మనీలాండరింగ్ కేసులో వేలకోట్ల మోసానికి పాల్పడ్డ జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు 'నరేష్ గోయల్' గత ఏడాది సెప్టెంబర్ 1న అరెస్ట్ అయ్యారు. అయితే క్యాన్సర్ భారిన పడి.. దాని చికిత్స కోసం ఇటీవల మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టులో గురువారం పిటీషన్ దాఖలు చేశారు.
మధ్యంతర బెయిల్ కోసం నరేష్ గోయల్ అభ్యర్థనను కోర్టు పరిశీలిస్తోంది. ఆరోగ్య పరిస్థితులను పరిశీలించడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కోర్టు ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసి.. సంబంధిత వివరాలను ఈ నెల 20లోపు సమర్పించాలని ఆదేశించింది.
నరేష్ గోయల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రిపోర్ట్ అందించిన తరువాత కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే ఈ తీర్పు ఎలా ఉంటుందనేది త్వరలోనే తెలుస్తుంది.
నరేష్ గోయల్ గత జనవరిలో కోర్టుకు హాజరైన తనకు బ్రతకాలనిగానీ, భవిష్యత్తు మీద ఎలాంటి ఆశ లేదని, జైల్లోనే చనిపోవాలనుకున్న ప్రతిసారీ విధి కాపాడుతోంది, ఇలాంటి జీవితం భరించడం కంటే చనిపోవడం మేలని తనకు ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించవద్దని కన్నీరు పెట్టుకున్నారు.
ఒకప్పుడు ఇండియాలోనే టాప్ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా ఎదిగిన జెట్ ఎయిర్‌వేస్ అధినేత నరేష్ గోయల్ ప్రస్తుతం దుర్భర జీవితం గడుపుతున్నారు. 1990 నుంచి 2000 వరకు భారతీయ వైమానిక రంగంలో ఓ మెరుపు మెరిసిన సంస్థ ఈ రోజు అధో పాతాళానికి పడిపోయింది. అయితే ఈ నెల 20న నరేష్ గోయల్ బెయిల్ పొందుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్‌లో యూజర్ చాట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment