సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలోనే విడుదల చేయనుంది. గెలాక్సీ ఎం సీరీస్‌లో భాగంగా 'గెలాక్సీ ఎం 31' స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 25న భారత మార్కెట్లో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. అధికారిక ప్రకటనకు ముందే కొన్ని కీలక వివరాలు ఆన్‌లైన్‌లో వెల్లడైనాయి. భారీ బ్యాటరీసామర్థ్యంతో క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ. 16-18 వేల మధ్య నిర్ణయించే అవకాశం వుందని బీబాం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
శాంసంగ్ 'గెలాక్సీ ఎం 31' ఫీచర్లు : 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో లాంచ్ చేసే అవకాశం వుంది. 6.4 అంగుళాల డిస్‌ప్లే , ఎక్సినోస్ 9611 సాక్, 64 ఎంపీ ప్రధాన కెమెరా వెనుక క్వాడ్ కెమెరాలు, సెల్పీ కెమెరాను అమర్చింది. ఇన్ఫినిటీ యు కటౌట్‌తో 6.40 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందని భావిస్తున్నారు. అంతేకాదు గెలాక్సీ ఎం 11, ఎం 21 రెండు కొత్త మోడళ్లను కూడా ప్రకటించనుందని అంచనా.
Samsung is all set to launch the all new Galaxy M31. This new #MegaMonster will come with a quad camera set up and as per our sources, the phone could be priced between 16-18K. Well, we can’t wait to know more details! @SamsungIndia pic.twitter.com/JVBmI6EKma
— Beebom (@beebomco) February 7, 2020
Comments
Please login to add a commentAdd a comment