Naresh Goyal
-
జెట్ ఎయిర్వేస్ కథ కంచికి..
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీని లిక్విడేట్ చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పరిష్కార ప్రణాళిక నిబంధనలను పాటించనందుకు గాను జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) ఇన్వెస్ట్ చేసిన రూ. 200 కోట్ల మొత్తాన్ని జప్తు చేయాలని సూచించింది. ఇక రూ. 150 కోట్ల పర్ఫార్మెన్స్ గ్యారంటీని క్లెయిమ్ చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియానికి అనుమతినిచ్చింది. రాజ్యాంగంలోని 142 ఆరి్టకల్ కింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తాజా పరిణామాలతో పాతికేళ్ల పైగా సాగిన జెట్ ఎయిర్వేస్ ప్రస్థానం ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్సీఎల్ఏటీకి అక్షింతలు.. జేకేసీ సమర్పించిన పనితీరు ఆధారిత బ్యాంక్ గ్యారంటీని (పీబీజీ) పాక్షిక చెల్లింపు కింద సర్దుబాటు చేసేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించడాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. దివాలా కోడ్ (ఐబీసీ) సూత్రాలకు విరుద్ధంగా పేమెంట్ నిబంధనలను పూర్తిగా పాటించకుండానే ముందుకెళ్లేందుకు జేకేసీకి వెసులుబాటునిచ్చినట్లయిందని వ్యా ఖ్యానించింది.జెట్ ఎయిర్వేస్ పరిష్కార ప్రణాళిక ఆమోదం పొంది అయిదేళ్లు గడిచినా కూడా కనీస పురోగతి కూడా లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దివాలా కేసుల విషయంలో ఈ తీర్పు ఓ ’కనువిప్పు’లాంటిదని, ఆర్థికాంశాలకు సంబంధించి ఇచ్చిన హామీలను సకాలంలో తీర్చాల్సిన అవసరాన్ని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తాయని పేర్కొంది. 1992లో ప్రారంభం.. ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు సేల్స్ ఏజంటుగా వ్యవహరించిన నరేశ్ గోయల్ 1992లో జెట్ ఎయిర్వేస్ను ప్రారంభించారు. తొలుత ముంబై–అహ్మదాబాద్ మధ్య ఎయిర్ ట్యాక్సీ సర్వీసుగా కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఒక దశలో జెట్ ఎయిర్వేస్కి 120 పైగా విమానాలు ఉండేవి. ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధం1,300 మంది పైలట్లు, 20,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండేవారు. అయితే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో 2019లో కంపెనీ తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసింది. అప్పటికి జెట్ ఎయిర్వేస్ వివిధ బ్యాంకులకు రూ. 8,500 కోట్ల రుణాలతో పాటు పలువురు వెండార్లు, ప్యాసింజర్లకు ఇవ్వాల్సిన రీఫండ్లు, ఉద్యోగుల జీతాలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. దీంతో 2019 జూన్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) జెట్ ఎయిర్వేస్పై దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2021లో కంపెనీని జేకేసీ దక్కించుకుంది. 2024 నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభించనున్నట్లు కూడా జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. అయితే, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని జేకేసీ సకాలంలో చెల్లించకపోవడంతో వివాదం చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. గురువారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేరు ధర 5 శాతం లోయర్ సర్క్యూట్‌తో 34.04 వద్ద క్లోజయ్యింది. -
క్యాన్సర్‌తో నరేష్ గోయల్ భార్య కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ క్యాన్సర్‌తో పోరాడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆమె 2015 నుంచి సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.అనితా గోయల్ కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా గురువారం ఉదయం ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనిత 1979లో మార్కెటింగ్ అనలిస్ట్‌గా కంపెనీలో చేరారు. ఆమె మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్‌గా ఎదిగిన తర్వాత నరేష్ గోయల్‌తో పరిచయం ఏర్పడింది. వారు కలిసిన తొమ్మిదేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.మనీలాండరింగ్ కేసులో 2023లో జైలుకెళ్లిన ఆమె భర్త నరేష్‌గోయల్‌కు వైద్యకారణాల వల్ల బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ ఇచ్చింది. భర్త జైల్లోనుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే భార్య మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది. -
నరేష్ గోయెల్‌కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయెల్‌కు ముంబయి హైకోర్టు రెండు నెలలపాటు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆయన భౌతిక, మానసిక ఆరోగ్యం బాగోలేదని గోయెల్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2023 సెప్టెంబరులో తనను అరెస్టు చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్న సమయంలో అనుమతి లేకుండా ముంబయిని విడిచి వెళ్లకూడదని, హామీ కింద రూ.లక్ష జమ చేయాలని ఆదేశించింది. దాంతోపాటు ఆయన పాస్‌పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని తెలిపింది.నరేశ్ గోయెల్ కొన్నిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఆ చికిత్స నిమిత్తం పలుమార్లు బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. జైలులోనుంచి బయటకు వెళ్లి సాక్ష్యాలను మారుస్తారని బెయిల్ ఇవ్వలేదని సమాచారం. మానవతా దృక్ఫథంతో తనకు బెయిలు మంజూరు చేయాలని గోయెల్ విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. ఆసుపత్రిలో గోయెల్ చికిత్స గడువును పొడిగిస్తే ఈడీకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపడంతో బెయిల్ మంజూరు చేసినట్లు తెలసింది.ఇదీ చదవండి: ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్..! కారణం..జెట్ ఎయిర్వేస్ అభివృద్ధి కోసం కెనరా బ్యాంకు ద్వారా గతంలో దాదాపు రూ.530 కోట్లు అప్పు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని సంస్థ వృద్ధికికాకుండా వ్యక్తిగత అవసరాలకు, ఇతరవాటికి వినియోగించారని తేలడంతో గోయెల్‌తోపాటు ఆయన భార్యను అరెస్టు చేశారు. అయితే తన భార్య ఆరోగ్యంరీత్యా బెయిల్ ఇచ్చారు. -
కష్టాలన్నీ ఈ అపరకుబేరుడికే..ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు!
ప్రముఖ జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాల రిత్యా మరో ఆరు నెలల పాటు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ముంబైకి చెందిన జెజె హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్ ఆధారంగా తన శరీరంలో క్యాన్సర్ కారకమయ్యే మాలిగ్నెన్సీ అనే కణతి పెరిగిపోతుందని, వైద్యం కోసం మధ్యంతర బెయిల్ కోరినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గోయల్ తరపు న్యాయవాది అబద్ పోండా సైతం మెడికల్ రిపోర్టులను కోర్టుకి అందజేశారు. గోయల్ అనారోగ్యానికి చికిత్స తీసుకునేందుకు జైలులో సరైన వసతులు లేవు. ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందే హక్కు ఉందని అన్నారు. కీమోథెరపీ తర్వాత కోలుకోవడానికి వైద్య చికిత్స, పరిశుభ్రమైన వాతావరణం అవసరం కాబట్టే గోయల్‌కు ఆరు నెలల మెడికల్ బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు. తన క్లయింట్ చికిత్స పొందిన తర్వాత, పరిశుభ్రత సమస్యలు ఉంటాయని, ఫలితంగా అతను ఇతర ఖైదీలతో కలిసి జీవించలేరని పోండా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పోండా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు టాటా మెమోరియల్ హాస్పిటల్లో చికిత్స పొందవచ్చని, పోలీసు ఎస్కార్ట్ సౌకర్యాన్ని పొందవచ్చని తెలిపింది. కాగా, ఈ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కుటుంబసభ్యులకు సైతం మోసం-అవినీతి ఆరోపణలు. వేలాది మందిని రోడ్డున పడేశారన్న అపఖ్యాతి. దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు. కుటుంబానికి దూరమై జైలులో దుర్భర జీవితం. చచ్చిపోతా.. అనుమతించండంటూ కోర్టుకు విజ్ఞప్తులు. ఇదీ.. జెట్ ఎయిర్వేస్ అధిపతి నరేశ్ గోయల్ దుస్థితి. నరేష్ గోయల్ తో పాటు ఆయన భార్యకు క్యాన్సర్, కుమార్తెకు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ ఇద్దరి బాగోగులు చూసుకునేందుకు ఎవరూ లేక, జైలు జీవితం అనుభవించ లేక దయచేసి జైల్లోనే చచ్చిపోయేందుకు నాకు అనుమతివ్వండి అంటూ కొద్దిరోజుల క్రితం కోర్టును ప్రాధేయపడ్డారు. ఇప్పుడు నరేష్ సైతం క్యాన్సర్ భారిన పడడం వైద్యం నిమిత్తం బెయిల్ మంజూరు చేయడంపై ఆయన ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. జైలులో ఆయన దుర్బర జీవితం గురించి తెసుకున్న వారు సైతం నరేష్ గోయల్ కష్టం... పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నారు. రూ.538 కోట్ల మోసం కేసులో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్‌లో రూ.538 కోట్ల మోసానికి పాల్పడ్డారని నరేశ్ గోయల్, ఆయన భార్య అనితతోసహా ఇతర జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగానే మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు దాఖలు చేసింది. బ్యాంక్ రుణ నిధులను మళ్లించారని, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించింది. ఈ క్రమంలోనే గత ఏడాది సెప్టెంబర్ 1న గోయల్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
క్యాన్సర్ బారిన పడ్డ నరేష్ గోయల్! - కోర్టు కనికరిస్తుందా..
మనీలాండరింగ్ కేసులో వేలకోట్ల మోసానికి పాల్పడ్డ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు 'నరేష్ గోయల్' గత ఏడాది సెప్టెంబర్ 1న అరెస్ట్ అయ్యారు. అయితే క్యాన్సర్ భారిన పడి.. దాని చికిత్స కోసం ఇటీవల మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టులో గురువారం పిటీషన్ దాఖలు చేశారు. మధ్యంతర బెయిల్ కోసం నరేష్ గోయల్ అభ్యర్థనను కోర్టు పరిశీలిస్తోంది. ఆరోగ్య పరిస్థితులను పరిశీలించడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కోర్టు ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసి.. సంబంధిత వివరాలను ఈ నెల 20లోపు సమర్పించాలని ఆదేశించింది. నరేష్ గోయల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రిపోర్ట్ అందించిన తరువాత కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే ఈ తీర్పు ఎలా ఉంటుందనేది త్వరలోనే తెలుస్తుంది. నరేష్ గోయల్ గత జనవరిలో కోర్టుకు హాజరైన తనకు బ్రతకాలనిగానీ, భవిష్యత్తు మీద ఎలాంటి ఆశ లేదని, జైల్లోనే చనిపోవాలనుకున్న ప్రతిసారీ విధి కాపాడుతోంది, ఇలాంటి జీవితం భరించడం కంటే చనిపోవడం మేలని తనకు ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించవద్దని కన్నీరు పెట్టుకున్నారు. ఒకప్పుడు ఇండియాలోనే టాప్ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ అధినేత నరేష్ గోయల్ ప్రస్తుతం దుర్భర జీవితం గడుపుతున్నారు. 1990 నుంచి 2000 వరకు భారతీయ వైమానిక రంగంలో ఓ మెరుపు మెరిసిన సంస్థ ఈ రోజు అధో పాతాళానికి పడిపోయింది. అయితే ఈ నెల 20న నరేష్ గోయల్ బెయిల్ పొందుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్‌లో యూజర్ చాట్ వైరల్ -
గుర్తుపట్టారా? ఒకప్పుడు ‘బాగా రిచ్’.. ఇప్పుడు షార్ప్‌షూటర్లు మధ్య జైలు జీవితం!
ఓ వ్యక్తి ఫోటో ప్రస్తుతం అటు వ్యాపార ప్రపంచంలో ఇటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెల్లని గడ్డం.. సాదాసీదా బట్టలు. కళ్లల్లో అన్నీ కోల్పోయామనే బాధ, ఆ చూపులో తప్పు చేశాననే పశ్చాత్తాపం స్పష్టంగా కనపడుతుంది. ఒకప్పుడు విమానయాన రంగంలో రారాజులా వెలిగిన ఓ బడా వ్యాపారవేత్త. వందల్లో విమానాలు, వేల కోట్లల్లో ఆస్తులు. పిలిస్తే పలికే మంది మార్బలం. ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు. ఒక్క చిటికేస్తే ఆయన ఏం కోరుకున్నా క్షణాల్లో జరిగే పవర్స్. కానీ కాలం కలిసి రాకపోతే అది కొట్టే దెబ్బలకు ఎవరూ అతీతులు కారు. అలా కాలం ఈడ్చి కొట్టిన దెబ్బకి ఇప్పడు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. రూ.538.62 కోట్ల రుణాల ఎగవేతకు పాల్పడి కరడు గట్టిన నేరస్థులు, షార్ప్‌షూటర్లు, గూండాలతో కలిసి జైలు జీవితం అనుభవిస్తున్నారు. కడవరకు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తనకే తెలియని దిక్కుతోచని స్థితిలో కోర్టును చావును ప్రసాదించమని కోరారు. సమాజంలో బతకలేక.. జైలులో చనిపోయేందుకు అనుమతి అడిగారు. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎంతటి శత్రువుకైనా తలెత్తకూడదని కోరుకుంటూ నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆయనను గుర్తు పట్టారా? ఇంతకీ ఆఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? బ్యాంకు రుణాల ఎగవేత కేసులో జైలు పాలైన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ది. నాలుగు నెలలుగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఈయన ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో జాతీయ మీడియా ఆయనను ఫోటోలు తీసింది. ఇక జనవరి 26న ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల సూచనల మేరకు తనని ప్రైవేట్ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అమనుమతి కావాలని పిటిషన్లో కోరారు. ఎస్కార్ట్‌తో ప్రైవేట్ ఆస్పత్రికి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎంజే దేశ్‌పాండే..‘నరేష్ గోయల్ ఆరోగ్య పరిస్థితిని ఇప్పటికే (చివరి విచారణలో) గుర్తించాము. ఎవరి సహాయం లేకుండా తనంతట తానుగా నిలబడలేకపోతున్నారు. కాబట్టి అతని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఎస్కార్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్ ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారను కాబట్టి ఎస్కార్ట్ కోసం అయ్యే ఖర్చును గోయల్ చెల్లిస్తారని తెలిపారు. -
ఒకప్పుడు కింగ్ మేకర్..ఇప్పుడు బతుకు భారమై..జైల్లో జెట్ ఎయిర్వేస్ అధినేత!
‘‘జీవితంపై నేను పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. కలలు కరిగి పోయాయి. భవిష్యత్తు నాశనం అయ్యింది. బయట జీవించడం కంటే నేను జైల్లో చనిపోతేనే బాగుంటుంది.’’ ఇంతకీ ఈ మాట అన్నది ఎవరో తెలుసా? ఒప్పుడు విమానయాన రంగంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగి పాతాళంలోకి కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ అధినేత నరేష్ గోయల్ జెట్ ఎయిర్వేస్.. ప్రైవేట్ విమానయాన రంగంలో ఆకాశమంత ఎత్తు ఎదిగిన సంస్థ. ఇండియాలోనే టాప్ ఎయిర్‌లైన్స్‌లో ఇది ఒకటి. కానీ అదంతా గతం.. ఇప్పుడు పెరిగిన అప్పులతో కుప్పకూలిపోయింది. 200కిపైగా విమానాలతో నడిచే ఈ సంస్థ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా, 1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా మెరిసిపోయిన కంపెనీ అదాళ పాతంలోకి కూరుకుపోయింది. పిలిస్తే పలికే నాధుడు లేక ఫలితంగా నిన్నమొన్నటి వరకు ఏవియేషన్ రంగాన్ని శాసించి .. సంస్థను వరుస లాభాలతో పరుగులు పెట్టించిన జెట్ ఎయిర్ వేస్ అధినేత నరేష్ గోయల్ దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. జీవిత చరమాంకంలో పెరిగిన అప్పులు, వెంటాడుతున్న కేసులు, చుట్టు ముట్టిన అనారోగ్య సమస్యలు. వెరసి శరీరం సహరించిక.. పిలిస్తే పలికే నాధుడు లేక. ఆ బాధనుంచి బయట పడడానికి న్యాయమూర్తిని చావు శరణు కోరారు. మనీలాండరింగ్ కేసులో కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ కింద ఆర్ధర్ రోడ్ జైలులో ఉన్నారు. బెయిల్ పిటిషన్‌పై ఉన్న ఆయన ఇప్పటికే పలు మార్లు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కోర్టులో చేతులు జోడించి.. జైల్లో నరకయాతన రోజులన్నీ ఒకేలా ఉండవు. ఒకప్పుడు భార్య, కుమార్తె.. వేలల్లో ఉద్యోగులు.. వందల్లో విమానాలు.. కోట్లలో లావాదేవీలు చేసిన నరేష్ గోయల్ పరిస్థితి తలకిందులైంది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగే ముందే కొన్ని నిమిషాల పాటు తనని వ్యక్తిగతంగా విచారణ చేయాలని గోయల్ ప్రత్యేక కోర్టు న్యాయ మూర్తి ఎంజే దేష్ పాండేను కోరారు. అందుకు న్యాయమూర్తి అనుమతి ఇవ్వడంతో.. జెయిట్ ఎయిర్వేస్ అధినేత ఎదుట చేతులు జోడించి ‘‘ వయస్సు రిత్యా తన రోజువారి ఆటకం ఏర్పడుతుంది. జైలు సిబ్బంది అందుకు సహకరించినా అవి సరిపోవడం లేదని, తాను పడుతున్న బాధ పగవాడికి కూడ రావొద్దని.. జైల్లో నరకయాతన పడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇకపై నేను ఇలాంటివి భరించలేను తాను బలహీనంగా ఉన్నానని, చికిత్స నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేదని గోయల్ న్యాయమూర్తికి తెలిపారు. ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించే సమయంలో జైలు సిబ్బంది, ఎస్కార్ట్ వాహనంతో పాటు ఇతర ఖైదీలతో ప్రయాణం చేయడం ఒత్తిడి గురై బతుకు దుర్భరంగా మారింది. ఇకపై నేను ఇలాంటివి భరించలేను. జేజే ఆస్పత్రిలో ఎప్పుడూ పెద్ద క్యూ ఉంటుంది. ఇతర అనారోగ్య బాధితులకు చికిత్స అందించి.. డాక్టర్ల నా వంతుగా వైద్యం చేసేందుకు మరింత సమయం పడుతుంది. ఇలాంటి పరిణామాలు నా ఆరోగ్యంపై దుష్ప్రప్రభావాన్ని చూపుతున్నాయి. జైల్లో చనిపోవడమే మంచిది నాకు 75 ఏళ్లు నిండాయి. భవిష్యత్తుపై ఎలాంటి ఆశ లేదు. నేను జైలులో చనిపోవాలనుకున్న ప్రతి సారి విధి నన్ను కాపాడుతుంది. జీవితంపై నేను పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. కలలు కరిగి పోయాయి. భవిష్యత్తు నాశనం అయ్యింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో జీవించి ఉండటం కంటే జైల్లో చనిపోవడమే మంచిది అందుకు అనుమతించండి" అని కోర్టు ఎదుట మొకరిల్లాడు. కన్నీటి పర్యంతరం నా భార్య అనిత క్యాన్సర్ ముదిరిపోయి చికిత్స పొందుతోంది. ఒక్కగానొక్క నమ్రత గోయల్ కూతురు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో ఆమెను చూసుకునే వారు లేరని కన్నీటి పర్యంతమయ్యారు గోయల్. తనను జెజె ఆసుపత్రికి పంపవద్దని, బదులుగా ‘‘ జైలులోనే చనిపోవడానికి అనుమతించండి’’ అని కోర్టును అభ్యర్థించాడు. చివరిగా.. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడానికి ఆరోగ్యం సహకరించడం లేదు. ఇప్పుడు కోర్టుకు హాజరయ్యాను. ఇకపై కోర్టు అడిగిన ఆధారాల్ని సమర్పిస్తాను. కానీ భౌతికంగా కోర్టుకు హాజరు కాలేనని చెప్పాడు. జనవరి 16న తదుపరి విచారణ గోయల్ అభ్యర్ధనను విన్న ప్రత్యేక న్యాయ మూర్తి.. జెట్ ఎయిర్ వేస్ నరేష్ గోయల్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా నరేష్ గోయల్ బెయిల్ పిటిషన్‌పై ఈడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి విచారణ జనవరి 16 న జరగనుంది. -
Naresh Goyal: జైల్లోనే చావాలనుంది!
ముంబై: ‘‘నాలో బతకాలన్న ఆశలన్నీ పూర్తిగా అడుగంటాయి. క్యాన్సర్ ముదిరి నా భార్య అనిత మంచాన పడింది. ఆమెను ఎంతగానో మిస్సవుతున్నా. నా ఒక్కగానొక్క కూతురుకూ ఒంట్లో బాగుండటం లేదు. నా ఆరోగ్యం కూడా పూర్తిగా దిగజారింది. మోకాళ్లు మొదలుకుని మూత్ర సంబంధిత వ్యాధుల దాకా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒళ్లంతా స్వాధీనం తప్పి వణుకుతోంది. నొప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో దైన్యంగా బతుకీడ్చడం కంటే జైల్లోనే చనిపోతే బాగుండనిపిస్తోంది’’ అంటూ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (74) భావోద్వేగానికి లోనయ్యారు. రూ.538 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితుడైన ఆయనను ఈడీ గత సెపె్టంబర్ 1న అరెస్టు చేసింది. నాటి నుంచీ జైల్లో ఉన్న ఆయన శనివారం ముంబై ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాసేపు వ్యక్తిగతంగా విచారించాలని కోరగా జడ్జి అనుమతించారు. ఈ సందర్భంగా చేతులు జోడించి తన దైన్యం గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. మాట్లాడుతున్నంత సేపూ గోయల్ వణకుతూనే ఉన్నారని జడ్జి తెలిపారు. ఆయన గత డిసెంబర్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
రూ.538 కోట్ల విలువైన జెట్‌ఎయిర్‌వేస్ ఆస్తులు సీజ్
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్వేస్కు చెందిన రూ.538 కోట్లకు పైగా విలువ గల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుంది. జెట్ ఎయిర్వేస్ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఆయన భార్య, కుమారుడికి చెందిన లండన్, దుబాయ్ సహా భారత్‌లో వివిధ ప్రదేశాల్లో ఉన్న 17 కమర్షియల్ ఫ్లాట్లు, ఇతర ఆస్తులను ఈడీ ఈ మేరకు సీజ్ చేసింది. దాదాపు 26 సంవత్సరాలుగా పూర్తి వాణిజ్య సేవలు అందించిన జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. నగదు కొరత కారణంగా ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. 2019లో గోయల్ ఎయిర్‌లైన్ చైర్‌పర్సన్‌గా వైదొలిగిన తర్వాత జెట్ ఎయిర్వేస్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పిటిషన్‌ని దాఖలు చేసింది. కెనరా బ్యాంకులో రూ.538 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో సెప్టెంబర్ ప్రారంభంలో ఈడీ నరేష్ గోయల్‌ను అరెస్టు చేసింది. బ్యాంకు నుంచి రుణంగా పొందిన ఆదాయంతో విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపించింది. ఈ కేసులో నేరష్ గోయల్‌తో పాటు మరో ఐదుగురిపై ఈడీ మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఉన్న నిందితుల ఆస్తులపై ఈ ఏడాది జులైలోనే ఈడీ దాడులు జరిపింది. జెట్ ఎయిర్వేస్కు రూ.848.86 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తే.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలు ఉన్నాయని కెనరా బ్యాంకు ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2021 జూలై 29న ఈ కేసును మోసంగా ప్రకటించబడిందని కూడా సీబీఐ పేర్కొంది. ఇదీ చదవండి: Wine Capital of India: దేశంలో మద్యం రాజధాని ఏది? -
ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్
న్యూఢిల్లీ: కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో శుక్రవారం రాత్రి అరెస్టయిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను.. మనీ లాండరింగ్ కేసులను విచారించేందుకు ఏర్పాటైన ముంబైలోని ప్రత్యేక కోర్టు సెపె్టంబర్ 11 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి పంపుతూ శనివారం ఆదేశించింది. కెనెరా బ్యాంక్ ఫిర్యాదు మేరకు జెట్ ఎయిర్వేస్ ఛైర్మన్ నరేష్ గోయల్, భార్య అనితపై సీబీఐ మే 3న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జెట్ ఎయిర్వేస్కు రూ.848.86 కోట్ల రుణ పరిమితులు, రుణాలు మంజూరు చేశామని.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలున్నాయన్న కెనరా బ్యాంకు ఫిర్యాదుపై కేసు నమోదైంది. -
ఎవరీ నరేశ్ గోయల్?..జెట్ ఎయిర్వేస్ ఎలా పతనం అయ్యింది?
చిన్న వయస్సులోనే తండ్రి మరణం..చదువుకునే స్థోమతా లేదు. ఒకపూట తింటే రెండో పూట పస్తులుండే జీవితం. అలాంటి దుర్భుర జీవితాన్ని అనుభవించిన ఓ యువకుడు దేశంలోనే అతి పెద్ద ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్ వేస్ అనే విమానయాన సంస్థను ఎలా స్థాపించగలిగారు. చిన్న వయస్సు నుంచే ‘నువ్వు మంచి చేస్తే మంచి... చెడు చేస్తే చెడు... తిరిగి మళ్ళీ అది నిన్నే చేరుతుంది’ అమ్మ మాటల్ని వింటూ పెరిగిన ఆయన ఆర్ధిక నేరానికి ఎందుకు పాల్పడ్డారు. వందల కోట్లలో తీసుకున్న బ్యాంకు లోన్లను ఎగ్గొట్టి పరారయ్యేందుకు ఎందుకు ప్రయత్నించారు. చివరికి ఎలా అరెస్ట్ అయ్యారు. జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్టు అయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రకారం.. కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనను అదుపులోకి తీసుకుంది.ఈ తరుణంలో భారతీయలు సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న నరేశ్ గోయల్ కెరియర్, జెట్ ఎయిర్వేస్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. బీకామ్‌తో సరిపెట్టుకుని నరేశ్ గోయల్ 29 జూలై 1949 పంజాబ్‌లోని సంగ్రూర్ గ్రామంలో జన్మించారు. అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో తన పాఠశాల విద్యాభ్యాసాన్ని, పంజాబ్‌లోని పాటియాలా ప్రభుత్వ బిక్రమ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి కామర్స్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేశారు. అయితే 11 ఏళ్ల వయస్సుల్లో తన తండ్రి మరణం మరింత ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టింది. రుణం కారణంగా ప్రభుత్వం చిన్న తనంలో గోయల్ ఇంటిని, ఇతర ఆస్తుల్ని వేలం పాట నిర్వహించింది. కాబట్టే చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేయాలన్నా ఆయన కలలు.. కల్లలయ్యాయి. చదువుకునే స్థోమత లేక బీకామ్‌తో సరిపెట్టుకున్నారు. కఠిక నేలపై నిద్రిస్తూ 1967లో గ్రాడ్యుయేషన్ తర్వాత, గోయల్ తన మేన మామ సేథ్ చరణ్ దాస్ రామ్ లాల్ ట్రావెల్ ఏజెన్సీ ఈస్ట్ వెస్ట్ ఏజెన్సీస్‌లో క్యాషియర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. అదే ఆఫీస్‌నే ఇంటిగా మార్చుకున్నారు. పగలు ఆఫీస్ పనుల్ని చక్కబెడుతూనే.. రాత్రి వేళలో అదే ఆఫీస్‌లో నిద్రించే వారు. ఆఫీస్ అయిపోయిన వెంటనే అందులోనే స్నానం చేయడం.. పక్కనే ఉన్న దాబాలో సమయానికి ఏది దొరికితే అది తినడం, కఠిక నేలపై నిద్రించడం ఇలా రోజువారీ దినచర్యగా మారింది. అనతి కాలంలో మేనేజర్ స్థాయికి అనతి కాలంలో 1969లో ఇరాకీ ఎయిర్వేస్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్‌గా నియమితులయ్యారు. 1971 నుండి 1974 మధ్యకాలంలో రాయల్ జోర్డానియన్ ఎయిర్‌లైన్స్‌కు రీజినల్ మేనేజర్‌గా కూడా పనిచేశాడు. ఆ సమయంలో టిక్కెట్లు, రిజర్వేషన్, అమ్మకాల రంగాలలో అనుభవాన్ని గడించారు. ఆ అనుభవమే మిడిల్ ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లోని భారతీయ అధికారులతో పనిచేసేందుకు ఉపయోగపడింది. తల్లి ఆశీర్వాదంతో 1967 నుండి 1974 వరకు, గోయల్ అనేక విదేశీ విమానయాన సంస్థలతో కలిసి పనిచేశారు. వ్యాపార మెళుకువల్ని నేర్చుకుని ఆ రంగంపై పట్టు సాధించారు. తనకున్న అనుభవంతో 1974లో నరేశ్ గోయల్ తన తల్లి నుంచి 500 డాలర్లు( రూ. 40వేలు) ఇప్పుడు (రూ.2లక్షలకు పైమాటే) వేల వరకు తీసుకున్నారు. ఆ డబ్బుతో తన సోదరుడు సురీందర్ కుమార్ గోయల్‌తో కలిసి తన సొంత స్టార్టప్ జైటర్ అనే ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించారు. సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో జైటర్ ఎయిర్ ఫ్రాన్స్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్, కాథే పసిఫిక్ వంటి విమానయాన సంస్థలకు సేలందించేంది. వ్యాపారం జోరుగా కొనసాడంతో లాభాల్ని గడిస్తూ వచ్చారు. అంది వచ్చిన అవకాశం అయితే 1991లో, నాటి భారత ప్రభుత్వం ఓపెన్ స్కైస్ పాలసీని ప్రకటించింది. ఆ ప్రకటనే నరేశ్ మరింత ఎత్తుకు ఎదిగేందుకు దోహదం చేసింది. గోయల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సొంతంగా తానే విమానయాన సంస్థను ప్రారంభించారు.1992లో అతని ట్రావెల్ ఏజెన్సీ జెట్ ఎయిర్వేస్గా పేరు మార్చారు. ఆ మరుసటి ఏడాది జెట్ ఎయిర్వేస్ దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. 2004 నాటికి, జెట్ ఎయిర్వేస్ అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలను ప్రారంభమయ్యాయి. 2007లో జెట్ ఎయిర్వేస్ ఎయిర్ సహారాను కొనుగోలు చేసింది. 2010 నాటికి భారతదేశంలో అతిపెద్ద ఏవియేషన్ సంస్థగా అవతరించింది. కొంపముంచిన అతి విశ్వాసం కానీ రోజులు గడిచే కొద్దీ జెట్ ఎయిర్వేస్ ప్రాభవం మరింత తగ్గుతూ వచ్చింది. ఓవైపు అతి విశ్వాసం.. మరోవైపు మార్కెట్లో ఇతర ఏవియేషన్ సంస్థలు పుట్టుకురావడం, జెట్ ఎయిర్వేస్ విమాన టికెట్ ధరలు ఇతర ఏవియేషన్ కంపెనీ టికెట్ల ధరల కంటే ఎక్కువగా ఉండటం, వ్యాపారం కొనసాగించేందుకు అప్పులు చేయడం.. వాటికి వడ్డీలు చెల్లించడం, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక అక్రమ మార్గాన్ని ఎంచుకోవడంతో.. జెట్ ఎయిర్వేస్ పతనం ప్రారంభమైంది. నాలుగు పెద్ద సూట్కేసుల్ని తీసుకుని 2019లో ఎయిర్‌లైన్‌లో ఆర్థిక సంక్షోభంతో మూడింట రెండు వంతుల విమానాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఆయన మార్చి 25 ,2019న తన భార్య అనితా గోయల్‌తో కలిసి జెట్ ఎయిర్వేస్ బోర్డు నుండి వైదొలిగారు. అదే ఏడాది నాలుగు పెద్ద పెద్ద సూట్‌కేసులతో విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేశ్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించడం అప్పట్లో పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది. సెప్టెంబరు 2019లో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గోయల్‌పై విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు కోసం ప్రశ్నించారు. 2020లో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కెనరా బ్యాంక్ నుంచి రూ.538 కోట్లు రుణాలు ఎగవేతకు పాల్పడడం, తన అనుబంధ సంస్థ జేఐఎల్కు 14వందల కోట్ల చెల్లింపులు, పెట్టుబడులు పెట్టి తద్వారా భారీగా నిధుల్ని కాజేశారు. కెనరా బ్యాంక్ అధికారుల ఫిర్యాదు, నిధులు కాజేయడంతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించిన ఈడీ అధికారులు గోయల్‌ను ముంబై కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించించారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వివాదాలు 👉2000వ దశకంలో నరేష్‌గోయల్‌కు అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జెట్ ఎయిర్వేస్కు దావూద్ నిధులు సమకూర్చారని పిల్ పేర్కొంది. అయితే నరేష్ కు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. 👉మార్చి 2020లో, అతనితో అనుబంధించబడిన 19 ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలలో పాల్గొన్నందుకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ద్వారా మనీ లాండరింగ్ కేసు నమోదైంది. 👉19 జూలై 2023న, నరేష్ గోయల్, అతని సహచరుల నివాసాల్లో ఢిల్లీ, ముంబైలలో దాడులు చేసింది. దీనికి ముందు, జూలై 14, 2023న గోయల్, అతని భార్యతో పాటు ఇతరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. చివరికి అదుపులోకి తీసుకుంది. 👉1979లో మార్కెటింగ్ అనలిస్ట్‌గా కంపెనీలో చేరి మార్కెటింగ్, సేల్స్ హెడ్‌గా ఎదిగిన అనిత అనే యువతిని ఆమెను వివాహం చేసుకున్నారు. వారు తొమ్మిదేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. 👉చివరిగా ::: ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని అంశాల ఆధారంగా ఆకాశమే నీ హద్దురా సినిమా తెరకెక్కింది. ఆ సినిమాలో విమానయాన సంస్థ పెట్టడానికి ప్రయత్నించే యువకుడిగా కెప్టెన్ గోపీనాథ్ పాత్రను సూర్య చేస్తే.. సినిమాలోని సూర్య (మహా) ఆశయాన్ని ప్రతి అడుగులోను అడ్డగించే విలన్‌గా పరేష్ రావల్ యాక్ట్ చేశారు. నిజజీవితంలో కెప్టెన్ గోపీనాథ్‌ను ఇబ్బంది పెట్టింది మరెవరో కాదు జెట్ ఎయిర్ వేస్ అధినేత నరేశ్ గోయల్. -
‘జెట్ ఎయిర్వేస్’ నరేశ్ గోయల్ అరెస్ట్
ముంబై: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్(74)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంస్థ శుక్రవారం రాత్రి అరెస్టు చేసింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద.. ముంబైలో ఆయన్ను అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది. జెట్ ఎయిర్ కోసం కెనరా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.848.86 కోట్ల రుణాలను దారి మళ్లించి స్వాహా చేశారని సీబీఐ ఇంతకు ముందే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ గోయల్‌ను ప్రశ్నించి.. అరెస్టు చేసింది. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ నరేశ్ గోయల్, అనితా గోయల్, గౌరంగ్ ఆనంద శెట్టి తదితరులపై గతేడాది నవంబర్ 11న సీబీఐకి కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ సంతోష్ ఫిర్యాదు చేశారు. దీనివల్ల బ్యాంకుకు రూ.538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. గోయల్‌ను శనివారం ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశ పెట్టి..ఈడీ అధి కారులు ఆయన కస్టడీ కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనూహ్యంగా.. దాదాపు 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించిన జెట్ ఎయిర్వేస్.. భారీ నష్టాలు, సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో 2019 ఏప్రిల్‌లో మూత పడింది. ఆపై బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం.. జెట్ ఎయిర్వేస్ సంస్థ బిడ్ సొంతం చేసుకుంనది. ఇక జలాన్ కల్ రాక్ కన్సార్టియం ఆధ్వర్యంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది. ఎయిర్‌పోర్ట్‌లో అడ్డగింత.. తనిఖీలు.. జెట్ ఎయిర్వేస్ సర్వీస్‌లు నిలిచిపోయాక.. 2019 మే 25న విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించారు. ఆ టైంలో నరేష్ గోయల్ దంపతులు నాలుగు భారీ సైజ్ సూట్ కేసులతో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఇక.. విదేశీ విమాన సర్వీసుల సంస్థ ‘ఎతిహాద్’కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో విదేశీ మారక ద్రవ్యం యాజమాన్య సంస్థ (ఫెమా) నిబంధనలను నరేష్ గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో ముంబై, ఢిల్లీల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 2019 సెప్టెంబర్ లో తనిఖీలు చేశారు. 2020లో నరేష్ గోయల్‌ని ఈడీ అధికారులు పలు దఫాలు ప్రశ్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన్ని ముంబై కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. అటు నుంచి అటే అదుపులోకి తీసుకున్నారు. -
జెట్ ఎయిర్వేస్ 2.0లో కీలక పరిణామం
ముంబై: కొత్త ఏడాదిలో జెట్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థకు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుధీర్ గౌర్ షాక్ ఇచ్చారు. తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదివికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజీనామా చేయడానికి గల కారణాలను మాత్రం గౌర్ వెల్లడించలేదు. అయితే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ వల్లే.. గౌర్ నిష్క్రమణ జరిగిందా? అనే కోణంలో ప్రత్యేక చర్చ మొదలైంది ఇప్పుడు. నరేష్ గోయల్ స్థాపించిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభం కారణంగా రెండు సంవత్సరాల పాటు సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. తిరిగి 2022లో జెట్ ఎయిర్వేస్ 2.0 పేరుతో సర్వీసుల్ని పున:ప్రారంభించాల్సి ఉంది. ఈ విషయాన్ని జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం అధికారికంగా వెల్లడించింది కూడా. మరోవైపు 2022 మొదటి త్రైమాసికంలో(వేసవిలోపే) విమానయాన సంస్థను పునఃప్రారంభించడానికి గత ఏడాది ఎన్‌సిఎల్‌టి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇన్వెస్ట్మెంట్ గురు, బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ను కూడా తొలి త్రైమాసికంలోనే తెచ్చే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు. ఇదివరకే 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తేలిసిందే. ఈ మధ్యే లోగోను లాంఛ్ చేయగా.. బోయిగ్ సంస్థతో విమానాల కోసం ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జెట్ ఎయిర్వేస్ నుంచి తాతాల్కిక సీఈవో వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. సుధీర్ గౌర్ ఆకాశ ఎయిర్‌లో చేరతారా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఇక నిధుల కొరత, మితిమీరిన రుణం భారంతో 2019లో జెట్ ఎయిర్వేస్ తన విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ 2021 జూన్‌లో ఆమోదం తెలిపింది. 2022 నుంచి తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని జలాన్ కల్రాక్ కన్సార్షియం భావించింది. (చదవండి: అమెరికాలో అమెరికన్ కంపెనీకి దిమ్మదిరిగే షాక్..!) -
జెట్ ఎయిర్వేస్ నరేష్ గోయల్‌కు ఈడీ షాక్
సాక్షి, ముంబై: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో నరేష్ గోయల్ ఇంటిపై ఈడీ అధికారులు గురువారం దాడులు నిర్వహంచారు. అలాగే గోయల్‌తోపాటు మరికొందరిపై ఈడీ తాజాగా కేసులు నమోదు చేసింది. ముంబై పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద క్రిమినల్ కేసు నమోదైందని ఈడీ అధికారులు తెలిపారు. బుధవారం కూడా ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి, విచారణ చేపట్టామని, దాడులు కొనసాగుతున్నాయని అధికారులు గురువారం తెలిపారు. జెట్‌ఎయిర్‌వేస్‌లో పెద్ద ఎత్తున నిధుల దారిమళ్లింపు సహా పలు అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో గోయల్, అతని కుటుంబం, ఇతరులపై విదేశీ మారకద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై దాడులు నిర్వహించింది. ఇదే కేసులో గత ఏడాది సెప్టెంబర్‌లో గోయల్‌ను విచారించింది. గోయల్‌కు 19 ప్రైవేటు కంపెనీలు ఉన్నాయని, వీటిలో ఐదు విదేశాల్లో ఉన్నాయిని ఈడీ గతంలో ఆరోపించింది. అమ్మకం, పంపిణీ, నిర్వహణ ఖర్చులు ముసుగులో ఈ సంస్థలు "అనుమానాస్పద" లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలను ఈడీ పరిశీలిస్తోంది. కాగా అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ గత ఏడాది ఏప్రిల్‌లో తన కార్యకలాపాలను మూసివేసింది. దీనికి ఒక నెల ముందు, గోయల్ జెట్ ఎయిర్వేస్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. -
జెట్ మాజీ ఛైర్మన్‌కు మరోసారి చిక్కులు
సాక్షి, ముంబై: జెట్‌ఎయిర్‌వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్‌కు మరోసారి చిక్కులు తప్పేలా లేవు. నిధుల మళ్లింపు ఆరోపణలతో ఇండిపెండెంట్ ఆడిట్ నిర్వహించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భావిస్తోంది. ఎస్బిఐ నిర్వహించిన ఆడిట్‌పై సంతృప్తిచెందని అధికారులు స్వతంత్ర ఆడిట్నిర్వహిస్తామని ప్రకటించడంతో నరేష్‌గోయల్ చిక్కుల్లోపడ్డారు. మొత్తం 19 ప్రైవేటు కంపెనీలు నరేష్‌గోయల్‌కు ఉన్నాయని, వాటిలో ఐదు కంపెనీలు విదేశాల్లో రిజిష్టరు అయినట్లు సీనియర్ ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థలు అమ్మకం, పంపిణీ , నిర్వహణ ఖర్చులు ముసుగులో అనుమానాస్పద లావాదేవీలను ఈడీ పరిశీలిస్తోంది. నగదు సంక్షోభంలో చిక్కుకుని, ఏడువేల కోట్ల బకాయిలు పేరుకున్న సంస్థపై ఇపుడు స్వతంత్ర ఆడిట్ నిర్వహించడమే మంచిని భావిస్తోంది. గతవారంలో గోయల్‌ను ప్రశ్నించిన అధికారులు ఎస్బిఐ నిర్వహించిన ఆడిట్లో లోపాలున్నట్లు గుర్తించారు. రుణాల సొమ్మును విదేశాల్లోని కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర ఆడిట్‌తోనే మరిన్ని అంశాలు వెలుగులోనికి వస్తాయని ఈడీ భావిస్తోంది. ముంబై కార్యాలయంలో గత వారంలోనే గోయల్‌ను విచారించిన ఈడీ విదేశీ కరెన్సీ చట్టాల పరిధిలో విచారణ నిర్వహించింది. ఆగస్టులో ఆయన నివాసాలు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన తర్వాత మొదటిసారి ముంబైలో గోయల్‌ను ప్రశ్నించింది. రూ.18వేల కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలపై దర్యాప్తునకు గోయల్ సహకరించడం లేదని ఆగస్టులో ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం నివేదించింది. అయితే ఈ ఆరోపణలను గోయల్ తిరస్కరించారు. కాగా దివాలా చర్యలను ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్ చైర్మన్ గోయల్ ఇదివరకే తన పదవికి రాజీనామా చేశారు. అలాగా మార్చిలో జెట్ ఎయిర్వేస్ బోర్డు పునర్నిర్మాణంలో భాగంగా గోయల్, అతని భార్య అనిత రాజీనామా చేశారు. ఈ సంక్షోభం నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. -
జెట్ ఫౌండర్ నరేష్ గోయల్‌పై ఈడీ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ మారకద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ నివాసం, కార్యాలయాలపై ఈడీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఫెమా నిబంధనలకు అనుగుణంగా అదనపు ఆధారాల కోసం ఈ సోదాలు చేపట్టామని ఈడీ అధికారులు వెల్లడించారు. ముంబై, ఢిల్లీలో గోయల్‌కు చెందిన నివాస, కార్యాలయ ప్రాంగణాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆర్థిక సంక్షోభంతో పాటు నగదు కొరతతో ఏప్రిల్ 17న జెట్ ఎయిర్వేస్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు జెట్ ఎయిర్వేస్లో పెద్ద ఎత్తున నిధుల దారిమళ్లింపు సహా పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తనిఖీ నివేదికలోనూ వెల్లడైంది. జెట్ ఎయిర్వేస్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఎయిర్‌లైన్ చైర్మన్‌గా నరేష్ గోయల్ ఈ ఏడాడి మార్చిలో వైదొలిగారు. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్లో ఐబీసీ కోడ్ కింద దివాళా ప్రక్రియ సాగుతోంది. -
నరేష్ గోయల్‌కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు గోయల్ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. గ్యారంటీ సొమ్ము చెల్లించకుండా దేశం విడిచి వెళ్లరాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఒకవేళ దేశం విడిచి విదేశాలకు వెళ్లాలనుకుంటే 18వేల కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక ఊరట కల్పించలేమని న్యాయమూర్తి సురేష్ కైత్ స్పష్టం చేశారు. తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్కులర్‌ను సవాల్ చేస్తూ, దేశం విడిచి వెళ్లడానికి కోర్టు అనుమతిని కోరుతూ గోయల్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అలాగే దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా గోయల్ ఆయన భార్య అనిత దుబాయ్‌కు వెళుతుండగా మార్చి 25 న విమానాన్ని దింపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ రంగబ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా, డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో నరేష్ గోయల్‌కు తాజా షాక్ తగిలింది. -
నరేష్ గోయల్‌కి ఢిల్లీ కోర్టులో షాక్
-
జెట్ ఎయిర్వేస్: మరో షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై : అప్పుల ఊబిలో కూరుకు పోయి కార్యకలాపాలను నిలిపివేసిన ప్రయివేటు రంగవిమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కంపెనీలో అక్రమాలకు పాల్పడినట్లుగా జెట్ ఎయిర్వేస్ వ్యవస్థపాకుడు నరేష్ గోయల్ మీద తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. భారీ పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ ఆయనకు సమన్లు జారీ చేసింది. రూ. 650 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ నరేష్ గోయల్‌ను ప్రశ్నించబోతోందని తాజా మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. పన్నులు ఎగవేసేందుకు నరేష్ గోయల్ దుబాయ్‌లోని దాని గ్రూప్ కంపెనీతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డంతోపాటు, ఇందుకు దుబాయ్ కంపెనీకి కమిషన్ ముట్టినట్టుగా అసెస్మెంట్ వింగ్ దర్యాప్తులో తేలింది. దీంతో దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నరేష్ గోయల్‌ను ఆదేశించింది. త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్న సమయంలో ఈ సర్వే జరిగిందని ఆదాయపు పన్ను అధికారి చెప్పారు. పన్నులు ఎగవేసేందుకు విదేశాలకు నిధులను మళ్లించాలనే ఉద్దేశ్యంతో చేసిన అధిక చెల్లింపులు అనే కోణంలో అసెస్మెంట్ వింగ్ విచారణ అనంతరం, మరింత వివరణ కోరేందుకు ఆయన్ను పిలిపించనున్నట్టు మరో అధికారి అందించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే తాజా పరిణామాలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది. కాగా 2018 సెప్టెంబర్‌లో జెట్ ముంబై కార్యాలయాంలో దాడులు, కొన్నికీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిపై దర్యాప్తు ఫిబ్రవరిలో పూర్తయింది. అయితే ఫిబ్రవరిలో వెలువడిన ఈ నివేదికపై స్పందించిన జెట్‌ఎయిర్‌వేస్ అవకతవకల ఆరోపణలను ఖండించింది. లావాదేవీలన్నీచట్ట ప్రకారం, నియంత్రణ, కార్పొరేట్ పాలన అవసరాలకు లోబడే ఉన్నాయంటూ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
మంచిరోజులు వస్తాయంటున్న జెట్ ఫౌండర్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో మూసివేత అంచుకు చేరిన జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసే బిడ్డర్ మరికొన్ని రోజుల్లో ముందుకొస్తారని జెట్ ఎయిర్వేస్ వ్యవస్ధాపకుడు నరేష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. బిడ్డింగ్‌కు తుదిగడువు ఈనెల 10న ముగుస్తుండగా వచ్చే వారంలోనే బిడ్డర్‌ను బ్యాంకులు ఖరారు చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జెట్ ఎయిర్వేస్ 26వ వార్షికోత్సవమైన మే 5 (ఆదివారం) తన జీవితంలో అత్యంత విచారకరమైన రోజని ఆయన సంస్థ ఉద్యోగులు రాసిన లేఖలో పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా మే 5 సంస్థ ఉద్యోగుల్లో ప్రత్యేక స్ధానం ఏర్పరచుకుందని, అయితే ఈ ఏడాది మాత్రం అది అత్యంత విచారకరమైన రోజుగా గడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 1993, ఏప్రిల్ 18న తాము ముంబైలో తొలి విమానాన్ని అందుకోగా, ఈ ఏడాది ఏప్రిల్ 18న తాము అమృత్సర్ నుంచి ముంబైకి చివరి విమానం నడపడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. జెట్ ఎయిర్వేస్ను కాపాడేందుకు తాను తన భార్య నీతా చివరినిమిషం వరకూ ప్రయత్నించామని, మార్చి 25న బోర్డు నుంచి వైదొలగడంతో పాటు తన కంపెనీల్లో ఒక కంపెనీ నుంచి రూ 250 కోట్లు సమకూర్చానని, ఎయిర్‌లైన్‌లో తన షేర్లను తనఖా పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా జెట్ ఎయిర్వేస్ను దక్కించుకునేందుకు ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్టనర్స్, ఎన్ఐఐఎఫ్ ఆసక్తి కనబరుస్తున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ సాగాలో న్యూ ట్విస్ట్
సాక్షి,ముంబై : జెట్ ఎయిర్వేస్ సాగాలో సరికొత్త ట్విస్ట్ వ్యాపార వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మాజీ ప్రమోటర్, గత నెలలో చైర్మన్‌గా తప్పుకున్న నరేష్ గోయల్ ఎయిర్‌లైన్స్‌లో వాటాను తిరిగి దక్కించు కోవాలని యోచిస్తున్నారట. జెట్‌లో వాటాల కొనుగోలుకు ప్రధాన ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి కనబర్చని నేపథ్యంలో ఆయన నిర్దిష్టమైన రోడ్‌మ్యాప్‌తో సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బిడ్‌ను దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం రుణపరిష్కారప్రనాళికను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్‌వెస్‌లో దాదాపు 75 శాతం వాటాను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించారు. అయితే దీనికి పెద్దగా స్పందన లభించకపోవడంతో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు డెడ్‌లైన్‌ను పొడిగించింది. బిడ్లనును సమర్పించే గడువును ఏప్రిల్ 12వరకు పొడిగిస్తున్నట్టు ఎస్బీఐ క్యాపిటల్ ప్రకటించింది. దీంతో జెట్ ఎయిర్వేస్లో ఇప్పటికే పెట్టుబడిదారుగా ఉన్నఎతిహాడ్, జెట్ ఎయిర్ వేస్ మాజీ సీఈవో క్రామర్ బాల్ కూడా జెట్ వాటాల ఒక కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. దాదాపు ప్రతి రోజు ఎస్బీఐ అధికారులతో సమావేశమవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కాగా అప్పుల సంక్షోభంతో కుప్పకూలుతున్న జెట్ ఎయిర్వేస్కు కష్టాలు వెన్నంటుతున్నాయి. తీవ్ర నిధుల కొరత, రుణాల భారంతో పాటు, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్ధితిలో జెట్ ఎయిర్వేస్ అష్ట కష్టాలు పడుతోంది. బాకీలు కట్టలేందంటూ ఎయిర్వేస్కు ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఇంధన సరఫరాను నిలిపివేసింది. తక్షణమే రూ.1,500 కోట్ల మేర నిధులను అందించే ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్వేస్ను స్థాపించి విజయపథంలో పరుగులు పెట్టించిన ఛైర్మన్ నరేష్ గోయల్ చివరికి అనివార్య పరిస్థితుల్లో కంపెనీ బోర్డు నుంచి సతీమణి అనితా గోయల్‌తోపాటు వైదొలగిన సంగతి తెలిసిందే. -
గోయల్.. ‘జెట్’ దిగెన్!
ముంబై: కొన్ని నెలలుగా కొనసాగుతున్న జెట్ ఎయిర్వేస్ సంక్షోభానికి పరిష్కారం దొరికింది. తీవ్ర నిధుల కొరత, రుణ భారం సమస్యలను ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్కు బ్యాంకులు తక్షణమే రూ.1,500 కోట్ల మేర నిధులను అందించనున్నాయి. జెట్ ఎయిర్వేస్ చైర్మన్ పదవి నుంచి, కంపెనీ బోర్డు నుంచి నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితాగోయల్ తప్పుకున్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ రూపొందించిన పరిష్కార ప్రణాళికలో భాగమే ఇది. ఈ ప్రణాళికకు సోమవారం అత్యవసరంగా సమావేశమైన జెట్ ఎయిర్వేస్ బోర్డు ఆమోదం తెలిపింది. మధ్యంతర నిధుల సాయం పొందడమే ఈ సమావేశం ప్రధాన ఎజెండాగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్వేస్కు చెందిన 80కు పైగా విమానాలు సర్వీసులు నడపలేని పరిస్థితుల్లో నిలిచిపోయిన విషయం విదితమే. నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్, ఎతిహాద్ ఎయిర్వేస్ పీజేఎస్సీ నామినీ డైరెక్టర్ కెవిన్ నైట్ జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి వైదొలిగారు. కంపెనీలో ఎతిహాద్‌కు 24 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. డెట్ ఇనుస్ట్రుమెంట్ల జారీ ద్వారా బ్యాంకులు రూ.1,500 కోట్లు అందించనున్నాయి. జెట్ ఎయిర్వేస్ బ్యాంకులకు రూ.8,000 కోట్లకు పైగా రుణాలను చెల్లించాల్సి ఉంది. దీంతో 11.4 కోట్ల షేర్లను బ్యాంకులకు జారీ చేయడం ద్వారా రుణాన్ని ఈక్విటీగా కంపెనీ మార్చనున్నది. దీంతో బ్యాంకులకు సంస్థలో నియంత్రిత వాటా 51 శాతం లభిస్తుంది. ప్రమోటర్ నరేష్ గోయల్ వాటా ప్రస్తుతమున్న 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గుతుంది. అలాగే, అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ వాటా 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, పర్యవేక్షణకు మధ్యంతర మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తూ కూడా జెట్ ఎయిర్వేస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మెకెన్సీ అండ్ కో సహకారంతో బోర్డు డైరెక్టర్ల పర్యవేక్షణ కింద ఈ కమిటీ పనిచేస్తుంది. ప్రమోటర్లకు చెందిన ఇద్దరు నామినీలు, ఎతిహాద్ ఎయిర్వేస్ తరఫున ఒక నామినీ జెట్ ఎయిర్వేస్ బోర్డులో కొనసాగుతారని జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఉద్యోగుల్లో ఆందోళన మరోవైపు జనవరి నుంచి ఉద్యోగులకు జెట్ ఎయిర్వేస్ వేతనాలను చెల్లించడం లేదు. డిసెంబర్ నెలకు సంబంధించి కూడా కేవలం 12.5 శాతం వేతనాలనే చెల్లించింది. దీంతో పైలట్లు, ఇంజనీర్లు, ఇతర కీలక విధుల్లోని ఉద్యోగులు ఇతర విమానయాన సంస్థల్లో ఉపాధి వెతుక్కుంటున్న పరిస్థితి ఉంది. ‘‘మాకు కూడా ఆర్థిక బాధ్యతలు ఉన్నాయి. ఎయిర్‌లైన్ ఒక్కసారిగా కుప్పకూలితే ఏమవుతుందన్న భయం ఉంది. మా బకాయిలు మార్చి 31 నాటికి చెల్లించాలి. అలాగే, మా కంపెనీకి సంబంధించి రోడ్‌మ్యాప్ సిద్ధం కావాలి’’ అని నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వలైని పేర్కొన్నారు. విషాద దినం: అజయ్‌సింగ్ దేశ విమానయాన రంగానికి ఇదొక విషాద దినంగా స్పైస్‌జెట్ చీఫ్ అజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి తప్పుకోవాల్సి రావడంతో అజయ్‌సింగ్ ఇలా స్పందించారు. ప్రపంచస్థాయి ఎయిర్‌లైన్ సంస్థను ప్రారంభించి నరేష్ గోయల్, అనితా గోయల్ భారత్ గర్వపడేలా చేశారని పేర్కొన్నారు. విమానయాన సంస్థలను పోటీ పడలేకుండా చేస్తున్న నిర్మాణాత్మక సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టేందుకు విధాన నిర్ణేతలకు ఇదొక మేల్కొలుపుగా అభివర్ణించారు. వీటిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. షేరు పరుగు... గోయల్ వైదొలగిన వార్తలతో జెట్ షేరు 17 శాతానికి పైగా పెరిగింది. బీఎస్ఈలో చివరికి 12.69 శాతం లాభంతో రూ.254.50 వద్ద స్థిరపడింది. బ్యాంకుల నిర్ణయం పట్ల జైట్లీ సంతోషం న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్కు సంబంధించి ప్రభుత్వరంగ బ్యాంకులు తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులు స్వప్రయోజనాలతోపాటు, ప్రజా ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకున్నట్టు చెప్పారు. ‘‘మరిన్ని విమానాలు, ఎయిర్‌లైన్స్ భారత్‌కు అవసరం. లేదంటే చార్జీలు పెరిగిపోతాయి. జెట్ ఎయిర్వేస్ సంస్థ కార్యకలాపాలు కొనసాగే విధంగా బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. అప్పుడే అవి తమ బకాయిలను వసూలు చేసుకోగలవు. ఈ నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నా’’ అని జైట్లీ పేర్కొన్నారు. మే నాటికి కొనుగోలుదారుల ఖరారు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ జెట్ ఎయిర్వేస్కు సంబంధించి కొనుగోలుదారులు లేదా పెట్టుబడిదారులను మే చివరి నాటికి ఖరారు చేస్తామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ప్రమోటర్ అయిన నరేష్ గోయల్ సైతం త్వరలో జరిగే బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హులేనని చెప్పారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఈక్విటీగా మార్చడం వల్ల జెట్ ఎయిర్వేస్లో... ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకులకు 51 శాతం వాటా ఉండనుంటే, నరేష్ గోయల్ వాటా ప్రస్తుత 50 శాతం నుంచి 25 శాతానికి దిగొస్తుంది. అలాగే, అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ వాటా 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది. జెట్ ఎయిర్వేస్ విక్రయానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియను జూన్ నాటికి పూర్తి చేయాలన్నది ప్రణాళిక. అయితే, మే 31 నాటికే ఇది ముగుస్తుందన్న ఆశాభావాన్ని రజనీష్ కుమార్ వ్యక్తం చేశారు. ‘‘ఎవరు రావాలన్నా జెట్ ద్వారాలు తెరిచే ఉంటాయి. ఏప్రిల్ 9 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30 నాటికి బిడ్డింగ్ ముగుస్తుంది. మే నాటికి ఇన్వెస్టర్‌ను ఖరారు చేస్తాం’’ అని రజనీష్ కుమార్ తెలిపారు. ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ లేదా ఎయిర్‌లైన్.. నరేష్ గోయల్ అయినా లేదా ఎతిహాద్ అయినా ఇన్వెస్ట్ చేయవచ్చన్నారు. బిడ్డింగ్‌కు ఎవరికీ నిషేధం లేదని స్పష్టం చేశారు. జెట్ ఎయిర్వేస్ను కాపాడడమే: గోయల్ జెట్‌లో పనిచేసే 22,000 మంది ఉద్యోగుల కుటుంబ ప్రయోజనాల కంటే తనకు ఏదీ పెద్ద త్యాగం కాదని కంపెనీ చైర్మన్, బోర్డు నుంచి తప్పుకున్న నరేష్ గోయల్ వ్యాఖ్యానించారు. 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్న జెట్ ఎయిర్వేస్ను స్థాపించినది నరేష్ గోయల్. 1992 నుంచి కంపెనీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘నా కుటుంబంలోని 22,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యల కోసమే జెట్‌ఎయిర్‌వేస్ బోర్డు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. నా కుటుంబం నాతో, నా వెనుకనే ఉన్నది. మీరు కూడా నా నిర్ణయానికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా’’ అని చెప్పారు. కొత్త అధ్యాయం ఇప్పుడే మొదలు జెట్ బోర్డు నుంచి తప్పుకున్న నేపథ్యంలో తమ ప్రయాణం ముగిసిపోలేదని, నూతన అధ్యాయం ఇప్పుడే మొదలైందన్నారు గోయల్. రుణ పునర్నిర్మాణ ప్రణాళిక ఆమోదంతో జెట్ బలమైన, స్థిరమైన ఆర్థిక మూలాలపై నిలబడుతుందన్న ఆశాభావాన్ని 22,000 మంది ఉద్యో గులకు రాసిన లేఖలో గోయల్ వ్యక్తం చేశారు. సంస్థకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. -
జెట్ బోర్డు నుంచి వైదొలగిన నరేష్ గోయల్
ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్య తప్పుకున్నారు. జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి నరేష్ గోయల్, ఆయన భార్య అనిత్ గోయల్, పూర్తికాల డైరెక్టర్ గౌరంగ్ షెట్టి, నసీం జైదీ తప్పుకోవాలని బోర్డు సూచించింది. ఇందుకు ప్రతిగా అత్యవసర నిధి కింద రూ 1500 కోట్లు సమీకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఈ నిధులను జెట్ ఎయిర్వేస్కు అందచేస్తుంది. గోయల్ బృందం బోర్డు నుంచి వైదొలగడంతో వారంలోగా జెట్ ఎయిర్వేస్కు అత్యవసర సాయం అందించేందుకు బ్యాంకుల కన్సార్షియం ముందుకొచ్చిందని ఎయిర్‌లైన్ వర్గాలు తెలిపాయి. కాగా దివాలా చట్టానికి అనుగుణంగా ప్రక్రియను చేపట్టడం కంటే రుణదాతలకు, కంపెనీకి మధ్య సంప్రదింపులు జరగడమే మేలని సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. తాజా పరిణామాల నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్లో గోయల్ వాటా 51 శాతం నుంచి 25.5 శాతానికి, ఎతిహాద్ ఎయిర్వేస్ వాటా 12 శాతానికి తగ్గుతుందని, బ్యాంకులకు 50.5 శాతం వాటాతో కంపెనీపై నియంత్రణ లభించేందుకు మార్గం సుగమమైందని భావిస్తున్నారు. జెట్ ఎయిర్వేస్ దివాళా తీయకుండా కాపాడేందుకు ఎయిర్‌లైన్‌ను కాపాడాలని ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. కాగా మూడు నెలల నుంచి తమకు జీతాలు చెల్లించడం లేదని జెట్ ఎయిర్వేస్ ఇంజనీర్లు, ఇతర సిబ్బంది, పైలట్లు ఆందోళన చేపడుతున్నారు. ఏప్రిల్ 1లోపు పెండింగ్ వేతన బకాయిలను పరిష్కరించకపోతే అదే రోజు నుంచి సేవలు నిలిపివేస్తామని పైలట్లు హెచ్చరించారు. -
జెట్ ఎయిర్వేస్ సంక్షోభం : కీలక పరిణామం
సాక్షి, ముంబై : ప్రయివేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సంస్థ ఫౌండర్, ప్రధాన ప్రమోటర్ నరేష్ గోయల్ సంస్థనుంచి వైదొలగే అవకాశం ఉందని తెలుస్తోంది. నరేష్ గోయల్‌తోపాటు ఆయన భార్య అనితా గోయల్ కూడా బోర్డుకు రాజీనామా చేయనున్నారని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. జెట్‌ఎయిర్‌వేస్ సంక్షోభంపై చర్చించేందుకు బోర్డు ఈ రోజు సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇవాల్టి సమావేశంలో ఒక కొత్త తీర్మానాన్ని కూడా ఆమోదించనున్నారు. తద్వారా నరేష్ గోయల్ సొంతమైన 51 శాతం వాటాను కన్సా ర్షియం సొంతం చేసుకుంటుంది. కొత్త కొనుగోలుదదారుకోసం అన్వేషించనుంది. అలాగే ఎస్బీఐ మాజీ ఛైర్మన్ మాజీ సీవీసీ కమిషనర్ జానకి వల్లభ్‌ను జెట్ ఎయిర్వేస్ బోర్డులోకి ఆహ్వానించనున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న నరేష గోయల్ అక్కడినుంచే 23వేల ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం. ఈ వార్తలు వాస్తవరూపం దాలిస్తే దాదాపు పాతికేళ్లపాటు సంస్థను విజయపధంలో నడిపించిన నరేష్ గోయల్ ప్రస్థానం ముగియనుంది. మరోవైపు ఇప్పటికే పలువురు సీనియర్ ఉన్నతాధికారులు సంస్థను వీడగా, వేతన బకాయిలు చెల్లించకపోతే తాము కూడా రాజీనామా బాట పట్టక తప్పదని పైలట్లు హెచ్చరించారు. అటు అద్దె బకాయిలు చెల్లించలేక , పైలట్లులేక రోజు రోజుకు జెట్ ఎయిర్వేస్ రద్దవుతున్న విమానాల సంఖ్య పెరుగుతోంది. కాగా సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న జెట్ ఎయిర్వేస్ మరింత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంతోపాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నేతృత్వంలో భారీ రుణాలిచ్చిన బ్యాంకులు సంస్థను గట్టెక్కించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలన సంస్థ మళ్లీ గాడిలో పడాలంటే నరేష్ గోయల్, ఆయన భార్య , మరో ఇద్దరు డైరెక్టర్లు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ సూచించిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో కీలక పరిణామం
సాక్షి, ముంబై: బిలియన్ డాలర్ల అప్పులు, రుణ బాధలు, నిధుల లేమి, కనీసం పైలట్లకు జీతాలు కూడా చెల్లించలేని సంక్షోభంలో ఉన్న దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ నుంచి చక్కదిద్దే కసరత్తుగా భాగంగా కీలక పరిణామం చోటు చేసుకోనుంది. జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయెల్ సంస్థనుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతం 51శాతం వాటా కలిగిన ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్‌గా గోయల్ తప్పుకునేందుకు అంగీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నష్టాలతో కునారిల్లుతూ, నిర్వహణ కార్యకలాపాలకే నిధుల్లేక జెట్ ఎయిర్వేస్కు వాటా దారైన ఇతిహాద్ ఎయిర్‌లైన్స్ బెయిల్అవుట్ ప్యాకేజీతో ముందుకు వచ్చిన నేపథ్యంలో గోయల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇరు విమానయాన సంస్థలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోన్నుయంటూ ఇప్పటికే వార్తలు బిజినెస్ వర్గాల్లో వ్యాపించాయి. ఇతిహాద్‌కు ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్‌లో 24శాతం వాటా ఉండగా, మరో రూ. 700 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దీనిపై ఇప్పటికే పలు మీడియా సంస్థలు నివేదించాయి కూడా.. ఈ డీల్ ఓకే అయితే ఇతిహాద్ వాటా మరింత పెరగనుంది. అటు ఫౌండర్ నరేష్ గోయేల్ వాటాలు 20శాతానికి పడిపోతాయి. అలాగే రూ. 3000 కోట్ల రుణాలు అందించడానికి రుణదాతలు ముందుకొచ్చాయని సమాచారం. అయితే తాజా పరిణామంపై జెట్ ఎయిర్వేస్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దుబే ఉద్యోగులకు ఇచ్చిన సమాచారం ఆసక్తికరంగా మారింది. రాబోయే కాలంలో మరింత కఠిన పరిస్థితులను ఎదుర్కోబోతోందని సిబ్బంది సహనంగా ఉండాలని పేర్కొన్నారు. కంపెనీ నిలదొక్కుకునే ముందు కొన్ని ఇబ్బందులు తప్పవని, కానీ ఉద్యోగుల సంపూర్ణ మద్దతు, నిబద్ధతతో సమిష్టి కృషితో భవిష్యత్తులో బలమైన సంస్థగా నిలబడతామనే ధీమాను వ్యక్తం చేశారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్కు అతిపెద్ద రుణదాతగా ఉన్న స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఇతర బ్యాంకులు, ఛైర్మన్ నరేష్ గోయల్, ఇతిహాద్ సీఈఓ టోనీ డగ్లస్ మధ్య ఒక అత్యవసర భేటీని ఏర్పాటు చేసింది. అనంతరం జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించేందుకు త్వరలోనే ఒక పరిష్కారం దొరుకుతుందంటూ పిబ్రవరి 25న, కొంతమంది ముఖ్య వాటాదారులతో కలిసి ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. కాగా అద్దెలు చెల్లించలేక ఇటీవల 6బోయింగ్ 737 విమానాలను, 15 ఇతర విమానాలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా పరిమాణాలతో జెట్ ఎయిర్ వేస్ రుణ బాధలనుండి బయట పడే అవకాశం ఉందని అంచనా.