
దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తాయి. కొన్ని కంపెనీలు బోనస్‌ల రూపంలో నగదు పంపిణీ చేస్తే మరికొన్ని స్వీట్లు, ఇతర గిఫ్ట్‌లు ఇస్తూంటాయి. భారత్‌లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి బహుమతి అందించింది. రిలయన్స్ ఇచ్చిన గిఫ్ట్‌బాక్స్ అన్‌బాక్స్ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తనకు అందించిన గిఫ్ట్ బాక్స్‌ను అన్‌బాక్స్ చేస్తూ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోలో ఇంగ్లీషు, హిందీలో ‘దీపావళి శుభాకాంక్షలు’, ‘శుభ్ దీపావళి’ అని రాసిన తెల్లటి బాక్స్‌ను గమనించవచ్చు. ఇందులో మూడు ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష(కిస్‌మిస్) ఉన్నాయి.
ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌తోపాటు తమ కుటుంబంలోని నలుగురు మనవరాళ్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నోట్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment