iphone 14
-
ఈ ఐఫోన్ వాడుతుంటే.. మీకే ఈ అలర్ట్!
ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) వినియోగదారులకు యాపిల్ ముఖ్యమైన అలర్ట్‌ను జారీ చేసింది. కొన్ని నెలల క్రితం తయారైన ఐఫోన్ 14 ప్లస్ యూనిట్లలో తలెత్తిన రియర్ కెమెరా సమస్య కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ప్రభావితమైన ఫోన్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అధీకృత యాపిల్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద సర్వీసింగ్ పొందవచ్చని కంపెనీ ప్రకటించింది.రియర్ కెమెరా సమస్య తమ హ్యాండ్‌సెట్‌పై ప్రభావం చూపిందో లేదో కస్టమర్లు తమ క్రమ సంఖ్యను కంపెనీకి అందించడం ద్వారా ధ్రువీకరించుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్‌లో రియర్ కెమెరాకు మరమ్మతుల కోసం ఇప్పటికే డబ్బు చెల్లించినవారు ఆ మొత్తాన్ని రీఫండ్ పొందవచ్చు.సమస్య ఇదే..ఐఫోన్ 14 ప్లస్‌లో రియర్ కెమెరా సమస్య మరమ్మతు కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం సపోర్ట్ పేజీని ఏర్పాటు చేసింది. అసలేంటి సమస్య అంటే.. రియర్ కెమెరాతో ఫొటో తీసినప్పుడు ప్రివ్యూ చూపించడం లేదు. అయితే ఈ చాలా తక్కువ ఫోన్లలోనే ఉత్పన్నమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇవి 2023 ఏప్రిల్ 10 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 28 మధ్య తయారైనవి.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అదిరిపోయే ప్రయోజనాలు!అయితే తమ ఫోన్లలో ఇలా సమస్య ఉంటే కంపెనీ ఉచిత సర్వీసింగ్ ప్రోగ్రామ్ పొందడానికి అర్హత ఉందా.. లేదా అన్న విషయాన్ని యాపిల్ ఏర్పాటు చేసిన సపోర్ట్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నంబర్ నమోదు చేస్తే మీ ఫోన్‌కి ఫ్రీ సర్వీసింగ్ వస్తుందో రాదో తెలుస్తుంది. యాపిల్ సర్వీస్ ప్రోగ్రామ్ ఫోన్ కొనుగోలు తేది నుంచి మూడేళ్లపాటు వర్తిస్తుంది. -
ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్
ఐఫోన్ 16 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి యాపిల్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 మోడల్ ధర భారీగా తగ్గింది. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 14 ప్లస్ ధర రూ. 79,600 లుగా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో కొంటే రూ. 56,000 కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 ప్లస్ బేస్ వేరియంట్ రూ. 56,499కి అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్ కొనుగోలుపై కొనుగోలుదారులు రూ.23,101 ఆదా చేసుకోవచ్చు. దీంతో పాటు, యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. అంటే ఐఫోన్ 14 ప్లస్ రూ.55,499కే లభిస్తుందన్న మాట.ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్స్» 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పెద్ద » 6.7-అంగుళాల స్క్రీన్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే» డిస్ప్లే దెబ్బతినకుండా సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్» A15 బయోనిక్ చిప్సెట్» 12-మెగాపిక్సెల్ రియర్ డ్యూయల్ కెమెరా» 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా -
ఐఫోన్ లవర్స్‌కి గుడ్‌న్యూస్
యాపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త. త్వరలో మార్కెట్‌కి పరిచయం కానున్న ఐఫోన్ 16 తయారీ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 15 విడుదలైన మరుక్షణం నుంచి ఐఫోన్ 16 ఇలా ఉండబోతుందంటూ రకరకాల డిజైన్లను ప్రస్తావిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తయారీ ప్రారంభంతో ఆ ఫోన్ డిజైన్‌పై స్పష్టత రానుంది.ఐ ఫోన్ డిస్ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చే నెల నుంచి తయారీ ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు. ఐఫోన్ 16 మోడళ్లను హై-ఎండ్ వేరియంట్ల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చని తెలుస్తోంది. కాగా, గత ఏడాది ఐఫోన్ 15 సిరీస్ తయారీ ఆగస్ట్ నెలలో ప్రారంభం కాగా.. ఈ లేటెస్ట్ వెర్షన్ అంతకంటే ముందే మ్యానిఫ్యాక్చరింగ్కు సిద్ధమైంది. ఐఫోన్ 16 భారత్‌లో తయారవుతుందా? మరి యాపిల్ సంస్థ ఐఫోన్ 16ను భారత్‌లో తయారు చేస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రానప్పటికీ ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15లు మాత్రం దేశీయంగా తయారయ్యాయి.ఐఫోన్ 15 సిరీస్ ధరెంతంటేగతేడాది విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్ ధర రూ.1,34,900 నుండి ప్రారంభమవుతుండగా.. ప్రో మాక్స్ ధర రూ. 1,59,900. 128జీబీ స్టోరేజ్ ఐఫోన్ 15మోడల్ ధర భారత్‌లో రూ. 79,900, ప్లస్ మోడల్ రూ. 89,900కే మార్కెట్లో లభ్యమవుతుంది. ఐఫోన్ 16 సిరీస్.. చాలా కాస్ట్ గురూ..!అయితే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఎందుకంటే ఇటీవలి నిక్కీ ఆసియా మ్యాగిజైన్ ఇంటర్వ్యూలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తయారీకి 558 డాలర్ల ఖర్చవుతుందని యాపిల్ తెలిపింది. విడి భాగాల ధరలు పెరుగుదల కారణంగా ఐఫోన్ 16 ధరలు 12 శాతం పెరిగే అవకాశం ఉందని వెలుగులులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
కొంపముంచిన డేటింగ్ యాప్: ‘ఐస్’తో కిలాడీ నిలువు దోపిడీ
డేటింగ్ యాప్ పరిచయం ఓ యువకుడి కొంప ముంచింది. బంబుల్యాప్లో పరిచయమైన గురుగ్రామ్‌కు చెందిన యువకుడికి మత్తుమందు ఇచ్చి మరీ మహిళ నిలువునా దోచేసింది. బంగారం, నగదు, లగ్జరీ ఐఫోన్‌తో పాటు, బ్యాంకు ఖాతాని ఖాళీ చేసేసింది. విషయం తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. గురుగ్రామ్ వ్యక్తికి బంబుల్ డేటింగ్ యాప్‌లో సాక్షి అలియాస్ పాయల్ అనే ఆ మహిళతో పరిచయం ఏర్పడిందని బాధితుడు రోహిత్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ప్రకారం తాను ఢిల్లీకి చెందిన దాన్ననీ, అయితే గురుగ్రామ్‌లో తన అత్తతో నివసిస్తున్నాననిపాయల్ చెప్పింది. గత వారం పాయిల్కు ఫోన్ చేసి, కలుద్దామని రోహిత్‌ను కన్విన్స్ చేసింది. అనుకున్న ప్రకారం రోహిత్ వాళ్ల ఇంట్లో కలుసుకున్నారు. ఆ తరువాత దగ్గర్లోని దుకాణంలో మద్యం కొనుక్కుని ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత ఐస్ తీసుకురమ్మనే నెపంతో అతడి దృష్టి మళ్లించింది. అతడలా ఐస్ కోసం వెళ్లగానే డ్రింక్‌లో ఏ మత్తుమందు తెలిపిందో తెలియదు గానీ అది తాగిన వెంటనే రోహిత్ స్పృహ కోల్పోయాడు. ఆ మత్తు ఎంత ప్రభావితం చేసిందంటే...అక్టోబర్ ఒకటోతేదీ రాత్రి స్పృహ కోల్పోతే..అక్టోబర్ 3వ తేదీ ఉదయం నిద్రలేచేంత.కళ్లు తెరిచి చూసే సరికి ఆమె ఇంట్లో లేదు. బంగారు గొలుసు, ఖరీదైన ఐఫోన్ 14 ప్రో, రూ. 10వేల నగదు, క్రెడిట్,డెబిట్ కార్డులు మాయం. ఇంతలో తన బ్యాంకు అకౌంట్నుంచి రూ. 1.78 లక్షలు విత్‌డ్రా అయినట్లు కూడా గుర్తించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. -
ఐఫోన్ కావాలంటే కొనుక్కోవాలికానీ కొరికితే ఎలా? వింత చోరీ వీడియో వైరల్!
iPhone theft: యాపిల్ ఐఫోన్ (Apple iPhone)15 త్వరలో లాంచ్ కాబోతోంది. యమా క్రేజ్ ఉండే ఐఫోన్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. అయితే ఇది అప్డేట్లకు సంబంధించినది కాదు.. ఐఫోన్ చోరీకి సంబంధించినది. ఖరీదైన ఐఫోన్ల చోరీల గురించి తరచూ వింటుంటాం. ఈమధ్య ఈ ఫోన్ల దొంగతనాలు సృజనాత్మకంగా మారాయి. అలాంటిదే చైనాలో ఒకటి తాజాగా జరిగింది. ఆ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాలోని ఓ యాపిల్ స్టోర్‌లో సుమారు రూ. 80,000 విలువ చేసే ఐఫోన్ 14 ఫ్లస్ (iPhone 14 Plus)ని చాకచక్యంగా దొంగిలించింది ఓ మహిళ. స్టోర్‌లో డిస్ప్లేకు ఉంచిన ఫోన్‌ను యాంటీ-థెఫ్ట్ కేబుల్‌ను కొరికేసి తన బ్యాగులో వేసుకుంది. అలారం స్టోర్ సిబ్బంది గుర్తించలేకపోయారు. చోరీ జరిగిన అరగంట తర్వాత చూసుకున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ మహిళను అరెస్ట్ చేశారు. VIDEO: MUJER SE ROBA UN IPHONE A MORDIDAS Una cámara de seguridad captó el momento en que mujer roba un #iPhone de exhibición a mordidas en una Apple Store en #China. En las imágenes se puede apreciar a la fémina acercándose de manera disimulada a la mesa donde se encontraban… pic.twitter.com/eC7E6poeUy — El Dato Noticias Morelos (@eldatomx) September 2, 2023 -
యాపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో ఆఫర్!
Apple Mega Sale:యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపర్ ఆఫర్ ఆందిస్తోంది. త్వరలోనే కొత్త ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ కానున్న నేపథ్యంలో పాపులర్ ఐఫోన్లు భారీ డిస్కౌంట్లో ధరలో లభ్యం. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 , ఐఫోన్ 13,ఐఫోన్ 1, ఐఫోన్ తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి లేదా కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ ముఖ్యంగా ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ ఆఫర్ అందుబాటులోఉంది. దీన్ని రూ. 72,999 వద్దే దీన్ని సొంతం చేసుకోవచ్చు. దీని లాంచింగ్ ప్రైస్ రూ.89,990. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద నిబంధనల ప్రకారం రూ. 48,999 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే HDFC కార్డుద్వారా జరిపే కొనుగోళ్లపై 128 జీబీ వేరియంట్‌పై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, ఏ15 బయోనిక్ చిప్సెట్ , 12ఎంపీ డ్యుయల్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (ఇక జాబిల్లిపై కోట్లాది భారతీయుల కొత్త కలలు: ఆనంద్ మహీంద్ర) ఐఫోన్ 14 ఐఫోన్ 14 పై అసలు ధరలో 14శాతందాకా తగ్గింపు. అంటే ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 67,999కి అందుబాటులో ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికివస్తే 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఆకట్టుకునే బ్యాటరీ సామర్థ్యం ప్రత్యేకం.. ఐఫోన్ 13, ఐఫోన్ 12 ఈ సేల్‌లో ఐఫోన్ 13ను రూ. 59,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 12 ను డిస్కౌంట్ తరువాత రూ. 51,999 కొనుగోలు చేయ వచ్చు. ఇక ఐఫోన్ 11 64GB వేరియంట్‌ను కేవలం రూ. 41,999 వద్ద అందుబాటులో ఉంది. -
రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా?
Apple iPhone 14 యాపిల్ ఐఫోన్ మరోసారి తగ్గింపు ధరలోఅందుబాటులోకివచ్చింది. ప్రస్తుతం యాపిల్ లైనప్‌లో చౌక ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 14. త్వరలోనే ఐఫోన్ 15ను లాంచ్ చేయనున్న తరుణంలో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ కానున్న నేపథ్యంలో ఈ తగ్గింపు అందుబాటులోకి రావడం గమనార్హం. దాదాపు రూ. 43,600 వరకు తగ్గింపుతో రూ. 26,399కే ఐఫోన్ 14ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అధికారిక స్టోర్‌లో రూ. 10,901 తగ్గింపుతో రూ. 68,999 వద్ద లిస్ట్ అయింది. దీనితో పాటు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4000 తగ్గింపును పొందవచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్, ఇతర ఆఫర్లతో కలిపి ఫ్లిప్‌కార్ట్ సేల్ కంటే ముందుగా యాపిల్ ఐఫోన్ 14ని కేవలం 26,399 రూపాయలకే పొందవచ్చు. కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆగస్టు 4-9 వ తేదీవరకు కొనసాగనుంది. సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం రేపటి నుండే ప్రారంభం. కాగా యాపిల్ ఐఫోన్14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, యాపిల్ 14 ప్రో మాక్స్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 15 ఈ ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) -
యాపిల్ ఐఫోన్ 14 పై భారీ డిస్కౌంట్
యాపిల్ ఐఫోన్ 14 లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఈ లగ్జరీస్మార్ట్ఫోన్ ఇపుడు భారీ తగ్గింపులో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 42,600 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంటే దీని ధర రూ. 30,000 కంటే తక్కువన్నమాట. డిస్కౌంట్లు, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫరలు కలిపి ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14పై ఈ భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఇదీ చదవండి : ట్యూటర్లకు షాక్: ఏఐ చాట్‌బాట్‌పై బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు ఐఫోన్ 14 తగ్గింపు ఆఫర్ ఐఫోన్ 14 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ధర రూ. 69,999 వద్ద లిస్ట్ చేసింది. దీని లాంచింగ్ ప్రైస్. రూ.79,900. ప్రస్తుతం రూ. 9901 తగ్గింపు అందుబాటులో ఉంది. దీంతో పాటు, బ్యాంక్ మరియు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో మరింత దిగి వచ్చింది. ముఖ్యంగా తమ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా (ఫోన్ పరిస్థితి మోడల్‌పై ఆధారపడి) రూ. 38,600 వరకు ఆఫర్ చేసే ఎక్స్ఛేంజ్ డీల్ లభ్యం. (యోగా గురు రామ్‌దేవ్ లగ్జరీ కార్ల కలెక్షన్: దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు) అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 4,000 వరకు బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో లావాదేవీలపై 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇవన్నీ వర్తించిన తరువాత యాపిల్ ఐఫోన్ 14 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ. 27,399కే కొనుగోలు చేయవచ్చు. -
బాబోయ్ ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు అన్ని కోట్లా? లగ్జరీ లంబోర్ఘినికే ఝలకా?
అతి ఖరీదైన ఫోన్లు అనగానే యాపిల్ ఐఫోన్లు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రస్తుతం రూ. 1,27,999 ధర పలుకుతున్న ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అత్యంత ఖరీదైన ఫోన్‌గా భావిస్తాం. దీని లేటెస్ట్ వెర్షన్ ధర కళ్లు చెదిరే ధర పలుకుతోంది. డైమండ్ స్నోఫ్లేక్ వేరియంట్, కేవియర్ ద్వారా కస్టమైజ్ చేసిన ఐఫోన్ ధర సుమారు రూ. 5 కోట్లు (616,000 డాలర్లు) పలుకుతోంది. ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్నోఫ్లేక్ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే బ్రిటీష్ జ్యువెలరీ బ్రాండ్ గ్రాఫ్ సహకారంతో రూపొందించారు. డైమండ్ మోడల్ బ్యాక్ప్లేట్కు లాకెట్టు అమర్చారు. దీన్ని అతి ఖరీదైన ప్లాటినం, వైట్ గోల్డ్‌తో రూపొందించారు. ఈ రౌండ్ అండ్ మార్క్యూస్-కట్ డైమండ్స్‌తో తయారు చేసిన లాకెట్టు ధర ఒక్కటే దాదాపు రూ. 62 లక్షలు. దీనికి అదనంగా,18 కేరట్ల వైట్ గోల్డ్ బ్యాక్ప్లేట్ను కూడా అమర్చారు. దీనికి 570 వజ్రాలను అమర్చారట. ప్రస్తుతానికి మూడు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచినట్టుతెలుస్తోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రూ.3.7 కోట్లకు లభ్యమవుతున్న లంబోర్గిని హురాకాన్ ఎవో సూపర్‌కార్ ధర కంటే ఎక్కువ కదా బాసూ అంటే కమెంట్ చేస్తున్నారు. కాగా 1,39,900 రూపాయల వద్ద భారతీయ మార్కెట్లో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. -
గుడ్ న్యూస్.. ఐఫోన్ లవర్స్‌కి ఇదే మంచి సమయం
Amazon Apple Sale Days: భారతదేశంలో ఐఫోన్‌కు ఉన్న క్రేజు అంతా .. ఇంతా.. కాదు. యువతరం మొత్తం ఐఫోన్ అంటే పడి సచ్చిపోతారు. అలాంటి వారి కోసం అమెజాన్ కొత్త యాపిల్ డేస్ సేల్స్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఐఫోన్లపై మీద భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ అవకాశం కేవలం వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకు ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారు జూన్ 17లోపు కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం బ్యాంకు కార్డుల మీద తగ్గింపులను అందించడం మాత్రమే కాకుండా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ మీద అమెజాన్ అందించే ఆఫర్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యాపిల్ సంస్థ గతేడాది ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 14 (iPhone 14) దేశీయ మార్కెట్లో ఐఫోన్ 14 128జీబీ మోడల్ ధర రూ. 79,999. ఆఫర్ కింద 15 శాతం తగ్గింపుతో దీనిని రూ. 67,999 కే సొంతం చేసుకోవచ్చు. అదే సమయంలో 256 జీబీ వేరియంట్‌ని (రూ. 89,900) 13 శాతం తగ్గింపుతో రూ. 77,999కే.. 512 జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900 కాగా 11 శాతం తగ్గింపుతో రూ. 97,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) యాపిల్ సేల్ డేస్ ఆఫర్ సమయంలో ఐఫోన్ 14 ప్లస్ కొనుగోలు చేయాలనుకునే వారు దీనిని రూ. 76,999కి కొనుగోలు చేయవచ్చు. మంచి బ్యాటరీ కెపాసిటీ కలిగి పెద్ద స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 89,900. ఆఫర్ సమయంలో 14 శాతం తగ్గింపు లభిస్తుంది. కావున ఇది రూ. 76,999కే లభిస్తుంది. ఇక 256GB వేరియంట్ ధర రూ. 99,900 కాగా.. అమెజాన్ ఆపిల్ డే సేల్ సమయంలో 13 శాతం తగ్గుదలతో రూ. 86,999కి లభిస్తుంది. (ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో) ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌తో సహా ఐఫోన్ 14 సిరీస్ హై-ఎండ్ మోడల్‌లు కూడా ప్రస్తుతం సుమారు 9 శాతం తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి. 128జీబీ స్టోరేజ్ అండ్ 256జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 14 ప్రో అసలు ధరలు వరుసగా రూ. 1,29,900 & రూ. 1,39,900 కాగా.. ఆఫర్ కింద ఇవి రూ. 1,19,999 అండ్ రూ. 1,34,990 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: వేలంలో కోట్లు పలికిన చెక్కతో తయారైన కారు - దీని ప్రత్యేకత ఏమిటంటే?) ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max) ఆపిల్ సెల్ డేస్ ఆఫర్ కింద ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కొనాలనుకునే వారు సాధారణ ధరకంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 14 ప్రో మ్యాక్స్ 128జీబీ ధర రూ. 1,39,900, అదే సమయంలో 256జీబీ వేరియంట్ ధర రూ. 1,49,900. ఆఫర్ కింద వీటిని వరుసగా రూ. 1,27,999 అండ్ రూ. 1,43,990 కే సొంతం చేసుకోవచ్చు. -ఎన్.కుమార్ -
స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు..
Flipkart Big Bachat Dhamaal Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డమాల్ సేల్ మళ్లీ వచ్చేసింది. స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఈ సేల్ మే 19న ప్రారంభమైంది. మే 21 వరకు కొనసాగుతుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a), ఐఫోన్ 14 (iPhone 14)తో పాటు కొత్తగా లాంచ్ అయిన మరికొన్ని స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి ఇది మంచి అవకాశం. స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్స్, ఇయర్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర గాడ్జెట్లపై సూపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్‌లో ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో ఓ లుక్కేయండి.. ఇదీ చదవండి: Redmi A2 Series: రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ గూగుల్ పిక్సెల్ 7ఏ కొత్తగా లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) ధర రూ. 43,999లుగా ఉంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్చేంజ్ ద్వారా రూ. 34,000 వరకు తగ్గింపు లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ 6.1అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. Tensor G2 SoC చిప్‌తో జోడించారు. ఐఫోన్ 14 యాపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) 128 GB వేరియంట్ రూ. 69,999 వద్ద లభిస్తుంది . హెచ్డిఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇక పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్ఛేంజ్పై రూ. 33,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 14లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంది . Apple A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. ఒప్పో రెనో 8 ప్రో 5G ఒప్పో రెనో (OPPO Reno) 8 Pro 5G (12 జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్) ఫోన్‌ను రూ. 45,999లకే కొనుక్కోవచ్చు. అంతే కాకుండా కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని వాడుకుంటే 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Mediatek డైమెన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. వివో T1X వివో (Vivo) T1X ఫోన్ 4GB ర్యామ్, 128GB రోమ్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ సేల్‌లో రూ. 12,999 కే లభిస్తుంది. మరోవైపు కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే అదనంగా మరో 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక పాత ఫోన్ల ఎక్స్చేంజ్పై గరిష్టంగా రూ. 12,450 లభిస్తుంది. పోకో F5 5G ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పోకో (Poco) F5 5G ఫోన్ 8GB వేరియంట్ రూ. 29,999లకు లభిస్తోంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్ప్లే, Qualcomm Snapdragon 7+ Gen2 చిప్సెట్ ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లు, వాటిపై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి తెలుసుకునేందుకు సాక్షి బిజినెస్ పేజీని చూడండి -
ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు మరో సంస్థలోనూ..
యాపిల్ ఐఫోన్14 (Apple iPhone 14)పై ఈ-కామర్స్ సంస్థలు వరుసకట్టి ఆఫర్లు ప్రకటించాయి. పోటీ పడి డిస్కౌంట్లు అందిస్తున్నాయి. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఐఫోన్14 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.79,900 ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు విజయ్ సేల్స్ అనే మరో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈ ఫోన్‌పై భారీ తగ్గింపులు, ఆఫర్లు అందిస్తున్నాయి. తక్కువ ధరకే ఐఫోన్ 14 కొనుక్కోవాలనుకుంటున్నవారికి ఇప్పుడే సరైన సమయం. ఇదీ చదవండి: Amazon Great Summer Sale: ఆఫర్ల జాతరకు సిద్ధమైన అమెజాన్.. ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు! ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధిక డిస్కౌంట్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 128జీబీ వేరియంట్ ఐఫోన్14పై అత్యధికంగా 12 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై ఐదు శాతం క్యాష్‌బ్యాక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ.4,000 తగ్గింపు పొందవచ్చు. అదనంగా ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.40,749 కంటే తక్కువ ధరకే ఐఫోన్14 మీ సొంతం అవుతుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు కండీషన్‌ను బట్టీ గరిష్టంగా రూ.29,250 వరకు లభిస్తుంది. అమెజాన్ ఆఫర్లు ఐఫోన్14ని అమెజాన్ 10 శాతం తగ్గింపుతో రూ.71,999లకు విక్రయిస్తోంది. అలాగే వివిధ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 4,000 వరకు ఆఫర్లను కూడా అందిస్తోంది. అదనంగా ట్రేడ్-ఇన్ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే చాలా తక్కువ ధరకే ఐఫోన్14 లభిస్తుంది. ఈ ఆఫర్ కింద రూ.19,700 వరకు తగ్గింపు ఉంటుంది. తద్వారా రూ. 52,299 కంటే తక్కువకే ఐఫోన్14ను కొనుక్కోవచ్చు. విజయ్ సేల్స్‌లో యాపిల్ డేస్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు విజయ్ సేల్స్ కూడా ఐఫోన్14పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో కొనసాగుతున్న యాపిల్ డేస్‌లో భాగంగా కేవలం రూ.70,999లకే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్14పై ఈ సంస్థ 11 శాతం తగ్గింపుతో పాటు హెచ్డీఎఫ్సీ కార్డ్‌లపై రూ.4,000 క్యాష్‌బ్యాక్, యస్ బ్యాంక్ కార్డ్‌లపై రూ.2,000 వరకు తక్షణ తగ్గింపు వంటి ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు -
ఐఫోన్14 ప్లస్‌పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు!
యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ (Apple iPhone 14 Plus)పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అద్భుతమైన ఆఫర్ నడుస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ భారతదేశంలో రూ. 89,999 ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దీనిపై రూ.12,000 ఫ్లాట్ తగ్గింపు అందిస్తోంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అదనం. యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ 89,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇది ఇప్పుడు భారీ తగ్గింపుతో రూ.77,999లకే అందుబాటులో ఉంది. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ల విషయానికొస్తే, పాత మోడల్ ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కస్టమర్లు గరిష్టంగా రూ. 29,500 వరకు పొందవచ్చు. ఇదీ చదవండి: ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్.. విండోస్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు! ఇక రూ. 99,900 ఉన్న 256GB వేరియంట్ ఫోన్ రూ. 87,999లకే కొనుక్కోవచ్చు. రూ. 1,19,900 ధర ఉన్న 512GB వేరియంట్ రూ. 1,07,900లకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్ పర్పుల్, స్టార్‌లైట్, మిడ్నైట్, బ్లూ, ప్రొడక్ట్ (రెడ్), ఎల్లో కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్14పైనా తగ్గింపు రూ. 79,999 ధరతో ప్రారంభమైన యాపిల్ ఐఫోన్ 14 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 71,999లకే అందుబాటులో ఉంది. అంటే రూ. 8,000 డిస్కౌంట్. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ.4,000 తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు పరిమాణం మినహా యాపిల్ ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి. రెండూ A15 బయోనిక్ చిప్సెట్తో 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉన్నాయి. కెమెరా పరంగా ఐఫోన్14, ఐఫోన్14 ప్లస్ 12MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇదీ చదవండి: ఊరిస్తున్న కార్లు వచ్చేస్తున్నాయి.. మే నెలలో లాంచ్ అయ్యే కార్లు ఇవే.. -
ఐఫోన్ 14పై అక్షయ తృతీయ ఆఫర్.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు!
ప్రత్యేకంగా యాపిల్ ప్రీమియమ్ ఉత్పత్తులను విక్రయించే దేశంలోని ప్రముఖ రీసెల్లర్ కంపెనీ మాపుల్ (Maple) అక్షయ తృతీయ సందర్భంగా ఐఫోన్ 14 (iPhone 14)పై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. మాపుల్ స్టోర్ లేదా ఆన్లైన్లో ఐఫోన్ 14 కొంటే రూ.21,000 తగ్గింపు పొందవచ్చు. లేదా నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్ పేమెంట్‌తో ఐఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు! ప్రస్తుతం ఐఫోన్ 14 512 GB ధర రూ. 1,09,900 ఉంది. కానీ మాపుల్లో రూ.11,000 తగ్గింపుతో పాటు హెడ్ఎఫ్సీ క్యాష్‌బ్యాక్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6,000 మొత్తంగా రూ. 21,000 తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్ 14 128జీబీ, 256 జీబీ వేరియంట్లపైనా కూడా 10 శాతం మాపుల్ డిస్కౌంట్, హెచ్డీఎఫ్సీ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను పొందవచ్చు. ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు ఇక ఈఎంఐపై ఫోన్ కొనాలనుకుంటున్నవారి కోసం కూడా ప్రత్యేక ఆఫర్‌ను మాపుల్ కల్పిస్తోంది. బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్ పేమెంట్‌తో ఐఫోన్ 14ను అందిస్తోంది. ముంబై, మంగళూరులో స్టోర్లను కలిగి ఉన్న మాపుల్ దేశమంతటా ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది. 5 లక్షల మందికిపైగా కస్టమర్లను కలిగి ఉంది. లేటెస్ట్ ఐఫోన్లు, మాక్‌బుక్‌లు, ఐపాడ్లు, యాపిల్ వాచ్‌లపై ఆఫర్ల గురించి మరింత తెలుసుకోవడానికి సమీపంలోని మాపుల్ స్టోర్ లేదా ఆన్లైన్లో maplestore.in ని సందర్శించవచ్చు. ఇదీ చదవండి: Apple Retail Store In Delhi: రెండో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌కుక్ -
ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా?
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్..గత ఏడాది జరిగిన 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్'లో ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు సిరీస్ 8, ఎయిర్‌పాడ్స్ ప్రో, వాచీ ఎస్ఈ2 లను విడుదల చేసింది. ఈ సందర్భంగా యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ ఐఫోన్ 13తో పోలిస్తే కొత్త ఐఫోన్ 14 పెద్దగా అప్డేట్ ఏమీ లేదంటూ ఓ సెటైరికల్ మీమ్‌ను షేర్ చేశారు. అయితే త్వరలో ఐఫోన్ 15 సిరీస్ విడుదల కానున్న తరుణంలో ఈవ్ జాబ్స్ ఐఫోన్ 14 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐఫోన్ 14 లేకుండా జీవించలేనని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు టెక్ వరల్డ్ చర్చనీయాంశంగా మారాయి. ఐఫోన్ 14 లేకపోతే జీవించలేను న్యూయార్స్ మ్యాగజైన్ ‘ది స్ట్రాటజిస్ట్’తో జరిగిన ఇంటర్వ్యూలో ఏ వస్తువులు మీ దగ్గర లేకపోతే జీవించలేరన్న ఇంటర్వ్యూర్ ప్రశ్నకు ఈవ్ జాబ్స్ స్పందించారు. తాను 9 వస్తువులు లేకపోతే జీవించలేనని ఆవేంటో చెప్పారు. వాటిల్లో ఐఫోన్ 14కూడా ఉంది. నిజం చెబుతున్నారా? దీంతో ఇంటర్వ్యూ చేసే యాంకర్ గతంలో ఐఫోన్ 14పై వేసిన సెటైర్ల గురించి ప్రస్తావించారు. అందుకు ఆమె ‘ఇది క్రియేటివ్స్ కోసం సృష్టించిన టూల్ అని, దాని డిజైన్ మాస్టర్ పీస్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. మనుషుల జీవన విధానాల్ని సమూలంగా మార్చిన ఐఫోన్ 14 జీనియస్ అని అన్నారు. కొందరు ఈ విషయంపై ఈవ్ జాబ్స్ నిజం చెబుతున్నారా? లేదంటే సెటైర్లు వేస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ధరించిన చొక్కాలాంటిదే మరోటి కొనుక్కోవడం సాధారణంగా యాపిల్ విడుదల చేసే ఐఫోన్లన్నీ దాదాపు ఒకే తరహాలో ఉంటాయి. టెక్నాలజీ పరంగా ఫోన్లలో మార్పులు చేస్తుందే తప్పా డిజైన్‌లో పెద్దగా మార్పులుండవు. ఈవ్ జాబ్స్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఐఫోన్ 14 విడుదల సమయాలో ఓ మీమ్‌ను నెటిజన్లతో పంచుకున్నారు. ‘ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 14కు మారడం అంటే ప్రస్తుతం ధరించిన చొక్కాలాంటిదే మరోటి కొనుక్కోవడం లాంటిది’ అని చెప్పే మీమ్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. గుర్రపుస్వారీలో నిష్టాతురాలు స్టీవ్ జాబ్స్ నలుగురు పిల్లలలో ఈవ్ జాబ్స్ చిన్న. ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్, సైన్స్, టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించింది. మోడల్, గుర్రపుస్వారీలో నిష్టాతురాలు కూడా. చదవండి👉 ‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్ -
అబ్బా ..ఇది కదా ఆఫర్ అంటే, ఐఫోన్ 14ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి!
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఐఫోన్ 14 ఫోన్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128 జీబీ ఐఫోన్ 14 ధర రూ.71,999గా ఉంది. అయితే అదే ఫోన్‌ను ఎక్ఛేంజ్, బ్యాంక్ డిస్కౌంట్‌తో తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం దొరికింది. ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.30 వేల వరకు ఎక్ఛేంజ్ ఆఫర్లు అందిస్తుంది. ఈ ఎక్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే మీరు వినియోగిస్తున్న ఫోన్ కండీషన్ బాగుండాలి. పనితీరు ఆధారంగా ఎక్ఛేంజ్ ఆఫర్ ఎంత మొత్తం ఇవ్వాలనేది ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం ఇస్తుంది. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే మరో రూ.4వేల వరకు తగ్గుతుంది. ఐఫోన్ 14 ఫీచర్లు ఐఫోన్ 14 ఫీచర్ల విషయానికి వస్తే ఈ హాట్ డివైజ్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్, ప్రైమరీ 12ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సర్, సెకండరీ 12ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో పాటు వీడియో రికార్డింగ్ కోసం డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిఉంది. 16 కోర్ ఎన్పీయూ, 5 కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్‌తో కూడిన ఏ15 బయోనిక్ చిప్‌ను కలిగిఉంది. ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ ఐఓఎస్ 16 వెర్షన్‌పై రన్ అవుతుంది. చదవండి👉‘నో సిమ్ కార్డ్ ట్రేస్’.. ఐఫోన్ 15 సిరీస్‌పై ఆసక్తికర కథనాలు -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్: ఐఫోన్ 14 పై రూ. 44వేల భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: యాపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది.ఈ రోజు (మార్చి 31) ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో అనేక ఉత్పత్తులపై స్మార్ట్డీల్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఖరీదైన ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్న వారికి బంపర్ ఆఫర్. దాదాపు రూ. 44,901 తగ్గింపు తర్వాత కేవలం రూ. 34,999కి అందుబాటులో ఉంది. (సంక్షోభ సమయంలో హెచ్‌సీఎల్ టెక్ గుడ్‌న్యూస్) మార్చి 31 నుండి ఏప్రిల్ 3 వరకు జరిగే బిగ్ బచత్ ధమాల్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మొబైల్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,901 తగ్గింపుతో రూ.68,999కి విక్రయిస్తోంది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.4000 తక్షణ తగ్గింపు, స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్లో రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా రూ. 44,901 తగ్గింపు తర్వాత యాపిల్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 34,999కి లభించనుంది. (ఇదీ చదవండి: హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) యాపిల్ ఐఫోన్ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే 12 ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా,12 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) -
‘నో సిమ్ కార్డ్ ట్రేస్’.. ఐఫోన్ 15 సిరీస్‌పై ఆసక్తికర కథనాలు
ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది. దీంతో ఐఫోన్ 15 మీద టెక్ లవర్స్ దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 15పై అనేక రూమర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్నాలజీ బ్లాగ్ మాక్ జనరేషన్ ఐఫోన్ 15 సిరీస్‌పై ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అందులో యాపిల్ సంస్థ సిమ్ కార్డ్ ట్రేస్ లేకుండా ఈ ఏడాది ఫ్రాన్స్‌లో ఐఫోన్ 15 అమ్మకాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. యాపిల్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటే సిమ్ కార్డ్ ట్రేస్ లేని ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. ఫ్రాన్స్‌లో విక్రయాలు జరిగితే మిగిలిన ప్రపంచ దేశాల్లో సైతం ఐఫోన్లలో సిమ్ ట్రేస్ కనుమరుగు కానున్నాయి. ఐఫోన్ 15లో సిమ్ ట్రేస్‌ను తొలగిస్తే.. మొబైల్ నెట్ వర్క్ సాయంతో యాపిల్ ఫోన్లు ఈ - సిమ్ కార్డ్‌లతో పనిచేస్తాయి. ఫిజికల్ సిమ్ కార్డ్ లేకుండా మొబైల్ నెట్ వర్క్‌తో మొబైల్స్ పనిచేసేలా ఈ-సిమ్స్ వినియోగదారులను అనుమతిస్తుంది. ఐఫోన్ 14లో ఈ - సిమ్ ఐఫోన్ 14 విడుల సమయంలో యాపిల్ సంస్థ ఈ - సిమ్ల వినియోగాన్ని ప్రోత్సహిచింది. ఎందుకంటే ఫిజికల్ సిమ్కార్డ్లతో పోలిస్తే ఇది మరింత సురక్షితమైనదని భావించింది. వీటిని విరగొట్టుచ్చు లేదా దొంగిలించవచ్చు. 2022లో యూఎస్‌లో విక్రయించబడిన ఐఫోన్ 14 సిరీస్‌లో యాపిల్ సిమ్ కార్డ్ ట్రేని తొలగించి విక్రయాలు నిర్వహించింది. ప్రస్తుతం, ఐఫోన్ 13, కొత్త ఐఫోన్ ఉత్పత్తులలో ఒకేసారి రెండు ఈ సిమ్‌లు పనిచేసే సౌకర్యం ఉంది. సిమ్ కార్డ్ ట్రేలు లేకుండా యాపిల్ ఐఫోన్ 15 మోడళ్లను భారత్‌లో విడుదల చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
ఐఫోన్ ఎల్లో వేరియంట్‌పై భలే డిస్కౌంట్!
మనలో చాలా మందికి ఐఫోన్లంటే బాగా క్రేజ్. ప్రతి ఒక్కరూ ఐఫోన్ కొనాలని కలలు కంటారు. కానీ వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో కొనలేకపోతుంటారు. అయితే పలు ఐఫోన్ మోడళ్లపై ఇటీవల భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వీటిని గరిష్టంగా ఉపయోగించుకుంటే తక్కువ ధరకే కలల ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Realme C33 2023: తక్కువ ధరలో రియల్మీ ఫోన్లు... కిర్రాక్ ఫీచర్లు! ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లు గతేదాది ఐదు రంగుల్లో విడుదలైంది. మళ్లీ ఈ మధ్య మరో కలర్ వేరియంట్‌ను యాపిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే ఎల్లో వేరియంట్. యాపిల్ డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన రెడింగ్టన్ ఐఫోన్ 14 సిరీస్ ఎల్లో వేరియంట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లపై రూ.15,000 వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది. స్టోర్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, పాత ఐఫోన్ల ఎక్సేంజ్ ద్వారా ఈ తగ్గింపు లభిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా ఈ తగ్గింపులు పొందవచ్చు. ఇదీ చదవండి: 100 సీసీ హోండా షైన్ వచ్చేసింది! ధర దాని కంటే తక్కువే.. ఈ ఐఫోన్ 14 ఎల్లో వేరియంట్ మార్చి 10 నుంచి ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులోకి వచ్చింది. మార్చి 14 నుంచి రిటైల్ స్టోర్లలో విక్రయిస్తున్నారు. ఐఫోన్ 14 ఎల్లో వేరియంట్ ధర రూ. 79,990. ఐఫోన్ 14 ఎల్లో వేరియంట్ ప్లస్ ప్రారంభ ధర రూ. 89,990. అయితే ఇందులో రంగు తప్ప ఎటువంటి అప్డేట్లు ఇవ్వలేదు. 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. ఇక ఐఫోన్ 14 ప్లస్‌లో 6.7 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇందులో మూడు వేరియంట్లు 128జీబీ స్టోరేజ్ 6జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ 6జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ 6జీబీ ర్యామ్ అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్? భారీగా పతనమైన షేర్లు.. -
నయా కలర్ ఆప్షన్.. ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్!
మార్కెట్లో 'ఐఫోన్స్'కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఇందులో కస్టమర్లు ఆధునిక ఫీచర్స్ ఉన్న వాటిని మాత్రమే కాకుండా, లేటెస్ట్ కలర్ ఆప్షన్ కూడా ఎంపిక చేసుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పుడు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మొబైళ్లను కొత్త ఎల్లో కలర్ ఆప్షన్లో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు పింక్, వైట్, గ్రే మొదలైన కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఐఫోన్స్ రానున్న రోజుల్లో 'ఎల్లో' ఆప్షన్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 14 సిరీస్ నయా కలర్ పొందుతున్నట్లు జపాన్‌కు చెందిన బ్లాగ్ మ్యాక్ఒటాకర వెల్లడించింది. (ఇదీ చదవండి: సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్: కేవలం 300 మందికి మాత్రమే!) గతంలో ఎల్లో కలర్ అనేది ఐఫోన్ 11 సిరీస్‌లో ఉండేది. అయితే నాలుగేళ్ల తరువాత కంపెనీ మళ్ళీ ఐఫోన్ 14లో ఈ కలర్ తీసుకురావాలని సంకల్పించింది. అయితే ఈ కొత్త కలర్ ప్రొడక్ట్ ప్లానింగ్ వచ్చే వారంలో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఐఫోన్ 13కి గ్రీన్ కలర్ అందించింది. నిజానికి యాపిల్ కంపెనీ సెప్టెంబర్ నెలలో కొత్త సిరీస్ మొబైల్స్ లాంచ్ చేస్తుంది. ఆ తరువాత సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఆ సిరీస్‌లో కొత్త కలర్ వేరియంట్లను ప్రవేశపెడుతుంటుంది. 2022 మార్చిలో కంపెనీ ఐఫోన్ 13 సిరీస్‌కు గ్రీన్ కలర్, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ ఫోన్లకు 2021 ఏప్రిల్‌లో పర్పుల్ కలర్ ఆప్షన్ అందించింది. కొనుగోలుదారులను ఆకర్శించడానికి కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కలర్స్ విడుదల చేస్తుంది. -
ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపరాఫర్!..మరీ ఇంత డిస్కౌంటా?
హోలీ సందర్భంగా కొనసాగుతున్న బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఐఫోన్ 13,ఐఫోన్ 14 ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక సేల్‌లో దాదాపు 1000 కి పైగా బ్రాండ్స్‌కి చెందిన దాదాపు లక్షకుపైగా ప్రోడక్ట్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వీటితో పాటు పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లైన ఐఫోన్ 13,ఐఫోన్ 14 మోడళ్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లకే అందిస్తున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆఫర్లో భాగంగా ఐఫోన్ 13 ధర రూ.61,999 ఉండగా..రూ.59,999కే కొనుగోలు చేయొచ్చు. ఫోన్‌పై ఎక్ఛేంజ్ ఆఫర్ సౌకర్యం ఉంటే ఆ ధర కాస్త రూ.23,000 వరకు తగ్గుతుంది. అదే సమయంలో ఐఫోన్ 14 ధర రూ.71,999 ఉండగా..సేల్‌లో రూ.67,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక స్మార్ట్ఫోన్లు కాకుండా గృహోపకరణాలు, వంటగదిలో వినియోగించే వస్తువులు,హోమ్ అప్లయెన్సెస్ పై 70శాతం, రిఫ్రిజిరేటర్లపై 60శాతం డిస్కౌంట్స్, ల్యాప్‌ట్యాప్స్‌పై 45శాతం డిస్కౌంట్ పొందవచ్చు. -
ఐఫోన్ 15 సిరీస్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కలర్స్‌పై ఓ లుక్కేయండి!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ గత ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫోన్ విడుదలై కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఐఫోన్ 14 కంటే తదుపరి సిరీస్ ఐఫోన్ 15లో లేటెస్ట్ టెక్నాలజీ జోడించడంతో పాటు వివిధ రకాలైన కలర్స్‌తో మార్కెట్‌కు పరిచయం చేయాలని యాపిల్ సంస్థ భావిస్తోంది. ఈ తరుణంలో ఐఫోన్ 15 సిరీస్‌లో వనిల్లా కొత్త వేరియంట్స్ కలర్స్‌తో మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు ‘9 టూ 5 మాక్’ నివేదిక తెలిపింది. వనిల్లా ఐఫోన్ 15 సిరీస్‌లో డార్క్ పింక్, లైట్ బ్లూ కలర్స్‌తో పాటు సెల్ఫీ జనరేటెడ్ రెండర్ ఇమేజ్ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు పింక్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో వనిల్లా ఐఫోన్ 15 ఇమేజ్‌లను విడుదల చేయడంపై ఆసక్తి మరింత పెరిగింది. ఐఫోన్ 15సిరీస్‌లో బ్లాక్ , వైట్, రెడ్ వేరియంట్స్ కలర్స్‌తో మార్కెట్‌కు పరిచయం కానుందని నివేదికలు చెబుతున్నాయి. కానీ లేటెస్ట్ కలర్స్‌పై యాపిల్ స్పందించలేదు. ఇక రిపోర్ట్‌ల ప్రకారం.. ఈ ఏడాది ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌ను స్పెషల్ కలర్స్ లాంచ్ చేయనుంది. ముఖ్యంగా ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్/ ఆల్ట్రా మోడల్స్‌లో డార్క్ రెడ్ కలర్స్‌తో టైటానియం ఫినిష్‌తో రానుంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ డిస్ప్లేల చుట్టూ తిన్నర్ బెజెల్స్, ఐఫోన్ 14 తరహా స్క్రీన్‌ను పోలి ఉండనుందని గతంలోనే పలు నివేదికలు తెలిపాయి. తాజా నివేదికలు సైతం యాపిల్ వాచ్ తరహా డిజైన్లతో థిన్ బెజెల్స్, కర్డ్వ్ షేప్స్‌తో విడుదల కానున్నట్లు సమాచారం. -
ఐఫోన్14.. యాపిల్ బంపర్ ఆఫర్!
తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే. రూ.80 వేల విలువైన ఐఫోన్ 14ను రూ.14 వేలకే అందిస్తోంది యాపిల్. ఐఫోన్ 14ను ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్‌లతో యాపిల్ గతేడాది విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.79,999. యాపిల్ స్టోర్ ఎప్పుడో గానీ డిస్కౌంట్లు ఇవ్వదు. కానీ ఐఫోన్ 14పై మాత్రం భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో రెండు రకాల ఆఫర్లు ఉన్నాయి. మొదటి పాత ఫోన్ ఎక్సేంజ్, రెండోది బ్యాంక్ ఆఫర్. వీటిని ఉపయోగించుకుని చాలా తక్కువ ధరకే ఐఫోన్14 కొనుక్కోవచ్చు. అది ఎలాగో చూడండి... అన్ని రకాల ఆఫర్లు, డిస్కౌంట్లను వినియోగించుకుంటే యాపిల్ స్టోర్‌లో ఐఫోన్ 14 రూ.14,170 లభిస్తోంది. రూ.79,990 ఉండే ఈ ఫోన్‌ను యాపిల్ ప్రాథమిక ఆఫర్‌తో రూ.58,730కు ఉంచింది. ఆ తర్వాత పనిచేసే కండీషన్లో ఉన్న మీ పాత ఫోన్‌ను ఎక్సేంజ్ చేసుకుంటే గరిష్ట మొత్తంలో ఆఫర్ లభిస్తుంది. ఇక్కడ బయటకు కనిపించని ఒక సీక్రెట్ ఏంటంటే.. పైకి ఎంతో ఆసక్తికరంగా కనిపించే ఈ ఆఫర్ లో కొన్ని లిటిగేషన్ లు కూడా ఉన్నాయి. పాత ఫోన్ అనగానే మనం వాడే ఫోన్ తీసుకెళ్తే దానికి అంతగా విలువ కట్టరు. యాపిల్ ఫోన్లను ప్రతీసారి అప్ డేట్ చేసుకునే కస్టమర్లు కొందరు ఉంటారు. కొత్త మోడల్ వచ్చిన ప్రతీసారి వారు తమ వద్ద ఉన్న మోడల్ ను ఇచ్చి కొత్తది తీసుకుంటారు. అలాగే ఐఫోన్ 14 విషయంలోనూ ఇలాంటి షరతే వర్తిస్తుంది. మీ దగ్గర మంచి కండీషన్ లో ఉన్న ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13 మోడల్ ఉంటే.. దానికి గరిష్టంగా కట్టే విలువ దాదాపు రూ.35 వేలు. ఇక హెచ్డీఎఫ్సీ కార్డ్‌లతో చెల్లింపులు చేస్తే రూ.7వేలకు పైగా డిస్కౌంట్ వస్తుంది. ఇలా అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే రూ.14,170కే ఐఫోన్ 14 మీ సొంతం అవుతుంది. పైకి సులభంగా అనిపించినా.. షరతులన్నీ చూసుకుంటే.. లాభమా? నష్టమా? వినియోగదారులే నిర్ణయించుకోవాలి. (ఇదీ చదవండి: హైడ్రోజన్‌తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి) -
Valentine’s Day sale: ఐఫోన్14 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: వాలెండైన్స్ డే అంటేనే బిజినెస్ వర్గాలకు సందడి. వాలెండైన్స్ డే డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు ఆఫర్స్‌ను అందిస్తుంటాయి. అందులోనూ ఐఫోన్ల మీద తగ్గింపు అంటే ప్రేమికులు ఎగబడరూ! ఈ క్రేజ్ నేపథ్యంలో యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపుధరలు అందుబాటులో ఉన్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్ ఫోనలపై 12,195 దాకా తగ్గింపు లభిస్తోంది. దీంతోపాటు బ్యాంక్ కార్డ్‌లపై తక్షణ తగ్గింపులతో పాటు తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కలిగి ఉన్నాయని గమనించాలి. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు మరో రూ.4,000 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 14పై 6వేలు, ఐ ఫోన్ 14 ప్లస్‌పై 7వేల దాకా తక్షణ డిస్కౌంట్ లభ్యం. ఐఫోన్ 14: ఐఫోన్ 14 ఇపుడు రూ. 67,705లకే కొనుగోలు చేయవచ్చు. గత సెప్టెంబర్‌లో లాంచింగ్ ధర రూ. 79,900 ఐఫోన్ 14 ప్లస్: ఐఫోన్ 14 ప్లస్ రూ. రూ. 84,900 గత సెప్టెంబర్‌లో దీని లాంచింగ్ ధర రూ. 89,900 ప్రో మోడల్స్‌పై కూడా ఆఫర్ అలాగే ఐఫోన్ 14 ప్రో , ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ పై డిస్కౌంట్ అందుబాటులోఉంది. రూ. 129,900వద్ద లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రోను ఈ సేల్‌లో రూ. 1,25,400కు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ రూ. 1,35,400కే లభ్యం. అసలు ధర రూ. 139,900 ఇతర ఉత్పతులపై కూడా ఫిబ్రవరి 28 వరకూ సేల్! ఈ సేల్, తగ్గింపు ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకు మాత్రమే ఈ అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ఇతర ఉత్పత్తులపై కూడా తగ్గింపు లభ్యం. -
వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!
సామర్ధ్యం ఉండి.. ఐఫోన్‌ను కొనలేకపోయామే అని బాధపడుతున్న ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త. గతేడాది మార్కెట్లో యాపిల్ శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు ఇతర సంస్థలు భారీ ఎత్తున ఫోన్లను విడుదల చేశాయి. ఏ సంస్థ నుంచి ఎన్ని ఫోన్లు విడుదలైన అందులో ఐఫోన్‌కు ప్రత్యేకత వేరే ఉంటుంది. అందుకే స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ జీవితంలో ఒక్కసారైన ఐఫోన్‌ను వినియోగించాలని అనుకుంటారు. కానీ ఆ ఫోన్ ధర కారణంగా వెనక్కి తగ్గుతుంటారు. ఇప్పుడు అలాంటి వారి కోసమే ఈకామర్స్ కంపెనీలు భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ దేశీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ అమ్మకాలపై క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. 2022 ఆగస్ట్ నెలలో యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. ఆ సిరీస్‌లోని ఐఫోన్ 14 పై భారీ ఎత్తున డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. రీటైల్ మార్కెట్లో ఆఫోన్ ధర రూ.80 వేలు ఉండగా.. ఇప్పుడు అదే ఫోన్ పై రూ.5,910 డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇలా ఫ్లిప్ కార్ట్‌తో పాటు ఇతర డిస్కౌంట్లతో ఆ ఫోన్ ధర రూ.50,990కి తగ్గింది. ఒకవేళ మీరు 128 జీబీ వేరీయంట్ ఐఫోన్ 14ను ఎక్ఛేంజీలో సైతం కొనుక్కోవచ్చు. ఫోన్ కండీషన్ బాగుండి, మేజర్ సమస్యలు లేకపోతే ట్రేడ్- ఇన్ డిస్కౌంట్ వ్యాల్యూ ఆధారంగా క్యాలిక్లేట్ చేసి మీ ఫోన్ పై ఎంత ఎక్ఛేంజీ ఇవ్వాలో నిర్ధారిస్తారు ఐఫోన్ ప్రతినిధులు. ఆఫోన్పై ఎక్ఛేంజ్తో రూ.23వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎగ్జిస్టింట్ ఇన్స్టంట్ డిస్కౌంట్ కింద 7శాతం డిస్కౌంట్, ఇతర బ్యాంక్‌లు ఇచ్చే ఆఫర్లు ఇలా మొత్తం కలిపితే రూ.40వేలకే ఫోన్ కొనుగోలు చేయొచ్చని ప్లిప్ కార్ట్ తెలిపింది. కాగా, యాపిల్ కంపెనీ త్వరలో ఐఫోన్ 15 సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి👉‘నా దారి నేను చూసుకుంటా’, చైనాకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారీ షాక్!