Hatrick
-
బంగారు బైల్స్.. ప్యారిస్ ఒలిపింక్స్‌లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ (ఫోటోలు)
-
అరుణాచల్‌లో బీజేపీ
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 60 స్థానాలకు గాను ఏకంగా 46 చోట్ల కాషాయ జెండా రెపరెపలాడింది. 10 స్థానాలు ముందే ఏకగ్రీవంగా బీజేపీ సొంతం కావడంతో ఏప్రిల్ 19న మిగతా 50 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. బీజేపీ 36 సీట్లు గెలుచుకోగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 5, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 3, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) 2 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు సాధించగా ఈసారి మరో ఐదు పెరగడం విశేషం. ఏకగ్రీవంగా నెగ్గిన వారిలో సీఎం పెమా ఖండూ కూడా ఉన్నారు. అభివృద్ధి రాజకీయాలకు పట్టం: మోదీ అరుణాచల్ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. బీజేపీకి మరోసారి విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం మరింత ఉత్సాహంగా, నూతన శక్తితో పని చేస్తామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారు. పార్టీ కార్యకర్తల అలుపెరుగని కృషితోనే ఈ విజయం సాధ్యమైంది’’ అని అన్నారు. సంగీతాభిమాని...అరుణాచల్‌లో బీజేపీని వరుసగా మూడోసారి గెలుపు బాటన నడిపిన నాయకుడిగా పెమా ఖండూ పేరు మార్మోగిపోతోంది. క్రీడలు, సంగీతం పట్ల అమితాసక్తి ఉన్న ఆయన రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2000లో కాంగ్రెస్‌లో చేరిన ఖండూ తండ్రి డోర్జీ ఖండూ ప్రాతినిధ్యం వహించిన ముక్తో అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో గెలిచారు. నబామ్ తుకీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2016 జనవరిలో రాష్ట్రపతి పాలన అనంతరం బీజేపీ మద్దతిచి్చన కల్హోపుల్ ప్రభుత్వంలో మరోసారి మంత్రి అయ్యారు. సుప్రీంకోర్టు జోక్యంతో తుకీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది. తుకీ రాజీనామాతో 2016లో ఖండూ 37 ఏళ్ల వయసులో తొలిసారి సీఎం అయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు. 2019లో రెండోసారి సీఎం అయి ఐదేళ్లూ కొనసాగారు. తాజాగా మరోసారి విజయం దక్కించుకున్నారు. బౌద్ధ మతస్థుడైన పెమా ఖండూ మోన్పా గిరిజన తెగకు చెందినవారు. తండ్రి డోర్జీ 2011లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. -
Lok Sabha Election 2024: మోదీ @ 200 సభలు, రోడ్‌షోలు
సాక్షి, న్యూఢిల్లీ: ముచ్చటగా మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకుని రావడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఒక్కో రోజు మూడు నుంచి ఐదు సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. మార్చి 16న ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మొత్తంగా మోదీ 206 సభలు, సమావేశాలు, రోడ్‌షో, ర్యాలీల్లో పాల్గొన్నారు. ఒక్క మేలో 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని ఏకంగా 31 సభల్లో పాల్గొన్నారు. బిహార్‌లో 20, మహారాష్ట్రలో 19, పశి్చమబెంగాల్లో 16 సభలకు హాజరయ్యారు. కేవలం ఈ 4 రాష్ట్రాల్లోనే 86 సభల్లో మోదీ పాల్గొనడం గమనార్హం. దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేశారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణల్లో 11, తమిళనాడులో 7 ప్రచార కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో మోదీ 145 సభలు, సమావేశాలు, రోడ్‌షో, ర్యాలీల్లో పాల్గొన్నారు. 2019లో 68 రోజులు ప్రచారంచేయగా ఈసారి 76 రోజులపాటు ప్రచారంచేశారు. ఈసారి ఆయన మొత్తం 80 మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంటే సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కువ. -
ముంబై ఇండియన్స్ బౌలర్ హ్యాట్రిక్.. వీడియో వైరల్
సెల్హాట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో శ్రీలంక పేసర్ నువాన్ తుషారా హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఐదో శ్రీలంక బౌలర్‌గా నువాన్ రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 4 ఓవర్లో తుషారా ఈ ఘనత సాధించాడు. ఆ ఓవర్లో రెండో బంతికి నజ్ముల్ హోస్సేన్ షాంటోను తుషారా క్లీన్ బౌల్డ్ చేయగా.. మూడో బంతికి హృదయ్, నాలుగో బంతికి మహ్మదుల్లాను తుషారా పెవిలియన్‌కు పంపాడు. దీంతో తుషారా తొలి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఐపీఎల్-2024 వేలంలో తుషార్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. రూ.4.8 కోట్లకు అతడిని ముంబై ఫ్రాంచైజీ దక్కించుకుంది. చదవండి: #Sarfaraz: తెగ మిడిసిపడుతున్నాడు.. గిల్- బెయిర్‌స్టో గొడవలో సర్ఫరాజ్.. వైరల్ NUWAN THUSHARA HAT TRICK!#BANvSL #SLvBAN pic.twitter.com/cRVHgu1RBP — Abdullah Neaz (@Neaz__Abdullah) March 9, 2024 -
TS Election 2023: సీఎం.. కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం.. మదన్‌రెడ్డి జోస్యం..
మెదక్: సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం స్థానిక సాయిక్రిష్ణ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ రాబోయే ఎన్నికలలో గెలవడం ఖాయమన్నారు. ఈనెల 23న మెదక్‌కు వస్తున్న సీఎం పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం జరిగే బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి 40వేల మందిని తరలించాలని మంత్రి హరీశ్‌రావు లక్ష్యంగా నిర్ణయించారని చెప్పారు. సభను విజయవంతం చేసేందుకు నాయకులు కృషి చేయాలని కోరారు. నియోజకవర్గానికి మూడు వేల గృహలక్ష్మి ఇళ్లను కేటాయించారని, మరో రెండు వేల ఇళ్లను కేటాయించాలని మెదక్ సభలో సీఎంకు విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాల్గొనే మెదక్ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. జనా న్ని భారీగా తరలించాలని ఆమె కోరారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతో నర్సాపూర్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని చెప్పారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు. సమావేశానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, అసంఘటి త కార్మిక బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా జెడ్పీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, ప్యాక్స్ చైర్మన్ రాజుయాదవ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, వెంకట్‌రెడ్డి, శేకర్, అశోక్‌గౌడ్, శ్రీధర్‌గుప్తా, నయిం, సుధీర్‌రెడ్డి, భిక్షపతి, వీరేశ్ పాల్గొన్నారు. -
ఐపీఎల్ 2022: బట్లర్ భళా... చహల్ చాంగుభళా
IPL 2022 RR Vs KKR- ముంబై: ఐపీఎల్ పుట్టిన రోజున ఇంతకంటే ఆసక్తికర పోరును ఆశించలేమేమో! లీగ్ తొలి చాంపియన్, మెరుపు బ్యాటింగ్‌తో తొలి రోజును వెలిగించిన జట్ల మధ్య జరిగిన పోరు హోరాహోరీగా సాగి అభిమానులను అలరించింది. బట్లర్ సూపర్ సెంచరీకి తోడు యజువేంద్ర చహల్ ‘హ్యాట్రిక్’ ప్రదర్శన రాజస్తాన్‌ను గెలిపించాయి. చేతిలో 6 వికెట్లతో 24 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన స్థితిలో విజయం దిశగా సాగిన కోల్‌కతా... 17వ ఓవర్లో చహల్‌కు నాలుగు వికెట్లు సమర్పించుకొని ఓటమికి బాటలు వేసుకుంది. చివరకు 7 పరుగుల తేడాతో రాయల్స్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (61 బంతుల్లో 103; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఈ సీజన్లో రెండో సెంచరీ సాధించగా, సంజు సామ్సన్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లో 210 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (51 బంతుల్లో 85; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆరోన్ ఫించ్ (28 బంతుల్లో 58; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చహల్ ‘హ్యాట్రిక్’సహా ఐదు వికెట్లు తీశాడు. 17వ ఓవర్లోని చివరి మూడు బంతుల్లో వరుసగా శ్రేయస్ అయ్యర్, శివమ్ మావి, కమిన్స్‌లను అవుట్ చేసి చహల్ హ్యాట్రిక్ సాధించాడు. బట్లర్ మరో సెంచరీ... రాజస్తాన్‌ను నియంత్రించడంలో ఒక్క నరైన్ మినహా మిగతా బౌలర్లంతా విఫలమయ్యారు. ఎప్పటిలాగే బట్లర్ తనదైన శైలిలో దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించగా... ఈసారి దేవదత్ పడిక్కల్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిని కనబర్చాడు. వరుణ్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన బట్లర్, మావి ఓవర్లోనూ వరుసగా 4, 6 బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 60 పరుగులకు చేరింది. ఆ తర్వాత 29 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు 97 పరుగుల (59 బంతుల్లో) భాగస్వామ్యం తర్వాత పడిక్కల్‌ను అవుట్ చేయడంతో కోల్‌కతాకు తొలి వికెట్ దక్కింది. అయితే ఆ తర్వాత బట్లర్ జోరు కొనసాగగా, మూడో స్థానంలో వచ్చిన సామ్సన్ కూడా వేగంగా దూసుకుపోయాడు. ఉమేశ్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన అతను రసెల్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. కమిన్స్ వేసిన ఫుల్‌టాస్‌ను లాంగాన్ మీదుగా సిక్స్‌గా మలచి 59 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న బట్లర్... అదే ఓవర్లో అవుటయ్యాడు. అయితే చివర్లో హెట్‌మైర్ (13 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు రాయల్స్‌కు భారీ స్కోరును అందించాయి. రసెల్ వేసిన 20వ ఓవర్లోనే అతను 2 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. శతక భాగస్వామ్యం... తొలి బంతికే నరైన్ (0) రనౌట్‌తో కోల్‌కతా ఇన్నింగ్స్ మొదలైంది. ఆ తర్వాత ఫించ్, శ్రేయస్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. శ్రేయస్ తొలి రెండు ఓవర్లలో వరుసగా రెండేసి ఫోర్లు కొట్టగా, ఐపీఎల్లో చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ కూడా బౌల్ట్ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. చహల్ ఓవర్లోనూ మూడు ఫోర్లు, ఆపై మెక్కాయ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన ఫించ్ 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 107 పరుగుల పార్ట్నర్షిప్ తర్వాత ఫించ్ వెనుదిరగ్గా, 32 బంతుల్లో శ్రేయస్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ధాటిగా ఆడాల్సిన తరుణంలో మరో ఎండ్‌లో రాణా (18), రసెల్ (0) విఫలం కావడంతో గెలిపించాల్సిన బాధ్యత శ్రేయస్‌పై పడింది. అయితే ఉమేశ్ (9 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పోరాడినా చివరకు కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (సి) వరుణ్ (బి) కమిన్స్ 103; పడిక్కల్ (బి) నరైన్ 24; సామ్సన్ (సి) మావి (బి) రసెల్ 38; హెట్‌మైర్ (నాటౌట్) 26; పరాగ్ (సి) మావి (బి) నరైన్ 5; నాయర్ (సి) కమిన్స్ (బి) మావి 3; అశ్విన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–97, 2–164, 3–183, 4–189, 5–198. బౌలింగ్: ఉమేశ్ 4–0–44–0, మావి 4–0–34–1, వరుణ్ 2–0–30–0, కమిన్స్ 4–0–50–1, నరైన్ 4–0–21–2, రసెల్ 2–0–29–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) నాయర్ (బి) ప్రసిధ్ 58; నరైన్ (రనౌట్) 0; శ్రేయస్ (ఎల్బీ) (బి) చహల్ 85; రాణా (సి) బట్లర్ (బి) చహల్ 18; రసెల్ (బి) అశ్విన్ 0; వెంకటేశ్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 6; జాక్సన్ (సి) ప్రసిధ్ (బి) మెక్కాయ్ 8; మావి (సి) పరాగ్ (బి) చహల్ 0; కమిన్స్ (సి) సామ్సన్ (బి) చహల్ 0; ఉమేశ్ (బి) మెక్కాయ్ 21; వరుణ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 210. వికెట్ల పతనం: 1–0, 2–107, 3–148, 4–149, 5–178, 6–180, 7–180, 8–180, 9–209, 10–210. బౌలింగ్: బౌల్ట్ 4–0–48–0, ప్రసిధ్ 4–0–43–1, మెక్కాయ్ 3.4–0–41–2, అశ్విన్ 4–0–38–1, చహల్ 4–0–40–5. 21:ఐపీఎల్లో నమోదైన మొత్తం హ్యాట్రిక్‌లు. ఇందులో 12 మంది భారత బౌలర్లు హ్యాట్రిక్ తీయగా... అమిత్ మిశ్రా మూడుసార్లు, యువరాజ్ సింగ్ రెండుసార్లు చొప్పున హ్యాట్రిక్ సాధించడం విశేషం. ఐపీఎల్లో నేడు బెంగళూరు X లక్నో సూపర్ జెయింట్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం WHAT. A. GAME! WHAT. A. FINISH! 👏 👏 The 1⃣5⃣-year celebration of the IPL done right, courtesy a cracker of a match! 👌 👌@rajasthanroyals hold their nerve to seal a thrilling win over #KKR. 👍 👍 Scorecard ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR pic.twitter.com/c2gFuwobFg — IndianPremierLeague (@IPL) April 18, 2022 -
లక్ష్య సేన్ హ్యాట్రిక్
న్యూఢిల్లీ: ఈ సీజన్లో తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ భారత యువ షట్లర్ లక్ష్య సేన్ ‘హ్యాట్రిక్’ సాధించాడు. వరుసగా మూడో అంతర్జాతీయ టోర్నమెంట్లో సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు. జర్మనీలోని సార్బ్రాకెన్లో ఆదివారం ముగిసిన సార్లర్లక్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో ఈ ఉత్తరాఖండ్ షట్లర్ చాంపియన్‌గా నిలిచాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో లక్ష్య సేన్ 17–21, 21–18, 21–16తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)పై గెలిచాడు. విజేత లక్ష్య సేన్‌కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.3 లక్షల 96 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీకంటే ముందు లక్ష్యసేన్ డచ్ ఓపెన్, బెల్జియం ఓపెన్ టైటిల్స్ సాధించాడు. -
యూరోప్ జట్టు హ్యాట్రిక్
జెనీవా (స్విట్జర్లాండ్): ప్రతి యేటా మేటి టెన్నిస్ ఆటగాళ్ల మధ్య నిర్వహిస్తున్న లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో యూరోప్ జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా మూడో ఏడాది ఈ టోర్నీలో విజేతగా నిలిచి హ్యాట్రిక్ సాధించింది. రాఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), సిట్సిపాస్ (గ్రీస్), ఫాగ్నిని (ఇటలీ), బాటిస్టా అగుట్ (స్పెయిన్)లతో కూడిన యూరోప్ జట్టు 13–11తో వరల్డ్ టీమ్‌పై విజయం సాధించింది. వరల్డ్ టీమ్‌లో జాన్ ఇస్నెర్ (అమెరికా), మిలోస్ రావ్‌నిచ్ (కెనడా), నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), షపోవలోవ్ (కెనడా), జాక్ సోక్ (అమెరికా), జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) సభ్యులుగా ఉన్నారు. నిర్ణాయక చివరి సింగిల్స్ మ్యాచ్‌లో యూరోప్ జట్టు ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 3–6, 10–4తో రావ్‌నిచ్ (వరల్డ్ టీమ్)పై నెగ్గి తన జట్టుకు కప్ అందించాడు. మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 12 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొమ్మిది సింగిల్స్ విభాగంలో, మూడు డబుల్స్ విభాగంలో నిర్వహించారు. తొలి రోజు జరిగిన మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచిన వారికి ఒక్కో పాయింట్, రెండో రోజు రెండు పాయింట్లు, మూడో రోజు మూడు పాయింట్ల చొప్పున కేటాయించారు. -
ఆసీస్ మహిళా క్రికెటర్ మెగాన్ షుట్ హ్యాట్రిక్
మహిళల క్రికెట్లో ఆ్రస్టేలియా పేసర్ మెగాన్ షుట్ అరుదైన ఘనతను నమోదు చేసింది. బుధవారం నార్త్‌సౌండ్‌లో వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో ఆమె ‘హ్యాట్రిక్’ సాధించింది. విండీస్ ఇన్నింగ్స్ 50వ ఓవర్ చివరి మూడు బంతులకు ఆమె మూడు వికెట్లు తీసింది. ఆసీస్‌కు వన్డేల్లో ఇదే తొలి హ్యాట్రిక్. గతేడాది భారత్‌తో ముంబైలో జరిగిన టి20 మ్యాచ్‌లో కూడా ‘హ్యాట్రిక్’ తీసిన ఘనత ఆమె సొంతం. తద్వారా అంతర్జాతీయ వన్డేలు, టి20ల్లో ‘హ్యాట్రిక్’ సాధించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా మెగాన్ షుట్ రికార్డులకెక్కింది. -
భళారే బుమ్రా
ఔరా... బుమ్రా. తొలి స్పెల్‌లో (6–1–10–5) నిప్పులు చెరిగే ప్రదర్శనతో వెస్టిండీస్‌ను నిలువునా కూల్చేశాడు. అతని ‘హ్యాట్రిక్’ ఆతిథ్య జట్టు పతనానికి నాంది పలికింది. కనాకష్టంగా వంద పైచిలుకు పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా రెండో టెస్టులోనూ భారత జట్టు గెలుపుబాట పట్టేసింది. కింగ్స్టన్: భారత్ మూడో రోజే ఆఖరి టెస్టును శాసించే స్థితిలో నిలిచింది. భారత్ ఆల్‌రౌండ్ షోకు ప్రత్యర్థి విలవిలలాడుతోంది. విండీస్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా భారీ లక్ష్యంతో ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనే ఎత్తుగడతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఇక టీమిండియా గెలుపును వర్షం తప్ప ఇంకేవీ ఆపే పరిస్థితులు కనిపించడంలేదు. అంతకుముందు ఆదివారం వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 117 పరుగులే చేసి ఆలౌటైంది. భారత పేస్ ఎక్స్‌ప్రెస్ జస్ప్రీత్ బుమ్రా (6/27) హ్యాట్రిక్‌తో విండీస్‌ను కూల్చేశాడు. షమీకి 2 వికెట్లు, ఇషాంత్, జడేజాలకు ఒక్కో వికెట్ దక్కాయి. హెట్‌మైర్ (34; 7 ఫోర్లు) చేసిన ఆ కాసిన్ని పరుగులే విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరు! దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే విండీస్‌ను ఫాలోఆన్ ఆడించకుండా భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. భారత్ కడపటి వార్తలందేసరికి 31 ఓవర్లలో 4 వికెట్లకు 57 పరుగులు చేసింది. రాహుల్ (6), మయాంక్ (4), కోహ్లి (0), పుజారా (27) ఔటయ్యారు. రహానే (12 బ్యాటింగ్), విహారి (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 356 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజే గెలుపు బాట... వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ ఆట పరుగులతో కాకుండా పతనంతో మొదలైంది. ఒకానొక దశలో అయితే... పరుగు చేయకుండానే మూడు వికెట్లు టపటపా రాలిపోయాయి. ఆతిథ్య బ్యాట్స్‌మెన్ ఆడేందుకు వస్తున్నారా... లేక పలాయనం చిత్తగించేందుకా అన్నట్లు ఇన్నింగ్స్ సాగింది. చేసే పరుగులు పక్కనబెడితే... క్రీజులో నిలబడే బ్యాట్స్‌మెన్ కూడా విండీస్‌కు కరువయ్యాడు. టాపార్డర్ నుంచి ఐదో వరుస బ్యాట్స్‌మెన్ దాకా అందరిదీ అదే దారి! ఇందులో మొదటి ఓపెనర్ బ్రాత్‌వైట్ (10) రెండంకెల స్కోరైనా చేశాడు. అనంతరం ఆ వరుసలో భారత పేస్ పదునుకు ఏ ఒక్కరూ నిలబడలేకపోయారు. 13 ఓవర్లకే సగం కూలింది... వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్ పేలవమైన ఆరంభాన్నిచ్చారు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా తన పేస్ పదును పెంచాడు. చకాచకా వికెట్లను తీశాడు. ఇన్నింగ్స్‌లో పది ఓవర్లు ముగియకముందే నాలుగు వికెట్లను తనే çపడగొట్టాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో క్యాంప్‌బెల్‌ను కీపర్ రిషభ్ పంత్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్లో (9వ) హ్యాట్రిక్ దెబ్బ తీశాడు. బ్రేవో, బ్రూక్స్, ఛేజ్‌లు అతని నిప్పులు చెరిగే బంతులకు తలవంచారు. ఆ ఓవర్ ముగియక ముందే... 8.4 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరెంతో తెలుసా... 13/4. బ్రాత్‌వైట్ కొంచెం ఆలస్యంగా ఔటయినా... నిష్క్రమించింది మాత్రం బుమ్రా బౌలింగ్‌లోనే! ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అతను ఔట్ కావడంతో విండీస్ 22 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. కాసేపు నిలబడిన హెట్‌మైర్... ఆదిలోనే ఐదు వికెట్లను కోల్పోయిన ఆతిథ్య జట్టు వికెట్ల పతనాన్ని లోయర్ మిడిలార్డర్లో హెట్‌మైర్, కెప్టెన్ హోల్డర్ (18) కాసేపు అడ్డుకోగలిగారు... కానీ ఒడ్డున పడేయలేకపోయారు. ఆరో వికెట్‌కు 45 పరుగులు జోడించాక హెట్‌మైర్ ఆటను షమీ ముగించాడు. మరో బ్యాట్స్‌మన్ క్రీజులోకి వచ్చి సర్దుకునేలోపే హోల్డర్‌ను కూడా బుమ్రానే ఔట్ చేశాడు. దీంతో 78 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. రెండో రోజు ఆటనిలిచే సమయానికి 7 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఈ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన విండీస్ మరో 30 పరుగులు చేసి మిగతా 3 వికెట్లు కోల్పోయింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 416; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (సి) పంత్ (బి) బుమ్రా 10; క్యాంప్‌బెల్ (సి) పంత్ (బి) బుమ్రా 2; బ్రేవో (సి) రాహుల్ (బి) బుమ్రా 4; బ్రూక్స్ ఎల్బీడబ్ల్యూ (బి) బుమ్రా 0; చేజ్ ఎల్బీడబ్ల్యూ (బి) బుమ్రా 0; హెట్‌మైర్ (బి) షమీ 34; హోల్డర్ (సి) సబ్–రోహిత్ (బి) బుమ్రా 18; హామిల్టన్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 5; కార్న్‌వాల్ (సి) రహానే (బి) షమీ 14; రోచ్ (సి) మయాంక్ (బి) జడేజా 17; గాబ్రియెల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (47.1 ఓవర్లలో ఆలౌట్) 117. వికెట్ల పతనం: 1–9, 2–13, 3–13, 4–13, 5–22, 6–67, 7–78, 8–97, 9–117, 10–117. బౌలింగ్: ఇషాంత్ శర్మ 10.5–3– 24–1, జస్ప్రీత్ బుమ్రా 12.1–3–27–6, మొహమ్మద్ షమీ 13–3–34–2, రవీంద్ర జడేజా 11.1–7–19–1. కోహ్లి రివ్యూ... బుమ్రా హ్యాట్రిక్ కోహ్లి రివ్యూ పుణ్యమాని బుమ్రా భారత టెస్టు చరిత్రలో భాగమయ్యాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన ఈ పేసర్ రెండో బంతికి బ్రేవో, మూడో బంతికి బ్రూక్స్‌ను ఔట్ చేశాడు. నాలుగో బంతి చేజ్ ప్యాడ్లను తాకింది. ఎల్బీ కోసం అప్పీలు చేయగా అం పైర్ తిరస్కరించాడు. అయితే కోహ్లి రివ్యూ కోరగా చేజ్ వికెట్ల ముందు దొరికినట్లు రివ్యూ లో తేలింది. అంతే బుమ్రాతోపాటు, భారత శిబిరం హ్యాట్రిక్ ఆనందాల్లో మునిగింది. 3: టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మూడో భారతీయ బౌలర్ బుమ్రా. గతంలో హర్భజన్ సింగ్ (ఆస్ట్రేలియాపై కోల్‌కతాలో; 2001), ఇర్ఫాన్ పఠాన్ (పాకిస్తాన్‌పై కరాచీలో; 2006) ఈ ఘనత సాధించారు. 44: టెస్టు క్రికెట్లో ఇది 44వ హ్యాట్రిక్కాగా ఈ ఘనత సాధించిన 40వ బౌలర్ బుమ్రా. నలుగురు బౌలర్లు (ట్రంబుల్, జిమ్మీ మాథ్యూస్, అక్రమ్, స్టువర్ట్ బ్రాడ్) రెండుసార్లు చొప్పున హ్యాట్రిక్ నమోదు చేశారు. 7: భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన ఏడో బౌలర్ బుమ్రా. చేతన్ శర్మ, కపిల్ దేవ్, కుల్దీప్ యాదవ్, షమీ వన్డే ఫార్మాట్లో హ్యాట్రిక్ తీశారు. -
దబంగ్ ఢిల్లీకి కళ్లెం
ముంబై: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీకి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ కళ్లెం వేసింది. ముంబైలోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 31–26తో ఢిల్లీని కంగుతినిపించింది. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం కీలక సమయంలో ఒత్తిడిని జయించిన ఫార్చూన్ జెయింట్స్నే వరించింది. దీంతో లీగ్‌లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన మోరే 9 పాయింట్ల(4 రైడ్ పాయింట్లు, 4 టాకిల్ పాయింట్లు, ఒక బోనస్ పాయింటు)తో గుజరాత్‌కు విజయాన్ని అందించాడు. అతనికి రోహిత్ గులియా (8 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. దబంగ్ రైడర్ నవీన్ కుమార్ సూపర్ ‘టెన్’ సాధించినా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ యోధతో తెలుగు టైటాన్స్; యు ముంబాతో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ తలపడతాయి. -
హ్యాట్రిక్ సాధ్యమయ్యేనా..!
సాక్షి,నిజాంసాగర్(జుక్కల్): కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దు కూడలిగా ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో మూడు రాష్ట్రాల సంప్రదాయం కలగలిపి ఉంటుంది. కన్నడ, మరాఠీ, తెలుగు భాష సాంప్రదాయలతో ఈ ప్రాంత ప్రజల ప్రత్యేకత వేరు. ఈ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పటికీ ఏ ఒక్కరూ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించలేకపోయారు. గతంలో నాలుగుసార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించినా, వరుసగా మూడు సార్లు గెలవలేదు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో హన్మంత్ సింధే గెలుపొందారు. ప్రస్తుతం ఆయన తిరిగి ఎన్నికయితే హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టిస్తారు. ఆయన హ్యాట్రిక్ సాధింస్తారో లేదో తేలాలంటే డిసెంబర్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. 14 సార్లు ఎన్నికలు ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన జుక్కల్ నియోజకవర్గానికి 1952 నుంచి 2014 వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇన్నేళ్లయినా అభ్యర్థులు ఎవ్వరూ హ్యాట్రిక్ సాధించలేరు. స్వతంత్ర అభ్యర్థులు నాలుగుసార్లు, కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు సార్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నాలుగుసార్లు, టీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కసారి విజయం సాధించారు. కానీ ఆయా పార్టీల తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు హ్యాట్రిక్ సాధించలేరు. 1967, 1972 సంవత్సరంలో సామెల్ విఠల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా సౌదాగర్ గంగారాం 1978, 1983 వరుసగా రెండు సార్లు, 1989, 2004 సంవత్సరాల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. 1985, 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరపున బేగరి పండరి రెండు సార్లు గెలుపొందారు. 1999 సంవత్సరంలో టీడీపీ తరపున కుమారి అరుణతార విజయం సాధించారు. అలాగే 2009 సంవత్సరంలో టీడీపీ, 2014 సంవత్సరంలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన హన్మంత్‌సింధే వరుసగా రెండు సార్లు చొప్పున గెలుపొందారు. ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న సింధేకు హ్యాట్రిక్ చాన్స్ ఉంది. కానీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అసెంబ్లీ ఎన్నికల పోరు పోటాపోటీగా ఉంది. నాలుగోసారి బరిలోకి సింధే ప్రజాసేవ కోసం ఇంజినీరింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి హన్మంత్ సింధే రాజకీయాల్లోకి వచ్చారు. నీటిపారుదలశాఖలో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన హన్మంత్‌సింధే 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి జుక్కల్ అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కేరాఫ్‌గా నిలిచిన నేత సౌదాగర్ గంగారాం మూడుసార్లు జుక్కల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 సంవత్సరం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హన్మంత్ సింధేను కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాం ఓడించారు. అప్పటి ఓటమితో గుణపాఠం నేర్చుకున్న సింధే జుక్కల్ నియోజకవర్గ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేశారు. దాంతో 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున రెండో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ సావిత్రి బాయిపై విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా హన్మంత్‌సింధే మూడోసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు. ప్రస్తుతం గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని నాలుగోసారి ఎన్నికల బరిలో నిలిచారు. -
మరో హ్యాట్రిక్‌పై గురి!
నటుడు విజయ్ మరో హ్యాట్రిక్‌పై కన్నేశారని కోలీవుడ్ సమాచారం. ‘తేరీ, మెర్సెల్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దర్శకుడు అట్లీ–హీరో విజయ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ‘సర్కార్’ షూటింగ్‌ను కంప్లీట్ చేసిన తర్వాత విజయ్ ఈ సినిమా షూట్లో జాయిన్ అవుతారని టాక్. ఇక ‘సర్కార్’ విషయానికొస్తే..‘కత్తి, తుపాకి’ వంటి సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత దర్శకుడు మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘సర్కార్’. కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ఇటు మురుగదాస్, అటు అట్లీ.. ఇలా వరుసగా హ్యాట్రిక్ చిత్రాలపై విజయ్ గురిపెట్టడం కోలీవుడ్‌లో ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారారు. -
ఆ హీరోయిన్‌కు అదృష్టం పట్టుకుంది..
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ మెహ్రీన్ కౌర్‌కు అదృష్టం పట్టుకుంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా హ్యీట్రిక్ విజయం సాధించాయి. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్లో ఆరంగ్రేటం చేసింది. ఆ సినిమా విజయం సాధించినప్పటికీ అవకాశాలు రాలేదు. దాదాపుగా ఒక ఏడాది పాటు అవకాశం ఎదురు చూసింది మెహ్రీన్. నిధానమే ప్రధానం అన్నది మెహ్రీన్‌కు సెట్ అవుతుందేమో. ఈ ఏడాది ఆమె వరుసగా రెండు సినిమాలు చేసింది. కొద్ది రోజుల క్రితం శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మెహ్రీన్ చాలా బాగా నటించింది. అంతేకాక ఆమెకు మంచిపేరును తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఆనందంలో ఉన్న మెహ్రీన్‌కు తాజాగా విడుదలైన రవితేజ ‘రాజా ది గ్రేట్’ కూడా విజయాన్ని అందుకుంది. ఈ విధంగా మెహ్రీన్ టాలీవుడ్లో హ్యాట్రిక్ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాల విజయంతో ఆమెకు ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. సాయి ధరమ్ తేజ్‌తో మెహ్రీన్ జవాన్ సినిమాలో జత కట్టిన విజయం తెలిసందే. ఈ సినిమాకు బీబీఎస్ రవి దర్శకత్వంలో వహిస్తున్నారు. -
జొకోవిచ్ ‘హ్యాట్రిక్'
లండన్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ‘హ్యాట్రిక్' సాధించాడు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను అతను వరుసగా మూడో ఏడాది సొంతం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి జరగాల్సిన ఫైనల్లో ఈ సెర్బియా స్టార్‌కు స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నుంచి ‘వాకోవర్' లభించింది. వెన్ను నొప్పి కారణంగా ఫైనల్ ఆడేందుకు ఫిట్‌గా లేనంటూ ఫెడరర్ స్వయంగా కోర్టులోకి వచ్చి ప్రకటించాడు. 45 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్లో ‘వాకోవర్’ రావడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో జొకోవిచ్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ‘హ్యాట్రిక్’ సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో ఇవాన్ లెండిల్ (1985 నుంచి 1987 వరకు); ఇలీ నస్టాసే (1971 నుంచి 1973 వరకు) మాత్రమే ఈ ఘనత సాధించారు. టోర్నీలో అజేయంగా నిలిచిన జొకోవిచ్‌కు 20 లక్షల 75 వేల డాలర్ల (రూ. 12 కోట్ల 82 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. డబుల్స్ విభాగంలో బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) జంట విజేతగా నిలిచింది. -
షరపోవా ‘హ్యాట్రిక్’
ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ మరియా షరపోవా (రష్యా) వరుసగా మూడో ఏడాది టైటిల్ సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఫైనల్లో షరపోవా 3-6, 6-4, 6-1తో మాజీ నంబర్‌వన్ అనా ఇవనోవిచ్ (సెర్బియా)పై గెలిచింది. షరపోవా కెరీర్లో ఇది 30వ అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. విజేతగా నిలిచిన షరపోవాకు రూ. కోటీ 25 లక్షలు విలువచేసే ‘పోర్షె 911 టార్గా 4ఎస్’ మోడల్ కారుతోపాటు 96,774 యూరోలు (రూ. 81 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
హ్యాట్రిక్‌పై హామిల్టన్ గురి
సీజన్లో మూడో ‘పోల్ పొజిషన్’ నేడు చైనా గ్రాండ్‌ప్రి షాంఘై: మరోసారి తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ‘హ్యాట్రిక్’ విజయంపై దృష్టి సారించాడు. ఆదివారం జరిగే చైనా గ్రాండ్‌ప్రి రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ నుంచి ప్రారంభించనున్నాడు. ఆస్ట్రేలియా, మలేసియా గ్రాండ్‌ప్రి రేసులను కూడా ‘పోల్ పొజిషన్’తో మొదలుపెట్టిన హామిల్టన్ ఈసారి గెలిస్తే తన కెరీర్లో తొలిసారి ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తాడు. ఈ సీజన్లో అతను మలేసియా, బహ్రెయిన్ రేసుల్లో గెలిచాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచాడు. చిరు జల్లుల మధ్యే కొనసాగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 53.860 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తన కెరీర్లో 34వ సారి ‘పోల్ పొజిషన్’ను సంపాదించాడు. ఈ క్రమంలో ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో అత్యధిక పోల్ పొజిషన్స్ దక్కించుకున్న వారి జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో మైకేల్ షుమాకర్ (68-జర్మనీ), అయర్టన్ సెనా (65-బ్రెజిల్), సెబాస్టియన్ వెటెల్ (45-జర్మనీ) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. మరోవైపు హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ క్వాలిఫయింగ్‌లో తడబడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ చాంపియన్ వెటెల్ మూడో స్థానం నుంచి... రికియార్డో రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు మిశ్రమ ఫలితాలు లభించాయి. హుల్కెన్‌బర్గ్ 8వ స్థానం నుంచి... పెరెజ్ 16వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. చైనా గ్రాండ్‌ప్రి వివరాలు ల్యాప్‌ల సంఖ్య : 56 సర్క్యూట్ పొడవు : 5.451 కి.మీ. రేసు దూరం : 305.066 కి.మీ. మలుపుల సంఖ్య : 16 ల్యాప్ రికార్డు : 1ని:32.238సె (షుమాకర్-2004) గతేడాది విజేత : అలోన్సో -
‘రింగ్’ నుంచి రిక్తహస్తాలతో...
అల్మాటీ (కజకిస్థాన్): వరుసగా మూడోసారి ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తారనుకున్న భారత బాక్సర్లు నిరాశపరిచారు. బుధవారం ఇక్కడ జరిగిన పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్ బరిలో నిలిచిన ఐదుగురు భారత బాక్సర్లు శివ థాపా, మనోజ్ కుమార్, వికాస్ మలిక్, సుమీత్ సంగ్వాన్, సతీశ్ కుమార్ ఓడిపోయారు. ఫలితంగా ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి భారత బాక్సర్లు రిక్తహస్తాలతో తిరిగి వస్తున్నారు. 2009లో విజేందర్, 2011లో వికాస్ కృషన్ భారత్‌కు కాంస్య పతకాలను అందించారు. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో ఒకేసారి భారత్ నుంచి ఐదుగురు భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నా ఒక్కరు కూడా ఈ అడ్డంకిని అధిగమించలేకపోయారు. ఒకవేళ క్వార్టర్ ఫైనల్స్‌లో గెలిచిఉంటే కనీసం కాంస్య పతకం ఖాయవయ్యేది. 56 కేజీల విభాగంలో నాలుగో సీడ్ శివ థాపా 0-3 (27-30, 27-30, 27-30)తో జావిద్ చలాబియేవ్ (అజర్బైజాన్) చేతిలో... 60 కేజీల విభాగంలో వికాస్ మలిక్ 0-3 (28-29, 25-30, 27-30)తో నాలుగో సీడ్ రాబ్సన్ కాన్సికావో (బ్రెజిల్) చేతిలో ఓడిపోయారు. 64 కేజీల విభాగంలో ఆరో సీడ్ మనోజ్ కుమార్ 0-3 (27-30, 28-29, 26-30)తో యాస్నియెర్ లోపెజ్ (క్యూబా) చేతిలో... 81 కేజీల విభాగంలో సుమీత్ సంగ్వాన్ 0-3 (27-30, 28-29, 27-30)తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆదిల్బెక్ నియాజిమ్‌బెతోవ్ (కజకిస్థాన్) చేతిలో ఓటమి చవిచూశారు. ప్లస్ 91 కేజీ విభాగంలో గాయం కారణంగా సతీశ్ కుమార్ బరిలోకి దిగకుండా తన ప్రత్యర్థి ఇవాన్ దిచ్కో (కజకిస్థాన్)కు ‘వాకోవర్’ ఇచ్చాడు. -
బంగ్లాదేశ్, కివీస్ తొలి టెస్టు ‘డ్రా’
చిట్టగాంగ్: న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ సొహాగ్ గాజి చెలరేగాడు. బ్యాటింగ్‌లో సెంచరీతో పాటు బౌలింగ్‌లో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. దీంతో ఇరుజట్ల మధ్య ఆదివారం ముగిసిన తొలి టెస్టు ‘డ్రా’ అయ్యింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం సమంగా ఉంది. 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి రోజు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 48.2 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసింది. అంతకుముందు 117/1 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను 90 ఓవర్లలో 7 వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓ దశలో 260/4 స్కోరుతో పటిష్టంగా ఉన్న కివీస్‌ను గాజి దెబ్బతీశాడు. 85వ ఓవర్లో రెండో, మూడో, నాలుగో బంతికి వరుసగా అండర్సన్ (8), వాట్లింగ్ (0), బ్రేస్‌వెల్ (0)లను పెవిలియన్‌కు చేర్చాడు. చివరకు 287 పరుగుల వద్ద కివీస్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన రెండో బంగ్లా బౌలర్‌గా గాజి రికార్డులకెక్కాడు. -
భారత్ ‘హ్యాట్రిక్’
ఇపో (మలేసియా): అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ భారత హాకీ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్లో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 9-1 గోల్స్ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్ తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘టాపర్’గా నిలిచింది. భారత్ తరఫున ‘డ్రాగ్ ఫ్లికర్స్’ రఘునాథ్ (29వ, 52వ, 59వ నిమిషాల్లో), రూపిందర్ పాల్ సింగ్ ‘హ్యాట్రిక్’లు సాధించారు. రూపిందర్ (4వ, 19వ, 27వ, 61వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌తో కలిపి నాలుగు గోల్స్ చేయడం విశేషం. నికిన్ తిమ్మయ్య (25వ నిమిషంలో), మలాక్ సింగ్ (47వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బంగ్లాదేశ్‌కు రెహ్మాన్ చాయాన్ 35వ నిమిషంలో ఏకైక గోల్‌ను అందించాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ నిర్ణీత సమయంకంటే 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆట నాలుగో నిమిషంలో రూపిందర్ చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన భారత్ ఏదశలోనూ బంగ్లాదేశ్‌కు తేరుకోనీయలేదు. చిరుజల్లుల మధ్యే మ్యాచ్ మొత్తం సాగింది. ఈ మ్యాచ్‌కు ముందే సెమీఫైనల్ బెర్త్ ఖాయం కావడంతో భారత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడింది. సమన్వయంతో కదులుతూ గోల్స్ చేసే అవకాశాలను సృష్టించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తమకు లభించిన 10 పెనాల్టీ కార్నర్లలో ఆరింటిని గోల్స్‌గా మలిచింది. సెమీఫైనల్స్ రేపు పాకిస్థాన్ x దక్షిణ కొరియా సాయంత్రం గం. 5.00 నుంచి భారత్ x మలేసియా రాత్రి గం. 7.00 నుంచి