ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్‌ | Iphone 14 Plus Gets Heavy Discount On Flipkart Ahead Of iPhone 16 Series Launch, Check Out Details | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్‌

Published Sat, Aug 3 2024 10:09 PM | Last Updated on Sun, Aug 4 2024 7:02 PM

iPhone 14 Plus gets heavy discount on Flipkart

ఐఫోన్ 16 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి యాపిల్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 మోడల్‌ ధర భారీగా తగ్గింది. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.

యాపిల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 14 ప్లస్ ధర రూ. 79,600 లుగా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో కొంటే రూ. 56,000 కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 ప్లస్ బేస్ వేరియంట్ రూ. 56,499కి అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్ కొనుగోలుపై కొనుగోలుదారులు రూ.23,101 ఆదా చేసుకోవచ్చు. దీంతో పాటు, యూపీఐ ద్వారా పేమెంట్‌ చేస్తే రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. అంటే ఐఫోన్ 14 ప్లస్ రూ.55,499కే లభిస్తుందన్న మాట.

ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్స్‌
» 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పెద్ద 
» 6.7-అంగుళాల స్క్రీన్ సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే
» డిస్‌ప్లే దెబ్బతినకుండా సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌
» A15 బయోనిక్ చిప్‌సెట్
» 12-మెగాపిక్సెల్ రియర్‌ డ్యూయల్ కెమెరా
» 12-మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement