planes
-
వట్టి బెదిరింపులేనా?
ఇది కనివిని ఎరుగని కథ. వారంరోజుల్లోనే మన విమానాలకు శతాధికంగా బాంబు బెదిరింపు కాల్స్... వివిధ జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలను అర్ధంతరంగా దింపాల్సి రావడం, దారి మళ్ళించడం, చివరకు ఫైటర్ జెట్ల రక్షణ మధ్య తీసుకువెళ్ళాల్సి రావడం జరిగింది. ఈ–మెయిల్, సోషల్ మీడియా అజ్ఞాత పోస్టుల బెదిరింపులతో భారత వైమానిక రంగం ఉలిక్కిపడింది. ఏ బెదిరింపు వచ్చినా నిశితంగా పరీక్షించి, జాగ్రత్త చేపట్టాలన్నది నిబంధన కావడంతో విమానయాన పరిశ్రమపై తాజా బెదిరింపుల ప్రభావం అంతా ఇంతా కాదు. ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ సైతం ఎయిరిండియా విమానంపై దాడి చేస్తామనీ, నవంబర్ 1–19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించవద్దనీ హెచ్చరించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పెరుగుతున్న భద్రతా సమస్యలపై విమానయాన శాఖ మల్లగుల్లాలు పడుతోంది. బెదిరింపులకు పాల్పడినవారిపై తీవ్ర శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలనీ, దోషుల్ని విమానయానం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని భావిస్తున్నామనీ కేంద్ర మంత్రి మాట. భవిష్యత్తుకు పనికొచ్చే ఆ చర్యల మాటెలా ఉన్న వర్తమానంలో తక్షణ మార్గాంతరమేమిటన్నదే ఇప్పుడు ప్రశ్న.2014 – ’17 మధ్య అంతా కలిపి 120 బాంబు బెదిరింపులే రాగా, ఇప్పుడు ఒక్కవారంలోనే 100కు పైగా బెదిరింపులు రావడం గమనార్హం. విమానాల దారి మళ్ళింపు, తక్షణ ల్యాండింగ్ వల్ల అయ్యే ఇంధన వృథా ఖర్చు, వగైరాలతో ప్రతి బెదిరింపు కాల్ వల్ల ఎయిర్‌లైన్స్‌కు రూ. 3 కోట్ల పైగా నష్టమట! ప్రయాణికుల్లో భయాందోళనల్ని పెంచడంతో పాటు ప్రయాణంలో ఆలస్యంతో కీలకమైన పనులు దెబ్బతినడం లాంటివి సరేసరి. రద్దీ ఎక్కువగా ఉండే పండగ సీజన్ కావడంతో కష్టం, నష్టం ఎక్కువ. ఒక్క వారంలోనే వంద బెదిరింపులు వచ్చాయంటే భద్రతా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీలు ఏం చేస్తున్నట్టు? ఇప్పటి వరకు ఒక మైనర్నీ, అతని తండ్రినీ మాత్రమే అరెస్ట్ చేసినట్టు వార్త. నింది తుల్ని వేగంగా కనిపెట్టి, కఠినచర్యలకు ఎందుకు దిగడం లేదు? అయితే ముష్కరులు, తీవ్రవాదులు వర్చ్యువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా ఈ నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దాంతో, వారున్న లొకేషన్ కనిపెట్టలేని పరిస్థితి. ఈ సవాలును అధిగమించేందుకు మార్గాలు అన్వేషించాలి. నిజానికి, విమాన సర్వీసులకే కాదు... కొద్ది నెలలుగా రైల్వేలకూ ఈ బెడద తప్పడం లేదు. రైల్వే ట్రాకుల మీద రాళ్ళు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ నింపిన సీసాల లాంటివి దుండగులు పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఆ మధ్య అనేక చోట్ల వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను లక్ష్యంగా చేసుకొని రాళ్ళు విసిరిన ఉదంతాలూ చూశాం. ఈ చర్యల వెనుక పెద్ద పన్నాగమే ఉందని విశ్లేషకుల మాట. దేశంలో విమానయాన రంగం వేగంగా దూసుకుపోతోంది. ఒక్క 2023లోనే 15.2 కోట్ల మంది దేశంలో విమానయానం చేశారు. అలాంటిది... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత వైమానిక రంగాన్నీ, రైల్వేలనూ గనక అప్రతిష్ఠ పాల్జేస్తే, ఆర్థిక నష్టంతో పాటు భూమి మీదైనా, ఆకాశంలోనైనా సురక్షితంగా ప్రయాణం చేయలేమనే భీతిని దేశ, విదేశీ ప్రయాణికుల్లో పెంచాలన్నది కుట్ర. భయం పెంచి, ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి విద్రోహ చర్యలను తక్షణం అరికట్టాలి. చిత్రమేమిటంటే, ఐరోపా గగనతలంలోనూ భారత విమానయాన సంస్థలకు బెదిరింపులు వస్తున్నాయి. భారత ప్రభుత్వం, గూఢచర్య వ్యవస్థలు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకుంటే పెను ప్రమాదమే! భారత్‌కు తీరని నష్టం కలిగించడమే ధ్యేయంగా పెట్టుకొన్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ ఎయిరిండియా విమానాలను పేల్చేస్తామంటూ గత ఏడాది నవంబర్ లోనూ ఇలానే బెదిరింపులకు దిగాడు. అతను, అతని అనుచరుల ఆనుపానులు, దుశ్చర్యలు తెలిసినప్పటికీ అమెరికా గూఢచారి వ్యవస్థ ఎఫ్‌బీఐ లాంటివి కళ్ళు మూసుకొని, వారిని కాపాడుతూ వస్తుండడమే విషాదం. మరోపక్క దేశీయ విమానాల్లో సిక్కు ప్రయాణికులు కృపాణాలతో ప్రయాణించడాన్ని నిరోధించేందుకు సుప్రీమ్ కోర్టు సైతం నిరాకరించడంతో, పన్నూ లాంటి వారు దాన్ని అవకాశంగా తీసుకొంటే కష్టమే. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఒకటికి రెండు తీవ్రవాద బృందా లను కలుపుకొనిపోతే పెను ప్రమాదమే. దాదాపు పాతికేళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11న తీవ్ర వాదులు విమానాల హైజాక్‌తో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట భవనాల కూల్చి వేతతో సహా 3 వేల మంది మరణానికి కారణమైన ‘9/11’ ఘటనను విస్మరించలేం. ఈ పరిస్థితుల్లో ఈ ముష్కరమూకలకు పరోక్షంగా అండగా నిలుస్తున్న అమెరికా, కెనడాలకు పరిస్థితిని వివరించి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకొనే దిశగా భారత ప్రభుత్వం కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలి. మన ప్రయాణ వ్యవస్థలతో పాటు పౌరుల భద్రత అత్యంత ప్రధానమని తెలియజెప్పాలి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ, ఐరాస భద్రతా మండలినీ ఆశ్రయించాలి. అదే సమయంలో కొద్దివారాల పాటు టెక్నాలజీని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే ముష్క రులు ‘9/11’ ఘటనకు పాల్పడగలిగారని మర్చిపోరాదు. సాంకేతికంగా ముష్కర చేష్టలకు వీలు కల్పించే ట్రాన్సీవర్స్ లాంటి సాంకేతిక సామగ్రిని ఆన్లైన్లో అమ్మడాన్ని తక్షణం నిషేధించడం అవసరమని నిపుణుల సూచన. అన్నిటి కన్నా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన మన విమాన, రైల్వే భద్రతా వ్యవస్థలను పునఃపరిశీలించి, సరికొత్త సవాళ్ళకు అనువుగా పటిష్ఠం చేయాలి. అత్యవసర పరిస్థితిలో అనుసరించాల్సిన ప్రామాణిక ఆచరణ విధానాలను (ఎస్ఓపీ) సిద్ధం చేయాలి. అదే సమయంలో అన్ని ఎయిర్‌లైన్స్, వివిధ దేశాల వైమానిక రంగాలు ఒక్కటై, సమాలోచనలు జరపాలి. పెరుగుతున్న ముప్పును పరస్పర సహకారం, సమన్వయంతో ఎలా ఎదుర్కోవాలో చూడాలి. -
విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపుల బెడద ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. గురువారం ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ఇండియా విమానం ఏఐసీ129కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. లండన్ గగనతలంపై ప్రయాణిస్తుండగా ‘స్క్వాకింగ్ 7700’ సంకేతాలు అందాయి. ఇదొక అత్యవసర సంకేతామని అధికారులు దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇటీవల 14 భారత విమానాలను వేర్వేరు దేశాల్లో ఇలాంటి కారణంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, విమానాల్లో బాంబులు అమర్చామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న 10 సోషల్ మీడియా ఖాతాలను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు రద్దు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఎక్కువ ఖాతాలు ‘ఎక్స్’కు సంబంధించినవేనని తెలిపాయి. ముంబై నుంచి బయలుదేరే మూడు విమానాల్లో బాంబులు పెట్టానని ఎక్స్‌లో పోస్టు చేసిన 17 ఏళ్ల బాలుడిని ముంబై పోలీసులు చత్తీస్‌గఢ్‌లో ఇటీవల అరెస్టు చేశారు. -
రష్యా సరిహద్దులో హైటెన్షన్.. యూఎస్ బాంబర్ విమానాలు ప్రత్యక్షం!
మాస్కో: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ రష్యా, అమెరికా మధ్య ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమ దేశ సరిహద్దులోకి వచ్చిన అమెరికాకు చెందన బాంబర్ విమానాలను రష్యా అడ్డుకుంది. దీంతో, రెండు దేశాల మధ్య ఘర్షణ మరోసారి మొదలైంది.వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన బాంబర్ విమానాలు తమ దేశ సరిహద్దు సమీపంలోకి వచ్చాయని రష్యా ఆరోపించింది. తమ సరిహద్దుకు సమీపించిన రెండు వైమానిక విమానాలను తమ ఫైటర్ జెట్లతో అడ్డుకున్నామని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. వాటిని అమెరికా వాయుసేనకు చెందిన బీ-52హెచ్ వ్యూహాత్మక బాంబర్లుగా తమ సైన్యం గుర్తించిందని తెలిపింది. ఆర్కిటిక్‌లోని బారెంట్స్ సముద్రంలో ఈ పరిణామం చోటుచేసుకుందని వెల్లడించింది.BREAKING 🇷🇺⚡🇺🇸 Russia said Sunday that it scrambled fighter jets to prevent two US strategic bomber planes from crossing its border over the Barents Sea in the Arctic.“As the Russian fighters approached, the American strategic bombers corrected their flight course, moving away… pic.twitter.com/5kjGYWndfM— Lou Rage (@lifepeptides) July 21, 2024ఇదిలా ఉండగా.. అమెరికా మాత్రం రష్యా ఆరోపణలను ఖండించింది. అంతర్జాతీయ జలాల మీదుగా విమానాలతో గస్తీ నిర్వహిస్తుండటం సాధారణ ప్రక్రియేనని పేర్కొంది. తటస్థ గగనతలంలో వీటిని చేపట్టామని, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే నడుచుకున్నామని స్పష్టం చేసింది. దీంతో, రెండు దేశాల మధ్య మళ్లీ మాటల యుద్ధం ప్రారంభమైంది. మరోవైపు.. ఇటీవలి కాలంలో అమెరికా పట్ల రష్యా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడుల సమయంలో నుంచి బైడెన్, పుతిన్ మధ్య పరోక్షంగా వార్ నడుస్తూనే ఉంది. ఇక, రష్యాపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. -
ఢిల్లీలో పొగమంచు.. విమానాలు మళ్లింపు
సాక్షి, న్యూఢిల్లీ: పొగ మంచు కమ్మేయడంతో దేశ రాజధాని ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలు దారి మళ్లించారు. విజిబిలిటీ తగ్గిపోవడంతో శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య హైదరాబాద్, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా నగరాల నుంచి ఢిల్లీకి వస్తున్న 20 విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్సర్ ఎయిర్‌పోర్టులకు దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి లక్నో, జైపూర్, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను రన్‌వే పైనే నిలిపివేసినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. -
ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. అల్లాడిపోతున్న గాజా
జెరూసలేం: హమాస్ మిలిటెంట్ సంస్థ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. దానిపై భూతల దాడుల తీవ్రతను శనివారం మరింత పెంచింది. పదాతి దళం, సాయుధ వాహనాలు గాజాకేసి దూసుకెళ్తున్నాయి. వాటికి దన్నుగా విమానాలు, యుద్ధ నౌకల నుంచి భారీ రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. హమా స్ నిర్మించుకున్న భూగర్భ సొరంగాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. వాటి తీవ్రత యుద్ధం మొదలైన ఈ మూడు వారాల్లో కనీవినీ ఎరగనంత ఎక్కువగా ఉందంటూ గాజావాసులు ఆక్రోశిస్తు న్నారు. వాటి దెబ్బకు గాజాలో ఇప్పటిదాకా మిగిలి ఉన్న అరకొర సమాచార వ్యవస్థలన్నీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. దాంతో గాజాలోని 23 లక్షల మందికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టేనని భావిస్తున్నారు. దాడుల ఫొటోల విడుదల గాజాలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్న యుద్ధ ట్యాంకుల వరుసలు తదితరాల ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. భారీ సంఖ్యలో సైన్యం, ట్యాంకులు సరిహద్దులకు చేరుకుంటున్నాయి. ‘‘మా సైన్యాలు గాజాను కమ్ముకుంటున్నాయి. యుద్ధం కొనసాగుతోంది’’ అని సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరీ ప్రకటించారు. మరోవైపు, యుద్ధం కీలక దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ప్రకటించారు. ‘‘గత రాత్రి గాజాలో భూకంపం పుట్టించాం. నేలమీద, భూగర్భంలో ఉన్న హమాస్ స్థావరాలపై భారీగా దాడులకు దిగాం’’ అని వివరించారు. గాజాపై ఇప్పటిదాకా రాత్రిపూట దాడులకే సైన్యం పరిమితమవుతూ వచి్చంది. కానీ ఇక ఆ ప్రాంతమంతటినీ ఆక్రమించడమే ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యమని చెబుతున్నారు. అయితే హమాస్ విస్తృత భూగర్భ నెట్వర్క్ తదితరాలను నాశనం చేసేందుకు చాలా సమయం పడుతుందన్న సైన్యం వ్యాఖ్యల నేపథ్యంలో పోరుకు ఇప్పట్లో తెర పడే సూచనలు కని్పంచడం లేదు...! ఆస్పత్రే హమాస్ కేంద్రం! గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అయిన షిఫా నిజానికి హమాస్ మిలిటెంట్ సంస్థ ప్రధాన కార్యాలయమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఆస్పత్రి కిందే దాని ప్రధాన స్థావరం దాగుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి తమ దగ్గరున్న సమాచారం ఆధారంగా రూపొందించిన ఓ సిమ్యులేటెడ్ వీడియోను కూడా సైన్యం విడుదల చేసింది. వందలాది మంది హమాస్ మిలిటెంట్లు ఆస్పత్రి కింద తలదాచుకున్నారని పేర్కొంది. ‘‘ఆస్పత్రి కింద లెక్కలేనన్ని భూగర్భ కాంప్లెక్సులున్నాయి. ఉగ్రవాదులు వాటిని యథేచ్ఛగా వాడుకుంటున్నారు’’ అని ఆరోపించింది. ఆస్పత్రి కింద ఉన్న నెట్వర్క్ మొత్తాన్నీ బట్టబయలు చేసి తుడిచి పెట్టి తీరుతామని ప్రకటించింది. షిఫా ఆస్పత్రి కాంప్లెక్స్‌పై భారీ దాడికి సైన్యం సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తుండటం తెలిసిందే. హమాస్ దురాగతాలు ఐసిస్‌ను మించిపోయాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ దుయ్యబట్టారు. ఆస్పత్రులనే ప్రధాన స్థావరాలుగా మార్చుకునే నైచ్యానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది. గాజాకు స్టార్‌లింక్ కనెక్టివిటీ గాజాలో పాలస్తీనియన్లకు కనీస సౌకర్యాలు అందించేందుకు ప్రయతి్నస్తున్న అంతర్జాతీయ సంస్థలకు స్టార్‌లింక్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ తదితర కనెక్టివిటీ సౌకర్యం కలి్పస్తామని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ శనివారం ప్రకటించారు. గాజాలో అన్ని సమాచార సదుపాయాలనూ ధ్వంసం చేయడం దారుణమంటూ అమెరికా నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కొరెట్జ్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా మస్క్ ఈ మేరకు ప్రకటన చేశారు. స్టార్ లింక్ మస్క్ తాలూకు అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఉపగ్రహ నెట్వర్క్ వ్యవస్థ. 7,700 దాటిన మృతులు ► అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్–హమాస్ పోరాటంలో గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య ఇప్పటికే 7,700 దాటింది. ► వీరిలో చాలామంది బాలలు, మహిళలేనని పాలస్తీనా ప్రకటించింది. ► శుక్రవారం సాయంత్రం నుంచే కనీసం 550 మందికి పైగా మరణించినట్టు సమాచారం. ► గతంలో ఇజ్రాయెల్–హమాస్ మధ్య జరిగిన నాలుగు పోరాటాల్లోనూ కలిపి దాదాపు 4,000 మంది మరణించినట్టు అంచనా! ► అక్టోబర్ 7న హమాస్ జరిపిన మెరుపు దాడిలో 1,400 మంది దాకా ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. వీరిలో 311 మంది సైనికులని ప్రభుత్వం ప్రకటించింది. సర్వం స్తంభించింది... ఇజ్రాయెల్ దాడుల ధాటికి గాజాలో సమాచార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దాంతో వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి అష్రఫ్ అల్ఖిద్రా తెలిపారు. ► అంబులెన్స్‌లకు సమాచారమివ్వడం అసాధ్యంగా మారిపోయింది. ► అవసరమైన చోట్లకు ఎమర్జెన్సీ బృందాలను పంపడం నిలిచిపోయింది. ► ఇజ్రాయెల్ సైనిక వాహనాల హోరు, బాంబుల మోతల మధ్యే వైద్య బృందాలతో కూడి న వాహనాలు క్షతగాత్రుల కోసం చెదురుమదురుగా వెదుకులాడుతున్నాయి. ► చాలాచోట్ల గాయపడ్డవారిని పౌరులే తమ వాహనాలపై ఆస్పత్రులకు చేరుస్తున్నారు. ► బాంబు దాడుల ధాటికి నేలమట్టమవుతున్న ఒక వీధిలో నుంచి పాలస్తీనియన్లు హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుండటం స్థానిక మీడియా విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. గాయాలతో కుప్పకూలి అల్లాడుతున్న ఒక వ్యక్తి అంబులెన్స్ అని అరుస్తుండటం అందులో కనిపిస్తోంది. ► తాము కేవలం హమాస్ మిలిటెంట్లను మాత్రమే లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతున్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. కానీ వారు పౌరులను అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. బందీల బంధువుల నిరసన అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు చెరపట్టిన 200 మంది పై చిలుకు ఇజ్రాయెలీల బంధువులు టెల్ అవీవ్ నగరంలో నిరసనకు దిగారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వచ్చి తమ గోడు వినాలంటూ నినాదాలు చేశారు. బందీలను విడిపించి వెనక్కు తీసుకొచ్చే ఆలోచన ఎవరూ చేయడం లేదంటూ మండిపడ్డారు. ► హమాస్ చెరలో 229 మంది ఉన్నట్టు సైనిక అధికార ప్రతినిధి హగరీ నిర్ధారించారు. అయితే వారిని విడుదల చేస్తే కాల్పులు విరమిస్తామని ప్రతిపాదించినట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ► ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం ఫలితంగా నలుగురు బందీలను హమాస్ ఇటీవల విడుదల చేయడం తెలిసిందే. -
ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది..
న్యూఢిల్లీ: ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి ఆదివారం రెండు విమానాల్లో 471 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. వీటిలో ఒక విమానం ఎయిరిండియాకు చెందినది కాగా, మరోటి స్పైస్‌జెట్ సంస్థదని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 197 మందితో కూడిన మూడో విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా, 274 మంది ప్రయాణికులతో నాలుగో విమానం సాయంత్రం వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ‘ఎక్స్’లో విడుదల చేశారు. శుక్ర, శనివారాల్లో ఎయిరిండియా ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ విమా నాల్లో 435 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. తాజా తరలింపుతో యుద్ధ వాతావరణం నెలకొన్న ఇజ్రాయెల్ నుంచి ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో స్వదేశానికి వచ్చిన భారతీయుల సంఖ్య 900 దాటింది. -
వేగంగా వృద్ధి సాధిస్తాం
ముంబై: తమ దగ్గర నిధుల సౌలభ్యం ఉందని, ఈ ఏడాది చివరిలో భారీ సంఖ్యలో (మూడు అంకెల) విమానాలకు ఆర్డర్ చేయగలమని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే ప్రకటించారు. చాలా వేగంగా వృద్ధి చెందే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. ఈ సంస్థను ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ జున్‌జున్‌వాలా స్థాపించడం గమనార్హం. వచ్చే నెలతో సంస్థ కార్యకలాపాలకు ఏడాది పూర్తి కానుంది. ఈ కాలంలో తాము అంచనాలను మించినట్టు దూబే తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 19 విమానాలు ఉండగా, మరొకటి ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. దీంతో అంతర్జాతీయ సరీ్వసులు సైతం ప్రారంభించడానికి వీలు కలగనుంది. మూడు అంకెల విమానాల ఆర్డర్లు, అంతర్జాతీయ సేవల ప్రారంభం ఈ ఏడాదిలో ఉంటాయని దూబే చెప్పారు. ఈ సంస్థ 76 విమానాలకు గత నెలలో ఆర్డర్లు ఇవ్వడం తెలిసిందే. మార్కెట్లో పోటీ పెరగడంతో ఇండిగో, ఎయిర్ ఇండియా ఒకవైపు పెద్ద సంఖ్యలో విమానాలకు ఆర్డర్లు ఇవ్వడాన్ని ప్రస్తావించగా.. తాము ఏదీ కూడా స్వల్పకాల దృష్టితో చేయబోమని దూబే స్పష్టం చేశారు. తాము వృద్ధి కోసం పరుగులు పెట్టడం కాకుండా, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ‘‘ఇప్పటి నుంచి 2027 మార్చి నాటికి 76 ఎయిర్‌క్రాఫ్ట్‌లు మాకు అందుబాటులోకి వస్తాయి. ఉజ్వలమైన దేశీయ మార్కెట్, పలు అంతర్జాతీయ మార్గాలకు సరీ్వసులతో, ఎక్కువ మంది కస్టమర్ల సంతృప్తి పొందే ఎయిర్‌లైన్ సంస్థగా ఉంటాం’’అని దూబే చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం మే నెలలో దేశీ మార్గాల్లో ఆకాశ ఎయిర్ 4.8 శాతం వాటాను సంపాదించింది. స్వర్ణయుగం.. వచ్చే రెండు దశాబ్దాల కాలం ఏవియేషన్ చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిపోతుందని దూబే అన్నారు. వచ్చే 15–20 ఏళ్లలో సుమారు 2,000 విమాన సరీ్వసులు, పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ‘‘ప్రస్తుతం మేమున్న స్థితి పట్ల ఎంతో సంతోíÙస్తున్నాం. ఎంతో వృద్ధి చూడనున్నాం. మేము చిన్న సంస్థగా ఉన్నాం. కనుక మరింత వేగంగా వృద్ధి చెందే సామర్థ్యాలు మాకున్నాయి. ఒక్కసారి మా విమానాల సంఖ్య 20కు చేరితే అంతర్జాతీయ సరీ్వసులు ఆరంభించేందుకు అర్హత లభిస్తుంది. 120 ఏళ్ల విమానయాన చరిత్రలో సున్నా నుంచి 19 విమానాలకు మా అంత వేగంగా చేరుకున్నది మరొకటి లేదు. గత ఏడాదిలో మేము సాధించిన ప్రగతి పట్ల సంతోíÙస్తున్నాం’’అని దూబే వివరించారు. తాము ఉద్యోగులను పెంచుకుంటున్నామని చెబుతూ, 2023 చివరికి 3,500 మంది ఉద్యోగులను కలిగి ఉంటామని పేర్కొన్నారు. -
ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆకాశంలో రెండు విమానాలు ఎదురెదురుగా వస్తే ఇంకేమైనా ఉందా. ఇక అంతే సంగతలు. ఐతే కంట్రోలర్ల అజాగ్రత్త కారణంగా నేపాల్‌కి చెందిన రెండు విమానాలు ఎదురు పడి డీ కొనేంత చేరువులోకి వచ్చేశాయి. అయితే పైలట్లను అప్రమత్తం చేయడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో నేపాల్ విమానాయన అథారిటీ సీరియస్ అయ్యింది. కంట్రోలర్ల అజాగ్రత్త కారణంగానే జరిగిందని నిర్థిరిస్తూ.. ముగ్గురు కంట్రోలర్లపై వేటు విధించింది. వివరాల ప్రకారం..శుక్రవారం ఉదయం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఖాట్మండుకు వస్తున్న నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ 320 విమానం, న్యూఢిల్లీ నుంచి ఖాట్మండుకు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం దాదాపు ఢీ కొనేంత చేరువకు వచ్చాయి. ఎయిర్ ఇండియా విమానం దాదాపు 19 వేల అడుగుల నుంచి దిగుతుండగా..అదే ప్రదేశంలో నేపాల్ ఎయిర్‌లైన్స్ సుమారు 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. రెండు విమానాలు సమీపంలో ఉన్నాయని రాడార్ చూపించడంతో వార్నింగ్ సిస్టమ్ ద్వారా అధికారులు సదరు విమాన పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం ఏడు వేల అడుగులకు దిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కొద్దిలో పెను ప్రమాదం తప్పిందని అదికారులు ఊపించుకున్నారు. గానీ ఈ ఘటన పట్ల సీరియస్ అయిన నేపాల్ పౌర విమానాయన అథారిటీ ఇది ఉద్యోగుల అజాగ్రత్త కారణంగానే చోటుచేసుకున్నట్లు పేర్కొంది. అంతేగాదు ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటన జరిగినప్పుడూ కంట్రోల్ రూంకు ఇన్చార్జ్గా ఉన్న ముగ్గురు అధికారులను సీఏఏఎన్ సస్పెండ్ చేసింది. దీనిపై ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. (చదవండి: చిన్నారి హత్య కేసు నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష) -
ఎయిరిండియాకు 6,500 మంది పైలట్లు కావాలి
ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సంస్థ ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి 470 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విమానాలు నడిపించడానికి 6,500 మందికిపైగా పైలట్లు అవసరమని విమానయాన పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 113 విమానాలు ఉన్నాయి. దాదాపు 1,600 మంది పైలట్లు పనిచేస్తున్నారు. పైలట్ల కొరత వల్ల ఇటీవల పలు సందర్భాల్లో అల్ట్రా–లాంగ్ హాల్ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాల ప్రయాణాల్లో ఆలస్యం చోటుచేసుకుంది. ఎయిరిండియా అనుబంధ సంస్థలైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియాలో 54 ఫ్లైట్లు ఉండగా, దాదాదాపు 850 మంది పైలట్లు సేవలందిస్తున్నారు. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో 53 విమానాలు, 600 మందికిపైగా విమాన చోదకులు ఉన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియా, విస్తారా సంస్థల్లో కలిపి 220 విమానాలు ఉన్నాయి. 3,000 మందికిపైగా పైలట్లు పనిచేస్తున్నారు. -
Sakshi Cartoon: చైనా సరిహద్దుల్లో అమెరికా రహస్య విమానాలు
మనం భారత్ సరిహద్దుల్లో ఇలానే చేస్తుంటే.. వాళ్లు మన సరిహద్దుల్లో అదే పని చేస్తున్నార్సార్! -
నిలిచిపోనున్న ఇండిగో పాత విమానాలు
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో తన పాత విమానాలకు స్వస్తి పలకాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి కొత్త ‘ఏ 320 నియో’ విమానానికి.. అన్మోడిఫైడ్ ప్రాట్ అండ్ విట్నీ (పీడబ్ల్యూ) ఇంజన్లను కలిగిన పాత విమానాలను నిలుపుచేయాల్సి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా ఆదేశించింది. ఇక వచ్చే ఏడాది జనవరి 31 నాటికి మొత్తం 97 ఏ 320 నియో విమానాల్లో పీడబ్ల్యూ ఇంజిన్లను మార్చాల్సిందేనని ఇటీవలే డీజీసీఏ ఆదేశించిన విషయం తెలిసిందే. గడువుతేదీ లోపు మార్చకపోతే వీటిని నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొంది. -
జెట్ ఎయిర్వేస్కు ఊరట: ట్రూజెట్ చేతికి జెట్ విమానాలు
సాక్షి,ముంబై: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్ వేస్ కష్టాలనుంచి గట్టెక్కేందుకు మల్ల గుల్లాలుపడుతోంది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్కు భారీ ఊరట లభించనుంది. హైదరాబాద్ ఆధారిత సంస్థ ట్రూజెట్ జెట్ ఎయిర్‌వేస్‌తో మంతనాలు జరుపుతోంది. ఈమేరకు చర్చలు కూడా ప్రారంభించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్భారీస్థాయిలో విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మార్చి 2019 నాటికి 7 కొత్త విమానాలతో 20 ప్రాంతాలకు ట్రూజెట్ బ్రాండ్ విమానాలను నడపాలని యాజమాన్యం భావిస్తోంది. ఈ నెలలోనే ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఖర్చులు తగ్గించుకుని అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలని జెట్ ఎయిర్వేస్ భావిస్తోంది. 7 ఏటీఆర్ విమానాలతో పాటు సిబ్బంది, నిర్వహణ, ఇన్సూరెన్స్ లను కూడా స్వల్ప కాల సబ్ లీజుకి తీసుకొనే ఉద్దేశంలో ఉన్నామని ట్రూజెట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ 7 విమానాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తే ట్రూజెట్ జెట్ ఎయిర్ వేస్ నుంచి మరిన్ని విమానాలను సబ్ లీజుకి తీసుకొనే అవకాశం ఉందని అంచనా. మరోవైపు తన అన్ని విమానాల వాడకానికి సంబంధించిన అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని జెట్ ఎయిర్వేస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. జెట్ ఎయిర్ వేస్ తో ఒప్పందం కుదిరితే 7 ఏటీఆర్ విమానాలు ట్రూజెట్ ఫ్లీట్ లో చేరతాయి. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు అమలులో ఉంటుందని సమాచారం. కాగా జూలై 2015న ట్రూజెట్ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం 5 ఏటీఆర్-72 విమానాలతో 14 ప్రాంతాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. టైర్ 2, టైర్ 3 నగరాలను కలుపుతూ చౌకగా విమానయానం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద ట్రూజెట్ తన కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విస్తరణ అనంతరం పశ్చిమ మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు విమానాలు నడిపే యోచనలో ఉంది ట్రూజెట్. -
విమానాల రద్దు సెగ: చార్జీల మోత
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థల నిర్ణయంతో విమాన టికెట్ చార్జీలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రధాన ఎయిర్‌లైన్స్ ఇండిగో, గో ఎయిర్ తమ సర్వీసులను రద్దు చేయడంతో కొన్ని కీలక మార్గాల్లో చార్జీల మోత మోగుతోంది. ముఖ్యంగా రద్దయిన విమానాలకు చెందిన ప్రయాణీకులు సదరు టికెట్లను కాన్సిల్ చేసుకోవడం, తిరిగి టికెట్లను బుక్ చేసుకోవడం తప్పనిసరి. కొన్ని ప్రధానమైన రూట్లలో 10శాతం చార్జీలు పెరిగాయి. దీంతో వేలాది మంది విమానప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దేశీయ పెద్ద విమానయాన సంస్థలు ఇండిగో దాదాపు 65 విమానాలను, గో ఎయిర్ 11 విమానాలను రద్దు చేయడంతో లాస్ట్ మినిట్ ప్రయాణీకులకు భారీ షాక్ తగిలింది. విమానాలు రద్దు చేయడం కొన్ని కీలక మార్గాల్లో అత్యవసరంగా ప్రయాణించే ప్రయాణీకులపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ ప్రతినిధి శరత్ దలాల్ తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైల మధ్య వన్‌వే టికెట్లు రూ.12వేల ధర పలికినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పుంజుకునే అవకాశం ఉందని అంచనావేశారు. దాదాపు 5-10శాతం పెరుగుదల ఉంటుందన్నారు. టైర్ -2 విమానాల ఛార్జీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. మంగళవారం ఢిల్లీ, భువనేశ్వర్ మధ్య చివరి నిమిషంలో బుక్ చేసుకున్న టికెట్ చార్జీలు రూ .7వేలు- రూ .29వేలు ఉండగా, బుధవారం నాటి ధరలు రూ.9వేలనుంచి -రూ.27వేలుగా ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై రూట్లో కూడా బుధవారం దాదాపు రూ. 5వేలు-24వేల మధ్య పలుకుతుండటం గమనార్హం. ఇండిగో అధికారిక వెబ్సైట్ అందించిన సమాచారం ఇండిగో బుధవారం 42 విమానాలను రద్దు చేసింది. ముంబయి, కోల్‌కతా పుణె, జైపూర్, శ్రీనగర్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, డెహ్రాడూన్, అమృత్సర్, బెంగళూరు, హైదరాబాద్ రూట్లు ఇందులో ఉన్నాయి. అయితే గో ఎయిర్‌కు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రయాణీకుల ఇబ్బందులకు తొలగించేందుకు చర్యలు తీసుకంటామని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. కాన్సిలేషన్ చార్జీలు రద్దు, రీషెడ్యూలింగ్ లాంటి చర్యలు చేపట్టుతున్నటు నిన్న ప్రకటించాయి. కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రాట్ అండ్ విట్నీఇంజిన్ల వైఫల్యాల కారణంగా ఎ320 నియో(న్యూ ఇంజిన్ ఆప్షన్) విమానాలను నిలిపివేస్తోంది. సోమవారం అహ్మదాబాద్ నుంచి లక్నో మీదుగా కోల్‌కతా వెళ్తున్న ఇండిగోకు చెందిన ఎయిర్ బస్ ఏ320 నియో విమానం ఎగిరిన కొన్ని నిమిషాలకే దాంట్లోని పిడబ్ల్యూ 1100 ఇంజన్ మొరాయించిన కొన్ని గంటల్లోనే డీజీసీఏ ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్ల వైఫల్యాలున్న ఎ320 నియో విమానాలు నిలిపివేత ప్రారంభించింది. విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్సర్, గౌహతి తదితర నగరాల నుంచి వెళ్లాల్సిన కొన్ని విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దేశీయ విమానయాన రంగంలో ఇండిగోకు 40శాతం, గోఎయిర్‌కు 10శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. -
ఎయిర్‌పోర్టును కమ్మేసిన పొగమంచు..
సాక్షి, దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో మంగళవారంనాడు దట్టమైన పొగమంచు కమ్మేసిన కారణంగా సుమారు 90 పైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజాము 6 గంటల నుండి 9 గంటల వరకూ ఏర్పోర్ట్ చుట్టుపక్కల పొగమంచు కమ్మేసింది. దీంతో అటు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోయాయి. కేఐఏఎల్కు రావాల్సిన విమానాలను దారిమళ్లించారు. ముఖ్యంగా లండన్ వెళ్లాల్సిన బీఏ-118 బ్రిటీష్ ఏర్వేస్,అమెరికన్ ఏర్వేస్ ఐబీ-47652 ఇబ్రియా ఎయిర్వేస్ ,దుబాయ్ వెళ్లాల్సిన ఇండిగో తదితర అంతర్ రాష్ట్రీయ విమానాలు ఆలస్యంగా ఎగిరాయి.బ్రెజిల్ ,సింగపూర్, అబుదాబి తదితర దేశాల నుండి రావాల్సిన విమానాలు ఆలస్యంగా వచ్చాయి. మరికొన్ని విమానాలకు ఇతర ఏర్పోర్ట్లకు దారిమళ్లించారు. 9 గంటల తరువాత పొగమంచు తగ్గాక విమానాలు రాకపోకలు ప్రారంభించాయి. -
సత్తా చాటిన తూర్పు నౌకాదళం
-
సత్తా చాటిన తూర్పు నౌకాదళం
విశాఖ సాగరతీరంలో తూర్పు నౌకాదళం తన విన్యాసాలను ప్రదర్శించి శత్రు దేశాలకు తన సత్తా ఏపాటిదో చాటి చెప్పింది. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌ను చిత్తు చేసి భారత్ విజయబావుటాను ఎగురవేసిన సందర్భంగా ఏటా డిసెంబర్ 4న నేవీ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా సోమవారం సాయంత్రం విశాఖలోని రామకృష్ణా బీచ్‌లో పలు యుద్ధ విన్యాసాలు చేశారు. వీటిని ఎంతోమంది తిలకించారు.సముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించడం, నావికులను సాగరంలో ఒక చోట నుంచి మరో చోటకు తరలించడం వంటివి ప్రదర్శించారు. గంటకు ఆరు వేల కి.మీ. వేగంతో దూసుకెళ్లే మిగ్ విమానాలు భూమికి అతి సమీపంనుంచే గాల్లో తల్లకిందులుగా చక్కర్లు కొడుతూ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. శత్రు దేశం సముద్రంలో రహస్యంగా ఉంచిన ఆయిల్ రిగ్గు పేల్చివేత, మెరైన్ కమెండోల సాహసకృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇంకా డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హాక్స్ శ్రేణి హెలికాప్టర్లు తమ ప్రతిభను ప్రదర్శించాయి. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధ నౌకలు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనువిందు చేశాయి. – సాక్షి, విశాఖపట్నం -
విమానాలపై కెమికల్ దాడులు.. వార్నింగ్!
-
అమెరికా, రష్యాకు ధీటుగా చైనా సవారీ!
షాంఘై: ఉపగ్రహాల ప్రయోగంలో చైనా వినూత్నంగా ముందుకెళ్లనుంది. సాధరణంగా ప్రత్యేక లాంచ్ ప్యాడ్ల ద్వారా రాకెట్లను ప్రయోగించి ఉపగ్రహాలను అంతరిక్షంలోని కక్షల్లో ప్రవేశ పెట్టడానికి భిన్నంగా ప్రయోగాలు చేయనుంది. ఏకంగా యుద్ధ విమానాల ద్వారా రాకెట్లను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టనున్నట్లు చైనాకు చెందిన ఓ పత్రిక తెలిపింది. వందల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపండంతోపాటు, వాణిజ్యపరమైన, శాస్త్రపరమైన లక్ష్యాలను నెరవేర్చుకునే ఉద్దేశంతోనే ఈ దిశగా ముందుకు వెళుతున్నట్లు బీజింగ్ అధికారులు చెప్పినట్లుగా పేర్కొంది. లాంచ్ వెహికల్ టెక్నాలజీని అందించే ది చైనా అకాడమీ ప్రస్తుతం 100 కేజీల పేలోడ్స్‌ను మోసుకెళ్లగల సాంద్ర ఇంధన రాకెట్ల పరిజ్ఞానాన్ని రూపొందించిందని రాకెట్ డెవలప్మెంట్ వ్యవహారాలు చుసుకునే సంస్థ డైరెక్టర్ లి టోంగ్యూ చెప్పారు. చైనా అంతరిక్ష ప్రోగ్రాంను మరింత ముందుకు తీసుకెళ్లాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చెబుతున్నారని, ఈ కార్యక్రమానికే ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అమెరికా, రష్యాలతో పోల్చినప్పుడు ఈ విషయంలో చైనా కొంత నిడివి కలిగి ఉన్నందున వాటికి సమానంగా అంతరిక్షరంగంలో కూడా దూసుకెళ్లేలా చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వై-20 వ్యూహాత్మక యుద్ధ విమానాలు మోసుకెళ్లగలిగే రాకెట్లను సిద్ధం చేస్తున్నామని, వీటి ద్వారానే రాకెట్ల ప్రయోగం చేసి ఉపగ్రహాలను పంపించనున్నామని వెల్లడించారు. మరోపక్క, చైనా మొట్టమొదటి కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ ప్రయాణం ఏప్రిల్‌లో మొదలుకానుంది. 2022నాటికి శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని చైనా ఏర్పాటుచేయాలనుకుంటున్న విషయం తెలిసిందే. -
విమానాలకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
అహ్మదాబాద్: అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. విమానాశ్రయ రన్ వే పై ఇండిగో విమానం, స్పైస్ జెట్ విమానాల ల్యాండింగ్, టేక్ ఆఫ్ సందర్భంగా ఈ ఘోర ప్రమాదం తృటిలో తప్పిందని రన్ వే అధికారులు ప్రకటించారు. అకస్మాత్తుగా రన్ వే మీదికి ఓ కుందేలు దూసుకురావడం.. భయాందోళనకు దారి తీసిందని.. అయితే అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పిందని లేదంటే వందలమంది ప్రాణాలు ప్రమాదంలో చిక్కుకునేనవని ఎయిర్‌పోర్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఆఖరి నిమిషంలో జోక్యం చేసుకున్న ఏటీసీ అధికారులు అప్రమత్తమై పైలట్లను అలర్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండిగో విమానం జస్ట్ ల్యాండ్ అయ్యి ట్యాక్సీ వే వైపు పోతోంది. అదే సమయంలో స్పైస్ జెట్ విమానం టేక్ ఆఫ్(ఎగరడానికి) సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ చిన్న అనుకోని ఘటన ఎందురైంది. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదుగానీ రన్‌వై మీద కుందేలు ఉండడాన్ని గమనించారు అధికారులు. ఆఖరి నిమిషంలో ఏటీసీ అధికారులు అప్రమత్తమై పైలట్లను అలర్ట్ చేశారు. దీంతోవారు సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ఇండిగో విమానం ముక్కు నేలను తాకగా తోక మాత్రం గాల్లోనే ఉండిపోయింది. ఈ ఘటనతో సిబ్బంది ఒక్కక్షణం భయభ్రాంతులకు లోనయ్యారు. అటు రన్ వే పై కుందేలును గమనించినట్టు ఇండిగో పైలట్లు, రన్ వే క్లియర్ కాకుండా, ఇండిగోవిమానం అక్కడే ఉండడాన్ని చూసి అప్రమత్తమైనట్టు టేక్ ఆఫ్ తీసుకున్న స్సైస్ జెట్ పైలట్లు నివేదించారు. అయితే ఏటీసీ అధికారుల సూచనలతో విమానాల పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అటు ఏవియేషన్ విభాగం ఈ ఘటనపై విచారణ చేపట్టింది. ఈ ఉదంతంపై రెండు విమానాలకు చెందిన పైలెట్లు అహ్మదాబాద్ ఏటీసీకి తమ నివేదికను అందించారు. -
విమానయాన సంస్థలకు షాకిచ్చిన ఎన్జీటీ
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాకిచ్చింద. విమానాల్లోని మానవ వ్యర్థాలను గృహాలపై విడిచిపెట్టడంపై మండి పడింది. దీనికి సంబంధించి సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ) ని ఆదేశించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతంలో నివిసించే మాజీ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సాత్వంత్ సింగ్ దహియా దాఖలు చేసిన పిటీషన్ పై విమానయాన సంస్థలకు షాకిచ్చిన ఎన్జీటీ అధ్యక్షుడు స్వతంత్ర కుమార్ ఈ ఆదేశాలిచ్చారు.. స్వచ్ఛ్ భారత్ అభియాన్ కి విమానయాన సంస్థ చర్యలు విఘాతం కలిగిస్తున్నాయన్న సైనిక అధికారి వాదనలను ట్రిబ్యునల్ సమర్ధించింది. విమానాల టాయిలెట్ ట్యాంకులను గాల్లోనే ఖాళీచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ డీజీసీఎ కి కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా ఇలా వ్యవహరించే విమానయాన సంస్థలకు రూ .50,000 జరిమానా విధించాలని డీజీసీఏ ని కోరింది. జరిమానా ద్వారా సేకరించిన సొమ్మను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) వద్ద డిపాజిట్ చేయాలని కోరింది. సంబంధిత ఫిర్యాదులకో్సం ఒక హెల్ప్ లైన్ , ఈ మెయిల్ క్రియేట్ చేయాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు సీపీసీబీ కూడా ఎయిర్ లైన్స్ చర్యపై విస్మయం వ్యక్తంచేసింది. ఫిర్యాదు దారు ఇంటిదగ్గర సేకరించిన సాంపిల్స్ ను పరీక్షించగా, అవి మానవ వ్యర్థాలుగా తేలిందని పేర్కొన్నారు. విమానాలు ల్యాండ్ అయినపుడు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో టాయిలెట్ ట్యాంకులు ఖాళీగా ఉండడం గమనించామని తెలిపింది. అయితే ఈ ఆరోపణలను విమాన మంత్రిత్వ శాఖ ఖండించింది. విమానం ల్యాండ్అయిన తరువాత సాధారణంగా వాటిని శుభ్రం చేస్తారని పేర్కొంది. అయితే ఏవియేషన్ అధికారులు టాయిలెట్ ట్యాంక్ లీక్ అయివుండంచ్చని తెలపడం విశేషం. -
చైనాపై ఫిలిప్పీన్స్‌కు అండగా జపాన్
టోక్యో: చైనాతో దక్షిణ చైనా సముద్ర ప్రాదేశిక జలాల విషయంలో పోరాడుతున్న ఫిలిప్పీన్స్‌కు జపాన్ బాసటగా నిలిచింది. దక్షిణ చైనా సముద్రంపై తన వాటా కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఫిలిప్పీన్స్‌కు అండగా ఉంటామని, వారి సేనలకు తాము యుద్ధ నౌకలతోపాటు నిఘా విమానాలను పంపిస్తామని చెప్పింది. ఈ మేరకు జపాన్ ప్రధాని షింజో అబే మంగళవారం ఒక ప్రకటన కూడా చేశారు. రెండు పెట్రోల్ యుద్ధ నౌకలను, ఐదు నిఘా యుద్ధ విమానాలను ఫిలిప్పీన్స్‌కు సహాయంగా పంపించేందుకు తాము అంగీకరిస్తున్నట్లు జపాన్ ప్రధాని తెలిపారు. దక్షిణ చైనా సముద్రంపై చైనాతో ఉన్న వివాదాన్ని శాంతియుత పరిష్కరించే క్రమంలో భాగంగా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టీ, జపాన్ ప్రధాని షింజో ఒక ఒప్పందానికి వచ్చినట్లు జపాన్ డిప్యూటీ కేబినెట్ చీఫ్ సెక్రటరీ కోయిచి హగుదా చెప్పారు. -
విమానాల్లో మహిళలపై వికృత చేష్టలు
‘ఇండిగో’లో వ్యక్తి అసభ్య ప్రవర్తనపై మహిళ ఫిర్యాదు హైదరాబాద్: విమానంలో ఓ మహిళా ప్రొఫెసర్‌తో విజయవాడ టీడీపీ కార్పొరేటర్ అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చినరోజే.. మరో విమానంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. శుక్రవారం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో వస్తుండగా తన పక్కసీట్లో కూర్చున్న వ్యక్తి సెల్ఫోన్లో ఫొటోలు తీస్తూ వికృతంగా ప్రవర్తించినట్లు ఓ మహిళ శనివారం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రయాణం చేస్తున్నంతసేపూ అతడి ప్రవర్తనతో విసిగిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నా.. అధికారికంగా ధ్రువీకరించలేదు. ఏడాది కిందట మద్యం మత్తులో విమానంలోని ఎయిర్‌హోస్టెస్ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. అలాగే తోటి ప్రయాణికురాలితో మరో వ్యక్తి కూడా అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలపై ఫిర్యాదులందాయి. -
విమానాల్లో చార్జీల మోత!!
-
ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు!
ఢిల్లీ: విమానాల్లో బాంబులు పెట్టామంటూ వరుసగా వస్తున్న బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా పలు విమానాల్లో బాంబులు పెట్టామంటూ ఢిల్లీకి, బెంగళూరు నగరాల్లోని ఎయిర్ పోర్ట్ లకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆరు విమానాల్లో బాంబులు పెట్టామని దుండగుల నుంచి శనివారం ఉదయం బెదిరింపు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. దీంత్ అప్రమత్తమై భద్రతా బలగాలు విమానాలను క్షణ్ణంగా తనిఖీ చేశారు. మూడు అంతర్జాతీయ విమానాలకు ఇందిరా గాంధీ విమానాశ్రయానికి తిరిగి రప్పించి తనిఖీలు నిర్వహించారు. అనంతరం విమానాల్లో ఎటువంటి బాంబులు లేవని నిర్ధారించారు. ఇది కొంతమంది ఆకతాయిలు చేసిన పనిగా అనుమానిస్తున్నా.. ఈ కాల్స్ పై పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు పోలీసులు సన్నద్దమయ్యారు. అసలు బెదిరింపు కాల్స్ వెనుక ఉగ్రవాదులు కుట్ర ఏమైనా ఉందా?అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
విమానాలు ఢీ : ఏడుగురు మృతి
బ్రటిస్లావా : స్లోవేకియాలో ఎయిర్ షో కోసం గురువారం ప్రాక్టీసు చేస్తున్న రెండు విమానాలు ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే ఈ ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు విమానంలోని పలువురు ప్రయాణీకులు ప్యారాచుట్ల ద్వారా కిందకి దూకేశారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈ రెండు విమానాల్లో సుమారు 40 మంది ప్రయాణీకులు ఉన్నారని తెలిపింది. విమాన శిథిలాలు చెక్ రిపబ్లిక్ సరిహద్దులోని పర్వత ప్రాంతంలో పడి ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సైన్యం మూడు హెలికాప్టర్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టిందని వివరించింది. ఎయిర్ షో నిర్వహించిన ల్లవ్వా పట్టణం రాజధాని బ్రటిస్లావాకు 150 కిలోమీటర్లు దూరంలో ఉంది.