ఎయిర్ ఏషియా బిగ్ సేల్ | AirAsia Big Sale: Now book domestic flight at Rs 990 | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఏషియా బిగ్ సేల్

Published Wed, Nov 25 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM

ఎయిర్ ఏషియా బిగ్ సేల్

ఎయిర్ ఏషియా బిగ్ సేల్

హైదరాబాద్: విమాన టికెట్లకు సంబంధించి ఎయిర్‌ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్... భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి.తమ బిగ్‌సేల్‌లో భాగంగా పుణే, గోవా, కోచి, గౌహతి, వైజాగ్ వంటి దేశీయ రూట్లలో విమాన టికెట్‌లు  రూ.990 (అన్ని చార్జీలు కలుపుకొని)నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్  సీగ్‌ట్రాండ్ టెక్ పేర్కొన్నారు.  అలాగే బ్యాంకాక్, కౌలాలంపూర్, వంటి అంతర్జాతీయ నగరాలకు తమ గ్రూప్ విమానాల ద్వారా జరిపే విమాన ప్రయాణాలకు చార్జీలను రూ.3,699కు ఆఫర్ చేస్తున్నామని వివరించారు.

ఈ నెల 29 వరకూ ఎయిర్‌ఏషియాడాటకామ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ప్రయాణ కాలం వచ్చే ఏడాది మే 1 నుంచి 2017 ఫిబ్రవరి 5 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్‌కు డెరైక్ట్ విమాన సర్వీస్‌ను ఎయిర్ ఏషియా ఎక్స్ నుంచి అందిస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement