jet airways
-
జెట్ ఎయిర్వేస్ కథ కంచికి..
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీని లిక్విడేట్ చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పరిష్కార ప్రణాళిక నిబంధనలను పాటించనందుకు గాను జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) ఇన్వెస్ట్ చేసిన రూ. 200 కోట్ల మొత్తాన్ని జప్తు చేయాలని సూచించింది. ఇక రూ. 150 కోట్ల పర్ఫార్మెన్స్ గ్యారంటీని క్లెయిమ్ చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియానికి అనుమతినిచ్చింది. రాజ్యాంగంలోని 142 ఆరి్టకల్ కింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తాజా పరిణామాలతో పాతికేళ్ల పైగా సాగిన జెట్ ఎయిర్వేస్ ప్రస్థానం ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్సీఎల్ఏటీకి అక్షింతలు.. జేకేసీ సమర్పించిన పనితీరు ఆధారిత బ్యాంక్ గ్యారంటీని (పీబీజీ) పాక్షిక చెల్లింపు కింద సర్దుబాటు చేసేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించడాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. దివాలా కోడ్ (ఐబీసీ) సూత్రాలకు విరుద్ధంగా పేమెంట్ నిబంధనలను పూర్తిగా పాటించకుండానే ముందుకెళ్లేందుకు జేకేసీకి వెసులుబాటునిచ్చినట్లయిందని వ్యా ఖ్యానించింది.జెట్ ఎయిర్వేస్ పరిష్కార ప్రణాళిక ఆమోదం పొంది అయిదేళ్లు గడిచినా కూడా కనీస పురోగతి కూడా లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దివాలా కేసుల విషయంలో ఈ తీర్పు ఓ ’కనువిప్పు’లాంటిదని, ఆర్థికాంశాలకు సంబంధించి ఇచ్చిన హామీలను సకాలంలో తీర్చాల్సిన అవసరాన్ని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తాయని పేర్కొంది. 1992లో ప్రారంభం.. ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు సేల్స్ ఏజంటుగా వ్యవహరించిన నరేశ్ గోయల్ 1992లో జెట్ ఎయిర్వేస్ను ప్రారంభించారు. తొలుత ముంబై–అహ్మదాబాద్ మధ్య ఎయిర్ ట్యాక్సీ సర్వీసుగా కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఒక దశలో జెట్ ఎయిర్వేస్కి 120 పైగా విమానాలు ఉండేవి. ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధం1,300 మంది పైలట్లు, 20,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండేవారు. అయితే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో 2019లో కంపెనీ తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసింది. అప్పటికి జెట్ ఎయిర్వేస్ వివిధ బ్యాంకులకు రూ. 8,500 కోట్ల రుణాలతో పాటు పలువురు వెండార్లు, ప్యాసింజర్లకు ఇవ్వాల్సిన రీఫండ్లు, ఉద్యోగుల జీతాలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. దీంతో 2019 జూన్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) జెట్ ఎయిర్వేస్పై దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2021లో కంపెనీని జేకేసీ దక్కించుకుంది. 2024 నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభించనున్నట్లు కూడా జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. అయితే, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని జేకేసీ సకాలంలో చెల్లించకపోవడంతో వివాదం చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. గురువారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేరు ధర 5 శాతం లోయర్ సర్క్యూట్‌తో 34.04 వద్ద క్లోజయ్యింది. -
క్యాన్సర్‌తో నరేష్ గోయల్ భార్య కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ క్యాన్సర్‌తో పోరాడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆమె 2015 నుంచి సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.అనితా గోయల్ కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా గురువారం ఉదయం ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనిత 1979లో మార్కెటింగ్ అనలిస్ట్‌గా కంపెనీలో చేరారు. ఆమె మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్‌గా ఎదిగిన తర్వాత నరేష్ గోయల్‌తో పరిచయం ఏర్పడింది. వారు కలిసిన తొమ్మిదేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.మనీలాండరింగ్ కేసులో 2023లో జైలుకెళ్లిన ఆమె భర్త నరేష్‌గోయల్‌కు వైద్యకారణాల వల్ల బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ ఇచ్చింది. భర్త జైల్లోనుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే భార్య మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది. -
నరేష్ గోయెల్‌కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయెల్‌కు ముంబయి హైకోర్టు రెండు నెలలపాటు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆయన భౌతిక, మానసిక ఆరోగ్యం బాగోలేదని గోయెల్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2023 సెప్టెంబరులో తనను అరెస్టు చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్న సమయంలో అనుమతి లేకుండా ముంబయిని విడిచి వెళ్లకూడదని, హామీ కింద రూ.లక్ష జమ చేయాలని ఆదేశించింది. దాంతోపాటు ఆయన పాస్‌పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని తెలిపింది.నరేశ్ గోయెల్ కొన్నిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఆ చికిత్స నిమిత్తం పలుమార్లు బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. జైలులోనుంచి బయటకు వెళ్లి సాక్ష్యాలను మారుస్తారని బెయిల్ ఇవ్వలేదని సమాచారం. మానవతా దృక్ఫథంతో తనకు బెయిలు మంజూరు చేయాలని గోయెల్ విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. ఆసుపత్రిలో గోయెల్ చికిత్స గడువును పొడిగిస్తే ఈడీకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపడంతో బెయిల్ మంజూరు చేసినట్లు తెలసింది.ఇదీ చదవండి: ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్..! కారణం..జెట్ ఎయిర్వేస్ అభివృద్ధి కోసం కెనరా బ్యాంకు ద్వారా గతంలో దాదాపు రూ.530 కోట్లు అప్పు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని సంస్థ వృద్ధికికాకుండా వ్యక్తిగత అవసరాలకు, ఇతరవాటికి వినియోగించారని తేలడంతో గోయెల్‌తోపాటు ఆయన భార్యను అరెస్టు చేశారు. అయితే తన భార్య ఆరోగ్యంరీత్యా బెయిల్ ఇచ్చారు. -
జలన్ కల్రాక్ చేతికి జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో మూతపడిన జెట్ ఎయిర్వేస్ రుణపరిష్కార ప్రణాళికను దివాలా పరిష్కార అపీలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తాజాగా అనుమతించింది. జలన్ కల్రాక్ కన్సార్షియంకు కంపెనీ యాజమాన్యాన్ని బదిలీ చేసేందుకు ఎన్సీఎల్ఏటీ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బదిలీని 90 రోజుల్లోగా పూర్తిచేయవలసిందిగా జెట్ ఎయిర్వేస్ పర్యవేక్షణ కమిటీకి సూచించింది. దీంతోపాటు పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీగా జలన్ కల్రాక్ కన్సార్షియం(జేకేసీ) చెల్లించిన రూ. 150 కోట్లను సర్దుబాటు చేయమంటూ జెట్ ఎయిర్వేస్ రుణదాతలను ఎన్సీఎల్ఏటీ బెంచ్ ఆదేశించింది. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకి గతంలో విజయవంతమైన బిడ్డర్‌గా జేకేసీ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే జెట్ ఎయిర్వేస్ రుణదాతలు, జేకేసీ మధ్య యాజమాన్య బదిలీపై తలెత్తిన న్యాయ వివాదాలు ఏడాదికాలంగా కొనసాగుతున్నాయి. ఇంతక్రితం కంపెనీ రుణదాతలు ఈ అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ జోక్యం చేసుకునేందుకు తిరస్కరించింది. అంతేకాకుండా నిర్ణయాధికారాన్ని ఎన్సీఎల్ఏటీకి అప్పగించింది. ఆర్థిక సవాళ్లతో జెట్ ఎయిర్వేస్ సర్విసులు 2019 ఏప్రిల్ నుంచి నిలిచిపోగా.. 2021లో జేకేసీ విజయవంత బిడ్డర్‌గా నిలిచింది. కాగా.. కోర్టు అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళిక(రూ. 350 కోట్ల ఆర్థిక మద్దతు)లో భాగంగా జెట్ ఎయిర్వేస్కు గతేడాది జలన్ కల్రాక్ కన్సార్షియం రూ. 100 కోట్ల పెట్టుబడులను సమకూర్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది(2024)లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని జెట్ ఎయిర్వేస్ యోచిస్తోంది. -
కష్టాలన్నీ ఈ అపరకుబేరుడికే..ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు!
ప్రముఖ జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాల రిత్యా మరో ఆరు నెలల పాటు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ముంబైకి చెందిన జెజె హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్ ఆధారంగా తన శరీరంలో క్యాన్సర్ కారకమయ్యే మాలిగ్నెన్సీ అనే కణతి పెరిగిపోతుందని, వైద్యం కోసం మధ్యంతర బెయిల్ కోరినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గోయల్ తరపు న్యాయవాది అబద్ పోండా సైతం మెడికల్ రిపోర్టులను కోర్టుకి అందజేశారు. గోయల్ అనారోగ్యానికి చికిత్స తీసుకునేందుకు జైలులో సరైన వసతులు లేవు. ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందే హక్కు ఉందని అన్నారు. కీమోథెరపీ తర్వాత కోలుకోవడానికి వైద్య చికిత్స, పరిశుభ్రమైన వాతావరణం అవసరం కాబట్టే గోయల్‌కు ఆరు నెలల మెడికల్ బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు. తన క్లయింట్ చికిత్స పొందిన తర్వాత, పరిశుభ్రత సమస్యలు ఉంటాయని, ఫలితంగా అతను ఇతర ఖైదీలతో కలిసి జీవించలేరని పోండా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పోండా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు టాటా మెమోరియల్ హాస్పిటల్లో చికిత్స పొందవచ్చని, పోలీసు ఎస్కార్ట్ సౌకర్యాన్ని పొందవచ్చని తెలిపింది. కాగా, ఈ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కుటుంబసభ్యులకు సైతం మోసం-అవినీతి ఆరోపణలు. వేలాది మందిని రోడ్డున పడేశారన్న అపఖ్యాతి. దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు. కుటుంబానికి దూరమై జైలులో దుర్భర జీవితం. చచ్చిపోతా.. అనుమతించండంటూ కోర్టుకు విజ్ఞప్తులు. ఇదీ.. జెట్ ఎయిర్వేస్ అధిపతి నరేశ్ గోయల్ దుస్థితి. నరేష్ గోయల్ తో పాటు ఆయన భార్యకు క్యాన్సర్, కుమార్తెకు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ ఇద్దరి బాగోగులు చూసుకునేందుకు ఎవరూ లేక, జైలు జీవితం అనుభవించ లేక దయచేసి జైల్లోనే చచ్చిపోయేందుకు నాకు అనుమతివ్వండి అంటూ కొద్దిరోజుల క్రితం కోర్టును ప్రాధేయపడ్డారు. ఇప్పుడు నరేష్ సైతం క్యాన్సర్ భారిన పడడం వైద్యం నిమిత్తం బెయిల్ మంజూరు చేయడంపై ఆయన ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. జైలులో ఆయన దుర్బర జీవితం గురించి తెసుకున్న వారు సైతం నరేష్ గోయల్ కష్టం... పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నారు. రూ.538 కోట్ల మోసం కేసులో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్‌లో రూ.538 కోట్ల మోసానికి పాల్పడ్డారని నరేశ్ గోయల్, ఆయన భార్య అనితతోసహా ఇతర జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగానే మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు దాఖలు చేసింది. బ్యాంక్ రుణ నిధులను మళ్లించారని, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించింది. ఈ క్రమంలోనే గత ఏడాది సెప్టెంబర్ 1న గోయల్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
క్యాన్సర్ బారిన పడ్డ నరేష్ గోయల్! - కోర్టు కనికరిస్తుందా..
మనీలాండరింగ్ కేసులో వేలకోట్ల మోసానికి పాల్పడ్డ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు 'నరేష్ గోయల్' గత ఏడాది సెప్టెంబర్ 1న అరెస్ట్ అయ్యారు. అయితే క్యాన్సర్ భారిన పడి.. దాని చికిత్స కోసం ఇటీవల మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టులో గురువారం పిటీషన్ దాఖలు చేశారు. మధ్యంతర బెయిల్ కోసం నరేష్ గోయల్ అభ్యర్థనను కోర్టు పరిశీలిస్తోంది. ఆరోగ్య పరిస్థితులను పరిశీలించడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కోర్టు ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసి.. సంబంధిత వివరాలను ఈ నెల 20లోపు సమర్పించాలని ఆదేశించింది. నరేష్ గోయల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రిపోర్ట్ అందించిన తరువాత కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే ఈ తీర్పు ఎలా ఉంటుందనేది త్వరలోనే తెలుస్తుంది. నరేష్ గోయల్ గత జనవరిలో కోర్టుకు హాజరైన తనకు బ్రతకాలనిగానీ, భవిష్యత్తు మీద ఎలాంటి ఆశ లేదని, జైల్లోనే చనిపోవాలనుకున్న ప్రతిసారీ విధి కాపాడుతోంది, ఇలాంటి జీవితం భరించడం కంటే చనిపోవడం మేలని తనకు ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించవద్దని కన్నీరు పెట్టుకున్నారు. ఒకప్పుడు ఇండియాలోనే టాప్ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ అధినేత నరేష్ గోయల్ ప్రస్తుతం దుర్భర జీవితం గడుపుతున్నారు. 1990 నుంచి 2000 వరకు భారతీయ వైమానిక రంగంలో ఓ మెరుపు మెరిసిన సంస్థ ఈ రోజు అధో పాతాళానికి పడిపోయింది. అయితే ఈ నెల 20న నరేష్ గోయల్ బెయిల్ పొందుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్‌లో యూజర్ చాట్ వైరల్ -
గుర్తుపట్టారా? ఒకప్పుడు ‘బాగా రిచ్’.. ఇప్పుడు షార్ప్‌షూటర్లు మధ్య జైలు జీవితం!
ఓ వ్యక్తి ఫోటో ప్రస్తుతం అటు వ్యాపార ప్రపంచంలో ఇటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెల్లని గడ్డం.. సాదాసీదా బట్టలు. కళ్లల్లో అన్నీ కోల్పోయామనే బాధ, ఆ చూపులో తప్పు చేశాననే పశ్చాత్తాపం స్పష్టంగా కనపడుతుంది. ఒకప్పుడు విమానయాన రంగంలో రారాజులా వెలిగిన ఓ బడా వ్యాపారవేత్త. వందల్లో విమానాలు, వేల కోట్లల్లో ఆస్తులు. పిలిస్తే పలికే మంది మార్బలం. ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు. ఒక్క చిటికేస్తే ఆయన ఏం కోరుకున్నా క్షణాల్లో జరిగే పవర్స్. కానీ కాలం కలిసి రాకపోతే అది కొట్టే దెబ్బలకు ఎవరూ అతీతులు కారు. అలా కాలం ఈడ్చి కొట్టిన దెబ్బకి ఇప్పడు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. రూ.538.62 కోట్ల రుణాల ఎగవేతకు పాల్పడి కరడు గట్టిన నేరస్థులు, షార్ప్‌షూటర్లు, గూండాలతో కలిసి జైలు జీవితం అనుభవిస్తున్నారు. కడవరకు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తనకే తెలియని దిక్కుతోచని స్థితిలో కోర్టును చావును ప్రసాదించమని కోరారు. సమాజంలో బతకలేక.. జైలులో చనిపోయేందుకు అనుమతి అడిగారు. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎంతటి శత్రువుకైనా తలెత్తకూడదని కోరుకుంటూ నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆయనను గుర్తు పట్టారా? ఇంతకీ ఆఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? బ్యాంకు రుణాల ఎగవేత కేసులో జైలు పాలైన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ది. నాలుగు నెలలుగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఈయన ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో జాతీయ మీడియా ఆయనను ఫోటోలు తీసింది. ఇక జనవరి 26న ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల సూచనల మేరకు తనని ప్రైవేట్ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అమనుమతి కావాలని పిటిషన్లో కోరారు. ఎస్కార్ట్‌తో ప్రైవేట్ ఆస్పత్రికి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎంజే దేశ్‌పాండే..‘నరేష్ గోయల్ ఆరోగ్య పరిస్థితిని ఇప్పటికే (చివరి విచారణలో) గుర్తించాము. ఎవరి సహాయం లేకుండా తనంతట తానుగా నిలబడలేకపోతున్నారు. కాబట్టి అతని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఎస్కార్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్ ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారను కాబట్టి ఎస్కార్ట్ కోసం అయ్యే ఖర్చును గోయల్ చెల్లిస్తారని తెలిపారు. -
Naresh Goyal: జైల్లోనే చావాలనుంది!
ముంబై: ‘‘నాలో బతకాలన్న ఆశలన్నీ పూర్తిగా అడుగంటాయి. క్యాన్సర్ ముదిరి నా భార్య అనిత మంచాన పడింది. ఆమెను ఎంతగానో మిస్సవుతున్నా. నా ఒక్కగానొక్క కూతురుకూ ఒంట్లో బాగుండటం లేదు. నా ఆరోగ్యం కూడా పూర్తిగా దిగజారింది. మోకాళ్లు మొదలుకుని మూత్ర సంబంధిత వ్యాధుల దాకా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒళ్లంతా స్వాధీనం తప్పి వణుకుతోంది. నొప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో దైన్యంగా బతుకీడ్చడం కంటే జైల్లోనే చనిపోతే బాగుండనిపిస్తోంది’’ అంటూ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (74) భావోద్వేగానికి లోనయ్యారు. రూ.538 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితుడైన ఆయనను ఈడీ గత సెపె్టంబర్ 1న అరెస్టు చేసింది. నాటి నుంచీ జైల్లో ఉన్న ఆయన శనివారం ముంబై ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాసేపు వ్యక్తిగతంగా విచారించాలని కోరగా జడ్జి అనుమతించారు. ఈ సందర్భంగా చేతులు జోడించి తన దైన్యం గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. మాట్లాడుతున్నంత సేపూ గోయల్ వణకుతూనే ఉన్నారని జడ్జి తెలిపారు. ఆయన గత డిసెంబర్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
రూ.538 కోట్ల విలువైన జెట్‌ఎయిర్‌వేస్ ఆస్తులు సీజ్
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్వేస్కు చెందిన రూ.538 కోట్లకు పైగా విలువ గల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుంది. జెట్ ఎయిర్వేస్ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఆయన భార్య, కుమారుడికి చెందిన లండన్, దుబాయ్ సహా భారత్‌లో వివిధ ప్రదేశాల్లో ఉన్న 17 కమర్షియల్ ఫ్లాట్లు, ఇతర ఆస్తులను ఈడీ ఈ మేరకు సీజ్ చేసింది. దాదాపు 26 సంవత్సరాలుగా పూర్తి వాణిజ్య సేవలు అందించిన జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. నగదు కొరత కారణంగా ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. 2019లో గోయల్ ఎయిర్‌లైన్ చైర్‌పర్సన్‌గా వైదొలిగిన తర్వాత జెట్ ఎయిర్వేస్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పిటిషన్‌ని దాఖలు చేసింది. కెనరా బ్యాంకులో రూ.538 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో సెప్టెంబర్ ప్రారంభంలో ఈడీ నరేష్ గోయల్‌ను అరెస్టు చేసింది. బ్యాంకు నుంచి రుణంగా పొందిన ఆదాయంతో విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపించింది. ఈ కేసులో నేరష్ గోయల్‌తో పాటు మరో ఐదుగురిపై ఈడీ మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఉన్న నిందితుల ఆస్తులపై ఈ ఏడాది జులైలోనే ఈడీ దాడులు జరిపింది. జెట్ ఎయిర్వేస్కు రూ.848.86 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తే.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలు ఉన్నాయని కెనరా బ్యాంకు ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2021 జూలై 29న ఈ కేసును మోసంగా ప్రకటించబడిందని కూడా సీబీఐ పేర్కొంది. ఇదీ చదవండి: Wine Capital of India: దేశంలో మద్యం రాజధాని ఏది? -
జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణకు మరో 100 కోట్లు
ముంబై: జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను పునరుద్ధరించే దిశగా జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) మరో రూ. 100 కోట్లు సమకూర్చింది. దీనితో, కోర్టు ఆమోదిత పరిష్కార ప్రణాళిక ప్రకారం మొత్తం రూ. 350 కోట్లు సమకూర్చినట్లయిందని జేకేసీ తెలిపింది. కంపెనీపై పూర్తి అధికారాలు దక్కించుకునేందుకు అవసరమైన నిబంధనలన్నింటినీ పాటించినట్లయిందని పేర్కొంది. ఎయిర్‌లైన్ కార్యకలాపాల పునరుద్ధరణ ప్రణాళికలో ఎటువంటి మార్పులు ఉండవని, వచ్చే ఏడాది (2024) నుంచి ప్రారంభించేందుకు కొత్త ప్రమోటర్లు దృఢనిశ్చయంతో ఉన్నట్లు జేకేసీ వివరించింది. లాంచ్ తేదీని రాబోయే వారాల్లో ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్ 17 నుంచి నిల్చిపోయిన సంగతి తెలిసిందే. -
ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్
న్యూఢిల్లీ: కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో శుక్రవారం రాత్రి అరెస్టయిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను.. మనీ లాండరింగ్ కేసులను విచారించేందుకు ఏర్పాటైన ముంబైలోని ప్రత్యేక కోర్టు సెపె్టంబర్ 11 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి పంపుతూ శనివారం ఆదేశించింది. కెనెరా బ్యాంక్ ఫిర్యాదు మేరకు జెట్ ఎయిర్వేస్ ఛైర్మన్ నరేష్ గోయల్, భార్య అనితపై సీబీఐ మే 3న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జెట్ ఎయిర్వేస్కు రూ.848.86 కోట్ల రుణ పరిమితులు, రుణాలు మంజూరు చేశామని.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలున్నాయన్న కెనరా బ్యాంకు ఫిర్యాదుపై కేసు నమోదైంది. -
ఎవరీ నరేశ్ గోయల్?..జెట్ ఎయిర్వేస్ ఎలా పతనం అయ్యింది?
చిన్న వయస్సులోనే తండ్రి మరణం..చదువుకునే స్థోమతా లేదు. ఒకపూట తింటే రెండో పూట పస్తులుండే జీవితం. అలాంటి దుర్భుర జీవితాన్ని అనుభవించిన ఓ యువకుడు దేశంలోనే అతి పెద్ద ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్ వేస్ అనే విమానయాన సంస్థను ఎలా స్థాపించగలిగారు. చిన్న వయస్సు నుంచే ‘నువ్వు మంచి చేస్తే మంచి... చెడు చేస్తే చెడు... తిరిగి మళ్ళీ అది నిన్నే చేరుతుంది’ అమ్మ మాటల్ని వింటూ పెరిగిన ఆయన ఆర్ధిక నేరానికి ఎందుకు పాల్పడ్డారు. వందల కోట్లలో తీసుకున్న బ్యాంకు లోన్లను ఎగ్గొట్టి పరారయ్యేందుకు ఎందుకు ప్రయత్నించారు. చివరికి ఎలా అరెస్ట్ అయ్యారు. జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్టు అయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రకారం.. కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనను అదుపులోకి తీసుకుంది.ఈ తరుణంలో భారతీయలు సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న నరేశ్ గోయల్ కెరియర్, జెట్ ఎయిర్వేస్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. బీకామ్‌తో సరిపెట్టుకుని నరేశ్ గోయల్ 29 జూలై 1949 పంజాబ్‌లోని సంగ్రూర్ గ్రామంలో జన్మించారు. అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో తన పాఠశాల విద్యాభ్యాసాన్ని, పంజాబ్‌లోని పాటియాలా ప్రభుత్వ బిక్రమ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి కామర్స్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేశారు. అయితే 11 ఏళ్ల వయస్సుల్లో తన తండ్రి మరణం మరింత ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టింది. రుణం కారణంగా ప్రభుత్వం చిన్న తనంలో గోయల్ ఇంటిని, ఇతర ఆస్తుల్ని వేలం పాట నిర్వహించింది. కాబట్టే చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేయాలన్నా ఆయన కలలు.. కల్లలయ్యాయి. చదువుకునే స్థోమత లేక బీకామ్‌తో సరిపెట్టుకున్నారు. కఠిక నేలపై నిద్రిస్తూ 1967లో గ్రాడ్యుయేషన్ తర్వాత, గోయల్ తన మేన మామ సేథ్ చరణ్ దాస్ రామ్ లాల్ ట్రావెల్ ఏజెన్సీ ఈస్ట్ వెస్ట్ ఏజెన్సీస్‌లో క్యాషియర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. అదే ఆఫీస్‌నే ఇంటిగా మార్చుకున్నారు. పగలు ఆఫీస్ పనుల్ని చక్కబెడుతూనే.. రాత్రి వేళలో అదే ఆఫీస్‌లో నిద్రించే వారు. ఆఫీస్ అయిపోయిన వెంటనే అందులోనే స్నానం చేయడం.. పక్కనే ఉన్న దాబాలో సమయానికి ఏది దొరికితే అది తినడం, కఠిక నేలపై నిద్రించడం ఇలా రోజువారీ దినచర్యగా మారింది. అనతి కాలంలో మేనేజర్ స్థాయికి అనతి కాలంలో 1969లో ఇరాకీ ఎయిర్వేస్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్‌గా నియమితులయ్యారు. 1971 నుండి 1974 మధ్యకాలంలో రాయల్ జోర్డానియన్ ఎయిర్‌లైన్స్‌కు రీజినల్ మేనేజర్‌గా కూడా పనిచేశాడు. ఆ సమయంలో టిక్కెట్లు, రిజర్వేషన్, అమ్మకాల రంగాలలో అనుభవాన్ని గడించారు. ఆ అనుభవమే మిడిల్ ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లోని భారతీయ అధికారులతో పనిచేసేందుకు ఉపయోగపడింది. తల్లి ఆశీర్వాదంతో 1967 నుండి 1974 వరకు, గోయల్ అనేక విదేశీ విమానయాన సంస్థలతో కలిసి పనిచేశారు. వ్యాపార మెళుకువల్ని నేర్చుకుని ఆ రంగంపై పట్టు సాధించారు. తనకున్న అనుభవంతో 1974లో నరేశ్ గోయల్ తన తల్లి నుంచి 500 డాలర్లు( రూ. 40వేలు) ఇప్పుడు (రూ.2లక్షలకు పైమాటే) వేల వరకు తీసుకున్నారు. ఆ డబ్బుతో తన సోదరుడు సురీందర్ కుమార్ గోయల్‌తో కలిసి తన సొంత స్టార్టప్ జైటర్ అనే ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించారు. సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో జైటర్ ఎయిర్ ఫ్రాన్స్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్, కాథే పసిఫిక్ వంటి విమానయాన సంస్థలకు సేలందించేంది. వ్యాపారం జోరుగా కొనసాడంతో లాభాల్ని గడిస్తూ వచ్చారు. అంది వచ్చిన అవకాశం అయితే 1991లో, నాటి భారత ప్రభుత్వం ఓపెన్ స్కైస్ పాలసీని ప్రకటించింది. ఆ ప్రకటనే నరేశ్ మరింత ఎత్తుకు ఎదిగేందుకు దోహదం చేసింది. గోయల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సొంతంగా తానే విమానయాన సంస్థను ప్రారంభించారు.1992లో అతని ట్రావెల్ ఏజెన్సీ జెట్ ఎయిర్వేస్గా పేరు మార్చారు. ఆ మరుసటి ఏడాది జెట్ ఎయిర్వేస్ దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. 2004 నాటికి, జెట్ ఎయిర్వేస్ అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలను ప్రారంభమయ్యాయి. 2007లో జెట్ ఎయిర్వేస్ ఎయిర్ సహారాను కొనుగోలు చేసింది. 2010 నాటికి భారతదేశంలో అతిపెద్ద ఏవియేషన్ సంస్థగా అవతరించింది. కొంపముంచిన అతి విశ్వాసం కానీ రోజులు గడిచే కొద్దీ జెట్ ఎయిర్వేస్ ప్రాభవం మరింత తగ్గుతూ వచ్చింది. ఓవైపు అతి విశ్వాసం.. మరోవైపు మార్కెట్లో ఇతర ఏవియేషన్ సంస్థలు పుట్టుకురావడం, జెట్ ఎయిర్వేస్ విమాన టికెట్ ధరలు ఇతర ఏవియేషన్ కంపెనీ టికెట్ల ధరల కంటే ఎక్కువగా ఉండటం, వ్యాపారం కొనసాగించేందుకు అప్పులు చేయడం.. వాటికి వడ్డీలు చెల్లించడం, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక అక్రమ మార్గాన్ని ఎంచుకోవడంతో.. జెట్ ఎయిర్వేస్ పతనం ప్రారంభమైంది. నాలుగు పెద్ద సూట్కేసుల్ని తీసుకుని 2019లో ఎయిర్‌లైన్‌లో ఆర్థిక సంక్షోభంతో మూడింట రెండు వంతుల విమానాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఆయన మార్చి 25 ,2019న తన భార్య అనితా గోయల్‌తో కలిసి జెట్ ఎయిర్వేస్ బోర్డు నుండి వైదొలిగారు. అదే ఏడాది నాలుగు పెద్ద పెద్ద సూట్‌కేసులతో విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేశ్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించడం అప్పట్లో పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది. సెప్టెంబరు 2019లో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గోయల్‌పై విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు కోసం ప్రశ్నించారు. 2020లో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కెనరా బ్యాంక్ నుంచి రూ.538 కోట్లు రుణాలు ఎగవేతకు పాల్పడడం, తన అనుబంధ సంస్థ జేఐఎల్కు 14వందల కోట్ల చెల్లింపులు, పెట్టుబడులు పెట్టి తద్వారా భారీగా నిధుల్ని కాజేశారు. కెనరా బ్యాంక్ అధికారుల ఫిర్యాదు, నిధులు కాజేయడంతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించిన ఈడీ అధికారులు గోయల్‌ను ముంబై కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించించారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వివాదాలు 👉2000వ దశకంలో నరేష్‌గోయల్‌కు అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జెట్ ఎయిర్వేస్కు దావూద్ నిధులు సమకూర్చారని పిల్ పేర్కొంది. అయితే నరేష్ కు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. 👉మార్చి 2020లో, అతనితో అనుబంధించబడిన 19 ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలలో పాల్గొన్నందుకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ద్వారా మనీ లాండరింగ్ కేసు నమోదైంది. 👉19 జూలై 2023న, నరేష్ గోయల్, అతని సహచరుల నివాసాల్లో ఢిల్లీ, ముంబైలలో దాడులు చేసింది. దీనికి ముందు, జూలై 14, 2023న గోయల్, అతని భార్యతో పాటు ఇతరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. చివరికి అదుపులోకి తీసుకుంది. 👉1979లో మార్కెటింగ్ అనలిస్ట్‌గా కంపెనీలో చేరి మార్కెటింగ్, సేల్స్ హెడ్‌గా ఎదిగిన అనిత అనే యువతిని ఆమెను వివాహం చేసుకున్నారు. వారు తొమ్మిదేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. 👉చివరిగా ::: ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని అంశాల ఆధారంగా ఆకాశమే నీ హద్దురా సినిమా తెరకెక్కింది. ఆ సినిమాలో విమానయాన సంస్థ పెట్టడానికి ప్రయత్నించే యువకుడిగా కెప్టెన్ గోపీనాథ్ పాత్రను సూర్య చేస్తే.. సినిమాలోని సూర్య (మహా) ఆశయాన్ని ప్రతి అడుగులోను అడ్డగించే విలన్‌గా పరేష్ రావల్ యాక్ట్ చేశారు. నిజజీవితంలో కెప్టెన్ గోపీనాథ్‌ను ఇబ్బంది పెట్టింది మరెవరో కాదు జెట్ ఎయిర్ వేస్ అధినేత నరేశ్ గోయల్. -
‘జెట్ ఎయిర్వేస్’ నరేశ్ గోయల్ అరెస్ట్
ముంబై: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్(74)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంస్థ శుక్రవారం రాత్రి అరెస్టు చేసింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద.. ముంబైలో ఆయన్ను అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది. జెట్ ఎయిర్ కోసం కెనరా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.848.86 కోట్ల రుణాలను దారి మళ్లించి స్వాహా చేశారని సీబీఐ ఇంతకు ముందే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ గోయల్‌ను ప్రశ్నించి.. అరెస్టు చేసింది. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ నరేశ్ గోయల్, అనితా గోయల్, గౌరంగ్ ఆనంద శెట్టి తదితరులపై గతేడాది నవంబర్ 11న సీబీఐకి కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ సంతోష్ ఫిర్యాదు చేశారు. దీనివల్ల బ్యాంకుకు రూ.538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. గోయల్‌ను శనివారం ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశ పెట్టి..ఈడీ అధి కారులు ఆయన కస్టడీ కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనూహ్యంగా.. దాదాపు 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించిన జెట్ ఎయిర్వేస్.. భారీ నష్టాలు, సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో 2019 ఏప్రిల్‌లో మూత పడింది. ఆపై బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం.. జెట్ ఎయిర్వేస్ సంస్థ బిడ్ సొంతం చేసుకుంనది. ఇక జలాన్ కల్ రాక్ కన్సార్టియం ఆధ్వర్యంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది. ఎయిర్‌పోర్ట్‌లో అడ్డగింత.. తనిఖీలు.. జెట్ ఎయిర్వేస్ సర్వీస్‌లు నిలిచిపోయాక.. 2019 మే 25న విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించారు. ఆ టైంలో నరేష్ గోయల్ దంపతులు నాలుగు భారీ సైజ్ సూట్ కేసులతో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఇక.. విదేశీ విమాన సర్వీసుల సంస్థ ‘ఎతిహాద్’కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో విదేశీ మారక ద్రవ్యం యాజమాన్య సంస్థ (ఫెమా) నిబంధనలను నరేష్ గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో ముంబై, ఢిల్లీల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 2019 సెప్టెంబర్ లో తనిఖీలు చేశారు. 2020లో నరేష్ గోయల్‌ని ఈడీ అధికారులు పలు దఫాలు ప్రశ్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన్ని ముంబై కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. అటు నుంచి అటే అదుపులోకి తీసుకున్నారు. -
కీలక పరిణామం.. జెట్ ఎయిర్వేస్ సీఈవో పదవికి సంజీవ్ కపూర్ రాజీనామా!
దేశీయ ఏవియేషన్ రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది జెట్ ఎయిర్వేస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సంజీవ్ కపూర్ తన పదవికి రాజీనామా చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయన సీఈవోగా ఏప్రిల్ 30 వరకు కొనసాగనున్నారు. ఇక సంజీవ్ కపూర్ సీఈవో పదవికి ఎందుకు రాజీనామా చేశారన్న విషయంపై కారణాలు తెలియరావాల్సి ఉంది. రిజిగ్నేషన్పై అటు సంజవ్ కపూర్ గాని, ఇటు జలాన్- కర్లాక్ కన్సార్షియం గాని స్పందించలేదు. అప్పటి వరకు సంజీవ్ కపూర్ సీఈవోగా ఆర్థికంగా కుదేలైన జెట్ ఎయిర్వేస్ 2019లో నిలిచిపోయింది. దీంతో ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్లగా.. జలాన్- కర్లాక్ కన్సార్షియం బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకుంది. అయితే, తాజాగా జెట్ ఎయిర్వేస్ సేవల్ని పునఃప్రారంభించే విషయంలో కన్సార్షియానికి, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. ఈ తరుణంలో సంజీవ్ కపూర్ రాజీనామా చేయడం దేశీయ ఏవియేషన్ రంగంలో కీలక పరిమాలు చోటు చేసుకోవడం చర్చాంశనీయంగా మారింది. సంజీవ్ కపూర్ రాజీనామాతో విమానయాన రంగంలో సంజీవ్ కపూర్‌కు దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆసియా, ఐరోపా, అమెరికాలోని పలు కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. స్పైస్‌జెట్, గోఎయిర్, విస్తారాలో వివిధ హోదాల్లో సంజీవ్ కపూర్ పనిచేశారు. చదవండి👉 ‘నేను మీ పని మనిషిని కాను సార్’.. ఇండిగో ఎయిర్ హోస్టెస్‌కు జెట్ ఎయిర్వేస్ సీఈవో సపోర్ట్ -
వివాదంలో జెట్ ఎయిర్వేస్ సీఈవో.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో ఉన్న మెట్రో స్టేషన్ల సౌందర్యం,ఆర్కిటెక్చర్‌పై (aesthetics and architecture) ఆసంతృప్తి వ్యక్తం చేస్తూ వైట్‌ఫీల్డ్-కేఆర్ పురం మెట్రో మార్గం (పర్పుల్ లైన్) - దుబాయ్ మెట్రో స్టేషన్ ఫోటోల్ని ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లపై ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్ నడుస్తున్నది. సంజీవ్ కపూర్ భారత్ - దుబాయ్‌లోని మౌలిక సదుపాయాలను పోల్చారు. దుబాయ్ మౌలిక సదుపాయాలతో పోలిస్తే ఇండియన్ మెట్రోస్టేషన్లు ‘కళ లేని కాంక్రీటు కళ్లజోళ్లు’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. అంతే ఆ ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు జెట్ ఎయిర్వేస్ సీఈవోను ట్రోలింగ్ చేస్తున్నారు. ఓ ట్విటర్ యూజర్ బెంగుళూరు, గుర్గావ్, కోల్కతాలలోని ఓవర్‌గ్రౌండ్/ఓవర్ హెడ్ మెట్రో స్టేషన్లు కళావిహీనంగా ఉన్నాయా? అని ప్రశ్నిస్తూ సంబంధిత మెట్రోస్టేషన్ ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో పాటు దుబాయ్ మెట్రోస్టేషన్ కంటే భారత్‌లో మెట్రో స్టేషన్లు బాగున్నాయని నొక్కాణిస్తూ మరిన్ని ఫోటోల్ని షేర్ చేశారు. చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా అందంగా ఉన్న మెట్రోస్టేషన్లను, వాటి డిజైన్ ఫోటోల్ని ట్విటర్లో పంచుకుంటున్నారు. 'అది కూడా కరెక్టే కదా సార్' సంజీవ్ కపూర్ అభిప్రాయాన్ని ఏకీభవించిన మరికొందరు.‘‘అది కూడా కరెక్టే కదా సార్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యావరణ అనుకూలమైనది కాదు. ఖర్చుతో కూడుకున్నది. కేవలం మెట్రో స్టేషన్ మాత్రమే కాదు ఇతర పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. ఈ రోజుల్లో ప్రైవేట్ నిర్మాణాలు సైతం అందానికి తక్కువ ప్రాముఖ్యతనిచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ చేతులు మీదిగా కాగా, జెట్ ఎయిర్వేస్ సీఈవో ట్వీట్ చేసిన బెంగళూరులోని 13 కిలోమీటర్ల వైట్‌ఫీల్డ్-కెఆర్ పురం మెట్రో (పర్పుల్ లైన్) రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 25న ప్రారంభించనున్నారు. Delhi Metro for you! pic.twitter.com/HA8z0g6AZZ — Rahul Kapoor (@okwithrk) March 18, 2023 The same station from some distance has this look (not the right part of pic), but yes, most of the stations are box shaped. •Sri Sathya Sai Hospital Metro Station#Bangalore pic.twitter.com/SCWEUxtmk6 — Bangalore Metro Updates (@WF_Watcher) March 18, 2023 Bangalore metro has amazing artwork on the walls. They let artists paint the walls later on. Case in point, church street metro: pic.twitter.com/41ojhy7JQx — Srijan R Shetty (@srijanshetty) March 19, 2023 -
‘మీకో దణ్ణం! నాకు ఫోన్ చేయొద్దు’.. జెట్ ఎయిర్ వేస్ సీఈవో అసహనం!
9 ఏళ్ల నుంచి మీ నెట్ వర్క్ వినియోగిస్తున్నా. ఇక నుంచి వేరే నెట్ వర్క్‌కు మారుతున్నా. దయచేసి నాకు ఫోన్ చేయకండి అంటూ ప్రముఖ ఏవియేషన్ సంస్థ జెట్ ఎయిర్ వేస్ సీఈవో సంజీవ్ కపూర్ ఓ టెలికం కంపెనీ కస్టమర్ కేర్ నిర్వాహకంపై అసహననానికి గురయ్యారు. అందుకు ఓ కారణాన్ని ప్రస్తావిస్తూ ట్విటర్ వేదికగా చివాట్లు పెట్టారు. జెట్ ఎయిర్ వేస్ సీఈవో సంజీవ్ కపూర్ 9 ఏళ్ల నుంచి దేశీయ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ నెట్ వర్క్ పనితీరు మందగించడంతో యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తాజాగా సంజీవ్ కపూర్‌కు సైతం ఈ తరహా ఇబ్బంది తలెత్తింది. ఆదివారం నెట్ వర్క్ సరిగ్గా పనిచేయకపోవడం, అదే సమయంలో కస్టమర్ కేర్ నుంచి వరుస కాల్స్ రావడంతో ఇరిటేట్ అయ్యారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ట్విటర్ వేదికగా సదరు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఫోన్ చేయడం ఆపండి అంటూ ట్వీట్ చేశారు. ప్రియమైన @ViCustomerCare: నెట్ వర్క్ మారవద్దని నన్ను ఒప్పించేందుకు పదే పదే కాల్స్ చేస్తున్నారు. అలా కాల్ చేయడం మానేయండి. నేను 9 సంవత్సరాల తర్వాత నెట్ వర్క్ ఎందుకు మారుతున్నానో మీకు చెప్పాను. దేశంలోని కొన్ని ప్రాంతాలలో కవరేజీ తక్కువగా. కొందరికి రోమింగ్ కాల్స్ చేసుకోవడంలో ఇబ్బందికి గురవుతున్నారు. అంతే. ధన్యవాదాలు’అని ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు వీఐ కస్టమర్ కేర్ విభాగం స్పందించింది. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తాం అని రిప్లయి ఇచ్చింది. ఆ ట్వీట్‌కు సంజీవ్ రిప్లయి ఇచ్చారు. @ViCustomerCare దయచేసి నన్ను సంప్రదించేందుకు ప్రయత్నించకండి. నిన్నటి నుండి నాకు డజను కాల్స్ వచ్చాయి. ఫోన్ చేయడం ఆపండి, అంతే! అని అన్నారు. అయినా సరే వీఐ కస్టమర్ కేర్ విభాగం సంజీవ్ కపూర్‌కు మరోసారి ఫోన్ చేసి విసిగించింది. దీంతో ఏం చేయాలో పోక...మా నెట్ వర్క్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ ఫోన్ వచ్చింది. ఇది మంచి పద్దతి కాదు. ఫోన్ చేయడం ఎప్పుడు ఆపేస్తారో.. వీఐ యాజమాన్యం ఉన్నతాధికులు ట్విటర్లో ఉన్నారా? అంటూ ప్రశ్నిస్తూ మరోసారి ట్వీట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. Dear @ViCustomerCare : please stop calling me repeatedly trying to convince me not to switch carriers. I have told you why I am switching after 9 years: 1. Poor coverage in some parts of India, and 2. Inferior international roaming plans for some countries. That's all. Thanks. — Sanjiv Kapoor (@TheSanjivKapoor) February 12, 2023 Hi Sanjiv! I can understand this has caused difficulties for you. I’ve made a note of your concern. Will get in touch with you shortly - Vandana https://t.co/fuKV0H8zIF — Vi Customer Care (@ViCustomerCare) February 12, 2023 -
మాజీ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ కొత్త యజమాని– జలాన్–ఫ్రిట్ష్ కన్సార్టియంకు (మురారి లాల్ జలాన్– ఫ్లోరియన్ ఫ్రిచ్) అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్‌లైన్ మాజీ ఉద్యోగుల భవిష్య నిధి, గ్రాట్యుటీ బకాయిలను చెల్లించాలని ఆదేశిస్తూ, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన ఇచ్చిన రూలింగ్‌కు వ్యతిరేకంగా కన్సార్టియం దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణకు స్వీకరించలేదు. ‘‘ఎవరైనా ఏదైనా డీల్‌లో అడుగుపెడుతున్నప్పుడు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల గురించి తెలుసుకుంటారు. చెల్లించని కార్మికుల బకాయిలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఈ విషయంలో అంతిమ నిర్ణయం ఉండాలి. క్షమించండి, మేము ట్రిబ్యునల్ తీర్పులో జోక్యం చేసుకోవడం లేదు’’ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కన్సార్టియం వాదన ఇది... కన్సార్టియం తరఫున సీనియర్ అడ్వకేట్ సౌరభ్ కిర్పాల్ తన వాదనలు వినిపిస్తూ, కన్సార్టియంకు అందించిన సమాచార పత్రంలో (ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్) కార్పొరేట్ రుణగ్రహీత (జెట్ ఎయిర్వేస్) భవిష్య నిధి, గ్రాట్యుటీ బకాయిలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలను పూర్తిగా వెల్లడించలేదని పేర్కొన్నారు. బకాయిల కింద ఇప్పుడు రూ. 200 కోట్లకు పైగా అదనపు మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని, దీనివల్ల విమానయాన సంస్థను పునరుద్ధరించడం కష్టమని అన్నారు. ఒకసారి ఆమోదించిన తర్వాత రిజల్యూషన్ ప్లాన్‌ను సవరించడం లేదా వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని కూడా పేర్కొన్నారు. ఈ తరహా ఉద్యోగులకు ఆశాకిరణం సుప్రీం రూలింగ్‌తో జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. కన్సార్టియం అప్పీల్‌కు వెళుతుందన్న అభిప్రాయంతో జెట్ ఎయిర్వేస్ అగ్రివ్డ్ (బాధిత) వర్క్‌మెన్ అసోసియేషన్ (ఏఏడబ్ల్యూజేఏ) సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వకేట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ భట్నాగర్, న్యాయవాది స్వర్ణేందు ఛటర్జీ తమ వాదనలు వినిపించారు. ‘‘ఈ ఉత్తర్వు ఈ వివాదంలో మార్గనిర్దేశం చేయడమే కాదు, ఈ రకమైన వ్యాజ్యాలలో చిక్కుకున్న ఈ తరహా కార్మికులు, ఉద్యోగులందరికీ ఇది ఒక ఆశాకిరణం’’ అని అడ్వకేట్ ఛటర్జీ విలేకరులతో అన్నారు. రికార్డ్ తేదీ... 2019 జూన్ 20 ఆర్థిక సంక్షోభం కారణంగా 2019 ప్రారంభంలో కార్యకలాపాలను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ కోసం బిడ్‌ను దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా జలాన్–ఫ్రిట్ష్ కన్సార్టియం గెలుచుకుంది. విమానయాన సంస్థ ఇప్పుడు తన సేవలను పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం, రాజీనామా చేసిన లేదా పదవీ విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులందరికీ పూర్తి గ్రాట్యుటీ మరియు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాలి. ఈ లెక్కలకు 2019 జూన్ 20 వరకు తేదీని (దివాలాకు సంబంధించి అడ్మిషన్ తేదీ వరకు) పరిగణనలోకి తీసుకోవాలి. సుప్రీం రూలింగ్‌తో ప్రయోజనం పొందుతున్న వారిలో జెట్ ఎయిర్వేస్ కార్మికులు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. -
జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం బదిలీకి ఎన్సీఎల్టీ ఆమోదం
ముంబై: దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ యాజమాన్య హక్కులను జలాన్ కల్రాక్ కన్సార్షియానికి బదిలీ చేసే ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. అలాగే రుణదాతలు, ఉద్యోగులు మొదలైన వారికి బాకీలు చెల్లించడానికి మరికొంత సమయం ఇచ్చింది. దీంతో బాకీల చెల్లింపునకు కన్సార్షియానికి మే నెల వరకూ వ్యవధి లభించింది. గతంలో ఈ గడువు 2022 నవంబర్ 16గా ఉండేది. కన్సార్షియం, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో తాజా ఉత్తర్వులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దివాలా పరిష్కార ప్రక్రియ కింద జెట్ ఎయిర్వేస్ను జలాన్ కల్రాక్ కన్సార్షియం దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2021 జూన్‌లో ఆమోదించిన ప్రణాళిక ప్రకారం బ్యాంకులు రూ. 7,807 కోట్ల మేర బాకీలను వదులుకునేందుకు (హెయిర్‌కట్) అంగీకరించాయి. రుణదాతలకు చెల్లింపులతో పాటు వ్యాపారానికి కన్సార్షియం రూ. 1,375 కోట్ల మొత్తాన్ని సమకూర్చాల్సి ఉంది. ఈ క్రమంలో ఎయిర్‌లైన్ యాజమాన్య హక్ులను తమకు బదిలీ చేయాలని, బాకీల చెల్లింపునకు మ రింత సమయం ఇవ్వాలని ఎన్సీఎల్టీని కన్సార్షి యం ఆశ్రయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై రెండు వారాల పాటు స్టే విధించాలని ప్రతివాదులు కోరినప్పటికీ ఎన్సీఎల్టీ తిరస్కరించింది. -
‘నేను మీ పని మనిషిని కాను సార్’.. ఎయిర్ హోస్టెస్ తీరుపై ప్రశంసలు
ప్రముఖ ఏవీయేషన్ సంస్థ ఇండిగో సిబ్బంది, విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. ఈ వివాదంలో మరో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎయిర్ హోస్టెస్‌కు సపోర్ట్ చేశారు. నెటిజన్లు సైతం ఎయిర్ హోస్టెస్ తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండిగో సంస్థ ఇస్తాంబుల్- ఢిల్లీ విమానాల కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. డిసెంబర్ 16న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడు తానుకోరుకున్న ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో లేవని వాగ్వాదానికి దిగాడు. ఫ్లైట్‌లో ఉన్న ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఈ ఆర్.గూర్ప్రీత్ సింగ్ మెన్స్ వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది తెగ చక్కెర్లు కొడుతోంది. వాళ్లూ మనుషులే As I had said earlier, crew are human too. It must have taken a lot to get her to breaking point. Over the years I have seen crew slapped and abused on board flights, called "servant" and worse. Hope she is fine despite the pressure she must be under. https://t.co/cSPI0jQBZl — Sanjiv Kapoor (@TheSanjivKapoor) December 21, 2022 ఈ తరుణంలో ఫ్లైట్‌లో ప్రయాణికులు-ఎయిర్ హోస్టెస్ మధ్య జరిగిన ఘర్షణపై జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందించారు. ఇండిగో ఎయిర్ హోస్టెస్‌కు మద్దతు పలికారు. సిబ్బంది కూడా మనుషులేనని వ్యాఖ్యానించారు. ‘నేను ముందే చెప్పినట్లు,సిబ్బంది కూడా మనుషులే.నేను గత కొన్నేళ్లుగా విమానంలో సిబ్బందిని..చెంపదెబ్బలు కొట్టడం దూర్భాషలాడడం చూశాను. ప్రయాణికుడితో జరిగిన వాగ్వాదంలో ఆమె తీవ్రంగా త్తిడికి గురైంది. ఇప్పుడు ఆమె బాగుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఎయిర్ హోస్టెస్‌కు అండగా నెటిజన్లు సీఈవో వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందించారు.హెచ్ఆర్, యాజమాన్యం మహిళా సిబ్బందికి అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. వారు ఈ స్థాయిలో చేరేందుకు ఎంతో కష్టపడిందో అర్ధం చేసుకోవాలంటూ అండగా నిలుస్తున్నారు. ఈ ఘటనలో మహిళా సిబ్బంది తప్పు లేదని, ఎంతో ఓర్పుతో సమాధానం ఇచ్చిందని ప్రశంసిస్తున్నారు. ఫ్లైట్‌లో ఏం జరిగింది ఇండిగోకు విమానం ‘6ఈ 12’ ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ వైపు వస్తుంది. ప్రయాణ సమయంలో ఎయిర్ హోస్టెస్‌కు, ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికుడు దురుసగా ప్రవర్తించడంతో ఓ ఎయిర్ హోస్ట్ కన్నీటి పర్యంతమైంది. దీంతో మరో ఎయిర్ హోస్టెస్ వారికి సర్ది చెప్పి గొడవను సద్దుమణిగించేందుకు వెళ్లింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రయాణికుడు మరింత రెచ్చిపోయాడు. గొడవను సద్దుమణించేందుకు ప్రయత్నించిన సదరు మహిళా ఉద్యోగిని వైపు చేత్తో సంజ్ఞలు చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఆమె ప్రయాణికుడికి గట్టిగా సమాధానం ఇచ్చింది. Tempers soaring even mid-air: "I am not your servant" An @IndiGo6E crew and a passenger on an Istanbul flight to Delhi (a route which is being expanded soon with bigger planes in alliance with @TurkishAirlines ) on 16th December : pic.twitter.com/ZgaYcJ7vGv — Tarun Shukla (@shukla_tarun) December 21, 2022 "నువ్వు నా వైపు వేలు చూపుతూ ఎందుకు అరుస్తున్నావు. నీ వల్ల నా సిబ్బంది ఏడుస్తున్నారు. దయచేసి పరిస్థితని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరిపడ భోజనాలు (విమానంలో) ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆహారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం’ అని మాట్లాడుతుండగా ప్రయాణికుడు అడ్డు తగిలాడు "ఎందుకు అరుస్తున్నావు?" అని ప్రయాణికుడు గట్టిగా అరిచాడు. ఎయిర్ హోస్ట్ తన స్వరం పెంచుతూ...ఎందుకంటే మీరు మా మీద అరుస్తున్నారు. నీ మీ పని మనిషిని కాదు సార్. ఎయిర్ హెస్ట్ని. ఇండిగో సంస్థ ఉద్యోగిని అంటూ అక్కడి నుంచి వెళ్లి పోయింది. శాండ్ విచ్ లేదని.. ఫ్లైట్ వివాదంపై ఇండిగో యాజమాన్యం స్పందించింది. ప్రయాణీకుడు శాండ్విచ్ అడిగారని, విమానంలో ఫుడ్ ఐటమ్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేస్తామని సిబ్బంది చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌పై అరవడం ప్రారంభించాడు. దీంతో భయాందోళనకు గురైన ఎయిర్ హోస్ట్ ఏడ్చినట్లు తెలిపింది. -
Jet Airways: జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు భారీ షాక్
ఉద్యోగులకు జెట్ ఎయిర్వేస్ భారీ షాక్ ఇచ్చింది. సంస్థ భవిష్యత్ కోసం పొదుపు మంత్రం జపిస్తోంది. ఇందులో భాగంగా ఎలాంటి వేతనాలు చెల్లించకుండా 60 శాతం ఉద్యోగులను సెలవులపై ఇంటికి పంపించాలని నిర్ణయించింది. మిగిలిన ఉద్యోగులకు 50 శాతం వరకు జీతంలో కోత పెట్టనుంది. 2019లో ఆర్థికంగా కుదేలైన జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాల్ని నిలిపివేసింది. అయితే ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో జెట్ ఎయిర్వేస్ను బిడ్డింగ్ జలాన్కర్లాక్ సంస్థ దక్కించింది. నూతన యాజమాన్యం ఈ ఏడాది నుంచి తిరిగి సర్వీసుల్ని ప్రారంభించాలని భావించింది. కానీ ఇప్పుటికే ఉద్యోగులకు చెల్లించాల్సిన జీత భత్యాలపై ఉద్యోగులు, సిబ్బంది సంఘం నేషనల్ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ను ఆశ్రయించారు. దీంతో కథ మొదటికొచ్చింది. సర్వీసుల పునప్రారంభం కంటే ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ బకాయిలను చెల్లించాలని నూతన యాజమాన్యాన్ని ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో జలాన్ కర్లాక్ కన్సార్షియం ఎయిర్‌లైన్స్ పూర్తి స్థాయిలో తాము ఆధీనంలోకి రాలేదని, ఇందుకోసం తగిన సమయం పడుతోందంటూ ఎన్సీల్ఏటీకి వివరణిచ్చింది. కాగా, సిబ్బందిని సెలవులపై ఇంటికి పంపేందుకు నిర్ణయం తీసుకుంది. నిధుల్ని ఆదా చేసేందుకు ఈ తరహా చర్యలకు దిగింది. -
నష్టాల్లోనే జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విమానయాన కంపెనీ జెట్ ఎయిర్వేస్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 308 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 306 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. స్టాండెలోన్ ఫలితాలివి. మొత్తం ఆదాయం రూ. 45 కోట్ల నుంచి 13.5 కోట్లకు పడిపోయింది. మొత్తం వ్యయాలు రూ. 322 కోట్లకు చేరాయి. మూడున్నరేళ్లుగా కార్యకలాపాలు నిలిచిపోయిన కంపెనీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో జలాన్ కల్రాక్ కన్సార్షియం బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్వేస్ను గెలుపొందింది. అయితే కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకావలసి ఉంది. -
దేశీ ఎయిర్‌లైన్స్ రికవరీకి ఏటీఎఫ్ సెగ
ముంబై: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు ఆకాశాన్నంటుతుండటం, రూపాయి పతనమవడం వంటి అంశాలు దేశీ విమానయాన సంస్థల రికవరీ ప్రక్రియకు పెను సవాలుగా పరిణమించే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో వెల్లడించింది. ఇక జెట్ ఎయిర్వేస్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుండటం, ఆకాశ ఎయిర్ సర్వీసులు మొదలుపెట్టడం వంటివి ఎయిర్‌లైన్స్ మధ్య పోటీని మరింత తీవ్రం చేయవచ్చని పేర్కొంది. సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటా 45 శాతం దాకా ఉంటుంది. నిర్వహణ వ్యయాల్లో 35–40 శాతం భాగం అమెరికా డాలర్ మారకంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్ రేట్లు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం వంటివి ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం చూపనున్నాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలతో ఏటీఎఫ్ రేట్లు ఆగస్టులో ఏకంగా 77 శాతం ఎగిశాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఏటీఎఫ్ రేట్లు అధికంగా ఉండటంతో పాటు రూపాయి క్షీణత వల్ల పరిశ్రమ ఆదాయాలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. సీజనల్‌గా ఉండే ప్రయాణాల ధోరణుల కారణంగా జూన్‌తో పోలిస్తే జులైలో ప్రయాణికుల సంఖ్య 7 శాతం తగ్గినట్లు ఇక్రా పేర్కొంది. టికెట్ చార్జీలు పెరుగుతుండటం కూడా విహార యాత్రల ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది. ఆగస్టు 31 నుంచి చార్జీలపై పరిమితులు ఎత్తివేస్తున్నందున .. విమానయాన సంస్థలు వ్యయాల భారాన్ని రేట్ల పెంపు రూపంలో ప్రయాణికులకు బదలాయించే అవకాశాలు ఉన్నాయని ఇక్రా పేర్కొంది. అయితే, పరిశ్రమలో తీవ్ర పోటీ నెలకొన్నందున ఎకాయెకిన చార్జీల పెంపు భారీగా ఉండకపోవచ్చని వివరించింది. -
ఏవియేషన్‌కు కొలువుల కళ!
న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు గణనీయంగా తగ్గిపోవడం, ప్రయాణాలపై అన్ని ఆంక్షలు తొలగిపోవడం ఏవియేషన్ పరిశ్రమకు కలసి వస్తోంది. దీంతో గత రెండేళ్ల నుంచి విహార యాత్రలకు దూరమైన వారు.. ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుని విమానం ఎక్కేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎయిర్‌లైన్స్ సంస్థలకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. మరోవైపు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా నుంచి ఆకాశ ఎయిర్‌లైన్స్ కొత్తగా సేవలు ఆరంభిస్తుండడం, మరోవైపు చాలా కాలంగా నిలిచిన జెట్ ఎయిర్వేస్ సేవల పునరుద్ధరణతో ఈ రంగంలో ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వచ్చే రెండు త్రైమాసికాల్లో ఎయిర్‌లైన్స్ సంస్థలు సుమారు 30 శాతం మేర అదనంగా ఉద్యోగులను నియమించుకోవచ్చని పరిశ్రమ నిపుణుల అంచనా. ఆటోమేషన్ చుట్టూ చర్చ నడుస్తున్నప్పటికీ.. ఏవియేషన్ పరిశ్రమ ఎక్కువగా మానవవనరులపైనే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని టీమ్‌లీజ్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ (రిటైల్, ఈ కామర్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్టేషన్) జోయ్ థామస్ తెలిపారు. ఏవియేషన్ పరిశ్రమలో నెలకొన్న ధోరణులను పరిశీలిస్తే వచ్చే రెండు క్వార్టర్లలో నియామకాలు 30 శాతం పెరగొచ్చని చెప్పారు. మాన్స్టర్ డాట్ కామ్ డేటాను పరిశీలిస్తే.. 2022 ఏప్రిల్ నెలలో ఏవియేషన్ రంగంలో నియామకాలు రెండంకెల స్థాయిలో పెరిగాయని తెలుస్తోంది. మారిన పరిస్థితులు.. కరోనా కారణంగా ప్రయాణాలపై విధించిన ఆంక్షల వల్ల ఏవియేషన్ రంగం గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులను చూసిన మాట వాస్తవం. ఏవియేషన్, దీని అనుబంధ రంగాలు ప్రపంచవ్యాప్తంగా 2020 నుంచి భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫ్రయిట్ ఫార్వార్డర్స్, కార్గో ఎయిర్‌లైన్స్ ఒక్కటే ఇందుకు భిన్నం. దీంతో ఏవియేషన్ రంగంలో భారీగా ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. వేతనాల్లో కోత పడింది. ఎయిర్‌లైన్స్ సంస్థలు 2020 ఏప్రిల్, మే నెలల్లో అసలు సర్వీసులే నడపలేని పరిస్థితి. ఆ తర్వాత నుంచి రెండేళ్లపాటు దేశీయ సర్వీసులకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో నష్టాలను తట్టుకోలేక ఉద్యోగుల వేతనాలకు కోతలు పెట్టిన పరిస్థితులు చూశాం. కరోనా రెండేళ్ల కాలంలో ఈ పరిశ్రమలో సుమారు 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని పార్లమెంటరీ డేటానే చెబుతోంది. రూ.25,000 కోట్లకు పైగా పరిశ్రమ నష్టాలను ఎదుర్కొన్నది. ఇండిగో అయితే తన మొత్తం సిబ్బందిలో 10 మందిని తగ్గించింది. విస్తారా సైతం తన సిబ్బంది వేతనాలకు కోత పెట్టింది. స్పైస్‌జెట్, గోఫస్ట్ వేరియబుల్ పేను ఆఫర్ చేశాయి. కొత్త సంస్థలు.. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఆకాశ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు మొదలవన్నాయి. ఎయిర్ ఇండియా యాజమాన్యం మారిపోవడం, టాటా గ్రూపులో ఎయిర్‌లైన్స్ సంస్థల స్థిరీకరణ, కరోనా కేసులు తగ్గిపోవడం, విదేశీ సర్వీసులకు ద్వారాలు తెరవడం డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కమర్షియల్ పైలట్ల నియామకాలు వచ్చే కొన్నేళ్లపాటు వృద్ధి దశలోనే ఉంటాయని క్వెస్‌కార్ప్ వైస్ ప్రెసిడెంట్ కపిల్ జోషి చెప్పారు. కొత్త సంస్థల రాక, ఉన్న సంస్థలు అదనపు సర్వీసులను ప్రారంభించడం వల్ల నిర్వహణ సిబ్బందికి డిమాండ్ పెంచుతుందని జోషి వివరించారు. -
జెట్ ఎయిర్వేస్ రిజల్యూషన్ ప్లాన్ : ఉద్యోగుల షాక్!
ముంబై: ఎయిర్‌లైన్స్ కోసం జలాన్-కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళికను సవాలుచేస్తూ, ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్)లో అప్పీల్ దాఖలు చేసినట్లు ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ గురువారం తెలిపింది. బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్‌ల కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను 2020 అక్టోబర్‌లో జెట్ ఎయిర్వేస్ రుణ దాతల కమిటీ (సీఓసీ) ఆమోదించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ పరిష్కార ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు గత వారం జెట్ ఎయిర్వేస్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తిరిగి ధృవీకరించింది. దీనితో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏప్రిల్ 2019లో ఆగిపోయిన ఎయిర్‌లైన్ పునఃప్రారంభానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియను సవాలు చేస్తూ, ఆ సంస్థ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ తాజాగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. బీకేస్, జెట్ ఎయిర్వేస్ క్యాబిన్ క్రూ అసోసియేషన్, వివిధ సంఘాలు కూడా గత నెలలో ఎన్సీఎల్ఏటీ ముందు అప్పీల్ దాఖలు చేశాయి. రాబోయే నెలల్లో సేవలను పునఃప్రారంభిస్తుందని భావిస్తున్న జెట్ ఎయిర్వేస్ను ప్రస్తుతం మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తోంది. అప్పీల్ ఎందుకంటే... జెట్ ఎయిర్వేస్ ఆస్తులు, ఫ్లైట్ స్లాట్లు, మరీ ముఖ్యంగా ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగులతో సహా కీలక విభాగాల వినియోగం ఎలా అన్నది రిజల్యూషన్ ప్రణాళికలో ఊహాజనితంగా ఉందని ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ పావస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగానే తాము దీనిని సవాలు చేస్తున్నట్లు తెలిపారు. అసోసియేషన్ గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఏప్రిల్ 2018 నుండి జూన్ 2019 వరకు బోనస్, కార్మికులు-ఉద్యోగులందరికీ రిట్రెంచ్‌మెంట్ పరిహారం పూర్తి చెల్లింపులపై తగిన పరిష్కారం చూపాలని ఎన్సీఎల్ఏటీ ముందు దాఖలు చేసిన అప్పీల్లో విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. రిజల్యూషన్ దరఖాస్తుదారు లేదా మానిటరింగ్ కమిటీ ద్వారా తిరిగి నియమించబడిన ఏ ఉద్యోగికైనా అప్పటికే రావాల్సిన వారి గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, బోనస్ రిట్రెంచ్‌మెంట్ పరిహారం చెల్లించాలని కూడా అసోసియేషన్ డిమాండ్ చేస్తోందన్నారు. మినహాయింపులను ఎంతమాత్రం అంగీకరించడం జరగదని కిరణ్ పావస్కర్ స్పష్టం చేశారు. రిజల్యూషన్ ప్రణాళిక అస్పష్టమైన వ్యాపార ప్రణాళికతో ముడివడి ఉందని జెట్ ఎయిర్వేస్ మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఉద్యోగుల న్యాయ సలహాదారు నారాయణ్ హరిహరన్ అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన అన్ని చట్టబద్ధమైన హక్కులను, ముఖ్యంగా గ్రాట్యుటీ, ప్రివిలేజ్లీవ్, చెల్లించని జీతం, బోనస్‌లను మాఫీ చేయలని చూస్తున్నట్లు విమర్శించారు. జెట్ ఎయిర్వేస్ ఇంతక్రితం నరేష్ గోయల్, గల్ఫ్ క్యారియర్ ఎతిహాద్ యాజమాన్యంలో ఉండేది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం 2019 జూన్‌లో రూ. 8,000 కోట్లకు పైగా బకాయిల కోసం దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. -
జెట్ ఎయిర్వేస్లో కొత్తగా నియామకాలు
న్యూఢిల్లీ: విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఇటీవలే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ పొందిన జెట్ ఎయిర్వేస్ తాజాగా నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నట్లు వెల్లడించింది. చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా ప్రభ్ శరణ్ సింగ్, ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా హెచ్ఆర్ జగన్నాథ్, ఇన్‌ఫ్లయిట్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా మార్క్ టర్నర్, సేల్స్ తదిర విభాగాల వైస్ ప్రెసిడెంట్‌గా విశేష్ ఖన్నా నియమితులైనట్లు తెలిపింది. వచ్చే నెలలో కొందరు బాధ్యతలు చేపట్టనున్నట్లు వివరించింది. సింగ్ ప్రస్తుతం డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో సీఈవోగా చేసిన జగన్నాథ్‌కు ఏవియేషన్ రంగంలో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. టర్నర్ గతంలో కూడా జెట్ ఎయిర్వేస్లో సేవలు అందించారు. గల్ఫ్ ఎయిర్, ఎమిరేట్స్ మొదలైన వాటిలో సీనియర్ మేనేజ్మెంట్ హోదాలో పని చేశారు. ఖన్నా ప్రస్తుతం వీఎఫ్ఎస్ గ్లోబల్‌లో బిజినెస్ హెడ్ (ఈ–వీసా విభాగం)గా ఉన్నారు. ఆర్థిక సంక్షోభంతో 2019 ఏప్రిల్ 17న మూతబడిన జెట్ ఎయిర్వేస్ను జలాన్–కల్రాక్ కన్సార్షియం దక్కించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. -
రెక్కలు తొడిగి, మళ్లీ నింగిలోకి జెట్ ఎయిర్ వేస్..!
అప్పులతో కుదేలైన ప్రముఖ ఏవియేషన్ సంస్థ జెట్ ఎయిర్ వేస్ తిరిగి తన కార్యకలాపాల్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జెట్ ఎయిర్ వేస్‌కు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్(ఏఓసీ)ని అందించింది మే5,1993న నరేష్ గోయల్ జెట్ ఎయిర్ వేస్ పేరుతో తొలి కమర్షియల్ ఫ్లైట్‌ను ప్రారంభించారు. 100 పైగా విమానాలతో జెట్ ఎయిర్ వేస్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. కానీ మార్కెట్లో కాంపిటీషన్, ఫ్లైట్ నిర్వహణతో పాటు పెరిగిపోతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఆ సంస్థ ఏప్రిల్ 18,2019 నాటికి ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో జాతీయ అంతర్జాతీయ విమానయాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా,ఈ సంస్థను యూఏఈకి చెందిన వ్యాపార వేత్త మురారి జలాన్, యూకేకి చెందిన కల్రాక్ క్యాపిటల్ సంస్థలు ఒప్పొంద ప్రాతిపదికన జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేయడం,పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా ఆ రెండు సంస్థల కన్సార్టియం జెట్ ఎయిర్ వేస్‌కు 180మిలియన్ల నిధుల్ని అందించనున్నాయి. అందులో 60 మిలియన్లను అత్యవసర రుణాల్ని జెట్ ఎయిర్ వేస్ తీర్చనుంది. డీసీజీఏ వివరాల ప్రకారం డీసీజీఏ వివరాల ప్రకారం.. జెట్ ఎయిర్ వేస్ ఇప్పటికే తన కార్యకాలపాల్ని ప్రారంభించింది. మే15నుంచి మే17 మధ్య కాలంలో 5 విమానాల రాకపోకల్ని నిర్వహించింది. మిగిలిన కమర్షియల్ ఫ్లైట్లు జులై- సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రారంభం కానున్నాయని డీసీజీఏ తెలిపింది. చదవండి👉ఇండిగోకి కొత్త సీఈవో..ఆయన ఎవరంటే! -
రెక్కలు తొడిగిన జెట్ ఎయిర్వేస్
ఆర్థిక ఇబ్బందుల కారణంగా కార్యకలాపాలు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ మళ్లీ రెక్కలు తొడిగింది. కమర్షియల్ విమాన సర్వీసులు నడిపేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు సాధించింది. దీంతో దాదాపు మూడేళ్ల తర్వాత తర్వాత జెట్ ఎయిర్ వేస్ విమానం గాల్లోకి ఎగిరింది. డీజీసీఏ నుంచి అనుమతి రావడంతో టెస్ట్ ఫ్లైట్‌ను ముందుగా నడిపించింది జెట్ ఎయిర్వేస్. 2022 మే5న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మొదటి విమానం బయల్ధేరింది. మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభించడం పట్ల చాలా ఆనందంగా ఉందని ఆ కంపెనీ సీఈవో సంజీవ్ కపూర్ తెలిపారు. త్వరలోనే కమర్షియల్ సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. జెట్ ఎయిర్వేస్ చివరి కమర్షియల్ సర్వీస్ 2019 ఏప్రిల్ 17న నడిచింది. చదవండి : సక్సెస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదంటున్న అపర కుబేరుడు వారెన్ బఫెట్ -
బాబోయ్ ఫ్యూయల్ రేట్లు మండిపోతున్నాయ్! విమానాల్లో మగవాళ్లు వద్దు?
కరోనా దెబ్బతో అతలాకుతలమైన ఏవియేషన్ సెక్టార్‌పై రష్యా - ఉక్రెయిన్ వార్ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయ్యింది. అంతర్జాతీయ ఉద్రిక్తలతో గత మూడు నెలలుగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఏవియేషన్ ఫ్యూయల్ రేట్లు పెరిగాయి. చివరి సారిగా ఏకంగా 18 శాతం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో విమానాలు నడిపించడం కత్తిమీద సాములా మారింది. పెరిగిన ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు సర్వీసు ప్రొవైడర్లకు ఇబ్బందికరంగా మారాయి. విమాన సర్వీసుల నిర్వాహాణలో 40 శాతం వ్యయం కేవలం ఫ్యూయల్‌కే వెళ్తుంది. దీంతో పెరుగుతున్న ధరలు ఫ్లైట్ సర్వీస్ ప్రొవైడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంధన పొదుపుకు సంబంధించి ఏం చేయాలనేది వారికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్‌కి ఆసక్తికరమైన సూచన చేశాడు విశాల్ శ్రీవాత్సవ అనే నెటిజన్. విమానం నడిపే క్యాబిన్ క్రూలో మీరు ఎందుకు ఎక్కువ మంది మగవాళ్లనే నియమిస్తున్నారు? పురుషులతో పోల్చితే మహిళలు తక్కువ బరువు ఉంటారు. దీంతో తక్కువ ఇంధనం ఖర్చవుతుంది. మీరు లేడీ కేబిన్ క్రూను తీసుకోవడం ద్వారా ప్రతీ ఫ్లైట్‌కి కనీసం వెయ్యి రూపాయలు ఆదా అవుతాయి అనుకున్నా.. రోజుకు వంద ఫ్లైట్లు నడిపిస్తారనుకున్నా.. ఏడాదికి కనీసం రూ. 3.5 కోట్ల వ్యయం తగ్గుతుంది కదా ? అంటూ ప్రశ్నించాడు. విశాల్ శ్రీవాత్సవ సంధించిన ప్రశ్నలకు జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందిస్తూ.. మంచి ఐడియా ఇచ్చారు విశాల్. కేవలం కేబిన్ క్రూ విషయంలోనే ఈ నియమం ఎందుకు అమలు చేయాలి ? ప్రయాణికుల్లో కూడా మొత్తం మహిళలే ఉండేలా చూసుకోవడం లేదా కనీసం మగ ప్యాసింజర్లను తగ్గించినా కూడా ఫ్యూయల్ బాగానే ఆదా అవుతుంది కదా అంటూ బదులిచ్చారు. Extending that logic, imagine the savings if one were to carry only female passengers! Or charge male passengers more! 😉 https://t.co/3GP2YETBnV — Sanjiv Kapoor (@TheSanjivKapoor) March 22, 2022 మీరు చెప్పిన లాజిక్ బాగానే ఉన్నా అది దీర్ఘకాలంలో లింగ వివక్షకు దారి తీస్తుంది. అంతే కాదు చట్టపరమైన చిక్కులు కూడా వస్తాయి. ఫ్యూయల్ కాస్ట్ తగ్గించుకునేందుకు మహిళా క్రూ అనేది అంత సబబైన విధానం కాదంటూ వివరణ ఇచ్చారు సంజీవ్ కపూర్. మొత్తంగా పెరుగుతున్న ఫ్యూయల్ ఛార్జీలతో ఏవియేషన్ సెక్టార్ ఎంతగా ఇబ్బంది పడుతుంతో తెలిపేందుకు విశాల్, సంజీవ్ కపూర్ల మధ్య జరిగిన సంభాషణ ఉదాహారణగా నిలుస్తోందంటున్నారు నెటిజన్లు. చదవండి: నష్టాల ఊబిలో ఏవియేషన్ -
జెట్ ఎయిర్వేస్ 2.0లో కీలక పరిణామం
ముంబై: కొత్త ఏడాదిలో జెట్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థకు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుధీర్ గౌర్ షాక్ ఇచ్చారు. తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదివికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజీనామా చేయడానికి గల కారణాలను మాత్రం గౌర్ వెల్లడించలేదు. అయితే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ వల్లే.. గౌర్ నిష్క్రమణ జరిగిందా? అనే కోణంలో ప్రత్యేక చర్చ మొదలైంది ఇప్పుడు. నరేష్ గోయల్ స్థాపించిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభం కారణంగా రెండు సంవత్సరాల పాటు సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. తిరిగి 2022లో జెట్ ఎయిర్వేస్ 2.0 పేరుతో సర్వీసుల్ని పున:ప్రారంభించాల్సి ఉంది. ఈ విషయాన్ని జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం అధికారికంగా వెల్లడించింది కూడా. మరోవైపు 2022 మొదటి త్రైమాసికంలో(వేసవిలోపే) విమానయాన సంస్థను పునఃప్రారంభించడానికి గత ఏడాది ఎన్‌సిఎల్‌టి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇన్వెస్ట్మెంట్ గురు, బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ను కూడా తొలి త్రైమాసికంలోనే తెచ్చే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు. ఇదివరకే 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తేలిసిందే. ఈ మధ్యే లోగోను లాంఛ్ చేయగా.. బోయిగ్ సంస్థతో విమానాల కోసం ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జెట్ ఎయిర్వేస్ నుంచి తాతాల్కిక సీఈవో వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. సుధీర్ గౌర్ ఆకాశ ఎయిర్‌లో చేరతారా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఇక నిధుల కొరత, మితిమీరిన రుణం భారంతో 2019లో జెట్ ఎయిర్వేస్ తన విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ 2021 జూన్‌లో ఆమోదం తెలిపింది. 2022 నుంచి తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని జలాన్ కల్రాక్ కన్సార్షియం భావించింది. (చదవండి: అమెరికాలో అమెరికన్ కంపెనీకి దిమ్మదిరిగే షాక్..!) -
జెట్ ఎయిర్వేస్: టేకాఫ్‌కు సిద్ధం!
-
జెట్ ఎయిర్వేస్: టేకాఫ్‌కు సిద్ధం!
సాక్షి,ముంబై: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మంచిరోజులు రానున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగిరేందుకు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచే దేశీయ విమాన సర్వీసులను పున:ప్రారంభించనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని జలాన్ కల్రాక్ కన్సార్షియం వెల్లడించింది. నిధుల కొరత, మితిమీరిన రుణం భారంతో 2019లో జెట్ ఎయిర్వేస్ తన విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఈ ఏడాది జూన్‌లో ఆమోదం తెలిపింది. తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని మురళీ జలాన్ ఇటీవల వెల్లడించారు. ఈ చరిత్రాత్మక ప్రయాణంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే జెట్ ఎయిర్వేస్ విమానాలు టేకాఫ్‌కు సిద్ధమవుతున్నాయి. చదవండి : Ramya krishna: రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్‌డే -
అమ్మకానికి ఎయిరిండియా.. దక్కించుకునేది ఎవరు ?
పెట్టుబడుల ఉపసంహార కార్యక్రమాన్ని వేగవంతం చేసింది ఎన్డీఏ సర్కారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా అమ్మకానికి మరోసారి రంగం సిద్ధం చేసింది. నేటితో ఆఖరు ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా నిర్వాహణపరమైన లోపాలతో నష్టాల పాలైంది. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా నష్టాలు రూ. 43,000 కోట్లుగా తేలాయి. దీంతో ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఆసక్తి ఉన్న కంపెనీలు బిడ్ దాఖలు చేసేందుకు 2021 సెప్టెంబరు 15 చివరి తేదీగా నిర్ణయించింది. ఇకపై గడువు పెంచబోమంటూ ఏవియేషన్ మినిష్టర్ జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. రెండోసారి ఎయిర్ ఇండియాను 2018లోనే కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఎయిర్ ఇండియాలో కనీసం 76 శాతం వాటాను కొనుగోలు చేయాలని షరతు విధించింది. అయితే ఏ ఒక్క కంపెనీ కేంద్రం విధించిన షరతులు అనుసరించి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దీంతో రెండో సారి ఎయిర్ ఇండియా కొనుగోలుకు సంబంధించి బిడ్లను కేంద్రం ఆహ్వానించింది. ఈసారి ఒకే సంస్థ కాకుండా రెండు సంస్థలు కలిసి బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చంటూ కొంత వెసులుబాటు కల్పించింది. అదే విధంగా వంద శాతం వాటాలను విక్రయించాలని కూడా నిర్ణయించింది. బరిలో ఎవరు ? ఎయిర్ ఇండియా కొనుగోలుకు సంబంధించి చివరి తేది వరకు కూడా పెద్దగా కంపెనీలు ఆసక్తి చూపించలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు టాటా గ్రూపుతో పాటు స్పైస్ జెట్ సంస్థలు ఎయిర్ఇండియా కొనుగోలకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా బిడ్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎయిర్ ఇండియా భారీగా నష్టాల పాలైనప్పటికీ వేల కొట్ల విలువ చేసే ఆస్తులు ఆ సంస్థకి ఉన్నాయి. ముంబై, ఢిల్లీలలో నగరం నడిబొడ్డున ఎకరాల కొద్ది స్థలం అందుబాటులో ఉంది. దీనికి తోడు దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లో సిబ్బంది క్వార్టర్స్ రూపంలో కూడా ఆస్తులు ఎయిర్ ఇండియా పేరిట ఉన్నాయి. విదేశాల్లో సైతం ఎయిర్ఇండియాకు అనేక ఆస్తులు ఉన్నాయి. చదవండి : డిసెంబరే టార్గెట్.. ఎయిరిండియాను అమ్మేయడానికే -
మళ్లీ గాల్లో ఎగరనున్న ఆ బడా ఎయిర్ లైన్స్ కంపెనీ
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్దం అవుతుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జెట్ ఎయిర్వేస్ విమానాలు మళ్లీ గాల్లో ఎగరనున్నాయని జలాన్ కల్రాక్ కన్సార్షియం సోమవారం వెల్లడించింది. న్యూఢిల్లీ నుంచి ముంబైకి తన మొదటి విమానంతో దేశీయ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉందని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం నాటికి అంతర్జాతీయ విమానాలు కూడా పనిచేస్తాయని కంపెనీ ఈ రోజు తెలిపింది. 100కి పైగా విమాన సేవలు గ్రౌండెడ్ క్యారియర్ పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(ఏఓసీ) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. "జెట్ ఎయిర్వేస్ 2.0 2022 మొదటి తొలి త్రైమాసికంలో దేశీయ కార్యకలాపాలను పునఃప్రారంభించడం, క్యూ3/క్యూ4 2022 నాటికి స్వల్ప కాలిక అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మా ప్రణాళికలో భాగంగా రాబోయే 3 సంవత్సరాలలో 50+ విమానాలు, 5 సంవత్సరాలలో 100+ పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని కన్సార్టియం స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకున్నట్లు" లండన్ కు చెందిన జలాన్ కల్రాక్ కన్సార్టియం ప్రధాన సభ్యుడు, జెట్ ఎయిర్ వేస్ ప్రతిపాదిత నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యుఏఈ వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ అన్నారు.(చదవండి: ఈఎస్ఐసీ చందాదారులకు కేంద్రం శుభవార్త!) విమానయాన చరిత్రలో ఇదే మొదటిసారి "విమానయాన చరిత్రలో 2 సంవత్సరాలకు పైగా మూతబడిన ఒక విమానయాన సంస్థను పునరుద్ధరించబడటం ఇదే మొదటిసారి. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో భాగం కావడం ఆనందంగా ఉంది" అని శ్రీ జలాన్ చెప్పారు. భారీగా పెరిగిన నష్టాలతో కుంటుపడిన ఈ విమానయాన సంస్థ, ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ క్యారియర్. భారీ అప్పుల కారణంగా ఏప్రిల్ 2019లో అన్ని విమానాలను నిలిపి వేయాల్సి వచ్చింది. జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ ప్రణాళికను నేషనల్ కంపెనీల లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఈ ఏడాది జూన్‌లో ఆమోదించింది. ప్రస్తుతం ఈ కంపెనీ దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియలో ఉంది. గతేడాది అక్టోబరులో బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈ వ్యాపారవేత్త జలాన్‌ల నేతృత్వంలోని కన్సార్షియం.. జెట్ ఎయిర్వేస్ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. రాబోయే 5 ఏళ్లలో రూ.12000 వేల కోట్లను తిరిగి చెల్లిస్తామని కల్రాక్-జలాన్ కన్సార్షియం ప్రతిపాదించింది. దీనికి ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది.(చదవండి: పన్నులు చెల్లించండి..అభివృద్ధికి సహకరించండి..) 1000కి పైగా ఉద్యోగాలు పునరాగమనం చేస్తున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. "జెట్ ఎయిర్ వేస్ ముంబైలోని తన 'గ్లోబల్ వన్' కార్యాలయం నుండి పనిచేస్తుంది. అక్కడ ఆ విమానయాన సంస్థకు ప్రపంచ స్థాయి అత్యాధునిక శిక్షణా కేంద్రాన్ని కూడా ఉంది. ఇక్కడే సిబ్బంది కోసం ఇన్-హౌస్ శిక్షణ ఇస్తారు" అని తాత్కాలిక సీఈఓ కెప్టెన్ గౌర్ పేర్కొన్నారు. "జెట్ ఎయిర్వేస్ ఇప్పటికే తన ప్రణాళికలో భాగంగా 150 మందికి పైగా శాశ్వత స్థాయి ఉద్యోగులను నియమించుకుంది. అలాగే వివధ కేటగిరీలలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో 1000 మందికి పైగా ఉద్యోగులను ఆన్ బోర్డ్ చేయాలని చూస్తున్నాము" అని కెప్టెన్ గౌర్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియ దశలవారీగా ఉంటుందని ఆయన అన్నారు. -
ఎన్సీఎల్ఏటీ ముందుకు జెట్ ఎయిర్వేస్ దివాలా కేసు
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ దివాలా విషయంలో జలాన్ కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళిక అమలును నిలిపివేయాలని ఆ విమాన సంస్థ క్యాబిన్, గ్రౌండ్ సిబ్బంది ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. ఈ పరిష్కార ప్రక్రియలో తమ వేతనాలు, రిటైర్మెంట్ ప్రయోజన అంశాలు లేవని వివరించింది. తమ వాదనలు విని, తుది తీర్పు వెలువరించేంతవరకూ జూన్‌లో ఎస్‌సీఎల్‌టీ, ముంబై బెంచ్ ఆమోదించిన కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళిక అమలుపై స్టే ఇవ్వాలని ఎన్సీఎల్ఏటీని అభ్యర్థించింది. రుణ భారాల్లో కూరు కుపోయిన జెట్ ఎయిర్వేస్ రెండేళ్లుగా కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అద్దె యంత్రాల కోసం సోనాలికా యాప్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్ల తయారీలో ఉన్న సోనాలికా గ్రూప్ ‘సోనాలికా అగ్రో సొల్యూషన్స్’ పేరుతో యాప్‌ను తీసుకొచ్చింది. వ్యవసాయ రంగానికి అవసరమైన అత్యాధునిక యంత్రాలు, ట్రాక్టర్ల వంటివి అద్దెకిచ్చే వ్యక్తులను ఈ యాప్ ద్వారా రైతులతో అనుసంధానిస్తారు. రైతులు సైతం తమ వద్ద ఉన్న యంత్రాలను అద్దెకు ఇవ్వాలనుకుంటే ఈ యాప్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. -
‘ఆకాశ’ .. మాస్టర్ మైండ్స్ వీరే
ముంబై: ఇండియాలో విమానయానం సామాన్యులకు ఎప్పుడు అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. గతంలో తక్కువ ధరలకే ఎయిర్ డెక్కన్ వచ్చినా ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పోయింది. తాజాగా తక్కువ ధరకే విమాన సర్వీసులు అందిస్తామంటూ ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆకాశ విమానయాన సంస్థ నెలకొల్పారు. ఆకాశ ఆకాశ పేరుతో రాబోయే కొద్ది రోజుల్లోనే ఎయిర్ సర్వీసులు ప్రారంభించేందుకు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రెడీ అయ్యారు. మార్కెట్ నిపుణుడైన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు ఎయిర్‌లైన్స్‌లో ఉన్న అనుభవం ఎంత ? అయన ఈ రంగంలోకి అడుగు పెట్టేందుకు అండగా నిలబడింది ఎవరు? తనకు అందుబాటులో ఉండే ధరలతోనే కామన్ మ్యాన్ ఆకాశయనం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు మార్కెట్లో నెలకొన్నాయి. అయితే ఆకాశ స్థాపన వెనుక మార్కెట్ బిగ్బుల్ రాకేశ్‌తో ఎయిల్లైన్స్లో అపాన అనుభవం ఉన్న మాస్టర్ మైండ్స్ ఉన్నాయి. వీరిద్దరే స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్ చేసి లక్షల కోట్లు సంపాదించి మార్కెట్ బిగ్‌బుల్‌గా పేరుపడిన రాకేశ్ఝున్ఝున్వాలాకి ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీలో పట్టులేదు. కానీ ఆ రంగంలో అపార అనుభవం ఉన్న వినయ్ దుబే, ఆదిత్యాఘోష్లు రాకేశ్‌కు కుడిఎడమలుగా నిలబడ్డారు. వారిద్దరే రెక్కలుగా మారి రాకేశ్ చేత ఆకాశయానం చేయిస్తున్నారు. వినయ్‌దుబే ఆకాశ ఎయిర్వేస్ ఆలోచన పురుడుపోసుకోవడానికి ప్రధాన కారణం జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దుబే. ఎయిర్ ఇండియాకు పోటీగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ సీఈవోగా వినయ్ దుబే పని చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాతో కలిసి ఆకాశకు బీజం వేశారు. ఆకాశలో వినయ్ దుబేకి 15 శాతం వాటా ఉంది. ఆదిత్యా ఘోష్ చౌక విమాన సర్రీసులు అందించిన గో ఎయిర్‌లో 2008లో ఆదిత్య ఘోష్ చేరారు. అప్పటి నుంచి 2018లో కంపెనీని వీడేవరకు వివిధ హోదాల్లో రకరకాల స్కీమ్‌లు అమలు చేస్తూ గో ఎయిర్ అభివృద్దికి తోడ్పడ్డారు. ఇప్పుడు 160 విమానాలతో దేశంలోనే ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీగా గో ఎయిర్ కొనసాగుతోంది. ఈయన ఆకాశ ఎయిర్‌లైన్స్‌లో 10 శాతం వాటాను కలిగి ఉన్నారు. ర్యాన్ఎయిర్ తరహాలో ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలకే విమానయానం అందిస్తామని ఆకాశ హామీ ఇస్తోంది. ఆగష్టు చివరి నాటికి ప్రభుత్వం నుంచి అనుమతలు వచ్చే అవకాశం ఉంది. యూరప్‌కి చెందిన ‘ర్యాన్ఎయిర్’ తరహాలో ఆకాశ ఎయిర్‌లైన్స్ సర్వీసెస్ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఉదాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. చిన్న నగరాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తోంది, కొత్తగా అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో ఎయిర్‌లైన్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతందనే అంచనాలు ఉన్నాయి,. ఈ నేపథ్యంలో 70 ఫ్లైట్లలతో ఆకాశ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో భాగమైన జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోనున్న కంపెనీ సంస్థ సిబ్బందికి ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్‌టాప్‌ను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా నగదును సైతం చెల్లించేందుకు ప్రతిపాదించింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్వేస్ సిబ్బందిలో కనీసం 95 శాతం టేకోవర్‌కు అనుకూలంగా ఓటింగ్ చేయవలసి ఉంటుంది. ఇలాగైతేనే జెట్ ఎయిర్వేస్ కొనుగోలు బిడ్‌కు క్లియరెన్స్ లభించనుంది. జలాన్ కల్రాక్ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను గెలుపొందిన సంగతి తెలిసిందే. కంపెనీ సిబ్బంది(ఉద్యోగులు, కార్మికులు) ప్రయోజనాల నేపథ్యంలో టేకోవర్ ప్రక్రియకు ఈ నెల 5న ప్రారంభమైన వోటింగ్ ఆగస్ట్ 4వరకూ కొనసాగనుంది. గత నెల 22న ఎన్సీఎల్టీ కొన్ని షరతులతో జలాన్ కల్రాక్ కన్సార్షియంకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా కంపెనీ సిబ్బందికి కొన్ని రకాల లబ్ధిని చేకూర్చేందుకు కన్సార్షియం ఆమోదించింది. ఈ అంశాలను జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్లో పొందుపరిచారు. రుణ భారం, నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్ 17న మూత పడింది. తదుపరి 2019 జూన్ 20న దివాలా చర్యలు ప్రారంభమయ్యాయి. ఆఫర్ ఇలా..: జెట్ ఎయిర్వేస్ సిబ్బంది(కార్మికులు)కి టేకోవర్ కంపెనీ ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్‌టాప్‌ను ఇచ్చేందుకు సన్నద్ధమైంది. అంతేకాకుండా రూ. 22,800 చొప్పున నగదును చెల్లించనుంది. ఇక ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.11,000 చొప్పున అందించనుంది. జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకునేందుకు జలాన్ కల్రాక్ కన్సార్షియం మొత్తంగా నగదు రూపేణా రూ. 1,375 కోట్లను వెచ్చించనుంది. -
జెట్ ఎయిర్వేస్లోకి రూ. 1,375 కోట్లు!
న్యూఢిల్లీ: దివాలా తీసిన ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను వేలంలో దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం .. రుణ పరిష్కార ప్రణాళిక ప్రకారం కంపెనీలో రూ. 1,375 కోట్ల మేర నిధులు సమకూర్చనుంది. ఇందులో రూ. 475 కోట్లు రుణదాతలకు దక్కనున్నాయి. మిగతా రూ. 900 కోట్ల మొత్తాన్ని సంస్థ నిర్వహణ మూలనిధి అవసరాలు, పెట్టుబడి వ్యయాల కోసం కన్సార్షియం వెచ్చించనుంది. ఈ ప్రణాళిక ప్రకారం బ్యాంకులకు దక్కే నిధుల్లో భారీగా అంటకత్తెర పడనుంది. సుమారు రూ. 7,800 కోట్ల పైగా రావాలంటూ బ్యాంకులు క్లెయిమ్ చేయగా వాటికి రూ. 475 కోట్ల మేరకే కేటాయింపు జరిగింది. ఇందులోనూ మళ్లీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు (సీఐఆర్‌పీ) సంబంధించిన ఖర్చులు పోగా ఆర్థిక రుణదాతలకు నికరంగా రూ. 380 కోట్లు లభించనున్నాయి. దీనిలో రూ. 185 కోట్ల మొత్తాన్ని ముందస్తుగా చెల్లించనుండగా, మిగతా రూ. 195 కోట్లకు జీరో – కూపన్ బాండ్లను కన్సార్షియం జారీ చేస్తుంది. అలాగే జెట్ ఎయిర్వేస్లో బ్యాంకులకు 9.5 శాతం, జెట్ ప్రివిలేజ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 7.5 శాతం వాటా లభిస్తుంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్‌లో కార్యకలాపాలు నిలిపివేసింది. అదే ఏడాది జూన్ నుంచి దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 22న జలాన్ కల్రాక్ కన్సార్షియం సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన ఆదేశాలను రాతపూర్వకంగా బుధవారం ప్రకటించింది. చదవండి: జెట్ ఎయిర్వేస్కు మళ్లీ రెక్కలు! -
దివాలా తీసిన విమాన కంపెనీకి మళ్లీ రెక్కలు
ముంబై: ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్.. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగిరేందుకు మార్గం దాదాపు సుగమమైంది. జలాన్ కల్రాక్ కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) మంగళవారం ఆమోదముద్ర వేసింది. జూన్ 22 నుంచి 90 రోజుల్లోగా దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆదేశించింది. ఒకవేళ గడువు పొడిగించాల్సిన అవసరం వస్తే ట్రిబ్యునల్‌ను జలాన్ కల్రాక్ కన్సార్షియం మరోసారి ఆశ్రయించవచ్చని మౌఖికంగా పేర్కొంది. అటు విమానాశ్రయాల్లో స్లాట్ల కేటాయింపు అంశాన్ని ప్రభుత్వం లేదా సంబంధిత నియంత్రణ సంస్థ పరిశీలించాల్సి ఉంటుందని ఎన్సీఎల్టీ తెలిపింది. మరోవైపు ఎన్సీఎల్టీ రాతపూర్వక ఆదేశాలు వచ్చాక తదుపరి ప్రక్రియపై నిర్ణయం తీసుకోనున్నట్లు జలాన్ కల్రాక్ కన్సార్షియం పేర్కొంది. జెట్ ఎయిర్వేస్ను తిరిగి పునరుద్ధరించేందుకు సంబంధిత వర్గాలందరితో కలిసి పనిచేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో అంతా సవ్యంగా జరిగితే ఈ ఏడాది ఆఖరు నాటికి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కాగలవని కంపెనీ పరిష్కార నిపుణుడు, గ్రాంట్ అండ్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ ఆశీష్ ఛాచ్రియా ఆశాభావం వ్యక్తం చేశారు. జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియ ప్రారంభమయ్యాక రెండేళ్ల నుంచి కంపెనీ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ‘రెండేళ్ల మా శ్రమకు ఫలితం దక్కింది. జెట్ ఎయిర్వేస్ 2.0 పునరుద్ధరణకు ఎన్సీఎల్టీ ఉత్తర్వులు తోడ్పడతాయి‘ అని ఆయన పేర్కొన్నారు. కీలకంగా స్లాట్లు.. రెండేళ్ల క్రితం కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయిన తర్వాత జెట్‌కి ఉన్న స్లాట్లు ఇతర ఆపరేటర్లకు దక్కాయి. కంపెనీ సర్వీసులు పునఃప్రారంభం కావడానికి ఇవి కీలకంగా ఉండనున్నాయి. ఇదే విషయాన్ని ఆశీష్.. ఎన్సీఎల్టీ దృష్టికి తీసుకెళ్లారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), పౌర విమానయాన శాఖ (ఎంవోసీఏ) దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. అయితే, గత చరిత్ర ఆధారంగా జెట్ ఎయిర్వేస్కు స్లాట్లను కేటాయించడం కుదరదని, నిర్దిష్ట మార్గదర్శకాలకు లోబడే కేటాయింపు ఉంటుందని ఎన్సీఎల్టీకి దాఖలు చేసిన సంయుక్త అఫిడవిట్లో డీజీసీఏ, ఎంవోసీఏ స్పష్టం చేశాయి. మరోవైపు స్లాట్ల అంశం ఎప్పటికి పరిష్కారమవుతుందన్నది చెప్పడం కష్టం అయినప్పటికీ.. నిర్దేశిత గడువులోగా ఒక కొలిక్కి రాగలదని ఆశిస్తున్నట్లు ఆశీష్ పేర్కొన్నారు. పలు విమానాశ్రయాలు సామర్థ్యాన్ని విస్తరించుకుంటున్న నేపథ్యంలో తగు స్థాయిలో స్లాట్లు అందుబాటులో ఉండవచ్చని ఆయన తెలిపారు. రూ. 8,000 కోట్ల బకాయిలు బ్యాంకులకు రూ. 8,000 కోట్ల పైచిలుకు బాకీపడిన జెట్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్ నుంచి నిలిచిపోవడం తెలిసిందే. కంపెనీ కార్యకలాపాలు పునఃప్రారంభించే దిశగా జలాన్ కల్రాక్ కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను గతేడాది అక్టోబర్‌లో రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించగా, తాజాగా ఎన్సీఎల్టీ కూడా ఓకే చెప్పింది. బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ కలిసి ఈ కన్సార్షియం ఏర్పాటు చేశారు. షేరు జూమ్.. పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదముద్ర వేసిందన్న సానుకూల వార్తతో జెట్ షేరు మంగళవారం 5 శాతం (అప్పర్ సర్క్యూట్) ఎగిసింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో రూ. 99.45 వద్ద ముగిసింది. మరోవైపు, రెండేళ్ల క్రితం కార్యకలాపాలు నిలిచిపోయినప్పట్నుంచీ జెట్ షేరు ధర దాదాపు సగానికి పైగా పడిపోయింది. సర్వీసుల నిలిపివేతకు ఒక్క రోజు ముందు 2019 ఏప్రిల్ 16న బీఎస్ఈలో షేరు రూ. 241.85 వద్ద క్లోజయ్యింది. ఆ తర్వాత పరిణామాలతో ఒకదశలో సుమారు రూ. 59కి కూడా పడిపోయింది. ప్రస్తుతం రూ. 99.45 వద్దకు తిరిగి కోలుకుంది. రెండేళ్లలో కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ. 1,617 కోట్ల మేర హరించుకుపోయింది. తాజా పరిణామాలతో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సుమారు రూ. 1,130 కోట్లుగా ఉంది. జెట్ ఎయిర్వేస్ సంక్షోభం ఇలా.. లీజుకు తీసుకున్న నాలుగు బోయింగ్ విమానాలతో, జెట్ ఎయిర్వేస్ 1993లో ఎయిర్ ట్యాక్సీ ఆపరేటరుగా సర్వీసులు ప్రారంభించింది. ఆ తర్వాత 1995లో పూర్తి స్థాయి షెడ్యూల్ క్యారియర్‌గా మారింది. 2004 మార్చిలో చెన్నై నుంచి కొలంబోకు ఫ్లయిట్‌తో అంతర్జాతీయంగా సర్వీసులు ప్రారంభించింది. 2019 ఏప్రిల్ 17: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కారణంగా కార్యకలాపాలు నిలిపివేసింది. ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం .. ఎన్సీఎల్టీలో జూన్ 19న కంపెనీపై దివాలా పిటిషన్ దాఖలు చేసింది. 2020 మార్చి 13: టేకోవర్ చేసేందుకు బిడ్డర్లు ఎవరూ రాకపోవడంతో పరిష్కార ప్రక్రియకు మరింత సమయం ఇవ్వాలని ఎన్సీఎల్టీని జెట్ కోరింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న ప్రాపర్టీని విక్రయించి, కొన్ని రుణాలను సెటిల్ చేసుకునేందుకు జూన్‌లో కంపెనీకి ఎన్సీఎల్టీ అనుమతులు ఇచ్చింది. 2020 అక్టోబర్ 17: జలాన్ కల్రాక్ కన్సార్షియం పరిష్కార ప్రణాళికను రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించింది. గత చరిత్ర ఆధారంగా స్లాట్లను కూడా మళ్లీ కేటాయించాలని ఎన్సీఎల్టీని కన్సార్షియం కోరింది. 2021 ఫిబ్రవరి 21: జలాన్ కల్రాక్ కన్సార్షియం అభ్యర్థ్ధనపై స్పందించేందుకు డీజీసీఏకి ఎన్సీఎల్టీ మరింత సమయం ఇచ్చింది. స్లాట్ల విషయంలో తామేమీ భరోసా ఇవ్వలేమని మార్చిలో డీజీసీఏ తెలియజేసింది. కంపెనీ గత చరిత్ర ఆధారంగా స్లాట్లు కేటాయించలేమని జూన్ 3న ఎన్సీఎల్టీకి డీజీసీఏ, ఎంవోసీఏ తెలియజేశాయి. -
80% విమానాలకు ఓకే- షేర్లకు రెక్కలు
ముంబై, సాక్షి: కోవిడ్-19కు ముందున్నస్థాయిలో 80 శాతంవరకూ దేశీ సర్వీసుల నిర్వహణకు ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎయిర్‌లైన్స్ కంపెనీలు తమ సామర్థ్యంలో 80 శాతం విమానాలను నిర్వహించేందుకు వీలు చిక్కింది. ఇందుకు అనుమతిస్తూ పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డవున్ విధించిన తదుపరి మే 25న దేశీయంగా విమాన సర్వీసులకు ప్రభుత్వం అనుమతించింది. రెండు నెలల తరువాత సర్వీసులు ప్రారంభమైనప్పుడు 30,000 మంది ప్రయాణికులు నమోదుకాగా.. నవంబర్ 30కల్లా ఈ సంఖ్య 2.52 లక్షలను తాకినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో ప్రయివేట్ రంగ లిస్టెడ్ కంపెనీలు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్పైస్‌జెట్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పుట్టింది. దీంతో ఈ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండిగో.. గో ఇండిగో బ్రాండు విమానయాన సర్వీసుల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 1,744 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,747 వరకూ ఎగసింది. వెరసి 52 వారాల గరిష్టాన్ని తాకింది. దేశీయంగా మే నెలలో 33 శాతం, జూన్‌లో 45 శాతం వరకూ విమానాల నిర్వహణకు అనుమతించిన ప్రభుత్వం తాజాగా 70 శాతం నుంచి 80 శాతానికి పరిమితిని పెంచడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. స్పైస్‌జెట్ దేశీ సర్వీసులలో 80 శాతం వరకూ విమానాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో స్పైస్‌జెట్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9.3 శాతం దూసుకెళ్లి రూ. 89 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 92 వరకూ ఎగసింది. ఇక రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా కల్రాక్ క్యాపిటిల్ కన్సార్షియం మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇటీవల జెట్ ఎయిర్వేస్ కౌంటర్ సైతం ర్యాలీ బాటలో సాగుతున్న విషయం విదితమే. వచ్చే(2021) వేసవిలో యూరోపియన్ దేశాలతోపాటు.. పశ్చిమాసియా నగరాలకు జెట్ ఎయిర్వేస్ సర్వీసులను ప్రారంభించే వీలున్నట్లు అంచనాలు వెలువడటంతో జెట్ ఎయిర్వేస్ షేరు నవంబర్ 5న రూ. 79 వద్ద ఏడాది గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షేరు 1.5 శాతం క్షీణించి రూ. 69 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్నజెట్ ఎయిర్వేస్ షేరు 8 నెలల్లో 438 శాతంపైగా దూసుకెళ్లడం గమనార్హం! -
వేసవి నుంచి మళ్లీ జెట్ ఎయిర్ సర్వీసులు!
ముంబై, సాక్షి: వచ్చే వేసవి సీజన్ నుంచి ప్రయివేట్ రంగ కంపెనీ జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే జాతీయ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నుంచి కంపెనీ టేకోవర్‌కు లైన్ క్లియర్‌కావడంతో డీజీసీఏ, పౌర విమానయాన శాఖ(ఎంసీఏ) నుంచి అనుమతుల కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. భారీ రుణాలు, నష్టాల కారణంగా 2019 నుంచి కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ ప్రణాళికలకు ఇటీవల ఎన్సీఎల్టీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. దీంతో కల్రాక్ క్యాపిటల్- మురారిలాల్ జలన్ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకుంది. దీనిలో భాగంగా ఇకపైన కూడా స్టాక్ ఎక్స్ఛేంజీలలో జెట్ ఎయిర్వేస్ లిస్టింగ్‌ను కొనసాగించేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. విదేశాలకు కనెక్టివిటీ వచ్చే(2021) వేసవిలో యూరోపియన్ దేశాలతోపాటు.. పశ్చిమాసియా నగరాలకు జెట్ ఎయిర్వేస్ సర్వీసులను ప్రారంభించే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. దేశీయంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి సర్వీసులు ప్రారంభంకావచ్చని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. జెట్ ఎయిర్వేస్ రిజల్యూషన్ ప్రణాళికను నవంబర్ 5న ఎన్సీఎల్టీకి కల్రాక్ క్యాపిటల్- మురారిలాల్ జలన్ కన్సార్షియం అందజేశాయి. బిగ్ చార్టర్, ఇంపీరియల్ క్యాపిటల్ తదితర సంస్థల మధ్య పోటీలో రూ. 1,000 కోట్ల ఆఫర్ ద్వారా జెట్ ఎయిర్వేస్ను కల్రాక్ క్యాపిటల్ గెలుచుకుంది. కాగా.. ఇప్పటికే ఎన్సీఎల్టీ నుంచి అనుమతులు పొందడంతో ఎంసీఏ, డీజీసీఏల నుంచి క్లియరెన్స్‌ల కోసం కంపెనీ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. షేరు జోరు కంపెనీ పునరుద్ధరణకు కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలాన్ కన్సార్షియం ప్రతిపాదించిన రిజల్యూషన్‌కు రుణదాతల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రయివేట్ రంగ కంపెనీ జెట్ ఎయిర్వేస్ కౌంటర్ గత రెండు నెలల్లో నిరవధికంగా బలపడుతూ వచ్చింది. ఈ బాటలో నవంబర్ 5కల్లా ఎన్ఎస్ఈలో రూ. 79ను అధిగమించింది. తద్వారా 52 వారాల గరిష్టానికి చేరంది. తదుపరి అక్కడక్కడే అన్నట్లుగా కదులుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ షేరు 1 శాతం బలపడి రూ. 70 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్నజెట్ ఎయిర్వేస్ షేరు 8 నెలల్లో 438 శాతంపైగా దూసుకెళ్లడం గమనార్హం! -
జెట్ ఎయిర్వేస్కు రెక్కలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఇండియా టేకాఫ్‌కు ముందడుగు పడింది. కొత్త యజమానుల చేతుల్లోకి సంస్థ మారనుంది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ అడ్వైజరీ అయిన కల్రాక్ క్యాపిటల్, వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్‌ల కన్సార్షియం జెట్ పగ్గాలను చేపట్టబోతోంది. జెట్‌ను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా రుణ పరిష్కార ప్రణాళికకై ఈ కన్సార్షియం ఆఫర్ చేసిన బిడ్‌ను జెట్ రుణ సంస్థల కమిటీ ఆమోదం తెలిపింది. కంపెనీ ఈ విషయాన్ని శనివారం వెల్లడించింది. కల్రాక్–జలాన్‌ల కన్సార్షియం బిడ్‌లో భాగంగా బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్లో వాటాతో పాటు రూ.850 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. జెట్‌ను దక్కించుకునే వేటలో ఎఫ్ఎస్టీసీ, బిగ్ చార్టర్, ఇంపీరియల్ క్యాపిటల్ సైతం పోటీపడ్డాయి. అప్పుల భారంతో నష్టాల్లో కూరుకుపోయి, దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్‌లో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కంపెనీ అప్పులు రూ.8,000 కోట్లకు ఎగబాకాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలతోసహా రూ.40,000 కోట్ల బకాయిలు ఉన్నట్టు సమాచారం. ప్రయాణికుల సంఖ్య పరంగా భారత్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన ఈ సంస్థలో దాదాపు 22,000 మంది ఉద్యోగులు ఉండేవారు. కోల్‌కతాలో తమ కుటుంబ వ్యాపారమైన పేపర్ ట్రేడింగ్‌లో మురారీ లాల్ జలాన్ తన కెరీర్‌ను 1980లో ప్రారంభించారు. పేపర్ తయారీ, రియల్టీ, హెల్త్‌కేర్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టి రష్యా, యూఏఈ వంటి దేశాల్లో విస్తరించారు. జెట్ డీల్‌తో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది -
విమానయాన షేర్లు లాభాల టేకాఫ్
దేశీయ విమానయాన కంపెనీల షేర్లు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. లాక్‌డౌన్‌తో దాదాపు 2నెలల విరామం తర్వాత సోమవారం (మే 25) నుంచి దేశీయ విమాన సర్వీసులను నడపనున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఏవియేషన్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ రంగానికి చెందిన ఇండిగో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్, గ్లోబల్ వెక్టా హెలీకార్పో లిమిటెడ్ కంపెనీల షేర్లు 11శాతం నుంచి 8శాతం లాభపడ్డాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ బుధవారం కీలక ప్రకటన చేశారు. దేశంలో 2,3 నెలలుగా నిలిచిపోయిన దేశీయ (డొమెస్టిక్) విమానాలు మే 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని ఈయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే, కచ్చితమైన నిబంధనలను, ఆంక్షలను విమానాశ్రాయాల్లోను, విమానాల్లోను తప్పకుండా పాటించాల్సి వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధివిధానాలను విమానయాన శాఖ వెల్లడిస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. షేర్ల ధరల జోరు... ఇండిగో షేరు: నేడు బీఎస్ఈలో రూ.1002.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం 10గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.911.90)తో పోలిస్తే 8శాతం లాభంతో రూ.986.50 వద్ద ట్రేడ్ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.765.05, రూ.1911.00గా ఉన్నాయి. స్పైస్ జెట్ షేరు: నేడు బీఎస్ఈలో 5శాతం లాభంతో రూ.42.95 వద్ద ప్రారంభమైన అదే ధర వద్ద అప్పర్ సర్కూ్యట్‌ను తాకి ఫ్రీజ్ అయ్యింది. జెట్ ఎయిర్వేస్: నేడు బీఎస్ఈలో రూ.19.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం 10గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.911.90)తో పోలిస్తే 4.91శాతం లాభంతో రూ.20.30 వద్ద ట్రేడ్ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.13, రూ.164.90గా ఉన్నాయి. -
‘యస్’ షేర్ల ట్రేడింగ్‌పై ఆంక్షలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షేర్ల ట్రేడింగ్‌పై హఠాత్తుగా ఆంక్షలు విధించడం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) సహా ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న షేర్లలో పాతిక శాతానికి మించి విక్రయించడానికి లేకుండా విధించిన నిబంధనతో సోమవారం మదుపరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. షేరు ఏకంగా 50 శాతం పైగా ఎగిసినప్పటికీ తమ దగ్గరున్న వాటిని విక్రయించే పరిస్థితి లేకుండాపోయింది. క్యాష్, డెరివేటివ్స్ సెగ్మెంట్లో తమ పొజిషన్లను వదిలించుకోలేకపోవడంపై పలువురు సీనియర్ ఫండ్ మేనేజర్లు, ఎఫ్‌పీఐలు, సంస్థాగత ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ నిబంధనను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీగా పొజిషన్లు ఉన్న ఇన్వెస్టర్లు ఇరుక్కుపోయినట్లయిందని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత నియంత్రణ సంస్థను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు వివరించారు. ఆంక్షల గురించి సోమవారం ఉదయానికి మాత్రమే ఇన్వెస్టర్లకు తెలిసింది. అంతే కాకుండా యస్ బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్‌ను మొబైల్ యాప్స్ ద్వారా కుదరదని, డెస్క్‌టాప్ ద్వారా మాత్రమే చేయాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తదితర బ్రోకింగ్ సంస్థలు .. ఇన్వెస్టర్లకు సమాచారమిచ్చాయి. ఒకవేళ యస్ బ్యాంక్ షేర్లలో ఈ–మార్జిన్ పొజిషన్లు గానీ ఉంటే సోమవారం వాటిని డెలివరీ కింద మారుస్తామని, అందుకు తగినంత స్థాయిలో నిధులు తమ అకౌంట్లలో ఉంచుకోవాలని సూచించాయి. 19నే సూచీల నుంచి నిష్క్రమణ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో గతంలో అనుకున్న దానికంటే ముందుగానే యస్ బ్యాంక్‌ను నిఫ్టీ సహా వివిధ సూచీల నుంచి తొలగించాలని ఎన్ఎస్ఈ ఇండిసెస్ ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్–కమిటీ నిర్ణయించింది. దీంతో ముందుగా అనుకున్నట్లు మార్చి 27న కాకుండా 19 నుంచే నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ 100, నిఫ్టీ 500 వంటి అన్ని ఈక్విటీ సూచీల నుంచి యస్ బ్యాంక్ నిష్క్రమించనుంది. 18 నుంచి పూర్తి సేవలు: ఆర్బీఐ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18 సాయంత్రం నుంచి యస్ బ్యాంక్‌పై మారటోరియం తొలగిపోయి, అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ గవ ర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీంతో ఖాతా దారులు .. ఆంక్షలేమీ లేకుండా విత్‌డ్రాయల్స్ లావాదేవీలు జరపవచ్చని పేర్కొన్నారు. కార్పొరేట్లకు ఈడీ సమన్లు.. యస్ బ్యాంక్ మాజీ వ్యవస్థాపకుడు రాణా కపూర్ తదితరులపై మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా పలువురు కార్పొరేట్ దిగ్గజాలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాష్ చందద్ర, జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఇండియాబుల్స్ చైర్మన్ సమీర్ గెహ్లాట్లను విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. అటు అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కూడా ఈ నెల 19న హాజరు కానున్నారు. యస్ బ్యాంక్ అప్‌గ్రేడ్ .. తాజాగా పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో యస్ బ్యాంక్ రేటింగ్‌ను సానుకూల అంచనాలతో అప్‌గ్రేడ్ చేసినట్లు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. బోర్డు పునర్వ్యవస్థీకరణకు ఓకే .. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్.. కొత్త ఎండీ, సీఈవోగా బోర్డు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. -
జెట్ ఎయిర్వేస్ నరేష్ గోయల్‌కు ఈడీ షాక్
సాక్షి, ముంబై: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో నరేష్ గోయల్ ఇంటిపై ఈడీ అధికారులు గురువారం దాడులు నిర్వహంచారు. అలాగే గోయల్‌తోపాటు మరికొందరిపై ఈడీ తాజాగా కేసులు నమోదు చేసింది. ముంబై పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద క్రిమినల్ కేసు నమోదైందని ఈడీ అధికారులు తెలిపారు. బుధవారం కూడా ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి, విచారణ చేపట్టామని, దాడులు కొనసాగుతున్నాయని అధికారులు గురువారం తెలిపారు. జెట్‌ఎయిర్‌వేస్‌లో పెద్ద ఎత్తున నిధుల దారిమళ్లింపు సహా పలు అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో గోయల్, అతని కుటుంబం, ఇతరులపై విదేశీ మారకద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై దాడులు నిర్వహించింది. ఇదే కేసులో గత ఏడాది సెప్టెంబర్‌లో గోయల్‌ను విచారించింది. గోయల్‌కు 19 ప్రైవేటు కంపెనీలు ఉన్నాయని, వీటిలో ఐదు విదేశాల్లో ఉన్నాయిని ఈడీ గతంలో ఆరోపించింది. అమ్మకం, పంపిణీ, నిర్వహణ ఖర్చులు ముసుగులో ఈ సంస్థలు "అనుమానాస్పద" లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలను ఈడీ పరిశీలిస్తోంది. కాగా అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ గత ఏడాది ఏప్రిల్‌లో తన కార్యకలాపాలను మూసివేసింది. దీనికి ఒక నెల ముందు, గోయల్ జెట్ ఎయిర్వేస్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్ షేర్లు జూమ్
సాక్షి,ముంబై: ప్రైవేటు రంగ విమాన యాన సంస్థ చాలా రోజుల తరువాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. బిలియనీర్ హిందూజా బ్రదర్స్ జెట్ ఎయర్‌వేస్‌ను కొనుగోలుకు బిడ్‌ను సిద్ధం చేస్తోందన్న వార్తల మధ్య జెట్ ఎయిర్వేస్ షేర్లు లాభపడుతున్నాయి. మంగళవారం నాటి బలహీన సెషన్లో ఇన్వెస్టర్లు జెట్ ఎయిర్వేస్ షేర్లుకొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో బీఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ అయ్యి రూ .296 వద్ద లాక్ అయ్యాయి. కాగా హిందూజా సోదరులు గోపిచంద్, అశోక్ హిందూజా నేతృత్వంలోని బృందం జనవరి 15 గడువులోగా జెట్ ఎ యిర్‌వేస్‌కు బిడ్ దాఖలు చేయాలని యోచిస్తోంది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఈ ఏడిది ఏప్రిల్ 17 నుంచి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్కు మంచి రోజులు?!
సాక్షి, ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకుని చివరకు మూతపడిన జెట్ ఎయిర్వేస్కు సంబంధించి ఒకకీలక విషయం మార్కెట్ వర్గాల్లో నానుతోంది. హిందూజా గ్రూప్ మూతపడిన జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి బిడ్‌ను సిద్ధం చేస్తోంది. బిలియనీర్ హిందూజా బ్రదర్స్ జెట్ ఎయిర్వేస్కు బిడ్ సిద్ధం చేస్తున్నట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గోపిచంద్ హిందూజా, అశోక్ హిందూజా సోదరుల బృందం 2020 జనవరి 15 గడువు లోగా బిడ్‌ను సమర్పించాలని యోచిస్తోంది. అయితే ఈ వార్తలపై హిందుజా గ్రూపు అధికారికంగా స్పందించాల్సి వుంది. -
జెట్ ఎయిర్వేస్ దివాలా
ముంబై: జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార గడువును 90 రోజుల పాటు పొడిగించేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతించింది. దక్షిణాఫ్రికాకు చెందిన సినర్జీ గ్రూపు మరింత సమయం కోరుతుండడం, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఆసక్తి వ్యక్తీకరిస్తున్న నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ రుణ దాతల కమిటీ (సీవోసీ) దివాలా పరిష్కార గడువును పొడిగించాలంటూ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్‌ను కోరింది. జెట్ ఎయిర్వేస్కు కార్పొరేట్ దివాలా పరిష్కార గడువు (180 రోజులు) ఈ నెల 16న ముగియగా, ఈ గడువును మరో 90 రోజులు పాటు పొడిగిస్తూ ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది. జెట్ ఎయిర్వేస్కు సినర్జీ గ్రూపు ఒక్కటే బిడ్ దాఖలు చేయగా, వాటాదారుల ప్రయోజనం దృష్ట్యా పెట్టుబడులపై సరైన నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కోరుతుండడం గమనార్హం. -
ఎయిర్‌లైన్స్ కంపెనీలకు రూ.4,260 కోట్ల నష్టాలు
విమానయాన సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 600 మిలియన్ డాలర్లకు (రూ.4,260 కోట్లు) పైగా నష్టాలను నమోదుచేయవచ్చని కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ అంచనా వేసింది. 500–700 మిలియన్ డాలర్ల వరకు లాభాలకు అవకాశం ఉంటుందని ఈ ఏడాది జూన్‌లో వేసిన అంచనాలను సవరించింది. జెట్ ఎయిర్వేస్ మూసివేత, సానుకూలంగా ఉన్న చమురు ధరల నుంచి ప్రయోజనం పొందడంలో ఎయిర్‌లైన్స్ కంపెనీలు విఫలమైనట్టు సీఏపీఏ తన తాజా నివేదికలో పేర్కొంది. -
జెట్ మాజీ ఛైర్మన్‌కు మరోసారి చిక్కులు
సాక్షి, ముంబై: జెట్‌ఎయిర్‌వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్‌కు మరోసారి చిక్కులు తప్పేలా లేవు. నిధుల మళ్లింపు ఆరోపణలతో ఇండిపెండెంట్ ఆడిట్ నిర్వహించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భావిస్తోంది. ఎస్బిఐ నిర్వహించిన ఆడిట్‌పై సంతృప్తిచెందని అధికారులు స్వతంత్ర ఆడిట్నిర్వహిస్తామని ప్రకటించడంతో నరేష్‌గోయల్ చిక్కుల్లోపడ్డారు. మొత్తం 19 ప్రైవేటు కంపెనీలు నరేష్‌గోయల్‌కు ఉన్నాయని, వాటిలో ఐదు కంపెనీలు విదేశాల్లో రిజిష్టరు అయినట్లు సీనియర్ ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థలు అమ్మకం, పంపిణీ , నిర్వహణ ఖర్చులు ముసుగులో అనుమానాస్పద లావాదేవీలను ఈడీ పరిశీలిస్తోంది. నగదు సంక్షోభంలో చిక్కుకుని, ఏడువేల కోట్ల బకాయిలు పేరుకున్న సంస్థపై ఇపుడు స్వతంత్ర ఆడిట్ నిర్వహించడమే మంచిని భావిస్తోంది. గతవారంలో గోయల్‌ను ప్రశ్నించిన అధికారులు ఎస్బిఐ నిర్వహించిన ఆడిట్లో లోపాలున్నట్లు గుర్తించారు. రుణాల సొమ్మును విదేశాల్లోని కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర ఆడిట్‌తోనే మరిన్ని అంశాలు వెలుగులోనికి వస్తాయని ఈడీ భావిస్తోంది. ముంబై కార్యాలయంలో గత వారంలోనే గోయల్‌ను విచారించిన ఈడీ విదేశీ కరెన్సీ చట్టాల పరిధిలో విచారణ నిర్వహించింది. ఆగస్టులో ఆయన నివాసాలు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన తర్వాత మొదటిసారి ముంబైలో గోయల్‌ను ప్రశ్నించింది. రూ.18వేల కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలపై దర్యాప్తునకు గోయల్ సహకరించడం లేదని ఆగస్టులో ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం నివేదించింది. అయితే ఈ ఆరోపణలను గోయల్ తిరస్కరించారు. కాగా దివాలా చర్యలను ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్ చైర్మన్ గోయల్ ఇదివరకే తన పదవికి రాజీనామా చేశారు. అలాగా మార్చిలో జెట్ ఎయిర్వేస్ బోర్డు పునర్నిర్మాణంలో భాగంగా గోయల్, అతని భార్య అనిత రాజీనామా చేశారు. ఈ సంక్షోభం నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. -
జెట్‌కు కొత్త బిడ్డర్లు దూరం
ముంబై: దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసే రేసులో మూడే సంస్థలు మిగిలాయి. విక్రయానికి గడువు మూడుసార్లు పొడిగించినప్పటికీ కొత్త బిడ్డర్లెవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ‘మూడోసారి పెంచిన గడువు ఆగస్టు 31తో ముగిసింది. కానీ కొత్తగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలేమీ (ఈవోఐ) రాలేదు. డెడ్‌లైన్‌ను ఇక మరింత పొడిగించే అవకాశాలు లేవు. దీంతో ఇప్పటిదాకా వచ్చిన మూడు సంస్థలతోనే విక్రయ ప్రక్రియ కొనసాగవచ్చు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈవోఐలు దాఖలు చేసిన వాటిల్లో రష్యాకు చెందిన రష్యన్ ఫండ్ ట్రెజరీ ఆర్ఏ పార్ట్నర్స్, పనామాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ అవాంట్యులో గ్రూప్, దక్షిణ అమెరికా సినర్జీ గ్రూప్ ఉన్నాయి. -
జెట్ ఫౌండర్ నరేష్ గోయల్‌పై ఈడీ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ మారకద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ నివాసం, కార్యాలయాలపై ఈడీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఫెమా నిబంధనలకు అనుగుణంగా అదనపు ఆధారాల కోసం ఈ సోదాలు చేపట్టామని ఈడీ అధికారులు వెల్లడించారు. ముంబై, ఢిల్లీలో గోయల్‌కు చెందిన నివాస, కార్యాలయ ప్రాంగణాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆర్థిక సంక్షోభంతో పాటు నగదు కొరతతో ఏప్రిల్ 17న జెట్ ఎయిర్వేస్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు జెట్ ఎయిర్వేస్లో పెద్ద ఎత్తున నిధుల దారిమళ్లింపు సహా పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తనిఖీ నివేదికలోనూ వెల్లడైంది. జెట్ ఎయిర్వేస్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఎయిర్‌లైన్ చైర్మన్‌గా నరేష్ గోయల్ ఈ ఏడాడి మార్చిలో వైదొలిగారు. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్లో ఐబీసీ కోడ్ కింద దివాళా ప్రక్రియ సాగుతోంది. -
జెట్ ఎయిర్వేస్ ఎఫెక్ట్ : స్పైస్‌జెట్ రికార్డ్ లాభాలు
సాక్షి, ముంబై : భారతీయ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ లిమిటెడ్ అనూహ్య లాభాలను సాధించింది. ప్రధానంగా జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సంక్షోభం, సేవలు నిలిపివేత లాంటివి స్పైస్ జెట్ కు బాగా కలిసి వచ్చాయి. ఆర్థిక మందగమనం, దేశీయంగా డిమాండ్ క్షీణిస్తున్నప్పటికీ లాభాల్లో విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. ఉదాహరణకు, ఎడెల్విస్ సెక్యూరిటీస్ 154 కోట్ల రూపాయల లాభం ఆర్జిస్తుందని అంచనా వేసింది. జూన్ త్రైమాసికంలో(క్యూ 1) రూ. 262 కోట్ల నికర లాభాలను సాధించింది. ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో 38.1 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం ఏకంగా 35 శాతం ఎగిసింది. మొత్తం ఆదాయం జూన్ 2019తో ముగిసిన త్రైమాసికంలో 3,145.3 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.2,253.3 కోట్లు. ఆపరేటింగ్ ఆదాయం 3002 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 2204 కోట్లుగా ఉంది. గత ఏడాది రూ. 32.89తో పోలిస్తే క్యూ 1లో రూ. 143.2 కోట్ల ఇతర ఆదాయాన్ని నమోదు చేసింది. గత మూడు నెలల కాలంలో ప్రయాణీకుల ఛార్జీలు11 శాతం పెరిగాయని స్పైస్ జెట్ తెలిపింది. మార్చిలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలిన తరువాత బోయింగ్ 737 మాక్స్ విమానాలను రద్దు చేయడంతో ఈ త్రైమాసికంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నామని, లేదంటే ఫలితాలు ఇంకా బావుండేవని స్పైస్‌జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
జెట్ రేసులో ఇండిగో!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్కు మళ్లీ మంచి రోజులు వచ్చేట్టున్నాయి. రుణాలు తీర్చలేక, చేతిలో చిల్లిగవ్వ లేక ఈ సంస్థ కార్యకలాపాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంస్థకు రూ.8,000 కోట్లకు పైగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు వాటిని వసూలు చేసుకునేందుకు మార్గంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేయడం తెలిసిందే. ఓ పరిష్కార నిపుణుడిని నియమించి, 90 రోజుల్లోపు దీనికి పరిష్కారం కనుగొనాలని ఎన్సీఎల్టీ ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఎన్సీఎల్టీ ముంగిటకు చేరిన జెట్ ఎయిర్వేస్పై పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశీయంగా విమానయానంలో అతిపెద్ద వాటా కలిగిన ఇండిగో దివాలా దశకు చేరిన జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఇందుకోసం ప్రైవేటు ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్‌తో కలసి దివాలా చట్టం (ఐబీసీ) కింద జెట్ఎయిర్వేస్కు బిడ్ వేయనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అమెరికాకు చెందిన మరో ప్రైవేటు ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సైతం జెట్ కొనుగోలుకు ముందుకొస్తోంది ఆసక్తిగల ఇతర ఇన్వెస్టర్లతో కలసి జెట్ ఎయిర్వేస్కు బిడ్ వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. సమస్యాత్మక కంపెనీల్లో పెట్టుబడులకు అపోలో గ్లోబల్ ప్రసిద్ధి చెందిన సంస్థ. ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల కన్సార్షియంను సంప్రదించినట్టు తెలిసింది. ఈ సంస్థ నిర్వహణలో 280 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. ప్రాథమిక చర్చలు జరిగాయి... ‘‘ఇండిగో, టీపీజీ క్యాపిటల్ జెట్ ఎయిర్వేస్ పట్ల ఆసక్తిగా ఉన్నాయి. లీడ్ బ్యాంకర్ అయిన ఎస్బీఐతో ఇటీవలే ప్రాథమిక చర్చలు కూడా నిర్వహించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న దివాలా ప్రక్రియ కింద ఈ రెండు సంస్థలు సంయుక్తంగా బిడ్ వేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్కు చెందిన దేశీయ, అంతర్జాతీయ స్లాట్లపై ఇండిగో ఆసక్తిగా ఉంది. తద్వారా తన మార్కెట్ వాటాను కాపాడుకోవాలని భావిస్తోంది. జెట్ ప్రివిలేజ్ ప్రైవేటు లిమిటెడ్ (జేపీపీఎల్) పట్ల టీపీజీ క్యాపిటల్ ఎక్కువ ఆసక్తితో ఉంది. ఎందుకంటే జెట్ ఎయిర్‌వేస్‌తో పోలిస్తే జేపీపీఎల్ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండడమే కాకుండా, గతంలో లాభాలు కూడా చవిచూసింది.స్వతంత్ర సంస్థ అయిన జేపీపీఎల్ దివాలా చర్యల్లో భాగంగా లేకపోవడమే ఉన్న అడ్డంకి. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో జేపీపీఎల్ను కూడా భాగం చేయవచ్చా అన్నదానిపై ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కన్సార్షియం కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జేపీపీఎల్ అన్నది జెట్ ఎయిర్వేస్ సర్వీసుల్లో తరచుగా ప్రయాణించే వారి కోసం ఉద్దేశించిన లాయల్టీ ప్రోగ్రామ్. 2012లో జెట్ సొంత విభాగంగా ఏర్పాటవ్వగా, 2014లో స్వతంత్ర సంస్థగా మార్చారు. ఆ ఏడాది ఎతిహాద్ ఎయిర్వేస్ 150 మిలియన్ డాలర్లతో 50.1 శాతం వాటా తీసుకుంది. మిగిలిన వాటా జెట్ చేతుల్లో ఉంది. జేపీపీఎల్ విలువ రూ.7,300 కోట్లు ఉంటుందని ఆన్ పాయింట్ లాయల్టీ అనే సంస్థ అంచనా కట్టింది. ఇక, అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సైతం జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల కన్సార్షియంతో ఇటీవలే సమావేశమైందని, వ్యాల్యూ ఇన్వెస్టర్లుగా జెట్ ఎయిర్వేస్లో మంచి అవకాశం కోసం చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జెట్ రుణదాతల కన్సార్షియం ఈ నెల 16న తొలిసారి సమావేశమై చర్చలు కూడా నిర్వహించింది. ఈ వారాంతంలోపు జెట్ ఎయిర్వేస్కు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణలకు ఆహ్వానం పలకొచ్చని, బిడ్లు వేసేందుకు ఆగస్ట్ మొదటి వారం వరకు గడువు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. -
నరేష్ గోయల్‌కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు గోయల్ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. గ్యారంటీ సొమ్ము చెల్లించకుండా దేశం విడిచి వెళ్లరాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఒకవేళ దేశం విడిచి విదేశాలకు వెళ్లాలనుకుంటే 18వేల కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక ఊరట కల్పించలేమని న్యాయమూర్తి సురేష్ కైత్ స్పష్టం చేశారు. తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్కులర్‌ను సవాల్ చేస్తూ, దేశం విడిచి వెళ్లడానికి కోర్టు అనుమతిని కోరుతూ గోయల్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అలాగే దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా గోయల్ ఆయన భార్య అనిత దుబాయ్‌కు వెళుతుండగా మార్చి 25 న విమానాన్ని దింపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ రంగబ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా, డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో నరేష్ గోయల్‌కు తాజా షాక్ తగిలింది. -
నరేష్ గోయల్‌కి ఢిల్లీ కోర్టులో షాక్
-
జెట్ ఎయిర్వేస్ : ఉద్యోగుల చొరవ
సాక్షి, న్యూఢిల్లీ : రుణభారంతో కుదేలైన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్పై దివాలా ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు తమ సంస్థను గట్టెక్కించేందుకు , తద్వారా తమ భవిష్యత్తు భరోసాకు నడుం బిగించారు. ఆది గ్రూపు భాగస్వామ్యంతో ఉద్యోగుల కన్సార్షియం బిడ్ దాఖలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్) ద్వారా 75 శాతానికి బిడ్ దాఖలు చేస్తామని శుక్రవారం ప్రకటించింది. సంస్థ ఉద్యోగులు ఇలాంటి చొరవ తీసుకోవడం ఇదే తొలిసారని బిజినెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. భారత విమానయాన చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయమని అంటున్నారు. "ఇది నిజంగా ప్రధానమంత్రి కల 'సబ్కా సాథ్, సబ్ కా వికాస్ సబ్ కా విశ్వస్' ను సూచిస్తుందంటూ , ఉద్యోగుల కన్సార్షియం ఆదిగ్రూప్ జారీ చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్, జనరల్ సెక్రటరీ, జెట్ సీనియర్-మోస్ట్ పైలట్లలో ఒకరైన కెప్టెన్ అశ్వని త్యాగి, ఆది గ్రూపు ప్రతినిధులు పాల్గొన్నారు. కంపెనీకి రుణాలిచ్చిన 26 సంస్థల తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జెట్ ఎయిర్వేస్పై 2016 నాటి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ చట్టం ప్రకారం కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(సీఐఆర్‌పీ) దివాలా ప్రక్రియ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఈ పిటీషన్‌ను ఈ నెల 20న స్వీకరించగా తదుపరి విచారణ జూలై 5న జరగనుంది. భారత్‌లో దివాలా ప్రక్రియకు చేరిన తొలి విమానయాన సంస్థగా జెట్ ఎయిర్వేస్ నిలిచింది. ఐఆర్‌పీగా నియమితులైన ఆశీష్ చౌచారియా 90 రోజుల్లో రిజల్యూషన్ ప్రణాళికను అందజేయాలని ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఆదేశించింది. కాగా బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలకు జెట్ ఎయిర్వేస్ కంపెనీ రూ.8 500 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు, వెండార్లకు కలిపి మొత్తం 25వేల కోట్ల లోనే బకాయిలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియ ప్రారంభం
న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన జెట్ ఎయిర్వేస్పై దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కంపెనీకి రుణాలిచ్చిన 26 సంస్థల తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో జెట్ ఎయిర్వేస్పై దివాలా ప్రక్రియ కోసం పిటీషన్ దాఖలు చేసింది.ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఈ పిటీషన్‌ను ఈ నెల 20న స్వీకరించింది. 2016 నాటి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ చట్టం ప్రకారం తమ కంపెనీపై కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(సీఐఆర్‌పీ) ఆరంభమైందని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. దివాలా ప్రక్రియ ప్రారంభమవడంతో తమ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ అధికారాలన్నీ సస్పెండ్ అవుతాయని, ఇంటెరిమ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్(ఐఆర్పీ) బోర్డ్ అధికారాలు నిర్వహిస్తారని వివరించింది. రెండు వారాల పురోగతి నివేదిక భారత్‌లో దివాలా ప్రక్రియకు చేరిన తొలి విమానయాన సంస్థగా జెట్ ఎయిర్వేస్ నిలిచింది. ఐఆర్‌పీగా నియమితులైన ఆశీష్ చౌచారియా 90 రోజుల్లో రిజల్యూషన్ ప్రణాళికను అందజేయాలని ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఆదేశించింది. సాధారణంగా రిజల్యూషన్ ప్రణాళికకు 180 రోజుల గడువు ఇస్తారు. అయితే జాతీయ ప్రాముఖ్యత గల అంశం కాబట్టి త్వరితంగా దీనిని ఒక కొలిక్కి తెచ్చే ఉద్దేశంతో 90 రోజుల గడువునే నిర్దేశించారు. జెట్ ఎయిర్వేస్ దివాలాపై తదుపరి విచారణ వచ్చే నెల 5న జరగనున్నది. అదే తేదీన రెండు వారాల పురోగతి నివేదికను ఐఆర్పీ సమర్పించాలని కూడా ముంబై ధర్మాసనం ఆదేశించింది. బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలకు జెట్ ఎయిర్వేస్ కంపెనీ రూ.8,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు, వెండార్లకు కలిపి మొత్తం వేల కోట్ల లోనే బకాయిలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిపేసింది. -
జెట్ దివాలా పరిష్కారానికి 90 రోజుల గడువు
ముంబై: జెట్ ఎయిర్వేస్కు వ్యతిరేకంగా దివాలా పరిష్కారం కోసం ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం నమోదు చేసుకుంది. గ్రాంట్ థార్న్‌టన్‌కు చెందిన ఆశిష్ చౌచారియాను పరిష్కార నిపుణుడిగా నియమించింది. ఈ అంశం జాతీయ ప్రాధాన్యం గలది కాబట్టి చట్ట ప్రకారం ఆరు నెలల గడువు ఉన్నప్పటికీ, మూడు నెలల వ్యవధిలోపు పరిష్కార ప్రక్రియ కనుగొనేందుకు ప్రయత్నించాలని పరిష్కార నిపుణుడిని ఎన్సీఎల్టీ బెంచ్ కోరింది. పిటిషన్లో ఎస్బీఐ జెట్ ఎయిర్వేస్ నుంచి రూ.967 కోట్లు తన వంతుగా వసూలు కావాల్సి ఉందని తెలిపింది. ఇందులో మూలధన అవసరాలకు రూ.505 కోట్లు, ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కింద రూ.462 కోట్లను జెట్ ఎయిర్వేస్కు అందించినట్టు పేర్కొంది. ఈ దరఖాస్తులో జోక్యం చేసుకునేందుకు తమను అనుమతించాలంటూ నెదర్లాండ్‌కు చెందిన లాజిస్టిక్స్ విక్రయదారులు దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ తిరస్కరించింది. ప్రతీ 15 రోజులకోసారి పరిష్కార పురోగతిపై నివేదికను సమర్పించాలని, తొలి నివేదిక జూలై 5న దాఖలు చేయాలని పరిష్కార నిపుణుడిని ఎన్సీఎల్టీ ఆదేశించింది. అదే రోజు ఈ పిటిషన్‌పై బెంచ్ తదుపరి విచారణ చేయనుంది. మొత్తం 26 బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్ రూ.8,500 కోట్ల మేర బకాయిపడింది. వందలాది విక్రయదారులు, ఉద్యోగులకు రూ.13,000 కోట్లకు పైగా చెల్లింపులు చేయా ల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోవడం తెలిసిందే. -
జెట్ దివాలాపై నేటి నుంచి విచారణ
ముంబై: రుణ సంక్షోభంతో కుప్పకూలిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ దివాలాకు సంబంధించిన పిటిషన్‌పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను కూడా పార్టీలుగా చేర్చాలని జెట్ ఎయిర్వేస్ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్‌కి చెందిన రెండు లాజిస్టిక్స్ వెండింగ్ సంస్థలు కూడా ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. తాము ఇంటర్వెన్షన్ పిటిషన్ వేసేందుకు అనుమతించాలని వెండార్లు కోరారు. జెట్ భారీగా బాకీ పడటంతో దానికి లీజుకిచ్చిన విమానాలను ఈ ఏడాది మార్చిలో అమ్‌స్టర్‌డామ్ ఎయిర్‌పోర్టులో ఈ రెండు సంస్థలు స్వా«ధీనం చేసుకున్నాయి. అయితే, ఈ సంస్థల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. ఏప్రిల్ 17 నుంచి జెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 8,500 కోట్ల రుణాలు రాబట్టుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని 26 బ్యాంకుల కన్సార్షియం.. జెట్ ఎయిర్వేస్పై ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. జెట్ ఎయిర్వేస్ దాదాపు 23,000 ఉద్యోగులకు రూ. 3,000 కోట్లు జీతాలు, ఇతరత్రా విమానాల వెండార్లు, లెస్సర్లకు (లీజుకిచ్చిన సంస్థలు) రూ. 10,000 కోట్ల దాకా బాకీపడింది. మోసర్ బేయర్ ఆస్తుల విక్రయానికి ఆదేశం నిర్దిష్ట గడువులోగా రుణ పరిష్కార ప్రణాళికకు రుణ దాతల నుంచి ఆమోదం పొందడంలో విఫలమైనందున మోసర్ బేయర్ సోలార్ ఆస్తులు విక్రయించాలంటూ ఎన్సీఎల్టీ మరో కేసులో ఆదేశించింది. ఇందులో భాగంగా కంపెనీకి లిక్విడేటర్‌గా అరవింద్ గర్గ్ వ్యవహరిస్తారని సూచించింది. లిక్విడేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కంపెనీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా గర్గ్ చూస్తారని పేర్కొంది. లిక్విడేషన్ ప్రకటన తేదీ నుంచి 75 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని లిక్విడేటర్‌కు ఎన్సీఎల్టీ సూచించింది. 2017 నవంబర్ 14న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిటిషన్‌ను స్వీకరించడంతో మోసర్ బేయర్ సోలార్‌పై దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ ప్రారంభమైంది. సంస్థ లిక్విడేషన్ విలువ రూ. 72.42 కోట్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మోసర్ బేయర్ సోలార్ మాతృ సంస్థ మోసర్ బేయర్ ఇండియా కూడా లిక్విడేషన్ ప్రక్రియ ఎదుర్కొంటోంది. -
జెట్ దివాలాపై నేటి నుంచి విచారణ
ముంబై: రుణ సంక్షోభంతో కుప్పకూలిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ దివాలాకు సంబంధించిన పిటిషన్‌పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను కూడా పార్టీలుగా చేర్చాలని జెట్ ఎయిర్వేస్ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్‌కి చెందిన రెండు లాజిస్టిక్స్ వెండింగ్ సంస్థలు కూడా ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. తాము ఇంటర్వెన్షన్ పిటిషన్ వేసేందుకు అనుమతించాలని వెండార్లు కోరారు. జెట్ భారీగా బాకీ పడటంతో దానికి లీజుకిచ్చిన విమానాలను ఈ ఏడాది మార్చిలో అమ్‌స్టర్‌డామ్ ఎయిర్‌పోర్టులో ఈ రెండు సంస్థలు స్వా«ధీనం చేసుకున్నాయి. అయితే, ఈ సంస్థల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. ఏప్రిల్ 17 నుంచి జెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 8,500 కోట్ల రుణాలు రాబట్టుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని 26 బ్యాంకుల కన్సార్షియం.. జెట్ ఎయిర్వేస్పై ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. జెట్ ఎయిర్వేస్ దాదాపు 23,000 ఉద్యోగులకు రూ. 3,000 కోట్లు జీతాలు, ఇతరత్రా విమానాల వెండార్లు, లెస్సర్లకు (లీజుకిచ్చిన సంస్థలు) రూ. 10,000 కోట్ల దాకా బాకీపడింది. మోసర్ బేయర్ ఆస్తుల విక్రయానికి ఆదేశం నిర్దిష్ట గడువులోగా రుణ పరిష్కార ప్రణాళికకు రుణ దాతల నుంచి ఆమోదం పొందడంలో విఫలమైనందున మోసర్ బేయర్ సోలార్ ఆస్తులు విక్రయించాలంటూ ఎన్సీఎల్టీ మరో కేసులో ఆదేశించింది. ఇందులో భాగంగా కంపెనీకి లిక్విడేటర్‌గా అరవింద్ గర్గ్ వ్యవహరిస్తారని సూచించింది. లిక్విడేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కంపెనీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా గర్గ్ చూస్తారని పేర్కొంది. లిక్విడేషన్ ప్రకటన తేదీ నుంచి 75 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని లిక్విడేటర్‌కు ఎన్సీఎల్టీ సూచించింది. 2017 నవంబర్ 14న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిటిషన్‌ను స్వీకరించడంతో మోసర్ బేయర్ సోలార్‌పై దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ ప్రారంభమైంది. సంస్థ లిక్విడేషన్ విలువ రూ. 72.42 కోట్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మోసర్ బేయర్ సోలార్ మాతృ సంస్థ మోసర్ బేయర్ ఇండియా కూడా లిక్విడేషన్ ప్రక్రియ ఎదుర్కొంటోంది. -
ఎన్సీఎల్టీ ముంగిట జెట్
ముంబై: దాదాపు రూ.8,500 కోట్ల రుణ బకాయిలను రాబట్టుకునే దిశగా ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్పై బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలోని 26 బ్యాంకులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణను ట్రిబ్యునల్ బుధవారానికి వాయిదా వేసింది. రుణాలు, నష్టాల భారం పేరుకుపోవడంతో జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17న కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా కంపెనీని విక్రయించడానికి బ్యాంకులు ప్రయత్నిస్తున్నప్పటికీ... వివిధ కారణాల వల్ల సాధ్యపడటం లేదు. బ్యాంకులకు రూ. 8,500 కోట్లతో పాటు, వందల కొద్దీ వెండార్లకు (విమానాలు లీజుకిచ్చిన సంస్థలు మొదలైనవి) రూ.10,000 కోట్లను జెట్ చెల్లించాల్సి ఉంది. ఇక మార్చి నుంచి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదు. దీంతో 23,000 మంది పైచిలుకు ఉద్యోగులకు రూ.3,000 కోట్ల మేర జీతాల బకాయిలు చెల్లించాల్సి ఉంది. మంగళవారం జెట్ షేరు 41 శాతం క్షీణించి రూ. 40.45 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 53 శాతం క్షీణించి రూ.32.25 ఆల్‌టైం కనిష్ట స్థాయిని కూడా తాకింది. గడిచిన అయిదు ట్రేడింగ్ సెషన్లలో షేర్ల విలువ 73 శాతం పైగా హరించుకుపోయింది. -
జెట్ ఎగరడం ఇక కలే!
ముంబై: ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో మెజారిటీ వాటాలు విక్రయించటంపై బ్యాంకులు చేతులెత్తేశాయి. వాటాల విక్రయానికి బిడ్లను ఆహ్వానించి రెండు నెలల పాటు ఇన్వెస్టర్ కోసం అన్వేషించిన రుణదాతల (బ్యాంకులు) కమిటీ... ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. చివరకు బిడ్డింగ్‌లో మిగిలిన ఏకైక సంస్థకు జెట్‌ను విక్రయించడం ఇష్టం లేక, దివాలా చట్టం (ఐబీసీ) కింద రూ.8,000 కోట్ల రుణాల వసూలు కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు అవి ప్రకటించాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలో 26 సంస్థల రుణదాతల కమిటీ సోమవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘షరతులతో కూడిన ఒకే ఒక్క బిడ్ మాత్రమే రావడంతో ఉన్నత స్థాయి చర్చల అనంతరం జెట్ ఎయిర్వేస్కు దివాలా చట్టం కింద పరిష్కారం కోరాలని నిర్ణయించాం’’ అని ఎస్బీఐ ప్రకటనలో పేర్కొంది. ఆశావహ ఇన్వెస్టర్ ఈ డీల్‌కు కొన్ని రకాల సెబీ మినహాయింపులు కోరడంతో, ఐబీసీ కిందే మెరుగైన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపింది. 25 ఏళ్ల క్రితం మొదలై ఒక దశలో అతిపెద్ద ప్రైవేటు రంగ విమానయాన కంపెనీగా ఎదిగిన జెట్ కార్యకలాపాలు ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. కార్యకలాపాల నిర్వహణకు కనీస నగదు కూడా లేని పరిస్థితుల్లో, నిధుల సాయానికి బ్యాంకులు అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బకాయిలు చెల్లించకపోవడంతో సంస్థ విమానాలను కూడా లీజుదారులు తీసుకెళ్లిపోయారు. 23,000 మంది ఉద్యోగులకు కష్టం! ఎతిహాద్–హిందుజా కూటమి ఆసక్తి వ్యక్తీకరించినప్పటికీ, నిర్మాణాత్మక ప్రతిపాదన ఏదీ సమర్పించలేదని, పైగా భారీ హెయిర్‌కట్ (రుణభారంలో నష్టపోయే మొత్తం) తీసుకోవాలని కోరడంతో బ్యాంకులు ఎన్సీఎల్టీ మార్గాన్ని ఎంచుకున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మాజీ చైర్మన్ నరేష్ గోయల్‌కు వ్యతిరేకంగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం, దర్యాప్తు విభాగాలు మనీల్యాండరింగ్ ఆరోపణలపై విచారణ మొదలుపెట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, సంస్థ పునరుద్ధరణ దిశగా ఇన్ని రోజులు ఆశలతో ఉన్న వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు బ్యాంకుల నిర్ణయం ఫలితంగా అంధకారంగా మారింది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులు సంస్థను వీడగా, ఇప్పటికీ చాలా మంది తిరిగి కార్యకలాపాలు మొదలవుతాయన్న ఆశతో ఉన్నారు. బ్యాంకుల చేతికి వెళ్లినా చీకటే జెట్ రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉండటంతో చైర్మన్ నరేష్ గోయల్‌ను బలవంతంగా బయటకు పంపించిన బ్యాంకులు కంపెనీ నియంత్రణను మార్చి 25న తమ అధీనంలోకి తీసుకున్నాయి. రుణాన్ని ఈక్విటీగా మార్చుకున్నాయి. అయితే, రూ.1,500 కోట్ల మేర ఈక్విటీ మూలధనాన్ని అందిస్తామని హామీ ఇచ్చిన బ్యాంకులు ఆ తర్వాత ముఖం చాటేయడంతో పాటు సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయేందుకు పరోక్షంగా కారణమయ్యాయి. సంస్థలో 24 శాతం వాటా కలిగిన అబుదాబీ సంస్థ ఎతిహాద్ సైతం మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. అప్పుల భారమే ఎక్కువ జెట్ ఎయిర్వేస్కు రుణ భారం, ఇతర బాధ్యతలు కలిపి రూ.36,000 కోట్ల మేర ఉన్నాయి. సంస్థ చేతుల్లోని ఆస్తులు కేవలం హీత్రూ విమానాశ్రయంలో స్లాట్లు, జేపీ మైల్స్ అనే లాయల్టీ కార్యక్రమంలో మైనారిటీ వాటా మాత్రమే. దేశీయ విమానాశ్రయాల్లో జెట్‌కు ఉన్న స్లాట్లలో చాలా వాటిని ఇప్పటికే కేంద్రం ఇతర కంపెనీలకు కేటాయించేసింది. సంస్థ ఖాతాల్లో ఉన్న విమానాలు కేవలం 16. మిగిలిన 123 విమానాలు లీజుకు తీసుకున్నవి కాగా, అవి రిజిస్ట్రేషన్ కోల్పోయాయి. షేరు ఢమాల్... జెట్ ఎయిర్వేస్ షేరు సోమవారం భారీగా నష్టపోయింది. జూన్ 28 నుంచి జెట్ ఎయిర్వేస్ స్టాక్ ట్రేడింగ్‌పై ఆంక్షలు విధిస్తున్నట్టు, ట్రేడ్ టు ట్రేడ్ విభాగంలోకి మారుస్తున్నట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు తీసుకున్న నిర్ణయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. షేరు 18% నష్టపోయి ఎన్ఎస్ఈలో రూ.66.95 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 19.56% పతనమైంది. -
జెట్ ఎయిర్వేస్: మరో షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై : అప్పుల ఊబిలో కూరుకు పోయి కార్యకలాపాలను నిలిపివేసిన ప్రయివేటు రంగవిమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కంపెనీలో అక్రమాలకు పాల్పడినట్లుగా జెట్ ఎయిర్వేస్ వ్యవస్థపాకుడు నరేష్ గోయల్ మీద తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. భారీ పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ ఆయనకు సమన్లు జారీ చేసింది. రూ. 650 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ నరేష్ గోయల్‌ను ప్రశ్నించబోతోందని తాజా మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. పన్నులు ఎగవేసేందుకు నరేష్ గోయల్ దుబాయ్‌లోని దాని గ్రూప్ కంపెనీతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డంతోపాటు, ఇందుకు దుబాయ్ కంపెనీకి కమిషన్ ముట్టినట్టుగా అసెస్మెంట్ వింగ్ దర్యాప్తులో తేలింది. దీంతో దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నరేష్ గోయల్‌ను ఆదేశించింది. త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్న సమయంలో ఈ సర్వే జరిగిందని ఆదాయపు పన్ను అధికారి చెప్పారు. పన్నులు ఎగవేసేందుకు విదేశాలకు నిధులను మళ్లించాలనే ఉద్దేశ్యంతో చేసిన అధిక చెల్లింపులు అనే కోణంలో అసెస్మెంట్ వింగ్ విచారణ అనంతరం, మరింత వివరణ కోరేందుకు ఆయన్ను పిలిపించనున్నట్టు మరో అధికారి అందించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే తాజా పరిణామాలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది. కాగా 2018 సెప్టెంబర్‌లో జెట్ ముంబై కార్యాలయాంలో దాడులు, కొన్నికీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిపై దర్యాప్తు ఫిబ్రవరిలో పూర్తయింది. అయితే ఫిబ్రవరిలో వెలువడిన ఈ నివేదికపై స్పందించిన జెట్‌ఎయిర్‌వేస్ అవకతవకల ఆరోపణలను ఖండించింది. లావాదేవీలన్నీచట్ట ప్రకారం, నియంత్రణ, కార్పొరేట్ పాలన అవసరాలకు లోబడే ఉన్నాయంటూ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జెట్ సమస్యలు పరిష్కారమవుతాయ్!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ సమస్యలు పరిష్కారమవుతాయని పౌర విమానయాన శాఖ కొత్త మంత్రి హర్దీప్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. పౌర విమానయాన రంగానికి సంబంధించి గతంలో కొన్ని తప్పులు చేశామని, ఇప్పుడు వాటిని సరిదిద్దాల్సిన అవసరముందని పేర్కొన్నారు. భారీ రుణాల కారణంగా సంక్షోభంలోకి కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్పై రెండో సారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం నుంచి వెలువడిన తొలి వ్యాఖ్య ఇది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సెమినార్లో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారీగా రుణాలు చేయడం, తీవ్రమైన పోటీతో ఒకప్పుడు ప్రైవేట్ రంగంలో అతి పెద్ద విమానయాన సంస్థగా వెలిగిన జెట్ ఎయిర్వేస్ ఇప్పుడు కార్యకలాపాలు నిలిపేసింది. ఫలితంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా విమాన చార్జీలు భారీగా పెరిగాయి. విమానయాన రంగం గడ్డు పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ శాఖకు కొత్త మంత్రిగా పురి బాధ్యతలు స్వీకరించారు. భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ, ఎయిర్ ఇండియా విక్రయం గత ఏడాది విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సమస్యలను కొత్త మంత్రి ఎలా గట్టెక్కిస్తారో చూడాలి. -
జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభం కారణంగా కార్యకలాపాలు నిలిపివేసిన ప్రయివేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లావాదేవీల నిర్వహణ (ట్రేడింగ్ యాక్టివిటీ)లో ఆంక్షలు విధించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్ణయించినట్లు వెలువడిన వార్తలు నేపథ్యంలో ఇన్వెస్టర్లు జెట్ ఎయిర్ వేస్ షేర్లలో భారీ అమ్మకాలకు దిగారు. దీంతో గురువారం నాటి మార్కెట్లో జెట్ షేరు ఏకంగా 23శాతం పతనమైంది. తద్వారా సరికొత్త కనిష్టానికి చేరింది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 986.03 కోట్లకు పడిపోయింది. బిఎస్ఇలో 15.61 లక్షల షేర్లు చేతులుమారాయి. స్టాక్ గత తొమ్మిది రోజుల్లో 40శాతానికి పైగా పతనమైంది. జెట్ షేర్లను రోజువారీ ట్రేడింగ్నుంచి తీసివేయనున్నామని నేషనల్ స్టాక్ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తెలిపింది. గరిష్టస్థాయిలో ఆటుపోట్లను చవిచూడకుండా నివారించే బాటలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. జెట్ ఎయిర్వేస్ కౌంటర్లో ట్రేడింగ్ యాక్టివిటీపై నియంత్రణలు విధించనున్నట్లు ఎన్ఎస్ఈ ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఈ ఆంక్షలు ఈ నెల 28 నుంచీ అమల్లోకిరానున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా ఈ షేరును ఎఫ్‌అండ్‌వో విభాగం నుంచి తొలగించనున్నారు. ఫలితంగా 100 శాతం మార్జిన్ల చెల్లింపుతోపాటు 5 శాతం ప్రైస్‌బ్యాండ్ అమలు కానుంది. -
జెట్‌లో పెట్టుబడులపై హిందుజా ఆసక్తి
ముంబై: ఆర్థిక సంక్షోభం కారణంగా దాదాపు నెల రోజుల్నించి కార్యకలాపాలు నిలిపివేసిన ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను హిందుజా గ్రూప్ పరిశీలిస్తోంది. మంగళవారం ఈ విషయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఏప్రిల్ 17 నుంచి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జెట్ విక్రయంపై కసరత్తు చేస్తున్నాయి. ఎతిహాద్ గ్రూప్ వంటి సంస్థలు బిడ్లు వేశాయి. ప్రస్తుతం వివిధ విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న జెట్ ఎయిర్వేస్ స్లాట్స్‌ను ఇతర ఎయిర్‌లైన్స్‌కు తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర పౌర విమానయాన శాఖ కేటాయించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు హిందుజా గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హిందుజా గ్రూప్‌నకు ఆటోమోటివ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, విద్యుత్, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో కార్యకలాపాలున్నాయి. గ్రూప్ సంస్థల్లో దాదాపు 1,50,000 మంది పైచిలుకు ఉద్యోగులున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు హిందుజా గ్రూప్ ఆసక్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం జెట్ ఎయిర్వేస్ షేర్లు ఏకంగా 15 శాతం ఎగిశాయి. బీఎస్ఈలో 14.73 శాతం పెరిగి రూ.150.75 వద్ద ముగిశాయి. అటు ఎన్ఎస్ఈలో సుమారు 13 శాతం పెరిగి రూ. 148.40 వద్ద క్లోజయ్యాయి. రూ.135 వద్ద ప్రారంభమైన షేరు ఒక దశలో రూ. 154.80 గరిష్ట స్థాయికి కూడా ఎగిసింది. దీంతో వరుసగా రెండో రోజూ జెట్ షేరు పెరిగినట్లయింది. -
జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. విమాన సర్వీసులను పూర్తి నిలిపివేసిన అనంతరం జెట్ ఎయిర్వేస్ నుంచి వరుసగా కీలక ఉద్యోగులు తప్పుకుంటున్నారు. తాజాగా జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దుబే రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలరీత్యా కంపెనీనుంచి వైదొలగుతున్నట్టు వెల్లడించారు. మంగళవారం కంపెనీ డిప్యూటీ సీఈవో, సిఎఫ్ఓ అమిత్ అగర్వాల్ కంపెనీ నుంచి వైదొలగారు. ఒకవైపు వాటాల కొనుగోలు సంబంధించిన అంశం ఇంకా కొలిక్కి రావడంలేదు. మరోవైపు వరుసగా కీలక ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీకి గుడ్‌బై చెపుతున్నారు. ముఖ్యంగా ఇపుడు సీఈవో రాజీనామా చేయడం కీలక పరిణామం. కాగా ఆగష్టు 8, 2017న జెట్‌కు సీఈవోగా వినయ్ దుబే నియమితులయ్యారు. -
‘జెట్’ కూలిపోయిందా.. కూల్చేశారా?
సాక్షి, బిజినెస్ డెస్క్: విమానయాన రంగంలో 25 ఏళ్లకు పైగా దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ అగ్రగామి సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన జెట్ ఎయిర్వేస్ ఉన్నట్టుండి కుప్పకూలడం వెనుక ఏం జరిగి ఉంటుంది...? ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్నా చితకా ఎయిర్‌లైన్ కంపెనీలు సర్వీసులను చక్కగా నడిపిస్తుంటే, దశాబ్దాల చరిత్ర ఉన్న జెట్ ఎందుకలా రెక్కలు తెగిన విహంగంలా కూలిపోయింది...? కేవలం చమురు ధరల పెరుగుదల, రుణాల భారమే ఈ సంస్థను ముంచేసిందా? లేక కావాలనే ముంచేశారా? సంస్థ ప్రమోటర్ నరేష్‌గోయల్ నిధులను పక్కదారి పట్టించారా? భారీగా రుణాలిచ్చిన బ్యాంకులు జెట్‌ఎయిర్‌వేస్ స్టీరింగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాతే ఎందుకు ఉన్న ఫళంగా జెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి? ప్రీ ప్లాన్ ప్రకారం తీసుకొచ్చిన సంక్షోభమా ఇది? విశ్లేషకులు, విమానయాన పరిశ్రమ వర్గాలు, ఆఖరికి జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులను తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. వీటికి సమాధానాలు ఎవరిస్తారు..? స్వామి సంచలన ట్వీట్ ‘‘ప్రభుత్వం జాగ్రత్త పడాలి. ఇద్దరు మంత్రులు జెట్ ఎయిర్వేస్ను స్పైస్‌జెట్‌కు విక్రయించేందుకు మానిప్యులేట్ చేస్తున్నారు. తెరవెనుక అసలు యజమానులు ఎవరన్నది తర్వాత వెల్లడిస్తాను. ప్రభుత్వం ముందున్న ఆప్షన్ జెట్ ఎయిర్వేస్ను ఎయిర్ ఇండియాతో విలీనం చేయడమే. ఎందుకంటే రెండు వైపులా ఎయిర్‌స్పేస్ విషయంలో ప్రభుత్వానిదే జోక్యం ఉంటుంది’’ అని బీజేపీ ప్రముఖ నేత సుబ్రమణ్యస్వామి గత నెల 21న చేసిన ట్వీట్. అంటే స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ తెరవెనుక ఎవరో ఈ కథ అంతా నడిపిస్తున్నట్టు స్వామి మాటల్లో వ్యక్తమైన సందేహంలా కనిపిస్తోంది. తిరిగి స్వామి బయటపెట్టే వరకూ అసలు కథ ఎవరికీ తెలియదేమో! నిధుల మళ్లింపుపై ఫిర్యాదు ఐసీఐసీఐ బ్యాంకు–వీడియోకాన్ రుణ బంధం వెనుక బ్యాంకు మాజీ చీఫ్ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌కు ప్రయోజన లబ్ధి కలిగిందంటూ ఓ ఫిర్యాదుతో సంచలన దర్యాప్తునకు కారణమైన ప్రజా వేగు అరవింద్ గుప్తా గుర్తుండే ఉంటుంది. ఆ వ్యక్తే జెట్ ఎయిర్వేస్లో నిధుల మళ్లింపుపై దర్యాప్తు సంస్థల తలుపు తట్టారు. జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్లు కంపెనీ పుస్తకాల నుంచి రూ.5,125 కోట్లను దారి మళ్లించినట్టు ఆయన ఆరోపణ. ఈ నిధుల మళ్లింపును కంపెనీ ఆడిటింగ్ కంపెనీ నిరోధించలేకపోయిందంటూ 2018 ఆగస్ట్‌లో అరవింద్ గుప్తా ఫిర్యాదు చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం ఫలితాలను జెట్ ఎయిర్వేస్ సకాలంలో వెల్లడించలేదు. వాయిదా వేసింది. అదే సమయంలో అరవింద్ గుప్తా ఫిర్యాదుతో కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ముంబై విభాగం జెట్‌ఎయిర్‌వేస్ ఖాతాల తనిఖీ చేపట్టింది. కంపెనీల చట్టం నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు, నిధుల మళ్లింపు ప్రయత్నాలను గుర్తించినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ నివేదికను ఆర్వోసీ కార్పొరేట్ శాఖకు ఈ నెల 8నే సమర్పించింది. ఆర్వోసీ గుర్తించిన అంశాల పట్ల కార్పొరేట్ శాఖ సంతృప్తి చెంది, నిధుల మళ్లింపుపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరం అని భావిస్తే తీవ్ర మోసాల దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) విచారణకు ఆదేశించే అవకాశాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేష్ గోయల్‌కు చెందిన కంపెనీలతో జెట్ ఎయిర్వేస్, జెట్‌లైట్ లావాదేవీలు నిర్వహించాయని అరవింద్ గుప్తా ఆరోపణలు. ఈ ఆరోపణల్లోని నిజానిజాలు త్వరలో నిగ్గు తేలాల్సి ఉంది. జెట్ ఆగిపోవడం ఓ స్కామ్: ఆనంద్‌శర్మ జెట్‌ఎయిర్‌వేస్ కూలిపోవడాన్ని స్కామ్‌గా కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్‌శర్మ ఆరోపించారు. ‘‘ఇదో పెద్ద స్కామ్‌గా నాకు అనిపిస్తోంది. ఎన్నికల సమయంలో దీన్ని అమలు చేశారు. దీంతో ఈ సమయంలో దీన్ని ఎవరూ ప్రశ్నించరు’’ అని శర్మ అన్నారు. కేంద్రం కాపాడుతున్న ఇతర వ్యాపారాలతో పోలిస్తే జెట్ రుణ భారం తక్కువేనన్నారు. ఎయిర్‌లైన్స్‌కు కావాల్సిన అత్యవసర నిధులను అందించేందుకు రుణదాతల కమిటీ తిరస్కరించడంపై సందేహాలు వ్యక్తం చేశారు. బ్యాంకుల ఆధ్వర్యంలో మూత 1992లో ఏర్పాటై 1995లో పూర్తి స్థాయి విమానయాన సంస్థగా కార్యకలాపాలు ఆరంభించిన జెట్ ఎయిర్వేస్... 2019 ఏప్రిల్ 17న తన కార్యకలాపాలను నిలిపివేసింది. దీనికంటే ముందు నిధుల సమీకరణకు కంపెనీ దాదాపు తీవ్రంగానే ప్రయత్నించింది. 3 నెలలుగా 20,000 మంది ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేదు. బ్యాంకులకు రూ.8,000 కోట్లకు పైగా రుణ బకాయిలు చెల్లించాల్సి ఉంది. చివరకు కార్యకలాపాలను నిలిపివేయడంతో 20వేల ఉద్యోగులు రోడ్డున పడ్డారు. నరేష్ గోయల్ నిర్వహణలో జెట్ మొత్తం రూ.13,000 కోట్ల మేర నష్టాలను మూటగట్టుకున్నట్టు తెలుస్తోంది. 120 విమానాలతో నిత్యం 600 విమాన సర్వీసులను నడిపిన ఘన చరిత జెట్ ఎయిర్‌వేస్‌ది. చివరికి కార్యకలాపాలు నిలిపివేసే నాటికి సంస్థ వద్దనున్న విమానాలు కేవలం 7. లీజుకిచ్చిన సంస్థలు తమ విమానాలను స్వాధీనం చేసుకున్నాయి. జెట్ ఎయిర్వేస్ స్లాట్లను తాత్కాలికంగా ప్రభుత్వం ఇతర సంస్థలకు కేటాయించేసి చేతులు దులుపుకుందే గానీ సంస్థను కాపాడే యత్నాలు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చిన సంస్థలకు లీడ్‌బ్యాంకర్ ఎస్బీఐ. రుణాలిచ్చిన సంస్థలు తమ రుణాలను జెట్‌లో వాటాలుగా మార్చుకుని మెజారిటీ వాటాదారులుగా అవతరించాయి. ప్రమోటర్ నరేష్ గోయల్‌ను చైర్మన్ పదవి నుంచి తప్పుకునేలా చేశాయి కూడా. జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు తక్షణం రూ.1,500 కోట్లు అవసరం కాగా, వాటిని బ్యాంకులు సమకూరుస్తాయన్న ఆశ చిగురించింది. నిజానికి బ్యాంకులు రూ.1,500 కోట్ల నిధుల సాయానికీ తొలుత ఆసక్తి తెలిపినప్పటికీ... వాటాదారులుగా మారాక ఎందుకో వెనుకడుగు వేశాయి. ఏప్రిల్ 15 నాటి సమావేశంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో నిధులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోలేదు. డిపాజిట్ దారులు, తమ చట్టబద్ధమైన ప్రయోజనాల కోణంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్ణయం తీసుకున్నట్టు నాడు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సెలవిచ్చారు. అయితే, జెట్ నిర్వహణను నియంత్రణలోకి తీసుకున్న బ్యాంకులు, రూ.1,500 కోట్ల ఇచ్చేందుకు ముందుకు రాకుండా, తర్వాత రెండు రోజులకు ఏప్రిల్ 17న సంస్థ మూసివేతకు కారణమయ్యాయి. రోజువారీ కార్యకలాపాలు జరిగేలా చూసి, జెట్‌ను విక్రయానికి పెడితే ఇన్వెస్టర్లు త్వరగా ముందుకు వచ్చేవారేమో. కానీ, విమానాలన్నీ కిందకు దించేసి, రుణదాతలు విక్రయానికి మొగ్గు చూపడం సందేహాలకు తావిచ్చినట్టయింది. షేరు ధర సయ్యాట జెట్‌ఎయిర్‌వేస్ 2018–19 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం ఫలితాలను వాయిదా వేయడం ఈ సంక్షోభానికి ఆరంభంగా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కంపెనీ షేరు ధర తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతూ వచ్చింది. 2018 జనవరి 5న జెట్ ఎయిర్వేస్ షేరు రూ.870 స్థాయిలో ఉంది. 2018 అక్టోబర్ 1 నాటికి రూ.172 స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత టాటాలు జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వచ్చిన వార్తలతో ఈ షేరు ధర ఈ స్థాయి నుంచి నెల రోజుల్లోనే రూ.323 వరకు పెరిగింది. తిరిగి అక్కడి నుంచి తాజాగా రూ.129 స్థాయికి పడిపోయింది. షేరు ఏడాది గరిష్ట, కనిష్ట ధరలు రూ.489, రూ.121. మళ్లీ టేకాఫ్ అవుతుందా...? బ్యాంకులు జెట్ఎయిర్వేస్కు బిడ్లు పిలిచాయి. నాలుగు సంస్థలు బిడ్లు వేశాయి కూడా. వీటిల్లో ఎతిహాద్ కూడా ఉంది. జెట్‌ను తాము టేకోవర్ చేస్తాం, రుణాలన్నీ తీర్చేస్తామంటూ పైలెట్లు, ఇంజినీర్లకు ప్రాతినిధ్యం వహించే రెండు ఉద్యోగ సంఘాలు– ఎస్‌డబ్ల్యూఐపీ, జేఏఎమ్‌ఈవీఏలు ఎస్బీఐని లేఖ ద్వారా కోరాయి. అయినా వారికి అవకాశం ఇవ్వలేదు. తమ నియంత్రణలోకి తీసుకుని రూపాయి కూడా విదిల్చలేదు. కానీ, నిలువునా అమ్మేసి తమ బకాయిలను రాబట్టుకునే పనిపై దృష్టి పెట్టాయి ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతలు. చివరికి ఏ సంస్థకు జెట్‌ను అప్పగిస్తాయో, అందులో ఎవరి ప్రయోజనం నెరవేరుతుందో వేచి చూడాల్సి ఉంది. అలాగే, సుబ్రమణ్యస్వామి ఆరోపణలు, ఇటు జెట్ ఉద్యోగుల ఆరోపణలు, ప్రజావేగు ఫిర్యాదులోని నిజా నిజాలే నిగ్గుతేలాల్సి ఉంది. కింగ్‌ఫిషర్–జెట్... అప్పులే ముంచాయ్ విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్వేస్ పరిణామాలకు పోలిక కనిపిస్తుంది. ఈ రెండూ భారీగా అప్పులు తీసుకుని హారతి కర్పూరంగా మార్చి, తిరిగి చెల్లించలేక చేతులెత్తేసినవే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ షేరు 2008లో రూ.90కు పైగా పలికింది. చివరికి కార్యకలాపాలు మూసేసే నాటికి పడిపోతూ వచ్చి రూపాయి వరకు దిగొచ్చింది. చివరికి డీలిస్ట్ అయింది. నాడు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రుణాలిచ్చిన సంస్థలు ఇప్పుడు దాని ప్రమోటర్ విజయ్‌మాల్యాను వెంటాడుతూ, వేటాడుతున్నాయి. కానీ, కింగ్‌ఫిషర్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ, జెట్ ఎయిర్వేస్లో మాత్రం వాటాదారులుగా మారి ఆ సంస్థను మరెవరికో కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి జెట్ ఎయిర్వేస్ షేరు ఇంత జరిగినా రూ.120 స్థాయిలకు పైనే ఉందంటే జెట్ ఎదో ఒక గట్టి సంస్థ చేతుల్లోకి వెళ్లి, తిరిగి ఎగురుతుందన్న ఆశ ఇన్వెస్టర్లలో ఉండి ఉండొచ్చన్న విశ్లేషణ అనలిస్టుల నుంచి వినిపిస్తోంది. జెట్‌ఎయిర్‌వేస్ విషయంలో బ్యాంకుల తీరును విజయ్‌మాల్యా సైతం ఇటీవల తప్పుబట్టారు. . ఎతిహాద్ కుట్ర...? అప్పుల ఊబిలో కూరుకుపోయి సేవలను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ ఉదంతంలో భారీ కుట్ర చోటుచేసుకుందన్న ఆరోపణ కేవలం సుబ్రమణ్యస్వామి, కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ నుంచే కాదు.. జెట్ ఎయిర్వేస్ పైలట్ల నుంచి కూడా రావడం ఆశ్చర్యకరం. కంపెనీ షేరు ధరను స్టాక్ మార్కెట్లో కుప్పకూల్చడం ద్వారా ఎతిహాద్ జెట్‌లో మరో 25 శాతం వాటాను చేజిక్కించుకోవాలనుకుందని, కంపెనీలో ప్రధాన వాటాదారు అయిన ఎతిహాద్ ఎయిర్వేస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కలిసి ఈ కుట్రకు తెరతీశాయని... దీనిపై దర్యాప్తు జరిపించాలని ప్రధాని నరేంద్ర మోదీని జెట్‌ఎయిర్‌వేస్ పైలట్లు కోరారు. జెట్ ఎయిర్వేస్లో యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్కు 24 శాతం వాటా ఉంది. జెట్ ప్రమోటర్ నరేశ్ గోయల్ తన వాటా షేర్లను తనఖా పెట్టి రూ.1,500 కోట్ల తాజా నిధులను అందించేందుకు సిద్ధపడినా.. ఎస్బీఐ ముందుకు రాలేదని, ఎతిహాద్ కూడా ఈ కష్టకాలంలో కావాలనే సహాయ నిరాకరణకు పాల్పడిందని పైలట్లు పేర్కొన్నారు. జెట్ పతనం వెనుక ఎతిహాద్ పాత్రను దర్యాప్తు చేసి నిగ్గుతేల్చాలని ప్రధానిని అభ్యర్థించారు. కానీ, ప్రభుత్వం మాత్రం దర్యాప్తునకు ఆదేశించలేదు. జెట్‌కు అందరూ రాంరాం! నిన్న సీఎఫ్ఓ.. నేడు సీఈఓ ఔట్ జెట్ ఎయిర్వేస్కు కీలక పదవుల్లోని వారు ఆకస్మికంగా రాజీనామాలు ప్రకటిస్తున్నారు. నిధుల కొరతతో సంస్థ కార్యకలాపాలు మూతబడిన నెల రోజులకు సీఈవో వినయ్ దూబే, కంపెనీ సెక్రటరీ కుల్దీప్ శర్మ జెట్ ఎయిర్వేస్కు గుడ్‌బై చెప్పేశారు. భారతీయ అమెరికన్ అయిన దూబే 21 నెలల పాటు జెట్ ఎయిర్వేస్లో పనిచేశారు. జెట్ ఎయిర్వేస్ డిప్యూటీ సీఈవో, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవుల నుంచి అమిత్ అగర్వాల్ తప్పుకున్న మరుసటి రోజే దూబే నుంచి ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. వ్యక్తిగత కారణాల వల్ల దూబే కంపెనీ సీఈవో పదవికి రాజీనామా చేసినట్టు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. జెట్‌కు పూర్వం డెల్టా ఎయిర్‌లైన్స్, సబ్రే ఐఎన్‌సీ, అమెరికన్ ఎయిర్‌లైన్స్ తదితర విమానయాన సంస్థల్లో దూబే పనిచేశారు. అలాగే, డిప్యూటీ సీఈవో, సీఎఫ్‌వో పదవులకు అమిత్ అగర్వాల్ రాజీనామా చేశారని, ఈ నెల 13 నుంచి అమల్లోకి వచ్చినట్టు జెట్ ఎయిర్వేస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచ్చింది. మరోవైపు చీఫ్‌పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా సైతం రాజీనామా చేసినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను విక్రయించే పనిలో ఉన్న సమయంలో ఉన్నత పదవుల నుంచి వీరు తప్పుకోవడం గమనార్హం. గత నెలలో కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పతి, నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ నసీమ్ జైది, హోల్‌టైమ్ డైరెక్టర్ గౌరంగ్ శెట్టి కూడా రాజీనామా చేయడం తెలిసిందే. -
మరో కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై
సాక్షి, ముంబై: రుణ సంక్షోభంతో చిక్కుకుని ప్రస్తుతం కార్యకలాపాలను నిలిపివేసిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరో కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. తాజాగా జెట్ ఎయిర్వేస్ డిప్యూటీ సీఈవో, సీఎఫ్‌వో అమిత్ అగర్వాల్ కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. మే13 నుంచి అమిత్ అగర్వాల్ రాజీనామాను ఆమోదించినట్టు జెట్ ఎయిర్వేస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అమిత్ అగర్వాల్ 2015, డిసెంబరులో జెట్ ఎయిర్వేస్లో చేరారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా 24 ఏళ్ల అనుభవం ఉంది. జెట్ కంటే ముందు సుజ్లాన ఎనర్జీ, ఎస్సార్ స్టీల్ లాంటి పలు సంస్థల్లో సీఎఫ్‌వోగా పనిచేశారు. గత నెల రోజుల కాలంలో నలుగురు కీలక వ్యక్తులు సంస్థను వీడారు. ఇప్పటికే ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పాతీ, అలాగే మాజీ ఏవియేషన్ సెక్రటరీ, కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నసీం జైదీ రాజీనామా చేశారు. వీరికితోడు ఇటీవల పూర్తి కాలపు డైరెక్టర్ గౌరాంగ్ శెట్టి జెట్ ఎయిర్వేస్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోర్డులో రాబిన్ కామార్క్, అశోక్ చావ్లా, శరద్ మిగిలారు. -
ఎఫ్21 మీరు కొంటే మరో దేశానికి అమ్మం
న్యూఢిల్లీ: ఇతర కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీ దృష్ట్యా.. తాము కొత్తగా తయారు చేసిన ఎఫ్–21 యుద్ధ విమానాల విక్రయానికి సంబంధించి ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ భారత్‌కు ఓ ఆఫర్ ఇచ్చింది. 114 ఎఫ్–21 విమానాల కొనుగోలుకు కనుక భారత్ ఆర్డర్ ఇచ్చిన పక్షంలో.. తమ యుద్ధ విమానాలను మరే ఇతర దేశానికి అమ్మబోమని స్పష్టం చేసింది. ఆయుధాలను తీసుకెళ్లగలిగే సామర్థ్యంతో పాటు అత్యుత్తమమైన ఇంజిన్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ వంటి పలు ప్రత్యేకతలు కలిగిన ఈ విమానాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 60కి పైగా వైమానిక కేంద్రాల నుంచి నడపగలిగేలా డిజైన్ చేసినట్లు కంపెనీ వైఎస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్ చెప్పారు. 18 బిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.1,27,000 కోట్లు) విలువైన 114 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత వైమానిక దళం గత నెలలో సమాచార విజ్ఞప్తి (ఆర్ఎఫ్ఐ) లేదా ప్రాథమిక టెండర్ జారీ చేసింది. -
జెట్‌కు ఈపీఎఫ్‌వో నోటీసులు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్‌ని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిధులు, ఇతరత్రా బకాయీలను జమ చేయనందుకుగానూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) జెట్ ఎయిర్వేస్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మొత్తం బకాయిలపై విచారణ జరపనున్నట్లు, ప్రావిడెంట్ ఫండ్‌లో ఉద్యోగుల వాటాను జమ చేయనందుకు పోలీస్ కేసు పెట్టనున్నట్లు సంస్థ ఎండీకి పంపిన లేఖలో ఈపీఎఫ్‌వో ముంబై ప్రాంతీయ కార్యాలయం అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ దిలీప్ కే రాథోడ్ స్పష్టం చేశారు. లేఖ ప్రకారం 2019 మార్చి నుంచి బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు, బకాయిలు చెల్లించకపోవడంతో జెట్ ఎయిర్వేస్కి అద్దెకిచ్చిన పలు కార్యాలయాలను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఎయిర్‌లైన్ సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలను నగదుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఏఏఐ వర్గాలు తెలిపాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17 నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. జెట్‌కు బిడ్స్ దాఖలు.. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు సంబంధించి ఎతిహాద్ ఎయిర్‌వేస్‌తో పాటు మరికొన్ని సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు ఎస్బీఐ క్యాప్స్ వెల్లడించింది. సీల్డ్ కవర్లో వచ్చిన బిడ్లను పరిశీలించేందుకు రుణదాతలకు సమర్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. జెట్‌లో 31.2–75 శాతం దాకా వాటాల విక్రయానికి బ్యాంకుల కన్సార్షియం బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అర్హత పొందిన సంస్థలు ఆర్థిక బిడ్లు దాఖలు చేయడానికి మే 10 (శుక్రవారం) ఆఖరు తేదీ. దీనికి అనుగుణంగా ఎతిహాద్ తదితర సంస్థల నుంచి బిడ్స్ వచ్చినట్లు బిడ్డింగ్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్బీఐ క్యాప్స్ పేర్కొంది. బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్ దాదాపు రూ. 8,000 కోట్లు బాకీపడింది. ప్రస్తుతం సంస్థలో బ్యాంకులకు 51 శాతం పైగా వాటాలు ఉన్నాయి. షేరు 3 శాతం అప్..: జెట్ కొనుగోలు కోసం బిడ్స్ వచ్చాయన్న వార్తలతో షేరు శుక్రవారం 3 శాతం పెరిగింది. రూ. 151.80 వద్ద క్లోజయ్యింది. -
జెట్ ఎయిర్వేస్కు భారీ ఊరట
సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు భారీ ఊరట లభించింది. ఇప్పటికే సంస్థలో 25శాతం వాటా వున్న ఎథిహాద్ఎ యిర్‌వేస్ , జెట్‌లో వాటాల కొనుగోలుకు బైండింగ్ బిడ్ దాఖలు చేసింది. దీనిపై (టిపిజి కాపిటల్, ఇండిగో పార్టనర్స్, ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)) మొత్తం మూడు బిడ్లు దాఖలు కాగా ఎథిహాడ్‌ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్లోవాటా కొనుగోలుకు సంబంధించి బిడ్లను సమర్పించేందుకు గడువు మే 10 వ తేదీ సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పరిణామంపై మార్కెట్ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. దాదాపు మరో 6 వారాల్లో జెట్ విమానాలు మళ్లీ ఎగిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది ఇలా వుంటే జెట్ ఎయిర్వేస్ మూతతో రోడ్డున పడ్డ ఉద్యోగుల బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసారు. తమకు వేతనాలు తక్కువైనా పర్వాలేదు కానీ జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం మే 23 తరువాత ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు కంపెనీ ఉద్యోగులు ప్రధాన మంత్రి కలిసి సంస్థను కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకూ జెట్ ఎయిర్వేస్ కోసం వాటాల విక్రయ ప్రక్రియను పర్యవేక్షించే అధికారమున్న ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు రెండు బిడ్లు వచ్చాయని ఎస్బీఐ ఛైర్మన్ రజ్నీష్ కుమార్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్పై ఎస్ఎఫ్ఐవో దర్యాప్తు?
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్లో నిధుల మళ్లింపు, పెట్టుబడుల మాఫీ వంటి చర్యలపై తీవ్ర మోసాలకు సంబంధించి దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) విచారణకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ ఖాతాలను ప్రాథమికంగా పరిశీలించిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ముంబై విభాగం... కంపెనీల చట్టం నిబంధనలు ఉల్లంఘించినట్టు, లెక్కల్లోని రాని పెట్టుబడులను గుర్తించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ కేసును ఎస్ఎఫ్ఐవో దర్యాప్తునకు నివేదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. ఆర్వోసీ ముంబై విభాగం జెట్ ఎయిర్వేస్ ఖాతాల తనిఖీకి సంబంధించి ఇప్పటికే కార్పొరేట్ శాఖకు నివేదిక కూడా సమర్పించింది. జెట్ ఎయిర్వేస్ పలు సబ్సిడరీలకు సంబంధించి మాఫీ చేసిన పెట్టుబడులపై ఎస్ఎఫ్ఐవో దృష్టి సారించనుంది. ఈ నిధులు ఎక్కడికి చేరాయన్నదీ ఆరా తీయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. అప్పటి వరకు మంచి లాభాలు ప్రకటించి, ఉన్నట్టుండి 2018లో నష్టాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందన్న అంశాన్ని గుర్తించేందుకు కంపెనీ యాజమాన్యాన్ని సైతం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. అరవింద్ గుప్తా అనే ప్రజా వేగు ఇచ్చిన ఫిర్యాదులో... జెట్ ప్రమోటర్లు రూ.5,125 కోట్లను కంపెనీ ఖాతాల నుంచి కొల్లగొట్టే ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నారు. ఆడిట్ కమిటీ సైతం నిధుల మళ్లింపును నిరోధించలేకపోయిందన్నారు. జెట్ ఎయిర్వేస్, జెట్‌లైట్ బ్రాండ్లు ప్రమోటర్లకు చెందిన కంపెనీలతో లావాదేవీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే ఆర్వోసీ ముంబై విభాగం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయగా, తదుపరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ఎస్ఎఫ్ఐవో రంగంలోకి దిగనుంది. ఐసీఐసీఐ–వీడియోకాన్ రుణాల కేసులోనూ అక్రమాలను బయటపెట్టింది అరవింద్ గుప్తాయే కావడం గమనార్హం. వేలానికి జెట్ ఎయిర్వేస్ కార్యాలయం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఉన్న జెట్ ఎయిర్వేస్ కార్యాలయాన్ని వేలం వేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. దీనికి రూ. 245 కోట్ల రిజర్వు ధర నిర్ణయించినట్లు, మే 15న ఈ–వేలం నిర్వహించనున్నట్లు బహిరంగ ప్రకటనలో వెల్లడించింది. 52,775 చ.అ. విస్తీర్ణం ఉన్న ఈ కార్యాలయం.. జెట్ ఎయిర్వేస్ గోద్రెజ్ బీకేసీ భవంతిలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీకి జెట్ ఎయిర్వేస్ రూ. 414 80 కోట్ల మేర రుణాలు బాకీపడింది. ఇప్పటికే జెట్ యాజమాన్య బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్న రుణదాతలు.. కంపెనీలో వాటాల విక్రయానికి బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్నర్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) సంస్థలు వాటాల కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బిడ్డర్ల పూర్తి వివరాలు శుక్రవారం వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. -
జెట్ ఎయిర్వేస్లో మూడవ వికెట్ డౌన్
సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకుని కార్యకలాపాలను మూసివేసిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థ పూర్తి కాలపు డైరెక్టర్ గౌరాంగ్ శెట్టి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా జెట్ ఎయిర్వేస్ బోర్డు, సంస్థనుంచి వైదొలగుతున్నట్టు గురువారం ప్రకటించారు. ఏప్రిల్ 23 నుంచి అమలులోకి వస్తుందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా గత నెల రోజుల కాలంలో ముగ్గురు కీలక వ్యక్తులు సంస్థను వీడారు. ప్రస్తుతం బోర్డులో రాబిన్ కామార్క్, అశోక్ చావ్లా, శరద్ మిగిలారు. ఇప్పటికే ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పాతీ, అలాగే మాజీ ఏవియేషన్ సెక్రటరీ, కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నసీం జైదీ జెట్ ఎయిర్వేస్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు జెట్ ఎయిర్వేస్కు దర్యాప్తు సంస్థల రూపంలో మరో ప్రమాదం ముంచు కొస్తోంది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ జెట్ లో నిధుల మళ్లింపుపై దర్యాప్తును ప్రారంభించనుందని సమాచారం. -
మంచిరోజులు వస్తాయంటున్న జెట్ ఫౌండర్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో మూసివేత అంచుకు చేరిన జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసే బిడ్డర్ మరికొన్ని రోజుల్లో ముందుకొస్తారని జెట్ ఎయిర్వేస్ వ్యవస్ధాపకుడు నరేష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. బిడ్డింగ్‌కు తుదిగడువు ఈనెల 10న ముగుస్తుండగా వచ్చే వారంలోనే బిడ్డర్‌ను బ్యాంకులు ఖరారు చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జెట్ ఎయిర్వేస్ 26వ వార్షికోత్సవమైన మే 5 (ఆదివారం) తన జీవితంలో అత్యంత విచారకరమైన రోజని ఆయన సంస్థ ఉద్యోగులు రాసిన లేఖలో పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా మే 5 సంస్థ ఉద్యోగుల్లో ప్రత్యేక స్ధానం ఏర్పరచుకుందని, అయితే ఈ ఏడాది మాత్రం అది అత్యంత విచారకరమైన రోజుగా గడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 1993, ఏప్రిల్ 18న తాము ముంబైలో తొలి విమానాన్ని అందుకోగా, ఈ ఏడాది ఏప్రిల్ 18న తాము అమృత్సర్ నుంచి ముంబైకి చివరి విమానం నడపడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. జెట్ ఎయిర్వేస్ను కాపాడేందుకు తాను తన భార్య నీతా చివరినిమిషం వరకూ ప్రయత్నించామని, మార్చి 25న బోర్డు నుంచి వైదొలగడంతో పాటు తన కంపెనీల్లో ఒక కంపెనీ నుంచి రూ 250 కోట్లు సమకూర్చానని, ఎయిర్‌లైన్‌లో తన షేర్లను తనఖా పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా జెట్ ఎయిర్వేస్ను దక్కించుకునేందుకు ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్టనర్స్, ఎన్ఐఐఎఫ్ ఆసక్తి కనబరుస్తున్నాయి. -
జెట్ క్రాష్‌లో ఎతిహాద్ కుట్ర!
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయి సేవలను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ ఉదంతంలో భారీ కుట్ర చోటుచేసుకుందా? తాజాగా జెట్ పైలట్ల ఆరోపణలతో ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగుతోంది. కంపెనీలో ప్రధాన వాటాదారు అయిన ఎతిహాద్ ఎయిర్వేస్, ఎస్బీఐ కలిసి ఈ కుట్రకు తెరతీసాయని... దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని జెట్ ఎయిర్వేస్ పైలట్లు కోరారు. కంపెనీ షేరు ధరను స్టాక్ మార్కెట్లో కుప్పకూల్చడం ద్వారా ఎతిహాద్ జెట్‌లో మరో 25 శాతం వాటాను చేజిక్కించుకోవాలనుకుందని, అందుకే ఈ కుట్రకు తెరతీశారని పైలట్లు ఆరోపించారు. తద్వారా కంపెనీని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకోవాలనేది ఆ కంపెనీ వ్యూహమన్నారు. జెట్ ఎయిర్వేస్లో యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్కు ప్రస్తుతం 24 శాతం వాటా ఉంది. రోజువారీ కార్యకలాపాలకు కూడా నిధులు లేకపోవడంతో జెట్ సేవలను ఇటీవలే తాత్కాలికంగా నిలిపివేశారు. జెట్ ప్రమోటర్ నరేశ్ గోయల్ తన వాటా షేర్లను తనఖా పెట్టి రూ.1,500 కోట్ల తాజా నిధులను అందించేందుకు సిద్ధపడినా.. ఎస్బీఐ ముందుకు రాలేదని, ఎతిహాద్ కూడా ఈ కష్టకాలంలో కావాలనే సహాయ నిరాకరణకు పాల్పడిందని పైలట్లు పేర్కొన్నారు. జెట్ పతనం వెనుక ఎతిహాద్ పాత్రను దర్యాప్తు చేసి నిగ్గుతేల్చాలని ప్రధానిని అభ్యర్థించారు.గురువారం బీఎస్ఈలో మరో 20 శాతం మేర దిగజారి రూ.122కు పడిపోయింది. చివర్లో కాస్త కోలుకుని 12% నష్టంతో రూ.135 వద్ద ముగిసింది. -
జెట్ ఎయిర్వేస్కు హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : రుణ సంక్షోభంలో పడిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మరోసారి ఇబ్బందుల్లో చిక్కుకుంది. కాన్సిల్ చేసిన విమాన టికెట్ల డబ్బులను తిరిగి వినియోగదారులకు చెల్లించే అంశంపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై జెట్ ఎయిర్వేస్ స్పందించాలని కోరింది. అలాగే ఈ అంశంపై అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ)ను ఆదేశించింది. ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసులను నిలిపివేసి, ప్రయాణికులను సంక్షోభంలోకి నెట్టి వేసిందనంటూ సామాజిక కార్యకర్త బిజోన్ కుమార్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, జస్టిస్ ఎ.బి. భంభాని ఆధ్వర్యంలోని హైకోర్టు బెంచ్ బుధవారం ఈ నోటీసులిచ్చింది. ఈ వేసవి సెలవుల తర్వాత దీనిపై వాదనలను వింటామని చెప్పిన కోర్టు తదుపరి విచారణను జులై 16కు వాయిదా వేసింది. కాగా జెట్ ఎయిర్వేస్ రుణ సమీకరణ అంశం ఒక కొలిక్కి రాకపోవడంతో సర్వీసులను ఆకస్మికంగా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ చెల్లించాల్సిన రీఫండ్ మొత్తం సుమారు 360 కోట్ల రూపాయలకు పై మాటే. -
వైద్య బీమా ప్రీమియానికి డబ్బుల్లేవు
న్యూఢిల్లీ: ఉద్యోగుల గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ ప్రీమియం చెల్లింపునకు కంపెనీ వద్ద డబ్బుల్లేవని జెట్ఎయిర్ వేస్ తన ఉద్యోగులకు స్పష్టం చేసింది. మంగళవారంతో కంపెనీ ఉద్యోగులకు సంబంధించిన గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ రెన్యువల్ గడువు తీరిపోయింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏప్రిల్ 17 నుంచి సంస్థ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ‘‘రుణదాతలు లేదా ఇతర మార్గాల నుంచి అత్యవసరంగా నిధులు అందే పరిస్థితి సమీపంలో లేదు. దీంతో గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ ప్రీమియం చెల్లింపునకు అవసరమైన నిధులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లో కంపెనీ ఉంది’’ అని జెట్ ఎయిర్వేస్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా సమాచారం ఇచ్చారు. -
గుడ్ న్యూస్ చెప్పిన విస్తారా
దేశీయ విమానయాన సంస్థ విస్తారా గుడ్ న్యూస్ చెప్పింది. వందమందికి పైగా పైలట్లను, 400 మందికి పైగా క్యాబిన్ ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించినట్టు సమాచారం. ఈనియామకాల్లో ముఖ్యంగా రోడ్డున పడ్డ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుందట. తద్వారా అప్పుల సంక్షోభంలో చిక్కుకుని, కార్యకలాపాలను నిలిపివేసిన దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు భారీ ఊరటనివ్వనుంది. అలాగే విస్తారా నిబంధనలు, స్టాండర్డ్స్‌కు అనుగుణంగా వీరికి (జెట్ ఎయిర్వేస్కు చెందిన పైలట్లు, ఇంజనీర్లు, ఇతర సిబ్బందికి) సంబంధిత విక్షణను కూడా ఇవ్వనుందని ఇండస్ట్రీకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. అంతేకాదు జెట్ ఎయిర్వేస్కు చెందిన 737 బోయింగ్ విమానాలను కూడా విస్తారా తన ఖాతాలో చేర్చుకోనుంది. త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులను కూడా ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ నియమకాలని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై విస్తారా అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేస్తాం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతుండగా, తాజాగా ఆ కంపెనీ ఉద్యోగ సంఘాలు కంపెనీని నడిపించడానికి ముందుకు వచ్చాయి. పైలెట్లు, ఇంజనీర్లకు ప్రాతినిధ్యం వహించే రెండు ఉద్యోగ సంఘాలు– ఎస్‌డబ్ల్యూఐపీ, జేఏఎమ్‌ఈవీఏలు ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్‌కు ఒక లేఖ రాశాయి. రూ.7,000 కోట్ల మేర నిధులు సమీకరించగలమని, జెట్‌ను టేకోవర్ చేస్తామని ఆ లేఖలో ఆ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఎస్‌డబ్ల్యూఐపీ(ద సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్)లో 800 మంది, జేఏఎమ్ఈవీఏ(జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్)లో 500 మంది వరకూ సభ్యులున్నారు. కాగా జెట్ టేకోవర్‌కు సంబంధించిన బిడ్లు దాఖలు చేసే గడువు తేదీ దాటిపోయింది. టేకోవర్‌కు అర్హత సాధించే కంపెనీల తుది జాబితా వచ్చే నెల 10న వెల్లడి కావచ్చు.