london
-
వైఎస్ జగన్ పుత్రికోత్సాహం.. లండన్‌లో కుటుంబంతో.. ఈ చిత్రాలు చూశారా?
-
కేన్సర్ నుంచి బయటపడ్డాను: కేట్ మిడిల్టన్
లండన్: తాను కేన్సర్‌ను జయించానని బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ ప్రకటించారు. తనకు కేన్సర్ చికిత్స అందించిన లండన్‌లోని రాయల్ మార్స్డెన్ ఆసుపత్రిని మంగళవారం ఆమె సందర్శించారు. గత ఏడాది కాలంగా తనను సేవలందించిన నేషనల్ హెల్త్ సర్విస్ (ఎన్హెచ్ఎస్) సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ ఏడాది కాలంగా విలియం, నాతో కలిసి నిశ్శబ్దంగా నడిచిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక రోగిగా ఈ కాలంలో నేను అసాధారణమైన సంరక్షణ, సలహాలు పొందాను. ఎంతో ఉపశమనం పొందాను. కేన్సర్‌ను అనుభవించినవారికే ఇది తులుస్తుంది. ఇప్పుడు కోలుకోవడంపై దృష్టి పెట్టాను. ఈ సంవత్సరం గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నా’’అని కేట్ ప్రకటించారు. మార్చిలో తాను కేన్సర్‌కు కీమో థెరపీ చికిత్స చేయించుకున్నట్లు కేట్ వెల్లడించారు. గత గురువారం 43వ పుట్టిన రోజు జరుపుకొన్న కేట్.. ‘‘అద్భుతమైన భార్య, తల్లి. గత ఏడాది కాలంగా మీరు చూపించిన బలం అమోఘం’’అని ప్రిన్స్ విలియం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కేన్సర్ ఆసుపత్రిగా రాయల్ మార్స్డెన్ను 1851లో ప్రారంభించారు. దీనికి బ్రిటన్ రాజవంశీయులు దాతలుగా ఉన్నారు. దీనికి 2007 నుంచి ప్రిన్స్ విలియం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో వేల్స్ యువరాణి అయిన అతని తల్లి డయానా ఈ పాత్రను నిర్వహించారు. -
లండన్‌లో శివతాండవం
నాట్యం అనేది ఆహ్లాదానికే కాదు మానసిక వికాసానికి కూడా అనుకుంటే... నాట్యం అంటే సంతోషమే కాదు మానసికస్థైర్యం కూడా అనుకుంటే... నాట్యం అనేది ఆనందతరంగమే కాదు పర్యావరణహిత చైతన్యం అంటే గుర్తుకు వచ్చే పేరు.... సోహిని రాయ్ చౌదరి....సోహిని రాయ్ చౌదరి తండ్రి సుబ్రతో రాయ్ సితార్ విద్వాంసుడు. తల్లి ఉమారాయ్ చౌదరి శిల్పి. కోల్‌కత్తాలోని వారి ఇంటిలో ఎప్పుడూ కళాత్మక వాతావరణం ఉండేది. నాలుగు సంవత్సరాల వయసులోనే నృత్యకారిణిగా కాళ్లకు గజ్జె కట్టింది సోహిని రాయ్ చౌదరి. భరతనాట్యం నుంచి మోహినియాట్టం వరకు ఎన్నో నృత్యాలలో ప్రావీణ్యం సాధించింది.‘మన వైదిక సిద్ధాంతాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ మానవతావాదం, మంచి గురించి చాటి చెప్పాయి. కోవిడ్, ఆర్థికమాంద్యం, యుద్ధంలాంటి అనిశ్చిత కాలాల్లో అవి మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ఇతరులకు సహాయపడేలా ప్రేరణ ఇస్తాయి. జీవితానికి సానుకూల దృక్పథాన్ని ఇచ్చే శక్తి మన పవిత్ర తత్వాలలో ఉంది’ అంటుంది సోహిని. వాతావరణ మార్పులపై ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో సదస్సులలో సోహిని రాయ్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.‘వేదమంత్రాలతో కూడిన నా నృత్యప్రదర్శన ప్రకృతి గురించి, మన జీవితాల్లో దాని ప్రాముఖ్యత గురించి తెలియజేసేలా ఉంటుంది. పశుపతిగా శివుడు, అడవులు, జంతువులు, పర్యావరణాన్ని పరిరక్షించేవాడు. ప్రకృతిని మనుషులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, విధ్వంసం సృష్టిస్తున్నారో చెప్పడానికి, ప్రకృతితో సన్నిహిత సంబంధాల కోసం శివతాండవం చేస్తున్నాను’ అంటున్న సోహిని రాయ్ ‘గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ కూడా అందుకుంది.ప్రపంచవ్యాప్తంగా భారతీయ కళలు, సంస్కృతికి సోహిని రాయ్ చౌదరి అంబాసిడర్‌గా మారింది. యూకేలోని ఇండియన్ హైకమిషన్‌కు చెందిన నెహ్రూ సెంటర్లో సోహిని చేసిన శివతాండవం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివతాండవంతోపాటు శివుడి గురించి రుషి దాస్ గుప్తా చెప్పిన విలువైన మాటలను వినిపించింది. మార్కండేయ పురాణం, శివపురాణాలలో నుంచి ఒక కథను ఎంపిక చేసుకొని దాన్ని నృత్యరూపకంగా మలుచుకుంది. లండన్ తరువాత అమెరికా, రష్యా, జర్మనీ, స్పెయిన్... మొదలైన దేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వబోతోంది.‘డ్యాన్సింగ్ విత్ ది గాడ్స్’ పేరుతో తొలి పుసక్తం రాసిన సోహిని రాయ్‌కు రచనలు చేయడం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆమె రచనల్లో మహిళా సాధికారత నుంచి రంగస్థలం వరకు, నృత్యోద్యమం నుంచి దేవదాసీల దుస్థితి వరకు ఎన్నో అంశాలు ఉంటాయి. శక్తివాదాన్ని ప్రధానంగా చేసుకొని ఎన్నో రచనలు చేసింది.‘ఇండియన్ స్టేజ్ స్టోరీస్: కనెక్టింగ్ సివిలైజేషన్స్’ పేరుతో సోహినిరాయ్ రాసిన పుస్తకం భారతీయ రంగస్థలం ఆత్మను పట్టిస్తుంది. ఈ పుస్తకం ద్వారా మన నాగరికతలోని గొప్ప సాంస్కృతిక, సంప్రదాయల గురించి తెలియజేసే ప్రయత్నం చేసింది. యూరప్‌లోని పద్ధెనిమిది యూనివర్శిటీలలో విజిటింగ్ప్రోఫెసర్గా పనిచేసింది. ‘సూఫీ తత్వం, రూమీ కవిత్వం, ఠాగూరు మానవతావాదంలో నాకు మహిళాసాధికారత కనిపిస్తుంది’ అంటున్న సోహినిరాయ్ చౌదరి తన నృత్య కళను సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగిస్తోంది. -
లండన్‌లో చిల్ అవుతోన్న యంగ్ టైగర్.. వీడియో వైరల్
ఈ ఏడాది దేవర మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ యాక్షన్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు.అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2లో కనిపించనున్నారు. ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జతకట్టనున్నారు. ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు ఇటీవల నిర్మాత ప్రకటించారు.అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో చిల్ అవుతున్నారు యంగ్ టైగర్. లండన్‌లో తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా లండన్‌లోని హైడ్ పార్క్‌లో తన పిల్లలతో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. #JrNTR anna at London with his family...@tarak9999 #prideofindia pic.twitter.com/CEtShHW8r4— i am Rajesh(NRT)“🐉” (@rajeshntripati) December 28, 2024 Tiger @tarak9999 chilling on the streets of London ♥️🐯#JrNTR #War2 #NTRNeel #Dragon pic.twitter.com/LLxLG5N7zc— poorna_choudary (@poornachoudary1) December 28, 2024 -
ఒక సొరంగం.. రూ.16.96 లక్షల కోట్లు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ నగరాల మధ్య దూరం 3 వేల మైళ్లు(4,828 కిలోమీటర్లు). విమానంలో కాకుండా సముద్రంలో నౌకలపై ప్రయాణించాలంటే రోజుల తరబడి సమయం పడుతుంది. కానీ, సముద్రంలో కేవలం గంట సమయంలో ప్రయాణించే అవకాశం వస్తే? నిజంగా అద్భుతం. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు కీలక నగరాలను అనుసంధానించడానికి అట్లాంటిక్ మహాసముద్రంలో సొరంగం(టన్నెల్) నిర్మించాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. ఇది సాధారణ సొరంగం కాదు. వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీతో నిర్మించే సొరంగం. ఈ ప్రాజెక్టుకు రూ.16.96 లక్షల కోట్లకుపైగా(20 ట్రిలియన్ డాలర్లు) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా అమల్లోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర గర్భ టన్నెల్‌గా రికార్డుకెక్కడం ఖాయం. ప్రస్తుతం ఉత్తర యూరప్‌లో ఫెమార్న్బెల్ట్ సొరంగం నిర్మాణ దశలో ఉంది. డెన్మార్క్, జర్మనీని అనుసంధానించే ఈ సొరంగం 2029లో అందుబాటులోకి రానుంది. ఇది ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్ అండ్ రైల్ టన్నెల్‌గా రికార్డు సృష్టించబోతోంది. మరోవైపు దక్షిణ యూరప్‌లోనూ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గ్రీస్, టర్కీని కలిపేలా సముద్రంపై కొత్త వంతెన నిర్మించబోతున్నారు. -
Vallabhbahi Patel: ‘ఉక్కు మనిషి’ చివరి రోజుల్లో..
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎనలేని కృషి చేశారు. ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి తొలి హోంమంత్రిగా వ్యవహరించారు. స్వాతంత్య్రానంతరం భారత్- పాకిస్తాన్ విభజన ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, ఆ సమయంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న హిందూ ముస్లిం అల్లర్లను నియంత్రించడంలో పటేల్ సహకారం మరువలేనిది. ఇంతటి మహాన్నత వ్యక్తి జీవిత చరమాంకంలో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ రోజు(డిసెంబరు 15) సర్దార్ పటేల్ వర్థంతి.చదువులో వెనుకబడినా..వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నదియాడ్‌లో జన్మించారు. ఝవేర్‌భాయ్ పటేల్- లడ్బా దేవిల ఆరుగురు సంతానంలో వల్లభాయ్ పటేల్ నాల్గవవాడు. అతని చదువు నెమ్మదిగా సాగింది. సర్దార్ పటేల్ తన 22 ఏళ్ల వయసులో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. తదనంతరం ఇంగ్లాండుకు వెళ్లి బారిస్టర్ అయ్యాడు.ఎనలేని సన్మానాలుస్వాతంత్య్రానంతరం దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన సర్దార్ పటేల్‌కు దేశ విదేశాల్లో ఎంతో గౌరవం లభించింది. 1948 నుండి 1949 మధ్యకాలంలో నాగ్‌పూర్, అలహాబాద్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, పంజాబ్ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. 1947 జనవరిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖచిత్రం టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది.తప్పిన విమాన ప్రమాదం1949, మార్చి 29న సర్దార్ పటేల్ తన కుమార్తె మణిబెన్,పటియాలా మహారాజుతో కలిసి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డి హావిలాండ్ డోవ్ విమానంలో ఢిల్లీ నుండి జైపూర్‌కు వెళ్తున్నారు. ఈ సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానయాగ అధికాలు తక్కువ ఎత్తులో ప్రయాణించాలని పైలట్‌కు సూచించారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం ఎడారిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. నాడు సర్దార్ పటేల్ అక్కడికి సమీప గ్రామంలో బస చేశారు.క్షీణించిన ఆరోగ్యంవిమాన ప్రమాదం నుంచి బయటపడిన పటేల్‌కు పార్లమెంటులో ఘన స్వాగతం లభించింది. విమాన ప్రమాదంపై చర్చల కారణంగా సభా కార్యక్రమాలు అరగంట వరకు ప్రారంభం కాలేదు. కొంతకాలానికి పటేల్ ఆరోగ్యం క్షీణించింది. ఆ సమయంలో పటేల్ ఓ ప్రైవేట్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారు. నాటి బెంగాల్ ముఖ్యమంత్రి బిధాన్ రాయ్ వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన కూడా పటేల్‌కు చికిత్స అందించారు.ఢిల్లీ నుండి ముంబైకి వచ్చి..1950 నవంబర్ న పటేల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపధ్యంలో ఆయన తరచూ స్పృహ కోల్పోతుండేవారు. అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమయ్యారు. ఢిల్లీలోని వాతావరణం ఆయన ఆరోగ్యాన్ని మరింత దెబ్బలీసింది. డాక్టర్ రాయ్ సలహా మేరకు పటేల్ ఢిల్లీ నుంచి ముంబైకి తరలివచ్చారు. అ సమయంలో జవహర్లాల్ నెహ్రూ, రాజగోపాలాచారి, రాజేంద్రప్రసాద్, వీపీ మీనన్‌లు ఆయనను పరామర్శించారు.మెరుగుపడని ఆరోగ్యంముంబై చేరుకున్న పటేల్ చాలా బలహీనంగా మారారు. విమానాశ్రయం వెలుపలనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అక్కడి నుంచి ఆయనను నేరుగా బిర్లా హౌస్‌కు తీసుకెళ్లారు. ముంబైలో పటేల్ ఆరోగ్యం మెరుగుపడలేదు. 1950, డిసెంబరు 15న తెల్లవారుజామున 3 గంటలకు సర్దార్ పటేల్ గుండెపోటుకు గురయ్యారు. 9.57 గంటలకు కన్నుమూశారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: అయోధ్యలో నూతన రామాలయం.. ట్రంప్ పునరాగమనం.. ఈ ఏడాదిలో ఆసక్తికర పరిణామాలివే -
కంటి వైద్యుడి నుంచి కర్కశ నియంత దాకా..
బీరూట్: రెండు పుష్కరాల క్రితం అన్యమనస్కంగా అధ్యక్ష పీఠంపై కూర్చున్న అసద్ తదనంతరకాలంలో నిరంకుశ నేతగా ఎదిగిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డమాస్కస్ మెడికల్ కాలేజీలో చదివిన అసద్ తర్వాత ఆప్తమాలజీ చదివేందుకు బ్రిటన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అసద్ తొలినాళ్లలో లండన్‌లో నేత్ర వైద్యునిగా సేవలందించేవారు. 1971 సంవత్సరం నుంచి సిరియాను తన ఉక్కుపిడికిలి కింద పాలిస్తున్న తన తండ్రి హఫీజ్ మరణంతో 2000 సంవత్సరంలో అసద్ స్వదేశం తిరిగొచ్చాడు. సానుభూతిపరుల మద్దతుతో అయిష్టంగానే అధ్యక్ష పీఠంపై కూర్చున్నారు. అప్పటికి ఆయన వయసు కేవలం 34 సంవత్సరాలు. అధ్యక్ష పదవికి కనీస అర్హత వయసు అయిన 40 ఏళ్లుకూడా నిండకపోవడంతో ఈయన కోసం పార్లమెంట్లో చట్టసవరణ చేశారు. నిజానికి హఫీజ్ తన పెద్ద కుమారుడు బస్సెల్ను తన వారసునిగా చూడాలనుకున్నారు. అయితే 1994లో కారు ప్రమాదంలో బస్సెల్ మరణించడంతో అసద్ అసలైన వారసుడయ్యారు. 2011దాకా అసద్ పాలనపై పెద్దగా విమర్శలు రాలేదు. కానీ అరబ్ విప్లవం మొదలయ్యాక 2011 మార్చిలో అసద్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు డమాస్కస్, డేరా నగరాల్లో వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేశారు. వీటిని అసద్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసింది. ఆనాటి నుంచి అసద్ నిరంకుశ పాలనకు తెరలేపారు. మానవహక్కుల ఉల్లంఘన, అక్రమ అరెస్ట్‌లు, జనంపైకి రసాయన ఆయుధాల ప్రయోగం, కుర్దులను అణగతొక్కడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిడ్నాప్‌లు, హత్యలు వంటి అరాచకాలు ఆనాటి నుంచి నిత్యకృత్యమయ్యాయి. ఆ తర్వాతి ఏడాది అలెప్పో సిటీలో ఘర్షణలు పెరిగాయి. తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమించుకోగా నాలుగేళ్లు కష్టపడి సైన్యం తిరిగి స్వాధీనంచేసుకుంది. ఆ తర్వాత తూర్పు ఘాతాలో ప్రభుత్వం జరిపిన రసాయన ఆయుధ దాడిలో ఏకంగా వందలాది మంది అమాయక పౌరులు చనిపోయారు. దీంతో ఐసిస్ ఉగ్రసంస్థ విజృంభించి రఖాను స్వాధీనం చేసుకుంది. 2019దాకా ఐసిస్ పట్టుకొనసాగింది. అయితే 2015 సెప్టెంబర్‌లో రష్యా రాకతో అసద్ బలం పుంజుకున్నారు. అయితే 2017 ఏప్రిల్‌లో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు పరోక్షంగా రంగ ప్రవేశం చేశాయి. 14 ఏళ్ల అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ గత నెల 27న ఇడ్లిబ్ సిటీ ఆక్రమణతో మొదలైన తిరుగుబాటుదారుల జైత్రయాత్ర రాజధాని డమాస్కస్దాకా కొనసాగడంతో 59 ఏళ్ల అసద్ పలాయనం చిత్తగించక తప్పలేదు. అసద్ పాలనలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధం కారణంగా 11 లక్షల మంది సిరియాను వదిలి విదేశాలకు శరణార్థులుగా వలసవెళ్లారు. అసద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
బీబీసీ ఆధ్వర్యంలో ప్రోస్టేట్ కేన్సర్ అవగాహన కార్యక్రమం
బీబీసీ (బెర్క్‌షైర్ బాయ్స్ కమ్యూనిటీ) ఆధ్వర్యంలో ఇటీవల బ్రిట్‌వెల్ లైబ్రరీలో మువంబర్ డేని ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూల నుంచి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రోస్టేట్ కేన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రము ద్వారా మగవాళ్ళ లో తరచుగా వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ పైన అవగాహన తోపాటు బయటపడేల ఛారిటీ ప్రోగ్రాం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.ఈ ప్రోగ్రాంకి మంచి స్పందన రావడమే గాక దిగ్విజయంగా జయప్రదమయ్యింది. వంద మందికి పైగా పురుషులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో భాగంగా ప్రోస్టేట్ కేన్సర్ అవగాహన ఛారిటీ మొత్తానికి ఎనిమిదివేల పౌండ్స్‌కి పైగా సేకరించామని అన్నారు నిర్వాహకులు. నవంబరు నెల ప్రోస్టేట్ కేన్సర్‌కు సంబంధించి కావడంతో దీనిపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి ఏడాది ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి..ఛారిటీ ద్వారా వచ్చిన ఆర్ధిక సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రోస్టేట్ కేన్సర్ బాధితులను ఆర్ధికంగా ఆదుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి మంచి ఆలోచనతో ప్రోగ్రామ్స్ నిర్వహించడం తెలుగు వారందరికి గర్వకారణమని పలువురు ప్రసంశించారు.ఈ ఈవెంట్ విజయానికి సహకరించిన సభ్యులు :సత్యనారాయణ నోముల,సంజీవ్ అంకిరెడ్డి,రామ్ జయనతి,రవి మంచిరాజు,రవి మేకల,సత్యనారాయణ ఆవుల,శ్రీధర్ బేటి,రమేష్ బుక్క,తిరుమల కాగిత,గోవర్ధన వడ్లపంట్ల,సతీష్ చింతపండు,విశి మాణిక్ రెడ్డి తదితరులు. అలాగే ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన స్పాన్సర్స్ అందరికి కృతజ్ఞతా పూర్వక అభినందనలు అని కమిటీ సభ్యులు తెలిపారు .(చదవండి: న్యూజెర్సీలో మాటా ఫ్రీ హెల్త్ క్యాంప్) -
లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ
సాక్షి, సిటీబ్యూరో: గుడ్ మార్నింగ్ లండన్.. మీరు వింటున్నారు 98.8 స్పైస్ ఎఫ్ఎం.. అంటూ ఓ గొంతు ఉదయమే అందరినీ పలకరిస్తుంటుంది. గొప్ప వ్యక్తుల జీవితాలను పరిచయం చేస్తూ స్ఫూర్తిని నింపుతుంది. ప్రపంచ దేశాల్లోని శ్రోతలకు ఆ గొంతు ఒక వ్యసనం.. ఆ గొంతు విననిదే చాలామందికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఎందుకు చెప్పుకోవడమంటే ఆ గొంతు మన తెలుగు అబ్బాయిది కాబట్టి.. అదీ మన హైదరాబాదీ గొంతు కాబట్టి. ఆ గొంతుక పేరే భరత్ కల్యాణ్. ఉప్పల్‌కు చెందిన భరత్ పేరు యూకే, యూఎస్, కెనడా, భారత్‌తో పాటు అనేక దేశాల్లో రేడియో శ్రోతలకు వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు. వారం మొత్తం జాబ్ చేసుకుని.. వారాంతాల్లో ఫ్రెండ్స్‌తో జాలీగా ఎంజాయ్ చేయకుండా.. శనివారం అక్కడి స్పైస్ ఎఫ్ఎంలో ది కల్యాణ్ క్రానికల్స్ విత్ భరత్ అనే కార్యక్రమం ద్వారా ఎంతో మందికి చేరువయ్యాడు.ఉన్నత చదువుల కోసం వెళ్లి.. అందరు యువకుల్లాగే విదేశాలకు వెళ్లి ఎంఎస్ చేయాలనేది తన కోరిక. ఎలాగోలా యూకేలోని న్యూక్యాసిల్ వెళ్లి ఎంఎస్ పూర్తి చేశాడు. బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్‌గా మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే ప్రజలతో మమేకం కావడమంటే చిన్నప్పటి నుంచి మనోడికి ఇష్టం. ఉద్యోగరీత్యా అది సాధ్యం కాదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. ఓ ఆన్లైన్ ఎఫ్ఎం స్టేషన్లో రేడియో జాకీ ఉద్యోగం ఉందని ప్రకటన చూసి దరఖాస్తు చేసుకోవడం.. మనోడి స్కిల్స్ చూసి సెలెక్ట్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి దేశ, విదేశాల్లో సక్సెస్ అయిన వారి జీవిత విశేషాలు, సక్సెస్ జర్నీని శ్రోతలకు పరిచయం చేస్తూ స్ఫూర్తి నింపుతున్నాడు. అలా మన తెలుగు వారిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. 2014 యూపీఎస్సీ టాపర్ ఇరా సింఘాల్ ఇంటర్వ్యూ ఎంతో ఇష్టమని భరత్ చెప్పాడు. గొప్ప వ్యక్తుల జీవిత విశేషాలు పది మందితో పంచుకుంటుంటే.. ఎంతో మంది తనకు ఫోన్ చేసి మెచ్చుకుంటుంటే ఆ తృప్తే వేరని పేర్కొంటున్నాడు. ఇక, తాను పనిచేసే ఎఫ్ఎం దక్షిణాసియా దేశాలకు చెందిన వారు నడుపుతున్నారని, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఎంతో సోదరభావంతో పనిచేస్తుంటామని, ఎలాంటి బేధాలు లేకుండా చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుందని వివరించాడు. -
ఒక అపరిచితుడి దయ
ఒక మనిషి సాటి మనిషికి సాయానికి రాడని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ముక్కూ ముఖం తెలియని మనుషులు చేయందిస్తారు. అడక్కుండానే మనల్ని సమస్య నుంచి గట్టెక్కిస్తారు. అది ఎంత చిన్నదైనా సరే, ఆ సమయానికి పెద్ద సాయమే అవుతుంది. అయితే, అలాంటి మనుషులను మనం ఎంత నమ్ముతాం? చాలాసార్లు మనుషుల రూపాలను చూసి వాళ్ల గుణాలను అంచనా వేస్తుంటాం. కానీ మనుషులను చూపులతో అంచనా వేయలేం. అలాంటి సందర్భాలు మనకు చాలాసార్లు ఎదురవుతూనే ఉంటాయి. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇతరులకు సాయపడటం, ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలు ఎదురైనా అవి గుర్తుంచుకోవాల్సినవి కావు.అధికారికంగా దాని పేరు ‘లండన్ అండర్‌గ్రౌండ్’. కానీ అందరూ పిలిచేది ‘ట్యూబ్’ అని! అది నిజంగానే గొట్టం ఆకారంలోనే ఉంటుంది మరి! కానీ, సొరంగం నుంచి రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వస్తూండటాన్ని చూసినప్పుడు మాత్రం దాన్ని టూత్‌పేస్ట్‌తో పోల్చడం మేలని నాకు అనిపిస్తుంది. పదహారేళ్ల వయసులో మొట్టమొదటిసారి ట్యూబ్‌ను చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన కూడా ఇదే. విక్టోరియా స్టేషన్లో ఉన్నాను అప్పుడు నేను. అప్పుడే ఎయిర్పోర్ట్ వాహనం నుంచి కిందకు దిగాను. రెండు చేతుల్లో భారీ ట్రంకు పెట్టెలు. మీరు నమ్మినా నమ్మకపోయినా... ఆరోజు ఎయిరిండియా విమానం రెండు గంటలు ముందుగానే ల్యాండ్ అయ్యింది. నేను ఉండటానికి వెళ్తున్న నా సోదరి కిరణ్ కూడా దానికి ఆశ్చర్యపోయింది.తమ్ముడు సెలవుల కోసం అనుకోకుండా ప్రత్యక్షమవుతున్నాడన్న ఆనందం, షాక్ నుంచి కోలుకుంటూ ‘‘హీత్రూ నుంచి బస్సు పట్టుకో... బాండ్ స్ట్రీట్‌లో ట్యూబ్’’ అంటూ కిరణ్ తన ఇంటికి దారి చెప్పింది. ‘‘నేను ఆ పక్కన ఉంటా’’ అని ముగించింది.బాండ్ స్ట్రీట్ స్టేషన్ కిరణ్ ఆఫీసుకు దగ్గరలోనే ఉంటుంది. నాకైతే అప్పటికి లండన్ కొత్త. ఒకపక్క ఉత్సాహంగా ఉంది. ఇంకోపక్క కొంచెం ఉద్వేగంగానూ అనిపిస్తోంది. బాండ్ స్ట్రీట్ అన్నది మోనోపలి గేమ్‌లో కనిపించే పేరు. అక్కడున్న జనాలను చూస్తే మాత్రం అమ్మో ఇంతమందా? అనిపించక తప్పదు. అందరూ ఎవరి హడావుడిలో వారున్నారు. చాలామంది వ్యాపారాలు చేసుకునేవాళ్లనుకుంటా. ఒకరిద్దరు మాత్రం అక్కడక్కడా తచ్చాడుతూ కనిపించారు. బెల్‌బాటమ్ ప్యాంట్లు, పొడుచుకువచ్చినట్లు ఉన్న జుత్తుతో ఉన్న వాళ్లకు బూడిద రంగు ఫ్లానెల్స్, సరిగ్గా అమరని స్కూల్ బ్లేజర్‌తో ఉన్న నేను పరాయివాడినన్న విషయం ఇట్టే తెలిసిపోయేలానే ఉంది. వాతావరణం ఇలా ఉన్న సందర్భంలోనే... సొరంగం నుంచి ట్యూబ్ బయటకొస్తూ కనిపించింది. సొరంగంలో ఉండగానే వచ్చిన రణగొణ ధ్వని ట్యూబ్ వస్తున్న విషయాన్ని అందరికీ ఎలుగెత్తి చెప్పింది. శబ్దం వింటూనే చాలామంది ట్యూబ్ రాకను గుర్తించారు. సామన్లు సర్దుకుంటూ రైలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. నాకైతే అంతా కొత్త. పరిసరాలతో పరిచయమూ తక్కువే. ఏం చేయాలో తెలియకుండా అలా... చూస్తూనే ఉండిపోయా కొంత సమయం!ఎవరో గట్టిగా అరిచారు. ‘‘మిత్రమా... రా’’ అని! అప్పటికే రైలు తలుపులు తెరుచుకుని ఉన్నాయి. జనాలు లోపలికి చొరబడుతున్నారు. నేను మాత్రం నా రెండు ట్రంకు పెట్టెలతో ముందుకెళ్లేందుకు తంటాలు పడుతున్నాను. రెండింటినీ ఒక్కో చేత్తో పట్టుకున్నానా... హ్యాండ్‌బ్యాగ్ పట్టుకునేందుకు ఇంకో చేయి లేకుండా పోయింది. సర్దుదామనుకుంటే పెట్టెలు ఎత్తలేనంత బరువైపోతున్నాయి. ఈ లోపు పక్క నుంచి ఏదో గొంతు వినిపించింది... ‘‘ఒంటిచేత్తోనే చేయగలవు.’’ అంటూ. ‘‘రెండు, మూడు కావాలేమో’’ అని కూడా అనేసిందా గొంతు! యాభై ఏళ్లు పైబడ్డ వ్యక్తి మాటలు కావచ్చు అవి. చిందరవందర బట్టలేసుకుని ఉన్నాడు. తలపై టోపీ ఒకటి. గడ్డం కూడా సరిగ్గా గీసుకోలేదు. బహుశా కంపు కూడా కొడుతున్నాడేమో. మామాలుగానైతే ఆ వ్యక్తితో మాట్లాడేవాడిని కాదేమో. భవిష్యత్తులోనైతే అలాంటి వాళ్లకు దూరంగా జరిగిపోయేవాడినేమో. దిమ్మరి అనుకుని వారిని దూరం నుంచే కొనచూపుతో చూస్తూ ఉండేవాడిని. ఎందుకంటే అలాంటివాళ్లపై నాకున్న అయిష్టం ఇట్టే తెలిసిపోతుంది మరి. అయితే ఆ రోజు నేను ట్యూబ్ ఎక్కేనాటి పరిస్థితి వేరు. కుర్రాడిని. సాయం అవసరం ఉంది. పొగరు ఇంకా తలకెక్కి లేదు. మరీ ముఖ్యంగా... ఆ మనిషి నా ట్రంకు పెట్టెలతోపాటు హ్యాండ్ లగేజీ కూడా లాక్కున్నాడు. ట్యూబ్‌లోకి చేర్చాడు. ఆ వెంటనే రైలు తలుపులు మూసుకున్నాయి. ఆ వ్యక్తి నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నోట్లో కొన్ని పండ్లు ఊడిపోయి ఉంటే... ఉన్నవి కూడా గారమరకలతో కనిపించాయి. ‘‘హమ్మయ్యా... ఎక్కేశాం’’ అన్నాడా వ్యక్తి! సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు నాకు. ఓ నీరసపు నవ్వు నవ్వి ఊరుకున్నాను. ‘‘చిటికెలో రైలు తప్పిపోయేది తెలుసా?’’ అన్నాడు. నాకేమో కొత్తవాళ్లతో మాట్లాడటమంటే భయం. అతడేమో ఒకట్రెండు మాటలతో సరిపెట్టేలా లేడు. మొత్తమ్మీద ఇద్దరి మధ్య కాసేపు మౌనమే రాజ్యమేలింది. రెండు స్టేషన్లు దాటిన తరువాత ఆ వ్యక్తి నా వైపు చూసి, ‘‘ఎక్కడికి మిత్రమా?’’ అన్నాడు. తలూపుతూ నా సమాధానం విన్నాడు. కిటికీల్లోంచి బయటకు చూడటం మొదలుపెట్టాడు. సొరంగం నల్లటి గోడలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు బయట! ఆ వ్యక్తి ఆ నల్లగోడలనే కళ్లప్పగించి మరీ చూస్తూ ఉండిపోయాడు.ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందా? అని నేను ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. లగేజీ ఎలా దింపుకోవాలన్న ఆలోచన మెదడును తొలిచేస్తోంది. ఇంతలో బాండ్స్ట్రీట్ రానేవచ్చింది. పెట్టెలు సర్దుకుందామని అనుకునే లోపే ఆ వ్యక్తి వాటిని తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. ‘‘చిన్న లగేజీలు నువ్వు తీసుకో’’ అన్నాడు. ‘‘నీ సైజుకు తగ్గవి’’ అని చతుర్లాడాడు కూడా. ప్లాట్‌ఫామ్ చివరి వరకూ నాకు తోడుగా వచ్చాడు. ‘‘వచ్చేశాం’’ అన్నాడు. ‘‘గుడ్ లక్’’ చెప్పాడు. వచ్చినంత వేగంగా వెనక్కు వెళ్లిపోయాడు. మేమొచ్చిన వైపే వెళ్లాల్సిన ట్యూబ్ కోసం వేచి చూడటం మొదలుపెట్టాడు.ఈ సంఘటన తరువాత నేను ఆ వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు. అతడు చేసిన సాయానికి థ్యాంక్స్ అయినా సరిగ్గా చెప్పానో లేదో గుర్తు లేదు. కానీ లండన్ అండర్‌గ్రౌండ్‌లో నాకు ఎదురైనా మధురమైన అనుభూతుల్లో ఇదీ ఒకటిగా నిలిచిపోయింది. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇలా ఇతరులకు సాయపడటం ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలూ ఎదురవుతూంటాయి కానీ, వాటిని నేను గుర్తుంచుకోను. ఢిల్లీలోనూ మెట్రో భూగర్భ మార్గం పడుతున్న నేపథ్యంలో మనకూ ఇలాంటి అనుభవాలు బోలెడన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు చూసిన వెంటనే మనకు కలిగే ఇంప్రెషన్ తప్పు కావచ్చు అని చెప్పేందుకు ఉపయోగపడుతూంటాయి. చూపులతోనే మనిషిని అంచనా వేయలేమని చెబుతూంటాయి!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఐన్‌స్టీన్, హాకింగ్స్లనే మించాడు!
ఒక రంగంలో రాణించడాన్నే గొప్పగా చూసే రోజులివి. భారతీయ మూలాలున్న ఈ బ్రిటిష్ బాలుడు మాత్రం బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచి శెభాష్ అనిపించుకుంటున్నాడు. లండన్‌లోని హాన్స్లో ప్రాంతంలో నివసించే క్రిష్ అరోరాకు పియానో అంటే ఇష్టం. పియానో నేర్చుకుని ఏకంగా గ్రేడ్ 7 సరి్టఫికేట్ సాధించాడు. పియానో ఎంతబాగా వాయించగలడో చదరంగం అంతే బాగా ఆడగలడు. మానవ మేధస్సుకు కొలమానంగా చూసే ఇంటెలిజెంట్ కోషెంట్ (ఐక్యూ) పరీక్షలో ఏకంగా 162 స్కోర్ సాధించి ఔరా అనిపించాడు. ఇంతటి స్కోరు ప్రఖ్యాత భౌతిక శాస్తవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, విఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్‌కు కూడా సాధ్యపడకపోవడం విశేషం! ఈ అరుదైన ఫీట్‌తో క్రిష్ ప్రపంచంలోనే అత్యంత మేధావులైన ఒక శాతం మందిలో స్థానం సంపాదించాడని బ్రిటన్ వార్తాసంస్థ ‘మెట్రో’ పేర్కొంది. అత్యంత మేధావుల సంఘమైన ‘మెన్సా’లోనూ క్రిష్ చోటు సాధించాడు.బ్రిటన్‌లోనే అత్యుత్తమ బోధన ప్రమాణాలు పాటించే క్వీన్ ఎలిజబెత్ గ్రామర్ స్కూల్లో వచ్చే ఏడాది చేరబోతున్నాడు. ‘‘11వ క్లాస్ సిలబస్ చాలా ఈజీగా ఉంది. పై తరగతులు నా సామర్థ్యాలకు సవాళ్లు విసురుతాయనుకుంటా. ప్రైమరీ స్కూల్ బోర్ కొట్టింది. ఎప్పుడూ కూడికలు, తీసివేతలు, గుణింతాలు, వాక్య నిర్మాణాలే. ఇప్పుడిక బీజగణితం పట్టుబడతా’’ అని క్రిష్ నవ్వుతూ చెప్పాడు. క్రిష్ తండ్రి మౌళి, తల్లి నిశ్చల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నాలుగేళ్లప్పుడే తమవాడి అమోఘమైన జ్ఞాపకశక్తి, తెలివితేటలను గుర్తించామని వారు చెప్పారు. ‘‘నాలుగేళ్లకే అనర్గళంగా మాట్లాడేవాడు. తప్పుల్లేకుండా స్పెల్లింగులు చెప్పేవాడు. చక్కగా ఉచ్చరించేవాడు. ఓసారి నా పక్కన మూడు గంటలు కూర్చుని గణిత పుస్తకమంతా కంఠస్థం చేశాడు. ఏకసంథాగ్రాహి. నాలుగేళ్లకే దశాంశ స్థానాలకు లెక్కలు చేయడం మొదలెట్టి ఆశ్చర్యపరిచాడు. ఎనిమిదేళ్ల వయసులో ఒక ఏడాది సిలబస్‌ను ఒక్క రోజులో చదివేశాడు. ఏంచేసినా అత్యున్నత స్థాయి ప్రావీణ్యం చూపాలని ఆరాటపడతాడు’’ అని తల్లిదండ్రులు చెప్పారు.ప్రఖ్యాత ట్రినిటీ కాలేజ్‌లోనూ.. పాఠశాలలో పుస్తకాలతో కుస్తీ పట్టడం మాత్రమే కాదు సంగీతం అన్నా క్రిష్‌కు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే పియానో నేర్చుకున్నాడు. పియానిస్ట్‌గా ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు. పియానో వాయించడానికి సంబంధించి కేవలం ఆరు నెలల్లో నాలుగు గ్రేడ్లు పూర్తిచేశాడు. సంగీతానికి సంబంధించి అత్యున్నత కళాక్షేత్రంగా పేరొందిన ట్రినిటీ కాలేజ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యత్వం సాధించాడు. ప్రస్తుతం గ్రేడ్ 7 పియానో సరి్టఫికేట్ పొందాడు. తన కంటే వయసులో పెద్దవాళ్లతో పోటీపడుతూ వాళ్లను ఓడించి పతకాల పంట పండిస్తున్నాడు. వెస్ట్ లండన్‌లో ఎన్నో పోటీల్లో పాల్గొన్నాడు. హిట్ సంగీతాన్ని వాయించేటప్పుడు చాలా మంది ఎదురుగా సంబంధిత నోట్‌ను రాసుకుంటారు. క్రిష్ ఎలాంటి నోట్ లేకుండానే అద్భుతంగా వాయించి ప్రేక్షకులు ప్రశంసలు పొందిన సందర్భాలు ఎన్నో. ‘‘ సంగీత పోటీల్లో నోట్స్ లేదని భయపడను. తప్పు చేయబోనని నాకు బాగా తెలుసు’’ అని క్రిష్ గతంలో చెప్పాడు. బాలమేధావి ‘యంగ్ షెల్డన్’ వెబ్ సిరీస్‌ను బాగా ఇష్టపడే క్రిష్ ఎక్కువగా పజిల్స్, పదవినోదం లాంటి వాటిని పరిష్కరించడం అలవాటు. చదరంగం మీద ఆసక్తి చూపడంతో ఒక టీచర్‌ను పురమాయించి నేరి్పంచారు. అయితే ఆ టీచర్నే తరచూ ఓడిస్తూ తన అద్భుత మేధను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు క్రిష్. – లండన్ -
లండన్‌లో హై అలర్ట్.. అమెరికా ఎంబసీ ముందు పార్సిల్ కలకలం
లండన్:బ్రిటన్ రాజధాని లండన్‌లో హైఅలర్ట్ పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం (నవంబర్22) నగరంలో అమెరికా ఎంబసీ కార్యాలయం బయట ఒక అనుమానాస్పద ప్యాకేజీ కలకలం సృష్టించింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ద్వారా ప్యాకేజ్‌ను నిర్వీర్యం చేశారు. ఆ ప్యాకేజీ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ వెల్లడించింది.మరోవైపు గాట్విక్ ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన ఘటన ఇంకొకటి జరిగింది.దీంతో ఎయిర్‌పోర్టు దక్షిణ టెర్మినల్‌ను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.ఈ క్రమంలోనే అమెరికాలోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడులు చేసే అవకాశముందని ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.ఈ మేరకు నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటనను విడుదల చేసింది. -
అత్యుత్తమ సిటీ లండన్
లండన్: ప్రపంచంలో అత్యుత్తమ నగరాల జాబితాలో వరసగా పదోసారి లండన్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత టాప్–10 స్థానాల్లో న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్, మాడ్రిడ్, బార్సిలోనా, బెర్లిన్, సిడ్నీ నిలిచాయి. 2025 ఏడాదికి సంబంధించిన టాప్–100 జాబితాలో అత్యధికంగా అమెరికాలోని 36 నగరాలు స్థానం సంపాదించడం విశేషం. అయితే కనీసం టాప్–100 కూడా భారతీయ నగరాలకు చోటు దక్కకపోవడం విచారకరం. సహజసిద్ధ వాతావరణం, ఇక్కడే జీవించాలనేంతగా జీవన అనుకూల పరిస్థితులు, సంప్రదాయాలు, రాత్రి జీవితం తదితరాలను పరిగణనలోకి తీసుకుని రీసోనెన్స్ కన్సల్టెన్సీ, ఇప్పోస్లు సంయుక్తంగా 2025 ఏడాదికి అత్యుత్తమ నగరాల జాబితాను సిద్ధంచేశాయి. -
కారు డిక్కీలో శవమై తేలిన యువతి : పరారీలో భర్త!
భారత సంతతికి చెందిన మహిళ లండన్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. లండన్‌లోని కారు ట్రంక్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం హత్యగా అనుమానిస్తున్న నార్తాంప్టన్‌షైర్ పోలీసులు హర్షిత భర్త పంకజ్ లాంబా కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అతగాడు దేశం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు.హర్షిత బ్రెల్లా (24) మృతదేహాన్ని తూర్పు లండన్‌లోని ఇల్ఫోర్డ్లోని బ్రిస్బేన్ రోడ్లో గురువారం తెల్లవారు జామున వాలెంటైన్స్ పార్క్ ప్రవేశానికి సమీపంలో, ఒక కారు డిక్కీలో గుర్తించారు. ఆమెను భర్తే హత్య చేశాడని అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం హర్షిత గృహ హింస చట్టం కింద కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇరుగుపొరుగువారు అందించిన సమాచారం ప్రకారం గత రెండు రోజులుగా హర్షిత ఆందోళనగా కనిపించింది. చనిపోవడానికి ముందు ఇద్దరి మద్యా వాగ్వాదం జరిగిందని, అయితే భార్యాభర్తల వ్యవహారం కాబట్టి తాను పట్టించుకోలేదని ఒక మహిళ వెల్లడించింది. వరుసగా ఇలాంటి ఘర్షణలను తాను గమనించినా కల్పించుకోలేదని, ఇపుడు ఆ బిడ్డ ప్రాణాలే కోల్పోవడం తనకు చాలా బాధగా ఉందని, అసలు దీన్ని నమ్మలేకపోతున్నాను అంటూ హర్షితకు పొరుగున ఉండే కెల్లీ ఫిలిప్ ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు శుక్రవారం నాడు జరిగిన ఫోరెన్సిక్ పోస్టుమార్టం అనంతరం హత్యకు గురైనట్టు నార్త్మ్ప్టన్షైర్ పోలీస్ చీఫ్ ఇన్స్పెక్టర్ పాల్ క్యాష్ ఆదివారం ధృవీకరించారు. హర్షిత మృతదేహాన్ని నార్తాంప్టన్‌షైర్ నుండి ఇల్‌ఫోర్డ్‌కు కారులో తరలించినట్లు అనుమానిస్తున్నామన్నారు. నిందితుడు దేశం విడిచి పారిపోయాడని భావిస్తున్నాం. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. -
‘మా అల్లుడు వెరీగుడ్’: సుధా మూర్తి
తన అల్లుడు ఎంతో మంచివాడని, ఆయన్ని చూస్తే ఎంతో గర్వకారణంగా ఉందని అంటున్నారు ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి. లండన్ విద్యాభవన్‌లో జరిగిన దీవాళి గళా కార్యక్రమంలో ఆమె భారతీయ విలువలు, సంస్కృతి మీద మాట్లాడుతూ..మనిషికి మంచి చదువే కాదు.. సంప్రదాయ మూలాలు కూడా ముఖ్యమేనని అంటున్నారు సుధా మూర్తి. శనివారం లండన్‌లో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్లో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కూతురు అక్షతా మూర్తి, ఆమె భర్త..బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌లు హాజరయ్యారు.మంచి విద్య మీకు పైకి ఎగరడానికి(ఎదగడానికి) రెక్కలను ఇస్తుంది, కానీ గొప్ప సంస్కృతి మిమ్మల్ని మీ మూలాల్లో నిలబెట్టేలా చేస్తుంది. ఉషా సునాక్(రిషి తల్లి) ఆయన్ని(రిషి) అద్భుతంగా పెంచారు. ఆ పెంపక పునాదుల్లో.. బలమైన భారతీయ సంస్కృతి ఉంది. సునాక్ బ్రిటిష్ జాతి గర్వించదగ్గ వ్యక్తి. అదే సమయంలో.. ఆయన భారతీయ వారసత్వంలో విలువలు కూడా కనిపిస్తాయి అంటూ అల్లుడిని ఆకాశానికెత్తారామె.ఈ సందర్భంగా.. భారతీయ కళను, సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు భారతీయ విద్యాభవన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. భారతీయ సంప్రదాయాల్ని నేర్చుకునేందుకు మీ పిల్లలను ఇక్కడికి(విద్యాభవన్)కు పంపండి. మనం ఒక వయసుకి వచ్చాక.. మన మూలాలను తాకాల్సి ఉంటుంది అంటూ ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి రిషి సునాక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్లు సైతం హాజరయ్యారు. విద్యాభవన్ నిర్వాహకులకు రిషి, అక్షతలు మెమోంటోలు ఇచ్చి సత్కరించారు. ఎన్నారై వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్,అంతకు ముందు.. భవన్ యూకే చైర్మన్ సుభాను సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎన్ నందకుమారలు వేద మంత్రాలు చదువుతూ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే.. భారత కళలను ఎలా ప్రదర్శిస్తున్న తీరును, ఆ సెంటర్ సాధించిన విజయాల్ని ఏవీ రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి.. రామాయణం, కలిపూజ వంటి అంశాలను ప్రస్తావించారు. పలువురు కళాకారులు భారతీయ నృత్య కళలు ప్రదర్శించారు. -
కూతురితో ప్రియాంక విహారం.. లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో అలా!
-
ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!
ఆటబొమ్మలతో ఆడుకోవడం పిల్లలందరికీ ఇష్టమైన వ్యాపకం. ప్రపంచంలోని ప్రతిచోటా పిల్లలందరూ ఆటబొమ్మలను ఇష్టపడతారు. కొందరు అందుబాటులో ఉన్న వస్తువులనే ఆటబొమ్మలుగా మలచుకుని, వాటితో ఆటలాడుకుంటారు. ఇంకొందరు డబ్బులు వెచ్చించి రకరకాల రంగురంగుల ఆటబొమ్మలను కొనుక్కుని ముచ్చట తీర్చుకుంటారు. ఆటబొమ్మలపై పిల్లలకు ఉండే సహజ వ్యామోహం కొందరికి వ్యాపారావకాశం కూడా! పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటబొమ్మలను అమ్మే దుకాణాలు వెలిశాయి. వీటిలో అత్యంత పురాతనమైనది ‘హామ్లీస్’ టాయ్ స్టోర్. బ్రిటిష్ రాజధాని లండన్ నగరంలో ఉందిది. విలియమ్ హామ్లీ అనే ఆసామి 1760లో లండన్‌లోని హై హాల్‌బోర్న్ వీ«థిలో దీనిని నెలకొల్పాడు. తర్వాత కొద్దికాలానికే రీజెంట్ స్ట్రీట్‌కు దుకాణాన్ని తరలించాడు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, అత్యంత పెద్దదయిన ఆటబొమ్మల దుకాణంగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకెక్కడం విశేషం. మొదట్లో ఇది ఒకే దుకాణంగా మొదలైనా, తర్వాతి కాలంలో శాఖోపశాఖలుగా ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించింది. భారత్‌లో కూడా దీని శాఖలు ఉన్నాయి. తరతరాలుగా బ్రిటిష్ రాచకుటుంబానికి అభిమాన ఆటబొమ్మల దుకాణంగా ఉన్న ‘హామ్లీస్’ చేతులు మారి, ప్రస్తుతం రిలయన్స్ రీటెయిల్ కంపెనీ చేతిలోకి వచ్చింది.‘హామ్లీస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్’కు చెందిన వందశాతం వాటాలను రిలయన్స్ రీటెయిల్ కంపెనీ 2019లో సొంతం చేసుకుంది. రీజెంట్ స్ట్రీట్‌లోని ‘హామ్లీస్’ స్టోర్ 2010లో తన 250వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ప్రస్తుతం ‘హామ్లీస్’కు బ్రిటన్‌లో 11 శాఖలు, మిగిలిన దేశాల్లో 90 శాఖలు ఉన్నాయి. అత్యంత పురాతనమైన ఈ దుకాణంలో దొరకని ఆటబొమ్మలు అరుదు. (చదవండి: -
లండన్ లో రోడ్డు ప్రమాదం
-
లండన్‌లో ఘోర ప్రమాదం, చావు బతుకుల మధ్య హైదరాబాద్ యువతి
ఉపాధికోసం విదేశాలకు వెళ్లిన యువతిని దురదృష్టం వెంటాడింది. హైదరాబాద్‌కు చెందిన బాధిత యువతి ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనలో పడిపోయారు.హైదరాబాద్ దిల్ సుఖ్‌నగర్ సమీపంలోని మారుతి నగర్‌కు చెందిన హిమ బిందు ఉద్యోగం కోసం లండన్ వెళ్లింది. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్ హిమ బిందును డీకొట్టింది దీంతో ఆమెకు తీవ్ర గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిమ బిందు ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ యాక్సిండెట్ గురించి అధికారులు బిందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
లండన్ వేదికగా ప్రారంభమైన వరల్డ్ ట్రావెల్ మార్కెట్
నవంబర్ 5-7 వరకు లండన్‌లో జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)లో భారతదేశం పాల్గొంటుంది.ఇన్‌బౌండ్ టూరిజంను మెరుగుపరచడం , దేశాన్ని ప్రధాన ప్రపంచ ప్రయాణ గమ్యస్థానంగా ఉంచడం లక్ష్యంగా ఇందులో పాల్గొంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు , భారతీయ టూరిస్ట్ పరిశ్రమకు చెందిన హోటళ్లతో సహా దాదాపు 50 మంది వాటాదారుల ప్రతినిధి బృందంతో WTMలో పాల్గొంటున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఇందులో భాగంగానే ఇన్క్రెడిబుల్ ఇండియా స్టాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూకేలో భారత హై కమీషనర్ విక్రమ్ దురై స్వామి, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి తెలంగాణా ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా లండన్ టీ ఎక్స్చేంజ్ చైర్మన్ తో మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణ పర్యాటక రంగంలో పెట్టుబడులు, హైదరాబాద్ లో టీ ఎక్స్చేంజ్ ఔట్లెట్, లండన్ ఐ తరహాలో ఐకానిక్ జాయింట్ వీల్ ఏర్పాటుపై చర్చించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణామోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా.వంశీ కృష్ణ, డా. రాజేష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆర్ఆర్ఆర్కు అరుదైన గౌరవం
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్‌లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ సినిమా హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రదర్శితం కానుంది. వచ్చే ఏడాది మే 11న ఈ మూవీ స్క్రీనింగ్ ఉంటుందని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ కార్యక్రమంలో రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కన్సర్ట్ ఇవ్వనున్నారు.కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 2022 మార్చి 25న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో (నాటు నాటు పాటకు గాను) ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులు కూడా లభించాయి. కాగా ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమా ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో 2019లో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. -
అల లండను పురములో.. పుట్టగానే తారుమారు.. ఐదు దశాబ్దాల తర్వాత వెలుగులోకి!
సగం జీవితం అయిపోయాక.. పెరిగిన ఇల్లే గాక పెంచిన తల్లిదండ్రులు.. తోబుట్టువులు.. ఎవరూ తనవారు కారని తెలిస్తే? ఇప్పటిదాకా ఏర్పరుచుకున్న బంధాలన్నీ అబద్ధమేనని అర్థమైతే? ఊహించడానికే కష్టంగా ఉంది కదూ! లండన్‌లో ఇద్దరు మహిళలకు అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎందుకంటే వారిద్దరూ పసికందులుగా ఉన్నప్పుడే తారుమారయ్యారు. అల వైకుంఠపురం సినిమాను తలపించే ఈ ఉదంతం లండన్‌లో టాకాఫ్ ద టౌన్‌గా మారిందిప్పుడు. డీఎన్ఏ కిట్‌తో... 2021 క్రిస్మస్. లండన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌కు చెందిన టోనీకి మిత్రులు డీఎన్ఏ హోమ్ టెస్టింగ్ కిట్ కానుకగా ఇచ్చారు. దాంతో పనేముంది లెమ్మని పక్కకు పడేశాడు. రెండు నెలల తర్వాత ఫిబ్రవరిలో కిట్ కంటపడింది. సెలవు రోజు కావడంతో టైం పాస్ కోసం తన శాంపిల్‌ను డీఎన్ఏ టెస్ట్‌కు పంపాడు. తర్వాతి ఆదివారం సాయంత్రం తల్లి జోన్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా రిజల్ట్ మెయిల్ వచి్చంది. తన తల్లి కుటుంబం ఐర్లాండ్‌లో ఎక్కడి నుంచి వచి్చందో దాని ఆధాంరగా గుర్తించగలిగాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ తన చెల్లెలి పేరు చూసి షాకయ్యాడు. తన చెల్లెలు జెస్సికాకు బదులు క్లెయిర్ అనే పేరును సోదరిగా పేర్కొన్నారు. తామిద్దరి డీఎన్ఏలు పూర్తిగా సరిపోలడమే అందుకు కారణం. జెస్సికా తమకు ముగ్గురు అన్నదమ్ముళ్ల తర్వాత పుట్టిన ఏకైక అమ్మాయి. అలాంటిది తను అసలైన చెల్లె కాదని డీఎన్ఏ టెస్టు పేర్కొనడం టోనీని కలవరపరిచింది. ఏమైనా 80 ఏళ్ల తల్లికి ఈ విషయం చెప్పి ఆందోళనకు గురి చేయొద్దనుకున్నాడు. మర్నాడే క్లెయిర్‌ను సంప్రదించాడు. డీఎన్ఏ పరీక్ష రిజల్టు గురించి వివరించాడు. ‘‘అది పొరపాటని అనుకుంటున్నా. నువ్వేమైనా తెలుసుకోగలవా?’ అంటూ మెసేజ్ చేశాడు. దాంతో తను కూడా షాకైంది. ఎందుకంటే క్లెయిర్‌కు రెండేళ్ల క్రితమే ఆమె కొడుకు డీఎన్ఏ కిట్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చాడు. పరీక్ష చేయించుకుంటే తల్లిదండ్రులతో తన డీఎన్ఏ అస్సలు పోలలేదు. ఈ వివరాలన్నీ టోనీతో పంచుకుందామె. ఆ క్రమంలో, జెస్సికా పుట్టిన ఆస్పత్రిలోనే క్లెయిర్ కూడా పుట్టిందని తేలింది. ఏం జరిగిందంటే... జోన్ 1967లో నాలుగో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచి్చంది. నవజాత శిశువును ఆమె కాసేపు ముద్దులాడాక సిబ్బంది పిల్లల గదిలోకి తీసుకెళ్లారు. అర్థరాత్రి దాటాక మరో మహిళకు పుట్టిన పాపను కూడా పిల్లల వార్డుకు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ తారుమారయ్యారు. జోన్‌కు పుట్టిన క్లెయిర్ మరో మహిళ పొత్తిళ్లలోకి, ఆమెకు పుట్టిన జెస్సికా జోన్ చెంతకు చేరారు. పాపాయి జుత్తు రంగు నల్లగా ఉండటంతో అనుమానించినా, ముగ్గురు కొడుకుల తరువాత పుట్టిన కూతురు కావడంతో ఆ సంతోషంలో పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరూ నా కూతుళ్లే ఆస్పత్రిలో తనకు తెలిసిన ఈ నిజాలను క్లెయిర్‌తో పంచుకున్నాడు టోనీ. ఆమె మర్నాడే వెళ్లి తన అసలు తల్లి జోన్‌ను, కుటుంబాన్ని కలిసింది. క్లెయిర్ రోజూ ఆ ప్రాంతం మీదుగానే ఆఫీసుకు వెళ్తుంటుంది. ఇన్నేళ్లుగా తన అసలు తల్లి అదే రూట్లో తనకు తెలియకుండా ఉంటోందని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. తన క్లెయిర్ భర్తకు, పిల్లలకు విషయం చెప్పింది. క్లెయిర్, జెస్సికా ఇద్దరూ తన కూతుళ్లేనని జోన్ చెప్పుకొచి్చంది. జెస్సికా అసలు ఏడాది ముందే మరణించింది. న్యాయపరమైన చిక్కులు.. తారుమారు కారణంగా క్లెయిర్, జెస్సికా పుట్టిన రోజులు మారిపోయాయి. దాంతో బర్త్ సరి్టఫికెట్ మొదలుకుని పాస్‌పోర్ట్ దాకా అన్నీ మార్చాల్సిన అవసరం వచి్చంది. ఈ నిర్వాకంపై జాతీయ ఆరోగ్య ట్రస్టు (ఎన్హెచ్ఎస్)కు టోనీ ఘాటుగా లేఖ రాశాడు. తప్పు ఒప్పుకున్న ట్రస్టు, వారిద్దరికీ పరిహారం ఇస్తామని ప్రకటించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
-
సాహసమే ఊపిరిగా..! ఏకంగా 14 పర్వతాలను ..!
అభిరుచి, అంకితభావం, పట్టుదల ఒక దగ్గర చేరితే ఏమవుతుంది? అపురూప విజయం అవుతుంది. ఆడ్రియానా బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం అవుతుంది. ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా 23 ఏళ్ల ఆడ్రియానా బ్రౌన్లీ రికార్డ్ సృష్టించింది. లండన్‌లో పుట్టి పెరిగిన బ్రౌన్లీకి చిన్నప్పటి నుంచి ఎత్తైన పర్వతాలను అధిరోహించిన వారి గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. నాన్న పర్వతారోహకుడు. పర్వతారోహణకు సంబంధించి ఆయన చెప్పే ఒళ్లు గగుర్పొడిచే విషయాలను వినడం అంటే ఇష్టం.ఎనిమిదేళ్ల వయసులో పర్వతారోహకుడైన తండ్రి నుంచి ప్రేరణ ΄పొందింది బ్రౌన్లీ. పెద్ద పర్వతాలు అధిరోహించి పెద్ద పేరు తెచ్చుకోవాలని కలలు కనేది. ఇరవై ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో ఆ కల సాకారం అయింది. ఆక్సిజన్ లేకుండా గాషెర్‌బ్రమ్ 1కు చేరుకున్న అతి పిన్న వయస్కురాలిగా, కే2 శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది.చైనాలోని 8,000 మీటర్ల ఎత్తులో ఉన్న పిషాపాంగ్మా పర్వతాన్ని అధిరోహించడం ద్వారా 14 శిఖరాల అధిరోహణను పూర్తి చేసింది. నిర్మలమైన ఆకాశం సాక్షిగా, సూర్యోదయం వెలుగులో పిషాపాంగ్మా పర్వతం దగ్గరకు చేరుకోగానే బ్రౌన్లీ భావోద్వేగానికి గురైంది. ‘శిఖరానికి చేరుకోకముందే నా లక్ష్యం నెరవేరబోతుంది అనే ఆనందంలో ఏడ్వడం మొదలు పెట్టాను’ అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకుంది. బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం కేవలం సంఖ్యకు సంబంధించినది కాదు. అంకితభావాన్ని, నిబద్దతను ప్రతిఫలించే అపురూప విజయం అది. పర్వతారోహణ అనేది అభిరుచి మాత్రమే కాదు త్యాగాల సమాహారం. పర్వతారోహణపై దృష్టి పెట్టిన బ్రౌన్లీ టీనేజ్ సంతోషాలకు దూరమైంది. తన కలను సాకారం చేసుకోవడానికి యూనివర్శిటీకి దూరమైంది. వ్యక్తిగత విజయాలపై మాత్రమే బ్రౌన్లీ దృష్టి పెట్టలేదు. పర్వతారోహణ విషయంలో యువతను ప్రోత్సహించడానికి, వారు తమ కలలను సాకారం చేసుకునే విషయంలో సహకరించడానికి నడుం కట్టింది.‘సాహసం మంచిదేగానీ దుస్సాహాసం తగదు’ అంటున్న బ్రౌన్లీ ఎంతోమంది పర్వతారోహకులను దగ్గర నుంచి చూసింది. వారిలో ఉత్సాహమే కనిపిస్తుంది. శిక్షణ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ‘సాహసాల పేరుతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం నాకు తెలుసు. పర్వతారోహణ పేరుతో సాహసాలకు దిగే కొద్దిమందికి ప్రాథమిక విషయాల్లో కూడా అవగాహన లేదని తెలుసుకున్నాను. ఉత్సాహమే కాదు శిక్షణ కూడా చాలా ముఖ్యం. అనుభవం లేని పర్వతారోహకులను ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి అనుమతించరాదు. వారు తమ ప్రాణాల తోపాటు ఇతరులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నించే పర్వతారోహకులు ముందుగా చిన్న పర్వతాలను అధిరోహించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటుంది బ్రౌన్లీ. ‘ఎప్పుడు పర్వతాల గోలేనా’ అని బ్రౌన్లీని స్నేహితులు వెక్కిరించేవారు. అయితే ఆమె అలాంటి వెక్కిరింపులను ఎప్పుడూ పట్టించుకోలేదు.‘జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆ లక్ష్యం మీకు ప్రత్యేకమైనది కావచ్చు. ఇతరులకు వింతగా అనిపించవచ్చు’ అంటుంది బ్రౌన్లీ. ఒక పర్వతానికి మరో పర్వతానికి సంబంధం ఉండదు. ప్రతి పర్వతం తనదైన సవాళ్లు విసురుతుంటుంది. ‘ప్రతి సవాలు విలువైనదే’ అంటున్న ఆడ్రియానా బ్రౌన్లీ మరిన్ని సాహసాలకు సిద్ధం అవుతుంది.(చదవండి: తాటి ఆకుల కళ..! 75 ఏళ్ల బామ్మ..) -
మరమరాల చాట్ అమ్ముతూ బ్రిటిష్ వ్యక్తి..!
మరమరాలతో చేసే చాట్ అంటే అబ్బా..! ఆ రుచి తలుచుకుంటేనే నోటిలో నీళ్లూరిపోతుంటాయి. ఆ టేస్ట్ వేరేలెవెల్. మన ఊర్లలోనే కాదు పట్టణాలో చిన్న బండిలపై ఈ మరమరాల చాట్‌ను అమ్ముతుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో తింటుంటే ఓ పక్క పుల్లగా.. కారంగా భలే రుచిగా ఉంటుంది. ఇదంతా ఎందుకంటే ఇలా మరమరాల చాట్‌ని మనవాళ్లు అమ్ముతుంటే పెద్ద ఫీల్ ఉండదె. అదే తెల్ల దొరలు అమ్మితే..కచ్చితంగా అవాక్కవుతాం కదా..!. నిజం అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక బ్రిటిష్ వ్యక్తి అచ్చం మన వాళ్లలా మరమరాల చాట్ అమ్ముతూ కనిపిస్తాడు. అచ్చం మనలానే ఓ గిన్నేలో మరమరాలు వేసుకుని ఉల్లిపాయలు, కొత్తిమీర, కీర దోస, కాస్త మసాలా చాట్ వేసి కలిపి..పేపర్ పొట్లంలో చుట్టి ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది దగ్గర దగ్గరగా కోల్‌కతా స్టీట్ విక్రేతల మాదిరిగా అమ్ముతున్నాడు. అయితే ఈ ఘటన లండన్‌లో చోటు చేసుకుంది. అతడు అలా మన వాళ్లలా "ఝల్మురి ఎక్స్‌ప్రెస్" పేరుతో చిన్న బండిపై మరమరాల చాట్ అమ్ముతున్న విధానం చూస్తే భారత్‌లోనే ఉన్నామా..! అని షాక్ అవ్వుతాం. అందుకు సంబంధించిన వీడియోని ఒక ఫుడ్ వ్లాగర్ నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని 200 ఏళ్లు పాలించి చివరికి ఇలా అయిపోయారని చమత్కరిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ansh Rehan | London📍 (@explorewithrehans) (చదవండి: సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్: ఆ హెయిర్ ట్రీట్మెంట్లు వద్దు..!)