ముకేశ్ రిలయన్స్ జియోకి ఏకీకృత టెలికం లెసైన్సు | Reliance Jio Infocom gets unified telecom licence | Sakshi
Sakshi News home page

ముకేశ్ రిలయన్స్ జియోకి ఏకీకృత టెలికం లెసైన్సు

Published Sat, Oct 26 2013 12:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

ముకేశ్ రిలయన్స్ జియోకి ఏకీకృత టెలికం లెసైన్సు

ముకేశ్ రిలయన్స్ జియోకి ఏకీకృత టెలికం లెసైన్సు

 న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. పూర్తిస్థాయి టెలికం సేవలకు సమాయత్తమవుతోంది. తాజాగా వాయిస్, హై-స్పీడ్ డేటా సర్వీసులు అందించేందుకు కావాల్సిన ఏకీకృత లెసైన్సును దక్కించుకుంది.  దీంతో రిలయన్స్ జియో.. దేశవ్యాప్తంగా ఈ స్పెక్ట్రం ఉన్న ఏకైక టెలికం ఆపరేటర్ అయ్యిందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

22 టెలికం సర్కిల్స్‌లోని సబ్‌స్క్రయిబర్స్‌కి వాయిస్ టెలిఫోనీ సహా అన్ని రకాల టెలికం సర్వీసులు అందించేందుకు ఈ ఏకీకృత లెసైన్సు ఉపయోగపడుతుందని వివరించింది. ఇప్పటికే ఐఎస్‌పీ లెసైన్సు, బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ యాక్సెస్ (బీడబ్ల్యూఏ) స్పెక్ట్రం ఉన్న రిలయన్స్ జియో .. ఏకీకృత లెసైన్సు కోసం వన్ టైమ్ ఎంట్రీ ఫీజు కింద రూ. 1,673 కోట్లు చెల్లించింది. ఎంటీఎస్ పేరిట మొబైల్ సర్వీసులు అందించే సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్, ఐడియా సంస్థలు ఇప్పటికే ఏకీకృత లెసైన్సు దక్కించుకున్నాయి. అయితే, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు మాత్రం దీనికోసం దరఖాస్తు చేసుకోలేదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement