ఫెడరర్‌కు షాక్‌ | Stefanos Tsitsipas Overcomes Roger Federer To Reach Final Of ATP Finals | Sakshi
Sakshi News home page

ఫెడరర్‌కు షాక్‌

Published Sun, Nov 17 2019 3:57 AM | Last Updated on Sun, Nov 17 2019 3:57 AM

Stefanos Tsitsipas Overcomes Roger Federer To Reach Final Of ATP Finals  - Sakshi

లండన్‌: కెరీర్‌లో 11వసారి సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో టైటిల్‌ పోరుకు చేరుకోవాలని ఆశించిన స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌కు నిరాశ ఎదురైంది. గ్రీస్‌ యువతార స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ అద్భుత ప్రదర్శనతో వరుస సెట్‌లలో 38 ఏళ్ల ఫెడరర్‌ ఆట కట్టించి తొలి ప్రయత్నంలోనే ఈ ప్రతిష్టాత్మక రోజర్‌ ఫెడరర్‌ టోర్నీన ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల సిట్సిపాస్‌ 6–3, 6–4తో ఈ టోరీ్నలో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఫెడరర్‌ను మట్టికరిపించాడు. 96 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సిట్సిపాస్‌ సర్వీసులో 11 బ్రేక్‌ పాయింట్‌ అవకాశాలను ఫెడరర్‌ వృథా చేశాడు. ఈ విజయంతో సిట్సిపాస్‌ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో ఫైనల్‌ చేరిన పిన్న వయసు్కడిగా గుర్తింపు పొందాడు. జ్వెరెవ్‌ (జర్మనీ), థీమ్‌ (ఆ్రస్టియా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో నేడు జరిగే ఫైనల్లో సిట్సిపాస్‌ తలపడతాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement