Reliance Industries
-
మార్కెట్ ‘కింగ్’ రిలయన్స్
ముంబై: దేశీయంగా అత్యధిక మార్కెట్ వేల్యుయేషన్‌తో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానంలో కొనసాగింది. రూ. 17.5 లక్షల కోట్ల విలువతో బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా టాప్ 500 కంపెనీల లిస్టులో నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. అటు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్) రూ. 16.1 లక్షల కోట్ల మార్కెట్ వేల్యుయేషన్‌తో రెండో స్థానంలో, రూ. 14.22 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో నిల్చాయి.మరోవైపు, ఐపీవోకి సన్నాహాలు చేసుకుంటున్న స్టాక్ ఎక్స్ఛేంజీ ఎన్ఎస్ఈ సంస్థ రూ. 4.7 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో.. అన్‌లిస్టెడ్ కంపెనీల విభాగంలో అగ్రస్థానంలో ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయాలు 28 శాతం పెరిగి రూ. 16,352 కోట్లకు, లాభాలు 51 శాతం ఎగిసి రూ. 8,306 కోట్లకు చేరాయి. ఈ విభాగంలో రూ. 77,860 కోట్ల వేల్యుయేషన్‌తో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా అయిదో స్థానంలో ఉంది. బైటి నుంచి నిధులు సమీకరించకుండా సొంతంగా ఎదిగిన బూట్స్ట్రాప్డ్ సంస్థల లిస్టులో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. గ్రూప్‌లవారీగా చూస్తే టాటా సన్స్ వేల్యుయేషన్ 2024లో 37 శాతం ఎగిసి రూ. 32.27 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో రిలయన్స్ గ్రూప్ మొత్తం వేల్యుయేషన్ రూ. 19.71 లక్షల కోట్లుగా, అదానీ గ్రూప్ విలువ రూ. 13.40 లక్షల కోట్లుగా ఉంది. తొలిసారిగా లిస్టులోని కంపెనీలన్నీ 1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ ఉన్నవేనని హురున్ చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. దేశవ్యాప్తంగా పరిశ్రమ నిపుణులు, జర్నలిస్టులు, బ్యాంకర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలు, బహిరంగంగా అందుబాటలో ఉన్న గణాంకాల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు వివరించారు. దీనికి డిసెంబర్ 13 కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు. మరిన్ని వివరాలు .. ⇒ టాప్ 500లోకి చోటు దక్కించుకునేందుకు ఈసారి కనిష్ట వేల్యుయేషన్ పరిమితిని 43% అధికంగా రూ. 9,580 కోట్లకు పెంచారు. 2023లో ఇది రూ. 6,700 కోట్లుగా ఉంది. ⇒ లిస్టులోని మొత్తం కంపెనీల విలువ 40 శాతం ఎగిసి 3.8 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ. 324 లక్షల కోట్లు) చేరింది. ఇది దాదాపు 3.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న దేశ జీడీపీ కన్నా అధికం కావడం గమనార్హం. మోతీలాల్ ఓస్వాల్, ఐనాక్స్ విండ్, జెప్టో, డిక్సన్ వంటి సంస్థల వేల్యుయేషన్ అత్యధికంగా పెరిగింది. ⇒ మొత్తం సుమారు రూ. 86 లక్షల కోట్ల పైగా ఆదాయం ఉన్న ఈ 500 కంపెనీలు దాదాపు రూ. 8 లక్షల కోట్ల లాభాలు ఆర్జించగా, రూ. 2.2 లక్షల కోట్ల మొత్తాన్ని పన్నుల కింద చెల్లించాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలపై రూ. 11,000 కోట్లు వెచ్చించాయి. సుమారు 85 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ⇒టాప్ కంపెనీల సంఖ్యాపరంగా చూస్తే రూ. 10.11 లక్షల కోట్ల విలువ చేసే 35 సంస్థలతో హైదరాబాద్ అయిదో స్థానంలో నిలి్చంది. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణ ఏడో ర్యాంకులో ఉంది. -
అమెరికాలో నీతా అంబానీకి అరుదైన గౌరవం (ఫోటోలు)
-
రిలయన్స్ అనుబంధ సంస్థగా కొత్త కంపెనీ
మీడియా, ఎంటర్టైన్మెంట్ సంస్థ వయాకామ్18 (Viacom18) మీడియా అనుబంధ కంపెనీగా అవతరించినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) తాజాగా పేర్కొంది. తప్పనిసరిగా మార్పిడికిలోనయ్యే 24.61 కోట్ల ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను అదే సంఖ్యలో ఈక్విటీ షేర్లుగా మార్పు చేసినట్లు వెల్లడించింది.దీంతో ప్రత్యక్ష సబ్సిడియరీగా మారినట్లు తెలియజేసింది. ఇప్పటివరకూ రిలయన్స్ అనుబంధ కంపెనీ నెట్వర్క్18 మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్కు వయాకామ్18 మీడియా మెటీరియల్ సబ్సిడియరీగా వ్యవహరించేది. కాగా.. తాజా మార్పు కారణంగా వయకామ్18లో రిలయన్స్ వాటా 70.49 శాతం నుంచి 83.88 శాతానికి ఎగసింది.అంతకుముందు 2024 మార్చిలో పారామౌంట్ గ్లోబల్ నుంచి వయాకామ్18లో 13.01 శాతం వాటాను రిలయన్స్ చేజిక్కించుకుంది. ఇందుకు రూ. 4,286 కోట్లు వెచ్చించింది. ఈ ఏడాది నవంబర్ 14న వాల్ట్ డిస్నీ దేశీ మీడియా బిజినెస్‌తో రిలయన్స్ మీడియా విభాగాలను విలీనం చేయడంతో రూ. 70,000 కోట్ల విలువైన దేశీ మీడియా దిగ్గజం ఆవిర్భవించిన విషయం విదితమే. -
నీతా అంబానీకి అత్యంత ఇష్టమైన చీర! ఏకంగా 900 ఏళ్ల నాటి..!
కొన్ని చీరలు మన భారతీయ హస్తకళా నైపుణ్యానికి ప్రతీకలుగా ఉంటాయి. కాలాలు మారుతున్న వాటి ఉనికి ప్రకాశవంతంగా నిలిచే ఉంటుంది. ఎన్నో వెరైటీ డిజైన్లు వచ్చినా.. పురాతన హస్తకళతో కూడిన చీరలే అగ్రస్థానంలో అలరారుతుంటాయి. తరతరాలు ఆ చీరలను ఆదరిస్తున్నే ఉంటారు. అలాంటి చీరల కళా నైపుణ్యానికి సెలబ్రిటీలు, ప్రముఖులు దాసోహం అంటూ వాటిని ప్రోత్సహిస్తూ భవిష్యత్తు తరాలు తెలసుకునేలా.. ఆ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు కూడా. అలాంటి 900 ఏళ్ల నాటి హస్తకళా నైపుణ్యానికి పేరుగాంచిని పటోలా చీరల విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీకి సైతం ఈ చీరలంటే మహా ఇష్టం. ఆ మక్కువతోనే ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించిన చిన్న కుమారుడు అనంత్-రాధికల వివాహంలో ఈ చీరలనే అతిధులకు గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతలా కట్టిపడేసేలా ఆ పటోల చీరల్లో ప్రత్యేకత ఏముందంటే..?ఎక్కడ నుంచి వచ్చాయంటే..ఈ పటోలా చీరలు గుజరాత్‌లోని పటాన్ ప్రాంతం నుంచి వచ్చాయి. ఈ చీరలు శక్తిమంతమైన రంగుల కలయికతో క్లిష్టమైన డిజైనలతో ఉంటాయి. ఈ చీరల తయారీ అనేది శ్రమతో కూడిన హస్తకళ అని చెప్పాచ్చు. అంబానీల ఇంట జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత నుంచి వీటి అమ్మకాలు బాగా ఎక్కువయ్యాయి. ఇప్పుడు చాలామంది మగువలు ఏరికోరి ఈ పటోలా చీరలను తెప్పించుకుని మరీ కొంటున్నారు. ప్రత్యేకతలు..పటోలా చీర తయారీ అంత ఈజీ కాదు. తొందరగా అయ్యిపోయే పనికూడా కాదు. ప్రతిభాగానికి దాదాపు పది నుంచి పన్నెండు మంది కళాకారుల బృందంతో సుమారు ఆరు నెలల శ్రమ ఫలితం ఈ చీరలు. చక్కటి పట్టు దారాలతో నేసిన చీరలివి. భారతదేశ గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించేలా చక్కటి మనికతో ఉంటాయి. వీటి సరిగ్గా వాడితే శతాబ్దం వరకు చెక్కు చెదరవట. అయితే ఈ పటోలా చీరలను మాములు పద్ధతిలో వాష్ చేయకూడదు. వీటిని డ్రై-క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. సరిహద్దులు దాటి..పటోలా చీరల కీర్తీ సరిహద్దులు దాటి..జర్మనీ, యూఎస్ఏ, రష్యా వంటి దేశాల అభిమానం కూడా సంపాదించుకుది. బనారసీ చీరల తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న సాంప్రదాయ వస్త్రాలలో ఇవి ఒకటి. అయితే వీటి ధరలు ప్రారంభ ధర రూ. 10 వేల నుంచి మొదలై దాదాపు ఏడు లక్షలుదాక పలికే లగ్జీరియస్ చీరలు కూడా ఉన్నాయి. (చదవండి: ప్రమాణ స్వీకారంలో కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?) -
రిలయన్స్-వాల్ట్ డిస్నీ విలీనం ఎప్పుడంటే..
న్యూఢిల్లీ: ఇటీవలి ఒప్పందం మేరకు... రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా ఆస్తుల్లో వాల్ట్ డిస్నీ ఇండియా ఈ డిసెంబర్ త్రైమాసికంలోపు విలీనం కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి విలీనం పూర్తవుతుందంటూ స్టాక్ ఎక్స్చేంజ్ లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సమాచారం ఇచ్చింది. రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ), జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి అనుమతులు లభించడం గమనార్హం. ‘‘మిగిలిన అనుమతుల కోసం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.విలీన లావాదేవీ 2024–25 సంవత్సరం మూడో త్రైమాసికంలో ముగుస్తుందని అంచనా వేస్తున్నాం’’అని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. రిలయన్స్ మీడియా విభాగాలైన టీవీ18 బ్రాడ్కాస్ట్, ఈ18, నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విలీనానికి ఎన్సీఎల్టీ ఇప్పటికే ఆమోదం తెలియజేసిందని.. అక్టోబర్ 3 నుంచి విలీనం అమల్లోకి వచ్చిందని సంస్థ పేర్కొంది.రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్ 18 పరిధిలోని నాన్ న్యూస్ (వార్తలు కాకుండా), కరెంట్ ఎఫైర్స్ టీవీ ఛానళ్ల లైసెన్స్‌లను స్టార్ ఇండియాకు బదిలీ చేసేందుకు సెపె్టంబర్ 27న కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధిట్రీ సిస్టమ్స్‌కు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ వ్యాపారానికి వయాకామ్ 18 హోల్డింగ్ కంపెనీగా ఉంది. విలీనం తుది దశలో ఉందని, సీసీఐ ఆదేశాలకు అనుగుణంగా వ్యాపారాల్లో సర్దుబాట్లు చేస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. అతిపెద్ద మీడియా సంస్థ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా విభాగాలు, వాల్ట్‌డిస్నీ ఇండియా వ్యాపారాల విలీనంతో రూ.70,000 కోట్ల విలువైన అతిపెద్ద మీడియా సంస్థ అవతరించనుంది. విలీనానంతర సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 63.16 శాతం, వాల్ట్ డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలుంటాయి. పోటీ సంస్థలైన సోనీ, నెట్‌ఫ్లిక్స్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా రూ.11,500 కోట్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడిగా పెట్టనుంది. -
ఐకానిక్ ఇషా అంబానీ, స్టైలిష్ లుక్స్ (ఫోటోలు)
-
అంబానీకి మార్కెట్ సెగ.. రూ. 1.32 లక్షల కోట్లు ఆవిరి!
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి షేర్ మార్కెట్ సెగ తగిలింది. భారత్‌లో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని షేర్లు భారీగా పతనమవడంతో భారీ నష్టాన్ని చవిచూసింది.షేర్ మార్కెట్లో అమ్మకాల జోరుతో కేవలం నాలుగు రోజుల్లోనే కంపెనీ రూ. 1.32 లక్షల కోట్లు నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం రూ. 20 లక్షల కోట్ల మార్కును అధిగమించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ అక్టోబర్ 4 నాటికి రూ.18.76 లక్షల కోట్లకు తగ్గింది. శుక్రవారం కంపెనీ షేరు ధర రూ.42.45 (1.51%) తగ్గింది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..రిలయన్స్ షేరులో భారీ క్షీణత కనిపించినప్పటికీ దేశంలో ముఖేష్ అంబానీనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. అక్టోబర్ 4 నాటికి అంబానీ రియల్ టైమ్ నెట్‌వర్త్ రూ.916055 కోట్లు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నిరంతర విదేశీ మూలధన ప్రవాహం కారణంగా మార్కెట్ క్రాష్ అయింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా అనిశ్చితి కారణంగా గ్లోబల్ క్రూడ్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీసింది. -
ఒక్క రూపాయీ జీతం తీసుకోని ముఖేష్ అంబానీ!
దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా నాలుగో ఏడాది కూడా తన కంపెనీల నుంచి ఎలాంటి జీతం తీసుకోలేదు. కరోనా మహమ్మారి సమయం నుంచి ఆయన వేతనం తీసుకోవడం ఆపేశారు. ఆయనేకాదు తన బోర్డులోకి వచ్చిన తన వారసులు కూడా వేతనాలు తీసుకోకపోవడం గమనార్హం.కరోనాకి ముందు వేతనం అందుకున్న ముఖేష్ అంబానీ.. ఉన్నత నిర్వాహక స్థానాల్లో ఉన్నవారు వేతనాల విషయంలో ఆదర్శంగా ఉండాలని, అందుకు తానే వ్యక్తిగత ఉదాహరణగా నిలిచేందుకు 2009 నుంచి 2020 ఆర్థిక సంవత్సరం వరకు తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. 2021లో కోవిడ్ మహమ్మారి కారణంగా వ్యాపారాలు ప్రభావితమైనప్పుడు అంబానీ తన జీతాన్ని పూర్తీగా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.కంపెనీ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. 2024 ఆర్థికేడాదిలో ముఖేష్ అంబానీ జీతం రూపంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అలవెన్సులు, పెర్క్విసిట్లతో పాటు రిటైరల్ ప్రయోజనాలను కూడా పొందలేదు. 1977 నుంచి రిలయన్స్ బోర్డులో ఉన్న ముఖేష్ అంబానీ, 2002 జూలైలో తన తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత కంపెనీ ఛైర్మన్ అయ్యారు.ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్‌లు గత ఏడాది అక్టోబర్‌లో ఎటువంటి జీతం లేకుండా బోర్డులో నియమితులయ్యారు. కానీ ఒక్కొక్కరు సిట్టింగ్ ఫీజుగా రూ.4 లక్షలు, కమీషన్ కింద రూ.97 లక్షలు పొందారు. బోర్డులో 2023 ఆగస్టు 28 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సిట్టింగ్ ఫీజు రూపంలో రూ.2 లక్షలు, కమీషన్ కింద రూ.97 లక్షలు అందుకున్నారు.ముఖేష్ అంబానీ కంపెనీ నుంచి ఎలాంటి వేతనం తీసుకోనప్పటికీ వ్యాపార పర్యటనల సమయంలో అయ్యే ఖర్చులన్నిటినీ కంపెనీ నుంచి చెల్లిస్తారు. అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడానికి కూడా కంపెనీనే ఖర్చులు భరిస్తుంది. 109 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. -
బుల్.. కొత్త రికార్డుల్
ముంబై: ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. తొలిసారి సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల పాయింట్ల మార్కును దాటాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1%, టీసీఎస్, ఇన్ఫోసిస్ 2%, అ్రల్టాటెక్ సిమెంట్ 5%, ఎన్టీపీసీ 3% పెరిగి సూచీల రికార్డుల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు, కాసేపటికే పుంజుకొని తాజా రికార్డులు నమోదు చేశాయి. మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో ఇరు సూచీలు సరికొత్త రికార్డుల ఎగువనే ముగిశాయి.ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 721 పాయింట్లు ఎగసి 79,396 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 569 పాయింట్ల లాభంతో 79,243 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 219 పాయింట్లు బలపడి 24,087 వద్ద తాజా గరిష్టాన్ని నెలకొలి్పంది. ఆఖరికి 176 పాయింట్లు బలపడి 24,044 వద్ద నిలిచింది. రికార్డుల ర్యాలీలోనూ ఫైనాన్స్, పారిశ్రామిక, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.17 % లాభపడగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ అరశాతానికి పైగా నష్టపోయింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు బలపడి 83.45 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్ సూచీలు బలహీనంగా ముగిశాయి. అమెరికా మార్కెట్లూ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ‘‘జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల స్థాయిలను అధిగమించాయి. అధిక వెయిటేజీ షేర్లు రాణించడం, రాజకీయ స్థిరత్వం, విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమన అంశాలు సూచీలను సరికొత్త శిఖరాలపైకి చేర్చాయి. అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి’’ రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరింది. సెన్సెక్స్ 4 రోజుల్లో 2,033 పాయింట్లు(2.63%) పెరగడంతో రూ.3.93 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్‌టైం రికార్డు రూ.438.41 లక్షల కోట్లకు చేరింది. ర్యాలీ ఇలానిఫ్టీ చేరేందుకు పట్టిన కాలం 20,000 51 రోజులు 21,000 60 రోజులు 22,000 25 రోజులు 23,000 88 రోజులు 24,000 25 రోజులు -
'ఇల్లాలిగా, బిజినెస్ విమెన్‌గా సరిలేరామెకు'! దటీజ్ నీతా!
అందిరిలానే ఓ సాధారణ అమ్మాయి నీతా. అనుకోకుండా ఓ సంపన్న కుటంబం తమ కోడలిగా చేసుకుంటానని ముందుకొచ్చింది. అందరిలా ఎగిరి గంతేయ్యలేదు. ఇద్దరి మనసులు కలిసాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆఖరికి కోడలిగా అడుగుపెట్టిన తన ఉద్యోగం మాత్రం వదిలేయనని తెగేసి చెప్పింది. నిజానికి ఆమె గొప్పింటి కోడలిగా రాజభోగాలు అనుభవిస్తూ ధర్జాగా కాలుపై కాలు వేసుకుని కూర్చొవచ్చు అందుకు ఆమె అంగీకరించలేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఉండాలనుకుంది. కేవలం ముఖేష్ అంబానీ వైఫ్ నీతాగా గుర్తింపు కంటే తన ఆత్మగౌరవంతో ఆర్జించుకన్న గుర్తింపుకే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ విలక్షణమే అమెను పవర్ ఫుల్ విమెన్‌గా ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు దక్కేలా చేసింది. పైగా సక్సెస్ఫుల్ విమెన్‌కి అసలైన నిర్వచనంగా నిలిచింది నీతా అంబానీ. ముంబైలో స్థిరపడిన గుజరాతీ కుటుంబం నీతాది. ఆమె కామర్స్‌లో డిగ్రీ చేశారు. భరత నాట్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఒకరోజు ఎప్పటిలానే ప్రదర్శన ఇచ్చి ఇచ్చారు. అది ధీరుబాయ్ అంబానీ కుటుంబం కంటపడింది. ఆమె నృత్య ప్రదర్శన, చలాకీతనం ధీరుబాయ్ దంపతులకు ఎంతాగనో నచ్చింది. తమ పెద్ద కుమారుడికి ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అప్పటికే అంబానీలకు పెద్ద ధనవంతుల కుటుంబమని మంచి ఫేమ్ ఉంది. అయితే ఈ విషయం నీతా చెవిన పడింది. కానీ ఆమె ఎగిరి గంతెయ్యలేదు. పైగా తమ ఇరువురి అభిప్రాయాలు కలిస్తేనే పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పింది. ఇక పెళ్లయ్యాక కూడా తాను చేసే టీచర్ ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తానని షరతు కూడా విధించింది. అయితే అప్పుడూ ఆమె జీతం రూ. 800/-. అయినా ఇప్పుడూ అంబానీ కోడలివి అది ఏ పాటిదన్న ససమేరా అంది. పైగా అది తన ఆత్మగౌరవం అని తేల్చి చెప్పింది. ఓ తల్లిగా పిల్లలను.. ఆమె పిల్లల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారేమె. తన పిల్లలను మధ్య తరగతి పిల్లల్లానే పెంచేవారట. అయితే ప్రతి శుక్రవారం పిల్లలకు కొనుక్కోవడానికి రూ.5/- ఇచ్చేవారట. ఒకరోజు చిన్న కొడుకు అనంత్ నువ్వు రూ. 5లే తెచ్చుకుంటున్నావ్.. అంబానీ కొడుకువేనా అని స్నేహితులు హేళన చేస్తున్నారని మారం చేశాడు. ఆ ఘటన నీతాను కదిలించినా చిన్నపిల్లలకు ఎక్కువ డబ్బులు ఇవ్వకూడదన్న ఉద్దేశ్యంతో సర్ది చెప్పి పంపించారట. అలాగే వారిపై ఆంక్షలు విధించేవారట. స్వేచ్ఛగా వారి నిర్ణయాలు తీసుకుని కెరియర్లో రాణించేలా చేసేవారట. సమానత్వానికే పెద్ద పీట.. ఎవ్వరైనా మీకు ఇద్దరు వారసులు కదా అని అడిగితే కాదు ముగ్గురు అని సవరించేవారట నీతా. అంతేగాదు తన కూతురు ఇషా అంబానీని నువ్వు ఎవ్వరికీ తీసిపోవంటూ కూతురిని వ్యాపారం రంగంలో ప్రోత్సహించారు నీతా. అదుకే ఇషా విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆఖిరికి అనంత్ అంబానీ బరువు విషయంలో ఎంతగా ఇబ్బంది పడ్డాడో, హేళనలకు గురయ్యేవాడో పలు ఇంటర్యూల్లో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. అందుకోసం ఆమె అతని తోపాటు యోగా, వ్యాయామాలు చేసి 90 కేజీలు బరువున్న ఆమె కాస్త 50 కేజీలకు వచ్చి కొడుకుకి ఆదర్శంగా నిలిచి చూపించింది. అయితే అనంత్ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బరువు తగ్గి చూపించాడు. అయితే అనారోగ్యం కారణంగా మళ్లీ అనూహ్యంగా చాలా బరువు పెరిగిపోవడం జరిగింది. ఆ సమయంలో మరింతగా బాధపడుతున్న అనంత్‌కి తనలో ఉన్న లోపాలను చూడొద్దని, సానుకూలతలనే చూడమని చూపింది. అందువల్లే ముగ్గురు పిల్లలు కూడా 'అమ్మే మా ధైర్యం' అని పలు ఇంటర్యూల్లో ముక్త కంఠంతో చెప్పారు. తొలి మహిళా బోర్డు సభ్యురాలు ఆమె.. ఇల్లు, పిల్లలే జీవితం అనుకోలేదు. ధీరూభాయ్ అంబానీ స్కూల్ ప్రారంభించి దేశంలో ప్రముఖ స్కూళ్లలో ఒకటిగా నిలిపారు. కుటుంబ వ్యాపారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోకి అడుగుపెట్టి తొలి మహిళా బోర్డు సభ్యురాలయ్యారు. అప్పుడే కీలక పదవుల్లో మహిళా ప్రాధాన్యంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ ‘ముంబయి ఇండియన్స్’ సహా ఎన్నో వెంచర్లు ప్రారంభించి, విజయం సాధించారు. కళలంటే ప్రాణం. వాటిని ప్రోత్సహించడానికి ‘స్వదేశీ మార్ట్’, ‘జియో వరల్డ్ సెంటర్’, ‘నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్’ వంటివీ ప్రారంభించారు. తాజాగా రియలన్స్ ‘డిస్నీ ఇండియాను’ విలీనం చేసుకునే పనిలో ఉంది. దానికి ఛైర్పర్సన్ కూడా నీతానే!. ఇలా కెరీర్ పరంగాను సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయారామె. ఈ విజయాలే ఆమెను పవర్ఫుల్ బిజినెస్ విమెన్’గా ఫోర్బ్స్ జాబితాలో నిలచేలా చేసింది. ఎన్నెన్నో పురస్కారాలను అందుకునేలా చేసింది. సేవలోనూ ముందుటారామె.. తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు నీతా. అందుకే 1997 జామ్‌నగర్‌లో రిలయన్స్ రిఫైనరీలో చేసే ఉద్యోగుల కోసం కాలనీ నిర్మించారు. 17వేలమంది కోసం నిర్మించిన దానిలో లక్ష మొక్కలు నాటించారు. అంతేకాదు రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించి మారుమూల గ్రామాలు, పట్టణాల్లో విద్య, ఆరోగ్యం, కళల అభివృద్ధికి కృషి చేశారు. ‘ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్’ ద్వారా లక్ష మంది చిన్నారులను విద్య, ఆటలకు చేరువ చేశారు. బ్రెయిలీ లిపిలో న్యూస్‌పేపర్, ఉచిత కంటి ఆపరేషన్లు... వంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. అలాగే హర్ సర్కిల్’ పేరుతో మహిళా సాధికారతకు ఎంతగానో కృషిచేశారు. (చదవండి: లావుగా ఉన్నావంటూ బిడ్డతో సహా భార్యను వదిలేశాడు..కానీ ఆమె..!) -
భారత్‌లో తొలి కంపెనీగా రిలయన్స్ - రూ.20 లక్షల కోట్లు..
ఫిబ్రవరి 13న ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు ఏకంగా 14 శాతం పుంజుకున్నాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 20 లక్షల కోట్లను అధిగమించిన భారతదేశపు మొదటి కంపెనీగా అవతరించింది. 2024లో షేర్ విలువ ఇంత పెరగటం ఇదే మొదటిసారి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ బిఎస్ఇలో ఫిబ్రవరి 13న రూ. 2,957కు చేరింది. ఈ రోజు (ఫిబ్రవరి 13) ఉదయం 1.7 శాతం పెరిగి రూ. 2953వద్ద ట్రేడ్ అయింది. దీంతో మార్కెట్ విలువ ఏకంగా రూ. 20 లక్షల కోట్లు దాటేసింది. 2005లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదటి సారి రూ.1 లక్ష కోట్ల మార్కెట్ విలువను చేరుకుంది. ఆ తరువాత 2007లో రూ.2 లక్షల కోట్లు, 2007లో రూ.3 లక్షల కోట్లు, 2007లో రూ.4 లక్షల కోట్లకు చేరింది. 2017లో రూ.5 లక్షల కోట్లు, 2019లో రూ.10 లక్షల కోట్లు, 2021లో రూ.15 లక్షల కోట్లు చేరింది. ఆ తరువాత సుమారు 600 రోజుల్లో రూ.20 లక్షల కోట్లు మైలురాయిని సాధించింది. అంటే 2005 నుంచి రూ. 20 లక్షల కోట్ల విలువను చేరుకోవడానికి దాదాపు 19 సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: మరో వ్యాపారంలోకి అంబానీ!.. రూ.27 కోట్ల డీల్ కొత్త సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ పెరుగుదల వైపు అడుగులు వేసింది. జనవరిలో 10.4 శాతం పెరిగిన షేర్ ఇప్పటికి (ఫిబ్రవరి) మరో నాలుగు శాతం పెరిగి ఈ ఏడాది గరిష్ట స్థాయికి చేరింది. దీంతో సంస్థ భారీ లాభాలను సొంతం చేసుకోగలిగింది. (మార్కెట్లో ఒడుదుడుకులు ఏర్పడితే విలువలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వ్యాల్యూలో తేడాలు రావొచ్చు.. గమనించగలరు.) -
దేశంలోనే టాప్ కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవి..
భారత్‌లో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మొదటిస్థానంలో నిలిచింది. యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ విభాగమైన బర్గండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా ఒక నివేదిక తయారుచేశాయి. గతేడాది అక్టోబరు వరకు ఆయా కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా దీన్ని రూపొందించాయి. అందులోని కొన్ని ముఖ్యమైన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. టాప్ 3 కంపెనీలు ఇవే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.15.6 లక్షల కోట్లు (ప్రస్తుత విలువ రూ.19.65 లక్షల కోట్లు). దాంతో ఈ కంపెనీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.12.4 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.14.90 లక్షల కోట్లు) రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.11.3 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.10.55 లక్షల కోట్లు) మూడో స్థానంలో ఉన్నాయి. ప్రైవేటు రంగంలోని టాప్-500 కంపెనీల (రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్) మార్కెట్ విలువ 2.8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.231 లక్షల కోట్లు)గా ఉంది. సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, సింగపూర్ల సంయుక్త జీడీపీ కంటే ఈ మొత్తం అధికం. ఏడాది వ్యవధిలో ఈ కంపెనీలు 13% వృద్ధితో 952 బిలియన్ డాలర్ల (సుమారు రూ.79 లక్షల కోట్ల) విక్రయాలను నమోదు చేశాయి. ఒక త్రైమాసికంలో దేశ జీడీపీ కంటే ఇవి ఎక్కువ. దేశంలోని 70 లక్షల మందికి (మొత్తం ఉద్యోగుల్లో 1.3 శాతం) ఈ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించాయి. ఒక్కో కంపెనీ సగటున 15,211 మందికి ఉపాధి కల్పించగా, ఇందులో 437 మంది మహిళలు ఉన్నారు. 179 మంది సీఈఓ స్థాయిలో ఉన్నారు. కంపెనీ స్థాపించి 10 ఏళ్లు కూడా పూర్తవని సంస్థలు 52 ఉన్నాయి. 235 ఏళ్ల చరిత్ర కలిగిన ఈఐడీ-ప్యారీ కూడా 500 కంపెనీల జాబితాలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాబితాలో 28వ స్థానం సాధించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు 2023 ఎడిషన్‌లో మరోసారి టాప్-10 జాబితాలోకి చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. హైదరాబాద్ కేంద్రంగా 29 కంపెనీలు ఈ జాబితాలో చోటు సాధించగా, వీటి మార్కెట్ విలువ రూ.5,93,718 కోట్లని నివేదిక తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ మొత్తం విలువ 22% పెరిగింది. దేశంలో సొంతంగా అభివృద్ధి చెందిన సంస్థల్లో రెండో స్థానంలో నిలిచిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.67,500 కోట్ల విలువను కలిగి ఉంది. నమోదు కాని సంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఈ సంస్థ విలువ ఏడాది క్రితంతో పోలిస్తే 22.1% పెరిగింది. టాప్ కంపెనీలు(మార్కెట్ విలువ) ఇవే.. దివీస్ ల్యాబ్స్: రూ.90,350 కోట్లు డాక్డర్ రెడ్డీస్: రూ.89,152 కోట్లు మేఘా ఇంజినీరింగ్: రూ.67,500 కోట్లు అరబిందో ఫార్మా: రూ.50,470 కోట్లు హెటెరో డ్రగ్స్: రూ.24,100 కోట్లు లారస్ ల్యాబ్స్: రూ.19,464 కోట్లు సైయెంట్: రూ.17,600 కోట్లు ఎంఎస్ఎన్ ల్యాబ్స్: రూ.17,500 కోట్లు డెక్కన్ కెమికల్స్: రూ.15,400 కోట్లు కిమ్స్: రూ.15,190 కోట్లు ఇదీ చదవండి: రూ.70వేలకోట్ల అమెజాన్ షేర్లు అమ్మనున్న బెజోస్.. ఈ జాబితాలో సువెన్ఫార్మా, నాట్కోఫార్మా, తాన్లా ప్లాట్‌ఫామ్స్, రెయిన్బో హాస్పిటల్స్, ఆరజెన్ లైఫ్‌సైన్సెస్, అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, యశోదా హాస్పిటల్స్, మెడ్‌ప్లస్, ఒలెక్ట్రాగ్రీన్‌టెక్, ఎన్సీసీ, సీసీఎల్ ప్రొడక్ట్స్, హెచ్‌బీఎల్ పవర్, గ్రాన్యూల్స్, మేధా సర్వో డ్రైవ్స్, కేఫిన్ టెక్, ఎంటార్ కంపెనీలు ఉన్నాయి. -
రిలయన్స్ షేర్ల రికార్డ్.. రూ.18 లక్షల కోట్ల మార్కు దాటిన ఆర్ఐఎల్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర ఊపందుకుంది. మార్కెట్ విలువ ప్రకారం దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన ఆర్ఐఎల్ షేర్లు గురువారం (జనవరి 11) 2 శాతానిపైగా పెరిగాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ కంపెనీ షేరు విలువ రూ. 2,700కిపైగా పెరిగి కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఆర్ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 18 లక్షల కోట్ల మార్కును దాటింది. గతేడాది నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విలువ 9 శాతం తగ్గుదల నమోదైంది. అయితే ఆర్ఐఎల్ షేర్ల కొనుగోళ్లు గత కొన్ని రోజులలో ఊపందుకున్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సుమారుగా 4 శాతం పెరిగాయని ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక పేర్కొంది. డిసెంబరు త్రైమాసిక ఫలితాల సీజన్ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన బ్రోకరేజీల కొనుగోలు జాబితాలో ఆర్ఐఎల్ అగ్రస్థానంలో ఉంది. గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఇటీవల ఆర్ఐఎల్ టార్గెట్ ధరను రూ.2,660 నుంచి రూ.2,885కి పెంచగా జెఫరీస్ ఇంకా ఎక్కువగా టార్గెట్ ధరను రూ.3,125గా నిర్ణయించింది. ఇక నోమురా అయితే రూ. 2,985గా నిర్ణయించింది. త్వరలో గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ జామ్‌నగర్‌లోని ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను 2024 ద్వితీయార్థంలో ప్రారంభించనున్నట్లు ఆర్ఐఎల్ చైర్పర్సన్ ముఖేష్ అంబానీ తాజాగా ప్రకటించారు. 5,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ హరిత ఇంధన రంగంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టించడం, పర్యావరణహిత ఉత్పత్తులను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఈ విషయంలో అంబానీ కంపెనీ తర్వాతే ఏదైనా..!
న్యూఢిల్లీ: దేశీయంగా మీడియాలో అత్యధికంగా కనిపించే (విజిబిలిటీ) కార్పొరేట్ సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిల్చింది. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్టెల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వార్తల్లో కార్పొరేట్ల విజిబిలిటీని విశ్లేషించే విజికీ న్యూస్ స్కోర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023కి గాను రిలయన్స్ 96.46 స్కోరుతో నంబర్ వన్ స్థానంలో ఉంది. గతేడాది ఇది 92.56గా, 2021లో 84.9గా నమోదైంది. నివేదికలోని మిగతా సంస్థల స్కోరుకు, రిలయన్స్ స్కోరుకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఎస్బీఐకి 85.81, హెచ్‌డీఎఫ్‌సీకి 84.06, ఐసీఐసీఐ బ్యాంక్‌కి 81.9, భారతి ఎయిర్‌టెల్‌కు 80.64 స్కోరు లభించింది. 4,00,000 పైచిలుకు ప్రచురణ సంస్థల్లో వార్తలు, హెడ్‌లైన్స్, సదరు పబ్లికేషన్ విస్తృతి, రీడర్షిప్ మొదలైన వాటి ఆధారంగా ఈ స్కోరు ఇచ్చారు. ఇందుకోసం కృత్రిమ మేథ, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, మీడియా ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించారు. విజికీ పరిశోధన ప్రకారం పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్)పరంగా కూడా రిలయన్స్ పటిష్టంగా ఉంది. నాలుగేళ్ల క్రితం విజికీ న్యూస్ స్కోర్ ప్రారంభమైనప్పటి నుంచి రిలయన్సే అగ్రస్థానంలో ఉంటోంది. కంపెనీ స్కోరు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. -
‘డిస్నీ–స్టార్’పై రిలయన్స్ కన్ను!
న్యూఢిల్లీ: భారత్‌లో డిస్నీ–స్టార్ వ్యాపారాన్ని దక్కించుకోవడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ మరింతగా దృష్టి పెట్టింది. 51% మెజారిటీ వాటా కొనుగోలుకు సంబంధించి వచ్చే వారం ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నగదు, స్టాక్ రూపంలో ఈ డీల్ ఉండొచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇంకా చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయమేదీ తీసుకోలేదని వివరించాయి. ఒప్పందం కుదుర్చుకున్నాక ఇరు సంస్థలు వ్యాపార మదింపు ప్రక్రియ చేపడతాయని తెలిపాయి. ఒప్పందం సాకారమైతే మీడియా రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరింతగా విస్తరించేందుకు దోహదపడనుంది. పలు సవాళ్ల నేపథ్యంలో భారత విభాగాన్ని విక్రయించే యోచనలో ఉన్నట్లు వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఐగర్ ఇటీవల సంకేతాలిచ్చిన నేపథ్యంలో తాజా డీల్ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కన్సాలిడేషన్ దిశగా .. ఇప్పటికే జీ ఎంటర్టైన్మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్ డీల్ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉందని ఎలార క్యాపిటల్ ఎస్వీపీ కరణ్ తౌరానీ తెలిపారు. రెండు మీడియా దిగ్గజాలకు (సోనీ/రిలయన్స్) టీవీ/ఓటీటీ మార్కెట్లో సింహభాగం వాటా ఉంటుందని పేర్కొన్నారు. డిస్నీ–స్టార్ భారత వ్యాపార విభాగంలో స్టార్ ఇండియా తదితర టీవీ చానళ్లు, డిస్నీప్లస్‌హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఉన్నాయి. డీల్ అనంతరం డిస్నీ–స్టార్‌కు దేశీ వ్యాపారంలో మైనారిటీ వాటాలు ఉంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒప్పందం అమలైతే విలీన సంస్థ దేశంలోనే అతి పెద్ద మీడియా సంస్థల్లో ఒకటిగా ఆవిర్భవించనుంది. రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకామ్ 18కి చెందిన 38 చానళ్లు, స్టార్ ఇండియాకి ఎనిమిది భాషల్లో ఉన్న చానళ్లతో కలిపి మొత్తం 70 టీవీ చానళ్లు ఉంటాయి. వాటితో పాటు 2 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు–డిస్నీప్లస్‌హాట్‌స్టార్, జియోసినిమా కూడా ఉంటాయి. 2019లో స్టార్‌ను ట్వంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ నుంచి డిస్నీ కొనుగోలు చేసింది. -
వినాయక చవితికి జియో ఎయిర్‌ఫైబర్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులోకి వారసుల ఎంట్రీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అంబానీ సోదరులకు శాట్‌లో ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ టేకోవర్ నిబంధనలు ఉల్లంఘన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ తదితరులపై సెబీ విధించిన రూ.25 కోట్ల జరిమానా ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. సెబీ ఆదేశాలను అంబానీ సోదరులు అప్పీల్ చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. షేర్లను గణనీయంగా కొనుగోలు చేయడం, స్వా«దీనం చేసుకోవడం (ఎస్‌ఏఎస్‌టీ) నిబంధనలను అప్పీలుదారు ఉల్లంఘించలేదని నిర్ధారిస్తూ, దీంతో సెబీ విధించిన జరిమానా ఆదేశాలు చెల్లుబాటు కావని శాట్ తేల్చింది. సెబీ ఆదేశాల మేరకు ఇప్పటికే అంబానీ సోదరులు, ఇతర సంస్థలు రూ.25 కోట్లను డిపాజిట్ చేయగా, వాటిని తిరిగి ఇచ్చేయాలని శాట్ ఆదేశించింది. 2000కు ముందు కేసు.. 2000కు ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన కేసు ఇది. కంపెనీలో 5 శాతానికి పైగా వాటాలను (మొత్తం 6.83 శాతం) ప్రమోటర్లు, పర్సన్స్ యాక్టింగ్ ఇన్ కన్సర్ట్ (పీఏసీలు)లతో కొనుగోలు చేసినా కానీ, ఆ సమాచారాన్ని వెల్లడించలేదంటూ సెబీ తప్పుబట్టింది. ఈ కేసులో ముకేశ్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ, అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీ, ఇతర సంస్థలు నిబంధనలు పాటించలేదని 2021 ఏప్రిల్‌లో జరిమానా విధిస్తూ, ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. సెబీ డిస్క్లోజర్ నిబంధనల కింద 5 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేస్తే ఆ సమాచారాన్ని వెల్లడించడం తప్పనిసరి. -
దేశంలో విలువైన కంపెనీ రిలయన్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా మరోసారి గుర్తింపు సొంతం చేసుకుంది. ‘2022 బుర్గుండీ ప్రైవేటు హరూన్ ఇండియా 500’ జాబితా మంగళవారం విడుదలైంది. 16.4 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ మొదటి స్థానంలో ఉంటే, టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్) రూ.11.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. రూ.9.4 లక్షల కోట్ల మార్కెట్ విలువతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనం అనంతరం రిలయన్స్ తర్వాత రెండో అత్యంత విలువైన కంపెనీ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరికొన్ని ప్రత్యేకతలు కూడా సొంతం చేసుకుంది. 2022–23 సంవత్సరానికి రూ.67,845 కోట్ల లాభంతో అత్యంత లాభదాయక సంస్థగానూ ఉంది. అలాగే, అత్యధికంగా రూ.16,297 కోట్ల పన్నును చెల్లించింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ అన్లిస్టెట్ కంపెనీల్లో అత్యంత విలువైన సంస్థగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిలిచింది. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ.1.97 లక్షల కోట్లుగా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ రూ.1.65 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. రూ.69,100 కోట్లతో బైజూస్ మూడో అత్యంత విలువైన అన్‌లిస్టెడ్ సంస్థగా ఉంది. 2022 అక్టోబర్ 30 నుంచి 2023 ఏప్రిల్ 30 మధ్య ఆరు నెలల కాలంలో దేశంలోని టాప్–500 ప్రైవేటు కంపెనీల మార్కెట్ విలువల వ్యత్యాసాన్ని బర్గుండీ ప్రైవేటు, హరూన్ ఇండియా ట్రాక్ చేసి ఈ నివేదికను రూపొందించాయి. మార్కెట్ విలువ ఆధారంగానే వాటికి ర్యాంకులను కేటాయిస్తుంటాయి. దేశంలోని టాప్–500 ప్రైవేటు కంపెనీల మార్కెట్ విలువ 2022 అక్టోబర్ 30 నాటికి రూ.227 లక్షల కోట్లుగా ఉండగా, 2023 ఏప్రిల్ 30 నాటికి 6.4 శాతం క్షీణించి రూ.212 లక్షల కోట్లకు పరిమితమైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.71.5 లక్షల కోట్లుగా ఉంది. దేశ జీడీపీలో ఇది 37 శాతానికి సమానం. అత్యధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ మార్కెట్ విలువను పెంచుకున్నాయి. అదానీ గ్రూపులో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ 52 శాతం క్షీణించింది. -
అంబానీకి అప్పు కావాలంట! విదేశీ బ్యాంకులతో టచ్‌లో రిలయన్స్..
ఆసియాలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. రూ.7,35,000 కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరు. అయితే ఆయన నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ 2 బిలియన్ డాలర్ల (రూ. 16,386 కోట్లు) రుణం కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. అత్యంత విజయవంతమైన వ్యాపారాల శ్రేణిని కలిగి ఉన్న రిలయన్స్ గ్రూప్ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రుణాన్ని కోరుతోంది. రుణం కోసం రిలయన్స్ విదేశీ వాణిజ్య రుణ మార్గాన్ని ఉపయోగించుకోవాలనుకుంటోందని నివేదికలు పేర్కొంటున్నాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదక ప్రకారం.. ఇలా తీసుకున్న రుణాన్ని మూలధన వ్యయం కోసం, ఇతర రుణాలను రీఫైనాన్స్ చేయడానికి రిలయన్స్ కంపెనీ ఖర్చుచేయనున్నట్లు తెలుస్తోంది. టచ్‌లో ఉన్న బ్యాంకులు ఇవే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణం కోసం బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లతో కంపెనీ టచ్‌లో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ముఖేష్ అంబానీ గత 10 సంవత్సరాలుగా టెలికాం, కన్జ్యూమర్ బిజినెస్ రంగాల్లో వైవిధ్యంతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జియో, రిలయన్స్ రిటైల్ సంస్థలను ప్రారంభించారు. అవి భారీగా విజయవంతమయ్యాయి. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ముడి చమురు శుద్ధి ప్రధాన వ్యాపారంగా ఉంది. జియో, రిటైల్ వ్యాపారాలను ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీ నిర్వహిస్తున్నారు. మరో కుమారుడు అనంత్ అంబానీ కంపెనీ కొత్త ఎనర్జీ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను 2020లోనే ముఖేష్ అంబానీ రుణ విముక్తంగా ప్రకటించారు. కానీ టెలికాం, రిటైల్ రంగాలలో విస్తరణలో భాగంగా ఇటీవల నిధుల సేకరణ జరుపుతోంది. రిలయన్స్ కొత్త ఇంధన వ్యాపారంలో రాబోయే 15 సంవత్సరాలలో 75 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా 3 బిలియన్ డాలర్లకు దక్కించుకున్నారు. అనంత్ అంబానీ నేతృత్వంలో కంపెనీ 2030 నాటికి గ్రూప్‌కు 10-15 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెస్తుందని ఇటీవల ఒక విదేశీ సంస్థ అంచనా వేసింది. -
ఐటీ జాబ్ కూడా తక్కువే!.. ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి లైఫ్ స్టైల్, లగ్జరీ కార్లు, భవనాలు, సంపద ఇలా ఏదో ఒకటి వార్తల్లో నిలుస్తూనే ఉండడం షరా మామూలే. అయితే ఒక్కోసారి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి దగ్గర పని చేస్తున్న సిబ్బందికి సంబంధించి విషయాలు కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డ్రైవర్ సాలరీపై సోషల్‌మీడియాలో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 2017లో ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం నెలకు రెండు లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు నెట్టింట ఓ వీడియో హల్చల్ చేస్తోంది. దీని ప్రకారం.. అంబానీ డ్రైవర్‌కు ఏడాదికి రూ.24 లక్షలు. ఐటీ రంగంలో కొన్ని కంపెనీల సీఈఓలకు, ఇతర సంస్థల్లో పనిచేసే వృత్తి నిపుణులకు కూడా ప్రస్తుత రోజుల్లో ఈ స్థాయి జీతం లభించడం లేదు. ఐదేళ్ల క్రితమే రూ.2 లక్షలుంటే.. అయితే 2023లో అతని జీతం ఎంత అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నగా మారి ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. వామ్మో.. అంత సాలరీ ఎందుకు సెలబ్రిటీల కుటుంబానికి డ్రైవర్‌గా జీవితం అంత తేలికైన విషయం కాదు. అందులోనూ ప్రపంచకుబేరుడు ఇంట్లో సిబ్బందిగా పనిచేయాలంటే.. వాళ్లు చేసే పనికి సంబంధించి ఎంతో నైపుణ్యం ఉండాల్సిందే. వివరాల ప్రకారం వీరిని ఒక ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నియమించుకుంటారట. కేవలం వీరికి డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు సెలబ్రిటీల లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు అనుకూలంగా నడుచుకోవడం, యజమానుల వద్ద అనుసరించాల్సిన విధివిధానాలు, క్రమ శిక్షణ కూడిన ప్రవర్తనతో పాటు మరికొన్ని అంశాలతో కఠినమైన శిక్షణను కూడా అందిస్తారు. వీటితో పాటు లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలా నడపాలి..? అని ఆ కాంట్రాక్టు సంస్థలు శిక్షణ ఇస్తుంటాయని సమాచారం. అంతేకాకుండా ఏ తరహా రోడ్ల పై, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితుల మధ్య అయినా వాహనాన్ని నడిపేలా వీరికి ట్రైనింగ్ ఇస్తారు. ఇంత తతంగం ఉంది కనుకే వారి జీతం కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో సెలబ్రీటల ఇంట పని చేస్తున్న సిబ్బంది జీతాలు ఆకర్షణీయంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. చదవండి: ఈ మెట్రో స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే.. ఎందుకంటే? -
తెలుగు రాష్ట్రాలకు జియో సంక్రాంతి కానుక.. మరిన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం ప్రారంభంలో బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 5జీ సేవల్ని ప్రారంభించిన జియో.. తాజాగా మరో 16 నగరాల్లో యూజర్లు వినియోగించేలా అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. జియో అందుబాటులోకి తెచ్చిన 16 నగరాల్లో కర్నూలు,కాకినాడ (ఆంధ్రప్రదేశ్), సిల్చార్ (అస్సోం), దేవనగరి, శివమొగ్గ, బీదర్, హోస్పేట్, గడగ్-బెటగేరి (కర్ణాటక),మలప్పురం,పాలక్కాడ్,కొట్టాయం, కానూర్ (కేరళ), తిరుపూర్ (తమిళనాడు), నిజామాబాద్, ఖమ్మం (తెలంగాణ), బరేలీ(ఉత్తర్ ప్రదేశ్)లు ఉన్నాయి. అధిక నగరాల్లో జియో 5జీ సేవలు దేశంలో తొలిసారి అధిక నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చిన టెలికం సంస్థగా జియో ప్రసిద్ది చెందింది. ఇక జియో 5జీ నెట్ వర్క్ వినియోగించుకునేందుకు సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో జియో వెల్కమ్ ఆఫర్లో భాగంగా 1జీబీపీఎస్ వరకు అన్లిమిటెడ్ డేటా పొందవచ్చని జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటనలో తెలిపింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర్ఖండ్,బీహార్,జార్ఖండ్‌లలో కనెక్టివిటీ సర్వీసుల్ని వినియోగంలోకి తెచ్చిన జియో.. విడతల వారీగా దేశ వ్యాప్తంగా ఈ ఫాస్టెస్ట్ నెట్వర్క్ సేవల్ని యూజర్లకు అందిస్తామని జియో ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా జియో అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. జియో 5 జీ నెట్ వర్క్ వాణిజ్యం, టూరిజం, ఎడ్యూకేషన్ హబ్స్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చాం. జియో 5జీ నెట్ వర్క్‌తో టెలికం సేవలతో పాటు ఈ-గవర్నెన్స్,ఎడ్యుకేషన్, ఆటోమెషిన్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్,గేమింగ్, అగ్రికల్చర్, ఐటీ, చిన్న మధ్యతరహా పరిశ్రమ వంటి రంగాలు గణనీయమైన వృద్ది సాధిస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి👉 ఫోన్ల జాబితా వచ్చేసింది, ఎయిర్టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
ధీరూభాయ్ రోల్ మోడల్..ముఖేష్ అంబానీ నాకు మంచి స్నేహితుడు : అదానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీని రోల్ మోడల్‌గా, అతని కుమారుడు ముఖేష్ అంబానీని స్నేహితుడిగా భావిస్తున్నట్లు బిలియనీర్ గౌతమ్ అదానీ తెలిపారు. అంతేకాదు దేశంలోనే అత్యంత సంపన్న అదానీ - అంబానీ కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. నేషనల్ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ధీరూభాయ్ మాకు రోల్ మోడల్, స్ఫూర్తి అని చెప్పారు. ఈ సందర్భంగా ముఖేష్ భాయ్ నాకు చాలా మంచి స్నేహితుడు. నేను అతనిని గౌరవిస్తాను. సంప్రదాయిక పెట్రోకెమికల్స్ వ్యాపారంతో పాటు జియో, టెక్నాలజీ, రిటైల్ వంటి వ్యాపారాలకు కొత్త దిశానిర్దేశం చేశారు. అంతేకాదు దేశ పురోగతికి దోహదపడుతున్నారని కొనియాడారు. గత ఏడాది ముకేశ్ అంబానీని అధిగమించి భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో చేరినప్పుడు మీకేమనిపించింది అన్న ప్రశ్నకు అదానీ స్పందించారు. నేను ఈ సంఖ్యల ఉచ్చులో ఎప్పుడూ పడలేదని సమాధానం ఇచ్చారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 117 బిలియన్ల విలువ కలిగిన అదానీ బెర్నార్డ్ ఆర్నాల్ట్, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తర్వాత ఆసియాలో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలో మూడవ ధనవంతుడిగా కొనసాగుతున్నారు. కాగా, గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చిన అదానీ, అంబానీలు భారత్ తన ఆర్ధిక వ్యవస్థ పటిష్టం చేసుకునే సమయంలో వ్యాపార రంగాల్లో అడుగు పెట్టి ఏసియా దేశాల్లో ధనవంతులుగా చెలామణి అవుతున్నారు. -
‘భారతీయుల హృదయాల్లో రిలయన్స్ చిరస్థాయిగా నిలిచిపోవాలి’
ముకేశ్ అంబానీ. భారతదేశంలో ఈ పేరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత. రిటైల్ రంగాన్ని పరుగులు తీయిస్తున్న కార్పొరేట్ దిగ్గజం. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 5G సేవలను అందించేందుకు శ్రమిస్తున్న వ్యాపారవేత్త. ‘రిలయన్స్ ఇండియా’ను హరిత కార్పొరేట్‌గా మలచాలని కలలు కంటున్న వ్యూహకర్త. ఏటా తన తండ్రి ధీరూబాయి పుట్టిన రోజును ‘రిలయన్స్ ఫ్యామిలీ డే’ గా నిర్వహిస్తారు. కంపెనీలోని అన్ని స్థాయుల ఉద్యోగులతో సంభాషిస్తారు. వారికి దిశానిర్దేశం చేస్తారు. గత ఏడాది ఇదే కార్యక్రమంలో తన పిల్లలు ముగ్గురికి కంపెనీ వారసత్వ పగ్గాలను అప్పగించారు. టెలికాం, డిజిటల్ బిజినెస్ పెద్ద కొడుకు ఆకాశ్‌కి, కవల సోదరి ఇషాకు రిటైల్, చిన్న కొడుకు అనంత్‌కు ఎనర్జీ బిజినెస్ అప్పగించారు. ఈ సారి ఫ్యామిలీ డే సందర్భంగా ఆయన ప్రసంగం మరింత ఉత్తేజ భరితంగా సాగింది. వచ్చే ఐదేళ్లలో రిలయన్స్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, సంస్థల్లోని నాయకులు, ఉద్యోగులు అంతా అంచనాలను అందుకోవాలని చెప్పారు. అర్జెంటీనా జట్టును ప్రేరణగా తీసుకుని ముందుకు సాగిపోవాలని చెప్పారు. భారతీయుల హృదయాల్లో రిలయన్స్ చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాక్షించారు. ఇతర అంశాలు ఆయన మాటల్లోనే... జనహృదయాల్లో చిరస్థాయిగా రిలయన్స్ ‘‘కాలం పరిగెడుతుంది. రిలయెన్స్ సంస్థ మర్రిచెట్టు మాదిరిగా శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. దాని కొమ్మలు విశాలమవుతాయి. వేళ్లు మరింత లోతుకు చొచ్చుకుపోతాయి. ఎందరో భారతీయుల జీవితాలను అది స్పృశిస్తుంది. సుసంపన్నం చేస్తుంది. వారికి సాధికారతను ఇస్తుంది. పెంచి పోషిస్తుంది. సంరక్షిస్తుందన్నారు ముకేశ్ అంబానీ. ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా 5G సేవలు ‘ఆకాశ్ నేతృత్వంలో జియో ప్రపంచంలోని ఏ ఇతర దేశాలలో కంటే భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. 2023 నాటికి 5G మోహరింపు పూర్తవుతుంది. జియో ప్లాట్ ఫామ్స్ అన్నీ డిజిటల్ ప్రోడక్ట్స్‌ను, పరిష్కారాలను అందిస్తూ తమకు దక్కిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే ప్రతి గ్రామానికి 5జీ కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీనివల్ల గ్రామీణ-పట్టణ అన్న అంతరం తొలుగుతుంది. అత్యున్నత విద్య, అత్యున్నత ఆరోగ్య సంరక్షణ, అత్యున్నత వాణిజ్య కలపాలు సాధ్యమవుతాయి. జియో వల్ల సంఘటిత అభివృద్ధి వేగవంతం అవుతుందని’ అన్నారు. భారత సంఘటిత అభివృద్ధిలో పాత్ర ‘ఇషా ఆధ్వర్యంలోని రిటైల్ వ్యాపారం కూడా విస్తృతంగా, మరింత లోతుగా చొచ్చుకుపోతోంది. మరింత ఉన్నతమైన లక్ష్యాలు, గమ్యాలను వెతుక్కుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అధిక ఉపాధి కల్పన, రైతులకు అధిక ఆదాయం, చిన్న, మధ్యతరహా తయారీ రంగం మరింత ఉత్పాదను సాధించటం, వ్యాపారులు మరింత సంపన్నులు కావటం ద్వారా భారత్ లోని సంఘటిత అభివృద్ధిలో రిటైల్ వ్యాపారం కూడా పరోక్ష ప్రభావాన్ని చూపుతుందన్నారు’ ముఖేశ్ అంబానీ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్సు ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్సు, పెట్రో కెమికల్ ప్లాంటులతో ఆయిల్–టు-కెమికల్ వ్యాపారంలోనూ గ్రూపు తన నాయకత్వ స్థానాన్ని నిలుపుకుంటోంది. అలాగే మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలను డిజిటల్ సర్వీసెస్ తో అనుసంధానం చేయటం వల్ల పరిశ్రమలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. ఎనర్జీ బిజినెస్‌లో.. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయటంతో పాటు, హైడ్రోజన్ బిజినెస్ లోకి ప్రవేశించటం వంటి అంశాలు కంపెనీ స్వరూప స్వభావాలనే మార్చివేస్తాయి. కొత్తతరం వ్యాపార ప్రపంచంలోకి అనంత్ ప్రవేశించారు. జామ్ నగర్లో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు వేగవంతంగా ముందుకు వెళుతున్నాం. విస్తృతిలోనూ, విలువ పరంగానూ ఖ్యాతి గడించిన రిలయెన్స్ ‘గ్రీన్ కార్పొరేట్’గా దిశగా అడుగులు వేస్తోంది. ఇంధన రంగంలో స్వయంసమృద్ధి ఇంధనరంగం ముందు స్పష్టమైన లక్ష్యాలున్నాయి. దిగుమతులపైన ఆధారపడటం తగ్గించి భద్రతను, స్వయంసమృద్ధిని సాధించాలి. చురుగ్గా, సాంకేతికంగా ముందుండటం వల్ల దీనిని సాధించవచ్చుని అన్నారు. అర్జెంటీనా విజయమే ప్రేరణ వ్యాపార రంగంలో విజయం సాధించాలంటే, నాయకత్వం, బృంద సభ్యుల పనితీరు ముఖ్యం. అర్జెంటీనానే అందుకు గొప్ప ఉదాహరణ. నాయకత్వం, మంచి బృందం కలవటం వల్లనే ఫుట్‌బాల్‌లో ఆ దేశం ప్రపంచకప్ గెల్చుకోగలిగింది. మెస్సీ తను సొంతంగా కప్ గెల్చుకోలేదు. అదే సమయంలో మెస్సీలాంటి సమర్థ నాయకత్వం లేకపోతే అర్జెంటీనా జట్టు విజయం సాధించి ఉండేది కాదు. మొదటి గేమ్‌లో వారు అపజయం పాలయ్యారు. విజయాన్ని శ్వాసించి.. విజయాన్ని కలగని.. విజయం సాధించేందుకు అవసరమైనదంతా చేసి.. చివరి పెనాల్టీ షాట్ వరకూ విజయాన్ని వెంటాడుతూ.. చివరికి గెలుపును సొంతం చేసుకున్నారు. వివేకానందుని మంత్రం మా తండ్రి ధీరుబాయి అంబానీ మాదిరిగానే నేనూ వివేకానందుని నుంచి ప్రేరణ పొందుతాను. ఒక ఆలోచనను ఎంచుకోండి. దాన్ని మీ జీవితంగా మలుచుకోండి. దాని గురించి ఆలోచించండి. దానిపైనే జీవించండి. మీ మనసు, శరీరం, నరాలు, కండరాలు, మీ శరీరంలోని అణువణువునూ అదే ఆలోచనతో నింపి, మిగిలిన ఆలోచనలన్నింటిని పక్కన పెట్టండి. అదే విజయానికి మార్గం. అదే గెలుపు మంత్రమంటూ ముగించారు ముకేశ్ అంబానీ. చదవండి: కొత్త సంవత్సరం.. కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్! -
రిలయన్స్ కిట్టీలో సోస్యో డ్రింక్
కార్బొనేటెడ్ పానీయాల కంపెనీ సోస్యో హజూరీ బెవరేజెస్‌లో రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ గుజరాత్ కంపెనీలో మిగిలిన 50 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్లు హజూరీ కుటుంబం కలిగి ఉంటుందని డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ తాజాగా తెలియజేసింది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. తాజా కొనుగోలుతో పానీయాల విభాగం మరింత బలపడనున్నట్లు రిలయన్స్ రిటైల్ ఎఫ్ఎంసీజీ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ పేర్కొంది. శత వసంతాల పురాతన కంపెనీ సోస్యో కార్బొనేటెడ్ పానీయాలు, జ్యూస్‌ల తయారీలో ఉంది. కాగా.. ఇప్పటికే రిలయన్స్ రిటైల్ సుప్రసిద్ధ బ్రాండ్ క్యాంపాకోలాను సొంతం చేసుకోవడం తెలిసిందే. 1923లోనే..: సోస్యో హజూరీ బెవరేజెస్‌ను 1923లో అబ్బాస్ అబ్దుల్రహీమ్ హజూరీ ఏర్పాటు చేశారు. గుజరాత్లో తయారీ యూనిట్ ఉంది. ప్రధాన బ్రాండ్ సోస్యో పేరుతో గుజరాత్‌తోపాటు పొరుగు రాష్ట్రాలలోనూ పానీయాలు విక్రయిస్తోంది. పానీయాలను యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తోంది. తాజా పెట్టుబడి ద్వారా స్థానిక హెరిటేజ్ బ్రాండ్లకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించడంతోపాటు.. వృద్ధి అవకాశాలకు తెరతీయనున్నట్లు రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. చదవండి: కొత్త సంవత్సరంలో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్.. ఆ 18 వేల మంది పరిస్థితి ఏంటో! -
గురువాయూర్ శ్రీకృష్ణ స్వామిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కేరళలోని గురువాయూర్ శనివారం శ్రీకృష్ణుని స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో తన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా ఉన్నారు. అంబానీ సంప్రదాయం ప్రకారం పట్టువస్త్రాలలో గురువాయుర్ స్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. ఆయన కుటుంబానికి ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఘన స్వాగతం పలికారు. ఆయన తన కుటుంబంతో కలిసి ఆలయంలోని సోపానం (అంతర్గత గర్భగుడి) వద్ద నెయ్యి సమర్పించడంతో పాటు ఆలయ ఏనుగులు చెంతమరక్షన్, బలరామన్‌లకు నైవేద్యాలు సమర్పించారు. కాగా కొన్ని రోజులుగా రిలయన్స్ అధినేత కాబోయే కోడలితో కలిసి ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవలే తిరుపతి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న సంగతి తెలిసిందే. -
మొదట 5 మెట్రో నగరాల్లో 5జీ సేవలు: రిలయన్స్
-
రిలయన్స్ రిటైల్ ఐపిఒ పై సర్వత్రా ఉత్కంఠ
-
ఇది టీజర్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. రిలయన్స్ వార్నింగ్
Reliance Industries: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని రిలయన్స్ సంస్థ హెచ్చరించింది. ప్రపంచంలో అతిపెద్ద ముడి చమురు రిఫైనింగ్ ఫ్యాక్టరీ గల రిలయన్స్.. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2022-23 ఏప్రిల్-జూన్) అంచనాల కంటే తక్కువ లాభాలను ఆర్జించిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తులో లాభాల విషయంలో ఫలితాలు అనుకున్నంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని పేర్కొంది. రిలయన్స్ జాయింట్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ వీ శ్రీకాంత్ ఈ విషయమై మాట్లాడుతూ.. పెరుగుతున్న సరుకు రవాణా, ఇన్పుట్ ధరల కారణంగా అధిక నిర్వహణ ఖర్చులు వంటి అనేక సవాళ్లను ఎదర్కోవాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ త్రైమాసికంలో ముడి సరుకుల ధరలు 76% పెరిగాయి. ఇదిలా ఉంటే, ఈ నెలాఖరులోగా ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు ఔట్‌లుక్‌ను తగ్గించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు, మార్కెట్లకు మూలధన ప్రవాహం మందగించడం, కొనసాగుతున్న మహమ్మారి, చైనాలో మందగమనం లాంటివి వీటికి పెనుసవాళ్లుగా మారాయి. చదవండి: విమాన ప్రయాణంలో ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఎందుకు ఆన్ చేస్తారో తెలుసా? -
రంకెలేసిన బుల్, 18 లక్షల కోట్లను క్రాస్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ!
ముంబై: ఉక్రెయిన్ రష్యాల మధ్య చర్చల ద్వారా సయోధ్య కుదిరే అవకాశం ఉందన్న వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో పాటు మార్కెట్ల అనిశ్చితిని అంచనా వేసే వీఐఎక్స్ ఇండెక్స్ భారీగా దిగిరావడం (20 స్థాయికి దిగువకు)ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర అధిక వెయిటేజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు బుధవారం ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 740 పాయింట్ల లాభంతో 58,684 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు బలపడి 17,498 వద్ద నిలిచింది. ఈ ముగింపు సూచీలకు ఆరువారాల గరిష్టస్థాయి కావడం విశేషం. విస్తృతస్థాయి మార్కెట్లో బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. మెటల్, ఫార్మా, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో ఒక్క జపాన్ స్టాక్ మార్కెట్ మాత్రమే నష్టపోయింది. మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండు శాతం వరకు రాణించాయి. ఇటీవల భారీ ర్యాలీ నేపథ్యంలో యూరప్ మార్కెట్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1357 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,126 కోట్ల షేర్లను కొన్నారు. మూడురోజుల్లో రూ.3 లక్షల కోట్లు గడిచిన మూడు రోజుల్లో సెన్సెక్స్ 1321 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈ నమోదిత కంపెనీలు మొత్తం రూ.3 లక్షల కోట్లను ఆర్జించాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ బుధవారం రూ.264 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఇదే మూడురోజుల్లో నిఫ్టీ సూచీ 345 పాయింట్లు లాభపడింది. ఒడిదుడుకులమయంగా సాగిన మార్చి ట్రేడింగ్‌లో మొత్తం రూ.11 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ‘‘ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ తేదీ(నేడు)న నిఫ్టీ 17,450 స్థాయి నిలుపుకోలిగే షార్ట్ కవరింగ్ ర్యాలీ జరగవచ్చు. దీంతో రానున్న రోజుల్లో కీలక నిరోధం 17,900 స్థాయిని చేధించేందుకు వీలుంటుంది. ఇటీవల గరిష్టాలను చేరిన కమోడిటీ, క్రూడ్ ధరలు దిగిరావడంతో కార్పొరేట్లపై నెలకొన్న మార్జిన్ల ఒత్తిళ్లు తగ్గొచ్చనే అంచనాలు సూచీల ర్యాలీకి తోడ్పడ్డాయి’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. రూపాయి 21 పైసలు పతనం: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం 21 పైసలు క్షీణించి 75.94 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల రికవరీతో పాటు వడ్డీరేట్ల పెంపు భయాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు రూపాయి కరిగేందుకు కారణమయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 75.65 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 75.62 వద్ద గరిష్టాన్ని, 75.97 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. రిలయన్స్ : రూ.18 లక్షల కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో రెండుశాతం లాభపడి రూ.2,673 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.18 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►టాటా కాఫీ(టీసీఎల్)ని విలీనం చేసుకుంటామని టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ ప్రకటనతో టీసీఎల్ షేరు తొమ్మిది శాతం లాభపడి రూ.215 వద్ద స్థిరపడింది. ఒక దశలో 13 శాతం పెరిగి రూ.222 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ►ఎస్అండ్పీ బ్రోకరేజ్ సంస్థ పాజిటివ్ అవుట్‌లుక్‌ను కేటాయించడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు మూడుశాతం లాభపడి రూ.7,254 వద్ద ముగిసింది. ► ఓఎన్జీసీ ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ఇష్యూ మొదలుకావడంతో షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఐదు శాతం క్షీణించి రూ.162 వద్ద స్థిరపడింది. -
అంబానీ అదరహో..ఈసారి ఏకంగా!!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన వ్యాపార కార్యకలాపాల్నీ దేశ విదేశాలకు విస్తరిస్తున్నారు. ఇటీవల లండన్ స్టోక్ పార్క్ ఎస్టేట్‌ను కొనుగోలు చేసిన ఆయన తాజాగా అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రముఖ ఐకానిక్ లగ్జరీ హోటల్ 'మాండరీయన్ ఓరియంటల్'ను కొనుగోలు చేసినట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాసియా దేశాల్లోనే అపరకుబేరుల జాబితాల్లో అగ్రస్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ తన వ్యాపారాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా న్యూయార్క్ నగరంలోని 80 కొలంబస్ సర్కిల్ ప్రాంతంలో కేపిటల్ ఆఫ్ కొలంబస్ సెంటర్ కార్పొరేషన్‌కు చెందిన ఐకానిక్ లగ్జరీ హోటల్ మాండరీయన్ ఓరియంటల్ 73.37శాతం స్టేక్‌తో 98.15మిలియన్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ భారీ మొత్తాన్ని విలాసవంతమైన హోటల్లో పరోక్షంగా వాటాను కలిగి ఉన్న కేమాన్ ఐలాండ్స్ షేర్ ను కొనుగోలు చేయడంతో.. హోటల్ ముఖేష్ అంబానీ సొంతమైంది. హోటల్ ప్రత్యేకతలు 2003లో స్థాపించిన మాండరిన్ ఓరియంటల్ 80 కొలంబస్ సర్కిల్లో ఉన్న ఐకానిక్ లగ్జరీ హోటల్. ఇది నేచురల్ సెంట్రల్ పార్క్, కొలంబస్ సర్కిల్‌కు నేరుగా ఆనుకుని ఉంది. అంతేకాదు ఇది ప్రపంచంలో ప్రసిద్దికెక్కిన హోటల్స్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. అందుకుగాను ఆ హోటల్‌కు ఏఏఏ ఫైవ్ డైమ్ హోటల్, ఫోర్బ్స్ ఫైవ్ స్టార్ హోటల్, ఫోర్బ్స్ ఫైవ్‌స్టార్ స్పా అవార్డ్‌లను గెలుచుంది. కాగా ఈ హోటల్ 2018లో ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.8,54,19,12,500.00, 2019లో రూ.8,39,33,57,500.00, 2020లో రూ.1,11,41,62,500.00 ఆదాయాల్ని గడించింది. ఇప్పుడు ఇదే హోటల్ ఎక్కువ వాటాను ముఖేష్ అంబానీ కొనుగోలు చేయడంతో రిలయన్స్ ఆస్తులు రెట్టింపు అయినట్లు రిపోర్ట్లు పేర్కొన్నాయి. మొన్నిటిక మొన్న స్టోక్ పార్క్ ఎస్టేట్ రిలయన్స్ సంస్థ ఇప్పటికే ఈఐహెచ్ లిమిటెడ్ (ఒబెరాయ్ హోటల్స్), ముంబైలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షన్ సెంటర్, హోటల్, ఇళ్లను భారీ ఎత్తున కొనుగోలు చేసింది. కొద్ది రోజుల క్రితం లండన్ బకింగ్ హామ్ స్టోక్ పార్క్‌లో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ 300 ఎకరాల స్థలంలో ఉన్న 49 బెడ్ రూమ్‌లు ఉన్న ఇంటిని ప్రత్యేకంగా రూ.592 కోట్లను వెచ్చించింది. కాగా, ఈ స్టోక్ పార్క్ ఎస్టేట్‌ను హెరిటేజ్ ప్రాపర్టీకింద వినియోగిస్తున్నట్లు రిలయన్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: రిలయన్స్ జియో సంచలన నిర్ణయం..! -
ఆ వార్త నిజం కాదు: రిలయన్స్
దేశ టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో (Reliance Jio) తన జెండాను రెపరెపలాడించింది. ఈ నేపథ్యంలో తర్వాతి అడుగుగా విదేశీ మార్కెట్లపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) దృష్టిసారించిందనే వార్త సోమవారం అంతా చక్కర్లు కొట్టింది. బ్రిటన్‌లోని అతిపెద్ద కంపెనీ బీటీ గ్రూప్(BT Group) కోసం బిడ్ వేయనుందనేది ఆ వార్త సారాంశం. కొంతకాలం క్రితం రిలయన్స్ T-Mobile డచ్ యూనిట్‌ను కొనుగోలు చేయడానికి బిడ్‌ను వేసింది. అంతకు ముందు లండన్‌లోని ఐకానిక్ స్టోక్ పార్క్‌ను 57 మిలియన్ పౌండ్లతో కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ అండ్ బిటిల ఒప్పందంపై వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ కథనాలను కొట్టిపారేసింది రిలయన్స్. ఇది పూర్తిగా నిరాధారమైన, ఊహాజనితమైన కథనమని పేర్కొంటూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. బీటీ అనేది ఫిక్స్డ్ లైన్ టెలికాం సేవల యూకే ఆపరేటర్. గత కొన్ని సంవత్సరాలుగా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, ఐపి టివి, టెలివిజన్, స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్, మొబైల్ సేవలను అందిస్తుంది, అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలకు అందిస్తుంది. బిటి స్టాక్ ఐదేళ్లలో 53% పడిపోయింది, 2020-21లో 11 సంవత్సరాల కనిష్టానికి చేరుకుంది. అయితే రిలయన్స్ బిడ్ కథనాలు నేపథ్యంలో ఒక్కసారిగా షేర్ల దూసుకుపోవడం విశేషం. ఇక రిలయన్స్‌కు చెందిన జియో ప్రస్తుతం భారత్‌లో అతిపెద్ద ఆపరేటర్‌గా ఉంది. ట్రాయ్ డాటా ప్రకారం.. సెప్టెంబర్, 2021 నాటికి 42.48 కోట్ల మొబైల్ సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు జియోకి. ఇక ఈమధ్యే ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియాతో పాటు జియో కూడా టారిఫ్‌లను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. -
వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ
ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రస్తుతం 12 స్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో అరుదైన ఫీట్‌ను సాధించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం..ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ తరువాత స్థానంలో నిలిచారు. షేర్.. హుషారు శుక్రవారం ఒక్కరోజే ఇండియన్ స్టాక్ మార్కెట్లో రియలన్స్ షేర్ వ్యాల్యూ 4 శాతం పెరిగి..అంబానీ సంపాదనకు మరో 3.7 బిలియన్ల డాలర్లు చేరినట్లైంది. దీంతో 92.9 బిలియన్ డాలర్లతో వరల్డ్ వైడ్ బిలియనీర్ జాబితాలో 11వ స్థానంలో ప్రముఖ కాస్మోటిక్స్ సంస్థ లోరియల్ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయరన్‌ను వెనక్కి నెట్టారు. 92.60 బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబానీ ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. అపర కుబేరుడు వారెన్ బఫెట్ 103 బిలియన్ డాలర్లతో 10వస్థానంలో ఉన్నారు. కలిసొచ్చిన కామెంట్స్ దేశీయ ఆన్లైన్ కామర్స్ మార్కెట్లో మరింత పట్టు కోసం రిలయన్స్ రిటైల్ వెంచర్స్(ఆర్ఆర్వీఎల్) అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా లోకల్ సెర్చి ఇంజిన్ జస్ట్ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ వాటాల్ని కొనుగోలు చేసినట్లు గురువారం తెలిపింది. ఈ ప్రకటన చేసిన మరుసటి రోజు (శుక్రవారం) నేషనల్ షాక్ ఎక్ఛేంజీలో 4.5 శాతానికి ఎగసి జీవితకాల గరిష్ట స్థాయిల్ని టచ్ చేయడంతో రియలన్స్ షేరు రూ .2,389.65 వద్ద ముగిసింది. దీంతో పాటు 'గ్రీన్ ఎనర్జీ' ద్వారా 100గిగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించడంతో రిలయన్స్ కు కలిసొచ్చింది. చదవండి: కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే! -
మరింత లాభం, చైనా కంపెనీపై ముఖేష్ అంబానీ కన్ను
ముంబై: సోలార్ ప్యానెల్స్ తయారీ సంస్థ ఆర్ఈసీ గ్రూప్‌ను దక్కించుకోవడంపై దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) దృష్టి పెట్టింది. చైనా నేషనల్ కెమికల్ కార్పొరేషన్ (కెమ్‌చైనా) నుంచి కంపెనీని కొనుగోలు చేయాలని ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఈ డీల్ విలువ సుమారు 1–1.2 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా. దీని కోసం దాదాపు 500–600 మిలియన్ డాలర్లను రుణ రూపంలో సమకూర్చుకునేందుకు అంతర్జాతీయ బ్యాంకులతో రిలయన్స్ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చదవండి : కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే! త్వరలోనే ఈ డీల్ గురించి ప్రకటన చేయొచ్చని వివరించాయి. నార్వే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆర్ఈసీ గ్రూప్ .. యూరప్‌లోనే అతి పెద్ద సోలార్ ప్యానెల్స్ తయారీ సంస్థ. సింగపూర్‌లో రిజిస్టర్ అయ్యింది. ఫొటోవోల్టెయిక్ (పీవీ) అప్లికేషన్లకు అవసరమైన సిలికాన్ మెటీరియల్, మల్టీ–క్రిస్టలైన్ వేఫర్లు, గృహాలు .. పరిశ్రమలు .. సోలార్ పార్కుల్లో ఉపయోగించే మాడ్యూల్స్‌ను తయారు చేస్తుంది. పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తి రంగంలో కార్యకలాపాలు విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ఆర్ఈసీ కొనుగోలు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అధునాతన టెక్నాలజీతో పాటు అంతర్జాతీయంగా తయారీ సామర్థ్యాలు కూడా కంపెనీకి అందుబాటులోకి వస్తాయని వివరించాయి. సౌర విద్యుత్ పరిశ్రమ ఎక్కువగా చైనాపై ఆధారపడాల్సి వస్తున్న పరిస్థితుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆర్ఈసీని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం భారత్‌కి ఏటా 3 గిగావాట్ల సోలార్ సెల్స్, 15 గిగావాట్ల మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నాయి. 90 శాతం ఉత్పత్తులను చైనా, చైనీస్ కంపెనీల నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. 2019–20లో భారత్ 2.5 బిలియన్ డాలర్ల విలువ చేసే సోలార్ వేఫర్లు, సెల్స్, మాడ్యూల్స్, ఇన్వర్టర్లను దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
రిలయన్స్ వ్యాక్సిన్: ట్రయల్స్‌కు గ్రీన్‌సిగ్నల్!
ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్.. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలోకి అడుగుపెట్టింది. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ వృద్ధి చేసిన రీకాంబినెంట్ ఆధారిత వ్యాక్సిన్.. రెగ్యులేటరీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. అప్లికేషన్‌ను పరిశీలించిన ది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో హ్యూమన్ ట్రయల్స్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిధిలోని రిలయన్స్ లైఫ్ సైన్సెస్ డెవలప్ చేసిన ఈ వ్యాక్సిన్.. ఇప్పుడు లైన్ క్లియన్ కావడంతో త్వరగా ఫేజ్-1 ట్రయల్స్‌ను మొదలుపెట్టనుంది. మొత్తం 58 రోజులపాటు ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ ముంబై ధీరూబాయ్ అంబానీ లైఫ్ సైన్సెస్ సెంటర్లో నిర్వహించనుంది. అది అయిపోయిన వెంటనే.. రెండో, మూడో ట్రయల్స్ నిర్వహిస్తుంది. రెండో డోసుల ఈ వ్యాక్సిన్ అన్ని సక్రమంగా జరిగితే.. వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. దేశంలో వ్యాక్సినేషన్ రేటు పుంజుకునే టైంలో.. రిలయన్స్ వ్యాక్సిన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా ప్రజలను ఆకర్షించేందుకు రిలయన్స్ ఎలాంటి అడుగులు వేయనుందో అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, క్యాడిల్లా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. చదవండి: అంబానీ ‘డబుల్’ మాస్టర్ ప్లాన్ -
10 లక్షల ఉద్యోగులకు రిలయన్స్ ఉచిత వ్యాక్సిన్
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు అదేవిధంగా అసోసియేట్లు, భాగస్వాములకు కలిపి 10 లక్షలకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొంది. రిలయన్స్ ఫౌండేషన్ ఏప్రిల్ లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటి వరకు అర్హత కలిగిన మొత్తం ఉద్యోగుల్లో 98 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ కనీసం ఒక డోస్ తీసుకున్నారు. అంతేగాకుండా, రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కమ్యూనిటీలకు ఉచిత వ్యాక్సినేషన్ వేయడం ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. ఇందులో 'వి కేర్ ఇనిషియేటివ్' కింద అదనంగా 10 లక్షల మోతాదులు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఇది అతి పెద్ద ఉచిత కార్పొరేట్ వ్యాక్సినేషన్ కార్యక్రమం. ప్రస్తుత కరోనా సంక్షోభంపై పోరాడటానికి ఇది ఒక్కటే మార్గం. గత నెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా ఎమ్. అంబానీ సాధారణ సమాజానికి టీకాలు వేయదనీ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. "ఈ మిషన్ దేశవ్యాప్తంగా అమలు చేయడం ఒక అతిపెద్ద పని. ప్రతి భారతీయుడి భద్రత, రక్షణ మా వాగ్దానం" అని ఆమె చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి రిలయన్స్ ఫౌండేషన్ అంతర్గత, బాహ్య సమాజాలను రక్షించే తమ సామాజిక బాధ్యత అని సంస్థ పేర్కొంది. -
Reliance Digital: ‘డిజిటల్ ఇండియా సేల్’లో బంపర్ ఆఫర్లు..!
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ డిజిటల్ కొనుగోలుదారులకు ‘ ఇండియా బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్-డిజిటల్ ఇండియా సేల్’ పేరిట సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు, బిగ్ డిస్కౌంట్లను రిలయన్స్ డిజటల్ అందిస్తోంది. డిజిటల్ ఇండియా సేల్ జూలై 26 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్ అన్ని మై జియో స్టోర్స్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా కంపెనీ వెబ్సైట్ www.reliancedigital.in. ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చును. టెలివిజన్లు, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, యాక్సెసరీస్ వంటి విస్తృతమైన కేటగిరీల శ్రేణిలో ప్రత్యేకమైన ఆఫర్లు లభించును. జూలై 22 నుంచి ఆగస్టు 5, 2021 వరకు రూ.10,000 కనీస లావాదేవీపై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద 10% క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది.ఈ ఆఫర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఈఎమ్ఐ లావాదేవీలపై కూడా లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ కేటగిరీలో, కస్టమర్లకు డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్‌లు లభిస్తాయి. జూలై 31 వరకు ఎంపిక చేసిన ఫోన్స్ పై యాక్సిడెంటల్ డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్ కవరేజ్ లభించును. వన్‌ప్లస్ నార్డ్2 స్మార్ట్‌ఫోన్ సేల్‌భాగంగా జూలై 28 నుంచి లభిస్తుంది. అంతేకాకుండా ఆపిల్ వాచ్ సీరీస్ 6, శాంసంగ్ గాలక్సీ ఆక్టివ్ 2 స్మార్ట్ వాచ్‌లు అతి తక్కువ ధరకే లభించనున్నాయి. SpO2 ఫీచర్ కలిగిన ఈ సరికొత్త ఫైర్ బోల్ట్ అగ్ని స్మార్ట్ వాచ్ డిజిటల్ ఇండియా సేల్ లో భాగంగా ఎక్స్ క్లూజివ్ గా రూ. 2,599/ ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది. ల్యాప్ ట్యాప్ కేటగిరీలో బ్యాంక్ క్యాష్ బ్యాక్, బ్రాండ్ వారంటీ ఆఫర్లతో పాటు అదనంగా రూ. 14,990/- విలువైన ప్రయోజనాలు అందుకోగలరు. Asus 10th Gen i5 గేమింగ్ ల్యాప్ టాప్ రూ. 64,999/- ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది. దాంతో పాటుగా మ్యాక్ బుక్ ప్రో స్టూడెంట్స్, టీచర్లకు ప్రత్యేకంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి కొనుగోలు చేస్తే రూ. 7000 క్యాష్ బ్యాక్ తో రూ. 1,12,990/- ఫ్లాట్ ధరకు ఎక్స్ క్లూజివ్ గా లభిస్తుంది. ల్యాప్ టాప్‌లపై స్పెషల్ డీల్ జూలై 26 నుంచి జూలై 27 న మాత్రమే లభించును. ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది.32 ఇంచుల స్మార్ట్ టీవీలు రూ. 12,990 నుంచి ప్రారంభం కానున్నాయి. రిఫ్రిజరేటర్లు రూ. 11,990, ప్రారంభం కానున్నాయి. అంతేకాకుంగా కొనుగోలుపై ఉచితంగా రూ. 1,999 విలువైన వస్తువులు లభిస్తాయి. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు రూ. 13,290 ధరతో ప్రారంభం కానున్నాయి. కొనుగోలుదారులు తమకు నచ్చిన స్టోర్ల నుంచి మూడు గంటలలోపు డెలివరీ పొందవచ్చును. -
75వేల కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేశాం: ముఖేశ్ అంబానీ
-
ప్రారంభమైన రిలయన్స్ 44వ వార్షిక సభ్య సమావేశం
-
రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి మరో కంపెనీ
బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. బ్రిటన్‌కు చెందిన లిమిటెడ్ స్టోక్ పార్కును 79 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. హోటల్‌తో పాటు గోల్ఫ్ కోర్స్ కలిగిన స్టోక్ పార్క్‌ను సొంతం చేసుకుంది. దీంతో రిలయన్స్ హాస్పిటాలిటీ ఆస్తుల్లో ఇకపై స్టోక్స్ పార్క్ కూడా భాగం కానుంది. 1964 బ్లాక్ బస్టర్ మూవీలో జేమ్స్ బాండ్, ఆరిక్ గోల్డ్ ఫింగర్తో కలిసి గోల్ఫ్ కోర్స్ ఆట ఆడినప్పటి నుంచి రోలింగ్ గోల్ఫ్ కోర్సు భాగ ఫేమస్ అయ్యింది. ముఖేష్ అంబానీ తన సామ్రాజ్యాన్ని ఇంధనేతర రంగంలోకి విస్తరిస్తున్న తరుణంలో 2019లో బ్రిటిష్ బ్రాండ్ అయిన ప్రముఖ ఆటబొమ్మల సంస్థ హామ్లిస్‌ను కొనుగోలు చేశారు. దీంతో భారత మార్కెట్లో మెరుగైన అవకాశాలు ఉన్న ఈ రంగంలోకి హామ్లిస్‌తో ప్రవేశించాలని రిలయన్స్ యోచిస్తోంది. గత ఏడాది రిలయన్స్ రిటైల్ & డిజిటల్ యూనిట్లలో ఉన్న వాటాను విక్రయించిన తర్వాత వచ్చిన 27 బిలియన్ డాలర్ల తాజా మూలధనంతో వినియోగ ఆధారిత సేవా రంగాలపై ముకేశ్ దృష్టి సారించారు. అందులో భాగంగానే జియో పేరిట టెలికాం రంగంతో పాటు హాస్పిటాలిటీ సెక్టార్‌లోకి ప్రవేశించారు. చదవండి: 2021లో టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల జోరు! -
రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ గడువు పొడగింపు
రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్, కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్‌తో చేసుకున్నకొనుగోలు ఒప్పందం గడువు ముగిసిపోవడంతో, ఇప్పుడు రిలయన్స్ రిటైల్ ఆ గడువును మరో ఆరు నెలలు పొడిగించింది. గతంలో చేసుకున్న ఒప్పందం గడువు మార్చి 31, 2021 నాటికి ముగిసిపోయింది. తాజాగా కొనుగోలు ఒప్పందం గడువు సెప్టెంబరు 30, 2021కి మార్చినట్లు రిలయన్స్ ప్రకటించింది. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ గత ఏడాది కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ గ్రూప్‌లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కు వాటాలున్నాయి. అయితే, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, ఫ్యూచర్ గ్రూప్‌తో చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం ఈ ఒప్పందం చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఈ-కామర్స్ దిగ్గజం దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. 2020 ఆగస్టు 29న ప్రకటించిన ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందం, సిసిఐ, సెబీ, బోర్సెస్ వంటి రెగ్యులేటర్ల నుంచి ఇప్పటికే క్లియరెన్స్ పొందింది. ఈ ఒప్పంద ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అడ్డంకులు ఏర్పడటంతో రిలయన్స్ గడువును పొడిగించాల్సి వచ్చింది. చదవండి: మార్చిలో రికార్డు స్థాయిలో ఎగుమతులు రెడ్మీ రికార్డు: రెండు వారాల్లోనే రూ.500 కోట్లు -
గూగుల్, ఫేస్‌బుక్‌తో రిలయన్స్ జట్టు
రిటైల్ పేమెంట్స్ లైసెన్స్ కోసం టెక్ దిగ్గజం గూగుల్, ఫేస్బుక్ సంస్థలతో కలిసి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ న్యూ అంబ్రెల్లా ఎంటిటీ(ఎన్‌యూఐ)ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దేశీయంగా డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్(యూపీఐ) మాదిరిగానే వాటా పొందేందుకు రిలయన్స్ ఆసక్తి కనబరుస్తుంది. దీనికోసం రిలయన్స్, గూగుల్, ఫేస్బుక్ సంస్థలు సో హమ్ భారత్ అనుబంధ సంస్థ ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ లిమిటెడ్ సంస్థతో కలిసి ఎన్‌యూఐ లైసెన్స్ కోసం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ బృందంలో గూగుల్, ఫేస్బుక్ తక్కువ వాటాను కలిగి ఉన్నాయి. దేశ డిజిటల్ ఎకానమీని బలోపేతం చేయడానికి తమ బృందం ఒక ప్లాన్‌ను ఆర్బీఐకి సమర్పించినట్లు తెలుస్తుంది. భారతదేశంలో యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు విజయవంతం కావడంతో ఆర్బీఐ 2020 ఆగస్టులోఎన్యూఐ బిడ్లను ఆహ్వానించింది. ఆర్బిఐ ఇటీవల ఎన్యుయు దరఖాస్తుల గడువును మార్చి 31, 2021కు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆరు నెలల్లో సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రతిపాదనలను అధ్యయనం చేస్తుంది. రిలయన్స్‌తో పాటు టాటా గ్రూప్, అమెజాన్-ఐసీఐసీఐ బ్యాంక్-యాక్సిస్ బ్యాంక్, పేటీఎం-ఓలా-ఇండస్లాండ్ బ్యాంక్ వేర్వేరుగా ఎన్యూఐల కోసం ఆర్బీఐకి దరఖాస్తులు చేసేందుకు సిద్ధం అయ్యాయి. చదవండి: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్! -
2 దశాబ్దాల్లో టాప్–3లోకి..
న్యూఢిల్లీ: వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్ టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. తలసరి ఆదాయం రెట్టింపవుతుందని పేర్కొన్నారు. ’ఫేస్బుక్ ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020’ కార్యక్రమంలో భాగంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ సీఈవో మార్క్ జకర్‌బర్గ్‌తో వర్చువల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా మొత్తం కుటుంబాల్లో 50 శాతం పైగా వాటా ఉండే మధ్యతరగతి కుటుంబాల సంఖ్య ఏడాదికి మూడు.. నాలుగు శాతం మేర వృద్ధి చెందుతుందని అంబానీ చెప్పారు. రాబోయే రోజుల్లో భారత్ ఆర్థికంగా, సామాజికంగా మరింత వేగంగా వృద్ధి చెందబోతోందని, ఫేస్బుక్, జియో సహా ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలు, కంపెనీలు ఈ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు ఇది బంగారంలాంటి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ‘‘వచ్చే రెండు దశాబ్దాల్లో టాప్ 3 ఎకానమీల్లో ఒకటిగా భారత్ ఎదుగుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. యువ జనాభా ఊతంతో ప్రీమియర్ డిజిటల్ సమాజంగా కూడా ఎదుగుతుంది. మా తలసరి ఆదాయం 1,800–2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పెరుగుతుంది’’ అని అంబానీ పేర్కొన్నారు. సంక్షోభానికి వెరవడం మా డీఎన్ఏలోనే లేదు.. కోవిడ్ సంక్షోభాన్ని భారత్ దృఢసంకల్పంతో, దీటుగా ఎదుర్కొందని అంబానీ చెప్పారు. ‘‘కోవిడ్–19 మహమ్మారి భారీ స్థాయిలో విరుచుకుపడటం.. మిగతా అందరిలాగే భారత్‌లో ప్రజల్నీ కలవరపర్చింది. అయితే, సంక్షోభాలకు వెరవడమన్నది బహుశా భారతీయుల డీఎన్ఏలో లేదేమో. అందుకే మేం దీన్ని దీటుగా ఎదుర్కొనగలిగాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీ సంక్షోభం.. ఒక కొత్త అవకాశం కల్పిస్తుందని అంబానీ చెప్పారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అత్యంత భారీ స్థాయిలో టీకాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. డిజిటల్ ఊతం... డిజిటల్ ఇండియా నినాదం ఊతంతో కనెక్టివిటీ పెరగడం వల్ల కరోనా వైరస్‌పరమైన పరిస్థితులను భారత్ దీటుగా ఎదుర్కొనగలిగిందని అంబానీ పేర్కొన్నారు. సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేందుకు డిజిటైజేషన్ ప్రక్రియ తోడ్పడగలదన్నారు. ‘భారత్, భారతీయులకు, దేశీయంగా చిన్న వ్యాపార సంస్థలకు.. ఫేస్బుక్, జియో భాగస్వామ్యం ఎంతో ప్రయోజనం చేకూ ర్చనుంది. రాబోయే రోజుల్లో మన మాటల కన్నా చేతలే దీనికి నిదర్శనంగా ఉండబోతున్నాయి’ అని జకర్‌బర్గ్‌తో అంబానీ చెప్పారు. -
బిల్‌గేట్స్ సంస్థలో రిలయన్స్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి చెందిన బ్రేక్‌థ్రూ ఎనర్జీ వెంచర్స్ (బీఈవీ)లో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 50 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయనుంది. వచ్చే ఎనిమిది నుంచి పదేళ్ల వ్యవధిలో విడతలవారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. వాతావరణ మార్పు సమస్యలను టెక్నాలజీ సహాయంతో పరిష్కరించే మార్గాలు కనుగొనడంపై బీఈవీ కృషి చేస్తోంది. సమీకరించిన నిధులను పర్యావరణ అనుకూల ఇంధనాలు మొదలైన వాటిని ఆవిష్కరించేందుకు వెచ్చించనుంది. కొత్త ఆవిష్కరణలతో మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూరగలదని, ఇన్వెస్టర్లకు కూడా మెరుగైన రాబడులు రాగలవని రిలయన్స్ తెలిపింది. -
రిలయన్స్ చేతికి ‘ఫ్యూచర్’ రిటైల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో బ్లాక్‌బస్టర్ డీల్‌కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) తాజాగా కిషోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలను కొనుగోలు చేయనున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన 1,800లకుపైగా బిగ్‌బజార్, ఎఫ్‌బీబీ, ఈజీడే, సెంట్రల్, ఫుడ్‌హాల్ స్టోర్లు దేశవ్యాప్తంగా 420లకు పైచిలుకు నగరాల్లో విస్తరించాయి. వీటిని వినియోగించుకునేందుకు రిలయన్స్‌కు మార్గం లభించింది. రిలయన్స్ రిటైల్ వ్యాపారాల విస్తరణ వేగంగా జరిగేందుకు, పోటీ కంపెనీలకు ధీటుగా ఈ–కామర్స్ రంగంలో పట్టు సాధించేందుకు ఈ లావాదేవీ దోహదం చేయనుంది. ఇక డీల్‌లో భాగంగా రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌కు బదిలీ అవుతాయి. అలాగే లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు బదిలీ చేస్తారు. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన పేరొందిన ఫార్మాట్స్, బ్రాండ్స్‌కు ఒక వేదిక ఇవ్వడం ఆనందంగా ఉందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్, ఆర్థిక పరిస్థితుల మూలంగా తలెత్తిన సవాళ్లకు.. పునర్వ్యవస్థీకరణ, తాజా లావాదేవీ ఫలితంగా సంస్థకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ వ్యాఖ్యానించారు -
ముకేశ్ చేతికి ఫ్యూచర్ గ్రూప్ రిటైలింగ్!
కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ శనివారం బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో రిటైల్ బిజినెస్‌ను బిలియనీర్ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించే ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో నగదు రూపేణా డీల్ కుదుర్చుకోనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. డీల్ విలువ రూ. 30,000 కోట్లవరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. ఒకే సంస్థగా.. రుణ భారంతో కొద్ది రోజులుగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో చర్చలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తద్వారా రిటైల్ బిజినెస్‌ను ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం ఆర్ఐఎల్కు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. డీల్‌పై అంచనాలు ఎలా ఉన్నాయంటే.. తొలుత గ్రోసరీ, దుస్తులు, సప్లై చైన్, కన్జూమర్ బిజినెస్‌లతో కూడిన ఐదు లిస్టెడ్ కంపెనీలు ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనం కానున్నాయి. ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం గ్రూప్‌నకు చెందిన రిటైల్ బ్యాకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెరసి ఫ్యూచర్ రిటైల్, లైఫ్‌స్టైల్, సప్లై చైన్, మార్కెట్స్ కంపెనీలు ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనంకానున్నట్లు అంచనా. విలీనం తదుపరి మొత్తం రిటైల్ ఆస్తులను ఒకే యూనిట్‌గా ఆర్ఐఎల్కు విక్రయించనుంది. చెల్లింపులు ఇలా! పరిశ్రమవర్గాల అంచనా ప్రకారం రిలయన్స్ తొలుత రూ. 13,000 కోట్లను ఫ్యూచర్ గ్రూప్ రుణ చెల్లింపులకు కేటాయించనుంది. మరో రూ. 7,000 కోట్లను భూయజమానులు, వెండార్స్‌కు చెల్లించనుంది. మరో రూ. 7,000 కోట్లవరకూ ప్రమోటర్ గ్రూప్‌నకు విడుదల చేసే అవకాశముంది. తదుపరి దశలో రూ. 3,000 కోట్లు వెచ్చించడం ద్వారా ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో 16 శాతం వరకూ వాటాను సొంతం చేసుకోనుంది. ఫ్యూచర్ కన్జూమర్‌కు చెందిన ఎఫ్ఎంసీజీ ప్రొడక్టులు, టెక్స్టైల్ మిల్స్, బీమా విభాగాలను ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ కలిగి ఉండవచ్చని అంచనా. ఫుడ్, ఫ్యాషన్ సరఫరాలకు వీలుగా ఆర్ఐఎల్తో దీర్ఘకాలిక ఒప్పందాన్ని ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ కుదుర్చుకోనుంది. ఈ వివరాలపై రెండు కంపెనీలూ స్పందించేందుకు నిరాకరించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. షేర్ల జోరు బోర్డు సమావేశం నేపథ్యంలో ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలన్నీ లాభాలతో పరుగు తీస్తున్నాయి. ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ రిటైల్ 4.3 శాతం జంప్‌చేసి రూ. 136కు చేరగా.. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ 4.7 శాతం ఎగసి రూ. 145ను అధిగమించింది. ఇతర కౌంటర్లలో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 2 శాతం ఎగసి రూ. 19.6 వద్ద, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ 2 శాతం బలపడి రూ. 151 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 26.65 వద్ద ఫ్రీజయ్యింది. ఇక ఫ్యూచర్ కన్జూమర్ 2 శాతం పుంజుకుని రూ. 11.15 వద్ద కదులుతోంది. -
రిలయన్స్‌కు షాకిచ్చిన బ్రోకరేజ్‌లు
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, ఎడెల్వీజ్లు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు షాక్‌నిచ్చాయి. నిఫ్టీ ఇండెక్స్‌ను ముందుండి నడిపిస్తున్న రిలయన్స్ షేరుకు డౌన్‌గ్రేడ్ రేటింగ్‌ను కేటాయించాయి. మార్చి కనిష్టస్థాయి రూ.867.82 నుంచి రిలయన్స్ షేరు 150శాతం ర్యాలీ చేసి ఇటీవల రూ.2000 స్థాయిని అందుకుంది. ‘‘నిధుల సమీకరణ, రుణాన్ని తగ్గించుకోవడం, వ్యాపారాల వాల్యూ అన్‌లాక్ కావడంతో షేరు అధికంగా ర్యాలీ చేసింది. వాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయి. ఈ పరిణామాలు అప్రమత్తతకు సంకేతాలు’’ అని రెండు బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఇప్పుడు రిలయన్స్ షేరుపై ఆయా బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలను చూద్దాం... ఎడెల్వీజ్ బ్రోకరేజ్: రిలయన్స్ షేరుకు ‘‘హోల్డ్’’ రేటింగ్‌ను కేటాయించింది. టార్గెట్ ధరను రూ.2105గా నిర్ణయించింది. రుణాలను తగ్గించుకోవడం, అసెట్ మోనిటైజేషన్, వ్యాపారంలో డిజిటల్ మూమెంట్ తదితర అంశాలు షేరును రూ.2000స్థాయిని అందుకునేందుకు తోడ్పడినట్లు ఎడెల్వీజ్ బ్రోకరేజ్ తెలిపింది. రిలయన్స్ షేరు ఏడాది ప్రైజ్ -టు -ఎర్నింగ్స్ 47.2రెట్ల నిష్పత్తి వద్ద ట్రేడ్ అవుతోందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ విలువ వాస్తవ విలువ కంటే అధికంగా ఉందని తెలిపింది. షేరు ధర పతనం ఒక క్రమపద్ధతిలో ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ బ్రోకరేజ్ సంస్థ 2016 నుంచి రిలయన్స్ షేరుపై పాజిటివ్‌గానే ఉంది. ఈ 4ఏళ్లలో షేరు 400శాతం ర్యాలీ చేసింది. సీఎల్ఎస్ఏ బ్రోకరేజ్: రిలయన్స్ షేరు రేటింగ్‌ను ‘‘అవుట్‌ఫెర్‌ఫామ్’’ నుంచి ‘‘బై’’కు కుదించింది. అయితే టార్గెట్ ధరను మాత్రం రూ.2,250కి పెంచింది. ఈ టార్గెట్ ధర షేరు ప్రస్తుత ధరకు అతి దగ్గరలో ఉంది. మార్చి 2022 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 220 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తుంది. అయితే షేరు ర్యాలీ స్వల్పకాలంలో ఆగిపోతుందని విశ్వసిస్తుంది. గడిచిన 4ఏళ్లలో షేరు 400శాతానికి పైగా ర్యాలీ చేసింది. 4నెలల్లో 150శాతం ర్యాలీ చేసింది. ఇప్పుడు స్టాక్ ర్యాలీ కొంతకాలం పాటు ఆగిపోవచ్చని సీఎల్ఎస్ఏ తన నివేదికలో తెలిపింది. -
మార్క్ జుకర్‌బర్గ్ సమీపానికి ముకేశ్ అంబానీ
దేశీ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సరికొత్త రికార్డు సాధించారు. వారాంతానికల్లా వ్యక్తిగత సంపద 77.4 బిలియన్ డాలర్లను తాకింది. దీంతో ప్రపంచంలోనే అపర కుబేరుల్లో 5వ ర్యాంకుకు చేరుకున్నారు. తద్వారా సంపదలో ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్(86 బిలియన్ డాలర్లు) సమీపంలో ముకేశ్ నిలిచారు. ముకేశ్ గ్రూప్‌లోని డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు లాభపడటంతో శుక్రవారం ఒక్క రోజులోనే వ్యక్తిగత సంపదకు 3.5 బిలియన్ డాలర్లు జమకావడం ఇందుకు సహకరించింది. రెండు వారాల క్రితమే సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను అధిగమించిన ముకేశ్ తాజాగా.. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ అధినేత ఎలన్ మస్క్, గూగుల్ సహవ్యవస్థాపకులు సెర్జీ బ్రిన్, లారీ పేజ్‌లను సైతం వెనక్కి నెట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. సాధారణంగా టాప్-5 ప్రపంచ కుబేరుల్లో అమెరికన్లు, తదుపరి యూరోపియన్లు, ఒక మెక్సికన్ చోటు సాధిస్తూ వచ్చే సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్‌కు ముకేశ్ చెక్ పెట్టినట్లు విశ్లేషకులు సరదాగా పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. జియో ప్లాట్‌ఫామ్స్ స్పీడ్ గత నెలలో ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 10వ ర్యాంకులో నిలిచారు. తదుపరి గ్రూప్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లాభాల బాటలో సాగడంతో వ్యక్తిగత సంపద మరింత బలపడుతూ వచ్చింది. కాగా.. ఈ ఏడాది జనవరి నుంచీ చూస్తే ముకేశ్ సంపద 22.3 బిలియన్ డాలర్లు పెరిగింది. మార్చిలో నమోదైన కనిష్టం నుంచి చూస్తే గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 145 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25 శాతం వాటా విక్రయం ద్వారా భారీగా విదేశీ నిధులను సమీకరించడం సహకరించింది. దీంతోపాటు.. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,000 కోట్లు సమీకరించడంతో రుణరహిత కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్, గూగుల్, సిల్వర్‌లేక్ తదితరాలు ఇన్వెస్ట్చేయడం ప్రస్తావించదగ్గ విషయంకాగా.. దీనికి జతగా ఇటీవల రిలయన్స్ రిటైల్‌లో అమెజాన్ వాటా కొనుగోలు చేయనుందన్న అంచనాలు ఇటీవల సెంటిమెంటుకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఈ ఏడాది అత్యంత భారీగా సంపదను పెంచుకున్న వ్యక్తులలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నిలవడం విశేషం! బెజోస్ సంపద 2020లో ఇప్పటివరకూ 64 బిలియన్ డాలర్లమేర బలపడింది! -
ఆర్ఐఎల్- రోజారీ బయోటెక్ రయ్రయ్
ఇటీవల ప్రతిరోజూ సరికొత్త గరిష్టాలను తాకుతున్న డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్(ఆర్ఐఎల్)కు మరోసారి డిమాండ్ నెలకొంది. దీంతో పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ ఆర్ఐఎల్ షేరు మరోసారి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో గురువారం భారీ లాభాలతో లిస్టయిన స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ రోజారీ బయోటెక్ వరుసగా రెండో రోజూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఆర్ఐఎల్ రికార్డ్ డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు విదేశీ దిగ్గజాలు క్యూకట్టడం, రైట్స్ ఇష్యూ పూర్తి నేపథ్యంలో ఆర్ఐఎల్ కౌంటర్లో ర్యాలీ కొనసాగుతోంది. కంపెనీ ఇప్పటికే రుణరహితంకావడంతోపాటు రిలయన్స్ రిటైల్, జియోమార్ట్ వంటి విభాగాలపైనా వ్యూహాత్మక ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్న వార్తలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో ఎన్ఎస్ఈలో తొలుత ఆర్ఐఎల్ షేరు రూ. 2150కు చేరింది. ఇది ఆల్‌టైమ్ హై.. కాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 2120 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ) రూ. 14 లక్షల కోట్లను తాకడం గమనార్హం! గత నెల రోజుల్లో ఆర్ఐఎల్ షేరు 22 శాతం లాభపడిన సంగతి తెలిసిందే. రోజారీ బయోటెక్ గత ఐదేళ్ల కాలంలో లిస్టయిన తొలి రోజే 75 శాతం జంప్‌చేయడం ద్వారా రికార్డ్ సృష్టించిన రోజారీ బయోటెక్ వరుసగా రెండో రోజు లాభాలతో దూసుకెళ్లింది. ఎన్ఎస్ఈలో తొలుత 7 శాతం ఎగసి రూ. 794కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా తదుపరి వెనకడుగు వేసింది. ప్రస్తుతం స్వల్ప లాభంతో రూ. 743 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల రెండో వారంలో ఐపీవో పూర్తిచేసుకున్న రోజారీ బయోటెక్ గురువారం భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 425కాగా.. చివరికి 75 శాతం లాభంతో రూ. 742 వద్ద ముగిసింది. గత ఐదేళ్ల కాలంలో 11 కంపెనీలు మాత్రమే లిస్టింగ్‌లో 50 శాతానికిపైగా లాభపడినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. తొలి రోజు బీఎస్ఈలో ఇంట్రాడేలో రూ. 804 వద్ద గరిష్టాన్ని తాకగా.. ఈ కౌంటర్లో 30 లక్షలకుపైగా షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. -
రిలయన్స్ షేరుపై బ్రోకరేజ్‌లకు ఎందుకంత మోజు..?
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఈ ఏడాది మార్చి కనిష్టస్థాయి నుంచి షేరు ఏకంగా 80శాతం పెరిగింది. కేవలం 3నెలల్లోనే 10 విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రిలయన్స్ జియోలో దాదాపు రూ.1.04లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం షేరు ర్యాలీకి కారణమైనట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలో మంగళవారం ఇంట్రాడే షేరు రూ.1647 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ఈ షేరు ఇంత స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ.., రానున్న రోజుల్లో మరింత లాభపడేందుకు అవకాశాలున్నట్లు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలైన మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మెన్ శాక్స్, సీఎల్‌ఎస్‌ఏలు రిలయన్స్ షేరుపై ఇప్పటికీ బుల్లిష్ వైఖరిని కలిగి ఉన్నాయి. ఈ షేరుపై ఆయా సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి... మోర్గాన్ స్టాన్లీ: ఆస్తుల అమ్మకాలు, ఇంధన విభాగంలో క్యాష్ ఫ్లోలు తిరిగి పుంజుకోవడం, రిటైల్ అమ్మకాలు పెరగడం, టెలికాం యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరగడం తదితర కారణాలతో షేరు రానున్న రోజుల్లో మరింత ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో తెలిపింది. ‘‘ ఏడాది తర్వాత ప్రైస్-టు-ఎర్నింగ్ (పీ/ఈ), ప్రైస్-టు-బుక్ (పీ/బీ)లు ఇప్పుడు సైకిల్ లెవల్లో గరిష్టస్థాయి వద్ద ఉన్నాయి. అయితే ఈక్విటీపై రిటర్న్(ఆర్ఓఈ), వృద్ధి ఆదాయాలను తన సహచర కంపెనీలు(పీర్స్)తో పోలిస్తే అధికంగా ఉన్నాయి.’’ అని మోర్గాన్ స్టాన్లీ ఈక్విటి విశ్లేషకుడు మయాంక్ మహేశ్వర్ తెలిపారు. మోర్గాన్ స్లాన్టీ ఈ షేరుపై ఓవర్‌వెయిట్ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.1801కి పెంచింది. గోల్డ్‌మెన్ శాక్స్: బ్రోకరేజ్ అంచనాల ప్రకారం.... ఆఫ్‌లైన్ గ్రాసరీ స్టోర్ విస్తరణ-ఆధారిత మార్కెట్ వాటా, ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్ విస్తరణతో రిలయన్స్ గ్రాసరీ రీటైల్ స్థూల వ్యాపారణ విలువ ఆర్థిక సంవత్సరం 2029 నాటికి 83బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అంతేకాకుండా, రిటైల్ వ్యాపారం ఎబిడిటా ఎఫ్వై 20-29 మధ్య 5.6 రెట్ల వృద్ధిని సాధిస్తుందని బ్రోకరేజ్ సంస్థ ఆశిస్తోంది. గోల్డ్‌మెన్ శాక్స్ ''బై'' రేటింగ్ కేటాయించడంతో పాటు పాటు షేరు టార్గెట్ ధరను రూ.1755గా నిర్ణయించింది సీఎల్ఎస్ఏ: ఈ-కామర్స్ రంగంలో విజయవంతం కావడం, ఇన్విట్ టవర్ల వాటా అమ్మకం, జియో ఫ్లాట్‌ఫామ్‌లో మరింత వాటా విక్రయం, అరామ్కో ఒప్పందం తదితదర అంశాలు రిలయన్స్ షేరు తదుపరి ర్యాలీని నడిపిస్తాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇటీవల ఫేస్‌బుక్‌తో ఒప్పందం జియో మార్ట్‌కు కలిసొస్తుంది. ఫేస్బుక్ అనుబంధ సంస్థ వాట్సప్ ద్వారా వినియోగదారులతో సత్సంబంధం పెంచుకోవడం, నిరంతరం వారికి అందుబాటులో ఉండటంతో వ్యాపార అభివృద్ధికి మరింత కలిసొస్తుందని సీఎల్ఎస్ఏ తెలిపింది. సీఎల్‌ఎస్‌ఈ బ్రోకరేజ్ సంస్థ సైతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. -
ముకేశ్ అంబానీ గ్రూప్ షేర్ల హవా
గత నెల రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నప్పటికీ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో గత నెల రోజుల్లో ఆటుపోట్ల మధ్య ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 8 శాతమే బలపడగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఎంటర్టైన్మెంట్, మీడియా కంపెనీల షేర్లు 46-98 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఈ బాటలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ప్రాస్ట్రక్చర్ సైతం 12 శాతం స్థాయిలో పుంజుకోవడం గమనార్హం! జియో ఎఫెక్ట్? మొబైల్, డిజిటల్ సర్వీసుల అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలుకి విదేశీ దిగ్గజాలు క్యూ కట్టినప్పటి నుంచీ మాతృ సంస్థ ఆర్ఐఎల్ జోరందుకుంది. జియో ఇన్ఫోకామ్‌లో 22 శాతం వాటా విక్రయంతో రూ. 1.04 లక్షల కోట్లను సమీకరించగా.. రైట్స్ ఇష్యూ ద్వారా ఆర్ఐఎల్ రూ. 53,000 కోట్లకుపైగా సమకూర్చుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గ్రూప్‌లో ప్రధాన కంపెనీ ఆర్ఐఎల్ రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. ఇతర బిజినెస్‌ల విస్తరణపై దృష్టిసారించనున్నట్లు నిపుణలు పేర్కొంటున్నారు. దీంతో గ్రూప్‌లోని కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. జోరు తీరిలా ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని ఆర్ఐఎల్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ప్రాస్ట్రక్చర్ గత నెల రోజుల్లో 11 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఫలితంగా ఆర్ఐఎల్ షేరు మంగళవారం(16న) రూ. 1648 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది కూడా. ఈ బాటలో ఇతర కౌంటర్లు మరింత జోరందుకున్నాయి. హాథవే భవానీ కేబుల్టెల్ 98 శాతం ఎగసి రూ. 16 నుంచి రూ. 32కు చేరింది. టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్ 75 శాతం జంప్‌చేసి రూ. 22 నుంచి రూ. 38కు ఎగసింది. నెట్వర్క్ 18 మీడియా రూ. 25 నుంచి రూ. 40కు చేరింది. ఇది 61 శాతం వృద్ధికాగా..డెన్ నెట్వర్క్స్ 53 శాతం పురోగమించి రూ. 80ను తాకింది. ఇదే విధంగా హాథవే కేబుల్ 46 శాతం పుంజుకుని రూ. 34ను అధిగమించగా.. రిలయన్స్ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా 12 శాతం బలపడి రూ. 306కు చేరింది. -
రిలయన్స్... ‘రైట్ రైట్’!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించాలని యోచిస్తోంది. రేపు (గురువారం–ఈ నెల 30న) జరిగే డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో రైట్స్ ఇష్యూ, డివిడెండ్, గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలపై చర్చ జరగనున్నది. ప్రస్తుత వాటాదారులకు రైట్స్ ఇష్యూ ద్వారా షేర్లు జారీ చేసే అంశం డైరెక్టర్ల బోర్డ్ పరిశీలనలో ఉంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ ఇలాంటి ఇష్యూతో రావడం ఇదే మొదటిసారి. రూ.40,000 కోట్లు సమీకరణ... రుణ రహిత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దే లక్ష్యంలో ఇదొక అడుగు అని నిపుణులంటున్నారు. రైట్స్ ఇష్యూ ద్వారా కనీసం 5 శాతం వాటా షేర్లను జారీ చేయొచ్చని వారంటున్నారు. అంటే ప్రతి వంద షేర్లకు 5 కొత్త షేర్లు లభిస్తాయి. ఈ రైట్స్ ఇష్యూ ద్వారా రూ.40,000 కోట్ల నిధులు సమకూరుతాయని అంచనా. గత ఏడాది డిసెంబర్ నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం రుణ భారం రూ.3,06,851 కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,53,719 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద నికర రుణ భారం రూ.1,53,132 కోట్లు. కాగా ఇటీవలనే రిలయన్స్ జియో డిజిటల్ ప్లాట్ఫామ్లో 10% వాటాను ఫేస్బుక్ రూ.43,574 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. ఇంధన రిటైల్ విభాగంలో సగం వాటాను రూ.7,000 కోట్లకు బీపీకి విక్రయించింది. అలాగే టెలికం టవర్ బిజినెస్‌ను రూ.25,200 కోట్లకు అమ్మేసింది. ఆయిల్ టు కెమికల్ బిజినెస్‌లో 20% వాటా ను సౌదీ ఆరామ్కో కంపెనీకి విక్రయించడానికి గత ఏడాది ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లావాదేవీలన్నింటి ద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవాలని రిలయన్స్ యోచిస్తోంది. -
అందుకే జియోతో జతకట్టాం: జుకర్ బర్గ్
సాక్షి, న్యూడిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, దేశీయ ఇంధన దిగ్గజం రిలయన్స్ జియో ఒప్పందంపై ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయనొక వీడియోను షేర్ చేశారు. డిజిటల్ ఇండియాగా మారుతున్న తరుణంలో తమ ఒప్పందం దేశవ్యాప్తంగా ప్రజలకు వాణిజ్య అవకాశాలను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ డీల్ ప్రారంభం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఇందుకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి, మొత్తం జియో బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు తమ ఆధీనంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్, రిలయన్స్ ఆధీనంలోని ఇ-కామర్స్ వెంచర్ జియో మార్ట్ మధ్య సహకారాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. (రిలయన్స్ జియోలో ఫేస్బుక్ భారీ పెట్టుబడి ఫేస్బుక్ జియో ప్లాట్‌ఫామ్‌లతో జతకట్టింది ఆర్థిక పెట్టుబడులు పెడుతున్నాం, అంతకన్నా ఎక్కువ, భారతదేశం అంతటా ప్రజలకు వాణిజ్య అవకాశాలను తెరిచే కొన్ని ప్రధాన ప్రాజెక్టులపై కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాని మిస్టర్ జుకర్‌బర్గ్ తన అధికారిక ఫేస్బుక్ పోస్ట్ లో రాశారు. ఫేస్ బుక్, వాట్సాప్ కు సంబంధించిన భారీ వినియోగదారులు, చాలామంది ప్రతిభావంతులైన పారిశ్రామికవేత్తలకు భారతదేశం నిలయం.. దేశం ఒక పెద్ద డిజిటల్ పరివర్తన క్రమంలో ఉంది. ముఖ్యంగా జియో వంటి సంస్థలు వందల మిలియన్ల భారతీయులను, చిన్న వ్యాపారాలను ఇందులో మిళితం చేయడంలో పెద్ద పాత్ర పోషించాయని జుకర్ బర్గ్ పేర్కొన్నారు. చిన్న వ్యాపారాలు ప్రతి ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైనవి, ఈ నేపథ్యంలో వాటికి మా మద్దతు అవసరం. దేశంలో 60 మిలియన్లకు పైగా చిన్న వ్యాపారాలున్నాయి. మిలియన్ల మంది ప్రజలు ఉద్యోగాల కోసం చూస్తున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా లాక్డౌన్లో ఉన్న కారణంగా డిజిటల్ సాధనాల ప్రాముఖ్యత చాలా వుంది. చిన్న సంస్థలు కస్టమర్లను కనుగొని కమ్యూనికేట్ చేయడంతో పాటు, వ్యాపారాలను పెంచుకోవడానికి ఈ డీల్ ఉపయోగపడనుంది. భారతదేశంలోని కొత్త ఉద్యోగాలు, చిరు వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికే తాము జియోతో జతకట్టామని ఫేస్ బుక్ అధినేత వెల్లడించారు. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ) కాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని జియోతో ప్రతిష్టాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో తన డిజిటల్ పరిధిని మరింత విస్తరించుకోవాలనే ప్రణాళికలో భాగాంగా జియోతో 5.7 బిలియన్ డాలర్లు పెట్టుబడుల ఒప్పందాన్ని చేసుకుంది. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్) -
రిలయన్స్, ఫేస్బుక్: వన్ స్టాప్ సూపర్ యాప్
సాక్షి, న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ బహుళార్ధసాధకంగా వన్‌స్టాప్ సూపర్ యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. వీచాట్ మాదిరిగానే ఈ కొత్త యాప్ ద్వారా, సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపులు, గేమింగ్‌తో పాటు హోటల్ బుకింగ్, తదితర సేవలతో వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నాయి. ఇందుకు మోర్గాన్ స్టాన్లీని కూడా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్‌గా నియమించుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న ఈ యాప్ తుది రూపు ఎలా వుంటుందనే దానిపై పూర్తి స్పష్టత రానప్పటికీ ప్రధానంగా వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా దీన్ని రూపొందించనుంది. ఈ యాప్ లో అన్ని అంశాలను మిళితం చేసేలా అమెరికాకు చెందిన టాప్ కన్సల్టెంట్లను నియమించుకుందిట. (యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది..) కాగా రిలయన్స్ జియోలో 10 శాతం వాటాను కొనుగోలుకు ఫేస్బుక్ రంగం సిద్దం చేసుకున్న సంగతి విదితమే. ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడుతున్న తరుణంలో కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా విధించిన ప్రయాణ నిషేధంతో చర్చలు ఆగిపోయాయి. ఈ సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రాజెక్టు ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఫేస్బుక్ భారతదేశంలో తన డిజిటల్ పరిధిని విస్తరించుకోవాలని భావిస్తోంది. చదవండి: (ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త) 76.80 స్థాయికి పడిపోయిన రూపాయి -
రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచమంతా ప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి నివారణకు ఎలాంటి మందు లేకపోవడం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నివారణ ఔషధ తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సైంటిస్టుల పరిశోధన ఆసక్తికరంగా మారింది. కరోనా వ్యాప్తిని సముద్రంలో దొరికే ఓ రకమైన ఎరుపు రంగు నాచు (మెరైన్ రెడ్ ఆల్గే) తో కరోనాకి చెక్ పెట్టవచ్చని వారు చెబుతున్నారు. దీని నుంచి తయారుచేసిన జీవరసాయన పొడి యాంటీ-వైరల్ ఏజెంట్ గా పని చేస్తుందని వెల్లడించారు. వృక్షజాలం, జంతుజాలం, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఎత్తైన మొక్కలులాంటి సహజ వనరుల నుండి ఉత్పన్నమైన ఉత్పత్తులు వైరస్ ల వల్ల వచ్చే వ్యాధులతో పోరాడటానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. పొర్ఫీరీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచు నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాచురైడ్‌లు, కరోనా వైరస్ నిరోధానికి ప్రధానంగా పనిచేస్తాయని రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు వినోద్ నాగ్లే, మహాదేవ్ గైక్వాడ్, యోగేశ్ పవార్, సంతను దాస్‌గుప్తా బృందం తెలిపింది. తాజా పరిశోధనల ప్రకారం శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లను అడ్డుకుంటాయని తమ పరిశోధనలో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. బలమైన యాంటీ వైరల్ ఏజెంట్లుగా ఇవి పనిచేస్తాయన్నారు. అంతేకాదు కరోనా యాంటీ వైరల్ మందులు మాత్రమే కాకుండా శానిటరైజ్ వస్తువులపై వైరస్ చేరకుండా కోటింగ్ (పై పూతగా)గా కూడా వాడవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్ ను నియంత్రించడంలో పోర్ఫిరీడియంతో సహా వివిధ జీవ వనరులనుంచి లభ్యమయ్యే క్యారేజీనన్ పాత్ర ప్రశంసనీయమని తేల్చారు. (కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్) తమ పరిశోధనకు మద్దతుగా క్లినికల్ ట్రయల్ అధ్యయనాలలో క్యారేజీనన్, సల్ఫేట్ పాలిసాకరైడ్ పాటు పోర్ఫిరిడియం ఇపిఎస్‌ను కూడా వినియోగించవచ్చని తెలిపారు. ఎందుకుంటే ఈ నాచు నుంచి ఉత్పత్తి అయ్యే ఎక్సోపోలిసాచురైడ్లలోని బహుళ అణువులతో (మాలిక్యులస్) చికిత్స సానుకూల ప్రయోజనం కనిపిస్తుందని పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలకు సంబంధించిన మల్టీడిసిప్లినరీ ప్రిప్రింట్ ప్లాట్‌ఫామ్ ప్రిప్రింట్స్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ నెల ప్రారంభంలో ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో కరోనాపై రిలయన్స్ లైఫ్ సైన్సెస్ చేస్తున్న పరిశోధనల గురించి ప్రస్తావించడం గమనార్హం. సహజమైన పాలీశాచురేడ్స్ పుష్కలంగా ఉన్న సీవీడ్స్ (సముద్ర నాచు)కు ఆహార ఉత్పత్తులు, సౌందర్య సాధనాలతోపాటు పలు ఔషధ పరిశ్రమల మార్కెట్ లో భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) -
కరోనాపై పోరుకు రిలయన్స్ సిద్ధం..
సాక్షి, ముంబై : కరోనాతో పోరుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మేము సైతం అంటూ నడుం బిగించింది. ప్రభుత్వ చర్యలకు తోడు తమ వంతు సాయంగా తోడ్పాటు నందించడానికి ముందుకొచ్చింది. కరోనాపై పోరుకు మాస్కులు అత్యవసరం కావడంతో రోజుకు లక్ష ఫేస్‌మాస్క్‌లు ఉత్పత్తి చేస్తామని రిలయన్స్ సోమవారం ప్రకటించింది. దీంతోపాటు కరోనా పేషెంట్లను తరలించే అత్యవసర వాహనాలకు ఉచితంగా ఇంధనం సరఫరా చేస్తామని వెల్లడించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగానికి చెందిన ముంబయి నగరపాలక సంస్థ భాగస్వామ్యంతో కేవలం రెండు వారాల వ్యవధిలోనే సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో 100 పడకలను సిద్ధం చేశామని రిలయన్స్ తెలిపింది. (కరోనా అలర్ట్ : నిర్లక్ష్యానికి భారీ మూల్యం) మరోవైపు లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ నగరాల్లో జీవనాధారం కోల్పోయినవారికి ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తామని పేర్కొంది. తమ సంస్థలో పనిచేసే ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని స్పష్టంచేసింది. కాగా.. కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వాలకు తమవంతుగా సహాయం చేయడానికి వ్యాపార వేత్తలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఆనంద్ మహీంద్రా వెంటిలేటర్ల తయారీ చేపడుతున్నామని, బాధితులకు అండగా నిలుస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. -
రిలయన్స్ @10,00,000
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి, ఏకైక భారత కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,584ను తాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ చివరకు 0.6 శాతం లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,01,555 కోట్లకు చేరింది. ఫలితంగా ఈ కంపెనీ ప్రమోటర్ ముకేశ్ అంబానీ సంపద రూ.4,28,973 కోట్లకు చేరింది. ఒక్క రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్.. 19 నిఫ్టీ కంపెనీల మార్కెట్ క్యాప్‌కు, మొత్తం నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీలోని 250 కంపెనీల మార్కెట్ క్యాప్‌కు సమానం. కంపెనీ షేర్ ధరను ఆ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్ క్యాప్‌గా వ్యవహరిస్తారు. ఆ రెండు విభాగాల జోరు.... అతి తక్కువ కాలంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని సాధించిందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా తెలిపారు. వినియోగ ఆధారిత టెలికం, రిటైల్ రంగాల్లో పెట్టుబడుల వల్ల రిలయన్స్ ఈ ఫలితాన్ని పొందిందని పేర్కొన్నారు. ఈ రెండు విభాగాల వాటా కంపెనీ మొత్తం లాభాల్లో నిలకడగా పెరుగుతోందని వివరించారు. 25 సెషన్లలోనే లక్ష కోట్లు అప్.... ఈ ఏడాది అక్టోబర్ నాటికి రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.9 లక్షల కోట్లకు పెరిగింది. కేవలం 25 ట్రేడింగ్ సెషన్లలోనే మార్కెట్ క్యాప్ లక్ష కోట్లు పెరిగి రూ.10 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీగా అవతరించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ సెన్సెక్స్ 14 శాతం పెరగ్గా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ మాత్రం 41 శాతం ఎగబాకింది. రుణ రహిత కంపెనీగా నిలవాలన్న కంపెనీ లక్ష్యం, దానికి తగ్గట్లుగా ప్రయత్నాలు చేస్తుండటం, టెలికం టారిఫ్‌లను పెంచనుండటం, వినియోగదారుల వ్యాపారంపై దృష్టిని పెంచడం.. షేర్ జోరుకు కారణాలని నిపుణులంటున్నారు. వచ్చే నెల నుంచి మొబైల్ చార్జీలను పెంచనున్నామని రిలయన్స్ జియో ప్రకటించినప్పటి నుంచి ఈ షేర్ పెరుగుతూనే ఉంది. కాగా ఈ క్యూ2లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రికార్డ్ స్థాయిలో రూ.11,262 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇటీవల వరకూ అత్యధిక మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనే ట్యాగ్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ల మధ్య పోటీ ఉండేది. ఈ రేసులో ఈ రెండు కంపెనీలు నువ్వా ? నేనా అనే పోటీ పడేవి. ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న టీసీఎస్‌కు, రిలయన్స్‌కు మధ్య తేడా రూ. 2 లక్షల కోట్ల మేర ఉండటం విశేషం. రుణ భారం పెరుగుతూ ఉన్నా... రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2009 నుంచి 2016 వరకూ రూ.350–550 రేంజ్లో కదలాడింది. రిలయన్స్ జియో రంగంలోకి వచి్చన తర్వాత నుంచి షేర్ జోరు పెరిగింది. మూడేళ్లలో ఈ షేర్ 220 శాతం ఎగసింది. 1977లో ఈ కంపెనీ ఐపీఓకు వచి్చనప్పుడు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే, అది ఇప్పుడు రూ.2.1 కోట్లకు పెరిగిందని అంచనా. కాలంతో పాటు మారుతూ రావడమే రిలయన్స్ ఘనతకు కారణం. నూలు తయారీ కంపెనీ నుంచి ఇంధన దిగ్గజంగా ఎదగడమే కాకుండా మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రిటైల్, టెలికం రంగాల్లోకి విస్తరించింది. 2009లో రూ.72,000 కోట్ల మేర ఉన్న రుణ భారం పదేళ్లలో 277 శాతం ఎగసి రూ.2.87 లక్షల కోట్లకు పెరిగింది. రుణ భారం ఈ స్థాయిలో పెరుగుతూ ఉన్నా, ఇన్వెస్టర్లు ఈ షేర్‌పై విశ్వాసాన్ని కోల్పోలేదు. ‘టార్గెట్’ పైపైకి... రుణ రహిత కంపెనీగా నిలవాలన్న రిలయన్స్ కంపెనీ లక్ష్యం వచ్చే ఆరి్థక సంవత్సరంలో సాకారం కావచ్చని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తాఫా నదీమ్ అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కోకు వాటా విక్రయం, రిలయన్స్ జియో విభాగం కారణంగా భవిష్యత్తులో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ మరింతగా పెరగగలదని పేర్కొన్నారు. బ్రోకరేజ్ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌కు కొనచ్చు రేటింగ్‌ను ఇచ్చాయి. టార్గెట్ ధరలను పెంచాయి. -
రిలయన్స్ గ్యాస్ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: కొనుగోలుదారుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో కేజీ–డీ6 బ్లాక్‌లో కొత్తగా ఉత్పత్తి చేయబోయే గ్యాస్ బేస్ ధరను రిలయన్స్ ఇండస్ట్రీస్ 7 శాతం తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేజీ–డీ6 బ్లాక్‌లోని ఆర్–క్లస్టర్ క్షేత్రం నుంచి కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్ కొనుగోలు కోసం రిలయన్స్ బిడ్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. బిడ్డింగ్ నిబంధనల ప్రకారం.. గడిచిన మూడు నెలల బ్రెంట్ క్రూడ్ సగటు రేటులో 9 శాతం స్థాయిలో గ్యాస్ బేస్ ధరను నిర్ణయించింది. తాజా మార్పుతో బేస్ రేటు 8.4 శాతం స్థాయిలో ఉండనుంది. -
జియో లిస్టింగ్‌కు కసరత్తు షురూ
రిలయన్స్ జియో (ఆర్‌జియో) లిస్టింగ్ దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటిని ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిలయన్స్ జియో సహా డిజిటల్ వ్యాపార విభాగాలకు ఉన్న రుణభారాన్ని (సుమారు రూ. 1.73 లక్షల కోట్లు) తన పేరిట బదలాయించుకోనుంది. ప్రతిగా అను బంధ సంస్థలో పూర్తి వాటాలను దక్కించుకోనుంది. దీనితో ఆర్ఐఎల్కు రిలయన్స్ జియో 100%అనుబంధ సంస్థగా (డబ్ల్యూవోఎస్) మారుతుంది. ఈ ప్రతిపాదనకు జియో పేరిట రుణాలిచి్చన బ్యాంకులు, డిబెంచర్ హోల్డర్లు అనుమతి వచ్చినట్లు ఆర్ఐఎల్ తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితే 2020 మార్చి 31 నాటికి స్పెక్ట్రం పరంగా చెల్లించాల్సిన చెల్లింపులు తప్పితే.. రిలయన్స్ జియో పూర్తి రుణ రహిత సంస్థగా మారుతుందని పేర్కొంది. -
రిలయన్స్ ‘రికార్డు’ల హోరు!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రికార్డ్ స్థాయి లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.9,516 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.11,262 కోట్లకు ఎగసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. షేర్ పరంగా చూస్తే, నికర లాభం రూ.16.1 నుంచి రూ.18.6కు పెరిగింది. ఒక్క క్వార్టర్లో ఈ స్థాయి లాభం సాధించడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి. అత్యదిక త్రైమాసిక లాభం సాధించిన ప్రైవేట్ కంపెనీగా తన రికార్డ్‌ను తానే రిలయన్స్ ఇండస్ట్రీస్ బద్దలు కొట్టింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఈ కంపెనీ రూ.10,362 కోట్ల నికర లాభం సాధించింది. ఈ క్యూ2లో ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. స్టాండ్అలోన్ పరంగా చూసినా, ఈ క్యూ2లో రికార్డ్ నికర లాభం, రూ.9,702 కోట్లను ఈ కంపెనీ సాధించింది. రిటైల్, జియోల జోరు..... సాంప్రదాయ రిఫైనింగ్, పెట్రో కెమికల్స్ విభాగాల లాభాలు బలహీనంగా ఉన్నా, రిఫైనింగ్ మార్జిన్లు టర్న్ అరౌండ్ కావడం, రిటైల్, టెలికం... ఈ రెండు కన్సూమర్ వ్యాపారాలు జోరుగా పెరగడం వల్ల ఈ రికార్డ్ స్థాయి లాభాలను సాధించామని కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ వివరించారు. ఇక ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.1,63,754 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రిటైల్ వ్యాపారం నిర్వహణ లాభం 12 శాతం పెరిగి రూ.2,322 కోట్లకు చేరిందని, టెలికం విభాగం, జియో రూ.990 కోట్ల నికర లాభం సాధించిందని తెలి పారు. ఈ రెండు విభాగాలు రికార్డ్ స్థాయి స్థూల లాభాలు సాధించాయని పేర్కొన్నారు. మొత్తం కంపెనీ నిర్వహణ లాభంలో ఈ రెండు విభాగాల వాటా మూడో వంతుకు చేరిందని చెప్పారు. రిటైల్ పరుగు... రిలయన్స్ రిటైల్ స్థూల లాభం 67% పెరిగి రూ.2,322 కోట్లకు, ఆదాయం 27% పెరిగి రూ.41,202 కోట్లకు చేరాయి. స్టోర్ ఉత్పాదకత, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణే దీనికి కారణం. క్యూ2లో కొత్తగా 337 రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించింది. దీంతో 6,700 నగరాల్లో మొత్తం రిటైల్ స్టోర్స్ సంఖ్య 10,901కు చేరింది. మరిన్ని విశేషాలు... ►9.9 మిలియన్ టన్నుల రికార్డ్ ఉత్పత్తిని సాధించినప్పటికీ, పెట్రో కెమికల్స్ వ్యాపారం స్థూల లాభం 6 శాతం తగ్గి రూ.7,692 కోట్లకు చేరింది. ఈ విభాగం స్థూల లాభం తగ్గడం ఇది వరుసగా ఆరో క్వార్టర్. ►స్థూల రిఫైనింగ్ మార్జిన్(ఒక్క బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందువల్ల లభించే మార్జిన్) గత క్యూ2లో 9.5 డాలర్లుగా ఉండగా, ఈ క్యూ2లో 9.4 డాలర్లకు తగ్గింది. క్యూ1 జీఆర్ఎమ్(8.1 డాలర్లు)తో పోలి్చతే పెరిగింది. ►ఈ ఏడాది జూన్ చివరికి రూ.2,88,243 కోట్లుగా ఉన్న రుణభారం సెప్టెంబర్ నాటికి రూ.2,91,982 కోట్లకు పెరిగింది. నగదు నిల్వలు రూ.1,34,746 కోట్లకు పెరిగాయి. జియో...జిగేల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం విభాగం రిలయన్స్ జియో నికర లాభం ఈ ఆరి్థక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 45 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.681 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.990 కోట్లకు ఎగసింది. నిర్వహణ ఆదాయం రూ.9,240 కోట్ల నుంచి 34 శాతం వృద్ధితో రూ.12,354 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో 35 కోట్ల వినియోగదారుల మైలురాయిని దాటిందని రిలయన్స్ ఎమ్డీ ముకేశ్ అంబానీ తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ.2 తగ్గి రూ.120కు చేరింది. కాగా ఈ క్యూ2లో కొత్తగా 2.4 కోట్ల మంది వినియోగదారులు రిలయన్స్ జియోకు జతయ్యారు. రిలయన్స్ మార్కెట్ విలువ రికార్డ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ శుక్రవారం మరో రికార్డ్ ఘనత సాధించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.9,05,214 కోట్లను తాకింది. రూ.9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను తాకిన తొలి భారత కంపెనీ ఇదే. ఆరి్థక ఫలితాలపై సానుకూల అంచనాల నేపథ్యంలో (మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి) ఇంట్రాడేలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,428ను తాకింది. చివరకు 1.3% లాభంతో రూ.1,428 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను తాకిన ఈ షేర్ మార్కెట్ క్యాప్ రూ. రూ.8,97,179 కోట్లకు చేరింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన ఘనతను ఈ కంపెనీ గత ఏడాది ఆగస్టులోనే సాధించింది. కంపెనీ మార్కెట్ క్యాప్ 14 నెలల్లోనే లక్ష కోట్లకు పైగా ఎగియడం విశేషం. మరో రెండేళ్లలో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 20,000 కోట్ల డాలర్ల(రూ.14 లక్షల కోట్లకు)కు పెరగగలదని ఇటీవలే బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. వినియోగదారుల వ్యాపారాల జోరు కారణంగా రికార్డ్ స్థాయి లాభం సాధించాం. రిటైల్ వ్యాపారం వృద్ది కొనసాగుతుండటం సంతోషదాయకం. వినియోగదారులకు ఉత్తమ విలువ అందించడమే లక్ష్యంగా రిలయన్స్ రిటైల్ మంచి పనితీరు కనబరుస్తోంది. ఈ విభాగం రికార్డ్ స్థాయి ఆదాయాన్ని, నిర్వహణ లాభాన్ని సాధించింది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ సరీ్వసుల కంపెనీగా రిలయన్స్ జియో నిలిచింది. ప్రతి నెలా కొత్తగా కోటిమంది వినియోగదారులవుతున్నారు. వినియోగదారులు, ఆదాయం పరంగా రిలయన్స్ జియో కంపెనీ భారత్‌లోనే అతి పెద్ద కంపెనీగానే కాకుండా, డిజిటల్ గేట్‌వే ఆఫ్ ఇండియాగా కూడా నిలిచింది. ఇళ్లకు, వ్యాపార సంస్థలకు బ్రాడ్‌బాండ్ సేవలందించడానికి జియో ఫైబర్ పేరుతో మరో విప్లవాత్మకమైన చర్యకు శ్రీకారం చుట్టాం. –ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
రిలయన్స్ ఇండస్ట్ర్రీస్..మరో సంచలనం
సాక్షి, హైదరాబాద్ : దేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. డిజిటల్ ఇండియాకు పూల దారి ప్రారంభమయింది. ప్రపంచమే భారత్‌వైపు చూసే సమయం ఆసన్నమయింది. రిలయన్స్ ఇండస్ట్ర్రీస్ మరో సంచలనానికి తెరతీసింది.ఇప్పటికే జియోతో జిల్జిల్ జిగేల్ అంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రపంచ నంబర్ వన్ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో జత కట్టింది. భారత డిజిటల్ రూపు రేఖలు మరింత మెరుగుపర్చేందుకు దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంది. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రపంచస్థాయి క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుండగా, దానికి అవసరమయ్యే ‘అజుర్’ కంప్యూటర్ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్ అందించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేశ్ అంబానీ కంపెనీ ఏజీఎం సమావేశంలో వెల్లడించారు. అంతేకాకుండా, భారతీయ టెక్నాలజీ స్టార్టప్‌లకు జియో కనెక్టివిటీతో పాటు జియో-అజుర్ క్లౌడ్ సర్వీస్‌ను ఉచితంగానే అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చిన్న స్థాయి వ్యాపార సంస్థలకు అవసరమయ్యే కనెక్టివిటీ సమూహాన్ని, ఆటోమేషన్ టూల్స్‌ను నెలకు కేవలం రూ.1500లకే అందించనున్నట్లు ముఖేశ్ అంబానీ ప్రకటించారు. -
ఇక రిలయన్స్, బీపీ బంకులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు, విమాన ఇంధనాన్ని కూడా విక్రయిచేందుకు దిగ్గజ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీ తాజాగా జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. పెట్టుబడులు తదితర అంశాలతో కూడిన ఒప్పందం కూడా త్వరలోనే ఖరారు కాగలదని పేర్కొన్నాయి. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 2020 ప్రథమార్ధం నాటికి పూర్తి ఒప్పందం కుదరవచ్చని వివరించాయి. డీల్ ప్రకారం కొత్త వెంచర్లో బీపీకి 49 శాతం, రిలయన్స్‌కు 51 శాతం వాటాలు ఉంటాయి. ప్రస్తుతం రిలయన్స్‌కి చెందిన సుమారు 1,400 పైచిలుకు పెట్రోల్ బంకులు, 31 పైచిలుకు విమాన ఇంధన స్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యే జేవీకి బదలాయిస్తారు. రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ, బీపీ గ్రూప్ సీఈవో బాబ్ డడ్లీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ‘ఇంధన రిటైలింగ్ రంగంలో అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటైన బీపీతో మా పటిష్టమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనం. ఇప్పటికే గ్యాస్ వనరుల అభివృద్ధిలో ఉన్న మా భాగస్వామ్యం ఇక ఇంధన రిటైలింగ్, ఏవియేషన్ ఇంధనాలకు కూడా విస్తరిస్తుంది. ప్రపంచ స్థాయి సేవలు అందించేందుకు ఇది తోడ్పడనుంది‘ అని ముకేశ్ అంబానీ తెలిపారు. ‘రిలయన్స్‌తో కలిసి వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన సేవలు, అత్యంత నాణ్యమైన ఇంధనాలు అందిస్తాం‘ అని బాబ్ డడ్లీ పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో ఇంధనాల రిటైల్ నెట్‌వర్క్‌ను 5,500 పెట్రోల్ బంకులకు విస్తరించనున్నామని రెండు సంస్థలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ‘భారత్‌లో విమాన ఇంధన విక్రయ వ్యాపారానికి, రిటైల్ సర్వీస్ స్టేషన్ నెట్వర్క్ ఏర్పాటు కోసం మా రెండు సంస్థలు కొత్తగా జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రిలయన్స్‌కు ఉన్న ఇంధన రిటైలింగ్ నెట్వర్క్, విమాన ఇంధన వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నాం‘ అని వివరించాయి. అయితే, 1,400 పైచిలుకు పెట్రోల్ బంకులు, 31 విమానాశ్రయాల్లో ఉన్న విమాన ఇంధన స్టేషన్లలో కూడా వాటాలు దక్కించుకుంటున్నందుకు గాను రిలయన్స్‌కు బీపీ ఎంత మొత్తం చెల్లించనున్నది మాత్రం వెల్లడించలేదు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న జంట చమురు రిఫైనరీల్లో వాటాలు విక్రయించేందుకు సౌదీ ఆరామ్కోతో రిలయన్స్ చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ జాయింట్ వెంచర్ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరామ్కో కూడా భారత్‌లో ఇంధనాల రిటైలింగ్ కార్యకలాపాల వెంచర్‌పై దృష్టి పెట్టింది. మూడో జేవీ.. 2011 నుంచి రిలయన్స్, బీపీకి ఇది మూడో జాయింట్ వెంచర్ కానుంది. 2011లో రిలయన్స్‌కి చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో బీపీ 30 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 7.2 బిలియన్ డాలర్లు. ఇప్పటిదాకా రెండు సంస్థలు చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కోసం 2 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. ఇక అప్పట్లోనే గ్యాస్ సోర్సింగ్, మార్కెటింగ్ కార్యకలాపాల కోసం ఇండియా గ్యాస్ సొల్యూషన్స్ (ఐజీఎస్‌పీఎల్) పేరిట రెండు సంస్థలు ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఇందులో రెండింటికీ చెరి 50 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చమురు, గ్యాస్ బ్లాకుల్లో కొన్నింటిని రిలయన్స్–బీపీ వదిలేసుకున్నాయి. ఐజీఎస్‌పీఎల్ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఇంధన రిటైలింగ్‌లో పీఎస్‌యూల హవా.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 65,000 పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) చమురు మార్కెటింగ్ కంపెనీలకే ఉంది. వీటికి ఏకంగా 58.174 బంకులు ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించి రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ సారథ్యంలోని నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్ ఆయిల్)కు 5,244 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వచ్చే 2–3 ఏళ్లలో వీటిని 7,000కు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. రాయల్ డచ్ షెల్‌కు ప్రస్తుతం 151 అవుట్‌లెట్స్ ఉండగా, కొత్తగా మరో 150–200 దాకా బంకులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. భారత్‌లో 3,500 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు బీపీ 2016లోనే లైసెన్సు పొందింది. -
ఆదాయంలోనూ రిలయన్స్ టాప్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను చాటుకుంది. ఆదాయం పరంగా ప్రభుత్వరంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను (ఐవోసీ) అధిగమించి దేశంలో అగ్ర స్థానానికి చేరుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ రూ.6.23 లక్షల కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. పోటీ సంస్థ ఐవోసీ టర్నోవర్ 6.17 లక్షల కోట్లుగానే ఉంది. ఇక లాభం విషయంలోనూ నంబర్ 1 రిలయన్స్ ఇండస్ట్రీలే కావడం గమనార్హం. ఐవోసీ లాభంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రెట్టింపు స్థాయింలో రూ.39,588 కోట్లను నమోదు చేసింది. ఐవోసీ నికర లాభం 17,274 కోట్లకే పరిమితం అయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.22,189 కోట్లతో పోలిస్తే 23 శాతం క్షీణించింది. కానీ, అదే సమయంలో ఆర్ఐఎల్ లాభంలో 13 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. మార్కెట్ విలువ పరంగా ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో టాప్ కంపెనీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో టీసీఎస్‌తో తరచూ పోటీ పడుతూ ఉంటుంది. దశాబ్దం క్రితం ఐవోసీ సైజులో ఆర్ఐఎల్ సగం మేరే ఉండేది. ఈ మధ్య కాలంలో టెలికం, రిటైల్, డిజిటల్ సేవలు వంటి వినియోగ ఆధారిత వ్యాపారాల్లోకి రిలయన్స్ పెద్ద ఎత్తున విస్తరించడం అగ్ర స్థానానికి చేరుకునేందుకు దోహదపడింది. గతేడాది వరకు ఐవోసీ ప్రభుత్వరంగంలో అత్యంత లాభదాయకత కలిగిన కంపెనీగా ఉండగా, 2018–19లో ఓఎన్జీసీ ఈ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఓఎన్జీసీ మార్చి క్వార్టర్ ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉండగా, డిసెంబర్ నాటికే 9 నెలల్లో రూ.22,671 కోట్ల లాభం సొంతం చేసుకుంది. ఈ ప్రకారం చూసినా ఐవోసీని వెనక్కి నెట్టేసినట్టే అనుకోవాలి. ఐవోసీ ఆదాయం ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్, గ్యాస్ వ్యాపారాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ఏ విధంగా చూసినా.. తాజా రికార్డులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడు రకాలుగా... ఆదాయం, లాభం, మార్కెట్ విలువ పరంగా మెరుగైన స్థానంలో, దేశంలో నంబర్1గా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఆర్ఐఎల్ ఆదాయం 2018–19లో అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 44 శాతం వృద్ధి చెందింది. అదే ప్రధానంగా ఐవోసీని రెండో స్థానానికి నెట్టేసేందుకు ఉపయోగపడింది. 2010–19 మధ్య వార్షికంగా ఆర్ఐఎల్ ఆదాయ వృద్ధి 14 శాతం ఉండడం గమనార్హం. ఇక ఐవోసీ ఆదాయం 2018–19లో 20 శాతం వృద్ధిని నమోదు చేయగా, 2010–19 మధ్య వార్షికంగా 6.3 శాతం పెరుగుతూ వచ్చింది. మంగళవారం నాటి స్టాక్ క్లోజింగ్ ధర ప్రకారం ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ రూ.8.52 లక్షల కోట్లు. ఇక గమనించాల్సిన మరో అంశం... మరే కంపెనీకి లేని విధంగా ఆర్ఐఎల్ వద్ద రూ.1.33 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉండడం. అంతే కాదండోయ్... స్థూల రుణ భారం విషయంలోనూ ప్రముఖ స్థానం రిలయన్స్‌దే కావడం విశేషం. 2019 మార్చి నాటికి రూ.2.87 లక్షల కోట్ల రుణాలు ఆర్ఐఎల్ తీసుకుని ఉంది. ఐవోసీ రుణ భారం రూ.92,700 కోట్లు. -
రిలయన్స్ రిటైల్ చేతికి ఐటీసీ ‘జాన్ ప్లేయర్స్’
న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ మగవాళ్ల దుస్తుల బ్రాండ్, జాన్ ప్లేయర్స్‌ను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించింది. డీల్‌లో భాగంగా ట్రేడ్‌మార్క్, మేధోపరమైన హక్కులనూ రిలయన్స్ రిటైల్‌కు బదిలీ చేసింది. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా జాన్ ప్లేయర్స్‌ను బ్రాండ్‌ను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించామని ఐటీసీ తెలిపింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే ఈ డీల్ విలువ రూ.150 కోట్ల మేర ఉండొచ్చని సమాచారం. ఈ బ్రాండ్ కొనుగోలుతో రిలయన్స్ రిటైల్, ఈ సంస్థ ఆన్లైన్ప్లాట్ఫామ్, అజియోడాట్కామ్లు మరింత పటిష్టమవుతాయని నిపుణుల అంచనా. 2002లో ఆరంభమైన జాన్ ప్లేయర్స్ బ్రాండ్...యూత్ ఫ్యాషన్ అప్పారెల్ బ్రాండ్‌గా మంచి ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం 557గా ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ ఫ్యాషన్ స్టోర్స్‌ను ఐదేళ్లలో 2,500కు పెంచాలని రిలయన్స్ రిటైల్ యోచిస్తోంది. -
స్వల్ప లాభాలతో సరి..
ముంబై: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలున్నా... శుక్రవారం దేశీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా ఇండెక్స్‌లోని బడా షేర్లవైపే మొగ్గు చూపడంతో చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 13 పాయింట్లు పెరిగి 36,387 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.75 పాయింట్ల లాభంతో 10,907 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 379 పాయింట్లు (సుమారు 1 శాతం), నిఫ్టీ 112 పాయింట్లు (దాదాపు 1 శాతం) మేర పెరిగాయి. ఫార్మా షేర్లు, బలహీన రూపాయి తదితర అంశాలు సెంటిమెంట్‌కి ప్రతికూలంగా మారాయని, అంతర్జాతీయ మార్కెట్లు కోలుకున్నా దేశీ మార్కెట్లు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (రీసెర్చి విభాగం) వినోద్ నాయర్ తెలిపారు. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, మళ్లీ మాంద్యం భయాల కారణంగా సమీప భవిష్యత్‌లో భారత మార్కెట్లు స్థిర శ్రేణిలోనే కదలాడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, వేదాంత, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, టీసీఎస్ దాదాపు 1.41 శాతం దాకా లాభపడ్డాయి. ఎయిర్టెల్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాŠంక్, యస్ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్ మొదలైనవి కూడా అదే బాటలో 6.42 శాతం దాకా క్షీణించాయి. రిలయన్స్ జూమ్... క్యూ3లో రికార్డు స్థాయిలో రూ. 10,000 కోట్ల పైగా నికర లాభాలు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సెన్సెక్స్‌లో అత్యధికంగా 4.34 శాతం లాభపడి రూ. 1,183 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఒక దశలో 4.89 శాతం ఎగిసి రూ. 1,185.50 స్థాయిని కూడా తాకింది. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ ఒక్కరోజులోనే రూ. 31,209 కోట్లు పెరిగి రూ. 7,49,830 కోట్లకు చేరింది. -
ముకేశ్ అంబానీ రిటైల్ జోరు..
(సాక్షి, బిజినెస్ విభాగం) జ్యుయలరీ నుంచి మొదలుపెడితే దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, పాదరక్షలు, నిత్యావసర సరుకులు... ఇలా అన్నింటికీ వేరువేరు ఆఫ్‌లైన్ స్టోర్లు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్... ఈ బలాన్ని ఆన్‌లైన్‌కు ఉపయోగించుకోవటానికి స న్నాహాలు చేస్తోంది. వీటన్నిటినీ ఆన్‌లైన్‌లోకి తేవటానికి తన మరో ప్రధాన ఆయుధమైన రిలయన్స్ జియోను ఎంచుకుంటోంది. ఇంటింటికీ జియో ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్... దాని ద్వారానే ఆన్లైన్ వ్యాపారం వృద్ధి చెం దుతుందని భావిస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ–కామర్స్ అనుభవాన్ని అం దించేందుకు తనకు మూలమూలనా ఉన్న జియో పాయింట్ స్టోర్స్‌ను వినియోగించుకోనుంది. చౌక చార్జీలతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ తాజాగా రిటైల్ రంగంలోనూ అదే తరహాలో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలో ప్రారంభించే రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ వెంచర్ కోసం ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న జియో పాయింట్ స్టోర్స్‌ను ఉపయోగించుకోబోతున్నారు. ప్రస్తుతం 5,000 పైచిలుకు నగరాల్లో 5,100 పైగా చిన్న స్థాయి జియో పాయింట్ స్టోర్స్ ఉన్నాయి. ప్రణాళికల ప్రకారం ఇంటర్నెట్ అంతగా అందుబాటులో లేని ప్రాంతాల వారికి, ఆన్లైన్ షాపింగ్ చేయని వారికి చేరువయ్యేందుకు వీటిలో ఈ–కామర్స్ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తారు. కొనుగోలుదారులు ఆన్లైన్లో ఆర్డర్లిచ్చేందుకు వీటిలో ఉండే స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ సహాయం అందిస్తారు. పప్పులు, పంచదార, సబ్బులు వంటి నిత్యావసరాలు మొదలుకుని సౌందర్య సంరక్షణం, దుస్తులు, పాదరక్షల దాకా అన్నింటినీ వీటి ద్వారా ఆర్డరివ్వొచ్చు. రిలయన్స్ రిటైల్ ఈ ఆర్డర్లను ప్రాసెస్ చేస్తుంది. ఇప్పటికే ఈ స్టోర్స్‌కు సిమ్‌కార్డులు, మొబైల్ హ్యాండ్సెట్స్, యాక్సెసరీస్ మొదలైనవి సరఫరా చేస్తున్న జియో పంపిణీ వ్యవస్థ... ఇకపై ఈ–కామర్స్ ఆర్డర్స్‌ను కొనుగోలుదారుల ఇంటి వద్దకే చేరుస్తుంది. ‘ఇన్స్టాలేషన్ అవసరం లేని, షెల్ఫ్ లైఫ్ ఉండే చాలా మటుకు ఉత్పత్తులను ఈ నెట్వర్క్ ద్వారా విక్రయించేందుకు అవకాశం ఉంది. కస్టమర్ ఆయా ఉత్పత్తులను జియో పాయింట్ వద్దే తీసుకోవచ్చు కూడా. కావాలనుకుంటే స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ వాటిని ఇంటికి కూడా డెలివరీ చేస్తారు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే జియో పాయింట్ స్టోర్స్ నుంచి టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లకు సంబంధించి ఈ తరహా ఆర్డర్లు తీసుకుంటోంది. మొత్తం కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో వీటి వాటా 10 శాతం దాకా ఉంటోంది. ఇప్పుడు ఇదే విధానాన్ని నిత్యావసరాలు మొదలైన వాటికి కూడా వర్తింపచేయాలని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ–కామర్స్ వెంచర్.. కంపెనీ వర్గాల కథనం ప్రకారం.. రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ వెంచర్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 95% జనాభాకు చేరువవ్వాలని రిలయన్స్ రిటైల్ లకి‡్ష్యస్తోంది. ఈ–కామర్స్, జియో పాయింట్ స్టోర్స్ ద్వారానే ఇది సాధ్యం అవుతుందని కూడా భావిస్తోంది. దాదాపు 10,000 పైగా జనాభా ఉన్న పట్టణాల్లో రిటైల్ పాయింట్స్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా పెద్ద నగరాలు, చిన్న పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 50,000 పైచిలుకు జియో పాయింట్ స్టోర్స్‌ను కొత్తగా ప్రారంభించాలని రిలయన్స్ భావిస్తోంది. కస్టమర్ సేల్స్, సర్వీస్ టచ్ పాయింట్స్‌గానే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉత్పత్తుల పంపిణీకి కూడా వీటిని ఉపయోగించుకోనుంది. ఈ ప్రణాళికల్లో భాగంగా ప్రతి మూడునెలల్లో కొత్తగా 500 జియో పాయింట్స్‌ను ప్రారంభిస్తోంది. అన్ని ఫార్మాట్లలోనూ దిగ్గజాలతో పోటీ! ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు దీటుగా రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ వెంచర్ ఉండబోతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సంస్థలు కూడా గ్రామీణ ప్రాంతాల వారికి చేరువయ్యేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు అమెజాన్ ప్రత్యేకంగా ప్రాజెక్ట్ ఉడాన్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని కింద చిన్న పట్టణాల్లో 12,000 పైచిలుకు చిన్న రిటైల్ సంస్థలు, స్థానిక ఎంట్రప్రెన్యూర్స్‌తో చేతులు కలిపింది. ఈ షాపుల ద్వారా ఆన్లైన్లో అమెజాన్‌లో ఆర్డర్లు పెట్టొచ్చు. ఉత్పత్తుల డెలివరీ తీసుకోవచ్చు. దీంతో పాటు దిగ్గజ సంస్థలకు దీటుగా వీడియో, మ్యూజిక్, మ్యాగజైన్స్, న్యూస్ వంటి రంగాల్లోనూ రిలయన్స్ భారీగా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. 12 బిలియన్ డాలర్ల మార్కెట్.. కన్సల్టెన్సీ సంస్థ ఎర్న్స్ట్ అండ్ యంగ్ అంచనాల ప్రకారం భారత ఈ–కామర్స్ విభాగంలో గ్రామీణ ప్రాంత మార్కెట్ వచ్చే నాలుగేళ్లలో 10–12 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుంది. 2017 నుంచి 2021 మధ్య కాలంలో దేశీయంగా ఈ–కామర్స్ విక్రయాలు 32 శాతం మేర వార్షిక వృద్ధి నమోదు చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోను పెరుగుతున్న ఆదాయాలు, వినియోగం, వ్యవసాయేతర ఆదాయ మార్గాలు, సానుకూల వ్యవసాయ పరిస్థితులు, ఇంటర్నెట్ వినియోగం మెరుగుపడుతుండటం, చిన్న కుటుంబాలు తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. -
లాభాల్లో రిలయన్స్ కొత్త రికార్డు
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)... ఈ ఆర్థిక సంవత్సరం జూలై– సెప్టెంబర్ త్రైమాసిక లాభంలో 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.9,516 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.8,109 కోట్లతో పోలిస్తే 17% వృద్ధి చెందగా, ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే మాత్రం 0.6 శాతమే పెరిగింది. రూ.9,629 కోట్ల లాభాన్ని ఆర్జించొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. రిటైల్, జియో, పెట్రోకెమికల్ వ్యాపారాలు కళకళలాడాయి. దీంతో రిఫైనరీ వ్యాపారం దెబ్బకొట్టినా, కంపెనీ మెరుగైన ఫలితాలను నమోదు చేయగలిగింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 54.5% పెరిగి రూ.1,56,291 కోట్లకు చేరింది. పెట్రోకెమికల్, రిఫైనరీ ఉత్పత్తులకు అధిక ధరలు లభించడం ఆదాయం పెరిగేందుకు తోడ్పడింది. కొత్త పెట్రోకెమికల్ తయారీ సదుపాయాలు అందుబాటులోకి రావడం అధిక విక్రయాలకు కారణమని కంపెనీ తెలిపింది. రిటైల్ వ్యాపారం భళా రిటైల్ వ్యాపారంలో పన్నుకు ముందస్తు లాభం ఏకంగా 213 శాతం పెరిగి రూ.1,392 కోట్లకు చేరింది. దుకాణాల విస్తరణ, ఉన్న దుకాణాల్లో అమ్మకాలు పెరగడంతో ఆదాయం సైతం రెట్టింపై రూ.32,436 కోట్లుగా నమోదైంది. దేశవ్యాప్తంగా 5,800 పట్టణాల్లో కంపెనీకి 9,146 స్టోర్లు ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలంలో రిటైల్ వ్యాపారం రూ.444 కోట్ల పీబీడీఐటీ (తరుగుదల, వడ్డీ, పన్నుకు ముందు లాభం) నమో దు చేసింది. ఆదాయం రూ.14,646 కోట్లుగా ఉంది. జియోకు లాభాలు టెలికం విభాగం రిలయన్స్ జియో నికర లాభం రూ.681 కోట్లుగా ఉంది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 11.3 శాతం పెరిగింది. కంపెనీ చందాదారుల సంఖ్య 25.2 కోట్లుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జియో పన్నుకు ముందు రూ.271 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ క్వార్టర్లో నికరంగా 3.7 కోట్ల కస్టమర్లు జియో నెట్‌వర్క్‌కు తోడయ్యారు. జూన్ క్వార్టర్లో నూతన చం దాదారుల సంఖ్య 2.87 కోట్లుగా ఉంది. ఓ యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ.134.5గా ఉండగా, సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.131.7కు తగ్గింది. రిఫైనరీ మార్జిన్ రిఫైనింగ్ వ్యాపారంలో ఆదాయం 3.25 శాతం వృద్ధితో రూ.98,760 కోట్లకు చేరుకుంది. ఎబిట్ (వడ్డీ, పన్నుకు ముందస్తు ఆదాయం) 19.6 శాతం క్షీణించి రూ.5,322 కోట్లుగా నమోదైంది. జూన్ త్రైమాసికంలోనూ ఎబిట్ 16.8 శాతం తగ్గడం గమనార్హం. బ్యారెల్ చమురుపై స్థూల రిఫైనరీ మార్జిన్ 9.50 డాలర్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 12 డాలర్లు కాగా, జూన్ త్రైమాసికంలో 10.5 డాలర్లుగా ఉంది. అయితే, జీఆర్ఎం అంతకుముందు త్రైమాసికంతో పోల్చితే ఫ్లాట్‌గా 10.6–10.9 డాలర్ల మధ్య ఉండొచ్చని అనలిస్టులు అంచనా వేశారు. చమురు ధరలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చితే... ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్ నాటికి 45 శాతం పెరిగాయి. బ్రెండ్ క్రూడ్ బ్యారెల్ 75 డాలర్లకు చేరుకుంది. పెట్రోకెమికల్ వ్యాపారం పన్నుకు ముందస్తు లాభం 63 శాతం వృద్ధితో రూ.8,120 కోట్లుగా ఉంది. ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి వ్యాపారంలో నష్టాలు పెరిగాయి. పన్నుకు ముందు రూ.480 కోట్ల నష్టాలు వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ నష్టాలు రూ.272 కోట్లుగా ఉన్నాయి. పెరిగిన రుణ భారం జియో కోసం రిలయన్స్ పెట్టుబడులు పెడుతూనే ఉంది. దీంతో కంపెనీ రుణ భారం సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.2,58,701 కోట్లకు పెరిగింది. జూన్ క్వార్టర్లో ఇది రూ.2,42,116 కోట్లు. కంపెనీ నగదు నిల్వలు క్రితం త్రైమాసికంలో ఉన్న రూ.79,492 కోట్ల నుంచి రూ.76,740 కోట్లకు తగ్గాయి. సవాళ్ల మధ్య బలమైన పనితీరు స్థూల ఆర్థికపరమైన సవాళ్ల మధ్య కూడా మా సంస్థ బలమైన నిర్వహణ, ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. వార్షికంగా చూస్తే ఆదాయాల్లో మంచి వృద్ధి నెలకొంది. కమోడిటీ, కరెన్సీ మార్కెట్లో తీవ్ర అస్థిరతల మధ్య మా సమగ్ర రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారం బలమైన నగదు ప్రవాహాలను నమోదు చేసింది’’ అని ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. కన్జ్యూమర్ వ్యాపారం ఊపందుకుంటోందని చెప్పారు. రిటైల్ వ్యాపారం ఎబిట్డా వార్షికంగా చూస్తే మూడు రెట్లు పెరగ్గా, జియో ఎబిట్డా 2.5 రెట్లు పెరిగినట్టు అంబానీ తెలిపారు. రిలయన్స్ చేతికి హాత్వే, డెన్నెట్వర్క్ కేబుల్ టీవీ, వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో రిలయన్స్ వేగంగా విస్తరించే దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా డెన్ నెట్‌వర్క్‌లో 66 శాతం వాటా తీసుకోనున్నట్టు తెలియజేసింది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.2,045 కోట్లు, సెకండరీ మార్కెట్లో రూ.245 కోట్లతో ప్రస్తుత ప్రమోటర్ల నుంచి షేర్లను కొనుగోలు చేయనుంది. అలాగే, హాత్వే కేబుల్‌లోనూ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.2,940 కోట్ల పెట్టుబడితో 51.34 శాతం వాటా కొనుగోలు చేయనుంది. 90.8 కోట్ల షేర్లను ఒక్కో షేరుకు రూ.32.35 ధరపై జారీ చేయనున్నట్టు హాత్వే కేబుల్ ప్రకటించింది. హాత్వే, హాత్వే భవానీ కేబుల్ టెల్ అండ్ డేటాకామ్ సంయుక్త సంస్థ అయిన జీటీపీఎల్ హాత్వే లిమిటెడ్ మైనారిటీ వాటాదారులకు ఆర్ఐఎల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. -
అదరగొట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్
సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. ముఖ్యంగా జియో బూస్ట్‌తో లాభాల్లోనూ, ఆదాయంలోనూ గణనీయమైన వృద్ధిని సాధించి ఎనలిస్టులు అంచనాలను బ్రేక్ చేసింది. సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్ 2లో 9,516 కోట్ల రూపాయల నికర లాభాలను సాధించింది. వార్షిక ప్రాతిపదికన నికరలాభాల్లో 17శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.1.43 లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ .9,516కోట్లు. ఎబిటా మార్జిన్లు రూ. 3573కోట్లుగా ఉంది. ఆర్ఐఎల్ చరిత్రలో భారీ లాభాలను సాధించిన త్రైమాసికం ఇదేనని ఎనలిస్టులు చెబుతున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజీల తాజా సమాచారం ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశంలోని అన్ని లిస్టెడ్ కంపెనీలలో అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా ఉంది. నేటి ముగింపు సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ .7.28 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించింది. మరోవైపు కేబుల్ టీవీ, హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పెద్దయెత్తున విస్తరించే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయంగా అతి పెద్ద కేబుల్ ఆపరేటర్ హాథ్‌వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్వర్క్స్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది. -
రిలయన్స్ ‘కేబుల్’ వేట!
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ, హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పెద్దయెత్తున విస్తరించే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. డెన్ నెట్వర్క్స్, హాథ్‌వే కేబుల్ అండ్ డేటాకామ్ సంస్థల్లో గణనీయ వాటాలు కొనే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇవి తుది దశల్లో ఉన్నాయని, బుధవారం ఈ డీల్స్‌పై ప్రకటన వెలువడొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘హాథ్‌వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్‌వర్క్స్‌లో వాటాల కొనుగోలు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థల ద్వారా జరుపుతున్న చర్చలు తుది దశల్లో ఉన్నాయి. బుధవారం వీటికి సంబంధించి డీల్స్‌ను ప్రకటించవచ్చు‘ అని వివరించాయి. మరోవైపు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించడంపై అక్టోబర్ 17న (బుధవారం) తమ తమ బోర్డులు సమావేశం కానున్నట్లు హాథ్‌వే, డెన్ నెట్వర్క్స్ సంస్థలు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేశాయి. హాథ్‌వే ప్రస్తుతం నాలుగు మెట్రోలు సహా 16 నగరాల్లో హై స్పీడ్ కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. కంపెనీకి సుమారు 35,000 కిలోమీటర్ల మేర ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉండగా, 8 లక్షల మంది బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు ఉన్నారు. ఇక 15 నగరాల్లో కార్యకలాపాలు విస్తరిస్తున్న డెన్ కేబుల్.. 2–3 ఏళ్లలో 500 నగరాల్లో సర్వీసులు అందిం చేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది. -
ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో మనోళ్లు ముగ్గురు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతదేశంలో ఈ యేటి శ్రీమంతులంటూ ఫోర్బ్స్ వెలువరించిన జాబితాలో మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీయే అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. దాదాపు రూ.3.4 లక్షల కోట్ల సంపదతో ఆయన నంబర్–1 స్థానంలో నిలిచారు. నిజానికి లిస్టెడ్ కంపెనీ అయిన రిలయన్స్... గత కొద్ది రోజుల్లోనే ఏకంగా 20 శాతం వరకూ పతనమయింది. ఫోర్బ్స్ జాబితా గనక ఇప్పుడు వెలువరించి ఉంటే ఆయన సంపద రూ.3 లక్షల కోట్లకన్నా తక్కువే ఉండేదన్నది మార్కెట్ వర్గాల మాట. ఇక 1.5 లక్షల కోట్ల సంపదతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ రెండవ స్థానంలో నిలిచారు. మొదటి– రెండు స్థానాల మధ్య తేడా దాదాపు సగానికన్నా అధికంగా ఉండటం గమనార్హం. భారతీయ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఆర్సెలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ నివాస్ మిట్టల్ నిలిచారు. ఈయన సంపద దాదాపు 1.3 లక్షల కోట్లు. తరువాతి స్థానాల్లో వరసగా హిందూజా సోదరులు, పల్లోంజీ మిస్త్రీ, హెచ్‌సీఎల్ గ్రూప్ అధిపతి శివ్ నాడార్, గోద్రెజ్ కుటుంబం నిలిచాయి. ఫోర్బ్స్ మొత్తంగా 100 మందితో ఈ జాబితాను వెలువరించింది. తెలుగు వారు ముగ్గురు!! భారతదేశంలోని టాప్–100 శ్రీమంతులతో ఫోర్బ్స్ రూపొందించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి చోటు దక్కింది. దాదాపు రూ.22,300 కోట్ల సంపదతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధిపతి పి.పి.రెడ్డి ఈ రెండు రాష్ట్రాల నుంచీ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తంగా చూస్తే మాత్రం జాబితాలో ఈయనది 47వ స్థానం. దాదాపు రూ.20వేల కోట్లతో అరబిందో ఫార్మా అధిపతి పి.వి.రామ్‌ప్రసాద్ రెడ్డి, రూ.19,800 కోట్లతో దివీస్ ల్యాబ్స్ అధిపతి మురళి ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. మొత్తంగా చూస్తే ఫోర్బ్స్ జాబితాలో వీరు 50, 53 స్థానాల్లో నిలిచారు. (గమనిక: ఫోర్బ్స్ ఈ జాబితాలో సంపదను డాలర్లలో లెక్కించగా... రూపాయిల్లోకి మార్చేటపుడు డాలర్ విలువను రూ.72గా పరిగణించటం జరిగింది.) -
హాథ్‌వేపై రిలయన్స్ కన్ను
ముంబై: గిగాఫైబర్ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ క్రమంలో.. ఇతర కంపెనీల కొనుగోళ్లపైనా దృష్టి పెట్టింది. తాజాగా దేశీయంగా అతి పెద్ద కేబుల్ ఆపరేటర్ హాథ్‌వే కేబుల్ అండ్ డేటాకామ్ సంస్థను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సం బంధించి చర్చలు కూడా ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, డీల్ పూర్తిగా కుదురుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని వివరించాయి. అయితే, రిలయన్స్ మాత్రం హాథ్‌వేను కచ్చితంగా దక్కించుకోవాలనే భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. సుమారు రూ. 2,500 కోట్ల మేర వ్యాల్యుయేషన్‌పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో డెన్ కొనుగోలుకు యత్నం .. కేబుల్ టీవీ రంగానికి చెందిన సంస్థను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. గతంలో సమీర్ మన్‌చందా ప్రమోటరుగా ఉన్న డెన్ నెట్‌వర్క్స్‌ను కొనేందుకు ప్రయత్నించింది. చర్చలు తుది దశ దాకా కూడా జరిగాయి. కానీ ఆ డీల్ కుదరలేదు. దీంతో.. తమ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కింద తమ గిగాఫైబర్ ప్రాజెక్టును సొంతంగానే ప్రారంభించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఏదైనా భారీ మల్టీ–సిస్టమ్ ఆపరేటర్ (ఎంఎస్‌వో)తో పాటు కొన్ని చిన్న సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా త్వరితగతిన కార్యకలాపాలు విస్తరించాలన్నది కంపెనీ వ్యూహం. వాటికి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకుని వీడియో, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ప్రారంభించాలన్న ఆలోచన ఉంది. కానీ కీలకమైన మార్కెట్లలో స్థానిక కేబుల్ ఆపరేటర్స్ (ఎల్సీవో) నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుండటంతో .. యూజర్ల ఇళ్ల దాకా కనెక్టివిటీని విస్తరించే విషయంలో రిలయన్స్ జియోకి సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో గిగాఫైబర్ ప్రాజెక్టు ప్రవేశపెట్టడంలో మరింత జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఏదైనా ఎంఎస్‌వోను కొనుగోలు చేయాలన్న ప్రణాళికను కంపెనీ మళ్లీ పరిశీలించడం ప్రారంభించినట్లు సంబంధిత వ్యక్తి తెలిపారు. ఒకవేళ హాథ్‌వేని గానీ చేజిక్కించుకోగలిగితే జియో బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలకు గట్టి ఊతమే లభించగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ‘ఆర్‌ఐఎల్‌కి ఇప్పటికే ఎంఎస్‌వో లైసెన్సు ఉండటంతో పాటు ఫైబర్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించింది. ఇక కావాల్సినదల్లా స్థానిక కేబుల్ ఆపరేటర్ల మద్దతు మాత్రమే. ఏదైనా ఎంఎస్‌వోను కొనుగోలు చేసిందంటే చాలు ఈ సమస్య పరిష్కారమైనట్లే‘ అని ప్రముఖ బ్రోకరేజి సంస్థ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. హాథ్‌వే కథ ఇదీ .. కేబుల్ బ్రాడ్‌బ్యాండ్, కేబుల్ టీవీ సర్వీసులు అందిస్తున్న హాథ్‌వే కేబుల్‌లో ప్రమోటరు రహేజా గ్రూప్‌నకు 43.48 శాతం వాటాలు ఉన్నాయి. కంపెనీ దాదాపు 1.1 కోట్ల డిజిటల్ కేబుల్ టీవీ కనెక్షన్లతో పాటు 8 లక్షల బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. జూన్ త్రైమాసికం గణాంకాల ప్రకారం హాథ్‌వే బ్రాడ్‌బ్యాండ్ ప్రతి యూజరుపై సగటున నెలకు (ఏఆర్పీయూ) రూ. 710 ఆదాయం ఉంటోంది. మార్చి ఆఖరు నాటికి సంస్థకు రూ. 1,617 కోట్ల రుణభారం ఉండగా.. వచ్చే రెండేళ్లలో దీన్ని రూ. 500 కోట్ల మేర తగ్గించుకోవాలని భావిస్తోంది. రాబోయే ఏడాదిన్నర కాలంలో హాథ్‌వే ప్రమోటర్లు.. ఈక్విటీతో పాటు దీర్ఘకాలిక అన్సెక్యూర్డ్ రుణాల రూపంలో రూ. 350 కోట్లు సమకూరుస్తున్నారు. ఇప్పటికే జూలైలో తొలి విడతగా రూ. 100 కోట్లు ఇవ్వగా, మరో రూ. 100 కోట్లు ఆగస్టు ఆఖరు నాటికి ఇవ్వనున్నట్లు గతంలో కంపెనీ వర్గాలు తెలిపాయి. మరో రూ. 150 కోట్లు 2020 మార్చి నాటికి లభించనున్నాయి. రాబోయే రోజుల్లో కార్యకలాపాల ద్వారా మరో రూ. 150 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ యోచిస్తోన్నట్లు తెలుస్తోంది.డీల్ వార్తల నేపథ్యంలో బుధవారం హాథ్‌వే కేబుల్ అండ్ డేటాకామ్ షేరు బీఎస్ఈలో సుమారు 9 శాతం పెరిగి రూ. 27.60 వద్ద క్లోజయ్యింది. -
రూపీ రికవరీ : మార్కెట్లు జంప్
ముంబై : స్టాక్ మార్కెట్లను, ఇన్వెస్టర్లను వణికిస్తున్న రూపీ రికవరీ అయింది. రూపీ రికవరీతో మార్కెట్లు హమ్మయ్య అనుకున్నాయి. ఆల్-టైమ్ కనిష్ట స్థాయిల్లో 72.10 వద్ద నమోదైన రూపాయి, ట్రేడింగ్ ముగింపులో కోలుకుంది. దీంతో నిఫ్టీ 11,500 మార్కును పునరుద్ధరించుకుంది. సెన్సెక్స్ 200 పాయింట్లు పైగా జంప్ చేసింది. కరెన్సీ సహకారంతో పాటు, హెవీ వెయిట్ ఉన్న స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్ స్టాక్ సూచీలకు లాభాల పంట అందించాయి. ఫార్మాస్యూటికల్స్, ఎనర్జీ, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ రంగాలు కూడా మార్కెట్లకు బలంగా నిలిచాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 225 పాయింట్ల లాభంలో 38,242.81 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో 11,536 వద్ద స్థిరపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా టాప్ గెయినర్లుగా నిలువగా.. మారుతీ సుజుకీ, యస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, హిందాల్కో ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో అత్యంత కనిష్ట స్థాయి 72.10 మార్కు నుంచి కోలుకుని, 71.85 వద్ద నమోదైంది. కాగా, గత కొన్ని రోజులుగా పాతాళ స్థాయికి పడిపోతున్న రూపాయితో, మార్కెట్లు కూడా భారీగానే నష్టపోతున్నాయి. ఆరు సెషన్ల నుంచి మార్కెట్లు నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. నేడు ఈ నష్టాలకు తెరపడి, మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. -
ట్రెండ్ సృష్టించిన జియో : హ్యాపీ బర్త్‌డే
ముంబై : సరిగ్గా రెండేళ్ల క్రితం.. టెలికాం మార్కెట్‌ను హడలెత్తిస్తూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోను ఎవరూ మర్చిపోయి ఉండరు. ముఖ్యంగా యువత. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ, పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ ఆలోచన... జియో రూపంలో ఓ సంచలనానికి తెరలేపింది. ఆ క్షణాన మొదలైన జియో ట్రెండ్... ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశీయ మార్కెట్లోనే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా జియో తానేంటో నిరూపించుకుంటూ.. అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. నేడు(సెప్టెంబర్ 5) రిలయన్స్ జియో తన రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఇప్పటి వరకు దేశీయ టెలికాం సర్వీసులపై చూపిన ప్రభావమెంతో ఓ సారి తెలుసుకుందాం... జియో ఎంట్రీ తర్వాత మొబైల్ డేటా వినియోగం భారత్‌లో నెలకు 20 కోట్ల జీబీ నుంచి 370 కోట్ల జీబీకి పెరిగింది. కేవలం జియో కస్టమర్లే 240 కోట్ల జీబీ డేటాను వినియోగిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. జియో లాంచ్ అయిన నెలల్లోనే, ప్రపంచంలోనే నెంబర్ కంపెనీగా ఎదిగింది. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను తన సొంతం చేసుకుంది. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జియో తన ఖాతాలో వేసుకుంది. ఇలా తన నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ పోతూ.. 2018 జూన్ 30 నాటికి 21.5 కోట్ల మందికి పైగా కస్టమర్లను చేరుకుంది. భారత్‌లో ఎల్టీఈ కవరేజ్ ఎక్కువగా జియోకే ఉంది. 99 శాతం భారత జనాభాను త్వరలో జియోనే కవర్ చేయబోతుంది. అన్ని టారిఫ్ ప్లాన్లపై ఉచిత అపరిమిత కాలింగ్ ఆఫర్ చేసిన కంపెనీ జియోనే. అప్పటి వరకు ఏ కంపెనీ కూడా అలా ఆఫర్ చేయలేదు. జియో తీసిన ఈ అపరిమిత సంచలనంతో, మిగతా అన్ని కంపెనీలు కూడా ఉచితాల బాట పట్టాయి. డేటాను ధరలను కూడా తగ్గించాయి. జియో లాంచ్ తర్వాత, 250 రూపాయల నుంచి 10వేల రూపాయల మధ్యలో ఉన్న ఒక్క జీబీ డేటా ధర, ప్రస్తుతం 15 రూపాయలకు తగ్గింది. అంటే అంతకముందు డేటా ఛార్జీల బాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జియో లాంచింగ్ తర్వాత డేటా ధరలు భారీగా కుప్పకూలి, సామాన్యుడికి చేరువలో ఇంటర్నెట్ వచ్చేసింది. ఇప్పటికీ కూడా జియో తీసుకొస్తున్న కొత్త కొత్త టారిఫ్ ప్లాన్లతో ఇతర టెల్కోల గుండెల్లో పరుగులు పెడుతున్నాయి. ఆయా కంపెనీలు కూడా జియో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టిన వెంటనే, దానికి కౌంటర్‌గా టారిఫ్ ధరలను తగ్గిస్తూ పోతున్నాయి. ఇలా టెలికాం మార్కెట్లో అసాధారణమైన పోటీ నెలకొంది. జియో దెబ్బకు చాలా కంపెనీలు మూత పడటం, మరికొన్ని కంపెనీలు విలీనమవడం జరిగింది. 4జీ నెట్వర్క్ కవరేజ్‌లో జియోనే ఆధిపత్య స్థానంలో ఉన్నట్టు ట్రాయ్ స్పీడ్‌టెస్ట్ పోర్టల్ వెల్లడించింది. జియో ఎంట్రీ అనంతరం, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు యూజర్ బేస్ పెరిగింది. అంటే పరోక్షంగా ఈ కంపెనీలకు కూడా జియో బాగా సహకరించింది. జియో కార్యకలాపాలు లాంచ్ అయినప్పటి నుంచి గూగుల్, ఫేస్‌బుక్‌లకు భారత్ మోస్ట్ యాక్టివ్ మార్కెట్‌గా మారింది. ఎల్వైఎఫ్ బ్రాండ్ కింద వాయిస్ఓవర్ ఎల్టీఈ డివైజ్‌లను కూడా రిలయన్స్ రిటైల్ లాంచ్ చేసింది. జియో అరంగేట్రం తర్వాత ఈ డివైజ్‌ల సరుకు రవాణా పెరిగింది. ఫీచర్ ఫోన్ మార్కెట్లోనూ జియో సంచలనానికి తెరలేపింది. జియోఫోన్ పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను ప్రవేశపెట్టి, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకుంది. ఇటీవలే ఫీచర్ ఫోన్లో హైఎండ్ మోడల్ జియోఫోన్ 2ను కూడా ఆవిష్కరించింది. దీంతో పాటు బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి జియో అడుగుపెట్టింది. జియో గిగాఫైబర్ పేరుతో ఫైబర్ ఆధారిత వైర్‌లైన్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2018 ఆగస్టు 15 నుంచి దీని రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది. భారత్‌ను గ్లోబల్‌గా ఆధిపత్య స్థానంలో నిల్చోబెట్టడమే లక్ష్యంగా జియో ముందుకు సాగుతుందని ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ పలుమార్లు పునరుద్ఘాటించారు. -
రిలయన్స్ @రూ.8 లక్షల కోట్లు
ముంబై: ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అరుదైన రికార్డ్‌ను సాధించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను సాధించి భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీగా రికార్డ్ సృష్టించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన తొలి భారత కంపెనీగా కూడా నిలిచింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,274ను తాకిన ఈ షేర్ చివరకు 1.8% లాభంతో రూ.1,270 వద్ద ముగిసింది. ఈ షేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం ఒక్క రోజే రూ.15,527 కోట్లు పెరిగింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ రూ.8,04,691 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్ 37 శాతం వరకూ లాభపడింది. ఏజీఎమ్ నుంచి జోరు...: గతనెలలో జరిగిన ఏజీఎమ్‌లో ఈ కంపెనీ టెలికం విభాగం రిలయన్స్ జియో గిగా ఫైబర్(ఫైబర్–టు–ద హోమ్ సర్వీస్)ను ప్రకటించినప్పటి నుంచి ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ఈ షేర్ గత నెల 12న 10, 000 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ కంపెనీగా అవతరించింది. 2007లో ఈ ఘనత సాధించిన ఈ కంపెనీ మళ్లీ అదే ట్యాగ్‌ను ఈ ఏడాది పొందింది. గత నెల 13న ఈ కంపెనీ మార్కెట్ క్యాప్‌రూ.7 లక్షల కోట్లను అధిగమించింది. నెలన్నర రోజుల్లోనే మరో లక్ష కోట్ల మార్కెట్ క్యాప్‌ను జత చేసుకొని 8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కంపెనీగా గురువారం అవతరించింది. -
జియో గిగాఫైబర్ టారిఫ్ ప్లాన్స్ ఇవేనట!
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోనూ తన సత్తా చూపేందుకు వచ్చేస్తోంది. జియోగిగాఫైబర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 41వ వార్షిక సాధారణ సమావేశంలో లాంచ్ చేసింది. ఇళ్లకు, ఆఫీసులకు, దుకాణాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా హై-స్పీడ్ఇంటర్నెట్ను అందించడమే లక్ష్యంగా జియోగిగాఫైబర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్లోనే జియోగిగాటీవీ సేవలను అందించబోతుంది. ఆగస్టు 15 నుంచి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు 41వ ఇన్వెస్టర్ల సమావేశంలోనే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. కానీ ఆ సమయంలో జియోగిగాఫైబర్ టారిఫ్‌లను రివీల్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఈ టారిఫ్ ప్లాన్లపై కంపెనీ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. మరికొన్ని రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తున్న క్రమంలో జియోగిగాఫైబర్ టారిఫ్ ప్లాన్లు ఈ విధంగా ఉండబోతున్నాయంటూ ఆన్లైన్లో కొన్ని టారిఫ్ ధరలు చక్కర్లు కొడుతున్నాయి. అవేమిటో ఓ సారి చూద్దాం.. 500 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్... జియోగిగాఫైబర్ తొలి ప్యాకేజీ రూ.500 నుంచి ప్రారంభమవుతుందట. ఈ ప్లాన్ కింద నెలకు 300 జీబీ వరకు డేటాను 50 ఎంబీపీఎస్ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. అయితే 300 జీబీ ఎఫ్‌యూపీ పరిమితి అయిపోయాక, స్పీడ్ తగ్గిపోనుందని సమాచారం. 750 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్... తర్వాత ప్లాన్ రూ.750గా ఉంటుందని సంబంధిత వర్గాల టాక్. ఈ ప్లాన్ కింద నెలకు 450 జీబీ అపరిమిత డేటాను 50 ఎంబీపీఎస్ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీలో మార్కెట్లోకి వస్తుందని టాక్. 999 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్.... 600జీబీ వరకు అపరిమిత డేటాను రూ.999 ప్లాన్‌పై పొందవచ్చట. దీని స్పీడ్ 100 ఎంబీపీఎస్ అని తెలుస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులుగా ఉంటుందని సమాచారం. 1,299 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్.... ఈ ప్లాన్ ఎఫ్‌యూపీ పరిమితి 750 జీబీ. ఈ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడులో 30 రోజుల వరకు వాడుకోవచ్చట. 1,599 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్.... జియోగిగాఫైబర్ కింద అందించే హైయస్ట్ ప్లాన్ ఇదేనట. ఈ ప్లాన్ కింద 900 జీబీ డేటాను 150 ఎంబీపీఎస్ స్పీడులో పొందవచ్చట. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులని తెలుస్తోంది. ఎఫ్‌యూపీ పరిమితి అయిపోయాక స్పీడు పడిపోనుందని టాక్. జియోగిగాఫైబర్ రిజిస్ట్రేషన్లు... జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల రిజిస్ట్రేషన్లను రిలయన్స్ జియో ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతుంది. జియో అధికారిక వెబ్సైట్ లేదా మైజియో మొబైల్ అప్లికేషన్ నుంచే దీని రిజిస్ట్రేషన్లను ఆమోదించనుంది. తొలి దశలో 1,100 నగరాల్లో ఈ సేవలు లాంచ్ కాబోతున్నాయి. ఎక్కడైతే ఎక్కువ రిజిస్ట్రేషన్లు నమోదు అవుతాయో అక్కడ తొలుత దీని సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
మళ్లీ మార్కెట్ కింగ్ రిలయన్స్..
న్యూఢిల్లీ: ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ జోరుగా పెరుగుతోంది. మంగళవారం ఇంట్రాడేలో 3.5 శాతం లాభంతో ఆల్ టైమ్ హై, రూ.1,190ను తాకిన ఈ షేర్ చివరకు 3.1 శాతం లాభంతో రూ.1,186 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7,51,550 కోట్లకు పెరిగింది. దీంతో అతి పెద్ద మార్కెట్ క్యాప్ కంపెనీ అనే ఘనతను మళ్లీ సొంతం చేసుకుంది. రూ.7,43,222 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న టీసీఎస్‌ను అధిగమించి అగ్రస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగబాకింది. మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ల తర్వాతి స్థానాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(రూ.5,75,185 కోట్లు), హిందుస్తాన్ యూనిలీవర్ (రూ.3,74,828 కోట్లు), ఐటీసీ(రూ.3,63,150 కోట్లు)లు నిలిచాయి. జూలైలో 21 శాతం పెరిగిన షేర్... ఐదేళ్ల క్రితం అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థానాన్ని టీసీఎస్ ఎగరేసుకుపోయింది. తాజాగా ఈ స్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ చేజిక్కించుకుంది. ఈ నెల ఆరంభంలోనే 100 బిలియన్ డాలర్ల కంపెనీగా రిలయన్స్ నిలిచింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ టీసీఎస్ షేరు విలువ 28 శాతం పెరగ్గా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 29 శాతం లాభçపడింది. ఇక ఈ నెలలో బీఎస్ఈ సెన్సెక్స్6 శాతం లాభపడగా, టీసీఎస్ 4.5 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్21 శాతం చొప్పున ఎగబాకాయి. -
ధనాధన్ రిలయన్స్
ముంబై: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మరోసారి రికార్డుల లాభాలతో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2018–19, క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ.9,459 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.9,108 కోట్ల పోలిస్తే 4 శాతం మేర వృద్ధి నమోదైంది. ఒక క్వార్టర్లో కంపెనీ సాధించిన అత్యధిక నికర లాభం ఇదే. కాగా, క్రితం ఏడాది తొలి త్రైమాసికంలో గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్ వాటా విక్రయం ద్వారా కంపెనీకి రూ.1,087 కోట్ల అసాధారణ ఆదాయం లభించింది. దీన్ని కలపకుండా చూస్తే లాభం రూ.7,992 కోట్లు మాత్రమే. అంటే దీంతో పోలిస్తే ఈ ఏడాది క్యూ1లో రిలయన్స్ నికర లాభం 18.6% ఎగబాకినట్లు లెక్క. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 56.5 శాతం వృద్ధితో రూ.1.41 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది క్యూ1లో ఆదాయం రూ.90,537 కోట్లు. ప్రధాన వ్యాపారాల్లో ఒకటైన పెట్రోకెమికల్స్ జోరుతో పాటు రిటైల్ ఇతర అనుబంధ విభాగాలు కూడా భారీ లాభాలతో కొనసాగుతుండటం కంపెనీ మెరుగైన పనితీరుకు దోహదం చేసింది. జీఆర్ఎం తగ్గింది...: చమురు శుద్ధి రంగానికి సంబంధించి స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) క్యూ1లో 10.5 డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో జీఆర్ఎం 11.9 డాలర్లు కాగా, క్రితం త్రైమాసికంలో(2017–18, క్యూ4) 11 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురు(క్రూడ్)ను శుద్ధి చేసి పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. ముఖ్యాంశాలివీ... ►పెట్రోకెమికల్స్ వ్యాపారం స్థూల లాభం క్యూ1లో దాదాపు రెట్టింపయింది. 94.9 శాతం వృద్ధితో రూ.7,857 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో స్థూల లాభం రూ.4,031 కోట్లు. ►మార్జిన్లు తగ్గడంతో రిఫైనింగ్ విభాగం స్థూల లాభం 16.8 శాతం క్షీణించింది. రూ.7,476 కోట్ల నుంచి రూ.5,315 కోట్లకు దిగజారింది. ►చమురు–గ్యాస్ వ్యాపారం నష్టాలు మరింత పెరిగాయి. గతేడాది క్యూ1లో రూ.373 కోట్ల స్థూల నష్టాన్ని చవిచూడగా... ఈ ఏడాది క్యూ1లో నష్టం రూ.447 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా కేజీ బేసిన్లో ఉత్పత్తి పతనం దీనికి కారణంగా నిలిచింది. ►రిటైల్ వ్యాపారం స్థూల లాభం క్యూ1లో266 శాతం ఎగబాకి రూ.1,069 కోట్లకు చేరింది. గతేడాది ఇదే క్వార్టర్లో స్థూల లాభం 292 కోట్లు మాత్రమే. ఆదాయం రూ.11,571 కోట్ల నుంచి రూ.25,890 కోట్లకు దూసుకెళ్లింది. ►కంపెనీ వద్ద నగదు నిల్వలు ఈ ఏడాది జూన్ చివరినాటికి స్వల్పంగా పెరిగి రూ.79,492 కోట్లకు చేరాయి. ఇక మొత్తం రుణ భారం రూ.2,42,116 కోట్లకు ఎగబాకింది. ఈ ఏడాది మార్చి నాటికి రుణ భారం రూ.2,18,768 కోట్లుగా ఉంది. ►రిలయన్స్ షేరు శుక్రవారం బీఎస్ఈలో 1.73 శాతం లాభంతో రూ.1,130 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. ‘ మా వ్యాపార విభాగాలన్నింటిలో అత్యుత్తమ నిర్వహణ పనితీరును సాధించడంపైనే ప్రధానంగా దృష్టిసారించాం. పెట్రోకెమికల్స్ వ్యాపారం రికార్డు స్థాయి స్థూల లాభాన్ని(ఎబిటా) సాధించింది. పాలియెస్టర్ చైన్‌లో మార్జిన్ల జోరు ఇందుకు ప్రధాన కారణం. ఇటీవలి కాలంలో ఈ రంగంలో మేం చేసిన పెట్టుబడుల ప్రతిఫలమే ఇది. ఇక సీజనల్ బలహీనతలు ఉన్నప్పటికీ... రిఫైనింగ్ వ్యాపార పనితీరు కూడా స్థిరంగానే కొనసాగుతోంది. రిటైల్, ఇతర కన్సూమర్ వ్యాపారాలు కొత్త శిఖరాలను అందుకుంటున్నాయి. రిటైల్ రంగంలో రెట్టింపు ఆదాయం, మూడు రెట్ల ఎబిటాను నమోదు చేశాం. ఇక టెలికం అనుబంధ సంస్థ జియో క్యూ1లో రికార్డు స్థాయిలో వినియోగదారులను జతచేసుకుంది’. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ జియో జోరు... ముకేశ్ అంబానీ సంచలన టెలికం వెంచర్ రిలయన్స్ జియో... లాభాల బాటలో దూసుకెళ్తోంది. 2018 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.612 కోట్ల నికర లాభాన్ని సాధించింది. 2018 జనవరి–మార్చి త్రైమాసికంలో లాభం రూ.510 కోట్లతో పోలిస్తే 20 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా 14 శాతం వృద్ధితో 8,109 కోట్లకు చేరింది. ఇక గతేడాది జూన్ క్వార్టర్లో కంపెనీ రూ.21.27 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో జియో నికరంగా 2.87 కోట్ల కొత్త కస్టమర్లను చేజిక్కించుకుంది. కంపెనీ వాణిజ్య కార్యకలాపాలు మొదలైన తర్వాత ఒక క్వార్టర్లో ఇంత భారీగా యూజర్లు జత కావడం ఇదే తొలిసారి. క్రితం క్వార్టర్లో జతైన కొత్త యూజర్ల సంఖ్య 2.65 కోట్లు. సగటున ఒక్కో కస్టమర్ నుంచి ఆదాయం(ఏఆర్పీయూ) క్యూ1లో రూ. 134.5గా నమోదైంది. జూన్ నాటికి మొత్తం యూజర్ల సంఖ్య 21.53 కోట్లకు చేరింది. -
మాన్సూన్ హంగామా ఆఫర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలే తన 41వ వార్షిక సాధారణ సమావేశాన్ని ముంబైలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కంపెనీ పెద్ద పెద్ద ప్రకటనలో చేసింది. జియో గిగాఫైబర్ లాంచింగ్, జియో ఫోన్ హై ఎండ్ మోడల్ జియో ఫోన్2 విడుదల, జియోఫోన్‌లో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ యాప్‌లు అందుబాటు వంటి వాటిని ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్ కూడా ఒకటి. అత్యంత తక్కువ ధరకు ఎవరైతే జియోఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికే ఈ జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్. పాత ఫీచర్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే పొందవచ్చు. జూలై 21 నుంచి జియో మాన్సూన్ హంగామా ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ రిజిస్ట్రేషన్లను కంపెనీ ప్రారంభించింది. ‘రిజిస్టర్ యువర్ ఇంటరెస్ట్’ గా జియో ఈ ప్రాసెస్‌ను మొదలుపెట్టింది. ఈ ఆఫర్‌ను రిజిస్ట్రర్ చేయాలనుకునే వారు, జియో.కామ్ లేదా మైజియో యాప్‌లోకి లాగిన్ అయి, ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దానిలో అడిగిన వివరాలను నమోదు చేసిన అనంతరం, నియమ, నిబంధనలను అంగీకరించి, వ్యాపారం లేదా వ్యక్తిగతం అనే దాన్ని క్లిక్ చేయాలి. ఆ అనంతరం సబ్మిట్ బటన్ నొక్కాలి. ఈ ప్రక్రియ అనంతరం జియో మాన్సూన్ హంగామా ఆఫర్‌ను రిజిస్టర్ చేసుకున్నట్టు మీ ఈ-మెయిల్‌కు లేదా ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్ వస్తుంది. జియో తొలుత మార్కెట్లో సిమ్ కార్డులను లాంచ్ చేసినప్పటి నుంచి ఇదే ప్రక్రియను అనుసరిస్తోంది. ఎవరైతే ముందస్తు బుకింగ్ లేదా రిజిస్టర్ చేసుకుంటారో వారికి ఇతరుల కంటే ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. జియోఫోన్ కూడా ఇదే ప్రక్రియను రిలయన్స్ అనుసరించింది. అయితే తాజాగా చేపడుతున్న రిజిస్ట్రేషన్లు కస్టమర్లను క్యూలైన్ల నుంచి కాపాడలేవని తెలుస్తోంది. ఇది, కేవలం ఆఫర్ అందుబాటులోకి రావడానికి ముందే ఎన్ని డివైజ్‌లు అందుబాటులో ఉంటున్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిసింది. ఈ రిజిస్ట్రేషన్‌తో ఆఫర్ లైవ్‌లోకి వచ్చే సమయంలో యూజర్లకు నోటిఫికేషన్ అలర్ట్‌ను కంపెనీ పంపిస్తుందని, దీంతో స్టోర్ వద్దకు వెళ్లి త్వరగా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వీలవుతుందని తెలిసింది. ఆధార్ ఐడీ, పాస్‌పోర్ట్ సైజు ఫోటోను జియో స్టోర్‌కు తీసుకెళ్తే, మాన్సూన్ ఆఫర్లో జియోఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. -
అంబానీ ‘బ్రాడ్‌బ్యాండ్’ బాజా
ముంబై: చౌక చార్జీలతో దేశీ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో... తాజాగా బ్రాడ్‌బ్యాండ్ సేవల్లోనూ అదే ట్రెండ్ కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా 1,100 నగరాల్లో ఇళ్లకి, సంస్థలకు జియో గిగా ఫైబర్ పేరిట అత్యంత వేగవంతమైన అల్ట్రా హై–స్పీడ్ ఫిక్స్డ్ లైన్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించనుంది. గురువారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. 2025 నాటికి రిలయన్స్‌ను 125 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చే దిశగా భారీ ప్రణాళికలను ఆవిష్కరించారు. ‘జియో గిగాఫైబర్’ పేరిట అందించే బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఎప్పటినుంచి ప్రారంభించేదీ నిర్దిష్టంగా వెల్లడించకపోయినప్పటికీ... కనెక్షన్ల కోసం ఆగస్టు 15 నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చని చెప్పారాయన. ‘ప్రస్తుతం వేల సంఖ్యలో ఇళ్లలో ఈ సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాం. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో భారత్ అంతర్జాతీయంగా నాయకత్వ స్థాయికి చేరినప్పటికీ, ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ విషయంలో మాత్రం ఇంకా వెనకబడి ఉంది. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో 134వ ర్యాంకులో ఉన్నాం. దీనికి సంబంధించి మన దగ్గర సరైన మౌలిక సదుపాయాలు లేవు. అదంతా ఇక మారుతుంది’ అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం రిలయన్స్ కీలక మలుపు దగ్గరుంది. ఈ స్వర్ణ దశాబ్దిలో... కంపెనీ టర్నోవర్‌లో ఇంధన, పెట్రోకెమికల్ వ్యాపారాల ఆదాయ వాటా ఎంత ఉంటుందో, కన్జూమర్ బిజినెస్ విభాగం వాటా కూడా ఆ స్థాయికి చేరబోతోంది‘ అని అంబానీ చెప్పారు. 2025 నాటికి భారత ఎకానమీ పరిమాణం రెట్టింపు కానున్న నేపథ్యంలో... అదే వ్యవధిలో రిలయన్స్ పరిమాణం కూడా రెట్టింపు స్థాయికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. 21 కోట్లకు జియో యూజర్లు.. గడిచిన ఏడాది కాలంగా జియో కస్టమర్స్ సంఖ్య రెట్టింపై 21.5 కోట్లకు చేరిందని, 2.5 కోట్ల జియోఫోన్లు అమ్ముడయ్యాయని అంబానీ వెల్లడించారు. అత్యంత స్వల్పకాలంలో 10 కోట్ల మంది యూజర్ల సంఖ్యను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. 2016 సెప్టెంబర్‌లో టెలిఫోనీ, డేటా సర్వీసులతో టెలికంలో జియో సంచలనం సృష్టించడం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ సేవల కోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రిలయన్స్ ఇప్పటికే రూ.2,50,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసింది. జియో రావడానికి ముందు దేశీయంగా డేటా వినియోగం నెలకు 125 కోట్ల జీబీగా ఉండగా... ప్రస్తుతం 240 కోట్ల జీబీలకుపైగా ఉందని అంబానీ వివరించారు. ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటు.. అమెజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్ సంస్థలకు దీటుగా రిలయన్స్ కూడా ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడంపై కసరత్తు చేస్తోంది. తమ రిటైల్ వ్యాపారానికి అనుబంధంగా ఇది ఉంటుందని అంబానీ చెప్పారు. ‘హైబ్రీడ్, ఆన్లైన్–టు–ఆఫ్‌లైన్ కామర్స్ ప్లాట్‌ఫాంలో మరిన్ని వృద్ధి అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ ప్లాట్‌ఫాం కంపెనీగా రిలయన్స్ రూపాంతరం చెందుతోంది. రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌కి జియో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసులను అనుసంధానం చేయడం ద్వారా ఈ కొత్త ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం సృష్టించబోతున్నాం‘ అని ముకేశ్ వివరించారు. తుది దశలో పెట్రో పెట్టుబడులు.. రిలయన్స్ ప్రధాన వ్యాపార విభాగాలను ప్రస్తావిస్తూ.. భారీ పెట్టుబడులతో తలపెట్టిన విస్తరణ ప్రణాళికలు దాదాపు తుది దశకు వచ్చాయని అంబానీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన పారాక్సిలీన్ కాంప్లెక్స్, పెట్‌కోక్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్, ఆఫ్–గ్యాస్ క్రాకర్ ఏర్పాటు చేశామని, బుటైల్ రబ్బర్ ప్రాజెక్టు ఈ ఏడాది ప్రారంభించనున్నామని ఆయన వివరించారు. 2022 నాటికి కేజీ–డీ6 బ్లాక్ నుంచి రోజుకు 30–35 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయడంపై భాగస్వామ్య సంస్థ బీపీతో కలిసి రిలయన్స్ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. జియోఫైబర్‌తో బ్రాడ్‌బ్యాండ్‌లో విప్లవాత్మక మార్పులు.. రిలయన్స్ ప్రారంభించబోయే జియోగిగాఫైబర్ సర్వీసులు బ్రాడ్‌బ్యాండ్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేగలవని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. స్వల్పవ్యవధిలోనే జియో ఏకంగా 20 కోట్ల మొబైల్ యూజర్స్‌ను సాధించడం ప్రశంసనీయమన్నారు. కొత్త ప్రణాళికల ఊతంతో జియో టెలికం సర్వీస్ ప్రొవైడర్‌గా మిగిలిపోకుండా విస్తృత స్థాయి టెక్నాలజీ కంపెనీగా ఎదగగలదని కొనియాడారు. గిగాటీవీ సెట్‌టాప్ బాక్స్ కూడా.. ఏజీఎంలో గిగాటీవీ సెట్‌టాప్ బాక్స్‌ను ముకేశ్ ఆవిష్కరించారు. పలు ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్స్‌కి కూడా అనుగుణంగా వ్యవహరించడం దీని ప్రత్యేకత. యూజర్లు తమ టీవీ ద్వారా మల్టీ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. జియో గిగాటీవీ సెట్‌టాప్ బాక్స్‌తో 600 టీవీ చానల్స్, వేల కొద్దీ సినిమాలు, అసంఖ్యాకంగా పాటలు కూడా రిలయన్స్ జియో అందించనుంది. జియో గిగాఫైబర్, గిగాటీవీ సెట్‌టాప్ బాక్స్‌లకు కనెక్టయిన ఇతరత్రా టీవీ యూజర్లకు వీడియో కాలింగ్ చేసే సదుపాయం కూడా జియోటీవీలో ఉండనుంది. 1 జీబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్, 100 ఎంబీపీఎస్ అప్లోడ్ స్పీడ్‌తో జియో గిగాఫైబర్ సర్వీసులు ఉండనున్నాయి.ప్రస్తుతం చాలా మటుకు నెట్ సంస్థలు.. భవంతి దాకా ఒక లైను, ఆ తర్వాత బయటి నుంచి ఇంటికి మరో లైను ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాయి. దీనివల్ల స్పీడ్ తగ్గిపోతోందని, గిగాఫైబర్‌తో అలాంటి సమస్య లేకుండా నేరుగా ఇంటిదాకా ఒకే ఫైబర్‌తో కనెక్షన్ ఉంటుందని, ఫలితంగా స్పీడ్‌పరమైన కష్టాలు ఉండబోవని అంబానీ చెప్పారు. ఒకే ఫైబర్‌తో హైస్పీడ్ ఇంటర్నెట్, పెద్ద టీవీల్లో అల్ట్రా హై డెఫినిషన్ ఎంటర్టైన్మెంట్, మల్టీ–పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, వాయిస్ యాక్టివేటెడ్ వర్చువల్ అసిస్టెన్స్, వర్చువల్ రియాలిటీ గేమింగ్, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ మొదలైన సర్వీసులు జియో గిగాఫైబర్‌తో లభిస్తాయి. జియో ఫోన్ 2 .. మాన్సూన్ హంగామా.. క్వెర్టీ కీప్యాడ్ ఫీచర్‌తో రెండో తరం జియోఫోన్‌ను అంబానీ ఆవిష్కరించారు. ఇందులో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సైట్స్‌ను కూడా నిరాటంకంగా ఉపయోగిం చుకోవచ్చు. దీని ధర రూ.2,999. ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం రూ.1,500 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌తో అందిస్తున్న జియోఫోన్ విక్రయాలు కూడా కొనసాగుతాయని అంబానీ తెలిపారు. కావాలనుకుంటే రూ.501 చెల్లించి, పాత ఫీచర్ ఫోన్స్‌ను కొత్త జియో ఫోన్స్‌తో ఎక్సే్చంజ్ చేసుకోవచ్చని వివరించారు. ’మాన్సూన్ హంగామా’ పేరిట ఈ ఆఫర్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, క్వెర్టీ కీప్యాడ్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమరీ (128 జీబీ దాకా ఎక్స్‌పాండబుల్), 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలైన ఫీచర్స్ జియోఫోన్2లో ఉంటాయి. ఏజీఎంలో అంబానీ కాబోయే కోడలు సందడి... ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ను పెళ్లాడనున్న కాబోయే కోడలు శ్లోకా మెహతా.. ఈసారి ఏజీఎంలో ప్రత్యేక ఆకర్షణగా నిల్చారు. ముకేశ్ రెండో కుమారుడు అనంత్, తల్లి కోకిలాబెన్ అంబానీతో కలిసి ముందువరుసలో కూర్చున్నారు. హై స్పీడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, కొత్త తరం జియో ఫోన్ మొదలైన వాటిపై ఆకాశ్, ఆయన సోదరి ఈషా ఇచ్చిన ప్రెజెంటేషన్‌ను ఆసాంతం ఆసక్తిగా చూశారు. సమావేశం మధ్యలో.. షేర్హోల్డర్లతో ప్రశ్నోత్తరాల సమయంలో ఈషాతో కలిసి శ్లోకా బయటకు వెళ్లిపోయారు. బ్లూ డైమండ్స్ సంస్థ అధిపతి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా... ఈ ఏడాది డిసెంబర్లో ఆకాశ్‌ను పెళ్లాడనున్నారు. అదే నెలలో పారిశ్రామికవేత్త అజయ్ పిరమాల్ కుమారుడు ఆనంద్‌తో ఈశా అంబానీ వివాహం కూడా ఉంది. డివిడెండ్లపై ప్రశ్నలు.. ఒక మోస్తరు డివిడెండ్లపై ఈసారి ఏజీఎంలో పలువురు షేర్హోల్డర్లు ప్రశ్నలు లేవనెత్తారు. వాటాదారులకు మెరుగైన రాబడులు అందించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తామని అంబానీ భరోసానిచ్చారు. ఈసారి అంబానీ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ గురించి, ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాలైన డిజిటల్ ఇండియా వంటి వాటి గురించి గానీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. గత ఏజీఎంలో మోదీ డిజిటల్ ఇండియా గురించి అంబానీ పలుమార్లు ప్రస్తావించారు. ఏజీఎం నేపథ్యంలో గురువారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో 2.53 శాతం క్షీణించి రూ. 965 వద్ద క్లోజయ్యింది. -
జియోఫోన్ 2 ఫీచర్లు ఇవే!
ముంబై : ప్రస్తుతం ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న జియోఫోన్‌కు సక్ససర్‌గా హై-ఎండ్ మోడల్ జియోఫోన్ 2ను రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పాత ఫోన్‌కు స్మార్టర్‌గా ఈ కొత్త జియోఫోన్ 2ను మార్కెట్లోకి వచ్చింది. అత్యాధునిక స్పెషిఫికేషన్లు, మెరుగైన డిజైన్‌తో జియోఫోన్ 2ను రిలయన్స్ రూపొందించింది. 25 మిలియన్ పాత జియోఫోన్లను విక్రయించినట్టు ప్రకటించిన అనంతరం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా, కొడుకు ఆకాశ్ జియోఫోన్ 2ను లాంచ్ చేశారు. జియోఫోన్ 2 స్పెషిఫికేషన్లు.. డిస్ప్లే : అంతకముందు జియోఫోన్‌కు ఉన్న డిస్ప్లే మాదిరిగానే 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే. కీప్యాడ్ ఏరియాలో మార్పు. బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్ సాఫ్ట్వేర్ : జియోఫోన్ 2, అమెరికా కంపెనీ కిఓఎస్ టెక్నాలజీస్ చెందిన కిఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది ర్యామ్ : 512 ఎంబీ ర్యామ్ స్టోరేజ్ : 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ బ్యాటరీ : 2000 ఎంఏహెచ్ బ్యాటరీ కనెక్టివిటీ : వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ వైఫై, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో వెనుక కెమెరా : 2 మెగాపిక్సెల్ సెన్సార్ ముందు కెమెరా : వీజీఏ సెన్సార్ స్పెషల్ ఫీచర్లు... క్వర్టీ కీప్యాడ్ కొత్త జియోఫోన్ 2లో కీలక ఫీచర్. జియోఫోన్‌తో పోలిస్తే మొత్తం డిజైన్‌ను రిలయన్స్ మార్చింది. జియోఫోన్ బేసిక్ ఫీచర్ ఫోన్ మాదిరి ఉంటే, జియోఫోన్ 2 ఎంట్రీ-లెవల్ ఫోన్ల మాదిరిగా ఉంది. జియోఫోన్‌కు హై-ఎండ్ వెర్షన్ జియోఫోన్ 2గా కంపెనీ అభివర్ణించింది. జియోఫోన్ 2 డ్యూయల్ సిమ్ కార్డు సపోర్టుతో మార్కెట్లోకి వచ్చింది. ప్రైమరీ సిమ్ కార్డు స్లాట్ లాక్ చేసి ఉంటుంది. దాన్ని స్పెషల్‌గా జియో సిమ్ కోసమే రూపొందించారు. రెండో సిమ్ కార్డు స్లాట్ అన్‌లాక్‌తో ఉంది. దీనిలో ఇతర నెట్‌వర్క్‌లు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సిమ్‌లు వేసుకోవచ్చు. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ పాపులర్ సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌ను ఈ ఫోన్లో అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 15 నుంచి జియోఫోన్ 2 విక్రయాలు కమర్షియల్‌గా ప్రారంభమవుతాయి. జియోఫోన్ 2 లో కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. జియోఫోన్ కోసం మాన్సూన్ హంగామా ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ ఆఫర్ ద్వారా కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే, పాత ఫీచర్ ఫోన్ల ఎక్స్చేంజ్లో కొనుగోలు చేయొచ్చని ప్రకటించారు. ఈ ఆఫర్ జూన్ 21 నుంచి ప్రారంభమవుతుంది. జియోఫోన్ 2 ధర : రూ.2999కే ఈ ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. బ్లాక్ రంగులో ఈ ఫోన్ లభ్యమవుతుంది. జియోఫోన్ 2 రిటైల్ పార్టనర్లు ఎవరన్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించలేదు. -
బిగ్గెస్ట్ గేమ్‌ఛేంజర్ : ‘జియో గిగాఫైబర్’
ముంబై : దేశీయ టెలికాం రంగంలో అతిపెద్ద గేమ్ ఛేంజర్ ఫైబర్ ఆధారిత ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు‘ జియోగిగాఫైబర్’ ను రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్ అంబానీలు మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. నేడు ముంబైలోని న్యూ మెరైన్ లైన్స్‌లో బిర్లా మధుశ్రీ ఆడిటోరియంలో జరిగిన 41వ వార్షికోత్సవ సమావేశంలో ఈ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. జియోగిగాఫైబర్ ద్వారా అందించే ఫీచర్లను ఆకాశ్, ఇషా అంబానీలు ప్రజెంటేషన్ ద్వారా ఇన్వెస్టర్లకు వివరించారు. బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఆగస్టు 15 నుంచే కస్టమర్ల ముందుకు తీసుకురానున్నట్టు ముఖేష్ అంబానీ చెప్పారు. సెటాప్‌బాక్స్ ద్వారా టీవీలో కూడా జియోగిగాఫైబర్ సేవలను అందించనున్నట్టు ఆకాశ్, ఇషాలు తెలిపారు. జియోగిగాఫైబర్ ద్వారా జియోటీవీ కాలింగ్ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, టీవీ కాలింగ్‌లు జియోగిగాఫైబర్ రెండు ముఖ్యమైన ఫీచర్లని తెలిపారు. జియో.కామ్ లేదా మైజియో ద్వారా ‘జియోగిగాఫైబర్’ సర్వీసులను రిజిస్టర్ చేసుకోవచ్చని రిలయన్స్ పేర్కొంది. మూడు ముఖ్యమైన యాప్స్ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్‌లను జియో ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్టు ఆకాశ్, ఇషాలు చెప్పారు. జియో ఫోన్లో ఇవి ఎలా పనిచేస్తాయో కూడా చూపించారు. వీటిని ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు ముఖేష్ అంబానీ తెలిపారు. జియోఫోన్ హైఎండ్ మోడల్ జియోఫోన్ 2ను కూడా ఇషా, ఆకాశ్‌లు ప్రవేశపెట్టారు. గృహాలకు, వర్తకులకు, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలకు, పెద్దపెద్ద వ్యాపారాలకు ఫైబర్ కనెక్టివిటీని విస్తరించనున్నామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. 1,100 నగరాలకు అత్యున్నతమైన ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ సొల్యూషన్స్‌ను ఆఫర్‌చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే టాప్ - 5 బ్రాడ్‌బ్యాండ్ దేశాల్లో భారత్‌ను ఒకటిగా నిలుపాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ముఖేష్ అంబానీ ప్రసంగంలో పలు ముఖ్యాంశాలు : 2,999 రూపాయలకే జియోఫోన్ హై-ఎండ్ మోడల్ జియోఫోన్ 2 జియోఫోన్‌కు మాన్సూన్ హంగామా ఆఫర్, కేవలం రూ.501కే పాత ఫీచర్ ఫోన్ల ఎక్స్చేంజ్లో కొత్త జియోఫోన్ జియోగిగాపైబర్ నెట్‌వర్క్‌ను గంట కంటే తక్కువ వ్యవధిలోనే కంపెనీ సర్వీసుమెన్ ఇన్స్టాల్ బ్రాడ్‌బ్యాండ్ వాడకంలో ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత్ 134వ స్థానంలో ఉంది. దీనిలో ప్రపంచంలో టాప్-5లో భారత్‌ను ఒకటిగా చేరుస్తాం ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్‌దే రాబోయే భవిష్యత్తు కాలం బెస్ట్ ఎడ్యుకేషనల్ కంటెంట్‌ను జియోగిగాఫైబర్ హోమ్ ద్వారా యాక్సస్ రియల్ టైమ్ మెడికల్ సూచనలు అందుబాటు జియోగిగా టీవీ లాంచ్ చేసిన రిలయన్స్, 4కే రెజుల్యూషన్‌లో వీడియో ప్లే అందుబాటు ధరలో నాణ్యమైన సేవలు కేవలం 22 నెలల కాలంలోనే జియోకు 215 మిలియన్ కస్టమర్లు డేటా వాడకం నెలకు 125 కోట్ల జీబీ నుంచి 240 కోట్ల జీబీకి పైగా పెరిగింది వాయిస్ వాడకం ప్రతి రోజూ 250 కోట్ల నిమిషాల నుంచి 530 కోట్ల నిమిషాలకు చేరింది వీడియో వాడకం 165 కోట్ల గంటల నుంచి 340 కోట్ల గంటలకు పెరిగింది అనూహ్యమైన నెట్వర్క్ వృద్ది గుర్తింపును సాధిస్తూనే నెంబర్ వన్ స్థానాన్ని విజయవంతంగా కలిగి ఉండగలిగాం. గతేడాది ప్రతి నెలలోనూ ట్రాయ్ స్పీడ్ టెస్ట్ డేటాలో భారత్‌లో ఫాస్టెస్ట్ నెట్వర్క్ గుర్తింపును తెచ్చుకుంది భారత ఎగుమతుల్లో రిలయన్స్ వాటా 8.9 శాతం 20.6 శాతం పెరిగిన రిలయన్స్ నికర లాభాలు ప్రైవేట్ కంపెనీలో అత్యధిక పన్ను చెల్లింపుదారు రిలయన్స్ ఇండస్ట్రీస్, 2018లో రూ.9844 కోట్ల పన్ను చెల్లింపు రిలయన్స్ రిటైల్ : గతేడాది 3500 స్టోర్లు ప్రారంభం, ఈ ఏడాది 4 వేలకు పైగా ప్రారంభించనున్నట్టు తెలిపిన ముఖేష్ 5 లక్షల టన్నుల గ్రోసరీలు అమ్మిన రిలయన్స్ రిటైల్