
మీకు ఐఫోన్ అంటే ఇష్టమా? చవగ్గా తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. యాపిల్ తాజా మోడళ్ల ఐఫోన్ కొనుగోలు చేయలేని ఐఫోన్ (iPhone) ప్రియుల కోసం ముఖేష్ అంబానీకి చెందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ రిలయన్స్ డిజిటల్ (Reliance Digital) ఓ మంచి డీల్ తీసుకొచ్చింది. ఐఫోన్ 14 (iPhone 14)పై భారీ తగ్గింపును అందిస్తోంది.
యాపిల్ 2022లో లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 14 ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్‌లో అందుబాటులో ఉంది. దీని అసలు రిటైల్ ధర రూ. 54,900 కాగా రిలయన్స్ డిజిటల్ దీనిపై రూ.6,500 తగ్గింపు అందిస్తోంది. ఫ్లాట్ రూ. 6,500 తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్‌ల ద్వారా ఐఫోన్ 14 రూ. 47,400 లకే పొందవచ్చు. హెచ్‌ఎస్‌బీసీ (HSBC) క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 2,000 వరకు అదనంగా 5% తగ్గింపును పొందవచ్చు. దీంతో తుది ధర రూ. 46,400కి తగ్గుతుంది. అంటే మొత్తంగా రూ. 8,500 తగ్గింపు.
ఐఫోన్ 14 ఫీచర్లు
2022 అక్టోబర్‌లో రూ. 79,900 బేస్ ధరతో యాపిల్ ఐఫోన్ 14 లాంచ్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ముఖ్యంగా సేల్ ఈవెంట్‌ల సమయంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొబైల్ ఫోన్‌లలో ఐఫోన్ 14 ఒకటి. ఐఫోన్ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. వెనుకవైపు 12MP డ్యూయల్-కెమెరా, సెల్ఫీ ప్రియుల కోసం డ్రాప్ నాచ్ 12MP ఫ్రంట్ షూటర్ కెమరా ఇందులో ఉన్నాయి.
ఇదిలా ఉండగా యాపిల్‌కు చెందిన తాజా సిరీస్ ఐఫోన్ 16 (iPhone 16). గత ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్‌ను యాపిల్ భారత్‌లో లాంచ్ చేసింది. సెప్టెంబర్ 20 నుంచి విక్రయాలు ప్రారంభం కాగా ఊహించినట్లుగానే ఐఫోన్ 16 సిరీస్‌కు భారత్‌లో భారీ స్పందన లభించింది. మొదటి రోజే రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. బేస్ మోడల్‌కు ఐఫోన్ 16 ధరలు రూ.79,900 కాగా ఐఫోన్ 16 ప్రో ధర రూ. 144,900 వరకు ఉంది.