విమానయానంపై ఆఫర్లే... ఆఫర్లు
ముంబై: విమాన టికెట్లకు సంబంధించి ఆఫర్ల వర్షం కురుస్తూనే ఉంది. జెట్ ఎయిర్‌వేస్ రూ.908కే విమాన యానాన్ని(అన్ని చార్జీలు కలుపుకొని) అందిస్తోంది. దీనికి ప్రతిగా రూ.690కే విమాన యానాన్ని అందిస్తామని ఎయిర్‌ఏషియా ఇండియా తెలిపింది. మరోవైపు స్పైస్‌జెట్ సంస్థ ఎంఎస్‌ఎంఈ సంస్థల వ్యక్తులకు 10 శాతం డిస్కౌంట్‌కే విమానయానాన్ని ఆఫర్ చేస్తోంది.
జెట్ ఎయిర్‌వేస్: ఎయిర్‌ఏషియాకు గట్టిపోటీనివ్వడానికి ఆ సంస్థ నడిపే రూట్లలోనే జెట్ ఎయిర్‌వేస్ రూ.908కే విమానయానాన్ని ఆఫర్ చేస్తోంది. బెంగళూరు నుంచి చెన్నై, చంఢీగర్, కోచి, జైపూర్ విమాన టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని జెట్ తెలిపింది.
ఎయిర్‌ఏషియా ఆఫర్ రూ.690 నుంచి
జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్‌కు ప్రతిగా ఎయిర్‌ఏషియా కంపెనీ రూ.690 నుంచి ప్రారంభమయ్యే ధరలకే విమానయానాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా 15 లక్షల ప్రమోషనల్ సీట్లను అందిస్తున్నామని తెలిపింది. బెంగళూరు నుంచి చెన్నై, కోచి, గోవాలకు రూ.690కే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది.
బెంగళూరు నుంచి జైపూర్, చండీగర్‌లకు రూ.2,390లకు విమాన టికెట్‌ను అందిస్తోంది. చెన్నై, కోచి, కోల్‌కత, తిరుచిరాపల్లి, బెంగళూరు నుంచి కౌలాలంపూర్‌కు రూ.4,999(అన్ని చార్జీలతో, కనీస ధర). చెన్నై నుంచి బ్యాంకాక్‌కు రూ.4.500కు విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్‌కు బుకింగ్స్ సోమవారం నుంచే మొదలయ్యాయని, వచ్చే నెల 5 వరకూ ఉంటాయని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 15-జూన్ 30 వరకూ ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
ఎంఎస్‌ఎంఈ ప్రయాణికులకు స్పైస్‌జెట్ ఆఫర్
లఘు, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు చెందిన వ్యక్తులకు స్పైస్‌జెట్ 10% డిస్కౌంట్‌నిస్తోంది. ఎస్‌ఎంఈ ట్రావెలర్ పేరుతో దీన్ని అందిస్తోంది.