న్యూఢిల్లీ: గెలాక్సీ ఎస్–22 సిరీస్ ఫోన్లకు రికార్డు స్థాయిలో ప్రీబుకింగ్‌లు వస్తున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన అగ్రగామి ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్‌సంగ్ ప్రకటించింది. పరిశ్రమతో పోలిస్తే అధిక వృద్ధిని నమోదు చేస్తామని, ప్రీమియం విభాగంలో జూన్ నాటికి మార్కెట్ లీడర్‌గా అవతరిస్తామని తెలిపింది. శామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజు ఆంథోనీ పుల్లన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎస్ సిరీస్ ఫోన్లకు 20 లక్షల మంది కస్టమర్లు యాక్టివ్ యూజర్లుగా ఉన్నారు. ఆవిష్కరించిన మొదటి 72 గంటల్లోనే ఎస్–22 సిరీస్ ఫోన్లకు 1,00,000కు పైగా ప్రీ బుకింగ్‌లు వచ్చాయి. ఇప్పటికే 1,40,000 బుకింగ్‌లు దాటిపోయాయి. మార్చి 10న ప్రీబుకింగ్ ముగుస్తుంది’’ అని పుల్లన్ తెలిపారు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్–22 సిరీస్ ఫోన్ ఆరంభ ధర రూ.72,999 కాగా, గరిష్ట ధర రూ.1,18,999.
Comments
Please login to add a commentAdd a comment