International Services
-
వేగంగా వృద్ధి సాధిస్తాం
ముంబై: తమ దగ్గర నిధుల సౌలభ్యం ఉందని, ఈ ఏడాది చివరిలో భారీ సంఖ్యలో (మూడు అంకెల) విమానాలకు ఆర్డర్ చేయగలమని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే ప్రకటించారు. చాలా వేగంగా వృద్ధి చెందే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. ఈ సంస్థను ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ జున్‌జున్‌వాలా స్థాపించడం గమనార్హం. వచ్చే నెలతో సంస్థ కార్యకలాపాలకు ఏడాది పూర్తి కానుంది. ఈ కాలంలో తాము అంచనాలను మించినట్టు దూబే తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 19 విమానాలు ఉండగా, మరొకటి ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. దీంతో అంతర్జాతీయ సరీ్వసులు సైతం ప్రారంభించడానికి వీలు కలగనుంది. మూడు అంకెల విమానాల ఆర్డర్లు, అంతర్జాతీయ సేవల ప్రారంభం ఈ ఏడాదిలో ఉంటాయని దూబే చెప్పారు. ఈ సంస్థ 76 విమానాలకు గత నెలలో ఆర్డర్లు ఇవ్వడం తెలిసిందే. మార్కెట్లో పోటీ పెరగడంతో ఇండిగో, ఎయిర్ ఇండియా ఒకవైపు పెద్ద సంఖ్యలో విమానాలకు ఆర్డర్లు ఇవ్వడాన్ని ప్రస్తావించగా.. తాము ఏదీ కూడా స్వల్పకాల దృష్టితో చేయబోమని దూబే స్పష్టం చేశారు. తాము వృద్ధి కోసం పరుగులు పెట్టడం కాకుండా, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ‘‘ఇప్పటి నుంచి 2027 మార్చి నాటికి 76 ఎయిర్‌క్రాఫ్ట్‌లు మాకు అందుబాటులోకి వస్తాయి. ఉజ్వలమైన దేశీయ మార్కెట్, పలు అంతర్జాతీయ మార్గాలకు సరీ్వసులతో, ఎక్కువ మంది కస్టమర్ల సంతృప్తి పొందే ఎయిర్‌లైన్ సంస్థగా ఉంటాం’’అని దూబే చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం మే నెలలో దేశీ మార్గాల్లో ఆకాశ ఎయిర్ 4.8 శాతం వాటాను సంపాదించింది. స్వర్ణయుగం.. వచ్చే రెండు దశాబ్దాల కాలం ఏవియేషన్ చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిపోతుందని దూబే అన్నారు. వచ్చే 15–20 ఏళ్లలో సుమారు 2,000 విమాన సరీ్వసులు, పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ‘‘ప్రస్తుతం మేమున్న స్థితి పట్ల ఎంతో సంతోíÙస్తున్నాం. ఎంతో వృద్ధి చూడనున్నాం. మేము చిన్న సంస్థగా ఉన్నాం. కనుక మరింత వేగంగా వృద్ధి చెందే సామర్థ్యాలు మాకున్నాయి. ఒక్కసారి మా విమానాల సంఖ్య 20కు చేరితే అంతర్జాతీయ సరీ్వసులు ఆరంభించేందుకు అర్హత లభిస్తుంది. 120 ఏళ్ల విమానయాన చరిత్రలో సున్నా నుంచి 19 విమానాలకు మా అంత వేగంగా చేరుకున్నది మరొకటి లేదు. గత ఏడాదిలో మేము సాధించిన ప్రగతి పట్ల సంతోíÙస్తున్నాం’’అని దూబే వివరించారు. తాము ఉద్యోగులను పెంచుకుంటున్నామని చెబుతూ, 2023 చివరికి 3,500 మంది ఉద్యోగులను కలిగి ఉంటామని పేర్కొన్నారు. -
విదేశాలకు ఆకాశ ఎయిర్
బెంగళూరు: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనుంది. డిసెంబర్ నాటికి పెద్ద ఎత్తున విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో వినయ్ దూబే బుధవారం వెల్లడించారు. ‘ఇప్పటికే 72 విమానాలకు ఆర్డర్ ఇచ్చాం. వీటిలో 18 సంస్థ ఖాతాలో చేరాయి. కొత్తగా ఇవ్వనున్న ఆర్డర్ మూడంకెల స్థాయిలో ఉంటుంది. ఏడాది కాలంలో 300 మంది పైలట్లను నియమించుకుంటాం. బెంగళూరులో లెర్నింగ్ అకాడెమీ స్థాపించనున్నాం. వచ్చే పదేళ్లలో సంస్థకు కనీసం 3,500 మంది పైలట్లు అవసరం అవుతారు’ అని వివరించారు. సిబ్బందిలో మహిళల సంఖ్య 37 శాతం ఉంది. దీనిని 50 శాతానికి చేర్చాలన్నది ఆకాశ ఎయిర్ లక్ష్యం. గతంలోనే ఆర్డర్ ఇచ్చిన 72 విమానాలను బోయింగ్ 2027 మార్చి నాటికి డెలివరీ చేయనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఆరు నెలలు పూర్తి చేసుకున్న ఆకాశ ఎయిర్ 10 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. హైదరాబాద్, వైజాగ్తోసహా 14 నగరాల్లో సేవలు అందిస్తోంది. 2023 ఆగస్ట్ నాటికి వారంలో 1,000 సర్వీసులు నడపాలని లక్ష్యంగా చేసుకుంది. -
ఐ థింక్ లాజిస్టిక్స్
హైదరాబాద్: సాస్ ఆధారిత షిప్పింగ్ సేవల ప్లాట్‌ఫామ్ ‘ఐ థింక్ లాజిస్టిక్స్’.. దేశీ ఈ కామర్స్ విక్రేతల కోసం అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల దేశీ ఈ కామర్స్ విక్రేతలు (ఎంఎస్ఎంఈలు), డీ2సీ బ్రాండ్లు అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించొచ్చని సంస్థ తెలిపింది. ఐథింక్ లాజిస్టిక్స్ ఇంటర్నేషనల్ భాగస్వామ్య సంస్థల ద్వారా ఇందుకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపింది. భారత్ నుంచి సీమాంతర షిప్పింగ్ సేవల విలువ 2025 నాటికి 129 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐథింక్ లాజిస్టిక్స్ భారత ఈ కామర్స్ విక్రేతల వృద్ధి అవకాశాలకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఒక్క క్లిక్‌తో ఐథింక్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్.. అమెజాన్, ఈబే, షాపిఫై, మెజెంటో, వూకామర్స్ సంస్థలతో అనుసంధానించనున్నట్టు తెలిపింది. -
మేఘాల దారుల్లో... వియత్నాంకు సైతం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు భారీగా పెరిగాయి. కోవిడ్‌కు ముందున్న అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు మరిన్ని సర్వీసులు నేరుగా అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక, వ్యాపార, పర్యాటక రంగాల్లో విశేషంగా ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహానగరంపై అన్ని దేశాలూ దృష్టి సారించాయి. దీంతో అనేక దేశాల నుంచి నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు పలు ఎయిర్‌లైన్స్‌కి ఆసక్తి చూపిస్తున్నాయి. గతంలో హైదరాబాద్ నుంచి దుబాయ్, సౌదీ, ఖతార్ వంటి అరబ్ దేశాలకు మాత్రమే విమానాలు నడిచాయి. కోవిడ్ దృష్ట్యా ఆయా సరీ్వసులపై కూడా ఆంక్షలు విధించారు. కరోనా అనంతరం క్రమంగా 12 దేశాలకు మొదట సర్వీసులను పునరుద్ధరించగా ఇప్పుడు కొత్తగా మరిన్ని దేశాలకు నేరుగా అంతర్జాతీయ కనెక్టివిటీ పెరిగింది. దీంతో 18కి పైగా దేశాలకు హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం గమనార్హం. కోవిడ్‌కు ముందు.. తర్వాత.. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాన అనుసంధానంగా ఉన్న హైదరాబాద్ మహానగరం నుంచి దేశీయంగా, అంతర్జాతీయంగా ఏటా రాకపోకలు పెరగడంతో విమానాశ్రయం విస్తరణ పనులు చేపట్టారు. అంతర్జాతీయ విమానాలు రాకపోకల కోసం రెండేళ్ల క్రితమే అదనపు టరి్మనల్స్ అందుబాటులోకి వచ్చాయి. కాగా.. కోవిడ్ కారణంగా అన్ని రకాల పౌర విమానయాన సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కోవిడ్ కాలంలో అత్యవసర సర్వీసులు మాత్రమే నడిపారు. ఈ ఏడాది ఆంక్షలను సడలించడంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దేశీయ గమ్యస్థానాల సంఖ్య అసాధారణంగా పెరిగింది. కోవిడ్‌కు ముందు 55 గమ్యస్థానాలకు మాత్రమే డొమెస్టిక్ సర్వీసులు నడిచాయి. కోవిడ్ తర్వాత 15 నగరాలకు మొదటీ సర్వీసులను పునరుద్ధరించారు. ఇప్పుడు ఏకంగా 70కి పైగా డొమెస్టిక్ గమ్యస్థానాలకు అనుసంధానం పెరిగింది. కొత్తగా గుల్బర్గా, హుబ్లీ తదితర నగరాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. కొత్తగా అంతర్జాతీయ గమ్యస్థానాలైన చికాగో, మాల్దీవులకు విమాన సర్వీసులను జోడించారు. ఈ సర్వీసులకు ప్రయాణికుల నుంచి అసాధారణమైన స్పందన లభించింది. త్వరలో హైదరాబాద్ నుంచి వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇటీవల థాయ్ స్మైల్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు డైరెక్ట్ విమాన సరీ్వసును పునరుద్ధరించింది. అలాగే ఎయిర్ ఏషియా హైదరాబాద్–కౌలాలంపూర్ విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించింది. దీంతో ఈ ఏడాది అబుదాబి, బహ్రెయిన్, కొలంబో, సింగపూర్, దుబాయ్, దోహా, లండన్, జెడ్డా, రియాద్, కౌలాలంపూర్, కువైట్, మస్కట్, షార్జా, బ్యాంకాక్, చికాగో, మాలే, ఢాకా నగరాలకు డైరెక్ట్ ఫ్లైట్లు అందుబాటులోకి వచ్చాయి. (చదవండి: కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం) -
ట్రావెల్ ఇన్సూరెన్స్.. టేకాఫ్!
న్యూఢిల్లీ: ప్రయాణ బీమా (ట్రావెల్ ఇన్సూరెన్స్)కు పూర్వపు వైభవం సంతరించుకుంది. దేశీయ ప్రయాణాలపై ఆంక్షలు తొలగిపోవడానికి తోడు, అంతర్జాతీయ విమాన సర్వీసులను తెరవడం ఇందుకు అనుకూలించే అంశం. కరోనా వైరస్ సమసిపోవడంతో మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించడం తెలిసిందే. దీంతో ఎక్కువ మంది అంతర్జాతీయ ప్రయాణికులు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే కరోనా ముందు నాటితో పోలిస్తే ఇప్పుడు మరింత మంది ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు మొగ్గుచూపిస్తున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని వారి వైఖరిలో మార్పువచ్చినట్టు భావించొచ్చు. కరోనా వల్ల రెండేళ్లుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడం గమనార్హం. దీంతో విదేశీ పర్యటనలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం ట్రావెల్ ఇన్సూరెన్స్ విభాగాన్ని గట్టిగానే తాకింది. 25% అధికం: ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్ పాలసీబజార్ మార్చి 27తో మొదలైన వారంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోళ్లు 25% పెరిగినట్టు (అంతకుముందు వారంతో పోలిస్తే) తెలిపింది. విక్రయాలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని ఈ సంస్థ అంటోంది. విమాన టికెట్ ధరల స్థిరీకరణకు తోడు, సెలవులు పరిశ్రమకు కలిసొస్తాయని పేర్కొంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ 35 శాతానికి చేరుకుంటాయని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అంచనా వేస్తోంది. కరోనా మహమ్మారి రావడానికి ముందు ఇది 18%గా ఉండేది. విహార యాత్రలు, వ్యాపార యాత్రలకు వెళ్లే వారి నుంచి ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు డిమాండ్ పెరిగినట్టు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అంటోంది. చాలా కాలంగా విమాన సర్వీసులు నిలిచిపోయినందున విహార యాత్రలకు డిమాండ్ ఏర్పడినట్టు తెలిపింది. విదేశీ పర్యటనలకు సంబంధించి ట్రావెల్ ఇన్సూరెన్స్ బుకింగ్‌లు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో 40 శాతం పెరిగినట్టు పాలసీబజార్ వెల్లడించింది. డిమాండ్ మరింత పెరుగుతుంది.. ‘‘ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ 1.5 రెట్లు వృద్ధిని చూస్తుంది’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వెబ్‌సేల్స్ హెడ్ సౌరభ్ చటర్జీ చెప్పారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. విమాన సర్వీసు రద్దయినా, ఆలస్యం అయినా, ఆరోగ్య సమస్యలు ఏర్పడినా కవరేజీ లభిస్తుందని పాలసీబజార్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అమిత్ చాబ్రా తెలిపారు. ‘‘విదేశాలు ఇప్పుడే పర్యాటకులను అనుమతిస్తున్నాయి. ప్రయాణానికి ముందే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. అప్పుడు రిస్క్‌ను ఎదుర్కోవడం సులభంగా ఉంటుంది’’ అని అన్నారు. -
కోవిడ్: విస్తారా ఆ విమానాలు బంద్
సాక్షి, ముంబై: కోవిడ్-19 (కరోనా వైరస్ ) విజృంభిస్తున్న తరుణంలో విమానయాన సంస్థ విస్తారా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 20 నుంచి మార్చి 31 వరకు తన అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా విమాన ప్రయాణికుల ద్వారా ఈ మహమ్మారి తేలికగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న రేపథ్యంలో విస్తారా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ పరిస్థితి కారణంగా 2020 మార్చి 20 నుండి 2020 మార్చి 31 వరకు అంతర్జాతీయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, జాయింట్ వెంచర్ సంస్థ విస్తారా బుధవారం తెలిపింది.ప్రభావిత విమానాలలో బుక్ చేసుకున్న వినియోగదారులకు పూర్తిగా చార్జీలను తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. కాగా ఇప్పటికే గ్లోబల్‌గా పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా బంద్ పెట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 వరకు అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు మార్చి17న గో ఎయిర్ ప్రకటించింది. చైనాలోని వుహాన్ నగరంలో వ్యాపించి ప్రపంచదేశాలను చుట్టేస్తున్న కరోనా మహమ్మారి, ఇటు మానవ జాతిని, ఇటు ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 8 వేలకు తాకింది. అలాగే ఈ వైరస్‌బారిన పడిన వారి సంఖ్య రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. దేశీయంగా కరోనా సోకిన వారికి సంఖ్య 151కి చేరింది. -
దివాలా అంచున ఎయిర్‌లైన్స్ ..
ముంబై: కరోనా వైరస్ భయాలతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో విదేశాలకు ఫ్లయిట్ సేవలు నిలిపివేస్తున్నట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ గోఎయిర్ మంగళవారం వెల్లడించింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 15 దాకా సర్వీసులు ఉండవని పేర్కొంది. దీంతో రోజువారీ ఫ్లయిట్ల సంఖ్య 325 నుంచి 280కి తగ్గుతుంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని వినియోగించుకునే క్రమంలో.. ఉద్యోగులకు రొటేషనల్ ప్రాతిపదికన స్వల్పకాలికంగా, తాత్కాలిక సెలవులు కూడా ఇస్తున్నట్లు గోఎయిర్ వివరించింది. ఈ వ్యవధిలో జీతభత్యాలు ఉండవు. దీంతో పాటు ఉద్యోగుల వేతనాలను క్రమంగా 20 శాతం మేర తగ్గించాలని గోఎయిర్ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దివాలా అంచున ఎయిర్‌లైన్స్ .. కరోనా వైరస్ కారణంగా ప్రయాణికుల సంఖ్య పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఫ్లైబీ సంస్థ ఇప్పటికే దివాలా తీయగా.. ఈ ఏడాది మే ఆఖరు నాటికి చాలా ఎయిర్‌లైన్స్ మూతపడే ప్రమాదముందని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ సీఏపీఏ హెచ్చరించింది. పలు విమానయాన సంస్థలు ఉద్యోగాల్లో కోతకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు 50 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాలంటూ అమెరికాలోని ఎయిర్‌లైన్స్ సంస్థల సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. విమానరంగ నియంత్రణ సంస్థలకు మరిన్ని అధికారాలు పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థలైన డీజీసీఏ, బీసీఏఎస్, ఏఏఐబీ మొదలైన వాటికి మరిన్ని అధికారాలు, చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ఎయిర్‌క్రాఫ్ట్ (సవరణ) బిల్లు 2020ని పార్లమెంటు ఆమోదించింది. విమానయాన రంగ సంస్థలు .. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో విధించే జరిమానాను రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటికి పెంచడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. కరోనా వైరస్‌పరమైన సవాళ్ల నుంచి విమానయాన రంగం సత్వరం బైటికి రాగలదని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పురి ధీమా వ్యక్తం చేశారు. -
ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త భాగస్వామ్య సంస్థ విస్తారా... ఇక నుంచి అంతర్జాతీయ సర్వీసులను కూడా నడపనుంది. వచ్చే నెల (ఆగస్ట్) 6 నుంచి ప్రప్రథమంగా సింగపూర్‌కు ఢిల్లీ నుంచి రోజువారీ విమాన సర్వీసులను ఆరంభిస్తోంది. ఆ మరుసటి రోజే ఆగస్ట్ 7న ముంబై నుంచి కూడా సింగపూర్‌కు డైలీ సర్వీసులను ప్రారంభించనుంది. ఢిల్లీ నుంచి ఒకటి, ముంబై నుంచి ఒకటి మొత్తం రెండు ఫ్లయిట్లను నడపనుంది. అంతర్జాతీయంగా మరిన్ని కేంద్రాలకు త్వరలోనే సర్వీసులను విస్తరించనున్నట్టు సంస్థ తెలిపింది. ఇరువైపుల ప్రయాణానికి అన్ని చార్జీలతో కలిపి ప్రారంభ ధరలను ప్రకటించింది. ఢిల్లీ నుంచి సింగపూర్‌కు వెళ్లి, తిరిగి ఢిల్లీకి వచ్చేందుకు ఎకానమీ క్లాస్‌లో రూ.21,877, బిజినెస్ క్లాస్‌లో రూ.76,890గా నిర్ణయించింది.అలాగే, ముంబై నుంచి సింగపూర్‌కు, సింగపూర్ నుంచి ముంబైకి రానుపోను చార్జీని ఎకానమీ క్లాస్‌కు రూ.20,778, బిజినెస్ క్లాస్‌కు రూ.63,331గా నిర్ణయించింది. చాలా ముఖ్యమైన మార్కెట్ అయినందునే తొలుత సింగపూర్‌కు సర్వీసులు ఆరంభిస్తున్నట్టు విస్తారా సీఈవో లెస్లీథాంగ్ తెలిపారు. -
13 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసుకున్న జెట్ ఎయిర్వేస్
సాక్షి, న్యూఢిల్లీ: నిధుల కొరత కారణంగా గత కొన్ని రోజులుగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్ 13 అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. ఏప్రిల్ చివరి వరకు పలు అంతర్జాతీయ సేవలను నిలిపివేసింది. బెంగుళూరు-సింగపూర్, ఢిల్లీ-అబుదాబీ, ఢిల్లీ-డామన్, ఢిల్లీ-ఢాకా, డిల్లీ-హంగ్‌కాంగ్,ఢిల్లీ-రియాద్, కోల్‌కతా-ఢాకా, ముంబై-అబుదాబీ, ముంబై-బహ్రేన్, ముంబాయి-డామన్, ముంబై-హంగ్‌కాంగ్, పూణే-అబుదాబీ, పూణే-సింగపూర్ మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఢిల్లీ-బ్యాంకాక్ మార్గాల్లో సర్వీసులను 3 నుంచి ఒకటికి తగ్గించగా, ఢిల్లీ-ఖాట్మాండు (4 నుంచి 2), ఢిల్లీ-సింగపూర్ (3 నుంచి 1), ముంబయి-బ్యాంకాక్(3 నుంచి1), ముంబాయి-దోహా(2 నుంచి 1), ముంబాయి-కువైట్ నగరం(2 నుంచి 1), ముంబాయి-సింగపూర్ (3 నుంచి1)కి తగ్గించుకుంది. తాజా సమాచారం మేరకు జెట్ ఎయిర్వేస్ రూ. 8వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఇవే కాకుండా అమ్మకందారులకు రూ.15 వేల కోట్ల మేర బకాయి పడింది. స్టాక్ మార్కెట్లోనూ జెట్ ఎయిర్వేస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. -
విదేశాలకు ఎయిర్ ఏసియా విమాన సర్వీసులు
-
భారత్‌లో వ్యాపారం కష్టమే..: ఎయిర్ ఏషియా
కానీ ఇక్కడి మార్కెట్లో కొనసాగుతామని స్పష్టీకరణ న్యూఢిలీ: భారత్‌లో అనుసరించే రక్షణాత్మక ఆర్థిక విధానాలు, స్వార్థ ప్రయోజనాల కారణంగా ఇక్కడి మార్కెట్లో వ్యాపార నిర్వహణ కష్టతరమని మలేసియన్ ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ ఏషియా చీఫ్ టోనీ ఫెర్నాండెజ్ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఈ విధమైన విధానాలను విడిచిపెట్టేందుకు మోదీ సర్కారు ధైర్యంగా ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. టాటాలతో తమ భాగస్వామ్య సంస్థ ‘ఎయిర్ ఏషియా ఇండియా’ ప్రధానంగా దూర ప్రాంత సర్వీసుల కోసం ఉద్దేశించినదిగా చెప్పారు. ఎయిర్ ఏషియా ఇండియా దూకుడుగా వెళ్లకుండా వృద్ధి వైపు నిదానంగా అడుగులు వేస్తున్న తీరుపై మాట్లాడుతూ... ఇక్కడి విమానయాన రంగం సుదీర్ఘ పరుగు పందెం వంటిందన్నారు. విజయ్‌మాల్యా వలే తుఫాను వేగంతో వెళ్లి సమస్యల్లో చిక్కుకోవాలని లేదని ‘కింగ్‌ఫిషర్స్ ఎయిర్‌లైన్స్’ ఉదంతాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. ఇంతకుముందు విమానయాన పాలసీపై స్పష్టత లేదని, అందుకే తాము విస్తరణ విషయంలో ఆచితూచి అడుగులు వేశామని వివరించారు. ఇకపై తాము ఏం చేయాలన్న దానిపై స్పష్టతతో ఉన్నామని ఫెర్నాండెజ్ చెప్పారు. ఈ మేరకు టోనీ ఫెర్నాండెజ్ కంపెనీ వృద్ధి ప్రణాళికలపై పీటీఐ సంస్థతో మాట్లాడారు. ఎయిర్‌లైన్స్‌ను కాపాడాల్సిన పనిలేదు.. విమానయాన రంగంలో భారత సర్కారు రక్షణాత్మక విధానాలను విమర్శించడానికి మాటలు చాలవన్న ఆయన... దేశీయ ఎయిర్‌లైన్ సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను నడిపే విషయంలో నిబంధన (5/20)ను మార్చడంపై సంతోషం వ్యక్తం చేశారు. ‘మలేసియాలో 2 విమానాలతో సేవలు ప్రారంభిం చాం. అక్కడ 5/20 నిబంధన లేదు. కోర్టులతో పని పడలేదు. మా వెనుక నరేష్ గోయల్ లేడు. భారత్‌లో రెండేళ్లుగానే ఉన్నాం. ఓపిక పట్టాలి. కంగారొద్దు’ అని ఫెర్నాండెజ్ అన్నారు. ‘ఎయిర్‌లైన్ సంస్థలను కాపాడే ప్రయత్నం చేయవద్దు. మరిన్ని విమానయాన సర్వీసులకు వీలు కల్పించాలి. మరింత మంది పర్యాటకులు భారత్‌కు రావాలి. దీంతో మరిన్ని ఉద్యోగాల సృష్టి జరగాలి’ అని అభిప్రాయపడ్డారు.