10 సోషల్ మీడియా ఖాతాలు రద్దు
న్యూఢిల్లీ: విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపుల బెడద ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. గురువారం ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ఇండియా విమానం ఏఐసీ129కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. లండన్ గగనతలంపై ప్రయాణిస్తుండగా ‘స్క్వాకింగ్ 7700’ సంకేతాలు అందాయి. ఇదొక అత్యవసర సంకేతామని అధికారులు దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ఇటీవల 14 భారత విమానాలను వేర్వేరు దేశాల్లో ఇలాంటి కారణంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, విమానాల్లో బాంబులు అమర్చామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న 10 సోషల్ మీడియా ఖాతాలను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు రద్దు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఎక్కువ ఖాతాలు ‘ఎక్స్’కు సంబంధించినవేనని తెలిపాయి. ముంబై నుంచి బయలుదేరే మూడు విమానాల్లో బాంబులు పెట్టానని ఎక్స్‌లో పోస్టు చేసిన 17 ఏళ్ల బాలుడిని ముంబై పోలీసులు చత్తీస్‌గఢ్‌లో ఇటీవల అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment