జియో వరల్డ్ ప్లాజాలో.. ఈఎల్ & ఎన్ లండన్ | EL&N London Debuts in Jio World Plaza | Sakshi
Sakshi News home page

జియో వరల్డ్ ప్లాజాలో.. ఈఎల్ & ఎన్ లండన్

Published Sat, Oct 19 2024 6:57 PM | Last Updated on Sat, Oct 19 2024 7:24 PM

EL&N London Debuts in Jio World Plaza

ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన లైఫ్‌స్టైల్ అండ్ కేఫ్ బ్రాండ్ ఈఎల్ & ఎన్ లండన్.. జియో వరల్డ్ ప్లాజాలో తన మొదటి ఇండియన్ అవుట్‌లెట్‌ ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ గ్లోబల్ సెన్సేషన్‌ భారతీయ మార్కెట్‌లో మొదటి వెంచర్‌ అని తెలుస్తోంది.

2017లో అలెగ్జాండ్రా మిల్లర్‌ ప్రారంభించిన ఈఎల్ & ఎన్ (ఈట్, లైవ్ & నోరిష్) ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. ఈ బ్రాండ్ పింక్ ఇంటీరియర్స్, అద్భుతమైన ఫ్లోరల్ డెకర్ వంటి వాటితో కస్టమర్లను మాత్రమే కాకుండా.. ప్రేక్షకులను కూడా చాలా ఆకర్షించింది.

ఈఎల్ & ఎన్ ఫ్యాషన్ ఫార్వర్డ్ డిజైన్, స్పెషాలిటీ కాఫీ వంటి వాటితో పాటు ప్రత్యేక ఫుడ్ కూడా అందిస్తుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం ప్యారిస్, మిలన్, దుబాయ్, కౌలాలంపూర్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 37 అవుట్‌లెట్‌లను నిర్వహిస్తోంది. ఇప్పుడు ముంబైలో అడుగుపెట్టి భోజన ప్రియులను, సోషల్ మీడియా ఔత్సాహికులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది.

జియో వరల్డ్ ప్లాజా రెండవ అంతస్తులో ఉన్న ఈ కొత్త కేఫ్.. 2,130 చ.అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ప్రత్యేకమైన మోటిఫ్‌లు, గులాబీ రంగు మెష్ షాన్డిలియర్, సిగ్నేచర్ ఏఎల్ & ఎన్ పుష్పాలు & పత్రాలు, నియాన్ కోట్‌లు వంటివి ఉన్నాయి. అంతే కాకుండా.. టెర్రాజో & మార్బుల్ ఫ్లోరిం, ఐకానిక్ కేక్, కాఫీ బార్‌ వంటివి ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement