Galaxy
-
అనంత దూరంలోని... ఆ గెలాక్సీలో ఆక్సిజన్!
అనంతమైన విశ్వంలో మన భూమిపై తప్ప ఇంకెక్కడా ప్రాణవాయువు(ఆక్సిజన్) ఉండకపోవచ్చని శాస్త్రజు్ఞలు ఇప్పటిదాకా భావించేవారు. కానీ మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలం (గెలాక్సీ)లో ఆక్సిజన్ ఆనవాళ్లను గుర్తించారు. అంతేగాక భారీ లోహాల జాడను సైతం కనిపెట్టారు. ఈ గెలాక్సీ భూమి నుంచి ఏకంగా 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది! విశ్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇది ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌బ్యాంగ్ 1,380 కోట్ల ఏళ్ల క్రితం సంభవించిందన్న వాదనలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నక్షత్ర మండలానికి జేడ్స్–జీఎస్–జెడ్14–0 అని నామకరణం చేశారు. నిజానికి దీన్ని 2024 జనవరిలోనే ప్రాథమికంగా గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గెలాక్సీ ఉనికిని వెలుగులోకి తెచ్చింది. కాకపోతే దానిపై ప్రాణవాయువు ఉన్నట్లు కనిపెట్టడం కీలక పరిణామమని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ ఆక్సిజన్ ఏ రూపంలో, ఎంత పరిమాణంలో ఉందన్నది తేల్చడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పరిమాణంలో అత్యంత భారీగా ఉన్న ఈ నక్షత్ర మండలం కాంతివంతమైనది కూడా. మన భూగోళమున్న గెలాక్సీకి సమీపంలో ఇప్పటిదాకా మరో 700 గెలాక్సీలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శాంసంగ్ నుంచి మూడు కొత్త స్మార్ట్ఫోన్లు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) తన గెలాక్సీ ఎ-సిరీస్ లైనప్‌లో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. అవి శాంసంగ్ గెలాక్సీ ఎ56, గెలాక్సీ ఎ36, గెలాక్సీ ఎ26. ఆకట్టుకునే ఫీచర్లు, ఆకర్షణీయ ధరలో విస్తృత శ్రేణి వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ డివైజ్ లను రూపొందించారు. వీటిలో ఏయే స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ధరలెంత అన్న విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..గెలాక్సీ ఎ56గెలాక్సీ ఎ56 కొత్త లైనప్ లో ఫ్లాగ్ షిప్ మోడల్. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఎక్సినోస్ 1580 చిప్ సెట్ తో నడిచే ఏ56 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లను అందిస్తుంది.. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ డ్యూయల్ 5జీ సిమ్ కార్డులకు సపోర్ట్ చేస్తుంది.కెమెరా సామర్థ్యాల విషయానికి వస్తే, గెలాక్సీ ఎ56లో విభిన్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ కూడా ఉంది.గెలాక్సీ ఎ56 మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి ఆసమ్ ఆలివ్, ఆసమ్ లైట్గ్రే, ఆసమ్ గ్రాఫైట్. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.41,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.44,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.47,999గానూ కంపెనీ నిర్ణయించింది.గెలాక్సీ ఏ36గెలాక్సీ ఎ36 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో సహా అనేక ఫీచర్లను ఎ56లో మోడల్లో ఉన్నట్లుగానే ఉంటాయి. అయితే ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ను అందించారు. ఏ36లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇచ్చారు.గెలాక్సీ ఏ36లో కెమెరా సెటప్ విషయానికి వస్తే ఓఐఎస్‌తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. ఎ56 మాదిరిగానే ఎ36 కూడా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ కూడా ఉంది.గెలాక్సీ ఎ36 లావెండర్, బ్లాక్, వైట్ రంగులలో లభిస్తుంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.32,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.35,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.38,999గానూ నిర్ణయించారు.గెలాక్సీ ఏ26గెలాక్సీ ఎ26 కొత్త లైనప్ లో అత్యంత చవక మోడల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + సూపర్ అమోలెడ్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు.గెలాక్సీ ఏ26లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ ఉంది.గెలాక్సీ ఏ26 ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. బ్లాక్, వైట్, మింట్, పీచ్ పింక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. -
ఆండ్రోమెడాలో వెలుగుల పున్నమి
సువిశాల విశ్వంలో ఎన్నెన్నో నక్షత్ర మండలాలు (గెలాక్సీలు)న్నాయి. మన నక్షత్ర మండలాన్ని పాలపుంత (మిల్కీవే) అంటారన్నది తెలిసిందే. మనకు సమీపంలో ఉన్న అతిపెద్ద నక్షత్ర మండలం ఆండ్రోమెడా. ఈ గెలాక్సీలో అరుదైన దృశ్యాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) బృందం కెమెరాలో బంధించింది. గెలాక్సీలోని నక్షత్రాలపై ఉన్నట్టుండి పేలుడు సంభవించి భిన్న రంగులతో కూడిన అత్యధిక కాంతి వెలువడడాన్ని నోహ్‌వై అంటారు. ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో ఇలాంటి నోహ్‌వై నుంచి పరారుణ ఉద్గారాలను తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఆస్ట్రోశాట్ ఉపగ్రహంపై అమర్చిన అ్రల్టావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (యూవీఐటీ) ద్వారా ఈ ఉద్గారాలను చిత్రీకరించారు. నోహ్‌వై సాధారణంగా బైనరీ నక్షత్ర వ్యవస్థలో సంభవిస్తూ ఉంటుంది. భూమి పరిమాణంలో ఉన్న మరుగుజ్జు నక్షత్రం మరో నక్షత్రానికి సమీపంలో పరిభ్రమిస్తున్నప్పుడు ఈ పరిణామాన్ని చూడొచ్చు. ఒక నక్షత్రం తన గురుత్వాకర్షణ శక్తితో మరో నక్షత్రంలోని పదార్థాన్ని ఆకర్షిస్తే శక్తివంతమైన థర్మోన్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుంది. దాంతో హఠాత్తుగా మిరుమిట్లు గొలిపే వెలుగుతో నక్షత్రంపై పేలుడు సంభవిస్తుంది. ఆండ్రోమెడా గెలాక్సీలో నోహ్‌వై నుంచి 42 దాకా అ్రల్టావైలెట్ ఉద్గారాలను గుర్తించడం విశేషం. వీటిపై మరింత అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలను అస్ట్రో ఫిజికల్ జర్నల్‌లో ప్రచురించారు. నక్షత్ర మండలాల గురించి తెలుసుకోవడానికి ఈ సమాచారం తోడ్పడుతుందని భావిస్తున్నారు. నోహ్‌వై రహస్యాలను ఛేదించడానికి భవిష్యత్తులో అ్రల్టావైలెట్, ఎక్స్–రే మిషన్లలో పరిశోధనలకు సైతం ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వర్చువల్ గలాక్సీ ఐపీవో బాట
న్యూఢిల్లీ: బీఎఫ్‌ఎస్‌ఐపై ప్రత్యేక దృష్టిపెట్టిన సాస్(ఎస్ఏఏఎస్) సేవల సంస్థ వర్చువల్ గలాక్సీ ఇన్ఫోటెక్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఎమర్జ్‌కు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.ఐపీవోలో భాగంగా 66 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధుల్లో రూ. 34 కోట్లు అదనపు అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు, రూ. 19 కోట్లు ప్రస్తుత ప్రొడక్టుల ఆధునీకరణ, విస్తరణ తదితరాలకు వినియోగించనుంది. మరో రూ. 14 కోట్లు బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్ కార్యకలాపాలపై వెచ్చించనుంది.ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్సైట్కాగా.. జులైలో ప్రీఐపీవో నిధుల సమీకరణలో భాగంగా సుప్రసిద్ధ ఇన్వెస్టర్ల నుంచి రూ. 21.44 కోట్లు సమకూర్చుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి ఆరు నెలల్లో(ఏప్రిల్–సెప్టెంబర్) రూ. 72 కోట్ల ఆదాయం, రూ. 19 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
నిషిద్ధ కాంతి చిక్కింది
ఇప్పటిదాకా వినడమే తప్ప కంటికి కనబడని విశ్వపు సుదూరాల్లోని నిషిద్ధ కాంతి ఎట్టకేలకు చిక్కింది. దాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించింది. భూమికి ఏకంగా 27.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఎంసీజీ–01–24–014 స్పైరల్ గెలాక్సీ నుంచి వెలువడుతున్న ఈ కాంతి తరంగాలను ఒడిసిపట్టింది. వాటికి సంబంధించి అబ్బురపరిచే ఫొటోలను భూమికి పంపింది. టెలిస్కోప్ తాలూకు అడ్వాన్స్డ్ కెమెరా ఫర్ సర్వేస్ (ఏసీఎస్) ఈ ఘనత సాధించింది. అత్యంత స్పష్టతతో ఉన్న ఫొటోలు చూసి నాసా సైంటిస్టులతో పాటు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ కిరణాల వెలుగులో కనువిందు చేస్తున్న ఎంసీజీ గెలాక్సీ అందాలకు ఫిదా అవుతున్నారు. కాస్మిక్ ఫొటోగ్రఫీ చరిత్రలోనే దీన్ని అత్యంత అరుదైన ఫీట్‌గా అభివరి్ణస్తున్నారు. హబుల్ ఫొటోల్లో కన్పిస్తున్న ఎంసీజీ గెలాక్సీ పూర్తిస్థాయిలో వికసించిన నిర్మాణం, అత్యంత శక్తిమంతమైన కేంద్రకంతో కనువిందు చేస్తోంది. ఇది అత్యంత చురుకైన కేంద్రకాలున్న టైప్–2 సీఫెర్ట్ గెలాక్సీల జాబితాలోకి వస్తుందని నాసా పేర్కొంది. సీఫెర్ట్ గెలాక్సీలు అంతరిక్షంలో మనకు అత్యంత దూరంలో ఉండే అతి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలైన క్వాసార్ల సమీపంలో ఉంటాయి. అయితే క్వాసార్లు తామున్న గెలాక్సీలను బయటికి ఏమాత్రమూ కని్పంచనీయనంతటి ప్రకాశంతో వెలిగిపోతుంటాయి. సీఫెర్ట్ గెలాక్సీలు మాత్రం వీక్షణకు అనువుగానే ఉంటాయి. కానీ అత్యంత సుదూరంలో ఉన్న కారణంగా వీటి వెలుతురు ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కలేదు. ఆ కారణంగానే సైంటిస్టుల పరిభాషలో దాన్ని ‘నిషిద్ధ కాంతి’గా ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు. పైగా ఈ కాంతి పుంజాలు భూమ్మీద మనకు ఇప్పటిదాకా తెలిసిన పరిమాణ భౌతిక శాస్త్ర నియమాలకు పూర్తిగా అతీతమన్నది సైంటిస్టుల నమ్మకం. అనంత విశ్వంలో అంతటి సుదూర అంతరిక్ష క్షేత్రంలో మన భౌతిక శాస్త్ర నియమాలన్నీ తల్లకిందులవుతాయని వారు చెబుతుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆకాశంలో దెయ్యం
పెద్దగా నోరు తెరుచుకుని మీదికొస్తున్న దెయ్యంలా.. చూడగానే వామ్మో అనిపించేలా ఉందికదా! ఇది ఏ గ్రాఫిక్స్ బొమ్మనో, సరదాగా సృష్టించిన చిత్రమో కాదు.. సుదూర అంతరిక్షంలోని ఓ భారీ గెలాక్సీ (నక్షత్రాల గుంపు) ఇది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ) సాయంతో టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ గెలాక్సీని గుర్తించారు. మన విశ్వం పుట్టుక తొలినాళ్లలోనే ఈ గెలాక్సీ ఏర్పడిందని.. అది భారీగా దుమ్ము, ఇతర ఖగోళ పదార్థాలతో నిండి ఉందని వారు తెలిపారు. విసిరివేసినట్టుగా ఉన్న ఆ ఖగోళ పదార్థాల నుంచి వేలాది కొత్త నక్షత్రాలు జన్మిస్తున్నాయని.. ఈ క్రమంలో దెయ్యం ముఖం వంటి ఆకృతి ఏర్పడిందని వివరించారు. అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చిత్రాలు మసకగా ఉండటంతో.. ఓ చిత్రకారుడితో మరింత స్పష్టత వచ్చేలా మార్చామని వివరించారు. -
ఖగోళ రహస్యాలను చేధించిన ఎడ్విన్ హబుల్.. టెలిస్కోప్‌తో ఎన్నో ఆవిష్కరణలు
ఖగోళ వింతలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? టెలిస్కోప్ ఆవిష్కణలతో ఆకాశ వింతల్ని దగ్గరన్నుంచి చూసి విశ్వం రసహ్యాలను తెలుసుకోవచన్న సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే చాలా టెలిస్కోప్‌లు ఉన్నాయి. కానీ చరిత్రలో కొన్ని టెలిస్కోపులకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. అందులో ఒకటి హబుల్ టెలిస్కోప్. విశ్వ రహస్యాలను మన కళ్లముందు ఉంచడంతో పాటు అంతరిక్షంలో బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. . ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ గౌరవార్థం హబుల్ స్పేస్ టెలిస్కోప్‌కు ఆ పేరు పెట్టారు. ఇవాళ(సోమవారం)ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ. అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త అయిన ఎడ్విన్ హబుల్ నవంబర్ 20, 1889లో మిస్సౌరీలోని మార్ష్‌ఫీల్డ్‌లో జన్మించాడు. 1910లో అతను చికాగో విశ్వవిద్యాలయం నుంచి చదువు పూర్తిచేశాడు.ఖగోళ శాస్త్రంలో అనేక అధ్యయనాలు చేసి విశేష గుర్తింపు పొందాడు. గెలాక్సీలను అధ్యయనం చేయడంలో హబుల్ ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడ్డాయి. 1923లో నెబ్యులాలో సెఫీడ్ వేరియబుల్స్ అని పిలువబడే ఒక రకమైన నక్షత్రాన్ని కనుగొన్నాడు, నెబ్యులా అనేక వందల వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని (పాలపుంత గెలాక్సీ వెలుపల) ఇది మరొక గెలాక్సీ అని హబుల్ నిర్ధారించాడు. విశ్వంలో అనేక గెలాక్సీలు ఉన్నాయని తన పరిశోధనల ద్వారా కనుగొన్నాడు. గెలాక్సీల రెడ్‌షిఫ్ట్, దూరం మధ్య స్థిరమైన సంబంధాన్ని కనుగొనడం ద్వారా విశ్వం విస్తరిస్తోంది అని నిరూపించాడు. ఇక హబుల్ పేరుమీద హబుల్ స్పేస్ టెలిస్కోప్ అని పేరు పెట్టారు. ఇది హబుల్ స్పేస్ టెలిస్కోప్..ఇది అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి ప్రధాన ఆప్టికల్ టెలిస్కోప్. 1990లో దీన్ని ప్రయోగించారు. ఎడ్విన్ హబుల్ గౌరవార్థం టెలిస్కోప్‌కు ఆ పేరు పెట్టారు. విశ్వం పరిమాణమెంతో అంచనా కట్టేందుకు మొదలుకొని,నక్షత్రాలు, గ్రహాల పుట్టుక వంటివెన్నో విషయాలను అంచనా వేయడానికి హబుల్ టెలిస్కోపు పరిశోధనలు కీలకపాత్ర వహించాయి. సౌరకుటుంబం అవతల ఉన్న గ్రహాల రూపురేఖలు, వాటిల్లో ఉండే రసాయనాల వివరాలు తెలిసింది కూడా హబుల్ తీసిన ఫొటోల ఆధారంగానే. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం వరకూ చూడగల సామర్థ్యమున్న హబుల్ టెలిస్కోపు నక్షత్రాలు ఎంత వేగంగా కదులుతున్నాయో కూడా ఫోటోలు తీసి పంపించింది. వీటి ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విశ్వం వయసు 1300 నుంచి 1400 కోట్ల సంవత్సరాల వరకూ ఉంటుందని అంచనా కట్టగలిగారు.ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని తొలిసారి నేరుగా ఫొటో తీయగలిగింది కూడా ఈ టెలిస్కోప్ ద్వారానే. -
ఆ తార అస్తమయం వెనక...!
అది 2009. అనంతాకాశంలో ఒక తార ఉన్నట్టుండి మాయమైంది. అది సైంటిస్టులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నక్షత్రాలు మరణించడం వింతేమీ కాదు. అరుదు అంతకన్నా కాదు. కానీ అందుకు ఒక క్రమం ఉంటుంది. తమ జీవిత కాలంలో చివరి ఏడాదిలో అవి అత్యంత ప్రకాశవంతంగా మారతాయి. అనంతరం సూపర్ నోవాగా పిలిచే బ్రహా్మండమైన పేలుడుకు లోనవుతాయి. అలా శక్తినంతా కోల్పోయి మరుగుజ్జు తారలుగా మిగిలిపోతాయి. నెమ్మదిగా అంతర్ధానం చెందుతాయి. కానీ... సూర్యుని కంటే ఏకంగా 25 రెట్లు పెద్దదైన ఎన్6946– బీహెచ్1 అనే నక్షత్రం మాత్రం ఏదో మంత్రం వేసినట్టు ఉన్నపళంగా మాయమైపోయింది! మనకు 2.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అది కూడా తొలుత మరణానికి సిద్ధమయ్యే ఇతర తారల మాదిరిగానే 10 లక్షల సూర్యులకు సమాన తేజంతో వెలిగిపోయింది. దీన్ని గమనించిన సైంటిస్టులు, మరో సూపర్ నోవా చోటు చేసుకోనుందనే అనుకున్నారు. కానీ జరగకపోగా, అది వెలుగులన్నీ కోల్పోయింది. అలాగే క్రమంగా మాయమైపోయి ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కారణాలపై ఇప్పుడు బోలెడంత చర్చ జరుగుతోంది. కృష్ణబిలం మింగింది.. కాదు... ఈ తార విచిత్ర అంతర్ధానాన్ని ’జరగని సూపర్ నోవా’గా అప్పట్లో కొందరు సైంటిస్టులు పిలిచారు. బహుశా ఆ నక్షత్రాన్ని ఏదో కృష్ణబిలం మింగేసిందని వారు ప్రతిపాదించారు. అలా అది కూడా కృష్ణబిలంగానే మారిందని సూత్రీకరించారు. ఆ ఉద్దేశంతోనే దాని పేరు చివరన బీహెచ్1 అని చేర్చారు. అయితే అది సరికాదని మరికొందరు సైంటిస్టులు తాజాగా వాదిస్తున్నారు. దీనికి సంబంధించి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవల సేకరించిన పరిణామాల్ని విశ్లేíÙంచిన మీదట ఆ వాదనకు బలం చేకూరుతోంది. బీహెచ్1 తార ఉన్న చోట అతి ప్రకాశవంతమైన పరారుణ కాంతిని జేమ్స్ వెబ్ గమనించింది. అది మూడు వేర్వేరు రకాల కాంతి అని కూడా చెబుతున్నారు. బహుశా పలు నక్షత్రాలు పరస్పరం కలిసిపోయి పెను తారగా మారాయనేందుకు ఇది నిదర్శనమని అంటున్నారు. కానీ సూపర్ నోవాగా మారకుండా అది ఎలా అంతర్ధానం అయిందన్న కీలక ప్రశ్నకు మాత్రం ఇంకా బదులు దొరకాల్సే ఉంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కృష్ణ ‘చక్రం’
కృష్ణ బిలాల అధ్యయనంలో కీలక మలుపు. గెలాక్సీ ఎం87లో ఉన్న అతి భారీ కృష్ణబిలం ఒకటి భూచక్రం మాదిరిగా వర్తులాకారంలో గిరగిరా తిరుగుతోంది. ఇది మనకు 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కన్యా నక్షత్ర రాశిలో ఉంది. దీనికి సంబంధించి రెండు దశాబ్దాల పాటు సేకరించిన డేటాను అధ్యయనం చేసిన మీదట సైంటిస్టులకు ఈ విశేషం చిక్కింది. అందులో భాగంగా ఈ కృష్ణబిలానికి సంబంధించి నాలుగేళ్ల క్రితం ఈవెంట్ హోరైజాన్ టెలీస్కోప్ తీసిన ఫొటోను అధ్యయనం చేసి, అది నిలువుగానూ, పక్కలకూ గిరగిరా తిరుగుతోందని తేల్చారు. ఇలా తేలడం ఇదే మొదటిసారి. కృష్ణ బిలాల అధ్యయనంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ► కృష్ణ బిలం సమీపానికి వచి్చన ప్రతి వస్తూ రాశినీ దాని తాలూకు డిస్క్ లోనికి లాక్కునే క్రమంలో ఇలా తిరుగుతోందట. ► ఇది అచ్చం సౌర వ్యవస్థలోని గురుత్వాకర్షణ బలాల కలయిక తదితరాల ప్రభావంతో భూమి భ్రమణం, పరిభ్రమణం చేస్తున్న తీరును పోలి ఉందట. ► ఈ సరికొత్త సమాచారం చాలా థ్రిల్లింగ్ గా ఉందని దీనిపై సమరి్పంచిన అధ్యయన పత్రానికి లీడ్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ యుజూ కుయ్ చెప్పుకొచ్చారు. ► ప్రపంచవ్యాప్తంగా 45 అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధకులతో కూడిన బృందం నాలుగేళ్ల పాటు ఈ అంశంపై లోతుగా పరిశోధించింది. తెలిసింది గోరంతే ► అత్యంత భారీగా ఉండే కృష్ణబిలాల అధ్యయనం చాలా కష్టం. ► ఎందుకంటే అవి కాంతితో సహా అన్నింటినీ తమలోకి లాగేసుకుంటాయి. ► వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు అందుబాటులో ఉన్న సమాచారం కూడా చాలా స్వల్పం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్‌తో...
Samsung Galaxy Z Fold 5 and Z Flip 5: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ బుధవారం సియోల్‌లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో రెండు కొత్త ఫోల్డింగ్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 , గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 పేరుతో రెండు ఫోల్డబుల్ స్మార్ట్పోన్లను తీసుకొచ్చింది. అలాగే గెలాక్సీ వాచ్ 6 సిరీస్, గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్‌ను కూడా ఆవిష్కరించింది.గత సంవత్సరం మాదిరిగానే, కొత్తగెలాక్సీ S9 సిరీస్‌లో మూడు మోడల్స్తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్, గెలాక్సీ ఎస్ 9 అల్ట్రా మోడల్స్‌ను లాంచ్ చేసింది. ('ట్యాప్ & పే' ఫీచర్‌తో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6..యాపిల్‌కు షాకే!) ప్రీమియం సెగ్మెంట్లో ఆండ్రాయిడ్ ప్రత్యర్థులైన షావోమి, ఒప్పో లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్తగా లాంచ్ అన్ని డివైస్‌లు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి. Snapdragon 8 Gen 2 SoC కొత్త కీలు డిజైన్‌తోపాటు Z Flip 5 డిస్ప్లేకి కొన్ని అప్గ్రేడ్లను కూడా చేసింది. (మారుతి జిమ్నీని సింగిల్ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో) కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు, ధరలు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్): రూ 99,999 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్): రూ 1,09,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ): రూ 1,54,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్): రూ 1,64,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్): రూ 1,84,999 ప్రీ-బుకింగ్ కస్టమర్లు రూ. 23,000 (జెడ్ ఫ్లిప్ 5 కోసం రూ. 20,000) వరకు విలువైన ప్రయోజనాలను పొందుతారని శాంసంగ్ వెల్లడించింది. ఇందులో క్యాష్‌బ్యాక్ అప్‌గ్రేడ్ బోనస్‌లు ఉంటాయని పేర్కొంది. ప్రీ-బుకింగ్ విండో జూలై 27 నుంచి మొదలు. ఆగస్టు 17 లైవ్ సేల్, ఆ తర్వాత విక్రయాలు ఉంటాయి. -
'ట్యాప్ & పే' ఫీచర్‌తో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6..యాపిల్‌కు షాకే!
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ కొత్త గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేసింది. బుధవారం సియోల్‌లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 6, క్లాసిక్ పేరుతో రెండు వేరియంట్లను బుధవారం తీసుకొచ్చింది. ముఖ్యంగా అభిమానులకు ఇష్టమైన ఫీచర్, ఫిజికల్ రొటేటింగ్ బెజెల్‌ను తీరిగి పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో AFib లేదా క్రమరహిత హృదయ స్పందన రేటు ట్రాకింగ్, ఎమర్జెన్సీ ఎస్‌వోఎస్, ఫాల్డిటెక్షన్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్, స్లీప్ ట్రాకింగ్, పీరియడ్ ట్రాకింగ్ లాంటివి కీలక ఫీచర్లుగా ఉన్నాయి. (శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్‌తో...) అలాగే దేశంలో తొలిసారిగా గెలాక్సీ వాచ్ 6 సిరీస్ 'ట్యాప్ & పే' ఫీచర్‌తో వీటిని లాంచ్ చేసింది. అంటే యూజర్లు, చేతికి వాచ్ ఉండగానే ప్రయాణంలో చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ లాంచింగ్ సందర్భంగా ప్రకటించింది. (యాపిల్ ఐఫోన్ 14 పై భారీ డిస్కౌంట్) వీటి కోసం ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించింది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 44ఎంఎ గ్రాఫైట్ , సిల్వర్‌లో , 40ఎంఎం గ్రాఫైట్,గోల్డ్ కలర్స్‌లో లభ్యం.300mAh , 400mAh బ్యాటరీలను ఇందులో అందించింది. ప్రీమియం, టైమ్‌లెస్ టైమ్‌పీస్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ బ్లాక్ అండ్ సిల్వర్ , 43ఎంఎ, 47ఎంఎం మోడల్స్‌లో అందుబాటులో ఉంటుంది. AOD ఫీచర్ ఆన్‌తో 30 గంటల బ్యాటరీ లైఫ్‌ని, AOD ఫీచర్ ఆఫ్‌తో 40 గంటల వరకు అందించబడతాయని కంపెనీ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 ధర రూ. 29,999 నుండి ప్రారంభం. 44ఎంఎ డయల్, LTE సపోర్ట్‌ఉన్న టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 36,999. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ 43 ఎంఎం మోడల్ ధర రూ.36,999. LTT, 47 ఎంఎం మోడల్ ధర రూ.43,999గా నిర్ణయించింది. వినియోగదారులు శాంసంగ్ ఆన్లైన్ స్టోర్ నుండి జూలై 27 నుండి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 11న సేల్స్ మొదలవుతాయి. ప్రీ-బుక్ చేసుకున్న వారు రూ.19,999తో ప్రారంభమయ్యే సరికొత్త గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌ని సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. -
శాంసంగ్ లాంచ్ ఈవెంట్: అంచనాలు మామూలుగా లేవుగా!
Galaxy Unpacked 2023: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో సహా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5లను భారత మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో డిజిటల్ ఇన్ పర్సన్ ఈవెంట్‌గా జరుగుతుంది. మెరుగైన కెమెరాలు, బిగ్ డిస్ప్లే లాంటివి ఫీచర్లతో ముఖ్యంగా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో తీసుకురానుందని అంచనా. దీనికి తోడు ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వీటి ధర, ముందస్తు ఆఫర్ గురించి లీక్ చేయడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ లీక్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర రూ. 1,49,999గా ఉంటుందని, ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 1,43,999కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర రూ.99,999గఘుంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 94,999కి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ : 5, 7.6 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 6.2 అంగుళాల కవర్ డిస్ప్లే, 50+12+10 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 12 ఎంపీ సెల్పీ కెమెరా లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. అలాగే 6.7 అంగుళాల మెయిన్ డిస్ప్లే, 3.4 అంగుళాల కవర్ డిస్ప్లేతో గెలాక్సీ ఫ్లిప్ ఫోన్ తీసుకొస్తోంది. అయితే అధికారిక లాంచింగ్ తరువాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గెలాక్సీ వాచెస్, గెలాక్సీ ట్యాబ్స్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 , వాచ్ 6 క్లాసిక్‌లను కూడా లాంచ్ చేయనుంది. బిగ్ స్క్రీన్లు సన్నని బెజెల్‌లను కలిగి ఉంటాయని అంచనా. దీంతోపాటు అప్‌గ్రేడ్ చేసిన డిస్ప్లేలు , ప్రాసెసర్లతో Tab S9, S9 ప్లస్ , S9 అల్ట్రాలను కలిగి ఉండే Galaxy Tab S9 సిరీస్‌ని కూడా లాంచ్ చేయనుంది. తొలి స్మార్ట్ రింగ్ అంతేకాదు శాంసంగ్ తన తొలి స్మార్ట్ రింగ్, గెలాక్సీ రింగ్, కొత్త వైర్లెస్ ఇయర్‌బడ్‌లు, బడ్స్ 3తో కూడా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరచవచ్చని భావిస్తున్నారు. -
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ: లాంచింగ్ ఆఫర్ ముగుస్తోంది!
శాంసంగ్‌కు చెందిన టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్54 5 జీపై భారీ తగ్గింపు లభిస్తోంది. గెలాక్సీ ఎఫ్ సిరీస్లోఇటీవల లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇపుడు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. మెటోర్ బ్లూ ,స్టార్‌డస్ట్ సిల్వర్ రెండు రంగులలో లభిస్తుంది. ఐదు సంవత్సరాల వరకు భద్రతా అప్డేట్స్, అలాగే తాజా ఫీచర్లు, మెరుగైన భద్రత ఉంటుందని కంపెనీ భరోసా ఇస్తోంది. గెలాక్సీ ఎఫ్54 5జీ స్పెసిఫికేషన్స్ 6.7అంగుళాల sAMOLED+ డిస్ప్లే Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 8జీబీర్యామ్ , 256 జీబీ స్టోరేజ్ ఐకానిక్ గెలాక్సీ సిగ్నేచర్ డిజైన్ 108 ఎంపీ నో షేక్ కెమెరా, 8+2 ఎంపీ లెన్స్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000mAh బ్యాటరీ, 25W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్,ఇతర ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3,000 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. అన్ని ఆఫర్లతో సహా, గెలాక్సీ ఎఫ్54 5జీ ధర రూ. 27,999లకే కొనుగోలు చేయవచ్చు. జూన్ 20వరకే ఈ ఆఫర్అందుబాటులో ఉంటుంది. -
అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే..
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23) కొత్త రంగులో వస్తోంది. లైమ్ కలర్ వేరియంట్ మే 16 నుంచి భారత్‌లో అమ్మకానికి వస్తోంది. గెలాక్సీ ప్రస్తుతం ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రంగులలో అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! ధర, ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 కొత్త లైమ్ కలర్ వేరియంట్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 8/128 జీబీ ధర రూ. 74,999 కాగా 8/256 జీబీ వేరియంట్ ధర రూ. 79,999. ఈ కొత్త కలర్ వేరియంట్ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. గెలాక్సీ ఎస్23 కొనేవారికి పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ సీడీ లేదా బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకునే వారు నెలకు కేవలం రూ. 3,125 ఈఎంఐతో గెలాక్సీ ఎస్23 ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదనంగా ప్రస్తుత ఫ్లాగ్షిప్ ఫోన్ యజమానులు రూ.8,000 అప్‌గ్రేడ్ బోనస్ ప్రయోజనాన్ని పొందవచ్చు . దీన్న 24 నెలల బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ లేదా హెచ్డీఎఫ్సీ సీడీ పేపర్ ఫైనాన్స్‌తో కలపవచ్చు. అప్‌గ్రేడ్ బోనస్‌ను రూ.5 వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌తో కలపడం మరో ఆప్షన్. దీని వల్ల 8/128 జీబీ వేరియంట్ రూ. 61,999లకు, 8/256 జీబీ మోడల్ ధర రూ.66,999లకు తగ్గుతుంది. ఈ ఆఫర్లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీతో 9 నెలల నో కాస్ట్ ఈఎంఐని కూడా ఎంచుకోవచ్చు. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గేమ్ మోడ్‌లో సూపర్ స్మూత్ 6.1 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50 MP వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా 3,900mAh బ్యాటరీ, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ 8జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
5జీ ఫోన్ల విక్రయాలపై శాంసంగ్ మరింత దృష్టి.. గెలాక్సీ ఎ54, ఎ34 విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 5జీ ఫోన్ల వాటాను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు శాంసంగ్ ఇండియా జీఎం అక్షయ్ రావు తెలిపారు. ప్రస్తుతం విలువపరంగా వీటి వాటా 61 శాతంగా ఉందని 2023లో దీన్ని 75 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు గెలాక్సీ ఎ సిరీస్‌లో రెండు కొత్త 5జీ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించిన సందర్భంగా వివరించారు. వీటిలో ఎ54, ఎ34 మోడల్స్ ఉన్నాయి. (రియల్మీ సి–55.. ఎంట్రీ లెవెల్ విభాగంలో సంచలనం!) ఎ34 ధర రూ. 30, 999–రూ. 32,999గా ఉండగా, ఎ54 రేటు రూ. 38,999–40,999గా ఉంటుందని అక్షయ్ రావు చెప్పారు. ఆఫర్ కింద రూ. 3,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 8జీబీ+128 జీబీ లేదా 256 వేరియంట్లలో లభించే ఈ ఫోన్లకు 4 వరకు ఆండ్రాయిడ్ అప్డేట్లు, 5 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్లు పొందవచ్చు. తమ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 25 స్మార్ట్ఫోన్లు ఉండగా .. వీటిలో 5జీ మోడల్స్ 16 ఉన్నాయని అక్షయ్ రావు పేర్కొన్నారు. వీటి ధర రూ. 14,000 నుంచి ప్రారంభమై రూ. 1.60 లక్షల వరకూ ఉందని చెప్పారు. (మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!) -
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!
సాక్షి,ముంబై: శాంసంగ్ కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 5nm ప్రాసెసర్ , 6000 mAh బ్యాటరీ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు (మార్చి 24) భారత మార్కెట్లో విడుదల చేసింది. 5జీ సెగ్మెంట్లో మాత్రమే వస్తోంది. ఈ కనెక్టివిటీ కోసం 13 బ్యాండ్లను సపోర్ట్ చేస్తుందీ మొబైల్. అలాగే Exynos 1330 చిప్సెట్తో వస్తుందని, ఇందులోన బిగ్ బ్యాటరీ 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. పరిచయ ఆఫర్‌గా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీను ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్‌ల కొనుగోళ్లపై 4 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ కోసం రూ. 12,990, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,490కే అందిస్తోంది. మార్చి 30 మధ్యాహ్నం 12 గంటలనుంచి సేల్ మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ తోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో త్రి కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్పెసిఫికేషన్స్ 6.6-అంగుళాల పూర్తి HD+ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, Android 13 ఆధారంగా One UI 5 50ఎంపీ ప్రధాన కెమెరా 2MP మాక్రో కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా . 6000 mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అతేకాదు గరిష్టంగా 2 తరాల OS అప్గ్రేడ్లను 4 సంవత్సరాల వరకు భద్రతా అప్డేట్లను అందిస్తుంది. ఫైనాన్షియల్ అప్లికేషన్లు, వ్యక్తిగత ఐడీలు, ఇతర రహస్య పత్రాలను స్టోర్ చేసుకునేందుకు ఆల్-ఇన్-వన్ అప్లికేషన్ వాయిస్ ఫోకస్ ఫీచర్ , Samsung Walletకి మద్దతు కూడా ఉంది. -
ఇదో వింత.. ఢీకొంటున్న కృష్ణబిలాల జంటలు!
కృష్ణబిలం. అనంత శక్తికి ఆలవాలం. దాని ఆకర్షణ పరిధిలోకి వెళ్లిన ఏ వస్తువూ తప్పించుకోవడమంటూ ఉండదు. దానిలో కలిసి శాశ్వతంగా కనుమరుగైపోవాల్సిందే. అలాంటి రెండు అతి భారీ కృష్ణబిలాల జంటలు త్వరలో పరస్పరం ఢీకొననున్నాయట! వీటిలో ఒకటి భూమికి 76 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్133 అనే మరుగుజ్జు తారామండల సమూహంలో ఉండగా, మరొకటి 32 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్1758ఎస్ అనే మరో మరుగుజ్జు గెలాక్సీలో ఉంది. నాసా తాలూకు చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ ఈ కృష్ణబిలాలను గుర్తించింది. అంతరిక్షంలో ఇలా భారీ కృష్ణబిలాలు ఢీకొట్టడానికి సంబంధించి మనకు నిదర్శనం లభించడం ఇదే తొలిసారి కానుంది. దీనిద్వారా తొలినాటి విశ్వంలో కృష్ణబిలాల వృద్ధి, మరుగుజ్జు గెలాక్సీల ఎదుగుదల తదితరాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని నాసా భావిస్తోంది. ఆ రెండు మరుగుజ్జు గెలాక్సీల పరిమాణం 3 కోట్ల సూర్యుల సమష్టి ద్రవ్యరాశికి సమానం. అంటే మన పాలపుంత కంటే 20 రెట్లు తక్కువ! ఇలాంటి మరుగుజ్జు గెలాక్సీలు పరస్పరం కలిసిపోయి మనమిప్పుడు చూస్తున్న భారీ గెలాక్సీలుగా రూపొంది ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న తొలినాటి కృష్ణబిలం తొలినాటి విశ్వానికి చెందినదిగా భావిస్తున్న ఓ భారీ కృష్ణబిలాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇది ఊహాతీత వేగంతో విస్తరిస్తోందట. బహుశా అప్పట్లో అత్యంత భారీ కృష్ణబిలం ఇదే కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని లోతుగా పరిశోధిస్తే విశ్వావిర్భావపు తొలి నాళ్లలో భారీ నక్షత్ర మండలాలతో పాటు అతి భారీ కృష్ణ బిలాల ఆవిర్భావంపై మరిన్ని కీలక వివరాలు తెలిసే వీలుందని చెబుతున్నారు. ఈ కృష్ణ బిలం సీఓఎస్–87259గా పిలుస్తున్న ఓ గెలాక్సీ తాలూకు కేంద్ర స్థానంలో నెలకొని ఉంది. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే (ఏఎల్ఎంఏ) రేడియో అబ్జర్వేటరీ ద్వారా ఈ కృష్ణబిలం జాడ కనిపెట్టారు. ఇది మన పాలపుంత కంటే ఏకంగా వెయ్యి రెట్లు ఎక్కువ వేగంతో నక్షత్రాలకు జన్మనిస్తోందట! సూర్యుని వంటి వంద కోట్ల నక్షత్ర ద్రవ్యరాశులకు ఇది ఆలవాలమట. దీని తాలూకు ప్రకాశం వల్ల సీఓఎస్–87259 గెలాక్సీ అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనువిందు చేస్తోందట! ఈ అధ్యయన ఫలితాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాలూకు జర్నల్ మంత్లీ నోటీసెస్‌లో ప్రచురించారు. -
Samsung Galaxy S22 5G: భారీ ఆఫర్, ఇక హోలీనే!
సాక్షి,ముంబై: సౌత్‌కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీఎస్22 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీఆఫర్ అందిస్తోంది. 33 శాతం తగ్గింపుతో పాటు, నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది. గెలాక్సీ ఎస్22 5జీ అసలు ధర రూ.85,999గ ఉండగా, తాజా ఆఫర్లో అమెజాన్‌లో కేవలం రూ.57,998 కి కొనుగోలు చేయవచ్చు. రూ.28వేల తగ్గింపుతోపాటు, ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది లాంచ్ చేసిన ఎస్ 22 సిరీస్‌లో ఇదే ఎఫర్డ్బుల్ ప్రైస్ డివైస్‌గా పేరొందింది. గెలాక్సీ ఎస్ 22 5జీ ఫీచర్లు 6.1 అంగుళాల డైనమిక్ AMOLED డిస్ప్లే 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 120 Hz రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 8 Gen 1 octa-core ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 50+12+10 ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరా 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3700 mAh బ్యాటరీ -
సామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా
సైజ్: 6.8 అంగుళాలు బరువు: 234 గ్రా. రిజల్యూషన్: 1440x3088 పిక్సెల్స్ వోఎస్: ఆండ్రాయిడ్ 13, వన్ యూఐ 5.1 మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్ 256జీబి 12జీబి ర్యామ్ 512 జీబి 12జీబి ర్యామ్ కలర్స్: ఫాంటమ్ బ్లాక్, గ్రీన్, క్రీమ్, స్కైబ్లూ, రెడ్, బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ వాట్సాప్ ‘ఫొటో క్వాలిటీ’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఒరిజినల్ క్వాలిటీతో, కంప్రెస్డ్ ఫార్మట్‌లో ఫొటోలను పంపి డాటా సేవ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ వాట్సాప్ సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్‌లో (ఐఫోన్) ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలు సెండ్ చేయడానికి... ► వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఐకాన్ ట్యాప్ చేయాలి. ► స్టోరేజ్ అండ్ డాటా–ట్యాప్ ► మీడియా అప్లోడ్ క్వాలిటీ–ట్యాప్ ► ఆటో–సెలెక్ట్ -
రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్లు
హైదరాబాద్: దక్షిణ కొరియా శాంసంగ్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్23 ఫోన్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. ‘‘శాంసంగ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ ఒప్పందం ద్వారా కస్టమర్లకు గెలాక్సీ ఎస్23 సిరీస్ వంటి అత్యాధునిక సాంకేతికత అందించడం గర్వంగా ఉంది’’ అని కంపెనీ చీప్ ఎగ్జిక్యూటివ్ బ్రియాన్ బడే అన్నారు. గెలాక్సీ ఎస్23 కొనుగోలుపై గెలాక్సీ వాచ్4 బ్లూటూత్‌ను రూ.2,999 పొందవచ్చు. గెలాక్సీ ఎస్23 అల్ట్రా కొనుగోలుపై గెలాక్సీ వాచ్4 క్లాసిక్ ఎల్టీఈ–గెలాక్సీ బడ్స్ రూ.4999కే లభిస్తుంది. -
పాలపుంతలో నీటి గ్రహాలు! కనిపెట్టిన నాసా టెలిస్కోప్..
వాషింగ్టన్: భూమికి 218 కాంతి సంవత్సరాల దూరంలోని లైరా అనే పాలపుంతలో ఓ ఎర్రని మరుగుజ్జు తార చుట్టూ పరిభ్రమిస్తున్న కెప్లర్–138సి, కెప్లర్–138డి అనే రెండు గ్రహాలను సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇందులో వింతేముందంటారా? పరిమాణంలో భూమి కంటే ఒకటిన్నర రెట్లు పెద్దవైన ఇవి రెండూ దాదాపుగా నీటితో నిండి ఉన్నాయట! నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ వీటి ఉనికిని బయట పెట్టింది. వాటిపై ఉన్న పదార్థం శిలల కంటే తేలికగా, హైడ్రోజన్, హీలియం కంటే భారంగా ఉన్నట్టు సైంటిస్టులు తేల్చారు. కనుక అది కచ్చితంగా నీరే అయి ఉంటుందని బల్లగుద్ది చెబుతున్నారు. విశ్వంలో ఇలాంటి నీటి గ్రహాల ఉనికి వెలుగులోకి రావడం ఇదే తొలిసారి! దీనికి సంబంధించి నేచర్ ఆ్రస్టానమీ జర్నల్‌లో లోతైన అధ్యయనం పబ్లిషైంది. చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..! -
మైండ్‌బ్లోయింగ్ ఆఫర్.. రూ.27వేల స్మార్ట్‌వాచ్..కేవలం రూ. 3 వేలకే
క్రిస్మస్, న్యూయర్కు వెల్ కమ్ చెబుతూ పలు దిగ్గజ ఈకామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ ఆయా ఫోన్లను భారీ డిస్కౌంట్లకే కొనుగోలు దారులు దక్కించుకోవచ్చని తెలిపింది. ముఖ్యంగా ఫోల్డబుల్ ఫ్లాగ్ షిప్ డివైజ్‌లపై శాంసంగ్ ఆఫర్లు పెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ ధర రూ.1,54,999 ఉండగా రూ.8,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, రూ. 8,000 అప్‌గ్రేడ్ బోనస్‌తో రూ.1,46,999కే కొనుగోలు చేయొచ్చు. అదనంగా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4ని కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 34,999 విలువైన గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ బీటీ 46ఎంఎంపై రూ. 2,999 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అన్ని ఉత్పత్తులపై అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా, రూ. 89,999 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4పై రూ. 7వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 7వేల అప్‌గ్రేడ్ బోనస్‌తో సహా రూ. 82,999 కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్లు ప్రముఖ ఈ కామర్స్ సైట్లతో పాటు అన్నీ రిటైల్ స్టోర్లలో లభిస్తాయని శాంసంగ్ ప్రతినిధులు వెల్లడించారు. వీటితో పాటు రూ.1,09,999 ఖరీదైన గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా పై రూ. 5వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 7వేల అప్‌గ్రేడ్ బోనస్‌తో రూ. 1,02,999కి కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ ఎస్ 22 ఆల్ట్రాని కొనుగోలు చేసే కస్టమర్లు రూ.26,999 విలువైన స్మార్ట్ వాచ్ గెలాక్సీ వాచ్ 4 బీటీ 44ఎంఎంను కేవలం రూ.2,999కే పొందవచ్చు. రూ. 72,999 ధర కలిగిన గెలాక్సీ ఎస్22ని రూ. 54,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు. గెలాక్సీ బడ్స్2ని కేవలం రూ. 2,999కే పొందవచ్చు. రూ.84,999 ధర కలిగిన గెలాక్సీ ఎస్ 22 ప్లస్ రూ. 59,999కే అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ. 15,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 13,000 అప్‌గ్రేడ్ బోనస్, అలాగే రూ. 10,000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌లు ఉన్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 20,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు. రూ.26,999 విలువైన గెలాక్సీ వాచ్4 బీటీ 44 ఎంఎం స్మార్ట్ వాచ్‌ను రూ. 2,999కే పొందవచ్చు. ఇక, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర రూ . 84,999 ఉండగా.. ప్రత్యేక సేల్‌లో రూ. 59,999కి అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ. 15వేలు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ. 10,000 అప్‌గ్రేడ్ బోనస్ ఉన్నాయి.గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈని రూ . 39,999 నుండి కొనుగోలు చేయొచ్చు. ఇందులో రూ. 3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, రూ. 7,000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ. 10,000 అప్‌గ్రేడ్ బోనస్ ఉన్నాయి. గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ రూ. 5,000 క్యాష్‌బ్యాక్, రూ. 3,000 అప్‌గ్రేడ్ బోనస్‌తో సహా రూ. 32,999 నుండి అందుబాటులో ఉంటుంది. -
శాంసంగ్ మరో గెలాక్సీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది: ఫీచర్లు, ధర
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్‌కు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. గెలాక్సీ ఎం 54 5 జీ వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే లాంచ్‌కు దీనికి సంబంధించిన ఫీచర్లు, ధరల తదితర వివరాలు ఫోన్ గీక్‌బెంచ్‌లో లీక్ అయ్యాయి. మల్టీ-కోర్ టెస్ట్‌లో 750 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 2,696 పాయింట్లు సాధించిందని గీక్ బెంచ్ తెలిపింది. Exynos 1380 చిప్సెట్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్ ఇందులో జోడించింది. స్టోరేజ్ విషయానికొస్తే, గరిష్టంగా 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుందని భావిస్తున్నారు. గెలాక్సీ ఎం54 5 జీ ఫీచర్లు అంచనా 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే ఆండ్రాయిడ్ 13,1080 x 2412 రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్ హోల్-పంచ్ డిస్ప్లే 64+8+5ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ధర గెలాక్సీ ఎం53 5జీ ప్రస్తుతం 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.24,999 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.21,999 ఈ నేపథ్యంలో రానున్న ఎం54 5జీ ధర రూ.30వేలుఉంటుందని అంచనా. -
లద్దాఖ్ పోదాం... పాలపుంతను చూద్దాం!
లద్దాఖ్: ఇదేమిటో తెలుసా? మన పాలపుంత. చాలా బాగుంది కదా! ఈ సుందర దృశ్యాలను చూసేందుకు సుదూరంలోని ధ్రువాల దాకానో వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ మన దేశ ఉత్తరాగ్రాన జమ్మూ కశ్మీర్‌లోని లద్దాఖ్ దాకా వెళ్తే చాలు. అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలో చాంగ్తాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఐదు గ్రామాల సమాహారమైన హాన్లేలో ఉన్న ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ (ఐఏఓ) బేస్ క్యాంప్ నుంచి కనిపించే అద్భుతమిది. దీన్ని చూసేందుకు ఇక్కడికి కొన్నాళ్లుగా పర్యాటకుల రాక బాగా పెరుగుతోంది. దీన్ని మరింత వ్యవస్థీకృతం చేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా అంతరిక్ష టూరిజాన్ని ప్రోత్సహించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ముందుకొచ్చింది. లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్డీసీ), కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని దేశంలోనే తొలి డార్క్ స్కై రిజర్వ్‌గా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా పరిసర గ్రామాలకు చెందిన 24 మందిని అంతరిక్ష రాయబారులుగా ఎంపిక చేసి వారికి 8 అంగుళాల డోబ్సోనియన్ టెలిస్కోపులు అందజేశారు. ఔత్సాహిక పర్యాటకులు వాటిద్వారా అంతరిక్షంలోకి తొంగిచూడవచ్చు. పాలపుంత తాలూకు వింతలను కళ్లారా చూసి ఆనందించొచ్చు. మేఘరహిత వాతావరణం, స్వచ్ఛమైన వాతావరణం కారణంగా ఇక్కణ్నుంచి అంతరిక్షం అద్భుతంగా కనిపిస్తుందట. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని చెబుతున్నారు. ఈ డార్క్ స్కై రిజర్వ్‌ను లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథుర్ అక్టోబర్ 31న వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. -
ఎఫర్డబుల్ ప్రైస్‌లో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో కీలక స్పెసిఫికేషన్లు , ఫీచర్లతో గెలాక్సీ ఏ04ఈ (Galaxy A04e) లిస్ట్ చేసింది. బ్లాక్, బ్లూ, కాపర్ ఇలా మూడు కలర్ ఆప్షన్లలో రానున్న ఈ ఫోన్ ధర, లభ్యతను ఇంకా వెల్లడించలేదు. అయితే వచ్చే నెలలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే 13,499 రూపాయలువద్ద Galaxy A04s ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత వస్తున్న ఈ ఫోన్ ధరను వినియోగదారులకు అందుబాటు ధరలో సుమారు పదివేలలోపే నిర్ణయించవచ్చని అంచనా. శాంసంగ్ గెలాక్సీ ఏ04ఈ ఫీచర్ల అంచనాలు 6.5 అంగుళాల HD+ ఇన్-సెల్ టచ్ LCD స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్, ఆక్టా-కోర్ చిప్సెట్ 720 x 1600 pixels, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ 4 జీబీ ర్యామ్ 126 జీబీ స్టోరేజ్ ( 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం) 13 ఎంపీ+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమరా 5 000mAh బ్యాటరీ -
అమెజాన్ దివాలీ సేల్: శాంసంగ్ 5జీ ఫోన్‌పై 40 వేల తగ్గింపు
సాక్షి, ముంబై: అన్లైన్ దిగ్గజం అమెజాన్ దీపావళి సేల్ ఈవెంట్లో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ మేకర్ శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ సిరీస్‌లోని గెలాక్సీ ఎస్22 అల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో పాటు ఇతర శాంసంగ్ గెలాక్సీ ఇతరఫోన్లపై ఆఫర్లను అందిస్తోంది. గెలాక్సీ ఎస్22 5జీ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను అమెజాన్ సేల్‌లో రూ. 32 వేల తగ్గింపుతో రూ.99,999కే అందిస్తోంది. దీని ఎంఆర్పీ ధర రూ. 1,31,999. దీనికి తోడు రూ. 13300 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అంతేకాదు అమెజాన్ అన్ని బ్యాంక్ కార్డ్‌ల కొనుగోళ్లపై రూ. 50వేల కంటే ఎక్కువ కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 8,000 ఫ్లాట్ ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. ఈ రెండు ఆఫర్లతో 40 వేల రూపాయల తగ్గింపుతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫీచర్లు 6.8 అంగుళాల AMOLED స్క్రీన్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 ప్రాసెసర్ 40 ఎంపీ సెల్ఫీ కెమెరా 108+12+12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 5000 mAh బ్యాటరీ -
కృష్ణబిలం ‘వినిపిస్తోంది’.. ఆడియో క్లిప్ విడుదల చేసిన నాసా
కృష్ణబిలం.. ఆయువు తీరిన తార తనలోకి తాను కుంచించుకుపోయే క్రమంలో ఏర్పడే అనంత గురుత్వాకర్షణ శక్తి కేంద్రం. సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కాంతితో సహా సర్వాన్నీ శాశ్వతంగా తనలోకి లాక్కుంటుంది. దాని గుండా కాంతి కూడా ప్రసరించలేదు గనక కృష్ణబిలం (బ్లాక్‌హోల్) ఎలా ఉంటుందో మనం చూసే అవకాశం లేదు. అలాంటి కృష్ణబిలం నాసా శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తొలిసారి ‘వినిపించింది’. ఇందుకోసం 2003లో సేకరించిన ఒక కృష్ణబిలం తాలూకు డేటాకు శాస్త్రీయ పద్ధతిలో నాసా శబ్ద రూపమిచ్చింది. దాని కేంద్రం నుంచి అన్నివైపులకూ ఊహాతీతమైన వేగంతో నిత్యం వెలువడే అతి తీవ్రమైన ఒత్తిడి తరంగాలను శబ్ద రూపంలోకి మార్చి విడుదల చేసింది. శబ్దం శూన్యంలో ప్రయాణించదన్నది తెలిసిందే. అంతరిక్షం చాలావరకూ శూన్యమయం. కానీ పాలపుంతల సమూహాల్లో అపారమైన వాయువులుంటాయి. వాటిగుండా ప్రయాణించే కృష్ణబిలపు ఒత్తిడి తరంగాలకు నాసా తాలూకు చంద్ర అబ్జర్వేటరీ స్వర రూపమిచ్చింది. ఈ శబ్దం అచ్చం హారర్ సినిమాల్లో నేపథ్య సంగీతం మాదిరిగా ‘హూం’.. అంటూ వినిపిస్తోంది. నాసా విడుదల చేసిన వీడియోలో దీన్ని స్పష్టంగా వినవచ్చు. సైన్స్‌ను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతోనే ఈ శబ్ద సృష్టి చేసినట్టు నాసా తెలిపింది. ఇదీ చదవండి: మిస్టరీ గెలాక్సీ చిక్కింది -
మిస్టరీ గెలాక్సీ చిక్కింది
ఇంతకాలంగా అందీ అందనట్టుగా తప్పించుకుంటూ వస్తున్న ఓ మిస్టరీ గెలాక్సీ ఆనవాలు ఎట్టకేలకు చిక్కింది. భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల పై చిలుకు దూరంలో ఉన్న కార్ట్‌వీల్ గెలాక్సీని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరా కంటిలో బంధించింది. దాని కేంద్రకం వద్ద ఉన్న భారీ కృష్ణబిలం కూడా వెబ్ కెమెరాకు చిక్కింది. ఈ గెలాక్సీని నిత్యం నక్షత్ర ధూళి భారీ పరిమాణంలో ఆవరించి ఉంటుందట. దాంతో హబుల్ వంటి కాకలు తీరిన టెలిస్కోప్‌లు ఎంతగా ప్రయత్నించినా ఇప్పటిదాకా దీన్ని ఫొటోలు తీయలేకపోయాయి. అందుకే ఈ గెలాక్సీ కంటపడటాన్ని చాలా అరుదైన విషయంగా నాసా సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు. కోట్లాది ఏళ్లలో కార్ట్‌వీల్ గెలాక్సీ ఎలాంటి మార్పుచేర్పులకు గురవుతూ వచ్చిందీ తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ తీసిన ఇన్ఫ్రా రెడ్ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. దాని కేంద్ర స్థానం వద్ద ఏర్పడ్డ కృష్ణబిలం గురించి కూడా విలువైన సమాచారం తెలిసే వీలుందట. అంతేగాక నక్షత్రాల పుట్టుకకు సంబంధించి ఇప్పటిదాకా మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి రావచ్చన్నది సైంటిస్టుల మాట. అచ్చం బండి చక్రంలా... వయసు మీదపడుతున్న హబుల్ టెలిస్కోప్‌కు వారసునిగా జేమ్స్ వెబ్ ఇటీవలే అంతరిక్ష ప్రవేశం చేయడం తెలిసిందే. కాలంలో వెనక్కు చూడగల ఇన్ఫ్రా రెడ్ సామర్థ్యం దీని సొంతం. దాని సాయంతో మహావిస్ఫోటనం (బిగ్‌బ్యాంగ్) అనంతరం విశ్వం ఆవిర్భవించిన తొలి నాళ్లకు సంబంధించిన ఫొటోను ఇటీవలే జేమ్స్ వెబ్ మనకు అందించిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా కార్ట్‌వీల్ గెలాక్సీకి సంబంధించి కూడా దాని ఇప్పటి, సుదూర, సమీప గతాలకు సంబంధించిన ఫొటోలనూ జేమ్స్ వెబ్ స్పష్టంగా అందించగలిగింది. ఈ ఫొటోల్లో కార్ట్‌వీల్ గెలాక్సీ పేరుకు తగ్గట్టుగా అచ్చం బండి చక్రం మాదిరిగానే కన్పిస్తోంది. స్కల్ప్టర్ నక్షత్ర మండలంలోని ఈ గెలాక్సీతో పాటు మరెన్నో ఇతర పాలపుంతలు కూడా నేపథ్యంలో కనిపిస్తుండటం విశేషం. ఒక అతి పెద్ద, మరో బుల్లి గెలాక్సీ ఊహాతీతమైన వేగంతో ఢీకొనడం వల్ల కార్ట్‌వీల్ గెలాక్సీ పురుడు పోసుకుందని సైంటిస్టులు సిద్ధాంతీకరించారు. కానీ దీని ఉనికి చాలాకాలం పాటు మిస్టరీగానే ఉండిపోయింది. అంతరిక్ష ధూళి తదితరాల గుండా సులువుగా పయనించగల పరారుణ కాంతిని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పట్టుకోగలదు. దాని సాయంతోనే ఎట్టకేలకు అది కార్ట్‌వీల్ ఉనికిని నిర్ధారించి కెమెరాలో బంధించగలిగింది. ఫొటోలో కన్పిస్తున్న నీలి రంగు చుక్కలన్నీ నక్షత్రాలు. కోట్లాది ఏళ్ల కాలక్రమంలో చోటుచేసుకున్న భారీ విస్ఫోటాలు తదితరాల వల్ల కార్ట్‌వీల్ గెలాక్సీలో చోటుచేసుకుంటూ వచ్చిన కీలక మార్పులను ఈ ఫొటోల సాయంతో విశ్లేషించవచ్చట. ఈ గెలాక్సీ చుట్టూ రెండు వెలుతురు మండలాలున్నాయి. కేంద్ర స్థానంలో సంభవించిన మహా విస్ఫోటం ఫలితంగా చెరువులో అలల్లా ఇవి నానాటికీ విస్తరిస్తూ పోతున్నాయట. అందుకే అంతరిక్ష శాస్త్రవేత్తలు దీన్ని రింగ్ గెలాక్సీ అని కూడా పిలుస్తుంటారు. ఇలాంటి ఆకృతులుండే పాలపుంతలు అరుదు. దీనిలోని అంతరిక్ష ధూళికి సంబంధించి లోతైన విషయాలను జేమ్స్ వెబ్ తాలూకు మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్ (ఎంఐఆర్ఐ) సాయంతో విశ్లేషించే పనిలో పడింది నాసా. – నేషనల్ డెస్క్, సాక్షి -
శాంసంగ్ గెలాక్సీ జెడ్ మోడల్స్ , డిస్కౌంట్లు, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ ఇండియా ఫోల్డేబుల్ విభాగంలో గెలాక్సీ జడ్ ఫ్లిప్4, ఫోల్డ్4 మోడళ్లను ఆవిష్కరించింది. ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ ఇక్కడి మార్కెట్లో వీటిని పరిచయం చేశారు. వేరియంట్‌నుబట్టి ధర రూ.90 వేల నుంచి రూ.1.85 లక్షల వరకు ఉంది. ప్రీ-బుకింగ్‌లు భారతదేశంలో 50,000 దాటినట్లు దక్షిణ కొరియా దిగ్గజం ఇటీవల ప్రకటించింది. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 అడాప్టివ్ 120 హెట్జ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ–ఓ డిస్ప్లేతో 6.7 అంగుళాల డైనమిక్ అమోలెడ్ మెయిన్ స్క్రీన్, 1.9 అంగుళాల సూపర్ అమోలెడ్ 60 హెట్జ్ కవర్ డిస్ప్లేతో ఫ్లిప్4 రూపుదిద్దుకుంది. 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 512 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ పొందుపరిచారు. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 8GB/256GB వేరియంట్ ధర రూ. 94,999గాను, బెస్పోక్ ఎడిషన్ 8GB/256GB రూ. 97,999 గా ఉంది. గెలాక్సీ జడ్ ఫోల్డ్4 ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లేతో 7.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 1-120 హెట్జ్ మెయిన్ స్క్రీన్, ఇన్ఫినిటీ–ఓ డిస్ప్లేతో 6.2 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 48–120 హెట్జ్ కవర్ స్క్రీన్‌తో ఫోల్డ్4 తయారైంది. 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ ఏర్పాటు ఉంది. Galaxy Z Fold 4 బేస్ వేరియంట్ (12GB/256GB) రూ. 1,54,999గా నిర్ణయించింది. ఇక 12GB/512GB , 12GB/1TB ధరలు వరుసగా రూ. 1,64,999 రూ. 1,84,999గాఉన్నాయి. ఆఫర్లు HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై జడ్ ఫోల్డ్4 ప్రీ-బుకింగ్‌తో రూ 8,000 క్యాష్‌బ్యాక్ లేదా జడ్ ఫ్లిప్4 బుగింగ్పై రూ. 7,000 తగ్గింపు పొందవచ్చు. దాని కోసం మీకువసరం. పాత ఫోన్‌తో exchange చేసుకుంటే 7 వేల నుంచి 8 వేల రూపాయల దాకా ప్రయోజనం లభిస్తుంది. Galaxy Z Fold 4ని ప్రీ-బుక్ చేసే కస్టమర్లు రూ. 34,999 విలువైన Galaxy Watch 4 Classic (46mm బ్లూటూత్)ని కేవలం రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు You have truly unfolded your world with the all-new foldables. We are delighted to share that #GalaxyZFold4 and #GalaxyZFlip4 have crossed 50,000+ pre-bookings! Thank you for your great response. pic.twitter.com/nyIbMtJPY0 — Samsung India (@SamsungIndia) August 18, 2022 -
మన పాలపుంత ఆవల... నిద్రాణ కృష్ణబిలం
న్యూయార్క్: సూర్యుడి కంటే 9 రెట్లు పెద్దదైన భారీ కృష్ణబిలాన్ని(బ్లాక్ హోల్) బెల్జియం పరిశోధకులు గుర్తించారు. భూమికి కేవలం 1,60,000 కాంతి సంవత్సరాల దూరంలో మెగెలానిక్ క్లౌడ్ అనే నక్షత్ర మండలంలో ఇది నిద్రాణ స్థితిలో ఉన్నట్లు తేల్చారు. ఒక కాంతి సంవత్సరం అంటే 9,460,730,472,580.8 కిలోమీటర్లు. ‘బ్లాక్‌హోల్ పోలీసు’గా పిలిచే పరిశోధకుల బృందం దాదాపు 1,000 నక్షత్రాలను నిశితంగా పరిశోధించి, ఈ బ్లాక్‌హోల్‌ను కనిపెట్టింది. మన భూగోళం ఉన్న పాలపుంత, నక్షత్ర మండలం వెలుపల బయటపడిన తొలి నిద్రాణ కృష్ణబిలం ఇదేనని చెబుతున్నారు. భారీ నక్షత్రాల జీవితకాలం ముగిసి, సొంత గురుత్వాకర్షణ శక్తిలోనే కూలిపోయినప్పుడు ఇలాంటి కృష్ణబిలాలు ఏర్పడుతుంటాయని పేర్కొంటున్నారు. నిద్రాణ స్థితిలోని బ్లాక్‌హోల్స్ నిస్తేజంగా ఉంటాయి. అంటే కాంతిని గానీ, రేడియేషన్‌ను గానీ వెలువరించవు. పరిసరాలతో ఎలాంటి సంబంధాలు ఉండని నిద్రాణ బ్లాక్‌హోల్స్‌ను గుర్తించడం కష్టమే. -
కరోనా సరికొత్త వేరియెంట్.. సెంటారస్!.. మనదేశంలోనూ ఉందా?
ఒకప్పుడు బాగా సైన్స్ తెలిసిన వాళ్లకే కొన్ని గ్రీకు, రోమన్లాంటి పారిభాషిక పదాలు తెలిసేవి. కానీ కరోనా పుణ్యమా అని చాలా చాలా కొత్త కొత్త పేర్లు అందరికీ తెలిసి వస్తున్నాయి. ఆ కోవలో ఇప్పుడు సరికొత్తగా మరో పదం తెలిసివచ్చింది. దాని పేరే ‘సెంటారస్’. ఇది కూడా కరోనాకు చెందిన సరికొత్త వేరియెంట్. అయితే ఇది ఒమిక్రాన్ తాలూకు ఒక సబ్ వేరియెంట్‌గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఒక వైరస్ తాలూకు వేరియెంట్‌కు మనుషులు నిరోధకత సాధించగానే... తన మనుగడ కోసం కొత్త కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కోవిడ్‌కు సంబంధించి... ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వంటి అనేక పేర్లు విన్నాం. ఆ తర్వాత వాటిల్లోనే డెల్టా, ఒమిక్రాన్ కలిసిపోయి... డెల్మిక్రాన్ వంటివీ, ఒమిక్రాన్ ఫ్లూతో కలవడంతో ఫ్లూరాన్ వంటి మరికొన్ని సబ్వేరియెంట్లూ పుట్టుకొచ్చాయి. ఇదే వరసతో కోవిడ్‌కు సంబంధించి ఇప్పుడు తాజాగా మరో సబ్–వేరియెంట్ ఆవిర్భవించింది. దాని పేరే ‘సెంటారస్’. ఈ పేరుకు ఇంకా కొన్ని ప్రాధాన్యాలున్నాయి. ‘సెంటారస్’ అనే పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా పెట్టలేదు. అయితే... మనకు (భూమికి) చాలా దూరంలో ఉన్న సెంటారస్ అనే గ్యాలక్సీ పేరు దీనికి పెట్టారనీ... గ్రీకు మైథాలజీ ప్రకారం సగం గుర్రం, సగం మానవ దేహం ఉన్న గ్యాలక్సీ పేరు దీనికి ఇచ్చారనీ... గుర్రం పరుగులా వేగంగా విస్తరించే స్వభావం ఉన్నందునే ఈ పేరు పెట్టారంటూ ‘గ్సేబియర్ ఆస్టేల్’ అనే కోవిడ్ పరిశీలకుడి మాట. అయితే ఇప్పటివరకైతే దాని తీవ్రత అంతగా కనిపించడం లేదు. తొలిసారిగా ‘నెదర్లాండ్’లో అవును ఉంది. సెంటారస్ (బీఏ 2.75) సబ్–వేరియెంట్‌ను ఈ ఏడాది మే నెలలోనే మన దేశంలోనూ ఉన్నట్లు గుర్తించారు. అయితే తొలిసారిగా దీన్ని ‘నెదర్లాండ్’లో కనుగొన్నారు. ఇప్పుడు ఈ వేరియెంట్ యూఎస్ఏ, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో సోకుతోంది. ఇప్పుడీ వేరియెంట్ పై దేశాలు కలుపుకుని దాదాపు పది దేశాల్లో విస్తరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంత తీవ్రమైనదేమీ కాదు... ఈ సెంటరాస్ వేరియెంట్ చాలా వేగంగా పాకుతుందంటూ కొంతమంది శాస్త్రవేత్తలు తొలుత ఆందోళన పడ్డారు. ఒమిక్రాన్ విషయంలో ఆందోళన పడ్డట్టుగానీ ఇది కూడా అంత తీవ్రమైనది కాదని తొలి పరిశీలనల్లో తేలింది. పైగా ఇది ఒమిక్రాన్ తర్వాత వచ్చిన సబ్–వేరియెంట్ కావడం... కొత్త కొత్త వేరియెంట్లు వస్తున్నకొద్దీ వాటి తీవ్రత తగ్గుతూ పోతుండటం వల్ల... ఇది శాస్త్రవేత్తలు అంచనా వేసినంత తీవ్రంగా లేకపోవడం ఓ సానుకూల అంశం. జెనీవాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆంటోనీ ఫ్లాహాల్ట్ మాట్లాడుతూ... ‘‘ఇలా వేరియెంట్లు రూపు మార్చుకుంటున్న కొద్దీ ఈ కొత్త కొత్త స్ట్రెయిన్ల కారణంగా కరోనాలోని ఫలానా వేరియెంట్‌కు అంటూ నిర్దిష్టంగా వ్యాక్సిన్ కనుగొనడం కష్టమవుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారు. డచ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మరో నిపుణుడు మాట్లాడుతూ ‘‘మనం సార్స్–సీవోవీ–2 కోసం రూపొందించిన వ్యాక్సిన్ కోటగోడను దాటుకుని ఇవి లోనికి ప్రవేశించగలవా లేదా అన్న అంశం ఇంకా తెలియద’’ని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లియాకు చెందిన ప్రొఫెసర్ పాల్ హంటర్ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ ఇది చాలా నెమ్మదిగానే ఉంది. పెద్దగా విధ్వంసకారిలా అనిపించడం లేదు’’ అని తెలిపారు. ఇంకా మనదేశానికి చెందిన ‘సార్స్–సీవోవీ–2’ జీనోమిక్ కన్సార్షియమ్ కో–ఛైర్ పర్సన్ డాక్టర్ ఎన్.కె. అరోరా మాట్లాడుతూ ‘‘ఇది మన దేశంలో కొత్తగా, అరకొరగా మరికొన్ని కేసులకు కారణమవుతున్నప్పటికీ, తీవ్రమైనదేమీ కాదు. దీనివల్ల కొత్తగా నాలుగో వేవ్ రాదు’’ అంటూ భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే మన దేశవాసుల్లోని చాలామంది డబుల్ వ్యాక్సినేషన్ తీసుకుని ఉండటం, మరికొందరు బూస్టర్ డోసుకూడా తీసుకోవడం, మూడో వేవ్‌లో ఒమిక్రాన్ చాలామందికి స్వాభావికమైన నిరోధకత ఇచ్చి ఉండటంతో పాటు... తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడో డోసు బూస్టర్‌ను కూడా ఉచితంగా ఇవ్వనుండటంతో ఇకపై ఈ వేరియెంట్ ఓ పెద్ద సమస్య కాబోదనేది చాలా మంది నిపుణుల భావన. -
శాంసంగ్ గెలాక్సీ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపు ధరలో లభిస్తుంది. గత ఏడాది లాంచ్ చేసిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ‘ఎం52 5జీ’ ధరను 10వేల రూపాయలు తగ్గించింది. రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుండి కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ ఆఫర్ లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ హై-ఎండ్ వేరియంట్ (8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్) ను రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో 21,999 రూపాయలకు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 31,999. బ్లేజింగ్ బ్లాక్, ఐసీ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 29,999గా ఉంటే ఇపుడు రిలయన్స్ డిజిటల్ ద్వారా రూ.20,999 లకే లభిస్తోంది. ఇదే వేరియంట్ ధర అమెజాన్‌లో రూ. 24,999 గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం52 ఫీచర్లు 6.7 అంగుళాల పూర్తి హెచ్డీ సూపర్ AMOLED డిస్ప్లే 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 778G SoC 64+12+ 5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 mAh బ్యాటరీ , 25W ఫాస్ట్ ఛార్జింగ్ USB టైప్-C పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
గెలాక్సీ ఫోన్లలోవాటర్-రెసిస్టెన్స్ ఫీచర్: శాంసంగ్‌కు భారీ షాక్
న్యూఢిల్లీ: దక్షిణకొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్‌కు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాలో గెలాక్సీ స్మార్ట్ఫోన్ల ఫీచర్‌కు సంబంధించి అవాస్తవాలను ప్రకటించిందంటూ ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ఏసీసీసీ) భారీ జరిమానా విధించింది. కొన్ని మోడళ్ల గెలాక్సీ స్మార్ట్ఫోన్లలో వాటర్-రెసిస్టెన్స్ ఫీచర్ గురించి తప్పుదారి పట్టించేలా వ్యవహరించిందని ఏసీసీసీ తేల్చింది. దీనికి గాను స్థానిక శాంసంగ్ యూనిట్‌కు 14 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు 76 కోట్ల రూపాయలు) జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించిందని ఆస్ట్రేలియా కాంపిటీషన్ రెగ్యులేటరీ గురువారం తెలిపింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలతో మార్చి 2016, అక్టోబర్ 2018 మధ్య, ఆస్ట్రేలియాలో గెలాక్సీ S7, S7 ఎడ్జ్, A5 (2017), A7 (2017), S8, S8 ప్లస్ , ఎస్ నోట్ 8 మెడల్స్ 3.1 మిలియన్ ఫోన్లను శాంసంగ్ విక్రయించిందని పేర్కొంది. ఈ మేరకు కమిటీ చైర్ గినా కాస్-గాట్లీబ్ ఒక ప్రకటన విడుదల చేశారు. గెలాక్సీ స్మార్ట్ఫోన్లు సరిగ్గా పనిచేయడం లేదని, లేదా నీటిలో తడిచిన తర్వాత పూర్తిగా పనిచేయడం మానేసాయంటూ వినియోగదారుల వందలాది ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫోన్లను కొలనులు లేదా సముద్రపు నీటిలో కూడా ఉపయోగించవచ్చని క్లెయిమ్ చేస్తూ, ఇన్-స్టోర్, సోషల్ మీడియా ప్రకటనలను కంపెనీ విడుదల చేసిందని రెగ్యులేటరీ ఆరోపించింది. ఈ మేరకు శాంసంగ్‌పై రెగ్యులేటరీ గతంలో దావా వేసింది. అయితే తాజా పరిణామంపై శాంసంగ్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్, ధర ఎంతంటే!
స్మార్ట్ ఫోన్ యూజర్లను పెంచుకునేందుకు ఇటీవల ప్రముఖ సౌత్ కొరియా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఫీచర్ ఫోన్ల తయారీని నిలిపివేసింది. వాటి స్థానంలో బడ్జెట్ ధరల్లో కొనుగోలు దారులకు స్మార్ట్ఫోన్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ తరుణంలో రీజనబుల్ ప్రైస్‌తో రోజు దేశీయ మార్కెట్లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫోన్ స్పెసిఫికేషన్లు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 జున్ 22 (ఈరోజు మధ్యాహ్నం) భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఫోన్ విడుదలతో గెలాక్సీ ఎఫ్13 ఫీచర్లు సైతం రివిల్ అయ్యాయి.6000 ఏఎంహెచ్ బ్యాటరీ, 5000ఏఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో విడుదలైన ఈ ఫోన్ రెడ్ మీ10 ప్రైమ్, రియల్ మీ నార్జ్ 50ఏ ప్రైమ్, పోకో ఎంపీ3 5జీ ఫోన్లకు కాంపిటీటర్‌గా మారనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫోన్ 1080*2,408 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే,4జీబీ ర్యామ్‌తో ఎక్సినోస్ 850 ప్రాసెసర్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 5మెగా పిక్సెల్ అల్ట్రావైడ్‌తో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,128జీబీ నుంచి 1టెరా బైట్ వరకు ఇంట్రనల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 13 ఫోన్ ధర 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ స్టాంగ్ వేరియంట్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫోన్ విడుదలైంది. ఇక ఈ ఫోన్ 4జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ మోడల్ ధర రూ.12,999 ఉండగా నైట్ స్కై గ్రీన్, సన్‌రైజ్ కూపర్, వాటర్ ఫాల్ బ్లూ కలర్లలో లభ్యం కానుండగా.. జూన్ 29నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్‌తో పాటు పలు రిటైల్ స్టోర్లలో లభ్యం కానుంది. గంటలో ఫోన్ ఫుల్ ఛార్జింగ్ ఎక్కేలా 15డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. దీంతో పాటు 8జీబీ ర్యామ్‌ను అందిస్తుండగా..దాని కెపాసిటీని పెంచేందుకు ర్యామ్ ప్లస్ టెక్నాలజీని అందిస్తుంది. తద్వారా ఎక్కువ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా ఫోన్ డెడ్ అవ్వకుండా ఈజీగా హ్యాండిల్ చేసుకునే సదుపాయం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 పై ఆఫర్లు బుధవారం విడుదలైన ఈ ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు గూగుల్ నెస్ట్ మినీ, నెస్ట్ హబ్‌లను తక్కువ ధరకే పొంద వచ్చు. చదవండి👉శాంసంగ్ షాకింగ్ నిర్ణయం..ఆ సిరీస్ ఫోన్ తయారీ నిలిపివేత! ఎందుకంటే! -
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 : ఫీచర్లు, ధర ఎలా ఉంటాయి?
సాక్షి,ముంబై: శాంసంగ్ బడ్జెట్ ధరలో ‘గెలాక్సీ ఎఫ్ 13’ అనే కొత్త స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించనుంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ ద్వారా దీన్ని తీసుకొస్తోంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ గెలాక్సీ ఎఫ్13 ఫోన్ విక్రయానికి రానుంది. బడ్జెట్ ధరలో, అందులోనూ అంతేకాదు ఆటో డేటా స్విచింగ్ సదుపాయంతో కంపెనీ తొలిఫోన్ను లాంచ్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 13 ఫీచర్లు , అంచనాలు 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎక్సినోస్ 850 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్ 50 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ చార్జర్ పింక్, గ్రీన్, బ్లూ రంగుల్లో లభించనున్న గెలాక్సీ ఎఫ్ 13 ధర సుమారు రూ.12వేల గా ఉంటుందని అంచనా. -
సెకనుకో భూమిని మింగేస్తోంది!
అంతరిక్షంలో కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ఉండటం కామనే. కాంతి సహా ఏదైనా సరే తన సమీపంలోకి వస్తే లాగేసుకునే కృష్ణ బిలాలు.. ప్రతి నక్షత్ర సమూహం (గెలాక్సీ)లో ఉంటాయి. కానీ ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఓ అతిపెద్ద ‘రాక్షస’కృష్ణబిలాన్ని గుర్తించి ‘జే1144’అని పేరు పెట్టారు. ఇప్పటివరకు గుర్తించిన అన్ని కృష్ణ బిలాల్లో.. అతిపెద్దది, కాంతివంతమైనది, వేగంగా ఎదుగుతున్నది ఇదేనని తెలిపారు. ►‘జే1144’మన సూర్యుడి కంటే 300 కోట్ల రెట్లు పెద్దగా ఉందని.. ప్రతి సెకన్‌కు మన భూమి అంత పరిమాణంలో ద్రవ్యరాశిని మింగేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ►సుమారు తొమ్మిది వందల కోట్ల ఏళ్ల వయసున్న ‘జే 1144’.. మన పాలపుంత (మిల్కీవే) మధ్యలో ఉన్న కృష్ణబిలం ‘సాగిట్టారియస్ ఏ’కన్నా ఐదు వందల రెట్లు పెద్దదని తెలిపారు. ►పాలపుంతకు దక్షిణంగా 18 డిగ్రీల కోణంలో.. 700 కోట్ల కాంతి సంవత్సరాల దూరం లో ఈ కృష్ణబిలం ఉందని వెల్లడించారు. ►అసలు పాలపుంతలోని కొన్ని కోట్ల నక్షత్రాలన్నీ వెలువరించే కాంతికన్నా.. ఈ భారీ కృష్ణబిలం చుట్టూ ఉన్న ప్లాస్మా రింగ్ నుంచి వెలువడుతున్న కాంతి ఏడు వేల రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. ►ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన ‘స్కైమ్యాపర్ సదరన్ స్కై సర్వే’.. విశ్వంలో దక్షిణ భాగంలో నక్షత్రాలు, గెలాక్సీలు, కృష్ణబిలాలు, ఇతర అంతరిక్ష వస్తువులను గుర్తించి మ్యాప్ రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు భారీ కృష్ణ బిలాన్ని కనుగొని, ఫొటో తీశారు. చిన్న గ్రహాలెన్నింటినో మింగేసి.. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి (జూపిటర్). అది ఎంత పెద్దదంటే.. భూమి వంటి 1,300 గ్రహాలు అందులో సులువుగా ఫిట్టయిపోతాయి. ఇంకా చెప్పాలంటే సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలను కలిపినా జూపిటర్‌లో సగం కూడా నిండవు. మరి జూపిటర్ ఇంత పెద్దగా ఎలా ఉందన్న దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. అది చిన్నచిన్న గ్రహాలెన్నింటినో స్వాహా చేసినట్టు తాజాగా గుర్తించారు. నాసాకు చెందిన జునో స్పేస్ ప్రోబ్ సాయంతో సేకరించిన డేటా ఆధారంగా ఈ అంచనాలు వేశారు. జూపిటర్ నిజానికి ఓ భారీ వాయుగోళం (గ్యాస్ జియాంట్). కేవలం పదిశాతమే కోర్ (గట్టిగా ఉండే మధ్యభాగం) ఉండి.. ఆపై మొత్తంగా హైడ్రోజన్, హీలియం, ఇతర వాయువులతో నిండి ఉందని ఇన్నాళ్లూ భావించారు. అయితే తాజా డేటా ప్రకారం.. జూపిటర్ పరిమాణంలో 30 శాతం వరకు కోర్ ఉన్నట్టు గుర్తించారు. ‘‘సాధారణంగా వాయుగోళాల్లో కోర్ పెద్దగా ఉండదు. దీనితో జూపిటర్ వాతావరణంలోని వాయువులు, ధూళి మేఘాల రసాయన సమ్మేళనాలను పరిశీలించగా.. భారీ మూలకాలు ఉన్నట్టు తేలింది. సాధారణంగా భూమి, అంగారకుడు వంటి మట్టి, రాళ్లు ఉండే గ్రహాల్లోనే భారీ మూలకాలు ఉంటాయి. అంటే సౌర కుటుంబం ఏర్పడిన మొదట్లో చిన్న చిన్న గ్రహాలు, గ్రహ శకలాలను జూపిటర్ మింగేసి ఉంటుంది..’’అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన నెదర్లాండ్స్ లీడెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త యమిలా మిగ్వేల్ తెలిపారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
రాకాసి బిలం.. సెకనులో భూమినే మింగేసేంత పవర్ఫుల్
ఈ విశ్వంలో ఎలాంటి వస్తువునైనా, అది ఎంత భారీదైనా తనలోకి లాక్కునేంత శక్తి ఉంది.. ఒక్క బ్లాక్‌హోల్(కృష్ణ బిలం)కే. స్పేస్‌టైమ్ ప్రాంతంగా పేరున్న బ్లాక్ హోల్ నుంచి.. ఏ కణమూ, చివరికి కాంతి లాంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏవీ తప్పించుకోలేవు. అలాంటిది భూమి లాంటి పరిమాణంలో ఉన్నవాటిని.. ఒక సెకనులో మింగేసేంత శక్తి ఉంటే.. ?.. ఈ భూమిని సెకనులోనే మింగేసేంత భా...రీ బ్లాక్‌హోల్‌ను గుర్తించారు ఖగోళ శాస్త్రవేత్తలు. పైగా సుమారు 900 కోట్ల సంవత్సరాల వయసున్నదిగా భావిస్తున్న ఆ బ్లాక్‌హోల్ సైజు కూడా జెట్ స్పీడ్‌తో పెరుగుతోంది. అది ఎంతలా అంటే.. సెకనులోనే భూమి సైజు ఉన్నంత పరిణామాన్ని అమాంతం మిగేసేంతగా.. అలాగని బ్లాక్ హోల్స్‌తో ఈ భూమికి వచ్చే ప్రమాదం ఏదీ లేదు!. ► స్కై మ్యాపర్ అనే టెలిస్కోప్ ద్వారా.. ఒకదాని వెంట మరొకటి జంటగా తిరిగే ‘బైనరీ స్టార్స్’ను గుర్తించే ప్రయత్నంలో.. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ భారీ బ్లాక్ హోల్‌ను కనిపెట్టారు. ► పాలపుంత కన్నా.. 500 రెట్లు భారీగా ఉందని చెప్తున్నారు. మొత్తం పాలపుంత నుంచి వెలువడే కాంతి కంటే.. ఏడువేల రెట్ల కాంతివంతంగా ఈ బ్లాక్ హోల్ ఉందంట. భారీ పరిణామం, ఊహించనిదని వర్ణించారు డాక్టర్ క్రిస్టోఫర్ ఆన్కెన్. ► శక్తివంతంగా.. ప్రకాశవంతంగా కనిపించిన ఈ బ్లాక్ హోల్ సైజు పెరగడానికి కారణం ఏంటన్న దానిపై నిర్ధారణకు రాలేకపోయారు. కాకపోతే.. రెండు భారీ పాలపుంతలు ఒకదాన్నొక్కటి ఢీకొడితే.. వెలువడ్డ మెటీరియల్ ఈ బ్లాక్‌హోల్‌లోకి ప్రవేశించి సైజును పెంచుతూ పోతుందని భావిస్తున్నారు. ► యాభై ఏళ్లకొకసారి ఈ తరహా వింతలు కనిపించినప్పటికీ.. ఇన్నేళ్లలో ఇంత ప్రకాశవంతమైన భారీ బ్లాక్‌హోల్‌ను గుర్తించడం ఇదే మొదటిసారని చెప్తున్నారు. ► మూడు బిలియన్ల సూర్యులు కలిస్తే ఎంత సైజు ఉంటుందో ఈ బ్లాక్ హోల్ సైజు అంతగా ఉందట!. పైగా పోను పోను మరింత భారీ సైజులో పెరుగుతూ పోతుందట. ఆర్ఎక్స్ఐవీ డేటాబేస్‌లో ఈ పరిశోధనను పొందుపరచగా.. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఈ కథనం పబ్లిష్ చేశారు. ► 14.5 విజువల్ మాగ్నిట్యూడ్ ఉన్న టెలిస్కోప్‌తో ఈ భారీ బ్లాక్ హోల్‌ను ఎవరైనా చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చదవండి: అంతరిక్షం నుంచి మిస్టరీ రేడియో సిగ్నల్స్.. ఇది రెండోసారి -
Nasa: అద్భుతం.. మహాద్భుతం
వాషింగ్టన్: నాసాకు చెందిన హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్.. గత ముప్పై ఏళ్ల కాలంలో కొన్ని మిలియన్ల ఫొటోలు తీసింది. కానీ, తాజాగా తీసిన ఓ ఫొటో మాత్రం మహాద్భుతమనే ప్రశంసను దక్కించుకుంటోంది. గుండ్రని వలయాలు, గులాబీ రంగులో నక్షత్రాలు, నీలి రంగు నక్షత్ర సమూహాలు.. వెరసి ఎం51 పాలపుంత ఫొటోల్ని పక్కాగా తీసి పంపింది హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్. Round and round we go… Let yourself be whisked away by the Whirlpool Galaxy’s curving arms, pink star-forming regions, and brilliant blue strands of star clusters. Explore #GalaxiesGalore with @NASAHubble on @Tumblr: https://t.co/F2kzCVAYBt pic.twitter.com/zVUKShxrEB — NASA (@NASA) May 22, 2022 అంతరిక్షంలో గెలాక్సీ ఎం51(దీనికి వర్ల్‌పూల్ గెలాక్సీ) అనే పేరు కూడా ఉంది. సర్వేల కోసం ఏర్పాటు చేసిన హబ్బుల్ అడ్వాన్స్డ్ కెమెరా ఈ ఫొటోల్ని క్లిక్‌మనిపించింది. గంభీరమైన స్పైరల్ గెలాక్సీ M51 వెడల్పాటి చేతులు.. నిజానికి నక్షత్రాల పొడవైన లేన్లు, ధూళితో నిండిన వాయువు. గ్రాండ్-డిజైన్ స్పైరల్ గెలాక్సీలు" అని పిలవబడే ముఖ్య లక్షణం అని పేర్కొంది. M51.. భూమి నుండి 31 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కేన్స్ వెనాటిసి నక్షత్రరాశిలో ఉంది. -
శామ్సంగ్ ఎస్22కు రికార్డు స్థాయి ప్రీ బుకింగ్‌లు
న్యూఢిల్లీ: గెలాక్సీ ఎస్–22 సిరీస్ ఫోన్లకు రికార్డు స్థాయిలో ప్రీబుకింగ్‌లు వస్తున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన అగ్రగామి ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ ప్రకటించింది. పరిశ్రమతో పోలిస్తే అధిక వృద్ధిని నమోదు చేస్తామని, ప్రీమియం విభాగంలో జూన్ నాటికి మార్కెట్ లీడర్‌గా అవతరిస్తామని తెలిపింది. శామ్సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజు ఆంథోనీ పుల్లన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎస్ సిరీస్ ఫోన్లకు 20 లక్షల మంది కస్టమర్లు యాక్టివ్ యూజర్లుగా ఉన్నారు. ఆవిష్కరించిన మొదటి 72 గంటల్లోనే ఎస్–22 సిరీస్ ఫోన్లకు 1,00,000కు పైగా ప్రీ బుకింగ్‌లు వచ్చాయి. ఇప్పటికే 1,40,000 బుకింగ్‌లు దాటిపోయాయి. మార్చి 10న ప్రీబుకింగ్ ముగుస్తుంది’’ అని పుల్లన్ తెలిపారు. శామ్సంగ్ గెలాక్సీ ఎస్–22 సిరీస్ ఫోన్ ఆరంభ ధర రూ.72,999 కాగా, గరిష్ట ధర రూ.1,18,999. -
విశ్వంలోకెల్లా అతి పే...ద్ద గెలాక్సీ
ఆమ్స్టర్డామ్: విశ్వంలోకెల్లా అతి పెద్ద గెలాక్సీని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. ఇది ఏకంగా 1.63 కోట్ల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉందట! మన పాలపుంత కంటే 153 రెట్లు, సూర్యుని కంటే 24,000 కోట్ల రెట్లు పెద్దదట. ఈ భారీ రేడియో గెలాక్సీకి అల్సియోనెస్ అని పేరు పెట్టారు. ఇది భూమి నుంచి 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని దీన్ని కనిపెట్టిన నెదర్లాండ్స్‌లోని లైడెన్ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని మధ్యలో కేంద్రకం వద్ద చురుకైన ఓ భారీ కృష్ణబిలం కూడా ఉందని వారంటున్నారు. దాని సమీపం నుంచి భారీ ద్రవ్యరాశితో కూడిన పలు ఖగోళ పదార్థాలు ఎగజిమ్ముతున్నాయట. ఇలాంటి అజ్ఞాత రేడియో గెలాక్సీల గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. కృష్ణబిలం తన చుట్టూ ఉన్న పదార్థాలన్నింటినీ తనలోకి లాగేసుకుంటూ ఉంటే అది చురుగ్గా ఉందని అర్థం. అలా దానిలోకి వెళ్లే వాటిలో అతి తక్కువ పదార్థాలు బిలం తాలూకు బయటి పొర గుండా దాని ధ్రువాల వైపు శరవేగంతో విసిరివేతకు గురవుతాయి. అక్కణ్నుంచి భారీ పేలుడుతో అంతరిక్షంలోకి దూసుకుపోయి అయనీకరణం చెందిన ప్లాస్మాగా రూపొందుతాయి. తర్వాత ఇవి కాంతివేగంతో సుదూరాలకు ప్రయాణిస్తూ చివరికి రేడియో ధారి్మకతను వెలువరించే భారీ అంతరిక్ష దృగి్వషయాలుగా మిగిలిపోతాయి. ఇలాంటి రేడియో ధారి్మక పదార్థాలు మన పాలపుంతలోనూ లేకపోలేదు. కానీ అల్సియోనెస్ వంటి భారీ గెలాక్సీల్లో అవి అంతంత సైజులకు ఎలా పెరుగుతాయన్నది ఇప్పటిదాకా మనకు అంతుపట్టని విషయం. ఈ విషయంలో ఇప్పటిదాకా ఉన్న పలు సందేహాలకు అల్సియోనెస్ రూపంలో సమాధానాలు దొరుకుతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇంత భారీ గెలాక్సీలు ఎలా పుట్టుకొస్తాయన్న ప్రశ్నలకు కూడా అల్సియోనెస్పై జరిగే పరిశోధనల్లో సమాధానాలు దొరకొచ్చని అబ్జర్వేటరీకి చెందిన మారి్టజిన్ ఒయ్ అన్నారు. యూరప్‌లో ఏర్పాటు చేసిన లో ఫ్రీక్వెన్సీ అర్రే (లోఫర్) డేటాను విశ్లేషించే క్రమంలో ఓయ్, ఆయన బృందం యాదృచి్ఛకంగా ఈ భారీ గెలాక్సీని కనిపెట్టింది. -
భారీ ఖగోళ వింత: గుర్తించింది మనవాళ్లే!
విశ్వ పరిశోధనల్లో ఇప్పటిదాకా కనివిని ఎరుగని ఖగోళ వింతకు స్థానం దక్కింది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ కృష్ణ బిలాలు(బ్లాక్‌హోల్స్) ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. మరో విశేషం ఏంటంటే.. భారత్‌కు చెందిన ముగ్గురు ఖగోళ పరిశోధకులు ఈ వింతను ఆవిష్కరించడం. పాలపుంతలో తాజాగా ఈ మూడు బ్లాక్ హోల్స్‌ను గుర్తించారు. ముందుగా జంట బిలాల గమనాన్ని పరిశీలించిన పరిశోధకులు.. మూడో దానితో వాటి విలీనానికి సంబంధించిన పరిశోధనను ‘ఆస్రోనమీ’ జర్నల్‌లో పబ్లిష్ చేశారు. ‘‘మూడో పాలపుంత(గెలాక్సీ) ఉందనే విషయాన్ని మేం నిర్ధారించాం. ఎన్జీసీ7733ఎన్.. అనేది ఎన్జీసీ7734 గ్రూప్‌లో ఒక భాగం. ఉత్తర భాగం కిందుగా ఇవి ఒకదానిని ఒకటి ఆవరించి ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. గెలాక్సీ జంట.. ఎన్జీసీ7733ఎన్-ఎన్జీసీ7734లోని పాలపుంతలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. సాధారణంగా కృష్ణబిలాల కలయిక తీవ్రమైన ఒత్తిడి.. శక్తిని కలగజేస్తుంది. అయితే వాటి విలీనం ఒకదానితో ఒకటి కాకుండా.. పక్కనే ఉన్న మూడో భారీ బ్లాక్‌హోల్‌లోకి విలీనం కావడం ద్వారా ఆ ఎనర్జీ అంతగా ప్రభావం చూపలేకపోయిందని తెలిపారు. Indian researchers have discovered three supermassive black holes from three galaxies merging together to form a triple active galactic nucleus, a compact region at the center of a newly discovered galaxy that has a much-higher-than-normal luminosity.https://t.co/y8BDohOTg5 pic.twitter.com/1dxjJudPX1 — PIB India (@PIB_India) August 27, 2021 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్రో్టఫిజిక్స్‌కు చెందిన జ్యోతి యాదవ్, మౌసుమి దాస్, సుధాన్షు బార్వే.. ఆస్రో్టసాట్ అబ్జర్వేటరీ ద్వారా అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సాయంతో వీటిని వీకక్షించగలిగారు. ఈ అధ్యయనం కోసం సౌతాఫ్రికా ఐఆర్ఎస్ఎఫ్, చిలీ వీఎల్టీ, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఎంయూఎస్‌ఈ టెక్నాలజీల సాయం తీసుకున్నారు. అంతేకాదు కృష్ణ బిలాల విలీనానికి సంబంధించిన ప్రకాశవంతమైన యూవీ-హెచ్ ఆల్ఫా ఇమేజ్‌లను సైతం రిలీజ్ చేశారు. -
మస్తు ఫీచర్లతో మడత ఫోన్లు..ఇరగదీస్తున్నాయిగా
సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ దూకుడు పెంచింది. అదిరిపోయే ఫీచర్లతో కాంపీటీటర్ల ఫోన్లకు పోటీగా మడత (ఫోల్డబుల్ ) ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భారత్ మినహాయించి వరల్డ్ వైడ్ గా ఆగస్ట్ 11న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 మడత (ఫోల్డబుల్ ) ఫోన్లతో పాటు గెలాక్సీ బడ్స్ 2, గెలాక్సీ వాచ్ 4 సిరీస్‌లను విడుదల చేయగా.. ఈ ఫోల్డబుల్ ఫోన్లను ఇండియాలో ఆగస్ట్ 20న బాలీవుడ్ హీరోయిన్ ఆలియా బట్ చేతులు మీదిగా మార్కెట్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఫీచర్స్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఫోన్ బుక్ టైప్ లో ఉంటుంది. అంటే మీరు ఈ ఫోన్ టాబ్లా లేదంటే ఫోన్లా యూజ్ చేసుకోవచ్చు.ఆపరేట్ చేసేందుకు ఎస్ పెన్ స్టైలస్ ఫోన్ తో పాటు వస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ లోని ఫీచర్లు ఇతర స్మార్ట్ ఫోన్ల కంటే భిన్నంగా ఉన్నాయి. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, ఎఫ్ 1/8 వైడ్ యాంగిల్ లెన్స్ తో 12 మెగాఫిక్సెల్ ప్రైమరీ షూటర్, 12 మెగాఫిక్సెల్ ఆల్ట్రావైడ్, 12 మెగా ఫిక్సెల్ టెలీ ఫోటో షూటర్స్ సదుపాయం ఉంది. హై క్వాలిటీ వీడియోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజటిన్ ఫీచర్స్ తో పాటు ఫ్రంట్ ఎండ్ 10 మెగా ఫిక్సెల్ షూటర్, వెనుక భాగంలో 4 మెగా పిక్సెల్ కెమెరాలతో అట్రాక్ట్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ లో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.1,33,600 గా ఉండగా.. భారత్ లో మాత్రం ఆ ఫోన్ల ధరల్లో మార్పులుండొచ్చు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫీచర్స్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 రేర్ కెమెరా సెటప్,12మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్, ఫ్రంట్ ఎండ్ లో ఎఫ్/2.4 లెన్స్ తో 10 మెగాపిక్సెల్‌తో అందుబాటులోకి రానుండగా. ఈ ఫోన్ కి ఎస్ పెన్ స్టైలస్ ను వినియోగించలేము. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 యూఎస్ మార్కెట్ లో రూ.74వేలు ఉండగా.. ఆగస్ట్ 20 న విడుదలయ్యే ఈ ఫోన్ ఖరీదు ఇండియాలో ఎంతుండొచ్చనేది తెలియాల్సి ఉంది. -
ఖగోళ అద్భుతం: బ్లాక్ హోల్ వెనుక ఫస్ట్ టైం వెలుగులు
Astronomers Detect Light Behind Black Hole: విశ్వంలో మనిషి మేధస్సుకు అంతుచిక్కని రహస్యాలెన్నో. వాటిలో బ్లాక్ హోల్ ఒక సంక్లిష్టమైన సబ్జెక్ట్. అదృశ్య ప్రాంతాలుగా కంటికి కనిపించకుండా.. ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకునే కేంద్రాలివి. అయితే కృష్ణ బిలాల వెనుక ఉన్న ఓ విషయాన్ని తొలిసారి ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించగా, ఐన్‌స్టీన్ అంచనా ఆయన మేధోసంపత్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. భూమికి 100 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కృష్ణ బిలం(ఐ జ్విక్కీ 1) వెనకాల కాంతి ప్రతిధ్వనుల్ని(తేలికపాటి) గుర్తించారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ(అమెరికా) పరిశోధకులు. మెరుపుల్లా మొదలై అటుపై రంగు రంగుల్లోకి మారిపోయాయి ఆ ఎక్స్‌రే కాంతులు. సాధారణంగా బ్లాక్ హోల్లోకి వెళ్లిన కాంతి ఏదీ బయటకు పరావర్తనం చెందదు. దీంతో ఆ వెనకాల ఏముంటుందో అనేది ఇప్పటిదాకా ఖగోళ శాస్రజ్ఞులు నిర్ధారించుకోలేకపోయారు. అయితే ఈ బిలం చుట్టేసినట్లు ఉండడం, కాంతి వంగి ప్రయాణించడం, అయస్కాంత క్షేత్రాలు మెలిదిరిగి ఉండడం వల్లే ఈ కాంతి ప్రతిధ్వనులను రికార్డు చేయగలిగామని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రో ఫిజిస్ట్ డాన్ విల్కిన్స్ వెల్లడించారు. ఐన్‌స్టీన్ ఏనాడో చెప్పాడు జర్మన్ మేధావి, థియోరెటికల్ ఫిజిసిస్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ విషయాన్ని ఏనాడో గుర్తించాడు. కృష్ణ బిలం వెనకాల కాంతి కిరణాల పరావర్తనాలు సాధ్యమని, అంతరిక్షంలో భారీవేవైనా సరే వక్రీకరణ చెందక తప్పవని ‘జనరల్ రియాల్టివిటీ’ పేరుతో ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ టైంలో ఆ థియరీని ఎవరూ పట్టించుకోలేదు. అయితే తాజా పరిశోధనల గుర్తింపుతో ఆయన మేధస్సును నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా సాధారణ టెలిస్కోప్‌ల ద్వారా గుర్తించడం విశేషం. నేచర్ జర్నల్‌లో బుధవారం ఈ మేరకు ఈ ఖగోళ అద్భుతంపై కథనం పబ్లిష్ అయ్యింది. -
అంతరిక్షంలోకి పయనమైన తొలి తెలుగు మహిళ
-
కష్టమర్లకు శామ్సంగ్ షాక్ ! పెరిగిన ధరలు
శామ్సంగ్ మొబైల్ ఫోన్ల ధరలు పెరిగాయి. ఇటీవల శామ్సంగ్ మార్కెట్లోకి తెచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ఓ2, శామ్సంగ్ గెలాక్సీ ఎంఓ2, శామ్సంగ్ గెలాక్సీ12 ధరలు పెరిగాయి. ఈ మెడల్స్ అన్నీ ఈ ఏడాదిలోనే శామ్సంగ్ రిలీజ్ చేసింది. చిప్సెట్ ఎఫెక్ట్ గ్లోబల్ మార్కెట్లో చిప్సెట్ల ధరలు పెరిగాయి. దాంతో వరుసగా ఒక్కో కంపెనీ తమ మొబైల్ హ్యాండ్సెట్ల ధరలను పెంచుతూ పోతున్నాయి. గత వారం షావోమి నోట్ 10 సిరీస్‌లో మొబైల్ ఫోన్ల ధరలు పెంచింది. తాజాగా శామ్సంగ్ కూడా ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. రూ.500 పెంపు శామ్సంగ్ ఎఫ్ఓ2 మోడల్‌పై రూ. 500 పెరిగింది. 3జీబీ 32 జీబీ స్టోరేజీ, 4 జీబీ 64 జీబీ వేరియంట్లలో ఈ మోడల్ లభిస్తోంది. ఈ ఫోన్ లాంఛ్ చేసినప్పుడు 3 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ. 8,999 ఉండగా ప్రస్తుతం రూ. 9,499గా ఉంది. 4 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ. 9,999 నుంచి రూ. 10,499కి చేరుకుంది. శామ్సంగ్ ఎఓ2ఎస్, శామ్సంగ్ ఏ 12ల మోడల్స్‌లో కూడా అన్ని వేరియంట్లపై రూ. 500 వరకు ధర పెరిగింది. అయితే ధరల పెంపుపై శామ్సంగ్ ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. కానీ వెబ్సైట్లో మాత్రం పెంచిన ధరలతోనే ఫోన్ అందుబాటులో ఉంచింది. -
శాంసంగ్ నుంచి మరో మాన్స్టర్ మొబైల్!
శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ, లాంగ్‌లాస్టింగ్ బ్యాటరీతో నడిచే మొబైల్ రిలీజ్ చేసింది. గెలాక్సీ ఎమ్12ను కంపెనీ ఈ రోజు భారత్‌లో మధ్యాహ్నం 12 గంటలకు యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా లాంచ్ చేశారు . ప్రారంభంలో గెలాక్సీ ఎమ్ సిరీస్ మొబైల్‌ను వియత్నాంలో లాంచ్ చేయగా, ఈ మొబైల్ గెలాక్సీ ఎమ్ 11 తదనంతర మొబైల్గా నిలుస్తోంది. భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం12 6జీబీ+128జీబీ ధర 13,499, 4 జీబీ+64 జీబీ ధర 10,999 గా నిర్ణయించారు.ఈ మొబైల్‌ను గత నెలలో వియత్నాంలో బ్లాక్, బ్లూ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లతో రిలీజ్ చేశారు. గెలాక్సీ ఎమ్12ను అమెజాన్ సేల్ చేయనుంది. గెలాక్సీ ఎమ్12 ఫీచర్స్.. గెలాక్సీ ఎమ్12 నాలుగు రియర్ కెమెరాలు, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 6.5-అంగుళాల హెచ్డి + (720x1,600 పిక్సెల్స్) టిఎఫ్టి వాటర్ డ్రాప్-స్టైల్ ఇన్ఫినిటీ-వి డిస్ప్లే నాచ్‌తో రానుంది. ఎమ్12 లో 6,000 ఎమ్ఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు.3జీబీ, 4 జీబీ ,6 జీబీ ర్యామ్ ను కలిగి ఉండగా, 32జీబీ, 64జీబీ, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రానుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ సెన్సార్, డ్యూయల్ సిమ్ (నానో) శామ్సంగ్ గెలాక్సీ ఎమ్12 ఆండ్రాయిడ్ వన్ యుఐ కోర్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ 8 ఎంఎం ఎక్సినోస్ ప్రాసెసర్‌ను అమర్చారు. బ్లాక్, బ్లూ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ లో లభిస్తాయి. -
బిగ్ బ్యాటరీతో విడుదలైన గెలాక్సీ ఎఫ్ 62
గత ఏడాది అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన ఎఫ్-సిరీస్ గెలాక్సీ ఎఫ్41కు కొనసాగింపుగా శామ్సంగ్ కంపెనీ మరో సరికొత్త మోడల్ గెలాక్సీ ఎఫ్ 62ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిలో ప్రధానంగా భారీ సామర్ధ్యం గల 7,000ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. ఇప్పటికే 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో శామ్సంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే. మిడ్ రేంజ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62లో ఎక్సినోస్ 9825 ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ప్రత్యేకతలున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 సేల్ ఫిబ్రవరి 22న ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్ కి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనేవారికి రూ.2,500 డిస్కౌంట్ లభిస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 స్పెసిఫికేషన్స్: డిస్ప్లే: 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్డీ ప్లస్ బ్యాటరీ: 7,000ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 25వాట్ ర్యామ్: 6జీబీ, 8జీబీ స్టోరేజ్: 128జీబీ ప్రాసెసర్: ఎక్సినోస్ 9825 బ్యాక్ కెమెరా: 64 ఎంపీ + 12 ఎంపీ + 5 ఎంపీ + 5 ఎంపీ సెల్ఫీ కెమెరా: 32 మెగాపిక్సెల్ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కలర్స్: లేజర్ బ్లూ, లేజర్ గ్రీన్, లేజర్ గ్రే కలర్ ధర: 6జీబీ+128జీబీ - రూ.23,999 8జీబీ+128జీబీ - రూ.25,999 చదవండి: అదిరిపోయిన ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్ గూగుల్ మ్యాప్స్‌కు దీటుగా ఇస్రో మ్యాప్స్ -
శామ్సంగ్ డేస్ సేల్.. భారీ తగ్గింపు!
వాలెంటైన్స్ డే సందర్బంగా శామ్సంగ్ డేస్ సేల్ పేరుతో కొత్త సేల్‌ని తీసుకొనివచ్చింది. ఈ సేల్ లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. శామ్సంగ్ డేస్ సేల్ ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. శామ్సంగ్ డేస్ సేల్‌లో కొన్ని స్మార్ట్ఫోన్లు శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ ఎ71, గెలాక్సీ ఎం31, గెలాక్సీ ఎఫ్41 ఉన్నాయి. అలాగే టాబ్లెట్లలో గెలాక్సీ టాబ్ ఎస్7+, గెలాక్సీ టాబ్ ఎ7 వంటివి ఉన్నాయి. ఈ ఆఫర్లు శామ్సంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్, సెలెక్ట్ ఇ-కామర్స్ పోర్టల్స్, ప్రముఖ రిటైల్ అవుట్లెట్లలో లభిస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా గెలాక్సీ టాబ్లను కొనుగోలు చేస్తే వినియోగదారులు పదివేల వరకు డిస్కౌంట్ లభించనుంది. చదవండి: ఆన్లైన్లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఫస్ట్ సేల్ -
గెలాక్సీ ఎఫ్62 లాంచ్ తేదీ వచ్చేసింది!
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫిబ్రవరి 15న మధ్యాహ్నం 12 గంటలకు(మధ్యాహ్నం) భారతదేశంలో విడుదల కానుంది. దీనికి సంబందించిన ఒక ప్రత్యేక పేజీని ఫ్లిప్‌కార్ట్ సృష్టించింది. ఈ ఫోన్ 7నానో మీటర్ మీద నిర్మించిన ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. గెలాక్సీ ఎఫ్ 62 మొబైల్ ముందు, వెనుక భాగాలు ఎలా ఉండనున్నాయో ఫ్లిప్‌కార్ట్ టీజర్ పేజీలో చూపించింది. శామ్సంగ్ షేర్ చేసిన ప్రకారం ఈ ఫోన్ ధర రూ.20వేల నుంచి రూ.25వేల మధ్య ఉండనుంది. దీని గీక్ బెంచ్ స్కోర్ 2,400గా ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫీచర్స్: డిస్ప్లే: 6.7 అంగుళాలు బ్యాటరీ: 7000ఎంఏహెచ్ ర్యామ్: 6జీబీ స్టోరేజ్: 128జీబీ ప్రాసెసర్: శామ్సంగ్ ఎక్సినోస్ 9 ఆక్టా 9825 బ్యాక్ కెమెరా: 64ఎంపీ+ 8ఎంపీ+ 5ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ చదవండి: లీకైన వన్‌ప్లస్ 9ప్రో ఫోటోలు -
శాంసంగ్ గెలాక్సీ ఫోన్ : బడ్జెట్ ధరలో
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ తయారీదారు శాంసంగ్ బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. గెలాక్సీ ఎంఓ2 పేరుతో దీన్ని భారత మార్కట్లో లాంచ్ చేసింది. శాంసంగ్ ఎం స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ రియర్ కెమెరా, బిగ్ బ్యాటరీ, బడ్జెట్ ధర ప్రత్యేకతలుగా ఉన్నాయి. ఫిబ్రవరి 9 నుంచి అమెజాన్, శాంసంగ్ వెబ్సైట్లలో అందుబాటులో ఉండనుంది. 2 జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ధర రూ.6,999 గా ఉంచింది. అయితే పరిచయ ధరగా 6799 రూపాయలకు అందించనుంది. బ్లాక్, బ్లూ, గ్రే, రెడ్ కలర్లలో లభ్యం. దీంతోపాటు 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కూడా ప్రకటించగా, ధర మాత్రం ఇంకా రివీల్ కాలేదు. (ఎస్బీఐ : యోనో బంపర్ ఆఫర్లు) గెలాక్సీ ఎంఓ2 ఫీచర్లు 6.50 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ 13+2 మెగా పిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000ఎంఏహెచ్ బ్యాటరీ -
గెలాక్సీ ఎస్ 21 లాంచ్ డేట్ వచ్చేసింది!
గతంలో మనం చెప్పుకున్నట్లే గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ను జనవరి 14న తీసుకొస్తున్నట్లు శామ్సంగ్ అధికారికంగా ప్రకటించింది. కంపెనీ కొత్త గెలాక్సీ ఆన్ ప్యాక్డ్ 2021 ఈవెంట్ పేరుతో విడుదల తేదీని ప్రకటించింది. “వెల్కమ్ టు ది ఎవ్రీడే ఎపిక్” పేరుతో ప్రసారమయ్యే వర్చువల్ ఈవెంట్ లో ఇండియా కాలమాన ప్రకారం జనవరి 14 రాత్రి 8 గంటలకు గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ను విడుదల చేయనుంది. తాజా గెలాక్సీ ఫ్లాగ్షిప్ ఫోన్లలో గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్, గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా ఉన్నాయి.(చదవండి: ఆన్లైన్ లో హలచల్ చేస్తున్న గెలాక్సీ ఎస్ 21 ఫీచర్స్) ఇప్పటికే గెలాక్సీ ఎస్ 21 ఫోన్ల ఫీచర్స్ కి సంబందించిన కొన్ని లీక్స్ బయటకి వచ్చాయి. ఈ లీక్స్ ప్రకారం, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 6.2-అంగుళాల డైనమిక్ అమోలేడ్ 2 ఎక్స్ డిస్ప్లేతో వస్తుంది. ప్లస్ మోడల్ 6.7-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. రెండు మోడళ్లలో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్ డి ప్లస్ ప్యానెల్లు ఉంటాయి. ఈ మొబైల్ స్క్రీన్లు హెచ్ డిఆర్ 10 ప్లస్ కి సపోర్ట్ చేస్తాయి. ఈ మొబైల్స్ లో తాజా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, అండర్ స్క్రీన్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను తీసుకురావచ్చు. ఈ ఫోన్లలో శామ్సంగ్ కొత్త ఎక్సినోస్ ప్రాసెసర్‌తో పాటు 8జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఫోన్లలో మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉందా లేదా అనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. -
5వేలకే గెలాక్సీ ఎస్ 20 మొబైల్స్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను అద్దెకు ఇచ్చే విధానాన్ని ప్రారంభించింది. శామ్సంగ్ గ్రోవర్తో కలిసి జర్మనీలో స్మార్ట్‌ఫోన్ అద్దె కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. గెలాక్సీ ఎస్ 20 మొబైల్ ను 1,3,6,12 నెలల కాలానికి అద్దెకు ఇవ్వడానికి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు ఎంచుకున్న కాలాన్ని బట్టి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ ఫోన్‌ను ఎంచుకుంటే, మీరు ఒక నెల కాలానికి 59.90 యూరోలు(సుమారు రూ.5,300) చెల్లించాల్సి ఉంటుంది. మీరు మూడు నెలల అద్దెను ఎంచుకుంటే నెలకు 49.90 యూరోలు(సుమారు రూ.4,400) చెల్లించాలి. అదే ఆరు నెలల కాలానికి అద్దెను ఎంచుకుంటే నెలకు 39.90 యూరోలు(సుమారు రూ.3,500), సంవత్సరం పాటు తీసుకుంటే నెలకు 29.90 యూరోలు(సుమారు రూ.2,600) చెల్లించాలి.(చదవండి: అదృష్ట్టం అంటే ఇదేనేమో) అదేవిదంగా గెలాక్సీ ఎస్ 20 అద్దె ధర నెలకి 99.90 యూరోలు, 3 నెలల కాలానికి నెలకి 69.90 యూరోలు, 6 నెలల కాలానికి నెలకి 59.90 యూరోలు, ఏడాది కాలానికి నెలకి 49.90 యూరోలు. గెలాక్సీ ఎస్ 20 + మీకు నెలకి 109.90 యూరోల నుండి 54.90 యూరోల వరకు లభించనుంది. అన్నిటి కంటే టాప్ ఎండ్ మోడల్ అయిన గెలాక్సీ ఎస్20 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ను తీసుకుంటే దాని నెలవారీ అద్దె 119.90 యూరోల(సుమారు రూ.10,800) నుంచి 69.90 యూరోలు(సుమారు రూ.6,200) మధ్య ఉండనుంది. భవిష్యత్ లో మరిన్ని మోడళ్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు శామ్సంగ్ పేర్కొంది. ఈ అద్దె సేవలు అనేవి ప్రస్తుతం జర్మనీకి మాత్రమే పరిమితం చేయబడి ఉన్నాయి. ఉత్పత్తులను కొనాలనుకునే వినియోగదారుల కంటే ఉపయోగించాలి అనుకునే వినియోగదారులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. -
భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎం51
సాక్షి, ముంబై: శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల లాంచింగ్ లో దూకుడు మీద ఉంది. తాజాగా గెలాక్సీ ఎం సిరీస్ లో భారీ బ్యాటరీ సామర్ధ్యంతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎం51ను భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర, లభ్యత, ఆఫర్ 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర 24,999 రూపాయలు 8 జీబీ ర్యామ్ వేరియంట్ 26,999 రూపాయలు సెప్టెంబర్ 18 న మధ్యాహ్నం 12 గంటల నుండి (మధ్యాహ్నం) అమెజాన్, శాంసంగ్.కామ్ , ఇతర రిటైల్ దుకాణాలలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 18-20 మధ్య అమెజాన్ ద్వారా ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 2,000 తగ్గింపు ఆఫర్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం51 ఫీచర్లు 6.7అంగుళాల పూర్తి-హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 జీ సాక్ ఆండ్రాయిడ్ 10 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ 6/ 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 64+12+5+5 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 32 మెగాపిక్సెల్ లెన్స్‌తో సెల్ఫీ కెమెరా 7000 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారీ బ్యాటరీ : గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్
సాక్షి,ముంబై: శాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. జర్మనీలో లాంచ్ అయిన ఈ మొబైల్ ను సెప్టెంబరు 10న భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. భారీ బ్యాటరీ, హోల్ పంచ్ డిస్ ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ ఇన్ ఫినిటీ-ఓ డిస్ ప్లే ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ధర సుమారు 31,500 రూపాయలుగా ఉండనుంది.. గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే క్వాల్కం స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టం 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ 128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64 +12 +5 5 మెగా పిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ Quick update people. We spotted Mo-B arriving in town for the Meanest Monster Face-off starting 6th Sep. We just hope he shows up and doesn’t get cold feet. It will be a matter of pride for the new #SamsungM51 to prove once and for all, why it’s called the #MeanestMonsterEver. pic.twitter.com/hFU619BVtf — Samsung India (@SamsungIndia) August 31, 2020 -
శాంసంగ్ 5జీ గెలాక్సీ; అంచనాలు
సాక్షి, ముంబై : చైనా బ్యాన్ డిమాండ్ నేపథ్యంలో దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ వేగం పెంచింది. త్వరలో గెలాక్సీ ఏ42 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసే యోచనలో ఉన్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గీక్ బెంచ్ అందించిన సమాచారం ప్రకారం.. 5జీ టెక్నాలజీతో, క్వాల్కం స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్ తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇప్పటికే సేఫ్టీ కొరియా సర్టిఫికేషన్ వెబ్ సైట్లోనూ, చైనా 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్లోనూ దర్శనమివ్వడం గమనార్హం. గెలాక్సీ ఏ41 స్మార్ట్ ఫోన్ కు తర్వాతి వెర్షన్ గా దీన్ని తీసుకురానుంది. అంతేకాదు శాంసంగ్ 5జీలో ఇదే తొలి బడ్జెట్ ఫోన్ కానుందనే వాదన కూడా వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ కావచ్చని భావిస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఏ42 ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. 6.1 అంగుళాల డిస్ ప్లే 1080 x 2400 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం క్వాల్కం స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్ 4, 6 జీబీ ర్యామ్ /128 జీబీ స్టోరేజ్ 48 ప్రధాన కెమెరాగా ట్రిపుల్ రియర్ కెమెరా 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ గెలాక్సీ ఫోన్ : ఊహించని ధర
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ దిగ్గజం శాంసంగ్ అతి తక్కువ ధరలో ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం01 కోర్ పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.. ఆండ్రాయిడ్ గో ప్లాట్‌ఫామ్ ఆధారితంగా తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.1 జీబీ ర్యామ్ /16 జీబీ స్టోరేజ్, 2 జీబీ, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో జూలై 29 నుంచి శాంసంగ్, ఇతర ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండన్నాయి. బ్లాక్, బ్లూ, రెడ్ మూడు రంగులలో ఇవి లభ్యం. (ఈజీ టు ఇన్స్టాల్ : శాంసంగ్ బిజినెస్ టీవీలు ) ధరలు 1జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ 5499 రూపాయలు. 2 జీబీ ర్యామ్/ 32 జీబీ స్టోరేజ్ 6499 రూపాయలు గెలాక్సీ ఎం01కోర్ ఫీచర్లు 5.3అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే మీడియాటెక్ ఎంటీ6739 ప్రాసెసర్ 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
సూపర్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. గెలాక్సీ ఎం31ఎస్ పేరుతో జూలై 30న మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో ఆవిష్కరించనున్నామని శాంసంగ్ ప్రకటించింది. గెలాక్సీ ఎం 31ఎస్ ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో లభించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకొచ్చిన ఎం 31 సిరీస్‌కు కొనసాగింపుగా దీన్ని అందుబాటులోకి తెస్తోంది. ఎల్-ఆకారపు డిజైన్‌లో అమర్చిన క్వాడ్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటివి. ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. ధర 20వేల రూపాయల లోపే ఉంటుందని అంచనా. శాంసంగ్ గెలాక్సీ ఎం31 ఎస్ఫీచర్లు 6.4 అంగుళాల ఫుల్హెచ్డీ ఇన్ఫినిటీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇన్-హౌస్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్ 6జీబీర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 64 +8+5 +5 మెగాపిక్సెల్ క్వాడ్రియర్కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ -
గెలాక్సీ నోట్ 20 అల్ట్రా: ఆసక్తికర లీక్
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ 20 అల్ట్రాకు సంబంధించి అనేక రూమర్లు, ఆసక్తికర మైన అంశాలు ఇప్పటికే మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా 108 మెగాపిక్సెల్ భారీ కెమెరాతో, 5జీ టెక్నాలజీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుందని తాజా లీక్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ఆగస్టు 5న ఆవిష్కరించనుందని సమాచారం. గెలాక్సీ ఎస్ 20 అల్ట్రాలో108 మెగాపిక్సెల్ కెమెరా ఖాయం అంటూ ప్రముఖ టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ ట్వీట్ చేశారు. 108 మెగాపిక్సెల్ కెమెరాతోపాటు 6.9 అంగుళాల భారీ స్క్రీన్ తో గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా ను తీసుకు రానుందని అంచనా. అలాగే ఎస్-పెన్ స్థానాన్ని మార్చనుందని భావిస్తున్నారు. అయితే, ప్లస్ మోడల్ ను కూడా లాంచ్ చేయనుందా, లేదంటే రెగ్యులర్ నోట్ 20, అల్ట్రా తీసుకొస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. (గెలాక్సీ నోట్ 10 లైట్ ధర తగ్గింది : క్యాష్‌బ్యాక్ కూడా) Samsung Galaxy Note 20 "Ultra" ("Canvas2") has a 108MP main cam. I know we knew, but I've seen hard evidence now, so consider it confirmed from my end. — Roland Quandt (@rquandt) June 25, 2020 -
గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది : క్యాష్‌బ్యాక్ కూడా
సాక్షి, ముంబై : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ తన గెలాక్సీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గించింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ధరపై నాలుగువేల రూపాయల శాశ్వత తగ్గింపుతో అందుబాటులో ఉంచింది. దీనికి అదనంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఆన్లైన్ సైట్లలో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని ముంబైలోని మహేష్ టెలికాంకు చెందిన మనీష్ ఖాత్రి ట్విటర్లో ధృవీకరించారు. (వాట్సాప్‌లో ఎర్రర్ : యూజర్లు గగ్గోలు) మొబైల్ ఫోన్లపై 12 శాతం నుంచి 18 శాతం జీఎస్టీ రేట్ల పెంపుతో దక్షిణ కొరియా దిగ్గజం గెలాక్సీ నోట్ 10లైట్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ మార్కెటో 4 వేల రూపాయల ధర తగ్గించడంతో పాటు, అదనపు ఆఫర్లను అందించడం విశేషం. సిటీబ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా గెలాక్సీ నోట్ 10 లైట్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 5000 క్యాష్‌బ్యాక్ లభ్యం. మిగిలిన ఆన్లైన్ చెల్లింపులపై 2000 రూపాయల క్యాష్ బ్యాక్ అందివ్వనుంది. (శాంసంగ్ కొత్త టీవీలు: ఫీచర్లు అదుర్స్) కొనుగోలుదారులు 9 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్, 2 నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వం కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లు జూన్ 30, 2020వరకు మాత్రమే చెల్లుతాయి. ఈ మోడల్స్ ధరలు ఇప్పటివరకు వరుసగా 41,999 రూపాయలు, 43,999 రూపాయలుగా ఉన్నాయి. జనవరిలో భారతదేశంలో లాంచ్ చేసినపుడు గెలాక్సీ నోట్ 10 లైట్ ప్రారంభ ధర 38999 రూపాయలు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ప్రస్తుత ధరలు 6 జీబీ వేరియంట్ ధర 37,999 రూపాయలు 8 జీబీ మోడల్ ధర 39,999 రూపాయలు గెలాక్సీ నోట్ 10 లైట్ స్పెసిఫికేషన్లు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9810 సాక్ 6జీబీ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 12+ 12+12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ21ఎస్ ను భారతదేశంలో లాంచ్ చేసింది. 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాగా క్వాడ్-కెమెరా రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ రికగ్నిషన్ లాంటివి ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. (శాంసంగ్ కొత్త టీవీలు: ఫీచర్లు అదుర్స్) గెలాక్సీ ఏ 21ఎస్ ఫీచర్లు 6.50 అంగుళాల డిస్ ప్లే ఆండ్రాయిడ్ 10 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 48+ 8+2+2 ఎంపీ క్వాడ్ కెమెరా 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 512జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ధరలు: 4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 16499 రూపాయలు 6 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 18499 రూపాయలు. బ్లాక్, బ్లూ , వైట్ కలర్ ఆప్షన్లలో ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్.కామ్, ఇతర ప్రధాన ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా ఈ రోజు (బుధవారం) నుండి లభ్యం. Show More -
శాంసంగ్ డేస్ సేల్ : ఆపర్లు
సాక్షి, ముంబై: మొబైల్ దిగ్గజం శాంసంగ్ మరోసారి ‘శాంసంగ్ డేస్’ సేల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మంగళవారం (జూన్ 9) నుంచి 12 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ముఖ్యంగా గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. అలాగే, శాంసంగ్ కేర్ ప్లస్, యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్లు కూడా లభ్యం. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా, ఎస్20ప్లస్, గెలాక్సీ ఎస్20, గెలాక్సీ నోట్ 10 లైట్, గెలాక్సీ నోట్ 10 ప్లస్, గెలాక్సీ ఎస్ 10 లైట్ వంటి వాటితోపాటు ఇతర స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తోంది. (శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్స్ వచ్చేశాయ్!) శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 సిరీస్ శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా, గెలాక్సీ ఎస్20ప్లస్, ఎస్ 20 కొనుగోళ్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలుపై రూ .4,000 క్యాష్‌బ్యాక్. 12 నెలల నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్. శాంసంగ్ కేర్ + ప్లాన్‌ను రూ .2,499 అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్ రూ .4,000 వరకు క్యాష్‌బ్యాక్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుల ద్వారా గెలాక్సీ ఎస్ 10 లైట్ (128 జీబీ) కొనుగోలుపై 12 నెలల నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్. గెలాక్సీ ఎస్ 10 లైట్ 512 జీబీ వేరియంట్ పై రూ .2,000 తక్షణ క్యాష్‌బ్యాక్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ తక్షణ క్యాష్‌బ్యాక్ రూ .2000. రూ .2,299 ల శాంసంగ్ కేర్ + ప్యాకేజీ అదనం Time to get a little closer to your favourite brand. Bringing to you, Samsung Days with no cost EMI and other great offers on all your favourite smartphones. Guess what? Get them delivered right at your doorstep. Happy Shopping! https://t.co/fpkWknMtpI#Samsung pic.twitter.com/KVsgZFdmjJ — Samsung India (@SamsungIndia) June 9, 2020 ఇవి కాకుండా, గెలాక్సీ ఏ 71, ఏ 51 ఇటీవల లాంచ్ చేసిన ఏ31 పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లనుపొందవచ్చు. దీంతోపాటు శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్లపైనా ఆఫర్లు ప్రకటించింది. శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌లపై 10 శాతం తక్షణ క్యాష్ బ్యాక్ లభించనుంది. (శాంసంగ్ గెలాక్సీ ఏ 31 లాంచ్) -
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త ట్యాబ్స్ ను లాంచ్ చేసింది. మెటల్ యూనీ-బాడీ డిజైన్‌తో ‘గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్’ పేరుతో దీన్ని భారత్‌లో సోమవారం ప్రవేశపెట్టింది. గత ఏప్రిల్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్‌ను విడుదల చేసిన వీటి ప్రారంభ ధర రూ. 27,999 గా ఉంచింది. శాంసంగ్.కామ్, అమెజాన్ ద్వారా ఈ రోజు (జూన్ 8) నుంచి 16వరకు ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంచింది. జూన్ 17వ తేదీనుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయి. గెలాక్సీ టాబ్ ఎస్ 6 లైట్ మూడు రంగులలో లభ్యం. ఇ-లెర్నింగ్, వర్క్ ఫ్రం హోం సాధారణమైన ప్రస్తుత సందర్భంలో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా గెలాక్సీ టాబ్ ఎస్ 6 లైట్ తీసుకొచ్చినట్టు శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ అన్నారు. ఎస్ 6 లైట్ లో జోడించిన ఎస్ పెన్‌తో విద్యార్థులు, మల్టీ టాస్కింగ్ వినియోగదారులకు ఉపయోగపడుతుందన్నారు. ఆఫర్లు ప్రీ-బుక్ చేసే కొనుగోలుదారులు గెలాక్సీ బడ్స్ + రూ .2999 కే కొనుగోలు చేయవచ్చు. లేదా రూ. 4,999 విలువ చేసే గెలాక్సీ టాబ్ ఎస్ 6 లైట్ బుక్ కవర్ ను .2,500 కు కొనుగోలు చేయడానికి అర్హులు. గెలాక్సీ టాబ్ ఎస్6 లైట్ ఫీచర్లు టాబ్ ఎస్ 6 లైట్ ఎస్ పెన్ సపోర్ట్, 10.4 అంగుళాల 2000x1200 ఎల్సిడి టచ్‌స్క్రీన్, ఎక్సినోస్ 9611 సాక్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్,7040 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా జోడించింది. ధరలు గెలాక్సీ టాబ్ ఎస్6 లైట్ రూ .31,999 వై-ఫై వెర్షన్ ధర రూ .27,999 -
శాంసంగ్ గెలాక్సీ ఏ 31 లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కట్లో లాంచ్ చేసింది. గెలాక్స్ ఏ30కి కొనసాగింపుగా శాంసంగ్ ఏ 31 ను గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పటికే గ్లోబల్ గా ప్రారంభించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ 31 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 21,999 గా ఉంచింది. ఈ రోజు (జూన్ 4 ) నుండే దేశంలో అమ్మకాలు మొదలు. శాంసంగ్ ఒపెరా హౌస్‌తో సహా ఆఫ్‌లైన్ రిటైలర్లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బెనో, అలాగే శాంసంగ్ ఇండియా ఈస్టోర్ ద్వారా అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ ఏ31 ఫీచర్లు 6.40 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే మీడియాటెక్ హెలియో పి 65ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 48+8+5+5 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
గెలాక్సీ ఎస్10 లైట్ కొత్త వేరియంట్
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్‌ఫోన్‌లో 512జీబీ వేరియంట్‌ను శుక్రవారం భారత మార్కెట్లో విడుదలచేసింది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలు (48 మెగాపిక్సెల్ స్టడీ ఓఐఎస్, 12ఎంపీ అల్ట్రా–వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సాన్స్) ఉండగా, సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను అమర్చింది. దీని ధర రూ. 44,999 కాగా, పాత వేరియంట్‌తో మార్పిడి ద్వారా రూ. 5000 వరకు బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించింది. మార్చి 1 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు ప్రారంభం. రీటేల్ స్టోర్లు, శాంసంగ్ ఒపెరా హౌజ్, శాంసంగ్ ఇ-షాప్‌తో పాటు అన్ని లీడింగ్ ఆన్లైన్ సేల్స్ వెబ్‌పోర్టల్స్‌లో లభించనున్నాయి. ప్రిజం వైట్, ప్రిజం బ్లాక్, ప్రిజం బ్లూ కలర్లలో గెలాక్సీ ఎస్10 లైట్ అందుబాటులో వుంటుందని శాంసంగ్ తెలిపింది. గెలాక్సీ ఎస్10 లైట్ ఫీచర్లు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ–ఓ డిస్ప్లే 1080x 2,400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ఆక్టా–కోర్ సాక్ ఆండ్రాయిడ్ 10 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ 4500ఎంఏహెచ్ బ్యాటరీ -
బిగ్ బ్యాటరీతో శాంసంగ్ ఎం31
సాక్షి,న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ‘ఎం’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. గత ఏడాది ఎం30 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన శాంసంగ్.. దీనికి కొనసాగింపుగా తాజాగా ఎం31 పేరుతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం లాంచ్ చేసింది. రూ. 14999 ప్రారంభ ధరగా నిర్ణయించింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ హై ఎండ్ మోడల్ ధర రూ. 15,999గా ఉంచింది. మార్చి 5వ తేదీ నుంచి అమెజాన్ ద్వారా విక్రయాలు ప్రారంభమవుతాయని శాంసంగ్ వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం 31 6.40 అంగుళాల డిస్ప్లే శాంసంగ్ ఎక్సినాస్ 9611 ప్రాసెసర్ ఆండ్రాయిడ్10 32ఎంపీ సెల్పీకెమెరా 64+ 8+ 5+ 5ఎంపీ రియర్ క్వాడ్‌కెమెరా 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ (చదవండి : రెండు సెల్ఫీ కెమెరాలు : రియల్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్) -
అద్భుత ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ 71
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియాలో కొత్త స్మార్ట్‌పోన్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఏ 70కి కొనసాగింపుగా గెలాక్సీ ఏ 71ని ఆవిష్కరించింది. భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఏ 71. ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ సిల్వర్, ప్రిజం క్రష్ బ్లూ కలర్ వేరియంట్లలో వస్తుంది. ఫిబ్రవరి 24 నుండి శాంసంగ్ ఒపెరా హౌస్, శాంసంగ్.కామ్‌తో పాటు ప్రముఖ ఆన్లైన్ పోర్టల్‌ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో వుంటుంది. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గెలాక్సీ ఎ 71 లో కొన్ని 'మేక్ ఇన్ ఇండియా' లక్షణాలను కూడా శాంసంగ్ అందిస్తోంది. గెలాక్సీ ఏ 71 సులభంగా చెల్లింపులను ప్రారంభించడానికి శాంసంగ్ పే ఇంటిగ్రేషన్‌తో ప్రీలోడ్ చేసింది. అంతేకాదు మెరుగైన భద్రత కోసం శాంసంగ్ నాక్స్ ఏఫీచర్‌ను కూడా జోడించింది. టెక్స్ట్ మెసేజింగ్ యాప్‌లో విజువల్ కార్డులు , రిమైండర్లు, ఆఫర్ల రూపంలో ఉంటాయి. స్థానిక భాషలకు మద్దతు ఇవ్వడానికి హ్యాండ్‌సెట్‌లో బహుభాషా టైపింగ్ సౌలభ్యం కూడా ఉంది. వినోదం, ఇ-కామర్స్, ఆహారం , ట్రావెల్ డొమైన్లలో కంటెంట్ కోసం శోధించేందుకు వీలుగా ఫైండర్, అలాగే సింగిల్ ట్యాప్‌తో స్క్రీన్‌షాట్‌సేవ్, స్మార్ట్ క్రాప్ ఫీచర్స్ అందిస్తోంది. వివో వి 17 ప్రో, ఒప్పోరెనో, రెడ్మి కె 20 ప్రో, వన్‌ప్లస్ 7 లాంటి స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ 71 ఫీచర్లు 6.70 అంగుళాల ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స రిజల్యూషన్ 8జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 512 జిబి వరకు విస్తరించుకునే అవకాశం 32 ఎంపీ సెల్ఫీకెమెరా 64+ 12+ 5+ 5 ఎంపీ రియర్ క్వాడ్‌కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
అద్భుత ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎం 31 త్వరలో
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలోనే విడుదల చేయనుంది. గెలాక్సీ ఎం సీరీస్‌లో భాగంగా 'గెలాక్సీ ఎం 31' స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 25న భారత మార్కెట్లో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. అధికారిక ప్రకటనకు ముందే కొన్ని కీలక వివరాలు ఆన్లైన్లో వెల్లడైనాయి. భారీ బ్యాటరీసామర్థ్యంతో క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ. 16-18 వేల మధ్య నిర్ణయించే అవకాశం వుందని బీబాం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. శాంసంగ్ 'గెలాక్సీ ఎం 31' ఫీచర్లు : 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో లాంచ్ చేసే అవకాశం వుంది. 6.4 అంగుళాల డిస్ప్లే , ఎక్సినోస్ 9611 సాక్, 64 ఎంపీ ప్రధాన కెమెరా వెనుక క్వాడ్ కెమెరాలు, సెల్పీ కెమెరాను అమర్చింది. ఇన్ఫినిటీ యు కటౌట్‌తో 6.40 అంగుళాల పూర్తి హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందని భావిస్తున్నారు. అంతేకాదు గెలాక్సీ ఎం 11, ఎం 21 రెండు కొత్త మోడళ్లను కూడా ప్రకటించనుందని అంచనా. Samsung is all set to launch the all new Galaxy M31. This new #MegaMonster will come with a quad camera set up and as per our sources, the phone could be priced between 16-18K. Well, we can’t wait to know more details! @SamsungIndia pic.twitter.com/JVBmI6EKma — Beebom (@beebomco) February 7, 2020 -
శాంసంగ్ మరో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్
సియోల్ : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తరువాత తరం గెలాక్సీ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఫిబ్రవరి 11 న శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్న కార్యక్రమంలో విడుదల చేయ బోతున్నట్లు సమాచారం. ‘ఎస్ 20’ పేరుతో లాంచ్ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. కొ ఎస్ 11 కు బదులుగా దీన్ని విడుదల చేసేందుకు యోచిస్తోంది. ఎస్ 10కు సంబంధించిన ఒక ఫోటోను టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ట్వీట్ చేసింది. ఎస్ 11 ఇ, ఎస్ 11 ,ఎస్ 11ప్లస్ కు బదులు, గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌కు కొనసాగింపుగా ఎస్ 20, ఎస్ 20 ప్లస్, ఎస్ 20 అల్ట్రా సిరీస్‌ను లాంచ్ చేయనుందని తెలిపింది. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే కొన్ని మార్కెట్లలో ఎక్సినోస్ 990 ప్రాసెసర్, మెజారిటీ మార్కెట్లలో స్నాప్‌డ్రాగన్ 865 ను జోడించింది. బేస్ వేరియంట్‌గా గెలాక్సీ ఎస్ 20 6.2-అంగుళాల స్క్రీన్‌ను, ఎస్ 20 + 6.7అంగుళాల స్క్రీన్‌ను, గెలాక్సీ 20 అల్ట్రా 6.9 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20, ఎస్ 20 ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌లో 108 ఎంపీ మెయిన్‌గా, క్వాడ్ కెమెరాఫీచర్ ప్రధాన ఆకర్షణగా వుండనుంది. 4000, 4400, 5000 ఎంఏహెచ్‌బ్యాటరీని అమర్చినట్టు తెలుస్తోంది. -
శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: మొబైల్ దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 8వేల తగ్గింపుతో గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌ను రూ.39.990కే విక్రయిస్తోంది. ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ తరువాత జూలైలో ఇండియాలో విడుదలైంది. అప్పటి దీని ధర (8జీబీ ర్యామ్/128 జిబి స్టోరేజ్) 47,990 రూపాయలు. డబుల్ రియర్ కెమెరా సెటప్‌తో 48ఎంపీ భారీ కెపాసిటీ రొటేటింగ్ కెమెరా ప్రత్యేక ఫీచర్‌గా వచ్చిన ఏ80 స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్ ను రెండు వైపులా మార్చుకోవడానికి అవకాశం ఉంది. సెల్ఫీల కనుగుణంగా కెమెరాలో సెల్ఫీ మోడ్‌ను ఎంచుకుంటే ఇది ఆటోమ్యాటిక్ గా తిరుగుతుంది. ప్రస్తుతం శాంసంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్, అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ 80 ఫీచర్లు 6.7-అంగుళాల ఫుల్-హెచ్డి ప్లస్ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9 పై క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 730జీ సాక్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా + 8 ఎంపీ 123డిగ్రీ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా 3700 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి : అద్భుత కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ ఏ80 -
శాంసంగ్ మరో అదరిపోయే ఫోన్
సియోల్: ప్రముఖ మొబైల్ తయారీ దారు శాంసంగ్ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లో భాగంగా శాసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ పేరుతో కొత్త వేరియంట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. సరసమైన ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుందని సమాచారం.గెలాక్సీ ఎస్ 10 లైట్ మొబైల్లో గెలాక్సీ ఎ 91( ఇంకా లాంచ్ కాలేదు) మాదిరిగానే 45వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ , స్నాప్‌డ్రాగన్ 855 చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరాను అమర్చినట్టు తాజా లీకుల ద్వారా తెలుస్తోంది. జీఎస్ఎం ఎరేనా రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్ 10 లైట్ ఫీచర్లు ఈ విధంగా ఉండనున్నాయి. శాంసంగ్ ఎస్10 లైట్ ఫీచర్లపై అంచనాలు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 855 8 జీబీ ర్యామ్ , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 48 ఎంపి మెయిన్ కెమెరా +12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ + 5 ఎంపీ డెప్త్ సెన్సార్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
30 నిమిషాల్లో ఖతం..బుకింగ్స్ క్లోజ్
సాక్షి, ముంబై : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ వాటాను సొంతం చేసుకున్న భారత్ లగ్జరీ స్మార్ట్ఫోన్ల విక్రయంలో రికార్డు నెలకొల్పింది. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన లగ్జరీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ప్రీ బుకింగ్‌లు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ హాట్ కేకుల్లా బుక్ అయిపోయాయి. శుక్రవారం అధికారిక ఆన్లైన్ స్టోర్‌లో ప్రీ-బుకింగ్‌లు మొదలు పెట్టిన 30 నిమిషాల వ్యవధిలో మొత్తం 1,600 యూనిట్ల గెలాక్సీ ఫోల్డ్ ప్రీమియం ఫోన్లను కంపెనీ విక్రయించింది. దీంతో ప్రీ-బుకింగ్స్‌ను మూసివేసింది. వార్తా సంస్థ ఐఎఎన్ఎస్ అందించిన నివేదిక ప్రకారం, ఫోన్లను ముందే బుక్ చేసుకున్న కొనుగోలుదారులు మొత్తం రూ. 1,64,999 ముందస్తుగా చెల్లించి మరీ వీటిని సొంతం చేసుకోవడం విశేషం. అక్టోబర్ 20న ఇవి వినియోగదారుల చేతికి రానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ గెలాక్సీ ఫోల్డ్ ఆరు కెమెరాలతో వస్తుంది. 4.6-అంగుళాల సింగిల్ ఫోల్డ్ అమోలెడ్ డిస్ప్లే. ఇది విప్పినప్పుడు 7.3 అంగుళాల వరకు విస్తరిస్తుంది. బయటి 21: 9 స్క్రీన్ 840x1960 రిజల్యూషన్ , మరో స్క్రీన్ 1,536 x 2,152 రిజల్యూషన్ కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు 7.3 అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే 12 జీబీ రామ్, 512 జీబీ స్టోరేజ్ కవర్ డిస్ప్లేపై 10 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇంటర్నల్ డిస్ప్లేపై 10 ఎంపీ, 8 ఎంపీ కెమెరాలు వెనుకవైపు 16 ఎంపీ, 12 ఎంపీ, 12 ఎంపీ ట్రిపుల్ కెమెరాలు 4380 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారీ కెమెరాతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా కంపెనీలకు పోటీగా శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఏ70 ఎస్’ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 64 మెగా పిక్సెల్ భారీ కెమెరా కలిగివుండటం ఈ ఫోన్ ప్రత్యేకత. శాంసంగ్ ఫోన్లలో ఇంత పెద్ద కెమెరా కలిగివుండడం ఇదే మొదటిసారి. సెల్పీల కోసం 32 మెగా పిక్సల్ కెమెరా, 512 జీబీ వరకు పెంచుకునే ప్రాసెసర్‌ను అమర్చారు. చీకటిలోనూ స్పష్టమైన ఫొటో, సూపర్ స్టడీ వీడియో తీసేందుకు అనువుగా ఫీచర్లు ఉన్నాయి. యూఎస్బీ టైమ్-సీతో వేగంగా చార్జింగ్ కాగలదు. 6జీబీ, 8జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. సెక్యురిటీ కోసం పింగర్ ప్రింట్ సెన్సార్‌ను పొందు పరిచారు. గేమింగ్ ప్రియులకు మరింత మజా వచ్చేలా ఏఐ ఆధారిత ‘గేమ్ బూస్టర్’ను ఉంచారు. ఆఫ్‌లైన్, ఆన్లైన్ పోర్టళ్ల ద్వారా ‘గెలాక్సీ ఏ70 ఎస్’ను కొనుగోలు చేయొచ్చు. ఇతర ఫీచర్లు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ, ఇన్ఫినిటీ, యూ-డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 ఆక్టాకోర్ ప్రాసెసర్ యూఐ ఆధారిత ఆండ్రాయిడ్ 9 పైయి 64+8+5 ఎంపీ ట్రిపుల్ కెమెరా 32 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర : 28,999 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర : 30,999 -
శాంసంగ్ ఎం30ఎస్ : భలే ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త మొబైల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం30ఎస్ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో వాటర్‌డ్రాప్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణ. శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో భాగంగా దీన్ని ఆవిష్కరించింది. 4జీబీ ర్యామ్/ 64జీబీ స్టోరేజ్, 6జీబీర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో వినియోగదారులకు లభించనుంది. ఇప్పటికే గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. శాంసంగ్ ఎం30 ఎస్ ఫీచర్లు 6.4 అంగుళాల ఆమోల్డ్ డిస్ప్లే స్క్రీన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+5+8 ఎంపీ ట్రిపుల్ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర : 13,999 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర : 16,999 సెప్టెంబరు 29నుంచి విక్రయానికి లభ్యం. -
శాంసంగ్ గెలాక్సీ ఏ 90 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్
సియోల్ : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ‘ఎ’ సిరీస్‌లో మరో ఫోన్‌ను పరిచయం చేసింది. అందరూ ఊహించినట్టుగా శాంసంగ్ గెలాక్సీ ఏ 90 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను నేడు (మంగళవారం, సెప్టెంబరు 3) దక్షిణ కొరియాలో తీసుకొచ్చింది. ఇది గెలాక్సీ ఏ సిరీస్‌లో మొట్ట మొదటి 5జీ డివైస్ కాగా, శాంసంగ్ డెక్స్ సపోర్ట్‌తో వచ్చిన తొలి ఫోన్ కూడా. అంతేకాదు శాంసంగ్ ఎస్10, శాంసంగ్ నోట్ 10, నోట్ 10 ప్లస్ తరువాత వస్తున్న నాల్గవ 5జీ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ ఏ 90 కావడం మరో విశేషం. స్లిమ్ బెజెల్స్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. 64, 128 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. అయితే 64 జీబీ స్టోరేజి వేరియంట్‌ను 512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించింది. రేపటి నుంచి కొరియన్ మార్కెట్లలో విక్రయానికి లభ్యం. అయితే ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అలాగే ఇండియాలో 5జీ వచ్చే ఏడాది నాటికి సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో శాంసంగ్ ఏ 90 4జీ వేరియంట్‌ను ఇండియాలో తీసుకొస్తుందా లేదా, వచ్చే ఏడాది దాకా వెయిట్ చేస్తుందా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. శాంసంగ్ ఏ 90 ఫీచర్లు 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఆక్టా-కోర్ చిప్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48+8+5 ఎంపీ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
తగ్గింపు ధరలో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ ఫోన్లపై తగ్గింపు ధరలనుప్రకటించింది. భారత్ మార్కెట్లో గెలాక్సీ ఏ సిరీస్‌లో ఇటీవల లాంచ్ చేసిన ఎ10, ఎ20, ఎ30 ఫోన్లను తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంచామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో లాంచ్ ఈ స్మార్ట్ఫోన్లపై ఇదే తొలి అధికారిక ధర తగ్గింపు. గెలాక్సీ ఎ10 : రూ.500 తగ్గింపు ధరతో రూ.7,990 ధరకు లభించనుంది. గెలాక్సీ ఎ20 : వెయ్యి రూపాయల తగ్గింపు అనంతరం రూ.11,490 లభ్యం గెలాక్సీ ఎ30 : రూ.1500 తగ్గింపు ధరతో రూ.15,490 ధరకు లభ్యం కానుంది. శాంసంగ్, అమెజాన్‌తో పాటు అన్ని ఆన్లైన్ స్టోర్లలో ప్రస్తుతం ఈ ఫోన్లను తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చని శాంసంగ్ వెల్లడించింది. -
శామ్సంగ్ గెలాక్సీ ఎస్10 శ్రేణిపై ఆఫర్లు
హైదరాబాద్: గెలాక్సీ ఎస్10 శ్రేణి ఫోన్లపై శామ్సంగ్ ఇండియా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. శామ్సంగ్ అప్‌గ్రేడ్ ఆఫర్ కింద... కస్టమర్లు గెలాక్సీ ఎస్10ఈ మోడల్‌ను ప్రస్తుత తమ ఫోన్‌తో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. తద్వారా ఇంతకుముందు రూ.2,000 తగ్గింపు లభించగా, అదిప్పుడు రూ.4,000 అయింది. గెలాక్సీ ఎస్10 (128జీబీ) వేరియంట్‌పై ప్రస్తుత ఎక్సేంజ్ బోనస్ 3,000 సైతం రూ.6,000 అయింది. గెలాక్సీ ఎస్10ఈ ఫీచర్లు 5.8 అంగుళాల ఫుల్ హెచ్‌సీ స్క్రీన్ ఆండ్రాయిడ్ 9.0 పై 6/8 జీబీ ర్యామ్, 128/256స్టోరేజ్ 16 ఎంపీ డ్యుయల్ ఫిక్సెల్ కెమెరా 10 ఎంపీ ఆటో ఫోకస్ ఫ్రంట్ కెమెరా 3100 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ గెలాక్సీ ఈవెంట్ : పాప్ అప్ కెమెరా ఫోన్
దక్షిణ కొరియా ఎలక్ట్రానికి దిగ్గజం శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌పై వేగం పెంచింది. ఇటీవల ఏ, ఎం సిరీస్‌లలో ఇటీవల గెలాక్సీ ఫోన్లను తీసుకొచ్చిన శాంసంగ్ వచ్చే నెలలో మరో శాంసంగ్ గెలాక్సీ బిగ్ ఈవెంట్ నిర్వహించనున్నామని వెల్లడించింది. ఏప్రిల్ 10న ఈ ఈవెంట్ జరగనుందంటూ శాంసంగ్ ట్వీట్ చేసింది. ఇంతకు మించి వివరాలను గోప్యంగా ఉంచింది. అయితే ఈ ఈవెంట్‌పై పరిశ్రమ వర్గాల్లో పలు అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రీమియం మిడ్ రేంజ్లో పాప్ అప్ కెమెరాతో ఏ90ను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేయనుంది. బ్యాంకాక్, మైలాన్, సావోపోలోలో ఒకేసారి వీటిని లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. అలాగే గెలాక్సీ ఏ సిరీస్‌లో ఏ 20 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుందని అంచనా. దీంతోపాటు ఏ40, ఏ 20ఈ లను కూడా తీసుకురానుందట. ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఏ 30, ఏ 50, ఏ 10 స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. Enter the era of live. April 10, 2019 - Live on https://t.co/kDIR3TcbZ5 #SamsungEvent pic.twitter.com/EqN8wF04Wd — Samsung Mobile (@SamsungMobile) March 18, 2019 -
శాంసంగ్ ఏ 20 లాంచ్.. డ్యుయల్ రియర్ కెమెరా
సాక్షి, ముంబై : శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎ20 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ రియర్ కెమెరాను. సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను పొందు పర్చింది. ఏ సిరీస్‌లో భాగంగా ఏ 50, ఏ 30, ఏ 20 లను రష్యా మార్కెట్లో తీసుకొచ్చింది శాంసంగ్. బ్లాక్ , బ్లూ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుంది. అయితే భారత మార్కెట్లో ఏ 20 ఏప్రిల్ రెండవవారంలో ఆవిష్కరించనుందని అంచనా. ధర : సుమారు రూ. 14,900 ఎ 20 ఫీచర్లు 6.4 హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే 720x1560 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 3జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 512జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 13+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ ఏ50, ఏ30 స్మార్ట్ఫోన్లు లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ తయారీదారు శాంసంగ్ నుంచి మరో రెండు స్మార్ట్ఫోన్లను తీసుకు లాంచ్ చేసింది. గెలాక్సీ ఏ సిరీస్‌లో గెలాక్సీ ఏ30, ఏ50 పేర్లతో రెండు ఫోన్లను శాంసంగ్ నెదర్లాండ్స్‌లో తీసుకొచ్చింది. ఇండియా మార్కెట్ సహా మార్చి మధ్యలో గ్లోబల్‌గా లాంచ్ చేయనుంది. 6.4 అంగుళాల ఇన్ఫినిటీ-యూ సూపర్ అమొలెడ్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 15 వాట్స్ ఫాస్ట చార్జ్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ల ప్రత్యేకతలుగా ఉన్నాయి. అధికారికంగా ధరలు వెల్లడికానప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ50 ధర : రూ. 28,500 శాంసంగ్ గెలాక్సీ ఏ50 ఫీచర్లు 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0పై 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 4 జీబీ/ 6 జీబీ ర్యామ్ 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ 512జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 25+5+8 ట్రిపుల్ రియర్ 25 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ శాంసంగ్ గెలాక్సీ ఏ30 ఫీచర్లు 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0పై 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 3జీబీ/ 4జీబీర్యామ్ 32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ 512జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 16+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వాలెంటైన్స్ డే: శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు
వాలెంటైన్స్ డే సమీపిస్తున్న తరుణంలో వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఈ కోవలో దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ చేరిపోయింది. ‘బెస్ట్ డేస్ పేరు’ స్పెషల్ సేల్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా గెలాక్సీ నోట్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ స్మార్ట్ఫోన్లపై బెస్ట్ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందులో క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు, బండిల్ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ నోట్ 9 గెలాక్సీ నోట్ 9 (8 జీబీ ర్యామ్+ 512 జీబీ స్టోరేజ్) రూ.77,900లకు లభ్యం. దీని ఎంఆర్పీ రూ.84,900. రూ.7,000 క్యాష్‌బ్యాక్‌తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుదారా కొనుగోలు చేస్తే రూ.8,000 క్యాష్‌బ్యాక్ అదనం. అంతేకాదు.. అప్‌గ్రేడ్ ఆఫర్ కింద ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో అదనంగా రూ.9,000 తగ్గింపు పొందొచ్చు. దీంతో మొత్తంగా గెలాక్సీ నోట్ 9 ధర భారీగా దిగి వచ్చింది. 8 జీబీ ర్యామ్/512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.68,900లకు అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్/128 జీబీ వేరియంట్ రూ.58,900కు లభ్యం. 512 జీబీ, 286 జీబీస్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికే అతి తక్కువ ధరకే అందిస్తోంది. 42ఎంఎం గెలాక్సీ వాచ్ రూ.9,999లకు సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.24,990. గెలాక్సీ ఎస్9 ప్లస్ 64 జీబీ వేరియంట్ ధరను రూ.7వేల తగ్గింపుతో రూ.57,900లకు దిగి వచ్చింది. 128 జీబీ మోడల్ ధర రూ.61,900. ఎంఆర్పీ రూ.68,900 256 జీబీ వేరియంట్ ధర రూ.65,900లకు లభ్యం. దీని అసలు ధర రూ.72,900 అలాగే ఈ ఫోన్‌పై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులు రూ.6,000 క్యాష్‌బ్యాక్ అదనంగా ఆఫర్ చేస్తోంది. లేదా ఎక్స్జేంజ్ ఆఫర్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్‌పై కూడా రూ.9,000 అప్‌గ్రేడ్ బోనస్ పొందొచ్చు. -
గెలాక్సీ ఎస్9ప్లస్ ధర భారీ తగ్గింపు..శాశ్వతంగా
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోయేందుకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త ప్రణాళికలతో వస్తోంది. చైనా కంపెనీ షావోమికి దీటుగా ఇటీవల బడ్జెట్ ధరల్లో ఎం10, ఎం20 స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చిన సంస్థ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ శాసంగ్ గెలాక్సీ ఎస్9ప్లస్ ధరలపై శాశ్వత తగ్గింపును ప్రకటించింది. ఎస్9ప్లస్ అన్ని వేరియంట్లపై రూ.7వేల తగ్గింపు అందిస్తోంది. ఈ తగ్గింపు ఆన్లైన్ విక్రయాలకు మాత్రమే వర్తించనుంది. గెలాక్సీ ఎస్9 + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 57,900, దీని లాంచింగ్ ధర రూ. 64,900. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ 61,900. లాంచింగ్ ధర రూ. 68,900 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ 65,900. లాంచింగ్ ధర 72,000. శాంసంగ్ ఆన్లైన్ అందించిన సమాచారం ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై రూ.4వేల క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అలాగే రూ. 9వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. కాగా గెలాక్సీ ఎస్ 9ప్లస్‌ను గత ఏడాది ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
‘గెలాక్సీ ఎమ్’ స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: శామ్సంగ్ ఇండియా కంపెనీ గెలాక్సీ ఎమ్20, ఎమ్10 స్మార్ట్ఫోన్లను భారత్‌లో అందుబాటులోకి తెస్తోంది. షావోమి బడ్జెట్ ఫోన్, రెడ్మీకి పోటీగా ఈ ఫోన్లను శామ్సంగ్ మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్లను అమెజాన్‌లో వచ్చే నెల 5 నుంచి కొనుగోలు చేయవచ్చని శామ్సంగ్ ఇండియా తెలిపింది. గెలాక్సీ ఎమ్20లో 3జీబీ, 32 జీబీ వేరియంట్ ధర రూ.10,990 అని, 4జీబీ, 64 జీబీ వేరియంట్ ధర రూ.12,990 అని శామ్సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్శి తెలిపారు. అలాగే గెలాక్సీ ఎమ్10లో 3జీబీ, 32 జీబీ వేరియంట్ ధర రూ.8,990 అని, 2జీబీ, 16 జీబీ వేరియంట్ ధర రూ.7,990 అని పేర్కొన్నారు. గెలాక్సీ ఎమ్20లో 6.3 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇనిఫినిటీ –వీ డిస్ప్లే, 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండగా, గెలాక్సీ ఎమ్10లో హెచ్డీ 6.2 అంగుళాల హెచ్డీ ప్లస్ స్క్రీన్ ఉందని పేర్కొన్నారు. ఇక రెండు ఫోన్లలో ఆల్ట్రావైడ్ ఫీచర్‌తో కూడిన డ్యుయల్ రియర్ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. -
గెలాక్సీ ఏ6ప్లస్‌పై మరోసారి ధర తగ్గింపు
శాంసంగ్ గెలాక్సీ ఏ6ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై మరోసారి ధర తగ్గింది. జూలైలో మొదటిసారి ధర తగ్గిన అనంతరం, తాజాగా మరోసారి ఈ స్మార్ట్‌ఫోన్‌పై 2వేల రూపాయల మేర ధర తగ్గిస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. దీంతో శాంసంగ్ గెలాక్సీ ఏ6ప్లస్ స్మార్ట్‌ఫోన్ 21,990 రూపాయలకు దిగొచ్చింది. లాంచింగ్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర 25,990 రూపాయలుగా ఉండేది. జూలైలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 2వేల రూపాయల ధర తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్ని రంగుల వేరియంట్లు కొత్త ధరలతో లిస్ట్ అయి ఉన్నాయి. కొత్త ధరలో శాంసంగ్ గెలాక్సీ ఏ6ప్లస్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా సైట్, పేటీఎం మాల్లో అందుబాటులో ఉంది. బ్లాక్, బ్లూ, గోల్డ్ రంగుల్లో ఇది లభ్యమవుతుంది. గెలాక్సీ ఏ6ప్లస్ స్పెషిఫికేషన్లు... డ్యూయల్ సిమ్(నానో) స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 6 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్ఓసీ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 16 మెగాపిక్సెల్+5మెగాపిక్సెల్ సెన్సార్లతో రెండు వెనుక కెమెరాలు 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై భారీ డిస్కౌంట్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్నుప్రకటించింది. గెలాక్సీ ఎస్9, ఎస్ 9 ప్లస్ డివైస్‌లపై ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, లేదా పేటీఎం మాల్ ద్వారా చేసిన కొనుగోళ్లపై రూ .9000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. జూన్ 30వ తేదీవరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు అదనంగా మరో 9వేల రూపాయల ఎక్స్ఛేంజ్ ఆఫర్, వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా ఉంది. అలాగే నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు శాంసంగ్ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ రెండు ఫోన్లను ఫిబ్రవరి నెలలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ ఎస్9 64 జీబీ వేరియంట్ ధర, రూ. 57,900, 128జీబీ వేరియంట్ ధర రూ. 61,900, 256జీబీ వేరియంట్ ధర రూ .65,900 గా ఉంది. అయితే, ఎస్ 9 ప్లస్ స్మార్ట్ ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర 64,900 రూపాయలు, 128 జీబీ వేరియంట్ ధర 68,900 రూపాయలు , 256 జీబీ వేరియంట్ ధర 72,900 రూపాయలు లభిస్తుంది. తాజాగా వీటిపై 9వేల భారీ తగ్గింపు లభ్యం. గడువు తేదీ ముగిసిన 90 రోజుల తరువాత కస్టమర్ల ఖాతాలోకి ఈ డిస్కౌంట్‌ను క్రెడిట్ చేస్తుంది. అలాగే ఫోన్లను కొనుగోలు చేసిన బిల్లును వినియోగదారులు 180 రోజుల లోపు కంపెనీకి అందించాల్సి ఉంటుంది. Remix your everyday with Super Slow-mo on the reimagined camera of Samsung #GalaxyS9 and #GalaxyS9Plus. Get one time screen replacement* and INR 9000.00 cashback* on ICICI Bank Credit Cards or Paytm mall. Move up now: https://t.co/x6LDp29WsO pic.twitter.com/Xyk2esgrUB — Samsung Mobile India (@SamsungMobileIN) June 2, 2018 -
షావోమికి సవాల్: ఏకంగా నాలుగు స్మార్ట్ఫోన్లు
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి సరసమైన ధరలు, ఆకర్షణీయమైన ఫీచర్లతో భారత వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రత్యర్థి కంపెనీ, సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకు వస్తోంది. జె సిరీస్‌లో కొత్త గెలాక్సీ స్మార్ట్ఫోన్లతో భీకర విధ్వంసానికి రడీ అవుతోంది. మిడ్ సెగ్మెంట్లో నాలుగు స్మార్ట్ఫోన్లను త్వరలో లాంచ్ చేయనుందట. జే సీరిస్‌లో భాగంగా వీటిని మే 21న మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ప్రధానంగా గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ ఎస్9 లాంటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలోని అద్భుత ఫీచర్లు ఇన్ఫినిటీ డిస్ప్లే లాంటి ప్రధాన ఫీచర్‌తో వీటిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అంతేకాదు వీటన్నింటినీ నోయిడాలోని కేంద్రంలో రూపొందించడం మరో విశేషం. బెజెల్ లెస్ స్ర్కీన్, సరసమైన ధరతో లక్షలాది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే లక్ష్యంగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వీటిని తీసుకొస్తున్నట్టు సోమవారం శాంసంగ్ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఎస్ బైక్ మోడ్, అల్ట్రా డేటా సేవింగ్ (యూడీఎస్) చార్జింగ్‌లో టర్బోస్పీడ్ లాంటి కీలక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రడీ అయిపోయింది. అయితే జే సిరీస్‌లో వస్తున్న ఈ నాలుగు డివైస్ల స్పష్టమైన ఫీచర్లు, ఇతర స్పెసికేషన్లు, ధరలు తదితర అంశాలపై క్లారిటీ రావాలంటే శాంసంగ్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. -
గెలాక్సీ ఎస్9, ఎస్ 9ప్లస్‌లపై గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: శాంసంగ్ ప్లాగ్‌షిప్ స్మార్ట్ఫోన్లు ఎస్9, ఎస్9+ పై కంపెనీ ఒక శుభవార్త అందించింది. టెలికం సర్వీసు ప్రొవైడర్ భారతి ఎయిర్టెల్ ఆన్లైన్స్టోర్లలో కూడా ఈ రెండు ఫోన్లు లభ్యం కానున్నాయి. అంతేకాదు కంఫర్టబుల్ డౌన్‌పేమెంట్, ఈఎంఐ సదుపాయాలను కూడా అందిస్తోంది. ఇందులో కొనుగోలుదారులు తమ బడ్జెట్‌కు అనుకూలమైన డౌన్ పేమెంట్‌ను ఎంపి కచేసుకోవచ్చు. దీంతోపాటుగా ఎయిర్టెల్ ఒక ఆసక్తికర ఆఫర్ కూడా ఉంది. తమ ఆన్లైన్ స్టోర్‌లో తాజా శాంసంగ్ స్మార్ట్ఫోన్లను అందించడం ఆనందంగా ఉందని అధికారి భారతి ఎయిర్టెల్ ప్రధాన మార్కెటింగ్ ముఖ్యఅధికారి వాణి వెంకటేష్ శుక్రవారం ప్రకటించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ ప్రీమియం మొబైల్‌ను తక్షణ ఫైనాన్సింగ్ ద్వారా అందించనున్నామన్నారు. గెలాక్సీఎస్ 9.. 64జీబీ వేరియంట్ రూ.9,900 డౌన్ పేమెంట్ ఆప్షన్, తర్వాత 24నెలవారీ వాయిదాలలో రూ.2,499 చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తోంది. గెలాక్సీ ఎస్9 + 64జీబీ వేరియంట్‌ను కేవలం రూ .9,900 డౌన్‌పేమెంట్ చేసి సొంతం చేసుకోవచ్చు. తదుపరి 24 నెలవారీ వాయిదాలలో రూ. 2,799. చెల్లించే అవకాశం. అంతేకాదు ఈ రెండు స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై 8జీబీ డేటా, అపరిమిత కాలింగ్, ఒక సంవత్సరం అమెజాన్ ప్రధాన సభ్యత్వం, ఎయిర్టెల్ సెక్యూర్, ఎయిర్టెల్ టీవీ, విన్క్ మ్యూజిక్ వంటి ఉత్తేజకరమైన కంటెంట్‌ను అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా ఉచితం. ఈ నెలలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన గెలాక్సీ ఎస్ 9 ధర రూ. 57,900. ఎస్ 9 +కు రూ. 64,900 ప్రారంభ ధరగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
పాలపుంత కంటే కాంతివంతం
లండన్: మన పాలపుంత కంటే 1000 రెట్లు అధిక కాంతివంతమైన నక్షత్ర మండ లాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గెలాక్సీ సుమారు 10 వేల మిలియన్ కాంతి సంవ త్సరాల దూరంలో నిక్షిప్తమై ఉందని తెలిపారు. అత్యంత కాంతివంతమైన ఈ గెలా క్సీ చాలా బలమైన పరారుణ కిరణాలను ప్రసారం చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. స్పెయిన్‌లోని పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ కార్టాజీనా (యూపీసీ టీ)కి చెందిన శాస్త్రవేత్తల బృందం సైజు, ఇంటెన్సిటీని ఎక్కువగా చేసి చూపించే గ్రావిటేషనల్ లెన్స్‌లను ఉపయోగించి దీని జాడ కనుగొన్నారు. దీని జాడ కోసం పరిశోధకులు ఆకాశం మొత్తాన్ని జల్లెడ పట్టడంతోపాటు వివిధ ఉపగ్రహాలు పంపిన సమాచారాన్ని విశ్లేషించారు. ఈ గెలాక్సీలో అత్యంత వేగంగా నక్షత్రాలు ఉద్భవి స్తున్నాయని పరిశోధకులు డియాజ్ సాన్చెజ్ తెలిపారు. దీనిలోని అణువు లపై అధ్యయనం చేస్తామని ప్రకటించారు. -
మహా గెలాక్సీల సరస్వతి!
న్యూఢిల్లీ: భారత ఖగోళ శాస్త్రవేత్తలు గెలాక్సీల మహాసమూహాన్ని గుర్తించారు. సుమారు 20 మిలియన్ బిలియన్ సూర్యుళ్లకు సమానమైన దీనికి సరస్వతిగా నామకరణం చేసినట్లు పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ వెల్లడించింది. సమీప విశ్వాంతరాళంలో మనకు తెలిసిన అతిపెద్ద గెలాక్సీల్లో ఇదీ ఒకటని, 10 బిలియన్ ఏళ్ల వయసున్న ఈ సమూహం భూమికి 4 వేల మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు పేర్కొంది. ఇది సుమారు 600 మిలియన్ కాంతి సంవత్సరాల పరిధిలో విస్తరించినట్లు వెల్లడించింది. గోడలాగా కనిపించే ఈ సమూహాన్ని స్లోవాన్ డిజిటల్ స్కై సర్వే ద్వారా చూడొచ్చు. ఇదే సంస్థకు చెందిన పరిశోధకులు గతేడాది గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనడంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. ఒక సమూహంలో 1000– 10 వేల దాకా గెలాక్సీలుంటాయి. మహా సమూహంలో అయితే అలాంటి సమూహాలు దాదాపు 43 ఉంటాయి. -
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్–3
ధర రూ.47,990 బెంగళూరు: శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తాజాగా గెలాక్సీ ట్యాబ్ ఎస్–3ని భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.47,990గా ఉంది. ఇందులో 9.7 అంగుళాల డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ (క్వాడ్‌కోర్ 2.15 గిగాహెర్ట్+1.6 గిగాహెర్ట్), 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 7.0 నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్ స్పీకర్స్, ఫాస్ట్ చార్జింగ్ కేపబిలిటీ, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 ఎంపీ ఆటోఫోకస్ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఎస్ పెన్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. -
పాలపుంత సైజులో కొత్త గెలాక్సీ!
వాషింగ్టన్: మన పాలపుంత పరిమాణంలో ఉన్న భారీ గెలాక్సీ (నక్షత్ర సమూహం)ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గెలాక్సీ మొత్తం కృష్ణపదార్థంతో తయారైందని భావిస్తున్నారు. డ్రాగన్ ఫ్లై-44 అని పిలుస్తున్న ఈ గెలాక్సీ ‘కోమా’ నక్షత్ర సమూహానికి దగ్గరగా ఉంది. ఇందులో అక్కడక్కడ కొన్ని నక్షత్రాలు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని అమెరికాలోని యేల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు హవాయిలోని డబ్ల్యూఎం కెక్ నక్షత్ర శాల, జెమినీ నార్త్ టెలీస్కోప్‌ల సాయంతో గుర్తించారు. దాదాపు 6 రాత్రుల పాటు పరిశీలించి డ్రాగన్ ఫ్లై-44లోని నక్షత్రాల వేగాన్ని (వెలాసిటీ) కొలిచారు. ఈ గెలాక్సీ మధ్య భాగం చుట్టూ ఉన్న గోళాకార నక్షత్రాల సమూహపు వెలుతురు భాగం.. మన పాలపుంత చుట్టూ ఉన్న వెలుతురు భాగం మాదిరిగానే ఉన్నట్లు గుర్తించారు. నక్షత్రాల వేగం గెలాక్సీ పదార్థాన్ని సూచిస్తుందని, నక్షత్రాలు ఎక్కువ వేగంగా కదిలితే గెలాక్సీ పదార్థం కూడా అధికంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. -
శాంసంగ్ ఫోన్లు వాటర్ రెసిస్టెంట్ కాదట?
వాటర్ ప్రూఫ్ స్పెషల్ ఫీచర్ అంటూ ప్రకటన ద్వారా ఊదర గొట్టిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారుదారు శాంసంగ్ కంపెనీకి షాక్ తగిలింది. ఫ్లాగ్ షిప్ ఫోన్ల మొబైల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన హై ఎండ్ కేటగిరీ గెలాక్సీ ఎస్ 7, ఎస్ 7 ఎడ్జ్ , యాక్టివ్ లలో సంస్థ చెబుతున్నట్టుగా వాటర్ ప్రూఫ్ సౌకర్యం లేదని తేలిపోయింది. ఉత్పత్తుల టెస్టింగ్స్ లో పేరు గడించిన సంస్థ కన్జ్యూమర్స్ అనే స్వచ్ఛంద సంస్థ తమ పరీక్షలలో వాటి ప్రామాణికత నిలబడలేదని స్పష్టం చేసింది. అందుకే తాము ఈ ఫోన్టను రికమెండ్ చేయలేమని పేర్కొంది. అమెరికాలో ఎటి అండ్ టీలో మాత్రమే అందుబాటులోఉన్న ఎస్ 7యాక్టివ్ వాటర్ రిసిస్టెంట్ కాదని (జలనిరోధితం) చెప్పింది. అలాగే ఎస్7 ఎడ్జ్, యాక్టివ్ పై చేసిన పరీక్షల్లో కూడా వాటర్ ప్రూఫ్ నిరూపితం కాలేదని తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఒక అరగంట నీళ్లలో ఉంచినపుడు యాక్టివ్ ఫోన్ స్క్రీన్ గ్రీన్ , పసుపు రంగుల్లో మారిపోయిందనీ, టచ్ పనిచేయలేదని తమ రిపోర్టులో తేలిందన్నారు. అంతేకాదు కెమెరా లెన్సెస్ మీద బుడగలుకూడా కనిపించాయని... రెండు ఫోన్ల పరీక్షల్లోనూ ఇదే ఫలితం వచ్చిందని సంస్థ డైరెక్టర్ మారియా రెక్రిక్ తెలిపారు. శాంసంగ్ చెబుతున్న క్వాలిటీ ని ఈ ఫోన్లు రీచ్ కాలేకపోతున్నాయని.. ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన రెండు ఫోన్లను ఈ పరీక్షల్లో ఫెయిలైనట్టు వెల్లడించారు. శాంసంగ్ యాక్టివ్ ఫెయిల్ కావడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిదన్నారు. సాధారణంగా శాంసంగ్ ఫోన్లు నాణ్యతకు మారుపేరుగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. ఎస్ 7,ఎస్ 7ఎడ్జ్, బ్యాటరీ లైఫ్, కెమెరా, డిస్ ప్లే లో అద్భుతంగా ఉన్నాయని కన్జ్యూమర్స్ పేర్కొంది. దీనిపై స్పందించిన శాంసంగ్ చాలా తక్కువ ఫిర్యాదులు మాత్రమే తమకు అందాయని తెలిపింది. ఈ విషయంలో కన్జ్యూమర్ రిపోర్ట్స్ ను పరిశీలిస్తున్నామని, దానితో టచ్ లో ఉన్నట్టు చెప్పింది. కాగా 5 అడుగుల నీటిలో అరగంట సేపు ఉన్నా తట్టుకునే సామర్థ్యం తమ ఫోన్లకు ఉందని శాంసంగ్ యూజర్లకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
నక్షత్ర పేలుళ్లను గుర్తించిన హబుల్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోపు మనకు దగ్గరలోనే ఉన్న ‘స్కైరాకెట్’ అనే గెలాక్సీలో నక్షత్ర పేలుళ్లను గుర్తించింది. క్రమంగా క్షీణించిపోతున్న ఈ గెలాక్సీ అసలు పేరు కిసో-5639. దీనికి ఒక చివర ఈ పేలుడు మొదలైంది. ఈ మరుగుజ్జు నక్షత్రమండలం చదరంగా ఉంది. ఈ గెలాక్సీ సాగదీసినట్లుండే గెలాక్సీలకు చక్కని ఉదాహరణ. అంతేకాకుండా మిగతా గెలాక్సీల కంటే ఇదే సమీపంలో ఉంది. ఇంత కల్లోలమైన పేలుళ్లకు కారణం గెలాక్సీల మధ్య ఉన్న వాయువులే అని ఖగోళ శాస్త్రవేత్తలంటున్నారు. విశ్వం ఆవిర్భావమైన సమయంలో ఈ వాయువుల వల్లే గెలాక్సీలు ఏర్పడి ఉంటాయని, మన పాలపుంత ఏర్పాటుకూ ఇదే కారణమని వారి అభిప్రాయం. -
సెల్ఫీలతో ముఖంపై ముడతలు
లండన్: అధిక సంఖ్యలో సెల్ఫీలు తీసుకునేవారి చర్మం పాడవుతుందనీ, ముఖంపై ముడతలు పడతాయని చర్మవైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల చర్మం తొందరగా వృద్ధాప్య ఛాయలను పొందుతుందని అంటున్నారు. చర్మానికి దెబ్బతిన్న చోట బాగుచేసుకునే సహజగుణం ఉంటుంది. రేడియేషన్ కారణంగా చర్మం ఆ గుణాన్ని కోల్పోతుంది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలం రంగు కాంతి కూడా చర్మానికి హాని కలిగించగలదన్నారు. అక్కడా ప్రాణవాయువు! టోక్యో: ఆక్సిజన్ ఉన్న సుదూర గెలాక్సీని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది బిగ్‌బ్యాంగ్ జరిగిన 70 కోట్ల ఏళ్ల తర్వాత ఏర్పడింది. దీని ద్వారా అంతరిక్ష ప్రాథమిక చరిత్రను తెలుసుకోవచ్చని అంటున్నారు. చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న రేడియో టెలిస్కోపుల ద్వారా దీన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గెలాక్సీలోని భారీ రసాయన మూలకాల ద్వారా నక్షత్రాల ఏర్పాటు, విశ్వపునఃఅయనీకరణరహస్యాలను ఛేదించవచ్చంటున్నారు. ఇందులో సూర్యుని కంటే ఎన్నో రెట్లు పెద్దవైన నక్షత్రాలు ఉండొచ్చని అంచనా. టాయిలెట్ ఉంది టీచర్! బరంపురం: పాఠశాలలో హాజరు (అటెండెన్స్) వేసుకునేటప్పుడు పిల్లలు సాధారణంగా ప్రెజెంట్/ఎస్ టీచర్ అని చెబుతారు. ఒడిశాలోని గంజాం జిల్లా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు మాత్రం ‘మా ఇంట్లో మరుగుదొడ్డి ఉంది/లేదు టీచర్’ అంటూ కొత్త పద్ధతిలో హాజరు పలుకుతున్నారు. ఎందుకంటే, ఈ రకంగానైనా ప్రజలు శౌచాలయాలు నిర్మించుకునేలా చేసి బహిరంగ మల విసర్జనను నిర్మూలించాలనేది అక్కడి అధికారుల ప్రణాళిక. గంజాంను బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా మార్చేందుకు అన్ని పాఠశాలల్లో దీన్ని చేపట్టినట్లు డీఈఓ తెలిపారు. జిల్లాలో 30% ఇళ్లలోనే మరుగుదొడ్లు ఉన్నాయి. -
నట్టింట్లో గెలాక్సీ!
ఇంటికి - ఒంటికి మీ ఇంట్లో పాతబడిన సీసాలున్నాయా..? అయితే మీ ఇంట్లో పాలపుంత (గెలాక్సీ) ఉన్నట్లే. ఎందుకంటే ఫొటోలో కనిపిస్తున్న గెలాక్సీ జార్లు తయారైంది ఆ పాత సీసాలతోనే. సాధారణంగా సీసాలు వాడే కొద్దీ మసగ్గా, అంద విహీనంగా కనిపిస్తుంటాయి. అలాంటివి మన ఇళ్లల్లో బోలెడన్ని ఉంటాయి. వాటిని పడేయకుండా, రీ మోడల్ చేసి... ఇలా కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే? కావలసినవి: పాత సీసాలు, వివిధ రంగుల గ్లో ఇన్ ది డార్క్ పెయింట్స్ (షాపుల్లో దొరుకుతాయి), పెయింట్ బ్రష్ తయారీ విధానం: ముందుగా సీసాలను శుభ్రం చేసుకొని, పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత పెయింట్‌ను ఓ దళసరి పేపర్ లేదా ఏదైనా మూతపై వేయాలి. బ్రష్‌తో కొద్ది కొద్దిగా పెయింట్‌ను తీసుకొని ఆ జార్‌పై చుక్కలు (చిన్నవి లేదా పెద్దవి) పెట్టుకోవాలి. అలా ఎన్ని రంగుల చుక్కలనైనా పెట్టుకోవచ్చు. చుక్కలే కాకుండా ఏవైనా డిజైన్లు కూడా వేసుకోవచ్చు. కొన్ని జార్లకు ఒకే రంగు చుక్కలు, మరి కొన్నిటికి రకరకాల రంగుల చుక్కలు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వాటిని ఎండలో కానీ బాగా వెలుతురున్న చోట రెండు గంటలపాటు ఉంచాలి. అప్పుడే ఆ పెయింట్ చార్జ్ అవుతుంది. తర్వాత వీటిని చీకట్లో పెడితే... నిజంగా పాలపుంతే మన ఇంటికి వచ్చిందా అనిపిస్తుంది. పిల్లల బెడ్రూముల్లో కనుక వీటిని బెడ్లైట్లుగా పెడితే భలే సరదా పడతారు. -
అంతరిక్షం అంచుల్లో గెలాక్సీ
వాషింగ్టన్: విశ్వంలోని మరో అద్భుతాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇప్పటి వరకు మానవుడు కనుగొన్న గెలాక్సీలకన్నా అత్యంత దూరమైన నక్షత మండలాన్ని కనిపెట్టారు. 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ పాలపుంత.. విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో అంటే దాదాపు 40 కోట్ల సంవత్సరాల తర్వాత ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. జీఎన్-జడ్11 అనే ఈ గెలాక్సీ.. ఉర్సా మేజర్ నక్షత్ర మండలం దిశలో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో కొత్త గెలాక్సీని చూశాం’ అని యేల్ యూనివర్సిటీకి చెందిన పాస్కల్ అనే ప్రధాన పరిశోధకుడు తెలిపారు. ఈ పాలపుంత దూరాన్ని హబుల్ టెలిస్కోప్‌లోని వైడ్ ఫీల్డ్ కెమెరా 3ని పరిశోధకులు తొలిసారిగా ఉపయోగించారు. -
అంతరిక్షంలో ఆలాపనలు
మనం ఇప్పుడు హద్దులను చెరిపేసి, జ్ఞానం కొత్త అంచుల దగ్గర ఉన్నాం. ఆవిష్కరణలోని నాటకీయతను చూసినప్పుడు ఎక్కువ ఆశించడం సులభమే. అయితే అతిశయోక్తుల గురించి శాస్త్రవేత్తలు మనలను హెచ్చరిస్తూనే ఉన్నారు. వారు ఈ అవిష్కరణలో ప్రతి అడుగులోను ఎంతో శ్రమించారు. ఆ శ్రమ అనేది ప్రయోగశాలలో కావచ్చు లేదా అబ్జర్వేటరీలో కావచ్చు. అందిన సమాచారాన్ని వాస్తవంగా మలచడానికి కొన్ని జీవితాలు పట్టాయి. ఒక ఆవిష్కరణ గురించిన ఉద్వేగం అందుబాటులో దొరికే సమాధానాలను గమనించడం కంటే, మరిన్ని ప్రశ్నలను సంధించడానికే చూస్తుంది. రెండువేల సంవత్సరాలకు పైగా వినిపించిన ప్రశ్నలు పైథాగరస్ నుంచి ఐన్‌స్టీన్‌ను వేరు చేసి చూపాయి. అలాగే ఐన్స్టీన్కీ, విర్గో కొలాబిరేషన్-లీగో బృందాలకీ మధ్య వందేళ్ల పాటు సాగిన ప్రయత్నం ఉంది. తెలుసుకోవాలనుకున్నప్పుడు విజ్ఞానశాస్త్రం నన్ను సదా గజిబిజి చేసిపోయేది. పాఠశాల స్థాయిలో మొదట్లో భౌతికశాస్త్ర పాఠాలు విన్నప్పుడు అంతా గందరగోళంగానే ఉండేది. రసాయనశాస్త్రం కాస్త అర్థమైనప్పుడు ఏదో కుట్ర పన్నుతున్నట్టు ఉండేది. తర్కంతో, అంచనాలతో సాగే గణితం మాత్రం బాగుండేది. కానీ లేని సున్నాతో ఏమైనా లెక్కకట్టాలని చూస్తే దానిని మాత్రం తత్వశాస్త్రంగా పరిగణించాలి. ఇకపోతే, ఒక హోటల్ గదిలో ఈ వారంలోనే ఒక వేకువ నిశ్శబ్ద వేళ అనుకోకుండా టీవీ పెట్టి, ఒక న్యూస్ చానల్ చూస్తున్నాను. హఠాత్తుగా నన్ను వివశత్వంలో ముంచెత్తుతూ భూతభవిష్యద్వర్తమానాలు, ఇంకా అనేక భవిష్యత్తు అంచనాలు కలగలసిన కలగూరగంప వంటి, ఇంకా అంతులేని కథనాలను జోడించుకుని ఓ సైన్స్ విషయం దర్శనమిచ్చింది. గూడు కట్టినట్టున్న ఆ నిశ్శబ్దంలోనే సాహిత్య గుబాళింపు ఉన్న ఒక వాక్యం వినిపించింది. విశ్వాసానికి అతీతమైనదానిని నిరాకరించమని హేతువు చెప్పినప్పుడు మనం దేని గురించి ఎదురు చూడవచ్చునో ఆ వాక్యం చెప్పి, మనోహరమైన వాస్తవం దగ్గరకి తీసుకుపోయింది. అదే- గోళాల సంగీతం. వందకోట్ల కాంతి సంవత్సరాల క్రితం గురుత్వాకర్షణ కారణంగా రెండు కృష్ణబిలాలు డీకొన్నప్పుడు జనించిన అంతరిక్ష సంబంధమైన, మరచిపోలేని శ్రావ్యమైన సంగీతం అందులో విన్నాను. మేధావుల స్థాయిలో చెప్పాలంటే పైథాగరస్ వచ్చి ఐన్‌స్టీన్‌ను కలుసుకున్నాడు. ఖగోళంలోని రాశులన్నీ లయాత్మకంగా కదులుతున్నాయని ఆ పురాతన గ్రీకు మార్మిక గణితశాస్త్రవేత్త ఏనాడో ప్రతిపాదించాడు. ఆ రాశులన్నీ కదిలిపోతూ మనిషి చెవులకు సోకని ఒక అనుపమానమైన ఆలాపన చేస్తున్నాయని కూడా చెప్పాడాయన. కవులని సూదంటురాయి వలే ఆకర్షించే ఆ అంశమే గోళాల స్వర సమ్మేళనం. కింది తరాలవారి అద్భుత మేధస్సునూ, ఈ తరం శాస్త్రవేత్తల సాహసోపేతమైన జ్ఞానదీప్తినీ ఒక ప్రేక్షకునిలా వీక్షించే నాలాంటి వ్యక్తి బుద్ధికి ఆ నాదం పదును పెడుతుంది. కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. స్థలకాలాలు, ఉనికిల సారం గురించి వినూత్న విశ్లేషణలు ఇచ్చే ఒక ప్రపంచంతో మన బుద్ధిని అనుసంధానింపచేస్తుంది. జీవితం అంటే కాలం గడిచిపోవడమే. అది ఒక శూన్యంలో అర్థంతరంగా ఎక్కడో ముగిసిపోతుంది. ఆ తరువాత ఏమవుతుందన్నది అంతుచిక్కని అంశం. దీనికి సమాధానం కేవలం నిర్దిష్ట విశ్వాసం, సిద్ధాంతాల ద్వారా లభిస్తుంది తప్ప, మనిషి మేధస్సుతో చేసే అనిర్దిష్ట ప్రయత్నంతో కాదు. కానీ, విశ్వంలో గురుత్వాకర్షణతో పాటే, మనిషి చెవికి సోకని కొన్ని శబ్దాలు ఉన్నాయని మేధస్సుతో చే సిన ప్రయత్నంతోనే ఇప్పుడు రుజువైంది. ఇంకో మాటలో చెప్పాలంటే మానవాళి అనుభవాల మౌలిక ధర్మాలు ఎక్కడెక్కడో ఉన్న ఇతర ప్రపంచాలలో కూడా ఉనికిలో ఉన్నాయి. ఇకపై శబ్దం వినడం మనిషి ఇంద్రియాలు చేసే పనులలో ఒకటి మాత్రమే కాదు, ఈ శాశ్వత ఉనికిలో కూడా దాని జాడ ఉంది. ‘లిగో’ (లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రేవిటేషనల్ - వేవ్ అబ్జర్వేటరీ)బృందంలో సభ్యుడు, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు సబోల్క్స్ మర్కా న్యూయార్క్ టైమ్స్ పత్రికకు చెప్పిన మాటను ఇక్కడ ఉటంకిస్తాను. ‘‘ఈ ఆవిష్కరణ చాలా కాలం తరువాత భౌతికశాస్త్ర పరిశోధన లు సాధించిన అతి గొప్ప పురోగతిగా నేను భావిస్తున్నాను. ఖగోళశాస్త్రంలో వేరే అన్నీ అంశాలు చర్మచక్షువులకు కనిపించేవే. ఇప్పుడు ఈ శాస్త్రానికి వినికిడి శక్తి కూడా వచ్చింది. ఇంతకు ముందు ఇలాంటి శక్తి ఏనాడూ లేదు.’’ఎంతో వాగ్ధాటితో వివరించిన ఈ అంశంలోని లోతైన ఆ భేదం గురించి ఆలోచించండి. దృష్టి మానవుల చూపు ద్వారా ఆవిర్భవిస్తుంది. అది వారి సామర్థ్యం మేరకు ప్రయాణిస్తుంది. నాదం మరెక్కడి నుంచో ఉద్భవిస్తుంది. ఇప్పుడు మనకు తెలిసిన దానిని బట్టి వంద కోట్ల కాంతి సంవత్సరాల క్రితం ఆ నాదం వెలువడింది. కన్ను ఆత్మాశ్రయం లేదా వ్యక్తి అనుభవం. చెవి బాహ్యమైనది. మనం ఇప్పుడు హద్దులను చెరిపేసి, జ్ఞానం కొత్త అంచుల దగ్గర ఉన్నాం. ఆవిష్కరణలోని నాటకీయతను చూసినప్పుడు ఎక్కువ ఆశించడం సులభమే. అయితే ఉత్ప్రేక్షల గురించి, అతిశయోక్తుల గురించి శాస్త్రవేత్తలు మనలను హెచ్చరిస్తూనే ఉన్నారు. వారు ఈ అవిష్కరణలో ప్రతి అడుగులోను ఎంతో శ్రమించారు. ఆ శ్రమ అనేది ప్రయోగశాలలో కావచ్చు లేదా అబ్జర్వేటరీలో కావచ్చు. అందిన సమాచారాన్ని వాస్తవంగా మలచడానికి కొన్ని జీవితాలు పట్టాయి. అయితే తెలియని కోణం వైపు మరో కొత్త అడుగు పడే వరకు ఈ వాస్తవాన్ని కూడా తాత్కాలికమైనదిగానే పరిగణిస్తారు. అలాగే ఒక ఆవిష్కరణని తక్కువ చేసి చూడడం కూడా చాలా సులభం. ఈ ఉద్వేగంలో నేను అతిగా స్పందిస్తూ ఉండాలి. కానీ నేను ఆశావాదంలోని దోషాన్ని చూడడానికే ప్రాధాన్యం ఇస్తాను. ఒక ఆవిష్కరణ గురించిన ఉద్వేగం అందుబాటులో దొరికే సమాధానాలను గమనించడం కంటే, మరిన్ని ప్రశ్నలను సంధించడానికే చూస్తుంది. రెండువేల సంవత్సరాలకు పైగా వినిపించిన ప్రశ్నలు పైథాగరస్ నుంచి ఐన్‌స్టీన్‌ను వేరు చేసి చూపాయి. అలాగే ఐన్స్టీన్కీ, విర్గో కొలాబిరేషన్-లీగో బృందాలకీ మధ్య వందేళ్ల పాటు సాగిన ప్రయత్నం ఉంది. ఊహకు కూడా అందని ఈ విశాల విశ్వం నిరీశ్వరవాదుల రచనలు వాదించినట్టు కొన్ని యాదృచ్చిక పరిణామాల మాలిక అనుకోవాలా? అంతకు మించి నైపుణ్యంతో మలచిన ఆకృతి అనకోవాలా? లేకపోతే ఈ భూగోళానికి అందకుండా బయట కాలానుక్రమణికలు ఉన్నాయా? కాలాన్ని వెనక్కు జరపవచ్చన్న వాగ్దానం ద్వారా మన ఊహలు ఎల్లప్పుడూ ప్రభావితమవుతూ వచ్చాయి. అల్బర్ట్ ఐన్‌స్టీన్ తన భావాలను రూపుదిద్దుతున్నప్పుడు, హెచ్.జి. వెల్స్ ‘ది టైమ్ మిషన్’ను రాస్తూ ఉండేవారు. భారతీయ తత్వశాస్త్రం అన్ని వేళలా కాలాన్ని పునర్జన్మలో విశ్వాసానికి తప్పనిసరి అవ సరంగా ఒక భ్రమగా కొట్టిపారేసింది. కాలంలోని వంపును, చపలతను లిగో శాస్త్రజ్ఞులు నమోదు చేశారు. మన మనస్సు సూచించేదానికంటే ఎక్కువ పరిమాణాలను కాలం కలిగి ఉంది. తర్వాతేమిటి? తర్వాత ఎక్కడ? జ్యోతిషశాస్త్రాన్ని ప్రస్తావించడం అనేది ఉత్కృష్ట స్థితినుంచి పరిహాసాస్పద స్థాయికి దిగజారడమే అవుతుందా? జ్యోతిషశాస్త్రానికి సైన్స్ అంత పరిపక్వత, కచ్చితత్వం ఉండదు కానీ అది సామూహిక అభద్రత కంటే ఎక్కువగా స్పష్టమైన రుజువుగా మన విశ్వాసాల్లో బలంగా నిలిచిపోయింది. మీడియాలో కనిపించే రోజువారీ లేదా వారాంతపు జోస్యాలు, అంచనాలు విస్పష్టంగానే అర్ధరహితమైనవి కానీ అన్ని సంస్కృతులను ఆదేశిస్తున్న జాతకచక్రం పట్ల పూజ్య భావం అనేది విలువ కోల్పోయిన పురాగాధనే సూచిస్తోంది. నాకు సమాధానాలు తెలియవు. ప్రశ్నలు మాత్రమే తెలుసు. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు: బీజేపీ అధికార ప్రతినిధి - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
శామ్ సంగ్ జెయింట్ టాబ్లెట్ టీజర్ లీక్!
మొబైల్ ఫోన్ల విభాగంలో దుమ్ము రేపుతున్న శామ్ సంగ్ మార్కెట్లోకి మరో సరికొత్త ఉత్పత్తిని ఆవిష్కరించనుంది. యాపిల్ ప్రో ఐ-పాడ్ 12.9 ఇంచెస్ స్క్రీన్ కు దీటుగా.. శామ్ సంగ్ గెలాక్సీ 18.5 అంగుళాల జెయింట్ స్క్రీన్ తో టాబ్లెట్ ను ప్రవేశ పెట్టబోతున్నట్లు గత సంవత్సర కాలంగా రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆన్ లైన్ లో లీక్ అయిన ఓ టీజర్... ఆ విషయాన్ని రూఢి చేస్తూ.. స్మార్ట్ ఫోన్ అభిమానులను ఉవ్విళ్ళూరిస్తోంది. ఆన్ లైన్ లో ఇప్పటికే లీక్ అయిన వివరాలను బట్టి చూస్తే... 18.5 అంగుళాల జెయింట్ స్క్రీన్ తో గెలాక్సీ ట్యాబ్ అందర్నీ ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యాపిల్ కంపెనీ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ అభిమానుల మనసు దోచుకుంటుండగా వారిని తనవైపు తిప్పుకొనేందుకు శామ్ సంగ్ కంపెనీ మార్కెట్లోకి అతి పెద్ద స్క్రీన్ తో జెయింట్ టాబ్లెట్ ను తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐఎఫ్ఏ బెర్లిన్ లో శామ్ సంగ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో టీజర్ లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆన్ లైన్ లో విడుదలైన టీజర్ ప్రకారం ఆ జెయింట్ టాబ్లెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తే... సుమారుగా లాప్ టాప్ ను తలపిస్తున్న టాబ్లెట్.. ఆకట్టుకునే నల్లని రంగులో ఉంది. దీనికి ఫోల్డబుల్ స్టాండ్ ను కూడ అమర్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ టాబ్లెట్ పూర్తి వివరాలను అక్టోబర్ నెలలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు కొన్ని సంస్థలు కూడ చెప్తున్నాయి. ఆన్ లైన్ టీజర్ ప్రకారం 451.8 మి.మీ. వెడల్పు, 275.8 మి.మీ పొడవు తోపాటు 11.9 మందంగా ఈ బ్లాక్ టాబ్లెట్ ఉంది. 18.4 అంగుళాల టీఎఫ్ టి ఎల్సీడీ స్క్రీన్, 1920x1080 రిజల్యూషన్ తో 8 మెగా పిక్సెల్ కెమెరా కలిగిన ఈ పరికరంలో 2.1 మెగా పిక్సెల్ తో మరో కెమెరా ఉంది. ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్జినోస్ 7 ప్రాసెసర్, 1.6 గిగాహెట్జ్ రన్నింగ్ కెపాసిటీ తోపాటు.. 2 జీబీ రాం కలిగి ఉంది. ఆ మెగా టాబ్లెట్ మార్కెట్లో నిజంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అంటూ సాంసంగ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
భూమి నుంచి ఒక గెలాక్సీ ఊహా చిత్రం
హైదరాబాద్: గ్రహాంతర వాసుల ఉనికిని కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘నెక్సస్ ఫర్ ఎక్సోప్లానెట్ సిస్టమ్ సైన్స్ (నెక్స్ఎస్ఎస్)’ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. మూడు నాసా కేంద్రాలు, పది యూనివర్సిటీలు, రెండు పరిశోధక సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నారని నాసా వెల్లడించింది. -
అగ్నిపర్వతం పేలితే.. భూమి చల్లబడుతుంది!
తెల్లని పొగ, నల్లని బూడిదను ఆకాశంలోకి ఎగజిమ్ముతున్న రష్యాలోని సరిచెవ్ పీక్ అగ్నిపర్వతమిది. అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు గతంలో తీసిన ఫొటోల్లో ఇది ఒకటి. అయితే.. ఇలాంటి స్వల్ప అగ్నిపర్వత పేలుళ్ల వల్ల భూగోళం చల్లారుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు చెప్తున్నారు అగ్ని పర్వతాలు విడుదల చేసే బూడిద, ధూళికణాలు వాతావరణంలోకి చేరి.. సూర్యరశ్మిని వెనక్కి పంపేసి భూమిని చల్లబరుస్తాయని వీరి అధ్యయనంలో వెల్లడైంది. -
అంతరిక్షం వాణిజ్య గవాక్షం
యూరి గెగరిన్ రెక్కలు తొడుక్కుని అంతరిక్షం అంచుల్ని తాకింది ఈ రోజే. అంటే అంతరిక్షంలోకి మనిషి వెళ్లి నేటితో కచ్చితంగా 54 ఏళ్లు! ఈ కాలమంతా ఒక ఎత్తు... రానున్నది మరో ఎత్తు! యుగాలుగా ఊరిస్తూ, ఉడికిస్తూ, నడిపిస్తూ వస్తున్న చుక్కల్ని, గ్రహాలను అబ్బురంగా చూస్తూనే... అందిపుచ్చుకోవాలని, వాటి ఆనుపానూ తెలుసుకోవాలని తపనపడ్డ మానవుడు రూటు మార్చాడు! సిరిమంతుల విలాస ప్రయాణానికి మాత్రమే కాదు... అంతరిక్షాన్ని... రేపటి గూడుగా. కల్పవక్షంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు! నిన్నమొన్నటివరకూ అంతరిక్ష ప్రయోగమంటే... దేశాల స్థాయిలో జరిగే శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే. మరి నేడు... కొంచెం ఆసక్తితోపాటు... బోలెడంత డబ్బున్న ఎవరైనా కంపెనీ పెట్టేసి మనుషుల్ని సొంతంగా అంతరిక్షంలోకి పంపేయవచ్చు. లేదా... వేల కోట్లతో నాసా వంటి సంస్థలు జరుపుతున్న ప్రయోగాల్లో పాలుపంచుకోవచ్చు. బ్రిటన్‌కు చెందిన వర్జిన్ అట్లాంటిక్ స్పేస్ ట్రావెల్ ద్వారా అంతరిక్షాన్ని వాణిజ్యానికి వాడుకునే ప్రయత్నం చేస్తూంటే... మాడ్రన్ ఐరన్ మ్యాన్‌గా కీర్తి గడించిన టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు, ఎలన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ పేరుతో రాకెట్లు తయారు చేస్తూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకు రవాణా చేస్తున్నాడు. అంతరిక్షం నుంచి డబ్బులు రాబట్టుకునేందుకు ముందుకురుకుతున్న కంపెనీల్లో ఇవి మచ్చుకు రెండు మాత్రమే. మారుతున్న పరిస్థితులు.. అవసరాలు సాంకేతిక పరిజ్ఞానాలు అన్నీ కలిసి అంతరిక్షాన్ని... వ్యాపారానికి గవాక్షంగా మార్చేస్తున్నాయి! చిన్నింటి వేట... జనాభా ఏటికేడాదీ పెరిగిపోతోంది. ఉన్న వనరులేమో తక్కువ. పరిస్థితి మరింత దిగజారే ప్రమాదమూ లేకపోలేదు. మరి తరుణోపాయం... పొరుగున ఉన్న చందమామనో... కొంచెం దూరంగా ఉన్న అంగారకుడినో చిన్నిల్లుగా మార్చేసుకోవడమే అన్నది చాలాకాలంగా వినిపిస్తున్న మాట. ఇప్పుడు త్రీడీ ప్రింటింగ్‌తో పాటు అనేక కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా ముందుగా అనుకున్నట్లే 2020 నాటికి చందమామపై స్థావరం ఏర్పాటు చేయడం, ఆ తరువాత మానవులతో కూడిన నివాస సముదాయాన్ని ఏర్పాటు చేయడం పక్కా అనుకోవచ్చు. ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్... చంద్రుడిపైకి పంపే రోవర్ ఎలా ఉండాలి? అన్న అంశంపై ఓ పోటీ పెట్టడం ప్రై వేట్ కంపెనీలు అంతరిక్ష రంగంపై చూపుతున్న ఆసక్తికి మచ్చుతునక. ఖనిజాల మూటలు... గ్రహశకలాలు, తోకచుక్కల వల్ల ఎదురయ్యే సమస్యనే ఓ మంచి అవకాశంగా మార్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు మనిషి తెలివికి నిదర్శనం. మనిషి జీవించడానికి అతిముఖ్యమైన నీటితోపాటు.. ఎలక్ట్రానిక్స్, విద్యుత్ తయారీ రంగాల్లో కీలకపాత్ర పోషించగల ప్లాటినమ్ వంటి ఖనిజాలను గ్రహశకలాల నుంచి కొల్లగొట్టేందుకు ప్లానెటరీ రిసోర్సస్ పేరుతో ఇటీవలే ఓ కంపెనీ ఏర్పాటైంది. గ్రహశకలాల్లోని నీటి ద్వారా భవిష్యత్తులో అంగారకుడు లేదా అంతకంటే దూరమైన గ్రహాలను కూడా అందుకునేందుకు అవసరమైన ఇంధనాన్ని అంతరిక్షంలోనే తయారు చేసుకోవచ్చునని, వ్యోమగాములకు అవసరమైన నీరు, గాలిని కూడా అక్కడికక్కడే తయారు చేసుకుంటే అనేక ప్రయోజనాలుంటాయని ఈ కంపెనీ అంటోంది. అంతరిక్షంలో సువిశాలమైన సౌరశక్తి ఫలకాలను ఏర్పాటు చేసుకుని... మైక్రోవేవ్ తరంగాల ద్వారా భూమ్మీదకు విద్యుత్తు ప్రసారం చేసుకుని వాడుకోవాలన్న జపాన్ ఆశ, ఆశయం ఇప్పుడు పాతవార్తే! బీజమేసిన ఒబామా... అంతరిక్షాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం ఐదేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ప్రకటనతో మొదలైంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించేందుకు నాసాకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు ఒబామా చేసిన ప్రకటనతో అమెరికాలో సరికొత్త అంతరిక్ష విప్లవం మొదలైంది. బోయింగ్‌తోపాటు స్పేస్ ఎక్స్ ఈ మొత్తంలో సింహభాగాన్ని అందుకున్నాయి. 2017 నాటికల్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అమెరికా వ్యోమగాములను చేర్చే లక్ష్యంతో ఈ రెండు కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఆర్బిటల్ సైన్స్, మూన్ ఎక్స్‌ప్రెస్ వంటి కంపెనీలు జాబిల్లి పైకి సరుకు రవాణా చేసే ప్రయత్నాల్లో ఉంటే.. ఇంకొన్ని కంపెనీలు గ్రహశకలాల మైనింగ్ వరకూ అనేక అంతరిక్ష వాణిజ్య కలాపాలను చేపడుతున్నాయి. పోటీలతో మరుగైన టెక్నాలజీలు పీటర్ డెమండిస్ అనే బిలియనీర్ స్థాపించిన ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్ అంతరిక్ష ప్రయోగాలను వాణిజ్య స్థాయికి చేర్చడంలో కీలకపాత్ర పోషించింది. భారీ నగదు బహుమతితో పోటీలు పెట్టడం.. తద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో ఎదురవుతున్న సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయడం ఈ కంపెనీ లక్ష్యాలు. స్పేస్ ట్రావెల్‌ను సులభతరం చేసే లక్ష్యంతో కొత్త విమానం తయారీకి పెట్టిన పోటీలో కంపెనీలు, ఔత్సాహికులు కూడా పాల్గొన్నారు. ఈ పోటీలో నెగ్గిన విమానం డిజైన్‌ను ప్రైవేట్ కంపెనీ వాడుకుంటూండటం విశేషం. ఎక్స్ ప్రైజ్ పోటీలు అంతరిక్ష రంగంతో మొదలైనప్పటికీ ప్రస్తుతం వాటితోపాటు విద్యుత్తు, రవాణా, పర్యావరణం వంటి అనేక రంగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. గూగుల్, నార్తరప్ గ్రమ్మన్ వంటి ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో చంద్రుడిపై రోవర్ నిర్మాణం వంటి పోటీలు ఇక్కడే జరుగుతున్నాయి. 546... ఇప్పటివరకూ అంతరిక్షంలోకి వెళ్లిన మానవుల సంఖ్య 437.749. రోజులు... రికార్డు స్థాయిలో వాలలీ పోల్యకోవ్ అనే వ్యోమగామి ఖగోళంలో గడిపిన కాలం. రూ. 3000000-10000000 నాసా వెబ్సైట్ ప్రకారం ఓ వ్యోమగామి వార్షిక ఆదాయమిది! రూ.12000000... అంతరిక్షంలో కొద్ది సమయం గడిపేందుకు వర్జిన్ గలాటిక్ సర్వీసెస్ వసూలు చేస్తున్న మొత్తం! ప్రభుత్వాలే అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాలన్న భావనకు కాలం చెల్లిపోతోంది. యూవింగో వంటి సంస్థలు క్రౌడ్‌ఫండింగ్ (ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించడం) ద్వారా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. గ్రహశకలాల్లో డబ్బే డబ్బు...! ప్లాటినమ్‌తో నిండినవి... భూమ్మీద ఇప్పటివరకూ తవ్వి తీసిన ప్లాటినమ్ కంటే ఎక్కువ మోతాదులో ప్లాటినమ్ గ్రూప్ ఖనిజాలుంటాయి. యుగాలకు సరిపడా వనరులు అపారమైన ఖనిజ వనరులకు నెలవులు పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు ఇప్పటివరకూ అనేక ప్రయత్నాలు చేశాం.. చేస్తున్నాం కూడా. తాజాగా మనిషి కన్ను అంతరిక్షంపై పడింది. నీటితోపాటు, అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్న గ్రహశకలాలను కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్లానటరీ రిసోర్సెస్ వంటి కంపెనీల అంచనాల ప్రకారం... భూమి చుట్టూ ఎడాపెడా తిరుగుతున్న గ్రహశకలాలను సద్వినియోగం చేసుకోగలిగితే... అనంత ఐశ్వర్యాన్ని కళ్లజూడవచ్చు. ప్లాటినమ్ గ్రూప్ ఖనిజాల ఉపయోగాలివి... ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు గణనీయంగా తగ్గుతాయి. పెట్రోలు, డీజిళ్ల అవసరం లేకుండా విద్యుత్ వాహనాలు వాడుకోవచ్చు. పర్యావరణానికి మేలు చేయవచ్చు. 500 మీటర్ల ప్లాటినమ్ గ్రహశకలంలో... 2.9 లక్షల కోట్ల డాలర్ల విలువైన ప్లాటినమ్ గ్రూప్ ఖనిజాలు ఇవి భూమ్మీద ఏటా వెలికితీస్తున్న ప్లాటినమ్‌కు 174 రెట్లు.. ఔన్సు ప్లాటినమ్ ధర... 1500 డాలర్లు (రూ.75,000) జలసిరి గ్రహశకలాలు... ఒక్కో గ్రహశకలంలోని నీటితో ఇప్పటివరకూ ప్రయోగించిన అన్ని రాకెట్లకు కావల్సిన ఇంధనాన్ని తయారు చేసుకోవచ్చు. 500 మీటర్ల సైజున్న జల గ్రహశకలం ద్వారా... లక్ష కోట్ల డాలర్ల విలువైన నీరు పొందవచ్చు. ప్రస్తుతం లీటర్ నీటిని అంతరిక్షంలోకి పంపేందుకు 20 వేల డాలర్లు ఖర్చు అవుతోంది. విశ్వంలో నీటితో ఉపయోగాలు సుదూర అంతరిక్ష ప్రయాణాలకు అవసరమైన ఇంధనం తయారు చేసుకోవచ్చు. వ్యోమగాములు పీల్చేందుకు గాలి... తాగేందుకు నీటిని సమకూర్చుకోవచ్చు. మన అవసరాల కోసం అంతరిక్షాన్ని వాడుకునే విషయంలో గ్రహశకలాల మైనింగ్ కొత్త అధ్యాయాన్ని సృష్టించనుంది. భూమ్మీద, అంతరిక్షంలోనూ మనిషి మరింత ఎదిగేందుకు అవసరమైన ప్లాటినమ్ ఖనిజం, నీరు వంటి వనరులను అందించనుంది. వేలకు వేలు... 1500: జాబిల్లికంటే దగ్గరగా ఉన్నవి 8800: ఇప్పటివరకూ గుర్తించినవి. 1000: ఏటా గుర్తిస్తున్న కొత్త గ్రహశకలాలు. - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
పాలపుంతలో ఏం జరుగుతోంది?
మన పాలపుంత గెలాక్సీ కేంద్రంలోని ధనూరాశి ప్రాంతంలో ఉన్న అతిపెద్ద కృష్ణబిలం(బ్లాక్‌హోల్) నుంచి ఇంతకుముందెన్నడూ చూడనంతటి స్థాయిలో భారీ ఎక్స్-రే విస్ఫోటం వెలువడిందట. చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ ద్వారా నాసా శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. కొన్నేళ్లుగా మామూలుగా ఉన్న ఎక్స్-రే ప్రకాశం ఒక్కసారిగా భారీ జ్వాలలా మారడం అనేది ఈ కృష్ణబిలం ప్రవర్తన, పరిసరాలపై కొత్త ప్రశ్నల్ని రేకెత్తిస్తోందని చెబుతున్నారు. మన సూర్యుడి కన్నా 45 లక్షల రెట్లు పెద్దగా ఉన్న ఈ బ్లాక్‌హోల్ తన సమీపంలోని ఓ ధూళిమేఘాన్ని మింగేసేటప్పుడు ఎంత వెలుతురు వెలువడుతుందన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టగా.. ఆ ప్రక్రియతో వెలుతురు వెలువడకపోగా ఇలా అనూహ్యంగా అప్పటికే ఉన్న ఎక్స్-రే ప్రకాశం 400 రెట్లు అధికంగా వెలిగిపోయిందట. ధూళి మేఘాలు కాకుండా ఏదైనా పెద్ద గ్రహశకలం బ్లాక్‌హోల్‌ను సమీపించడంతో ఇలాంటి విస్ఫోటం జరిగి ఉంటుందని కొందరు.. బ్లాక్‌హోల్‌లోకి వెళుతున్న వాయువులు కలగాపులగమై దిశలను మార్చుకోవడం వల్ల జరిగి ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
విశ్వంలో భూములు ఎన్ని?
పున్నమి వెన్నెల్లో, ఆరుబయట నింగికేసి చూస్తే... మిణుకు మిణుకుమంటూ కోటానుకోట్ల నక్షత్రాలు! ఓహ్... ఎంత అందమైన దృశ్యమది! మరి... ఆ నక్షత్రాలన్నింటి చుట్టూ మన సూర్యుడికి మల్లే గ్రహాలున్నాయా? ఒకవేళ ఉంటే.. వాటిల్లో మన భూమిని పోలినవి ఎన్ని? చిక్కు ప్రశ్నలేగానీ... శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే వీటికి సమాధానాలు తెలుసుకుంటున్నారు. ఈ విశాల విశ్వంలో మనిషి, భూమి ఒంటరేనా? అన్న ప్రశ్న, సందేహం ఈనాటివి కాదు. యుగాలుగా అటు తత్వవేత్తలను, ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలను ఆలోచనల్లోకి పడేసినవే. కాకపోతే సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అపోహలు తొలగిపోతున్నాయి. కొత్తకొత్త విషయాలు తెలుస్తున్నాయి. నిన్నమొన్నటివరకూ సౌరకుటుంబానికి ఆవల అసలు గ్రహాలే లేవన్న భావన నుంచి సుదూర ప్రాంతాల్లో, ఖగోళపు అంచుల్లోనూ గ్రహ వ్యవస్థలు ఉన్నట్లు రూఢి అవుతున్న కాలమిది. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఎక్సోప్లానెట్ల (సౌరకుటుంబానికి ఆవల ఉన్న గ్రహాలు) అన్వేషణే ప్రథమ లక్ష్యంగా కెప్లర్ పేరుతో ఓ అంతరిక్ష వేధశాల (అబ్జర్వేటరీ)ను ప్రయోగించింది. ఆకాశంలోని అతిచిన్న ప్రాంతంపై కన్నేసిన ఈ దుర్భిణి ఆశ్చర్యకరమైన ఫలితాలు అందించింది.. ఇంతకూ గ్రహాన్నెలా గుర్తిస్తారు? గ్రహాల్లో అత్యధికం ప్రకాశవంతమైన నక్షత్రాల చుట్టూ తిరుగుతూంటాయని మనకు తెలుసు. ఈ క్రమంలో గ్రహం నక్షత్ర కాంతిని కొంతమేరకు అడ్డుకంటుంది. కాంతిలో వచ్చే ఈ అతిచిన్న మార్పును లెక్కించడం ద్వారా ఆయా నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల సైజు, ఆకారం వంటివాటిని తెలుసుకోవచ్చు. కెప్లెర్ చూసిందెంత? 2009 మార్చి ఏడవ తేదీని ప్రయోగించిన కెప్లెర్ వేధశాల సిగ్నస్ నక్షత్ర మండలం సమీపంలోని చిన్న ప్రాంతంపై తన దష్టిని కేంద్రీకరించింది. నాలుగేళ్ల సమయంలో దాదాపు 1,50,000 నక్షత్రాలు, వాటి పరిసరాలను పరిశీలించడం ద్వారా కెప్లెర్ కొన్ని వేల గ్రహాలను గుర్తించింది. భారీ సైజున్న గ్రహాల్లో జీవం ఉండే అవకాశం లేదు. కాబట్టి గురు, శని గ్రహాల సైజులో అంటే... భూమి కంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రెట్లు సైజున్న గ్రహాలను తొలగిస్తే మిగిలినవి...3558 అనువైన ప్రాంతంలో ఉన్నవెన్ని? భూమి సైజులో ఉన్న గ్రహాలన్నింటిలో జీవం ఉంటుందా? ఊహూ అవకాశం లేదు. జీవం ఏర్పడేందుకు, వద్ధి చెందేందుకు అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండాలి. మాత నక్షత్రానికి దగ్గరగా ఉంటే వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. మరీ దూరంగా ఉంటే గడ్డకట్టుకుపోయే చలీ ఉండవచ్చు. కాబట్టి నక్షత్రం నుంచి ‘తగినంత’ దూరంలో ఉన్న గ్రహాల్లోనే జీవం ఏర్పడేందుకు అవకాశాలుంటాయి. కెప్లెర్ గుర్తించిన గ్రహాల్లో ఈ అనుకూల ప్రాంతంలో ఉన్న వాటి సంఖ్య.... 1696 భూమి లాంటివి ఉన్నాయా? జీవం ఉండేందుకు అవకాశమున్న 1696 గ్రహాలను కెప్లెర్ గుర్తించింది కానీ... ఇది కూడా పూర్తిస్థాయి అంచనా కాదు. ఎందుకంటే కెప్లెర్కూ కొన్ని పరిమితులున్నాయి. టెలిస్కోపు చూడగలిగే ప్రాంతంలో నక్షత్రం ముందు నుంచి ప్రయాణించే గ్రహాలను మాత్రమే ఇది చూడగలదు. గ్రహాల కక్ష్యామార్గంలో చిన్నపాటి తేడా ఉన్నా టెలిస్కోపు కంటికి అవి అందకపోవచ్చు. నక్షత్రం దూరం పెరిగే కొద్దీ ఇలాంటి గ్రహాలు ఉండే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇలా సంకేతాలు అందని గ్రహాలనూ పరిగణలోకి తీసుకుంటే కెప్లెర్ దష్టిపెట్టిన ప్రాంతంలో మాత్రమే ఉండే భూమిలాంటి గ్రహాల సంఖ్య...22,500 పాలపుంత మొత్తాన్ని చూస్తే... కెప్లెర్ ఆకాశంలో కేవలం 0.28 శాతం ప్రాంతాన్ని మాత్రమే పరిశీలించింది. దాదాపు మూడువేల కాంతి సంవత్సరాల దూరం వరకూ తొంగిచూసి అందించిన సమాచారాన్ని మిగిలిన ఆకాశానికి కూడా వర్తింపజేస్తే... లెక్కకు మించిన నక్షత్రాల చుట్టూ కోటానుకోట్ల భూమిలాంటి గ్రహాలు కోటానుకోట్లు ఉంటాయి. ఒక అంచనా ప్రకారం ఈ సంఖ్య...1500 - 3000 కోట్లు! ఇష్టమైందే చూడండి...! ఫేస్బుక్ ఓపెన్ చేయగానే వచ్చే న్యూస్‌ఫీడ్‌ను మీరెప్పుడైనా గమనించారా? ఏళ్ల క్రితం నాటి పోస్టింగ్స్ కూడా పేజీపైభాగంలో కనిపిస్తూంటాయి. తాజా పోస్ట్లనుకుని వాటికి మనం లైకులు కొట్టడం.. మనల్ని చూసి ఇంకొందరు అదేదారి పట్టడం తరచూ జరిగే విషయమే. అంతేకాకుండా మీ ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు కొన్ని పేజీలు ప్రత్యక్షమవుతూ చికాకు పెడుతూంటాయి కూడా. ఇలాంటి చిక్కుల్లేకుండా మీకు ఇష్టమైన మిత్రుల పోస్ట్‌లు మాత్రమే చూడాలనుకుంటున్నారా? ఎప్పుడో మీరు అన్‌ఫాలో చేసిన మిత్రులతో మళ్లీ సంబంధాలు నెరపాలని అనుకుంటున్నారా? అయితే ఫేస్బుక్ మరోసారి ఈ అవకాశమిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... వెంటనే ఎలా, ఏమిటి? అన్నది చూసేయండి మరి. చాలా సింపుల్. ఫేస్బుక్ హోంపేజీలో ఎడమవైపున ఉన్న మెనూలో ఆప్స్ ఆప్షన్‌ను డబుల్ క్లిక్ చేయండి. న్యూస్‌ఫీడ్, ఈవెంట్స్ వంటి ఫీచర్ల తాలూకూ సెట్టింగ్స్‌తో కూడిన విండో ప్రత్యక్షమవుతుంది. దీంట్లో న్యూస్‌ఫీడ్ సెట్టింగ్స్‌ను క్లిక్ చేస్తే మీకు అప్పటివరకూ కనిపించే మిత్రుల జాబితా, ఫాలో అవుతున్న పేజీల వివరాలన్నీ కనిపిస్తాయి. మీకు నచ్చిన దాన్ని ఉంచుకోండి. మిగిలిన వాటిని తొలగించుకోండి. ఫేస్బుక్ ఫ్రెష్‌గా మారిపోతుంది. ఫేస్బుక్లో ఏరోజైనా ఒక్కో వ్యక్తి న్యూస్‌ఫీడ్‌లో దాదాపు 1500 పోస్టులు ప్రత్యక్షమవుతూంటాయని అంచనా. అయితే వీటిల్లో చాలామంది 150 పోస్టులకు మించి చూడరు. మీ బ్రౌజింగ్ తీరుతెన్నులను పరిగణనలోకి తీసుకుని ఫేస్బుక్ అల్గారిథమ్స్ మీకు ఏ రకమైన పోస్ట్‌లు పోస్ట్ చేయాలో నిర్ణయిస్తూంటుంది. అయితే మన మూడ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? అస్సలు ఉండదు. అందుకే అప్పుడప్పుడైనా ఈ న్యూస్‌ఫీడ్ సెట్టింగ్స్‌ను వాడుకుని మీ ఫ్రెండ్స్, లైక్స్ పేజీల లిస్ట్‌ను రిఫ్రెష్ చేసుకోవడం మేలు. ఇంకో విషయం... న్యూస్‌ఫీడ్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చుకునేందుకు ఇలాంటి మరిన్ని ఫీచర్లను ప్రవేశపెడతామని ఫేస్బుక్ చెబుతోంది. చూస్తూనే ఉండండి మరి! -
‘మామ్’కు అంతరిక్షంలో 300 రోజులు
చెన్నై: అరుణగ్రహం దిశగా నిరంతరం దూసుకుపోతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్(మంగళ్యాన్-మామ్) ఉపగ్రహం అంతరిక్షంలో 300 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మామ్ అంగారకుడి కక్ష్యను చేరేందుకు మరో 22 రోజులే మిగిలి ఉంది. ప్రస్తుతం భూమికి 19.90 కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్న మామ్ సెకనుకు 22.33 కి.మీ. వేగంతో దూసుకెళుతోందని, ఇప్పటిదాకా మొత్తం 62.20 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం తన ఫేస్బుక్ పేజీలో పేర్కొంది. ఉపగ్రహం అన్ని రకాలుగా బాగుందని, సెప్టెంబర్ 24న మార్స్ కక్ష్యను చేరనుందని తెలిపింది. -
ఇక నవ ఉపగ్రహ శకం
* బిట్స్ పిలానీ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ * వచ్చే ఏడాది చివరికి భారత్‌కు సొంత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ * ఈ ఏడాది మరో రెండు ‘ఐఆర్ఎన్ఎస్ఎస్’ ఉపగ్రహాల ప్రయోగం * అత్యంత వేగం, అధిక సమాచార ప్రసార సామర్థ్యమున్న శాటిలైట్ల రూపకల్పనకు ప్రణాళిక * సెకనుకు 100 జీబీల ప్రసార సామర్థ్యం.. భూమిపై అడుగు ఎత్తుగల వస్తువులను గుర్తించే వీలు * నాసాతో కలిసి ‘మైక్రోవేవ్ ఇమేజింగ్’ ఉపగ్రహం తయారీకి కసరత్తు * వచ్చే ఏడాది ‘ఆస్ట్రోశాట్’ ప్రయోగం సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన పాత ఉపగ్రహాల స్థానంలో పలు అత్యాధునిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళిక రూపొందించామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.రాధాకృష్ణన్ తెలిపారు. భూమి మీద ఉన్న అతి చిన్న దృశ్యాలను కూడా చిత్రీకరించే సామర్థ్యం గల ఉపగ్రహాల తయారీకి కసరత్తు చేస్తున్నామని చెప్పారు. భూమిపై ఒక అడుగు ఎత్తు గల వస్తువులను కూడా గమనించే సామర్థ్యం ఆ ఉపగ్రహాలకు ఉంటుందన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలంలోని బిట్స్ పిలానీ (హైదరాబాద్ క్యాంపస్)లో జరిగిన స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్, బిర్లా గ్రూపు సంస్థల అధినేత, బిట్స్ పిలానీ విద్యాసంస్థల కులపతి కుమార మంగళం బిర్లా, ఉప కులపతి బిజేంద్రనాథ్ జైన్, డెరైక్టర్ వీఎస్ రావు పాల్గొన్నారు. 589 మంది విద్యార్థులకు డిగ్రీలు, 91 మందికి ఉన్న త డిగ్రీలు, ముగ్గురికి డాక్టరేట్ పట్టాలను అందజేశారు. ఎస్.కె. హర్షిత (ఈఈఈ,ఫిజిక్స్)కు బంగారు పతకం, మయాంక్(సివిల్) వెండి పతకం, నిశీత్ కేతన్(ఈసీఈ)కు కాంస్య పతకాన్ని అందజేశారు. అలుమ్నస్ అవార్డును రాజురెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ప్రసంగించారు. 1971లో తాను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే సమయానికి ఇస్రో బాలారిష్టాల్లో ఉందని, ఇప్పుడు తామెంతో సాధించామని చెప్పారు. త్రీడీ చిత్రాలను పంపగలిగే ‘ఇన్శాట్ త్రీడీ’ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించిన ఘనత మన దేశానికే దక్కిందన్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని సుసంపన్నం చేసేందుకు వ్యూహాత్మక శక్తి సామర్థ్యాలను అందించామని గర్వంగా చెప్పగలననన్నారు. ఈ సందర్భంగా ఇస్రో భవిష్యత్తు ప్రణాళికల గురించి విద్యార్థులకు వివరించారు. రాధాకృష్ణన్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. - మన దేశం ప్రస్తుతం 10 సమాచార ఉపగ్రహాలను కలిగి ఉంది. ఇవి ప్రసార మాధ్యమాలు, డాటా కనెక్టివిటీ తదితర అవసరాలను తీరుస్తున్నాయి. భవిష్యత్తులో 15 కిలోవాట్ల శక్తి, సెకనుకు 100 గిగాబైట్ల వేగంతో సమాచారాన్ని ప్రసారం చేసే సామర్థ్యం గల ఉపగ్రహాల తయారీపై దృష్టి సారించాం. - ఆ ఉపగ్రహాల ద్వారా అత్యధిక వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. - నాసాతో కలిసి ‘డ్యూయల్ ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్ ఇమేజింగ్’ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేస్తున్నాం. 2019-20 నాటికి ప్రయోగించనున్న ఈ ఉపగ్రహం తయారీలో ఇస్రో పూర్తిగా తన సొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. - 2015 నాటికి ‘ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్)’ ఏడు ఉపగ్రహాల ద్వారా స్వతంత్ర వ్యవస్థగా రూపుదిద్దుకోనుంది. దీని సహాయంతో భారతదేశంతో పాటు సరిహద్దుల ఆవల 1500 కిలోమీటర్ల పరిధిలో స్థితిగతులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు. ఇందులో భాగంగా ప్రయోగించే ఏడు ఉపగ్రహాల్లో రెండింటిని ఇప్పటికే అంతరిక్షంలోకి పంపాం. ఈ ఏడాది మరో రెండు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. - అతినీల లోహిత, పరారుణ కాంతిని విశ్లేషించి ఖగోళ వస్తువులను గమనించేందుకు.. 2015లో ‘ఆస్ట్రోశాట్’ అనే కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాం. ఒక అడుగు ముందుండాలి: కుమార మంగళం బిర్లా జ్ఞాన సముపార్జనలో ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉంటేనే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గగలమని కుమార మంగళం బిర్లా విద్యార్థులకు సూచించారు. గడిచిన దశాబ్ద కాలంలో ఇంటర్నెట్ జన జీవన శైలిలో ఎన్నో మార్పులు తెచ్చిందని, ఇప్పుడు అన్ని రంగాల్లో అది కీలకంగా మారిందని పేర్కొన్నారు. -
వ్యోమనౌకలకు ‘మైక్రోవేవ్’ ఇంధనం!
వాషింగ్టన్: అంతరిక్షంలో వ్యోమనౌకలు దూసుకుపోతున్నాయి.. చంద్రుడి మీదకి, భూమి మీదకి వస్తూ, వెళుతున్నాయి.. కానీ వాటి నుంచి ఎలాంటి శబ్దం లేదు.. మంటలు, పొగ, ఉష్ణం వంటివేవీ విడుదల కావడం లేదు.. అసలు వాటిలో ఇంధనమే లేదు.. ఇదేంటి? ఆ వ్యోమనౌకలు ఎలా ప్రయాణిస్తాయని అంటారా? కేవలం ‘మైక్రో తరంగాలు’.. అంటే రేడియోల్లో కార్యక్రమాలను ప్రసారం చేయడానికి వినియోగించే తరంగాలు! ఈ మైక్రో తరంగాలను వినియోగించి వ్యోమనౌకలకు శక్తినిచ్చే ఇంజన్ డిజైన్‌ను నాసా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఒక ప్రత్యేకమైన చాంబర్లోకి మైక్రో తరంగాలను ప్రయోగిస్తే... అవి అందులోని అన్ని అంచుల మధ్య బంతిలా అటూ ఇటూ పరావర్తనం చెందడంతో శక్తి ఉత్పన్నమవుతుంది. దీనిని ‘మైక్రోవేవ్ థ్రస్టర్ సిస్టమ్’గా పేర్కొంటున్నారు. ఇందులో మైక్రో తరంగాలను ఉత్పత్తి చేయడం కోసం సౌరశక్తిని వినియోగిస్తారు. దీనివల్ల ఎలాంటి సాంప్రదాయ ఇంధనాలూ అవసరం లేకుండా వ్యోమనౌకలు పనిచేస్తాయి. కృత్రిమ ఉపగ్రహాలు కక్ష్యలోనే ఉండేలా నియంత్రించేందుకు, గ్రహాంతర ప్రయాణాలకు ఈ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుందని నాసా శాస్త్రవేత్తలంటున్నారు. అన్నింటికన్నా విశేషం ఏమిటంటే.. 14 ఏళ్ల కిందటే 2000వ సంవత్సరంలో రోజర్ షాయర్ అనే శాస్త్రవేత్త ‘ఎమ్డ్రైవ్’ పేరుతో ఇదే తరహా ఇంజన్ నమూనాను రూపొందించారు. కానీ అది పనికిరాని పరిశోధన అంటూ.. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కొట్టిపారేయడం గమనార్హం. -
వాయనం: నో డౌట్... మహిళలకివి కరెక్ట్!
గడప దాటి బయటకు రాని రోజుల నుంచి... అంతరిక్షానికి ఎగిరేదాకా చేరుకున్నారు మహిళలు. ప్రతి రంగంలోనూ పురుషులతో పోటీ పడుతున్నారు. డాక్టరో, టీచరో కావడం మామూలే. కానీ మహిళలకే ఉండే కొన్ని ప్రత్యేకమైన లక్షణాల వల్ల ఇప్పుడు కొన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యత పెరుగుతోంది. మహిళలే బెస్ట్ అనిపించుకుంటోన్న రంగాలివే... ఎయిర్ హోస్టెస్ - ఈ పోస్ట్‌లో పురుషుడిని ఊహించడానికే మనసొప్పదు. ఎయిర్‌లైన్స్ సంస్థలు నానాటికీ పెరుగుతూ ఉండటంతో వీటిలో ఎయిర్ హోస్టెస్‌లకు డిమాండ్ పెరుగుతోంది. అందం, చలాకీతనం, చక్కని మాటతీరు ఉండి ఇంప్రెస్ చేయగలిగితే... ప్రారంభ జీతమే పాతిక నుంచి నలభై వేల వరకూ ఉంటుంది. అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లో అయితే 50 నుంచి 80 వేల వరకూ వస్తుంది. హెచ్.ఆర్. - ఉద్యోగుల నియామకం దగ్గర్నుంచి ప్రతిదానిలోనూ హెచ్.ఆర్. మేనేజర్ పాత్ర కీలకం. ఈ పాత్ర పోషించడానికి చాలా ఓర్పు ఉండాలి. చాకచక్యత ప్రదర్శించాలి. ఈ రెండు గుణాలూ మహిళల్లో అధికం కనుక పెద్ద పెద్ద కంపెనీలన్నీ మహిళలనే హెచ్.ఆర్. మేనేజర్లుగా నియమించుకోవడానికి ఇష్టపడుతున్నాయి. మార్కెటింగ్ - అన్నీ సర్వే చేయడం, అందరినీ కలవాల్సి రావడం, డిమాండ్ పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేయడం వంటివి చేయాల్సినందుకు పురుషులకే ఈ రంగం తగుతుంది అనేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడది మారింది. కలుపుగోలుతనం, ఆప్యాయంగా పలుకరించి ఆకర్షించడం వంటి లక్షణాలు మెండుగా ఉండటం వల్ల మహిళలకు ప్రాధాన్యత పెరుగుతోంది. అడ్వర్టయిజింగ్ - క్రియేటివ్ హెడ్స్‌గా, స్క్రిప్ట్ రైటర్స్‌గా, మోడల్స్‌గా... రకరకాల పాత్రలు పోషిస్తున్నారు ఈ రంగంలో. మహిళలు ఇంట్లోవాళ్లందరి మనస్తత్వాలనూ బాగా అర్థం చేసుకుని, దాని ప్రకారం నడచుకుంటారు. కాబట్టి ఎవరు ఎలా ఆలోచిస్తారు, ఏం కోరుకుంటారు అన్నదాని మీద వారికి అవగాహన ఉంటుంది. అది ఈ రంగానికి బాగా ఉపయోగపడుతుంది అంటారు అడ్వర్టయిజింగ్ కంపెనీల యజనమానులు. ఫ్యాషన్ డిజైనింగ్ - ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ డిజైనర్ల సంఖ్యలో మహిళల వాటానే ఎక్కువ. సహజంగానే అందచందాల మీద ఆసక్తి ఉండటం వల్లనో ఏమో గానీ... వారు ఈ రంగంలో దూసుకుపోతున్నారు. టెలివిజన్ - టెలివిజన్ రంగం మహిళల చుట్టూనే తిరుగుతోంది. సీరియళ్లు, రియాలిటీ షోలు... అన్నీ మహిళల కోసమే. వాటిలో పని చేసేది కూడా ఎక్కువ శాతం మహిళలే. తెరమీద మహిళా యాంకర్ కనిపిస్తే చూసినంతగా మగ యాంకర్ని చూడరు అని ప్రముఖ యాంకర్, నటుడు జెమినీ సురేష్ అన్నారంటే... ఆ రంగంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా న్యూస్ రీడర్లుగా కూడా ఆడవాళ్లే ఎక్కువ మెప్పిస్తున్నారు. ప్రయాణంలోనూ పస్తులుండక్కర్లేదు! కొంతమందికి ఇంట్లో వండినవి తప్ప, బయట ఎక్కడ ఏం తిన్నా ఆరోగ్యం దెబ్బ తింటుంది. అలాంటివాళ్లకి పక్క ఊళ్లు వెళ్లాలంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. పూర్తి విభిన్నమైన ఆహారం దొరికే చోటికి వెళ్లాలంటే మరీను. అలాంటివారి కోసం తయారు చేసిందే ఈ ‘మల్టీపర్పస్ ట్రావెల్ కుక్కర్’. దీనిలో రెండు విభాగాలుంటాయి. కింద కనిపిస్తోన్న నల్లది స్టాండు. దానికే ఆన్, ఆఫ్ చేయడానికి, మంటను పెంచుకుని, తగ్గించుకోవడానికి ఉపయోగించే బటన్ ఉంది. ఇక ఎర్రగా ఉన్నది వండుకునే గిన్నె. దీనిలో అన్నం, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, కూరలు... అన్నీ వండేసుకోవచ్చు. గుడ్లు ఉడికించుకోవచ్చు. ఆమ్లెట్ వేసుకోవడానికి ఓ చిన్న గిన్నె, ఇడ్లీ స్టాండు కూడా అదనంగా లభిస్తాయి. రైళ్లలోను, బస్సులలోను కూడా విద్యుత్ సౌకర్యం ఉంటోంది కాబట్టి ప్రయాణాల్లో కూడా వండేసుకోవచ్చు. వెల కూడా పెద్ద ఎక్కువేం కాదు. రూ.1200 లోపే. ఆన్లైన్ స్టోర్స్‌లో 999 రూపాయలకు కూడా దొరుకుతున్నాయి! -
మహా విస్ఫోటం నుంచి నేటి దాకా..
సుమారు 1,370 కోట్ల ఏళ్ల క్రితం మహా విస్ఫోటం (బిగ్‌బ్యాంగ్) అనంతరం విశ్వం ఆవిర్భవించి... అది నేటి దాకా పరిణామం చెందిన క్రమాన్ని వివరిస్తూ రూపొందించిన కంప్యూటర్ సిమ్యులేషన్ చిత్రమిది. విశ్వ పరిణామాన్ని వివరించే చిత్రాలతో ‘ఇలస్ట్రిస్’ అనే కంప్యూటర్ సిమ్యులేషన్(అనుకరణ వీడియో)ను మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. 8 వేల సీపీయూలను వినియోగించి, 1,200 కోట్ల 3డీ పిక్సెల్స్‌తో ఈ ఇలస్ట్రిస్ను ఆవిష్కరించారు. బిగ్‌బ్యాంగ్ అనంతరం నుంచి నేటి దాకా విశ్వం ఏ కాలానికి ఎలా విస్తరించింది? కంటికి కనిపించని కృష్ణపదార్థం, కనిపించే సాధారణ పదార్థం ఎలా వ్యాపించాయి? గెలాక్సీలు, నక్షత్రాల ఆవిర్భావం తదితర వివరాలను ఈ ఇలస్ట్రిస్ తెలియజేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది విశ్వంలో ఏ కాలాన్ని అయినా చూపే టైం మెషిన్ లాంటిదన్నమాట. దీని ద్వారా నేటి నుంచి వెనక్కి.. లేదా బిగ్‌బ్యాంగ్ నుంచి నేటికి ఎలాగైనా విశ్వాంతరాలను అన్వేషించవచ్చె. చిత్రం లో నీలి రంగులో ఉన్నది కృష్ణపదార్థం, మిగతాది గెలాక్సీలు, గెలాక్సీ క్లస్టర్స్‌తో కూడిన సాధారణ పదార్థం. -
అతి చిన్న న్యూట్రాన్ నక్షత్రం
మెల్బోర్న్: అంతరిక్షంలోని సుదూర ప్రాంతంలో నక్షత్రాలు, పాలపుంతల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాల్లో పరిభ్రమిస్తున్న అతి చిన్న న్యూట్రాన్ నక్షత్రాన్ని ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. ఇప్పటి వరకూ గుర్తించిన న్యూట్రాన్ నక్షత్రాల్లో ఇదే అతి చిన్నదని వారు చెపుతున్నారు. ఇంతకు ముందు గుర్తించిన దానికంటే ఇది పది లక్షల రెట్లు కచ్చితమైనదిగా వారు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ పరిశోధకులు జీన్పెర్రీ మెక్క్వార్ట్ ఈ అంశంపై అధ్యయనం జరిపారు. ‘‘అంతరిక్షంలోని ఇతర వస్తువులతో పోలిస్తే న్యూట్రాన్ నక్షత్రాలు అతి చిన్నవి. న్యూట్రాన్ నక్షత్రాల్లో కొన్నింటిని పల్సర్లుగా పిలుస్తారు. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అటువంటి పల్సర్ ‘బీ0834ప్లస్06ఆర్’ నక్షత్రంపై పరిశోధనలు నిర్వహించాం. నక్షత్రాలు, పాలపుంతల మధ్య ప్రాంతంలోని పల్సర్ల సిగ్నళ్ల ఆధారంగా ఈ న్యూట్రాన్ నక్షత్రాన్ని గుర్తించాం’’ అని మెక్క్వార్ట్ వెల్లడించారు. అతి భారీ లెన్స్‌లను వినియోగించి ఈ పరిశోధనలు కొనసాగించామని తెలిపారు. -
అంతరిక్షంలో హైడ్రోజన్ నదులు
వాషింగ్టన్: అంతరిక్షంలో వివిధ నక్షత్ర మండలాల (గెలాక్సీల) మధ్య అత్యంత భారీ స్థాయిలో హైడ్రోజన్ వాయువు ప్రవహిస్తోందని అమెరికాకు చెందిన వెస్ట్ వర్జీనియా వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది సర్పిలాకార గెలాక్సీల్లో పెద్ద సంఖ్యలో నక్షత్రాలు పుట్టడానికి దోహదం చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన ‘గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్’ సహాయంతో ఈ పరిశోధన చేశారు. భూమికి 2.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘ఎన్జీసీ6946’ అనే గెలాక్సీకి.. చుట్టూ ఉన్న గెలాక్సీల నుంచి హైడ్రోజన్ భారీగా ప్రవహిస్తున్నట్లు గుర్తించామని పరిశోధనకు నేతృత్వం వహించిన డీజే పిసానో చెప్పారు. ఇలాంటి హైడ్రోజన్ ప్రవాహాన్ని కనుగొనడం ఇదే మొదటిసారి అని, అత్యంత చల్లగా ఉండడం వల్ల ఈ ప్రవాహాలను గుర్తించడం కష్టమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రవాహాల వల్లే సర్పిలాకార గెలాక్సీలు నిత్యం నక్షత్రాలకు జన్మనిస్తున్నట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు.