ముంబై: తమ దగ్గర నిధుల సౌలభ్యం ఉందని, ఈ ఏడాది చివరిలో భారీ సంఖ్యలో (మూడు అంకెల) విమానాలకు ఆర్డర్ చేయగలమని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే ప్రకటించారు. చాలా వేగంగా వృద్ధి చెందే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. ఈ సంస్థను ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ జున్‌జున్‌వాలా స్థాపించడం గమనార్హం. వచ్చే నెలతో సంస్థ కార్యకలాపాలకు ఏడాది పూర్తి కానుంది. ఈ కాలంలో తాము అంచనాలను మించినట్టు దూబే తెలిపారు.
ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 19 విమానాలు ఉండగా, మరొకటి ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. దీంతో అంతర్జాతీయ సరీ్వసులు సైతం ప్రారంభించడానికి వీలు కలగనుంది. మూడు అంకెల విమానాల ఆర్డర్లు, అంతర్జాతీయ సేవల ప్రారంభం ఈ ఏడాదిలో ఉంటాయని దూబే చెప్పారు. ఈ సంస్థ 76 విమానాలకు గత నెలలో ఆర్డర్లు ఇవ్వడం తెలిసిందే.
మార్కెట్లో పోటీ పెరగడంతో ఇండిగో, ఎయిర్ ఇండియా ఒకవైపు పెద్ద సంఖ్యలో విమానాలకు ఆర్డర్లు ఇవ్వడాన్ని ప్రస్తావించగా.. తాము ఏదీ కూడా స్వల్పకాల దృష్టితో చేయబోమని దూబే స్పష్టం చేశారు. తాము వృద్ధి కోసం పరుగులు పెట్టడం కాకుండా, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ‘‘ఇప్పటి నుంచి 2027 మార్చి నాటికి 76 ఎయిర్‌క్రాఫ్ట్‌లు మాకు అందుబాటులోకి వస్తాయి. ఉజ్వలమైన దేశీయ మార్కెట్, పలు అంతర్జాతీయ మార్గాలకు సరీ్వసులతో, ఎక్కువ మంది కస్టమర్ల సంతృప్తి పొందే ఎయిర్‌లైన్ సంస్థగా ఉంటాం’’అని దూబే చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం మే నెలలో దేశీ మార్గాల్లో ఆకాశ ఎయిర్ 4.8 శాతం వాటాను సంపాదించింది.
స్వర్ణయుగం..
వచ్చే రెండు దశాబ్దాల కాలం ఏవియేషన్ చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిపోతుందని దూబే అన్నారు. వచ్చే 15–20 ఏళ్లలో సుమారు 2,000 విమాన సరీ్వసులు, పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ‘‘ప్రస్తుతం మేమున్న స్థితి పట్ల ఎంతో సంతోíÙస్తున్నాం. ఎంతో వృద్ధి చూడనున్నాం. మేము చిన్న సంస్థగా ఉన్నాం. కనుక మరింత వేగంగా వృద్ధి చెందే సామర్థ్యాలు మాకున్నాయి. ఒక్కసారి మా విమానాల సంఖ్య 20కు చేరితే అంతర్జాతీయ సరీ్వసులు ఆరంభించేందుకు అర్హత లభిస్తుంది. 120 ఏళ్ల విమానయాన చరిత్రలో సున్నా నుంచి 19 విమానాలకు మా అంత వేగంగా చేరుకున్నది మరొకటి లేదు. గత ఏడాదిలో మేము సాధించిన ప్రగతి పట్ల సంతోíÙస్తున్నాం’’అని దూబే వివరించారు. తాము ఉద్యోగులను పెంచుకుంటున్నామని చెబుతూ, 2023 చివరికి 3,500 మంది ఉద్యోగులను కలిగి ఉంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment