ఫిబ్రవరి 13న ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు ఏకంగా 14 శాతం పుంజుకున్నాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 20 లక్షల కోట్లను అధిగమించిన భారతదేశపు మొదటి కంపెనీగా అవతరించింది. 2024లో షేర్ విలువ ఇంత పెరగటం ఇదే మొదటిసారి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ బిఎస్‌ఇలో ఫిబ్రవరి 13న రూ. 2,957కు చేరింది. ఈ రోజు (ఫిబ్రవరి 13) ఉదయం 1.7 శాతం పెరిగి రూ. 2953వద్ద ట్రేడ్ అయింది. దీంతో మార్కెట్ విలువ ఏకంగా రూ. 20 లక్షల కోట్లు దాటేసింది.
2005లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదటి సారి రూ.1 లక్ష కోట్ల మార్కెట్ విలువను చేరుకుంది. ఆ తరువాత 2007లో రూ.2 లక్షల కోట్లు, 2007లో రూ.3 లక్షల కోట్లు, 2007లో రూ.4 లక్షల కోట్లకు చేరింది. 2017లో రూ.5 లక్షల కోట్లు, 2019లో రూ.10 లక్షల కోట్లు, 2021లో రూ.15 లక్షల కోట్లు చేరింది. ఆ తరువాత సుమారు 600 రోజుల్లో రూ.20 లక్షల కోట్లు మైలురాయిని సాధించింది. అంటే 2005 నుంచి రూ. 20 లక్షల కోట్ల విలువను చేరుకోవడానికి దాదాపు 19 సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మరో వ్యాపారంలోకి అంబానీ!.. రూ.27 కోట్ల డీల్
కొత్త సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ పెరుగుదల వైపు అడుగులు వేసింది. జనవరిలో 10.4 శాతం పెరిగిన షేర్ ఇప్పటికి (ఫిబ్రవరి) మరో నాలుగు శాతం పెరిగి ఈ ఏడాది గరిష్ట స్థాయికి చేరింది. దీంతో సంస్థ భారీ లాభాలను సొంతం చేసుకోగలిగింది. (మార్కెట్లో ఒడుదుడుకులు ఏర్పడితే విలువలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వ్యాల్యూలో తేడాలు రావొచ్చు.. గమనించగలరు.)
Comments
Please login to add a commentAdd a comment