హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్ ఇండియా ఫోల్డేబుల్ విభాగంలో గెలాక్సీ జడ్ ఫ్లిప్4, ఫోల్డ్4 మోడళ్లను ఆవిష్కరించింది. ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ ఇక్కడి మార్కెట్లో వీటిని పరిచయం చేశారు. వేరియంట్‌నుబట్టి ధర రూ.90 వేల నుంచి రూ.1.85 లక్షల వరకు ఉంది. ప్రీ-బుకింగ్‌లు భారతదేశంలో 50,000 దాటినట్లు దక్షిణ కొరియా దిగ్గజం ఇటీవల ప్రకటించింది.
గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4
అడాప్టివ్ 120 హెట్జ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ–ఓ డిస్‌ప్లేతో 6.7 అంగుళాల డైనమిక్ అమోలెడ్ మెయిన్ స్క్రీన్, 1.9 అంగుళాల సూపర్ అమోలెడ్ 60 హెట్జ్ కవర్ డిస్‌ప్లేతో ఫ్లిప్4 రూపుదిద్దుకుంది. 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 512 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ పొందుపరిచారు.
గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 8GB/256GB వేరియంట్ ధర రూ. 94,999గాను, బెస్పోక్ ఎడిషన్ 8GB/256GB రూ. 97,999 గా ఉంది.
గెలాక్సీ జడ్ ఫోల్డ్4
ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేతో 7.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 1-120 హెట్జ్ మెయిన్ స్క్రీన్, ఇన్ఫినిటీ–ఓ డిస్‌ప్లేతో 6.2 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 48–120 హెట్జ్ కవర్ స్క్రీన్‌తో ఫోల్డ్4 తయారైంది. 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ ఏర్పాటు ఉంది.
Galaxy Z Fold 4 బేస్ వేరియంట్ (12GB/256GB) రూ. 1,54,999గా నిర్ణయించింది. ఇక 12GB/512GB , 12GB/1TB ధరలు వరుసగా రూ. 1,64,999 రూ. 1,84,999గాఉన్నాయి.
ఆఫర్లు
HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై జడ్ ఫోల్డ్4 ప్రీ-బుకింగ్‌తో రూ 8,000 క్యాష్‌బ్యాక్ లేదా జడ్ ఫ్లిప్4 బుగింగ్‌పై రూ. 7,000 తగ్గింపు పొందవచ్చు. దాని కోసం మీకువసరం. పాత ఫోన్‌తో exchange చేసుకుంటే 7 వేల నుంచి 8 వేల రూపాయల దాకా ప్రయోజనం లభిస్తుంది.
Galaxy Z Fold 4ని ప్రీ-బుక్ చేసే కస్టమర్‌లు రూ. 34,999 విలువైన Galaxy Watch 4 Classic (46mm బ్లూటూత్)ని కేవలం రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు
You have truly unfolded your world with the all-new foldables. We are delighted to share that #GalaxyZFold4 and #GalaxyZFlip4 have crossed 50,000+ pre-bookings!
— Samsung India (@SamsungIndia) August 18, 2022
Thank you for your great response. pic.twitter.com/nyIbMtJPY0
Comments
Please login to add a commentAdd a comment