న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్ల విపణిలో ఇప్పుడు ఫ్లిప్ మోడళ్ల హవా నడుస్తోంది. ఫ్లిప్ విభాగంలో గట్టి పట్టు కోసం చైనా కంపెనీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. శామ్‌సంగ్‌కు ధీటుగా పోటీ ఇవ్వడానికి ఈ కంపెనీలు వినూత్నంగా ఫ్లిప్ ఫోన్లను తయారు చేసి కస్టమర్లను ఊరిస్తున్నాయి. చైనాకు చెందిన టెక్ దిగ్గజం లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలాతోపాటు టెక్నో, ఒప్పో వీటిలో ఉన్నాయి.
పరిశ్రమలో తొలిసారిగా మోటరోలా రూ.50,000 లోపు ధరలో ఫ్లిప్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఈ నెలాఖరులోగా వన్‌ప్లస్ నుంచి ప్రిమియం ఫ్లిప్ ఫోన్ వస్తోంది. 2023 జూలైలో ఫ్లిప్ మోడల్ విడుదల చేసిన తర్వాత రెండు నెలల్లోనే శామ్‌సంగ్ సుమారు 50–60 వేల యూనిట్లు విక్రయించినట్టు అంచనా అని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ తెలిపింది.
మోటరోలా, టెక్నో బ్రాండ్స్ నెలకు చెరి 18–20 వేల యూనిట్లను అమ్ముతున్నాయని వివరించింది. ఈ కంపెనీలను టెక్నో, ఒప్పో అనుసరించాయి. సర్క్యులర్ కవర్ డిస్‌ప్లే, మధ్య స్థాయి ఫీచర్లతో టెక్నో ఫ్లిప్ ఫోన్‌ను రూ.50 వేల ధరలో ప్రవేశపెట్టింది. మెరుగైన కెమెరా, బ్యాటరీకితోడు సాధారణ స్మార్ట్‌ఫోన్ మాదిరి డిస్‌ప్లేతో ఫ్లిప్ మోడల్‌ను ఒప్పో తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment