జొకోవిచ్ ‘హ్యాట్రిక్' | Roger Federer out of ATP World Tour final v Novak Djokovic | Sakshi
Sakshi News home page

జొకోవిచ్ ‘హ్యాట్రిక్'

Published Tue, Nov 18 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

జొకోవిచ్ ‘హ్యాట్రిక్'

జొకోవిచ్ ‘హ్యాట్రిక్'

లండన్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ‘హ్యాట్రిక్' సాధించాడు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను అతను వరుసగా మూడో ఏడాది సొంతం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి జరగాల్సిన ఫైనల్లో ఈ సెర్బియా స్టార్‌కు స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నుంచి ‘వాకోవర్' లభించింది. వెన్ను నొప్పి కారణంగా ఫైనల్ ఆడేందుకు ఫిట్‌గా లేనంటూ ఫెడరర్ స్వయంగా కోర్టులోకి వచ్చి ప్రకటించాడు.

45 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్లో ‘వాకోవర్’ రావడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో జొకోవిచ్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ‘హ్యాట్రిక్’ సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో ఇవాన్ లెండిల్ (1985 నుంచి 1987 వరకు); ఇలీ నస్టాసే (1971 నుంచి 1973 వరకు) మాత్రమే ఈ ఘనత సాధించారు. టోర్నీలో అజేయంగా నిలిచిన జొకోవిచ్‌కు 20 లక్షల 75 వేల డాలర్ల (రూ. 12 కోట్ల 82 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. డబుల్స్ విభాగంలో బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) జంట విజేతగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement