Samsung Galaxy A13 5g Price In India: Specification And Features In Telugu - Sakshi
Sakshi News home page

Samsung: శాంసంగ్‌ నుంచి చౌవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌..!

Published Wed, Dec 1 2021 10:06 PM | Last Updated on Thu, Dec 2 2021 12:39 PM

Samsung Galaxy A13 5G Is Its Cheapest 5G Phone Yet - Sakshi

Samsung Galaxy A13 5g Specifications: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ లాంగ్‌లాస్టింగ్‌ బ్యాటరీ ఫీచర్‌తో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. అత్యంత చౌవకైన స్మార్ట్‌ఫోన్‌గా శాంసంగ్‌ గెలాక్సీ ఏ13 5జీ నిలుస్తోందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం  ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెరికాలో డిసెంబర్‌ 3 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. అమెరికాలో దీని ధర 250 డాలర్లు(సుమారు రూ. 18 వేలు)గా ఉండనున్నట్లు తెలుస్తోంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్‌ భారత్‌లో త్వరలోనే లాంచ్‌ చేయనుంది. 

శాంసంగ్‌ గెలాక్సీ ఏ13 5జీ ఫీచర్స్‌

  • 6.5-అంగుళాల 90Hz ఇన్ఫినిటీ-V డిస్ప్లే
  • మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌
  • 50ఎంపీ+2ఎంపీ+ 2ఎంపీ రియర్‌ కెమెరా
  • 5ఎంపీ సెల్పీ కెమెరా
  • 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 5000ఏంహెచ్‌ బ్యాటరీ
  • 5జీ సపోర్ట్‌
  • 15 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌

చదవండి:  ఇది స్మార్ట్‌ఫోనా..ల్యాప్‌ట్యాపా...! వివో నుంచి కళ్లుచెదిరే గాడ్జెట్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement