4G smartphone
-
అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెడ్మీ 12 4జీ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. అదే తరహాలో రెడ్మీ 13 4జీ ఫోన్‌ను మార్కెట్‌కి పరిచయం చేయనుందంటూ పలు మీడియా కథనాలు చెబుతున్నాయి.రెడ్మీ 13 4జీ ధర, కలర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే?6జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్‌తో రెడ్మీ 13 4జీ ధర రూ.16,500 ఉండనుంది. 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.19,000గా ఉండనుందని తెలుస్తోంది.బ్లాక్,బ్లూ కలర్స్‌తో యూజర్లను అలరించనుంది.వాటికి అదనంగా పింక్, ఎల్లో కలర్స్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం.రెడ్మీ 13 4జీ డిజైన్స్ రెడ్మీ 13 4జీ డిజైన్స్ విషయానికొస్తే ఫోన్ టాప్ లెప్ట్ కార్నర్లో రెండు సర్కిల్ కెమెరా యూనిట్స్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్లు ఉన్నాయి.ఫోన్ బాడీ గ్లోసీ ఫినీష్‌తో రానుంది.ఫోన్ ఛార్జర్ యూఎస్బీ టైప్-సీకి సపోర్ట్ చేస్తోంది. ఫోన్ ముందు భాగంలో ఫ్లాట్ డిస్ప్లే, థిక్ బెజెల్స్,ఫోన్ పై భాగంగా సెంటర్డ్ హోల్ పంచ్ కటౌట్, సెల్ఫీ కెమెరా సెన్సార్లు ఉన్నాయి.రెడ్మీ 13 4జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్లురెడ్మీ 13 4జీ 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ సన్ స్క్రీన్, మీడియా టెక్ హీలియా జీ91 అల్ట్ రా, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, స్టోరేజ్ 1టీబీ వరకు పొడిగించుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్, ఆండ్రాయిడ్ ఐపర్ ఓఎస్,108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్,2 సెకండరీ సెన్సార్,ఫోన్ ముందు భాగంలో 13 మెగా పిక్సెల్ సెన్సార్‌తో విడుదల కానుందని పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. -
జియో 4జీ ఫోన్ వచ్చేసింది..ధర రూ.2,599 మాత్రమే!
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ సంస్థ యూజర్ల కోసం మరో కొత్త ఫోన్ ‘జియో ఫోన్ ప్రైమా 4జీ’ ఆవిష్కరించింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2023 (ఐఎంసీ)లో ప్రదర్శించింది. ఈ సందర్భంగా జియో ఫీచర్ ఫోన్లో వాట్సాప్,యూట్యూబ్,జియోపే, యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది. ధర ఎంతంటే? దీపావళి పండుగ నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానున్న ఈ 4జీ ఫోన్ ధర రూ.2,599గా ఉంది. జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్ షోరూంలలో కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. ఫీచర్లు జియో ఫోన్ ప్రైమా 4జీ వాట్సాప్,ఫేస్బుక్, యూట్యూబ్‌లను వీక్షించవచ్చు. అదనంగా జియో సినిమా, జియో సావన్,జియో టీవీ, జియో,యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. 512 ఎంబీ ర్యామ్‌తో వస్తున్న ఈ షోన్ మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 128 జీబీ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. 1800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. బ్యాటరీతో ఏఆర్ఎం కార్టెక్స్ ఏ53 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. -
JioBharat phone: సక్సెస్‌ను పట్టేసిన అంబానీ.. ఇక దూకుడే..
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో భారతదేశపు అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. అనేక రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తోంది. భారత టెలికాం పరిశ్రమలో అత్యధిక మార్కెట్ వాటాతో తిరుగులేని సంస్థగా ఉన్న రిలయన్స్ జియో బ్రాండ్ గత కొన్నేళ్లుగా అనేక ఉత్పత్తులను భారతీయ మార్కెట్‌కు సరసమైన ధరతో అందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే జియో భారత్ వీ2 (JioBharat V2) ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.999 మాత్రమే. భారతదేశంలో ఇంటర్నెట్ కలిగిన అత్యంత చవకైన ఫోన్ ఇదే. మరిన్ని ఫోన్ల ఉత్పత్తి.. ట్రయల్ దశలో రూ.99 కోట్ల విలువైన 10 లక్షల ఫోన్లను మాత్రమే రిలయన్స్ జియో విక్రయానికి ఉంచింది. ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయిన తర్వాత మరిన్ని జియో భారత్‌వీ2 ఫోన్లను తయారు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత రిలయన్స్ జియో ‘జియో భారత్’ ఫోన్ల అమ్మకాల్లో పురోగతిని గమనించిందని, 10 లక్షల ఫోన్ల విక్రయాల ట్రయల్ పూర్తవ్వగానే ఈ ఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు సిద్ధమైందని బ్రోకరేజ్ సంస్థ బీఎన్పీ పారిబాస్ ఓ నివేదికలో పేర్కొంది. జియో భారత్ వీ2 ఫోన్లలో 1.77 అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఇందులో జియో సినిమా, తాజా వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, హెచ్‌బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత మ్యూజిక్ యాప్ జియో సావన్, జియో ప్లే వంటివి కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! ప్రస్తుతానికి కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో జియో భారత్ వీ2 ఫోన్లను రిలయన్స్ జియో ఉత్పత్తి చేస్తోంది. ఇందు కోసం రానున్న రోజుల్లో ఇతర కంపెనీలూ రిలయన్స్ జియోతో జత కలిసే అవకాశం ఉంది. అతి తక్కువ ధరతోపాటు ఈ ఫోన్ కోసం రిలయన్స్ సరసమైన డేటా ప్లాన్లను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జియోకి పోటీగా ఎయిర్టెల్, అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్..
దేశీయ టెలికాం రంగంలో దిగ్గజ సంస్థలైన ఎయిర్టెల్, జియోల మధ్య పోటీ నెలకొంది. ఇతర టెలికాం కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని, కొత్త యూజర్లను రాబట్టుకునేందుకు జియో, ఎయిర్‌టెల్‌లు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో అతి తక్కువ ధర (రూ.999)కే 4జీ ఫోన్‌ను యూజర్లకు అందించింది. ఇందుకోసం కార్బన్ కంపెనీతో జతకట్టింది. జులై 7 నుంచే ఈ ఫోన్ అమ్మకాలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో మరో టెలికం కంపెనీ ఎయిర్టెల్ మొబైల్ తయారీ సంస్థ పోకోతో ఒప్పందం కుదర్చుకుంది. ఈ మేరకు, ఎయిర్టెల్ కస్టమర్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా పోకో సీ51 ను అందుబాటులోకి తెచ్చింది. జులై 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,999కే సేల్స్ ప్రారంభం కానున్నాయి. ♦ పోకో సీ51లో 6.52 అంగుళాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్,120 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, స్మూత్ అండ్ రెస్పాన్సీవ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్, ♦ మూమెమ్స్‌ను క్యాప్చర్ చేసేందుకు 8 ఎంపీ ఏఐ డ్యూయల్ రేర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రానుంది. ♦ పనితీరు బాగుండేందుకు ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియా జీ 36 ఎస్‌ఓఎస్‌తో వస్తుంది. ♦ యాప్స్, మీడియా, ఫైల్స్ స్టోరేజ్‌కోసం 4జీబీ ఇంటర్నల్ స్టోర్‌జ్‌ను అందిస్తుంది. ♦ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రోజంతా వినియోగించుకోవచ్చు. 10డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ♦ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0, 2.4జీహెచ్‌జెడ్ వైఫై వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ♦ పవర్ బ్లాక్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ కొనుగోలు చేసిన ఎయిర్టెల్ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్టెల్ కస్టమర్లుగా ఉన్నవారు, కొత్తగా ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి పోర్ట్ అవ్వాలనుకునే వారు ఈ మొబైల్‌ను కొనుగోలుపై పలు ఆఫర్లు అందిస్తుంది. ఫోన్ కొనుగోలు చేసిన యూజర్లు 18 నెలల పాటు ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు లాక్ అయ్యి ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.199 చొప్పున ఏ ప్లాన్ అన్లిమిటెడ్ ప్లాన్‌తోనైనా రీఛార్జి చేసుకోవచ్చు. 18 నెలల తర్వాత ఇతర నెట్వర్క్ సిమ్‌ను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు 50జీబీ డేటా ఉచితం. 10 జీబీ చొప్పున మొత్తం 5 కూపన్లు ఐదు నెలల పాటు లభించనున్నట్లు సంయుక్తంగా విడుదల చేసిన ఎయిర్టెల్ -పోకో’ల ప్రకటనలో తెలిపాయి. జియో ఫోన్ ఎంతంటే? ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తుండగా, భారత దేశంలో 25కోట్ల మంది వినియోగదారులు ఇప్పటికీ 2జీని వినియోగిస్తున్నారు. వారందరి కోసం మార్కెట్లోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ ఫోన్ జియోభారత్ V2ని రిలయన్స్ విడుదల చేసింది. ఈఫోన్ ధర రూ.999కే నిర్ధేశించింది. ఇక ఈ ఫోన్ 1.77 అంగుళాల స్క్రీన్, 0.3మెగాపిక్సెల్ కెమెరా ఎస్డీ కార్డ్‌తో 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం, హెచ్డీ వాయిస్ కాలింగ్, లౌడ్ స్పీకర్, 1000 ఎంఏహెచ్ బ్యాటరీ, జియో సినిమా, యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలుగా జియోపేని యూజర్లకు అందిస్తుంది. చదవండి👉 మీరు స్టూడెంట్సా? యాపిల్ బంపరాఫర్.. భారీ డిస్కౌంట్లు, ఫ్రీగా ఎయిర్ పాడ్స్! -
ఫోన్ల జాబితా వచ్చేసింది, ఎయిర్టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్లు ఇవే!
టెలికం కంపెనీ ఎయిర్టెల్ నెక్ట్స్ జనరేషన్ నెట్ వర్క్ 5జీని హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. కానీ ఈ లెటెస్ట్ టెక్నాలజీ నెట్ వర్క్ ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు మరికొన్ని ఫోన్లలో పనిచేయకపోవడంతో యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్లలో మాత్రమే 5జీ పనిచేస్తుంటూ ఓ జాబితా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు 5జీ పనిచేసే ఫోన్లు ఏమిటో తెలుసుకునే ముందు టారిఫ్ ధరలతో పాటు, సిమ్ కార్డ్‌లపై ఎయిర్టెల్ అందించిన వివరాల ప్రకారం.. 4జీ ఛార్జీలకే ఎయిర్టెల్ 5జీ 5జీ నెట్ వర్క్‌ను వినియోగంలోకి తెచ్చినా ఎయిర్టెల్ టారిఫ్ ధరల్ని ప్రకటించలేదు. ఈ తరుణంలో ప్రస్తుత 4జీ ప్లాన్‌లోనే 5జీ సేవల్ని కస్టమర్లు పొందవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. 5జీ స్మార్ట్ ఫోన్ ఏదైనా కస్టమర్లు వినియోగిస్తున్న ప్రస్తుత సిమ్‌లోనే 5జీ పని చేస్తుందని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. అంతా మీ ఇష్టం 5జీ సిగ్నల్స్ అందుకున్న వినియోగదారులు 5జీకి మళ్లవచ్చు. డేటా వినియోగం ఎక్కువగా అవుతోందని భావిస్తే తిరిగి 4జీకి బదిలీ కావొచ్చు. 5జీ సర్వీసులను అందుకోవాలా వద్దా అన్నది కస్టమర్ల అభీష్టం మేరకేనని కంపెనీ పేర్కొంది. మార్చి 2024 లోపు దేశ వ్యాప్తంగా ఈ లేటెస్ట్ కనెక్టివిటీని అందిస్తామని, ప్రస్తుతానికి దశల వారీగా ఎంపిక చేసిన కస్టమర్లకు 5జీ సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్లలో 5జీ నెట్ వర్క్‌ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. మీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తుందో, లేదా అని తెలుసుకోవాలంటే కింద జాబితాను చూడండి శాంసంగ్ శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ, శాంసంగ్ ఏ33 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎం 33, శాంసంగ్ ఫ్లిప్4, శాంసంగ్ గెలాక్సీ ఎస్22, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ప్లస్, శాంసంగ్ ఫోల్డ్4 రియల్ మీ రియల్మీ 8ఎస్ 5జీ , రియల్మీ ఎక్స్ 7 మ్యాక్స్ 5జీ, రియల్ మీ నార్జో 30 ప్రో 56, రియల్ మీ ఎక్స్7 5జీ, రియల్మీ ఎక్స్ 7 ప్రో 50, రియల్ మీ 850, రియల్ మీ ఎక్స్ 50 ప్రో, రియల్ మీ జీటీ 5జీ, రియల్మీ జీటీ ఎంఈ, రియల్ మీ జీటీ నియో2, రియల్మీ 95జీ, రియల్ మీ 9ప్రో, రియల్ మీ 9 ప్రో ప్లస్, రియల్మీ నార్జో 30 5జీ, రియల్మీ 9 ఎస్ఈ, రియల్మీ జీటీ2, రియల్మీ జీటీ 21ప్రో, రియల్మీ జీటీ నియో3, రియల్మీ నార్జో 50 50, రియల్మీ నార్జో 50 ప్రో వన్ ప్లస్ వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9ప్రో, వన్‌ప్లస్ నార్డ్ సీఈ, వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ 10 ప్రో 56,వన్‌ప్లస్ నార్డ్ సీఈ లైట్2, వన్‌ప్లస్ ఎక్స్‌డీఆర్, వన్‌ప్లస్ నార్డ్ 27,వన్‌ప్లస్ 10టీ షావోమీ షావోమీ ఎంఐ10, షావోమీ ఎంఐ ఎల్ఓటీ, షావోమీ ఎంఐ 10టీప్రో, షావోమీ ఎంఐ 11 ఆల్ట్రా(కే1), షావోమీ ఎంఐ 11ఎక్స్ ప్రో, షావోమీ ఎంఐ 11ఎక్స్, షావోమీ పోకో ఎం3 ప్రో 5జీ, షావోమీ పోకో ఎఫ్3 జీటీ, షావోమీ ఎంఐ 11 లైట్ ఎన్ఈ( కే9డీ), షావోమీ కిగా రెడ్మీ నోట్ ఐఐటీఎస్జీ (Xiaomi KIGA Redmi Note IITSG), షావోమీ కే3ఎస్ షావోమీ 11టీ ప్రో, షావోమీ కే 16 షాఓమీ 111 హైపర్ ఛార్జ్, షావోమీ రెడ్మీ నోట్ 10టీ, షావోమీ కే6ఎస్ (రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్), షావోమీ పోకో ఎం4 5జీ, షావోమీ 12 ప్రో, షావోమీ 111, షావోమీ రెడ్మీ 11 ప్రైమ్ 5జీ (ఎల్ 19), షావోమీ పోకో ఎఫ్4 5జీ, షావోమీ పోకో ఎక్స్4 ప్రో, షావోమీ రెడ్మీ కే50ఐ ఒప్పో ఒప్పో రెనో5జీ ప్రో, ఒప్పో రెనో 6, ఒప్పో రెనో 6 ప్రో, ఒప్పో ఎఫ్19ప్రో ప్లస్, ఒప్పో ఏ53 ఎస్, ఒప్పో ఏ53 ఎస్, ఒప్పో ఏ74, ఒప్పో రెనో 7 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ, ఒప్పో రెనో7, ఒప్పో రెనో8, ఒప్పో రెనో 8 ప్రో, ఒప్పో ఫైండ్2, ఒప్పో కే10 5జీ, ఒప్పో ఎస్21 ప్రో 5జీ వివో వివో ఎక్స్ 50 ప్రో, వీ20 ప్రో, ఎక్స్ 60 ప్రో ప్లస్, ఎక్స్60, ఎక్స్60 ప్రో ప్లస్, ఎక్స్70 ప్రో, ఎక్స్70 ప్రోప్లస్, ఎక్స్80, ఎక్స్ 80 ఫ్లాగ్షిప్ ఫోన్స్, వి20 ప్రో, వి21 5జీ, వి21ఈ, వై72 5జీ, వీ23 5జీ, వీ23 ప్రో 5జీ, వీ23ఈ 5జీ, టీ1 5జీ, టీ1 ప్రో 5జీ,వై 75 5జీ,వీ 25, వీ25ప్రో,వై55,వై55ఎస్ చదవండి👉 ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదు -
5జి వచ్చేస్తోంది.. మీ ఫోన్లో ఈ ఆప్షన్ ఉంటే సపోర్ట్ చేసినట్లే!
ఈ అక్టోబర్‌లో భారతదేశం ఎట్టకేలకు 5జి మార్కెట్ కానుంది. మరి కొద్ది వారాల్లో మీ స్మార్ట్ ఫోన్ స్టేటస్ బార్ లో మీరు 5జి ఐకాన్ చూడడం సాధ్యపడే అవకాశం ఉంది. జులైలో స్పెక్ట్రమ్ విజయవంతంగా ముగిసిన తరువాత, భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు 5జి ని వినియోగించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి ఢిల్లీ లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 5జి సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి ఇటీవలే ప్రకటించారు. జియో, ఎయిర్ టెల్ ఈ సేవలను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా (వి) కి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మెట్రో నగరాలు మొదటగా 5జి సేవలను పొందనున్నాయి. తాము 5జి సేవలను అందించే విషయంలో కంపెనీలు ఎంతో విశ్వాసంతో ఉన్నాయి. అదే సమయంలో 5జి అనుభూతిని పొందేందుకు కస్ట మర్లు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. 5జి కి సంబంధించి కస్టమర్లు సమాధానాలు తెలుసు కోవాలనుకుంటున్న ప్రశ్నలు కూడా ఎన్నో ఉన్నాయి. 5జి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? దాన్ని నేను ఎలా పొందగలుగుతాను? నాకు కొత్త ఫోన్ అవసరమవుతుందా? నేను ఏ ఫోన్ తీసుకోవాలి? కొత్త సిమ్ కార్డ్ అవసరమవుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటిలో కొన్ని మాత్రం ముఖ్యమైనవే. నాకు 5జి అవసరమా? జీవనశైలిని అప్ గ్రేడ్ చేసుకోవాలనే భావనను పక్కనపెడితే, అసలు ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి మీరు ఏం పొందాలనుకుంటున్నారు అనే దానిపై ఈ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉంటుంది. వేగవంతమైన ఇంట ర్నెట్ అనేది ఎలాంటి బఫరింగ్ లేకుండా హై-క్వాలిటీ వీడియోలను స్ట్రీమ్ చేస్తుంది. అతి తక్కువ లాటెన్సీ (స్పందించే సమయం) తో హై - గ్రాఫిక్స్ గేమ్స్ ను ప్లే చేస్తుంది. మీ కనెక్షన్ స్లో అవుతుందేమో అన్న బాధ లేకుండా పలు ఉప కరణాలను ఉపయోగించవచ్చు. 5జి కనెక్షన్ పొందడం అనేది టెంప్టింగ్ గా ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. అది క్యూరియాసిటీ వల్ల కావచ్చు లేదా తోటి వారంతా దాని గురించి ముచ్చటించుకోవడం నుంచైనా కావచ్చు. హై డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, మొబైల్ గేమింగ్, వీడియో కాల్స్ వంటి సేవలకు అంతరాయం లేని యా క్సెస్ ను పొందేందుకు అవసరమైన బ్యాండ్ విడ్త్, లాటెన్సీని 5జి అందిస్తుంది. భారతీయ స్మార్ట్ ఫోన్ విని యోగదారులకు సంబంధించి ఒక కన్జ్యూమర్ సర్వే ప్రకారం వేగవంతమైన నెట్ వర్క్ వేగాలు తమ మొబైల్ సేవలను మెరుగుపరుస్తాయని 42 శాతం మంది భావిస్తున్నారు. మరింత విశ్వసనీయమైన కనెక్షన్, మెరుగైన్ ఇన్ డోర్ కనెక్షన్ ఉంటాయని భావిస్తున్న వారి శాతం కూడా అధికంగానే ఉంది. భారతీయ ఆపరేటర్లు వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్ సి-బ్యాండ్, సబ్-1GHz లలో అధిక సామర్థ్యాన్ని, కవరేజీని అందించనుంది. టాప్ లైన్ స్పీడ్స్ పరంగా చెప్పాలంటే, 5జి మార్కెట్లలో చేసిన ఈ అధ్యయనం ప్రకారం, ప్రస్తుత 4జి కంటే కూడా 5జి వేగం 7 నుంచి 10 రెట్లు అధికంగా ఉండనుంది అని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. మీరు గనుక అప్ గ్రేడ్ కావాలనుకుంటే, భారతదేశంలో 4జి ప్రవేశపెట్టబడినట్లుగానే, 5జి మీకు అందించే ప్రోత్సాహకాలు ఏమిటో తెలుసుకోండి. అప్పట్లో టారిఫ్ లలో అగ్రెసివ్ ప్రైసింగ్ (ధరలు బాగా తక్కువగా ఉండడం) వెనుక పోటీ కూడా ఒక కారణంగా ఉండింది. ఈ రెండు అంశాలతో పాటుగా 5జికి గల డిమాండ్, దేశంలో 5జి సేవల ప్రోత్సా హకాలను ప్రభావితం చేయనున్నాయి. 2016లో జియో మొదలైనప్పుడు అది మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు, మార్కెట్ వాటా పొందేం దుకు తన నూతన 4జి నెట్ వర్క్ పై సుమారుగా 6 నెలల పాటు వాయిస్, డేటాను ఉచితంగా అందించింది. దీంతో 4జి మార్కెట్ లో జియో అత్యధిక మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. 5జి సేవలను అందించడంలో పోటీలో ముందు ఉండాలని భారతీయ ఆపరేటర్లు తహతహలాడుతున్న తరుణంలో ఆకర్షణీయ 5జి అప్ గ్రేడ్ ఆఫర్లు మార్కెట్ ను ముంచెత్తే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా జియో 'ట్రూ 5జి' సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవలే ప్రకటించారు. నా ఫోన్ 5జికి సిద్ధంగా ఉందా? మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు సులభమార్గం ఉంది. 2019లోనే దేశంలో మొదటి 5జి ఫోన్ రావడాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మీరు మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగ్స్ ను లేదా మీ సిమ్ కార్డ్ కు సంబంధించి ప్రిఫర్డ్ నెట్ వర్క్ ను పరిశీలించండి అది గనుక 5జి ని కూడా సూచిస్తే, మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క. ఓక్లా నిర్వహించిన ఒక మార్కెట్ సర్వే ప్రకారం చూస్తే, భారతీయులు 5జి ఫోన్ ఉపయోగిస్తూ తమ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ను పరీక్షించుకుంటున్నారు. ఎంతో మంది భారతీయులు ఇప్పటికే 5జి సామర్థ్యం కలిగిన ఉపకరణాలు ఉపయోగిస్తూ స్పీడ్ టెస్ట్ యాప్ ను రన్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే, 5జి అప్ గ్రేడేషన్ అనేది ఖరీదైన హ్యాండ్ సెట్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే, ఒక నూతన మొబైల్ రీచార్జ్ ప్లాన్ ను కొనుగోలు చేసినంత సులభం కానుందని ఈ సర్వే తెలుపుతోంది. 5జి అనేది ఖరీదైన ఫోన్లలోనే కాకుండా మధ్యస్థాయి ఫోన్లలో కూడా ఒక సాధారణ ఫీచర్ గా ఉంటోంది. మీ మొబైల్ నెట్ వర్క్ సెట్టింగ్స్ లో ఎక్కడా కూడా మీకు 5జి అనేది కనిపించకపోతే, మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేయదనే అర్థం. అలాంటప్పుడు మాత్రం మీరు 5జిని సపోర్ట్ చేసే కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి ఉంటుంది. కొత్త 5జి ఫోన్ అవసరమా? అక్టోబర్ మొదలుకొని వచ్చే ఏడాది నాటికి వివిధ భారతీయ నగరాల్లో 5జి అందుబాటు లోకి రానుంది. ప్రస్తుతానికి మాత్రం అది మెట్రో నగరాల్లోనే లభ్యం కానుంది. మీరు గనుక ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ లేదా బెంగళూరులలో నివసిస్తున్నట్లయితే, వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అనుభూతి పొందేందుకు మీ వద్ద 5జి ఫోన్ ఉండాల్సిందే. 5జి ఫోన్ ను కొనడం ఎంతో ప్రయోజనదాయకం అవుతుంది. అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, గురుగ్రామ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ఇతర నగరాల్లో 5జి కనెక్టివిటీ మరికొన్ని రోజుల తరువాత రానుంది. దేశంలో 5జి మొదటగా ఆవిష్కరించబడే 13 నగ రాల పేర్లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇప్పటికే ప్రకటించింది. మొదట పెద్ద పెద్ద నగరాల్లో ఈ కవరేజీ అందుబాటులోకి రానుంది. తమ పెట్టుబడులపై ప్రతిఫలాలు రావచ్చు అన్న అంచనాతో టార్గెట్లపై ఆపరేటర్లు పని చేస్తున్నారు. టాప్ 100 భారతీయ నగరాల్లో 5జి కవరేజ్ ప్లానింగ్ ను ఇప్పటికే పూర్తి చేసి నట్లుగా జియో ప్రకటించింది. 2024 నాటికి దేశంలో గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని నగరాల్లోనూ కవర్ చేయాలన్న సంకల్పంతో ఎయిర్ టెల్ ఉంది. నా ముందున్న ఆప్షన్లు ఏంటి? వివిధ ధరల శ్రేణుల్లో యాపిల్ ఐఫోన్లు, సామ్ సంగ్, షావోమి, పోకో, రియల్ మి, వివో వంటి బ్రాండ్లు 5జి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్నాయి. 5జి చిప్ సెట్ తయారీ సంస్థలైన మీడియా టెక్, క్వాల్ కమ్ వంటి వాటితో వ్యూహా త్మక ఒప్పందాలతో ఓఈఎంలు చాలా తక్కువ ధరకే అంటే రూ. 15,000లకే 5జి స్మార్ట్ ఫోన్లను అందించ గలుగుతున్నాయి. ఇది 5జి సేవల కోసం మరింత మంది ముందుకు వచ్చేలా చేస్తుంది. రియల్ మి వంటి బ్రాండ్లు రూ.10,000 లోపుగానే 5జి ఫోన్లను అందించేందుకు వాగ్దానం చేశాయి. 5జి స్మార్ట్ ఫోన్లను కొనాలనుకునే వినియోగదారులు అనుకూలతలు, ప్రతికూలతలు అన్ని ఒకసారి బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. తమకు సరిపోయే ఫీచర్లు గల ఫోన్ కోసం చూడాలి. 5జీ ఫోన్ కొనేటప్పుడు ఏయే అంశాలను చూడాలి? కొత్త ఫోన్ కొనేటప్పుడు 5జి తో పాటు మరెన్నో ఇతర అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. 5జి అనేది నేడు ఫోన్లకు ఒక తప్పనిసరి ఆవశ్యకతగా మారింది. రిటైల్ బాక్స్ లపై ‘‘5జి’’ అని ముద్రించబడి ఉంటుంది. అది ఒక్కటి మాత్రమే సరిపోదు. మరే ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టాలో చూద్దాం. 5-జి రెడీ ఫోన్ ఒక్కటే సరిపోదు. ఏ విధమైన 5జి బ్యాండ్స్ ను మీ ఫోన్ సపోర్ట్ చేస్తుందో కూడా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమాచారం ఫోన్ రిటైల్ బాక్స్ పై సులభంగా అందుబాటులో ఉంటుంది. 5జి స్పెక్ట్రమ్ లో మూడు బ్యాండ్స్ ఉంటాయి, వీటినే టెలికాం కంపెనీలు పొందాయి. లో – బ్యాండ్, మిడ్ -బ్యాండ్, హై- బ్యాండ్. లో-బ్యాండ్ అనేది 700MHz స్పెక్ట్రమ్ ను కలిగిఉంటుంది. దీన్నే n28గా కూడా వ్యవహరిస్తారు. మిడ్ బ్యాండ్ అనేది 3500MHz ను కలిగి ఉంటుంది. దీన్నే n78 అని వ్యవహరిస్తారు. దాదాపుగా ప్రతీ 5జి ఫోన్ కూడా n78 ను సపోర్ట్ చేస్తుంది. కానీ బాగా ఖరీదైన ఫోన్లలోనే n28ను మీరు గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే 700MHz అనేది స్టాండ్ అలోన్ 5జి సేవలకు ఉద్దేశించింది. రిలయన్స్ జియో ఒక్కటి మాత్రమే దీన్ని అందించగలదు. హై-బ్యాండ్ అనేది 26GHz స్పెక్ట్రమ్ ను కలిగిఉంటుంది. దీన్ని mmWave గా, n258గా వ్యవహరిస్తారు. చాలా కొద్ది ఫోన్లు మాత్రమే n258ను సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే, ఇది mmWave కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ 5జి ఆరంభంలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. 5జి ఎంత వేగంగా ఉండవచ్చు? ప్రపంచవ్యాప్తంగా 5జి నెట్వర్క్ లు వినియోగదారులకు 1జీబీపీఎస్ కు మించిన వేగాన్ని అందించగలుగు తున్నాయి. భారతీయ టెల్కోలు 4జి కన్నా అధికంగా డౌన్ లోడ్, అప్ లోడ్ వేగాలను అందించేందుకు వాగ్దానం చేశాయి. అయితే, 5జి స్పీడ్ అనేది ఆపరేటర్ పైనే గాకుండా, లొకేషన్ పై కూడా ఆధారపడి ఉంటుంది. 5జి ఫోన్లో 4జి సిమ్ కార్డ్ పని చేస్తుందా? మీ ప్రస్తుత 4జి సిమ్ కార్డ్ కొత్త 5జి ఫోన్లోనూ ఖచ్చితంగా పని చేస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, SMS మరియు వాయిస్ కాలింగ్ వంటి 4జి మరియు 5జి సేవలను పొందొచ్చు. భారతీయ టెలికాంలు NSA 5జి సాంకేతికతను అవలంబించడంతో, వారి ప్రస్తుత 4జి సిమ్ కార్డ్ Rel 99+ ప్రమాణానికి మద్దతు ఇస్తుంది. ఈ ప్రమాణం 2జి, 3జి, 4జి, మరియు 5జి సేవలు అందించేందుకు అనుకూలంగా ఉంటుంది. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
మారుమూల గ్రామాలకూ 4జీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మొబైల్ సిగ్నల్స్ రాని మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో 4జీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలోని 1,218 గ్రామాల్లో 4జీ మొబైల్ సర్వీస్‌లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర టెలి కమ్యూనికేషన్స్ శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే దీని టెండర్లు పూర్తయ్యాయి. దేశ వ్యాప్తంగా 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించనుండగా.. వాటిలో 1,218 గ్రామాలు ఏపీలో ఉన్నాయి. రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గడ్‌లో 699, జార్ఖండ్‌లో 827, మహారాష్ట్రలో 610, ఒడిశాలో 3,933 గ్రామాల్లో తాజాగా మొబైల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ జిల్లాలో జి.మాడుగుల, ముంచంగిపుట్టు, నిమ్మలపాడు వంటి మండలాల్లోని గ్రామాలకు కొత్తగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో 3 జిల్లాల్లో 1,218 ప్రాంతాల్లో 4జీ సర్వీసులు అందిస్తారు. ఇందుకోసం 771 టవర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆదేశించింది. ఒక్కో టవర్ ఎత్తు 40 మీటర్లకు తగ్గకుండా ఏర్పాటు చేస్తారు. మొబైల్ ద్వారా మాట్లాడుకోవడమే కాకుండా, ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ డేటా కూడా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి టవర్ కూడా 24 గంటలూ పనిచేసేలా ఉంటుంది. ఏపీలో 1,218 గ్రామాల్లో ఒక్క విశాఖలోనే 1,054 గ్రామాలకు 4జీ సేవలు అందుబాటులోకి వస్తుండగా, విజయనగరం జిల్లాలో 154, వైఎస్సార్ జిల్లాలో 10 ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఏపీలో కోటి మందికి స్మార్ట్ ఫోన్‌లున్నట్టు ట్రాయ్ తేల్చింది. కొత్తగా 1,218 గ్రామాల్లో 4జీ మొబైల్ సేవలు అందుబాటులోకొస్తే.. స్మార్ట్ ఫోన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
'జియో ఫోన్ నెక్ట్స్'నే ఎందుకు కొనాలి, లెక్కలతో ఏకిపారేస్తున్న నెటిజన్లు..!
దీపావళి సందర్భంగా జియో సంస్థ ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేస్తున్నట్లు కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జియో సంస్థ ఫోన్ ఫీచర్లు, ధరల్ని అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటనతో నెటిజన్లు తమదైన స్టైల్ స్పందిస్తున్నారు. లెక్కలేసి మరి ఫోన్ ధర రూ.6,499 కాదని, అంతకంటే ఎక్కువగానే ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్లో ట్రోల్స్ ట్రెండ్ అవుతుండగా.. ఫోన్ ధర తాము ఊహించినదానికంటే ఎక్కువగానే ఉందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్లో జియో ఫోన్ పై ట్రోల్స్ జీరో సీఎంఏ స్టూడెంట్ అనే ట్విట్టర్ యూజర్.. నేను జియో ఫోన్ నెక్ట్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి? జియో సంస్థ ప్రకటించిన ధర ఒకలా ఉంది. కానీ ప్లాన్లను కౌంట్ చేస్తే కాస్ట్ ఎక్కువైతుందని ట్వీట్ చేశాడు. Hello @reliancejio @JioCare @GoogleIndia Can u tell me pls,why should I choose ur Jio next phone? 1999+501+(18*500)= 10800+2500 =13,300 When compared to other best brand than jio next phone cost will be =6100+(18*199) = 9700Rs. Where is affordability in your product? pic.twitter.com/YvOieFSkg8 — Zero (@CMA_Student_21) October 30, 2021 జియో సంస్థ చెప్పిన కాస్ట్ ఇలా ఉంటే.. ఫోన్ అసలు ధర ఇలా ఉందని మరో నెటిజన్ ఉత్సవ్ టెక్కీ కామెంట్ చేశాడు. This is How Much Jio Phone Next will actually cost: Phone Down Payment 1999 Processing Fee 501 Total initially 2500 5GB per Months 24 Month 7200 Total 9700 18 Month 6300 Total Rs. 8800 1.5GB/Day 24 months 10800 Total 13,300 18 months 9000 Total 11500 pic.twitter.com/UUDulYf6HQ — Utsav Techie (@utsavtechie) October 29, 2021 చదవండి: జియో ఫోన్ కంటే ధర తక్కువగా ఉన్న ఫోన్ ఇదే -
నెలకు రూ.300 చెల్లిస్తే చాలు జియో ఫోన్ మీ సొంతం..! ఫోన్ ధర ఎంతంటే..!
మరో వారంలో ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ 'జియో ఫోన్ నెక్ట్స్' విడుదల కానున్న విషయం తెలిసిందే. జియో- గూగుల్ సంయుక్తంగా రూరల్ ఏరియాల్ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను విడుదల చేయడంపై వినియోగదారులు ఈ ఫోన్ ధర, ఫీచర్స్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వారి ఆసక్తిని రెట్టింపు చేస్తూ తక్కువ డౌన్ పేమెంట్‌తో పాటు కేవలం రూ.300 నెలవారీ ఈఎంఐని చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. దీపావళి సందర్భంగా విడుదల కానున్న ఈ ఫోన్ ఈఐఎంఐతో పాటు వాయిస్ కాల్స్, డేటా వివరాల గురించి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా వెల్లడించారు. జియో వివరాల ప్రకారం భారత్‌లో విడుదల చేయనున్న 4జీ జియో ఫోన్ నెక్ట్స్‌ను జియో సంస్థ కేవలం రూ.1,999 చెల్లించి సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని 18 నెలలు లేదంటే 24 నెలల కాల వ్యవధిలో చెల్లించే సౌకర్యాన్ని అందిస్తుంది. జియో ఫోన్ ధర చిప్ సెట్ల కొరత కారణంగా భారత్‌లో కాస్త ఎక్కువ ధరకే జియో ఫోన్ మార్కెట్ లో విడుదల కానుంది. మన దేశంలో జియో ఫోన్ ధర రూ.6,499గా నిర్ణయించింది. అయితే, కస్టమర్లు బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే రూ.1,999 ను డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 18-24 నెలల్లోగా పే చేయాలి. ఇందుకోసం జియో నాలుగు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. జియో ఫోన్ నెక్ట్స్ : కస్టమర్ల కోసం నాలుగు ప్లాన్లు మొదటి ప్లాన్ : ఆల్వేస్ ఆన్ ప్లాన్ కింద 18 లేదా 24 నెలల కాల వ్యవధిలో కస్టమర్లు ఎంపిక చేసుకున్న ఈఎంఐని బట్టి రూ.350 లేదా రూ.300 మాత్రమే చెల్లించాలి. ఇందులో వినియోగదారులు నెలకు 5జీబీ డేటా ప్లస్ 100నిమిషాల టాక్‌టైమ్‌ను కూడా పొందుతారు. రెండవ ప్లాన్ : జియో ఫోన్ నెక్ట్స్ లార్జ్ ప్లాన్ కింద కస్టమర్లు 18 నెలలకు రూ.500, 24 నెలలకు రూ.450 చెల్లించాలి. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌ను పొందవచ్చు. మూడో ప్లాన్ : జియో ఫోన్ నెక్ట్స్ కోసం జియో మూడవ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎక్స్ఎల్ అని పిలిచే మూడో ప్లాన్‌లో వినియోగదారులు 18 నెలలకు రూ. 550 లేదా 24 నెలలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు ప్రతిరోజూ 2జీబీ హై స్పీడ్ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాల్గవ ప్లాన్ : చివరిగా నాల్గవ ప్లాన్ ఎక్స్ ఎక్స్ఎల్ ప్లాన్. ఈ ప్లాన్‌లో జియో ఫోన్ కొనుగోలుదారులు నెలకు రూ. 600 చొప్పున 18 నెలల పాటు లేదా 24 నెలల పాటు రూ. 550 చెల్లించాలి. ఈ ఆఫర్ వినియోగదారులకు 24 నెలల పాటు అపరిమిత వాయిస్ కాల్లతో పాటు రోజుకు 2.5జీబీ 4జీ డేటాను పొందవచ్చు. జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లు డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 ) స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ర్యామ్,స్టోరేజ్ : 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు బ్యాక్ కెమెరా: 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ బ్యాటరీ: 3500 ఎంఏహెచ్ సిమ్ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్) సిమ్ పరిమాణం: నానో కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ అంతేకాదు ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్ ను గూగుల్ డెవలప్ చేసింది. జియో ఫోన్ నెక్ట్స్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ పెద్దగా చదవడం, ట్రాన్స్‌లేట్ చేసుకునేలా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. జియో ఫోన్ నెక్ట్స్ మై జియో, జియో సినిమా,జియో టీవీ, జియో సావన్‌తో పాటు మరికొన్ని యాప్‌లను ఇన్స్టాల్ చేసుకునే సదుపాయం ఉంది. చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..! -
నోకియా 5జీ ఫోన్ వచ్చేసింది, అద్భుతమైన ఫీచర్లతో..
ఒకప్పుడు బేసిక్, ఫీచర్ మోడళ్లతో ఓ వెలుగు వెలిగిన నోకియా ఇప్పుడు 4జీ, 5జీ ఫోన్లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను శాసించేందుకు కొత్త కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇటీవల బండకేసి బాదినా పగలని ఎక్స్ఆర్20ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది నోకియా. ఇప్పుడు అఫార్డబుల్ ప్రైస్‌లో నోకియా జీ సిరీస్‌లో 5జీ ఫస్ట్ ఫోన్‌ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోన్ యూకే మార్కెట్లో అందుబాటులో ఉండగా..మరికొద్ది రోజుల్లో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. నోకియా జీ50 స్పెసిఫికేషన్లు నోకియా జీ50 ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్లో విడుదల కానుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాల్ట్‌ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్,173.83x77.68x8.85 ఎంఎం, 6.82 అంగుళాల డిస్ప్లే, బ్రైట్నెస్ కోసం 450నిట్స్, 4 జీబీ ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480ఎస్ఓఎస్,48 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 5మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ షూటర్, 2మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. 64జీబీ ఇంట్రనల్ కెమెరా,512జీబీ వరకు మైక్రో ఎస్డీ కెమెరా,4జీ, 5జీ నెట్‌వర్క్‌లకు కనెక్టివిటీ ఆప్షన్, వైఫై 802.11ఏసీ,వీ5.0 బ్లూటూత్,జీపీఎస్-ఏజీపీఎస్ ట్రాకర్,ఎన్ఎఫ్సీ(Near-field communication),యూఎస్బీ, టైప్‌సీ పోర్ట్, సెన్సార్లను రిసీవ్ చేసుకునేందుకు యాంబీనెట్ లైట్, ఫోన్ ఆటో రొటేట్ కోసం జిరోస్కోప్ ఫీచర్లను యాడ్ చేసింది. ఫోన్ ధర నోకియా జీ50 4జీబీ ర్యామ్ 64 ఇంట్రనల్ స్ట్రోరేజ్తో వస్తున్న ఈ ఫోన్ ధర యూకే మార్కెట్లో రూ.20వేలల్లో లభ్యం కానుంది. మిడ్నైట్ సన్, బ్లూ ఓషన్ కలర్స్‌లో లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ 5జీ ఫోన్ యూకే మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తుండగా.. మరోవైపు అఫార్డ్బుల్ ప్రైస్‌లో 4జీ మోడల్ ఫోన్లు నోకియా జీ10,నోకియా జీ20 ఫోన్లను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. చదవండి: జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా బడ్జెట్ ఫోన్ -
ప్రపంచంలోనే అతి చిన్న 4జీ స్మార్ట్‌ఫోన్..! ధర ఏంతంటే..?
Mony Mint World Smallest 4G Smartphone: ప్రపంచంలోనే అతి చిన్న 4జీ సపోర్ట్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాకు చెందిన మోనీ మింట్ రూపొందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏటీఎమ్ కార్డు సైజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మోనీ మింట్ స్మార్ట్‌ఫోన్ మూడు అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండనుంది. అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ నెలలో అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.మోనీ మింట్ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు 150 డాలర్లు(సుమారు రూ. 11,131) గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లలోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తోందనే విషయం కంపెనీ తెలపలేదు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ అమెరికా, యూరోపియన్ నెట్వర్క్ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. మోనీ మింట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ 1,250mAh పాలిమర్ బ్యాటరీ 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 854*450 రిసల్యూషన్ డిస్ప్లే 1.5గిగా హెర్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, ఎక్సపాండబుల్ అప్టూ 128 జీబీ డ్యూయల్ సిమ్ కార్డు సపోర్ట్ -
అంతా 5జీ మయం, 2024 కి ఎంత పెరుగుతుందంటే
5జీ..! హ్యూమన్ లైఫ్ స్టైల్‌ని కంప్లీట్‌గా మార్చేసుందుకు దూసుకొస్తున్న టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరగడం వల్ల 5జీ నెట్ వర్క్ సంస్థలు 2021లో 19.91 బిలియన్ డాలర్లను అర్జించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ రీసెర్చ్ దిగ్గజం గ్రాంటార్ డేటాను విడుదల చేసింది. 5జీ నెట్ వర్క్. ఒక్క మాటలో చెప్పాలంటే కాకులు దూరని కారడవిలో సైతం నెట్ కనెక్టివిటీ, మొబైల్ నెట్ వర్కింగ్ వ్యవస్థతో పాటు..వర్చవల్ రియాల్టీ, ఓటీటీ,ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మానవ మేధోసంపత్తితో అద్భుతాలు సృష్టించేందుకు ఉపయోగపడనుంది. అయితే దీని వల్ల దేశ భద్రత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నా..టెక్నాలజీతో వాటన్నింటికి చెక్ పెట్టొచ్చని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయా సంస్థలు 5జీ టెక్నాలజీని విస్తరించే పనిలోపడ్డాయి. ముఖ్యంగా కోవిడ్-19 వల్ల యూజర్లు ఆల్ట్రా ఫాస్ట్ బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటీకి ఆప్టిమైజ్ అవ్వడంతో పాటు స్ట్రీమింగ్ వీడియోస్, ఆన్ లైన్ గేమ్స్, సోషల్ మీడియా అప్లికేషన్ల వినియోగం పెరిగిందని గ్రాంట్రార్ రీసెర్చ్ సీనియర్ ప్రిన్సిపల్ రీసెర్చ్ మైఖెల్ పొరౌస్కి తెలిపారు.5జీ వైర్లెస్ నెట్ వర్క్ ఇన్ఫ్రాస్టెక్చర్ మార్కెట్ విస్తరించడంతో పాటు..కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ (సీఎస్పీ)తో 5జీ నెట్ వర్క్‌తో పనిచేసే ఫోన్ల వినియోగం పెరిగిందని వెల్లడించారు. దీంతో 2020 లో 5జీ నెట్ వర్క్ ఇన్ ఫ్రాస్ట్రెక్చర్ వినియోగం వల్ల వరల్డ్ వైడ్‌గా 13.7బిలియన్ల రెవెన్యూ రాగా..2021లో 39 శాతం పెరిగి 19.91 బిలియన్ డాలర్లు చేరుకున్నట్లు ఐటీ రీసెర్చ్ దిగ్గజం గ్రాంటార్ రిపోర్ట్‌లో పేర్కొంది. టైర్ 1 సిటీస్‌లో 60శాతం వినియోగం గ్రాంటర్ రిపోర్ట్ ప్రకారం.. 2020లో 10 శాతం వినియోగంలో ఉన్న సీపీసీ నెట్ వర్క్ 2024కి 60శాతం పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా టైర్ 1 సిటీస్ లో ప్రస్తుతం లాంగ్ టర్మ్ ఎవెల్యూషన్ (ఎల్టీఈ) కమ్యూనికేషన్ తో వినియోగించే 4జీ నెట్ వర్క్ నుంచి 5జీ నెట్ వర్క్‌కు మార్చుకుంటారని గ్రాంటార్ రీసెర్చ్ మైఖెల్ పొరౌస్కి తెలిపారు. -
ఐటెల్ నుంచి అతి తక్కువ ధరకే 4జీ ఫోన్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐటెల్ అతి తక్కువ ధరలో 4జీ మొబైల్‌ను లాంచ్ చేసింది. మ్యాజిక్ సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఐటెల్ మ్యాజిక్-2 4జీ మొబైల్లో వైఫై, హట్‌స్పాట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సుమారు ఎనిమిది డివైజ్‌లను కనెక్ట్ చేసుకొవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఫోన్ డ్యూయల్ 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తోంది. కాగా ఈ ఫోన్ ధరను రూ. 2,349గా నిర్ణయించారు. బ్లూ, బ్లాక్ వేరియంట్లలో లభించనుంది. ఐటెల్ మ్యాజిక్-2 4జీ ఫీచర్లు 2.4-అంగుళాల 3డీ కర్వ్డ్ డిస్ప్లే 128 ఏంబీ ర్యామ్, 64 జీబీ ఎక్పపాండబుల్ స్టోరేజ్ 1,900 ఎంఏహెచ్ బ్యాటరీ 1.3 ఎంపీ రియర్ కెమరా విత్ ఫ్లాష్ వైఫై, హట్‌స్పాట్ బ్లూటూత్ చదవండి: పవర్ ఫుల్ ప్రాసెసర్ తో విడుదలైన రియల్మీ జీటీ 5జీ -
కేవలం రూ.4 వేలకే ఐటెల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
ఐటెల్ ఏ23 ప్రో ఎంట్రీ లెవల్ 4జీ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదలైంది. ఇది రెండు రంగు కలర్స్ తో లభిస్తుంది. ఐటెల్ ఏ23 ప్రో ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ మీద నడుస్తుంది. ఇది సింగిల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఎంట్రీ లెవల్ ఫోన్ కావడంతో, డిస్ప్లే చుట్టూ మందపాటి బెజెల్స్‌తో టాప్ బెజెల్ హౌసింగ్ సెల్ఫీ కెమెరా ఉంది. ఐటెల్ ఏ23 ప్రో రిటైల్ ధర రూ. 4,999, కానీ రిలయన్స్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ కింద రూ.3,899 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐటెల్ ఏ23 ప్రో ఫీచర్స్: 5 అంగుళాల డిస్ ప్లే క్వాడ్-కోర్ యునిసోక్ SC9832E ప్రాసెసర్ 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 0.3 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా డ్యూయల్ సీమ్ 4జీ, వై-ఫై, వోల్టిఈ, జీపీఎస్, బ్లూటూత్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ మైక్రో-యుఎస్బి చార్జర్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ 2,400 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి: ఉద్యోగుల భద్రత కోసం తగ్గేది లేదు: ఎల్అండ్టీ -
2021 ప్రారంభంలో జియో ఎంట్రీ లెవల్ 4జీ ఫోన్
రిలయన్స్ జియో గూగుల్ సహకారంతో రాబోయే ఎంట్రీ లెవల్ ఫోన్‌ను 2021 మొదటి త్రైమాసికంలో లాంచ్ చేయబోతున్నట్లు ఒక నివేదిక తెలిపింది. ఈ ఫోన్ డిసెంబరు నాటికి వస్తుందని అందరూ ఊహించారు. కానీ, జియో ఆండ్రాయిడ్ ఫోన్ ఇంకా పరీక్ష దశలో ఉండటం వల్ల దీనిని తీసుకురావడానికి మరో 3 నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. భారతదేశంలో ప్రజలను ఆకర్షించడానికి జియో తీసుకురాబోయే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 4,000 ఉండనున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం రానున్న రెండేళ్లలో 20 కోట్ల స్మార్ట్ ఫోన్లను జియో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.(చదవండి: గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్) జూలైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ 4జీ ఫోన్ ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. జియోలో 7.7శాతం వాటా కోసం గూగుల్ 33,737కోట్లు పెట్టుబడి పెట్టింది. గూగుల్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం త్వరలో రాబోయే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ గో ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నట్లు సమాచారం. 2017 జులైలో మనదేశంలో మొదటి 4జీ ఫీచర్ ఫోన్‌ను జియో లాంచ్ చేసింది. ఆ తర్వాత జియో ఫోన్ 2ను జియో లాంచ్ చేసింది. "జియో ప్లాట్‌ఫామ్ భాగస్వామ్యం ద్వారా దేశంలో మరింత ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని" అని గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ తెలిపారు. గూగుల్‌తో పాటు క్వాల్ కాం కూడా జియోలో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. మనదేశానికి 5జీ కనెక్టివిటీ తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫేస్బుక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్, ముబదాలా, ఎడిఐఎ, టిపిజి, ఎల్ కాటర్టన్, పిఐఎఫ్, ఇంటెల్ క్యాపిటల్ మరియు క్వాల్కమ్ వెంచర్స్ తర్వాత జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెట్టిన 14వ పెట్టుబడిదారుగా గూగుల్ నిలిచింది. -
డేటా వాడేస్తున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో వైర్లెస్ డేటా వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. 2014లో కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం జనవరి–సెప్టెంబర్‌లో ఇది ఏకంగా 5,491.7 కోట్ల జీబీగా నమోదైంది. 2017లో వినియోగదార్లు 2,009 కోట్ల జీబీ డేటాను వాడారు. 2014తో పోలిస్తే వైర్లెస్ డేటా యూజర్ల సంఖ్య 28.16 కోట్ల నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి 66.48 కోట్లకు చేరారు. 2017తో పోలిస్తే 2018లో యూజర్ల వృద్ధి 36.36 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో డేటా వాడకం ఊహించనంతగా అధికమవుతోందని ట్రాయ్ అంటోంది. ‘4జీ/ఎల్టీఈ రాక, ఈ టెక్నాలజీ విస్తృతితో ఇది సాధ్యమైంది. దేశంలో మొబైల్ నెట్వర్క్స్ అత్యధిక ప్రాంతం 2జీ నుంచి 4జీకి మారడం, అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లు లభించడం ఇంటర్నెట్ వాడకాన్ని పెంచింది. మొబైల్ టారిఫ్‌లు పడిపోవడం, ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో కంటెంట్ లభించడం కూడా ఇందుకు దోహదం చేసింది. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం కోట్లాది మందిని సాధికారత వైపు నడిపింది. వీరికి రియల్ టైమ్ సమాచారం, ప్రభుత్వ సేవలు, ఈ–కామర్స్, సోషల్ మీడియా ఎప్పటికప్పుడు చేరింది. దీంతో వీరి జీవితాలపై సానుకూల ప్రభావం చూపింది’ అని ట్రాయ్ తెలిపింది. -
రూ.2 వేల ఎయిర్టెల్ క్యాష్‌బ్యాక్
సాక్షి, ముంబై: ఎయిర్టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు శుభవార్త. ఫెస్టివ్ సీజన్లో భారతి ఎయిర్టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా 4జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.2 వేలు క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో మంగళవారం ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. ఆన్‌లైన లేదా ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా 4జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినవారు ఈ ఆఫర్‌ను దక్కించుకోవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 31, 2018తో ముగియనుంది. 4జీ స్మార్ట్ఫోను కొనుగోలు చేసిన తరువాత ఎయిర్టెల్ 4జీ సిమ్ వేసి మై ఎయిర్టెల్ యాప్ ద్వారా ఫ్రీ ఆఫర్లను క్లెయిమ్ చేసుకోవాలి. ఇలా వారి అకౌంట్లోకి రూ.50 విలువైన 40 కూపన్లు క్రెడిట్ అవుతాయి. వాటిని తరువాత చేసుకునే రీ ఛార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర రాయితీ పొందవచ్చు. ఈ కూపన్లను వాడుకోవాలనుకునే ప్రీ పెయిడ్ కస్టమర్లు రూ.199, రూ.249, రూ.448 ప్లాన్లను వాడాల్సి ఉంటుంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లు రూ.399 ఆపైన విలువ గల ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవాలి. నగదు చెల్లింపు పథకం మొదటి 40 నెలలు చెల్లుబాటు అవుతుంది. ఒక రీచార్జ్‌కి ఒక కూపన్‌ను మాత్రమే రిడీమ్ చేసుకునే అవకాశం. -
భలే ఆఫర్ : రూ. 3,399కే 4జీ స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో అతి తక్కువ ధర 3,399 రూపాయలకే 4జీ స్మార్ట్ఫోన్లను ఆఫర్ చేయనున్నట్టు వెల్లడించింది. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ ప్లాన్‌లో భాగంగా ఈ స్మార్ట్ఫోన్లను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లపై 2600 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందుబాటులో ఉంచనున్నట్టు భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. శాంసంగ్, వన్‌ప్లస్, షావోమి, హానర్, ఎల్జీ, లెనోవో, మోటో వంటి బ్రాండ్‌డ్ ఎక్స్‌క్లూజివ్ 4జీ స్మార్ట్ఫోన్లను ఈ ఆఫర్ కింద కస్టమర్లు కొనుగోలు చేసుకోవచ్చు. కస్టమర్లకు లభ్యం కానున్న 2600 రూపాయల క్యాష్‌బ్యాక్‌లో 2000 రూపాయలను ఎయిర్టెల్ నుంచి పొందవచ్చు. ఈ మొత్తాన్ని ఎయిర్టెల్ 36 నెలల్లో అందించనుంది. అదనంగా అందించే 600 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ తన ప్లాట్‌ఫామ్‌పై చేసుకునే 169 రూపాయల ఎయిర్టెల్ రీఛార్జ్‌లపై ఆఫర్‌చేయనుంది. ఈ ఆఫర్లో భాగంగా అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మొత్తం డౌన్‌పేమెంట్ కట్టి పొందాల్సి ఉంటుంది. అమెజాన్ ఇండియాతో చేసుకున్న తాము చేసుకున్న ఈ భాగస్వామ్యం కస్టమర్ల నుంచి సానుకూల స్పందన పొందుతున్న ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ కార్యక్రమానికి మరింత బూస్ట్‌ను ఇవ్వనుందని భారతీ ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణి వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కస్టమర్లకు తాము మరింత విలువైన సేవలను అందించనున్నామని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యంతో స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో సరసమైన ధరల్లో 4జీ టెక్నాలజీని కస్టమర్లు ఆస్వాదించవచ్చని అమెజాన్ ఇండియా కేటగిరీ మేనేజ్మెంట్ డైరెక్టర్ నూర్ పటేల్ తెలిపారు. పరిమితకాల వ్యవధిలో అన్ని అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్ఫోన్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు. తొలి ఇన్స్టాల్మెంట్లో 500 రూపాయలను పొందడానికి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన తొలి 18 నెలల కాలంలో 3500 రూపాయల విలువైన ఎయిర్టెల్ రీఛార్జ్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 18 నెలల కాలంలో మరో 3500 రూపాయల విలువైన రీఛార్జ్‌లు చేయించుకోవాలి. దీంతో మరో 1500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను రెండో ఇన్స్టాల్మెంట్లో ఎయిర్టెల్ నుంచి పొందవచ్చు. అంటే మొత్తంగా 2000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు పొందుతారు. అదనంగా 600 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ నుంచి పొందవచ్చు. ఆ క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి అమెజాన్ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా 169 రూపాయలతో 24 ఎయిర్టెల్ రీఛార్జ్‌లు చేయించుకోవాలి. రీఛార్జ్ చేయించుకున్న ప్రతి నెలా 25 రూపాయల చొప్పున కస్టమర్ల అమెజాన్ పే బ్యాలెన్స్‌లో క్రెడిట్ అవుతుంది. -
అతి తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానసోనిక్ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. 'పీ95' పేరుతో ఎంట్రీ లెవల్ 4 జీ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం విడుదల చేసింది. బ్లూ, గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు రూ.4,999 ధరకు ఫ్లిప్‌కార్ట్ సైట్లో లభిస్తున్నది. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ సైట్లో జరగనున్న బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో ఈ ఫోన్‌ను వెయ్యి రూపాయల తగ్గింపు ధరతో వినియోగదారులు అంటే.. 3,999 రూపాయలకే కొనుగోలు చేసుకునే అవకాశం. బడ్జెట్ ధరలో లక్షలమంది వినియోగదారులకు తమ స్మార్ట్‌ఫోన్ ఆకర్షిస్తుందనే విశ్వాసాన్ని పానసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్, పంకజ్ రాణా వ్యక్తం చేశారు. పానసోనిక్ పీ95 ఫీచర్లు 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్ 1జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 2300 ఎంఏహెచ్ బ్యాటరీ. -
వారికి బంపర్ ఆఫర్: రూ.2వేలకే స్మార్ట్‌ఫోన్
మొబైల్స్ తయారీదారు స్వైప్ టెక్నాలజీస్ బడ్జెట్ ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. కేవలం రూ.3,999 ధరకే ఈ ఎలైట్ డ్యుయల్‌ను తాజాగా విడుదల చేసింది. డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలిస్తున్నాయి. అంతేకాదు ఈ ఫోన్‌ను కొన్న యూజర్లకు రూ.2200 వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అంటే వినియోగదారులు 1,799 రూపాయలకే (రూ .3,999 - రూ .2,200) వద్ద ఫోన్ కొనుగోలు చేసే అవకాశం అన్నమాట. అయితే జియో కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందనేది గమనార్హం. జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న స్వైప్ టెక్నాలజీస్ జియో ఫుట్‌బాల్‌ఆఫర్ కింద జియో (పాత,కొత్త) ఈ ఆఫర్ అందిస్తోంది. బ్లాక్, వైట్, గోల్డ్ మూడు రంగుల్లో లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా షాప్‌క్లూస్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. స్వైప్ ఎలైట్ డ్యుయల్ ఫీచర్లు 5 ఇంచ్ డిస్ప్లే 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 1 జీబీ ర్యామ్ 8 జీబీ స్టోరేజ్ 64జీబీ దాకా విస్తరించుకనే అవకాశం 8+ 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్..
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ హ్యాండ్సెట్ తయారీదారు లావా తొలి ఆండ్రాయిడ్ ఓరియో గో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. లావా జెడ్ 50 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో ఎంట్రీ లెవల్లో 1జీబీ ర్యామ్ డివైస్లకుద్దేశించిన కొత్త ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం (గో ఎడిషన్) మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధరను 5వేల రూపాయలుగా నిర్ణయించింది. లావా జెడ్ 50 ఫీచర్లు 4.5 అంగుళాల డిస్ప్లే, 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆండ్రాయిడ్ ఓరియో గో 1.1 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ 1 జీబీ ర్యామ్ 8 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 5ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఫ్లాష్ -
ఎయిర్టెల్ మరో మైలురాయి
సాక్షి, న్యూడిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో 4జీ స్టార్ట్ఫోన్లను అందించేందుకు కొత్త వ్యూహంతో వస్తోంది. ఇందుకు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌తో సరికొత్త భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఓరియో తో కొత్త 4జీ స్మార్ట్ఫోన్లను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తోంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లకు గూగుల్ స్పెషల్‌గా డిజైన్ చేసిన ఆండ్రాయిడ్ గో ప్లాట్‌ఫాంతో ఈ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. ‘మేరా పహలా స్మార్ట్‌ఫోన్’ పథకం కింద ఆండ్రాయిడ్ గో 4జీ స్మార్ట్ఫోన్లను అందించనుంది. అదీ తక్కువ ధరలో. మై ఎయిర్టెల్ యాప్, ఎయిర్టెల్ టీవీ లాంటి ఎయిర్టెల్ యాప్స్, విన్క్ మ్యూజిక్ ప్రీ లోడెడ్‌గా వస్తున్న ఈ ఫోన్లను మార్చి నెలనుంచి అందుబాటులో తేనున్నట్టు ప్రకటించింది. ళసరసమైన ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించే ప్రయత్నాల్లో ఈ భాగస్వామ్యం ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణి వెంకటేష్ వెల్లడించారు. దీని ద్వారా ఆన్‌లైన్‌కు దూరంగా ఉన్న లక్షలమంది పీచర్ ఫోన్ వినియోగదారులు ఆన్‌లైన్‌కు చేరువవుతారన్నారు. అటు ఆండ్రాయిడ్ డైరెక్టర్ జాన్ గోల్డ్ కూడా ఈ భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ కంప్యూటింగ్ పవర్‌ను అందించడంలో తాము ముందుంటామనీ, అయితే ఈ క్రమంలో ఎయిర్టెల్ లీడ్ రోల్ పోషించడం అభినందనీయమంటూ ఈ డీల్‌ను స్వాగతించారు. -
ఆ ఫోన్లపై ఎయిర్టెల్ రూ.2 వేల క్యాష్‌బాక్
న్యూఢిల్లీ : ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ ప్లాన్ ప్రచారంలో భాగంగా మోటరోలా, లెనోవా 4జీ స్మార్ట్ఫోన్లపై టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్ టెల్ రూ.2 వేల క్యాష్‌బాక్ ఆఫర్‌ను ప్రకటించింది. మోటో సీ, మోటో ఈ4, లెనోవో కే8 నోట్ మొబైళ్లకు మాత్రమే ఈ క్యాష్‌బాక్ వర్తిస్తుంది. క్యాష్‌బాక్ ఆఫర్లో భాగంగా మోటో సీ మొబైల్ రూ.3,999 , మోటో ఈ4 మొబైల్ రూ.6,499, లెనోవో కే8 నోట్ రూ.10,999 లకే లభిస్తుంది. స్మార్ట్ఫోన్లు అత్యంత దిగువస్థాయి కస్టమర్లకు కూడా లభ్యమయ్యేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు భారతీ ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణి వెంకటేశ్ తెలిపారు. -
ఐడియా రూ.2వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్
సాక్షి, ముంబై: టెలికా ఆపరేటర్ ఐడియా గురువారం కొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రటకించింది. ఇప్పటివరకూ డేటా వార్తో కస్టమర్లను ఆకట్టుకున్న టెలికాం సంస్థలు ఇపుడిక క్యాష్‌బ్యాక్‌లపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా జియో, ఎయిర్టెల్ తరహాలో ఐడియా కూడా 4 జీ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి 2,000 రూపాయల క్యాష్ బ్యాక్ అందించనుంది. ఫిబ్రవరి 23 శుక్రవారం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఐడియా ప్రకటించింది. 4జీ హ్యాండ్సెట్స్ ద్వారా 4జీ నెట్వర్క్కి కస్టమర్ అప్ గ్రేడ్ చేయడమే తమ లక్ష్యమని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా ప్రకటించిన ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రీపెయిడ్ , పోస్ట్ పెయిడ్ యూజర్లకి వర్తిస్తంఉది. అయితే ప్ రీపెయిడ్ యూజర్లు ప్రతినెలా రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఇందులో రోజుకు 1.4 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ లోకల్ ఎస్టీడీ) పాటు, రోజుకి వంద ఎస్ఎంస్లు ఉచితం. ఈ 199 రూపాయల రీచార్జ్ మొదటి 18 నెలల కాలంలో మూడువేల రూపాయల విలువైన రీఛార్జ్‌లు చేసుకుంటే మొదటి దఫాగా రూ. 750 క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. మరో 18 నెలల రీచార్జ్ అనంతరం మరో 1,250 రూపాయల క్యాష్ బ్యాక్ కస్టమర్లకు అందిస్తుంది. పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు, అన్ని నిర్వాణ వాయిస్ కాంబో పధకాలకు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. 36 నెలల వ్యవధిలో రూ. 389 రీచార్జ్ ప్లాన్‌తో మొదలయ్యే ప్లాన్లపై ఆఫర్ ఏప్రిల్ 30, 2018 వరకు అందుబాటులో ఉంటుంది. -
రూ . 500కే 4జీ స్మార్ట్ ఫోన్
సాక్షి, ముంబయి : మొబైల్ ఫోన్ యూజర్లకు అతితక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. నెలకు కేవలం రూ 60 రూపాయలకే వాయిస్, డేటా ప్లాన్స్‌తో రూ 500కన్నా తక్కువ ధరలో 4జీ స్మార్ట్ ఫోన్ల తయారీ కోసం టాప్ టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు హ్యాండ్సెట్ కంపెనీలతో ఈ దిశగా కసరత్తు చేస్తున్నాయి. రిలయన్స్ జియో వంటి ఆపరేటర్లు ఆఫర్ చేస్తున్న వాయిస్, డేటా ప్లాన్స్‌తో లోకాస్ట్ స్మార్ట్ఫోన్ల వైపు మళ్లుతున్న యూజర్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తరహా స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు టాప్ 3 టెలికాం ఆపరేటర్లు సన్నాహాలు చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గుముఖం పడుతున్నందున హ్యాండ్సెట్ కంపెనీలతో ఒప్పందాల ద్వారా అత్యంత చౌకైన డేటా, వాయిస్ ప్లాన్లను అందిస్తామని టెలికాం కంపెనీల ప్రతినిధి పేర్కొన్నారు. ఫీచర్ ఫోన్ల తరహాలో స్మార్ట్ఫోన్ల ధరలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని చెప్పారు. రిలయన్స జియో నుంచి విపరీతమైన పోటీని తట్టుకుని యూజర్లను నిలుపుకునేందుకే భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ ఈ నిర్ణయం తీసుకున్నాయి.