'జియో ఫోన్‌ నెక్ట్స్‌'నే ఎందుకు కొనాలి, లెక్కలతో ఏకిపారేస్తున్న నెటిజన్లు..! | Netizens Trolling After Jio Phone Next Price And Specification Release | Sakshi
Sakshi News home page

Jio Phone Next: 'జియో ఫోన్‌ నెక్ట్స్‌'పై ట్రోల్స్‌...లెక్కలతో కడిగేస్తున్నారు..!

Published Sat, Oct 30 2021 5:26 PM | Last Updated on Sat, Oct 30 2021 5:32 PM

Netizens Trolling After Jio Phone Next Price And Specification Release - Sakshi

దీపావళి సందర్భంగా జియో సంస్థ  ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియో ఫోన్‌ నెక్ట్స్‌ విడుదల చేస్తున్నట్లు కంపెనీ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జియో సంస్థ ఫోన్‌ ఫీచర్లు, ధరల్ని అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈ ప్రకటనతో నెటిజన్లు తమదైన స్టైల్‌ స్పందిస్తున్నారు. లెక్కలేసి మరి ఫోన్‌ ధర రూ.6,499 కాదని, అంతకంటే ఎక్కువగానే ఉందంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రోల్స్‌ ట్రెండ్‌ అవుతుండగా.. ఫోన్‌ ధర తాము ఊహించినదానికంటే ఎక్కువగానే ఉందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.    

ట్విట్టర్‌లో జియో ఫోన్‌ పై ట్రోల్స్‌ 

జీరో సీఎంఏ స్టూడెంట్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌.. నేను జియో ఫోన్‌ నెక్ట్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి? జియో సంస్థ ప్రకటించిన  ధర ఒకలా ఉంది. కానీ ప్లాన్‌లను కౌంట్‌ చేస‍్తే కాస్ట్‌ ఎక్కువైతుందని ట్వీట్‌ చేశాడు.

జియో సంస్థ చెప్పిన కాస్ట్‌ ఇలా ఉంటే.. ఫోన్‌ అసలు ధర ఇలా ఉందని మరో నెటిజన్‌ ఉత్సవ్‌ టెక్కీ కామెంట్‌ చేశాడు.  

చదవండి: జియో ఫోన్‌ కంటే ధర తక్కువగా ఉన్న ఫోన్‌ ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement