13 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌​​​​ | Jet Air Ways Suspended Thirteen International Services Due To Funds Scarcity | Sakshi
Sakshi News home page

13 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌​​​​

Published Sat, Mar 23 2019 3:39 PM | Last Updated on Sat, Mar 23 2019 3:40 PM

Jet Air Ways Suspended Thirteen International Services Due To Funds Scarcity - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నిధుల కొరత కారణంగా గత కొన్ని రోజులుగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్‌ 13 అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. ఏప్రిల్‌ చివరి వరకు పలు అంతర్జాతీయ సేవలను నిలిపివేసింది.

బెంగుళూరు-సింగపూర్‌, ఢిల్లీ-అబుదాబీ, ఢిల్లీ-డామన్‌, ఢిల్లీ-ఢాకా, డిల్లీ-హంగ్‌కాంగ్‌,ఢిల్లీ-రియాద్‌, కోల్‌కతా-ఢాకా, ముంబై-అబుదాబీ, ముంబై-బహ్రేన్‌, ముంబాయి-డామన్‌, ముంబై-హంగ్‌కాంగ్‌, పూణే-అబుదాబీ, పూణే-సింగపూర్‌ మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. 

ఢిల్లీ-బ్యాంకాక్‌ మార్గాల్లో సర్వీసులను 3 నుంచి ఒకటికి తగ్గించగా, ఢిల్లీ-ఖాట్మాండు (4 నుంచి 2), ఢిల్లీ-సింగపూర్ ‌(3 నుంచి 1), ముంబయి-బ్యాంకాక్‌(3 నుంచి1), ముంబాయి-దోహా(2 నుంచి 1), ముంబాయి-కువైట్‌ నగరం(2 నుంచి 1), ముంబాయి-సింగపూర్‌ (3 నుంచి1)కి తగ్గించుకుంది.

తాజా సమాచారం మేరకు జెట్‌ ఎయిర్‌వేస్‌ రూ. 8వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఇవే కాకుండా అమ్మకందారులకు రూ.15 వేల కోట్ల మేర బకాయి పడింది. స్టాక్‌ మార్కెట్‌లోనూ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement