AirAsia
-
థాయ్‌ల్యాండ్‌కు ఎయిర్ ఏషియా మరిన్ని సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: థాయ్ ఎయిర్ ఏషియా తాజాగా భారత్ నుంచి థాయ్‌ల్యాండ్‌కు డైరెక్ట్ ఫ్లయిట్ సరీ్వసులను విస్తరించింది. కొత్త రూట్లలో హైదరాబాద్–బ్యాంకాక్, చెన్నై–ఫుకెట్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సరీ్వసులు అక్టోబర్ 27న, చెన్నై నుంచి ఫ్లయిట్స్ అక్టోబర్ 30న ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్ కింద హైదరాబాద్–బ్యాంకాక్ రూట్లో వన్–వే టికెట్ చార్జీ రూ. 7,390గా ఉంటుంది. వచ్చే నెల 27 నుంచి 2025 మార్చి 29 వరకు ప్రయాణాల కోసం సెపె్టంబర్ 22 వరకు ఈ ప్రమోషనల్ ఆఫర్ కింద బుక్ చేసుకోవచ్చు. కొత్తగా 2 సర్వీసుల చేరికతో భారతీయ మార్కెట్లో తాము సరీ్వసులు నిర్వహించే రూట్ల సంఖ్య 14కి చేరుతుందని థాయ్ ఎయిర్ఏషియా హెడ్ (కమర్షియల్) తన్సితా అక్రారిత్పిరోమ్ తెలిపారు. -
వెండి తెరపై విదేశీ అందాలు.. ఎయిర్‌లైన్ వినూత్న ప్రచారం
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు సినిమా థియేటర్లలో ‘సినిమాటిక్ ఇన్-ఫ్లైట్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎయిరేషియా ప్రకటించింది. భారత్‌లోని 16 నగరాల నుంచి మలేషియా, థాయ్‌ల్యాండ్‌ల మీదుగా 130 గమ్యస్థానాలకు ఎయిరేషియా విమానాలు నడుపుతోంది. తన నెట్‌వర్క్‌లోని పర్యాటక స్థలాలను వివరిస్తూ ప్రచారాన్ని సాగిస్తామని కంపెనీ తెలిపింది. దానివల్ల భారత్‌లో తమ ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ కరోల్ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సినిమా థియేటర్లలో ‘‘సినిమాటిక్ ఇన్-ఫ్లైట్’’ ద్వారా కంపెనీ నెట్‌వర్క్‌లోని పర్యాటక స్థలాలను ప్రదర్శిస్తాం. దానివల్ల భారత్‌లో కంపెనీకి ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం క్యూబ్ సినిమాస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. వచ్చే ఆరు నెలల్లో దేశంలోని 12 ప్రధాన నగరాల్లో 130 థియేటర్ల ద్వారా ఎయిరేషియా గమ్యస్థానాల గురించి వివరిస్తాం. భారతీయులు ఎక్కువ ప్రయాణించే ఆసియా, ఆస్ట్రేలియాల్లో పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఒక వ్యక్తికి రూ.2 లక్షలే అప్పు ఇవ్వాలి: ఎంఫిన్ప్రస్తుతం ఎయిరేషియా భారత్ నుంచి మలేషియా, థాయ్‌లాండ్‌లకు 22 డైరెక్ట్ సర్వీసులను నడుపుతోంది. త్వరలో మరో నాలుగు మార్గాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందుకోసం గౌహతి, కోజికోడ్, లఖ్‌నవూ, కౌలాలంపూర్‌లను ఎంచుకుంది. రాబోయే కొన్ని వారాల్లో తిరుచిరాపల్లి నుంచి నేరుగా బ్యాంకాక్‌కు విమాన సర్వీసు ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. -
ఎయిర్ ఏషియా సీఈవో రాజీనామా.. కారణమిదే..
ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ ఆపరేటర్ ఎయిర్ ఏషియా బెర్హాడ్ (AirAsia Berhad) మలేషియా యూనిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రియాద్ అస్మత్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం ఎయిర్‌లైన్‌లో నాయకత్వంలో చెప్పుకోదగ్గ మార్పును సూచిస్తోంది. కారణమిదేనా? రియాద్ అస్మత్ 2018 జనవరిలో ఎయిర్ ఏషియా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కంపెనీ బోర్డులో సలహాదారుగా మారాలనే యోచనతో ఆయన సీఈవోగా వైదొలగడానికి సిద్ధమయ్యారు. అస్మత్ నిష్క్రమణ ప్రకటనలో గల కారణాలకు సంబంధించి నిర్దిష్ట వివరాలు లేవు. అయితే ఎయిర్ ఏషియా ఏవియేషన్ గ్రూప్ పునర్నిర్మాణ కార్యక్రమాలు, సిబ్బంది మార్పులపై రాబోయే అప్డేట్లను ఇది తెలియజేస్తోంది. బడ్జెట్ ఎయిర్‌లైన్ సెక్టార్లో ప్రముఖ సంస్థ అయిన ఎయిర్ ఏషియా ఏవియేషన్ పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్లను, రానున్న మహమ్మారి నేపథ్యంలో తలెత్తే ఒడిదుడుకులను అధిగమించడానికి ఈ సంస్థాగత మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రియాద్ అస్మత్ తన నైపుణ్యం, అనుభవాన్ని కంపెనీ కోసం మరింతగా వినియోగించేందుకు సలహాదారుగా మారుతున్నట్లు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. -
ఎయిర్‌ఏషియాకు రూ.20లక్షల ఫైన్! ఎందుకంటే..
సాక్షి, ముంబై: ఏషియా విమాన సంస్థకు భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ.20 లక్షల జరిమానా విధించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిబంధనల ప్రకారం విమానాన్ని నడిపే పైలట్‌కు సామర్థ్య పరీక్షలు నిర్వహించేటప్పుడు కొన్ని కచ్చితమైన చర్యలు పాటించాలి. వాటిని పాటించడంలో వైఫల్యం చెందినందుకు గానూ ఎయిర్ఏషియా యాజమాన్యానికి డీజీసీఏ ఈ ఫైన్ విధించింది. డీజీసీఏ నిబంధనల మేరకు విధులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శించిన ఎయిర్‌లైన్స్ ట్రైనింగ్ విభాగ అధిపతిని మూడు నెలల పాటు తొలగించింది. అలాగే ఎనిమిది మంది సూపర్వైజర్లకు ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు డీజీసీఏ ఎయిర్ఏషియా మేనేజర్‌కు, శిక్షణ విభాగం అధిపతికి, పర్యవేక్షకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించడంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. వారి నుంచి వివరణలు వచ్చిన అనంతరం వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. చదవండి: ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు.. ఏం జరిగిందంటే.. -
ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్, 50లక్షల టికెట్లు ఉచితంగా
సాక్షి,ముంబై: ప్రముఖ ఎయిర్‌లైన్ ఎయిర్ ఏసియా విమాన ప్రయాణీకులకు భారీ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఏకం50 లక్షల ఉచిత విమాన టికెట్లను అందిస్తోంది. ఈమేరకు కంపెనీ ట్విటర్లో వివరాలను అందించింది కస్టమర్లు సెప్టెంబర్ 25 వరకు ఈ ఆఫర్లతో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇలా కొన్ని టికెట్ల ద్వారా జనవరి 1 అక్టోబర్ 28, 2023 మధ్య ప్రయాణించవచ్చని ఎయిర్ ఏసియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరెన్ చాన్. తమ వెబ్సైట్, మొబైల్ఆప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యాప్ లేదా వెబ్సైట్లో, ఈ ఆఫర్‌ను యాక్సెస్ కోసం "Flights" చిహ్నాన్ని ఎంచుకోవాలని తెలిపారు. అంతర్జాతీయంగా విమాన సేవలు క్రమంగా పునఃప్రారంభించడంతో పాటు, సంస్థ 21వ పుట్టినరోజు సందర్భంగా అందిస్తున్నఈ బిగ్ సేల్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చాన్ కోరారు. థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాంతో సహా అనేక ASEAN దేశాల ప్రయాణికులు ఆఫర్‌కు అర్హులు. రెండు నెలల క్రితం ఎయిర్ఏషియా కస్టమర్లకు ఉచిత టికెట్లను అందించిన సంగతి తెలిసిందే. AirAsia's BIG Sale is back! Enjoy 5 Million FREE Seats* starting today until 25 September 🥳 **Domestic: All-in from RM23, Asean: All-in from RM54. *Includes airport taxes, MAVCOM fee, fuel surcharges and other applicable fees. T&C apply. Read more: https://t.co/Pe2kRcZC7L — airasia Super App (@airasia) September 19, 2022 -
ఎయిర్ ఏషియా ఇకపై ఉండదు! కారణమిదే?
న్యూఢిల్లీ: ఎయిర్ఏషియా ఇండియాలో మొత్తం ఈక్విటీ వాటాలను ఎయిరిండియా కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేసింది. పరిశ్రమలో గుత్తాధిపత్యానికి దారితీసే అవకాశం ఉండే డీల్స్‌కు సీసీఐ ఆమోదం అవసరమవుతుంది. వివరాల్లోకి వెడితే .. టాటా సన్స్ (టీఎస్పీఎల్), ఎయిర్ఏషియా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (ఏఏఐఎల్) కలిసి జాయింట్ వెంచర్ సంస్థగా ఎయిర్ఏషియా ఇండియాను ఏర్పాటు చేశాయి. ఇందులో టీఎస్‌పీఎల్‌కు 83.67 శాతం, ఏఏఐఎల్‌కు 16.33 శాతం వాటాలు ఉన్నాయి. 2014 జూన్‌లో ఎయిర్ఏషియా ఇండియా దేశీయంగా ప్రయాణికులకు ఫ్లయిట్ సర్వీసులు, సరుకు రవాణా, చార్టర్ ఫ్లయిట్ సేవలను ప్రారంభించింది. అంతర్జాతీయంగా కార్యకలాపాలు లేవు. మరోవైపు, టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ ఏడాదే ప్రభుత్వ రంగ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను రూ. 18,000 కోట్లకు కొనుగోలు చేసింది. టాటా గ్రూప్ ఇప్పటికే జాయింట్ వెంచర్లయిన ఎయిర్ఏషియా ఇండియా, విస్తార ద్వారా సేవలందిస్తోంది. తాజాగా ఎయిరిండియా కొనుగోలు తర్వాత ఏవియేషన్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
శరీరంలో బాంబు ఉందంటూ ఓ యువతి..
కోల్‌కతా : ఓ యువతి చేసిన నిర్వాకానికి కోల్ కతా ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఏషియన్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సివచ్చింది. తన శరీరంలో బాంబు ఉందని, దానిని ఏ క్షణంలోనైనా పేల్చేస్తానని బెదిరించడంతో కంగుతిన్న ఫైలెట్.. విమానాన్ని కోల్‌కతాఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మోహిని మొండల్ (25) శనివారం రాత్రి 9.57 గంటలకు ఎయిర్ ఏషియన్ విమానంలో కోల్‌కతా నుంచి ముంబై బయలు దేరింది. మార్గమద్యలో తన కేబిన్ సిబ్బందికి ఒక లెటర్ ఇచ్చి అది ఫ్లైట్ కెప్టెన్‌కు అందివాల్సిందిగా కోరింది. తన శరీరం చుట్టూ బాంబులు ఉన్నాయని, వాటిని ఏ క్షణమైనా పేల్చేస్తానని లేఖలో హెచ్చరించింది. దీంతో కంగుతిన్న పైలట్..అధికారులకు సమాచారం అందించి కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం మోహిని మెండల్‌ను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి శనివారం రాత్రి 11.46 గంటలకు తిరిగి పంపించారు. కాగా, మోహిని శరీరంలో బాంబు లేదని, ఆమె ఎందుకు అలా బెదిరించిందో విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు. -
ఔను.. జెట్ రేసులో ఉన్నాం!
ముంబై: ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు సంబంధించి వస్తున్న వార్తలపై పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఎట్టకేలకు స్పందించింది. దీనిపై చర్చలింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, తామింకా నిర్మాణాత్మకంగా ఎలాంటి ప్రతిపాదన కూడా చేయలేదని స్పష్టంచేసింది. జెట్ టేకోవర్‌పై చర్చించేందుకు శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం టాటా సన్స్ ఈ విషయం వెల్లడించింది. తద్వారా జెట్ కొనుగోలుపై కొన్నాళ్లుగా వస్తున్న వార్తలను అధికారికంగా ధృవీకరించినట్లయింది. ‘జెట్ ఎయిర్వేస్ టేకోవర్‌పై టాటా సన్స్ ఆసక్తిగా ఉందంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే, ఈ అంశంపై చర్చలు ప్రాథమిక స్థాయిలోనే జరిగాయని స్పష్టం చేయదల్చుకున్నాం. నిర్దిష్ట ప్రతిపాదనేదీ మేం ఆఫర్ చేయలేదు‘ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేసే విషయంపై శుక్రవారం బోర్డు సమావేశంలో టాటాలు సానుకూల నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాల నేపథ్యంలో తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించే విషయంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగిందని, కంపెనీని కొనుగోలు చేసేలా టాటా సన్స్‌కు సూచనలు చేసిందన్న వార్తలు కూడా వచ్చినప్పటికీ కేంద్రం వాటిని తోసిపుచ్చింది. గురువారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన వివరణలో కూడా టేకోవర్ వార్తలన్నీ ఊహాగానాలేనంటూ జెట్ ఎయిర్వేస్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. జెట్ ఎయిర్వేస్లో ప్రమోటరు, చైర్మన్ నరేష్ గోయల్, ఆయన కుటుంబానికి 51%, ఎతిహాద్ ఎయిర్వేస్కు మరో 24% వాటాలు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి జీ తాలు కూడా సక్రమంగా చెల్లించలేకపోతోంది. వరుసగా గత మూడు త్రైమాసికాల్లో భారీ నష్టాలు ప్రకటించింది. తాజా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 1,261 కోట్ల నష్టం నమోదు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నరేష్ గోయల్ పూర్తిగా తప్పుకుని, నిర్ణయాధికారం పూర్తి గా తమదిగా ఉండే పక్షంలో మాత్రమే డీల్ కుదుర్చుకోవాలని టాటా సన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జెట్‌పై వ్యూహం.. జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసిన పక్షంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యంలో దేశీయంగా ఏర్పాటు చేసిన విస్తార విమానయాన సంస్థలో భాగం చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విస్తారకు దేశీయంగా 22 విమానాలు, 3.8 శాతం మాత్రమే మార్కెట్ వాటా ఉంది. మరోవైపు, అనుబంధ సంస్థ జెట్లైట్తో కలిపి జెట్‌కు 124 విమానాలు, 15.8 శాతం మార్కెట్ వాటా ఉంది. దేశ, విదేశాల్లో 66 ప్రాంతాలకు విమాన సేవలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ రూట్లలో విస్తార కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్నా అందుకు సంబంధించిన అనుమ తులు మంజూరు కావడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జెట్‌ను కొనుగోలు చేసి విస్తారలో విలీనం చేస్తే.. నేరుగా విదేశీ రూట్లలో సర్వీసులు ప్రారంభించేందుకు వెసులుబాటు లభించే అవకాశం ఉంది. 2008లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కూడా విదేశీ రూట్లలో సర్వీసులు మొదలుపెట్టేందుకు ఇదే తరహాలో ఎయిర్ డెక్కన్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అయిదేళ్ల కార్యకలాపాలు పూర్తయితే గానీ దేశీ ఎయిర్‌లైన్స్‌కు విదేశీ రూట్లలో సేవలకు అర్హత లభించేది కాదు. ఎయిర్ఏషియాకి ’టాటా’ .. జెట్ ఎయిర్వేస్పై కన్నేసిన టాటా గ్రూప్.. ఏవియేషన్ వ్యాపారంలో మరో వెంచర్ నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్ ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ)తో కలిసి విసార పేరుతో పూర్తి స్థాయి విమానయాన సంస్థను, మలేషియాకి చెందిన ఎయిర్ఏషియా బెర్హాద్‌తో కలిసి చౌక చార్జీల ఎయిర్ ఏషియా ఇండియాను నిర్వహిస్తోంది. ఎయిర్ఏషియా ఇండియా నుంచి వైదొలగాలని టాటా సన్స్ యోచిస్తున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. ఒకవేళ జెట్ ఎయిర్వేస్ డీల్ సాకారమైతే దాన్ని విస్తారలో విలీనం చేసి మొత్తం మీద ఒక్క విమానయాన వెంచర్‌కే పరిమితం కావాలని భావిస్తున్నట్లు వివరించాయి. ప్రస్తుతం ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్‌కు 49 శాతం, ఎయిర్ఏషియా బెర్హాద్‌కు మిగతా వాటాలు ఉన్నాయి. కంపెనీకి 19 విమానాలు ఉన్నాయి. ఒకవైపున జెట్ ఎయిర్వేస్ టేకోవర్‌కు టాటా సన్స్ ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఎయిర్ఏషియా ఇండియా నుంచి తప్పుకోవడంపై కూడా చర్చలు ప్రాథమికంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే, ఎయిర్ఏషియా ఇండియా పరిమాణం తక్కువగా ఉండటం, మందగతిన కార్యకలాపాల విస్తరణ, నష్టాలు, ఎయిర్ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్.. ఇతర అధికారుల అనుమానాస్పద లావాదేవీలపై సీబీఐ విచారణ తదితర అంశాల కారణంగా కొనుగోలుదారును పట్టుకోవడం టాటాలకు కాస్త కష్టతరంగానే ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యామ్నాయంగా ఫెర్నాండెజ్ స్వయంగా తన వాటాలను అమ్మేసి వైదొలిగే అంశాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. ‘తనమీద కేసులు దాఖలు కావడంతో భారత్‌లో వ్యాపారం చేయడం టోనీ ఫెర్నాండెజ్‌కు మరింత కష్టతరంగా మారుతోంది. దీంతో కంపెనీలో తన వాటాలను అమ్మేసే అవకాశాలను ఆయన పరిశీలించవచ్చు. అయితే, ఒకవేళ తాను వైదొలగాలని అనుకుంటే.. విమానయాన సంస్థలో తన వాటాలకు మంచి గిట్టుబాటు రేటు వస్తే తప్ప ఆయన తప్పుకోరు‘ అని కంపెనీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరోవైపు, ఫెర్నాండెజ్ వాటాలను కొనుగోలు చేసి ఎయిర్ఏషియా ఇండియాను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్నా టాటాలకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చన్న అభిప్రాయం నెలకొంది. ఇన్ఫ్రా, అకౌంటింగ్, రిజర్వేషన్ వ్యవస్థ మొదలైనవన్నీ ఎయిర్ఏషియా బెర్హాద్ లేదా దాని అనుబంధ సంస్థలు మలేషియా నుంచి నిర్వహిస్తుంటాయని, టాటాలకు కేవలం లైసెన్సు, స్లాట్స్ మాత్రమే దక్కుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జెట్ షేరు జూమ్.. టాటా సన్స్ టేకోవర్ చేయొచ్చంటూ వస్తున్న వార్తలు జెట్ ఎయిర్వేస్ షేరుకు గణనీయంగా లాభించాయి. గడిచిన అయిదు ట్రేడింగ్ సెషన్స్‌లో సంస్థ షేరు ఏకంగా 40 శాతం దూసుకెళ్లింది. టాటా సన్స్ బోర్డు సమావేశంలో టేకోవర్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలతో శుక్రవారం జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో 14 శాతం గ్యాప్ అప్‌తో ప్రారంభమైంది. చివరికి 8 శాతం లాభంతో రూ. 346.85 వద్ద క్లోజయ్యింది. అటు ఎన్ఎస్ఈలో 8 శాతం పెరిగి రూ. 341 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.366.95 స్థాయిని కూడా తాకింది. -
ఎయిర్ఏషియా ఆఫర్లు
ముంబై: ఎయిర్ఏషియా సంస్థ విమాన టికెట్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ట్రస్ట్ యువర్ వాండర్లస్ట్ పేరుతో ఈ ఆఫర్లను అందిస్తున్నామని ఎయిర్ఏషియా తెలిపింది. విమాన టికెట్లను దేశీయ రూట్లలో కనిష్ట చార్జీ రూ.1,199కు, అంతర్జాతీయ రూట్లలో రూ.4,399కే ఆఫర్ చేస్తున్నామని వివరించింది. వచ్చే నెల 2లోపు, ఎయిర్ఏషియా అధికారిక వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్లు వర్తిస్తాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 17లోపు ప్రయాణాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్జీ రూ.1,199 మాత్రమేనని తెలిపింది. -
లాబీయింగ్‌లో అవినీతికి పాల్పడలేదు
న్యూఢిల్లీ: పౌర విమానయాన రంగంలో కీలకమైన 5/20 నిబంధన తొలగింపు కోసం చేసిన లాబీయింగ్‌లో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ‘చట్టబద్ధం కాని చెల్లింపులు’ జరపలేదని మలేసియాకి చెందిన ఎయిర్ఏషియా గ్రూప్ స్పష్టం చేసింది. సక్రమమైన మార్గంలోనే అన్ని అనుమతులూ పొందామని పేర్కొంది. అంతర్జాతీయ రూట్ల లైసెన్సు కోసం అధికారులకు లంచాలు ఎరగా వేసి, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంటూ ఎయిర్ఏషియా ఇండియాతో పాటు గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌పై ఆరోపణలున్న నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆరోపణలపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ‘అన్ని అనుమతులూ సక్రమమైన మార్గంలోనే పొందాం. ఇందుకు ఏడాది పైగా పట్టింది. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా.. 5/20 నిబంధనను తొలగించాలని ఏవియేషన్ రంగంలోని ఇతర సంస్థలతో కలిసే లాబీయింగ్ చేశాం. ఇదంతా చట్టబద్ధంగానే జరిగింది. చట్టవిరుద్ధంగా ఎలాంటి చెల్లింపులు జరపలేదు‘ అంటూ ఏఏజీబీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దేశీ విమానయాన సంస్థలు విదేశీ సర్వీసులు నడపాలంటే కనీసం అయిదేళ్ల పాటు కార్యకలాపాల అనుభవంతో పాటు 20 విమానాలు ఉండాలంటూ 5/20 నిబంధన నిర్దేశిస్తోంది. కొత్త కంపెనీలకు ప్రతిబంధకంగా ఉన్న దీన్ని 2016లో ఎత్తివేశారు. ఎయిర్ఏషియా ఇండియా భారత్‌లో 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. -
టీడీపీలో ఫోన్ ట్యాపింగ్ రగడ
-
సింగపూర్ లాబీతో టీడీపీ సంబంధాలు నిజమా..?కాదా..?
-
టీడీపీలో ఎయిర్ ఏషియా కలవరం
సాక్షి, అమరావతి : ఎయిర్ ఏషియా స్కాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనకు రావడంతో టీడీపీలో కలవరం మొదలైంది. ఆ పార్టీ నాయకుడు ఆశోక్ గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్ ఏషియా ప్రతినిధుల మధ్య జరిగిన సంభాషణల ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. ఆ టేపులో చంద్రబాబు మనిషే కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు.. ఆయన్ని పట్టుకుంటే మనకు కావాల్సిన పని అవుతుందని వారి మధ్య సంబాషణ నడిచింది. దీంతో సమస్యను పక్కదోవ పట్టించడానికి టీడీపీ రంగం సిద్ధం చేసింది. టీడీపీ గతంలో ఓటుకు కోట్లులో విషయంపై వివరణ ఇవ్వకుండా సమస్యను దాటవేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ స్కాంలో టీడీపీ నాయకుల పేర్లు రావడంపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎదురుదాడికి దిగారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ నేతల గురించి వచ్చిన ఆరోపణలపై స్పందించకుండా ఎయిర్ ఏషియాలో స్కాం నిజమైతే కేంద్రమంత్రులంతా డబ్బులు తిన్నట్టే అంటూ వింత రాగం అందుకున్నారు. చంద్రబాబు ప్రస్తావన ఎలా బయటకి వచ్చిందంటూ ప్రశ్నించారు. భారత్‌లో ఫోన్ ట్యాపింగ్ అనుమతిస్తున్నారా అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నవి బయటకెలా వచ్చాయన్నారు. ఈ అంశాన్ని కేంద్రానికి ముడిపెడుతూ.. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసి కేంద్రం నియంత పాలన చేస్తుందని కుటుంబరావు ఆరోపించారు. -
చంద్రబాబు అవినీతి ‘ఆకాశయానం’!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఆడియో టేపుల్లో దొరికిపోయారు. చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోకగజపతిరాజుల వ్యవహారం ఈ టేపుల్లో బయటపడింది. గతంలో ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఈసారి ఎయిర్ ఏషియా కుంభకోణంలో బుక్కయ్యారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోన్న ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక బిజినెస్ టుడే ప్రకటించింది. దీనికి సంబంధించి ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌కు అదే సంస్థకు చెందిన ఇండియా సీఈఓ మిట్టూ శాండిల్యకు మధ్య జరిగిన సంభాషణను ఆ పత్రిక ప్రచురించింది. ‘‘మనం ఎలాగోలా కొత్త రూట్లకు సంబంధించిన లైసెన్సులను సంపాదించాలి. ఎంత ఖర్చయినా పరవాలేదు. ఎవరిని పట్టుకుంటే పనవుతుంది? ఎలాగోలా ఈ పని చేయాల్సిందే.’’అని టోనీ ఫెర్నాండెజ్ చెబుతుండగా.. ‘‘ఈ పని చేయాలంటే చంద్రబాబు నాయుడు సమర్థుడు. ఆయనను ఒప్పించగలిగితే మొత్తం పని అయిపోతుంది. ఈ పనిని చంద్రబాబు ద్వారా చేయించుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనిషే ఇపుడు పౌర విమాన యాన శాఖ మంత్రిగా ఉన్నాడు.’’అని మిట్టూ శాండిల్య వ్యాఖ్యానించినట్లు ఆడియో టేపుల్లో ఉండడం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఎయిర్ ఏషియా కుంభకోణంపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెల్సిందే. విదేశీ రూట్ల లైసెన్సులను దొడ్డిదారిన పొందడానికి గాను భారతీయ అధికారులకు లంచాలిచ్చినట్లు బయటపడడంతో వారిని అరెస్టు చేసి సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఏషియా కుంభకోణానికి సంబంధించి గతంలో జరిగిన సంభాషణలతో కూడిన ఆడియో టేపులు బయటపడడం, అందులో చంద్రబాబు, అశోక గజపతి రాజు పేర్లు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌తో అశోక గజపతిరాజు సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలలో టీడీపీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మోహనరావు కూడా ఉండడం గమనార్హం. టోనీ ఫెర్నాండేజ్, శాండిల్య మధ్య జరిగిన సంభాషణలివీ.. ప్రముఖ లాబీయిస్టు రాజేందర్ దూబే సమక్షంలో శాండిల్యకు, టోనీ ఫెర్నాండెజ్‌కు మధ్య జరిగిన సంభాషణలతో కూడిన ఆడియో టేపులను బిజినెస్ టుడే బయటపెట్టింది. వాటిలో ఏమున్నదంటే.. టోనీ ఫెర్నాండెజ్: నాకు ఎయిర్ ఏషియా ఇండియా ఇంటర్నేషనల్ రూట్ పర్మిట్లు కావాలి. ఏ మార్గం ఎంచుకున్నా ఒకే. ఇందుకోసం కొంత నష్టపోవడానికి కూడా సిద్ధమే. నిజాయితీగా సరైన మార్గంలో వెళితే పర్మిట్లు రావడానికి చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లైనా సరే త్వరగా ఇంటర్నేషనల్ పర్మిట్లు తీసుకురండి. శాండిల్య : సరే సర్.. అంటే అడ్డదారిలో వెళ్లమంటారా? టోనీ ఫెర్నాండెజ్: యెస్. నేను చెప్పింది చేయి. లైసెన్స్‌కోసం ఏదైనా చేయి. ఇక్కడ మన పురోగతి చాలా నెమ్మదిగా ఉంది. పని పూర్తయ్యేటట్లు చూడు. శాండిల్య : ప్రస్తుత నియంత్రణ నిబంధనల ప్రకారం చూస్తే మనం మరో మార్గంలో వెళ్లాలి. ప్రభుత్వంలో ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో నాకు తెలుసు. కీలక స్థానంలో ఉన్న పై స్థాయి వ్యక్తి నుంచి కింద స్థాయి వరకు వెళ్లాలి. టోనీ ఫెర్నాండెజ్: స్థానికంగా ఉన్న దూబే, మీరు కలిసి చూసుకోండి. వారితో బేరసారాలు చేయండి. ఎలా చేస్తారన్నది నీ ఇష్టం. నువ్వు అంతర్జాతీయ లైసెన్స్ తీసుకువస్తే మీకు అదనపు విమానాలను సమకూరుస్తాను. శాండిల్య : ‘సమర్థత’ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనతో మనం జాగ్రత్తగా డీల్ చేస్తే మొత్తం పనయిపోతుంది. పైగా గతంలో చంద్రబాబు వద్ద ఆర్థికమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజే ఇప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన మనతో ప్రత్యక్షంగా కనిపించడానికి ఇష్ట పడటం లేదు కానీ అడిగిన పని చేసి పెడతా అన్నారు. ఇలాంటివాడు మనతో ఉండటం మన అదృష్టం. హైదరాబాద్ కేంద్రంగానే సాగిన వ్యవహారం.. ఈ మొత్తం వ్యవహారమంతా హైదరాబాద్ కేంద్రంగానే జరిగినట్లు మరికొన్ని సాక్షాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆడియో టేపులకు మరింత బలం చేకూర్చే విధంగా ఈ రాయబేరం కోసం సింగపూర్‌కు చెందిన కంపెనీని రంగంలోకి దింపడానికి ఎయిర్ ఏషియా హైదరాబాద్ నోవాటెల్‌లో సమావేశమైనట్లు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 21, 2015లో హైదరాబాద్‌లో జరిగిన 11వ ఎయిర్ ఏషియా ఇండియా బోర్డు మీటింగ్‌లో సింగపూర్‌కు చెందిన హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్ పీటీఈని లాబీ కోసం నియమిస్తూ తీసుకున్న కాపీని మనీ కంట్రోల్ వెబ్సైట్ వెలుగులోకి తీసుకొచ్చింది. టేపుల్లో ఫెర్నాండెజ్ స్థానికంగా ఉన్న వ్యక్తిని రాయబేరాలకు తీసుకోమనడం.. హైదరాబాద్ కేంద్రంగా బోర్డు సమావేశంలో హెచ్ఎన్ఆర్ ట్రేడెండ్‌కు చెందిన రాజేంద్ర దూబేకు బాధ్యతలు అప్పచెప్పడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. అప్పటికి ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఆడియో టేపులు వెలుగులోకి రాకపోవడంతో చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి విదితమే. ఓటుకు కోట్లు కుంభకోణం బయటపడిన తర్వాతనే చంద్రబాబు తన కార్యక్షేత్రాన్ని అమరావతికి మార్చారు. కాగా మలేషియా ఎయిర్‌లైన్స్ కంపెనీ ఈ రాయబేరాల కోసం ఒక సింగపూర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇదీ ఎయిర్ ఏషియా కుంభకోణం.. మలేషియాకు చెందిన బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా 2014లో టాటా గ్రూపుతో కలిసి దేశీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టింది. కానీ అప్పటి నిబంధనల ప్రకారం స్థానికంగా 5 ఏళ్లు సర్వీసులు నడిపి, 20 విమానాలు కలిగిన ఉన్న సంస్థలకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అనుమతిచ్చేవారు. దీన్నే 5/20 నిబంధన అని పేర్కొంటారు. కానీ ఎయిర్ ఏషియా ఇండియాకు విదేశీ సర్వీసులు నడపడానికి గాను ఈ నిబంధనను మార్చాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ దీన్ని స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ వంటి స్థానిక విమానయాన కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా జూన్, 2016లో 5/20 నిబంధనను సవరిస్తూ అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరణ ప్రకారం ఐదేళ్ల సర్వీసు లేకుండా కేవలం 20 విమానాలు ఉంటే అంతర్జాతీయ సర్వీసులు నడుపుకోవచ్చు. ఈ నిబంధన వల్ల మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా, విస్తారా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు భారీ ప్రయోజనం జరిగింది. ఆ విధంగా ఎయిర్ ఏషియా దేశీయ విమానయానంలోకి అడుగు పెట్టిన రెండేళ్లలోనే ఈ లైసెన్స్‌ను దక్కించుకుంది. ఇలా బయటకు వచ్చింది... రతన్ టాటా, సైరస్ మిస్త్రీ మధ్య జరిగిన వివాదంతో ఈ కేసు బయటకు వచ్చింది. అప్పటి టాటా గ్రూపు చైర్మన్‌గా ఉన్న సైరస్ మిస్త్రీ ఎయిర్ ఏషియా లైసెన్స్‌లు దక్కించుకోవడంలో రూ.22 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ 2017మార్చిలో శాండిల్యాను ప్రశ్నించింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన సీబీఐ.. ఫెర్నాండెజ్‌తో సహా పలువురిపై కేసులు నమోదు చేసింది. హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఏషియా ఇండియా ఆ సంస్థకు రూ.12.28 కోట్లు చెల్లించి, ఈ మొత్తాన్ని రాయబేరాలకు వినియోగించినట్లు సీబీఐ పేర్కొంటోంది. విచారణలో భాగంగా 6వ తేదీ ఫెర్నాండేజ్‌ను హజరు కావాల్సిందిగా సీబీఐ సమన్లు పంపింది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. -
ఎయిర్ఏసియా ‘మిడ్ సమ్మర్ సేల్’
ఎయిర్ఏసియా ఇండియా ‘మిడ్ సమ్మర్ సేల్’ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఎంపిక చేసిన రూట్లలో విమాన టిక్కెట్లను రూ.1500 కంటే తక్కువకే అందించనున్నట్టు పేర్కొంది. ఢిల్లీ, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాంచి మార్గాలకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్టు విమానయాన సంస్థ తన వెబ్సైట్ ఎయిర్ఏసియా.కామ్‌లో వెల్లడించింది. మిడ్-సమ్మర్ సేల్ కింద భువనేశ్వర్-కోల్కత్తా, రాంచి-కోల్కత్తా, కొచ్చి-బెంగళూరు, కోల్కత్తా-భువనేశ్వర్, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై మార్గాలకు విమాన టిక్కెట్లు రూ.1399కే ప్రారంభమవనున్నట్టు ఎయిర్ఏసియా ఇండియా తెలిపింది. ఎయిర్‌లైన్ సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడిన సమయంలో ఎయిర్ఏసియా ఇండియా ఈ సమ్మర్ సేల్‌ను ప్రారంభించింది. మిడ్ సమ్మర్ సేల్ కింద టిక్కెట్లను అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం www.airasia.com వద్ద ఆన్లైన్ బుకింగ్స్కే అందుబాటులో ఉంది. 2018 మే 13 వరకు ఈ సేల్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. 2018 అక్టోబర్ 31 వరకు ఈ టిక్కెట్ల బుకింగ్‌పై ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ కింద సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. అన్ని విమానాలకు ఈ ఆఫర్ వర్తించదు. ఈ ధరలన్నీ కేవలం సింగిల్ జర్నీకి మాత్రమే. క్రెడిట్, డెబిట్, ఛార్జ్ కార్డు ద్వారా పేమెంట్లను ఎయిర్ఏసియా అంగీకరించనుంది. టిక్కెట్లను కొనుగోలు చేసేటప్పుడే అన్ని పన్నులను చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ఏసియా ఇండియా తెలిపింది. అదేవిధంగా మిడ్ సమ్మర్ సేల్ కింద ఆసియన్, ఆస్ట్రేలియన్ మార్గాల విదేశీ విమానాలకు టిక్కెట్లు రూ.3999కే ప్రారంభమవ్వనున్నట్టు తెలిసింది. ఈ టిక్కెట్లను కూడా 2018 మే 13 వరకే బుక్చేసుకోవాలి. -
ఎయిర్ ఏషియా సమ్మర్ ఆఫర్
సాక్షి, ముంబై: ఎయిర్ ఏషియా విదేశీటికెట్లపై సమ్మర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో విదేశీ విమాన టిక్కెట్లపై తగ్గింపును రేటును ప్రకటించింది. అన్నీ కలుపుకొని రూ.1,999 టికెట్ ప్రారంభ ధరలో టికెట్‌ను ఆఫర్చేస్తోంది. కౌలాలంపూర్, బ్యాంకాంక్,లాంగ్‌కవి బాలి, ఫూకట్, సింగపూర్ రూట్లలో ఈ డిస్కౌంట్ ఆఫర్. ఈనెల 25వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రమోషనల్ ద్వారా టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అలాగే ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ప్రయాణ అనుమతి సెప్టెంబర్ 30,2018 న ముగుస్తుంది. భారతదేశంలోని అనేక ప్రదేశాల నుంచి కౌలాలంపూర్, సింగపూర్, జకార్తా, సిడ్నీ, బాలి, ఎయిర్ ఆసియా విమాన సర్వీసులను అందిస్తోంది. ఎయిర్‌లైన్స్ వెబ్సైట్ ప్రకారం దేశంలోని కొచ్చి లాంటి వివిధ ప్రదేశాల నుంచి కోలాలంపూర్, సియోల్, పెర్త్, ఆక్లాండ్ వంటి ఇతర ప్రదేశాల నుంచి ఎయిర్ ఏషియా డిస్కౌంట్ టికెట్లు అందిస్తోంది. ముఖ్యంగా జైపూర్-కౌలాలంపూర్-ఫుకెట్ (రూ .6,818), జైపూర్-కౌలాలంపూర్-హనోయి (రూ .7,556), జైపూర్-కౌలాలంపూర్-లాంబోక్ (రూ .7,738), న్యూఢిల్లీ-కౌలాలంపూర్ (రూ .8,999), తిరుచిరాపల్లి-కౌలాలంపూర్-హనోయి (రూ.7,401). దీంతోపాటు ప్రీమియం ఫ్లాట్‌బెడ్ విమానాల్లో న్యూఢిల్లీ- కౌలాలంపూర్-ఫుకెట్ మధ్య టికెట్ రూ .20,157 ప్రారంభ ధరగా ఉంది. మిగిలిన వివరాలకు ఎయిర్ ఏషియా వెబ్‌సైట్‌ను పరిశీలించగలరు. -
రూ.999కే ఇంటర్నేషనల్ ఫ్లైట్ టిక్కెట్
ముంబై : ఎయిర్ఏషియా అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ''బిగ్ సేల్'' ఆఫర్ కింద ఎంపిక చేసిన మార్గాలలో రూ.999కే విమాన టిక్కెట్‌ను అందించనున్నట్టు ఎయిర్ఏసియా తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ కింద ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ టిక్కెట్లు 2018 మార్చి 11 వరకు అందించనున్నామని ఈ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ట్రావెల్ పిరియడ్ 2018 సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమై, 2019 మే 28 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్ఏషియా ఇండియా దేశీయ విమాన టిక్కెట్ల ధరలు రూ.799 నుంచి ప్రారంభమవుతున్నాయి. ''బిగ్ సేల్కు ఇది సరియైన సమయం. బీట్దిబడ్జెట్పై తమ అంతర్జాతీయ నెట్వర్క్ రూ.999 నుంచి ప్రారంభమవుతుంది'' అని ఎయిర్‌లైన్స్ తెలిపింది. భువనేశ్వర్ నుంచి కౌలాలంపూర్ వరకు వన్-వే విమానాలకు రూ.999కి విమాన టిక్కెట్‌ను ఆఫర్ చేస్తోంది. బిగ్ సేల్ కింద ఇతర రూట్లు కొచ్చి నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్ ధర రూ.2,999కు, చెన్నై నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్ ధర రూ.3,399కు, విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్ ధర రూ.1,399కు, జైపూర్ నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్ ధర రూ.3,690కు ఎయిర్ఏషియా ఆఫర్ చేస్తోంది. www.airasia.comలో ఆన్‌లైన్‌గా మాత్రమే ఈ డిస్కౌంట్ టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్, డెబిట్, ఛార్జ్ కార్డుల ద్వారా జరిపే పేమెంట్లకు నాన్-రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తోంది. పరిమిత సంఖ్యలో సీట్లు, అన్ని విమానాలకు ఇది వర్తించదు వన్-వే జర్నీకే ఈ ఆఫర్ అందుబాటు -
విదేశాలకు ఎయిర్ ఏసియా విమాన సర్వీసులు
-
ఎయిర్ ఏషియాతో.. చౌక ప్రయాణం
మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలోయ్.. ఎప్పుడూ ఉరుకులూ, పరుగులూ, టెన్షన్లేనా..? కాంక్రీట్ జంగిల్లో, ఇరుకు గదుల్లో రోబోల్లా ఉండాల్సిందేనా..? ఇక చాలు.. అటువంటి బిజీ లైఫ్‌కి కాస్త విరామం ఇవ్వండి. హాయిగా ప్రపంచాన్ని చుట్టేసి రిలాక్స్ అవ్వండి. ఇంతకీ ఇప్పుడు ఈ సంగతి ఎందుకు అనుకుంటున్నారా.. అబ్బే ఏం లేదండీ మీలాంటి వారి కోసమే ఎయిర్ ఏషియా 'బీట్దబడ్జెట్' పేరిట కొత్త ఆఫర్లు ప్రవేశపెట్టింది. వాటిని సద్వినియోగం చేసుకుని కాస్త రీచార్జ్ అవుతారనే మా చిన్ని సలహా. తప్పక పాటించి టికెట్లు బుక్ చేసేస్తారు కదూ. కౌలాలంపూర్ నవీనతకు, సంస్కృతికి, సహజమైన ప్రకృతి అందాలకు నెలవైన కౌలాలంపూర్‌ను ఒక్కసారైనా సందర్శించాల్సిందే. అక్కడి మడ అడవుల్లోని వృక్ష, జంతుజాలాలను, వన్య ప్రాణులను చూస్తే చాలు మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. పొద్దంతా బీచ్‌లలో సేదతీరి, రాత్రి విశ్రాంతి పొందే వీక్షకులతో నగరం ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. కెడాయ్ ద్వీప సమూహానికి చెందిన లాంగ్ కావి ద్వీపం భూతల స్వర్గంలా మనసును రంజింపజేస్తుంది. బీచ్‌లలో స్కూబా డైవింగ్ చేయొచ్చు. మరో అద్భుతమైన ప్రదేశం జోహార్‌లోని లెగోలాండ్. ఇక్కడ సరసమైన ధరలకే షాపింగ్ చేసుకోవచ్చు. అంతేకాదండోయ్ భోజన ప్రియులను అలరించేందుకు రెస్టారెంట్లు, ఉల్లాసంగా గడిపేందుకు థీమ్ పార్కులు ఉన్నాయి. సో మీ ట్రిప్‌లో కౌలాలంపూర్ ఉండేలా చూసుకోండి మరి. సింగపూర్.... గార్డెన్ సిటీగా ప్రసిద్ధి పొందిన సింగపూర్‌లో విభిన్న జాతుల వ్యక్తులు మీకు తారసపడతారు. ఠీవీ ఉట్టిపడేలా రాజమార్గాలతో నిండిన నగరం తన అందాలతో కనువిందు చేస్తుంది. ఆకాశహార్మ్యాలు, వలస కాలనీలు, వీధి మార్కెట్లు, పురాతన హిందూ, బౌద్ధ మతాలకు చెందిన ఆలయాలతో అలరారే సింగపూర్‌ను చూసి తీరాల్సిందే. సుమారు 1000 విభిన్న జీవ జాతులతో నిండిన నేషనల్ ఆర్కిడ్ గార్డెన్, అద్భుతమైన మెరీనా బే సాండ్స్ రిసార్ట్, అత్యాధునిక హంగులతో నిర్మితమైన చంగీ అంతర్జాతీయ విమానాశ్రయం, అందులో ఉన్న బటర్ ఫ్లై గార్డెన్ అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. బాలీ.... ప్రకృతి రమణీయ దృశ్యాలకు చిరునామా బాలీ ద్వీపం. కొండలు, ఇసుక బీచ్‌లు, పంటపొలాలు, అగ్ని పర్వతాలతో భూతల స్వర్గాన్ని తలపించే బాలీతో మీరు లవ్‌లో పడటం గ్యారెంటీ. సాయంత్రం వేళ 'కుటా' బీచ్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తే ఆ కిక్కే వేరప్పా. ఇక్కడా సందర్శించాల్సిన ప్రదేశం బాలీ సాంస్కృతిక రాజధాని ఉబుద్. ఇక్కడి ఆలయాలను దర్శిస్తూ, బాలీసంస్కృతిని ఎంజాయ్ చేస్తూ గడిపేయొచ్చు. మనోల్లాసం, ప్రశాంతత కోరుకునే వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది. మనీలా.... 'ప్యారిస్ ఆఫ్ ఏషియా' గా పిలుచుకునే మనీలా ప్రపంచంలోని టూరిస్ట్ ఫ్రెండ్లీ ప్రదేశాల్లో ఒకటి. దక్షిణాసియా, యూరోపియన్ సంస్కృతుల సంగమంతో ఆశ్చర్యానికి గురిచేసే మనీలా ప్రకృతి అందాలు, చారిత్రాత్మక ప్రదేశాలకు నెలవు. ఉల్లాసంగా గడపడానికి, షాపింగ్ చేయాలనుకునే వారు అత్యంత విలాసవంతమైన మాల్ ఆఫ్ ఏషియాకు వెళ్లి తీరాల్సిందే. కుటుంబంతో కలిసి ఓషన్ పార్క్, మౌంటేన్ పినాటుబో సందర్శించి మీ డైరీలో ఈ అందమైన జ్ఞాపకాలను పదిలపరుచుకోండి. హో చి మిన్ సిటీ..... వియత్నాంలోని అత్యంత సుందర ప్రదేశం. పురాతన, నవీన సంస్కృతులతో విరాజిల్లుతూ, చారిత్రాత్మక ప్రదేశాలు, మ్యూజియాలు, మార్కెట్లు, రెస్టారెంట్లతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. సిటీ చరిత్రను ప్రతిబింబించే హో చి మిన్ మ్యూజియం చూడదగ్గ ప్రదేశం. అలసిపోతే రిలాక్స్ అవటానికి, మీలో చైతన్యం నింపటానికి స్పాలు అందుబాటులో ఉంటాయి. సైకిల్, టాక్సీలను ఆశ్రయించి సిటీ అంతా చుట్టేస్తూ పనిలో పనిగా రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించవచ్చు. ఫుకెట్..... థాయ్‌లాండ్‌లోని అతి పొడవైన సుందర ద్వీపం. సముద్ర తీరాన తాటి చెట్లతో నిండిన బీచ్‌లతో ఆహ్లాదాన్ని పంచుతుంది. సెయిలింగ్ చేయాలనే ఆసక్తి ఉన్నవారు తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. రాత్రివేళ వెన్నెల్లో తెల్లని ఇసుక తిన్నెల్లో సేదతీరుతూ, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపేందుకు అత్యంత అనువైన ప్రదేశం. మానసిక ప్రశాంతత పొందాలంటే మీ లిస్ట్‌లో ఫుకెట్ పేరు ఉండి తీరాల్సిందే. బ్యాంకాక్..... థాయ్ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక. ఆకాశహార్మ్యాలు, చారిత్రక కట్టడాలు, విలాసవంతమైన డైనింగ్ హాల్స్, తెల్లని ఇసుకతో కూడిన బీచ్ అందాలకు చిరునామా ఈ నగరం. సియామ్ వాటర్ పార్కు, ద గ్రాండ్ ప్యాలెస్, త్రీ డైమెన్షనల్ సాంకేతికతో కూడిన ఆర్ట్ ఇన్ ప్యారడైజ్ వంటి ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు బ్యాంకాక్ సొంతం. ఒకే చోట 1500 స్టాల్స్‌తో షాపింగ్ ప్రియులను అలరించేందుకు చాటుచక్ మార్కెట్ రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం టికెట్ బుక్ చేసేయండి. న్యూజిలాండ్..... పర్వతాలు, వర్షారణ్యాలు, హిమనీనదాలు, నదులతో ఓలలాడే ప్రకృతి అందాలు వీక్షకులను కట్టిపడేస్తుంది న్యూజిలాండ్. స్కైడైవింగ్, జెట్ బోటింగ్, మౌంటేన్ బైకింగ్, బంగీ జంప్ చేయాలనుకునే వారికి సరైన గమ్యస్థానం న్యూజిలాండ్. ప్రపంచంలోని భూఉష్ణ మండలంలో ఒకటైన 'రొటోరా'కు వెళితే వేడి నీటి బుగ్గలు, మట్టి కుంటలు చూడవచ్చు. రుచికరమైర భోజనం కోసం 'నేపియర్' కు వెళ్లాలి. న్యూజిలాండ్‌లోని అతి పెద్దదైన ఆక్లాండ్ సిటీ బీచ్‌లు, ద్వీపాలు, అగ్నిపర్వతాలకు ప్రసిద్ధి. తమ ట్రిప్‌ను సాహసయాత్రగా మార్చుకోవాలనుకునేవారు ఆక్లాండ్ను ఒక్కసారైనా సందర్శించి తీరాల్సిందే. ఆస్ట్రేలియా..... ఒకప్పుడు బ్రిటీష్ వలస కాలనీగా విరాజిల్లి రాణిగారి దర్పానికి ప్రతిబింబంగా నిలిచింది. అద్భుతమైన బీచ్‌లకు, దట్టమైన వర్షారణ్యాలకు ప్రసిద్ధి. సముద్ర తీరాన ఎంజాయ్ చేయాలనుకునేవారు గ్రేటర్ బారియర్ రీఫ్ వెళ్లి, అక్కడి వన్యప్రాణులను వీక్షించాల్సిందే. సహజమైన సున్నపు రాళ్ల గనులను చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాల్సిందే. ఆడవారికి ఎంతో ప్రియమైన రత్నాలు అక్కడి జెమ్ మార్కెట్లలో విరివిగా లభిస్తాయి. అడిలైడ్‌ను కూడా సందర్శిస్తేనే మీ ట్రిప్ పూర్తైన తృప్తి కలుగుతుంది. -
దావోస్‌లో బిజీబిజీగా మంత్రి కేటీఆర్
-
దావోస్‌లో బిజీబిజీగా మంత్రి కేటీఆర్
దావోస్ : పెట్టుబడులను పెద్దఎత్తున తెలంగాణకి రప్పించేందుకు దావోస్ వెళ్లిన రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఐటీ మంత్రి కేటీఆర్ అక్కడ బిజిబిజీగా వున్నారు. రెండు రోజుల మంత్రి పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో ఫెర్నాండెస్‌తో పాటు, ఇండోరామ, మిత్సుబిషి, కేకేఆర్, కల్యాణి గ్రూప్, నోవార్టిస్, డెలాయిట్ వంటి కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్తో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో నోవార్టిస్ కార్యకలాపాల విస్తరణకు ఆ కంపెనీ అంగీకారం తెలిపింది. నోవార్టిస్.. ల్యాబోరేటరీ వ్యవస్థను, సిబ్బందిని రెట్టింపు చేయనుంది. కంపెనీ విస్తరణతో జీనోమ్ వ్యాలీ అభివృద్ది చెందుతుందని కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో టెక్ సెంటర్ ఏర్పాటుచేసేందుకు, ఇతర పెట్టుబడుల గురించి కేటీఆర్, దుబాయ్ పెట్టుబడుల కార్పొరేషన్ సీఈవో మహమ్మద్ ఏఐ షాబానితో కూడా చర్చించారు. హెచ్‌పీ కంపెనీ మేనేజ్మెంట్ను కూడా హైదరాబాద్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. టీహబ్‌తో సహకారం ఏర్పరుచుకునేందుకు అన్వేషించాలని, హెచ్‌పీ తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తరించాలని కోరారు. జపనీస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్క్ ఏర్పాటు చేయాలని కూడా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
కొత్త రూట్ : డిస్కౌంట్ ధరలు
బడ్జెట్ క్యారియర్ ఎయిర్ఏసియా కొత్త రూట్లకు డిస్కౌంట్లో టిక్కెట్లను అందించనున్నట్టు ప్రకటించింది. 2018 జనవరి 1 నుంచి కొత్త రూట్లకు రూ.1,999కే టిక్కెట్ ధరలు ప్రారంభమవుతాయని ఎయిర్ఏసియా తన వెబ్సైట్లో పేర్కొంది. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వరకు రోజూ డైరెక్ట్ విమానాలను లాంచ్ చేసింది. ఈ కొత్త మార్గానికి అడ్వాన్స్‌గా టిక్కెట్ బుక్ చేసుకునే వారికి, డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ కొత్త ఆఫర్ కింద డిసెంబర్ 10 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కేవలం వెబ్సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రమోషనల్ ధరల కింద ఎన్ని సీట్లు ఆఫర్ చేస్తుందో ఎయిర్ఏసియా వెల్లడించలేదు. ఈ ఆఫర్ ధరలోనే పన్నులు కూడా కలిసి ఉంటాయి. సీట్లు పరిమితంగానే అందుబాటులో ఉంటాయని, అన్ని విమానాలకు ఈ డిస్కౌంట్ ధరలు వర్తించవని మాత్రం ఎయిర్ఏసియా తెలిపింది. ఎయిర్ఏసియా బుకింగ్స్ పోర్టల్‌లో సెర్చ్ చేస్తే, కొత్త రూట్ హైదరాబాద్ టూ భువనేశ్వర్, భువనేశ్వర్ టూ హైదరాబాద్‌కు 2018 జవనరి 4 నుంచి టిక్కెట్ ధరలు రూ.1999గా ఉన్నాయి. టిక్కెట్ ధర రూ.1999లోనే 20 కేజీల బ్యాగేజ్, ఒకపూట ఆహారం ఉండనుంది. క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు చేస్తే, నాన్-రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు అందుబాటులో ఉంటుంది. హాలిడే సీజన్ సందర్భంగా ప్రయాణికులను ఆకట్టుకోవడానికి దేశీయ విమానయాన సంస్థలు భారీ ఎత్తున్న డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. డిస్కౌంట్ ధరలు దేశీయ విమానయాన సంస్థలకు మంచి ట్రాఫిక్ వృద్ధికి సహకరిస్తాయి. -
ఏడు దేశాలు.. ఏడు స్వర్గాలు
వీసా అవసరం లేకుండా ఏడు సర్వాంగ సుందరమైన ఆగ్నేయాసియా దేశాల పర్యటన. ఆహా... నిజంగా వింటుంటేనే ఇప్పుడే విమానం ఎక్కేయాలనిపిస్తోంది కదా! నిజంగా ఈ ఏడు దేశాలు ఏడు స్వర్గాలు.. ఆ మాదిరి అనుభూతిని అందిస్తానంటోంది ఎయిర్ ఏసియా. ఆసియాలోని ఈ ఏడు మహా అద్భుతమైన ప్రాంతాలను చుట్టి రావడానికి డిస్కౌంట్ ధరల్లో టిక్కెట్లను అందిస్తోంది ఎయిర్ఏసియా. చక్కని చలికాలంలో మధురమైన టూర్‌ను ఆహ్వానించడానికి, బ్యాగులన్నీ సర్దేసుకుని ఆసియా టూర్‌కు వెళ్లిరండి. ఈ సందర్భంగా మీకోసం అందిస్తున్న టూర్ వివరాలు... మలేషియా.. ట్విన్ టవర్స్‌ను పోలిన భవంతులు, ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడం మెనరా టవర్స్, మలేషియా రాజుల ప్యాలెస్, బటు గుహలు, బీచ్‌లు, ద్వీపకల్పాలు ఈ దేశ ప్రత్యేకతలు. రాజధానిగా ఉన్న కౌలాలంపూర్‌కు ఆగ్నేయాసియా ప్రాంతాల్లో విశిష్ట స్థానముంది. ఎంతో అద్భుతమైన, విభిన్న దేశంగా మలేషియాకు ఎంతో పేరుంది. ప్రతి ఒక్కరికీ ఈ దేశం ఆతిథ్యమిస్తోంది. సౌకర్యవంతమైన జోన్లో మీరు నివసించాలనుకుంటే, బెస్ట్ ప్లేస్‌గా మలేషియానే చెప్పుకోవచ్చు. మనోహరమైన చరిత్ర, సంస్కృతికి ఇది ప్రతీక. వివిధ రకాలైన రుచికరమైన వంటకాలకు పెట్టింది పేరు మలేషియా. సింగపూర్... మరో విలక్షణమైన దేశం సింగపూర్. చక్కటి పర్యాటక కేంద్రం అయిన ఈ దేశంలో మలయ్, చైనా, భారత దేశీయులు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. పర్యాటకంగానే కాక విలాసాలకు, వినోదాలకు పేరుపొందిన దేశం సింగపూర్. ఆకాశాన్నంటే భవంతులు, మాల్స్, జంతు ప్రదర్శనశాల, భూగర్భంలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ వరల్డ్, రాత్రివేళలో అద్భుతమైన లేజర్ షోలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. నోరూరించే వంటకాలు, లగ్జరీ హోటల్స్, పురాతన నిర్మాణాలు కూడా ఇక్కడ ప్రత్యేకతే. సింగపూర్‌నే లయన్ సిటీ, ది రెడ్ పోర్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఆగ్నేయాసియాలో దేశాల్లో కల్లా అత్యంత పాపులర్, ఖరీదైన టూరిస్ట్ ప్లేస్ గార్డెన్ సిటీ ఇక్కడే ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఈ-వీసా సర్వీసుతో ఈ అపూర్వమైన ప్రాంతాలను చుట్టి వచ్చేయండి. థాయ్‌లాండ్... థాయ్ శోభ గురించి ఎవరికి తెలియదు చెప్పండి? బీచ్ రిసార్టులు, అమేజింగ్ ఫుడ్, బడ్జెట్లో ధరలతోనే థాయ్‌లాండ్ ఆగ్నేయాసియా దేశాల్లో ట్రావెల్ హబ్‌గా నిలుస్తోంది. ప్రతి రిసార్ట్, హోటల్ కూడా పర్యాటకుల వినోదాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. ఒక్కసారి థాయ్‌లాండ్‌ను సందర్శిస్తే, ఇక జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. కంబోడియా... అద్భుతం, ఆశ్చర్యం కలగలుపుగా ఉండేదే కంబోడియా. ఈ దేశాన్ని సందర్శించే ప్రతి ఒక్కర్నీ ఇది ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. ప్రాచీన, ఆధునిక ప్రపంచాల సమ్మేళనంగా ఉంటుంది. దీంతోనే కంబోడియా ప్రారంభమైంది. సంప్రదాయంగా, భాషాపరంగా వైవిధ్యం కొనసాగుతున్న ప్రపంచదేశాలలో కంబోడియా ఒకటి. ఎంతో బాధాకరమైన చరిత్రను ఈ దేశం కలిగి ఉన్నప్పటికీ, తన ప్రజలతో ఇది ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. అతిథులకు మాత్రం ఈ దేశం ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన మనోహరమైన ప్రదేశంగానే నిలుస్తోంది. లావోస్... ఆగ్నేయాసియా దేశాల్లో మరో ప్రత్యేకమైన ప్రదేశం లావోస్. దీన్ని గురించి చెప్పుకోకుండా ఎలా మర్చిపోతాం. పర్యాటకులు తరుచు థాయ్‌లాండ్‌ను సందర్శించకపోయినప్పటికీ, లావోస్ సందర్శిస్తే చాలు ఆ మధురానుభవాన్ని అందించగలదు. ప్రత్యేకమైన బీచ్‌లు, వన్యప్రాణులతో ఎల్లప్పుడూ అలరించే అరణ్యాలు లావోస్ స్పెషల్. ఆగ్నేయాసియా దేశాల్లో ఇది చాలా చిన్నది, కానీ మహా అద్భుతమైన ప్రదేశం. పర్వతాలు, నదులు, వాటర్‌ఫాల్స్, గుహలు ఇక్కడ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆగ్నేయాసియా దేశాల్లో ఎంతో రమ్యమైన ప్రదేశం లావోసే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మనోహరమైన ప్రదేశాన్ని తిలకించడానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఎయిర్ఏసియాలో పర్యటించడానికి సిద్ధం అవండి. హాంకాంగ్.... ఆహారం, షాపింగ్, సంప్రదాయాల పరంగా తూర్పు, పడమర సంస్కృతుల కలయికనే హాంకాంగ్. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన ప్రదేశం. ఈ ప్రదేశంలో చైనీస్ సాంస్కృతిక మూలాలు బ్రిటిష్ కాలంలో పశ్చిమ దేశ సంస్కృతితో ప్రభావితం కావడమే ఇందుకు ప్రధాన కారణం. దేశంలో ప్రతి మూలన వినోదం దొరుకుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దేశంలో ద్వీపకల్పాలు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఫుడ్‌కు ఈ సిటీ ఎంతో ప్రాచుర్యం. హాంకాంగ్‌కి మీ జర్నీ ఎంతో సౌకర్యవంతంగా ఉండటానికి ఈ-రిజిస్ట్రేషన్ సర్వీసు కూడా అందుబాటులో ఉంది. ఇండోనేషియా... వైవిధ్యతే ఇండోనేషియాకు మూలం. చల్లని తెల్లని ఇసుక నుంచి బాలి అగ్నిపర్వతాల వరకు విభిన్నకరమైన వాతావరణ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇండోనేషియాలో జాకర్త ఎంతో శక్తివంతమైన అందమైన నగరం. ఈ దేశంలో ప్రతి ప్రదేశం ఓ ప్రత్యేకమైన క్వాలిటీని కలిగి ఉంటుంది. ఆగ్నేసియాలో 17వేలకు పైగా ద్వీపకల్పాలు ఈ దేశంలోనే ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అరణ్యాలు, బీచ్‌లు, గుహలు, అగ్నిపర్వతాలు అన్నీ కూడా ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. -
ఎయిర్ ఏషియా డైరెక్ట్ ఫ్లైట్స్: ధర రూ.2299
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా నాలుగు కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది. దేశీయంగా నాలుగు కొత్త మార్గాల్లో ఎయిర్ ఏషియా డైరెక్ట్ విమానాలను ప్రారంభించనుంది. త్వరలో డెయిలీ డైరెక్ట్ ఫ్లైట్ ను లాంచ్ చేయనున్నామని అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. టికెట్ల ధరలు రూ .2,299 (వన్‌వే) నుంచి ప్రారంభమని తెలిపింది. కొత్త మార్గాల్లో రోజువారీ విమానాలను ప్రారంభించనున్నట్లు ఎయిర్ఏషియా మంగళవారం ప్రకటించింది. రాంచి -బెంగళూరు, భువనేశ్వర్, హైదరాబాద్‌లకు రోజువారీ విమానాలు నడిపే పథకాన్ని వెల్లడించింది. ఈ ప్రణాళికలో మొదటి విమానం అక్టోబర్ 7, 2017 మొదలు కానున్నట్టు తెలిపింది. సీట్లు పరిమితమని అన్ని విమానాల్లో అందుబాటులో ఉండకపోవచ్చునని ఎయిర్ ఏషియా తెలిపింది. వెబ్సైట్అందించిన అప్డేట్ ప్రకారం విమాన టికెట్ ధరలు భువనేశ్వర్- రాంచి రూ. 2299 ,రాంచి- బెంగళూరు రూ.3299, రాంచి- హైదరాబాద్ రూ.2799గా ఉన్నాయి. ముందుగానే వారి టిక్కెట్లు బుక్ చేసుకోవాలని, www.airasia.com ద్వారా ఆన్లైన్ బుకింగ్‌లకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయని తెలిపింది. -
ఎయిర్ ఏసియా డిస్కౌంట్ ఆఫర్స్
న్యూఢిల్లీ: మలేషియా బడ్జెట్ ఎయిర్‌లైన్ ఎయిర్ ఏసియా దేశీయ ప్రయాణికుల కోసం ఫ్లాష్ విక్రయాలను ప్రకటించింది. ఎంపిక చేసుకున్న మార్గాల్లో వన్ వే (అన్నీ కలిపి) రూ.999 ధరలో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఫిబ్రవరి 26, 2018 నుంచి ఆగస్టు 28, 2018 వరకు ప్రయాణాల కోసం ఆ డిస్కౌంట్ ధరలను అందిస్తోంది. ప్రమోషనల్ స్కీమ్‌లో భాగంగా ‘7 డేస్ మ్యాడ్ డీల్స్’ పేరిట మంగళవారం ఈ ఆఫర్‌ను తమ అధికారిక వెబ్సైట్లో షేర్ చేసింది. ఈ ఆఫర్ 2018 ఫిబ్రవరి 26 నుంచి ఆగస్టు 28 మధ్య వర్తించనుంది. ఈ రోజు నుంచి ఆగస్టు 27 వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. పరిమిత కాల వ్యవధిలో ఎంపిక చేసిన వన్-వే విమానాలకు టికెట్ ధరను రూ.999గా పేర్కొంది. అంతే కాకుండా ఎయిర్ఏషియా దేశంలో పలు ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన విమానాల్లోనే ఈ స్కీమ్ వర్తిస్తోందని, సీట్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయని ఎయిర్ ఏషియా ప్రతినిధులు తెలిపారు. వెబ్, మొబైల్ యాప్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కోల్‌కతా-బగ్దోగ్రా టికెట్ ధర రూ.999 కాగా, భువనేశ్వర్-కోల్‌కతా, గోవా-బెంగళూరు, గువాహటి-ఇంఫాల్, హైదరాబాద్-బెంగళూరు, కొచ్చి-బెంగళూరు మధ్య టికెట్ ధర రూ.1,099గా, అలాగే పుణె-బెంగళూరు, విశాఖపట్నం-బెంగళూరు మధ్య ధరను రూ.1,499గా ఉండనుంది. దీంతోపాటు కొన్ని అంతర్జాతీయ విమాన టిక్కెట్లకు ప్రారంభ ధరను రూ.3,399గా నిర్ణయించింది. కౌలాలంపూర్-కొచ్చి, కౌలాలంపూర్-తిరుచ్చిరాపల్లి మధ్య టికెట్ల ధరను తగ్గించినట్లు పేర్కొంది. మరోవైపు భారీ మార్కెట్ క్యాప్ తో అద్భుత ప్రదర్శన కనబర్చే టాప్ లిస్టెడ్ కంపెనీలకిచ్చే అవార్డును సంస్థ దక్కించుకుంది. ఎడ్జ్ మీడియా అందించే ఎడ్జ్ బిలియన్ రింగింట్ క్లబ్ అవార్డును స్వీకరించినట్టు ఎయిర్ ఏసియా ట్విట్టర్‌ద్వారా వెల్లడించింది. [Press Release] #AirAsia wins The Edge Billion Ringgit Club Company of the Year Award pic.twitter.com/89lFchEwIU — AirAsia (@AirAsia) August 22, 2017