ATP World Tour Finals
-
ఫెడరర్‌కు షాక్
లండన్: కెరీర్లో 11వసారి సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో టైటిల్ పోరుకు చేరుకోవాలని ఆశించిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు నిరాశ ఎదురైంది. గ్రీస్ యువతార స్టెఫానోస్ సిట్సిపాస్ అద్భుత ప్రదర్శనతో వరుస సెట్లలో 38 ఏళ్ల ఫెడరర్ ఆట కట్టించి తొలి ప్రయత్నంలోనే ఈ ప్రతిష్టాత్మక రోజర్ ఫెడరర్ టోర్నీన ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల సిట్సిపాస్ 6–3, 6–4తో ఈ టోరీ్నలో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఫెడరర్‌ను మట్టికరిపించాడు. 96 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సిట్సిపాస్ సర్వీసులో 11 బ్రేక్ పాయింట్ అవకాశాలను ఫెడరర్ వృథా చేశాడు. ఈ విజయంతో సిట్సిపాస్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో ఫైనల్ చేరిన పిన్న వయసు్కడిగా గుర్తింపు పొందాడు. జ్వెరెవ్ (జర్మనీ), థీమ్ (ఆ్రస్టియా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో సిట్సిపాస్ తలపడతాడు. -
ఫెడరర్‌కు షాక్
లండన్: టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు చుక్కెదురైంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో బెల్జియం ప్లేయర్ డేవిడ్ గాఫిన్ 2–6, 6–3, 6–4తో రెండో ర్యాంకర్ ఫెడరర్‌ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో ఫెడరర్‌తో ఆడిన ఆరుసార్లూ ఓటమి పాలైన గాఫిన్ ఏడో ప్రయత్నంలో నెగ్గడం విశేషం. ఐఎస్ఎల్లో రెండో ‘డ్రా’ గువాహటి: నాలుగో సీజన్ ఐఎస్ఎల్లో వరుసగా రెండోరోజూ ఒక్క గోల్ కూడా లేకుండానే మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ, జంషెడ్పూర్ ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 0–0తో ‘డ్రా’ అయింది. -
ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ నుంచి నాదల్ అవుట్
అనుకున్నదే అయింది. మోకాలి గాయం కారణంగా టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ నుంచి ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ వైదొలిగాడు. లండన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో నాదల్ 6–7 (5/7), 7–6 (7/4), 4–6తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం) చేతిలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఓటమి అనంతరం టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు నాదల్ ప్రకటించాడు. -
ఫెడరర్ శుభారంభం
లండన్: రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి టైటిల్‌పై దృష్టి పెట్టిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో శుభారంభం చేశాడు. ఆదివారం జరిగిన ‘బోరిస్ బెకర్ గ్రూప్’ లీగ్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–4, 7–6 (7/4)తో ఈ టోర్నీలో తొలిసారి ఆడుతోన్న జాక్ సోక్ (అమెరికా)పై గెలుపొందాడు. గంటా 31 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ ఐదు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సెట్లో ఒకసారి జాక్ సోక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ రెండో సెట్లో టైబ్రేక్‌లో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫెడరర్‌కిది 50వ విజయం కావడం విశేషం. -
ఆ ఇద్దరిపైనే దృష్టి
లండన్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టాప్–8 ఆటగాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి టైటిల్ కోసం తలపడనున్నారు. ‘పీట్ సంప్రాస్ గ్రూప్’లో రాఫెల్ నాదల్ (స్పెయిన్), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా), డేవిడ్ గాఫిన్ (బెల్జియం)... ‘బోరిస్ బెకర్ గ్రూప్’లో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మారిన్ సిలిచ్ (క్రొయేషియా), జాక్ సోక్ (అమెరికా), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఉన్నారు. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), ఆండీ ముర్రే (బ్రిటన్), స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ఈ టోర్నీకి దూరమయ్యారు. దాంతో ఇద్దరు దిగ్గజాలు ఫెడరర్, రాఫెల్ నాదల్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ ఏడాది వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ... నాదల్ ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో జాక్ సోక్తో ఫెడరర్; జ్వెరెవ్‌తో సిలిచ్ ఆడతారు. రెండు గ్రూప్‌ల లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆయా గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఈనెల 18న సెమీఫైనల్స్, 19న ఫైనల్ జరుగుతుంది. ఇదే టోర్నీ సందర్భంగా ఎనిమిది జోడీల మధ్య డబుల్స్ విభాగం మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. టెన్నిస్ ఆటగాళ్లందరూ గ్రాండ్‌స్లామ్ టోర్నీల తర్వాత ఈ టోర్నీని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. 1970లో మొదలైన ఈ టోర్నీని తొలుత ‘మాస్టర్స్ గ్రాండ్‌ప్రి’ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత 1990లో దీనిని ‘ఏటీపీ టూర్ వరల్డ్ చాంపియన్‌షిప్’గా వ్యవహరించారు. 2000లో ‘టెన్నిస్ మాస్టర్స్ కప్’గా పేరు మార్చగా... 2009 నుంచి ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌గా పిలుస్తున్నారు. భారీ మొత్తం... ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో పాల్గొన్న వారందరికీ భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభిస్తుంది. సింగిల్స్ విభాగంలో పాల్గొనే ఆటగాళ్లకు 1,91,000 డాలర్లు (రూ. కోటీ 24 లక్షలు) చొప్పున పార్టిసిపేషన్ ఫీజు చెల్లిస్తారు. రౌండ్ రాబిన్ లీగ్‌లో ఒక్కో విజయానికి 1,91,000 డాలర్లు (రూ. కోటీ 24 లక్షలు) అందజేస్తారు. సెమీఫైనల్లో గెలిచిన వారికి 5,85,000 డాలర్లు (రూ. 3 కోట్ల 81 లక్షలు)... ఫైనల్లో నెగ్గిన వారికి 12 లక్షల డాలర్లు (రూ. 7 కోట్ల 82 లక్షలు) లభిస్తాయి. అజేయ చాంపియన్‌కు మాత్రం 25 లక్షల 49 వేల డాలర్లు (రూ. 16 కోట్ల 61 లక్షలు) దక్కుతాయి. -
జొకోవిచ్ శుభారంభం
లండన్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. ఆదివారం మొదలైన ఈ టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-1, 6-1తో కీ నిషికోరి (జపాన్)పై గెలిచాడు. ఈ సీజన్లో జొకోవిచ్‌కిది 79వ విజయం కావడం విశేషం. అంతేకాకుండా 45 ఏళ్ల ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ చరిత్రలో వరుసగా 15వ విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా ఈ సెర్బియా స్టార్ గుర్తింపు పొందాడు. గత మూడేళ్లలో జొకోవిచ్‌కే ఈ టోర్నీలో టైటిల్ దక్కింది. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో జొకోవిచ్‌కు నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగించినందుకు ట్రోఫీని అందజేశారు. ఈ ఏడాది జొకోవిచ్ 14 టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరుకొని పదింటిలో విజేతగా నిలిచాడు. -
జొకోవిచ్ ‘హ్యాట్రిక్'
లండన్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ‘హ్యాట్రిక్' సాధించాడు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను అతను వరుసగా మూడో ఏడాది సొంతం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి జరగాల్సిన ఫైనల్లో ఈ సెర్బియా స్టార్‌కు స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నుంచి ‘వాకోవర్' లభించింది. వెన్ను నొప్పి కారణంగా ఫైనల్ ఆడేందుకు ఫిట్‌గా లేనంటూ ఫెడరర్ స్వయంగా కోర్టులోకి వచ్చి ప్రకటించాడు. 45 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్లో ‘వాకోవర్’ రావడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో జొకోవిచ్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ‘హ్యాట్రిక్’ సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో ఇవాన్ లెండిల్ (1985 నుంచి 1987 వరకు); ఇలీ నస్టాసే (1971 నుంచి 1973 వరకు) మాత్రమే ఈ ఘనత సాధించారు. టోర్నీలో అజేయంగా నిలిచిన జొకోవిచ్‌కు 20 లక్షల 75 వేల డాలర్ల (రూ. 12 కోట్ల 82 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. డబుల్స్ విభాగంలో బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) జంట విజేతగా నిలిచింది.