ఆసీస్‌ మహిళా క్రికెటర్‌ మెగాన్‌ షుట్‌ హ్యాట్రిక్‌ | Aussie Megan Schutt Got Hat Trick | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ మహిళా క్రికెటర్‌ మెగాన్‌ షుట్‌ హ్యాట్రిక్‌

Published Thu, Sep 12 2019 3:03 AM | Last Updated on Fri, Sep 13 2019 3:30 PM

Aussie Megan Schutt Got Hat Trick - Sakshi

మహిళల క్రికెట్‌లో ఆ్రస్టేలియా పేసర్‌ మెగాన్‌ షుట్‌ అరుదైన ఘనతను నమోదు చేసింది. బుధవారం నార్త్‌సౌండ్‌లో వెస్టిండీస్‌ మహిళలతో జరిగిన మూడో వన్డేలో ఆమె ‘హ్యాట్రిక్‌’ సాధించింది. విండీస్‌ ఇన్నింగ్స్‌ 50వ ఓవర్‌ చివరి మూడు బంతులకు ఆమె మూడు వికెట్లు తీసింది. ఆసీస్‌కు వన్డేల్లో ఇదే తొలి హ్యాట్రిక్‌. గతేడాది భారత్‌తో ముంబైలో జరిగిన టి20 మ్యాచ్‌లో కూడా ‘హ్యాట్రిక్‌’ తీసిన ఘనత ఆమె సొంతం. తద్వారా అంతర్జాతీయ వన్డేలు, టి20ల్లో ‘హ్యాట్రిక్‌’ సాధించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా మెగాన్‌ షుట్‌  రికార్డులకెక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement