smart phone
-
త్వరలో స్మార్ట్ ఫోన్ అంతం!! తర్వాత రాబోయేది ఇదే..
విశ్వవ్యాప్త సాంకేతికతను అంగీకరించడంలో మనిషి ఎప్పుడూ ముందుంటాడు. దానిని అంతే వేగంగా ఒడిసిపట్టుకుని అంగీకరిస్తుంటాడు కూడా. అయితే దశాబ్దాలపాటు మనందరి జీవితంలో భాగమైన మొబైల్ ఫోన్.. త్వరలో అంతం కానుందా?. అన్నింటికీ నెక్స్ట్(అడ్వాన్స్డ్) లెవల్ కోరుకునే మనిషికి వాటి స్థానంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులోకి రాబోతోంది?..మనిషి జీవితంలో మొబైల్ ఫోన్లు(Mobile Phones) రాక ఒక క్రమపద్ధతిలో జరిగింది. కమ్యూనికేషన్లో భాగంగా.. రాతి కాలం నుంచి నేటి ఏఐ ఏజ్ దాకా రకరకాల మార్గాలను మనిషి అనుసరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో పొగతో సిగ్నల్స్ ఇవ్వడం దగ్గరి నుంచి.. పావురాల సందేశం, డ్రమ్ములు వాయించడం, బూరలు ఊదడం లాంటి ద్వారా సమాచారాన్ని ఇచ్చుపుచ్చుకునేవాడు. కొన్ని ఏండ్లకు అది రాతపూర్వకం రూపంలోకి మారిపోయింది. ఆపై.. ఆధునిక యుగానికి వచ్చేసరికి టెలిగ్రఫీ, టెలిఫోనీ, రేడియో కమ్యూనికేషన్, టెలివిజన్, మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్-ఈమెయిల్, స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా.. ఆపై మోడ్రన్ కమ్యూనికేషన్(Modern Communication)లో భాగంగా ఏఐ బేస్డ్ టూల్స్ ఉపయోగం పెరిగిపోవడం చూస్తున్నాం. అయితే.. ఇన్నేసి మార్పులు వచ్చినా దశాబ్దాల తరబడి మొబైల్ ఫోన్ల డామినేషన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కాలక్రమంలో మనిషికి ఫోన్ ఒక అవసరంగా మారిపోయిందది. మరి అలాంటిదానికి అసలు ‘అంతం’ ఉంటుందా?అమెరికా వ్యాపారవేత్త, ఫేస్బుక్ సహా వ్యవస్థాపకుడు, ప్రస్తుత మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) సెల్‌ఫోన్ స్థానంలో తర్వాతి టెక్నాలజీ ఏంటో అంచనా వేస్తున్నారు. సెల్ఫోన్ల అంతం త్వరలోనే ఉండబోతోందని, వాటి స్థానాన్ని స్మార్ట్ గ్లాసెస్ ఆక్రమించబోతున్నాయని అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో వేరబుల్ టెక్నాలజీ(ఒంటికి ధరించే వెసులుబాటు ఉన్న సాంకేతికత) అనేది మనిషి జీవితంలో భాగం కానుంది. సంప్రదాయ ఫోన్ల కంటే స్మార్ట్ గ్లాసెస్‌ను ఎక్కువగా వినియోగిస్తాడు. వీటిని వాడడం చాలా సులువనే అంచనాకి మనిషి త్వరగానే వస్తాడు. అవుట్‌డేటెడ్ విషయాలను పక్కన పెట్టడం, ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నప్పుడు మనమూ అంగీకరించడం సర్వసాధారణంగా జరిగేదే. నా దృష్టిలో రాబోయే రోజుల్లో తమ చుట్టుపక్కల వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేందుకు స్మార్ట్ గ్లాసెస్(Smart Glasses)లాంటివి ఎక్కువగా వాడుకలోకి వస్తుంది. ఆ సంఖ్య ఫోన్ల కంటే కచ్చితంగా ఎక్కువగా ఉంటాయి’’ అని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.అలాగే 2030 నాటికి సెల్ఫోన్ల వాడకం బాగా తగ్గిపోతుందని.. దానికి బదులు స్మార్ట్‌గ్లాసెస్ తరహా టెక్నాలజీ వాడుకలో ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే వేరబుల్ టెక్నాలజీ ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని.. అలాగని దానిని అందరికీ అందుబాటులోకి తేవడం అసాధ్యమేమీ కాదని, అంచలంచెలుగా అది జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. స్మార్ట్ఫోన్లతోపాటు వాటికి అనువైన స్మార్ట్ యాక్ససరీస్‌కు మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ ఉంటోంది. తాజా సర్వేల ప్రకారం.. గత ఐదేళ్లుగా స్మార్ట్ వేరబుల్స్ వినియోగం పెరుగుతూ వస్తోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్ కంపెనీలు సైతం సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ వేరబుల్స్‌ను విడుదల చేస్తున్నాయి. అందునా స్మార్ట్‌గ్లాసెస్ వినియోగమూ పెరిగింది కూడా. రేబాన్ మెటా, ఎక్స్ రియల్ ఏ2, వచుర్ ప్రో ఎక్స్ఆర్, సోలోస్ ఎయిర్‌గో విజన్, అమెజాన్ ఎకో ఫఫ్రేమ్స్, లూసిడ్ తదితర బ్రాండ్లు మార్కెట్లోకి అందుబాటులోకి ఉన్నాయి. యాపిల్ కంపెనీ యాపిల్ విజన్ ప్రో పేరిట మార్కెట్‌కు తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. మరికొన్ని కంపెనీలు కూడా ఇంకా ఈ లిస్ట్‌లో ఉన్నాయి.ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ చేతికి అత్యంత అరుదైన వాచ్!! -
మార్కెట్లోకి షావొమీ రెడ్మీ-14సీ 5జీ.. బడ్జెట్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల దిగ్గజ కంపెనీ షావొమీ (Xiaomi) సరికొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేయనుంది. రెడ్మీ -14సీ 5జీ (Redmi 14C 5G) పేరుతో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ వినియోగదారుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ తయారు చేశామని కంపెనీ ప్రతినిధి సందీప్ శర్మ తెలిపారుహైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను వివరించారు. భారత్‌లో 5జీ స్మార్ట్ఫోన్ల వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ ఇప్పటివరకూ కేవలం 16 శాతం మంది వినియోగదారులు మాత్రమే 5జీ ఫోన్లు కలిగి ఉన్నారని.. మరింత మంది అత్యధిక వేగంతో పని చేసే 5జీ ఫోన్లను అందుబాటులోకి తెచ్చే క్రమంలో భాగా షావొమీ రెడ్మీ-14సీని అందుబాటులోకి తెచ్చిందని ఆయన వివరించారు. స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్‌గేజ్ బ్లాక్ పేరుతో ప్రత్యేకంగా డిజైన్‌తో కూడిన మూడు రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుందని తెలిపారు.నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ డిజైన్..రెడ్మీ - 14సీ 5జీలో స్మార్ట్‌ఫోన్‌లో అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 4జెన్-2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ (Processor) అర్కిటెక్చర్ కారణంగా సెకనుకు 2.5 జీబీబీఎస్ల వేగాన్ని అందుకోగలగడం దీని ప్రత్యేకత. 5జీ వేగాలను అందుకునేందుకు వీలుగా ఎక్స్-61 మోడెమ్‌ను ఏర్పాటు చేశారు. స్క్రీన్ సైజ్ 6.88 అంగుళాల హెచ్డీ (HD) డిస్ప్లే కాగా.. రెఫ్రెష్ రేటు 120 హెర్ట్ట్జ్. అలాగే డాట్ డ్రాప్ డిస్ప్లే కలిగి ఉండి.. గరిష్టంగా 600 నిట్స్ ప్రకాశాన్ని ఇస్తుంది.ఇక స్టోరేజీ విషయానికి వస్తే 12 జీబీల ర్యామ్ (RAM) (6జీబీ + అవసరమైతే మరో 6 జీబీ) కలిగి ఉంటుంది. 128 జీబీల రామ్ సొంతం. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఒక టెరాబైట్ వరకూ స్టోరేజీని పెంచుకోవచ్చు. 50 ఎంపీల ఏఐ-డ్యుయల్ కెమెరా వ్యవస్థతోపాటు 8 ఎంపీల సెల్ఫీ కెమెరాతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షావొమీ హైపర్ ఓఎస్‌పై పని చేస్తుంది.ధర.. అందుబాటులోకి ఎప్పుడు?రెడ్మీ 14సీ 5జీ ఈ నెల 10వ తేదీ నుంచి షావోమీ స్టోర్లతోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లలోనూ అందుబాటులోకి రానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ కలిగగిన ప్రాథమిక మోడల్ ధర రూ.9999లు కాగా.. స్టోరేజీ 128 జీబీ, మెమరీ నాలుగు జీబీలుండే ఫోన్ ధర రూ.10,999లు.. 6 జీబీ మెమరీ, 128 జీబీ స్టోరేజీ ఉన్న ఫోన్ ధర రూ.11,999లు అని సందీప్ శర్మ తెలిపారు. -
కొత్త సంవత్సరంలో లేటెస్ట్ ఐఫోన్.. బంపర్ డిస్కౌంట్
కొత్త సంవత్సరంలో ఐఫోన్ (iPhone) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారీ డీల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఫ్లి ప్కార్ట్ (Flipkart) ఐఫోన్ 15 (iPhone 15)పై గొప్ప డీల్‌ని తీసుకొచ్చింది. ఈ డీల్‌ని సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్ 15 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.ఇలా చేస్తే రూ.50,999కే ఐఫోన్ 15యాపిల్ (Apple) అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 15 అసలు ధర 128జీబీ వేరియంట్‌కు రూ.69,900 లుగా ఉంది. ఇదే ఐఫోన్ 15 గ్రీన్ కలర్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 57,999 ధరతో లిస్ట్ అయింది. అన్ని ఇతర కలర్ వేరియంట్లు రూ. 58,999 వద్ద ఉన్నాయి.అయితే మీరు ఈ ఫోన్‌ను రూ.50,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ టీజర్ చిత్రం ప్రకారం.. ఐఫోన్ 15పై రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాత ఫోన్ ఉన్నట్లయితే ఆ ఫోన్ ద్వారా రూ. 6000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఆఫర్ల తర్వాత, ఫోన్ ప్రభావవంతమైన ధర రూ. 50,999. అయితే ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ ఫోన్ పరిస్థితి, బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.ఐఫోన్ 15 స్పెక్స్ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేతో వస్తుంది. ఫోన్లో యాపిల్ బయోనిక్ ఎ16 (Bionic A16) చిప్సెట్ ఉంటుంది. ఇది 5-కోర్ జీపీయూతో వస్తుంది. ఫోన్లో డైనమిక్ నాచ్ కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే.. యూఎస్బీ టైప్-సి పోర్ట్ వస్తుంది. ఛార్జింగ్ కేబుల్ ఫోన్ బాక్స్‌లోనే వస్తుంది. -
వివో ఎక్స్200 సిరీస్.. ఇలాంటి కెమెరా తొలిసారి
మొబైల్స్ తయారీ సంస్థ వివో తాజాగా భారత్‌లో ఎక్స్200 సిరీస్ విడుదల చేసింది. వీటిలో వివో ఎక్స్200 ప్రో, వివో ఎక్స్200 ఉన్నాయి. భారత్‌లో తొలిసారిగా 200 మెగాపిక్సెల్ జైస్ అపోక్రోమాటిక్ టెలిఫోటో కెమెరా, 6,000 ఎంఏహెచ్ సెమీ–సాలిడ్ సేŠట్ట్ బ్యాటరీని వివో ఎక్స్200 ప్రో మోడల్‌కు పొందుపరిచారు.6.78 అంగుళాల ఆమర్ గ్లాస్ డిస్ప్లేతో తయారైంది. 50 ఎంపీ జైస్ ట్రూ కలర్ మెయిన్ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సైతం జోడించారు. ఎక్స్200 మోడల్ 6.67 అంగుళాల షాట్ ఆల్ఫా గ్లాస్ డిస్ప్లేతో రూపుదిద్దుకుంది. 50 ఎంపీ వీసీఎస్ ట్రూ కలర్ మెయిన్ కెమెరా, 50 ఎంపీ జైస్ టెలిఫోటో కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు ఉంది.ఫన్‌టచ్ ఓఎస్ 15, జెమినై అసిస్టెంట్, ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, వివో ఏఐ లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ వంటి హంగులు ఉన్నాయి. ఎక్స్200 ప్రారంభ ధర రూ.65,999 కాగా, ఎక్స్200 ప్రో ధర రూ.94,999 ఉంది. -
8 గంటలు ఫోన్ లేకుండా.. రూ.లక్ష బహుమతి
ప్రస్తుత రోజులలో స్మార్ట్ ఫోన్‌కు మనుషులు ఎంతలా బానిసలయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్ లేకుండా నిమిషం ఉండాలన్న కష్టమే. కానీ చైనాలో ఒక మహిళ ఎనిమిది గంటల పాటు మొబైల్ ఫోన్ వినియోగానికి దూరంగా ఉండే పోటీలో విజేతగా నిలిచి 10,000 యువాన్లను (రూ.1,16,000) గెలుచుకుంది.స్థానిక జిము న్యూస్ రిపోర్ట్ ప్రకారం, పోటీ నవంబర్ 29న చాంగ్కింగ్ మునిసిపాలిటీలోని ఒక షాపింగ్ సెంటర్లో జరిగింది. 100 మంది దరఖాస్తుదారుల నుండి ఎంపిక చేసిన పది మంది ఈ పోటీలో పాల్గొన్నారు. వీరు తమకు కేటాయించిన బెడ్‌పై ఎనిమిది గంటలు గడపవలసి ఉంటుంది. పోటీకి ముందు, వారి నుంచి మొబైల్ ఫోన్లను తీసేసుకున్నారు. ఐప్యాడ్లు, ల్యాప్‌టాప్‌లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా వాడటానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులతో కాలింగ్ సౌకర్యం మాత్రమే పాత మొబైల్ ఫోన్ ఉపయోగించవచ్చు.పోటీ జరుగుతున్నంత సేపూ బెడ్ మీదే ఉండాలి. టాయిలెట్ కు వెళ్లొచ్చు. పానీయాలు, భోజనం అక్కడికే అందించారు. పోటీదారులు నిద్రలోకి జారుకోకూడదు. ఎటువంటి ఆందోళనను ప్రదర్శించకూడదు. ఇందుకోసం వారి నిద్ర, ఆందోళన స్థాయిలను పర్యవేక్షించడానికి వారి చేతి మణికట్టుకు పట్టీలను అమర్చారు. చాలా మంది పోటీదారులు పుస్తకాలు చదవడం ద్వారానో లేదా కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం ద్వారానో సమయాన్ని గడిపారు. చివరికి, డాంగ్ అనే మహిళ 100కి 88.99 స్కోర్‌ను సాధించి ఛాంపియన్‌గా నిలిచారు. -
మరో సంచలనానికి సిద్దమవుతున్న జియో.. త్వరలో 5జీ స్మార్ట్‌ఫోన్
అక్టోబర్ నెలలో రిలయన్స్ జియో అతి తక్కువ ధర వద్ద రెండు 4జీ మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే బాటలో చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ యోచిస్తున్నట్లు సమాచారం.భారతదేశపు అతిపెద్ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో.. సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడానికి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చురర్ (OEMs), యూఎస్ చిప్‌మేకర్ క్వాల్‌కామ్‌తో జత కట్టనుంది. ఈ విషయాన్ని జియో వైస్ ప్రెసిడెంట్ సునీల్ దత్ వెల్లడించారు.రిలయన్స్ జియో అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. పరికరాల తయారీదారులు & బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోంది. 5జీ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. వినియోగదారులకు సరసమైన పరికరాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని సునీల్ దత్ పేర్కొన్నారు.భారతదేశ టెలికామ్ ల్యాండ్‌స్కేప్‌ను విప్లవాత్మకంగా మార్చిన చరిత్ర జియోకు ఉంది. 2016లో సంస్థ జియో ఫోన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 999 మాత్రమే, నెలకు రూ. 123తో ప్రారంభమయ్యే సరసమైన రీఛార్జ్‌లను అందించింది. కాబట్టి ఇది మార్కెట్లో 10 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.ఇక రాబోయే జియో 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. అయితే ఇది మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది. దీని ధర ఎంత ఉండొచ్చు? అనే చాలా వివరాలు రాబోయే రోజుల్లో అధికారికంగా వెల్లడవుతాయి. -
టాలీవుడ్ స్టార్ నటుడు.. ఇప్పటికీ రూ.2 వేల ఫోన్‌తోనే!
టాలీవుడ్లో విలక్షణ నటుడు ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకొస్తుంది. అతను మరెవరో కాదు.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. తనదైన నటనతో అలరించే పోసాని కృష్ణమురళి. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హావభావాలు, నటన చూస్తే చాలు చిరకాలంగా గుర్తుండిపోతాయి. అయితే సినీ ప్రియుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో చూసేద్దామా?ప్రస్తుతం కాలమంతా డిజిటల్ యుగం. చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచమంతా తిరిగేసి రావొచ్చు. ప్రస్తుతం ఆలాంటి యుగమే నడుస్తోంది. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండటం అంతా ఈజీ కాదు. కానీ అలా ఉండి చూపించారాయన. ఇప్పటికీ ఉంటున్నారు కూడా. తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్పనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి. ఇప్పటికీ ఆయన వాడుతున్న నోకియా ఫోన్ విలువ కేవలం రెండువేల రూపాయలే. ఈ కాలంలో ఇంత సింపుల్‌గా జీవించడమంటే మామూలు విషయం కాదు.సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో పోసాని కేవలం నోకియా ఫోన్‌కే పరిమితం కావడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తాను టీవీలో వార్తలు, సినిమాలు, సీరియల్స్ చూస్తానని అంటున్నారు. కానీ వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి గురించి తనకు తెలియదని పోసాని అన్నారు. ఈ నోకియా ఫోన్ రిలీజైనప్పుడు కొన్నదేనని ఆయన వెల్లడించారు. ఏదేమైనా ఈ డిజిటల్ యుగంలో నోకియా ఫోన్ వాడటం అంటే గొప్పవిషయం మాత్రమే కాదు.. తప్పకుండా అభినందించాల్సిందే.పోసాని కృష్ణమురళి ఇంటర్నెట్ లేని పాత “నోకియా “ కీప్యాడ్ ఫోన్ వాడతారు.. వాట్సప్ అంటే ఏంటో తెలీదట.. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ గురించి తెలీనే తెలియదట 🙏🙏 pic.twitter.com/JsW6R4g4LW— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) November 19, 2024 -
జాగ్రఫీ బోధించే గ్లోబ్..!
పెద్దలకు, పిల్లలకు నచ్చే ఆట బొమ్మలు చాలా అరుదు. అలాంటి వాటిలో ఈ ఆర్బూట్ ఎర్త్ ఒకటి. ఇదొక గ్లోబ్ బొమ్మ మాత్రమే కాదు, వర్చువల్ వరల్డ్ జాగ్రఫీ టీచర్ కూడా! ఈ గ్లోబ్‌ను ఐప్యాడ్‌కు లేదా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని వాడాలి. ఈ బొమ్మ ప్యాకేజీ బాక్స్‌లో మొత్తం పది అంగుళాల ఇంటరాక్టివ్ ఏఆర్ వరల్డ్ గ్లోబ్, పాస్‌పోర్ట్, వివిధ స్టాంప్స్, దేశాల జెండాలు, జంతువుల స్టిక్కర్లలతో పాటు ఒక హెల్ప్ గైడ్ ఉంటుంది. గ్లోబ్‌ను యాప్ ద్వారా ఐప్యాడ్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని, ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నయినా ఎంచుకుంటే, అప్పుడు అది పూర్తి యానిమేషన్ చిత్రాలతో ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలన్నింటినీ చూపిస్తుంది. ఇందులో జాగ్రఫీకి సంబంధించిన చిన్న చిన్న టాస్క్‌లు కూడా ఉంటాయి. వాటిని ఈ గ్లోబ్‌తో పాటు ఇచ్చే స్టాంపులు, స్టిక్కర్లతో పూర్తి చేయవచ్చు. ప్రపంచంలోని ఏ దేశాన్ని అయినా ఇట్టే గుర్తుపట్టేలా చిన్నారులకు నేర్పిస్తుంది ఈ గ్లోబ్. మూడు నుంచి ఐదేళ్ల వయసు గల పిల్లలకు ఇదొక మంచి బహుమతి. దీని ధర రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది. వివిధ ఆన్లైన్ స్టోర్స్‌లలో దొరుకుతుంది. (చదవండి: ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్‌తో అవాంఛిత రోమాలకు చెక్..!) -
కొత్త ఆండ్రాయిడ్15లో అబ్బురపరిచే ఫీచర్లు
సరికొత్త గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15 అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్ఫోన్లను మరింత మెరుగ్గా చేసేందుకు ఇందులో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. వీటిలో అబ్బురపరిచే కొన్ని ఫీచర్లను ఇక్కడ తెలుసుకుందాం..ప్రైవేట్ స్పేస్ప్రైవేట్ స్పేస్ అనేది వర్చువల్ లాకర్. వ్యక్తిగతమైన, గోప్యమైన యాప్‌లను ఇక్కడ ఉంచవచ్చు. ఈ యాప్‌లను మీరు మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా భద్రతను ఇస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఫోన్ ఇచ్చే పేరెంట్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్, షాపింగ్ వంటి యాప్‌లు ఇక్కడ సురక్షితంగా ఉంటాయి.చార్జింగ్ లిమిట్ ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గిపోతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆండ్రాయిడ్ 15లో 80% లిమిట్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా బ్యాటరీ తొందరగా దెబ్బతినకుండా నివారించుకోవచ్చు.థెఫ్ట్ ప్రొటెక్షన్ఆండ్రాయిడ్ 15లో తీసుకొచ్చిన థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ అసాధారణ చర్యలతో మీ ఫోన్‌ను ఎవరైనా చోరీ చేయడానికి ప్రయత్నించి ఉంటే తెలియజేస్తుంది. ఒక వేళ మీ ఫోన్ చోరీకి గురైతే మీ డేటాను రక్షించడానికి, ఫ్యాక్టరీ రీసెట్ చేయకుండా ఇది ఆటోమేటిక్‌గా లాక్ చేస్తుంది. మీ ఫోన్ నంబర్ని ఉపయోగించి వేరొక ఫోన్ నుంచి మీ ఫోన్‌ను లాక్ చేయవచ్చు.అడాప్టివ్ వైబ్రేషన్కొందరికి రింగ్ టోన్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఫోన్‌ను వైబ్రేషన్ లేదా సైలెంట్ మోడ్‌లో పెట్టుకుంటారు. మీటింగ్స్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. అయితే దీని వల్ల కొన్నిసార్లు కాల్స్ వచ్చినప్పుడు గుర్తించలేం. దీని పరిష్కారం కోసమే ఆండ్రాయిడ్ 15లో అడాప్టివ్ వైబ్రేషన్ ఫీచర్ ఇచ్చారు. సందర్భానికి అనుగుణంగా దానంతట అదే వైబ్రేషన్‌ను అడ్జెస్ట్ చేస్తుంది.యాప్ పెయిర్స్తరచూ స్ప్లిట్ స్క్రీన్ ఉపయోగించేవారి కోసమే ఈ ఫీచర్. ఏవైనా రెండు యాప్‌లను జతగా వినియోగించేవారు వాటిని సేవ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. వీటిని హెమ్ స్క్రీన్‌పై షార్ట్‌కట్స్‌గా సేవ్ చేసుకోవచ్చు.యాప్ ఆర్కైవింగ్ఫోన్లో స్టోరేజ్ అయిపోయినప్పుడు పాత యాప్‌లను వదిలించుకోవాలి. అయితే యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయడం వలన దాని డేటా మొత్తం పోతుంది. మళ్లీ ఇన్స్టాల్ చేస్తే మొదటి నుండి సెటప్ చేయాలి. దీన్ని పరిష్కరించడానికి గూగుల్ గతంలో ప్లేస్టోర్‌కి యాప్ ఆర్కైవింగ్ని జోడించింది. ఇప్పుడిదే ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 15తో ఇన్‌బిల్ట్‌గా తీసుకొచ్చింది. తొలగించిన యాప్‌ను మళ్లీ ఇన్స్టాల్ చేసినప్పడు పాత డేటా అలాగే ఉంటుంది.శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్లు పంపించే ఈ సరికొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 15లో ప్రకటించినప్పటికీ ప్రస్తుతానికి దీన్ని ఉపయోగించలేం. క్యారియర్లు ఈ సర్వీస్‌కు ధర నిర్ణయించే పనిలో ఉన్నాయి. దీని కోసం కొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది. -
ఖరీదైన గూగుల్ పిక్సెల్ ఫోన్ సగం ధరకే!
ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనాలనుకుంటే ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బిగ్ దీవాళి సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ కంపెనీకి చెందిన పిక్సెల్ 8 (Google Pixel 8) ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.గూగుల్ పిక్సెల్ 8 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 82,999 కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్‌ను రూ. 42,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలా గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌ను రూ. 36,499కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. మీ పాత ఫోన్ ఇస్తే దాని కండిషన్ ఆధారంగా రూ. 42,500 వరకు తగ్గింపు పొందొచ్చు.గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్లు ఈ ఫోన్లో 6.2 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే అందించారు. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. Titan M2 సెక్యూరిటీ చిప్‌తో వచ్చిన ఈ ఫోన్లో ప్రాసెసర్ కోసం T3 చిప్సెట్ ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్స్, 12 మెగాపిక్సెల్స్ డ్యూయల్ రియిర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 10.5 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ సంగతికొస్తే ఈ ఫోన్లో 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4575 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. -
‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లు ఎందుకు?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. చాలా కంపెనీలు మొబైల్ ఫీచర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్లను మరింత స్మార్ట్‌గా మార్చాలని విభిన్న ప్రయోగాలు చేపడుతున్నాయి. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఫీచర్ ఫోన్లకు ఆదరణ మాత్రం తగ్గడంలేదు. అయితే వివిధ కారణాలతో చాలామంది ఇంకా ఫీచర్ ఫోన్లవైపే మొగ్గు చూపుతున్నారు. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రాథమిక కమ్యునికేషన్ కోసం ఈ ఫీచర్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు.స్మార్ట్ఫోన్లతో పోలిస్తే బ్యాటరీ లైఫ్ అధికంగా ఉంటుంది.కేవలం కాల్స్, టెక్ట్స్ మెసేజ్‌లు చేయడానికి వీలుగా దీన్ని అధికంగా వాడుతున్నారు.కొన్ని ఆఫీసుల్లో వివిధ కారణాల వల్ల స్మార్ట్ఫోన్లను అనుమతించడం లేదు. దాంతో చాలామంది ఉద్యోగులు తప్పక ఈ ఫీచర్ ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు.స్మార్ట్‌ఫోన్ ఉన్నా కూడా నిత్యం దూర ప్రయాణాలు చేసేవారు బ్యాకప్ కోసం దీన్ని వినియోగిస్తున్నారు.ఫోన్లకు సంబంధించి సింప్లిసిటీని ఇష్టపడేవారు వీటిని కొనుగోలు చేస్తున్నారు.ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఫీచర్ ఫోన్లను తీసుకుంటున్నారు. ఒకవేళ పిల్లలు ఫోన్ కావాలని మారాం చేసి తీసుకుని కిందపడేసినా పెద్దగా నష్టం ఉండదు.వృద్ధులు, కంటి చూపు సరిగా లేనివారు ఈ ఫీచర్ ఫోన్లను సులువుగా వినియోగించవచ్చు.ఆర్థిక స్థోమత సరిగాలేని వారు ఈ ఫీచర్ ఫోన్లను ఎంచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ఫోన్ మార్కెట్ 2018-2030 మధ్య కాలంలో ఏటా 3.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. భారత్‌లో 2023 రెండో త్రైమాసికం లెక్కల ప్రకారం అంతకుముందు ఏడాది అదే త్రైమాసికంతో పోలిస్తే తొమ్మిది శాతం ఈ ఫోన్ల అమ్మకాలు పెరిగాయి.ఇదీ చదవండి: ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలంఇటీవల రిలయన్స్ జియో కంపెనీ 4జీ నెట్వర్క్ సదుపాయం కలిగిన ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024 సమావేశంలో భాగంగా ఈ ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి ధర రూ.1,099గా నిర్ణయించారు. అయితే రిటైలరనుబట్టి ఈ ధరలో మార్పులుంటాయని గమనించాలి. -
ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. కేంద్రం హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. కోట్ల మంది యూజర్లు గూగుల్ యాజమాన్యంలోని ఓఎస్ మీద ఆధారపడుతున్నారు. శాంసంగ్ గెలాక్సీ, గూగుల్ పిక్సెల్, వన్ ప్లస్, వివో వంటి చాలా కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లలో ఆండ్రాయిడ్ ఓఎస్‌ను అమలు చేస్తున్నాయి.స్మార్ట్ఫోన్ల వినియోగం భారీగా పెరగడంతో బ్యాంకింగ్, లొకేషన్ వంటి ఇతర సమాచారాల కోసం దీని మీదనే ఆధారపడుతున్నారు. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే నిక్షిప్తమై ఉంటాయి. ఈ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి గూగుల్ ఎప్పటికప్పుడు ఓఎస్‌ను అప్డేట్ చేస్తూ ఉంటుంది. కానీ యూజర్లు ఓఎస్‌ను అప్డేట్ చేయకుండా అలాగే వినియోగిస్తూ ఉంటారు. అప్డేట్ చేయకుండా ఉపయోగించడం వల్ల స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్స్ 12, 12ఎల్, 13, 14 యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో అనేక లోపాలున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెల్లడించింది. ఓఎస్ అప్డేట్ చేయకపోవడం వల్ల మోసగాళ్ళు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేను విశ్వసిస్తున్నాను.. భారత్ సాధిస్తుందిCERT-In ప్రకారం.. ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్లు, కెర్నల్, ఆర్మ్ కాంపోనెంట్, ఇమాజినేషన్ టెక్నాలజీస్ కాంపోనెంట్స్, యూనిసో కాంపోనెంట్లు, క్వాల్కామ్ కాంపోనెంట్లు, క్వాల్కామ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్లలో లోపాలున్నాయని తెలుస్తోంది. కాబట్టి ఓఎస్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. లేకుండా మీ సమాచారం మొత్తాన్ని ఇతరులు హ్యాక్ చేసి తెలుసుకోగలరు. -
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఊరట: బ్రెయిన్ కేన్సర్‌తో సంబంధం లేదు!
స్మార్ట్‌ఫోన్ వాడకంతో బ్రెయిన్ కేన్సర్ వస్తుందని ఇప్పటిదాకా చాలా భయపడ్డాం. సెల్‌ఫోన్ రేడియేషన్ దుష్ర్పభావానికి సంబంధించి పలువురు నిపుణులు హెచ్చరించారు కూడా. అయితే తాజా అధ్యయనం మాత్రం స్మార్ట్ఫోన్లకు, బ్రెయిన్ కేన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడినా, ముఖ్యంగా పడుకునేటపుడు దిండుకింద మొబైల్ పెట్టుకుని పడుకున్నా, పసిపిల్లలకు దగ్గరగా ఉంచి, రేడియేషన్ ప్రభావం ఉంటుందిని, తీవ్రమైన ప్రమాదకరమైన జబ్బులొస్తాయనే ఆందోళన ఇప్పటివరకు ఉండేది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్ వినియోగానికి, మెదడు కేన్సర్ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడింది. వైర్లెస్ టెక్నాలజీ వినియోగంలో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, మెదడు కేన్సర్‌లో పెరుగుదల లేదని మంగళవారం ప్రచురించిన ఒక రివ్యూలో తెలిపింది. సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులకు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం పాటు మొబైల్ ఫోన్లను ఉపయోగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రచురితమైన అనేక రీసెర్చ్ పేపర్లను సైతం అధ్యయనం చేసి ఈ విషయం వెల్లడించినట్లు అధ్యయనం పేర్కొంది. కాగా డబ్ల్యూహెచ్ఓ , ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మొబైల్ ఫోన్లు ఉపయోగించే రేడియేషన్ నుంచి వచ్చే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు ఖచ్చితమైన ఆధారాలు లేవని గతంలో చెప్పాయి, అయితే మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చాయి. ఈ నేపత్యంలో తాజా స్టడీ ఆసక్తికరంగా మారింది. -
మనలాగే.. ఐస్మార్ట్ దర్పణం!
ముఖంపై ముడతలు, నల్ల మచ్చలను గుర్తిస్తుంది ఇంట్లో ఉండి కూడా మన చర్మం గురించి తెలుసుకోవచ్చు ప్రస్తుతం నగరంలో పెరుగుతున్న స్మార్ట్ మిర్రర్స్ వాడకం బ్యూటీ పార్లర్లలో అధునాతన మిర్రర్స్ వినియోగంచర్మ సౌందర్య సాధానాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోతోంది. ఒకప్పుడు అమ్మాయిలకు మాత్రమే.. కానీ నేడు పురుషులు కూడా అందం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో సౌందర్య సాధానాల వాడకం విపరీతంగా పెరిగింది. 2023లో వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.135 కోట్లు. 2026 నాటికి రూ.230 కోట్లకు ఎగబాకనున్నదని నిపుణుల అంచనా. నగరాల్లో కాలుష్యం, ఎండ, దుమ్ము కారణంగా అనేక చర్మ సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి రక్షణకు చాలామంది మార్కెట్లో దొరికిన అనేక రకాల క్రీములు, జెల్స్, పౌడర్లు, సోప్‌లు, ఫేస్ వాష్‌లు వాడేస్తున్నారు. ఎలాంటి చర్మానికి ఎలాంటి సాధనాలు వాడాలనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. మరి మన చర్మం తత్వం ఎలా ఉందో తెలుసుకోవడం ఎలా..? అందుకే మన లాంటి వారి కోసమే నేనున్నా అంటూ వచ్చేసింది స్మార్ట్ మిర్రర్. ఇది మన చర్మ సమస్యలను ఇట్టే చెప్పేస్తుంది.. సాధారణ అద్దంలో చూసుకుంటే మన ముఖం ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ స్మార్ట్ మిర్రర్లో మాత్రం మన ముఖంలో ఉన్న లోపాలన్నీ కనిపిస్తాయన్న మాట. కళ్ల కింద నలుపు, నల్ల మచ్చలు, రంధ్రాలు, ముడతలు, గీతలు, మన చర్మం స్వభావం వంటి విషయాలు వెంటనే చెప్పేస్తుంది. మన ముఖంలో ఉన్న సమస్యలను కచ్చితత్వంతో పసిగట్టి మనకు విశ్లేషణ అందిస్తుంది. దీన్నిబట్టి మనం ఎలాంటి చికిత్స తీసుకోవాలనే అంచనాకు రావొచ్చు. ఇటీవల పలు బ్యూటీ పార్లర్స్‌లో కూడా దీని వాడకం విరివిగా పెరిగిపోయింది. సొంతంగానూ వాడుకోవచ్చు.. చాలా కంపెనీలు స్మార్ట్ మిర్రర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ట్యాబ్ పరిమాణంలో ఉండే ఈ స్మార్ట్ మిర్రర్ దాదాపు రెండున్నర కేజీల బరువు ఉంటుంది. దీనికి ఒక హెచ్డీ కెమెరా ఉంటుంది. దీని ముందు ముఖం పెట్టగానే కొన్ని ఫొటోలు తీస్తుంది. ఆ ఫొటోలను విశ్లేషించి మన చర్మం తత్వాన్ని చెప్పేస్తుంది. స్మార్ట్ ఫోన్ మాదిరిగానే మన వెంటే తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా వాడుకోవచ్చు. దీని ద్వారా మన చర్మంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయనే విషయాలను గుర్తించి, అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాస్త జాగ్రత్త మరీ.. ఏదైనా పరికరంలో కెమెరాలు ఉన్నాయంటే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే దీన్ని వాడనప్పుడు మూసేసి ఉంచడం మంచిది. కాకపోతే కొన్ని స్మార్ట్ మిర్రర్స్ వాడకంలో లేనప్పుడు ఆటోమేటిక్‌గా బంద్ అయిపోతుంది. దీంతో కాస్త వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది. మనం స్మార్ట్ మిర్రర్‌గా వాడనప్పుడు కెమెరాలు క్లోజ్ అయిపోయి.. సాధారణ అద్దంలాగే వాడుకోవచ్చు. హైటెక్ మిర్రర్ కూడా.. ఇంట్లోనే కాకుండా బ్యూటీ పార్లర్స్‌లో కూడా ఎక్కువగా స్కిన్ అనలైజర్లను ఇటీవల వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ మిర్రర్ ఇచి్చన ఇన్పుట్స్ ఆధారంగా శరీర తత్వానికి తగ్గట్టు సౌందర్యసాధనాలను వాడుతున్నారు. ఎలాంటి మేకప్ వేస్తే వారి చర్మానికి సూట్ అవుతుందనే విషయంపై ఓ అవగాహనకు వచి్చ, వారికి అలాంటి ఉత్పత్తులనే వాడుతున్నారు.పూర్తిస్థాయి పరిష్కారం కాదు.. స్మార్ట్ మిర్రర్స్ ద్వారా ఆయిల్ స్కిన్, పొడి చర్మమా అని చర్మం తత్వం గురించి తెలుస్తుంది. స్కిన్ ఏజింగ్ ప్రాసెస్ మాత్రమే తెలుపుతుంది. ఎండ లేదా కాలుష్యానికి ఎంతగా ప్రభావితమైందో అర్థం అవుతుంది. వీటి ద్వారా చర్మాన్ని ఎలా కాపాడుకోవాలనే అంచనాకు రావొచ్చు. అయితే చర్మ సంబంధిత వ్యాధుల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వదు. వ్యాధి నిర్ధారణ విషయంలో స్మార్ట్ మిర్రర్స్‌ను నమ్ముకోవద్దు. అలాంటప్పుడు డెర్మటాలజిస్టును కలిసి చికిత్స తీసుకోవాలి. సొంత వైద్యం చేసుకుంటే మరిన్ని సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. – డాక్టర్ గంగా హరీశ్, డెర్మటాలజిస్టు, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ -
స్మార్ట్‌ఫోన్ మార్కెట్ జోరు
దేశీయంగా స్మార్ట్ఫోన్ల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 3.2 శాతం వృద్ధి చెందింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదిక ప్రకారం 3.9 కోట్ల స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ (రిటైలర్లకు తయారీ సంస్థలు సరఫరా చేసే ఫోన్ల సంఖ్య) నమోదైంది. ఇందులో 16.5 శాతం మార్కెట్ వాటాతో చైనా కంపెనీ వివో అగ్రస్థానంలో ఉండగా, 13.5 శాతం వాటాతో అదే దేశానికి చెందిన షావోమి రెండో స్థానంలో నిలిచింది. కొరియన్ సంస్థ శాంసంగ్ అమ్మకాలు 15.4 శాతం క్షీణించడంతో 12.9 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది. మరోవైపు, మార్కెట్ వాటాపరంగా యాపిల్ 6.7 శాతం వాటాతో ఆరో స్థానంలో ఉన్నప్పటికీ సూపర్ ప్రీమియం సెగ్మెంట్లో (రూ.67,000 పైగా రేటు ఉండే ఫోన్లు) మాత్రం 83 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.నివేదికలోని మరిన్ని విశేషాలు..ఫ్లాగ్షిప్ ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోతో పాటు వై సిరీస్, మిడ్–ప్రీమియం వి సిరీస్‌ల్లో వివిధ ధరల శ్రేణిలో ఫోన్లను ఆవిష్కరించిన వివో వరుసగా రెండో త్రైమాసికంలోనూ అగ్రస్థానంలో నిలిచింది.ఎంట్రీ ప్రీమియం సెగ్మెంట్ (రూ.16,000 నుంచి రూ.33,500 వరకు ధర ఉండేవి) వాటా 22 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. ఈ సెగ్మెంట్ మెరుగైన వృద్ధి కనపర్చగలదని అంచనాలు ఉన్నాయి. చౌక 5జీ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరిస్తున్నప్పటికీ 100 డాలర్ల లోపు (సుమారు రూ.8,400) ధర ఉండే ఎంట్రీ లెవెల్ ఫోన్ల అమ్మకాలకు ఈ ఏడాది సవాళ్లు ఎదురుకావచ్చు. జెన్ఏఐ స్మార్ట్ఫోన్లకు ప్రచారం మరింత పెరగవచ్చు.క్యూ2లో 2.7 కోట్ల 5జీ స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ నమోదైంది. 5జీ స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ వార్షికంగా 49 శాతం నుంచి 77 శాతానికి పెరిగింది. ఇందులోనూ రూ.8,000 నుంచి రూ.16,700 వరకు ధర ఉండే మాస్ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల షిప్మెంట్ 2.5 రెట్లు పెరిగింది. ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్’!ప్రీమియం సెగ్మెంట్లో (రూ.50,000 నుంచి రూ.67,000 వరకు ధర శ్రేణి) యాపిల్ మార్కెట్ వాటా 61 శాతానికి, శాంసంగ్ వాటా 24 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు 6.9 కోట్లుగా నమోదయ్యాయి. -
ఆ సెగ్మెంట్లో మోస్ట్ పాపులర్ స్మార్ట్ ఫోన్లు ఇవే..?
భారత్‌లో ఎక్కువగా రూ.10 వేలు నుంచి రూ.20 వేల ధర ఉన్న మొబైల్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఉందని ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ అనీష్ కపూర్ తెలిపారు. గత రెండేళ్లుగా మొబైల్ మార్కెట్లోని స్తబ్దత తొలగిపోయిందన్నారు. 5జీ ట్రెండ్ కొనసాగుతుండడంతో చాలా మంది కస్టమర్లు అందుకు అనువుగా ఉంటే ఫోన్లను విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..‘భారత మార్కెట్లో రూ.10,000-రూ.20,000 మధ్య ధర కలిగిన స్మార్ట్ఫోన్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే మొత్తం అమ్మకాలు 40% పైగా పెరిగాయి. ఇటీవలి కాలంలో 5జీ ఫోన్లకు డిమాండ్ అధికమైంది. గతంలో రూ.10,000 లోపు ఫోన్లకు ఎక్కువ మార్కెట్ ఉండేది. 5జీ రావడంతో రూ.10,000 కంటే అధిక ధర మొబైళ్లకు డిమాండ్ పెరిగింది. గత రెండేళ్లుగా మార్కెట్లో ఉన్న స్తబ్దత తొలగిపోయింది. ఫీచర్లు అప్‌గ్రేడ్ చేయడం, తాజా ట్రెండ్‌కు తగిన లేటెస్ట్ టెక్నాలజీ అందించడం ద్వారా వీటికి మరింత గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘బహిరంగ విచారణ జరగాలి’ -
ప్రపంచంలో పలుచని స్మార్ట్‌ఫోన్
మొబైల్స్ తయారీ దిగ్గజం మోటరోలా భారత్‌లో ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. మిలిటరీ గ్రేడ్ ధ్రువీకరణతో ప్రపంచంలో అతి పలుచని స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ వెల్లడించింది. 7.79 మిల్లీమీటర్ల మందంతో దీన్ని తయారుచేశారు.ఇందులో ఆన్‌డ్రాయిడ్ 14 ఓఎస్, 6.67 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్–5, క్వాల్కామ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ మెమరీ, 50 ఎంపీ మెయిన్ సెన్సార్, 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10 ఎంపీ టెలిఫోటో, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు. డాల్బీ అట్మోస్ సౌండ్, 68 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి హంగులు ఉన్నాయి. మార్కెట్లో దీని ధర రూ.27,999గా ఉంది.ఇదీ చదవండి: భవిష్యత్తులో డిమాండ్ ఏర్పడే విభాగం..! -
రూ.14 వేలకే కర్వ్డ్ డిస్ప్లే ఫోన్
దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా బ్లేజ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ కొత్త బ్లేజ్-ఎక్స్ (Blaze X) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది.ఈ స్మార్ట్‌ఫోన్ స్టార్‌లైట్ పర్పుల్, టైటానియం గ్రే అనే రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కొత్త బ్లేజ్-ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను లావా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా స్టోర్‌లో జూలై 20 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ చవకైన సరికొత్త స్మార్ట్‌ఫోన్ రూ. 13,999 ప్రారంభ ధరకు (బ్యాంకు ఆఫర్లతో సహా) లభిస్తుంది.స్పెసిఫికేషన్లుపంచ్-హోల్ డిజైన్‌తో 6.67-అంగుళాల 120 హెర్ట్జ్ డిస్ప్లే64MP+2MP రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాMediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ -
కొత్త బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. వాచ్, బడ్స్ కూడా..
లండన్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ ‘నథింగ్’ సబ్-బ్రాండ్ అయిన సీఎంఎఫ్ మూడు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. సీఎంఎఫ్ ఫోన్ 1, సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 , సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఈ సీఎంఎఫ్ బ్రాండ్ కొత్త ఉత్పత్తులు జూలై 12 నుంచి భారత్‌లో విక్రయానికి రానున్నాయి. సీఎంఎఫ్ అధికారిక వెబ్సైట్ (cmf.tech) నుంచి, దారి రిటైల్ భాగస్వాముల ద్వారా జూలై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.సీఎంఎఫ్ ఫోన్ 1 వివరాలు⇒ 6/8GB ర్యామ్, 128GB స్టోరేజీ, ⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్⇒ 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే⇒ 50 MP రియర్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా⇒ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ⇒ ఛార్జర్‌ను రూ. 799కి విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.⇒ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 15,999 ⇒ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999.⇒ మొదటిరోజు సేల్‌లో రెండు మోడళ్లపై రూ. 1,000 తగ్గింపు. ⇒ ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ కొంటే సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 లేదా CMF బడ్స్ ప్రో 2పై రూ.1,000 తగ్గింపు⇒ బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ రంగులలో లభించే బ్యాక్ కేస్ల ధర రూ.1499 యాక్సెసరీస్‌లో స్టాండ్ రూ. 799, లాన్యార్డ్ ధర రూ. 799, కార్డ్ కేస్ రూ. 799కి లభిస్తుంది.సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 వివరాలు⇒ 1.32- అంగుళాల అమోల్డ్ ఎల్లప్పుడూ ఆన్ డిస్ప్లే⇒ 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్⇒ హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్, ఒత్తిడి స్థాయిల నిరంతర పర్యవేక్షణ⇒ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్⇒ మార్చుకోగలిగిన బెజెల్ డిజైన్⇒ బ్లూటూత్ కాల్స్, మ్యూజిక్ కంట్రోల్, నోటిఫికేషన్స్, రిమోట్ కెమెరా కంట్రోల్ ⇒ స్టాండర్డ్ మోడల్ ధర రూ. 4,999⇒ వేగన్ లెదర్ రూ.5,499⇒ డార్క్ గ్రే, యాష్ గ్రే, బ్లూ, ఆరెంజ్ రంగుల్లో లభ్యం.⇒ బెజెల్, స్ట్రాప్ సెట్‌ను అదనంగా రూ. 749కి కొనుగోలు చేయవచ్చు.సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2 వివరాలు⇒ 50 dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్⇒ మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం డ్యూయల్ డ్రైవర్లు⇒ ఎల్డీఏసీ టెక్నాలజీ సపోర్ట్⇒ Hi-Res ఆడియో వైర్లెస్⇒ 43 గంటల బ్యాటరీ లైఫ్⇒ స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్⇒ బ్లాక్, వైట్, బ్లూ, ఆరెంజ్ రంగులలో లభ్యం.⇒ ధర రూ. 4,299. -
మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?
దేశీయ మార్కెట్లో మోటోరోలా కంపెనీ తన 'ఎడ్జ్ 50 ఫ్యూజన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త ఫోన్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారతీయ విపహ్లవు లాంచ్ అయిన కొత్త మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్రారంభ ధర రూ. 22999 (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్), 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24999. ఈ మొబైల్ మే 22 నుంచి మోటోరోలా.ఇన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో ప్రముఖ రిటైల్ స్టోర్‌లో కూడా విక్రయానికి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలతో రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు.మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ వేగన్ లెదర్ ముగింపుతో హాట్ పింక్,మార్ష్మల్లౌ బ్లూ కలర్‌వేస్‌లో మాత్రమే కాకుండా.. పాలీమిథైల్ మెథాక్రిలేట్ (PMMA) ముగింపుతో ఫారెస్ట్ బ్లూ కలర్ ఎంపికలో కూడా అందుబాటులో ఉంటుంది.లేటెస్ట్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7 ఇంచెస్ ఫుల్ HD+ (1,0800x2,400 పిక్సెల్‌లు) pOLED కర్వ్డ్ డిస్ప్లే పొందుతుంది. ఇది క్వాల్కామ్ 4ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ మొబైల్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 68 వాట్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం ఐపీ68 రేటింగ్ పొందుతుంది.కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై-6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. బయోమెట్రిక్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి ఇందులో లభిస్తాయి. -
బ్యాటరీ కనిపించకుండా ఫోన్ల తయారీ.. ఎందుకో తెలుసా..
నిత్యం మార్పు చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ జీవితంలో భాగమైంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లేకుండా ఉండలేకపోతున్నారు. కీప్యాడ్ ఫీచర్‌తో ప్రారంభమైన ఫోన్ల తయారీలో రోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టచ్మొబైల్, మడతపెట్టే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలా వస్తున్న మార్పులో భాగంగా మొబైల్ బ్యాటరీలు కనిపించడంలేదు. మొబైళ్లు వచ్చిన చాలాకాలంపాటు రిమువెబుల్ బ్యాటరీలు చూసి ఉంటారు. కొన్నిసార్లు ఫోన్ ఉన్నట్టుండి హ్యాంగ్ అయితే బ్యాటరీ తీసి, మళ్లీ పెట్టి ఫోన్ స్విచ్ఆన్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు మార్కెట్లో వస్తున్న మొబైళ్లలో రిమువెబుల్ బ్యాటరీలు రావడం లేదు. కంపెనీలు అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ 2007లో తన మొదటి ఐఫోన్‌ను లాంచ్ చేసింది. అందులో మొట్టమొదటగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ టెక్నాలజీని వినియోగించారు. అప్పటి వరకు చాలా కంపెనీలు రిమువెబుల్ బ్యాటరీలతో మొబైళ్లను తయారుచేయడం, జనాలు దానికి బాగా అలవాటుపడడంతో ఐఫోన్‌పై కొంతమందిలో విముఖత వచ్చింది. కానీ ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు అదే ధోరణి పాటిస్తున్నాయి. అలా క్లోజ్డ్ బ్యాటరీలతో మొబైళ్లను తయారు చేయడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రీమియం డిజైన్ స్మార్ట్‌ఫోన్‌లో చాలా కీలకపాత్ర పోషించేది దాని డిజైన్. రిమువెబుల్ బ్యాటరీలతో ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పటికీ వాటి డిజైన్ మీద చాల ప్రభావం చూపిస్తాయి. ఫోన్‌ను మరింత స్లిమ్‌గా తయారుచేయాడానికి, మొబైల్ కవర్‌ను గ్లాస్ / మెటల్‌తో తయారు చేయడానికి ఈ క్లోజ్డ్ బ్యాటరీ విధానాన్ని ఎంచుకున్నారు. వాటర్, డస్ట్ ప్రూఫ్ ఫోన్ పొరపాటున నీటిలో పడిపోవడం లేదా వర్షంలో తడవడం వంటివి నిత్యం జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఫోన్ వెనకాల కవర్ ఓపెన్ చేసుకునేలా ఉంటే దానిలోకి నీరు, దుమ్ము వంటివి చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోన్లో ఎలాంటి గ్యాప్‌లు లేకుండా అంతర్గత సీలింగ్ బలంగా ఉంటే నీరు లోపలికి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఫోన్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా ఉంటాయి. ఇదీ చదవండి: మండుతున్న ఎండలు.. ఏసీ కొంటున్నారా..? జాగ్రత్తలివే.. అదనపు ఫీచర్లు ఫోన్ల తయారీ కంపెనీలు నిత్యం ఏదో కొత్త ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేస్తూంటారు. అందులో భాగంగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ ఉన్న ఫోన్లు డ్యుయెల్కెమెరాలు, స్టీరియో స్పీకర్లు, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఇంప్లిమెంట్ చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. -
టెక్ టాక్: ఇన్‌స్టాలో 15 నిమిషాల ఎడిట్ ఫీచర్.. మీకొసమే..!
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీలో కూడా వినూత్న మార్పులు చోటుచూసుకుంటున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్ మన దగ్గరకు వస్తున్నాయి. వాటిలో రెగ్యులర్‌గా వాడే వస్తువులైనా ఉండొచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామైనా ఉండొచ్చు. ఫీచర్‌కి తగ్గట్టుగా సరికొత్త టెక్నాలజీ పరికరాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి. మరవేంటో చూద్దాం. ఇన్‌స్టాలో 15 నిమిషాల ఎడిట్ ఫీచర్! మెసేజ్‌లను పంపిన తరువాత పదిహేను నిమిషాల వరకు ఎడిట్ చేయవచ్చని ప్రకటించింది ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్. పదిహేను నిమిషాల ఈ ఎడిట్ విండో వాట్సాప్‌లాంటి ఇతర మెసేజింగ్ ప్లాట్ఫామ్లాగే ఉంటుంది. సరిగ్గా అనిపించని మెసేజ్‌లను సరిచేయడానికి ఇది యూజర్లను అనుమతిస్తుంది. యూజర్లు ఒకే సందేశాన్ని పలుమార్లు ఎడిట్ చేయవచ్చు. ఒకసారి ఎడిట్ చేసిన తరువాత మెసేజ్ ఎడిట్ చేయబడిందనే విషయం హైలెట్ అవుతుంది. యాపిల్ న్యూ మ్యాక్‌బుక్ ఎయిర్ సైజ్ : 13.30 అంగుళాలు రిజల్యూషన్ : 2560్ఠ1600 పిక్సెల్స్ బరువు (కేజీ) : 1.29 మెటీరియల్ : అల్యూమినియం స్టోరేజ్ : 256జీబి కలర్ : గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే గెలాక్సీ ఎఫ్ 15 లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్15 గురించి ప్రకటించింది శాంసంగ్. 4/6 జీబి ఆఫ్ ర్యామ్, 128 జీబి ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన రెండు మెమోరీ వేరియంట్స్‌తో వస్తోంది. కొన్ని వివరాలు.. డిస్ప్లే : 6.5 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 90 హెచ్ ప్రైమరీ కెమెరా : 50 ఎంపీ బ్యాటరీ : 6,000 ఎఏహెచ్ కలర్స్ : యాష్ బ్లాక్, జాజ్ గ్రీన్, వయోలెట్ ఇవి చదవండి: వరల్డ్ బెస్ట్ లిస్ట్‌లో భారత ఫిల్టర్ కాఫీ -
రూ.31వేల ఈ లేటెస్ట్ 5జీ ఫోన్ ఇప్పుడు రూ.23వేలే..!
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్లతో కస్టమర్లలో మంచి ఆదరణ పొందిన శాంసంగ్ కంపెనీకి చెందిన ప్రముఖ 5జీ మోడల్ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో రూ.22,999 లకే అందుబాటులో ఉంది. ఈ మీడియం రేంజ్ స్మార్ట్ ఫోన్ రూ.30,999 ప్రారంభ ధరతో గతేడాది లాంచ్ అయింది. రూ. 3,000 తగ్గింపు తాజగా శాంసంగ్ గెలాక్సీ ఏ34 ఫోన్‌పై రూ. 3,000 తగ్గింపు లభించింది. దీంతో 6GB+128GB మోడల్ వేరియంట్ రూ.22,999లకే అందుబాటులోకి వచ్చింది. 8GB +128GB వేరియంట్ దాని అసలు ధర రూ. 27,499లకు బదులుగా రూ. 24,499లకే లభిస్తోంది. మరోవైపు 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ. 26,499లకే అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5G ఫీచర్లు FHD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 1080 SoC 8GB వరకూ ర్యామ్, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ OISతో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ 5MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 13MP సెల్ఫీ కెమెరా స్టీరియో స్పీకర్లు 5G, Wi-Fi 802.11, బ్లూటూత్ 5.3, GPS కనెక్టివిటీ కోసం USB టైప్-సి పోర్ట్ -
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు - కారణం ఇదే..
2024 జూన్ నుంచి స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరిగే సూచనలున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలకంటే సుమారు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెమొరీ చిప్‌ల ధరలు పెరగడంతో వచ్చే త్రైమాసికం నుంచి స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగనున్నట్లు సమాచారం. మార్కెట్ పరిశోధన సంస్థ ట్రెండ్‌ఫోర్స్ DRAM (మెమరీ చిప్స్) ధరలలో పెరుగుదల ఉందని సూచించింది. ఎందుకంటే శాంసంగ్, మైక్రాన్ కంపెనీలు మార్చి నుంచి ధరల పెరుగుదలను అమలు చేసే అవకాశం ఉంది. ఆ ప్రభావం స్మార్ట్ఫోన్లపై కూడా ఉంటుందని ట్రెండ్‌ఫోర్స్ తెలిపింది. స్మార్ట్‌ఫోన్, పర్సనల్ కంప్యూటర్ల వినియోగం భారీగా పెరగడం వల్ల ఏఐ, అధిక పనితీరు కలిగిన మెమొరీ చిప్‌ల డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో కంపెనీలు చిప్‌ల ధరలను పెంచనున్నాయి. ఇది మాత్రమే కాకుండా.. చైనీస్ కరెన్సీ యువాన్ బలపడటం వల్ల, అక్కడ నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాల ఖర్చు కూడా భారీగానే ఉన్న కారణంగా ధరలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ఆ కంపెనీ ఉద్యోగుల జాబ్స్ పోయినట్టేనా? సీఈఓ ఏమన్నారంటే.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారించింది. ఇది స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం బడ్జెట్‌ను పెంచింది. అయినప్పటికీ ఇప్పటికే తయారై సరఫరాకు సిద్దమైన ఫోన్స్ ధరలు 3 నుంచి 8 శాతం, కొత్తగా తయారవుతున్న ఫోన్ల మీద 5 నుంచి 10 శాతం ధరలు పెరగవచ్చని, డిమాండ్‌ను బట్టి ధరలు 10 నుంచి 15 శాతం పెరగవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు దారులకు శుభవార్త!
పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర వసూలు చేస్తున్న ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తూ అధికారికంగా ఉత్వరులు జారీ చేసింది. భారత్‌లో ఆయా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు స్థానికంగా ఫోన్లను తయారు చేయాలంటే.. అందుకు అవసరమయ్యే విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అలా దిగుమతి చేసుకున్నందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి 15 శాతం ఇంపోర్ట్ డ్యూటీని చెల్లించాలి. అయితే, తాజాగా ఈ ఇంపోర్ట్ డ్యూటీని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఇంకా, ఎల్సీడీ ప్యానెల్ల డిస్ప్లే, అసెంబ్లీ భాగాలపై దిగుమతి సుంకాలు 10శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా యాపిల్, శాంసంగ్ కంపెనీలు ఎగుమతులు పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా స్మార్ట్‌ఫోన్ తయారీ మార్కెట్లో కీలక పాత్రపోషిస్తున్న చైనా, వియాత్నాం వంటి దేశాలతో భారత్ పోటీపడేందుకు అవకాశంగా మారుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక దిగుమతి సుంకం తగ్గింపుతో భారత్‌లో స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొబైల్ విడి భాగాలపై మొబైల్ తయారీ పరిశ్రమలో భారత్‌ను అగ్రగామిగా నిలిచేందుకు కేంద్రం మొబైల్ ఫోన్ విడి భాగాలపై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించింది. సిమ్ సాకెట్, బ్యాటరీ కవర్, మెయిన్ కవర్, స్క్రూలు, జీఎస్ఎం, యాంటెన్నా వంటి మెకానికల్, ప్లాస్టిక్ ఇన్పుట్ భాగాలతో పాటు ఇతర మొబైల్ ఫోన్ విడి భాగాలపై దిగుమతి సుంకం తగ్గనుంది.