హ్యాట్రిక్‌పై హామిల్టన్ గురి
సీజన్‌లో మూడో ‘పోల్ పొజిషన్’
నేడు చైనా గ్రాండ్‌ప్రి
షాంఘై: మరోసారి తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్‌లో ‘హ్యాట్రిక్’ విజయంపై దృష్టి సారించాడు. ఆదివారం జరిగే చైనా గ్రాండ్‌ప్రి రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ నుంచి ప్రారంభించనున్నాడు. ఆస్ట్రేలియా, మలేసియా గ్రాండ్‌ప్రి రేసులను కూడా ‘పోల్ పొజిషన్’తో మొదలుపెట్టిన హామిల్టన్ ఈసారి గెలిస్తే తన కెరీర్‌లో తొలిసారి ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తాడు. ఈ సీజన్‌లో అతను మలేసియా, బహ్రెయిన్ రేసుల్లో గెలిచాడు.
శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచాడు. చిరు జల్లుల మధ్యే కొనసాగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 53.860 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తన కెరీర్‌లో 34వ సారి ‘పోల్ పొజిషన్’ను సంపాదించాడు. ఈ క్రమంలో ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో అత్యధిక పోల్ పొజిషన్స్ దక్కించుకున్న వారి జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో మైకేల్ షుమాకర్ (68-జర్మనీ), అయర్టన్ సెనా (65-బ్రెజిల్), సెబాస్టియన్ వెటెల్ (45-జర్మనీ) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
మరోవైపు హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ క్వాలిఫయింగ్‌లో తడబడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ చాంపియన్ వెటెల్ మూడో స్థానం నుంచి... రికియార్డో రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు మిశ్రమ ఫలితాలు లభించాయి. హుల్కెన్‌బర్గ్ 8వ స్థానం నుంచి... పెరెజ్ 16వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు.
చైనా గ్రాండ్‌ప్రి వివరాలు
ల్యాప్‌ల సంఖ్య : 56
సర్క్యూట్ పొడవు : 5.451 కి.మీ.
రేసు దూరం : 305.066 కి.మీ.
మలుపుల సంఖ్య : 16
ల్యాప్ రికార్డు : 1ని:32.238సె (షుమాకర్-2004)
గతేడాది విజేత : అలోన్సో