
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ సంస్థ యూజర్ల కోసం మరో కొత్త ఫోన్ ‘జియో ఫోన్ ప్రైమా 4జీ’ ఆవిష్కరించింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2023 (ఐఎంసీ)లో ప్రదర్శించింది. ఈ సందర్భంగా జియో ఫీచర్ ఫోన్‌లో వాట్సాప్,యూట్యూబ్,జియోపే, యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది.
ధర ఎంతంటే?
దీపావళి పండుగ నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానున్న ఈ 4జీ ఫోన్ ధర రూ.2,599గా ఉంది. జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్ షోరూంలలో కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది.
ఫీచర్లు
జియో ఫోన్ ప్రైమా 4జీ వాట్సాప్,ఫేస్‌బుక్, యూట్యూబ్‌లను వీక్షించవచ్చు. అదనంగా జియో సినిమా, జియో సావన్,జియో టీవీ, జియో,యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. 512 ఎంబీ ర్యామ్‌తో వస్తున్న ఈ షోన్ మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 128 జీబీ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. 1800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. బ్యాటరీతో ఏఆర్‌ఎం కార్టెక్స్ ఏ53 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment