే అవకాశం. అయితే, అప్పటివరకు ఎలా ఆడినా, ఉప్పెనలా విరుచుకుపడి క్షణాల్లో ఫలితం మార్చేసే కరీబియన్లకు ఏమేరకు ముకుతాడు వేస్తారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంది. మరోవైపు పిచ్ నెమ్మదిగా ఉంటుందనే అంచనాల రీత్యా అభిమానులకు ఉర్రూతలూగించే క్రికెట్ విందు లేనట్లే. భారత్... భువీతో! బంతి ఆగిఆగి బ్యాట్‌పైకి రావడంతో కోల్‌కతాలో టీమిండియాకు ఛేదన ఏమంత సులువు కాలేదు. ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైనా, లోతైన బ్యాటింగ్ లైనప్‌తో భారత్ పెద్దగా కంగారు పడాల్సిన పని లేకపోయింది. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు అరంగేట్ర ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా అండగా నిలిచి లాంఛనాన్ని ముగించాడు. అయితే, ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంతవరకు సరైన ఇన్నింగ్స్ ఆడకపోవడం జట్టుకు కొంత ఇబ్బందిగా ఉంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగితే కెప్టెన్ రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్, మనీశ్ పాండే సాధ్యమైనన్ని పరుగులు అందించాల్సి ఉంటుంది. రిషభ్ పంత్ మరోసారి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గానే వచ్చే వీలుంది. దినేశ్ కార్తీక్, కృనాల్ ఆఖర్లో చెలరేగితే ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించవచ్చు. ఛేదన అయినా ఇదే తీరులో ఆడాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌కు భారత్ బౌలింగ్‌లో ఒక మార్పుతో బరిలో దిగే అవకాశం ఉంది. పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ జట్టులోకి వస్తాడు. బుమ్రా, ఖలీల్ అహ్మద్ అతడితో పాటు బంతిని పంచుకుంటారు. స్పిన్ బాధ్యతలు కుల్దీప్, కృనాల్ తీసుకుంటారు. విండీస్... పోరాడితే ప్రత్యర్థి ప్రతిభ కంటే మ్యాచ్, పిచ్ పరిస్థితులను పట్టించుకోకుండా ఆడటమే కోల్‌కతాలో వెస్టిండీస్ పరాజయానికి ప్రధాన కారణమైంది. బ్యాట్స్‌మెన్ సహజ శైలిలో షాట్లకు దిగి వికెట్లు పారేసుకోవడంతో మోస్తరు లక్ష్యాన్నీ నిర్దేశించలేకపోయింది. ఫామ్‌లో ఉన్న షై హోప్ అనవసర రనౌట్ మరింత దెబ్బతీసింది. బౌలింగ్‌లోనే జట్టు ప్రతిఘటన చూపగలిగింది. కెప్టెన్ బ్రాత్‌వైట్, పియర్ పొదుపైన బౌలింగ్‌కు తోడు పేసర్ థామస్ మెరుపు స్పెల్ ఆశలు రేపినా అది విజయానికి సరిపోలేదు. హెట్‌మైర్, పొలార్డ్, బ్రావో తలో చేయి వేసి... ఆఖర్లో బ్రాత్‌వైట్ బ్యాట్ ఝళిపిస్తే భారత్‌కు సవాల్ విసిరే స్కోరు చేయగలదు. ఏదేమైనా బ్యాట్స్‌మెన్ కాస్త ఓపికగా ఆడి భారీగా పరుగులు సాధిస్తేనే విండీస్ విజయం అందుకోగలదు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, కేఎల్ రాహుల్, పాండే, పంత్, దినేశ్ కార్తీక్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా, ఖలీల్. వెస్టిండీస్: బ్రాత్‌వైట్ (కెప్టెన్), హోప్, రామ్‌దిన్, హెట్‌మైర్, బ్రావో, పొలార్డ్, రావ్మన్ పావెల్, అలెన్, కీమో పాల్, పియర్, థామస్. పిచ్, వాతావరణం కొత్తగా నిర్మించిన ఈ మైదానంలో పిచ్ చాలా నెమ్మదిగా ఉంది.వర్ష సూచనలు లేవు. రాత్రి వేళ మంచు కురుస్తుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కే మొగ్గు చూపొచ్చు. రాత్రి గం.7 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
స్మృతి మంధాన ‘శత’క్కొట్టింది
మాంచెస్టర్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (61 బంతుల్లో 102; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. కియా టి20 మహిళల సూపర్ లీగ్‌లో వెస్టర్న్ స్ట్రామ్స్ తరఫున ఆడుతున్న మంధాన... లాంకషైర్ థండర్‌పై 60 బంతుల్లోనే సెంచరీ కొట్టింది. దీంతో స్ట్రామ్స్ జట్టు 154 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది. అంతకుమందు లాంకషైర్ థండర్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 153 పరుగులు చేసింది. లాంకషైర్ తరఫున ఆడుతున్న భారత టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (0) విఫలమైంది. అయితే శాటర్త్‌వైట్ (57 బంతుల్లో 85 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాటంతో లాంకషైర్ మోస్తరు స్కోరు చేసింది. -
విండీస్ విజయం
సెయింట్ కిట్స్: వన్డే సిరీస్ కోల్పోయిన వెస్టెండీస్ పొట్టి ఫార్మాట్లో సత్తా చాటింది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మంగళవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన తొలి టి20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విండీస్ బౌలర్లు కెరిక్ విలియమ్స్ (4/28), నర్స్ (6/2), కీమో పాల్ (24/2) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. మహ్మదుల్లా (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌స్కోరర్. మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడటంతో విండీస్ లక్ష్యాన్ని 11 ఓవర్లలో 91గా కుదించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రసెల్ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), శామ్యూల్స్ (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగడంతో విండీస్ 9.1 ఓవర్లలో 3 వికెట్లకు 93 పరుగులు చేసి విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఆదివారం జరుగనుంది. -
ఫించ్ పిచ్చకొట్టుడు!
లండన్ : ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ రెచ్చిపోయాడు. ఒక పరుగు వద్ద లభించిన లైఫ్‌తో విధ్వంసం సృష్టించాడు. 79 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 131 పరుగులు బాది రికార్డు సృష్టించాడు. ఇంగ్లీష్ బ్లాస్ట్ టీ20 టోర్నీలో భాగంగా సర్రే జట్టు తరపున బరిలోకి దిగిన ఫించ్.. సస్సెక్స్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో సర్రే జట్టు 52 పరుగుల తేడాతో సస్సెక్స్‌పై విజయం సాధించింది. ఫించ్ తొలి పరుగు వద్దనే జోఫ్రా ఆర్చర్‌కు రిటర్న్ క్యాచ్ ఇవ్వగా.. అతను నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకున్న ఫించ్ సెంచరీతో చెలరేగాడు. ఇది సర్రె జట్టు బ్యాట్స్‌మన్‌గా అత్యధిక స్కోర్ కాగా.. ఫించ్‌కు టీ20ల్లో ఐదో టీ20 సెంచరీ. దీంతో సర్రే జట్టు మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్య చేధనలో సస్సెక్స్ జట్టు తడబడింది. 18వ ఓవర్లోనే 140 పరుగుల వద్ద చాపచుట్టేసింది. ఇక వరల్డ్ నెం1 బౌలర్ అఫ్గాన్ సంచలనం రషీద్‌ఖాన్ బౌలింగ్‌ను సైతం ఫించ్ చీల్చిచిండాడడు. ఈ దెబ్బకు రషీద్ 40 పరుగులు సమర్పించుకున్నాడు. -
చివరి టీ20 ; భారత్ లక్ష్యం 199
బ్రిస్టల్ : భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నిర్ణాయత్మక మూడో టీ20లో ఇంగ్లండ్ భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్, బట్లర్ దాటిగా ఆడటంతో స్కోర్ 7 ఓవర్లలోనే 82 పరుగులకు చేరింది. 8 ఓవర్లో సిదార్థ్ కౌల్ బట్లర్(34)ను అవుట్ చేయడంతో పరుగుల దాటికి అడ్డుకట్ట పడింది. ఆ తర్వాత 103 పరుగుల వద్ద జాసన్(67) వెనుదిరగడంతో పరుగుల వేగం కాస్త తగ్గింది. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ హేల్స్ (30), బెయిర్‌స్టో(25), స్టోక్స్(14) పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కొల్పోయి 198 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా నాలుగు వికెట్లు, కౌల్ రెండు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, ఉమేశ్ యాదవ్‌లకు చెరో వికెటు దక్కింది. -
అమీతుమీలో నెగ్గేదెవరో!
ఇరు జట్లు చెరొకటి గెలిచాయి.ఇక గెలవాల్సింది మరొకటి. ఈ ఒక్కటి గెలిచేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి భారత్, ఇంగ్లండ్. రెండు జట్ల లక్ష్యం ఇప్పుడు ట్రోఫీనే. దీంతో నిర్ణాయక మూడో టి20లో తాడోపేడో తేల్చుకునేందుకు తహతహలాడుతున్నాయి. ఇటు కోహ్లి సేన, అటు మోర్గాన్ బృందం బ్యాటింగ్, బౌలింగ్ల్లో సమవుజ్జీగా కనబడుతున్నాయి. దీంతో ఆదివారం రసవత్తర పోరుకు తెరలేవనుంది. బ్రిస్టల్: నిర్ణాయక మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టి20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో విరాట్ కోహ్లి బృందం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లపైనే ఒత్తిడి ఉంది. తొలి మ్యాచ్‌లో సూపర్ హిట్టయిన కుల్దీప్కు రెండో మ్యాచ్ నిరాశనే మిగిల్చింది. అతను ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. చహల్ ఒకటే వికెట్ తీసి పరుగులు బాగానే సమర్పించున్నాడు. బుమ్రా స్థానంలో ఆడుతున్న ఉమేశ్ రెండు మ్యాచ్‌ల్లో కలిపి 4 వికెట్లు తీశాడు. కానీ పరుగులు ధారాళంగా ఇచ్చుకున్నాడు. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ టచ్‌లోకి రావడంతో భారత్‌కు కష్టాలు తప్పలేదు. ఈ నేపథ్యంలో బౌలర్లు వైవిధ్యంపై దృష్టిసారిస్తేనే ఫలితాలు రాబట్టుకోవచ్చు. బ్యాటింగ్ విషయానికొస్తే కుల్దీప్‌లాగే రాహుల్ పరిస్థితి ఉంది. మాంచెస్టర్‌లో ‘శత’క్కొట్టేసిన ఈ టాపార్డర్ బ్యాట్స్‌మన్ కార్డిఫ్‌లో విఫలమయ్యాడు. ఓపెనర్లూ చేతులెత్తేయడంతో మిడిలార్డర్‌పై భారం పెరిగింది. అయితే సిరీస్‌ను తేల్చే ఈ మ్యాచ్‌లో రోహిత్, ధావన్‌లు తమ ప్రభావం చూపిస్తే పరుగుల ప్రవాహానికి అడ్డు ఉండదు. ప్రత్యర్థి జట్టు సమతూకంగా ఉంది. బ్యాటింగ్‌లో బట్లర్, రాయ్, హేల్స్, బెయిర్ స్టో ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ బట్లర్ ప్రమాదకర బ్యాట్స్‌మన్. ఫిట్నెస్తో ఉన్న ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఆడించే విషయాన్ని టాస్కు ముందు నిర్ణయిస్తామని జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. బౌలింగ్‌లో విల్లీ, జేక్ బాల్, ప్లంకెట్లు భారత బ్యాటింగ్‌ను దెబ్బతీయగల సమర్థులు. గత మ్యాచ్‌లో వీళ్లంతా తీసింది ఒక్కో వికెటే అయినా... భారత్‌ను పుంజుకోకుండా చేశారు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, రైనా, ధోని, పాండ్యా, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, బట్లర్, హేల్స్, రూట్/స్టోక్స్, బెయిర్‌స్టో, విల్లీ, ప్లంకెట్, జోర్డాన్, రషీద్, జేక్ బాల్. హేల్స్ నిలబెట్టాడు కార్డిఫ్‌లో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొందింది. అలెక్స్ హేల్స్ (41 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరిదాకా నిలబడి ఇంగ్లండ్‌ను సిరీస్‌లో నిలబెట్టాడు. భారత్ తమ ముందుంచిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 44 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు జాసన్ రాయ్ (15), బట్లర్ (14)లను ఉమేశ్ యాదవ్ తక్కువ స్కోర్లకే ఔట్ చేయగా... చహల్ బౌలింగ్‌లో రూట్ (9) బౌల్డయ్యాడు. ఈ దశలో కెప్టెన్ మోర్గాన్ (17), బెయిర్ స్టో (18 బంతుల్లో 28; 2 సిక్సర్లు)లతో విలువైన భాగస్వామ్యాలు జతచేసిన హేల్స్ జట్టును గెలుపుబాట పట్టించాడు. ఈ క్రమంలో అతను 39 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఉమేశ్ 2, భువీ, చహల్, పాండ్యా తలా ఒక వికెట్ పడగొట్టారు. పిచ్, వాతావరణం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వేసవికాలం కాబట్టి వర్ష సూచన లేదు. పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలిస్తుంది. స్పిన్నర్లకు ఇది సవాలే! ►సా.గం.6.30 నుంచి సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–3 చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం -
సిరీస్ విజయంపై భారత్ గురి
-
ఇక్కడే కొట్టేయాలి
కార్డిఫ్: తొలి మ్యాచ్‌లో అద్భుత విజయంతో ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ప్రారంభించిన భారత జట్టు శుక్రవారం ఇక్కడ జరుగనున్న రెండో టి20లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కుల్దీప్ స్పిన్ మాయకు రాహుల్ సుడిగాలి ఇన్నింగ్స్ తోడవడంతో మొదటి మ్యాచ్‌లో అలవోకగా గెలుపొందిన కోహ్లిసేన అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. పటిష్టంగా కనిపించినప్పటికీ... టీమిండియాను ఎదుర్కోలేక చతికిలపడ్డ ఆతిథ్య ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు యత్నించనుంది. ఈ వేదికపై ఇంగ్లండ్ గతంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలి చింది. కార్డిఫ్ పిచ్ కాస్త నెమ్మదైనది కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు తక్కువే. స్పిన్నర్ల జోరు... బ్యాట్స్‌మెన్ హోరు... వేదికతో సంబంధం లేకుండా పిచ్ ఎలాంటిదైనా తన స్పిన్‌ను ఎదుర్కోవడం ఎంత కష్టమో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నిరూపించాడు. అతడి ఊరించే బంతులను భారీ షాట్లుగా మలచాలనుకున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మూల్యం చెల్లించుకున్నారు. ప్రధాన పేసర్ భువనేశ్వర్ భారీగా పరుగులిచ్చినా... హార్దిక్, ఉమేశ్ తప పని సమర్థవంతంగా నిర్వర్తించారు. బ్యాటింగ్ విషయానికొస్తే కొంత కాలంగా తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న రాహుల్... సెంచరీతో తనను తప్పించలేని పరిస్థితి కల్పించాడు. ఓపెనర్లు రోహిత్, ధావన్, మిడిలార్డర్లో కోహ్లి, ధోని, రైనా, పాండ్యా చెలరేగితే ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు తిరుగుండదు. మరోవైపు భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లండ్ తమ సామర్థ్యం మేరకు రాణించాలని భావిస్తుంది. -
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సభ్యుల సెలబ్రేషన్స్
-
భారత్‌పై ఓటమి.. ఇంగ్లండ్ పండుగ..!!
సాక్షి, హైదరాబాద్ : ఎనిమిది వికెట్ల తేడాతో తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆ రాత్రి పండుగ చేసుకుంది. ఎందుకో తెలుసా?. అదే రోజు రాత్రి అద్భుత పోరులో కొలంబియాపై నెగ్గిన ఇంగ్లండ్ జట్టు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడమే ఇందుకు కారణం. కాగా, ఇంగ్లండ్ క్రికెటర్ల ఆనంద హేల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో ఇంగ్లండ్ జట్టు కొలంబియాను మట్టికరిపించింది. కాగా, తొలి ట్వంటీ-20లో భారతీయ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ధాటికి ఇంగ్లండ్ జట్టు కుదేలైంది. 54 బంతుల్లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఛేజింగ్‌లో వార్వెవా అనిపించాడు. ఓటమి తర్వాత ఫుట్‌బాల్ విన్‌తో ఆనందంలో మునిగిన ఇంగ్లండ్ జట్టు ఎలాంటి ఒత్తిడి లేకుండా రెండో ట్వంటీ-20లోకి బరిలోకి దిగొచ్చు. ఇప్పటికే కుల్దీప్ను ఎదుర్కొనేందుకు ఆ జట్టు బ్యాట్స్మన్లు మెషీన్లతో బంతులు వేయించుకుని మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్ గెలుపు అనంతరం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సభ్యుల సెలబ్రేషన్స్‌ను కింది వీడియాలో తిలకించండి. -
ఇంగ్లండ్‌ను కూల్చేసిన కుల్దీప్ ఏమన్నాడంటే
మాంచెస్టర్ : తన ప్రణాళిక విజయవంతంగా అమలు కావడంతోనే 5 వికెట్లు దక్కాయని టీమిండియా మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లిసేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను కుల్దీప్ 5 వికెట్లతో దెబ్బతీశాడు. మ్యాచ్ అనంతరం ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మాట్లాడుతూ.. ‘పిచ్‌పై బంతి తిరగడం లేదనే విషయాన్ని నాకన్న ముందు బౌలింగ్ చేసిన చహల్ ఓవర్లోనే అర్థమైంది. అలాంటప్పుడు పేస్ బంతులేస్తే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ రెచ్చిపోతారని తెలుసు. దీంతో ప్రత్యేకమైన పేస్‌తో కూడిన బంతులేసాను. అవి విజయవంతమవడంతో 5 వికెట్లు దక్కాయి. బ్యాట్స్‌మన్ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ బౌలింగ్ చేయను. ఏం చేయాలనే దానిపైన మాత్రమే దృష్టిసారిస్తాను. కొన్ని సార్లు బ్యాట్స్‌మన్‌ను సైతం పరిగణలోకి తీసుకొవాల్సి ఉంటుంది. జోస్ బట్లర్‌కు బౌలింగ్ చేసేటప్పుడు అదే చేశాను. అతని గురించి నాకు పూర్తిగా తెలుసు. ఐపీఎల్లో అతనికి చాలా సార్ల బౌలింగ్ చేశాను. బట్లర్ నా బౌలింగ్‌లో రిస్క్ తీసుకోకుండా కేవలం సింగిల్స్‌కు ప్రయత్నిస్తాడన్న విషయం కూడా తెలుసు. అతనికి నేను సంతోషంగా సింగిల్స్ ఇస్తాను.’ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. హేల్స్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న కుల్దీప్.. 14 ఓవర్లో మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ అద్భుతమైన బౌలింగ్‌కు ధోని మాస్టర్ కీపింగ్ తోడవ్వడంతో ఏకంగా ఈ ఓవర్లో మోర్గాన్(8), బెయిర్ స్టో(0), రూట్(0)ల వికెట్లు దక్కాయి. దీంతో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి ఎడమ చేతివాటం బౌలర్‌గా కుల్దీప్ రికార్డు నమోదు చేశాడు. ఇక 160 పరుగుల లక్ష్యాన్ని భారత్.. కేఎల్ రాహుల్ (101; 54 బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సర్లు) అజేయ సెంచరీతో సునాయసంగా చేధించింది. -
కుల్దీప్ కూల్చేయగా.. రాహుల్ శతక్కొట్టగా
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరిగే సుదీర్ఘ సిరీస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. మూడు టీ20ల భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత కుల్దీప్(5/24) బౌలింగ్ ముందు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తేలిపోగా.. అనంతరం లోకేశ్ రాహుల్(101; 54 బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సర్లు) పరుగుల ప్రవాహం కొనసాగించాడు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. ఏడు పరుగుల స్కోర్ బోర్డు వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్(4) విల్లే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి స్కోర్ బోర్డు పరిగెత్తించారు. ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై రాహుల్ ఎదురుదాడికి దిగగా, రోహిత్ శర్మ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలోనే 27 బంతుల్లోనే రాహుల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 123 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడిని రషీద్ విడదీశాడు. రోహిత్ శర్మ (30; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్) వెనుదిరగటంతో కెప్టెన్ కోహ్లితో కలిసి లక్ష్యాన్ని రాహుల్ పూర్తి చేశాడు. రాహుల్ వీరోచిత ఇన్నింగ్స్‌తో మరో పది బంతులు మిగిలుండగానే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే, రషీద్ తలో వికెట్ సాధించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం జాసన్ రాయ్ (30; 20 బంతుల్లో 5ఫోర్లు) ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మరో వైపు ఐపీఎల్ హీరో జోస్ బట్లర్(69; 46 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) భారత బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఆకాశమే హద్దుగా బౌలర్లపై దాడి చేశాడు. దీంతో పది ఓవర్లలకే స్కోర్ 77 పరుగులు దాటింది. కుల్డీప్ కూల్చేశాడు.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చేలరేగుతుండంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న సమయంలో బంతి అందుకున్న కుల్డీప్ మాయ చేశాడు. హేల్స్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న కుల్దీప్.. 14 ఓవర్లో మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ అద్భుతమైన బౌలింగ్‌తో పాటు ధోని మాస్టర్ కీపింగ్‌తో ఏకంగా ఈ ఓవర్లో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో మోర్గాన్(8), బెయిర్ స్టో(0), రూట్(0) వెనుదిరగడంతో ఇంగ్లండ్ కష్టాల్లోపడింది. మరో వైపు వికెట్లు పడుతున్నా బట్లర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. చివర్లో డేవిడ్ విల్లీ (29; 15 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌కు పనిచెప్పడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ ఐదు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ రెండు, హార్దిక్ ఒక్క వికెట్ సాధించారు. -
ఇంగ్లండ్‌తో టీ20 : కుల్దీప్ తిప్పేశాడు
మాంచెస్టర్ : చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(5/24) మ్యాజిక్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ 159 పరుగులకే పరిమితమైంది. భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్ తడబడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం జాసన్ రాయ్ (30; 20 బంతుల్లో 5ఫోర్లు) ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మరో వైపు ఐపీఎల్ హీరో జోస్ బట్లర్(69; 46 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) భారత బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఆకాశమే హద్దుగా బౌలర్లపై దాడి చేశాడు. దీంతో పది ఓవర్లలకే స్కోర్ 77 పరుగులు దాటింది. కుల్డీప్ కూల్చేశాడు.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చేలరేగుతుండంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న సమయంలో బంతి అందుకున్న కుల్డీప్ మాయ చేశాడు. హేల్స్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న కుల్దీప్.. 14 ఓవర్లో మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ అద్భుతమైన బౌలింగ్‌తో పాటు ధోని మాస్టర్ కీపింగ్‌తో ఏకంగా ఈ ఓవర్లో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో మోర్గాన్(8), బెయిర్ స్టో(0), రూట్(0) వెనుదిరగడంతో ఇంగ్లండ్ కష్టాల్లోపడింది. మరో వైపు వికెట్లు పడుతున్నా బట్లర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. చివర్లో డేవిడ్ విల్లీ (29; 15 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌కు పనిచెప్పడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ ఐదు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ రెండు, హార్దిక్ ఒక్క వికెట్ సాధించారు. -
నేడే తోలి సమరం
-
స్టాన్లేక్ ధాటికి పాకిస్తాన్ చిత్తు
హరారే: వరుసగా 9 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పరాజయం తర్వాత ఎట్టకేలకు ఆస్ట్రేలియాకు గెలుపు దక్కింది. పేస్ బౌలర్ స్టాన్లేక్ (4/8) అద్భుత బౌలింగ్ ప్రదర్శనకు, కెప్టెన్ ఆరోన్ ఫించ్ (33 బంతుల్లో 68; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులు తోడవడంతో ముక్కోణపు టి20 టోర్నీలో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టాన్లేక్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. షాదాబ్ ఖాన్ (29) టాప్ స్కోరర్. నాలుగు ఓవర్ల స్పెల్ (4–0–8–4)లో ఓవర్‌కు ఓ వికెట్ చొప్పున పడగొట్టిన స్టాన్లేక్ పాక్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఛేదనలో కెప్టెన్ అరోన్ ఫించ్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆసీస్ 10.5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. -
తొలి సమరానికి సై
మాంచెస్టర్: గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్న భారత్ ఓ వైపు... తమపై ఉన్న సంప్రదాయ ముద్రను మరిపిస్తూ పొట్టి ఫార్మాట్లో చెలరేగుతున్న ఇంగ్లండ్ మరోవైపు. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య సమరానికి నేటితో తెరలేవనుంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మంగళవారం భారత్ తమ తొలి టి20లో బరిలో దిగనుంది. ఐర్లాండ్‌తో పొట్టి సిరీస్‌లో కోహ్లిసేనకు విజయంతో మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించగా... సొంతగడ్డపై ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లండ్ అదే జోరు ఇక్కడ కొనసాగించాలని భావిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో రికార్డులు తిరగరాస్తున్న మోర్గాన్ సేనను భారత్ బౌలర్లు ఎంతవరకు నిలువరిస్తారో చూడాలి. పూర్తిస్థాయిలో కోహ్లిసేన... ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడానికి ప్రత్యర్థి బంగ్లాదేశో, అఫ్గానిస్తానో కాదు. పటిష్ట ఇంగ్లండ్. అందుకే భారత్ ఈ టోర్నీ కోసం పూర్తి స్థాయి జట్టుతో సన్నద్ధమైంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు రోహిత్, ధావన్‌లతో పాటు కెప్టెన్ కోహ్లి, టి20 స్పెషలిస్ట్ రైనా, సీనియర్ ధోని, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే నాలుగో స్థానంలో ఎవరు ఆడతారనేదే ఆసక్తికరం. రాహుల్‌ను స్పెషలిస్ట్ ఓపెనర్‌గానే పరిగణిస్తే మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. జట్టులో ధోనీలాంటి వికెట్ కీపర్, అత్యుత్తమ ఫినిషర్ ఉన్న నేపథ్యంలో పాండే వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా యి. గాయం కారణంగా బుమ్రా సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో చహర్‌ను ఎంపిక చేసినా... అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువే. భువనేశ్వర్‌తో పాటు ఉమేశ్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువ. స్పిన్ జోడీ చహల్, కుల్దీప్ తామి క్కడ కూడా సత్తా చాటగలమని ఐర్లాండ్ సిరీస్‌తో నిరూపించుకున్నారు. భారత్ ఆడిన గత 20 టి20ల్లో 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించి జోరు మీద ఉంది. పటిష్ట బ్యాటింగ్‌తో ఇంగ్లండ్... బ్యాటింగే ప్రధాన బలంగా ఇంగ్లండ్ బరిలో దిగనుంది. ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసిన మోర్గాన్ సేన ఏకైక టి20లోనూ జయభేరి మోగించింది. బట్లర్, రాయ్, బెయిర్‌స్టో, మోర్గాన్, హేల్స్, రూట్లతో ఆ జట్టు బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. ఐపీఎల్–11 ఫామ్‌ను కొనసాగిస్తున్న బట్లర్ ఓపెనర్ అవతారం ఎత్తి జట్టు భారీ స్కోరుకు బాటలు వేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన అతను తొలి మ్యాచ్‌లోనే తమ దేశం తరఫున వేగవంతమైన అర్ధశతకం (22 బంతుల్లో) సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఇక్కడ కూడా అదే జోరు కొనసాగిస్తే భారత్‌కు కష్టకాలమే. ►రాత్రి గం. 10.00 నుంచి సోనీ సిక్స్, సోనీ–టెన్ 3లలో ప్రత్యక్ష ప్రసారం -
విజయాల్లో టీమిండియానే టాప్
డబ్లిన్: వరుస విజయాలతో దూసుకపోతున్న టీమిండియా మరో అరుదైన ఘనత సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో టీమిండియా 100 అంతర్జాతీయ టీ-20ల మైలురాయిని చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన ఏడో జట్టుగా టీమిండియా నిలిచింది. కాగా, ఐర్లాండ్‌తో ఆడిన 100వ టీ20 మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. దాంతో టీ20లో టీమిండియా విజయాల సంఖ్య 63 కు చేరింది. ఫలితంగా ఒక అంతర్జాతీయ జట్టు 100 టీ20లు ఆడే సమయానికి అత్యధిక విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఆ జాబితా ప్రకారం తర్వాతి స్థానాలలో వరుసగా దక్షిణాఫ్రికా(59), పాకిస్తాన్ (59), ఆస్ట్రేలియా( 53), శ్రీలంక (52), న్యూజిలాండ్(52), ఇంగ్లండ్(48) జట్లు ఉన్నాయి. -
టీ20లోనూ తీరు మారని ఆసీస్
బర్మింగ్‌హామ్: ఫార్మట్ ఏదైనా ఓడడం ఆస్ట్రేలియాకు.. గెలవడం ఇంగ్లండ్‌కు అలవాటైనట్లుంది.. ఐదు వన్డేల సిరీస్ వైట్‌వాష్‌కు గురైన ఆసీస్, ఏకైక టీ20లోనూ చతికిలపడింది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆసీస్‌పై 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించిన అనంతరం ఐపీఎల్ హీరో జోస్ బట్లర్ 61(30 బంతుల్లో; 6ఫోర్లు, 5 సిక్సర్లు) స్టాన్లేక్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ జాసన్ రాయ్ 44(26 బంతుల్లో 6ఫోర్లు) దూకుడుగా ఆడాడు. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకున్న మిగతా బ్యాట్స్‌మెన్ బ్యాట్ ఝుళిపించారు. చివర్లో అలెక్స్ హేల్స్ (49), రూట్ (35) మెరుపు ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగుల చేసింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్వెప్సన్ రెండు వికెట్లు సాధించగా.. స్టాన్లేక్, స్టోయినిస్ తలో వికెట్ సాధించారు. అనంతరం 222 పరుగలు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 193 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్ 84(41 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఫించ్‌కు మిగతా ప్రధాన బ్యాట్‌మెన్ నుంచి సహకారం అందకపోవటంతో ఆసీస్ ఓటమి చవిచూసింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్, జోర్డాన్ తలో మూడు వికెట్లు సాధించగా.. ప్లంకెట్ రెండు వికెట్లు, విల్లీ, మొయిన్ అలీ చెరో వికెట్ పడగొట్టారు.