కొత్త సంవత్సరంలో లేటెస్ట్‌ ఐఫోన్‌.. బంపర్‌ డిస్కౌంట్‌ | iPhone 15 becomes cheaper available at rs 50999 on Flipkart | Sakshi
Sakshi News home page

కొత్త సంవత్సరంలో లేటెస్ట్‌ ఐఫోన్‌.. బంపర్‌ డిస్కౌంట్‌

Published Wed, Dec 25 2024 6:03 PM | Last Updated on Wed, Dec 25 2024 6:03 PM

iPhone 15 becomes cheaper available at rs 50999 on Flipkart

కొత్త సంవత్సరంలో ఐఫోన్‌ (iPhone) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారీ డీల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఫ్లి ప్‌కార్ట్‌ (Flipkart) ఐఫోన్‌ 15 (iPhone 15)పై గొప్ప డీల్‌ని తీసుకొచ్చింది. ఈ డీల్‌ని సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్‌ 15 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఇలా చేస్తే రూ.50,999కే ఐఫోన్‌ 15
యాపిల్‌ (Apple) అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్‌ 15 అసలు ధర 128జీబీ వేరియంట్‌కు రూ.69,900 లుగా ఉంది. ఇదే ఐఫోన్ 15 గ్రీన్ కలర్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 57,999 ధరతో లిస్ట్‌ అయింది. అన్ని ఇతర కలర్ వేరియంట్‌లు రూ. 58,999 వద్ద ఉన్నాయి.

అయితే మీరు ఈ ఫోన్‌ను రూ.50,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ టీజర్ చిత్రం ప్రకారం.. ఐఫోన్ 15‌పై రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్‌ చేసుకోవడానికి పాత ఫోన్‌ ఉన్నట్లయితే ఆ ఫోన్ ద్వారా రూ. 6000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఆఫర్ల తర్వాత, ఫోన్ ప్రభావవంతమైన ధర రూ. 50,999. అయితే ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ ఫోన్ పరిస్థితి, బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

ఐఫోన్ 15 స్పెక్స్‌
ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్‌లో యాపిల్‌ బయోనిక్‌ ఎ16 (Bionic A16) చిప్‌సెట్ ఉంటుంది. ఇది 5-కోర్ జీపీయూతో వస్తుంది. ఫోన్‌లో డైనమిక్ నాచ్ కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇక చార్జింగ్‌ విషయానికి వస్తే.. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ వస్తుంది. ఛార్జింగ్ కేబుల్ ఫోన్ బాక్స్‌లోనే వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement