Samsung
-
రూ.15,000 లోపు ప్రీమియం ఫీచర్లున్న స్మార్ట్ఫోన్లు
-
శాంసంగ్ కొత్త ఎత్తు! వెనక్కితగ్గని ఉద్యోగులు
చెన్నైలోని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లో కార్మికులు సమ్మె చేస్తున్నారు. మెరుగైన వేతనాలు, తమ యూనియన్‌కు గుర్తింపు కోసం దాదాపు నెల రోజులుగా నిరసనలు చేస్తున్నారు. సమ్మె ఆపాలని యాజమాన్యం ఎంత హెచ్చరించినా వెనక్కితగ్గడం లేదు. దీంతో కంపెనీ కొత్త ఎత్తు వేసింది.శాంసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్-సీఐటీయూ నేతృత్వంలో ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో గృహోపకరణాల విక్రయానికి కీలకమైన పండుగ సీజన్‌కు ముందు ఉత్పత్తి 80 శాతం తగ్గిపోయింది. సమ్మె ఇప్పుడు నాల్గవ వారానికి చేరుకోవడంతో ఉద్యోగుల కుటుంబాలను మచ్చిక చేసుకుని సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు వారి ఇళ్లకు ‘స్నాక్ కిట్’లను పంపుతోందని ఫ్రంట్‌లైన్ నివేదించింది.తమిళనాడులోని శాంసంగ్ ప్లాంట్‌లో దాదాపు 1,800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 1,000 మందికి పైగా కార్మికులు సెప్టెంబర్ 9 నుండి సమ్మెలో ఉన్నారు. తమ యూనియన్ను గుర్తించాలని, మూడేళ్ల జీతం రూ.36,000 పెంచాలని, షిఫ్ట్ అలవెన్స్‌ను రూ.150 నుండి రూ.250కి పెంచాలని, పితృ సెలవులను మూడు నుండి ఏడు రోజులకు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సమానమైన అర్హతలు, విధులు ఉన్న కార్మికులకు సమాన వేతనం అమలుచేయాలని కోరుతున్నారు.2007లో ఇక్కడ ఏర్పాటైన శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ గత 16 సంవత్సరాలుగా యూనియన్ లేకుండా పని చేస్తోంది.శాంసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ మద్దతుతో గత సంవత్సరం ఏర్పడింది. అయితే దీనికి కంపెనీ నుండి అధికారిక గుర్తింపు లేదు.కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. నిరసనను కొనసాగిస్తే వేతనాలు ఆపేస్తామని, విధుల నుంచి తొలగిస్తామని గత నెలలో కంపెనీ హెచ్చరించినట్లు రాయిటర్స్ నివేదించింది. ఇప్పుడు ఉద్యోగుల కుటుంబాలను మచ్చిక చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా వారికి పండ్లు, చాక్లెట్లతో కూడిన స్నాక్ కిట్లను పంపుతోంది. అంతేకాకుండా కంపెనీ ప్రతినిధులు నేరుగా కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లుగా ఫ్రంట్‌లైన్ పేర్కొంది. అయితే ఈ వార్తలను శాంసంగ్ యాజమాన్యం ఖండించింది. -
ఉద్యోగం పోతుందని హెచ్చరిక!
చెన్నైలోని సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా పరిధిలో నిరసనకు దిగిన ఉద్యోగులకు కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది. సమ్మె కొనసాగిస్తున్న ఉద్యోగులకు వేతనాలు అందజేయమని, ఉద్యోగంలో నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. చెన్నై ప్లాంట్‌లోని సామ్సంగ్ ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని, తమ యూనియన్‌కు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9 నుంచి నిరసన చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా కంపెనీ స్పందించింది.‘నో వర్క్..నోపే ప్రాతిపదికనను కంపెనీ పాటిస్తుంది. సమ్మె ప్రారంభమైన సెప్టెంబర్ 9 నుంచి నిరసనలో పాల్గొన్న ఉద్యోగులకు వేతనాలు ఉండవు. వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలి. నిరసన కొనసాగిస్తే ఉద్యోగాల నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉంది. నాలుగు రోజుల్లోగా ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరకపోతే, వారిని సర్వీస్ నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలి’ అని కంపెనీ హెచ్ఆర్ విభాగం అధికారులు ఈమెయిల్ పంపించారు.ఇదీ చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకంభారత్లో కార్యకలాపాలకు తమిళనాడులోని కాంచీపురం సామ్సంగ్ ప్లాంట్ కీలకం. ఈ ప్లాంట్ కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ఉంది. ఇందులో 16 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఇందులో తయారు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. వారిలో 60 మందే మహిళలు ఉండడం గమనార్హం. భారతదేశంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20-30% వరకు ఈ ప్లాంట్ నుంచే సమకూరుతోంది. ఇటీవల ఈ ప్లాంట్‌లో కొత్త కంప్రెషర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ రూ.1,588 కోట్ల పెట్టుబడి పెట్టింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ఏటా 80 లక్షల కంప్రెషర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉద్యోగులు వేతనాలు పెంచాలని, తమ యూనియన్ను కంపెనీ గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ కార్మికులను సమీకరించడంలో సహాయపడిన సీఐటీయూ వివరాల ప్రకారం సామ్సంగ్ ఉద్యోగులు నెలకు సగటున రూ.25,000 వేతనం అందుకుంటున్నారు. మూడేళ్లలో రూ.36,000కు పెంచాలని డిమాండ్ ఉంది. -
150 మంది సామ్సంగ్ ఉద్యోగులు అరెస్టు
వేతనాలు పెంచాలని నిరసనకు దిగిన 150 మంది సామ్సంగ్ ఉద్యోగులను సోమవారం అరెస్టు చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో కార్మికులు ర్యాలీ నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి మంజూరైన అనుమతులు చివరి నిమిషంలో రద్దు చేశారు. దాంతో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేసేందుకు దాదాపు 400కుపైగా కార్మికులు సోమవారం కాంచీపురం కలెక్టరేట్‌కు బయలుదేరారు. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లిన 150 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కార్మికులకు మద్దతుగా నిలిచిన ఇండియా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, సీఐటీయూ నాయకుడు ముత్తు కుమార్‌ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు కార్మికులు తెలిపారు.సామ్సంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు వేతన సవరణ కోరుతూ సమ్మెకు దిగారు. ఇప్పటికే సమ్మె ప్రారంభించి ఎనిమిది రోజులు అయింది. అయినా సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంతో ర్యాలీ నిర్వహించాలని భావించి కలెక్టర్ అనుమతి కోరారు. చివరి నిమిషంలో అనుమతులు రద్దు చేశారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం..‘కాంచీపురంలోని సామ్సంగ్ ప్లాంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలి సమ్మె. స్థానికంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ఉత్పత్తి జరుగుతోంది. ఈ ప్లాంట్‌లో దాదాపు 1,700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి వేతనాలు ఇతర సంస్థల్లోని అదే స్థాయి ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. 16 సంవత్సరాలుగా ఈ కార్మికులకు ఎలాంటి రిజిస్టర్డ్ యూనియన్ లేదు. వేతనాలు సవరించాలని సంస్థకు ఎన్నిసార్లు లేఖలు రాసినా లాభం లేకుండాపోయింది. సంస్థ వేతనాలపై స్పందించకపోగా కార్మికులపై పనిభారం మోపుతోంది. సామసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ పేరుతో సమ్మెకు దిగాం. సంస్థలో 25 శాతం మంది అప్రెంటిస్ కార్మికులున్నారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌లో సర్వీసులు పెంచనున్న ఎయిర్లైన్స్భారత్లో కార్యకలాపాలకు తమిళనాడులోని కాంచీపురం సామ్సంగ్ ప్లాంట్ కీలకం. ఈ ప్లాంట్ కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ఉంది. ఇందులో 16 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఇందులో తయారు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. వారిలో 60 మందే మహిళలు ఉండడం గమనార్హం. భారతదేశంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20-30% వరకు ఈ ప్లాంట్ నుంచే సమకూరుతోంది. ఇటీవల ఈ ప్లాంట్‌లో కొత్త కంప్రెషర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ రూ.1,588 కోట్ల పెట్టుబడి పెట్టింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ఏటా 80 లక్షల కంప్రెషర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
9 నిమిషాల ఛార్జ్.. 965 కిమీ రేంజ్: ఇది కదా కావాల్సింది
ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా.. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించాలని చాలామంది చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా ఈవీలను ఉపయోగించడానికి కొందరు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి కారణం రేంజ్ విషయం సమస్య, కావలసినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోవడమే. ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టడానికి & ఎక్కువ రేంజ్ అందించడానికి శాంసంగ్ ఓ బ్యాటరీ రూపొందించింది.కొరియన్ బ్రాండ్ శాంసంగ్ రూపొందించిన బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 965 కిమీ రేంజ్ అందిస్తుంది. వీటి జీవిత కాలం 20 ఏళ్ళు కావడం గమనార్హం. అంటే ఒక వాహనంలో శాంసంగ్ బ్యాటరీ ఫిక్స్ చేసుకుంటే అది 20 సంవత్సరాలు మనగలుగుతోంది. ఇది చాలా గొప్ప విషయం.శాంసంగ్ బ్యాటరీ వివిధ పరిమాణాలలో లభిస్తుంది. కాబట్టి దీనిని కారు, బస్సు ఇలా వివిధ వాహనాల్లో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇవి సాధారణ బ్యాటరీల కంటే కూడా రెట్టింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందులోనూ ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. కాబట్టి వాహన వినియోగదారుల సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన SNE బ్యాటరీ డే 2024 ఎక్స్‌పోలో, కంపెనీ తన పైలట్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ గురించి వెల్లడించింది. అయితే ప్రస్తుతం దీనిని పలు వాహనాల్లో పరీక్షిస్తోంది. 2027 నాటికి అధిక సంఖ్యలో ఈ బ్యాటరీల ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. -
ఉచితంగా రూ.1.09 లక్షల విలువైన ఫోన్!
ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారా.. అయితే మీకు రూ.1.09 లక్షల విలువైన ఫోన్ ఉచితంగా లభిస్తుంది. ఎలాగంటారా.. పారిస్ ఒలింపిక్ 2024లో పాల్గొనే క్రీడాకారులకు కార్పొరేట్ కంపెనీలు ఆకర్షణీయ బహుమతులు అందిస్తున్నాయి. ఇందులో మొబైల్ఫోన్లు వంటి విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్సంగ్ క్రీడాకారులకు ప్రత్యేకంగా కిట్‌ను అందిస్తోంది. అందులో రూ.1.09 లక్షల విలువైన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఒలింపిక్ ఎడిషన్‌ను ఉచితంగా ఇస్తున్నారు.ఈ కిట్‌ను అందుకోవాలంటే నేషనల్ ఒలింపిక్ కమిటీలో నమోదవ్వాలి. అందులో చేరిన వారికి పారిస్‌లోని ‘ఒలింపిక్ విలేజ్ చెఫ్ డి మిషన్’కు చేరిన వెంటనే కిట్ అందిస్తారు. వీటిని ఆగస్టు 11 వరకు ఎప్పుడైనా ‘ఒలింపిక్ విలేజ్ ప్లాజా’లో తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. View this post on Instagram A post shared by Frame Thanakhan Ch. (@frame_thnk)ఇదీ చదవండి: భారత్‌లో ఐప్యాడ్ తయారీ..?కిట్‌లో ఉండే వస్తువులు..1. శామ్సంగ్ ఒలింపిక్ ఫ్లిప్‌సూట్ ఎడిషన్(మార్కెట్ ధర సుమారు రూ.1,09,999)ఇందులో 100జీబీ డేటాలో అపరిమిత కాల్స్ మాట్లాడేలా ఈ-సిమ్ ఉంటుంది. శామ్సంగ్ ప్రత్యేకంగా అందించే అథ్లెట్ 365 యాప్ కూడా ఇన్స్టాల్ చేసి ఇస్తున్నారు. దాంతో వ్యక్తిగత ఒలింపిక్ అప్డేట్లు తెలుసుకోవచ్చు.2. ఐఓసీ వెల్కమ్ గైడ్3. కోకా-కోలా సిగ్గ్ బాటిల్, పారిస్ 2024 పవర్ఏడ్ స్క్వీజ్ బాటిల్4. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీకు చెందిన టాయిలెట్ బ్యాగ్, ఎయిర్ ఫ్రెషనర్, షాంపూ, హ్యాండ్ సోప్, టూత్ బ్రష్, టూత్‌పేస్ట్. -
సరికొత్త మడత ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్లు!
శాంసంగ్ తన సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లను ప్రకటించింది. గెలాక్సి జెడ్ ఫోల్డ్6 (Galaxy Z Fold6), గెలాక్సి జెడ్ ఫ్లిప్6 (Galaxy Z Flip6)లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. భారత్‌లో వీటి ధరలను ప్రకటించిన కంపెనీ ముందస్తు ఆర్డర్లను ప్రారంభించింది.గెలాక్సి జెడ్ ఫ్లిప్6 (12GB+256GB) ధర రూ. 1,09,999 కాగా 12GB+512GB వెర్షన్ ధర రూ. 1,21,999. ఇక 12GB+256GB వేరియంట్లోని గెలాక్సి జెడ్ ఫోల్డ్6 ధర రూ.1,64,999 కాగా, 12GB+512GB వెర్షన్ రూ.1,76,999కి వస్తుంది. 12GB+1TB (సిల్వర్ షాడో కలర్) ధర రూ. 2,00,999 అని కంపెనీ తెలిపింది."డివైస్‌లను ప్రీ-ఆర్డర్ చేసే వారు రూ. 14,999 విలువ చేసే 'గెలాక్సీ జెడ్ అస్యూరెన్స్'లో భాగంగా రెండు స్క్రీన్లు, విడిభాగాలను కేవలం రూ. 999కి పొందుతారు" అని కంపెనీ తెలిపింది, ప్రస్తుత శాంసంగ్ ఫ్లాగ్షిప్ కస్టమర్లు రూ. 15,000 అప్‌గ్రేడ్ బోనస్‌ను పొందవచ్చని కంపెనీ పేర్కొంది.గెలాక్సి జెడ్ ఫోల్డ్6, గెలాక్సి జెడ్ ఫ్లిప్6 ఫోల్డబుల్ ఫోన్లతో పాటు గెలాక్సి బడ్స్3 (Galaxy Buds3), గెలాక్సి బడ్స్3 ప్రో (Galaxy Buds3 Pro)లను కూడా శాంసంగ్ లాంచ్ చేసింది. వీటిలో బడ్స్3 ధర రూ. 14,999 కాగా బడ్స్3 ప్రో ధర రూ. 19,999. శాంసంగ్ గెలాక్సి ఫోల్డబుల్ ఫోన్లు, బడ్స్ అమ్మకాలు జూలై 24 నుంచి ప్రారంభం కానున్నాయి.గెలాక్సి జెడ్ ఫోల్డ్6 స్పెసిఫికేషన్లు» 7.60-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే» స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్» 10-మెగాపిక్సెల్ + 4-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా» 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ + 10-మెగాపిక్సెల్ రియర్ కెమెరా» 12GB ర్యామ్, 256GB, 512GB, 1TB స్టోరేజ్» 4400mAh బ్యాటరీ కెపాసిటీ» ఆండ్రాయిడ్ 14 ఓఎస్గెలాక్సి జెడ్ ఫ్లిప్6 స్పెసిఫికేషన్లు» 6.70-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే» స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్» 10-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా» 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ రియర్ కెమెరా» 12GB ర్యామ్, 256GB, 512GB స్టోరేజ్» 4000mAh బ్యాటరీ కెపాసిటీ» ఆండ్రాయిడ్ 14 ఓఎస్ -
శాంసంగ్ చరిత్రలో భారీ సమ్మె!!
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం చరిత్రలో ఇది అతిపెద్ద వ్యవస్థీకృత కార్మిక చర్య. వేతన పెంపు, సెలవుల విషయంలో గత నెలలో చర్చలు విఫలం కావడంతో కంపెనీలోని అతిపెద్ద యూనియన్ గత కొన్ని వారాలుగా మూడు రోజుల వాకౌట్ కు సిద్ధమవుతోంది.శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా గత జూన్ ఆరంభంలో ఒక్క రోజు సమ్మె జరిగింది. తాజాగా జూలై 8న భారీ సమ్మెను కార్మికులు చేపట్టారు. కంపెనీకి చెందిన అత్యాధునిక చిప్ ప్లాంట్లలో ఉత్పత్తికి అంతరాయం కలిగించడం ద్వారా యాజమాన్యానికి సందేశాన్ని పంపడానికి దీన్ని ఉద్దేశించినట్లుగా యూనియన్ నాయకులు చెబుతున్నారు.సియోల్ కు 38 కిలోమీటర్ల దూరంలోని హ్వాసియోంగ్ లోని శాంసంగ్ సెమీకండక్టర్ ప్లాంట్ల వెలుపల సోమవారం ఉదయం 11 గంటలకు ర్యాలీలకు 5,000 మందిని సమీకరించాలని కార్మిక సంఘం లక్ష్యంగా పెట్టుకుందని యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లీ హ్యూన్ కుక్ బ్లూమ్ బర్గ్ న్యూస్ కు తెలిపారు. వాస్తవానికి ఎంత మంది కార్మికులు విధులను పక్కన పెడతారో స్పష్టంగా తెలియదు. ఉత్పత్తికి అంతరాయం కలిగించడమే ఈ వాకౌట్ లక్ష్యమని యూనియన్ నేత సన్ వూ మోక్ తెలిపారు.3% వార్షిక మూలవేతనం పెంపునకు అంగీకరించని సుమారు 855 మంది సిబ్బందికి పెద్ద వేతన పెంపును కోరుతున్నట్లు మొదట చెప్పిన యూనియన్ నాయకులు తమ డిమాండ్లను మార్చారు. ఇప్పడు మొత్తం 28,000 మందికి పైగా యూనియన్ సభ్యులకు అధిక వేతనాలు, అదనపు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.సెమీకండక్టర్ సిబ్బందికి ప్రథమార్ధం పనితీరు సంబంధిత బోనస్ లను ప్రకటించడం ద్వారా కార్మికుల సమ్మె ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి శాంసంగ్ ప్రయత్నించింది. కాని వారు వాగ్దానం చేసిన నెలవారీ జీతాలలో గరిష్టంగా 75% గతంలో సాధారణమైన పూర్తి నెల చెల్లింపు కంటే తక్కువగా ఉంది.కొరియాలోని అనేక ప్రముఖ కంపెనీలను పీడిస్తున్న గ్రౌండ్ అప్ కల్లోలాన్ని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎప్పుడో నివారించింది. శాంసంగ్ దివంగత చైర్మన్, ప్రస్తుత అధినేత జే వై లీ తండ్రి లీ కున్ హీ యూనియన్లు ఏర్పడకుండా నిరోధించడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఇప్పుడు నేషనల్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ అనేది సుమారు 28,000 మందికి పైగా కార్మికులతో కంపెనీ యూనియన్లలో కెల్లా అతి పెద్దది. -
గోడలకు వేలాడే సంగీతం ఇది.. ఎప్పుడైనా విన్నారా!
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అలనాటి సామెతల్ని కొత్తగా నిర్వచిస్తోంది. గోడలకూ చెవులుంటాయని పెద్దలు చెబితే.. గోడల నుంచి సుస్వరాలు వినిపిస్తాయని సరికొత్త మ్యూజిక్ ఫ్రేమ్స్ నిరూపిస్తున్నాయి. గోడకు ఫొటో ఫ్రేమ్స్లానే తమ మ్యూజిక్ ఫ్రేమ్‌ను కూడా వేలాడదీస్తే ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చని అంటోంది ప్రసిద్ధ గృహోపకరణాల బ్రాండ్ శామ్సంగ్..తాజాగా ఈ బ్రాండ్ రూపొందించి సిటీ మార్కెట్లోకి విడుదల చేసిన ఈ వైర్లెస్ మ్యూజిక్ ఫ్రేమ్ ద్వారా వీనులవిందైన సంగీతాన్ని వినడం మాత్రమే కాదు వ్యక్తిగత ఫొటోలు, కళాత్మక చిత్రాలు సైతం పొందుపర్చుకోవచ్చు. డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచి్చన ఈ ఫ్రేమ్.. అందాన్ని పెంచే ఇంటీరియర్లా అమరిపోతుందంటున్నారు.ఇవి చదవండి: ఆన్లైన్ గేమర్స్‌ను వరించనున్న.. రూ. 2 కోట్ల ప్రైజ్ మనీ.. -
ప్రముఖ కంపెనీలో మొదటిసారి కార్మికుల సమ్మె
ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీ, దక్షిణ కొరియా ప్రధాన కేంద్రంగా ఉన్న శామ్సంగ్లో ఉద్యోగులు మునుపెన్నడూ లేనివిధంగా నిరసనకు దిగారు. కార్మికులు మొదటిసారి శుక్రవారం సమ్మె ప్రారంభించారు. సౌత్కొరియాలోని సియోల్‌లో ఉన్న శామ్సంగ్ ప్రధాన కార్యాలయం ముందు కంపెనీ చిప్ డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు లౌడ్ స్పీకర్లలో నిరసన పాటలు ప్లే చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.శామ్సంగ్ కంపెనీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి సమ్మెలు సాగలేదు. ఇదే మొదటిసారి. వేతనాల పెంపు, బోనస్‌లపై పలుసార్లు కంపెనీ యాజమాన్యంతో చర్చించామని సమ్మె నిర్వాహకులు చెప్పారు. కార్మికుల డిమాండ్లపై కంపెనీ స్పందించకపోవడంతో ఆందోళన ప్రారంభించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా సౌత్‌కొరియా నేషన్వైడ్ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ లీ హ్యూన్ కుక్ మాట్లాడుతూ..‘కార్మికులు, కంపెనీకి మధ్య సంధానకర్తగా ఉన్న యూనియన్‌కు యాజమాన్యం విలువ ఇవ్వట్లేదు. కంపెనీలో ఉన్న ఐదు లేబర్ గ్రూపుల్లో యూనియన్ అతిపెద్దది. ఇందులో 28,000 మంది సభ్యులున్నారు. శామ్సంగ్ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో ఐదో వంతుకు యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులోని దాదాపు 75 శాతం మంది ఏప్రిల్‌లో సమ్మెకు అనుకూలంగా ఓటు వేశారు. వేతనాల పెంపు, బోనస్‌లపై కంపెనీ యాజమాన్యంతో పలుమార్లు చర్చించాం. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి. యూనియన్ డిమాండ్లను అధికారులు వెంటనే పరిష్కరించాలి’ అన్నారు.ఇదీ చదవండి: డబ్ల్యూఈఎఫ్ జాబితాలో భారత కంపెనీలకు చోటుయూనియన్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధి ఒకరు న్యూయార్క్ టైమ్స్‌తో తెలిపారు. చిప్ తయారీ మార్కెట్లో కంపెనీ ఏటా తన లక్ష్యాలను చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే కంపెనీలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగించే విషయమంటున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో చిప్ విభాగం నుంచి కంపెనీకి సుమారు 1.4 బిలియన్ డాలర్ల(రూ.11వేలకోట్లు) లాభం చేకూరినట్లు నివేదికల ద్వారా తెలిసింది. -
Samsung : రూ.10,000 కోట్ల వ్యాపార లక్ష్యం
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం శామ్సంగ్ టీవీల అమ్మకాల ద్వారా 2024లో భారత మార్కెట్లో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా చేసుకుంది. రూ.10 వేల కోట్ల మైలురాయిని చేరుకోవడం ఇప్పటి వరకు ఏ కంపెనీ సాధించలేదని కంపెనీ వెల్లడించింది. మధ్య స్థాయి, ప్రీమియం టీవీల విభాగంలో పరిమాణం పరంగా వృద్ధిలో ఉన్నట్టు శామ్సంగ్ ఇండియా విజువల్ డిస్ప్లే బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ తెలిపారు. ‘ప్రీమియం టీవీలపై పెద్ద ఎత్తున ఫోకస్ చేశాం. కంపెనీ విక్రయాల్లో ఈ విభాగం వాటా 40%. యూహెచ్డీ, పెద్ద స్క్రీన్ టీవీల విక్రయాలతో ఈ ఏడాది వృద్ధి ఉంటుంది. ప్రీమియం ఉత్పత్తులకు మెట్రోలు, చిన్న పట్టణాల నుంచీ డిమాండ్ ఉంది’ అని వివరించారు. సంస్థకు 21 శాతం వాటా.. శామ్సంగ్ భారత్‌లో 2022–23లో రూ.98,924 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఇందులో 70 శాతం మొబైల్స్ అమ్మకాల ద్వారా కాగా మిగిలినది టీవీలు, ఇతర ఉపకరణాల ద్వారా సమకూరింది. దేశీయ టీవీల విపణిలో పరిమాణం పరంగా సంస్థకు 21 శాతం వాటా ఉంది. శామ్సంగ్ తాజాగా ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ టీవీలను భారత్‌లో ప్రవేశపెట్టింది. పిక్చర్ స్పష్టంగా, సహజత్వం ఉట్టిపడేలా ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటి ప్రారంభ ధర రూ.1.39 లక్షలు. ఓఎల్ఈడీ టీవీల ప్రారంభ ధర రూ.1.64 లక్షలు. కాగా, శామ్సంగ్ దేశీ విక్రయ టీవీల్లో 90% భారత్‌లో తయారైనవే. దేశంలో ఏటా అన్ని బ్రాండ్లలో కలిపి 1.2 కోట్ల యూనిట్ల టీవీలు అమ్ముడవుతున్నాయని అంచనా. -
మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ..
ఫీచర్ పోన్ నుంచి స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన తర్వాత క్రమంగా కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపారు. వారి ఊహలకు తగ్గట్టుగానే కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టాయి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. అవసరమైతేనే కొత్త ఫోన్ కొందామనే ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. మడత పెట్టేందుకు వీలున్న స్మార్ట్ఫోన్లు కొంత ఆకర్షించినా.. ధర బాగా ఎక్కువ కావడంతో, కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు విడుదల చేస్తున్న జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత గల స్మార్ట్ఫోన్లు.. మళ్లీ ఈ రంగంలో భారీ మార్పులకు కారణం అవుతాయని, అమ్మకాలు పెంచేందుకు దోహద పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏఐ టూల్‌కు కొద్దిగా సమాచారం అందిస్తే, మనకు ఆకర్షణీయంగా అనిపించే కంటెంట్‌ను అందించే సామర్థ్యం ఉంటుంది. గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌లోని అల్గారిథమ్ వల్ల బృందంలోని సభ్యుల ముఖ కవళికల్లో ఆకర్షణీయంగా ఉన్న వాటిని కెమెరా ఒడిసి పట్టుకుని ప్రత్యేక చిత్రంగా మనకు అందిస్తుంది. వాయిస్ డిక్టేషన్, వేరే భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయడం వంటివి రియల్‌టైమ్‌లోనే జరుగుతాయి. మన వినియోగానికి అనువుగా బ్యాటరీ ఛార్జింగ్ వేగాన్ని మారుస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేలా, అంతర్గత వ్యవస్థలో మార్పులు చేస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్ తాజాగా అందుబాటులోకి వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్లో ఏఐ ఆధ్వర్యంలో పనిచేసే స్నాప్‌డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న వాటిల్లో వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది. మనం ఒక వ్యక్తి ఫోటో తీసినప్పుడు, అతడు ధరించిన దుస్తులు, కళ్లజోడు, చేతి వాచీ, హ్యాండ్ బ్యాగుల వంటివి నచ్చాయనుకోండి. నచ్చిన వస్తువుపై సర్కిల్ డ్రా చేసి సెర్చ్ చేస్తే ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ పేరు, వాటి ధర, అవి సమీపంలో ఎక్కడ లభిస్తున్నాయి వంటి వివరాలు సెకన్లలో డిస్ప్లే అవుతాయి. మనం ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటాం. అవతలి వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడినా, మనం తెలుగులో వినాలనుకుంటే.. ఏఐ ఆ మాటలను మనకు తెలుగులోనే వినిపిస్తుంది. జవాబుగా మనం తెలుగులోనే మాట్లాడినా, ఆ పదాలను ఇంగ్లీషులోకి మార్చి.. వెనువెంటనే వారికి అందిస్తుంది. సర్వీసులు ఉచితమేనా అధిక క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలే ప్రస్తుతానికి ఈ ఏఐ రంగంలో ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. ఏఐలో ప్రాసెసర్లు, చిప్‌ల వాడకం అధికంగా ఉంటుంది. వాటికి పెద్దమొత్తంలో పెట్టుబడుతులు అవసరమవుతాయి. చిన్న కంపెనీలు ఆ ఖర్చును భరించలేవు. అదే పెద్ద కంపెనీల వద్ద అధికంగా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఉంటారు. కాబట్టి వారికి సాధ్యం అవుతుంది. ఇదీ చదవండి: సంబంధంలేని ఫొటోలు.. విమర్శలు ఎదుర్కొంటున్న గూగుల్ జెమిని అయితే కంపెనీలు వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. వీటిల్లో అందిస్తున్న ఫీచర్లకు నిర్వహణ వ్యయాలు కూడా ఉంటాయి కాబట్టి, భవిష్యత్తులో ఛార్జీలను వసూలు చేసే పరిస్థితులు కూడా రావొచ్చొని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఈ స్మార్ట్ వాచ్ స్పెషాలిటీ ఇదే.. ధర ఎంతంటే?
డయాబెటిస్ బాధితులు ప్రతినిత్యం చక్కెర స్థాయి తెలుసుకుంటూ ఉండాలి. చక్కెర స్థాయి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడల్లా వేలిని సూదితో గుచ్చి నెత్తుటిచుక్కలు బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ నెత్తుటిచుక్కల ద్వారానే ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్లూకోమీటర్లు చక్కెర స్థాయిని నిర్ధారించగలుగుతున్నాయి. ఇప్పటి వరకు డయాబెటిస్ బాధితులకు ప్రతిరోజూ ఈ నొప్పి తప్పడంలేదు. ఎలాంటి నొప్పి లేకుండానే, నెత్తుటి చుక్క చిందించకుండానే చక్కెర స్థాయిని కచ్చితంగా చెప్పగలిగే స్మార్ట్‌వాచీని కొరియన్ కంపెనీ ‘శామ్సంగ్’ అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌వాచీ మీటల మీద చేతి మధ్యవేలు, ఉంగరంవేలు కొద్ది క్షణాలు అదిమిపెట్టి ఉంచితే చాలు, శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో స్క్రీన్ మీద చూపిస్తుంది. ‘శామ్సంగ్’ రూపొందించిన ఈ గెలాక్సీ స్మార్ట్‌వాచ్ చక్కెర స్థాయితో పాటు శరీరంలో కొవ్వు పరిమాణం, కండరాల పరిమాణం వంటి వివరాలను కూడా చెబుతుంది. దీని ధర 81.26 డాలర్లు (సుమారు రూ.6750) మాత్రమే! -
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ కింగ్ ఇదే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత స్మార్ట్‌ఫోన్స్ విపణిలో శామ్సంగ్ హవా కొనసాగుతోంది. 2023లో 18 శాతం వాటాతో శామ్సంగ్ అగ్రస్థానంలో నిలిచినట్టు పరిశోధన కంపెనీ సైబర్‌మీడియా రిసెర్చ్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. గతేడాది 16 శాతం వాటాతో వివో రెండవ స్థానంలో, 13 శాతం వాటాతో వన్‌ప్లస్ మూడవ స్థానంలో నిలిచింది. 2022తో పోలిస్తే గతేడాది భారత స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్ 19 శాతం వృద్ధి చెందింది. 5జీ మోడళ్ల వాటా ఏకంగా 65 శాతానికి ఎగబాకింది. 5జీ స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2023లో 122% వృద్ధి సాధించడం విశేషం. ఫీచర్ ఫోన్లకూ గిరాకీ.. రూ.7–25 వేల ధర శ్రేణిలో 5జీ మోడళ్ల వాటా 58 శాతంగా ఉంది. 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఇది 47 శాతం నమోదైంది. రూ.25,000లకుపైగా ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్స్ విభాగం గతేడాది 71 శాతం ఎగబాకింది. రూ.50,000పైగా విలువైన సూపర్ ప్రీమియం మోడళ్ల విక్రయాలు 65 శాతం పెరిగాయి. 2022తో పోలిస్తే ఫీచర్ ఫోన్ల విభాగంలో అమ్మకాలు గతేడాది 52 శాతం అధికం అయ్యాయి. 4జీ ఫీచర్ ఫోన్లు ఈ దూకుడుకు కారణం అయ్యాయి. 2జీ ఫీచర్ ఫోన్స్ 12 శాతం క్షీణించాయి. రిలయన్స్ జియో 38 శాతం వాటాతో ఫీచర్ ఫోన్స్ విభాగంలో ముందు వరుసలో ఉంది. ఐటెల్ 23 శాతం, లావా 15 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నాల్గవ త్రైమాసికంలో.. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ 29 శాతం దూసుకెళ్లింది. 19 శాతం వాటాతో షావొమీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. శామ్సంగ్ 18.9 శాతం, వివో 16, రియల్మీ 12, ఒప్పో 8, యాపిల్ 6 శాతం వాటా దక్కించుకున్నాయి. 2023 యాపిల్ అమ్మకాల్లో ఐఫోన్–15 సిరీస్ 50 శాతంపైగా వాటా చేజిక్కించుకుంది. ఇక 2024లో స్మార్ట్ఫోన్ల విపణి దేశవ్యాప్తంగా 7–8 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. 5జీ మోడళ్ల అమ్మకాలు 40 శాతం పెరిగే ఆస్కారం ఉంది. 4జీ ఫీచర్ ఫోన్స్ 10 శాతం దూసుకెళ్లవచ్చు. -
మొన్న శాంసంగ్.. తాజాగా యాపిల్ ప్రొడక్ట్‌లపై కేంద్రం హైరిస్క్ అలర్ట్..
కేంద్రప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ఇటీవల శాంసంగ్ కంపెనీ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సైబర్ నేరస్థులు శాంసంగ్ ఫోన్లు వాడుతున్న లక్షల మంది వినియోగదారుల నుంచి తమ వ్యక్తిగత డేటాను దొంగలించే ప్రమాదం ఉందని సెర్ట్ పేర్కొంది. తాజాగా యాపిల్ ఉత్పత్తులకు కూడా ఇదే తరహాలో ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ తన అడ్వైజరీలో వివరించింది. ‘యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది’ అని సెర్ట్ తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే సెక్యూరిటీ పరిమితులను అధిగమించగలరని, ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్ చేసి కీలక సమాచారాన్ని పొందే ప్రమాదం ఉందని తెలిపింది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్ టీవీ ఓఎస్ 17.2, యాపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ వెల్లడించింది. కాగా.. యాపిల్ ఉత్పత్తులకు కేంద్రం గతంలోనూ పలుమార్లు ఇలాంటి అలర్ట్‌లు జారీ చేసింది. ఇదీ సంగతి: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్! ఇటీవలే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వినియోగదారులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ వివరించింది. -
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్!
స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్ని కేంద్రం హై- అలర్ట్ జారీ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) శాంసంగ్ గెలాక్సీ ఫోన్లతో పాటు పాత ఫోన్లలో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించింది. ఫలితంగా సైబర్ నేరస్తులు లక్షల మంది శాంసంగ్ ఫోన్లలోని వ్యక్తిగత డేటాను తస్కరించే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. శాంసంగ్ ఫోన్ యూజర్లు ఏం చేయాలంటే శాంసంగ్ ఫోన్లలో లోపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సైబర్ నేరస్తులు యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించి ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి యూజర్లు శాంసంగ్ సంగ్ ఆండ్రాయిడ్ వెర్షన్ 11,12,13,14లోని ఆపరేటింగ్ సిస్టంను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. శాంసంగ్ ఫోన్లపై దాడి.. ఆపై ఏం చేస్తారంటే? ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో విడులైన ఆ కంపెనీకి చెందిన ఫ్లాగ్ షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సైతం హ్యాకర్లు డేటాను తస్కరించే ఫోన్ల జాబితాలో ఉంది. ఫోన్ వినియోగదారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న సైబర్ నేరస్తులు ఫోన్లలోని డివైజ్ పిన్ను, ఎమోజీ సాండ్‌బాక్స్ డేటాను అటాకర్లు చదవగలరు. సిస్టమ్ టైమ్‌ను మార్చి నాక్స్ గార్డ్ లాక్‌ను బైపాస్ చేయగలరు. అర్బిట్రరీ ఫైల్స్, సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని సెర్ట్ ఇన్ పేర్కొంది. మిగిలిన ఫోన్ యూజర్లు సైతం అదే సమయంలో మిగిలిన స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు శాంసంగ్ ఫోన్ల నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అనుమానాస్పద లింకుల జోలికి పోవద్దని హెచ్చరించింది. -
కేంద్రం కొత్త పాలసీ? స్మార్ట్ఫోన్లలో లైవ్ టీవీ.. వ్యతిరేకిస్తున్న కంపెనీలు
స్మార్ట్ఫోన్లలో టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలు జరిగేలా భారత ప్రభుత్వం ప్రత్యేక పాలసీని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని శాంసంగ్, క్వాల్కమ్, ఎరిక్సన్,నోకియాతో పాటు ఇతర టెక్నాలజీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలో లైవ్‌టీవీ బ్రాడ్ కాస్ట్ సర్వీసుల్ని అందించాలంటే ఫోన్లలోని హార్డ్వేర్లని మార్చాలని, అలా మార్చడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు మరో 30 డాలర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయంటూ రాయిటర్స్ ఓ నివేదికను విడుదల చేసింది. అయితే, కేంద్రం టీవీ ప్రత్యక్ష ప్రసారాల కోసం సెల్యూలర్ నెట్‌వర్క్‌తో పనిలేకుండా డైరెక్ట్‌గా స్మార్ట్ ఫోన్లలో లైవ్ సిగ్నల్స్ ఉంటే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చలు సంబంధిత నిపుణలతో చర్చలు జరుపుతుంది. ఈ తరహా సేవలు ఉత్తర అమెరికా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఏటీఎస్సీ 3.0 టెక్నాలజీ సాయంతో నేరుగా ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో టెలికం కంపెనీల అవసరం లేకుండానే టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలకు వీలుంది. ఇప్పుడు ఇదే పద్దతిని భారత్‌లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. ఏటీఎస్సీ 3.0కు అనుగుణంగా ప్రస్తుత దేశీయ మార్కెట్లోని ఏ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేవు. ఒకవేళ కేంద్రం లైవ్ టీవీ పాలసీని అమలు చేస్తే తయారీ వ్యవస్థలో భారీ మార్పులు చేయాల్సి వస్తుందని సంస్థలు భావిస్తున్నాయి. ఇది తమకు చాలా నష్టమని మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి కంపెనీల ఆందోళనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. -
త్వరలో విడుదల కానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్24.. ధర ఎంతంటే?
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను విడుదల చేయనుంది. గెలాక్సీ ఎస్ 23 ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను ఇప్పటికే మార్కెట్‌కి పరిచయం చేసిన ఫోన్లను విడుదల చేసిన తర్వాతనే ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్లను విడుదల చేయాలని శాంసంగ్ భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నివేదికల ప్రకారం.. ఈ కొత్త సిరీస్‌లో బేస్ గెలాక్సీ ఎస్24,గెలాక్సీ ఎస్ 234 ప్లస్, గెలాక్సీ ఎస్ 24 ఆల్ట్రాలు ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌ను కొత్త ఏడాది జనవరి 17న అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలో జరిగే కార్యక్రమంలో విడుదల చేసే అవకాశం ఉందని ఎస్బీఎస్ బిజ్ రిపోర్ట్ తెలిపింది. శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ మోడల్‌ను సౌత్ కొరియాలో సుమారు రూ.70 వేల లోపు ధరతో విక్రయించనుంది. ఇంచు మించు శాంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ఫోన్ ధరలు సైతం అదే స్థాయిలో ఉండనున్నాయి. వీటి ఖచ్చిత ధర ఎంతనేది తెలియాలంటే ఈ ఫోన్ సీరీస్ విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సి ఉంది. యాపిల్ ఐఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ ఆర్థిక మాంద్యం కారణంగా గెలాక్సీ ఎస్ 23 సిరీస్, ఎస్ 24 సిరీస్ ఫోన్ల అమ్మకాల తగ్గకుండా ఉండేలా వ్యూహాత్మకంగా మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేయనుంది శాంసంగ్ . తద్వారా వాటి సేల్స్ పెంచుకోవాలని భావిస్తుంది. -
ఈ వాచ్ పెట్టుకుంటే నిద్ర సమస్యలు పరార్!
ఇప్పటికే రకరకాల స్మార్ట్‌వాచీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వాచీలు నడక, వ్యాయామం ద్వారా శరీరంలో ఖర్చయ్యే కేలరీలు, రక్తపోటు వంటి సమాచారాన్ని యాప్ ద్వారా ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి. దక్షిణ కొరియాకు చెందిన సామ్సంగ్ కంపెనీ నిద్రా సమస్యలను గుర్తించే స్మార్ట్ వాచీని ఇటీవల రూపొందించింది. దీనికి దక్షిణ కొరియా ఆహార, ఔషధ మంత్రిత్వశాఖ ఆమోదం కూడా లభించింది. ‘సామ్సంగ్ గెలాక్సీ వాచ్5’ పేరుతో వచ్చే ఏడాది నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇది నిద్ర తీరుతెన్నులను నిరంతరం గమనిస్తూ ఉంటుంది. నిద్రలో ఎదురయ్యే గురక, నిద్ర మధ్యలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలను గుర్తించి, యాప్ ద్వారా తెలియజేస్తుంది. సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా వెంటనే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. (చదవండి: 120 మీటర్ల ఎత్తులో ఉన్న కొండను ఆనుకొని ఓ కొట్టు..ఎక్కడంటే..) -
యూజర్ల నిద్ర సమస్యల్ని గుర్తించే స్మార్ట్ వాచ్!
ఇప్పటికే రకరకాల స్మార్ట్‌వాచీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వాచీలు నడక, వ్యాయామం ద్వారా శరీరంలో ఖర్చయ్యే కేలరీలు, రక్తపోటు వంటి సమాచారాన్ని యాప్ ద్వారా ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి. దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ కంపెనీ నిద్రా సమస్యలను గుర్తించే స్మార్ట్ వాచీని ఇటీవల రూపొందించింది. దీనికి దక్షిణ కొరియా ఆహార, ఔషధ మంత్రిత్వశాఖ ఆమోదం కూడా లభించింది. ‘శామ్సంగ్ గెలాక్సీ వాచ్5’ పేరుతో వచ్చే ఏడాది నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇది నిద్ర తీరుతెన్నులను నిరంతరం గమనిస్తూ ఉంటుంది. నిద్రలో ఎదురయ్యే గురక, నిద్ర మధ్యలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలను గుర్తించి, యాప్ ద్వారా తెలియజేస్తుంది. సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా వెంటనే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
వన్‌ప్లస్ నుంచి మడత ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో దీని ధర ఎంతంటే?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్.. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లలో ఆధిపత్య చెలాయిస్తున్న శాంసంగ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వన్ ప్లస్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్’ ఫోన్‌ను పరిచయం చేయనుంది. ఈ నెల 19న వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. వన్ ప్లస్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 ఫోన్‌కు వన్ ప్లస్ గట్టి పోటీదారుగా నిలుస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌లో ‘వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్’ ధర ఎంతంటే భారత మార్కెట్ లో విడుదల కానున్న వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.1,41,490 (1699 డాలర్లు) ఉంటుందని తెలుస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే వన్ ప్లస్ ఓపెన్ 7.8 అంగుళాల ఓపెన్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, కవర్ డిస్ ప్లే 6.3 అంగుళాలు, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సౌకర్యం ఉండనుంది. -
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్, అమెరికా టెక్దిగ్గజం యాపిల్‌పై మరోసారి ట్రోలింగ్‌కు దిగింది. అమెరికాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్‌ను తాజాగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే యూఎస్బీ-సీ పోర్ట్‌తో లాంచ్ తాజా ఐఫోన్లను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది శాంసంగ్. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో యుఎస్బి-సి పోర్ట్‌లపై దారుణంగా ట్రోల్ చేస్తోంది శాంసంగ్. దీనికి మరో స్మార్ట్ఫోన్దిగ్గజం వన్‌ప్లస్ కూడా తోడైంది. అలాగే మరికొన్ని డిజిటల్ ప్లాట్‌ఫాంలు కూడా యాపిల్‌పై విమర్శలకు దిగాయి. ఎట్టకేలకు మనం ఒక మాజికల్ చేంజ్‌ను (సీ) చూస్తున్నా అంటూ పోరక్షంగా ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ కొంతమంది యూజర్లు యాపిల్‌కు మద్దతుగా నిలవడం విశేషం. ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా కాలంగా USB-Cని ఉపయోగి స్తున్నాయి. నిజానికి, యాపిల్ఇపుడు యూఎస్బీ-సీ స్విచ్ చేయడానికి ఏకైక కారణం, 2024 నుంచి యూరోపియన్ యూనియన్ ఇప్పుడు అన్ని స్మార్ట్ఫోన్లు USB-C ని మాండేటరీ చేసింది. కాగా USB-Cతో Apple Watch Series 9, Airpods Proతో పాటు iPhone 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 79,900 నుండి ప్రారంభం. అలాగే ఐఫోన్ 15 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900, iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 గాను నిర్ణయించింది. ఇక iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభం.స్మార్ట్‌ఫోన్ సెక్టార్లో శాంసంగ్, యాపిల్ మధ్య పోటీ గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫోల్డబుల్ ఫోన్ లేదంటూ గత ఏడాది కూడా శాంసంగ్ యాపిల్‌పై విమర్శలు గుప్పించింది. Apple announcing USB-C… pic.twitter.com/KIzXQFIzMx — OnePlus_USA (@OnePlus_USA) September 12, 2023 -
యాపిల్, శాంసంగ్ కీలక నిర్ణయం! ఇక్కడ తయారీ లేనట్లే..
ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీలైన యాపిల్ (Apple), శాంసంగ్ (Samsung) భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌కు ఈ రెండు టెక్ దిగ్గజాలు దరఖాస్తు చేయలేదు. ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీమ్‌లో పాల్గొనేందుకు డెల్, లెనోవో, హెచ్పీతో సహా దాదాపు 40 ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అంగీకరించాయి. అయితే యాపిల్, శాంసంగ్ కంపెనీలు మాత్రం వద్దనుకున్నాయి. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఆ రెండు కంపెనీలు పీఎల్ఐ స్కీమ్‌ను వద్దనుకోవడానికి ప్రాథమిక కారణం స్మార్ట్ఫోన్లతో పోలిస్తే భారతదేశంలో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లకు మార్కెట్ చాలా తక్కువగా ఉండటమే. ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌లో భారత్‌లో ఉన్నది కేవలం 2.4 శాతం మాత్రమే. కానీ స్మార్ట్ఫోన్లకు మాత్రం భారత్‌లో అత్యధిక మార్కెట్ ఉంది. పైగా యాపిల్, శాంసంగ్ కంపెనీ ప్రధాన ఉత్పత్తులు ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు కావు. కాబట్టి చైనా, వియత్నాం వంటి దేశాల నుంచి తయారీ కేంద్రాలను భారత్‌కు తరలించడం ఆర్థికంగా అంత లాభదాయకం కాదు. ఎక్కువ ఆదాయం వాటి నుంచే.. యాపిల్ కంపెనీకి ఆదాయం ప్రధానంగా ఐఫోన్ ఉత్పత్తుల నుంచే వస్తోంది. మాక్‌లు, ఐపాడ్ల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా చాలా తక్కువ. అందువల్లే ఈ సంస్థ భారత్‌లో మాక్‌లు, ఐపాడ్ల తయారీకి మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు శాంసంగ్ ప్రభుత్వ ఇన్‌వాయిస్‌లలోని వ్యత్యాసాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంది. ఇది ఆ కంపెనీ పీఎల్ఐ స్కీమ్‌లో పాల్గొనకపోవడానికి కారణం కావచ్చు. ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) PLI 2.0 స్కీమ్ భారత్‌లో తయారు చేసే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్, అల్ట్రా-స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ పరికరాలతో సహా వివిధ సాంకేతిక ఉత్పత్తులను కవర్ చేస్తుంది. చాలా కంపెనీలు దీని కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వం బడ్జెట్‌కు మించి దరఖాస్తులు వచ్చాయి. -
హైదరాబాద్ : శామ్సంగ్ కొత్త మొబైల్ లాంచ్ చేసిన నటి అషురెడ్డి (ఫొటోలు)
-
ఆకస్మిక ఆంక్షలు: షాక్‌లో దిగ్గజ కంపెనీలు, దిగుమతులకు బ్రేక్!
ల్యాప్‌టాప్‌లు,కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం నిర్ణయం చైనా కంపెనీలతో సహా ,ఆపిల్, శాంసంగ్,హెచ్‌పీ లాంటి దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో చైనా లైసెన్సు లేకుండానే చిన్న టాబ్లెట్ల నుంచి ఆల్ ఇన్ వన్ పీసీల దిగుమతులపై ఆంక్షలు ఆయా కంపెనీల ఆదాయంపై భారీగా ప్రభావం చూపనుంది. ల్యాప్‌టాప్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, మేకిన్‌ఇండియా, స్థానిక ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వ ఈ చర్య తీసుకుంది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) లైసెన్స్‌లను తప్పనిసరి చేయడంతో ప్రపంచంలోని అతిపెద్ద పీసీ మేకర్స్, ఇతర కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. భారతదేశానికి ల్యాప్‌టాప్‌లు టాబ్లెట్ల కొత్త దిగుమతులను నిలిపివేశాయి. అయితే ఆకస్మిక లైసెన్సింగ్ ప్రకటించడం పరిశ్రమను అతలాకుతలం చేసిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విదేశీ సంస్థల బహుళ-బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఇది భారీ గండి కొడుతుందని అంచనా. రానున్న దీపావళి షాపింగ్ సీజన్,బ్యాక్-టు-స్కూల్ కాలం సమీపిస్తున్నందున డిమాండ్ పుంజుకోనున్న టైంలో లైసెన్సులను ఎలా త్వరగా పొందాలనే దానిపై సంస్థలు మల్లగుల్లాలు పడుతున్నాయి. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) గ్లోబల్ ఇన్వెంటరీ, అమ్మకాల వృద్ధిని పునఃప్రారంభించడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న తయారీదారులకు ఈ అవసరం అదనపు తలనొప్పిని సృష్టిస్తుందనీ, ఫలితంగా దేశీయ లాంచ్‌లు ఆలస్యం కావడానికి లేదా విదేశీ సరుకులపై ఇప్పటికీ ఎక్కువగా ఆధారపడే కంపెనీల్లో ఉత్పత్తి కొరతకు దారితీయవచ్చనేది ప్రధాన ఆందోళన. కాగా దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ముఖ్యంగా చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో తీసుకున్న ఈ నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. మరోవైపు దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు ఇతర హార్డ్‌వేర్ తయారీదారులను ఆకర్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుతం 170 బిలియన్ రూపాయల ($2.1 బిలియన్) ఆర్థిక ప్రోత్సాహక ప్రణాళిక కోసం దరఖాస్తులను కోరుతున్న సంగతి తెలిసిందే.