Flip
-
భారత్‌లో ఫోల్డబుల్ ఫోన్ల హవా!
న్యూఢిల్లీ: భారత స్మార్ట్ఫోన్ల విపణిలో ఇప్పుడు ఫ్లిప్ మోడళ్ల హవా నడుస్తోంది. ఫ్లిప్ విభాగంలో గట్టి పట్టు కోసం చైనా కంపెనీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. శామ్సంగ్కు ధీటుగా పోటీ ఇవ్వడానికి ఈ కంపెనీలు వినూత్నంగా ఫ్లిప్ ఫోన్లను తయారు చేసి కస్టమర్లను ఊరిస్తున్నాయి. చైనాకు చెందిన టెక్ దిగ్గజం లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలాతోపాటు టెక్నో, ఒప్పో వీటిలో ఉన్నాయి. పరిశ్రమలో తొలిసారిగా మోటరోలా రూ.50,000 లోపు ధరలో ఫ్లిప్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఈ నెలాఖరులోగా వన్‌ప్లస్ నుంచి ప్రిమియం ఫ్లిప్ ఫోన్ వస్తోంది. 2023 జూలైలో ఫ్లిప్ మోడల్ విడుదల చేసిన తర్వాత రెండు నెలల్లోనే శామ్సంగ్ సుమారు 50–60 వేల యూనిట్లు విక్రయించినట్టు అంచనా అని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ తెలిపింది. మోటరోలా, టెక్నో బ్రాండ్స్ నెలకు చెరి 18–20 వేల యూనిట్లను అమ్ముతున్నాయని వివరించింది. ఈ కంపెనీలను టెక్నో, ఒప్పో అనుసరించాయి. సర్క్యులర్ కవర్ డిస్ప్లే, మధ్య స్థాయి ఫీచర్లతో టెక్నో ఫ్లిప్ ఫోన్‌ను రూ.50 వేల ధరలో ప్రవేశపెట్టింది. మెరుగైన కెమెరా, బ్యాటరీకితోడు సాధారణ స్మార్ట్‌ఫోన్ మాదిరి డిస్ప్లేతో ఫ్లిప్ మోడల్‌ను ఒప్పో తీసుకొచ్చింది. -
నోకియా ఫ్లిప్ ఫోన్, అతి తక్కువ ధరలో
సాక్షి,ముంబై: హెచ్ఎండీ గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా క్లామ్‌షెల్ డిజైన్‌తో కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా 2780 ఫ్లిప్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. క్వాల్కం పప్రాసెసర్, ఎఫ్ఎం రేడియో, వాట్సాప్,వైఫై సపోర్ట్‌తో, ఎరుపు, నీలం రెండు రంగుల్లో దీన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతానికి అమెరికా మార్కెట్లలో అందుబాటులో ఉన్న నోకియా 2780 ఫ్లిప్ ఇతర మార్కెట్లలో అందుబాటులో ఉంటుందా లేదా అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇక ధర విషయానికి వస్తే అమెరికాలో దీని ధర డాలర్లు. 89.99. ఇండియాలో సుమారు రూ. 7,400గా ఉండొచ్చని అంచనా. కాగా ఎంట్రీ-లెవల్ వినియోగదారులే లక్ష్యంగా బడ్జెట్‌ధరల్లో ఈ సిరీస్‌లో నోకియా 2660 ఫ్లిప్, నోకియా 2760లను గతంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నోకియా 2780 ప్లిప్ స్పెసిఫికేషన్స్ 1.77 అంగుళాల TFT స్క్రీన్ 2.7అంగుళాల TFT స్క్రీన్ క్వాల్కం 215 చిప్ సెట్ క్వాడ్ కోర్ సీపీయూ T9 కీబోర్డ్ డిజైన్ 5 ఎంపీ రియర్ కెమెరా విత్ ఫిక్స్డ్ ఫోకస్, LED ఫ్లాష్ 4జీబీ ర్యామ్, 512 ఎంబీ స్టోరేజ్ 1450 ఎంఏహెచ్ రిమూవల్ బ్యాటరీ -
శాంసంగ్ గెలాక్సీ జెడ్ మోడల్స్ , డిస్కౌంట్లు, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ ఇండియా ఫోల్డేబుల్ విభాగంలో గెలాక్సీ జడ్ ఫ్లిప్4, ఫోల్డ్4 మోడళ్లను ఆవిష్కరించింది. ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ ఇక్కడి మార్కెట్లో వీటిని పరిచయం చేశారు. వేరియంట్‌నుబట్టి ధర రూ.90 వేల నుంచి రూ.1.85 లక్షల వరకు ఉంది. ప్రీ-బుకింగ్‌లు భారతదేశంలో 50,000 దాటినట్లు దక్షిణ కొరియా దిగ్గజం ఇటీవల ప్రకటించింది. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 అడాప్టివ్ 120 హెట్జ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ–ఓ డిస్ప్లేతో 6.7 అంగుళాల డైనమిక్ అమోలెడ్ మెయిన్ స్క్రీన్, 1.9 అంగుళాల సూపర్ అమోలెడ్ 60 హెట్జ్ కవర్ డిస్ప్లేతో ఫ్లిప్4 రూపుదిద్దుకుంది. 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 512 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ పొందుపరిచారు. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 8GB/256GB వేరియంట్ ధర రూ. 94,999గాను, బెస్పోక్ ఎడిషన్ 8GB/256GB రూ. 97,999 గా ఉంది. గెలాక్సీ జడ్ ఫోల్డ్4 ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లేతో 7.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 1-120 హెట్జ్ మెయిన్ స్క్రీన్, ఇన్ఫినిటీ–ఓ డిస్ప్లేతో 6.2 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 48–120 హెట్జ్ కవర్ స్క్రీన్‌తో ఫోల్డ్4 తయారైంది. 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ ఏర్పాటు ఉంది. Galaxy Z Fold 4 బేస్ వేరియంట్ (12GB/256GB) రూ. 1,54,999గా నిర్ణయించింది. ఇక 12GB/512GB , 12GB/1TB ధరలు వరుసగా రూ. 1,64,999 రూ. 1,84,999గాఉన్నాయి. ఆఫర్లు HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై జడ్ ఫోల్డ్4 ప్రీ-బుకింగ్‌తో రూ 8,000 క్యాష్‌బ్యాక్ లేదా జడ్ ఫ్లిప్4 బుగింగ్పై రూ. 7,000 తగ్గింపు పొందవచ్చు. దాని కోసం మీకువసరం. పాత ఫోన్‌తో exchange చేసుకుంటే 7 వేల నుంచి 8 వేల రూపాయల దాకా ప్రయోజనం లభిస్తుంది. Galaxy Z Fold 4ని ప్రీ-బుక్ చేసే కస్టమర్లు రూ. 34,999 విలువైన Galaxy Watch 4 Classic (46mm బ్లూటూత్)ని కేవలం రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు You have truly unfolded your world with the all-new foldables. We are delighted to share that #GalaxyZFold4 and #GalaxyZFlip4 have crossed 50,000+ pre-bookings! Thank you for your great response. pic.twitter.com/nyIbMtJPY0 — Samsung India (@SamsungIndia) August 18, 2022 -
వావ్..చీరలోనే అదరగొట్టిందిగా...!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా మహిళలు చీర కట్టులో కొన్ని పనులు చేయడానికి ఇబ్బంది పడటం సహజం. ముఖ్యంగా క్రీడల్లో అయితే మరీ కష్టం. అందులోనూ చీరలో జిమ్నాస్టిక్స్ చేయడం మంటే కత్తి మీద సామే.. ఎంతో సాధన చేస్తే కానీ సాధ్యం కాదు. అయితే ఇటీవలి కాలంలో చీరలో ఇలాంటి విన్యాసాలు చేస్తున్న వనితల వీడియోలు సోషల్ మీడియాలో అబ్బుర పరుస్తున్నాయి. మగువలు తలచు కోవాలేగానీ, సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక యువతి చీరలో అతి సునాయాసంగా పల్టీలు కొడుతున్న తీరు ఔరా అనిపిస్తోంది. చాలా నేర్పుగా, ఒడుపుగా తన విద్యను ప్రదర్శించిన తీరు నెటిజనులను ఆకట్టుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఒకసారి చూసేయండి.. అన్నట్టు నో అబ్యూజ్ కమెంట్స్ ప్లీజ్.. ప్రతిభ ఏ రూపంలో ఉన్నా అభినందించాల్సిందే. వారి పట్టుదలను మెచ్చుకోవాల్సిందే! ఏమంటారు? When a gymnast does flips in a saree. Watched it thrice just to see how the saree defied gravity. #ParulArora #ownit pic.twitter.com/tOxzqUOA7H — Aparna Jain (@Aparna) January 7, 2021 -
బోటెక్కిన డాల్ఫిన్!
డాల్ఫిన్.. సముద్రంలో కనిపించే అందమైన జలచరం. ఎప్పుడూ సముద్రం మధ్యలో పడవలు, ఓడల వెంబడి కనిపించే తెల్లని నీళ్లలో మునిగి తేలడానికి ఇవి బాగా ఇష్టపడతాయని మనకు తెలిసిందే. వాటికున్న ఆ ఇష్టమే ఓ పడవలో ప్రయాణిస్తున్న వారికి షాక్ ఇచ్చింది. మెక్సికోలో డాల్ఫిన్లను చూడటం కోసం పడవలో సముద్రంలోకి వెళ్లిన వారికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. పడవ వెంబడి వస్తూ గాల్లో పల్టీలు కొడుతున్న ఓ డాల్ఫిన్ హఠాత్తుగా బోటు లోపలికి దూకేసింది. అంతే, పడవలోని వారందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో మొదట కాస్త కంగారు పడ్డ సిబ్బంది పరుగులు పెట్టారు. కాస్త తేరుకున్నాక వారిలో ఇద్దరు బోటులో పడిన డాల్ఫిన్ మీద గుడ్డను కప్పి తిరిగి సముద్రంలో పడేశారు. బోటులో ప్రయాణిస్తున్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది.