Fare war
-
ఎయిర్ ఇండియా- రైల్వేస్ ప్రైస్ వార్
న్యూఢిల్లీ: విమాన టికెట్లలో డిస్కౌంట్ ఆఫర్లతో భారతీయ రైల్వేలకు ప్రభుత్వ, ఇతర ప్రయివేట్ విమానయాన సంస్థలు షాకిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీలకు దాదాపు సమామైన ధరలను ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే నూతన సంవత్సరంలో మూడు ప్రధాన విమాన యాన సంస్థలు తగ్గింపు ధరలను ప్రకటించాయి. తాజా ఎయిర్ ఇండియా మూడు నెలల తగ్గింపు ధరలను లాంచ్ చేసింది. ఈ డిస్కౌంట్ సేల్ ఆఫర్ జనవరి 6 న మొదలై ఏప్రిల్ 30 వ తేదీతో ముగియనుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ రాయితీ టిక్కెట్లు జనవరి 26 ఏప్రిల్ 30 మధ్య ప్రయాణానికి అందుబాటులో ఉన్నాయి. (చదవండి: ఎయిర్‌లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు) రైల్వే రిజర్వేషన్ కోసం వెయిటింగ్ తదితర కారణాల రీత్యా అసంతృప్తిగా ఉన్న రైల్వే ప్రయాణికులను ఆకర్షించే యోచనలో ఈ తగ్గింపు ధరల్ని ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టినట్టు సమాచారం. ఈ ప్రత్యేక ఛార్జీలు అన్ని రాజధాని రూట్ తోపాటు, జాతీయ రవాణా సంస్థ రైల్వేస్ తిరగని ఇతర మార్గాల్లో కూడా అందుబాటులోకి తెచ్చినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు, న్యూ ఢిల్లీ-ముంబై విమాన ఛార్జీ రూ 2,401 కే అందిస్తుండగా , రాజధాని ఎసి సెకండ్ కాస్ల్ ఛార్జీ రూ 2,870 గా ఉంది. న్యూఢిల్లీ-పాట్నా రాజధాని టికెట్ రూ 2,290, కాగా, ఎయిర్ ఇండియా ఎకానమీ క్లాస్ టికెట్ ను రూ 2,315 కు అందిస్తోంది. -
విమానయానంపై ఆఫర్లే... ఆఫర్లు
-
విమానయానంపై ఆఫర్లే... ఆఫర్లు
ముంబై: విమాన టికెట్లకు సంబంధించి ఆఫర్ల వర్షం కురుస్తూనే ఉంది. జెట్ ఎయిర్వేస్ రూ.908కే విమాన యానాన్ని(అన్ని చార్జీలు కలుపుకొని) అందిస్తోంది. దీనికి ప్రతిగా రూ.690కే విమాన యానాన్ని అందిస్తామని ఎయిర్ఏషియా ఇండియా తెలిపింది. మరోవైపు స్పైస్‌జెట్ సంస్థ ఎంఎస్ఎంఈ సంస్థల వ్యక్తులకు 10 శాతం డిస్కౌంట్‌కే విమానయానాన్ని ఆఫర్ చేస్తోంది. జెట్ ఎయిర్వేస్: ఎయిర్‌ఏషియాకు గట్టిపోటీనివ్వడానికి ఆ సంస్థ నడిపే రూట్లలోనే జెట్ ఎయిర్వేస్ రూ.908కే విమానయానాన్ని ఆఫర్ చేస్తోంది. బెంగళూరు నుంచి చెన్నై, చంఢీగర్, కోచి, జైపూర్ విమాన టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని జెట్ తెలిపింది. ఎయిర్ఏషియా ఆఫర్ రూ.690 నుంచి జెట్ ఎయిర్వేస్ ఆఫర్‌కు ప్రతిగా ఎయిర్ఏషియా కంపెనీ రూ.690 నుంచి ప్రారంభమయ్యే ధరలకే విమానయానాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా 15 లక్షల ప్రమోషనల్ సీట్లను అందిస్తున్నామని తెలిపింది. బెంగళూరు నుంచి చెన్నై, కోచి, గోవాలకు రూ.690కే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. బెంగళూరు నుంచి జైపూర్, చండీగర్‌లకు రూ.2,390లకు విమాన టికెట్‌ను అందిస్తోంది. చెన్నై, కోచి, కోల్‌కత, తిరుచిరాపల్లి, బెంగళూరు నుంచి కౌలాలంపూర్‌కు రూ.4,999(అన్ని చార్జీలతో, కనీస ధర). చెన్నై నుంచి బ్యాంకాక్‌కు రూ.4.500కు విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్‌కు బుకింగ్స్ సోమవారం నుంచే మొదలయ్యాయని, వచ్చే నెల 5 వరకూ ఉంటాయని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 15-జూన్ 30 వరకూ ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఎంఎస్ఎంఈ ప్రయాణికులకు స్పైస్‌జెట్ ఆఫర్ లఘు, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు చెందిన వ్యక్తులకు స్పైస్‌జెట్ 10% డిస్కౌంట్‌నిస్తోంది. ఎస్ఎంఈ ట్రావెలర్ పేరుతో దీన్ని అందిస్తోంది. -
దిగొచ్చిన విమానం..!
న్యూఢిల్లీ: అధిక చార్జీల కారణంగా ప్రయాణికులు తగ్గిపోతూ... ఉన్న ప్రయాణికులు కూడా సింహభాగం కొన్ని ఎయిర్‌లైన్స్‌నే ఆశ్రయిస్తుండటంతో కంపెనీలు మరోసారి ధరల పోరుకు తెరతీశాయి. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే జనవరి-మార్చి మధ్య కాలంలో ఈసారి కూడా ఎయిర్‌లైన్స్ కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లతో తెరమీదికొచ్చాయి. బేస్ ఫేర్, ఇంధన సర్‌చార్జీలను 50 శాతం తగ్గిస్తున్నట్లు సన్ గ్రూప్‌నకు చెందిన స్పైస్‌జెట్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే... ఇండిగో, గోఎయిర్, ఎయిర్ ఇండియా సంస్థలు కూడా ఇలాంటి ఆఫర్లనే అందుబాటులోకి తెచ్చాయి. ఎయిర్ ఇండియా ‘స్ప్రింగ్‌సేల్’... డిస్కౌంట్ అనంతరం కొన్ని రూట్లలో ఎయిర్ ఇండియా టికెట్ ప్రారంభ ధర పన్నులతో కలిపి రూ.1,357 స్థాయిలో ఉంది. సాధారణ రోజుల్లో చార్జీలతో పోలిస్తే ఇది 70 శాతం తక్కువ. ‘స్ప్రింగ్‌సేల్’ పేరుతో ఎయిర్ ఇండియా ప్రారంభిస్తున్న డిస్కౌంట్ సేల్ నేటి (బుధవారం) నుంచి ప్రారంభమై శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ టికెట్లు కొన్నవారు ఫిబ్రవరి 21 నుంచి ఏప్రిల్ 15లోగా ప్రయాణించాల్సి ఉంటుంది. తమ నెట్‌వర్క్‌లోని అన్ని రూట్లలోనూ రాయితీ చార్జీలు వర్తిస్తాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది. స్పైస్‌జెట్... 50 శాతం బేస్ ఫేర్‌తో పాటు ఇంధన సర్‌చార్జీలను సగానికి తగ్గించామని స్పైస్‌జెట్ ప్రకటించింది. ప్రయాణ తేదీకి కనీసం 30 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్ కంపెనీలు ఈ సీజన్లో ఇలాంటి ఆఫర్ల సాయంతో సీట్లను భర్తీ చేస్తుంటాయని, డిస్కౌంట్లు ఇచ్చి ప్రయాణికులను ఆకట్టుకోకపోతే ఆ సీట్లు ఖాళీగానే ఉంటాయని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. మంగళవారం ప్రారంభమైన చార్జీల రాయితీ మూడు రోజులపాటు అమల్లో ఉంటుంది. అంటే గురువారం రాత్రి 12 గంటల్లోపు బుక్ చేసుకునే టికెట్లపైనే డిస్కౌంట్ వర్తిస్తుంది. ‘ఈ ఆఫర్ దేశంలోని కొన్ని నగరాలకే పరిమితం. అంతర్జాతీయ పర్యటనలపై డిస్కౌంటు ఉండకపోవచ్చు...’ అని సన్ గ్రూప్ సీఎఫ్ఓ నారాయణన్ చెప్పారు. రాయితీ చార్జీలతో కంపెనీ ఆదాయంపై ఎలాంటి ప్రభా వం పడబోదన్నారు. ఆఫర్లో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ లోపు ప్రయాణించగలిగే టికెట్లు మాత్రమే లభ్యమవుతాయన్నారు. ఇండిగో, గో ఎయిర్ కూడా... ఇండిగో, గో ఎయిర్ అధికారికంగా ఇంకా డిస్కౌంట్లను ప్రకటించకపోయినా... ప్రయాణ తేదీకి 30-60 రోజుల ముందు టికెట్లు కొనేవారికి ఆ కంపెనీలు 50 శాతం వరకు టికెట్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు తెలియజేశారు. కాగా ఎయిర్‌లైన్ కంపెనీలు బేస్ ఫేర్‌ను మాత్రమే తగ్గిం చాయి. వర్తించే ఇతర ఫీజులు, పన్నులన్నిటినీ ప్రయాణికులే భరించాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే స్పైస్‌జెట్ విమానంలో గోవా - ముంబై చార్జీ కేవలం 20 శాతమే తగ్గుతుంది. చార్జీల తగ్గింపును ధ్రువీకరించడానికి ఆయా ఎయిర్‌లైన్స్ అధికారులు అందుబాటులోకి రాలేదు. రెండున్నర రెట్లు పెరిగిన బుకింగ్స్.. ఎయిర్‌లైన్స్ కంపెనీలు చార్జీలను తగ్గించిన కొద్ది గంటల్లోనే తమ వెబ్సైట్లో బుకింగ్‌ల సంఖ్య దాదాపు 250% పెరిగినట్లు యాత్రా డాట్‌కామ్ ప్రతినిధి శరత్ దలాల్ చెప్పారు. మరో ట్రావెల్ పోర్టల్ మేక్మైట్రిప్ సైతం ఎయిర్ టికెట్ల బుకింగ్‌లు గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. డిస్కౌంట్ సంగతి అందరికీ తెలిసిన తర్వాత బుకింగ్స్ మరింత పెరగవచ్చని పేర్కొంది. గూగుల్‌లో రెండు లక్షల సెర్చ్‌లు స్పైస్‌జెట్ చార్జీలను సగానికి సగం తగ్గించినట్లు తెలియడంతో నెట్లో ఎంక్వయిరీలు ప్రారంభించారు. గూగుల్‌లో మంగళవారం ఒక్కరోజే దాదాపు రెండు లక్షల మంది సెర్చ్ చేశారు. చార్జీలు ఎంత తగ్గాయో ఆరా తీశారు.