Reliance Industries: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని రిలయన్స్ సంస్థ హెచ్చరించింది. ప్రపంచంలో అతిపెద్ద ముడి చమురు రిఫైనింగ్ ఫ్యాక్టరీ గల రిలయన్స్.. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2022-23 ఏప్రిల్-జూన్) అంచనాల కంటే తక్కువ లాభాలను ఆర్జించిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తులో లాభాల విషయంలో ఫలితాలు అనుకున్నంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని పేర్కొంది.
రిలయన్స్ జాయింట్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ వీ శ్రీకాంత్ ఈ విషయమై మాట్లాడుతూ.. పెరుగుతున్న సరుకు రవాణా, ఇన్‌పుట్ ధరల కారణంగా అధిక నిర్వహణ ఖర్చులు వంటి అనేక సవాళ్లను ఎదర్కోవాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ త్రైమాసికంలో ముడి సరుకుల ధరలు 76% పెరిగాయి. ఇదిలా ఉంటే, ఈ నెలాఖరులోగా ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు ఔట్‌లుక్‌ను తగ్గించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు, మార్కెట్‌లకు మూలధన ప్రవాహం మందగించడం, కొనసాగుతున్న మహమ్మారి, చైనాలో మందగమనం లాంటివి వీటికి పెనుసవాళ్లుగా మారాయి.
చదవండి: విమాన ప్రయాణంలో ఫోన్‌లో ఫ్లైట్ మోడ్ ఎందుకు ఆన్ చేస్తారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment