అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్‌మీ సిరీస్‌ ఫోన్‌ | Redmi 13 4g Price Specifications In India | Sakshi
Sakshi News home page

అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్‌మీ సిరీస్‌ ఫోన్‌

Published Mon, May 27 2024 2:36 PM | Last Updated on Mon, May 27 2024 2:57 PM

Redmi 13 4g Price Specifications In India

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రెడ్‌మీ త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెడ్‌మీ 12 4జీ ఫోన్‌ యూజర్లను ఆకట్టుకుంటోంది. అదే తరహాలో రెడ్‌మీ 13 4జీ ఫోన్‌ను మార్కెట్‌కి పరిచయం చేయనుందంటూ పలు మీడియా కథనాలు చెబుతున్నాయి.

రెడ్‌మీ 13 4జీ ధర, కలర్‌ ఆప్షన్స్‌ ఎలా ఉన్నాయంటే?
6జీబీ ప్లస్‌ 128జీబీ ఆప్షన్‌తో రెడ్‌మీ 13 4జీ ధర రూ.16,500 ఉండనుంది. 8జీబీ ప్లస్‌ 256జీబీ వేరియంట్‌ ధర రూ.19,000గా ఉండనుందని తెలుస్తోంది.బ్లాక్‌,బ్లూ కలర్స్‌తో యూజర్లను అలరించనుంది.వాటికి అదనంగా పింక్‌, ఎల్లో కలర్స్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుందని సమాచారం.

రెడ్‌మీ 13 4జీ డిజైన్స్‌ 
రెడ్‌మీ 13 4జీ డిజైన్స్‌ విషయానికొస్తే ఫోన్‌ టాప్‌ లెప్ట్‌ కార్నర్‌లో రెండు సర్కిల్‌ కెమెరా యూనిట్స్‌, ఎల్‌ఈడీ ఫ్లాష్‌ యూనిట్‌లు ఉన్నాయి.ఫోన్‌ బాడీ గ్లోసీ ఫినీష్‌తో రానుంది.ఫోన్‌ ఛార్జర్‌ యూఎస్‌బీ టైప్‌-సీకి సపోర్ట్‌ చేస్తోంది. ఫోన్‌ ముందు భాగంలో ఫ్లాట్‌ డిస్‌ప్లే, థిక్‌ బెజెల్స్‌,ఫోన్‌ పై భాగంగా సెంటర్డ్‌ హోల్‌ పంచ్‌ కటౌట్‌, సెల్ఫీ కెమెరా సెన్సార్‌లు ఉన్నాయి.

రెడ్‌మీ 13 4జీ స్పెసిఫికేషన్స్‌, ఫీచర్లు
రెడ్‌మీ 13 4జీ 6.79 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ సన్ స్క్రీన్, మీడియా టెక్‌ హీలియా జీ91 అల్ట్ రా, 8జీబీ ర్యామ్‌, 256జీబీ వరకు స్టోరేజ్‌, స్టోరేజ్‌ 1టీబీ వరకు పొడిగించుకోవచ్చు. మైక్రోఎస్‌డీ కార్డ్‌, ఆండ్రాయిడ్‌ ఐపర్‌ ఓఎస్‌,108 మెగా పిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌,2 సెకండరీ సెన్సార్‌,ఫోన్‌ ముందు భాగంలో 13 మెగా పిక్సెల్‌ సెన్సార్‌తో విడుదల కానుందని పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్‌ చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement