Jio Infocom
-
రిలయన్స్ దీపావళి గిఫ్ట్ చూశారా?
దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తాయి. కొన్ని కంపెనీలు బోనస్‌ల రూపంలో నగదు పంపిణీ చేస్తే మరికొన్ని స్వీట్లు, ఇతర గిఫ్ట్‌లు ఇస్తూంటాయి. భారత్‌లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి బహుమతి అందించింది. రిలయన్స్ ఇచ్చిన గిఫ్ట్‌బాక్స్ అన్‌బాక్స్ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తనకు అందించిన గిఫ్ట్ బాక్స్‌ను అన్‌బాక్స్ చేస్తూ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోలో ఇంగ్లీషు, హిందీలో ‘దీపావళి శుభాకాంక్షలు’, ‘శుభ్ దీపావళి’ అని రాసిన తెల్లటి బాక్స్‌ను గమనించవచ్చు. ఇందులో మూడు ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష(కిస్మిస్) ఉన్నాయి. View this post on Instagram A post shared by sumanasri😍 (@itlu_me_suma)ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్తోపాటు తమ కుటుంబంలోని నలుగురు మనవరాళ్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నోట్ ఉంది. -
ముకేశ్ రిలయన్స్ జియోకి ఏకీకృత టెలికం లెసైన్సు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. పూర్తిస్థాయి టెలికం సేవలకు సమాయత్తమవుతోంది. తాజాగా వాయిస్, హై-స్పీడ్ డేటా సర్వీసులు అందించేందుకు కావాల్సిన ఏకీకృత లెసైన్సును దక్కించుకుంది. దీంతో రిలయన్స్ జియో.. దేశవ్యాప్తంగా ఈ స్పెక్ట్రం ఉన్న ఏకైక టెలికం ఆపరేటర్ అయ్యిందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 22 టెలికం సర్కిల్స్‌లోని సబ్‌స్క్రయిబర్స్‌కి వాయిస్ టెలిఫోనీ సహా అన్ని రకాల టెలికం సర్వీసులు అందించేందుకు ఈ ఏకీకృత లెసైన్సు ఉపయోగపడుతుందని వివరించింది. ఇప్పటికే ఐఎస్పీ లెసైన్సు, బ్రాడ్‌బ్యాండ్ వైర్లెస్ యాక్సెస్ (బీడబ్ల్యూఏ) స్పెక్ట్రం ఉన్న రిలయన్స్ జియో .. ఏకీకృత లెసైన్సు కోసం వన్ టైమ్ ఎంట్రీ ఫీజు కింద రూ. 1,673 కోట్లు చెల్లించింది. ఎంటీఎస్ పేరిట మొబైల్ సర్వీసులు అందించే సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్, ఐడియా సంస్థలు ఇప్పటికే ఏకీకృత లెసైన్సు దక్కించుకున్నాయి. అయితే, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్లు మాత్రం దీనికోసం దరఖాస్తు చేసుకోలేదు.