reliance
-
రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతా
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వ్యవహరిస్తున్న దర్శన్ మెహతా ఆ స్థానం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రిలయన్స్ బ్రాండ్స్ వ్యాపారంలో భాగమైన ఆయన రిలయన్స్ గ్రూప్‌లో మెంటార్‌గా ఉండబోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.తదుపరి తరం నాయకులకు మెహతా మార్గదర్శకత్వం వహిస్తారని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ గ్రూప్‌లో వ్యాపార అవకాశాలను విశ్లేషించడానికి, కొత్త వాటిని అన్వేషించడానికి కూడా ఆయన సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపింది. మెహతా రిలయన్స్ బ్రాండ్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. రిలయన్స్ బ్రాండ్స్ మొదటి ఉద్యోగుల్లో మెహతా కీలక వ్యక్తిగా ఉన్నారు. 2007లో రిలయన్స్ బ్రాండ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంస్థలోనే కొనసాగుతున్నారు. గతంలో ఆయన అరవింద్ బ్రాండ్స్ వంటి కంపెనీల్లో పని చేశారు. విలాసవంతమైన, ప్రీమియం విభాగాల్లో రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు మెహతా కృషి చేశారు.ఇదీ చదవండి: ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్ రాజన్గడిచిన కొన్నేళ్లుగా రిలయన్స్ బ్రాండ్స్ అనేక గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. బాలెన్సియాగా, జిమ్మీ చూ, బొట్టెగా వెనెటాతో సహా 90 కంటే ఎక్కువ బ్రాండ్లు రిలయన్స్ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నాయి. ఈ సంస్థ స్వదేశీ డిజైనర్ బ్రాండ్లను కూడా పరిచయం చేస్తోంది. మెహతా అనంతరం రిలయన్స్ బ్రాండ్‌కు కొత్త ఎండీని నియమించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి రిలయన్స్ బ్రాండ్లను పర్యవేక్షిస్తూ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉన్న వికాస్ టాండన్, దినేష్ తలూజా, ప్రతీక్ మాథుర్, సుమీత్ యాదవ్‌లతో కోర్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!
ఆటబొమ్మలతో ఆడుకోవడం పిల్లలందరికీ ఇష్టమైన వ్యాపకం. ప్రపంచంలోని ప్రతిచోటా పిల్లలందరూ ఆటబొమ్మలను ఇష్టపడతారు. కొందరు అందుబాటులో ఉన్న వస్తువులనే ఆటబొమ్మలుగా మలచుకుని, వాటితో ఆటలాడుకుంటారు. ఇంకొందరు డబ్బులు వెచ్చించి రకరకాల రంగురంగుల ఆటబొమ్మలను కొనుక్కుని ముచ్చట తీర్చుకుంటారు. ఆటబొమ్మలపై పిల్లలకు ఉండే సహజ వ్యామోహం కొందరికి వ్యాపారావకాశం కూడా! పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటబొమ్మలను అమ్మే దుకాణాలు వెలిశాయి. వీటిలో అత్యంత పురాతనమైనది ‘హామ్లీస్’ టాయ్ స్టోర్. బ్రిటిష్ రాజధాని లండన్ నగరంలో ఉందిది. విలియమ్ హామ్లీ అనే ఆసామి 1760లో లండన్‌లోని హై హాల్‌బోర్న్ వీ«థిలో దీనిని నెలకొల్పాడు. తర్వాత కొద్దికాలానికే రీజెంట్ స్ట్రీట్‌కు దుకాణాన్ని తరలించాడు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, అత్యంత పెద్దదయిన ఆటబొమ్మల దుకాణంగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకెక్కడం విశేషం. మొదట్లో ఇది ఒకే దుకాణంగా మొదలైనా, తర్వాతి కాలంలో శాఖోపశాఖలుగా ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించింది. భారత్‌లో కూడా దీని శాఖలు ఉన్నాయి. తరతరాలుగా బ్రిటిష్ రాచకుటుంబానికి అభిమాన ఆటబొమ్మల దుకాణంగా ఉన్న ‘హామ్లీస్’ చేతులు మారి, ప్రస్తుతం రిలయన్స్ రీటెయిల్ కంపెనీ చేతిలోకి వచ్చింది.‘హామ్లీస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్’కు చెందిన వందశాతం వాటాలను రిలయన్స్ రీటెయిల్ కంపెనీ 2019లో సొంతం చేసుకుంది. రీజెంట్ స్ట్రీట్‌లోని ‘హామ్లీస్’ స్టోర్ 2010లో తన 250వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ప్రస్తుతం ‘హామ్లీస్’కు బ్రిటన్‌లో 11 శాఖలు, మిగిలిన దేశాల్లో 90 శాఖలు ఉన్నాయి. అత్యంత పురాతనమైన ఈ దుకాణంలో దొరకని ఆటబొమ్మలు అరుదు. (చదవండి: -
రిలయన్స్, డిస్నీ విలీనం: దిగ్గజ మీడియా సంస్థగా..
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీకి చెందిన మీడియా వ్యాపారాల విలీనం పూర్తయింది. ఈ విలీనం ఏకంగా రూ.70,352 కోట్ల విలువైన కొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. రిలయన్స్ - డిస్నీ విలీనంతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యం అవతరించింది.జాయింట్ వెంచర్ వృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 11,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థకు నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు, వైస్ చైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ ఉంటారు. విలీన కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.34 శాతం వాటాను, వయాకామ్ 18 46.82 శాతం వాటాను, డిస్నీ 36.84 శాతం వాటాను పొందుతాయి.కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ), జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి విలీనానికి కావలసిన అనుమతులు కూడా ఇప్పటికే లభించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ విలీనం తరువాత వీటి కింద సుమారు 100 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్ ఉండనున్నాయి. ఇవి ఏడాదికి 30,000 గంటల కంటే ఎక్కువ టీవీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను ఉత్పత్తి చేయగలవని సమాచారం.ఇదీ చదవండి: ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ జాయింట్ వెంచర్ భారతదేశ వినోద పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ప్రపంచ స్థాయి డిజిటల్ స్ట్రీమింగ్ సామర్థ్యాలతో పాటు డిజిటల్ ఫస్ట్ అప్రోచ్‌తో భారతీయులకు మాత్రమే కాకుండా.. ప్రవాస భారతీయులకు సరసమైన ధరలకు అసమానమైన కంటెంట్ ఆప్షన్స్ అందించటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. -
పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...!
పెళ్లి తరువాత అమ్మాయిలకు అత్తింటి పేరు వచ్చి చేరడం సాధారణం. అయితే ఇది వారి వ్యక్తిగత ఇష్లాలు, ఆచారాలను బట్టి కూడా ఉంటుంది. తాజాగా రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించిన అంబానీ ఇంటి కోడలు రాధికా మర్చంట్ పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత, రాధిక మర్చంట్ తన పేరులో 'అంబానీ'ని అధికారికంగా చేర్చుకుంది. రాధికా మర్చంట్ తన భర్త అనంత్ అంబానీ ఇంటిపేరును తన పేరులో చేర్చుకోవడంతో ‘రాధిక అంబానీ’గా అవతరించింది. వ్యాపారవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికా మర్చంట్ తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ అనంత్ అంబానీని ఈ ఏడాది జూలైలో పెళ్లాడింది. రాధిక తన తండ్రి వ్యాపారమైన ఎన్కోర్ హెల్త్‌కేర్‌కు డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంది. ఇటీవల ఎంటర్ప్రెన్యూర్ ఇండియాతో మాట్లాడిన ఆమె తన భవిష్యత్ కెరీర్ ప్లాన్లను కూడా వివరించింది. ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించినట్లు రాధిక వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తీసుకురావాలని ఆమె భావిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి : Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
రూ.11తో 10 జీబీ డేటా!
రిలయన్స్ జియో వినియోగదారులకు కొత్తగా బూస్టర్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువగా డేటా వాడుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది. ఈమేరకు ప్లాన్ వివరాలు వెల్లడించింది.కేవలం రూ.11తో 10 జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు.ఈ ఆఫర్ వ్యాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది.రీఛార్జ్ చేసుకున్న గంట తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.ఈ ఆఫర్ కేవలం ఇంటర్నెట్ సర్వీసుకే పరిమతం. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులను ఇది అందించదు.నిర్ణీత సమయంపాటు హైస్పీడ్ డేటా అవసరమయ్యేవారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది.లార్జ్ ఫైల్స్ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్లు, డౌన్లోడ్ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది.ఇదీ చదవండి: సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు? -
సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)తో 2009లో విలీనమైన పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్)కు సంబంధించిన షేర్లలో 2007లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో ముకేశ్ అంబానీ మరో రెండు సంస్థలకు ఊరట లభించింది. ఇందుకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విధించిన జరిమానా విధింపును కొట్టివేస్తూ శాట్ (సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్) ఇచ్చిన రూలింగ్‌ను తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.ఈ విషయంలో సెబీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. శాట్ జారీ చేసిన ఉత్తర్వుపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మా జోక్యాన్ని కోరే ఈ అప్పీల్లో చట్టం ప్రమేయం లేదు. మీరు ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి వెంబడించలేరు‘ అని బెంచ్ పేర్కొంది. కేసు వివరాలు ఇవీ... » నవంబర్ 2007లో నగదు, ఫ్యూచర్స్ విభాగాల్లో ఆర్పీఎల్ షేర్ల విక్రయం, కొనుగోలులో అవకతవకలు జరిగాయన్నది కేసు సారాంశం. » 2009లో ఆర్ఐఎల్తో విలీనం అయిన లిస్టెడ్ అనుబంధ సంస్థ– ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని 2007 మార్చిలో ఆర్ఐఎల్ నిర్ణయం తీసుకుంది. » ఈ నేపథ్యంలోనే 2007 నవంబర్‌లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని, ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అదే సమయంలో కంపెనీ నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని సెబీ ఆరోపించింది.» ఈ కేసు విషయంలో సెబీ 2021 జనవరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్‌పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, అలాగే ముంబై సెజ్‌ను ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్‌లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేయడం గమనార్హం. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్‌కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ పాత్రధారులుగా మారినట్లు ఆరోపణ.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!» అంబానీ, నవీ ముంబై సెజ్, ముంబై సెజ్‌లపై 2021లో సెబీ జారీ చేసిన ఉత్తర్వులను శాట్ 2023లో రద్దు చేసింది. జరిమానాకు సంబంధించి డిపాజిట్‌గా ఉంచిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని శాట్ ఆదేశించింది. కార్పొరేట్ సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఆరోపణకు మేనేజింగ్ డైరెక్టర్‌ను బాధ్యునిగా చేయలేవని పేర్కొంది. ఇద్దరు సీనియర్ అధికారులు అక్రమ లావాదేవీలు నిర్వహించారని స్పష్టమవుతోందని, ఈ విషయంలో ముకేశ్ అంబానీ పాత్ర ఉన్నట్లు సెబీ రుజువుచేయలేకపోయిందని పేర్కొంది. ఆర్‌ఐఎల్‌పై ఆరోపణలను మాత్రం శాట్ కొట్టివేయకపోవడం గమనార్హం. » కాగా, శాట్ రూలింగ్‌ను సవాలుచేస్తూ, డిసెంబర్ 2023 డిసెంబర్ 4న సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: చిన్నారుల ఆఫర్
కొన్ని రోజులకు ముందు తీవ్ర చర్చకు దారితీసిన జియో హాట్‌స్టార్ డొమైన్ వ్యవహారం.. మళ్ళీ మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా దుబాయ్‌కి చెందిన ఇద్దరు చిన్నారులు తాము కొనుగోలు చేసిన జియో హాట్‌స్టార్ డొమైన్‌ను రిలయన్స్ సంస్థకు ఉచితంగా ఇచ్చేస్తాం అంటూ ఆఫర్ ఇచ్చారు.నిజానికి జియో హాట్‌స్టార్ విలీనం వేళ.. ఈ పేరుతో ఉన్న డొమైన్‌ను ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ ముందుగానే తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు. తాను కొనుగోలు చేసిన డొమైన్‌ను ఇవ్వాలంటే రూ. కోటి రూపాయలు ఇవ్వాలంటూ.. అంబానీకి ఆఫర్ ఇచ్చాడు. ఆ తరువాత డొమైన్‌ను దుబాయ్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు కొనుగోలు చేశారు.జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసిన చిన్నారులు.. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. ఈ డొమైన్‌ను రిలయన్స్ కంపెనీ కోరుకుంటే ఉచితంగానే ఇచ్చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక రిలయన్స్ సంస్థ నుంచి గానీ.. సంబంధిత అధికారుల నుంచి గానీ ఎలాంటి ఒత్తిడి లేదు. మనస్ఫూర్తిగానే మేము ఈ ప్రకటన చేస్తున్నామని ఆ చిన్నారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మాస్క్డ్ ఆధార్ కార్డు గురించి తెలుసా?: ఇది చాలా సేఫ్..చిన్నారులు ఇచ్చిన ఆఫర్‌కు కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతకంటే ముందు యాప్ డెవలపర్ నుంచి చిన్నారులు కొనుగోలు చేసిన తరువాత.. చాలామంది ఆ డొమైన్‌ను విక్రయించండి, అంటూ ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. కానీ ఎవరికీ డొమైన్‌ను విక్రయించలేదని వారు స్పష్టం చేశారు. కేవలం యాప్ డెవలపర్‌కు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో జియో హాట్‌స్టార్ డొమైన్ కొనుగోలు చేసినట్లు చిన్నారులు వెల్లడించారు. -
'కంగువ' టీమ్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన మద్రాసు హైకోర్టు
సౌత్ ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'కంగువ'. ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ సినిమా నిర్మాతలకు మద్రాస్ కోర్టు శుభవార్త చెప్పింది. కంగువ విడుదలను నిలిపివేయాలని రిలయన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పూర్తిగా పరిశీలించిన కోర్టు ఫైనల్ తీర్పును వెల్లడించింది. సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవని క్లారిటి ఇచ్చింది. దీంతో ముందుగా అనుకున్న సమయానికే కంగువ విడుదల కానుందని ప్రకటించింది.కంగువ నిర్మాత కేఈ.జ్ఞానవేల్ రాజా, రిలయన్స్ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో పలు చిక్కులు ఉన్నాయి. స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ తరపున టెడ్డీ-2, ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ చిత్రాల నిర్మాణం కోసం రిలయన్స్ నుంచి రూ.99 కోట్లు పైగానే జ్ఞానవేల్ రాజా రుణం పొందారు. అయితే, రూ.45 కోట్లు తిరిగి చెల్లించిన జ్ఞానవేల్ రాజా మిగిలిన రూ.55 కోట్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని రిలయన్స్ తరపున మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలైంది. అయితే, తాజాగా జరిగిన విచారణలో స్టూడియో గ్రీన్ కంపెనీ తరపున ఉన్న న్యాయవాది మాట్లాడుతూ.. రిలయన్స్ కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం డబ్బు పూర్తిగా చెల్లించామన్నారు. దీంతో లాయర్ చెప్పిన మాటలను రికార్డ్ చేసుకున్న న్యాయస్థానం కంగువ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవని తెలిపింది. జస్టిస్ అబ్దుల్ కుద్దూస్ ఎదుట ఈ కేసు విచారణకు వచ్చింది. నవంబర్ 8న రియలన్స్‌కు కేఈ.జ్ఞానవేల్ రాజా రూ. 55 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువ సినిమాలో సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ కీలకపాత్రలు చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో దీన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2,500 స్క్రీన్స్‌లలో ఈ చిత్రం విడుదలైతే.. ఉత్తరాదిలో 3,500 స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టేలా కంగువ ఉంది. -
ఇక రిలయన్స్ ‘స్నాక్స్’!
ముంబై: పంపిణీదార్లకు అధిక మార్జిన్లను అందిస్తూ క్యాంపాతో సాఫ్ట్‌డ్రింక్స్ మార్కెట్లో సంచలనం సృష్టించిన రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) తాజాగా స్నాక్స్ మార్కెట్‌పైనా గురిపెట్టింది. చిప్స్, బిస్కెట్స్ మొదలైన వాటి విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. సూపర్ స్టాకిస్ట్స్‌లకు మిగతా బ్రాండ్స్ అందించే 3–5 శాతంతో పోలిస్తే (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు కూడా కలిపి) దాదాపు రెట్టింపు ఇస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వివరించాయి. ఆర్సీపీఎల్ 6.5 శాతం ట్రేడ్ మార్జిన్‌ను ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇక డిస్ట్రిబ్యూటర్ల స్థాయిలో చూస్తే 8 శాతం మార్జిన్లతో పాటు అదనంగా 2 శాతం (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు సహా) ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. సాధారణంగా డి్రస్టిబ్యూటర్లకు ఇతర స్నాక్ బ్రాండ్స్ 6–6.5 శాతం ఆఫర్ చేస్తుంటాయి. ఆర్సీపీఎల్ అటు రిటైలర్లకు ఏకంగా 20 మార్జిన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ సెగ్మెంట్లో చాలాకాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న బ్రిటానియా, పెప్సీకో, స్థానిక కంపెనీలు, ఇతర బ్రాండ్లు ఇచ్చేది 8–15 శాతంగా (మార్జిన్లు, స్కీములు కలిపి) ఉంటోంది. ఆర్సీపీఎల్ ప్రస్తుతం చిప్స్, నమ్కీన్స్ వంటి స్నాక్స్‌కి సంబంధించి అలాన్ బ్యూగుల్స్, స్నాక్‌ట్యాక్ బ్రాండ్లను, ఇండిపెండెన్స్ పేరిట బిస్కట్ బ్రాండ్‌ను విక్రయిస్తోంది.42 వేల కోట్ల మార్కెట్..అధ్యయనాల ప్రకారం దేశీయంగా స్నాక్స్ మార్కెట్ 2023లో సుమారు రూ. 42,695 కోట్ల స్థాయిలో ఉంది. ఇది వార్షికంగా 9.08 శాతం వృద్ధి చెందుతూ 2032 నాటికి రూ. 95,522 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. దేశీ ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లుగా ఆర్సీపీఎల్ 2022లో ప్రకటించింది. ఆ తర్వాత నుంచి కంపెనీ క్రమంగా కోలా మార్కెట్లోకి చొచ్చుకుపోయే వ్యూహాలను అమలు చేయడం మొదలెట్టింది. పోటీ సంస్థలతో పోలిస్తే ఉత్పత్తులను తక్కువ ధరకే అందించడం, పంపిణీదార్లకు అధిక మార్జిన్లు ఇవ్వడం మొదలైనవి అమలు చేసింది. అమెరికాకు చెందిన అలాన్ బ్యూగుల్స్ బ్రాండ్‌ను భారత్‌కి తెస్తున్నట్లు గతేడది మే నెలలో ప్రకటించింది. సాల్టెడ్‌తో పాటు టొమాటో, చీజ్ తదితర ఫ్లేవర్లలో రూ. 10కే అందించనున్నట్లు పేర్కొంది. సాధారణంగా పెద్ద సంస్థలు మార్కెటింగ్ కోసం కేటాయించే దానిలో 10–15 శాతం కూడా ఖర్చు చేయకుండానే అమ్మకాలను పెంచుకునేందుకు సేల్స్ వ్యవస్థను కూడా ఆర్సీపీఎల్ పటిష్టం చేసుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిటైల్ స్టోర్స్‌లో వినియోగదార్ల దృష్టిని ఆకర్షించేందుకు మరిన్ని లాంచ్ ప్రమోషన్లను ఆఫర్ చేస్తోందని పేర్కొన్నాయి. -
నీతా.. నిన్నే పెళ్లాడుతా! ట్రాఫిక్ సిగ్నల్‌లో ప్రపోజ్
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ జీవిత భాగస్వామి నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో ఎంతో ముఖ్యమైన ముఖేష్ అంబానీతో ప్రేమ కథ ఎలా ప్రారంభమైందో ఈ కథనంలో తెలుసుకుందాం..ధీరూభాయ్‌ని మెప్పించి..ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ.. నీతా హుందాతనం, ప్రతిభను చూసి తన కోడలుగా ఎంచుకున్నారు. ఓసారి నీతా భరతనాట్యం ప్రదర్శనను తిలకించిన ధీరూభాయ్ తన కొడుకు ముఖేష్ ఆమే సరిజోడని భావించారు. వారిద్దరికీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారి మధ్య స్నేహాన్ని క్రమంగా పెంచింది.చెబితేనే కారు కదిలేది..మీడియా నివేదికల ప్రకారం.. ఒకరోజు ముఖేష్ అంబానీ, నీతాతో కలిసి కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపి నీతా వైపు తిరిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగారు. నిశ్చేష్టురాలైన ఆమె ఆశ్చర్యంతో ఏమీ చెప్పలేక కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. సమాధానం చెప్పే వరకూ కారు కదలదని ముఖేష్ అంబానీ చెప్పారు. దీంతో తరువాత ఆమె అంగీకరించారు. అలా వారు కలిసి జీవితాన్ని ప్రారంభించారు. -
‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’
దీపావళి పండగను పురస్కరించుకుని చాలా మంది విభిన్న రీతుల్లో వేడుకలు నిర్వహించుకుంటారు. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ముఖేశ్ అంబానీ గారాలపట్టి, ఆయన కూతురు ఇషా అంబానీ దీపావళి రోజును ఎలా జరుపుకుంటారో తెలిపారు. ఇంటిల్లిపాది ఎలా వేడుకలు నిర్వహించుకుంటారో తెలియజేశారు. తన వ్యాపారాలు వృద్ధికి ఈ పండగ ఎలా ఉపయోగపడుతుందో చెప్పారు.‘చిన్ననాటి నుంచి నాకు పండుగలంటే చాలా సరదా. ఆ సమయంలో మా ఇల్లు బంధువులతో, పండుగ వేడుకలతో కళకళలాడుతుంది. ఎన్ని పనులున్నా అమ్మానాన్నలు వాటిని పక్కన పెట్టి మాతోనూ, బంధుమిత్రులతోనూ గడుపుతారు. బిజీ జీవితంలో పండుగలు మా అందరికీ ఓ ఆటవిడుపులా దోహదపడుతాయి. అంతేకాదు ఎన్నో విషయాల్నీ శాస్త్రాల్నీ తెలియజేస్తుంటాయి. అయితే నాకు అన్ని పండుగల్లో కెల్లా దీపావళి అంటే చాలా ఇష్టం. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం, ఆ వెలుగును చూస్తూ ఆనందించడం అలవాటు. ఆ కాంతులు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ పండగ వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. టపాసుల విషయానికొస్తే పక్షుల్నీ, జంతువుల్నీ భయపెట్టీ, పర్యావరణానికి హాని చేసే వాటికి నేను దూరం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించే ఏకైక దేశం భారత్!ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్‌మెడ్స్ ఫ్రెష్‌పిక్ -
రిలయన్స్ దీపావళి గిఫ్ట్ చూశారా?
దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తాయి. కొన్ని కంపెనీలు బోనస్‌ల రూపంలో నగదు పంపిణీ చేస్తే మరికొన్ని స్వీట్లు, ఇతర గిఫ్ట్‌లు ఇస్తూంటాయి. భారత్‌లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి బహుమతి అందించింది. రిలయన్స్ ఇచ్చిన గిఫ్ట్‌బాక్స్ అన్‌బాక్స్ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తనకు అందించిన గిఫ్ట్ బాక్స్‌ను అన్‌బాక్స్ చేస్తూ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోలో ఇంగ్లీషు, హిందీలో ‘దీపావళి శుభాకాంక్షలు’, ‘శుభ్ దీపావళి’ అని రాసిన తెల్లటి బాక్స్‌ను గమనించవచ్చు. ఇందులో మూడు ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష(కిస్మిస్) ఉన్నాయి. View this post on Instagram A post shared by sumanasri😍 (@itlu_me_suma)ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్తోపాటు తమ కుటుంబంలోని నలుగురు మనవరాళ్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నోట్ ఉంది. -
దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్
రిలయన్స్ జియో.. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 999 రూపాయల వద్ద లభిస్తున్న 4జీ ఫోన్లను కేవలం రూ. 699లకు అందిస్తోంది. ఈ అవకాశం కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2జీ ఫీచర్ ఫోన్స్ నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం.రూ.123 నెలవారీ సబ్స్క్రిప్షన్ & ప్రయోజనాలుపండుగ సీజన్ ఆఫర్ జియో భారత్ ప్లాన్‌తో వినియోగదారులు రూ. 123 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ని ఆస్వాదించవచ్చు. ⋆అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్⋆నెలకు 14 జీబీ డేటా⋆455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు⋆సినిమా ప్రీమియర్లు & కొత్త సినిమాలు⋆వీడియో షోలు⋆లైవ్ స్పోర్ట్స్⋆జియో సినిమాలో హైలెట్స్⋆క్యూఆర్ కోడ్ స్కాన్లతో కూడా డిజిటల్ ట్రాన్సక్షన్⋆జియోపే ద్వారా అందుకున్న చెల్లింపులకు సౌండ్ అలర్ట్‌లను స్వీకరించడం⋆గ్రూప్ చాట్లు⋆జియో చాట్‌లో వీడియోలు, ఫోటోలు, మెసేజింగ్ వంటివి షేర్ చేయడంఇతర ఆపరేటర్లు అందిస్తున్న అతి తక్కువ ఫీచర్ ఫోన్ ప్లాన్‌తో (నెలకు రూ. 199) పోలిస్తే.. జియో భారత్ ప్లాన్ (నెలకు రూ. 123) దాదాపు 40 శాతం చౌకగా ఉంటుంది. దీంతో యూజర్ ప్రతినెలా రూ. 76 ఆదా చేయవచ్చు. ఇలా ఆదా చేస్తే మీరు తొమ్మిది నెలల్లో ఫోన్ కొన్న డబ్బును తిరిగి పొందినట్లే అవుతుంది. ఇది కేవలం ఫోన్ కంటే కూడా మీకు ఇష్టమైనవారికి ఇచ్చే గిఫ్ట్‌గా కూడా పనికొస్తుంది. దీనిని జియోమార్ట్ లేదా అమెజాన్ వంటి వాటిలో కొనుగోలు చేయవచ్చు. -
ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్‌న్యూస్
దేశంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడేళ్ల తర్వాత తన మదుపర్లకు శుభవార్త చెప్పింది. ఈ దీపావళి పండగ నేపథ్యంలో ధన్‌తేరాస్‌కు ముందు అక్టోబర్ 28న బోనస్ షేర్ల రికార్డు తేదీని ప్రకటించింది. గత ఏడేళ్ల నుంచి కంపెనీ ఎలాంటి బోనస్ షేర్లను ప్రకటించకపోవడంతో మదుపర్లు కొంత నిరాశతో ఉన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఇటీవల భారీగా పడిపోయింది. కేవలం ఈ కంపెనీ అనే కాదు, మార్కెట్ సూచీలు భారీగా నష్టాల బాటపట్టాయి. అక్టోబర్ 25తో ముగిసిన ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.2,655.45గా ఉంది. తాజాగా కంపెనీ 1:1 బోనస్ ప్రకటించింది. అంటే డీమ్యాట్‌లో ఒక షేర్ ఉంటే అదనంగా మరో షేర్ జమ అవుతుంది. అందుకు అనుగుణంగా షేర్ ధర కూడా సమానంగా డివైడ్ అవుతుంది. ఫలితంగా ధర తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ బోనస్‌కు అక్టోబర్ 28ను రికార్డు తేదీగా నిర్ణయించారు. ఆ తేదీలోపు డీమ్యాట్ ఖాతాలో కంపెనీ షేర్లు ఉంటే ఈ బోనస్‌కు అర్హులుగా పరిగణిస్తారు.ఇదీ చదవండి: గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణకు ఏం చేయాలంటే..రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్చ్యూన్ 500 కంపెనీ(అధిక రెవెన్యూ సంపాదిస్తూ అంతర్జాతీయంగా సర్వీసులు అందించే కంపెనీలకు ఇచ్చే గుర్తింపు). ఇది ఎనర్జీ, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, పునరుత్పాదక ఇంధనం, ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా వంటి విభిన్న రంగాల్లో సేవలిందిస్తోంది. 2023-24లో రూ.80 వేలకోట్ల ఆదాయం సంపాదించింది. 2024 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.17,55,986 కోట్లుగా ఉంది. -
‘నా పెళ్లి కోసం అన్నయ్య పెళ్లి వాయిదా’
ఇంట్లో పెళ్లికి ఎదిగిన కొడుకు, కూతురు ఉంటే తల్లిదండ్రులు కూతురికే ముందు పెళ్లి చేయాలనుకుంటారు. ఈ ఆనవాయితి దేశీయంగా దాదాపు అందరి ఇళ్లల్లో జరుగుతోంది. పేద, మధ్య తరగతి, ధనిక కుటుంబాలనే తేడా లేకుండా దీన్ని పాటిస్తున్నారు. ఇందుకు అంబానీ కుటుంబం కూడా అతీతం కాదని నిరూపించారు. ముఖేశ్-నీతా అంబానీ దంపతులకు ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీలు కవల పిల్లలు. మొన్న అక్టోబర్ 23న వారు పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, తన సోదరుడి పెళ్లికి సంబంధించి ఇషా అంబానీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘అన్నయ్య ఆకాశ్ అంబానీ పెళ్లి శ్లోకామెహతాతో నిర్ణయించుకున్నారు. మార్చి 24, 2018న గోవాలో ఎంగేజ్మెంట్ పూర్తయింది. మే, 2018లో ఆనంద్ పిరమాల్‌తో నాకు నిశ్చితార్థం జరిగింది. ముందుగా అన్నయ్య ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి, తన వివాహం ముందే జరగాల్సి ఉంది. కానీ నా పెళ్లి కోసం తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. అందుకు వదిన శ్లోకామెహతా కూడా ఎంతో సహకరించింది. నా వివాహం డిసెంబర్ 2018లో పూర్తయిన తర్వాత మార్చి 9, 2019లో అన్నయ్య-వదినల పెళ్లి జరిగింది’ అని ఇషా అంబానీ చెప్పారు.ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్‌మెడ్స్ ఫ్రెష్పిక్ఇదీ చదవండి: ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపుఆకాశ్ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిడెట్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ముంబయి ఇండియన్స్ -
ఎన్విడియాతో రిలయన్స్ జట్టు
ముంబై: అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా, దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా చేతులు కలిపాయి. భారత్‌లో కృత్రిమ మేధ (ఏఐ) కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయనున్నాయి. రిలయన్స్‌కి చెందిన కొత్త డేటా సెంటర్లో ఎన్విడియాకి చెందిన బ్లాక్వెల్ ఏఐ చిప్‌లను వినియోగించనున్నారు. ఎన్విడియా ఏఐ సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో జెన్సెన్ హువాంగ్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. భాగస్వామ్యం కింద రూపొందించే అప్లికేషన్లను రిలయన్స్ .. భారత్‌లోని వినియోగదార్లకు కూడా అందించే అవకాశం ఉందని హువాంగ్ తెలిపారు. అయితే, ఈ భాగస్వామ్యానికి సంబంధించి పెట్టుబడులు, నెలకొల్పబోయే మౌలిక సదుపాయాల సామర్థ్యాలు మొదలైన వివరాలను వెల్లడించలేదు. ‘చిప్‌ల డిజైనింగ్‌లో భారత్‌కి ఇప్పటికే ప్రపంచ స్థాయి నైపుణ్యాలు ఉన్నాయి. ఎన్విడియా చిప్‌లను హైదరాబాద్, బెంగళూరు, పుణెలో డిజైన్ చేస్తున్నారు. ఎన్విడియాలో మూడో వంతు ఉద్యోగులు ఇక్కడే ఉన్నారు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ సేవలతో ప్రపంచానికి ఐటీ బ్యాక్ ఆఫీస్‌గా పేరొందిన భారత్ ఇకపై అవే నైపుణ్యాలను ఉపయోగించి ఏఐ ఎగుమతి దేశంగా ఎదగవచ్చని చెప్పారు. 2024లో భారత కంప్యూటింగ్ సామర్థ్యాలు 20 రెట్లు వృద్ధి చెందుతాయని, త్వరలోనే ప్రభావవంతమైన ఏఐ సొల్యూషన్స్‌ను ఎగుమతి చేస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో రెండో స్థానంలో ఉన్న ఎన్విడియాకు .. భారత్‌లో హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. భారీ ఇంటెలిజెన్స్ మార్కెట్‌గా భారత్: అంబానీ భారత్ ప్రస్తుతం కొత్త తరం ఇంటెలిజెన్స్ సాంకేతికత ముంగిట్లో ఉందని, రాబోయే రోజుల్లో వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు. ‘అతిపెద్ద ఇంటెలిజెన్స్ మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతుంది. మనకు ఆ సత్తా ఉంది. ప్రపంచానికి కేవలం సీఈవోలనే కాదు ఏఐ సరీ్వసులను కూడా ఎగుమతి చేసే దేశంగా భారత్ ఎదుగుతుంది‘ అని అంబానీ వ్యాఖ్యానించారు. దేశీయంగా పటిష్టమైన ఏఐ ఇన్ఫ్రా ఉంటే స్థానికంగా సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ మార్కెట్లో భారత్ కీలక దేశంగా మారగలదని ఆయన చెప్పారు. అమెరికా, చైనాలతో పాటు భారత్‌లో అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని అంబానీ చెప్పారు. డేటాను అత్యంత చౌకగా అందిస్తూ సంచలనం సృష్టించినట్లుగానే ఇంటెలిజెన్స్ విషయంలోనూ గొప్ప విజయాలతో ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపర్చగలదని ఆయన పేర్కొన్నారు.ఇన్ఫీ, టీసీఎస్‌లతో కూడా.. భారత మార్కెట్లో కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రోలతో చేతులు కలుపుతున్నట్లు హువాంగ్ తెలిపారు. ఎన్విడియా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫాం ఆధారిత ఏఐ సొల్యూషన్స్‌ను వినియోగించుకోవడంలో క్లయింట్లకు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తోడ్పడనున్నాయి. అలాగే ఇండస్ 2.0 అనే ఏఐ నమూనాను అభివృద్ధి చేసేందుకు ఎన్విడియా మోడల్‌ను టెక్ మహీంద్రా ఉపయోగించనుంది. అటు టాటా కమ్యూనికేషన్స్, యోటా డేటా సర్వీసెస్ వంటి సంస్థలకు ఎన్విడియా తమ హాపర్ ఏఐ చిప్‌లను సరఫరా చేయనుంది. -
రిలయన్స్ డిజిటల్ దీపావళి ఆఫర్: ఎలక్ట్రానిక్స్‌పై భారీ తగ్గింపు
దీపావళిని భారతదేశంలో మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి.. రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ సేల్ పేరుతో ఎలక్ట్రానిక్స్‌పై బ్లాక్‌బస్టర్ డీల్స్ అందించడం ప్రారంభించింది. 2024 నవంబర్ 3 లోపు ప్రముఖ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే రూ. 15000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ దేశ వ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్/మై జియో స్టోర్స్‌లో మాత్రమే కాకుండా.. 'రిలయన్స్ డిజిటల్.ఇన్'లో కూడా అందుబాటులో ఉంటుంది. స్టోర్లలో కొనుగోలు చేసేవారు రూ. 22,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.రిలయన్స్ డిజిటల్ అందిస్తున్న కొన్ని అత్యుత్తమ డీల్స్..➤శామ్సంగ్ నియోక్యూఎల్ఇడి టీవీకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. దీని కొనుగోలుపైన 3 సంవత్సరాల వారంటీతో రూ.41,990 విలువైన 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఉచితంగా పొందవచ్చు. ఈఎంఐ రూ.1,990 నుంచి ప్రారంభమవుతుంది.➤రూ.46,900 విలువైన యాపిల్ వాచ్ సీరీస్ 10 ఇప్పుడు రూ. 44,900లకే లభిస్తోంది. రూ.24,999 విలువైన జేబీఎల్ లైవ్ బీమ్ 3ని కేవలం రూ.12,599లకే పొందవచ్చు.➤రూ.45900కే ఐఫోన్ 14 కొనుగోలుపైన తక్షణ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి పొందవచ్చు. రిలయన్స్ డిజిటల్లో మాత్రమే లభిస్తున్న మోటొరోలా, గూగుల్ పిక్సెల్ ఫోన్ సీరీస్ కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి.➤హోమ్, కిచెన్ యాక్ససరీస్ మీద ''ఎక్కువ కొనండి, ఎక్కువ ఆదా చేసుకోండి' ఆఫర్‌ను కూడా రిలయన్స్ అందిస్తోంది. వినియోగదారులు ఒకటి కొంటే 5 శాతం, రెండు కొంటే 10 శాతం, మూడు లేదా అంతకంటే ఎక్కువ కొంటే అన్లిమిటెడ్ డిస్కౌంట్‌తో 15 శాతం తగ్గింపు పొందవచ్చు.➤ల్యాప్‌టాప్‌లపై రూ.20,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మరోవైపు రూ.50,999లకే ప్రారంభమవుతున్న 3050 గ్రాఫిక్స్కార్డులతో గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై అబ్బురపరిచే డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.➤రూ.47000లకు ప్రారంభమవుతున్న వాషర్ డ్రైయర్ కొనుగోలు చేస్తే.. రూ.7295 విలువైన ఎయిర్ ఫ్రైయర్ ఉచితంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు.➤రూ.28990ల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న 1.5 టన్స్ 3 స్టార్ స్మార్ట్ ఏసీ అందుబాటులో ఉంది.➤రూ. 47,990కి ప్రారంభమవుతున్న ఎంపిక చేసిన సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపైన.. రూ. 7295 విలువైన ఎయిర్ ఫ్రైయర్‌ని రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. -
అంబానీ కవల పిల్లల వ్యాపార సామ్రాజ్యం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వారసులు, కవలు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీలు బుధవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖేశ్-నీతా అంబానీ దంపతులకు ఐవీఎఫ్ ద్వారా అక్టోబర్ 23, 1991లో వీరు ఇద్దరు జన్మించారు.ఇషా అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.యేల్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్రిలయన్స్ ట్రెండ్స్టిరా బ్యూటీయూస్టాఅజార్ట్హామ్లేస్నెట్మెడ్స్ఫ్రెష్పిక్ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..ఆకాశ్ అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషన్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు.అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.2018లో శ్లోకామెహతాను వివాహం చేసుకున్నారు. వీరికి పృథ్వీ, వేద ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఆకాశ్ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ప్లాట్‌ఫామ్స్ లిమిడెట్రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ముంబయి ఇండియన్స్ -
రిలయన్స్ రిటైల్ విస్తరణ
రిలయన్స్ రిటైల్ తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. యువతకు ఫ్యాషన్ ఉత్పత్తులను అందించే ‘అజార్ట్’ బ్రాండ్ స్టోర్లను పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో 12 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు తెలిపింది. జైపూర్, ఉదయపూర్, రాయ్‌పూర్, దెహ్రాదూన్, గోరఖ్‌పూర్, రాంచీ, బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.ఇప్పటికే బెంగళూరులో అజార్ట్ బ్రాండ్ పేరుతో స్టోర్లను ప్రారంభించిన రిలయన్స్ రిటైల్ వీటి సంఖ్యను ఐదుకు పెంచింది. ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ సీఈఓ అఖిలేష్ ప్రసాద్ మాట్లాడుతూ..‘అజార్ట్ బ్రాండ్‌ను 2022లో స్థాపించాం. క్రమంగా బ్రాండ్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాం. యువత నుంచి ఈ బ్రాండ్‌కు ఆదరణ పెరుగుతోంది. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఈ బ్రాండ్ యువతకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. వినియోగదారుల జీవనశైలిని ప్రతిబింబించేలా, మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించేలా కంపెనీ పనిచేస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్‌ల ఆడిట్పండగ సీజన్లో చాలా కంపెనీలు తమ వ్యాపారాలు విస్తరించాలని యోచిస్తుంటాయి. ఫెస్టివల్ నేపథ్యంలో తమ బ్రాండ్ ఉత్పత్తులకు ఆదరణ ఉంటుందని నమ్ముతాయి. కంపెనీ ఉత్పత్తులు వినియోగదారులకు నచ్చితే తదుపరి గిరాకీ ఏర్పడుతుందని భావిస్తాయి. -
రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్‌కు ఆమోదం.. షరతులివే..
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీల మీడియా అసెట్స్ విలీన ప్రతిపాదనకు దాదాపు రెండు నెలల తర్వాత కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం కొన్ని షరతులు విధిస్తూ మంగళవారం 48 పేజీల ఉత్తర్వులను జారీ చేసింది.సీసీఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇరు సంస్థలు ఏడు టీవీ చానళ్లను విక్రయించాలి. వీటిలో స్టార్ జల్సా మూవీస్, కలర్స్ మరాఠీ, హంగామా మొదలైనవి ఉన్నాయి. అలాగే క్రికెట్ ఈవెంట్ల ప్రసారాల అడ్వర్టైజ్మెంట్ స్లాట్లకు సంబంధించి బండిల్డ్ విధానంలో వసూలు చేయకూడదు. ఐపీఎల్, ఐసీసీ, బీసీసీఐ వంటి కీలక క్రికెట్ మ్యాచ్‌ల ఫీడ్‌ను ప్రసార భారతితో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, ఇరు సంస్థల ఓటీటీ ప్లాట్‌ఫాంలు (స్టార్‌కి చెందిన డిస్నీప్లస్‌హాట్‌స్టార్, రిలయన్స్‌లో భాగమైన వయాకామ్18కి చెందిన జియోసినిమా) వేర్వేరుగా కొనసాగుతాయి.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా.. -
జియో వరల్డ్ ప్లాజాలో.. ఈఎల్ & ఎన్ లండన్
ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన లైఫ్‌స్టైల్ అండ్ కేఫ్ బ్రాండ్ ఈఎల్ & ఎన్ లండన్.. జియో వరల్డ్ ప్లాజాలో తన మొదటి ఇండియన్ అవుట్లెట్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ గ్లోబల్ సెన్సేషన్ భారతీయ మార్కెట్లో మొదటి వెంచర్ అని తెలుస్తోంది.2017లో అలెగ్జాండ్రా మిల్లర్ ప్రారంభించిన ఈఎల్ & ఎన్ (ఈట్, లైవ్ & నోరిష్) ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. ఈ బ్రాండ్ పింక్ ఇంటీరియర్స్, అద్భుతమైన ఫ్లోరల్ డెకర్ వంటి వాటితో కస్టమర్లను మాత్రమే కాకుండా.. ప్రేక్షకులను కూడా చాలా ఆకర్షించింది.ఈఎల్ & ఎన్ ఫ్యాషన్ ఫార్వర్డ్ డిజైన్, స్పెషాలిటీ కాఫీ వంటి వాటితో పాటు ప్రత్యేక ఫుడ్ కూడా అందిస్తుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం ప్యారిస్, మిలన్, దుబాయ్, కౌలాలంపూర్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 37 అవుట్లెట్లను నిర్వహిస్తోంది. ఇప్పుడు ముంబైలో అడుగుపెట్టి భోజన ప్రియులను, సోషల్ మీడియా ఔత్సాహికులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది.జియో వరల్డ్ ప్లాజా రెండవ అంతస్తులో ఉన్న ఈ కొత్త కేఫ్.. 2,130 చ.అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ప్రత్యేకమైన మోటిఫ్‌లు, గులాబీ రంగు మెష్ షాన్డిలియర్, సిగ్నేచర్ ఏఎల్ & ఎన్ పుష్పాలు & పత్రాలు, నియాన్ కోట్లు వంటివి ఉన్నాయి. అంతే కాకుండా.. టెర్రాజో & మార్బుల్ ఫ్లోరిం, ఐకానిక్ కేక్, కాఫీ బార్ వంటివి ఉన్నాయి. -
హాట్‌స్టార్‌లో జియో సినిమా విలీనం!
రిలయన్స్, డిస్నీ విలీనం తర్వాత ఏర్పడిన జాయింట్ వెంచర్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను 'జియో హాట్‌స్టార్'గా పిలువనున్నట్లు సమాచారం.విలీనం పూర్తయితే.. ఐపీఎల్ 2025తో సహా అన్ని క్రికెట్ మ్యాచ్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్లు జియో సినిమాలో అందుబాటులో ఉండవు. కంపెనీ అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లను డిస్నీ+ హాట్‌స్టార్‌కి మార్చాలని యోచిస్తోంది. ఐపీఎల్ సహా భారతదేశంలో క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. డిస్నీ +హాట్‌స్టార్ అన్ని ఐసీసీ టోర్నమెంట్ల హక్కులను కలిగి ఉంది. అయితే ఇకపై అన్ని మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. దీనికి సంబంధించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు.రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ ఇండియా విలీనం 2024 ఫిబ్రవరిలో జరిగింది. కొత్తగా ఏర్పడిన జాయింట్ వెంచర్లో 120 టీవీ ఛానెల్‌లు, జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ అనే రెండు స్ట్రీమింగ్ సర్వీస్‌లు ఉన్నాయి.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనిజానికి మొదట హాట్‌స్టార్‌నే.. జియో సినిమాలో విలీనం చేయనున్నట్లు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ వంటి వాటికి వేరు వేరుగా ఓటీటీలు ఉంటే బాగుంటుందని.. జియో సినిమానే డిస్నీ+హాట్‌స్టార్‌లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గూగుల్ ప్లే స్టోర్‌లో జియో సినిమాకు 100 మిలియన్ డౌన్లోడ్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌కు 500 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండూ కలిసిపోవడం చేత ఇది అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించనుంది. -
జియో స్పీడ్ ఎక్కువే: ఓపెన్ సిగ్నల్!
వేగంగా నెట్వర్క్ సేవలందించడంలో జియో దూసుకుపోతుంది. నెట్వర్క్ స్పీడ్, కవరేజ్, స్థిరమైన సర్వీసులు అందించడంలో జియో మరింత మెరుగుపడిందని ఓపెన్ సిగ్నల్ నివేదించింది. దేశంలోని టెలికాం కంపెనీలతో పోలిస్తే జియో అధికంగా 89.5 ఎంబీపీఎస్ స్పీడ్ నెట్‌వర్క్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. ‘ఇండియా మొబైల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో భారత టెలికాం నెట్వర్క్ కంపెనీల సేవలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది.నివేదికలోని వివరాల ప్రకారం..రిలయన్స్ జియో గరిష్ఠంగా 89.5 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్ కలిగిన నెట్‌వర్క్‌ను అందిస్తుంది. ఎయిర్టెల్ 44.2 ఎంబీపీఎస్, వొడాఫోన్ ఐడియా 16.9 ఎంబీపీఎస్‌తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. జియో నెట్వర్క్ స్పీడ్ ఎయిర్టెల్ కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. ఇది స్ట్రీమింగ్, గేమింగ్, ఇతర డేటా సేవలను మరింత మెరుగ్గా అందించే అవకాశం ఉంది. జియో నెట్వర్క్ సేవలు చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించాయి. ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..దేశీయంగా టెలికాం నెట్వర్క్ సేవలకు సంబంధించి కస్టమర్ల అంచనాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్ గేమ్‌లు, వీడియో స్ట్రీమింగ్, ఇతర డేటా అవసరాల కోసం వేగంగా నెట్వర్క్ ఉండాలనుకుంటున్నారు. అదే సమయంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరుతుతోంది. దాంతో సంస్థలు మెరుగైన సర్వీసులు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలో జియోతోపాటు ఇతర కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దాంతో కస్టమర్ల అట్రిషన్ రేటు(నెట్వర్క్ మారడం) పెరగడంతో జియో విభిన్న మార్గాలు అనుసరిస్తోంది. టారిఫ్ రేట్లను పెంచినప్పటి నుంచి నెట్వర్క్ స్పీడ్ తగ్గిపోయిందనే అభిప్రాయాలున్నాయి. కాబట్టి క్రమంగా నెట్వర్క్ స్పీడ్ పెంచుతున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. -
రిలయన్స్ జ్యువెల్స్ 'వివాహం కలెక్షన్': భారీ తగ్గింపులు కూడా..
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్స్‌లో ఒకటైన 'రిలయన్స్ జ్యువెల్స్' రాబోయే పండగ సీజన్ కోసం ప్రత్యేక వివాహ కలెక్షన్స్ ఆవిష్కరించింది. ఆధునికత, సంప్రదాయం రెండూ కలబోసిన వినూత్న వివాహ ఆభరణాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తాయి. అందంగా తీర్చిదిద్దిన చోకర్లు, గాజులు, చెవి రింగులు, నెక్లెసులు, హాత్ ఫూల్, మాంగ్ టికా, ముక్కు పుడకలు, వడ్డాణాల వంటివి ఈ సరికొత్త ఆవిష్కరణలో ఉన్నాయి.ఈ వివాహం కలెక్షన్లో.. బంగారం, వజ్రాలతో ఎంతో సునిశితంగా తీర్చిదిద్దిన ఎనిమిది అద్భుతమైన ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ వధువును మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. అంతే కాకుండా వివిధ ప్రాంతాల సాంప్రదాయాలను ప్రతిబింబించే అనేక ప్రాంతీయ ఆభరణాలు కూడా ఈ కలెక్షన్లో ఉన్నాయి.వివాహం కలెక్షన్ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్ జువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. భారతదేశంలో వివాహాలు సంస్కృతికి నిదర్శనం. ఈ వేడుకల్లో వధువు ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సంప్రదాయానికి ప్రతిరూపం మా వివాహం కలెక్షన్. ప్రాంతీయ వారసత్వం, ఆధునిక అభిరుచి కలబోతగా ఈ కలెక్షన్లోని ప్రతి సెట్ నిలుస్తూ.. నేటి వధువు వ్యక్తిత్వానికి, వ్యక్తిగత స్టైల్‌ను అందిపుచ్చుకుంటాయి. ఇవన్నీ కేవలం పెళ్లి రోజున ధరించేవి మాత్రమే కాదు, ఏళ్ల తరబడి ఈ ఆభరణాలు ఆనందాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.రిలయన్స్ జువెల్స్ 2024 నవంబర్ 11 వరకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు, డైమండ్ వ్యాల్యూ, మేకింగ్ ఛార్జీలపై 30% వరకు ఆకర్షణీయ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఎంతో విలువైన అద్భుతమైన ఆభరణాలపై పెట్టుబడి పెట్టేందుకు వధువులకు ఇది చక్కని అవకాశం. ఆభరాలు దేశంలోని 185కు పైగా నగరాల్లోని రిలయన్స్ జువెల్స్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. -
‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లు ఎందుకు?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. చాలా కంపెనీలు మొబైల్ ఫీచర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్లను మరింత స్మార్ట్‌గా మార్చాలని విభిన్న ప్రయోగాలు చేపడుతున్నాయి. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఫీచర్ ఫోన్లకు ఆదరణ మాత్రం తగ్గడంలేదు. అయితే వివిధ కారణాలతో చాలామంది ఇంకా ఫీచర్ ఫోన్లవైపే మొగ్గు చూపుతున్నారు. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రాథమిక కమ్యునికేషన్ కోసం ఈ ఫీచర్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు.స్మార్ట్ఫోన్లతో పోలిస్తే బ్యాటరీ లైఫ్ అధికంగా ఉంటుంది.కేవలం కాల్స్, టెక్ట్స్ మెసేజ్‌లు చేయడానికి వీలుగా దీన్ని అధికంగా వాడుతున్నారు.కొన్ని ఆఫీసుల్లో వివిధ కారణాల వల్ల స్మార్ట్ఫోన్లను అనుమతించడం లేదు. దాంతో చాలామంది ఉద్యోగులు తప్పక ఈ ఫీచర్ ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు.స్మార్ట్‌ఫోన్ ఉన్నా కూడా నిత్యం దూర ప్రయాణాలు చేసేవారు బ్యాకప్ కోసం దీన్ని వినియోగిస్తున్నారు.ఫోన్లకు సంబంధించి సింప్లిసిటీని ఇష్టపడేవారు వీటిని కొనుగోలు చేస్తున్నారు.ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఫీచర్ ఫోన్లను తీసుకుంటున్నారు. ఒకవేళ పిల్లలు ఫోన్ కావాలని మారాం చేసి తీసుకుని కిందపడేసినా పెద్దగా నష్టం ఉండదు.వృద్ధులు, కంటి చూపు సరిగా లేనివారు ఈ ఫీచర్ ఫోన్లను సులువుగా వినియోగించవచ్చు.ఆర్థిక స్థోమత సరిగాలేని వారు ఈ ఫీచర్ ఫోన్లను ఎంచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ఫోన్ మార్కెట్ 2018-2030 మధ్య కాలంలో ఏటా 3.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. భారత్‌లో 2023 రెండో త్రైమాసికం లెక్కల ప్రకారం అంతకుముందు ఏడాది అదే త్రైమాసికంతో పోలిస్తే తొమ్మిది శాతం ఈ ఫోన్ల అమ్మకాలు పెరిగాయి.ఇదీ చదవండి: ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలంఇటీవల రిలయన్స్ జియో కంపెనీ 4జీ నెట్వర్క్ సదుపాయం కలిగిన ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024 సమావేశంలో భాగంగా ఈ ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి ధర రూ.1,099గా నిర్ణయించారు. అయితే రిటైలరనుబట్టి ఈ ధరలో మార్పులుంటాయని గమనించాలి.